authorities
-
చంద్రబాబు తీరుపై అధికారుల అసహనం
సాక్షి, అమరావతి: వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద ప్రతిబంధకంగా మారారని అధికారులు వాపోయారు. పనిచేసుకునే సమయం ఇస్తే అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించేవారమని వారు చెబుతున్నారు. ఒకపక్క ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉంటే సీఎం నిరంతరం సమీక్షలు చేయడం, నివేదికల కోసం పట్టుబట్టడం, రోజూ రెండు మూడు విడతలు పర్యటనలు చేస్తుండటంతో ప్రొటోకాల్ ప్రకారం కీలక అధికారులు అంతా ఆయన చుట్టూనే ఉండిపోవాల్సి వస్తోందంటున్నారు. సహాయ కార్యక్రమాలు విఫలం కావడానికి సీఎం తీరే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలన్నది డిజాస్టర్ ప్రోటోకాల్ ఉంటుందని, దాని ప్రకారం జిల్లా కలెక్టర్ నడుచుకుంటే పైనుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తే వ్యవహారం సజావుగా సాగిపోతుందని వరద సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న కీలక అధికారి ఒకరు చెప్పారు. కానీ సీఎం అసందర్భంగా గంటల కొద్దీ సమీక్షలు, ఉపయోగం లేని పర్యటనలు చేస్తుండటంతో సీఎస్, కలెక్టర్, డీజీపీ, ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు ఆయనతోనే ఉండిపోతున్నారని, దీంతో కింది స్థాయి అధికారులకు సరైన సమయంలో మార్గనిర్దేశకత్వం కరువయ్యిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదివారం అర్ధరాత్రి మూడు గంటల వరకు నాలుగు సార్లు ముంపు ప్రాంతాలను సందర్శించడం, అదే విధంగా కలెక్టర్ కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించడంతో అధికారులు తమ విధులను నిర్వర్తించడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రచార యావతో మంగళవారం జేసీబీ మీద 22 కి.మీ చంద్రబాబు వరద ప్రాంతాల్లో తిరగడంతో అధికారులు సహాయ కార్యక్రమాలు వదిలేసి ఆయన చుట్టూ పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఒకరి వెనుక ఒకరు సమీక్షలుముఖ్యమంత్రి, మంత్రులు గంటల తరబడి సమీక్షలు నిర్వహిస్తుండటంపై అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో, సాయంత్రం మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నతాధికారులతో సదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. సీఎం, మంత్రుల సమీక్షలు అవ్వగానే, వాటిపై ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబే కాకుండా మంత్రుల కూడా ముంపు ప్రాంతంలో పర్యటనలకు వెళ్లడంతో వారితో కూడా అధికారులు ఉండాల్సి వచ్చింది. ఇలా అధికారులు సమీక్షలకు, సీఎం, మంత్రులతో పర్యటనలకు పరిమితం అవుతుండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడి మొత్తం వ్యవస్థ కుప్ప కూలింది. కానీ ఆ నెపాన్ని తమపైకి ముఖ్యమంత్రి నెట్టడాన్ని అధికారులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. గంటల కొద్దీ టెలీ కాన్ఫరెన్స్లుక్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా టెలీకాన్ఫరెన్స్‌లు, నివేదికలు అంటూ వేధిస్తుండటంతో సహాయ పునరావాస కార్యక్రమాలు అటకెక్కాయి. వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న సచివాలయాల సిబ్బందితో ఏకంగా రోజుకు ఐదు విడతలు వివిధ స్థాయి అధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. పావు గంట నుంచి గంట వరకు ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఉండాల్సి వస్తోందని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి తోడు తమకు అప్పగించిన పనికి ప్రతి రెండు మూడు గంటలకొకసారి నివేదికల పేరుతో వివరాల సేకరణ జరుగుతోందని, వీటికే రోజుకు అత్యధిక సమయం సరిపోతోందని పేర్కొన్నారు. ఇలా సమీక్ష సమావేశంలో సిబ్బంది అందరూ ఉంటుండంతో సప్లయ్ చెయిన్ తెగిపోయి ప్రజలకు కనీసం తాగు నీరు కూడా అందించలేకపోయామని ఒక అధికారి వాపోయారు. సరైన కో–ఆర్డినేషన్ లేకపోవడంతో మంచినీళ్లు, పాలు, ఆహార పదార్థాలు పంపిన చోటకే మళ్లీ మళ్లీ పంపించడం జరిగిందని, ఇదే సమయంలో పెద్దఎత్తున ఆహారపదార్థాలు కూడా వృథా అయిపోయాయని అన్నారు. తప్పును మాపై నెడతారా?ఐదు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ప్రాణాలకు తెగించి సేవలు అందించడానికి ముందుకు వస్తే.. పని చేయనీయకుండా అడ్డుకొని ప్రజల నుంచి విమర్శలు రావడంతో తప్పును అధికారులపైకి నెట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఓ సీనియర్ అధికారి వాపోయారు. సీఎం చుట్టూ సిబ్బంది, ఫోటో, వీడియో గ్రాఫర్లు, రక్షణగా పోలీసులు, వీరికి అదనంగా చంద్రదండు పేరుతో మరో 50 మంది తెలుగుదేశం కార్యకర్తలు వస్తున్నారని, వీరందరినీ సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తే బాగుండేదంటూ ఒక అధికారి ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండటంతో వారిని సమన్వయం చేసుకుంటూ అధికారులు వేగంగా సహాయాన్ని అందించారని, ఇప్పుడు తెలియని ప్రాంతాలకు అధికారులను పంపడంతో తీవ్రజాప్యం జరుగుతోందని ఆ అధికారి విశ్లేషించారు. -
నీటి ఎద్దడి నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ చొప్పదండి మునిసిపాలిటీలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. పట్టణంలోని కొన్ని వార్డులకు తాగునీటిని అందించలేక మునిసిపల్ అధికారులు సతమతమవుతున్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో గాయత్రి పంప్ హౌజ్ , పక్కనుంచే ఎస్ఆర్ఎస్పీ కాలువలు పోతున్నా ఈ మునిసిపాలిటీకి సరైన నీటి సదుపాయం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు కూడా రావడం లేదు. ‘జగిత్యాల జిల్లా రాయికల్ మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య ఎక్కువైంది. ఎస్ఆర్ఎస్పీ నీరు ఉన్నప్పటికీ మూడు వార్డులకు సరిపడా నీళ్లను మునిసిపాలిటీ వాళ్లు అందించలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వార్డులోనే ఓ బావి తవ్వించి ఆ నీటిని మిషన్‌భగీరథ కోసం కట్టిన ట్యాంకుల్లోకి పంపించి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు’ ‘కరీంనగర్ కార్పొరేషన్లో గతంలో ప్రతిరోజూ ఇంటింటికీ తాగునీటిని అందించగా, తగ్గుతున్న దిగువ మానేరు నీటిమట్టంతో ఇప్పుడు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరపడమే కష్టంగా మారిందని మునిసిపల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగజ్‌నగర్ మునిసిపాలిటీలో కరెంటు సమస్య కారణంగా అధికారులు ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతున్నారు’ మంగళవారం సీడీఎంఏ కార్యాలయంలో మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యపై జరిగిన అధికారుల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో కొన్ని ఇవి. జలాశయాల్లో సరిపడినంతగా నీటి నిల్వలు లేకపోవడం, పెరిగిన సూర్యతాపానికి జలాశయాల్లోని నీరు కూడా క్రమంగా తగ్గుతుందనే భయంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రాష్ట్రంలో నీటి సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో సీడీఎంఏ దివ్య 140 పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఎదురవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారుల నియామకం రాష్ట్రంలో మునిసిపాలిటీలతో పాటు గ్రామాల్లో నీటి నిర్వహణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నీటి అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలను విభజించి, పది మంది ఐఏఎస్ అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. రానున్న రెండు నెలల పాటు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు వీరే... ఆదిలాబాద్, నిర్మల్ – ప్రశాంత్ జీవన్ పాటిల్ , కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య , కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు – ఆర్ వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనిత రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి – శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్– మల్కాజ్గిరి – విజయేంద్ర , మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ – శృతి ఓజా, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – గోపి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట – భారతి కొలిగేరి , ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం– సురేంద్రమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది లేదనే అంచనా హైదరాబాద్, శివారు ప్రాంతాలకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు జలాశయాలతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి కూడా హైదరాబాద్ వాటర్‌బోర్డు తీసుకుంటోంది. జలాశయాల నుంచి ప్రతిరోజూ 2,559 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీటిని హైదరాబాద్ నగర వాసుల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ కోర్‌సిటీకి (హైదరాబాద్ జిల్లా) 1082.62 ఎంఎల్డీ, శివారు సర్కిల్స్ (50 డివిజన్లు)కు 1,049. 58 ఎంఎల్డీ, ఓఆర్ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు 277.21 ఎంఎల్డీ, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. సింగూరు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లలో అవసరమైన మేర నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది 2,270 ఎంఎల్డీ నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేయగా, ప్రస్తుతం 2,409.53 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది కంటే 139.53 ఎల్ఎండీ అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ అక్కడే హైదరాబాద్ నగరానికి పశ్చిమాన ఉన్న మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 644 ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, మంగళవారం 6,593 ట్రిప్పుల్లో నీటి సరఫరా చేశాయి. భూగర్బ జలాలు తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందని వాటర్‌బోర్డు చెబుతోంది. -
‘మూసీ’కి పెరిగిన ఇన్‌ఫ్లో.. ఒక గేటు ఎత్తివేత
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 892 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. మూసీ గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 644.10 అడుగులు ఉంది. దీంతో అధికారులు ఒక క్రస్టు గేటును ఒక అడుగు మేర ఎత్తి 609 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
విధులకు రాం.. జీతం మింగేస్తాం
టౌన్‌ప్లానింగ్ విభాగంలో చైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణ దాదాపు 8 నెలలుగా పత్తాలేడు. జీతం మాత్రం నెలనెలా దాదాపు రూ. 25 వేలకు పైగా ఠంచనుగా ఆయన ఖాతాకు చేరుతోంది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం సంపాదించుకున్న ఈయన విధులకే హాజరుకావడం లేదు. సెలవులకూ దరఖాస్తు చేసుకోలేదు. సంబంధిత విభాగం అధికారి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఇంజినీరింగ్ విభాగంలో ఏకైక వర్క్ ఇన్స్పెక్టర్గా ఉన్న మాధవరెడ్డి కొన్ని నెలల క్రితం దిశ యాక్టు కింద కేసు నమోదు కావడంతో అరెస్ట్ అయ్యాడు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగానికి రాకపోయినా అధికారులు పట్టించుకోలేదని, దీంతో అమ్మాయిలకు వల వేయడమే పనిగా పెట్టుకున్న ఇతని బండారం చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో బయటపడిందని నగరపాలక సంస్థలో చర్చించుకుంటున్నారు. అనంతపురం సెంట్రల్: నగరపాలకసంస్థలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉద్యోగులు తయారయ్యారు. సంబంధిత విభాగపు అధికారిని ప్రసన్నం చేసుకుంటే చాలు ఉద్యోగానికి వచ్చినా రాకపోయినా అడిగే నాథుడు లేరనే ధీమాతో పలువురు ఉన్నారు. పింఛన్ విభాగంలో ఓ రెగ్యులర్ అటెండర్ ఉద్యోగానికి సంవత్సరాల పాటు రాకపోవడంతో ‘సాక్షి’లో కొన్ని రోజుల క్రితం కథనం వెలువడింది. దీంతో ఆయన ఇటీవల కాలంలో చుట్టపుచూపుగానైనా వస్తున్నారు. అయితే, ఇలాంటి అధికారులు నగరపాలకసంస్థలో కోకొల్లలుగా ఉన్నారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా విభాగాలకు చెందిన అధికారులను మచ్చిక చేసుకుని విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. కార్యాలయానికి ఉదయం వచ్చే అధికారుల్లో సగం మంది మధ్యాహ్నానికల్లా కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందిపై నిఘా లేకపోవడంతో ఇతరత్రా ప్రైవేటు కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. కొంతమంది కార్యాలయంలోనే వేరే విభాగాల్లో పనులు చేయిస్తూ దళారుల అవతారం ఎత్తుతుంటే, మరికొందరు రియల్ ఎస్టేట్, ఇతరత్రా పనులు చేసుకుంటున్నట్లు సమాచారం. చాలా నెలలుగా ఇదే పరిస్థితి. కొత్త కమిషనర్ భాగ్యలక్ష్మి దృష్టి సారిస్తే ఉద్యోగులు దారికొస్తారని పలువురు చెబుతున్నారు. సార్ తిట్టాడని రాలేదు విధులకు సక్రమంగా రాకపోవడంతో చైన్‌మ్యాన్ సూర్యనారాయణను గతంలో ఉన్న కమిషనర్ తిట్టారు. దీంతో ఆయన విధులకు రావడం లేదు. ఎలాంటి సెలవు కూడా పెట్టలేదు. దీనిపై అదనపు కమిషనర్‌కు రిపోర్టు చేశాం. సీసీఏ రూల్స్ ప్రకారం అతనిపై చర్యలు ఉంటాయి. – శాస్త్రి, ఏసీపీ, టౌన్‌ప్లానింగ్ (చదవండి: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ.. నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేసి..) -
హౌసింగ్ అధికారుల సర్దుబాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటైన 26 జిల్లాల ఆధారంగా అధికారులను సర్దుబాటు చేస్తూ గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త పోస్టులు సృష్టించకుండా, ఉన్న కేడర్‌ను సర్దుబాటు చేశారు. ప్రతి జిల్లాకు సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ), సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) స్థాయి అధికారులను డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ అధికారులుగా నియమించింది. ఇప్పటివరకూ ప్రతి జిల్లాకు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఎస్ఈ హోదా అధికారి కొనసాగారు. ఇకపై ఎస్ఈ, సీనియర్ ఈఈలు డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు 26 జిల్లాలకు డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. -
అమ్మా భయపడొద్దు.. వచ్చేస్తున్నాం.
నంద్యాల/వెల్దుర్తి: ‘ఉక్రెయిన్ నుంచి సరిహద్దు దేశమైన రొమేనియాకు బుధవారం చేరుకున్నాను. మీరేమీ భయపడొద్దు’ అంటూ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన విద్యార్థి జైన్ తేజ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాడు. ‘యుద్ధం మొదలవుతుందని తెలిసిన వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకున్నా. కానీ ఫ్లైట్లు బంద్ అయ్యాయి. దీంతో చాలా ఇబ్బందులు పడ్డాను. బాంబుల శబ్దాల మధ్య నాలుగు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఉక్రెయిన్ నుంచి రొమేనియాకు రావడానికి మన అధికారులు బాగా సహకరించారు. ప్రస్తుతానికి నేను క్షేమంగా ఉన్నాను. త్వరలో ఇంటికి వస్తాను’ అని తెలిపాడు. కాగా, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన మనోహర్ నాయుడు మంగళవారం రాత్రి ఉక్రెయిన్ బోర్డర్ దాటి పోలండ్‌లో అడుగుపెట్టినట్లు అతని తల్లిదండ్రులు ఎల్లమ్మ, మాధవస్వామి నాయుడు తెలిపారు. సోలోమియాన్స్కీ జిల్లా నుంచి 800 కి.మీ రైలు ప్రయాణం అనంతరం పోలండ్ దేశానికి చేరుకున్నానని ఫోన్ ద్వారా తెలిపాడన్నారు. విద్యార్థులను క్షేమంగా ఇండియాకు రప్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
పెచ్చు మీరుతున్న ఒడిశా ఆగడాలు
మందస: ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన భూభాగంలో ఒడిశా అధికారుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, రైతుల జిరాయితీ భూముల్లో దౌర్జన్యాలు చేస్తున్న ఒడిశా అధికారులు మరో అడుగు ముందుకు వేసి, ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సంస్థలను కూడా బెదిరిస్తున్నారు. పోలీసు కేసులు పెడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సాబకోట పంచాయతీలోని సరిహద్దు ప్రాంతానికి ఆనించి ఒడిశా భూభాగం ఉంది. ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలతో ఆంధ్రా గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఒడిశా అధికారులు, పోలీసులు గిరిజనులను బంధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒడిశా అధికారులతో పాటు పోలీసుల నుంచి వేధింపులకు గురవుతున్న గిరిజనులు ఇప్పుడు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. చదవండి: ఇన్ఫార్మర్ నెపంతో హత్య సాబకోట పంచాయతీ మాణిక్యపట్నంలో సుమారు 65 కుటుంబాలున్నాయి. వీరికి మినీ అంగన్వాడీ కేంద్రం ఉంది. భవనం లేకపోవడంతో 2012వ సంవత్సరంలో గిరిజనులు రేకులషెడ్‌ను ఆంధ్రా భూభాగంలో నిర్మించారు. ప్రస్తుతం మాణిక్యపట్నం మినీ అంగన్వాడీ భవనాన్ని తొలగించాలని ఒడిశా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒడిశా తహసీల్దార్ బుధవారం సిబ్బందితో వచ్చి అంగన్వాడీ కార్యకర్త సవర లక్ష్మిని బెదిరించి, పోలీసు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె హుటాహుటిన సమస్యను మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకువచ్చారు. ఒడిశా అధికారుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. మంత్రి సీదిరి సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఒడిశా అధికారులు, పోలీసుల నుంచి తరచూ బెదిరింపులు, హెచ్చరికలు ఎదుర్కొంటున్నామని, ఉన్నతాధికారులు స్పందించి రక్షించాలని సర్పంచ్ సవర సంధ్యారాము కోరారు. చదవండి: ఒడిశా దుశ్చర్యపై రాజన్నదొర అసహనం -
రాత్రికి రాత్రే ఊరు ఖాళీ
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింది ముంపు గ్రామం రాంపురం మదిర వడ్డెర కాలనీ వాసులను సోమవారం రాత్రికి రాత్రే అధికారులు ఖాళీ చేయించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ కాలనీలో సుమారు 75 కుటుంబాలు నివాసముంటున్నాయి. అందులో మెజార్టీ కుటుంబాలు ఇప్పటికే గ్రామం నుంచి వెళ్లి పోగా సోమవారం రాత్రి 30 డీసీఎంలు తీసుకుని తహసీల్దార్ బాల్‌రెడ్డి, ఆర్ఐ రవీందర్ కాలనీకి వచ్చారు. కాగా తమకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించకుండా ఎలా ఖాళీ చేయిస్తారంటూ నిర్వాసితులు అధికారులతో గొడవకు దిగారు. అర్ధరాత్రి తాము ఎక్కడికి వెళ్లేదంటూ మహిళలు, పురుషులు బోరున విలపించారు. అర్హులైన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లింస్తుందంటూ అధికారులు వారికి నచ్చజెప్పారు. రెండు మూడు రోజుల్లో రిజర్వాయర్‌లోకి నీరు వదిలేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు వారికి వివరించారు. ఎట్టకేలకు వడ్డెర కాలనీలోని సుమా రు 30 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. -
భారీగా చెలరేగిన మంటలు: 42 మంది ఆహుతి
అల్జీరియా : ఒకేసారి అటవీ ప్రాంతంలో అంటుకున్న దావానలం ఘోర విషాదాన్ని నింపింది. ఏకంగా 42 మంది అగ్నికి ఆహుతైన ఈ ఘటన కలకలం రేపింది. ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరిలో సహాయక చర్యల్లో ఉన్న 25మంది సైనికులతోపాటు మరో 17మంది పౌరులున్నారని అధికారులు తెలిపారు. మరో 14 మంది సైనికులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాజధాని అల్జీర్స్‌కి తూర్పున ఉన్న కబీలీ ప్రాంతంలోని అటవీప్రాంతమైన కొండలపై మంటలు, భారీగా పొగలు అలుముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘోరంపై ప్రెసిడెంట్ అబ్దేల్మాద్జిద్ తెబ్బౌన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. బాధిత బెజియా, టిజి ఓజౌ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు బలగాలను అప్రమత్తం చేశామని ఆయన ట్వీట్ చేశారు. సైన్యాన్ని కూడా రంగంలోకి దించినట్టు వెల్లడించారు. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు పెద్ద ఎత్తున చెలరేగిన మంటలపై కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఒకేసారి మంటలంటుకోవడం వెనుక క్రిమినల్స్ హస్తం తప్పక ఉండి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. గ్రీస్, టర్కీ, సైప్రస్, పశ్చిమ అమెరికా సహా ఇటీవలి భారీ మంటల బారిన పడిన దేశాల జాబితాలో అల్జీరియా చేరింది. సోమవారం రాత్రి నుంచి మంటలు చేలరేగడంతో అడవులు కాలిబూడిదవుతున్నాయి. దేశంలోని ఉత్తరాన ఉన్న 18 రాష్ట్రాల్లో 70కి పైగా ప్రదేశాల్లో మంటలు చెలరేగాయి, వీటిలో కబిలీలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలు పది ఉన్నాయి. దావానలంలో వ్యాపించిన అగ్నికీలలకు కబైలీ ప్రాంతంలోని ఆలివ్ చెట్లు పూర్తిగా నాశనమైపోయాయి. అనేక పశువులు, కోళ్లు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. మొత్తం కొండంతా మండుతున్న అగ్నిగోళంలా మారిపోయిందని, ఒక్కసారిగా ప్రపంచం అంతమైపోతుందా అన్నంత భయపడ్డామంటూ ఆందోళన వ్యక్తం చేశారని స్థానిక మీడియా నివేదించింది. కాగా గత నెలలో అడవులకు నిప్పుపెట్టిన కేసుల్లో 30 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు, మరణ శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష విధించే బిల్లును జారీ చేశారు. జూలైలో, ఆరెస్ పర్వతాలలో 15 చదరపు కిలోమీటర్ల (ఆరు చదరపు మైళ్ళు) అడవి ధ్వంసానికి కారణమైన మానితులపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 2020 లో, దాదాపు 440 చదరపు కిలోమీటర్లు (170 చదరపు మైళ్ళు) అడవి అగ్నిప్రమాదానికి గురైంది. అనేక మందిని అరెస్టు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #Algeria : Defence ministry has just said that 18 members of military have died as result of fires raging through forests & hillsides of Kabylie #الجزائر pic.twitter.com/uPVZ6jGMUf — sebastian usher (@sebusher) August 10, 2021 the fires in algeria are still strong; eleven dead were reported with over 80 wounded.. no help from the authorities was sent yet 💔#AlgeriaIsBurning pic.twitter.com/ki7mSRRD1s — ♠️ (@cicegimeda) August 10, 2021 Fires everywhere #PrayForAlgeria #Algeria https://t.co/r7JMeB4GpF — Jasmine 🌺 (@jasoSisin) August 10, 2021 -
ఒకరు అదృశ్యం.. మరొకరు అమ్మకానికి!
డిండి: కళ్లు తెరిచి నెలరోజులు గడిచిందో లేదో.. అప్పుడే అమ్మఒడి నుంచి ఓ ఆడశిశువు అదృశ్యమైంది.. దీనిపై తల్లిదండ్రులు నోరువిప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోఘటనలో ఏడురోజుల పసిగుడ్డును అమ్మకానికి పెట్టారు ఓ పేద తల్లిదండ్రులు. ఇదేమిటని ప్రశ్నించిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలు ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివరాలు... డిండి మండలం కుందేలుబాయితండా గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామలబాయితండాకు చెందిన జర్పుల çరమేశ్, సంగీత దంపతులు. వీరికి జూన్ 28న రెండో సంతానంగా ఆడశిశువు జన్మించింది. కాన్పు అనంతరం కాటికబండతండాలోని తల్లిగారింటికి వెళ్లిన సంగీత వారం క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చింది. అయితే శిశువు పేరు రిజిస్టర్లో నమోదు చేయడానికి వెళ్లిన అంగన్వాడీ టీచర్‌కు ఆ శిశువు కనిపించలేదు. శిశువు గురించి అడిగితే తల్లిదండ్రుల్లో ఉలుకూపలుకూలేదు. అదే శ్యామలబాయి తండాకు చెందిన ఇస్లావత్ సక్రూ భార్య అమృత గతనెల 24న మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాపను ఇతరులకు అమ్ముకుంటున్నారని చైల్డ్ హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్ 1098కు ఓ కాల్ వచ్చింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు, డిండి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు గతనెల 30, 31 తేదీల్లో ఆ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శిశువులు తల్లిదండ్రుల వద్దే ఉండాలని, లేనిపక్షంలో ఐసీడీఎస్ గృహానికి అప్పగించాలని, అక్రమంగా దత్తత ఇవ్వకూడదని సూచించారు. అయినా తమ బిడ్డను అమ్ముకుంటామని వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీలేక ఆ ఇద్దరు శిశువుల వివరాలు సేకరించాలని కోరుతూ అంగన్వాడీ సూపర్వైజర్ రేణుకారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జూపార్క్... అధికారుల నిర్లక్ష్యం
-
నచ్చిన వారికి కొలువులు.. అడిగినంత వేతనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): నచ్చిన వారికి కొలువులివ్వడం.. వారు అడిగినంత వేతనాలు చెల్లించడం దుర్గగుడి అధికారులకు పరిపాటిగా మారింది. కమిషనర్ ఆర్డర్‌తో పని లేదు.. ఆలయంలో ఉద్యోగం చేసే అర్హతలున్నాయా లేదా అనేది అవసరం లేదు.. కావాల్సిందల్లా అధికారుల అండదండలే.. గత కొంత కాలంగా దుర్గగుడిలో పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ఈ విషయం ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు పాటించారు. సోదాలు జరుగుతున్న సమయంలో ఈ ఉద్యోగులను విధుల్లోకి రానివ్వకుండా చూశారు. ప్రస్తుతం అక్కడి ఉద్యోగుల్లో ఇదీ చర్చనీయాంశం అయ్యింది. ►అమ్మవారి పల్లకీసేవ, ఊరేగింపులు, ఉత్సవాల సమయంలో బోయలు సేవలు చేస్తుంటారు. గతంలో దేవస్థానంలో 14 మంది బోయలు విధులు నిర్వహిస్తుండగా, కొత్తగా ఇద్దరు బోయలను విధుల్లోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో భారీగానే సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. కొత్తగా విధుల్లోకి చేరిన బోయలకు కమిషనర్ అనుమతి లేదు. రెండు నెలలుగా వారికి వేతనాలు చెల్లించడం లేదు. బోయలకు వేతనాలు చెల్లించాలంటే తొలుత వారి వివరాలను దేవస్థాన పరిపాలనా విభాగం రిజిస్ట్రార్‌లో నమోదు చేసుకోవాలి. తమ వివరాలను నమోదు చేసి వేతనాలు చెల్లించాలంటూ బోయలు రెండు నెలలుగా ఈవో చాంబర్‌కు, పరిపాలనా విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ►అమ్మవారి ప్రసాదాలను విక్రయించే కౌంటర్లలో ఇద్దరు సిబ్బందిని దేవస్థాన అధికారులు నియమించారు. గతంలో ఏళ్ల తరబడి విధులు నిర్వహించిన సిబ్బందిని కరోనా సమయంలో ఆలయ అధికారులు తొలగించారు. తొలగించిన వారి స్థానంలో కొత్తగా ఇద్దరిని నియమించడానికి భారీగానే సమర్పించుకున్నట్లు సమాచారం. ►దుర్గగుడిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలను కవరేజీ చేసేందుకు ఒక ఫొటోగ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్ ఉన్నారు. అయితే నెల రోజుల కిందట మరొకరిని అదనంగా విధుల్లోకి తీసుకున్నారు. ఇక్కడకూ కమిషనర్ ఆర్డర్ లేదు. ►ఇలా అనధికారికంగా విధుల్లోకి తీసుకున్న వారి నుంచి కమీషన్లు దండుకున్న అధికారులు వాస్తవంగా పనిచేస్తున్న సిబ్బంది కన్న ఎక్కువగా జీతాలు ఇస్తామంటూ నమ్మబలికినట్లు తెలిసింది. అధికారుల తీరుపై సిబ్బంది ఆగ్రహం దుర్గగుడిలో ఎన్నో ఏళ్లుగా 80 మంది ఎన్‌ఎంఆర్‌లు(నాన్ మస్టర్ రోల్)గా, ఇంజినీరింగ్ విభాగంలో మరో 18 మంది కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అనేక మంది రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. అయితే ఎన్‌ఎంఆర్‌లకు రూ.15 వేల నుంచి రూ.16 వేలు చెల్లిస్తుండగా.. అనధికారికంగా కొత్తగా విధుల్లోకి చేర్చుకున్న వారికి మాత్రం రూ.18 వేలు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 13 మంది దుర్గ గుడి ఉద్యోగుల సస్పెన్షన్.. నేడు కుప్పానికి బాబు: మేము రాలేం బాబోయ్! -
అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్‌తో బుధవారం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాల చెరువుల నుంచి కూడా చాలా నీరు హైదరాబాద్ నగరంలోని చెరువులకు చేరింది. దీంతో చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే నిండు కుండల్లా ఉన్న చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున గండ్లు పడటం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని అన్ని చెరువులను, కట్టల పరిస్థితిని పరిశీలించాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రమాదానికి ఆస్కారమున్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. -
ప్రగతి భవన్‌లోకి వెళ్లాలంటే చేతులు కడగాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రగతి భవన్లో ప్రత్యేక హ్యాండ్‌వాషింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రగతి భవన్‌లోకి వచ్చే ముందు చేతులు కడుక్కోవడానికి రెండు పెద్ద గంగాళాల్లో నీళ్లు పెట్టారు. మంత్రులు, సీనియర్ అధికారులు కార్యాలయంలోకి వచ్చే ముందు అక్కడే చేతులు కడుక్కుని, శానిటైజర్‌తో శుభ్రపరుచుకోవాలని నిబంధన పెట్టారు. దీంతో మంగళవారం నాటి అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రులు, ఇతర అధికారులు బయటే నీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కొని లోనికి ప్రవేశించారు. ప్రతీ ఇంట్లో, ప్రతీ కార్యాలయంలో కూడా ఇలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. -
విశ్వవిద్యాలయాల ప్రక్షాళన అత్యవసరం
విశ్వవిద్యాలయాల పాలనలో కొంత స్వేచ్ఛ తీసుకొని తమ విధానాలను అమలు చేసుకోవచ్చు అనే వెసులుబాటు ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలు వాటికున్న అధికారాలను దుర్వినియోగం చేసి వర్సిటీల వ్యవహారాల్లో పీకల్లోతున జోక్యం చేసుకొని ఉన్నత విద్యా ప్రమాణాలను దిగజార్చే పనులు చేస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో ఇలాంటివి చాలా జరిగాయి. గతంలో ఏపీ ప్రభుత్వం వర్సిటీల్లో సహాయాచార్యులను నియమించే ప్రక్రియను తాను లాక్కొని వీరి నియామకం ఏపీపీఎస్సీ ద్వారా జరిపే విధంగా మార్చింది. ఇది విశ్వవిద్యాలయాలకున్న స్వయంప్రతిపత్తిని పూర్తిగా హరించి వాటిని నాయకులు తమ కనుసన్నలలో ఉంచుకునే తీరులోనే సాగింది. ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో వచ్చిన నూతన ప్రభుత్వం వర్సిటీల పాలనలో జరుగుతున్న అన్ని అక్రమాలను కడిగేసి, అన్ని నియామకాల్లో ప్రమాణాలను పాటించే బాధ్యత తప్పక తీసుకోవాలి. గడచిన ఐదారేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాల పాలన గాడి తప్పి కంగాళీ అయింది. ఏయే అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో వివేచించి దారికి తెచ్చే మార్గాన్ని ఆలోచించి ప్రస్తుత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మన విశ్వవిద్యాలయాలు రెండు అధికారాల అధీనంలో పనిచేయవలసి ఉంటుంది. మనకు విద్యారంగం రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉంటుంది. యూజీసీ పార్లమెంటు అనుమతితో ఉన్నత విద్యకు సంబంధించి కొన్ని అధికరణాలను చేస్తుంది. ఇవి పార్లమెంటు చేసే చట్టాలలో భాగం. అదేవిధంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల పాలనకు సంబంధించి మరికొన్ని నిబంధనలను పెట్టుకుంటాయి. ఉదాహరణకు యూజీసీ ప్రకారం ఆచార్యుల పదవీ విరమణ 65 ఏళ్లకు జరగాలి. కాని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని 60, కొన్ని 62 మరికొన్ని 65 ఏళ్లుగా పెట్టుకున్నాయి. కాగా విశ్వవిద్యాలయాల కేంద్ర రెగ్యులేషన్ ప్రకారం 65 సంవత్సరాలుగా మాత్రమే ఉండాలని ఆదేశించవలసిందిగా రాష్ట్రాల ఆచార్యులు కొందరు సుప్రీంకోర్టును కోరారు. దానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ రాష్ట్రాలకు వారి పాలన పద్ధతి ప్రకారం పదవీ విరమణ వయస్సును పెట్టుకోవచ్చు అని చెప్పింది. కాని అదే సుప్రీంకోర్టు యూజీసీ నిబంధనలు కొన్నింటిని రాష్ట్రాలు అధిగమించరాదని చెప్పింది. ఆచార్యుని అనుభవం పదేళ్లు ఉంటేనే వీసీ పదవికి అర్హుడు అనే విషయంలో సుప్రీం తుది తీర్పు ఇంకా రావలసే ఉంది. అందాక అదే అమలులో ఉంది చాలా రాష్ట్రాలలో. విశ్వవిద్యాలయాల పాలనలో కొంత స్వేచ్ఛ తీసుకొని వారి వారి విధానాలను అమలు చేసుకోవచ్చు అనే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలు వాటికున్న అధికారాలను దుర్వినియోగం చేసి వర్సిటీల పాలనలో పీకల్లోతున జోక్యం చేసుకొని, వాటి స్వయం ప్రతిపత్తిని తుంగలో తొక్కి, రకరకాల గందరగోళాలు సృష్టించి ఉన్నత విద్యా ప్రమాణాలను దిగజార్చే పనులు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో గడచిన దశాబ్దంలో ఇలాంటివి చాలా జరిగాయి. వర్సిటీల ఆచార్యులను మూడు స్థాయిలలోని వారిని నియమించుకునే స్వతంత్ర ప్రతిపత్తి విశ్వవిద్యాలయాలకే ఉంటుంది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యక్షజోక్యం ఏ విధంగానూ ఉండదు. కాని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో సహాయాచార్యులను నియమించే పద్ధతిని తాను లాక్కొని వీరి నియామకం ఏపీపీయస్సీ ద్వారా జరిపే విధంగా మార్చింది. వారికి సర్వీసుకమీషనే పరీక్షపెట్టి వారిలో ఉత్తీర్ణత పొందిన వారి జాబితాను విశ్వవిద్యాలయాలకు పంపితే ప్రభుత్వ నియమాల ప్రకారం వారిని నియమించుకునేలా చట్టాలు మార్చింది. ఇది విశ్వవిద్యాలయాలకున్న స్వయంప్రతిపత్తిని పూర్తిగా హరించి తిరిగి వాటిని నాయకుల కనుసన్నలలో ఉంచుకునే తీరులోనే సాగింది. దీని వల్ల విశ్వవిద్యాలయాలు మరో రకం డిగ్రీ కాలేజీలుగా మారిపోతాయి. ఇలా చేయడానికి ప్రభుత్వం చూపిన సాకు ఏమంటే విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులు సహాయాచార్యుల నియామకాలలో అక్రమాలకు పాల్పడుతున్నారని అవినీతి జరుగుతూందని. కానీ సర్వీసు కమిషన్లు కూడా అవినీతికి అక్రమాలకు పాల్పడిన ఘట్టాలు గతంలో ఎన్నో జరిగిన ఉదంతాలు కోర్టు కేసులు పరిశీలిస్తే చరిత్రే తెలుస్తుంది. ప్రభుత్వం చేసిన ఈ మార్పు వల్ల అవినీతి ఒకచోటునుండి మరొక చోటుకు మారుతుందే కాని ఆగదు అని ప్రభుత్వం గమనించలేదు. దీనికి బదులు అసలు ఉపాధ్యక్షుల నియామకంలోనే నిజాయితీపరులను నియమిస్తే, యూజీసీ నిబంధనలను పాటిస్తే ఈ అక్రమాలు జరగవు. అలా కాక కొన్ని ప్రభుత్వాలు వీసీల నియామకాలలోనే యూజీసీ నియమాలను ఉల్లంఘించి అనర్హులకు అనుభవం లేనివారికి అవకాశాలిచ్చాయి. దీనికి రాజకీయ కారణాలు ఒత్తిడులే కారణం. అంతే కాదు ఆచార్యులను ప్రభుత్వమే నియమించడం వల్ల విశ్వవిద్యాలయాలకు చాలా నష్టం జరుగుతుంది. కొన్ని విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకమైన శాఖలుంటాయి. అసలు కొన్ని విశ్వవిద్యాలయాలే ప్రత్యేక అవసరాలకోసం ఏర్పడతాయి. వాటికి ఏవిధమైన పోస్టులు కావాలి ఏశాఖలు కావాలి ఎలాంటి వారితో వీటిని నింపుకోవాలి అనే విషయం ఆయా విశ్వవిద్యాలయాలకే తెలుస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ప్రమాణాలను, విద్యావసరాలను దెబ్బకొట్టే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఖర్చును తగ్గించుకొని ఉన్నత విద్య బడ్జెట్‌కు తీవ్రంగా కోత పెట్టే దిశలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కొన్ని శాఖలను అనవసరమైనవిగా ప్రభుత్వమే నిర్ణయించుకుంది. కొన్ని శాఖలను రద్దు చేసి వాటిలో ఉన్న ఆచార్యులను వేరే శాఖలకు పంపి శాఖలను కలిపేయడం లేదా రద్దు చేయడం చేసింది. ఆచార్యుల పోస్టులు వందల సంఖ్యలో రద్దు చేయడం లేదా ఆచార్యుల పోస్టులను సహాయ ఆచార్యుల పోస్టులుగా మార్చి వాటి రిక్రూట్‌మెంటును సర్వీసు కమిషన్ ద్వారా చేయడం, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా కొన్నింటిని రద్దుచేయడం కొన్నింటినే ఉద్యోగ ప్రకటనలలో ఉంచడం చేసింది. జానపదశాఖ, సంగీత లలితకళ శాఖలు, తత్వశాస్త్రశాఖ కొన్ని సంప్రదాయసైన్సు శాఖలలోని పోస్టులను రద్దుచేసింది. కొన్నింటిని మూసివేయడం చేసింది. సమాజానికి కంప్యూటర్ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రాలు ఎంత అవసరమో ఒక అర్థశాస్త్ర శాఖ, ఒక చరిత్ర శాఖ, ఒక జానపద శాఖ తత్వశాస్త్రశాఖ కూడా అంతే అవసరం అనే స్పృహను ప్రభుత్వం కోల్పోయింది. ఈశాఖలు ఎందుకు వాటిని రద్దుచేస్తేనే మంచిది అనే ధోరణిలో ఇలా హేతుబద్ధీకరణ చేసింది ప్రభుత్వం. ఇది ఉన్నత విద్యకు సమాజ ప్రగతికి శరాఘాతం లాంటిది. ఉమ్మడి రాష్ట్రంలో 1990 దశకంలో చరిత్ర శాఖలు ఎందుకు వాటిని తీసివేయాలి అని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దఎత్తున మేధావులలో, విశ్వవిద్యాలయాల పరిధిలో అలజడి చెలరేగింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. కానీ కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ విధానాలనే అమలుచేస్తూ వచ్చింది. విభజనానంతరం 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తిరిగి ఒక హైపవర్ కమిటీని వేసి హేతుబద్ధీకరణ పేరుతో పైన చెప్పిన అవాంఛనీయమైన పనులు అన్నీచేసింది. ఇక విశ్వవిద్యాలయాలను డిగ్రీకళాశాలలుగా మార్చే మరొక చర్యతీసుకుంది ప్రభుత్వం. అదేమంటే పీజీ ఎంట్రెన్స్‌కి కామన్ పరీక్ష పెట్టడం, కామన్ సిలబస్‌లు అన్ని కోర్సులకు ఉండాలని చెప్పడం ఇలాంటిదే. రీసెర్చి ప్రవేశాలకు కూడా కామన్ ప్రవేశ పరీక్షపెట్టడం కూడా ఇలాంటిదే. దీనివల్ల చాలా విశ్వవిద్యాలయాలకు వాటి స్వేచ్ఛపోతుంది. కొన్ని విశ్వవిద్యాలయాలు వాటి అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక రచన చేసుకుంటాయి. కరిక్యులమ్ డిజైనింగ్‌కి నాక్ అత్యంత ప్రాముఖ్యం ఇస్తుంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తిం చలేదు. ఇటీవలి కాలంలో విశ్వవిద్యాలయాలలోనే ఆయా ఉపాధ్యక్షుల అలసత్వం వల్లనేమి, భిన్నమైన ఆలోచనల వల్లనేమి పరిశోధనల ప్రమాణాలు పాతాళానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. దూరవిద్యలో పీహెచ్డీ పరిశోధనకు అవకాశం కల్పించడం యూజీసీ చేసిన ఘోరమైన తప్పిదంగా అది గుర్తించే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తిరిగి 2009లో దాన్ని రద్దుచేసినా కొన్ని విశ్వవిద్యాలయాలు పాత డేట్లతో అడ్మిషన్లు చేసాయి. ధనసంపాదనే ధ్యేయంగా ఆయా విశ్వవిద్యాలయాలు ఈ పాపానికి దిగాయి. ఎనిమిదివేల పీహెచ్డీ ప్రవేశాలు కేవలం మూడు నాలుగేళ్లలోనే చేసి ద్రవిడ వర్సిటీ ప్రపంచ రికార్డు నెలకొల్పడంపైన ఎంతో చర్చ జరిగింది ఎన్నో కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కావలసినంత రచ్చ జరిగింది. ఆ వర్సిటీ దాన్ని ప్రక్షాళన చేసుకునే పని ఇంకా చేసుకుంటూనే ఉంది. కాగా ఓయాలో కూడా ఏడువేల పీహెచ్డీ ప్రవేశాలు జరిగాయని ఇటీవలే వార్తలు పొక్కాయి. ఒక శాఖలో శాశ్వత ఉద్యోగిగా ఉన్న ఆచార్యుడు మాత్రమే ఆ శాఖలో పీహెచ్డీ పర్యవేక్షణకు అర్హుడు కాగా తాత్కాలిక ఆచార్యులకు అవకాశం ఇవ్వడం, ఒక శాఖలో పనిచేసే వారికి మరొక శాఖలో పరిశోధకులకు పర్యవేక్షణ చేసే అవకాశాలు ఇవ్వడం. డాక్టరేట్ ఉందని బోధనేతర సిబ్బందికీ పర్యవేక్షణ ఇవ్వడం ఇలాంటి అక్రమవిధానాలు కూడా కొన్ని చోట్ల జరిగాయి. విశ్వవిద్యాలయాలకు ఈసీ మెంబర్లను ఎంపిక చేసేటప్పుడు ఉన్నత విద్యావంతులకు, విద్యావేత్తలకు అవకాశం పూర్తిగా ఇవ్వాలి. కానీ ప్రభుత్వాలు రాజకీయ కోణంలోనే పునరావాస కల్పన చేసే దిశగా ఆ పద్ధతికి గండి కొట్టి కొన్ని ఎంపికలను రాజకీయ నాయకులతో చేశాయి. దీనివల్ల విశ్వవిద్యాలయ పాలన రాజకీయమయం అవుతుందే కాని విద్యాప్రమాణాలకు ఏవిధంగానూ ఉపయోగపడదు. గ్రాంటులు చాలినంత ఇవ్వకుండా మీ వనరులు మీరే చూసుకోండి అని విశ్వవిద్యాలయాలను వదిలివేయడం వల్ల కూడా అవి ఆర్థిక సంపాదన పైన ధ్యాస పెట్టడంతో íపీహెచ్డీ అక్రమాలకు గేట్లు ఎత్తినట్లు అయింది. ఏపీలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. పరిపాలనను అన్ని కోణాలలో అన్ని స్థాయిలలో చక్కదిద్దే ప్రయత్నం ఇది చేస్తూ ఉంది. ఈ సందర్భంలో విశ్వవిద్యాలయ పాలనపైన ఈ కొత్త ప్రభుత్వం ధ్యాసపెట్టాలి. పైన చెప్పిన అక్రమాలను కడిగి వేసి విశ్వవిద్యాలయాలలో ఉన్నత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. అన్ని నియామకాలను ప్రమాణాల ప్రాతిపదికనే చేయాలి. ఈ కొత్త ప్రభుత్వం ఈ గురుతర బాధ్యతను స్వీకరిస్తుందని ఆశిద్దాం. వ్యాసకర్త విశ్రాంత ఆచార్యులు, జానపద ఆదివాసీ అధ్యయనాల శాఖ, ద్రవిడ విశ్వవిద్యాలయం మొబైల్ : 94404 93604 ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి -
మా భూములు లాక్కుంటున్నారు
సాక్షి,కాసిపేట: అన్యాయంగా 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను అటవీ శాఖ అధికారులు కేసులు పె డుతూ లాక్కుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ నాయకపుగూడ శివారులోని భూములు ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. కాని ఈ మ ధ్య కాలం నుంచి అటవీశాఖ అధికారులు తమ భూములు అంటూ సాగు చేసుకుంటున్న గిరిజనులను బెదిరించి కేసులు పెడుతున్నారు. వారం రోజుల క్రితం సాగు చేసుకునేందుకు వెళ్లిన రైతుపై, ట్రాక్టర్‌పై కేసు నమోదు చేయడంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అటవీశాఖ అధికారులతో వాదనకు దిగారు. 1978లో 116 మందికి 188 ఎకరాలు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. లావణి పట్టాలు కలిగి ఉన్న రైతులు కొంత మంది సాగు చేసుకోగా కొంత మంది పడావుగా వదిలేశారు. ఈ మధ్య కాలంలో సాగు చేసుకునేందుకు గిరిజనులు మా భూములు అంటూ వెళ్తుండగా బెల్లంపల్లి డివిజన్ అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారు. దీంతో గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం అక్రమ కేసులు పెట్టడంతో సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు సిద్ధమవుతూ అధికారులను కలిసి విన్నవించారు. దీనిపై రెవెన్యూ అధికారులు తమ భూములని లావణి పట్టాలు ఉన్నాయని చెబుతుండగా, అటవీశాఖ అధికారులు తమ భూములని అంటున్నారు. దీంతో ఇరుశాఖల మధ్య సమన్వయం లోపించడం గిరిజనులకు శాపంగా మారింది. కనీసం రెండేళ్ల నుంచి ఏం తేల్చకుండా రైతులను వేధింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు పట్టాలు ఉన్న భూములను తమకు ఇప్పించాలని లేనట్లయితే మరోచోట భూమి చూపాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజనులను వేధించడం సరికాదు.. ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసు కుంటున్న గిరిజన రైతులను అటవీశా ఖ అధికారులు ఇబ్బందులకు గురి చే యడం సరికాదు. దీనిపై ఇరు శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సమ స్యను పరిష్కరించాలి. లేదంటే ఆందో ళనలు ఉధృతం చేస్తాం. వేముల కృష్ణ పెద్దనపల్లి యాబై ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం.. ప్రభుత్వం 1978లో తమకు భూములు అసైన్డ్ చేయడంతో అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు వచ్చి తమ భూములంటూ బెదిరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాకు న్యాయం చేయాలి. – మెసయ్య, రైతు -
ఈ అవ్వకు ‘ఆసరా’ ఏది?
వేమనపల్లి(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా వేమనపల్లికి చెందిన కోట సమ్మక్క శతాధిక వృద్ధురాలు.. నడవలేని స్థితిలో ఉంది. ఆమెకు ఆసరా పింఛన్ అందడం లేదు. పెన్షన్ ఇప్పించమని ఇప్పటికి ఆరుసార్లు దరఖాస్తు చేసుకుంది. 2016 మార్చి నుంచి ఆ వృద్ధురాలికి పింఛన్ వస్తుంది. కానీ పంపిణీ చేసే అధికారులే కుటుంబానికి తెలియకుండా పెన్షన్ స్వాహా చేశారు. సమ్మక్క కూతురు ఏమ లస్మక్క భర్త గతంలో మత్యువాతపడడంతో తల్లివద్దే ఉంటోంది. ఇద్దరూ కలిసి వేమనపల్లిలో సమ్మక్క కుమారుడు కోట రాజం వద్ద ఉంటున్నారు రాజం సైతం రెండేళ్ల క్రితం మృతిచెందగా కోడలు మల్లక్కే వారికి దిక్కయ్యింది. విచిత్రం ఏమిటంటే వృద్ధురాలైన సమ్మక్కకు పెన్షన్ రావటం లేదు. కానీ ఆమె కూతురు లస్మక్కకు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. వారం రోజుల క్రితం పెన్షన్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఆమెకు అసలు విషయం తెలిసింది. సమ్మక్కకు 2016 మార్చి నెలలోనే పెన్షన్ మంజూరైనట్లు జాబితాలో ఉంది. స్థానికంగా ఉండటం లేదని చూపించారు. మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల ఒకసారి అధికారులే డ్రాచేశారు. ఆ తర్వాత జూన్, జులై నెలల పెన్షన్ ఆగస్టులో అధికారులే స్వాహా చేశారు. అప్పటి నుంచి వృద్ధురాలు స్థానికంగా ఉండటం లేదని పెన్షన్ రద్దుచేశారు. పెన్షన్ కాజేయటం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. అధికారులు విషయం బయటికి పొక్కకుండా కుటుంబ సభ్యుల దరఖాస్తును తీసుకుని మళ్లీ మంజూరుకు పంపారు. పెన్షన్డ్రా అయినట్లు ఆన్లైన్లో చూపిస్తున్న దృశ్యం -
వాటికి రిజిస్ట్రేషన్ చేస్తే.. ఉద్యోగం ఊడినట్లే!
సర్కారు భూముల విషయంలో రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయం - అక్రమాలకు పాల్పడితే తొలగిస్తామని సబ్ రిజిస్ట్రార్లకు హెచ్చరిక - ‘ఎనీవేర్’లో అవకతవకల నియంత్రణకు చర్యలు సాక్షి, హైదరాబాద్: సర్కారు భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లను ఉద్యోగం నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు సబ్ రిజిస్ట్రార్లు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని రిజిస్ట్రేషన్ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నించే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులు నిర్ణయించారు. ఎనీవేర్‌లో లోపాలను సరిదిద్దడంతో పాటు, ఉల్లంఘనులపై చర్యల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. 6 నెలల అధ్యయనం తర్వాత కమిటీ పలు సిఫార్సులు చేయగా.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వాటిని అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత హైదరాబాద్, హైదరాబాద్ సౌత్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి అనంతరం మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. కమిటీ సిఫార్సులు.. ► రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి అందిన దస్తావేజుల వివరాలను ముందస్తుగా సబ్ రిజిస్ట్రార్లు తనిఖీ చేయాలి. ఆ ఆస్తి ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉన్నదో, అక్కడి నుంచి అనుమతి తీసుకోవాలి. ► సర్కారు సూచించిన నిషేధిత ఆస్తుల పుస్తకం (పీవోబీ)లో సదరు భూమి నమోదైనట్లు రుజువైతే దస్తావేజును తిరస్కరించాలి. పీవోబీలో లేని ఆస్తులనే రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలి. ► వేరొక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని భూమికి సంబంధించి మార్కెట్ విలువను నిర్ధారించే విషయమై అక్కడి సబ్ రిజిస్ట్రార్‌కు ఈ మెయిల్ ద్వారా వివరాలు పంపాలి. ఈ–మెయిల్స్‌ను అందుకున్న సబ్ రిజిస్ట్రార్లు 48 గంటల్లోగా స్పందించాలి. ► దస్తావేజులో పేర్కొన్న మార్కెట్ విలువలో తేడా ఉన్నా, పీవోబీలో భూమి సర్వే నంబరు ఉన్నా, సంబంధిత పత్రాలను రిప్లయ్‌తో జత చేయాలి. మార్కెట్ విలువలో వ్యత్యాసం ఉంటే ఆ మొత్తం చెల్లించాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలి. ► అలా కాకుండా తప్పుడు మార్కెట్ విలువతో ఫీజు లెక్కిస్తే సదరు సబ్ రిజిస్ట్రార్‌పై ‘భారతీయ స్టాంపుల చట్టం 1899’ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ► ఏదేని గ్రామంలో సర్వే నెంబరు 10ని పీవోబీలో పేర్కొని.. 10బీ, 10సీ సర్వే నెంబర్లలోని భూములుగా దస్తావేజులో పేర్కొంటే సదరు గుర్తింపులను సబ్ రిజిస్ట్రార్ రూఢీ చేసుకోవాలి. ► తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో సరిచూసుకున్నాకే దస్తావేజును అనుమతించాలి. లేదంటే రెవెన్యూ అధికారులతో పరిశీలన చేయించుకోవాలని సూచిస్తూ దస్తావేజును తిరస్కరించాలి. ► సెక్షన్ 22ఎ ప్రకారం నిషేధించిన భూములను ఏదైనా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే, ప్రభుత్వ సొమ్మును అపహరించిన నేరంతో సమానంగా పరిగణిస్తారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన కేసులలో సదరు అధికారులను ఉద్యోగం నుంచి తొలగించా లని రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది. -
ఓఆర్ఓపీ అమలు కోసం నేడు ధర్నా
-
ఓఆర్ఓపీ అమలు కోసం నేడు ధర్నా
న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్’ (ఓఆర్ఓపీ) అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, పారామిలటరీకి ప్రత్యేక చెల్లింపులు చేయాలనే డిమాండ్లతో రిటైర్డ్ పారామిలటరీ దళాలు సోమవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగనున్నాయి. దీంతో పాటు పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించి నిరసన తెలుపనున్నాయి. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు విజ్ఞాపన పత్రాన్ని అందించనున్నాయి. సైనికులకి సరైన ఆహారం అందించట్లేదని వీడియో పోస్ట్ చేసి వార్తల్లోకెక్కిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ తన కుటుంబంతో కలసి ఈ ధర్నాలో పాల్గొననున్నారని అధికారులు తెలిపారు. -
సర్పంచుల ధనదాహం వల్లే..
సాక్షి, హైదరాబాద్: కొందరు సర్పంచ్‌లు, అధికారుల ధనదాహం వల్లే హైదరాబాద్ చుట్టు పక్కల అక్రమ నిర్మాణాలు వెలిశాయని హెచ్ఎండీఏ హైకోర్టుకు తెలిపింది. అక్రమంగా ఆర్జించిన మొత్తాలతో ఓ సర్పంచ్ తన కుమారుడితో సినిమానే నిర్మించారని హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వి.నర్సింహగౌడ్ వివరించారు. జీ+2 వరకు పంచాయతీలు అనుమతి ఇవ్వొచ్చునని, అందుకు వారే ఫీజులన్నీ వసూలు చేసుకుంటారని తెలిపారు. జీ+2 కంటే ఎక్కువ అంతస్తుల్లో నిర్మించే భవనాలకు తాము అనుమతులిచ్చి, ఆ ఫీజులు వసూలు చేసుకుంటామన్నారు. పంచాయతీల పరిధిలో లేఔట్లలో భవన అనుమతులు ఇస్తున్న హెచ్ఎండీఏ తద్వారా వచ్చే నిధుల్లో పంచాయతీలకు వాటా ఇవ్వడం లేదంటూ కొంపల్లి గ్రామ సర్పంచ్ జమ్మి నాగమణి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృ త్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. వాదనలు విన్న తర్వాత ఈ వివాదానికి ఓ పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ఆసుపత్రుల్లో స్వచ్ఛత కోసమే ‘కాయకల్ప’
ప్రొగ్రాం అధికారి డాక్టర్ దుర్గప్రసాద్ బాన్సువాడ : ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ‘కాయకల్ప’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రొగ్రాం అధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని బుధవారం ఆయన పరిశీలించారు. గర్భిణుల వార్డు, మేల్, ఫిమేల్ వార్డులు, పిల్లల విభాగాన్ని, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, ప్రసూతి విభాగాన్ని, స్టాఫ్ రూంలను, పడకలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘కాయకల్ప’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతను పాటించే ఆసుపత్రులను ఎంపిక చేసి, గ్రేడింగ్ ఇస్తుందని, తద్వారా ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరవుతాయన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ద్వారా కొనసాగుతున్న బాన్సువాడ, నాగారెడ్డిపేట, నవీపేట, కమ్మర్పల్లి ఆసుపత్రులకు 70 శాతం స్వచ్ఛత గ్రేడింగ్ లభించిందన్నారు. నివేదికను అందజేసిన తరువాత ‘కాయకల్ప’కు సంబంధించిన లబ్ధి చేకూరుతుందన్నారు. ఆయన వెంట నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ అధికారి డీ వెంకటయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్‌ప్రసాద్, డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ సుధా తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో వీఆరో ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్‌అర్బన్ : అధికారుల వేధింపులు భరించలేక సోమవారం బిచ్కుంద మండలానికి చెందిన వీఆర్వో బి భూపతి కలెక్టరేట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న కలెక్టరేట్ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు రావడంతో చికిత్స పొందిన తనను విధుల్లో చేరేందుకు రూ. 25 వేలు అడిగిన తహసీల్దార్‌ను, ఉప తహశీల్దార్‌ను జైలుకు పంపాలని బాధితుడు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూపతి ఆత్మహత్యాయత్నాన్ని చిత్రీకరించిన ఓ చానల్ రిపోర్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
టీవీ యాంకర్ అరెస్టు.. దేశ బహిష్కరణ
ఈజిప్టు: ప్రభుత్వ విధానాలు ఎండగడుతున్నారనే కారణంతో ఈజిప్టు అధికారులు ఓ టీవీ కార్యక్రమ ప్రముఖ నిర్వాహకురాలిని అరెస్టు చేసి ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. ముందస్తుగా ఎవరికి సమాచారం తెలియజేయకుండా ఇంటి నుంచి ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి అనంతరం ఓ ఫ్లైట్ ద్వారా బీరుట్ కు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇదేమిటని అడిగిన వారికి ఆమె ఈజిప్టులో ఉండాల్సిన సమయం పూర్తయిందని, అనుమతికి మించిన రోజులు ఉండటం వల్లే అరెస్టు చేశామని చెప్పింది. లిలియానే దౌద్ అనే లెబనాన్ మహిళ ఆన్ టీవీ అనే చానెల్లో ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఆమె ఇష్టం వచ్చినట్లు చేస్తూ హద్దు మీరిందని చెప్పారు. ఇంటివద్ద ఉన్న ఆమె పదేళ్ల కుమార్తె చెప్పిన ప్రకారం పాస్ పోర్టు అధికారుల పేరిట వచ్చిన వారు లిలియానేకు అరెస్టు చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగినా తొలుత చెప్పలేదు. ఇది ప్రభుత్వం చేసిన దుర్ణీతి అని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమే అని ఆమె తరుపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అర్థరాత్రి సమయంలో ఆమె అరెస్టును ఈజిప్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడి నుంచి ఆమెను బీరుట్కు పంపిస్తామని తెలిపింది. గడువు ముగిసినందున ఇక బహిష్కరణ తప్పదని చెప్పారు. -
రాజస్థాన్ అడవుల్లో పులిపిల్లలు..
న్యూఢిల్లీః ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో పర్యాటకులకు పులిపిల్లలు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వన్యప్రాణ ప్రేమికులకు, అధికారులకు ప్రత్యేక వార్తగా మారింది. ఇండియాలో క్రమంగా పులుల సంఖ్య పెరగడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్ లో పర్యటనకు వెళ్ళిన కొందరు పర్యాటకులకు రెండు పులి పిల్లలు కనిపించాయి. దీంతో వన్యప్రాణ ప్రేమికులు సహా అధికారులు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓ శుభ పరిణామంగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇండియాలోని రాజస్థాన్ రణతంబోర్ రిజర్వ్ అడవుల్లో పులి కూనలు కనిపించడంతో అధికారులు సంబరాలు జరిపారు. పార్కులోని జోన్ 5 కు చెందిన కచిడా ఏరియాలోని ధకడా ప్రాంతంలో టూరిస్టులు ఈ పులి పిల్లలను కనుగొన్నారు. ఈ పిల్లలకు సుమారు రెండు మూడు నెలల వయసు ఉంటుందని, వీటి తల్లి రిజర్వ్ లో నివసిస్తున్న టి-73 అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాక ఆ పెద్దపులి మరిన్ని పిల్లలను కూడ కని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జోన్ లో అత్యంత ఎక్కువమంది సందర్శించిన పులిగా పేరుతెచ్చుకున్న... అకాసుందరి పేరుగల టి-17 కు పుట్టిన ఆడపులే టి-73 అని, ఇప్పుడు ఈ టి-73 కూడ ముద్దులొలికే పులి కూనలను కనడం ఎంతో ఆనందంగా ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు తాను ఉండేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుని, ఇక్కడే నివసిస్తున్న మొదటి ఆడపులి ఈ టి-73 అని, చాలా కాలం తర్వాత ఇక్కడే ఈ పులి పిల్లలను పెట్టడం వన్యప్రాణ ప్రేమికులకు నిజంగానే శుభవార్త అని అధికారులు అంటున్నారు. ఈ అభయారణ్యంలో మరిన్ని ఆడ పులులు పిల్లలు పెట్టి ఉండొచ్చని వాటిని కూడ గుర్తిస్తామని తెలిపారు. -
భార్య ఆన్లైన్ వ్యభిచారం.. పట్టించిన భర్త
న్యూఢిల్లీ: గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో భార్య సాగిస్తున్న వ్యభిచార వ్యాపారానికి సైబర్ క్రైం పోలీసుల సహాయంతో చెక్ పెట్టాడో భర్త. ఇళ్లలో పని చేస్తోందనుకున్న తన భార్య అసలు స్వరూపం తెలుసుకుని షాకయ్యాడు. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు పట్టిచ్చాడు. ఇదంతా న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ఆన్లైన్లో తన భార్య చేస్తున్న పాడు పని గురించి తెలుసుకుని భర్త మొదట షాకయ్యాడు. భార్య స్నేహితురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెపై నిఘా పెట్టాడు. పనిమనిషి ముసుగులో భార్య సాగిస్తున్న వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ లో సాగిస్తున్న కార్యకలాపాల గుట్టు రట్టయింది. దీనికి సంబంధించిన రెండు వీడియోలలో తన భార్య కూడా దర్శనమివ్వడంతో విస్తుపోయాడు. ఆనక పోలీసులకు సమాచారం అందించాడు. ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తున్నానని సదరు భార్య మొదట అదంతా అబద్ధమంటూ బుకాయించింది. తాను ఎలాంటి అక్రమ కార్యకలాపాలు సాగించడంలేదని వాదించింది. కానీ ఆమె పనిచేస్తున్న ప్రదేశంలో కూడా ఇలాంటి వ్యవహారమే నడుస్తోందని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదుచేసిన పోలీసులు, తెరవెనుక హస్తాలపై ఆరా తీస్తున్నారు. -
జీజీహెచ్‌లో 1,251 ఎలుకల పట్టివేత
గుంటూరు మెడికల్ : ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఎలుకల వేట కొనసాగుతోంది. బుధవారం నాటికి 1,251 ఎలుకలను పట్టుకున్నారు. గత ఏడాది ఆగస్టు 26న ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటనతో అధికారులు ఎలుకల నిర్మూలన కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. జిల్లాలోని వట్టిచెరుకూరుకు చెందిన సీహెచ్ హనుమంతురావు, నాగలక్ష్మి దంపతులు ప్రతి రోజూ వార్డుల్లో ఎలుకలను పట్టే బోన్లు అమర్చుతున్నారు. బోనులో ఉన్న ఆహారం కోసం వచ్చిన ఎలుకలు వాటిలో ఇరుక్కొని చనిపోతున్నాయి. చనిపోయిన వాటిని వెంటనే అధికారులకు లెక్క చూపించి మళ్లీ నూతనంగా బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఆస్పత్రి అధికారులు ఎలుకను పట్టినందుకు రూ.20 చొప్పున అందిస్తున్నారు. శానిటేషన్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.6 వేలు వేతనం ఇప్పిస్తున్నారు. ఎలుకలు పూర్తిగా నిర్మూలన అయ్యేవరకు ఎలుకల వేట ఆస్పత్రిలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
ఐఆర్ఎస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాక్ వర్గాలు
న్యూఢిల్లీ: ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారిక వెబ్‌సైట్‌ను పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన వర్గాలు హ్యక్ చేశాయి. ఆదాయపన్ను శాఖకు చెందిన http://www.irsofficersonline.gov.in వైబ్‌సైట్ శనివారం నుంచీ పనిచేయడం లేదని, అందులో పాకిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
రైలు పట్టాలపై ఇనుప గోలీలు
ఇంజన్ చక్రాలకు రంధ్రాలు డోర్నకల్: ఖమ్మం జిల్లా గార్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలపై ఇనుప గోలీలు(చర్రాలు) పెట్టిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. గురువారం రాత్రి ముద్దునూరు నుంచి బొగ్గులోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్సు రైలు గార్ల సమీపంలో మున్నేరువాగు బ్రిడ్జి దాటుతుండగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో రైలు డ్రైవర్, రైల్వే గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డోర్నకల్ రైల్వేస్టేషన్‌కు సమాచారం అందించారు. రైలును డోర్నకల్ స్టేషన్లో నిలిపిన అధికారులు.. ఇంజన్ చక్రాలకు రంధ్రాలు పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పెట్రోలింగ్, మహబూబాబాద్ పీడబ్ల్యూఐ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి తనిఖీ చేయగా పట్టాలపై గోలీల లాంటి రెండు ఇనుప వస్తువులు కనిపించారుు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం ఏడీఆర్ఎం(ట్రాఫిక్) పీసీ టాంటతో పాటు పీడబ్ల్యూఐ అధికారులు, జీఆర్పీ సీఐ స్వామి, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పట్టాలపై కూడా రెండు చోట్ల రంధ్రాలు పడటాన్ని గుర్తించారు. ఈ చర్యకు పాల్పడింది ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు జీఆర్పీ ఎస్ఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు. -
గ్రేటర్ పోలింగ్ 45.27 శాతం
లెక్క తేల్చిన అధికారులు గత ఎన్నికలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు లెక్క తేల్చారు. బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. పోలింగ్ జరిగిన మంగళవారం సాయంత్రం వరకు పూర్తి సమాచారం అందకపోవడంతో సాయంత్రం 4.30 గంటల వరకు తమవద్ద ఉన్న సమాచారం మాత్రమే వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాదాపు 45 శాతం పోలింగ్ జరిగినట్లు మీడియా సమావేశంలో వెల్లడించడం తెలిసిందే. దాదాపుగా అంతే పోలింగ్ నమోదైంది. వివిధ వర్గాల ద్వారా, సామాజిక వేదికల ద్వారా, వీఐపీల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడంతో ఈసారి కనీసం 50 నుంచి 60 శాతం వరకు పోలింగ్ నమోదు కాగలదని అంచనా వేశారు. అయితే నగర ప్రజల్లో పోలింగ్‌పై ఇంకా చైతన్యం పెరగాల్సి ఉందని తేలింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 3 శాతం పోలింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైన వార్డు విజయనగర్ కాలనీయే కావడం విశేషం. ఇవీ వివరాలు.. 2002లో ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు.. మొత్తం ఓటర్లు : 26,78,009 పోలైన ఓట్లు: 11,58,913 పోలింగ్ శాతం: 43.27 2009లో జీహెచ్ఎంసీ తొలి ఎన్నికల్లో.. మొత్తం ఓట్లు: 56,99,639 పోలైన ఓట్లు: 23,98,105 పోలింగ్ శాతం: 42.07 2016.. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం ఓట్లు: 74,23,980 పోలైన ఓట్లు: 33,60,543 పోలింగ్ శాతం: 45.27 -
వ్యవసాయ శాఖలో ఇష్టారాజ్యం
♦ రూ. 3 కోట్లు తినేసి కూడా ఏడీఏగా చలామణి ♦ ఖమ్మంలోనూ రూ. కోటి పక్కదారి పట్టినట్లు నిర్ధారణ ♦ అధికారుల విచారణ పూర్తి సాక్షి, హైదరాబాద్: అతను వ్యవసాయశాఖలో ప్రస్తుతం అసిస్టెంట్ డెరైక్టర్ (ఏడీఏ) హోదాలో పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల కిందట ఒక జిల్లాలో పనిచేస్తూ ప్రభుత్వ పథకాల నుంచి వచ్చిన నిధుల్లో రూ. 3 కోట్ల మేరకు కాజేశాడు. రోజుకు రూ. 10 లక్షల చొప్పున బ్యాంకు నుంచి సెల్ఫ్ చెక్కుల ద్వారా నొక్కేశాడు. అతనిపై రెండేళ్ల క్రితం క్రిమినల్ కేసు కూడా నమోదైంది. కానీ లాబీయింగ్ చేసుకుని దర్జాగా తిరిగి అదే హోదాలో పనిచేస్తున్నాడు. కాజేసిన రూ. 3 కోట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇతరత్రా పెట్టుబడులు పెట్టి రెండు మూడింతలుపైగా ఆర్జించాడు. అలాగే, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జరిగిన అక్రమాలపై ముగ్గురు సభ్యుల విచారణ బృందం రూ. కోటి వరకు అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిందని తెలిసింది. రిటైరైన జిల్లా అధికారి ఒకరు అందుకు సూత్రధారిగా తేల్చారు. జిల్లాలో వ్యవసాయ యంత్రాల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖ అడిషనల్ డెరైక్టర్ విజయ్‌కుమార్, అసిస్టెంట్ డెరైక్టర్ శ్యాంసుందర్‌రెడ్డి, డిప్యూటీ డెరైక్టర్ బాలు చేస్తున్న విచారణ శనివారం పూర్తయింది. సోమవారం వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథికి నివేదిక సమర్పించనుంది. సాగు యంత్రాలకు సంబంధించి రైతుల తరఫున సబ్సిడీతో సహా కొనుగోలు చేసిన యంత్రాలకు ప్రభుత్వం కంపెనీలకు నిధులు ఇస్తుంది. కానీ కంపెనీలకు చెల్లించకుండానే ఖమ్మం జిల్లాలో సెల్ఫ్ చెక్కులు జారీచేసుకుని నిధులు కాజేసినట్లు తేలింది. ఆ ప్రకారం వ్యవసాయాంత్రీకరణ కింద 2014-15లో ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గోల్మాల్ అయినట్లు నిర్ధారణ అయింది. గోల్‌మాల్‌లో రిటైర్డ్ అధికారి, ఆయనకు తోడ్పడిన అకౌంటెంట్లు, ఇతర కిందిస్థాయి అధికారులు బాధ్యులుగా నిర్ణయించినట్లు తెలిసింది. విచిత్రమేంటంటే కొల్లగొట్టిన సొమ్మును తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆ రిటైర్డ్ అధికారి చెబుతున్నారట. ఆయన కూడా కొల్లగొట్టిన సొమ్ముతో వ్యాపారం చేసి కాజేసిన సొమ్మును తిరిగి ఇస్తానని చెబుతుండటం అవినీతికి పరాకాష్ట. మరికొన్ని జిల్లాల్లోనూ ఇటువంటి అక్రమాలు జరిగి ఉంటాయని అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆ జిల్లాలపైనా నిఘా పెట్టాలని వ్యవసాయ మంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. -
సరుకులిచ్చినా సంతోషం ఏదీ?
సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరిట రూ. 370.41 కోట్లు ఖర్చు చేసి పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేసినా ఇటు పేదల్లోనూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంతోషం లేకుండా పోయింది. పండుగ పూట ఉన్నత వర్గాలతో సమానంగా పేదలు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి నెయ్యితో కూడిన పిండి వంటలు తిని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరు రకాల వస్తువులను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కాసులకు కక్కుర్తిపడి నాసిరకం సరుకులు పంపిణీ చేశారు. దీంతో చాలా మంది పేదలు వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. తెల్లరేషన్ కార్డున్న ప్రతి లబ్దిదారుడికి రూ. 270లు విలువ చేసే అరకిలో కందిపప్పు, అర లీటర్ పామాయిల్, అర కిలో శనగపప్పు, అర కిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా ఇచ్చినా వాటిలో బెల్లం కరిగిపోయి వినియోగించుకోవడానికి వీల్లేకుండా పోయింది. దీనికి తోడు పొట్టుతో కూడిన గోధుమపిండి సరఫరా చేశారు. చంద్రన్న కానుక పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉన్న బ్యాగులో నాసిరకం సరుకులను పేదలకు కట్టబెట్టారు. నాసిరకం సరుకులు ఇవ్వడం వల్ల వాటిని పేదలకు ఉపయోగపడలేదని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెప్పించుకున్న సీఎం నా ఫోటో ఉన్న బ్యాగులో ఇలాంటి సరుకులు పంపిణీ చేసి తన పరువు తీశారంటూ ఇటీవల నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల సమయం ఇచ్చినా నాణ్యమైన సరుకులు ఇవ్వకుండా ముఖ్యమంత్రికి సంతోషం లేకుండా చేశారు. -
ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
♦ 46 వేల మంది సిబ్బంది నియామకం ♦ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి లింగోజిగూడ: ఫిబ్రవరి 2న నిర్వహించనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్, ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు గాను 46 వేల మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎల్బీనగర్ జంట సర్కిళ్ల(3ఎ, 3బి) కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని విభాగాల అధికారులకు శిక్షణ పూర్తి చేశామని, ఈవీఎం యంత్రాలను ఆయా కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచామని చెప్పారు. ఈవీఎంలు మొరాయిస్తే ముందు జాగ్రత్తగా అదనంగా 27 శాతం మిషిన్లను అందుబాటులో ఉంచామన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 50 లక్షల ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారన్నారు. మరో రెండు రోజుల్లో అందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహన శిబిరాలు నిర్వహించామని పేర్కొన్నారు. విద్యార్థులకు సంకల్ప పత్రాలు అందజేసి వారి తల్లిదండ్రులు ఓటేసే విధంగా కృషి చే స్తున్నామన్నారు. అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక టీమ్‌లు ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాయని చెప్పారు. అందరూ సమన్వయంతో పనిచేయాలి... ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ కోరారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా సిబ్బందికి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారుల నియామకానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. జోనల్ అధికారులు, ఆర్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేసేందుకు అందరూ నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. జోనల్ అధికారులకు వాహనాలు అందుబాటులో ఉంటాయని, పోలింగ్ సందర్భంగా గంటకు ఒకసారి డేటాను పంపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జంట సర్కిళ్ల ఎన్నికల పరిశీలకులు దినకర్‌బాబు, ఒమర్ జలీల్, జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డీసీలు పంకజ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి వద్దు.. చదువుకుంటా!
పోలీస్‌స్టేషన్‌లో తల్లిపై ఫిర్యాదు చేసిన బాలిక దేవరకొండ: ‘నాకు పెళ్లి వద్దు.. చదువుకుంటా’ అని నల్లగొండ జిల్లాలో ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. డిండి మండలం కింది శేషాయికుంటకు చెందిన వరికుప్పల సత్యనారాయణ, రామచంద్రమ్మల కుమార్తె అంజలి(14). ఐదేళ్ల క్రితం తండ్రి మరణించాడు. అంజలిని ఆరో తరగతి వరకు చదివించి మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్లులోని ఓ పత్తి మిల్లులో పనికి పంపుతోంది. ఇటీవల అంజలికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో జనవరి 1న మిల్లు నుంచి తప్పించుకుని వచ్చి డిండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అధికారులు, పోలీసులు సోమవారం అంజలిని నల్లగొండలోని బాలసదన్‌కు పంపించారు. ఇంటర్ వరకు అక్కడే చదువుకోవచ్చని సీడీపీవో సక్కుబాయి తెలిపారు. -
ఖైదీలకూ ఓటు హక్కు!
నేరాలలో సంబంధం ఉండి జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సమాచారం సేకరించి అర్హత కలిగిన ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని నిర్ణయించారు. ఖైదీలను డివిజన్ల వారీగా విభజించి వారికి పోస్టల్ బ్యాలెట్‌ను అందిస్తారు. ఓటు వేసిన అనంతరం సీల్డ్ కవర్లో స్వీకరించి డివిజన్ల వారీగా భద్రపరుస్తారు. వీటిని ఆయా కౌంటింగ్ కేంద్రాలకు పంపి ఫిబ్రవరి 5న లెక్కిస్తారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు రాజేంద్రనగర్ ఇన్చార్జి ఉపకమిషనర్ దశరథ్ పోలీస్స్టేషన్ల నుండి ఖైదీల వివరాలను సేకరించారు. మొత్తం ఇక్కడి ఐదు డివిజన్లలో 15 మంది జైలులో ఉన్నారు. కాగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్లలో 53 మంది సర్వీసు ఓటర్లను కూడా అధికారులు గుర్తించారు. వారి చిరునామా అనుగుణంగా పోస్టల్ ద్వారా సోమవారం బ్యాలెట్ పేపర్లను పంపించారు. - రాజేంద్రనగర్ -
మంచుతుపాను: నేడు 2800 విమానాలు రద్దు
► అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను ► 19కి చేరిన మృతుల సంఖ్య ► ఎమర్జెన్సీని ప్రకటించిన పది రాష్ట్రాలు ► నేడు 2,800 విమనాలు రద్దు చేసిన అమెరికా ► నిన్న 5,100 విమాన సర్వీసులు రద్దు వాషింగ్టన్: అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దేశ రాజధాని వాషింగ్టన్లో ఒక్క రోజే 30 అంగుళాల మంచు కురిసింది. దీని కారణంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య19కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. నార్త్ కరోలినాలో మంచు కారణంగా కారు ప్రమాదాల్లో 13 మంది మృతిచెందగా, వర్జీనియాలో ఇద్దరు, మేరీలాండ్‌లో ఒకరు, న్యూయార్క్‌లో ముగ్గురు మృతిచెందారు. పది లక్షల మంది మంచులో ఇరుక్కున్నట్లు అధికారులు ప్రకటించారు. జార్జియా, ఉత్తర కరోలినా, టెన్నెస్సీ, మేరీలాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, కెంటకీ రాష్ట్రాలు మంచు తుపానుకు విలవిల్లాడిపోతున్నాయి. 10 రాష్ట్రాలు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. న్యూయార్క్ గవర్నర్ ఆడ్రివ్ క్యూమో సహా ఇతర రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్ నగరాల్లోని రోడ్లపైకి వాహనాలను నిషేదించారు. వాహనాలు రాకుండా న్యూజెర్సీలోని బ్రిడ్జీలు, సొరంగ మార్గాలను ఆదివారం ఉదయమే మూసివేసినట్టు మేయర్ బిల్ ది బ్లాసియో తెలిపారు. అమెరికాలో మంచు కారణంగా నిన్న(శనివారం) 5,100 విమానాలు రద్దు చేయగా, ఈ రోజు 2,800 కి పైగా విమానాలను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వర్జీనియాలోని గురుద్వారాలు, ఆలయాల్లో మంచులో చిక్కుకుపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ తుపాను వల్ల దాదాపు లక్షా ఇరవై వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు వంద బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పరిస్థితిలో మార్పు రాదని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. -
అమెరికాను వణికిస్తున్న మంచుతుపాను
అమెరికాలోని నాష్విల్లే నగరంలో భారీగా కురుస్తున్న మంచు 9 మంది మృతి వాషింగ్టన్: అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. దేశ రాజధాని వాషింగ్టన్లో ఒక్క రోజే 30 అంగుళాల మంచు కురిసింది. 10 రాష్ట్రాలు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఇప్పటివరకు 9 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. పది లక్షల మంది మంచులో ఇరుక్కున్నట్లు అధికారులు శనివారం ప్రకటించారు. జార్జియా, ఉత్తర కరోలినా, టెన్నెస్సీ, మేరేలాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, కెంటుకీ రాష్ట్రాలు మంచు తుపానుకు విలవిల్లాడిపోతున్నాయి. వర్జీనియాలో తెలుగు జనాభా ఎక్కువగా ఉండటంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. ఎవరూ కూడా ఇళ్లు వదిలి బయటకు రాకూడదని తన సభ్యులకు విజ్ఞప్తి చేసింది. ఒక్క వర్జీనియాలోనే దాదాపు 800 ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వర్జీనియాలోని గురుద్వారాలు, ఆలయాల్లో మంచులో చిక్కుకుపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ తుపాను వల్ల దాదాపు లక్షా ఇరవై వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు వంద బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పరిస్థితిలో మార్పు రాదని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. -
విపత్తుకేదీ విరుగుడు?
ముంపు ముంగిట నగరం.. మేల్కోవాలి నాయక గణం కుంభవృష్టి కురవకపోయినా.. 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం కురిసినా నగరం మునిగిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక విపత్తు వస్తే పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలాలు ఓవైపు ఆక్రమణలకు గురై.. మరోవైపు చెత్తాచెదారం నిండిపోవడంతో వరద నీరు వెళ్లలేని దుస్థితి నగరానిది. సిటీలో సుమారు వంద నీట మునిగే(వాటర్ లాగింగ్) ప్రాంతాలున్నట్లు బల్దియా గుర్తించినా.. నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. రాష్ట్ర గవర్నర్ నివాసముండే రాజ్‌భవన్, అసెంబ్లీ, అమీర్‌పేట్ మైత్రీవనం, ఖైరతాబాద్ తదితర ప్రధాన ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు తగిన ప్రణాళికలు గానీ, చేసిన పనులు గానీ లేవంటే అతిశయోక్తి కాదు. కాగితాలపైనే నివేదికలు... 2000 ఆగస్టులో కురిసిన వర్షాలకు నగరం జలమయమైంది. నీరు వెళ్లే మార్గం లేకపోవడం, వరదనీటి కాలువల్లో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలు, ఇంకుడు గుంతలు లేకపోవడం, నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురవ్వడమే దీనికి కారణమని నిపుణులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించే బాధ్యత కిర్లోస్కర్ కన్సల్టెంట్‌కు అప్పగించారు. 2003లో నివేదిక సమర్పించిన కిర్లోస్కర్ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివద్ధి చేయాలని సూచించింది. దీనికి దాదాపు రూ.264 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భూసేకరణ, పునరావాసాలకు అదనపు నిధులు అవసరమవుతాయని భావించారు. మేజర్ నాలాల అభివద్ధికి కిర్లోస్కర్ కమిటీ ఈ నివేదిక రూపొందించగా, మైక్రోలెవల్ వరకు వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సిందిగా అధికారులు 2006లో కమిటీ కి సూచించారు. 2007లో నగరం గ్రేటర్‌గా ఏర్పటయ్యాక ‘సమగ్ర మాస్టర్‌ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్వర్క్ ప్లాన్, మేజర్, మైనర్ వరద కాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దీని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి రూ.6,247 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులతో బల్కాపూర్, కూకట్పల్లి, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజగుట్ట, యూసుఫ్‌గూడ, నాగమయ్యకుంట, కళాసిగూడ, ఇందిరాపార్కు, ముర్కినాలాలను ప్రక్షాళన చేసి, ఆక్రమణలు నిరోధించాలి. వీటితో పాటు దండు మాన్షన్, గాంధీనగర్, మోడల్‌హౌస్, జలగం వెంగళరావు పార్కు ప్రాంతాల్లో టన్నెలింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఈ నివేదికలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. చతుర్విద ప్రక్రియతో జలసిరి.. నగరంలోని పార్కులు, లోతట్టు ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో ఒక్కటి చొప్పున భారీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. ఇవి 22 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల లోతులో ఉండాలి. వీటిపై రంధ్రాలున్న సిమెంట్ జాలి, చెత్తాచెదారం చేరకుండా సిల్టు ట్రాపు మూతలు ఏర్పాటు చేయాలి. దీంతో సమీప బోరుబావులు రీఛార్జ్ అయి జలసిరి సంతరించుకుంటాయి. ఇలా చేస్తే 80 శాతం వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. ముంపు సమస్యలనూ అధిగమించొచ్చు. వీటి ఏర్పాటుపై జలమండలి, జీహెచ్ఎంసీ, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు దృష్టి సారించాలి. - హనుమంతరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్, రిటైర్డ్ ఆధునీకరించాలి.. లక్ష్మి, వివేకానందనగర్ నాలాల విస్తరణ చేపట్టాలి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నాలాలు కబ్జాలకు గురయ్యాయి. వర్షపు నీరు వెళ్లేందుకు నిర్మించిన నాలాల్లో ప్రస్తుతం రసాయన జలాలు, డ్రైనేజీ పారుతోంది. చెత్తాచెదారాలు నిండిపోయాయి. దీంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక వరద ఇళ్లలోకి వస్తోంది. ఇళ్లలోకి నీరు చేరి విష సర్పాలు కూడా వచ్చిన సందర్భాలున్నాయి. నాలాలు ఆధునీకరించి అభివృద్ధి చేసే వారికే నా ఓటు. అక్రమార్కులపై చర్యలేవీ? లావణ్య, కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్‌లో 6 కిలో మీటర్ల మేర నాలా విస్తరించి ఉంది. సుమారు 30 ఫీట్ల నాలా 15 ఫీట్లకు కుంచించుకుపోయింది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. ఆక్రమణలు జరుగుతున్నా అడ్డుకోకపోవడంతో నాలాలను ఆనుకొని బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. గతంలో అధికారులు పలు నిర్మాణాలు అక్రమమని తేల్చారు. కానీ చర్యలు తీసుకోలేదు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే నాయకులకే పట్టం కడతాం. నాలాల నిర్వహణేదీ..? ఈఎస్ ధనుంజయ, అంబర్‌పేట అధికారులు నాలాల నిర్వహణ మరిచారు. ‘నామ్‌కే వాస్త్’గా నాలాల పూడికతీత తీసి, నిధులు దండుకుంటున్నారు. మరోవైపు నాలాలు ఆక్రమణలకు గురై కుంచించుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. నాలాల చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని ఎన్నికల వేళ నాయకులు హామీలిస్తున్నారే తప్ప నెరవేర్చడం లేదు. హామీలు నెరవేర్చే వారినే గెలిపించాలి. చినుకొస్తే నగరం చిగురుటాకే.. కుంభవృష్టి కురిస్తే క‘న్నీటి’ సంద్రమే.. రహదారులు జలమయమే. రాకపోకలు రణరంగమే.. నిలువ నీడ లేక బస్తీలకు నిత్య కష్టమే.. ‘కబ్జా’ సర్పం పడగవిప్పి.. నీరు వెళ్లే దారి లేకుండా నాలాలను ఆక్రమించిన నరకమిది. నివేదికలు కాగితాలకే పరిమితమై.. వరద నీరు నగరాన్ని వణికిస్తున్న చిత్రమిది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం, అక్రమార్కుల ఆగడాల ఫలితమే ఈ దుస్థితి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ను ముంపు ముప్పు నుంచి గట్టెక్కించే పార్టీకే పట్టం కడతామంటున్నారు నగరవాసులు. ..: సాక్షి, సిటీబ్యూరో , కుత్బుల్లాపూర్ ‘మెట్రో’ల్లో భేష్ ముంబై, బెంగళూర్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మెట్రో నగరాల్లో విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఏర్పాటు చేసిన విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్) అందుబాటులో ఉంది. ఇందులో ఆయా నగరపాలక సంస్థలు, జలబోర్డులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విపత్తు నిర్వహణ విభాగానికి ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. విపత్తు సంభవించినప్పుడు సంస్థ సభ్యులు ఆయా విభాగాలను అప్రమత్తం చేసి, సుశిక్షితులైన సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపడతారు. కానీ నగరంలో ఇలాంటి ప్రత్యేక విభాగం లేదు. సిటీలోనూ ఇవి అవసరం ► నగరంలోనూ విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్) ఏర్పాటు చేయాలి. ► సిటీలోని పురాతన భవనాల నాణ్యత, మన్నికను గుర్తించేందుకు రేడియోధార్మిక టెక్నాలజీని వినియోగించాలి. ► నాలాలు, లోతట్టు ప్రాంతాలను జీఐఎస్ పరిజ్జానం ద్వారా గుర్తించి మ్యాపులు సిద్ధం చేయాలి. ► లోతట్టు ప్రాంతాల్లో ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ యంత్రాల ఏర్పాటు ► ముప్పు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించకుండా అత్యవసర మోటార్లు ఏర్పాటు చేయాలి. ► ప్రతి నాలా చుట్టూ వలయం నిర్మించాలి. ప్రతిపాదనలకే పరిమితం... నాలాల ఆధునీకరణకు రూ.10 వేల కోట్లు ఖర్చవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదించారు. తొలిదశలో 390 కి.మీ.ల మేర నాలాలను అభివద్ధి చేయాలని గతేడాది నవంబర్‌లో భావించారు. దశల వారీగా పనులు పూర్తి చేయాలని, ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజినీర్లు, సర్వేయర్లతో ప్రత్యేక బృందాలను నియమిస్తామని ప్రకటించారు. నేటికీ ఆచరణలోకి రాలేదు. ఇవిగో పరిష్కార మార్గాలు.. ► ప్రధాన నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ► బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ► నిర్ణీత వ్యవధిలో పనుల పూర్తికి ప్రత్యేక విభాగం ఏర్పాటు ► నాలాల ఆధునీకరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి. దీనికి పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. ► వరద నీటి కాలువల్లో మురుగునీరు పారకుండా జలమండలికి స్పష్టమైన ► ఆదేశాలివ్వాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. ► అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ► చెరువులు పునరుద్ధరించాలి. -
‘తోడేళ్ల ఫలహారం’ బిగుసుకుంటోంది
సాక్షి ప్రతినిధి మహబూబునగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ, పరిహారంలో జరిగిన అవకతవకల ఉచ్చు కొందరు అధికారుల మెడకు బిగుసుకుంటోంది. అక్రమాలకు సంబంధించి సాక్షిలో వరుస కథనాలు రావడంతో అధికారులు నష్టపరిహారం పంపిణీపై అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పలు రిజర్వాయర్ల పరిధిలో భూ సేకరణ జరుగుతున్న తీరు, నష్టపరిహారం నిర్ధారిస్తున్న విషయంపై అధికారులు దృష్టి సారించారు. మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కర్వెన రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణలో వెలుగుచూసిన అక్రమాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వ యంత్రాంగం ఇక క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యటించాకే పంట భూములను రెండు పంటలవిగా నిర్ధారించాలని నిర్ణయిం చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా భూ సేకరణకు సంబంధించి నష్టపరిహారం నిర్ధారణ చేసుకోవడానికి ఆయాభూములను సంబంధిత పర్యవేక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలున్నా కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి క్షేత్రస్థాయి పర్యటనలే చేయలేనట్లు తెలుస్తోంది. దీంతో ఒక పంట భూముల ను రెండు పంటలు పండేవిగా రికార్డుల్లోకి ఎక్కడంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైంది. మరోమారు పరిశీలన కర్వెన రిజర్వాయర్ పరిధిలో భూ సేకరణలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి దిద్దుబాటు చర్యలకు కొందరు క్షేత్రస్థాయి ఉద్యోగులు చేపట్టినట్లు తెలుస్తోంది. అక్రమాలు జరగలేదని వాదించిన వారిలో కొందరు అధికారులు బుధవారం కర్వెన రిజర్వాయర్ పరిధిలో నష్టపరిహారం చెల్లించిన భూముల్లో కొన్నింటిని పరిశీలించారు. వాటిలో ఉన్న బోర్లు పనిచేస్తున్నాయా..లేదా..అవి ఎన్ని ఎకరాలకు నీరందించే సామర్థ్యం కలిగి ఉన్నాయన్న అంశాన్ని పరిశీలించారు. భూ సేకరణలో ఎటువంటి అక్రమాలూ జరగని పక్షంలో నష్టపరిహారం చెల్లింపులు జరిగిన భూములను, వాటిలోని బోర్లను క్షేత్రస్థాయి అధికారి తరచితరచి పరిశీలించడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అదే విధంగా వాస్తవానికి భిన్నంగా రెండు పంటల భూములుగా రికార్డులలో నమోదైన వాటికి సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొందరికి చెల్లించి, తమవి ఎలా ఆపుతారని లబ్ధిదారులు ప్రశ్నిస్తుండడంతో చెల్లింపులను తాత్కాలికంగానే నిలిపివేస్తున్నామని సర్దిచెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భూ పరిహారం విషయంలో ఇప్పటికే ఆర్డీఓ కొంతమేరకు విచారణ జరపడం.. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు నివేదించడం తదితర పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కొందరు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో దిద్దుబాటు చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
లక్షకు చేరువలో ‘పోలీస్’ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వారం వ్యవధిలోనే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ‘లక్ష’కు చేరువైంది. పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో 9,281 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో అందుకు అనుగుణంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈనెల 11 నుంచి ఆన్లైన్లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుండటం తెలిసిందే. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అభ్యర్థుల నుంచి కాస్త తక్కువగా దరఖాస్తులురాగా గత రెండ్రోజుల్లో మాత్రం ఏకంగా 30 వేల మంది చొప్పున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మంగళవారం రాత్రికి దరఖాస్తుల సంఖ్య దాదాపు లక్షకు చేరువైంది. మరోవైపు దరఖాస్తుల్లో తప్పులు దొర్లుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా మంది అభ్యర్థులు స్కాన్ చేసిన ఫొటోలను మాత్రమే పొందుపరిచి, సంతకం చేయడం మరిచిపోతున్నారని, ఇలా అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు తమ వెబ్సైట్ హోంపేజీపై ‘సంతకం తప్పనిసరి’ అనే సూచనను రిక్రూట్మెంట్ బోర్డు పొందుపరిచింది. దరఖాస్తు విధానంలో ఎలాంటి తప్పులు దొర్లినా, అందుకు అభ్యర్థులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు అభ్యర్థులకు రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లలో తెలుగు, ఆంగ్లంలోనే సూచనలు ఉండగా ఉర్దూ మీడియం అభ్యర్థుల కోసం ఉర్దూలోనూ వాటిని పొందుపరిచారు. -
గీత దాటితే అంతే...
♦ నేటి నుంచి జీహెచ్ఎంసీలో నామినేషన్ల సందడి ♦ నిబంధనల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ♦ అతిక్రమిస్తే నామినేషన్ల తిరస్కరణ ఖాయం సాక్షి, సిటీబ్యూరో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ జారీతోపాటు నామినేషన్ల స్వీకరణ కూడా మంగళవారమే ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ చట్టం మేరకు రిటర్నింగ్ అధికారులు దీనికి సంబంధించి పబ్లిక్నోటీసు జారీ చేస్తారు. ఇక అధికారులు ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. ఏమాత్రం ఉల్లంఘనలు జరిగినా నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇవీ నామినేషన్ల నిబంధనలు ► 150 డివిజన్లకుగాను 150 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. ► నామినేషన్లు స్వీకరించే సమయం ఉ. 11 గం॥నుంచి మ. 3 వరకు ► ఒక డివిజన్‌కు ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఒక నామినేషన్‌కే డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. ► జీహెచ్ఎంసీలోని ఏ వార్డులోనైనా ఓటరు జాబితాలో పేరున్న వారే పోటీకి అర్హులు. ఈ మేరకు సర్కిల్ కార్యాలయం నుంచి పొందిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ► అభ్యర్థిని ప్రతిపాదించే వారికి సైతం ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రతిపాదించేవారు వార్డులో ‘స్థానికుడై’ ఉండాలి. ► ఎస్సీ, ఎస్టీ, బీసీలు కులధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. ► నామినేషన్‌తో పాటు రూ. 20 స్టాంపు పేపర్‌పై తమ విద్యార్హతలు తదితర వివరాలతో అఫిడవిట్ సమర్పించాలి. ► ఏరోజుకారోజు అందిన నామినేషన్లు, అభ్యర్థుల అఫిడవిట్లను సాయంత్రం వేళ నోటీసుబోర్డులో ప్రదర్శిస్తారు. ఎన్నికల సంఘం వెబ్సైట్లోనూ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ► ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులు నామినేషన్‌కు ఒక రోజు ముందే ఎన్నికల ఖర్చు నిర్వహణ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి. ఖాతా వివరాలను రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా తెలపాలి. వీరు అనర్హులు ► అవినీతి కేసుల్లో శిక్ష పడిన వారు, ఎన్నికల్లో నేరాలకు పాల్పడి శిక్షలు పడిన వారు ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులు. ► ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అర్హులు కారు. ► జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన ఏదేని పన్నుకు సంబంధించిన నోటీసు అంది, నిర్ణీత గడువు ముగిసేలోగా పన్ను కట్టనివారు అర్హులు కారు. డిక్లరేషన్ తప్పనిసరి ► ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల వార్డుల్లో పోటీచేసే ఆయా కేటగిరీల అభ్యర్థులు నామినేషన్ ఫారంతోపాటు ఫారం-2తో డిక్లరేషన్ ఇవ్వాలి. ► అందుకు అనుగుణంగా అధీకృత అధికారి జారీ చేసిన కులధ్రువీకరణ పత్రం పొందుపర్చాలి. ► నామినేషన్‌తో పాటు రూ.5 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అందులో సగం అంటే రూ. 2500 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మొత్తాన్ని రిటర్నింగ్ అధికారికి నగదు రూపంలో గానీ, ఎస్బీహెచ్ శాఖల్లో చలానా రూపంలో గానీ, ట్రెజరీ ద్వారా కానీ చెల్లించవచ్చు. ► జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలిసారిగా‘నోటా’ను అమలు చేయనున్నారు. ► గ్రేటర్ లోని 150 వార్డుల ఎన్నికలకు సంబంధించిన రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు సంబంధిత సర్కిళ్లలో ఏర్పాటు చేశారు. -
రేపటి నుంచి ‘పోలీస్’ దరఖాస్తులు
♦ మొత్తం 9,281 పోస్టులు... ఆన్లైన్లోనే దరఖాస్తుల ప్రక్రియ ♦ ఏర్పాట్లు పూర్తి చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. వివిధ పోలీసు విభాగాల్లో కలిపి భర్తీ చేయనున్న ఈ 9,281 పోస్టులకు పూర్తిగా ఆన్లైన్లోనే దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కొలువుల సంఖ్య భారీగా ఉండడం, వయోపరిమితి సడలింపు నేపథ్యంలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దరఖాస్తు విధానంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక నిపుణులను కూడా అందుబాటులో ఉంచారు. ఈ భర్తీకి సంబంధించి జనరల్ కేటగిరీలో 25 ఏళ్ల వరకు, హోంగార్డులుగా పనిచేస్తున్న వారికి 33ఏళ్ల వయస్సు వరకు వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల్లో నిర్ధారిత వయోపరిమితి అదనంగా వర్తిస్తుంది. ఇక సివిల్ పోలీసు పోస్టుల్లో మహిళలకు 33 శాతం పోస్టులు రిజర్వు చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల విధానం రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ కేటగిరీల అభ్యర్థులు రూ.400.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మీసేవ, ఈసేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో సొమ్ము చెల్లించి రసీదు తీసుకోవాలి. అనంతరం ఠీఠీఠీ.్టటఞటఛ.జీ వెబ్సైట్లోకి వెళ్లి.. అప్లైఆన్లైన్పై క్లిక్ చేయాలి. అందులో సొమ్ము చెల్లించిన రసీదుపై ఉన్న రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి. అనంతరం ‘మైఅప్లికేషన్’లోకి వెళ్లి అభ్యర్థులు తమ పూర్తి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలు తలెత్తితే వెబ్సైట్లోనే ‘యూజర్ గైడ్’ పరిశీలించి.. నివృత్తి చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థి సెల్‌ఫోన్‌కు, మెయిల్ ఐడీకి వివరాలు అందుతాయి. ప్రిలిమినరీ పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపిక విధానంలో మార్పులు పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం గతం లో ఉన్న విధానాలను చాలా వరకు మార్చారు. ముఖ్యంగా ఐదు కిలోమీటర్ల పరుగుకు స్వస్తి చెప్పి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై దృష్టి సారించారు. ఎంపిక ప్రక్రియలో మొట్టమొదట ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ (బహుళ ఐచ్ఛిక) విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు... బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ‘ఐదు కిలోమీటర్ల పరుగు (మహిళలకు 2.5 కి.మీ)’ పరీక్షకు బదులుగా పురుషుల విభాగంలో 800 మీటర్లు, మహిళల విభాగంలో 100 మీటర్ల ‘పరుగు’ పరీక్షలు చేస్తారు. చివరగా మెయిన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ స్థాయిలో 200 ప్రశ్నలతో ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో లభించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇదీ సిలబస్.. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో ఇంటర్మీడియట్ స్థాయిలో 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు (ఆబ్టెక్టివ్ పద్ధతిలో) ఉంటాయి. ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటిక్స్ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కంటెంట్స్ ఆఫ్ పార్టెయినింగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఇక దేహదారుఢ్య పరీక్షల తర్వాత నిర్వహించే మెయిన్ రాతపరీక్షలోనూ ఇంటర్మీడియట్ స్థాయిలో 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అదనంగా పర్సనాలిటీ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తారు. -
ఆధారాలను పరిశీలిస్తున్నాం: పాక్
ఇస్లామాబాద్: పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై భారత్ అందించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పాక్ కార్యాలయం తెలిపింది. దాడి ట్‌పై దాడి దురదృష్టకరమని.. జవాన్లు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని పేర్కొంటూ భారత ప్రభుత్వానికి, ప్రజలకు పాక్ తీవ్ర సంతాపం తెలిపింది. అలాగే.. సుస్థిర చర్చల ప్రక్రియలకు భారత్, పాక్‌లు కట్టుబడి ఉండాలని ఆకాంక్షించింది. మరోవైపు.. పఠాన్‌కోట్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల ఫోన్ కాల్ రికార్డుల వివరాలు, పాక్‌లోని వారి సూత్రధారుల మొబైల్ నంబర్లు, వారు సరిహద్దుకు ఆవలి నుంచి వచ్చినట్లు ఆధారాలను.. మున్ముందు ఇరు దేశాల అధికారులు భేటీ అయినపుడు పాక్‌కు తప్పనిసరిగా అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
రండి..శుభాకాంక్షలు చెప్పండి..!
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లోని ఐఏఎస్‌లు అందరూ విజయవాడ వచ్చి ముఖ్యమంత్రిని అభినందించాలి. ఇందుకు తగిన రవాణా ఏర్పాట్లు జరిగాయి. సచివాలయం నుంచి ఒంటిగంటకు వోల్వో బస్సు విజయవాడకు బయలుదేరుతుంది’... ఇదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సీఎంవో ఆఫీసు నుంచి ఐఏఎస్‌లందరికీ వచ్చిన ఎస్ఎంఎస్. శనివారం నుంచి ప్రారంభమయ్యే జన్మభూమికి సమాయత్తమవుతున్న ఐఏఎస్ లు ఈ ఎస్ఎంఎస్లతో విస్తుపోయారు. బహిరంగ సభలకు జనాన్ని వాహనాల్లో తరలించడం చూశాం గాని ముఖ్యమంత్రిని అభినందించేందుకు వోల్వో బస్సులు పెట్టి ఐఏఎస్‌లను తీసుకువెళ్లడం ఏమిటంటూ రుసరుసలాడారు. అయినా పిలిపించుకుని మరీ అభినందనలు చెప్పించుకోవాల్సిన అగత్యం ముఖ్యమంత్రికి వస్తే ఎలా? అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా నయం, బహిరంగ సభలకు తోలే జనానికి ఇచ్చినట్టు ఓ బిర్యానీ ప్యాకెట్టు, క్వార్టర్ మందు ఇస్తామన్నారు కాదంటూ ఓ ఐఏఎస్ జోక్ పేల్చారు. విజయవాడ పోయి వచ్చేందుకు కనీసం 10 గంటలు పడుతుందని, మళ్లీ తెల్లవారుతూనే జన్మభూమి విధులకు హాజరు కావాల్సి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నమ్మినబంట్లు ఎవరో తమ పలుకుబడిని చూపించుకునేందుకు ఈ పని చేశారంటూ వాపోయారు. ఇంత హడావుడి చేసినా... ఐఏఎస్ అధికారులు లింగరాజు పాణిగ్రాహి, సిసోడియా, జేసీ శర్మ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముద్దాడ రవిచంద్ర, అశోక్‌లు మాత్రమే బస్సులో వెళ్లగా... మిగతావారు విమానాల్లోనే వెళ్లడం గమనార్హం. సీఎం ఒక్కరు వస్తే... ముఖ్యమంత్రి ఒక్కరు హైదరాబాద్‌కు వస్తే ఇంతమంది అధికారులు విమానాల్లో, కార్లలో, గరుడ బస్సులో విజయవాడకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని, దీనివల్ల సర్కారు ఖజానాపై భారం తగ్గేదని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానించాయి. సీఎం ఒక్కరు హైదరాబాద్ వచ్చి ఉంటే ఈ వృథా వ్యయం తప్పేదని చర్చించుకున్నారు. కేవలం ఆరుగురికోసం 48 సీట్లున్న గరుడ బస్సులు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తపరిచారు. -
మహిళా, ఎస్సీ/ఎస్టీ ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత ఎక్కువగా ఉంది. కీలకమైన చాలా విభాగాలకు ఆయా శాఖలపై పట్టున్న అధికారులు లేరు. కొరతను అధిగమించేందుకు కేంద్రం రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఎక్కువ మంది మహిళా, ఎస్సీ, ఎస్టీ,, ఓబీసీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను గుర్తించి కేంద్రానికి డిప్యుటేషన్‌పై పంపాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. డిప్యూటీ సెక్రెటరీ, డెరైక్టర్ స్థాయిలో కొరత ఎక్కువగా ఉందని పేర్కొంది. సివిల్ సర్వీసెస్ బోర్డుకు ప్యానెల్ రికమెండ్ చేసిన అధికారులు చివరి దశలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నా, వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నా, కేడర్ నుంచి రిలీవ్ చేసేందుకు నిరాకరించినా.. అటువంటి అధికారులను ఐదేళ్లు సెంట్రల్ డిప్యుటేషన్ నుంచి డిబార్ చేస్తామని, విదేశీ పోస్టుకూ పరిగణనలోకి తీసుకోబోమని తెలిపింది. -
సాగు సంబంధమైనవి 342
సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేల్చింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 782 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది. వారిలో కేవలం 342 మంది ఆత్మహత్యలు నిజమైనవని, మిగిలినవి వ్యవసాయ సంబంధమైనవి కావని స్పష్టం చేసింది. నవంబర్, డిసెంబర్లో ఇప్పటివరకు జరిగిన ఆత్మహత్యల వివరాలు ఇంకా రాలేదని అధికారులు తెలిపారు. ఆత్మహత్యల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపెడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 1500 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలను నిర్దారించేందుకు జిల్లాల్లో డివిజన్ స్థాయిలో ఆర్డీవో చైర్మన్‌గా, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీలు సభ్యులుగా వేసిన కమిటీలు వీలైనంత మేరకు ఆత్మహత్యల సంఖ్యను తక్కువ చేసి చూపెడుతోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుకు సంబంధించిన దాదాపు 16 రకాల రికార్డులను కమిటీ పరిశీలించి కొర్రీలు పెట్టి నిర్దారించింది. జాతీయ క్రైం రికార్డు బ్యూరో ప్రకారం తెలంగాణలో రైతులు ఆర్థికంగా దివాళా తీయడం, అప్పులు పెరగడం, పంట న ష్టం జరగడం, వ్యవసాయ సంబంధిత సమస్యల కారణంగా చనిపోతున్నారని అంచనా వేసింది. పెళ్లి సంబంధిత సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అప్పులు, దివాళా కారణంగా మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా పేర్కొంది. ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో 41.8 శాతం మంది సన్నకారు రైతులు, 25.2 శాతం మధ్యతరహా రైతులు, 22.5 శాతం మంది చిన్నకారు రైతులు, 2.3 శాతం మంది పెద్ద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. కానీ వీటిని తెలంగాణ సర్కారు లెక్కలోకి తీసుకోవడంలేదు. -
పాలమూరు-రంగారెడ్డిలో అదనపు బ్యారేజీ!
♦ ఐదు కాక ఆరు నిర్మించాలని యోచన ♦ కొత్తగా ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి మధ్య అంతారం వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి స్థలం గుర్తింపు ♦ అంతారం బ్యారేజీతో తాండూర్, పరిగి, వికారాబాద్‌లలో 2 లక్షల ఎకరాలకు నీరు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఇప్పటికే నిర్ణయించిన ఐదు రిజర్వాయర్లకు తోడు మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవుని పల్లి బ్యారేజీల మధ్య అంతారం వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించాలని భావిస్తోంది. కొత్త బ్యారేజీ అవకాశాలపై పరిశీలన జరుపుతున్న దృష్ట్యానే ప్రస్తుతం ప్రాజెక్టు అంచనాలన్నీ సిద్ధమైనా.. రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మీదేవుని పల్లి బ్యారేజీ, ఇతర కాల్వల పనులను ప్రభుత్వం సిద్ధం చేయలేదని తెలుస్తోంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో మొత్తంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవుని పల్లి వద్ద బ్యారేజీలను ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటికే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా అన్ని బ్యారేజీల సర్వే, అంచనాలు సిద్ధమయ్యాయి. రిజర్వాయర్ల అంచనాల సమయంలోనే పంప్‌హౌజ్‌ల నిర్మాణానికి అవసరమయ్యే మోటార్లు, విద్యుత్ లెక్కలను అధికారులు తేల్చారు. ఈ పనుల ప్యాకేజీలపై స్పష్టత వచ్చిన వెంటనే టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవుని పల్లి మధ్య దూరం సుమారు 40 కి.మీ. ఉండటం, ఇందులో 35 కి.మీ. ఓపెన్ కెనాల్‌తో పాటు మరో 5 కి.మీ. మేర టన్నెల్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు ఇది వరకే నిర్ణయించారు. అయితే ఇది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నట్లు గుర్తించారు. కెనాల్, టన్నెల్ పరిధిలోని భూములన్నీ రంగారెడ్డి జిల్లాలో అత్యంత ఖరీదైనవి కావడంతో దీనికి ప్రత్యామ్నాయాలను వెతికిన నీటి పారుదల శాఖ.. అంతారం వద్ద మరో బ్యారేజీని నిర్మించాలన్న అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఉద్దండాపూర్ నుంచి 100 మీటర్ల లిఫ్టుతో అంతారానికి నీటిని తరలించడం అత్యంత సులభమని అధికారులు తేల్చారు. ఇక్కడ 20 టీఎంసీల నీటిని నిల్వ చేసే అనువైన ప్రదేశం ఉన్నట్లు గుర్తించి సర్వే పనులు సైతం పూర్తి చేశారు. అంతారం బ్యారేజీని చేపడితే కేపీ లక్ష్మీదేవుని పల్లి కింద ఉన్న మొత్తం ఆయకట్టు 3.5 లక్షల ఎకరాల్లోని 2 లక్షల ఎకరాలకు ఈ బ్యారేజీ ద్వారానే నీటిని అందించే వెసులుబాటు ఉంటుంది. పరిగి, తాండూర్లోని మొత్తం ఆయకట్టు, వికారాబాద్‌లోని కొంత ఆయకట్టుకు అంతారం ద్వారానే నీటిని అందించడం సులువని అంటున్నారు. ఈ మార్పుల వల్లనే రంగారెడ్డి జిల్లాలోని పనులపై ఇంకా అంచనాలు సిద్ధం చేయలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
అన్ని పోలీస్ స్టేషన్లలో వీసీ వ్యవస్థ
-
అన్ని పోలీస్ స్టేషన్లలో వీసీ వ్యవస్థ
పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో ఏర్పాటు పోలీసు విభాగం ఛీఫ్ అనురాగ్ శర్మ వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పోలీసుస్టేషన్లనూ వీడియో కాన్ఫరెన్సింగ్ (వీసీ) సౌకర్యం ద్వారా అనుసంధానించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో వీసీ వ్యవస్థను డీజీపీ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీసుకున్న ఈ చర్య ఎంతో ఉపయుక్తమైంది. హైదరాబాద్ మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాలు, డీఎస్పీలు పర్యవేక్షించే సబ్-డివిజన్, సర్కిల్ ఆఫీస్లతో పాటు పోలీసుస్టేషన్లనూ వీసీ ద్వారా అనుసంధానించాలని నిర్ణయించాం. సిటీలో ఏర్పాటైన పెలైట్ ప్రాజెక్టు ద్వారా ఇందులో ఉన్న లోపాలు, ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధ్యయనం చేసి అధిగమిస్తాం. ఆపై విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తాం. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) పర్యవేక్షణలో పని చేసే ఈ విధానం పూర్తి సాఫ్ట్వేర్ ఆధారంగా పని చేస్తుంది. ఎంతో ఉపయుక్తమైన ఈ సౌకర్యాన్ని నగర పోలీసులు సద్వినియోగం చేసుకుని, పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలి’ అని అన్నారు. ‘వీసీ’తో కొత్వాలే హోంగార్డుతో సంప్రదింపులు చేయొచ్చు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘కమిషనరేట్‌లోని శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లతో పాటు డీసీపీ, ఏసీపీ కార్యాలయాలు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు సహా మొత్తం 150 మంది వీసీని వినియోగించుకునే అవకాశం ఇచ్చాం. ప్రతి అధికారీ తమ సౌలభ్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని, వాటి ఆధారంగా సమాచార మార్పిడి చేసుకోవచ్చు. వీసీ విధానం ద్వారా నేరుగా కొత్వాలే క్షేత్రస్థాయిలో ఉండే హోంగార్డుతోనూ సంప్రదింపులు జరిగే అవకాశం ఏర్పడింది. కేవలం కమిషనరేట్ పరిధిలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఎన్ఐసీ ఆధీనంలో పని చేసే ప్రతి పోలీసుతోనూ అధికారులు వీసీ ద్వారా సంప్రదింపులు జరిపి, సమాచార మార్పిడి చేసుకునే అవకాశం ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు అంజనీకుమార్, వై.నాగిరెడ్డి, స్వాతి లక్రా, సంయుక్త పోలీసు కమిషనర్ మురళీకృష్ణ, ఎస్పీ రమేశ్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’లో పనుల విభజన!
♦ సివిల్, ఈ అండ్ ఎం పనులను వేరుచేసే యోచన ♦ ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెంచేందుకే... ♦ రూ. 4,596 కోట్లతో సివిల్, రూ.6,258 కోట్లతో ♦ ఈ అండ్ ఎం పనుల అంచనాలు సిద్ధం ♦ రూ. 500 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్లకో ప్యాకేజీగా నిర్ణయం? ♦ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు పనుల విభజన చేయాలని నీటిపారుదలశాఖ భావిస్తోంది. ఇప్పటివరకు ప్రాజెక్టుల్లో ఒకే పనిగా ఉన్న సివిల్, ఎలక్ట్రో మెకానికల్ (ఈ అండ్ ఎం) పనులను విభజించడం ద్వారా సాంకేతికంగా, నిర్వహణ, పనులపరంగా ఇబ్బందులను అధిగమించవచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే వేర్వేరుగా తయారైన అంచనాల మాదిరిగానే పనులను అదే రీతిన అప్పగించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రాజెక్టు పనులను వీలైనన్ని ఎక్కువ ప్యాకేజీలుగా విభజించి పనులు అప్పగించాలని యోచిస్తోంది. అంచనాలన్నీ సిద్ధం.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 62 మండలాల్లో ఉన్న 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం రూ. 35,200 కోట్లతో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టడం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణానికి 20,884.86 ఎకరాల మేర భూసేకరణ అవసరంకాగా ఇందులో 4,795 మంది రైతులు 12,101 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించారు. మరో 4,927.22 ఎకరాలకు అధికారులు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్టులో భాగంగా ఐదు రిజర్వాయర్లను నార్లాపూర్ 8.1 టీఎంసీలు, ఏదుల 6.5 టీఎంసీలు, వట్టెం 16.6 టీఎంసీలు , కరివెన 19.15 టీఎంసీలు, ఉద్దండాపూర్ 9.2 టీఎంసీల సామర్ధ్యాలతో నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం మొత్తంగా రూ. 9,644 కోట్లతో అంచనాలను సైతం సిద్ధం చేసింది. ఇందులో వట్టెం రిజర్వాయర్‌కు గరిష్టంగా రూ. 3,780 కోట్లు కానుండగా కరివెనకు రూ. 2,490 కోట్లు, ఉద్దండాపూర్‌కు రూ. 2,115 కోట్లు, నార్లాపూర్ రూ. 801 కోట్లు, ఏదులకు రూ. 458 కోట్లను అధికారులు అంచనా వ్యయంగా లెక్కించారు. రిజర్వాయర్ల అంచనాల సమయంలోనే పంప్‌హౌజ్‌ల నిర్మాణానికి అవసరమయ్యే మోటార్లు, విద్యుత్ లెక్కలనూ అధికారులు తేల్చారు. మొత్తంగా 34 మోటార్లు అవసరమవుతాయని గుర్తించి ఇందుకు 4,705 మెగావాట్లను విద్యుత్ అవసరాలుగా లెక్కించారు. పంపింగ్ స్టేషన్ల వద్ద చేయాల్సిన సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పనుల విలువ అంచ నాలను అధికారులు వేర్వేరుగా సిద్ధం చేశారు. రూ. 4,596 కోట్లతో సివిల్ పనులు, రూ. 6,258 కోట్లతో ఈఅండ్ఎం పనులను విభజించారు. విభజిస్తేనే మేలు.. మొత్తంగా 10,854 కోట్లతో గుర్తించిన సివిల్, ఈ అండ్ ఎం పనులను విభ జించాలని అధికారుల స్థాయిలో నిర్ణయం జరిగింది. గతంలో ఈ తరహా విధానం లేకపోవడంతో ఏఎంఆర్పీ, కల్వకుర్తి వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. సివిల్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లలో కొందరికి ఈ అండ్ ఎం పనుల్లో నైపుణ్యం లేకపోవడం, మరికొందరు ఒకే ప్రాజెక్టు పరిధిలో వేర్వేరు దేశాల మోటార్లను వినియోగించడంతో నిర్వహణ, మరమ్మతుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో ఆలస్యమైన పక్షంలో మోటార్ల బిగింపు సైతం జాప్యం కావడం వంటి సమస్యలూ ఉత్పన్నమయ్యాయి. దీనికితోడు సివిల్ కాంట్రాక్టర్లకు ఈ అండ్ ఎం పనులు అప్పగిస్తే నీటిపారుదలశాఖ నుంచి సాంకేతిక అనుమతులు పొందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే...సివిల్, ఈ అండ్ఎంకు నియమ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. దీనివల్ల ఈ రెండు పనులను ఏకకాలంలో చేయడం సాధ్యంకాదు. అదే జరిగితే పనులు ఆలస్యమై అంచనాలు అమాంతం పెరిగే అవకాశాలుంటాయి. ఇది ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని, ప్రాజెక్టు పూర్తి లక్ష్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పనుల విభజన చేయాలన్నది అధికారుల భావనగా ఉంది. దీనిపై ఇప్పటికే ఇంజనీర్లు అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వేర్వేరు దేశాలకు చెందిన మోటార్లను బిగించడంకన్నా స్వదేశీ (బీహెచ్ఈఎల్ తయారు చేసినవి) ఈఅండ్ఎం మోటార్లను వినియోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, దీనివల్ల విదేశీ పన్నుల భారం తగ్గుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీలైనన్ని ఎక్కువ ప్యాకేజీలు రూ. 35 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు పనులను వీలైనన్ని ఎక్కువ ప్యాకేజీలుగా విడగొట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కో పనిని కనిష్టంగా రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లుగా విభజించి పనులు అప్పగించాలని...అప్పుడే పనులు త్వరితగతిన పూర్తవుతాయని చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాల్సి ఉంది. నిర్ణయం జరిగిన వెంటనే జనవరిలో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. -
ఈ నెల పింఛన్ ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా ఒకటో తారీ ఖున పింఛన్లు అందుకునే లబ్ధిదారులు గత నెల పింఛన్ల కోసం 16వ తేదీ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ నెల కూడా వారికి ఎదురుచూపులు తప్పేలా లేవు. ఈ నెల ఒకటో తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలంటే.. గత నెల 20 లోపే బడ్జెట్ రిలీజ్ ఆర్డరు (బీఆర్వో)లను ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ, అక్టోబర్ 25న బీఆర్వోలు జారీ చేయడంతో నవంబరు 16 తరువాతే పింఛన్ల పంపి ణీ జరిగింది. అయితే డిసెంబర్ నెల పింఛన్లకు అధికారులు ఇప్పటికీ బీఆర్వోలు విడుదల చేయలేదు. దీంతో ఈ నెల పింఛన్లు ఇప్పట్లో వచ్చేలా లేవని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 లక్షల మంది పెన్షనర్లు పింఛన్ కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికలు ఉన్న జిల్లాలకు... గత నెల మొదటివారంలో వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో ఆసరా పింఛన్లను పంపిణీ చేసినట్లే.. ఈ నెలలో కూడా ఎన్నికలు ఉన్న మరి కొన్ని జిల్లాల్లో పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి నెలా పింఛన్లు పంపిణీ పూర్తయ్యాక, సమయానికి పింఛను తీసుకోని వారి సొమ్ము మిగులు తోంది. తాజాగా మిగిలిన సొమ్ము సుమారు రూ.160 కోట్లు సెర్ప్ వద్ద ఉన్నట్లు సమాచారం. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ, నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక ఉన్నందున మెదక్ జిల్లాలోనూ పింఛన్ల పంపిణీలో మరింత జాప్యం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న సొమ్ముతో ఆయా జిల్లాల్లో పింఛన్ల పంపిణీ చేసేందుకు సర్కారు ఆదేశాల కోసం సెర్ప్ అధికారులు ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్లు మంజూరు ఆసరా పింఛన్ల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న 21,970 మందికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా పింఛన్లు మంజూ రు చేసింది. అయితే.. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పింఛన్లను పంపిణీ చేసే అవకాశం లేదని సెర్ప్ అధికారులు అంటున్నారు. -
పదోన్నతుల జాబితాల్లో లోపాలు సరిచేయండి
♦ తెలంగాణ, ఏపీ పోలీసు ఉన్నతాధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం ♦ వీలైనంత త్వరగా కొత్త జాబితాలు రూపొందించండి ♦ అమల్లో ఉన్న ధిక్కార పిటిషన్‌ను మూసివేస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: పోలీసు అధికారుల పదోన్నతులకు సంబంధించి గత ఏడాది రూపొందించిన జాబితాల్లోని లోటుపాట్లను సరిచేయాల్సిందిగా తెలంగాణ, ఏపీ ఉన్నతాధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరలో కొత్త జాబితాలను రూపొందించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గతంలో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కెహర్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గందరగోళం మధ్య.. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ హైదరాబాద్ రేంజ్ పరిధిలోనిదా, కాదా అనే వ్యవహారంపై మొదలైన వ్యాజ్యం అనేక మలుపులు తిరిగి రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లతో పాటు ప్రమోటీ డీఎస్పీలు, డెరైక్ట్ డీఎస్పీల పదోన్నతుల అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. దాంతో సుదీర్ఘకాలంగా పోలీసు శాఖలో పదోన్నతులు ఇవ్వలేదని, హైదరాబాద్ రేంజ్‌కు సంబంధించి 2009లో ఇచ్చిన ఆదేశాలను ఉన్నతాధికారులు ధిక్కరించారని పేర్కొంటూ గతేడాది సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. దాంతో అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు హడావుడిగా పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలు రూపొందించారు. జీవో నం.54, 108లను విడుదల చేసి కొందరికి పదోన్నతులు ఇచ్చేశారు. ఈ జాబితాలను సుప్రీంకోర్టుకు అందజేశారు. కానీ ఈ పదోన్నతుల జాబితాల రూపకల్పనలో నిబంధనలను పట్టించుకోలేదని, అర్హులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అదనపు ఎస్పీగా ఉండాల్సిన వారు ఇంకా ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలుగానే ఉండిపోగా... తమ కంటే జూనియర్లు పదోన్నతి పొందారంటూ పలువురు అధికారులు ఉమ్మడి రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర విభజన తరువాత ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కానీ సుప్రీంకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఇంకా మూసివేయని కారణంగా... జాబితాలను సరిచేయలేమని ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఇదే సమయంలో జీవో నం.54, 108లను సవాల్ చేస్తూ పలువురు అధికారులు రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా... ట్రిబ్యునల్ సైతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఏ విధమైన తీర్పు వెలువరించలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ జీవోల్లోని లోపాలను సరిచేసేలా ఆదేశించడంతో పాటు ధిక్కార పిటిషన్‌ను మూసివేయాలని కోరుతూ... ఇరు రాష్ట్రాల అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం జరిపిన విచారణకు ఇరు రాష్ట్రాల డీజీపీ లు అనురాగ్‌శర్మ, జేవీ రాముడుతో పాటు తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, గత డీఐజీ శశిధర్‌రెడ్డితో పాటు ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, ఏపీ హోం శాఖ మాజీ కార్యదర్శి బి.ప్రసాదరావు, ఉమ్మడి రాష్ట్ర హోం శాఖ మాజీ కార్యదర్శి టీపీ దాస్ హాజరయ్యారు. వారి విజ్ఞప్తి మేరకు ధిక్కార పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. దీంతోపాటు పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ పదోన్నతుల జాబితాల్లో లోపాలను సరిచేసి, కొత్త జాబితాలు రూపొందించాలని ఆదేశించింది. ‘సిటీ’ అధికారులకు ప్రయోజనం? సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నవారికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. 1985లో ఎస్సైలుగా ఎంపికైన అధికారులు 220 మంది వరకు ఉండగా... అందులో దాదాపు సగం మంది హైదరాబాద్ సిటీ పోలీసు విభాగానికే వచ్చారు. పలు కారణాల నేపథ్యంలో గతంలో పోలీసు విభాగంలో వాస్తవ పదోన్నతులు లేవు. ఏటా ప్యానల్ ఇయర్లో ఏర్పడిన ఖాళీల ఆధారంగా తాత్కాలిక పదోన్నతులిస్తూ వచ్చారు. వీటిని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించినదే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.54. అయితే 2009లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సిటీ పోలీస్‌ను వేరే జోన్‌గా పరిగణించి పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా... జోన్-6లో కలిపి ప్రమోషన్లు ఇచ్చా రు. దీంతో నగర కమిషనరేట్‌కు చెందిన పలువురికి అన్యాయం జరిగింది. తాజాగా సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే (సైబరాబాద్ సహా) అన్ని ఖాళీలను సిటీ కమిషనరేట్లోకే చేర్చాల్సి వస్తుందని, ఇది డెరైక్ట్తో పాటు ప్రమోటీ డీఎస్పీలకు ఉపయుక్తమని చెబుతున్నారు. -
వనం వీడి.. జనంలోకి చిరుత!
♦ మెదక్ జిల్లా తుక్కాపూర్‌లో భయం..భయం ♦ ఏడున్నర గంటలపాటు బీభత్సం.. 9 మందిపై దాడి ♦ ఎట్టకేలకు వలకు చిక్కడంతో ఊపిరిపీల్చుకున్న జనం కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామాన్ని ఓ చిరుత పులి వణికించింది. దాదాపు ఏడున్నర గంటలపాటు బీభత్సం సృష్టిం చింది. తొమ్మిది మందిని గాయపరిచింది. ఫారెస్ట్, జూ అధికారులు వచ్చి ఎట్టకేలకు దాన్ని బంధించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉద యం గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. మంగళి బుజ్జమ్మపై మొదట దాడి చేసింది. బుజ్జమ్మ తన పిల్లలను బడికి పంపించి తిరిగి ఇంటికి వస్తుండగా.. దారిలో ఎదురుపడి ఆమెపై పంజా విసరడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు మంగళి శంకరయ్య, ఆయన కుమారులు మల్లేశం, యాదయ్యలు కర్రలు తీసుకుని చిరుతను అదిలించేందుకు వెళ్లారు. బుజ్జమ్మను వదిలి తండ్రీకొడుకులపై దాడికి దిగింది. ఈ దాడిలో ఈ ముగ్గురూ గాయపడ్డారు. అయినప్పటికీ వారు ఎదురుదాడికి దిగడంతో ఆయిలి పోచమ్మ ఇంట్లోకి దూరింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందులోనే గంటపాటు నక్కింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులంతా చిరుత నక్కిన ఇంటి పరిసరాలకు చేరుకున్నారు. జనం అరుపులకు బెదిరిన చిరుత ఇంట్లో నుంచి బయటకు వచ్చి జనంపై పడింది. ఘటనా స్థలికి చేరుకున్న అధికారగణం... మెదక్ ఆర్డీఓ నగేశ్, డీఎఫ్ఓ శివాని డోగ్రే, అటవీ, జూ, పోలీస్, అగ్నిమాపక శాఖలకు చెం దిన అధికారులు, సిబ్బందితో కలసి తుక్కాపూర్ చేరుకున్నారు. చిరుత ఉన్న పశువుల పాక ప్రాంతంలోని దారులను వలలతో మూసి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చిరుతను పశువుల పాక నుంచి కదిలించేందుకు బాణసంచా కాల్చారు. ఈ శబ్దాలకు బయటకు వచ్చినట్లే వచ్చి మళ్లీ పాకలోకి వెళ్లింది. ఇలా మూడోసారి బయటకు వచ్చి చివరకు అధికారులు ఏర్పాటు చేసిన వలకు చిక్కింది. హైదరాబాద్ జూపార్కు నుంచి వచ్చిన అధికారులు చిరుతపై తుపాకీతో మత్తు ఇంజక్షన్లతో దాడిచేయగా అది మత్తులోకి జారుకుంది. మధ్యాహ్నం చిరుతను హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించడం తో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స చిరుత దాడిలో గాయపడిన వారందరినీ చికిత్స కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నలుగురిని హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన సాయమ్మను తదుపరి చికిత్సల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచిం చారు. సాయమ్మ ఎడమ చెవిపైన దాదాపు ఎనిమిది అంగుళాల మేర చర్మం తెగిపోయి తీవ్రంగా గాయపడింది. ఉరుకులు, పరుగులు.. ఒక్కసారిగా చిరుత రావడంతో జనమంతా బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతి లో పెట్టుకొని ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే చిరుత గ్రామానికి చెందిన ఆయిలు రాములుపై దాడి చేసింది. చిరుతను చూసేందుకు వచ్చిన రంగంపేట వాసి చాకలి పోచయ్యపై దాడి చేసి మెడ భాగంలో తీవ్రంగా గాయపరిచింది. ఆ తరువాత తుక్కాపూర్‌కు చెందిన దొడ్లె శ్రీశైలం, కొండ పాపయ్యలపై దాడి చేసింది. చివరకు ఆయిలి కేశయ్య పశువుల పాకలోకి దూరింది. అక్కడ కట్టేసి ఉంచిన ఓ పశువును గాయపరిచింది. 4 గంటలపాటు పశువుల పాకలోనే ఉండిపోయింది. -
గ్రీన్‌హౌస్‌కు ప్రత్యామ్నాయంగా ‘షేడ్‌నెట్’
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్‌తోపాటు షేడ్‌నెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ఉద్యాన శాఖ నిర్ణయించింది. భారీ పెట్టుబడితో కూడిన గ్రీన్‌హౌస్‌ను ధనిక రైతులే ఉపయోగించుకుంటున్నందున.. అందుకు ప్రత్యామ్నాయంగా చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉండేలా షేడ్‌నెట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉద్యాన శాఖ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి షేడ్‌నెట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రైతుకు భారంగా గ్రీన్హౌస్ గ్రీన్‌హౌస్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అందుకోసం ఈ ఏడాది 847 ఎకరాలకు రూ.250 కోట్లు కేటాయించింది. గ్రీన్హౌస్ కోసం ముందుకు వచ్చే రైతులకు దాని నిర్మాణ వ్యయంలో 75 శాతం సబ్సిడీని ఇస్తోంది. ఆ ప్రకారం ఎకరా విస్తీర్ణంలో గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టాలంటే రూ. 39.50 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో 75 శాతం సబ్సిడీ ఇస్తున్నా ఎకరాకు సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేయడం రైతుకు భారంగా మారుతోంది. దీంతో గ్రీన్‌హౌస్‌కు అనుకున్నంత స్థాయిలో రైతుల నుంచి స్పందన రావడంలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు 30 ఎకరాల్లోపే గ్రీన్హౌస్ నిర్మాణం జరిగింది. ఎస్సీ, ఎస్టీలు ఎవరూ గ్రీన్‌హౌస్‌కు దరఖాస్తు చేయలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మార్గదర్శకాల్లో మార్పులు చేశారు. రైతులకే నేరుగా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. అయినా గ్రీన్‌హౌస్‌కు భారీగా పెట్టుబడి పెట్టాల్సి రావడంతో సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీలు దానివైపే చూడడంలేదు. ఈ పరిస్థితిని గమనించిన ఉద్యాన శాఖ షేడ్‌నెట్ నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది. చిన్నసన్నకారు రైతుల కోసమే షేడ్‌నెట్.. గ్రీన్హౌస్ నిర్మాణానికి ఎకరాకు రూ. 39.50 లక్షలైతే, షేడ్‌నెట్‌కు రూ. 12 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతోంది. గ్రీన్హౌస్లో వేసే పంటలకు అవసరమైన ఉష్ణోగ్రతలను పూర్తిస్థాయిలో నియంత్రించుకునే వీలుంటుంది. వర్షం పడినా గ్రీన్ హౌస్‌లో పంటలపై పడదు. షేడ్‌నెట్ కేవలం ఒక పందిరిలాంటిది అనుకోవచ్చు. నాలుగు పక్కలా ఆగ్రో నెట్(ఆకుపచ్చ రంగులో కనిపించే వలలు) లేదా ఇతర విధంగా నేయబడిన వలతో కప్పివేయబడి ఉంటుంది. మొక్కలకు అవసరమైన సూర్యరశ్మి, గాలి, తేమ ఆ వలలోని సందుల గుండా ప్రసరించేలా అనువైన వాతావరణం ఉంటుంది. షేడ్‌నెట్‌లో ఎండ, గాలి, వడగండ్ల నుంచి మాత్రమే రక్షించుకోవచ్చు. వర్షం వస్తే మాత్రం పంటలపై బోరున పడుతుంది. అందువల్ల రబీలోనే షేడ్‌నెట్ వల్ల ప్రయోజనం ఉంటుందని, వర్షాకాలంలో దీనివల్ల అంతగా ప్రయోజనం ఉండదని ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. గ్రీన్హౌస్ ద్వారా పూల సాగు చేస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుందని, షేడ్‌నెట్ ద్వారా రబీలో కూరగాయల సాగు చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షేడ్‌నెట్‌ను వచ్చే ఏడాది నుంచి భారీగా ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ భావిస్తోంది. ఎకరాకు రూ. 12 లక్షలు ఖర్చు అవుతున్నందున గ్రీన్‌హౌస్‌కు ఇచ్చినట్లే దీనికి కూడా 75 శాతం సబ్సిడీ ఇవ్వాలని.. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో 5 వేల ఎకరాల్లో షేడ్‌నెట్ సాగు చేపట్టాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్హౌస్ నిర్మాణానికి ముందుకొచ్చిన కంపెనీలతోనే షేడ్‌నెట్ నిర్మాణాలు చేపట్టేలా చూడాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో మార్గదర్శకాలు తయారుచేసి షేడ్‌నెట్‌పై విరివిగా ప్రచారం చేయాలని యోచిస్తున్నారు. -
ఒకే పరీక్షా? రెండు పరీక్షలా?
♦ డీఎస్సీ, టెట్ వేర్వేరుగా నిర్వహిస్తారా? ♦ రెండూ కలిపి ‘టెర్ట్’ నిర్వహిస్తారా! ♦ అయోమయంలో అభ్యర్థులు, అధికారులు ♦ త్వరలోనే నిర్ణయం: కడియం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ, టెట్ కలిపి ఒకే పరీక్షగా నిర్వహిస్తారా? లేక వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారా? దీనిపై స్పష్టత కోసం అభ్యర్థులతోపాటు అధికారులూ ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగుల్లో ఆత్రుత మరింత ఎక్కువైంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారన్న అంశంతోపాటు ఒకే పరీక్ష ఉంటుందా? వేర్వేరు పరీక్షలు ఉంటాయా? అన్న స్పష్టతను కోరుకుంటున్నారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రభుత్వం ఏం చెబుతుందోనన్న సమాచారం కోసం వేచి ఉన్నారు. జనవరి 24న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినా, దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది. ఇదీ టెట్ నేపథ్యం.. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు టెట్ నిర్వహించారు. అయితే ఉపాధ్యాయ విద్యా కోర్సులో చేరేందుకు ఎంపి క పరీక్ష, కోర్సు వార్షిక పరీక్షలు, ఆ తరువాత ఉపాధ్యాయ నియామక పరీక్ష.. ఇలా ఇన్ని పరీక్షల్లో అర్హతతోపాటు ప్రతిభ కనబరిస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తున్నపుడు మళ్లీ ప్రత్యేకంగా టెట్ అవసరమా? అన్న వాదనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై 2013లో ప్రభుత్వం కమిటీ వేయగా, టెట్, డీఎస్సీలను వేర్వేరుగా కాకుండా ఉమ్మడిగా ‘టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్టు (టెర్ట్)’ పేరుతో ఒకే పరీక్షగా నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే అది అప్పట్లో అమలుకు నోచుకోలేదు. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం మాత్రం రెండింటినీ కలిపి టెర్ట్ను నిర్వహించింది. అయితే, రెండు వేర్వేరు పరీక్షలు కాకుండా టెర్ట్ పేరుతో ఒకే రోజు పేపరు-1, పేపరు-2 (ఒకటి టెట్, మరొకటి టీఆర్టీ) పరీక్షలను నిర్వహిస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సర్కారు ఆలోచనలు చేసింది. అలాగే, ఎన్సీటీఈ ఆదేశాల ప్రకారం టెట్‌ను వేరుగానే నిర్వహించాలని, రెండింటినీ కలిపి నిర్వహించడానికి వీల్లేదని భావించింది. అందుకే ఈనెల 14న టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే టెట్ ఉత్తర్వుల్లో సవరణలు అవసరం ఉండటంతో ప్రభుత్వానికి రాసింది. దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది. ఈ లోగా సీఎం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. త్వరలోనే నిర్ణయం: కడియం టెట్, డీఎస్సీ పరీక్ష విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ముందుగా ఉపాధ్యాయ ఖాళీలను తేల్చాల్సి ఉందన్నారు. ఆ తరువాత సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామన్నారు. టెట్, డీఎస్సీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలా? లేదా టెర్ట్‌గా ఒకటే నిర్వహించాలా? అన్న అంశంపై తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
పారిస్ మృతులకు ఫ్రాన్స్ నివాళి
పారిస్: రెండువారాల క్రితం ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో అసువులు బాసిన 130 మంది ప్రజలకు ఫ్రాన్స్ శుక్రవారం ఘనంగా నివాళి అర్పించింది. పారిస్‌లోని లె ఇన్వాలిడెస్ నేషనల్ మాన్యుమెంట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెండువేల మంది హాజరయ్యారు. ఇందులో మృతుల బంధువులతోపాటు దాడుల్లో గాయపడి కోలుకున్నవారు, మంత్రులు, అధికారులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా చనిపోయిన వారందరి పేర్లను, వారి వయస్సు వివరాలను వరుసగా చదివి వినిపించారు. వారికి సైనిక వందనం సమర్పించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌వ్యాప్తంగా భవనాలు, ఇళ్లు, దుకాణాల్లో కిటికీలు, తలుపులను ఫ్రాన్స్ జాతీయ జెండాలోని రంగులతో అలంకరించి మృతులకు నివాళులర్పించారు. -
‘యాదాద్రి’ ప్లాంటు తరలింపు!
దామరచర్ల నుంచి తరలించాలన్న కేంద్రం ♦ ప్రతిపాదిత స్థలం గుండా మూసీ వెళ్తుండటమే కారణం ♦ నదీ జలాలు కలుషితం అవుతాయని ఆందోళన ♦ పరిశీలనకు నిపుణులతో కమిటీని పంపాలని నిర్ణయం ♦ ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి ♦ రామగుండం ఎన్టీపీసీ విస్తరణపై సైతం కొర్రీలు.. ‘సాక్షి’కి ప్రత్యేకం సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్ పూర్లలో నిర్మించ తలపెట్టిన యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం చిక్కుల్లో పడింది. 4,000 (5ఁ800) మెగావాట్ల భారీ సామర్థ్యంతో తెలంగాణ జెన్కో తలపెట్టిన ఈ ప్రాజెక్టును దామరచర్ల నుంచి మరో ప్రాంతానికి తరలించే అంశాన్ని పరిశీలిం చాల్సిందిగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిం చింది. ప్రతిపాదిత స్థలం మీదుగా కృష్ణా ఉప నది (మూసీ) వెళ్తున్నందున అక్కడ థర్మల్ ప్రాజెక్టు నిర్మిస్తే ఈ జల వనరు ప్రభావితం కావచ్చని ఆందోళన వెలిబుచ్చింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నేతృత్వం లోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) గత నెల 29న ఢిల్లీలో సమావేశమై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అనుమతులు జారీ చేసే అంశంపై ఆయా రాష్ట్రాల అధికారులతో చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన ‘మినిట్స్’ కాపీని ‘సాక్షి’ సంపా దించింది. వివిధ కారణాలతో దామరచర్లలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంతో పాటు కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ విస్తరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన 1,600 (2ఁ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులను వాయిదా వేస్తూ ఈ సమావేశంలో ఈఏసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు త్వరలో ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దామరచర్లకు పంపిస్తామని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర అధికారుల బృందానికి తెలియజేసింది. తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, డెరైక్టర్ సి.రాధాకృష్ణ ఈ సమావేశానికి హాజరై ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ ముందు ఉంచారు. ప్రతిపాదిత స్థలానికి సమీపంలో కృష్ణా ఉప నది వెళ్తుంది గనుక ప్రాజెక్టు అవసరాలకు సరిపడా నీళ్ల లభ్యత సైతం ఉందని రాష్ట్ర అధికారులు వివరించి నట్లు సమాచారం. ఇదే అంశాన్ని పట్టుకున్న కేంద్ర నిపుణుల కమిటీ.. ఉప నది సమీపంలో థర్మల్ కేంద్రాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించి నట్లు తెలిసింది. ప్రాజెక్టును మరోచోటికి తరలించే అంశంపై ఈ సమావేశంలో జెన్కో అధికారులతో విస్తృతంగా చర్చించామని ఈ మినిట్స్ నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి పరిశీలన జరపాలని జెన్కో అధికారులు విజ్ఞప్తి చేయగా, సబ్ కమిటీని పంపాలని ఈ నిపుణుల కమిటీ నిర్ణయించింది. దామరచర్లలో థర్మల్ ప్రాజెక్టు నిర్మాణా నికి 4,334 హెక్టార్ల అటవీ భూములను పరస్పర భూముల బదలాయింపు విధా నంలో వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం నుంచి అను మతులు సైతం పొందింది. దామరచర్లలో థర్మల్ ప్రాజెక్టు నిర్మిస్తే స్థానికులకు ఉద్యో గాలు వస్తాయని నల్లగొండ జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం నిపుణుల సబ్ కమిటీ తీసుకునే నిర్ణయమే దామరచర్ల విద్యుత్ కేంద్రం భవితవ్యాన్ని తేల్చనుంది. ఈ అంశంపై జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన ఫోన్ కాల్‌పై స్పందించలేదు. ఎన్టీపీసీ విస్తరణకు అడ్డంకే విభజన చట్టం హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలి విడతగా రామగుండంలో 1,600 మెగావాట్లతో ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణకు సైతం నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) అనుమతులను వాయిదా వేసింది. ఈ ప్రాజెక్టును 44 నెలల్లో పూర్తి చేసేందుకు ఇటీవలే ఎన్టీపీసీ నిర్ణయం తీసుకోగా, తాజా పరిణామాలతో మరింత ఆలస్యం జరగ నుంది. ఎన్టీపీసీ ప్రతిపాదనలపై కమిటీ ఏకంగా 14 కొర్రీలు వేసింది. ఎన్టీపీసీ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై పడుతున్న ప్రభావంపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రాజెక్టుకు బొగ్గు కేటాయింపులకు సంబం ధించి సమగ్ర వివరాలు సమర్పించాలని ఆ కమిటీ సూచించింది. -
మార్చి నుంచి భూముల రీసర్వే
♦ రాష్ట్రవ్యాప్తంగా మారనున్న సర్వే నంబర్లు ♦ రికార్డుల అప్డేషన్ ప్రక్రియను ప్రారంభించిన రెవెన్యూ శాఖ ♦ ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 275 కోట్లు సాక్షి, హైదరాబాద్: బూజు పట్టిన రికార్డులను దుమ్ముదులిపే ప్రక్రియకు రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ రికార్డులన్నింటినీ అప్డేషన్ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం 1952 నాటి సర్వే నంబర్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, తాజాగా చేపట్టనున్న భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా కొత్త సర్వే నంబర్లు రానున్నాయని రెవెన్యూ ఉన్నతాధికారులు తెలిపారు. రెవెన్యూ రికార్డుల అప్డేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే చేపట్టిన ఈ-పహాణీతో భూముల యజమానులు, సాగుచేస్తున్న రైతులు, పంటల వివరాల నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయి నుంచే రెవెన్యూ యం త్రాంగం ఆన్లైన్లో అప్డేట్ చే స్తోంది. దీనిలో భాగంగానే భూమి ప్రస్తుత యజమానుల పేర్లను రికార్డుల్లో చేర్చే (మ్యుటేషన్) ప్రక్రియను మరింత సులువు చేయాలని భూపరిపాలన విభాగం నిర్ణయించింది. భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌ను సీసీఎల్ఏ వెబ్సైట్(వెబ్‌ల్యాండ్)తో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఆన్లైన్ ప్రక్రియతో ఎప్పటికప్పుడు (అప్డేట్గా) మ్యుటేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ కింద రూ.275 కోట్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ భూమి రికార్డులను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ భూమి రికార్డు ఆధునీకరణ కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) చేపట్టింది. దీని కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 275 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అందినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంతో పాటు భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబర్‌లోగా కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపి ఆయా రాష్ట్రాల్లో భూముల రీసర్వే మోడల్స్‌ను అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. సర్వేయర్ పోస్టులకు త్వరలో... ఈ నేపథ్యంలో సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. గత ఎనిమిదేళ్లుగా సర్వేయర్ పోస్టులకు రిక్రూట్మెంట్ జరగక పోవడంతో ఈ విభాగంలో ఖాళీగా ఉన్న సుమారు 400 సర్వేయర్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించింది. సర్వేయర్ పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాలను శుక్రవారం జరగనున్న రెవెన్యూ ఉన్నతాధికారుల సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఈ మేరకు డిసెంబర్లో సర్వేయర్ పోస్టుల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
దుబాయ్ పోలీసుల అదుపులో అద్నాన్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఐఎస్ఐఎస్)కు ఆన్లైన్ రిక్రూటర్‌గా వ్యవహరిస్తున్న అద్నాన్ హసన్ దమూదీని దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 2 నెలల క్రితమే ఇది జరిగినా ఆలస్యంగా గుర్తించిన భారత నిఘా వర్గాలు అక్కడి అధికారులతో సంప్రదింపులు ప్రారంభించాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలకు చెందిన యువతకు ఆన్లైన్ ద్వారా గాలం వేసి, ఐసిస్‌లో చేరేలా ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్న అద్నాన్‌ను భారత్‌కు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గత ఏడాది సిరియా వెళ్లే ప్రయత్నాల్లో పశ్చిమ బెంగాల్లో పట్టుబడిన నలుగురు హైదరాబాద్ యువకుల్నీ ఆకర్షించింది అద్నాన్ అని నిఘా వర్గాలు తేల్చాయి. ఇతడి స్వస్థలం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్. సిటీలో 2007, 2013ల్లో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థలో కీలక వ్యక్తులైన ‘భత్కల్ బ్రదర్స్’ రియాజ్, ఇక్బాల్, యాసీన్ల స్వస్థలమూ ఇదే కావడం విదితమే. 2012లో దుబాయ్ వెళ్లిన అద్నాన్.. ఐఎంలో కీలకపాత్ర పోషించిన సుల్తాన్ ఆర్మర్ ద్వారా ఐసిస్ వైపు మళ్లినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతం కేంద్రంగా ఆర్మర్ ఐసిస్లోనూ కీలకపాత్ర పోషించాడు. ఐసిస్ సంస్థకు ఆన్లైన్ రిక్రూటర్‌గా మారిపోయిన అద్నాన్ దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన పలువురికి గాలం వేశాడు. గత ఏడాది సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న నలుగురు నగర యువకుల్ని పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో అడ్డుకుని వెనక్కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీరి విచారణ తరువాత.. సంప్రదింపులు జరిగిన సోషల్ మీడియా, సెల్‌ఫోన్ నంబర్లను విశ్లేసించిన నిఘా వర్గాలు అద్నాన్‌ను గుర్తించాయి. అప్పటి నుంచి అద్నాన్ ఆన్లైన్ కార్యకలాపాలపై భారత నిఘా వర్గాలు సాంకేతికంగా నిఘా ఉంచాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గుర్తించాయి. దీంతో కేంద్రం అధీనంలోని హోం మంత్రిత్వ శాఖ ద్వారా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న అధికారులు వీలైనంత త్వరలో అద్నాన్‌ను భారత్ తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తరవాత అద్నాన్‌ను విచారించడంతో పాటు చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. -
తిరిగి కడలి కడుపులోకి చిరుమీనాలు
ఒడిశా ముఠాలపై చర్యలకు పూనుకున్న అధికారులు అనుచితంగా వ్యవహరించిన కొందరు మత్స్యకార నేతలు కొత్తపల్లి : జిల్లాలోని తీరప్రాంతంలో తిష్టవేసి, సముద్రంలో చేపపిల్లలను వేటాడి, సీడ్‌గా అమ్ముకుంటున్న ఒడిశా ముఠాలపై మత్స్యశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆ ముఠాల కార్యకలాపాలపైనా, వారికి స్థానిక మత్స్యకార నాయకుల్లో కొందరు సహకరిస్తున్న వైనం పైనా సోమవారం ‘సాక్షి’లో ‘చిరు మీనాలపై పొరుగు వల’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు కొత్తపల్లి మండలం మూలపేట చిప్పలేరు వద్ద జరుగుతున్న చేపపిల్లల విక్రయూల్ని అడ్డుకున్నారు. వాటిని నిల్వ చేసిన ప్రాంతాల్లో దాడి చేసి, చేపపిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. ఒడిశా ముఠాలకు అండగా నిలుస్తున్న మత్స్యకార నాయకులు అధికారులను అడ్డగించడంతో పాటు వార్తాసేకరణకు వెళ్లిన విలేకరులను దుర్భాషలాడుతూ, కెమెరాలు లాక్కుంటూ దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల రంగప్రవేశంతో వారు వెనక్కు తగ్గారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డీడీ కల్యాణ్ మాట్లాడుతూ జీవనోపాధికి మూలమైన చేపపిల్లలను =మత్స్యకారులే అమ్ముకోవడం బాధాకరమన్నారు. చేప పిల్లలను పట్టుకోవడం చట్టరీత్యా నేరమని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు. ఆయన వెంట ఏడీ కనకరాజు, స్థానిక మత్స్యశాఖాధికారి పవన్‌కుమార్ ఉన్నారు. అవగాహన సదస్సుల నిర్వహణ: ఎమ్మెల్యే వర్మ సొమ్ములకు ఆశపడి చేపపిల్లలను అమ్మడం నేరమని స్థానిక ఎమ్మెల్యే వర్మ అన్నారు. చేపపిల్లల అక్రమ తరలింపుపై సోమవారం పత్రికల్లో ప్రచురించిన కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే వర్మ సోమవారం ఉదయం కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ కొందరు మత్స్యకారులకు అవగాహన లేక, కొందరు నాయకులు డబ్బులకు ఆశపడి చేపపిల్లల వేట, తరలింపులకు సహకరిస్తున్నా అది నేరమన్నారు. దీనిపై అవగాహన సదస్సులను ఏర్పాటు చే స్తామని చెప్పారు. -
ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానం స్వాధీనం!
♦ రెండు నోటీసులు జారీ చేసిన దేవాదాయ శాఖ ♦ అప్పగించేందుకు అంగీకరించని ఆలయ పాలకమండలి ♦ విశాఖ పీఠానికి అప్పగించినందున స్వాధీనం సరికాదంటూ వాదన ♦ సూమోటో ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లోని ప్రసిద్ధ దైవ సన్నిధానాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించింది. చలనచిత్ర, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఆలయ పాలక మండలి సభ్యులుగా ఉండటం.. స్వాధీన ప్రక్రియకు వారు తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నా దేవాదాయ శాఖ వెనకడుగు వేయకపోవటం... వెరసి ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయాన్ని దేవాదాయ శాఖ చట్టం మేరకు దానికి స్వాధీనం చేస్తూ రిజిస్ట్రేషన్ చేయాలన్న ఆ శాఖ నోటీసుకు ఆలయ పాలక మండలి స్పందించకపోవటంతో... చట్టంలో ఉన్న వెసులుబాటు ఆధారంగా సూమోటోగా అధికారులే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. పాలకమండలి సభ్యుల మధ్య పొడచూపిన విభేదాలే ఇప్పుడు ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకునే వరకు రావటం విశేషం. ఇదీ నేపథ్యం... జూబ్లీహిల్స్‌లో దాదాపు మూడున్నర వేల చదరపు గజాల విస్తీర్ణంలో దైవ సన్నిధానం పేరిట ఆలయాల సమూహం నిర్మితమైంది. అనతి కాలంలోనే ఆలయానికి ప్రాచుర్యం వచ్చింది. ముఖ్యంగా ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల రాకతో హడావుడిగా ఉంటుంది. ఆలయ పాలకమండలిలో దాదాపు అంతా ప్రముఖులే ఉన్నారు. ఈ తరుణంలో 2012లో పాలకమండలి సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో కొందరు పాలకమండలి సభ్యులు ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, పెద్దమొత్తంలో వస్తున్న ఆదాయాన్ని పక్కదారిపట్టిస్తున్నారని ఇద్దరు పాలకమండలి సభ్యులు దేవాదాయశాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా అప్పట్లోనే ప్రభుత్వం ఆదేశించటంతో ఆ శాఖ ఇన్స్పెక్టర్లు విచారణ ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం అధికారులు కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. కీలకమైన ఆదాయ ఖాతా వివరాలు ఇవ్వటంలో ఆలయ నిర్వాహకులు సహకరించటం లేదని, ఆలయాన్ని విశాఖపట్టణంలోని శారదాపీఠానికి బదలాయించినందున వివరాలు అందుబాటులో లేవని చెబుతున్నారని, అక్కడి పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తే దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ అందులో అధికారులు పేర్కొన్నారు. ఆలయానికి అవసరమైన 3,200 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వమే ఇచ్చినందున దాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు డి1-2416/2012 నెంబరుతో తాజాగా ఆల య పాలకమండలికి స్వాధీన నోటీసు జారీ చేశారు. ఆలయాన్ని విశాఖ శారదా పీఠానికి కేటాయించినందున దాని స్వాధీనం సరికాదంటూ పాలకమండలి సభ్యులు దేవాదాయశాఖ దృష్టికి తెచ్చారు. ఆలయ బదలాయింపునకు దేవాదయ శాఖ అనుమతి తీసుకోనందున అది చెల్లదని, వెంటనే దేవాదాయశాఖ పరిధిలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఆ శాఖ మరో నోటీసు జారీ చేసింది. అయినా స్పందన లేకపోవటంతో దేవాదాయ శాఖ చట్టంలోని సూమోటో సెక్షన్ ఆధారంగా అధికారులే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. -
గుడుంబా రహిత రాష్ట్రమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: గుడుంబాను రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేసిన దాడులు సత్ఫలితాలు ఇవ్వడంతో గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ‘గుడుంబా ఫ్రీ’ పేరిట చేపట్టే ఈ ప్రచార కార్యక్రమాలను ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు జరిగే ఈ ప్రచార ఉద్యమం ద్వారా గుడుంబా రహిత గ్రామాలు, మండలాలను ప్రకటిస్తారు. ఒక జిల్లాలో పూర్తిస్థాయిలో గుడుంబా లేదని రూఢీ చేస్తూ కలెక్టర్, ఎస్పీ డిక్లరేషన్ ఇస్తే దాన్ని గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించి ఉత్సవాలు జరుపుతారు. తొలుత గుడుంబాను 95 శాతం మేర నిషేధించిన గ్రామాలు, మండలాలను స్థానిక తహసీల్దార్, ఎస్ఐల ఆమోదంతో ప్రకటించి, సభలను నిర్వహిస్తారు, తరువాత జిల్లా స్థాయిలో సంబరాలు జరుపుతారు. గుడుంబాకు వ్యతిరేకంగా ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు చేపట్టే కార్యక్రమాల వివరాలను ఎక్సైజ్ డెరైక్టర్ అకున్ సబర్వాల్‌కు అధికారులు ఇప్పటికే పంపించారు. -
ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి..
సాక్షి, హైదరాబాద్: ‘ఐఏఎస్‌లు చేసి.. ఐపీఎస్‌లు చేసి.. ముఖ్యమంత్రులై.. అవినీతి కూపాల్లో చొచ్చుకుపోయి, కుంభకోణాల్లో ఇరుక్కుపోయి, చంచల్‌గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో పడ్డారే... వాళ్ళంతా జాతికి ముద్దుబిడ్డలు కాదు... దుష్టశక్తులు...’.. అవినీతిపై ఇంత చక్కగా లెక్చర్ దంచినవ్యక్తి ఎవరో తెలుసా? ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శనివారం అరెస్టు చేసిన కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు!! ఆయనకు రూ.13 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఏసీబీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దాడులు జరగడానికి కొన్ని రోజుల ముందు కూకట్పల్లి పరిధిలోని ఓ కాలేజీలో ఫ్రెషర్స్‌డే జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సంజీవరావు విద్యార్థుల్ని ఉద్దేశించి.. సుదీర్ఘ ప్రసంగం చేశారు. భరతమాతకు ముద్దుబిడ్డలుగా ఉండాలని.. ఉత్తచెత్త పౌరులుగా కాక.. ఉత్తమ పౌరులుగా నిలవాలని సంజీవరావు తన ప్రసంగంలో ఉద్బోధించారు. ఈసందర్భంగా కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు అంటూ శ్రీశ్రీ కవితనూ ఉదహరించారు. ఏసీబీ దాడులు, ఆయన అరెస్టు నేపథ్యంలో సోమవారం ఈ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. -
ఇక ‘సీడబ్ల్యూసీ’ భూ పంచాయితీ!
♦ కేంద్ర జల సంఘానికి కేటాయించిన 10 ఎకరాల భూమి కోసం ఇరు రాష్ట్రాల పట్టు ♦ తమకే ఇవ్వాలంటూ ఏపీ పరిధిలోని పోలవరం అథారిటీ, రాష్ట్ర పరిధిలోని గోదావరి బోర్డుల విజ్ఞప్తి ♦ పోలవరం అథారిటీకి ఇవ్వబోమంటున్న తెలంగాణ ♦ గోదావరి బోర్డుకు మూడెకరాలు ఇచ్చే దిశగా యోచన ♦ కేంద్ర జల సంఘం వద్దకు చేరిన వ్యవహారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి పారుదల శాఖల మధ్య ఓ భూ పంచాయితీ మొదలైంది. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం కేంద్ర జల సంఘాని (సీడ బ్ల్యూసీ)కి కేటాయించిన పది ఎకరాల భూమిని తమకు ఇవ్వాలంటే.. తమకు ఇవ్వాలంటూ ఏపీకి చెందిన పోలవరం అథారిటీ, తెలంగాణ నిర్వహణ కింద ఉన్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు అధికారులు పట్టుబడుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూమిని పోలవరం అథారిటీకి కేటాయించరాదని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తుండగా... ఆ భూమి అయితే తమ కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని ఏపీ పేర్కొంటుడడంతో వివాదం ముదురు తోంది. ప్రస్తుతం ఈ వివాదాన్ని పరిష్క రించాలిన బాధ్యత కేంద్ర జల సంఘంపై పడింది. సీడబ్ల్యూసీకి తలనొప్పి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన కేంద్రం... ప్రాజెక్టు నిర్వహణ నిమిత్తం పోలవరం అథారిటీని ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సహా ఇతర అధికారుల నియామకం, నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. ఈ అథారిటీ కేంద్ర జల సంఘం సూచనల మేరకు బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే ఈ అథారిటీ నిర్వహణను చూడాల్సిన ఏపీ ప్రభుత్వం... దానికి ప్రత్యేక కార్యాలయమేదీ కేటాయించలేదు. దీంతో అథారిటీ కార్యకలాపాలన్నీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ వద్ద ఉన్న సీడబ్ల్యూసీ కార్యాలయం నుంచే సాగుతున్నాయి. అది తమకు అనువుగా లేదంటూ అథారిటీ అధికారులు ఇటీవల ఏపీ ప్రభుత్వానికి, సీడబ్ల్యూసీకి లేఖలు రాశారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి 1982-83 మధ్య బీహెచ్ఈఎల్ సమీపంలోని నలగండ్ల వద్ద కేటాయించిన 10 ఎకరాల భూమిని తమకు ఇవ్వాల్సిందిగా సీడబ్ల్యూసీకి విన్నవించాలని పోలవరం అథారిటీకి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు అథారిటీ అధికారులు సీడబ్ల్యూసీకి విన్నవించుకున్నారు. అయితే దీనిని పరిశీలించాలంటూ సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రభుత్వానికి పంపగా... తమ రాష్ట్ర పరిధిలోని భూమిని ఏపీ పరిధిలోని అథారిటీకి రిజిస్ట్రేషన్ చేయలేమని స్పష్టం చేసినట్లుగా సమాచారం. మరోవైపు ఈ భూమి వివరాలు తెలుసుకున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆ పదెకరాల భూమిని తమకు కేటాయించాలంటూ సీడబ్ల్యూసీ, తెలంగాణ ప్రభుత్వాలకు విన్నవించింది. దానిని సర్కారు పరిశీలిస్తోంది. అందులో కనీసం మూడు ఎకరాలైనా కేటాయించాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా కేంద్రానికి తన వివరణను పంపినట్లు సమాచారం. ఇలా ఒకే భూమి కోసం ఇరు సంస్థలు పట్టుబడుతుం డడం, ఇరు రాష్ట్రాలు భిన్న రీతిలో స్పంది స్తుండటం సీడబ్ల్యూసీకి తలనొప్పిగా మారిం ది. ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలన్న దానిపై సీడబ్ల్యూసీ కసరత్తు చేస్తోంది. -
ఖాతా ఓపెన్ చేసి.. డబ్బులు డ్రా..!
ఖమ్మం అర్బన్: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకులో జిల్లా ఇంధన వనరుల శాఖ పేరుతో ఖాతాను తెరిచి తర్వాత దానిలోకి రూ. కోట్లు వచ్చి చేరాయి. తర్వాత పెద్ద మొత్తంలో డ్రా అయ్యాయి. అయితే తమకు తెలియకుండానే ఖాతా ఓపెన్ అరుు్యందని జిల్లా ఇంధన వనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై విచారణ కోసం ఆ శాఖ ఎండీ కమలాకర్‌బాబు సోమవారం హైదరాబాద్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కమిటీని నియమించినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని కవిరాజ్‌నగర్‌లో తెలంగాణ నూతన-పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంఘం లిమిటెడ్‌తో కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం పేరుతో ఈ నెల 2న మమత ఆస్పత్రిరోడ్డులోని ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి చెక్‌బుక్ అందింది. తమ కార్యాలయానికి సంబంధించిన ఖాతా లేకుండానే చెక్ బుక్ రావడంతో అధికారులు కంగుతిన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాంకు అధికారులను కలవడంతో బ్యాంకు టార్గెట్ కోసం ఖాతాను ఓపెన్ చేశామని, ఈ ఖాతాను కూడా క్లోజ్ చేశామని తప్పుడు స్టేట్మెంట్ను ఇచ్చినట్లు తెలిసింది. రూ. కోట్లు జమ.. ఈ ఏడాది మే 18న ఈ కార్యాలయం పేరుతో మేరుగు శ్రీనివాసరావు, బి.భగవాన్‌దాస్ పేర్లతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత ఆ ఖాతాలోకి సుమారు రూ.10,67,87,000 జమ అయ్యాయి. జమ అయిన మొత్తం నుంచి రూ.కోటి వరకు డిపాజిట్ చేయగా, మిగిలిన వాటిలో రూ.9.61 కోట్ల వరకు ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. రూ.6.83లక్షలు బ్యాంకు ఖాతాలో నిల్వ ఉన్నాయి. అయినా, తప్పుడు పేర్లతో, తమ కార్యాలయం పేరుతో ఖాతా ఓపెన్ అవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ బ్యాంకు ఉన్నతాధికారులకు, పోలీసులకు జిల్లా ఇంధన వనరుల శాఖ కార్యాలయ అధికారులు ఈనెల మొదటి వారంలో ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల హస్తం ఉందా..? కార్యాలయ అధికారులకు తెలియకుండా, కనీసం కార్యాలయం నుంచి లేఖ కూడా లేకుండా తప్పుడు పత్రాలతో ఖాతా తెరవడం.. ఆ ఖాతాలోకి కోట్లాది రూపాయలు వచ్చి చేరడంలో బ్యాంకు అధికారుల హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంధన వనరుల శాఖాధికారులు తొలు త బ్యాంకులో సంప్రదించినప్పుడు టార్గెట్ కోసం సెప్టెంబర్ 29న తెరచి, అక్టోబర్ 2న రద్దు చేసినట్లు చెప్పడం కూడా అనుమానాలు తావి స్తోంది. మరో మూడు రోజుల్లో విచారణ ఇంధన వనరులశాఖ కార్యాలయం పేరుతో కోట్లాది రూపాయలు జమ, డ్రా అయిన అంశంపై మూడురోజుల్లో ముగ్గురు అధికారులు ఖమ్మంలోని ఆ బ్యాంకులో విచారణ చేపట్టనుంది. ఈ విషయంపై జిల్లా నెడ్‌క్యాప్ మేనేజర్, ఏజీ ఆడిట్ అధికారిని, నెడ్‌క్యాప్ హెడాఫీస్ నుంచి ఓ అధికారిని విచారణాధికారులుగా నియమించారు. కోర్టు అనుమతి కోసం లేఖ: సీఐ శ్రీధర్ తమ పేరుతో ఖాతా తెరిచిన విషయంపై జిల్లా ఇంధన వనరుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశా రు. అయితే దీనిపై కేసు నమోదు చేయడానికి అనుమతి కోరుతూ కోర్టుకు నివేదించాం. అనుమతి రాగానే కేసు నమోదు చేస్తాం. లేకుంటే నిధులు దుర్వినియోగం అయ్యాయని బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా ఫిర్యాదు వచ్చినా కేసు నమోదు చేస్తాం. -
పీహెచ్‌సీల్లోనే ఆరోగ్యశ్రీ రోగులకు మందులు!
నిర్ణయించిన వైద్య ఆరోగ్య శాఖ సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు పొందిన రోగులకు ఇక నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) లోనే మందులను అందజేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలు వైద్యసేవలు పొందుతున్నారు. గుండె, కిడ్నీ వంటి శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న వారికి క్రమం తప్పకుండా వాడాల్సిన మందులను అవసరాన్ని బట్టి ఆరోగ్యశ్రీ ద్వారా అందజేస్తున్నారు. అయితే వైద్య సాయం పొందిన ఆస్పత్రి నుంచే మందులు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో పట్టణాలు, నగరాల్లో ఉన్న ఆస్పత్రులకు వెళ్లడం గ్రామీణ ప్రాంతాల వారికి భారంగా మారుతోంది. దీన్ని నివారించేందుకు రోగికి సమీపంలోని పీహెచ్‌సీల్లోనే అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఆ పీహెచ్సీ పరిధిలో ఎంతమంది ఆరోగ్యశ్రీ రోగులున్నారు, వారికి చేసిన చికిత్సలేంటి, ఏ మందులు వాడుతున్నారు, వంటి వివరాలను పీహెచ్సీలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రోగులకు మందులు సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. -
సీసీఐ తీరుతో రైతుల బేజారు
♦ పత్తి కొనుగోళ్లలో మడత పేచీలు ♦ సీసీఐ ఇప్పటివరకు సేకరించిన పత్తి 38వేల క్వింటాళ్లు మాత్రమే ♦ లావాదేవీల్లో ప్రైవేటు వ్యాపారులదే పైచేయి ♦ సవాలక్ష సాకులను చూపుతున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మీనమేషాలు లెక్కిస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), రైతుల నుంచి కొనుగోళ్ల విషయంలోనూ చొరవ చూపడం లేదు. నాణ్యత ప్రమాణాల పేరిట సీసీఐ సవాలక్ష నిబంధనలు విధిస్తుండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 84 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన సీసీఐ, ఇప్పటి వరకు 62 చోట్ల కేంద్రాలను ప్రారంభించినట్లు చెపుతోంది. ఇందులో 19 కేంద్రాల్లో లావాదేవీలు చురుగ్గా సాగుతున్నట్లు సీసీఐ వర్గాలు చెప్తున్నా.. ఇప్పటి వరకు 1592 మంది రైతుల నుంచి కేవలం 38 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యంత నాణ్యమైన పత్తికి సీసీఐ క్వింటాలుకు రూ.4,100 చెల్లిస్తుండగా, ప్రైవేటులో రూ.3,800 నుంచి రూ.4,200 వరకు పలుకుతోంది. సీసీఐ ద్వారా కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో.. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు ఆరంభంలో ధరను కొంత మేర పెంచి, ఆ తర్వాత అమాంతం తగ్గించేస్తున్నారు. తెల్లదోమ తెగులు మూలంగా మహారాష్ట్ర, రాజస్తాన్‌లో పత్తి పంట దెబ్బతినడంతో ప్రైవేటు వ్యాపారులు మన రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు వేగవంతం చేశారు. కూలీల కొరత, తక్షణమే కూలీ డబ్బులు చెల్లించాల్సి రావడం, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ల నేపథ్యంలో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల కోసం వేచి చూసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సీసీఐ సాకులు... రైతులకు దళారీల బెడద తగ్గించేందుకు సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం మినహా ప్రభుత్వం వద్ద మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఈ ఏడాది రాష్ట్రంలో 16.33 లక్షల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేశారు. 27.76 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 90 సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదించింది. అయితే సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ 84 కేంద్రాలే తెరిచేందుకు సీసీఐ అంగీకరించింది. అక్టోబర్ 10 నుంచి 17వ తేదీల మధ్య గుర్తిం చిన వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని సీసీఐ ప్రకటించినా నేటికీ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. కొనుగోలు కేంద్రాలు కొన్ని చోట్ల ప్రారంభమైనా.. కొనుగోలు కేంద్రం నుంచి జిన్నింగ్ మిల్లు వరకు పత్తి రవాణా వ్యయాన్ని రైతులే భరించాలని మడత పేచీ పెడుతున్నారు. ప్రభుత్వ వినతి ఫలించేనా..? పత్తి కొనుగోలు విషయంలో రైతుల నుంచి వస్తున్న ఒత్తిడితో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేశారు. మద్దతు ధరను క్వింటాలుకు రూ.5వేలు, తేమ శాతం 12 నుంచి 20కి పెంపు, హైదరాబాద్‌లో సీసీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, రవాణా భారాన్ని సీసీఐ భరించడం తదితరాలపై కేంద్రానికి విన్నవించారు. అయితే కేంద్రం నుంచి ఆదేశాలు రానంతవరకు పత్తి కొనుగోలులో ప్రస్తుతమున్న నిబంధనలే పాటిస్తామని సీసీఐ వర్గాలు చెప్తున్నాయి. -
తుది దశకు క్రమబద్ధీకరణ
♦ చెల్లింపు కేటగిరీలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి ♦ మిగతా సొమ్ము చెల్లించాలని ఫైనల్ డిమాండ్ నోటీసులు జారీ ♦ డిసెంబర్‌కల్లా వసూళ్లు పూర్తిచేయాలని కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం ♦ సంక్రాంతికల్లా పట్టాల పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ తుదిదశకు చేరింది. చెల్లింపు కేటగిరీలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక అన్ని జిల్లాల్లోనూ పూర్తయింది. దీంతో దరఖాస్తుతో పాటు చెల్లించిన సొమ్ము పోను, మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ లబ్దిదారులకు ఆటో జెనరేటెడ్ డిమాండ్ నోటీసులను రెవెన్యూ శాఖ జారీచేసింది. డిసెంబర్ 31కల్లా ఈ వసూళ్లు పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్) తాజాగా ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారు నిర్ధేశిత ధర చెల్లిస్తే సదరు భూమిని క్రమబద్ధీకరించేందుకు గాను గత డిసెంబరులో ప్రభుత్వం జీవో నంబరు 59 జారీచేసిన సంగతి విదితమే. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 23,516దరఖాస్తులు అందగా, జీవో 58 కింద ఉచిత కేటగిరీలో వచ్చిన దరఖాస్తుల్లో 21,493 దరఖాస్తులను కూడా చెల్లింపు కేటగిరీలోకి మార్చారు. దీంతో చెల్లింపు కేటగిరీ కింద ఉన్న దరఖాస్తుల సంఖ్య 45,009కు చేరింది. త్వరలో భూమి హక్కుల బదలాయింపు భూముల క్రమబద్ధీకరణకు అర్హులైన వారికి నిర్దేశిత ధరను చెల్లించేందుకు ప్రభుత్వం ఐదు సులభ వాయిదాల సదుపాయాన్ని కూడా కల్పించింది. సెప్టెంబర్ 30తో రెండోవాయిదా చెల్లింపు గడువు ముగియగా, కొందరు మూడో వాయిదా సొమ్మును, మరికొందరు ఒకేసారి మొత్తం సొమ్మును కూడా చెల్లించారు. దరఖాస్తులు వివిధ వాయిదాల కింద ఇప్పటివరకు మొత్తం రూ.141.35 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. ఒకేసారి సొమ్ము చెల్లించిన 409మంది లబ్ధిదారులకు ఈ నెలఖారుకల్లా భూమి హక్కులను బదలాయిస్తామని, ఇందుకోసం రూపొం దించిన కన్వీనియన్స్ డీడ్ నమూనా ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు రెవెన్యూ ఉన్నతాధికారుల చెబుతున్నారు. ఇప్పటికే న్యాయ విభాగం నుంచి క్లియరెన్స్ లభించినందున కన్వీనియన్స్ డీడ్ నమూనాకు ప్రభుత్వ ఆమోదం ఇక లాంఛనమేనంటున్నారు. వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తున్న లబ్ధిదారుల నుంచి డిసెంబరులోగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతి కల్లా పట్టాల పంపిణీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. చెల్లింపు క్రమబద్ధీకరణ తీరు వచ్చిన దరఖాస్తులు 23,516 మార్పిడి దరఖాస్తులు 21,493 మొత్తం దరఖాస్తులు 45,009 మొదటి వాయిదాలో వచ్చిన సొమ్ము రూ.129.30 కోట్లు రెండో వాయిదాలో అందిన సొమ్ము రూ.9.42 కోట్లు మూడో వాయిదా సొమ్ము రూ.91.90 లక్షలు ఒకేసారి చెల్లించిన సొమ్ము రూ.1.70 కోట్లు సర్కారుకు అందిన మొత్తం సొమ్ము రూ.141.35 కోట్లు -
ఐఏఎస్ వర్సెస్ నాన్-ఐఏఎస్
న్యూఢిల్లీ: ‘ఇద్దరం అఖిల భారత సర్వీసు అధికారులమే.. కానీ వేతనాల్లో, పదోన్నతుల్లో వివక్ష ఎందుకు?’ అంటూ ఐఏఎస్యేతర అధికారులు గళమెత్తుతున్నారు. తమకూ ఐఏఎస్‌లతో సమానంగా వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. ఐఏఎస్‌లూ వెనక్కి తగ్గడం లేదు. తమ ప్రతిభ, పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఉండాల్సిందేనంటున్నారు. ఇప్పుడున్న విధానాన్నే కొనసాగించాలని, తమను మిగతా సర్వీసు అధికారులతో సమానంగా పరిగణించ రాదంటూ 200 మంది ఐఏఎస్ అధికారుల బృందం సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. జాయింట్ సెక్రటరీ పోస్టును ఐఏఎస్ అధికారులు కేవలం 11 ఏళ్ల అనుభవంతో పొందుతారు. కానీ ఓ ఐఆర్ఎస్ అధికారికి ఆ పోస్టు దక్కాలంటే 13 ఏళ్లు ఎదురుచూడాల్సిందే. -
గణతంత్ర వేడుకల్లో సమ్మక్క, సారలమ్మ శకటం
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మ ఉత్సవానికి జాతీయస్థాయి గుర్తింపు రానుంది. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) నాడు దేశ రాజధానిలో జరిగే పరేడ్‌లో తెలంగాణ తరఫున సమ్మక్క - సారలమ్మ శకటం ప్రదర్శించనున్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు సంబంధించి రక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర సమాచార- పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ వి.సుభాష్, ఆర్టిస్టు రమణారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సమ్మక్క- సారలమ్మ జాతర వరంగల్ జిల్లా లో జరుగుతుందని, ఆ ఉత్సవాల ఔన్నత్యం తెలిపే శకటం ప్రదర్శనలో ఉంచితే బాగుంటుందని ఈ సమావేశంలో వీరు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులకు విన్నవించినట్లు సమాచారం. దీనికి రక్షణ శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. -
జలంపై జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాది వర్షాకాల సీజన్ పూర్తిగా ముగింపు దశకు వచ్చినా కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేర లేకపోవడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటిని వచ్చే జూన్ వరకు కాపాడుకుంటూ ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీర్చడం సాధ్యమయ్యేనా అన్న సంశయాన్ని వ్యక్తంచేసింది. ఇరు రాష్ట్రాలు మరింత పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్తు తాగునీటి అవసరాలకు ఎలాంటి ముప్పు ఉండదని, లేనిపక్షంలో కరువు తప్పదని హెచ్చరించింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు జరిగిన నీటి వినియోగం, భవిష్యత్ అవసరాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా బుధవారం కేంద్ర జల సంఘం కార్యాలయంలో తెలంగాణ, ఏపీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు కృష్ణా ప్రాజెక్టుల్లో నీటిని ఇరు రాష్ట్రాలు ఏ రీతిన వాడుకున్నాయి, మున్ముందు అవసరాలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై చర్చించారు. సాగుకు నీటిని మళ్లించొద్దు.. మొదటగా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యతపై సమావేశం చర్చించింది. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగులకుగాను ప్రస్తుతం 846.6 అడుగుల మట్టానికి 73.08 టీఎంసీల నీరు ఉందని అధికారులు వివరించారు. ఇందులో కనీస నీటిమట్టం 834 అడుగుల వరకు 20 టీఎంసీలు, ఆ తరువాత మరో 50 టీఎంసీలకు వరకు నీటి లభ్యత ఉంటుందని తెలిపారు. ఇక సాగర్‌లో నీటి లభ్యత కనీస మట్టం 510 అడుగుల దిగువకు పడిపోయిందని వివరించారు. ఈ సందర్భంగా నీటి లోటుపై ఆందోళన వ్యక్తం చేసిన బోర్డు, వచ్చే జూన్ వరకు ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు కనీసం 30 నుంచి 40 టీఎంసీల మేరకు ఉంటాయని, ప్రస్తుత లభ్యత నీటిని అప్పటివరకు కాపాడుకోవడం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని అభిప్రాయపడింది. కాగా, ప్రస్తుత తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం నుంచి మరింత నీటిని విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలు బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాల దృష్ట్యా 2.5 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ కోరగా, కృష్ణా డెల్టా అవసరాలకు 5 టీఎంసీలు, గుంటూరు, ప్రకాశం తాగునీటి అవసరాలకు మరో 2 టీఎంసీల మేర నీటి విడుదల చేయాలని ఏపీ కోరింది. అయితే దీనిపై బోర్డు తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం చెబుతామని స్పష్టం చేసింది. త్వరలో మైనర్ ఇరిగేషన్ సీఈలతో బోర్డు భేటీ.. కాగా కృష్ణా బేసిన్ చిన్నతరహా ప్రాజెక్టుల కింద ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి లెక్కలపై తేల్చేందుకు త్వరలోనే ఇరు రాష్ట్రాల మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని బోర్డు పేర్కొన్నట్టు తెలిసింది. చిన్న నీటి వనరుల కింద తెలంగాణకు 89.5 టీఎంసీలు, ఏపీకి సుమారు 20 టీఎంసీల వరకు కేటాయింపులున్నా ఇందులో ఎంత నీరు లభిస్తోంది. వినియోగం ఎంతన్నదానిపై సరైన వివరాల్లేవు. దీంతో కృష్ణాలో ఇరు రాష్ట్రాల పూర్తి నీటి వినియోగాన్ని లెక్కించడం ఇబ్బందిగా మారడంతో ఈ సమావేశాన్ని నిర్వహించే ఆలోచనలు చేస్తోంది. -
కులవృత్తిని మట్టుబెట్టజూస్తే ఖబడ్దార్
గౌడ సమ్మేళనంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ♦ గౌడలను ప్రభుత్వానికి దూరం చేయజూస్తే ఊరుకోం ♦ అన్యాయం జరిగితే సహించం: ఎంపీ బూర సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: విశ్వాసానికి ప్రతీకగా నిలిచే గౌడ కులస్తులను, కల్లు వృత్తిదారులను ప్రభుత్వానికి దూరం చేసేందుకు, కులవృత్తిని మట్టుబెట్టేందుకు కొందరు అధికారులు పనిగట్టుకుని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఇందుకు వత్తాసు పలుకుతున్న కొందరు నాయకుల బండారం కూడా త్వరలో బయటపెట్టి తీరతామని హెచ్చరించా రు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని జెడ్పీ మైదానంలో జరిగిన జిల్లా గౌడ సమ్మేళనం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు అండ గా ఉండటమే తాను చేసిన నేరంగా కొందరు చిత్రీకరించి రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారి కుట్రల ను చేధిస్తామన్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టయినా కులవృత్తులను కాపాడుకుంటామ న్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమకు ప్రాధాన్యమివ్వాల ని సీఎంను కోరతామని, త్వరలో ఆయన సమక్షంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ‘‘కులానికి, ధనానికి మేం తక్కువేమోగానీ వ్యక్తిత్వానికి మమ్మల్ని మించిన వారు లేరు. అదే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో గౌడ సమస్యలపై నిరంతరం పోరు సాగిస్తా’’ అని చెప్పారు. ‘కార్పొరేట్’ కుట్ర: కల్లు వృత్తిని కాపాడుకోవాలని సాక్షాత్తు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నా అధికారులు వక్రభాష్యం వెతుకుతూ ఆ వృత్తిని నిర్మూలించడం ద్వారా కార్పొరేట్ లిక్కర్ కంపెనీలకు చేయూతనిచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కల్తీ పేరుతో కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెట్టలనే ఉద్ధేశంతో కొందరు అధికారులు పనికట్టుకుని చేస్తున్న ప్రయత్నాలను ఇక చూస్తూ ఊరుకోబోమన్నారు. తాము తలచుకుంటే అధికారులు బండారం బయట పెడతామని, కులవృత్తులను అణచివేతకు ప్రయత్నిస్తే దాడులు చేయడానికి సైతం వెనుకాడబోమని అన్నారు. ‘‘కల్లులో కల్తీ ఉందని పదే పదే దుష్ర్పచారం చేస్తున్న అధికారులు, కొందరు నేతలు ఇప్పటిదాకా సంభవించిన మరణాల్లో ఏ ఒక్కటైనా కల్లు వల్లే జరిగిందని పోస్టుమార్టం సహా ఏ రిపోర్టులోనైనా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. అవసరమైతే కులవృత్తికి స్వస్తి చెప్పడానికీ సిద్ధం. రాజకీయాల్లో తన ఉన్నతిని తట్టుకోలేక తప్పుడు ఆరోపణలతో కుట్రలు చేస్తూ పత్రికల్లో రాయించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాము తలుచుకుంటే గీతకార్మికులను ఇబ్బంది పెట్టే ఏ అధికారి పొలిమేర దాటలేరని ఆయన హెచ్చరించారు. ఐక్యతే మహాబలం సమస్యల సాధనకు ఐక్యతే ప్రధాన ఆయుధమని భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. అనేక ప్రాంతాల్లో గౌడ కులస్తులపై ఆబ్కారీ అధికారులు దాడులకు పాల్పడి వేధిస్తున్నా, వారి ఓట్లతో గెలుపొందిన నేతలు దీన్ని ప్రశ్నించ కపోవడం దారుణమన్నారు. ‘‘ఏదేమైనా కల్లు వృత్తిని కాపాడుకుని తీరుతాం. గౌడలకు అన్యాయం జరిగితే సహించేదే లేదు’’ అన్నారు. -
వచ్చే జూన్ కల్లా వెళ్లాల్సిందే...
