గణతంత్ర వేడుకల్లో సమ్మక్క, సారలమ్మ శకటం | sammakka - saralamma in the celebration of Republic day | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకల్లో సమ్మక్క, సారలమ్మ శకటం

Published Thu, Oct 29 2015 4:16 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

గణతంత్ర వేడుకల్లో సమ్మక్క, సారలమ్మ శకటం

గణతంత్ర వేడుకల్లో సమ్మక్క, సారలమ్మ శకటం

సాక్షి, హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మ ఉత్సవానికి జాతీయస్థాయి గుర్తింపు రానుంది. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) నాడు దేశ రాజధానిలో జరిగే పరేడ్‌లో తెలంగాణ తరఫున సమ్మక్క - సారలమ్మ శకటం ప్రదర్శించనున్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు సంబంధించి రక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర సమాచార- పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ వి.సుభాష్, ఆర్టిస్టు రమణారెడ్డి హాజరయ్యారు.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సమ్మక్క- సారలమ్మ జాతర వరంగల్ జిల్లా లో జరుగుతుందని, ఆ ఉత్సవాల ఔన్నత్యం తెలిపే శకటం ప్రదర్శనలో ఉంచితే బాగుంటుందని ఈ సమావేశంలో వీరు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులకు విన్నవించినట్లు సమాచారం. దీనికి రక్షణ శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement