న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన దుస్తుల సంస్థ హెనెస్ అండ్ మారిట్జ్ (హెచ్‌అండ్‌ఎం)తో పాటు స్విట్జర్లాండ్ నిర్మాణ సామగ్రి దిగ్గజం హోల్సిమ్ పెట్టుబడి ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదముద్ర వేసింది. బుధవారం జరిగిన సమావేశంలో మొత్తం 23 ప్రతిపాదనలు పరిశీలనకు రాగా 14 ప్రతిపాదనలను ఆమోదించింది. తాజా నిర్ణయంతో హెచ్‌అండ్‌ఎం భారత్‌లో సుమారు రూ. 720 కోట్లతో సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. అలాగే హోల్సిమ్.. భారత్‌లోని అనుబంధ సంస్థలను కన్సాలిడేట్ చేసుకునేందుకు సాధ్యపడుతుంది.