♦ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ ♦ సిబ్బందిని అమరావతికి తరలించే పనిలో సీఎస్ సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం జూన్ కల్లా హైదరాబాద్ నుంచి అన్ని శాఖల ఉద్యోగులు అమరావతికి తరలి వెళ్లాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇప్పటివరకు సచి వాలయంలోని శాఖల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఇప్పటివరకు ఎంతమంది అమరావతికి వెళ్లారు? భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? అనే వివరాలను రాబట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు నమూనా ప త్రంలో మంగళవారం సాయంత్రంలోగా సాధారణ పరిపాలన శాఖకు వివరాలు అందజేయాల్సిందిగా సీఎస్ సోమవారం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఎప్పుడెప్పుడు వెళ్ళేదీ, పూర్తి స్థాయిలో ఎప్పటికి అమరావతికి వెళతారు? తేదీలను తెలియజేయాలని ఆదేశించారు. ఈ నెల 31వ తేదీన నిర్వహించే అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమావేశంలో ఆయా అంశాలు, వివరాలపై సమీక్ష ఉంటుందని తెలిపారు. భూముల ధరలు పెంచేందుకేనా..? హైదరాబాద్ నుంచి అధికారులు, ఉద్యోగులను వీలైనంత త్వరగా అమరావతికి తరలించడం వల్ల అక్కడ ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, తద్వారా ప్రభుత్వ పెద్దలకు అక్కడ ఉన్న భూముల ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వం హడావుడి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచి ధరలు రాగానే ఆ భూములను విక్రయించుకోవచ్చనేది ప్రభుత్వ పెద్దల యోచనగా చెబుతున్నారు. -
కల్యాణలక్ష్మి అక్రమాలపై కొరడా
♦ అక్రమాలకు పాల్పడ్డ అధికారులు, సిబ్బందిపై చర్యలకు సర్కారు ఆదేశం ♦ మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదుగురు అనర్హులకు లబ్ధి ♦ తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చిన కిందిస్థాయి అధికారులు ♦ శాఖాపర విచారణలో వెల్లడి ♦ తప్పుడు పత్రాలిస్తే క్రిమినల్ చర్యలు: ఎస్సీశాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి సాక్షి, హైదరాబాద్: నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి తోడుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కల్యాణలక్ష్మి’ పథకంలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ఈ పథకానికి సంబంధించి పలు అవినీతి ఉదంతాలు బయటపడడంతో శాఖాపరంగా విచారణ జరిపింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదుగురు అనర్హులు లబ్ధి పొందారని గుర్తించి, చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ 5 కేసుల్లో చట్టాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది, నకిలీ లబ్ధిదారులపై చర్య లు తీసుకోవాలని ఎస్సీ డెవలప్మెంట్ శాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి కలెక్టర్‌కు సూచించారు. తప్పుడు పత్రాలతో..: ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద వివాహ సమయంలో ఆడపిల్లలకు రూ. 51 వేలు అందిస్తారు. నిరుపేద కుటుంబాల్లోని యువతుల వివాహాలకు సహాయపడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. కానీ కిందిస్థాయిలో అధికారులు, సిబ్బంది కలసి బోగస్ లబ్ధిదారులతో ఈ సొమ్మును స్వాహా చేస్తున్నారు. అప్పటికే పెళ్లయిన వారు, పిల్లలున్న వారు, రెండో వివాహం చేసుకున్న వారితో దరఖాస్తులు చేయిస్తున్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో అధికారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి సహకరిస్తున్నారు. వచ్చిన సొమ్మును పంచుకుంటున్నారు. ‘కల్యాణలక్ష్మి’లో అనర్హులు లబ్ధిపొందుతున్నారని, దీనికి అధికారులు సహకరిస్తున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ కార్యాలయం దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన డెరైక్టర్ ఎం.వి.రెడ్డి విచారణ జరిపించారు. వీఆర్వోలు, వీఏవోలు, వార్డెన్లు ఇచ్చే తప్పుడు ధ్రువపత్రాల ద్వారా అక్రమాలకు అవకాశం ఉండడంతో... పకడ్బందీగా వెరిఫికేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో ఒకరు ఈ పథకం ద్వారా అక్రమంగా లబ్ధి పొందారని కొద్దిరోజుల క్రితం తేలింది. మహబూబ్‌నగర్ జిల్లాలో బయటపడిన 5 కేసులపై శాఖాపర విచారణ జరిపి, ఆయా అంశాలను తేల్చింది. అధికారులపైనా చర్యలు మహబూబ్‌నగర్ జిల్లాలో 5 కేసులపై విచారణ జరిపి, అక్రమాలు గుర్తించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రయోజనం పొందిన అనర్హుల నుంచి సొమ్మును రెవెన్యూ యాక్ట్ ప్రకారం తిరిగి వసూలు చేస్తాం. కొన్నికేసుల్లో నిధులు విడుదల చేయకుండా నిలిపేశాం. కల్యాణలక్మి పథకం కింద లబ్ధిపొందేందుకు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తప్పవు. సంబంధిత వెరిఫికేషన్ అధికారులపైనా క్రమశిక్షణ చర్యలు చేపడతాం. - ఎం.వి.రెడ్డి, ఎస్సీశాఖ డెరైక్టర్ -
కాపలా లేని క్రాసింగ్‌ల వద్ద హెచ్చరిక వ్యవస్థ
న్యూఢిల్లీ: కాపలా లేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరక్కుండా హెచ్చరికలు తెలిపే వ్యవస్థను రైల్వే ఏర్పాటు చేయనుంది. ఆరుతూ వెలిగే రెండు లైట్లు, సైరన్‌తో కూడిన ఈ వ్యవస్థ.. క్రాసింగ్‌కు రైలు కిలోమీటరు దూరంలో ఉండగానే ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. ఇది కోయంబత్తూరు-మెటుపల్లాయమ్ సెక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. మూడు నెలలు చక్కగా పనిచేసింది. దీంతో దీన్ని అన్ని రైల్వే జోన్లలోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్డీ ఎస్వో), రైల్వేస్ రీసెర్చ్ వింగ్ సిఫారసు చేశాయని అధికారులు తెలిపారు. రైలు ప్రమాదాల్లో 40 శాతం క్రాసింగ్ వద్ద జరిగినవే. రైలు ప్రమాదాల్లో 60 శాతం మంది క్రాసింగ్, ఓవర్ బ్రిడ్జిలు, భూగర్భ రైలు మార్గంలో జరిగిన దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారే. దేశవ్యాప్తంగా ఉన్న 30,348 క్రాసింగ్స్‌లో 11,563 చోట్ల కాపలా లేని దుస్థితి నెలకొని ఉంది. -
మేనల్లుడికి బుల్లెట్ తగిలిందని షూట్ చేసుకున్నాడు..
గోపేశ్వర్(ఉత్తరాఖండ్): వేటకెళ్లిన ఓ వ్యక్తి జంతువనుకొని కాల్పులు జరపగా దురదృష్టవశాత్తు తన మేనల్లుడికి బుల్లెట్ తగిలింది. తప్పుచేశానని మనస్తాపం చెంది తనను తానే కాల్చుకొని దుర్మరణం చెందాడు. ఈ ఘటన చమోలి జిల్లాలోని థరలి ప్రాంతంలో మారుమూల గ్రామమైన రుసన్లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం గోవర్ధన్లాల్ అనే వ్యక్తి వేటకై అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో పొదల చాటున శబ్దం వినిపించడంతో జంతువు అనుకొని ఆ దిశగా కాల్పులు జరిపాడు. తీరా దగ్గరికెళ్లి చూసి నిర్ఘాంతపోయాడు. తన సొంత మేనల్లుడు దర్శన్లాల్కు బుల్లెట్ తగిలి పడి ఉండటాన్ని గమనించాడు. తీవ్ర మనస్తాపం చెందిన గోవర్ధన్.. తనకు తానే కాల్చుకొని దుర్మరణం చెందాడని థరలి ఎస్డీఎం అనూప్ నౌతియాల్ తెలిపారు. అతని మేనల్లుడు దర్శన్‌లాల్ కర్ణప్రయాగ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆయనకు ప్రాణాపాయం తప్పిందని అధికారులు వివరించారు. -
‘డబుల్’ రాయితీ!
♦ రెండు పడక గదుల ఇళ్లకు ఇసుక ఉచితం ♦ తగ్గింపు ధరలకు సిమెంటు, స్టీలు ♦ ప్రతిపాదిత అంచనాలో ఇళ్లు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలకు రాయితీ ♦ తొలి టెండర్లలో భారీగా కోట్ చేయడంతో కొత్త నిర్ణయం ♦ ఎస్ఎస్ఆర్ తగ్గించి నిర్మాణ అంచనా మొత్తం కుదింపు ♦ వరంగల్‌లో మలి టెండర్లు పిలిచిన అధికారులు సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు సిమెంటు, స్టీలును తగ్గింపు ధరలకు అందజేయనుంది. ఈ మేరకు ‘డబుల్’ ఇళ్ల నిర్మాణ సంస్థలకు రాయితీలు కల్పించి... ప్రతిపాదిత ధరలోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోనుంది. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ. 946గా ప్రభుత్వం ఖరారు చేసింది. అన్ని పన్నులు కలిపి ఈ మొత్తం లోపే కొటేషన్లను ఆశిస్తోంది. కానీ పట్టణ ప్రాంతాల్లో కాలనీలుగా నిర్మించే చోట్ల మౌలిక వసతుల కల్పన భారీ వ్యయంతో కూడుకున్న నేపథ్యంలో... ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.5.30 లక్షల నిధులు సరిపోవని నిర్మాణ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు వరంగల్‌లో ఇటీవల జరిగిన తొలి టెండర్లలో చదరపు అడుగుకు రూ.1,200కు పైగా కోట్ చేశాయి. దీంతో ఆ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై కాంట్రాక్టర్లతో అధికారులు చర్చించగా.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మొత్తానికి నిర్మించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణ సామగ్రి ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) ధరలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆదేశాలు అందడంతో వరంగల్‌లోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మించే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని తగ్గించి తిరిగి టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. ఇసుక క్యూబిక్ మీటర్ ధర రూ.560 ఉండగా దాన్ని పూర్తి ఉచితంగా అందించనున్నారు. దీనిపై రవాణా చార్జీ మాత్రమే నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. ఇక సిమెంటు బస్తా ధర రూ.310 ఉండగా దాన్ని రూ.270కి తగ్గించారు. స్టీలు ధర టన్నుకు రూ.43 వేలు ఉండగా... రూ.36 వేలకు తగ్గించారు. వీటిని ప్రభుత్వమే నిర్ధారిత ధరలకు సరఫరా చేయనుంది. మొత్తంగా అంబేద్కర్ నగర్ ప్రాజెక్టు అంచనాను రూ.43.70 కోట్ల నుంచి రూ.39 కోట్లకు (10 శాతానికిపైగా) తగ్గించారు. కొత్త అంచనా ప్రకారం మళ్లీ టెండర్లు పిలిచారు. వీటిని సోమవారం తెరవనున్నారు. అన్ని పట్టణాలకు ఇదే తరహాలో..! కాలనీలుగా ‘డబుల్’ ఇళ్లను నిర్మించే అన్ని ప్రాంతాల్లో ఇదే తరహా పరిస్థితి ఉండే అవకాశముందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మౌలిక వసతుల కల్పనకు భారీగా వ్యయం అవుతున్నందున టెండర్లలో ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఈ పథకానికి నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించి సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలనీలుగా కాకుండా లబ్ధిదారులకు సంబంధించిన స్థలంలో వ్యక్తిగత నమూనాలో నిర్మించే ఇళ్ల వ్యయం తక్కువగా ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ఖజానాకు చేరే పన్నుల తగ్గింపు, వ్యాట్‌ను రీయింబర్స్ చేయడం లాంటి మరిన్ని ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తంగా ప్రతిపాదించిన ధరల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టనుంది. -
సరిహద్దులో ఆగని పాక్ కాల్పులు
జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణకు మళ్లీ గండికొట్టింది. శనివారం తొమ్మిది అవుట్‌పోస్టులపై పాక్ జరిపిన భారీ కాల్పులు, మోర్టారు బాంబు దాడుల్లో జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాకు చెందిన ఇద్దరు సామాన్య పౌరులు గాయపడ్డారు. ఓ పాఠశాల బస్సుతో పాటు ప్రైవేట్ బస్సు, ట్రాక్టర్ ఈ దాడిలో పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని పశువులు కూడా మృతిచెందినట్లు భద్రతాధికారులు అధికారులు తెలియజేశారు. కొన్ని ఇళ్లపై మోర్టారు బాంబులు దూసుకొచ్చాయని, గోడలు నెర్రెలు విచ్చాయని వెల్లడించారు. పాక్ దాడులను భారత భద్రతా బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. మరోపక్క..అంతర్జాయతీయ సరిహద్దు వెంట శుక్రవారం రాత్రి పాకిస్తాన్ జరిపిన దాడిలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. -
రూ.135తో రోజుకు లక్ష కేజీలు
సరఫరా చేస్తామని కందిపప్పు దిగుమతిదారుల వెల్లడి ♦ నిల్వల పరిమితిపై ఆంక్షలు ఎత్తేయాలని అరుణ్ జైట్లీకి వినతి ♦ నాలుగు రాష్ట్రాల్లో 50వేల టన్నుల పప్పు పట్టివేత న్యూఢిల్లీ: పప్పు దినుసుల విషయంలో తమపై ఉన్న నిల్వల పరిమితిపై ఆంక్షలను తొలగిస్తే.. కిలో రూ. 135 చొప్పున రోజుకు లక్ష కిలోల (100 టన్నుల) కందిపప్పును సరఫరా చేస్తామని దిగుమతిదారులు స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశంలో దిగుమతిదారులు తమ డిమాండ్‌ను తెలిపారు. దేశాలనుంచి ఒక ట్రిప్పులో 50వేల టన్నుల పప్పు వస్తుందని.. దీన్ని నిల్వ చేసుకునే పరిమితి పెంచకపోతే.. దిగుమతి చేసుకోవటం కష్టమని జైట్లీని కోరారు. మరోవైపు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటుగా నాలుగు రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో 50వేల టన్నుల పప్పు దినుసులను అందులోనూ పెద్దమొత్తంలో కందిపప్పును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వం చేతికి చిక్కిన అక్రమ నిల్వలు 50వేల టన్నులకు చేరినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఇటీవలికాలంలో పది రాష్ట్రాల్లో జరిగిన విజిలెన్స్ దాడుల్లో 35వేల టన్నుల వరకు ధాన్యం పట్టుబడటంకూడా ధరల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. కనీసం 40వేల టన్నుల దినుసు లను అత్యవసర పరిస్థితుల కోసం నిలువ ఉంచుకోవాలని కేంద్రం భావిస్తుండటం.. దిగుమతిదారులు నిల్వల విషయంలో ప్రభుత్వంతో చర్చించటం మరింత ధర దిగేందుకు తోడ్పడతాయని అధికారులంటున్నారు. కాగా, నిరుటి కంటే ఈసారి రబీలో 1.30కోట్ల టన్నుల పప్పుధాన్యం ఈ రబీ సీజన్లో ఉత్పత్తి అవుతుందని సర్కారు భావిస్తోంది. -
విద్యుత్ ఉద్యోగులకు దసరా ధమాకా!
సాక్షి, హైదరాబాద్: విజయదశమి కానుకగా విద్యుత్ శాఖలో భారీ ఎత్తున పదోన్నతులు జరిగాయి. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న 1,200 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంజనీరింగ్, అకౌంట్స్, పీఅండ్‌జీ తదితర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు పదోన్నతి కల్పించారు. సెలవు రోజులైనప్పటికీ మంగళ, బుధవారాల్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు రాత్రింబవళ్లు కసరత్తు జరిపి ఎట్టకేలకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రికార్డులు లభించక ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన సమాచారం లభించక తొలుత గందరగోళం ఏర్పడినా, పూర్తి స్థాయి వివరాలు సేకరించిన తర్వాతే పకడ్బందీగా పదోన్నతులు కల్పించామని అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోనే ఆలస్యం జరిగింది. రిలీవైన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఎత్తుగడ వల్ల అనూహ్య పదోన్నతులు రావడంతో టీ విద్యుత్ ఉద్యోగుల్లో పండుగ ఆనందం రెట్టింపైంది. పదోన్నతి కల్పించిన వారికి కొత్త పోస్టింగ్‌లు ఇంకా కేటాయించలేదు. ఏపీ స్థానికత ఉద్యోగుల తొలగింపు ద్వారా ఖాళీ అయిన పోస్టులన్నింటినీ ఈ పదోన్నతుల ద్వారా భార్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు ఖాళీ పోస్టులు భర్తీ కానున్నాయి. ఆ తర్వాతే రిలీవైన ఏపీ స్థానికత ఉద్యోగులను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మాకూ పదోన్నతులు కావాలి: రిలీవైన ఉద్యోగులు రిలీవైన ఉద్యోగులు సైతం తమకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థలకు జాయినింగ్ రిపోర్టులు సైతం అందజేశారు. తమను సైతం పదోన్నతుల్లో పరిగణించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. మరోవైపు రిలీవైన ఉద్యోగులు సాంకేతికంగా తెలంగాణ ప్రభుత్వంలో తిరిగి చేరినట్లేనని రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి. హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు ఇప్పటికే వారి రాష్ట్ర వాటా కింద 42 శాతం జీతభత్యాలను విడుదల చేసేశామని, దీంతో ఆ ఉద్యోగులు ప్రస్తుతం విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
సర్కారుకు ‘ఇస్కీ’ మస్కా..!
♦ పాలమూరు-రంగారెడ్డి అంచనాల తయారీలో చేతులెత్తేస్తున్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ♦ సర్వే కోసం ఇప్పటికే రూ.5 కోట్లు చెల్లింపు ♦ మరో రూ.5 కోట్లు ఇస్తేగాని సర్వే పూర్తిచేయలేమంటూ కొర్రీలు ♦ సబ్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించే యోచన ♦ ‘పాలమూరు’ టెండర్లకు మరో రెండు నెలలు జాప్యం! సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు తొలి దశ టెండర్ల ఖరారుకు సర్వే సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ (ఇస్కీ) వ్యవహారం గుదిబండగా మారింది. ప్రాజెక్టు సర్వే, అంచనాల తయారీ బాధ్యతలు తీసుకున్న ఇస్కీ సగం పనులు చేసి మిగతా పనులు చేయకుండా చేతులెత్తేయడం ప్రాజెక్టు ముందుకాళ్లకు బంధనమేస్తోంది. సర్వే పనులు పూర్తి చేసి అందుకు సంబంధించిన సొమ్ముని జేబులో వేసుకున్న సర్వే సంస్థ అంచనాల తయారీ పనులు చేసేందుకు ఇంకా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మరో రూ.5కోట్ల మేర చెల్లిస్తే కానీ అంచనాల తయారీ చేయలేమని తెగేసి చెబుతుండటంతో ప్రాజెక్టు పనులకు తీవ్ర అంతరాయంగా మారింది. ఇప్పటికే ఆగస్టులోగా టెండర్లు ఖరారు కావాల్సి ఉన్నా ఇస్కీ తీరుతో అక్టోబర్ ఆఖరుకు వస్తున్నా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. చెల్లిస్తున్నా చేతులెత్తేసిన ఇస్కీ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తొలుత నిర్ణయించిన డిజైన్ మేరకు జూరాల నుంచి వరద ఉండే 25 రోజుల్లో 70 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళికలు తయారు చేశారు. దీనికోసం జూరాల నుంచి రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మిదేవునిపల్లి వరకు సమగ్ర డీపీఆర్ తయారు చేసే బాధ్యతలను ఇస్కీకి కట్టబెట్టి, దీనికోసం రూ.5.72 కోట్లు ఇచ్చారు. ఈ మేరకు రూ.32,200 కోట్ల అంచనాతో డీపీఆర్ తయారుచేసి ప్రభుత్వానికి అందజేసింది. అనంతరం ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పలు మార్పులు చేసింది. శ్రీశైలం నుంచి వరద ఉండే 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తీసుకుని నార్లాపూర్ రిజర్వాయర్ మీదుగా కేపీ లక్ష్మిదేవునిపల్లి వరకు నీటిని తరలించాలని... మహబూబ్‌నగర్‌లో 7లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో 2.70 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30వేల ఎకరాలకు, డిండి కింది ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించింది. దీని డీపీఆర్, సర్వే, అంచనాల తయారీ బాధ్యతను తిరిగి ఇస్కీకే అప్పగించారు. దీనిలో భాగంగా ఆరు రిజర్వాయర్లు, 5 లిఫ్టులు ప్రతిపాదించిన ఇస్కీ... ప్రాజెక్టు నిర్మాణానికి రూ.35,200 కోట్లతో ప్రాథమిక డీపీఆర్‌ను ప్రభుత్వానికి అందజేసింది. ఈ డీపీఆర్, సర్వే పనుల కోసం సైతం రూ. 5కోట్ల మేర ప్రభుత్వం ఇస్కీకి చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా రిజర్వాయర్లు, వాటి అనుసంధానిస్తూ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం కోసం సర్వేలు చేపట్టాల్సి ఉంది. కానీ నార్లాపూర్ నుంచి కేపీ లక్ష్మిదేవునిపల్లి వరకు అప్రోచ్ చానళ్లు, ఓపెన్ కెనాల్, టన్నెల్, వియర్, పంప్‌హౌజ్, రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమయ్యే వ్యయ అంచ నాలను కచ్చితంగా గుర్తించి ప్రభుత్వానికి అందజేయాల్సిన సమయంలో ఇస్కీ కొర్రీలు పెడుతోంది. మరో రూ. 5కోట్లు మేర చెల్లిస్తే తప్ప తాము అంచనాలపై సర్వే చేయలేమంటూ పేచీ పెడుతోంది. సుమధుర అనే సబ్ ఏజెన్సీకి అంచనాల తయారీ బాధ్యతను అప్పగించే ప్రయత్నం చేస్తోంది. నిజానికి ప్రాజెక్టు పనులకు ఆగస్టులోగా తొలిదశ టెండర్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా... ఇప్పటికే రెండు నెలలు ఆలస్యమైంది. ఇప్పుడు ఇస్కీ తీరుతో మరో రెండు నెలలు ఆలస్యం కావడం ఖాయమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇస్కీ వ్యవహారాన్ని ప్రాజెక్టు అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది తెలియలేదని చెబుతున్నాయి. -
ఒకే గొడుగు కిందకు వర్సిటీలు
♦ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ♦ ఇకపై అన్నింటికీ ఒకే చట్టం ♦ చట్టం రూపకల్పనకు ఉన్నత విద్యా మండలి కసరత్తు సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలూ ఇక ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఆ దిశగా తొలి అడుగు పడింది. అన్నింటికీ ఉమ్మడి చట్టాన్ని రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15 విశ్వవిద్యాలయాలున్నాయి. మరొకటి.. ట్రైబల్ యూనివర్సిటీ రాబోతోం ది. ఈ క్రమంలో మొత్తంగా 16 విశ్వ విద్యాలయాలకు కొత్తగా ఉమ్మడి చట్టాన్ని రూపొం దించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో రకమైన చట్టం ఉంది. ఇటీవల ఆయా చట్టాల్లో మార్పులు చేసింది. ఛాన్స్‌లర్‌గా నిఫుణులను నియమించడంతోపాటు వైస్ఛాన్స్లర్లను ని యమించే అధికారాలను రాష్ట్ర గవర్నర్ పరిధి నుంచి తొలగించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెచ్చుకుంది. తాజాగా అన్నింటికి కలిపి ఒకే చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త చట్టం రూపకల్పనకు అవసరమైన చర్యలను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలిని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ శాఖలు, యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతోపాటు న్యాయశాఖ అధికారులు, విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ, హెల్త్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు భాగస్వామ్యం కల్పించింది. దీంతో మంగళవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆ కమిటీలోని సభ్యులు, అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగి న ఈ సమావేశంలో ప్రస్తుతం యూనివర్సిటీల పరిస్థితి, యూనివర్సిటీల వారీగా చట్టాల్లో ఉన్న లొసుగులు, కొత్త చట్టం తీరుతెన్నులపై చర్చించారు. గుజరాత్ తరహాలో ఈ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు అగ్రికల్చర్, హెల్త్, వెటర్నరీ, హార్టికల్చర్, జేఎన్టీయూహెచ్, కాకతీయ, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల రిజిస్ట్రార్లతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్కో వర్సిటీ ఒక్కో జాతీయస్థాయి సంస్థలైన యూజీసీ, ఎంసీఐ, ఏఐసీటీఈల నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం వాటి ప్రాథమిక నిబంధనల్లో మార్పులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అన్నీ ఒకే చట్టం కింద ఉండే విధంగా కొత్త చట్టాన్ని రూపొందించనున్నారు. ఈ నెల 31న జరిగే సబ్‌కమిటీ సమావేశంలో ఆయా అంశాలన్నింటిపై చర్చించి కొత్త చట్టానికి రూపలకల్పన చేసే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు చట్టాల్లో చేసిన మార్పుల మేరకు జాప్యం లేకుండా ఛాన్స్లర్లు, వైస్‌ఛాన్స్‌లర్ల నియామకాలు చేపట్టే వీలుందని మండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. -
తుళ్లూరులో తాత్కాలిక శాసనసభ నిర్మాణం
శీతాకాలం, బడ్జెట్ సమావేశాలు నిర్వహణ.. ఏర్పాట్లపై స్పీకర్ కోడెల సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఆఖరి వారంలో ఐదు రోజులపాటు గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించేందుకు వీలుగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సభను పోలి ఉండేలా సభా మందిరాన్ని ఐదెకరాల విస్తీర్ణంలో రాజధాని నగరం అమరావతికి శంకుస్థాపన జరిగే ప్రాంతానికి సమీపంలో నిర్మించనుంది. దీనికి సంబంధించిన నమూనాలను మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిశీలించారు. వీటిని సీఎంకు చూపించి ఆయన సూచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని అధికారులకు సూచించారు. తాత్కాలిక శాసనసభ ప్రాంగణం తగిన రీతిన రూపుదిద్దుకుంటే అవసరమైతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించవచ్చని చెప్పారు. శాసనమండలి శీతాకాల సమావేశాలు కూడా తుళ్లూరులోనే జరగనున్నాయని ప్రభుత్వం పేర్కొంది. -
తప్పొకరిది.. శిక్ష మరొకరికా?
♦ విద్యార్థుల జీవితాలతో ఓయూ అధికారుల చెలగాటం ♦ పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షలపై అశ్రద్ధ ♦ పాత సిలబస్‌తో పేపర్ ఇవ్వడంతో వందల మంది ఫెయిల్ ♦ ప్రశ్నపత్రం మారడంతో మార్కులు కలిపిన అధికారులు ♦ అయినా తీవ్రంగా నష్టపోయిన ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షలపై ఎనలేని అశ్రద్ధ కనబరుస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. పాత సిలబస్‌తో పరీక్ష పేపర్ ఇవ్వడంతో వందల మంది ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులు ఫెయిలయ్యారు. అధికారులు చడీచ ప్పుడు కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టినా అప్పటికే నష్టం జరిగిపోయింది. మార్కులు కలిపినా గుడ్డిలో మెల్ల చందంగా కొంతమంది పాసయ్యారే తప్ప మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారు. ఇంకొందరు అనుత్తీర్ణులుగానే మిగిలిపోయారు. ఏం జరిగింది.. ఓయూ పరిధిలో 2014-15 బ్యాచ్‌కి చెందిన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ఈ ఏడాది మేలో నిర్వహించారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు సంబంధించి మారిన సిలబస్ ప్రకారం ప్రశ్నపత్రం ఇవ్వాల్సి ఉండగా.. పాత సిలబస్‌తో ప్రశ్నపత్రం ఇవ్వడంతో విద్యార్థులు ఖంగుతిన్నారు. దీంతో చాలామంది విద్యార్థులు ఇంగ్లిష్‌లో ఫెయిలవ్వడంతో ఉత్తీర్ణత 50 శాతం కూడా దాటలేదు. ప్రశ్నపత్రం మారడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొన్ని మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 3,648 మంది పరీక్షకు హాజరు కాగా.. 2,600 మంది(71.27 శాతం) మాత్రమే గట్టెక్కారు. శాస్త్రీయత ఏదీ..? వాస్తవంగా సిలబస్ యేతర ప్రశ్నలు వస్తే.. ఎన్ని మార్కులు కలపాలన్న విషయంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. మొత్తం ఎన్ని మార్కులకు సిలబస్ బయటి నుంచి ప్రశ్నలు వచ్చాయి.. ఎన్ని మార్కులు ఏ ప్రాతిపదికన కలపాలి.. తదితర అంశాలను కమిటీ నిర్ణయించాలి. కానీ ఇందంతా లేకుండా.. తమకు తోచినట్లుగా అధికారులు మార్కులు కలిపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏ విద్యార్థికి మొదట ఎన్ని మార్కులు వచ్చాయి? తర్వాత ఎన్ని కలిపారు? అనే విషయాలపై అధికారుల వద్దే స్పష్టత లేదు. దీంతో ఏ శాస్త్రీయ పద్ధతులు అవలంబించలేదని వెల్లడవుతోంది. అధికారులు చేతులు దులిపేసుకునే క్రమంలో కొన్ని మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేశారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయమై ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్ కుమార్‌ను వివరణ కోరగా.. ఏం జరిగిందనేది సంబంధిత శాఖ నుంచి తెలుసుంటానని చెప్పారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్‌ని సంప్రదించగా.. అదనంగా మార్కులు కలిపిన విషయం వాస్తవమేనని.. ఎన్ని కలిపామో చెప్పలేమని బదులిచ్చారు. మొత్తం మీద అధికారుల తప్పిదానికి విద్యార్థుల భవిష్యత్ బలవుతోంది. -
డిజిటల్ పోలీసింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్నారు. నూతన ఒరవడులను అందిపుచ్చుకొని శాఖ ప్రక్షాళనకు ఉన్నతాధికారులు నడుం బిగించారు. అందులో భాగంగా పోలీసు కార్యాలయాల్లో కాగితరహితంగా, మరింత పారదర్శకంగా సేవలందించాలని నిర్ణయించారు. పూర్తిగా డిజిటల్‌మయంగా మార్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఏపీటీఎస్ (ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ‘కేఎం ఆటం (నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఆటోమేషన్)’ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. ఈ నూతన టెక్నాలజీపై మార్చి 2 నుంచి టెస్టింగ్‌లు నిర్వహించి సమస్యలను సరిచేశారు. మొదట దీన్ని డీజీపీ కార్యాలయంలో పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించి నేటి (మంగళవారం) నుంచి ఫైళ్లంటినీ ఈ సాఫ్ట్వేర్ ద్వారానే ఉన్నతాధికారులకు చేరేలా ఆదేశాలిచ్చారు. ఇందుకు డీజీపీ కార్యాలయంలోని 210 మంది కింది స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అలాగే త్వరలో అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాలతో పాటు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ)లో వినియోగించేందుకు టెక్నికల్ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. కేసుల పురోగతితో పాటు ఫైళ్ల స్థితిగతులను సులభంగా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేఎం ఆటం అప్లికేషన్ దోహదపడుతుంది. ఏ ఫైల్ ఎక్కడ, ఎవరి వద్ద ఎంత కాలం నుంచి ఉందనే విషయాలు వెంటనే తెలిపోతాయి. దీని ద్వారా వ్యవస్థలో మరింత పారదర్శకత రావడంతో పాటు సిబ్బందిలో అలసత్వం వీడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఫైల్ డీల్ చేసే ప్రతి సిబ్బంది ఎలక్ట్రానిక్ సంతకాన్ని కూడా రికార్డు చేసేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. అధికారులు ఎక్కడున్నా ల్యాప్‌టాప్, ట్యాబ్ ద్వారా ఫైల్స్ చూసుకోవచ్చు. -
గిరిజన ‘డ్రాపవుట్స్’ నివారణ అంతంతే!
♦ పూర్తిస్థాయిలో ఫలించని సర్కారు ప్రయత్నాలు ♦ మొత్తం 14,286 మంది చిన్నారుల్లో స్కూళ్లలో చేరింది 8,126 మందే సాక్షి, హైదరాబాద్: బడికి దూరమైన, బడుల్లోనే చేరని గిరిజన పిల్లలను స్కూళ్లలో చేర్చాలన్న సర్కారు ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడం లేదు. రాష్ట్రస్థాయి నుంచి ఉన్నతాధికారులు డ్రాపవుట్స్ పిల్లలను స్కూళ్లలో చేర్పిం చేందుకు కిందిస్థాయి అధికారులను ఆదేశిస్తున్నా వారిని బడుల్లో చేర్చే ప్రయత్నాలు పూర్తిగా సఫలం కావడం లేదు. జిల్లాస్థాయిల్లోని అధికారులు, ఇతర శాఖల సహకారంతో ఈ పిల్లలను చేర్పించేందుకు ప్రత్యేకశ్రద్ధ, చొరవ తీసుకుంటే తప్ప ఈ పిల్లలంతా బడుల్లో చేరే అవకాశాలు కనిపించడం లేదు. గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం 12,100 గిరిజన ఆవాసాల్లో 14,286 మంది చిన్నారులు స్కూల్ డ్రాపవుట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిని స్కూళ్లలో చేర్పించడంలో మాత్రం జిల్లాల్లోని గిరిజన సంక్షేమ అధికారులు విజయం సాధిం చలేకపోతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,126 మంది చిన్నారులను అధికారులు సూళ్లలో చేర్చగా మరో 6,160 మందిని బడుల్లో చేర్పించేందుకు అధికారులు చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలవారీగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 4,495 మంది డ్రాపవుట్ల చిన్నారులకుగాను 2,222 మంది పిల్లలను స్కూళ్లలో చేర్చారు. రంగారెడ్డి జిల్లాలో 2,345 పిల్లలకుగాను కేవలం 262 మందిని స్కూళ్లలో చేర్చగా, 2,083 పిల్లలను ఇంకా చేర్పించాల్సి ఉంది. హైదరాబాద్‌లో 357 మందికిగాను కేవలం 33 మందిని చేర్పించగా, 324 మందిని ఇంకా చేర్పించలేదు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమశాఖ తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వచ్చే శని వారం నాటికి మిగిలిన 6,160 పిల్లలను స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
నక్కX నాగుపాము
హుస్నాబాద్ రూరల్ : కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం అంతకపేట శివారులోని ఓ నీళ్లు లేని బావిలో నక్క, నాగుపాము ఫైటింగ్ చేశారుు. 3 రోజు లుగా నక్క, నాగుపాములు బావిలోనే ఉంటూ ఫైటింగ్ చేసుకుంటున్నా యి. వీటిని గమనించిన రైతులు బయటకు ఎలా తీయూలోనని తర్జనభర్జన పడుతూ అటవీశాఖ అధికారులకు ఆదివారం సమాచారం అందించారు. కాగా అధికారులు వచ్చి నక్కను బయటకు తీశారు. పాము ఇంకా బావిలోనే ఉంది. -
కేంద్రం ఇస్తే గందరగోళమే
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకిచ్చే స్కాలర్షిప్ను నేరుగా అందించాలనే కేంద్ర ఆలోచనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్కాలర్‌షిప్‌లకు సంబంధించి విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్లలో జాతీయస్థాయిలో అనుసంధానం కష్టమని, దీంతో మంజూరులో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని రాష్ర్ట అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ (శాచ్యురేషన్ మోడ్‌లో) స్కాలర్షిప్లు అందుతున్నాయి. అయితే కేంద్ర మాత్రం దాదాపు 40 శాతం వరకే స్కాలర్షిప్లు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుండడంపై విద్యార్థుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా ఆయా రాష్ర్ట ప్రభుత్వాలకే పేరు వస్తోందని కానీ, పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్న తనకు మాత్రం ఏమీ ప్రయోజనం ఉండడం లేదని కేంద్రం భావిస్తోంది. తాను చేస్తున్న సహాయానికి సంబంధించి తగిన ప్రచారం రాకపోవడంతో నేరుగా విద్యార్థులు, కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేలాకేంద్రం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రానికి ఒక నోడల్ ఆఫీసర్‌ను, మళ్లీ జిల్లా స్థాయిల్లోనూ నోడల్ అధికారులను నియమించి వారి ద్వారా విద్యార్థుల వివరాలను పరిశీలించి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకి నగదును బదిలీ చేస్తామని చెబుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ఇప్పటివరకు ప్రకటించలేదు. నేషనల్ పోర్టల్‌లోకి మారాలి... ఎస్సీ విద్యార్థులు, కాలేజీల స్కాలర్షిప్లను కేంద్రమే నేరుగా చెల్లిస్తుందని, అందుకోసం నేషనల్ ఈ స్కాలర్షిప్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెన్నైలో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల సంక్షేమశాఖల సమీక్షా సమావేశంలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సూచిం చారు. దీనిపై రాష్ట అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ-పాస్ విధానం ద్వారా అవకతవకలు, అవినీతికి ఆస్కారం లేనివిధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలుచేస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు, ఆదాయ, కులధృవీకరణ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులతో విద్యార్థులు, కళాశాలల అకౌంట్ నంబర్లు అనుసంధానం వంటివి నేషనల్ పోర్టల్‌లో లేవని, అందువల్ల బోగస్‌ల నివారణ, నిజమైన లబ్ధిదారుల గుర్తింపు వంటివి పూర్తిస్థాయిలో సాధ్యం కాదని పేర్కొన్నారు. అయితే, ఈ విషయమై అభ్యంతరాలను రాతపూర్వకం గా అందిస్తే పరిశీలిస్తామని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ స్పందించింది. దాదాపు మూడునెలల క్రితం ఢిల్లీలో జరిగిన కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ నిర్వహిం చిన వివిధ రాష్ట్రాల ఎస్సీ సంక్షేమ శాఖల సమావేశంలోనూ రాష్ట్ర ఎస్టీశాఖ అధికారులు ఈ విషయంపై తమ అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ప్రస్తుతం తాము అవలంభిస్తున్న విధానం, ఆన్లైన్లో ఈ-పాస్ ద్వారా విద్యార్థులు, కాలేజీలకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గురించి వివరించారు. జాతీయస్థాయితో పాటు వివిధ రాష్ట్రాల్లోని విధానాల కంటే రాష్ట్రంలో అమలుచేస్తున్న ఈ విధానం బాగుందనే అభిప్రాయాన్ని కూడా కేంద్ర ఎస్టీశాఖ ఉన్నతాధికారులు వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా, తాము ఇంత మంది విద్యార్థులకు ఇస్తాం, రాష్ట్రం ఇంతమందికి ఇవ్వాలన్న విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి ఆదేశాలు అందలేదు. -
ఉద్యోగాలు తీసిన సెల్ఫీ
సెల్ఫీల మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం, ప్రాణాలు పొగొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడదే సెల్ఫీ పిచ్చితో బ్రిటన్‌లో ఇద్దరు పోలీసు అధికారులు ఏకంగా ఉద్యోగాలనే పొగొట్టుకున్నారు. ఆగస్టు 22న సోరేహమ్ ఎయిర్‌షోలో పాల్గొంటున్న హంటర్ జెట్ ఒకటి హైవేపై కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలవ్వగా, మరో 16 మంది గాయపడ్డారు. పేర్లు బయటకు రాలేదుగాని వరుసగా 23, 24 ఏళ్ల వయసున్న ఇద్దరు ప్రొబేషనరీ పోలీసు ఆఫీసర్లు ఘటనాస్థలికి చేరిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనకుండా ముందు సెల్ఫీలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. అవతల ప్రాణాలు పోతుంటే వీళ్ల సెల్ఫీల పిచ్చి ఏంటని ఒళ్లు మండిన ఎవరో దాన్ని వీడియో తీసి... ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు వీరిద్దరూ బాధ్యతారహితంగా వ్యవహరించారని, బాధితుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారని తేల్చారు. వీరిద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని సిఫారసు చేశారు. విషయం తెలుసుకున్న ఈ ప్రొబేషనరీ పోలీసు అధికారులు తామే రాజీనామా చేసి వెళ్లిపోయారు. -
వేయికాళ్ల మండపం నమూనాలు సిద్ధం
సాక్షి, తిరుమల: పునః నిర్మాణానికి వేయికాళ్ల మండపం నమూనాల చిత్రాలు సిద్ధమయ్యాయి. శ్రీవారి ఆలయం వద్ద చారిత్రాత్మక కట్టడమైన వేయికాళ్ల మండపాన్ని 2003లో కూల్చివేసిన సంగతి తెలిసిందే. అనేక వివాదాల అనంతరం ఈ మండపాన్ని ఆలయానికి నైరుతి దిశలోని నారాయణగిరి ఉద్యావనంలో పున ః నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కొత్త వేయికాళ్ల మండపంలోనే శ్రీపద్మావతి పరిణయోత్సవం వంటి ఉత్సవాల నిర్వహిస్తారు. మండపం చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక, భక్తి భావాలు స్పృశించేలా నిర్మించాలని అధికారులు సంకల్పించారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థలతో పలు నమూనాలు రూపొందింపచేశారు. దీనిపై శనివారం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, చీఫ్ ఇంజినీరు చంద్రశేఖరరెడ్డి తదితరులు చర్చించారు. తుది నమూనాను త్వరలోనే ఖరారు చేయనున్నారు. -
తెలంగాణ ఈ-పాస్‌కు ప్రశంసలు
దక్షిణాది రాష్ట్రాల సంక్షేమశాఖల కితాబు సాక్షి, హైదరాబాద్: సంక్షేమ, ఇతరత్రా పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-పాస్ విధానం బేషుగ్గా ఉందని వివిధ రాష్ట్రాల సంక్షేమ శాఖల నుంచి కితాబు లభించింది. ఈ విధానం ద్వారా పారదర్శకంగా ఈ పథకాల నిర్వహణకు ఆస్కారం ఏర్పడిందనే అభిప్రాయాన్ని కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఉన్నతాధికారులు సైతం వ్యక్తం చేశారు. శుక్రవారం చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్, డెరైక్టర్ల ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడంలో భాగంగా పలు అంశాల గురించి ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె.రే మండ్ పీటర్ తన ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జాతీయ స్థాయితో పాటు, మిగతా రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విధానాల కంటే ఇది మెరుగైన విధానమని కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులు, కళాశాలలకు నేరుగా కేంద్రం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చేసేందుకు వీలుగా ‘నేషనల్ ఈ స్కాలర్షిప్ పోర్టల్’లో చేరాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర సామాజికన్యాయ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు సూచించారు. తెలంగాణలో తాము పకడ్బందీ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనిలోకి మారడానికి ఉన్న ఇబ్బందులను రేమండ్‌పీటర్ వివరించారు. ఆయా అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. -
లైడార్ సర్వే వివరాలు సెన్సార్!
ప్రాణహితపై సర్వే అంశాలు యథాతథంగా ఇవ్వలేమంటున్న సర్వే ఆఫ్ ఇండియా సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పులో భాగంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీ పరివాహక ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో నిర్వహించిన లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లైడార్) సర్వే వివరాలను యథాతథంగా ఇచ్చేందుకు సర్వే ఆఫ్ ఇండియా కొర్రీలు పెడుతోంది. సర్వే ద్వారా తీసిన త్రీడీ, టోఫోగ్రఫిక్ చిత్రాలను అన్నింటినీ ఇవ్వడం కుదరదని, ఏ వివరాలు, ఎందుకు కావాలో కోరితే ఆ వివరాలే సమర్పిస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా ప్రభుత్వం చెక్లిస్ట్ని సర్వే ఆఫ్ ఇండియాకు పంపినట్లుగా తెలిసింది. గోదావరి నీటిని తీసుకునేందుకు ప్రతిపాదించిన కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఇచ్ఛంపల్లి మార్గాల వద్ద గత నెలలో మొదటి విడత లైడార్ సర్వే జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిడ్‌మానేరు నుంచి తడ్కపల్లి, పాములపర్తి, నిజాంసాగర్ల మధ్య రెండో విడత సర్వే కొనసాగుతోంది. సర్వేలో భాగంగా హెలికాప్టర్ ద్వారా లేజర్ కిరాణాలు పంపి దూరాలు, లోతును కొలిచే పనిని పూర్తిచేశారు. దీనిద్వారా సర్వే చేసిన ప్రాంతంలో రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంతో త్రీడీ చిత్రాలను తీయవచ్చు. తొలి విడత సర్వేలో ఈ ప్రక్రియంతా పూర్తయింది. అయితే ఈ వివరాలను పూర్తిగా ఇవ్వడానికి సర్వే ఆఫ్ ఇండియా ఒప్పుకోవడం లేదు. దీంతో అధికారులు తమ అవసరాలను పేర్కొంటూ సర్వే ఆఫ్ ఇండియాకు జాబితా పంపారు. వీటిని పరిశీలించాక సర్వే ఆఫ్ ఇండియా ఒక బ్యాచ్ నంబర్‌ను రాష్ట్రానికి ఇస్తుంది. నంబర్‌ను తీసుకొని కేంద్ర రక్షణ శాఖ వద్దకు వెళితే ఏయే వివరాలు కావాలో వాటిని మాత్రమే రాష్ట్రానికి ఇస్తారని తెలుస్తోంది. -
తాగరన్నా.. తాగి ఊగరన్నా!
♦ మందు కల్లు తాగాలని పల్లెల్లో దండోరా ♦ ఆరోగ్యం బాగవుతుందంటూ కల్లు వ్యాపారుల ప్రచారం ♦ మళ్లీ ‘మత్తు’లోకి జారుకుంటున్న జనం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘దుకాణంలకు పాత కల్లు (మందు కల్లు) మల్లొచ్చింది. మాపటీల నిదుర పట్టనోళ్లు.. బెత్తలి బెత్తలి జేసేటోళ్లు.. తలకాయ తిరిగేటొల్లొచ్చి కల్లు తాగితే మంచిగైతరు. దుకాణానికొచ్చి కల్లు తాగండహో...’ మెదక్ జిల్లాలోని పల్లెల్లో కల్లు దుకాణదారులు వేయిస్తున్న దండోరా ఇదీ! అంతుబట్టని బెత్తలి (హిస్టీరియా) రోగానికి మందు కల్లు దివ్యౌషధం అనే ప్రచారం జరుగుతోంది. కల్లు తాగితే కళ్లు తిరగడం పోతుందని, హిస్టీరియా దగ్గరకే రాదని దుకాణదారులు గ్రా మాల్లో దండోరా వేయిస్తున్నారు. ఇటీవల కృత్రిమ కల్లుపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి.. ఆల్ఫ్రోజోలం, డైజోఫాం వంటి మత్తు మందులను కలపకుండా కట్టడి చేసింది. దీంతో జిల్లాలో ఈ కల్లుతాగే అలవాటున్నవారు మత్తు లేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారు. కొందరు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మత్తు కల్లు జనానికి అందుబాటులోకి వచ్చింది. వైద్యుల శ్రమ వృథా.. పల్లెల్లో మళ్లీ మందు కల్లు కోరలు చాచడంతో వైద్యుల శ్రమంతా బూడిదలో పోసినట్లైంది. కల్లు బాధితులకు జిల్లా వైద్యులు అతి కష్టమ్మీద సాధారణ స్థితికి తీసుకొచ్చారు. వందల సంఖ్యలో రోగులకు వైద్యం చేసి పంపారు. ఇంకొద్ది రోజులు కల్తీకల్లు నివారించి ఉంటే వీరంతా ‘కల్లు బానిసత్వం’ నుంచి బయట పడేవాళ్లు. కానీ ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి రావడంతో మత్తు బారిన పడుతున్నారు. కడుపు నిండా మందు కల్లు తాగి కంటి నిండా నిద్రపోతున్నారు. మూమూళ్ల మత్తులో అధికారులు కల్లులో కలిపే మత్తు పదార్థాలను మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం జిల్లాలో ప్రత్యేక ముఠాలు పనిచేస్తున్నాయి. పారిశ్రామిక వాడల్లోని ఔషధ తయారీ పరిశ్రమల నుంచి వీటిని అక్రమంగా సేకరించి, జహీరాబాద్ చెక్ పోస్టు మీదుగా జిల్లాకు తరలిస్తున్నారు. ఈ నిషేధిత పదార్థాల రవాణాను అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం మామూళ్ల మత్తులో జోగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. -
రోజులో లక్ష మందికి దర్శనం సాధ్యమా?
♦ రికార్డుల కోసం భక్తులకు నరకం చూపిస్తున్న అధికారులు ♦ దారి తప్పిన మూడు క్యూల విధానం ♦ ఊపిరాడక అవస్థలు పడుతున్న భక్తులు ♦ లక్ష దాటించాలని చూస్తే తొక్కిసలాటలు తప్పవంటున్న నిపుణులు సాక్షి, తిరుమల: వెంకన్న సాక్షిగా.. తిరుమల ఆలయ నిర్మాణం, నిత్య పూజా, కైంకర్యాల పరంగా ఒక రోజులో లక్ష మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే పరిస్థితుల్లేవు. అయినా పదే పదే లక్ష మందికిపైగా దర్శనం కల్పించామని ఇటీవల ఆలయ అధికారులు గొప్పలు చెబుతున్నారు. ఈ రికార్డు కోసం భక్తులకు నరకం చూపిస్తూ ఆలయంలో గెంటేసే పరిస్థితులు పెరిగిపోయాయి. తోపులాటల మధ్య 90 వేలకు మించే ప్రశ్నేలేదు ఆలయంలో గతంలో అమలయ్యే క్యూల ప్రకారం రోజుకి కులశేఖరపడి నుంచి అయితే 27 వేలు, రాములవారి మేడ నుంచి అయితే 45వేలు (లఘుదర్శనం), జయవిజయులు నుంచి అయితే 90 వేల మందికి(మహాలఘు) దర్శనం కల్పించేవారు. సామూహికంగా కల్పించే దర్శన విధానం వల్ల తీవ్రస్థాయిలో తోపులాటలు, రోదనలతో భక్తులు స్వామిని దర్శించుకునేవారు. తోపులాటలు తగ్గించేందుకు గంటామండపంలో 2013లో మూడు క్యూల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక్కడ 12 ఇంచ్‌లు, 6 ఇంచ్‌లు, నేలమీద అన్నట్టుగా 3 క్యూలను ఏర్పాటు చేశారు. ఒక్క సెకను కూడా భగవంతుణ్ని చూసే అవకాశం ఇవ్వడం లేదని భక్తులువాపోతున్నారు. దారితప్పిన మూడు క్యూల విధానం: రద్దీ రోజుల్లో 90 వేల వరకు దర్శనం కల్పించే పరిస్థితి నుంచి మూడు క్యూల విధానంతో ఈ సంఖ్య 60 వేల నుంచి 70 వేల వరకు వచ్చింది. ప్రస్తుత టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు మూడు క్యూల విధానంలోని నిటారుగా ఉండే బల్లల్ని ఏటవాలు(ర్యాంపు పద్ధతి)గా మార్చడంతో ఈ సంఖ్య 80 వేల దాకా పెరిగింది. అంతవరకు బాగానే ఉంది. ప్రస్తుత ఆలయ అధికారులు రికార్డుల వేటలో పడ్డారు. ఫలితంగా మూడు క్యూల విధానంలోని భక్తులను కూడా ఇష్టానుసారంగా లాగేస్తున్నారు. ఎంత లాగినా మరో 5 నుంచి 10 వేలలోపే భక్తులకు దర్శనం కల్పించగలుగుతున్నారు. 90 వేలకు మించకపోయినా లక్ష మార్కును అధిగమించామని డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ లెక్కలు వెల్లడించారు. వాస్తవానికి ఈ 90 వేల మంది భక్తుల్లో ఎక్కువ మందికి స్వామి దర్శనం కంటే నరకం చూస్తున్నారు. 80 వేల నుంచి 90 వేలలోపు భక్తులకే ఇలాంటి ఇబ్బందులుంటే ఈ సంఖ్య లక్ష దాటించాలని చూస్తే తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రికార్డుల కోసం స్వామి కైంకర్యాల్లోనూ కోత: రద్దీ పేరుతో రికార్డు సంఖ్యలో భక్తులకు దర్శనం సంకల్పంతో అధికారులు సాక్షాత్త్తూ దేవదేవుడి నిత్యకైంకర్యాలకు ఎసరు పెడుతున్నారు. ఆగమ నిబంధనల ప్రకారం గరిష్టంగా 8, కనిష్టంగా 6 గంటల పాటు స్వామికి కైంకర్యాలు, విరామం ఉండాలి. ఆ సమయం 2 గంటలకు తగ్గించటం సాంప్రదాయం కాదని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజులో సుమారు 20 గంటలపాటు స్వామి వారి దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు. ఇందులో మధ్య మధ్యలో స్వామి వారికి విరామం సమయం ఉంటుంది. ఈ మొత్తం సమయంలో వీఐపీ దర్శనానికి రెండు గంటలు కేటాయిస్తున్నారు. ఈ సమయంలో సామాన్య భక్తులకు దర్శన భాగ్యం ఉండదు. వీఐపీ దర్శనం మొదటి ప్రాధాన్యతలో గంటకు సుమారు 150 మంది, రెండో ప్రాధాన్యతలో 250 మంది, మూడో ప్రాధాన్యతలో 350 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. మిగతా 18 గంటలు సామాన్య భక్తులకు కేటాయిస్తున్నారు. సామాన్య భక్తులు గంట సమయంలో దాదాపు 4 వేల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ లెక్కన రోజులో స్వామి వారిని దర్శించుకునే వీఐపీలు, సామాన్య భక్తుల సంఖ్య 70 నుంచి 80 వేల మధ్యనే ఉంటుంది. -
ఎత్తులు.. చిత్తులు
సాక్షి, హన్మకొండ : మల్లంపల్లి మైనింగ్ మాఫియా సంచనాలకు కేంద్రంగా మారుతోంది. హింసాత్మక సంఘటలు, అవినితీ వ్యవహరాలతో ఇటీవల మల్లంపల్లి చర్చనీయాంశంగా మారింది. మైనింగ్ కంపెనీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు చిలికిచిలికి గాలివానగా మారింది. సహాజవనరులను ఇష్టారీతిగా కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు చూసీ చూడనట్లుగా వ్యవహారిస్తున్నాయి. మల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇంజినీరింగ్ కాలేజీ భవనాలకు వెనకవైపు ఎస్సారెస్పీ కాలువ సమీపంలో 15 కంపెనీలు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ మైనింగ్‌లో తవ్విన ఎర్రమట్టిని తరలించడనికి సరైన రోడ్డు మార్గం లేదు. ఎర్రమట్టిని తరలించేందుకు అటవీశాఖ భూముల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో అటవీశాఖ అధికారుల చేతులు తడిపి ఫారెస్టు భూముల నుంచి లారీలను నడిపించారు. ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ ఓ ఫారెస్టు రేంజి అధికారి ఎర్రమట్టి రవాణాకు దారి అనుమతి లేదంటూ కొన్నాళ్ల పాటు లారీలను అడ్డుకున్నాడు. ఇక్కడి మైనింగ్ కంపెనీల మధ్య వ్యాపార సంబంధమైన పోటీని ఆసరగా చేసుకుని ఎక్కువ ముట్టచెప్పిన వారికే అనుమతి ఇస్తానంటూ బేరం పెట్టాడు. చివరికి కొందరు మైనింగ్ వ్యాపారులు బృందంగా ఏర్పడి సుమారు రూ.12 లక్షలు సదరు అధికారికి సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కరికే అనుమతి సిన్సియర్ అధికారిగా కలరింగ్ ఇచ్చి మైనింగ్ మాఫియాలో ఒక వర్గాన్ని తన దారిలోకి తెచ్చుకుని బహుమతి అందుకున్న అధికారి తీరులో మార్పు వచ్చింది. తనకు నజరాన ముట్టచెప్పిన కంపెనీల వ్యాపారం చక్కగా సాగేందుకు అటవీ భూమికి పక్కన ఉన్న రైతుల నుంచి స్థలాలను కొన్నట్లుగా సుమారు 15 ఎకరాలకు సంబంధించి నకిలీ పత్రాలను అవినీతి ఫారెస్టు అధికారి సృష్టించినట్లుగా తెలుస్తోంది. నెలవారీగా రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు ముడుపులు అందుతుండటంతో ఈ విషయం బయటకు రావడంలేదు. కొందరు వ్యాపారుల లారీలకు అనుమతి ఇచ్చి.. మిగిలిన మైనింగ్ కంపెనీల రవాణాను అడ్డుకోవడంతో ఇక్కడ మైనింగ్ వ్యాపారుల మధ్య పోరు మొదలైంది. ఫారెస్టు అధికారి అండతో తమ వ్యాపారాలను అడ్డుకుంటున్న ఎదుటి వర్గం ఆట కట్టించేందుకు వీరు గట్టిగానే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కోవలోనే ఇటీవల జిల్లాలో సంచనాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదేతీరు జాతీయ రహదారి(163) నుంచి మల్లంపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో నుంచి మైనింగ్ కార్యకలాపాలకు అటవీశాఖ అడ్డదారి చూపింది. అటవీభూమి కంపార్ట్మెంట్ నెంబర్ 599, 600ల నుంచి క్వారీలకు వందలాదిగా లారీలు వచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇదేమంటే సదరు భూ భాగాన్ని సోషల్ ఫారెస్ట్‌కు లీజుకు ఇచ్చారని.. దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్లదేనంటూ అటవీశాఖ సెలవిస్తోంది. ఎర్రమట్టి లోడుతో వెళ్తున్న భారీ వాహనాలు ఎస్సారెస్పీ కాలువ మీదుగా వెళ్తున్నాయి. దీంతో కాలువ కుంగి పోతోందని రైతులు పేర్కొంటున్నారు. ఓవర్లోడ్లతో లారీలు వెళ్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఓవర్‌లోడు వాహనాల వల్ల మల్లంపల్లి నుంచి రాంచంద్రాపురం వరకు రోడ్డు అడుగుకో గుంత అన్న పరిస్థితి ఉంది. నిత్యం లారీల రద్దీతో పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి, మిరప తోటలపై ఎర్రని దుబ్బ అలముకుని మొక్కలు చనిపోతున్నాయని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక ప్రతీ ఏటా ఇబ్బందులు పడుతున్నా... ఎవరూ పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఈ విషయంలో పలుసార్లు అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. పచ్చని చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ చేయాల్సిన సోషల్ ఫారెస్ట్ అధికారులు కాసులకు కక్కుర్తిపడి మాఫియాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మైనింగ్‌ను అరికట్టాల్సిన అవసరముంది. -
ఎక్కడి ఫైళ్లు అక్కడే!
గాడితప్పిన పంచాయతీ పాలన ఆరు నెలలుగా ఇన్చార్జే దిక్కు కార్యాలయాల్లో సిబ్బంది హవా నూతన డీపీవో రాకతోనైనా పాలన చక్కబడేనా! మచిలీపట్నం : పంచాయతీల్లో పాలన గాడి తప్పింది. జిల్లా పంచాయతీ అధికారి పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉండటంతో పాలనను పట్టించుకునే వారే కరువయ్యారు. కీలక ఫైళ్లు అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇన్చార్జ్ డీపీవోగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్.వి.వి.సత్యనారాయణ కొనసాగుతున్నారు. రెగ్యులర్ డీపీవో లేకపోవడంతో పంచాయతీ కార్యాలయ సిబ్బంది తమ చిత్తానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాసులు ఇస్తేనే ఫైళ్లు కదిలే విధంగా డీపీవో కార్యాలయంలో పరిస్థితి తయారైంది. గత నెలలో జరిగిన పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో కార్యాలయ సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరించి లక్షలాది రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో డీపీవోగా పనిచేసిన నాగరాజువర్మ ఏసీబీకి చిక్కడంతో ఆ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఆరు నెలలుగా డీపీవోగా రెగ్యులర్ అధికారి లేకపోవడంతో కార్యాలయంలో పనిచేసే సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు చెప్పిందే వేదంగా నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో ఎవరికి వారు పెత్తనం చేయడం, ఇష్టానుసారంగా ఫైళ్లను నడపడం, అందినకాడికి దండుకోవడం నిత్యకృత్యమనే వాదనలు ఆశాఖ అధికారులు, సిబ్బంది నుంచే వినిపిస్తున్నాయి. నెలల తరబడి పెండింగ్‌లోనే ఫైళ్లు జిల్లాలో 970 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 153 మేజర్ పంచాయతీలు. గత ఏప్రిల్ నుంచి పారిశుధ్య కార్మికులు, పంపు ఆపరేటర్లు, కాంట్రాక్టు విద్యుత్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధిం చిన ఫైళ్లన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయ. రూ.2 లక్షల్లోపు పంచాయతీ ఖర్చు ఉంటే డీపీవో స్థాయిలో బిల్లులు చేసే అధికారం ఉంది. రూ.2 లక్షలకు మించి బిల్లులు చెల్లించాల్సి వస్తే కలెక్టర్‌కు ఈఫైళ్లను పంపి ఆమోదం పొందాల్సి ఉంది. గత ఆరు నెలలుగా ఇన్చార్జ్ డీపీవోనే ఉండటంతో మేజర్ పంచాయతీలకు సంబంధించిన బిల్లులకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్‌లోనే ఉన్నట్లు ఆశాఖ సిబ్బంది చెబుతున్నారు. పంచాయతీ సాధారణ నిధుల్లో 30 శాతానికి మించి పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రస్తుతం స్వచ్ఛభారత్ తదితర కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో మేజర్, మైనర్ పంచాయతీల్లో పారిశుధ్య చర్యలకు 30శాతాని కన్నా మించి ఖర్చులు అవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. పంచాయతీలకు సంబంధించిన బిల్లులు పెండిం గ్లో ఉండడం, కొన్ని పంచాయతీల్లో సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వడం తదితర అంశాలపై కలెక్టర్‌కు పూర్తిస్థాయిలో వివరించి ఆ బిల్లులు పాసయ్యేలా ఒప్పించే అధికారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంచాయతీల్లో ఏమైనా పనులు చేయాలంటే ముందు, వెనుక ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. డీపీవో రాకతోనైనా పరిస్థితి మారేనా! జిల్లా పంచాయతీ అధికారిగా వి.కృష్ణకుమారిని ప్రభుత్వం నియమించింది. ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు పంచాయతీ వర్గాలు తెలిపాయి. అయితే కలెక్టర్ బాబు.ఎ అందుబాటులో లేకపోవడంతో గురువారం డీపీవో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. గతంలో మచి లీపట్నం డీఎల్పీవోగా ఆమె పనిచేశారు. డీపీవో కార్యాలయం నుంచే పాలన కొనసాగించడంతో ఈ కార్యాలయంలో సిబ్బంది వ్యవహారశైలి తదితర అంశాలపై అవగాహన ఉంది. ప్రస్తుతం డీపీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల హవా కొనసాగుతోంది. ఇటీవల పంచాయతీరాజ్ విభాగంలోని ఉద్యోగులందరికీ బదిలీ జరిగినా ఈ ఇద్దరు మాత్రం ఇక్కడే కొనసాగుతున్నారు. వారు వచ్చిన ప్రతి అధికారిని ప్రసన్నం చేసుకుని తమ హవా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీల్లో పాలన గాడిలో పెట్టేం దుకు డీపీవో కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బం దిని ముందస్తుగా ప్రక్షాళన చేస్తే కొంత ప్రయోజనం ఉంటుందనే వాదన వ్యక్తమవుతోంది. నూతన డీపీవోగా బాధ్యతలు స్వీకరించనున్న కృష్ణకుమారి ఏ మేరకు వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే. -
ఫిబ్రవరిలో ముహూర్తం?
♦ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం ♦ అధికారుల కసరత్తు ♦ అభిప్రాయ సేకరణకు సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. 2016 ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికలు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 15లోగా ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. విభజనలో జాప్యంతో ఈ గడువులో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. పునర్విభజనలో భాగంగా డివిజన్ల సంఖ్యలో మార్పులు చోటు చేసుకోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ కోసం త్వరితంగా పనులు పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. విభజన, వార్డు రిజర్వేషన్లు ఖరారు చేసి... వీలైనంత త్వరితంగా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారు. జీహెచ్ ఎంసీ హైకోర్టుకు నివేదించిన సమాచారం మేరకు.. డీలిమిటేషన్ నుంచి రిజర్వేషన్ల ఖరారు వరకు 172 రోజులు అవసరం. అనంతరం ఎన్నికలకు మరో 45 రోజులు పడుతుంది. వీటిలో చట్టప్రకారం తప్పనిసరిగా గడువివ్వాల్సిన రోజులు పోను... మిగతా అంశాలను త్వరితంగా పూర్తి చేస్తే... ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహిస్తారనే ది విశ్వసనీయ వర్గాల సమాచారం. డివిజన్లను 150కే పరిమితం చేస్తున్న సంగ తి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఇప్పటికే కసరత్తు పూర్తయినందునముసాయిదాను ప్రజల ముందుకు తెచ్చేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. పది రోజుల్లో విభజన ముసాయిదాను ప్రజల ముం దుకు తెచ్చి... అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని కమిషనర్ సోమేశ్ కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. కొన్ని డివిజన్లలో పెద్దగా మార్పులు అవసరం లేదని... కొన్నిటిలో ఎక్కువ మార్పులకు అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. 2011 లెక్కల మేరకు గ్రేటర్ జనాభా 67,31,790. 150 డివిజన్లనే హేతుబద్ధీకరిస్తే ఒక్కో డివిజన్‌కు సగటున (పది శాతం మేరకు వ్యత్యాసం ఉండవచ్చు) 44,879 మంది ఉండాలి. ఈ మేరకు ఇప్పటికే ముసాయిదాలు... డివిజన్ మ్యాపులు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొదలుపెట్టాం... ైెహ కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా డీలిమిటేషన్ పని ప్రారంభించామని కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. డివిజన్ల విభజన, పోలింగ్ స్టేషన్ల ఎంపిక పూర్తయ్యాక రిజర్వేషన్ల పనులు ప్రారంభిస్తామన్నారు. తిరిగి 150 డివిజన్లే చేయాల్సి వచ్చిన విషయమై హైకోర్టుకు నివేదించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని డివిజన్లలో పెద్దగా మార్పులు అవసరం లేదు. ఉదాహరణకు కోర్ ఏరియాలోని సర్కిల్-7ను పరిగణనలోకి తీసుకుంటే... పరిపాలన సౌలభ్యం దృష్ట్యా దీన్ని7-ఎ, 7-బిగా విభజించారు. ఒకే సర్కిల్‌గా ఉన్నప్పుడు 16 డివిజన్లు ఉండగా... విభజించాక రెండింటిలో కలిసి 16 డివిజన్లే ఉన్నాయి. కాకపోతే ఒక సర్కిల్లో 7... మరో సర్కిల్లో 9 డివిజన్లు రానున్నాయి. ఈమేరకు ముసాయిదా మ్యాపులు రూపొందించినట్లు తెలిసింది. ఈ సర్కిళ్లలోని డివిజన్లు నిర్ణీత జనాభాకు అనుగుణంగా ఉండటంతో పెద్దగా విభజించాల్సిన పని పడలేదు. సర్కిల్-7 ఎ, 7బిలోకి దిగువ పేర్కొన్న డివిజన్లు వచ్చే అవకాశం ఉంది. సర్కిల్ 7 -ఎలోకి రానున్న డివిజన్లు 1.అహ్మద్‌నగర్, 2.ఆసిఫ్‌నగర్, 3.మల్లేపల్లి, 4.మెహదీపట్నం (పాక్షికం), 5.మురాద్‌నగర్, 6. రెడ్‌హిల్స్, 7.విజయనగర్‌కాలనీ. సర్కిల్ 7-బి లో... 1.దత్తాత్రేయ నగర్, 2.గుడిమల్కాపూర్, 3.కార్వాన్, 4.లంగర్‌హౌస్, 5.మంగళ్‌హాట్, 6.మెహదీపట్నం (పాక్షికం), 7. టోలిచౌకి, 8.జియాగూడ, 9.నానల్‌నగర్. మెహదీపట్నం రెండు సర్కిళ్లలోనూ ఉండటం గమనార్హం. సాధారణంగా విభజన పూర్తయ్యాక వార్డుల వారీగా ఎన్నికల జాబితా తయారీకి 72 రోజులు పడుతుంది. అనంతరం రిజర్వేషన్లకు బీసీ గణన తదితరమైన వాటికి మరో 102 రోజులు అవసరమని అధికారులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఎటొచ్చీ ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. లేనిపక్షంలో కనీసం ఆలోగా ఎన్నికల షెడ్యూలునైనా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్15లోగా ఎన్నికలు పూర్తి చేయలేకపోవడానికి గల కారణాలను కోర్టుకు నివేదిస్తూ, మరికొంత గడువు కోరే అవకాశాలు ఉన్నాయి. -
ఆ ఇద్దరిది ఆరు వందల కోట్ల టార్గెట్...!
పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు హడలెత్తిస్తున్నారు. వారు ఇప్పుడు దేన్నీ వదలడం లేదు. మరీ చిన్నచిన్న విషయాలను కూడా వదలడం లేదేంటని సన్నిహితులు అడిగినప్పుడు.. ఆరు వందల కోట్ల టార్గెట్ రీచ్ కావాలని బహిరంగంగానే చెప్పేస్తున్నారట. వీరిద్దరూ జిల్లాలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. అధికారులపై దాడులకు సైతం వెనుకాడకుండా అందినకాడికి కాజేస్తున్న వారు ఒకరైతే అధికార, అనధికార కార్యక్రమం ఏదైనా సరే శిలాఫలకంపై పేరు లేకపోతే గడ్డపారతో పగులగొడతానని బెదిరిస్తుంటారు ఇంకొక నేత. ఒకాయన 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంటే...! మరో నేత వంద కోట్ల టార్గెట్ పెట్టుకున్నారట. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వీరు సంపాదనలో మునిగిపోయారు. ఇసుక నుంచి అధికారుల బదిలీల వరకు అన్నింటిలోనూ తమ తడాఖా ఏంటో చూపిస్తున్నారు. గడచిన 16 నెలల కాలంలోనే రెండు వందల కోట్లకు తగ్గకుండా ఒకాయన వెనుకేసుకోగా...! రెండో నేత కూడా టార్గెట్‌లో సగం తన ఖాతాలో వేసుకున్నాడు. వీరి అగడాలకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ టార్గెట్ గొడవలో తాము బలవుతున్నామని వారంతా మిగతా నాయకులకు మొరపెట్టుకుంటుంటే... అధినేతకు కప్పం కట్టగా మిగిలిన దాంట్లో టార్గెట్ రీచ్ కావడమంటే ఈ గొడవలు తప్పదని ఆ నేతలిద్దరూ నిర్మొహమాటంగా సెలవిస్తున్నారట.!!! -
ఇంకెన్నాళ్లో?
కొలిక్కిరాని ఇన్పుట్ సబ్సిడీ జాబితా కాలయాపన చేస్తున్న అధికారులు ఆందోళనలో రైతన్నలు అనంతపురం అగ్రికల్చర్ : ఇన్పుట్ సబ్సిడీ జాబితా తయారీలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఖరీఫ్ 2014 లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) కింద పరిహారం విడుదలై రెండు నెలలు గడుస్తున్నా, జాబితా ఇప్పటికీ కొలిక్కిరావడం లేదు. 2014 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5.81 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, నష్టపోయిన 5.79 లక్షల మంది రైతులకు ఈ సంవత్సరం జూలై 22న ప్రభుత్వం రూ.567.32 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది. అయితే నకిలీ పాసుపుస్తకాలున్నాయంటూ కొన్ని రోజుల పాటు అధికారులు పాసుపుస్తకాల పరిశీలనలో మునిగిపోయారు. పరిశీలన పూర్తయ్యాక 7,529 మంది రైతులను ఇన్పుట్ సబ్సిడీకి అనర్హులుగా పరిగణించి వారికి ఇవ్వాల్సిన రూ.7.64 కోట్లు పరిహారాన్ని ఇప్పటికే వెనక్కు పంపారు. ఆ తర్వాత మండలాల వారీగా రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం ప్రారంభించారు. అయితే ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమం కొలిక్కిరాక కుస్తీలు పడుతున్నారు. ఈ సారి ఆధార్ నంబరు తప్పనిసరి కావడంతో సమస్య ఏర్పడింది. ఇష్టారాజ్యంగా ఆధార్ నంబర్లు నమోదు చేయడంతో జాబితాలు తప్పులతడకగా మారాయి. 80 శాతం అప్లోడ్ పూర్తైదని, రెండు మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు 15 రోజులుగా చెబుతూ వస్తున్నారు. కానీ... వాస్తవ పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి. జాబితా పూర్తి కావడానికి ఇంకా 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన దసరా పండుగకు కానీ రైతుకు పరిహారం అందే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి రూ.460 కోట్ల పరిహారం ఇవ్వడానికి వీలుగా 4.75 లక్షల మంది రైతులకు సంబంధించి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు జాబితా తయారు చేశారు. ఇంకా రూ.100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన 97 వేల మంది రైతుల వివరాలు జత కావడం లేదు. ఇది కొలిక్కిరావాలంటే తీవ్రం గా శ్రమించాల్సిన పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో ఈ ఏడా ది జిల్లాకు విడుదలైన మొత్తం రూ.567 కోట్ల పరిహారంలో చివరికి రూ.70 నుంచి 80 కోట్లు పంపిణీ కాకుండా ప్రభుత్వానికి వెనక్కి వెళ్లే పరిస్థితులు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన చాలామంది రైతులకు పరిహారం అందేది ప్రశ్నార్థకంగా మారింది. -
అక్రమార్కులకు చెక్‌పడేనా..?
- మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో సాధ్యంకాని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ - క్రమబద్ధీకరణకు ఈ నెల 27 చివరి తేదీ - ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగింపు - అయినప్పటికీ స్పందించని అక్రమార్కులు - నోటీసుల జారీకే పరిమితమైన అధికారులు మార్కాపురం : జిల్లాలోని మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు.. క్రమబద్ధీకరణకు గడువు తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదు. ప్రధానంగా డివిజన్ కేంద్రమైన మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ అటకెక్కింది. జూలైలో ప్రారంభమైన అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించారు. ఈ నెల 27వ తేదీతో క్రమబద్ధీకరణకు గడువు ముగియనుంది. అయినప్పటికీ అక్రమ కట్టడాల యజమానుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. అపరాధ రుసుంతో క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు... పురపాలక సంఘం పరిధిలో జనవరి 1, 1985 నుంచి డిసెంబర్ 31, 2014 వరకు మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మిం చుకున్న కట్టడాలను క్రమబద్ధీకరించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందు కోసం అపరాధ రుసుం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం 100 చ.మీటర్ల వరకు వ్యక్తిగత నివాస భవనాలకు, వాణిజ్యేతర భవనాలకు చదరపు మీటర్‌కు 40 రూపాయలు, 100 నుంచి 300 చదరపు మీటర్ల వరకు రూ.60 చెల్లించాలని పేర్కొన్నారు. అతిక్రమణ 30 శాతంలోపు అయితే 300 నుంచి 500 చదరపు మీటర్లకు రూ.50 చెల్లించాలని, 30 శాతం పైన అయితే రూ.100 చెల్లించాలని పేర్కొన్నారు. పీనలైజేషన్ చార్జీల కింద రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చదరపు గజానికి రూ.25 వేలు దాటితే వందశాతం చార్జీ చెల్లించాలని పేర్కొన్నారు. 50 శాతం కూడా దాటని క్రమబద్ధీకరణ... మార్కాపురం పట్టణంలో 187 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ, ఇప్పటివరకూ 56 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిద్వారా రూ.5.60 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. అదే విధంగా గిద్దలూరు మున్సిపాలిటీలో 115 అక్రమ కట్టడాలున్నట్లు గుర్తించగా, 70 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. క్రమబద్ధీకరణ పూర్తిస్థాయిలో అమలైతే రెండు మున్సిపాలిటీల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.40 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ, అధికారులు కేవలం నోటీసుల జారీకే పరిమితం కావడం, తదుపరి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో అక్రమ కట్టడాల యజమానుల్లో స్పందన లేకుండాపోయింది. యథేచ్ఛగా అక్రమ కట్టడాలు... మార్కాపురం పట్టణంలో 32 వార్డులు, గిద్దలూరు పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. మార్కాపురంలో మున్సిపల్ రికార్డుల ప్రకారం 17,464 కుటుంబాల వారు నివసిస్తున్నారు. 22.85 చ.కి.మీ.మేర పట్టణం విస్తరించి ఉంది. నిబంధనల ప్రకారం మార్కాపురం మున్సిపాలిటీలో జీప్లస్ వన్ భవనాన్ని నిర్మించుకునేందుకు అనుమతిస్తారు. జీ ప్లస్ 2 భవనాన్ని నిర్మించుకోవాలంటే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మున్సిపాలిటీకి సదరు భవనాన్ని మార్టిగేజ్ చేయాలి. 300 స్క్వేర్ మీటర్ల నుంచి 1000 స్క్వేర్ మీటర్ల వరకు నిర్మించే భవనానికి గుంటూరు రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ నుంచి అనుమతి పొందాలి. 1000 స్క్వేర్ మీటర్లు దాటితే (4 అంతస్తులపైన) హైదరాబాదులోని మున్సిపల్ డెరైక్టర్ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి. దినదినాభివృద్ధి చెందుతున్న మార్కాపురం మున్సిపాలిటీలో మూడేళ్ల నుంచి అపార్ట్మెంట్ నిర్మాణాలు ఊపందుకున్నాయి. వాటిలో ఎక్కువ శాతం నిబంధనలకు విరుద్ధంగా సరైన అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు. నోటీసులు జారీ చేశాం అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ఈ నెల 27 వరకు ప్రభుత్వం గడువిచ్చింది. ఇప్పటి వరకు అక్రమ భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసి క్రమబద్ధీకరించుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అందుకోసం వార్డుల వారీగా అక్రమ కట్టడాల వివరాలు సేకరిస్తున్నాం. - వివేకానంద, టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్, మార్కాపురం మున్సిపాలిటీ -
ప్రయాణం..ప్రమాదం
రహదారులు రక్తమోడుతున్నాయి.. వాహనాలు మృత్యు శకటాలవుతున్నాయి.. రోడ్డెక్కితే ఇంటికి చేరే వరకు ప్రాణాలకు గ్యారంటీ లేదు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి వద్ద బూడిద లారీ ప్రమాదంతో 16 మంది మృతి చెందారు. కె.కోటపాడు మండలంలో బ్రాండిక్స్ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో 28మంది గాయపడ్డారు. ప్రతి రోజూ ఏదో ఒక ప్రమాదం ప్రాణాలను హరిస్తోంది. ఈ పాపం ఎవరిది? అజాగ్రత్తగా ఉన్న ప్రజలదా.. నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానిదా.. నిబంధనలు పాటించని వాహన చోదకులదా? మర్రిపాలెం, నక్కపల్లి, పాడేరు : రోడ్డు ప్రమాదం జరిగితే పరుగులు తీస్తారు.. మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామంటారు.. బాధితులకు పరిహారం ప్రకటిస్తారు.. ఇదో ప్రహసనం.. ఎన్ని ప్రమాదాలు జరిగినా పాఠం నేర్వని జడత్వం.. అధికారులు, నాయకులు ఇదే తీరున వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2014లో దాదాపు 1,250కి పైగా ప్రమాదాలు జరిగాయి. 330 మంది మృతి చెందగా, 940 మంది క్షతగాత్రులుగా మిగిలారు. వీరిలో 75 మంది రవాణా తరహా వాహనాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకోగా 250 మందికి పైగా చికిత్స అందుకున్నారు. 2015 ఆగస్టు నాటికి సుమారు 900 ప్రమాదాలు చోటుచేసుకోగా 235 మంది మృతి చెందారు. ఇంకా 660 మంది గాయపడ్డారు. వీరిలో రవాణా వాహనాల ప్రమేయంతో 68 మంది మృతి చెందగా 150 మంది క్షతగాత్రులయ్యారు. సరకు రవాణా వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రవాణా వాహనాలు నిబంధనలు ఉల్లంఘించినా ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్టు ఉండటంతో ప్రాణనష్టం జరుగుతోంది. ఘాట్ రోడ్.. ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు పరిమితికి మించిన ప్రయాణికులతో రవాణా సాగిస్తున్నాయి. కొండలు, గుట్టలపై ఘాట్ రోడ్డులలో ఈ వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. వాయు వేగంతోపాటు ఓవర్లోడింగ్ ప్రమాదాలకు కారణమవుతోంది. పదిమందికి మాత్రమే సరిపడే వాహనాలలో ముప్ఫై, నలభై మందిని ఎక్కించి ప్రైవేటు ఆపరేటర్లు వాహనాలను నడుపుతున్నారు. వీటికి అనుమతులు ఉన్నాయో లేదో చూసే నాధులే కరువయ్యారు. అప్పుడప్పుడు పోలీసుల తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. క్షతగాత్రులు విశాఖపట్నం తరలించేలోగా మృత్యువాత పడుతున్నారు. పెదబయలు మండలం రూఢకోట సమీపంలో రెండు వారాల క్రితం జీపు బోల్తా పడిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన రూఢకోట పీహెచ్సీ ల్యాబ్ టెక్నీషియన్ చికిత్స కోసం విశాఖపట్నం తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఇటీవల జీకేవీధి మండలం జర్రెల ఘాట్ రోడ్డులో జీపు బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు గిరిజనులు మృతి చెందారు. పాడేరు ఘాట్‌లో మార్చి నెల 25న పెదకోడాపల్లి వద్ద జరిగిన రెండు జీపు ప్రమాదాల్లో ఒక మహిళ, మరో గిరిజనుడు మృతి చెందారు. రవాణా శాఖ నిఘా లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువయ్యాయి. హైవేలో ఉల్లంఘనలు... జాడలేని పెట్రోలింగ్ జాతీయ రహదారులపై లారీలు, ఇతరత్రా రవాణా వాహనాలలో ప్రయాణాలు డ్రైవర్లకు, క్లీనర్లకు కలిసి వస్తోంది. ఆర్టీసీ ధరలతో పోల్చితే లారీలలో ప్రయాణం తక్కువ ఖర్చుగా ఉంటోంది. దీంతో గ్రామీణులు, కూలీలు ఆసక్తి చూపుతున్నారు. డ్రైవర్ క్యాబిన్, వెనుక భాగంలో కూర్చోబెట్టి ప్రయాణికులను తరలిస్తున్నారు. వాహనాల మితిమీరిన వేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ తదితర చర్యలకు చెక్ పెట్టాల్సిన పెట్రోలింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో దాదాపు 150 కిలోమీటర్ల పొడవుతో హైవే ఉంది. నిత్యం ఎక్కడోచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. విచ్చలవిడిగా మద్యం దుకాణాలు హైవేలలో అర్ధరాత్రి వరకు తెరచి ఉన్న డాబాలు, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మద్యం దుకాణాల వల్ల డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం. ఉత్తుత్తి విశ్రాంతి గదులు హైవేలలో ప్రతి 50, 100 కిలో మీటర్లకు వి శ్రాంతి గదులు ఏర్పాటు చేస్తామని చేసిన ప్ర భుత్వ ప్రకటన అమలుకు ఇంతవరకు చర్యలు మొదలు కాలేదు. వీటిని ఎక్కడ ఎలా నిర్మిస్తారన్న విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావించలేదు. విశ్రాంతి గదులు ఎవరి సహకారంతో నిర్మిస్తారు.. ఎవరు పర్యవేక్షిస్తారన్న విషయంలో స్పష్టత లేదు. అటకెక్కిన డబుల్ డ్రైవర్స్ నిబంధన: నేషనల్ పర్మిట్ లారీలలో డబుల్ డ్రైవర్ నిబంధన అమలు జరగాలి. అయితే అంతర్రాష్ట్ర వాహనాలలో డబుల్ డ్రైవర్ నిబంధన ఉల్లంఘిస్తున్నారు. 10 శాతం వాహనాలలో కూడా డబుల్ డ్రైవర్ విధానం అమలు జరగడం లేదు. ఉత్తరాది రాష్ట్రాలలో డ్రైవర్ నిబంధన వర్తిస్తున్నా తెలుగు రాష్ట్రాలలో ఆ జాడ లేదు. ప్రమాద ప్రాంతాలలో ప్రత్యేక నిఘా జిల్లాలో ప్రమాద కూడళ్లు, ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అటువంటి ప్రాంతాలలో నిఘా ఉంటుంది. రాంగ్ రూట్ డ్రైవింగ్, అతి వేగం అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రమాదాల నియంత్రణకు చొరవ చూపుతాం. రవాణా వాహనాలలో ప్రయాణికులను తరలించడం పట్ల ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేసి నియంత్రిస్తాం. -ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ ట్రామాకేర్ ఎక్కడ? నక్కపల్లిలో రూ.70 లక్షల వ్యయంతో 30 పడకల ఆస్పత్రి నిర్మించినా.. ట్రామా కేర్ సెంటర్ లేక అత్యవర వైద్యం అందడం లేదు. కనీసం అంబులెన్స్‌కూడా ఉండదు. 108 వాహనం వచ్చేలోపు ప్రాణాలు పోతున్నాయి. గత ఏడాది గొడిచర్ల వద్ద ఆగిఉన్న లారీని ఇన్నోవా ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన రవిసుధాకర్ నక్కపల్లిలో సరైన సదుపాయంలేక విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నక్కపల్లి గురుకుల పాఠశాల ఎదురుగా రోడ్డుపై నిలుచున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని నక్కపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు బలమైన గాయాలు తగలడంతో సరైన వైద్యం అందక ఇద్దరూ మరణించారు. విశాఖ-పాయకరావుపేటల మధ్య 100 కిలోమీటర్ల దూరం ఉంది. 3 గంటలపాటు ప్రయాణించాలి. ఈమధ్యలో ఎక్కడా సరైన ఆస్పత్రి, ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం గమనార్హం. 40 కిలోమీటర్లకు ఒక పెట్రోలింగ్ వాహనాన్ని సమకూర్చారు. రెండు మండలాలకు ఒక 108 వాహనం ఉంది. ఇది ఎక్కడైనా అత్యవసర కేసుకు అటెండ్ అయిన సందర్భంలో ప్రమాదం జరిగితే ప్రైవేటు వాహనాలే గతి. -
అధ్వాన్న రోడ్డు భార్యను మింగేస్తే.. పోలీసులు భర్తను బుక్ చేశారు
బెంగళూరు: ఐటి నగరం బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అధ్వాన్నమైన, గుంతలు తేలిన రోడ్లు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను పొట్టన పెట్టుకున్నాయి. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడిన ఆ మహిళ భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. స్థానిక సంస్థల అధికారులపై విరుచుకుపడుతున్నారు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌కు చెందిన. 25 సం.రాల స్తుతి పాండే, ఓం ప్రకాశ్ ఇద్దరూ భార్యభర్తలు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ బైక్‌పై వెళుతుండగా రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో వెనక కూర్చున్న స్తుతి కిందపడటంతో, ఆమెకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో పోలీసులు ఓం ప్రకాశ్ పై హత్య కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై బెంగళూరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్వాన్నంగా తయారైన రోడ్లను బాగు చేయని స్థానిక అధికారులపై మండిపడుతున్నారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అధికారులను వదిలేసి, అమాయకుడైన భర్తపై కేసు నమోదు చేయడం పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పోలీసు అధికారులు మాత్రం తమ వైఖరిని సమర్ధించుకున్నారు. ఈ కేసును రోడ్డు ప్రమాదం కేసుగా పరిగణించి, డ్రైవర్‌గా ఉన్న ఓం ప్రకాశ్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణ తర్వాత అసలు విషయం తేలుతుందంటున్నారు. కాగా దీనిపై కర్ణాటక ప్రభుత్వం సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, పరిస్థితిని సమీక్షించింది. ఈ సంఘటనపై విచారణ చేపట్టి, తగినచర్యలు తీసుకుంటామని రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు అక్టోబర్ 21 నాటికల్లా నగరంలోని పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. -
అంతా డొల్ల!
నరసరావుపేట రూరల్ : సాగర్ ఆధునికీకరణ పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. చిలకలూరిపేట మేజర్‌కు విడుదల చేసిన నీటితో కాలువకు పలుచోట్ల లీకులు ఏర్పడ్డాయి. 200 క్యూసెక్కుల నీటికే ఈ పరిస్థితి ఏర్పడితే.. సామర్ధ్యం మేర నీరు వదిలితే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 18న బుగ్గవాగు నుం చి నీటిని చిలకలూరిపేట మేజర్‌కు విడుదల చేశారు. చిలకలూరిపేటకు మంచినీరు అందించాలనేది ప్రధాన ఉద్దేశం. మొదట 75 క్యూసెక్కులు విడుదల చేయగా, దాన్ని క్రమేపీ పెంచుతూ 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ నీటితో మంచినీటి చెరువును నింపుతున్నారు. మేజర్ పూర్థి సామర్ధ్యం 370 క్యూసెక్కులు. ఇప్పటివరకు విడుదల చేసిన నీటితో కాలువకు పలుచోట్ల లీకులు ఏర్పడ్డాయి. డ్రాప్‌ల నిర్మాణంలో నాణ్యతను తిలోకదాలు ఇవ్వడమే ప్రధాన కారణం. దీంతోపాటు మైనర్ కాలువలకు వెళ్లే షట్టర్లను కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడంతో అనేకచోట్ల నీరు వృధాగా పోతోంది. మేజర్ కట్టల పటిష్టతకు వేసిన మట్టి కూడా నీటిలో కొట్టుకుపోతోంది. నాణ్యత లేని పనులు.. ప్రపంచబ్యాంక్ సాయంతో చిలకలూరిపేట మేజర్‌కు రూ.6కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ పనులు కాంట్రాక్టర్లకు వరంగా మారాయనే విమర్శలు ఉన్నాయి. కేవలం మట్టిపనులతో వారు కాలంగడుపుతూ వచ్చారు. ఈ ఏడాది మేజర్ పరిధిలోని కాలువ కట్టలు పటిష్టపరచడం, కాలువలోని పూడికను తొలగించడం, శిథిదిలావస్థకుడ్రాప్ట్ల స్థానంలో కొత్తవాటిని నిర్మించే పనిని చేపట్టారు. వీటి నిర్మాణం కూడా నాసిరకంగా జరిగింది. ఈ డ్రాప్‌ల నుంచి నీరు లీకవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్లుగా మారడంతో అధికారుల పర్యవేక్షణ లోపించింది. గురవాయిపాలెం సమీపంలో కట్టలు పటిష్టతకు గ్రావెల్ బదులు నల్లమట్టిని వాడారు. దీనిపై రైతులు ఆందోళనకు దిగినా అధికారులు పట్టించుకోలేదు. ఈ ప్రాంతంలో అనేకచోట్ల ఏర్పడిన లీకులు కాలువ పటిష్టతపై ఆందోళన కలిగిస్తున్నాయి. క్యూరింగ్ చేయకపోవడంతో... చిలకలూరిపేట మేజర్‌లో ఇప్పటికి రూ.2 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. కాలువ కట్టలపై కొత్తగా మట్టిని వేయడం వల్ల కొన్ని చోట్ల లీకులు వచ్చాయి. రోలింగ్ చేయడంతో ఈ లీకులు తగ్గుతాయి. నూతనంగా నిర్మించిన డ్రాప్‌లకు సరిగా క్యూరింగ్ చేయకపోవడం వలన నీరు లీకవుతోంది. - రాజు, ఎన్ఎస్పీ సర్కిల్ డీఈ -
భవనాలతో బిజినెస్
యనమలకుదురు (పెనమలూరు) : సాక్షాత్తూ అధికార పార్టీ నేతలే అక్రమాలకు ఊతమిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేనే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, అధికారుల విధులకు అడ్డు తగులుతున్నారు. యనమలకుదురులో సోమవారం చోటుచేసుకున్న ఇలాంటి ఓ ఘటన అధికారులు, పోలీసుల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. యనమలకుదురు కరకట్ట దిగువన నదీ పరివాహక ప్రాంతంలో ఓ బిల్డర్ నిబంధనలకు వ్యతిరేకంగా గ్రూప్‌హౌస్ నిర్మిస్తున్నారు. దీంతో సోమవారం సీఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగి పోలీస్ బందోబస్తుతో అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. ఈలోగా స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన అనుచరులతో సంఘటనా స్థలం వద్దకు వచ్చారు. భవనం కూల్చేందుకు ప్రయత్నిస్తున్న సీఆర్డీఏ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తన నియోజకవర్గంలోకి ఎవరిని అడిగి వచ్చారని ప్రశ్నించారు. గ్రామాల్లో ఏ అక్రమ కట్టడం కూల్చాలన్నా తనకు ముందుగా తెలపాలని హెచ్చరించారు. బిల్డర్లతో తాను మాట్లాడుకున్నానని, అభివృద్ధికి సంబంధించి నిధులు సమీకరిస్తున్నానని తెలిపారు. గ్రామంలో అక్రమ కట్టడాలపై తాను తీసుకుంటున్న చర్యలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వచ్చానన్నారు. ఇక్కడ విలేకరులు ఎవరైనా ఉన్నారా? అని అక్కడ ఉన్న అధికారులను అడిగారు. అక్రమ కట్టడాలైనపుడు ముందు ఎందుకు స్పందించలేదని అధికారులను ప్రశ్నించారు. దీంతో భవనాన్ని కూలుస్తున్న అధికారులు, పోలీసులు ఏం చేయాలో తెలియక వెనుదిరిగారు. అంతా హైడ్రామానా! భవనం కూల్చివేత కార్యక్రమం అంతా హైడ్రామాగా నడిచింది. ఇటీవల సదరు ఎమ్మెల్యే బిల్డర్లతో ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటుచేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న ప్లాట్‌కు రూ.60 వేల చొప్పున తనకు చెల్లించాలని హుకుం జారీచేశారు. గ్రూప్హౌస్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. దీనికి బిల్డర్లు అంతగా స్పందించలేదు. దీంతో కంగుతున్న ఎమ్మెల్యే బిల్డర్లను హెచ్చరించాలనే అధికారులతో ఈ హైడ్రామా ఆడించారని గ్రామంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు క్రమబద్దీకరించుకోవాలని ఒకపక్క ప్రభుత్వం అవకాశం ఇవ్వగా, సాక్షాత్తూ ఎమ్మెల్యేనే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని మైండ్‌గేమ్ ఆడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భక్తులకు అడుగడుగునా అడ్డంకులే
ఇష్టానుసారంగా బారికేడ్ల పెంపు నాలుగైదు దశల్లో భక్తుల నిలిపివేత గ్యాలరీల్లో ఖాళీ ఉన్నా భక్తులను అనుమతించని పోలీసులు సాక్షి, తిరుమల : శ్రీవారి గరుడోత్సవానికి హాజరైన భక్తులను మితిమీరిన పోలీసుల కట్టడి ఇబ్బందులకు గురిచేసింది. తిరుమల కొండకు చేరిన వేలాది మంది భక్తులు పాసులు లేక, గ్యాలరీలను చేరలేక రోడ్లమీదనే నిలిచిపోయారు. భక్తులు బతిమాలుకున్నా పోలీసులు ససేమిరా అనడంతో పలు ద్వారాల దగ్గర పరస్పర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అనుమతుల విషయంలో స్పష్టమైన ఆదేశాలున్నాయన్న సాకుతో విధులు నిర్వర్తించిన పలువురు పోలీసులు భక్తుల విన్నపాలను నిర్లక్ష్యం చేశారు. ఈ ఏడాది స్వామివారి గరుడోత్సవానికి 3 నుంచి 4 లక్షల మంది భక్తులు హాజరవుతారని పోలీసు అధికారులు అంచనా వేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామన్న ఉన్నతాధికారులు ఈ ఏడాది 4500 మందికి ఉత్సవాల విధులను కేటాయించారు. అంతేకాకుండా గరుడోత్సవం రోజు పెరిగే రద్దీని నియంత్రించేందుకు ఇష్టానుసారంగా బారికేడ్లు పెంచేశారు. వీటికితోడు ఆనంద నిలయానికి వెళ్లే దారులన్నింటిలోనూ ఇనుప కంచెలు ఎక్కువగా వేశారు. ప్రతి ద్వారం దగ్గర పది మంది పోలీసులు విధులు నిర్వర్తించేలా డ్యూటీలు వేశారు. ఏటా ఎక్కువ మొత్తంలో ఇచ్చే గ్యాలరీ పాసులను సగానికి సగం తగ్గించేశారు. ఆలయానికి ఆగ్నేయం, నైరుతీ దిక్కుల్లో ఉన్న పలు గ్యాలరీల్లో భక్తులు తక్కువగా ఉన్నప్పటికీ పోలీసులు బయటి భక్తులను అనుమతించలేదు. వర్షం వల్ల గ్యాలరీల్లోని భక్తులు బయటకు వెళ్లినప్పటికీ అక్కడున్న ఖాళీలను భర్తీ చేసేం దుకు బయట భక్తులను అనుమతించకపోవడం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనం. పోలీసులు చూపిన విపరీతమైన కట్టడి కారణంగా ఎంతో మంది భక్తులు స్వామివారి వాహన సేవకు దూరమయ్యారన్న ఆరోపణలు వినిపించాయి. ఈవో సాంబశివరావు జోక్యం చేసుకుని భక్తులను లోపలికి అనుమతించాలని కోరినా పలు ద్వారాల్లో రాత్రి 10 గంటల వరకూ కట్టడి కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా పాసులు లేని వృద్ధులు, మహిళలు నానా ఇక్కట్లకు గురయ్యారు. -
కుక్కల కట్టడికి చర్యలు
చార్మినార్ : పండుగలు వస్తున్నాయంటే... రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. అయితే ప్రస్తుతం వీరితో పాటు దక్షిణ మండలం పోలీసులు కుక్కలపై (గ్రామసింహాలు) కూడా దృష్టి పెట్టారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని డీసీపీ సత్యనారాయణ కుక్కలను కట్టడి చేయాలని నిర్ణయించారు. ఓ వైపు వినాయక ఉత్సవాలు.. మరోవైపు ఈనెల 25న జరుగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో పోలీసులు పాతబస్తీలో రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు పాతనేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. అలాగే, ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమవుతున్న కుక్కలను కట్టడి చేయాలని డీసీపీ నిర్ణయించారు. చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా ఏసీపీ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల ప్రాంతాల్లో కుక్కల బెడద లేకుండా ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు, సిబ్బందితో కలిసి కుక్కల సంచారాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. కుక్కలతో ఇరు వర్గాల ఘర్షణలు... బక్రీద్ పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లపై కనిపించే జంతువుల వ్యర్థాలను కుక్కలు తింటుంటాయి.అయితే,కొన్ని కుక్కలు ఆ వ్యర్థాలను తమకు ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ప్రశాంతంగా తింటుంటాయి. ఇలా తీసుకెళ్లే కుక్కల వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. జంతువుల వ్యర్థాలను వినాయక మండపాలు, మండపాల సమీపంలోకి తీసుకె ళ్లి వదిలేస్తే.. మండపాల నిర్వాహకులు, భక్తులకు ఆగ్రహం వచ్చి ఇరువర్గాల మధ్య ఘర్షణలకు దారితీయొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ముందుగా కుక్కలను కట్టడి చేయడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. గట్టి బందోబస్తు... జంట పండుగల కోసం ఇప్పటికే పాతబస్తీలో అదనపు బలగాలను రప్పించి బందోబస్తులో నియమించామన్నారు. ఒక కంపెనీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు, రెండు కంపెనీల సీఆర్పీఎఫ్, రెండు కంపెనీల ఆర్‌ఏఎఫ్‌లతో పాటు 2 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారన్నారు. శాంతి సామరస్యంతో పండుగలు జరుపుకోవాలి... జంట పండుగులను ఇరువర్గాల ప్రజలు శాంతి సామరస్యాలతో జరుపుకోవాలి. గణేశ్ వేడుకలు, బక్రీద్ సందర్భంగా పాతబస్తీలో గట్టి బందోబస్తు కొనసాగిస్తున్నాం. వినాయక మండపాల నిర్వాహకులు 9వ రోజు (ఈనెల 25న)న పెద్ద సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనానికి తరలించే అవకాశాలున్నాయి. అదే రోజు బక్రీద్ పండుగ ఉన్నందున భక్తులు తమ విగ్రహాల నిమజ్జనాన్ని ఒక రోజు ముందు చేసుకోవడంలేదా..26వ తేదీకి వాయిదా వేసుకుంటే బాగుంటుంది. -వి.సత్యనారాయణ, దక్షిణ మండలం డీసీపీ -
ఊపిరాడక.. ఉక్కిరిబిక్కిరి!
నిలోఫర్‌లో కరెంట్ ‘కట్’కటా ఉదయం నుంచి చీకట్లోనే మగ్గిన నవజాత శిశువులు వైద్య పరీక్షలకు, చికిత్సలకు తీవ్ర అంతరాయం సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా సర్జికల్, సాధారణ వార్డుల్లో కరెంట్ లేకపోవడంతో వైద్యాధికారులు, నవజాత శిశువులు తీవ్ర ఇబ్బం దిపడాల్సి వచ్చింది. వార్డుల్లో గాలి, వెలుతురు లేక ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వార్మర్లు, ఫొటోథెరపీ యూనిట్స్ పని చేయక రోగు లు మరింత అస్వస్థతకు గురయ్యారు. ఎక్స్‌రే, సిటీస్కాన్, అల్ట్రాసౌండ్, రక్త, మూత్ర పరీక్షలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో శిశువులు, వార్డుల్లోని బాలింతలు, గర్భిణులు పగలంతా చీకట్లోనే మగ్గాల్సి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం వల్లే... ఆస్పత్రిలో ఇటీవల విద్యుత్ ఉపకరణాల వాడకం రెట్టింపైంది. ట్రాన్స్ఫార్మర్ను అప్‌గ్రేడ్ చేయక పోవడంతో పాటు ఆయిల్ లీకేజీలను అరికట్టక పోవడం వల్ల కాలిపోయింది. ఆస్పత్రిలో రెండు జనరేటర్లు ఉన్నా రోగుల అవసరాలు తీర్చలేకపోయాయి. విద్యుత్‌లేక కొత్త అడ్మిషన్లు సహా ఆరోగ్యశ్రీ సర్వీసులకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం వల్ల ఆస్పత్రిలో కరెంట్ సరఫరా ఆగిన మాట వాస్తవమే. అయితే అత్యవసర విభాగం సహా ఆపరేషన్ థియేటర్స్, లేబర్ వార్డు, ఎన్ఐసీయూ విభాగాల్లోని రోగులకు ఇబ్బందులు త లెత్తకుండా జనరేటర్ సాయంతో విద్యుత్ సరఫరా చేశాం. జనరల్ వార్డులో మాత్రమే సరఫరా నిలిచింది. దీన్నీ సాయంత్రం పునరుద్ధరించాం. - డాక్టర్ జయకృష్ణ, ఆర్ ఎంఓ, నిలోఫర్ -
ఓట్ల తొలగింపులో కూకట్పల్లి టాప్ !
1,21,085 ఓట్లు ఔట్ గ్రేటర్లో తొలగించిన మొత్తం ఓట్లు 4,77,972 మరో 1,78, 043 మందికి త్వరలో నోటీసులు సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు గందరగోళానికి దారితీసింది. దీనిపై ఆయా పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆచితూచి వ్యవహరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను తొలగించావుని అధికారులు చెబుతుండగా.. ఏకపక్షంగా తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారుు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపు చర్చనీయూంశంగా వూరింది. గ్రేటర్ పరిధిలోని 18 (పాత)సర్కిళ్లలో అత్యధికంగా కూకట్పల్లి సర్కిల్లోని 1,21,085 ఓట్లను అధికారులు తొలగించారు. కూకట్పల్లి తర్వాతి స్థానంలో ఖైరతాబాద్ ఉంది. తక్కువ ఓట్లు తొలగించిన సర్కిల్‌గా ఉప్పల్ మిగిలింది. ఎన్నికల జాబితాలో రెండుచోట్ల పేర్లున్నవారు(డూప్లికేట్లు), చిరునామా మారినవారు, తాళాలు వేసిన ఇళ్లు, మృతుల వివరాల ఆధారంగా ఓట్లు తొలగించాల్సివారు మొత్తం 27,12,468 మంది ఉన్నట్లు గుర్తించిన అధికారులు 25,34,425 మంది బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. మరో 1,78, 043 మందికి త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిబంధనల మేరకే.. : సోమేశ్‌కుమార్ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమనిబంధనల మేరకు ఓటర్ల జాబితాలను బహిరంగపరిచామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు. ‘నోటీసులు జారీ చేసి, స్థానికంగా ఉంటున్నట్లు వివరణనిచ్చేందుకు తగిన గడువునిచ్చి, అప్పటికీ స్పందించనివారినే ఓటర్ల జాబితా నుంచి తొలగించాం. ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా ఈ వివరాలు పొందుపరిచాం. లక్షలాది ఓట్లను ఏకపక్షంగా తొలగించామనే ఆరోపణల్లో వాస్తవం లేదు. అర్హులను తొలగించలేదు.’ అని శనివారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అర్హులు మళ్లీ నమోదు చేసుకోవచ్చు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల అధికారి అనర్హులుగా భావించినవారిని ఓటర్ల జాబితాలోంచి తొలగించారు. అర్హులైనవారు స్థానికంగా ఉంటున్నట్లు తగిన ఆధారాలు చూపితే వారి పేర్లను తిరిగి నమోదు చేస్తాం. స్థానిక సర్కిల్ కార్యాలయాల్లోగాని, ఆన్లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. - సి.రామకృష్ణారావు, అడిషనల్ కమిషనర్ -
అమ్మో.. బెజవాడే
భయపడుతున్న ఎక్సైజ్ సీఐలు నగరంలో ఉద్యోగం కష్టమంటున్న అధికారులు బదిలీల్లో నగరానికి నో ఆప్షన్ జిల్లాలో 25 మంది సీఐల బదిలీ సాక్షి, విజయవాడ : అమ్మో విజయవాడలో పనిచేయటం చాలా కష్టం.. వారంలో నాలుగు రోజులు మంత్రి ప్రోటోకాల్, మిగిలిన మూడు రోజులు ఇతర వీవీఐపీల పోటోకాల్ విధులు ఉంటాయి. ఇవి కాకుండా రెగ్యులర్‌గా తనిఖీలు, నెలకు సగటున 10 వరకు కేసుల నమోదు చేయాల్సి ఉంటుంది. సరే కష్టపడి పనిచేసినా పెద్దగా ఆర్థికంగా ఉపయోగం ఉండదు. డబ్బు ప్రోటోకాల్ ఖర్చులకే సరిపోవు. అందుకే విజయవాడ కంటే పక్కన ఉన్న మునిసిపాలిటీలే బాగుంటాయి. ఇది ఎక్సైజ్ శాఖలోని సిఐలు మనోగతం. గురువారం జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ సీఐల బదిలీలు జరిగాయి. నిబంధనలతో తంటా.. సాధారణంగా జిల్లాలో పనిచేసే ఎక్సైజ్ సిఐలు ఆదాయం బాగుంటుందని విజయవాడలోని పోస్టింగ్‌ల కోసం విస్తృతంగా ప్రయత్నించే వారు. అవసరాన్ని బట్టి రూ 4 లక్షల నుంచి 6 లక్షల వరకు అయినా ఖర్చు పెట్టి మరీ నగరంలో పోస్టింగ్ తెచ్చుకునే వారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎక్సైజ్ శాఖ సీఐల పనితీరుకు కొలమానం పెట్టింది. ఎ నుంచి డి వరకు నాలుగు గ్రేడ్లుగా పనితీరు ఆధారంగా బదిలీలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఎగ్రేడ్ సాధించిన వారికి మాత్రమే నగరంలో పోస్టింగ్‌లు కేటాయిస్తారు. అయితే ఎ-గ్రేడ్ ఒక సీఐకు మాత్రమే రావటంతో బిగ్రేడ్ ఉన్న ముగ్గురినీ నగరంలో వేయాల్సి ఉంది. అయితే బి గ్రేడ్‌లో ఉన్నసీఐలు నగరంలో పోస్టింగ్ వద్దని ఉన్నతాధికారులకు మెరపెట్టుకున్నారు. దీంతో నగరంలోని నాలుగు సీఐ పోస్టులనూ గతంలో లూప్లైన్లో పనిచేసిన వారికి కేటాయించారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలో 23 మంది సీఐల బదిలీలు జరిగాయి. పదవీకాలం పూర్తి కాలేదని ఉయ్యూరు సీఐని మినహాయించారు. మచిలీపట్నం సీఐ పోస్టును భర్తీ చేశారు. ఏఈఎస్ భీమ్‌రెడ్డిని పలాసకు బదిలీ చేశారు. నూతన సీఐలు వీరే... మచిలీపట్నానికి జయశ్రీ, బంటుమిల్లికి ఎన్. అమరేశ్వరరావు, అవనిగడ్డకు ఎస్.కె. రమేష్, మొవ్వకు ఎం. సూర్యప్రకాషరావు, గుడివాడకు వరహాలరాజు, కైకలూరుకు ఎన్.వి. రమేష్, మండవల్లికి పి.జయరామ్, గన్నవరానికి పాండురంగారావు, విజయవాడ ఈస్ట్‌కు పి.వి. రమణ, విజయవాడ వెస్ట్‌కు కె.వి. సుధాకర్, పటమటకు ఎం. కృష్ణకుమారి, భవానీపురానికి జె. రమేష్ బదిలీ అయ్యారు. మైలవరానికి జి. శ్రీనివాస్, నందిగామకు సాయి స్వరూప్, కంచికచర్లకు ఆర్.వి. రామ శివ, నూజివీడుకు జె. శ్రీనివాస్, తిరువూరుకు బి. నాగహనుమాన్, విసన్నపేటకు జి. అమర్‌బాబు, మచిలీపట్నం ఈఎస్ టాస్క్‌ఫోర్స్‌కు కె. బంగారు రాజు, విజయవాడ ఈఎస్ టాస్క్‌ఫోర్స్‌కు అబ్దుల్ ఖదీర్, లిక్కర్ డిపోకు సీఎస్ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. -
అక్రమాలపై ఉక్కుపాదం
- ఇక రాత్రి 8 దాటితే ఇసుక రవాణా నిషేధం - నకిలీ వే బిల్లుల లారీలను అడ్డుకున్న అధికారులు - ఈ బాగోతాన్ని బయటపెట్టిన ‘సాక్షి’ - కలెక్టర్ ఆదేశాలతో అధికారుల చర్యలు - మళ్లీ ‘మహా’ ఇసుక తుఫాన్ - తాజాగా రెండు క్వారీలకు మహారాష్ట్ర సర్కారు అనుమతి బోధన్ : మంజీర తీరంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కలెక్టర్ యోగితారాణా ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. బోధన్ మండలంలోని సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సమీపంలోని మంజీర నదికి ఆవతలి ఒడ్డున మహారాష్ట్ర ప్రాంతంలోని ఇసుక క్వారీల నుం చి లారీలు చెక్‌పోస్టు మీదుగా తెలంగాణలోకి వస్తున్నా రుు. ఆ క్వారీల నుంచి నకిలీ వే బిల్లులతో లారీల్లో రవాణా చేస్తున్నారు. ఈ విషయూన్ని ఇటీవల ‘ఇసుకాసురులు బరితెగించారు’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. దీంతో నకిలీ వే బిల్లులు, ఇసుక అక్రమ రవాణ ను కలెక్టర్ సీరియస్ పరిగణించారు. ఆమె ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఇసుక లారీల వే బిల్లులు తనిఖీ చేస్తున్నారు. సాలూర వద్ద మంజీర నది కొత్త వంతెన సమీపంలో ఆదివారం రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు మహారాష్ట్ర క్వారీల నుంచి వచ్చిన లారీలను నిలిపి వే బిల్లులను తనిఖీ చేశారు. కొన్ని లారీల వద్ద నకిలి బిల్లులను గుర్తించి రవాణాను అడ్డుకున్నారు. వాటిని మహారాష్ట్రకు తిప్పి పంపించారు. బోధన్ టౌన్, రూరల్ సీఐలు వెంక న్న, శ్రీనివాసులు, ఎడపల్లి, వర్ని ఎస్సైలు ఆసిఫ్ అహ్మద్, అంజయ్య, బోధన్ ఎంఆర్ఐ అశోక్ సింగ్, వీఆర్వో జావిద్ తదితరులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ రవాణా నియంత్రకు చర్యలు... మంజీర తీరంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝుళింపించారు. మహారాష్ట్ర ఇసుక క్వారీల నుంచి నకిలీ వే బిల్లులు, ఓవర్‌లోడ్‌తో రవాణా చేస్తున్న లారీలను అడ్డుకునేందుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఐదారేళ్లుగా అడ్డూఅదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతున్న విషయం విదితమే. దీనిద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అరుుతే కొత్తగా వచ్చి కలెక్టర్ యోగితా రాణా ఆదేశాలతో అధికార యంత్రాగం ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. మూడు చెక్పాయింట్లు.. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు.. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల సమన్వయంతో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్టు అధికారులు వెల్లడించారు. నిజాంసాగర్ మండలంలోని రెండు చోట్ల, ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ వద్ద చెక్పాయింట్లను ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఇసుక లారీల రవాణను నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘించి రవా ణా చేస్తే వాహనాలను స్వాధీ నం చేసుకుని లారీ యాజమానులపై క్రిమినల్ కేసులు నమో దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ వే బిల్లులతో రవాణా చేసినా చర్యలు తప్పవని ప్రకటించారు. మళ్లీ ‘మహా’ఇసుక తుఫాన్.. సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సమీపంలో గల మంజీర నది తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తోంది. మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా పరిధిలో మంజీర నదిలో అక్కడి ప్రభుత్వం ఇసుక క్వారీలకు వేలంపాట నిర్వహించి రవాణాకు అనుమతిస్తోంది. వేలంలో క్వారీలు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మన భూబాగంలోని నదిలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తున్న విషయం పలుమార్లు అధికారుల పరిశీలనలో వెలుగుచూసింది. ప్రస్తుతం గంజ్‌గాం క్వారీ కొన్ని నెలలుగా నడుస్తోంది. తాజాగా కార్లా, ఎస్గీ క్వారీలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని సమాచారం. రెండు రోజులుగా ఈ రెండు క్వారీల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. బోలేగాం క్వారీకి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. దీంతో మళ్లీ మంజీర తీరంలో మహా ఇసుక తుఫాన్ రానుంది. దీని ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కోట్లు దండుకుంటుండగా మన ప్రాంతంలో రోడ్లు దెబ్బతినడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు వట్టిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
- ఆర్వీఎం నియామకాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలు సంగారెడ్డి మున్సిపాలిటీ : సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు వారిని తిరిగి దొడ్డిదారిలో విధుల్లోకి తీసుకొంటూ రూ. లక్షలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలన్నా, తొలగించాలన్న రాష్ట్ర ప్రాజెక్టు అధికారి అనుమతితోనే చేపట్టాల్సి ఉంటుంది. అయితే మామూళ్లు దండుకొని దర్జాగా కోరిన చోట పోస్టింగ్‌లు ఇస్తున్నారు. గత మార్చిలో ములుగు కస్తూర్బాగాంధీ బాలిక హాస్టల్ ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు అప్పట్లో జిల్లా ఆర్వీఎం పీఓ ప్రకటించారు. అయితే అధికారులకు మామూళ్లు ముట్టడంతో జేసీడీఓ స్థాయి అధికారితో పాటు కార్యాలయంలోని ప్రధాన విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి డబ్బులు దండుకొని ఆ ప్రత్యేకాధికారికి చిన్న కొడూర్ మండలం అల్లీపూర్ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. చిన్న కోడూర్ మండలం అల్లీపూర్లో పనిచేస్తున్న ప్రత్యేకాధికారి తనకు దూరమవుతున్నందున ములుగు బదిలీ చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఆమెకు అక్కడ కాకుండా రాయికోడ్‌కు బదిలీ చేశారు. నంగునూర్ మండల పరిధిలోని నర్మెటలో పనిచేస్తున్న హాస్టల్ ప్రత్యేక అధికారిపై విద్యార్థులు ఆరోపణలు చేయడంతో సిద్దిపేట ఆర్డీఓ విచారణ చేపట్టారు. దాని ఆధారంగా ఆమెను సెస్పెండ్ చేశారు. అనంతరం జేసీడీఓ ప్రకాశ్‌రావు శాఖా పరమైన విచారణ చేపట్టి ఆమెను తొలగించారు. అయితే 45 రోజుల తరువాత తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఇవి కేవలం కొన్ని ఉదహారణలు మాత్రమే. అయితే కింది స్థాయి సిబ్బందిని తొలగించి, తిరిగి తీసుకోవడంలో అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఇలా ప్య్రతేకాధికారుల వ్యవహరమే కాకుండా సీఆర్టీలో సైతం డబ్బులు దండుకొని బదిలీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై జేసీడీఓ ప్రకాశ్‌రావు మాట్లాడుతూ సస్పెన్షన్‌కు గురైన ఎస్ఓలు తమ తప్పును ఒప్పుకోవడంతో కలెక్టర్ వారిని తీసుకోవాలని సూచించడంవల్లే తీసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియమకాలు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసే నాన్ టీచింగ్ సిబ్బందిని గుర్తుంపు పొందిన ఏజెన్సీల ద్వారానే నియమించాలి. అయితే నిబంధనలను పట్టించుకోకుండా డబ్బులు దండుకొని ఇష్టానుసారంగా నియమాకాలు చేస్తున్నారు. ఎవరైనా అడిగితే మాత్రం ఏజెన్సీల ద్వారానే నియమించడం జరుగుతుందని సమాచార హక్క చట్టం కింద ఆర్వీఎం శాఖకు చెందిన జేసీడీఓ పేర్కొన్నారు. చిన్నకోడూర్ కేజీబీవీలో స్థానిక నాయకులు, ఆర్వీఎం జిల్లా అధికారులకు ముడుపులు చెల్లించడం వల్లే తీసుకోవడం జరిగిందనే ఆరోపణలున్నాయి. మరో వైపు స్థానిక ఎంఈఓ,ఎంపీడీఓ, ఎస్ఓ తదితరులు కుమ్మకై అడ్వయిజరీ కమిటీ పేరుతో డబ్బులు తీసుకొని అర్హత లేని వారిని నియమించారనే ఆరోపణలు వచ్చాయి. స్పందించని పీఓ ఎస్ఓలను తిరిగి విధుల్లో తీసుకునే విషయంలో ముడుపులు తీసుకుంటున్నారనే విషయమై పీఓను వివరణ కోరే ందుకు ప్రయత్నించినా స్పందించలేదు. -
గత పాలకుల వల్లే తాగు, సాగునీటి ఇబ్బందులు
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి బాలానగర్ : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఇంతకాలం తెలంగాణలో సాగు, తాగునీటికిఇబ్బందులు పడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గత పాలకుల అరవై ఏళ్ల పాపాలను ఐదేళ్లలో కడిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ఆయన చెప్పారు. శుక్రవారం మోతిఘనాపూర్లో నిర్మించిన గ్రామ సచివాలయంతోపాటు గంగధర్పల్లిలో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకును, అమ్మపల్లిలో అంగన్వాడీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగధర్పల్లిలో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు లేవని మహిళలు మంత్రికి విన్నవించుకున్నారు. దానికి స్పందించిన మంత్రి సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణానికి వెంటనే రూ. 5 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులు తొందరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అనంతరం మోతిఘనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రిని గ్రామస్తులు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా తోడ్పాటునందించాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారని, అది పూర్తయితే లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
పట్టుకోండి చూద్దాం
- జిల్లాలో ట్యాక్స్ చెల్లించనివాహనాలు 27,001 - బకాయి వసూళ్లపై దృష్టి పెట్టని రవాణా శాఖ - ‘సర్దుకుపోతున్న’అధికారులు - రావాల్సిన ఆదాయం రూ.80 లక్షలు అనంతపురం టౌన్ : ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే రవాణా శాఖలో ట్యాక్స్ వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా వేల వాహనాలు ట్యాక్స్ చెల్లించకుండా రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి సుమారు రూ.80 లక్షల వరకు బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఎక్కడికక్కడ అధికారులు ‘సర్దుకుపోతుండడం’తోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అనంతపురం, హిందూపురం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లులో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)లతో పాటు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా ఉంది. అధికారులు ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లెసైన్సుల మంజూరు, వాహనాల ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పరిమితికి మించి ప్రయాణికులు, లగేజి తీసుకెళ్లడంతో పాటు ప్రధానంగా ట్యాక్స్ చెల్లించని వాహనాలను గుర్తించి జరిమానా విధించాలి. ప్రతి నెలా ఎంవీఐలు, ఏఎంవీఐలకు టార్గెట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలు కలిపి ట్యాక్స్ చెల్లించాల్సినవి 27,001 ఉన్నాయి. వీటిలో కొన్ని మూడు నెలలకు ఒకసారి, మరికొన్ని ఏడాదికి ఒకసారి ట్యాక్స్ చెల్లించే వాహనాలు ఉన్నాయి. అధికారుల పట్టింపులేని తనంతో వాహనదారులు మిన్నకుండిపోతున్నారు. ట్యాక్స్ వసూళ్ల విషయంలో కొందరు అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో చూసీచూడకుండా వెళ్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చిన్నచిన్న వాహనాల వరకు ట్యాక్స్ కట్టించుకుంటున్నా పెద్ద వాహనాలకు సంబంధించి పట్టుబడినా ‘సర్దుకుపోతున్నారన్న’ ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ చెల్లించని వాటిలో పది శాతం వాహనాలు ప్రస్తుతం తిరగడం లేదని అధికారులు చెబుతున్నా మిగిలిన వాటి విషయంలో వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పట్టుబడితే భారీ జరిమానా వేస్తాం ట్యాక్స్ చెల్లించని వారు తక్షణం చెల్లించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ను త్వరలో చేపడతాం. ఆ సమయంలో పట్టుబడితే భారీ జరిమానా విధిస్తాం. ట్యాక్స్‌ను కార్యాలయంలోనే కాకుండా మీ సేవలో కూడా చెల్లించే అవకాశం ఉంది. ఒక వేళ వాహనాలను తిప్పకపోతే రాతపూర్వకంగా తెలియజేయాలి. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. -
ఇటు పెళ్లి లోగిలి.. అటు మృత్యు కౌగిలి
కుమార్తె పెళ్లి రోజే తనువు చాలించిన తండ్రి కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు, బంధువులు లక్కిరెడ్డిపల్లె : ఓవైపు కన్న కూతురి పెళ్లి.. మరో వైపు మృత్యువుతో తండ్రి పోరాటం. చివరకు బిడ్డ పెళ్లి చూడకుండానే ఆ తండ్రి కన్ను మూశాడు. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం లక్కిరెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. లక్కిరెడ్డిపల్లెకు చెందిన ముబారక్ తన కుమార్తెకు ఈనెల 7న సోమవారం పెళ్లి జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పెళ్లికి అవసరమైన సామగ్రి తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనంలో వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం రాత్రి వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా.. పెళ్లికి బంధువులంతా రావడంతో బరువెక్కిన హృదయాలతోనే సోమవారం ఆమె వివాహాన్ని జరిపించారు. అదే రోజు రాత్రి ఆసుపత్రిలో ముబారక్ మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది. వివాహానికి హాజరైన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆ నవవధువు విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ చలించిపోయారు. మృతుడు గృహ నిర్మాణ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తుండటంతో ఆ శాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
మాజీ ఎంపీ ఫాంహౌస్‌కు నల్లా కనెక్షన్ కట్
మొయినాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఓ మాజీ ఎంపీ తన వ్యవసాయక్షేత్రానికి వేసుకున్న మంజీర పైపులైన్‌ను అధికారులు సోమవారం తొలగించారు. మండల పరిధిలోని చందానగర్ పంచాయతీ అనుబంధ గ్రామమైన రెడ్డిపల్లి వద్ద ఉన్న తన ఫాంహౌస్‌కు సదరుప్రజాప్రతినిధి నీటిని తరలించేందుకు అక్రమంగా కనెక్షన్ తీసుకున్నదానిపై ఆదివారం పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిం దే. దీంతో సోమవారం ఆర్డబ్ల్యూఎస్ చేవెళ్ల డివిజన్ డీఈ రాజేష్, మొయినాబాద్ మండల ఇన్చార్జ్ ఏఈ శ్రీనివాస్‌లు అక్కడికి చేరుకుని అనుమతులు లేకుండా కనెక్షన్ ఎలా తీసుకుం టారంటూ వ్యవసాయక్షేత్ర సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఈ రాజేష్ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రమే వర్క్ఇన్స్పెక్టర్తో అక్రమ కనెక్షన్‌ను తొలగించినట్లు తెలిపారు. ఫాంహౌస్‌కు మంజీరా నీటి కనెక్షన్ ఇవ్వాలని తమ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపామన్నారు. దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన పైప్‌లైన్ వేసుకుని కనెక్షన్ తీసుకోవడం సరికాదన్నారు. అయితే మొదటితప్పుగా భావించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మళ్లీ ఇలా అక్రమ కనెక్షన్ తీసుకుంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అ..ఆ..లు తెలియని ఊరు!
అక్షర ప్రకాశం విజయవంతమైనందుకు నాటి కలెక్టర్‌కు అవార్డు వచ్చింది.. దేశ వ్యాప్తంగా అభినందనలు అందాయి.. 8న ఢిల్లీలో జరగనున్న అక్షరాస్యతా దినోత్సవానికి లేటు వయసులో అ..ఆలు నేర్చిన ఉలవపాడు మహిళలు హాజరు కానున్నారు.. సర్వశిక్షా అభియాన్ ఉంది.. సాక్షర భారత్ విద్యా కేంద్రాలూ ఉన్నాయి.. పటిష్టమైన విద్యాశాఖ ఉంది... మరి.. పొదిలిలోని శ్రీపతి నగర్లో సున్నా శాతం అక్షరాస్యత ఎందుకుంది? - పొదిలిలోని శ్రీపతి నగర్లో నూరు శాతం నిరక్షరాస్యత - ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం రేపు పొదిలి పట్టణంగా విస్తరిస్తోంది.. కావాల్సిన సౌకర్యాలన్నీ ఉంటాయి. మేధావులు, ఉద్యోగులు, విద్యా సంస్థలకూ తక్కువ కాదు. అయితే దర్శి రోడ్డులో ఉన్న శ్రీపతి నగర్‌ను పరిశీలిస్తే శతాబ్దం వెనుక ఉన్నామా అనిపిస్తుంది. కారణం? వారు అడవుల్లోనో.. జన సంచారంలేని చోట ఉండటమో కాదు. మనిషిని ముందుకు నడిపిస్తున్న చదువంటే అక్కడుండేవారికి తెలియకపోవడం. సున్నా శాతం అక్షరాస్యత ఉన్నా పాలకులు గుర్తించకపోవడం.. అధికారుల లెక్కల్లో లేకపోవడం.. జిల్లా యంత్రాంగం ఘోర తప్పిదం. అక్కడ నుంచి ఓ వైపు కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల, మరో వైపు ఎస్వీకేపీ డిగ్రీకళాశాల కాలనీ వాసులకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే అవి విద్యా సంస్థలని తమ తల రాతలు మార్చే జ్ఞాన జ్యోతులని వారికి తెలియదు. చెప్పేవారు లేరు.. పట్టించుకొనేవారే లేరు. కాలనీలో మొత్తం 30 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. వారిలో పెద్దలు 55 మంది కాగా, పిల్లలు 40 మంది ఉన్నారు. వీరంతా దాదాపు బడిఈడు పిల్లలే. ఈ చిన్నారుల్లో ఒక్కరు కూడా బడికి పోవటం లేదు. ప్లాస్టిక్, పాత పేపర్లు ఏరుకుంటూ అమ్మానాన్నల కడుపు కూడా నింపుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గానీ.. కార్మిక శాఖకు గానీ బాలలు కనిపించకపోవడం వారి దురదృష్టం. అంతా యానాది సామాజికవర్గానికి చెందినవారే.. గతంలో పొదిలి చెరువు సివార్లలో నివాసం ఉండేవారికి ప్రభుత్వమే దర్శి రోడ్డులో పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇళ్లు మంజూరు చేసింది. తర్వాత శ్రీపతి నగర్‌గా నామకరణం చేసింది. ఇక్కడున్న వారందరికీ ఓటరు కార్డులున్నాయి. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులూ ఉన్నాయి. 15 ఏళ్ల నుంచి ఓటు హక్కూ వినియోగించుకుంటున్నారు. ఇంత జరిగినా ఇక్కడ ఓ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు ఎవరూ చొరవ తీసుకోలేదు. రేషన్ తీసుకోవాలన్నా.. పింఛన్లు తీసుకోవాలన్నా అంతా వేలిముద్ర వేయాల్సిందే! చిన్నారులంతా చిరిగిన దుస్తులతో.. అ..అంటే అమ్మ అని, ఆ.. అంటే ఆవు అని తెలియకుండానే పెద్దవాళ్లవుతున్నారు. అంగన్వాడీ బడిలో గుడ్లు తీసుకోకుండా.. పౌష్టికాహారం తినకుండా.. పూర్వ ప్రాథమిక విద్య నేర్చుకోకుండా పెరుగుతున్నారు. సంతకం అంటే తెలియకుండానే వృద్ధులు కాటికె ళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. -పొదిలి ప్రమాదాలతో భయంగా ఉంది, బడి చాలా దూరం, రోడ్డు వెంట నడిచి పిల్లలను బడికి పంపలేం. ఏ బండ్లు వచ్చి గుద్దుతాయోనని భయంగా ఉంది. ఓట్లు కోసం వస్తారు. ఇంకా పనులు చేయమని వస్తారు కానీ.. బడి గురించి ఎవరు పట్టించుకుంటారయ్యా! - మేకల సీతమ్మ చీదరించుకుంటున్నారని వెళ్లటం లేదు బళ్లో పిల్లలను చీదరించుకుంటున్నారని, పిల్లలు బడికి పోవటం లేదు. అప్పుడప్పుడు పంతుళ్లు వచ్చి పిల్లలను బడికి రమ్మని అడుగుతారు. వీళ్లు వెళ్లటం లేదు. దగ్గరగా బడి కట్టిస్తే చదువుకుంటారు. - మేకల కనకయ్య మినీ అంగన్వాడీ కేంద్రం కావాలి పిల్లలకు, గర్భిణులకు, బాలింతలు మంచి తిండి పెట్టేందుకు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయా లి. పిల్లలకు చదువుతో పాటు, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలి. - కొమరగిరి రమణమ్మ -
మీసేవ కేంద్రాల్లో నిలువు దోపిడీ
అధికంగా వసూళ్లు చేస్తున్నా.. పట్టించుకోని అధికారులు పులివెందుల రూరల్ : పట్టణంలోని మీసేవ కేంద్రాలలో ప్రజలను యథేచ్ఛగా నిలువు దోపిడీ చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని మీసేవ ప్రాంచైజ్‌లు, ఏపీ ఆన్లైన్ కేంద్రాలలో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల సేవలను మీసేవ కేంద్రాలకు అప్పగించడం పనులు సులువుగా జరుగుతాయని ప్రజలు భావించారు. అయతే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు వసూళ్లు చేస్తుండటంతో గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ఖర్చు అవుతోందని ప్రజలు చెబుతున్నారు. రైతులకు సంబంధించి అడంగల్, 1బిలకు రూ. 25లు తీసుకోవాల్సి ఉండగా.. రూ. 50లు వసూలు చేస్తున్నారు. దీంతోపాటు బీసీ రుణాలకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించడంతో అందుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో జత చేయాల్సి ఉంది. దీంతో మీసేవ కేంద్రాలలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆన్లైన్లో పంపిస్తామని చెప్పి రూ. 200లు వసూళ్లు చేస్తున్నారు. ఇందుకు రూ. 100లు కూడా ఖర్చు కాదు. ఈ పత్రాలను తహశీల్దార్ కార్యాలయంలో అప్రూవల్ చేయాల్సి ఉంది. ఇందుకు మీసేవ నిర్వాహకులు ప్రతి సర్టిఫికెట్‌కు ఓ రేటు నిర్ణయించి అప్రూవల్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటితో పాటు కుటుంబ సభ్యుల సర్టిఫికెట్, రేషన్ కార్డు ప్రింట్ అవుట్ ఇతరత్రా సర్టిఫికెట్లకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన ధరలకే తీసుకొనే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
నీటిపై రాజకీయం
జిల్లాలోని అధికారపార్టీ నాయకులు నీటి విడుదలలో రాజకీయం చేస్తున్నారు. వీరికి అధికారులు వంతపాడడంతో కొన్ని ప్రాంతాల రైతులు నష్టపోతున్నారు. ఇది రైతుల మధ్య విభేదాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది. అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి 1550 క్యూసెక్కులు (జిల్లా సరిహద్దులోని లెక్కల ప్రకారం) నీటిని వి డుదల చేస్తున్నారు. తుంగభద్ర హైలెవల్ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టుకు, తాగునీటి కోసం పీఏబీఆర్ అక్కడి నుంచి మిడ్‌పెన్నార్, చి త్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పంపకాలు చేపట్టారు.అయితే అధికారపార్టీ నా యకుల ప్రాంతాలకు ఓ విధంగా, ప్రతిపక్ష నాయకుల ప్రాంతాలకు మరోలా నీటి పం పిణీ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో హెచ్‌ఎల్‌ఎంసీ కింద అతిపె ద్ద ఆయకట్టు ఉంది. 20 వేల ఎకరాల్లో వరి, మరో పది వేల ఎకరాలకు పైగా ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తారు. ఈసారి ఆరుతడికి మాత్రమే నీటిని విడుదల చేస్తుండడంతో రోజూ 250 క్యూసెక్కులు నీటిని వదులుతున్నట్లు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయి. ఇది కాగితాల్లో మా త్రమే. అనధికారికంగా మరో 300 క్యూసెక్కు లు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లా సరిహద్దులో 1550 క్యూసెక్కుల నీరు వస్తోంది. పీఏబీఆర్‌కు వచ్చేసరికి 600 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. మరో 150 క్యూసెక్కులు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కు విడుదల చేస్తున్నారు. ఈ రెండింటికీ 750 క్యూసెక్కులు పోగా మి గిలిన 800 క్యూసెక్కులు నీటిలో ప్రవాహ నష్టాలు 200 నుంచి 250 క్యూసెక్కులు ఉంటుంది. మిగిలిన 550 క్యూసెక్కులు హెచ్‌ఎల్‌ఎంసీకి సరఫరా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో అధికారికంగా 250 కాగా, అనధికారికంగా 300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు సమాచా రం. కణేకల్లు, బొ మ్మనహాల్ మండలాలు ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు నియోజకవర్గ ప్రాంతాలు కావడమే ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద మొత్తం 9 డిస్ట్రీబ్యూటరీలు ఉంటే అన్ని ప్రాంతాల్లో పంట సాగు చేయడానికి నీటిని విడుదల చేయడంలే దు. ఒకసారి నాలుగు డిస్ట్రీబ్యూటరీలకు, మరోసారి 5 ఐదు డిస్ట్రీబ్యూటరీలకు చొ ప్పున వదులుతున్నారు. అదికూడా గతేడాది 195 క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల చేశారు. ఈసారీ 150కి మించి విడుదల చేయడం లేదు. దీని వలన పంటలకు నీరందక సకాలంలో సాగు చేసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా రైతులందరినీ సమానదృష్టితో చూడాలని రైతాంగం విజ్ఞప్తి చేస్తోంది. -
‘విమానాల్లో బాంబు’ కలకలం
సాక్షి, బెంగళూరు: స్థానిక కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడు విమానాల్లో బాంబులు పెట్టినట్లు సమాచారం అందడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి అది నిజం కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు హెచ్.ఎస్.ఆర్ లేవుట్‌కు చెందిన వ్యక్తి తాను బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరే మూడు విమానాల్లో బాంబులు పెట్టినట్లు వాట్స్అప్లో మెసేజ్ పంపారు. అంతేకాకుండా ఓ బ్యాంకు అకౌంట్ నంబర్ ఇచ్చి అందులో కోటి రూపాయలు వేస్తే ఎక్కడ పెట్టినది చెబుతానని పేర్కొన్నారు. దీంతో అధికారులు హుటాహుటిన అన్ని విమానాల్లో కూడా వెదికి ఎక్కడా కూడా బాంబు ఆనవాళ్లు కనబడలేదు. చివరికి శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు బయలు దేరాల్సిన విమానాలు దాదాపు 6 గంటలు ఆలస్యంగా బయలు దేరాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాంబు పెట్టినట్లు వాట్స్అప్ మెసేజ్ పంపిన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకుని మడివాళపోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
నీళ్లకు కాకి లెక్కలు!
చిత్తూరు (అర్బన్) : ‘ఇది జూలై 29, 30 తేదీల్లో చిత్తూరు నగరంలోని మాపాక్షి సమీపంలో అద్దె ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేసినట్లు ధ్రువీకరించే పత్రం. ఇందులో 29వ తేదీ మాపాక్షి, ఉయ్యాలచింత, శేషాచలపురం ప్రాంతాల్లో ఎక్కడయితే నీటిని సరఫరా చే శారో అదే ప్రాంతాల్లో అదే నెల 30న కూడా నీటిని సరఫరా చేసినట్లు ట్యాంకు యజమాని ట్రిప్పుషీట్ ఇవ్వగా అధికారులు సంతకాలు పెట్టి బిల్లు ఇవ్వడానికి పంపేశారు. నగరంలో ఒక రోజు ఓ ప్రాంతానికి నీళ్లు వస్తే ఆ మరుసటి రోజు ట్యాంకరు రాదు. మూడో రోజు ఆ ప్రాంతానికి మళ్లీ నీటి ట్యాంకరు వస్తుంది. దీనిని అధికారులు విస్మరించారు. పైగా ఇదే ట్యాంకరు రోజుకు 14 ట్రిప్పుల నీటిని సరఫరా చేసినట్లు చెప్పడం, అధికారులు ఆమోదించడం అవినీతికి సాక్ష్యంగా నిలుస్తోంది.’ ‘ఇది గంగాసాగరం వద్ద నీటిని పంపిణీ చేసినట్లు చూపుతున్న ట్రిప్పుషీట్. ఒకే ట్యాంకరు ఏకంగా రోజుకు 16 ట్రిప్పుల నీటిని అందించినట్లు ఇందులో రాసుంది. నిబంధనల ప్రకారం ఒక్కో ట్యాంకరు 5 నుంచి 6 ట్రిప్పుల నీటిని ఇవ్వాల్సి ఉండగా 24 గంటల్లో ఏకంగా 16 ట్రిప్పుల నీటిని ఇవ్వడం ఎలా సాధ్యమయ్యిందో అర్థం కావడంలేదు. పైగా నీటిని అందించిన తలుపు నెంబర్లలో 37-113 ప్రాంతం లక్ష్మీపురంగా, 37-115 ప్రాంతం కనికాపురంగా, 37-118 ప్రాంతం నరిగపురంగా రాశారు. మూడు డోర్ నెంబర్లు ఉన్న ఒకే ప్రాంతానికి మూడు వేర్వేరు కాలనీలను చూపిస్తే, అధికారులు ఆమోదిస్తూ సంతకాలు పెట్టేయడం ఆశ్చర్యంగా ఉంది.’ నగరంలో 120 అద్దె ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్లు అందించడానికి ప్రభుత్వం కరువు నిధులు విడుదల చేస్తోంది. రోజుకు 480 ట్రిప్పుల నీటిని ప్రజలకు అందిస్తున్నట్లు అధికారులు పుస్తకాల్లో లెక్కలు చూపుతున్నారు. నీటి ట్యాంకర్లకు నెలకు రూ.44 లక్షలు, ఏటా సుమారు రూ.5.5 కోట్లు కరువు నిధుల నుంచి చెల్లింపులు చేస్తున్నారు. ట్యాంకర్లు సక్రమంగా ప్రజలకు నీటిని అందిస్తోందా..? లేదా అనే దిశగా అధికారులు క్షేత్రస్థాయిలో ఏ మాత్రం తనిఖీలు చేయడంలేదు. పైగా కార్యాలయాలకు వచ్చే ట్రిప్షీట్లలో ఏం రాసుందో కూడా చూడకుండా గుడ్డిగా సంతకాలు పెట్టి కరువునిధుల్ని దొడ్డిదారిన మళ్లిస్తున్న కొందరు అధికారులు అవినీతి మత్తులో జోగుతున్నారు. అద్దె నీటి ట్యాంకర్లకు గ్లోబల్ పొజీషన్ సిస్టమ్ (జీపీఎస్) వ్యవస్థను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నివేదికల్లో ఏ మాత్రం పారదర్శకత లేదు. కొన్ని ట్యాంకర్లు వెళ్లిన వీధులకే వెళ్లి నీళ్లు ఇస్తున్నట్లు రికార్డుల్లో నమోదవుతోంది. అవినీతికి పాల్పడే చాలా ట్యాంకర్లకు అసలు జీపీఎస్ పరికరాలను అమర్చకపోవడం గమనార్హం. అక్కడ వేరే ట్యాంకర్లు ఉన్నాయి మాపాక్షి ప్రాంతంలో అధికారికంగా ఒకే ట్యాంకరుతో నీళ్లు ఇస్తున్నారు. అయితే జనాభా ఎక్కువగా ఉండడంతో అనధికారికంగా మూడు ట్యాంకర్లు పెట్టుకుని నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ విషయం మాకూ తెలుసు. ఇక శివారు ప్రాంతాలు కావడంతో ఆన్లైన్ వ్యవస్థకు నెట్వర్క్ రాకపోవడంతో జీపీఎస్ పరికరాలను ఉంచలేదు. - భాస్కరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, చిత్తూరు కార్పొరేషన్ -
‘గోవాడ’లో గోల్మాల్?
చోడవరం : గోవాడ చక్కెర మిల్లులో తడిసిన పంచదార అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి కాసులు కురిపించినట్టు చెప్పుకుంటున్నారు. సుమారు రూ.8కోట్లు మేర అవినీతి జరిగిందన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ కర్మాగారం గతేడాది వరకు లాభాల బాటలో పయనించింది. పాలకవర్గం నిర్లక్ష్యంతో గతేడాది ప్రారంభంలో క్వింటా రూ.2900 ధర ఉన్నప్పుడు పంచదార అమ్మకుండా గోడౌన్లలో నిల్వ ఉంచేశారు. సుమారు 5.2లక్షల క్వింటాళ్ల పంచదారను వడ్లపూడి, కశింకోటల్లోని ప్రైవేటు గోడౌన్లతోపాటు ఫ్యాక్టరీ గోడౌన్లలో నిల్వ చేశారు. ఇంతలో హుద్‌హుద్ ధాటికి గోడౌన్ల పైకప్పులు గతేడాది ఎగిరిపోయాయి. సుమారు 2.61లక్షల క్వింటాళ్ల పంచదార తడిసిపోయింది.దీనివల్ల రూ.80కోట్లు వరకు నష్టం వచ్చిందని పాలకవర్గం, యాజమాన్యం అప్పట్లో గగ్గోలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తడిసిన పంచదార అమ్మకం,బీమా పరిహారం పొందడంలో కొంత హైడ్రామా సాగినట్టు తెలిసింది. నష్టాల బూచిని చూపి పాలకవర్గం, యాజమాన్యం కుమ్మక్కయి రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఫ్యాక్టరీకి చెందిన ఓ అధికారి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని తెలిసింది. కశింకోట సీడబ్ల్యూసీ గోడౌన్లలోని 1.19లక్షల క్వింటాళ్ల అమ్మకాల్లో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నా యి. ఈ పంచదారకు యాజమాన్యం ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీకి పూర్తిగా ప్రీమియం చెల్లించకపోవడం, తర్వాత ఏదోలా పూర్తిసరకుకు బీమా వర్తించేలా తంటాలు పడినట్టు చెప్పుకుంటున్నారు. తడిసిన పంచదారను పరిశీలించేందుకు బీమా కంపెనీ అధికారులు రావడం, బస్తాలన్నింటినీ టెండరు ద్వారా అమ్మేసి, మిగతాది ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకు జోడించి నష్టపరిహారం ఇస్తామని వారు చెప్పడం జరిగింది. దీంతో ఫ్యాక్టరీకి గోనెలు సరఫరా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌మింట్ ఇండియా అగ్రిటెక్‌ప్రైవేటు పేరున ఈ వ్యవహారంలో కీలక పాత్రపోషిస్తున్న అధికారే బీమా టెండరు వేసి తర్వాత క్వింటా రూ.1070కి కోడ్ చేసి, టెండరును దక్కించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎకాయెకిన యా జమాన్యం, పాలకవర్గంలో మెజార్టీ సభ్యులు ఏకమై మధ్యంతరంగా తీర్మానించి పంచదారను వివిధ ధరలకు బహిరంగమార్కెట్లో విక్రయించినట్టు తెలిసింది. ఈక్రమంలో సుమారు రూ.8కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ పేరున వేసిన టెండరు మేరకు సరకు అప్పగించాలని సంబంధిత కంపెనీ యజమాని ఇన్సూరెన్సు సంస్ధకు కోర్టు నోటీసులు కూడా పంపినట్టు తెలిసింది. కాగా అక్రమాల విషయం ఎక్కడ బయటపడుతుందోనని బీమా పరిహా రం రూ.4కోట్లు వద్దంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు ఇందులో కీలకపాత్రవహిస్తున్న వారు నానా తంటాలు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. -
పన్ను ఎగవేత రూ.2 కోట్లు!
- రవాణా పన్ను చెల్లించని వాహనదారులు - జిల్లాలో రెండేళ్లుగా పేరుకుపోయిన వైనం - జరిమానా విధించాలని అధికారుల నిర్ణయం - ఈ నెల 16 వరకు బకాయిల చెల్లింపునకు గడువు తాండూరు: జిల్లాలో రవాణా పన్ను (ట్రాన్స్పోర్ట్ టాక్స్) ను వాహనదారులు రూ.కోట్లల్లో ఎగవేస్తున్నారు. రెండేళ్లుగా పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. జిల్లా లో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 8 వేల రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. ఇందులో మూడు చక్రాల ఆటోలతో పాటు వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు ప్రభుత్వం రవాణా పన్ను మినహాయించింది. మిగతా రవాణా వాహనాలు పన్ను ఎగవేశాయని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరకుండాపోయింది. ఆలస్యంగా మేల్కొన్న రవాణా శాఖ అధికారులు.. పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా జిల్లా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల(ఎంవీఐ)కు ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా పన్ను బకాయిలను వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నెల 16 వరకు స్వచ్ఛందంగా పన్ను బకాయిల చెల్లింపునకు అధికారులు గడువు ఇచ్చారు. గడువులోపు పన్ను చెల్లించని వాహనదారులకు అసలు పన్నుకు 200శాతం జరిమానా విధింపుతోపాటు వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత పట్టణాలు, గ్రామాల్లోకి వెళ్లి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దిగనున్నాయి. -
పల్లె గొంతెండుతోంది
మచిలీపట్నం : జిల్లాలో 370 తాగునీటి చెరువులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ అనంతరం వారం రోజుల పాటు కాలువలకు నీటిని విడుదల చేయగా అప్పట్లో తాగునీటి చెరువులను నింపారు. ఈ చెరువుల్లోని నీరు మే నెలలోనే సగానికి పైగా వాడుకున్నారు. గత నాలుగు నెలలుగా తాగునీటి చెరువుల్లోకి చుక్కనీరు చేరకపోవటంతో చెరువులు అడుగంటాయి. చల్లపల్లి మండలం కొత్తమాజేరులోని తాగునీటి చెరువులో నీరు కలుషితం కావటం, విషజ్వరాల బారినపడి 19 మంది మృతి చెందటంతో అడుగంటిన చెరువుల్లోని నీటిని తాగాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. కోట్లాది రూపాయలు తాగునీటి శుద్ధి కోసం, సరఫరా కోసం ఖర్చు చేస్తున్నా కలుషిత నీరే తాగాల్సిన దుస్థితి ప్రజలకు ఏర్పడింది. రక్షిత నీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీరు పచ్చగా ఉండటంతో వాటిని తాగలేక జనం అల్లాడిపోతున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే పంచాయతీల్లోని 13, 14వ ఆర్థిక సంఘ నిధులను ఖర్చుచేసి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు చెప్పటమే తప్ప ఆచరణలో చూపటం లేదు. గ్రామాల్లో దాహం కేకలు... మచిలీపట్నం మండలం కోన, పల్లెతుమ్మలపాలెం, తుమ్మలచెరువు, అరిసేపల్లి, పెదయాదర, రుద్రవరం తదితర గ్రామాల్లో తాగునీటి చెరువులు పూర్తిగా అడుగంటాయి. చెరువులను నింపేందుకు కాలువల ద్వారా నీరు రాకపోవటంతో పంచాయతీ పాలకవర్గాలు చేతులెత్తేశాయి. కోన గ్రామస్తులు చెరువు పక్కనే ఉన్న బావి, పంట కాలువ పక్కనే ఉన్న బోరు పంపు వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో ఆకుమర్రు మంచినీటి పథకం ద్వారా మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇంటికి రెండు బిందెలు చొప్పున తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నందివాడ మండలం ఇలపర్రు, ఎల్‌ఎన్‌పురం, వెన్ననపూడి, అరిపిరాల, కోరుకొండ పంచాయతీల్లోని చెరువులు పూర్తిస్థాయిలో అడుగంటాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, తమిరిశ పీఏసీఎస్ అధ్యక్షుడు పిన్నమనేని బాబ్జిల సహకారంతో ఈ గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పామర్రు మండలం ఎలకుర్రులో తాగునీటి చెరువు అడుగంటింది. నీరు - చెట్టు కార్యక్రమం ద్వారా ఈ చెరువును తవ్వారు. అనంతరం చెరువును నింపకపోవటంతో గ్రామానికి నిమ్మకూరు నుంచి ఓ దాత సహాయంతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కోడూరు మండలం వి.కొత్తపాలెం, రామకృష్ణాపురం, ఊటగుండం, ఇరాలి, జరుగువానిపాలెం గ్రామాల్లో తాగునీటి పథకాలు మూలనపడ్డాయి. దీంతో ఇరాలి గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరంలోని ఇరాలి డ్యాం వద్ద ఉన్న చేతి పంపు నుంచి, జరుగువానిపాలెం గ్రామస్తులు కోడూరు వచ్చి తాగునీటిని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నాగాయలంక మండలం సొర్లగొందిలో ఉన్న తాగునీటి చెరువు ద్వారా 10 పంచాయతీలకు సంగమేశ్వరం నీటి పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ చెరువు అడుగంటడంతో తాగునీటిని పొదుపుగా గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో 1.90 మీటర్ల నీటిమట్టం మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాలతో పాటు మచిలీపట్నం, గూడూరు మండలాల్లో 3.5 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరందరికీ తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ట్యాంకు నీటి మట్టం 5.19 మీటర్లు. ప్రస్తుతం అది 1.90 మీటర్లకు చేరింది. మూడు అడుగులకు నీరు చేరితే ఆ నీటిని ఉపయోగించడానికి వీలు లేకపోవటంతో పాటు దుర్వాసన వస్తుంది. ప్రస్తుతం ఉన్న నీటి మట్టం 40 రోజులకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. పెడన, మచిలీపట్నం పురపాలక సంఘాల్లో రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేస్తుండగా గూడూరు మండలంలోని 15 పంచాయతీలకు, బందరు మండలంలోని 34 పంచాయతీలకు మూడు, నాలుగు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటిని ఎంత పొదుపుగా వాడినా నెల రోజులకు మించి తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులోని నీరు రాదని అధికారులే చెప్పటం గమనార్హం. నందిగామ పట్టణంలో ఐదు రోజులకు ఒకసారి, పది రోజులకు ఒకసారి తాగునీటిని ఇష్టానుసారంగా సరఫరా చేస్తున్నారు. ఐతవరం వద్ద మూడు బోర్లు ఉన్నాయి. మోటార్లు మరమ్మతులకు గురైనా వాటిని బాగు చేయించటం లేదు. పాత పైప్లైన్ల కారణంగా నీరు వృథా అవుతోంది. జగ్గయ్యపేట పురపాలక సంఘంలో రెండు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. బోర్ నుంచి సక్రమంగా నీరు రాకపోవటంతో పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి స్థానికులు నీటిని కొనుగోలు చేస్తున్నారు. అక్కడ.. పొరుగు జిల్లా నుంచి తెచ్చుకోవాల్సిందే పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దున ఉన్న కృత్తివెన్ను మండలంలో పల్లెపాలెం, లక్ష్మీపురం గ్రామస్తులు భీమవరం వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 20 లీటర్ల టిన్ను కొనుగోలు, రవాణా ఖర్చులు కలిసి ఇంటికి చేరేసరికి రూ.50 అవుతోంది. తాగునీటి కోసం ఇంటికి ఒకరు పనులు మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కృత్తివెన్ను మండలంలోని శీతనపల్లి, నీలిపూడి, కొమాళ్లపూడి, మాట్లం, పల్లెపాలెం, నిడమర్రు తదితర ప్రాంతాల్లోని తాగునీటి చెరువుల్లోని నీరు పూర్తిగా అడుగంటింది. కైకలూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలు దుంపగడప, ఆకివీడు గ్రామాలకు వెళ్లి తాగునీటిని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. కైకలూరు, కలిదిండి మండలాల్లోని కొట్టాడ, సున్నంపూడి గ్రామస్తులు ఉప్పుటేరును దాటి పడవలో తాగునీటి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కైకలూరులోని పెంచికలమర్రు, మండవల్లి మండలంలోని తక్కెళ్లపాడులలో మెగా తాగునీటి ప్రాజెక్టు పథకాలు ఉన్నాయి. ఈ రెండు పథకాల ద్వారా 16 పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఈ రెండు చెరువులకు గత నాలుగు నెలలుగా నీరు చేరకపోవటంతో 16 పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ 16 పంచాయతీల చుట్టూ చేపల చెరువులు ఉండటంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. గుక్కెడు నీటి కోసం ఎన్ని తిప్పలో మా గ్రామంలో గుక్కెడు నీరు దొరకని పరిస్థితి నెలకొంది. చెరువు పక్కనే ఉన్న బావిలోని నీటినే వంట చేసుకునేందుకు ఉపయోగిస్తున్నాం. ప్రతిరోజూ తెల్లవారుజాము రెండు గంటల నుంచి ఈ బావి వద్ద క్యూ కట్టాల్సిందే. కొంతసేపటికే బావిలో నీరు అయిపోతోంది. నీరు ఊరే వరకు వేచి ఉండి మళ్లీ తోడుకోవాల్సిందే. గ్రామంలోని తాగునీటి చెరువు పూర్తిగా పాడైపోయింది. - కుమారి, కోన 16 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం జిల్లాలో 370 తాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో 10 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉంది. జిల్లాలోని సముద్రతీరం, కాలువ శివారున ఉన్న 16 గ్రామాలకు 16 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ఒక మనిషికి రోజుకు 10 లీటర్లు చొప్పున అందజేస్తున్నాం. ఏదైనా గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంటే ట్యాంకర్ల ద్వారా సరఫరాకు సిద్ధంగా ఉన్నాం. - గోపాల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ -
త్వరలో డీ లిమిటేషన్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ డీ లిమిటేషన్‌కు సంబంధించిన ముసాయిదా వచ్చే వారం వెలువ డే అవకాశాలున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు, ఈనెల రెండో వారంలో .. బహుశా 9వ తేదీన ముసాయిదా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే, రాబోయే వేసవిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి.హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది డిసెంబర్లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, ఇంతవరకు డీలిమిటేషన్, డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియలే ప్రారంభం కాలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఐదు నెలల సమయం పట్టనుంది. తాజా అంచనాల మేరకు అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏప్రిల్- మేలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల జాప్యంపై అందిన ఫిర్యాదుపై పలు పర్యాయాలు విచారణ జరిపిన హైకోర్టు అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని ఆదేశించడంతోపాటు డిసెంబర్ 15 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించిన సంగతి విదితమే. ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్, ఆధార్ లింకేజీ, తదితర కార్యక్రమాలు ఒకదాని వెనుక రావడంతో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ డీలిమిటేషన్‌పై దృష్టిసారించలేదు. ఇందుకు సంబంధించిన ముసాయిదాలు ఆయా సర్కిళ్ల నుంచి ప్రధాన కార్యాలయానికి అంది నాలుగైదు నెలలవుతోంది.వాటిలో మార్పుచేర్పులు అవసరం కావడంతో ఆ మేరకు సర్కిళ్లకు తిప్పిపంపించారు. తిరిగి అందాక వాటిని మరోమారు పరిశీలించారు. ఇంకా మూడు సర్కిళ్లలో మార్పుచేర్పులు అవసరమని సంబంధిత అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. సర్కిల్ -5,సర్కిల్-7, సర్కిల్-9 లలో స్వల్ప మార్పులు అవసరమని తాజాగా గుర్తించినట్లు తెలిసింది. ఈ పని పూర్తికాగానే ముసాయిదాను ప్రజల ముందుంచాలని కమిషనర్ సోమేశ్‌కుమార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత మేరకు ఈనెల రెండో వారంలోగా దీన్ని ప్రజల ముందుకు తెచ్చి, అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. అందుకుగాను వారం రోజుల గడువివ్వనున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 డివిజన్లు/వార్డులు ఉన్నాయి. ఇవి 200 డివిజన్లకు పెరగనున్నాయి. -
మూలుగుతున్న ‘ప్రత్యేక’ నిధులు
సాక్షి, విశాఖపట్నం : అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు ప్రత్యేక నిధులతో సరి పెట్టేశారు. ఆ ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో జిల్లా యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద జిల్లాకు విదిల్చిన నిధులొచ్చి ఏడు నెలయింది. వీటి వినియోగంపై మార్గదర్శకాలు జారీయి ఆరు నెలలు కావస్తోంది. అయినా సరే ప్రతిపాదనల దశ దాటలేదు. పైసా ఖర్చు కాలేదు. ఈ నిధుల వినియోగంపై కమిటీ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంవల్లే ఈ పరిస్థితి నెలకొంది. విభజన నేపథ్యంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేకప్యాకేజీ ఇస్తామని ఊరించారు. చివరకు ప్రత్యేక అభి ృద్ధి నిధుల పేరిట జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు విదిల్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది ఫిబ్రవరి 4న జిల్లాకు రూ.50 కోట్లు మంజూరయ్యాయి. ఆ తరువాత మార్గదర్శకాలు కూడా జారీయ్యాయి. కానీ నేటికీ ఒక్క పైసా కూడా ఖర్చు కాని దుస్థితి నెలకొంది. కలెక్టర్‌కే సర్వాధికారాలు నిధుల వినియోగంపై సర్వాధికారాలు జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. ఈ నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ నిర్వహించాలి. యాక్షన్ ప్లాన్కనుగుణంగా ఎప్పటికప్పుడు యుటిలైజ్డ్ సర్టిఫికెట్లు సమర్పించడంతో పాటు ప్రత్యేకంగా ఆడిటింగ్ కూడా చేయాలి. ఈ నిధులను ఖర్చు చేసేందుకు కలెక్టర్ చైర్మన్‌గా ఒక మోనటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీకి చీఫ్ ఫ్లానింగ్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనుండగా, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల, పరిశ్రమలు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ శాఖలతో పాటు అన్ని సంక్షేమ శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. శాఖల వారీగా రూపొందించే యాక్షన్ ప్లాన్‌పై చర్చించేందుకు మోనటరింగ్ కమిటీ కనీసం నెలకోసారి భేటీ కావాల్సి ఉంది. నిధులు కేటాయింపు, వినియోగంపై ప్రతీనెలా పర్యవేక్షిస్తుండడంతో పాటు ప్రత్యేకంగా కంప్యూటరైజేషన్ కూడా చేయాలి. కానీ నిధులు విడుదలై నెలలు గడుస్తున్నా జిల్లా స్థాయి మోనటరింగ్ కమిటీ భేటీ కాలేదు. శాఖల వారీగా ప్రతిపాదనలు ఇప్పటి వరకు శాఖల వారీగా ప్రతిపాదనలందాయి. ఫిషరీస్-రూ.3.75 కోట్లు, పశు సంవర్ధక శాఖ-రూ.21.12కోట్లు, డ్వామా- రూ.7.25 కోట్లు, అటవీశాఖ రూ.2.10 కోట్లు, డీఐసీ-రూ.25లక్షలు, ఏపీ టీడీసీ- రూ.3.10 కోట్లు, ఐటీడీఎ, పాడేరు- రూ.11కోట్లు, వ్యవసాయ శాఖ-రూ.10.50కోట్లు, విద్యా శాఖ-రూ.1.93 కోట్లు, సీపీఒ- రూ.50లక్షలు, బీసీ కార్పొరేషన్ రూ.1.83కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపించారు. వీటిపై జిల్లా స్థాయి మోనటరింగ్ కమిటీ భేటీ అయి శాఖల వారీగా పంపిన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ జిల్లా స్థాయి కమిటీ భేటీ జరగకపోవడం వలన ఈ ప్రత్యేక అభివృద్ధి నిధులు వినియోగం కాలేదు. మంత్రుల నుంచి గ్రీన్‌సిగ్నెల్ లేకే! మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్రీన్‌సిగ్నెల్ రాక పోవడం వలనే ఈ నిధుల వినియోగంపై జిల్లా యంత్రాంగం జాప్యం చేస్తుందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాము సూచించిన పనులకే ఈ నిధులు కేటాయించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈ నిధుల వినియో గంపై దృష్టి సారిం చాల్సిన అవసరం ఉంది. 2014-15 ఆర్ధికసంవత్సరం నిధులు ఖర్చు కాలేదు. మరొక పక్క 2015-16 ఆర్ధిక సంవత్సరానికి కూడా త్వరలో మరో రూ.50 కోట్ల చొప్పున నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయి. -
బ్యాంకింగ్‌కు సమ్మె సెగ
♦ చెక్కుల క్లియరెన్స్‌పై ప్రభావం ♦ సమ్మెకు దూరంగా ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ♦ పేమెంట్ బ్యాంకులపై యూనియన్ల వ్యతిరేకత ముంబై : సమ్మె సెగ బ్యాంకింగ్ సేవలను తాకింది. సమ్మె ప్రభావం బ్యాంకుల చెక్కుల క్లియరింగ్ కార్యకలాపాలపై పడింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, 14 బ్యాంకు యూనియన్లు బుధవారం సమ్మె నిర్వహించాయి. 24 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 11 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 9 విదేశీ బ్యాంకులు, 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 650 కో-ఆపరేటివ్ బ్యాంకులలతో పాటు నాబార్డు, సిడ్బి ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు ఎస్బీఐతోపాటు పలు ఇతర బ్యాంకుల సిబ్బంది దూరంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగానే బ్యాకింగ్ రంగం సమ్మెలో పాల్గొనిందని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం చెప్పారు. బ్యాంకింగ్ రంగంలోని 10 లక్షల మంది సిబ్బందిలో సగ భాగానికి పైగా సమ్మెకు మద్దతునిచ్చారని తెలియజేశారు. సమ్మె ప్రభావం బ్యాంకు వ్యాపార కార్యకలాపాలపై కనిపిం చిందన్నారు. బ్యాంకులన్నీ ఏటీఎం యంత్రాల్లో డబ్బుల్ని ఫుల్‌గా లోడ్ చేసి పెట్టాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌తో సహా ప్రైవేట్ రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, యస్ బ్యాంకులు సమ్మెలో పాల్గొనలేదని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడ రల్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ధనలక్ష్మీ బ్యాంకు, రత్నాకర్ బ్యాంకు, క్యాథలిక్ సిరియన్ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. సమ్మె విజయవంతం: బ్యాంకు యూనియన్లు సమ్మె విజయవంతమైనట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. సమ్మె వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కుంటుపడిందని, ప్రధాన లావాదేవీలన్ని నిలిచిపోయాయని యూనియన్ల ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. పేమెంట్ బ్యాంకుల ఏర్పాటును కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. కాగా, ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ సమ్మెకు దూరంగా ఉంది. తమ సిబ్బంది సమ్మెలో పాల్గొన లేదని ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్, సీడీఓ అశ్విని మెహ్రా పేర్కొన్నారు. -
అధికార షాక్
సాక్షి, గుంటూరు : మాచర్ల ప్రాంతంలో ప్రభుత్వ భూములు కాజేయాలని చూసి ఆనక చేతులు కాల్చుకున్న సదరు నేత తాజాగా తన తనయుడి పేరుతో ఏర్పాటు చేసిన కేబుల్ నెట్‌వర్క్‌కు బహిరంగంగానే విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్నారు. ఆ నేతకు చెందిన కేబుల్ నోడ్లు బహిరంగంగా విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ కనిపిస్తున్నా ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మాచర్ల నియోజకవర్గ అధికారపార్టీకి చెందిన నేత తన తనయుడి పేరుతో ఆరు నెలల క్రితం ఓ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి, దుర్గి మండలాల్లోని పలు గ్రామాల్లో తక్కువ ధరలకు కనెక్షన్లు ఇచ్చారు. సహజంగా జిల్లాలోని కేబుల్ నెట్‌వర్క్‌లు తమ కనెక్షన్ నోడ్లను ప్రైవేటు స్థలాలు లేదా ఇళ్లల్లో ఏర్పాటు చేసుకుని విద్యుత్ చార్జీలు చెల్లిస్తుంటారు. నోడ్ల నుంచి ఇళ్లకు కనెక్షన్లు ఇస్తారు. సదరు టీడీపీ నేత మాత్రం బహిరంగంగా విద్యుత్ స్తంభాలకే ఈ నోడ్లను బిగించి మెయిన్‌లైను నుంచి నేరుగా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్ శాఖ ఆదాయానికి గండి.. ఆరు నెలలుగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కేబుల్ నెట్వర్క్ కోసం విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నారు. సుమారు 250 నుంచి 300 వరకు విద్యుత్ స్తంభాలపై నోడ్లను బిగించారు. రోజుకు ఒక్కో నోడ్‌కు 1 నుంచి 2 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే నెలకు 12 వేల యూనిట్లకు పైగా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నట్టు అర్థమవుతోంది. అంటే నెలకు సుమారు రూ. లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు విద్యుత్ శాఖ ఆదాయనికి గండిపడినట్టు తెలుస్తోంది. మాచర్ల పట్టణంలో విద్యుత్ శాఖలో డీఈ స్థాయి అధికారి ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విజిలెన్స్ దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటాం మాచర్ల నియోజకవర్గంలో అధికార పార్టీ నేత కేబుల్ నెట్‌వర్క్‌కు విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అక్కడి విద్యుత్ అధికారులను అడిగి వివరాలు సేకరిస్తా. మంగళవారం గుంటూరు నుంచి విజిలెన్స్ అధికారులను పంపి దాడులు నిర్వహిస్తాం. విద్యుత్ అక్రమ వినియోగం జరిగినట్లు తేలితే కేసులు పెట్టి, పెనాల్టీలు వేస్తాం. - జయభారత్‌రావు, విద్యుత్‌శాఖ ఎస్ఈ కేబుల్ నోడ్లను తొలగిస్తాం.. విద్యుత్ స్తంభాలపై కేబుల్ నోడ్లను ఉంచిన విషయం సోమవారమే నా దృష్టికి వచ్చింది. సిబ్బందిని పంపి కొన్ని స్తంభాలపై ఉన్న నోడ్లను తొలగించాం, మంగళవారం విద్యుత్ అధికారులు, సిబ్బందితో కలిసి మిగిలిన స్తంభాలపై ఉన్న కేబుల్ నోడ్లను పూర్తిగా తొలగిస్తాం. వీటిని ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. కేబుల్ వైర్లకు మాత్రం 176 స్తంభాలకు నెలకు రూ. 1700 చొప్పున పన్ను వసూలు చేస్తున్నాం. వీటిలో కూడా ఏమైనా తేడా ఉంటే పరిశీలించి చర్యలు చేపడతాం. - భాస్కర్‌బాబు, విద్యుత్ డీఈ, మాచర్ల -
‘కాంట్రాక్టు’ కుదిరింది!
సాక్షి ప్రతినిధి, కడప : పోట్లదుర్తి బ్రదర్స్‌గా అధికార పార్టీలో పెత్తనం చెలాయిస్తున్న ఆ ఇద్దరికి రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం కల్పతరువుగా మారింది. భవన నిర్మాణాలు, పరిసర గ్రామాలకు మౌలిక వసతులు సైతం వారి కనుసన్నల్లో నిర్వహించాల్సిందే. ఆర్టీపీపీని అడ్డుపెట్టుకుని దోచుకునే కార్యక్రమాన్ని నిరాటంకంగా చేస్తున్నారు. తాజాగా కాంటాక్టు కార్మికుల నియామకంలో తాము సూచించిన వారికే సగం పోస్టులు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఆమేరకు ఆర్టీపీపీ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేసి జెన్కో కార్యాలయానికి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పోట్లదుర్తి బ్రదర్స్ ఆర్టీపీపీ కేంద్రంగా లాభార్జనకు పావులు కదుపుతున్నారు. ఆరవ యూనిట్ నిర్మాణాలు మొత్తం వారి కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు రూ.1500 కోట్లు కాంట్రాక్టు పనులు చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఇతర సివిల్ వర్క్ ఏదైనా వారి నేతృత్వంలోనే చేపట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో బ్రదర్స్‌కు తెలియకుండా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఆర్టీపీపీలో యాజమాన్యం లేదని తెలుస్తోంది. కాంట్రాక్టు కార్మికుల కోసం ప్రతిపాదనలు పోట్లదుర్తి బ్రదర్స్‌లో ఒకరు ఇటీవల ఆర్టీపీపీ ఉన్నతాధికారితో సమావేశమైనట్లు సమాచారం. అధికారంలో ఉన్నాం, గ్రామాల్లో ఉద్యోగాల కోసం బాగా ఒత్తిడి ఉంది. వంద కాంటాక్టు కార్మికుల ఉద్యోగాలు కావాలని కోరినట్లు తెలిసింది. తమ చేతుల్లో నియామకాల అధికారం ఉండదని జెన్కో నుంచి అనుమతులు తీసుకోవాలని ఆర్టీపీపీ యంత్రాంగం సూచించినట్లు తెలుస్తోంది. అలాగే కానీయండి, ప్రతిపాదనలు పంపండి, జెన్కో నుంచి అనుమతులు తెప్పిస్తామని దేశం నేత పేర్కొన్నట్లు వినికిడి. ఈ ఉద్యోగాల నియామకాల్లో యూనియన్ నేతలు, ఇతర పార్టీలు అంటే కుదరదని వంద కాంట్రాక్టు ఉద్యోగాలు తమకే కావాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వంద పోస్టులు ఏకపక్షంగా కేటాయించాలంటే సాధ్యం కాదని అధికారులు వివరించడంతో 200 పోస్టులకు ప్రతిపాదనలు పంపండి, వంద పోస్టులు యూనియన్లు ఇతర సమీకరణల్లో భాగంగా కేటాయించండని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో వంద పోస్టులు తాము సూచించిన వారికి అప్పగించాలనే అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జెన్కో కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. జెన్కో డెరైక్టర్‌తో ఇప్పటికే దేశం నేత ఒకరు పలుమార్లు సమాలోచనలు చేసినట్లు సమాచారం. ఒక్కమారుగా అన్ని కాంటాక్టు కార్మికుల పోస్టులు కేటాయిస్తే ఆరోపణలు వస్తాయని ఓ డెరైక్టర్ సూచించినట్లు తెలుస్తోంది. ఏమైనా తమకు అనుమతులు ఇచ్చి తీరాల్సిందేనని, మీకు కావాలంటే సీఎంఓ నుంచి ఆదేశాలు ఇప్పిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయమై ఏం చేయాలో దిక్కుతోచక జెన్కో డెరైక్టర్లు తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. పోట్లదుర్తి బ్రదర్స్‌కు ఆర్టీపీపీ దోపిడీకి కేంద్రంగా మారిందని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. కాగా కాంటాక్టు కార్మికుల ప్రతిపాదనలపై ఆర్టీపీపీ ఇన్‌ఛార్జి సీఈ దేవేంద్రనాయక్‌ను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని చెబుతూనే, తాను క్యాంపులో ఉన్నానంటూ ఫోన్ కట్ చేశారు. -
భూంఫట్
కర్నూలు(న్యూసిటీ)/కల్లూరు రూరల్ : ఆక్రమణదారులు దేవుడి భూములనూ వదలట్లేదు. రూ.15కోట్ల విలువ చేసే చెన్నకేశవస్వామి భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. కల్లూరు మండలం సల్కాపురం గ్రామంలో వెలసిన శ్రీ చెన్నకేశవ ఆంజనేయస్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలకు 17.95 ఎకరాల భూము ఉంది. 94 సర్వే నెంబర్లో 3.75 ఎకరాలు, సర్వే నెంబర్ 72లో 4.53 ఎకరాలు, 71 సర్వే నెంబర్లో 7.51 ఎకరాలు, 44 సర్వే నెంబర్లో 2.16 ఎకరాల భూమిని అర్చకులు పి.సంజీవయ్య తండ్రి కేశవయ్య, పి.భీమయ్య తండ్రి అనంతయ్యకు ప్రభుత్వం కేటాయించింది. ఈ సర్వే నెంబర్లలోని భూములు ఆర్ఓఆర్ 1-బీలో దేవాదాయ ధర్మాదాయశాఖ పేరు మీద ఉన్నా.. రెవెన్యూ అధికారుల లీలలతో దేవుని భూములకు రెక్కలొచ్చాయి. భూములన్నీ శివకేశవయ్యరెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి పేరు మీదకు మారిపోయాయి. ప్రస్తుత వీఆర్ఓ పుల్లారెడ్డి, గతంలో కల్లూరు తహశీల్దార్‌గా పని చేసిన టి.అంజనాదేవి సమయంలో భూములు విక్రయిం చినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఈ భూములను తనఖా పెట్టి ఏకంగా లక్షల రూపాయలు బ్యాంకుల్లో అప్పుగా తీసుకోవడం గమనార్హం. 2007 సంవత్సరంలో సర్వే నెంబర్ 72లోని 4.53 ఎకరాల భూమిని కల్లూరు సహకార సంఘంలో తనఖా పెట్టి రూ.3 లక్షలు, 2010 సంవత్సరంలో సర్వే నెంబర్ 71లోని 7.5 ఎకరాలు భూమిని తా కట్టు రూ.50 వేలు, 2010 సంవత్సరంలో సర్వే నెం బర్ 72లోని 7.51 ఎకరాల భూమి తాకట్టు పెట్టి రూ.3 లక్షలు పంట రుణంగా తీసుకున్నట్టు రికార్డుల్లో తేలింది. అయితే, ఇంత జరుగుతున్నా దేవాదాయ ధర్మాదాయ భూములను కాపాడటంలో అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 3,086 దేవాలయాలకు సంబంధించి 66,472 ఎకరాల ఆలయ భూములు ఉన్నాయి. ఇందులో వందలాది ఎకరాల భూములు ఇప్పటికే ఆక్రమణదారుల చెరలో ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భూములు అమ్మినట్లు రుజువైతే క్రిమినల్ కేసులు సల్కాపురంలోని శ్రీ చెన్నకేశవ ఆంజనేయస్వా మి దేవాలయ భూములు అమ్మినట్లు రుజువైతే క్రిమినల్ కేసులు బనాయిస్తాం. అమ్మిన వారినీ, కొన్న వారినీ జైలుకు పంపుతాం. - వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కంప్యూటర్ అడంగల్‌లో పొరపాటు కంప్యూటర్ ఆన్లైన్ అడంగల్, ఆర్ఓఆర్లో పొరపాటుగా వేరేవాళ్ల పేర్లు నమోదయ్యాయి. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా శివకేశవయ్యరెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి పేర్లు లేవు. ‘మీ ఇంటికి-మీభూమి’లో ఫిర్యాదు వచ్చింది. అడంగల్, ఆర్ఓఆర్లో పేరు సవరిస్తాం. - శివరాముడు, కల్లూరు తహశీల్దార్ -
ఎర్రగుంట్ల - నంద్యాల రైలు ఆలస్యం
జమ్మలమడుగు/ఎర్రగుంట్ల : ప్రయాణికులను అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ఎర్రగుంట్ల-నంద్యాల రైలు అంత త్వరగా పట్టాలెక్కేట్టు కనిపించడం లేదు. నొస్సం వరకు అన్ని రకాల పనులు పూర్తి కావడమే గాక ఈ మార్గంలోని నూతన రైల్వే స్టేషన్లలో స్టేషన్ మాస్టర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇక రైలు తిరగడమే తరువాయి అని అందరూ ఆశించారు. కానీ ఈ మార్గంలో సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాకే గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఈనెల 24న ఈ మార్గాన్ని పరిశీలించిన సెంట్రల్ రైల్వే సెక్యూరిటీ అధికారి దినేష్‌కుమార్‌సింగ్ ప్రకటించడంతో ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ రైలు మార్గంలోని సాంకేతిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజే యడం, ఆ తర్వాత దీనిపై కేంద్రం పరిశీలించి తుది నిర్ణయం ప్రకటించడం లాంటి తతంగం పూర్తి కావాల్సి ఉంది. ఇదంతా పూర్తికావడానికి ఎంతకాలం పడుతుందన్నది ఎవరూ చెప్పలేకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే తమ పని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ మార్గంలో రైలు ఎప్పుడు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రైల్వేస్టేషన్ సిబ్బందిని వెనక్కి పిలిపించిన అధికారులు రైల్వే ట్రాక్, క్రాసింగ్ లెవల్, రైల్వే స్టేషన్ సిగ్నల్ సిస్టంను పరిశీలించడానికి కేంద్ర రైల్వే భద్రతాధికారి ఎస్సీ దినేష్‌కుమార్ సింగ్ వస్తుండటంతో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం రైల్వేస్టేషన్లలో తాత్కలికంగా అసిస్టెంట్ రైల్వేస్టేషన్ మాస్టర్లతో పాటు సిబ్బందిని నియమించారు. అధికారులు రైల్వేలైన్ సిగ్నల్, స్టేషన్లను పరిశీలించి వెళ్లారు. ప్రస్తుతం సీఆర్ఎస్ అధికారులు నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అయితే ఇది ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియకపోవడంతో రైల్వే అధికారులు తాత్కాలిక సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే రైలు తిరగడం మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. కాగా వచ్చే మార్చి నాటికి రైలు తిరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్పుకొస్తున్నారు. కోట్లాది రూపాయల వస్తువులకు భద్రత కరువు... కొత్త రైల్వేస్టేషన్లలో నియమితులైన సిబ్బంది వెనక్కి వెళ్లిపోవడంతో రైల్వేస్టేషన్లు మూతపడ్డాయి. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన స్టేషన్లలోని విలువైన వస్తువుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీఆర్ఎస్ పరిశీలన అనంతరం సిబ్బంది తిరిగి వారి పాత స్టేషన్లకు వెళ్లిపోవడంతో స్టేషన్లలోని సామగ్రి, పరికరాల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు.. రాజకీయ పార్టీలు స్పందించాలి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోందనే సమయంలో ఉన్నట్లుండి ఎర్రగుంట్ల- నంద్యాల రైలు మార్గంలో రైళ్ల రాకపోకలు ఇప్పట్లో కొనసాగే పరిస్థితి లేకపోవడంపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు స్పందించి ఈ మార్గంలో సత్వరమే రైళ్లు తిరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైతే రైల్వే కార్యాలయాల వద్ద ఆ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని ప్రజాసోమ్ము దుర్వినియోగం కాకుండ చూడాలని ప్రజలు కోరుతున్నారు. సీఆర్ఎస్ నుంచి అనుమతులు లభిస్తే ప్రస్తుతం అరక్కోణం నుంచి కడప వరకు నడుస్తున్న ప్యాసింజర్ రైలును నొస్సం వరకు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అటు అధికారులు, ఇటు రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
ఫీజు ఘనం.. బోధన దైవాదీనం
♦ అర్హతలేని ఉపాధ్యాయులతో బోధన ♦ తల్లిదండ్రులపై తీవ్రభారం ♦ ఇదీ ప్రైవేటు స్కూళ్ల పరిస్థితి ♦ చోద్యం చూస్తున్న అధికారులు నెల్లూరు (టౌన్) : గ్లోబల్, టెక్నో, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఐఐటీ పేర్లతో కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రుల జేబులకు చిల్లుపెడుతున్నాయి. ప్రచార ఆర్భాటం తప్ప విద్యాబోధనలో పస ఉండటం లేదు. వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నాయి. అర్హత కలిగిన టీచర్లను నియమించుకోవాలన్న నిబంధనను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ విద్యాసంస్థలు యథేచ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి కారణంగా ముడుపులేననే ఆరోపణలున్నాయి. గుర్తింపు లేదు : జిల్లావ్యాప్తంగా 450కు పైగా కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నట్లు అధికారుల అంచనా. ఒక్క నెల్లూరులోనే సుమారు 250కు పైగా కార్పొరేట్ పాఠశాలలున్నాయి. వీటిలో 150 కి మాత్రమే విద్యాశాఖ గుర్తింపు ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో విద్యాశాఖ అధికారులు గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటనలు ఇస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కార్పొరేట్లో బోధించేందుకు అర్హత కలిగిన టీచర్లు 25 శాతానికి మించిలేరని తెలుస్తోంది. పది, ఇంటర్ చదివిన వారిని ఉపాధ్యాయులుగా నియమించి బోధన చేయిస్తున్నారు. అనర్హులైన టీచర్ల విషయం బయటపడకుండా ఉండేందుకు రెండు రిజిస్టర్లు వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. విద్యాశాఖాధికారులకు మాత్రం అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్న రిజిష్టర్‌ను చూపుతున్నారని, పాఠశాలలో ఒరిజినల్ రిజిష్టర్ పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో ఫీజులు : సాధారణ ప్రైవేటు పాఠశాలలు గ్లోబల్, టెక్నో తదితర పేర్లు పెట్టి రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ ఫీజు పేరుతో స్కూల్‌ను బట్టి రూ.5 వేలు నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫీజు రూ.300ల నుంచి రూ.1000 లాగుతున్నాయి. కొన్ని స్కూళ్లు ట్యూషన్ ఫీజు, బుక్స్‌కు వసూలు చేస్తోంటే, మరికొన్ని బుక్స్ కోసం ప్రత్యేకంగా రూ.5 నుంచి 10వేల వరకు లాగుతున్నాయి. ఇంకా స్పోర్ట్స్ ఫీజుని రూ.1,500లు, ఇతర కార్యక్రమాల కోసం రూ.1,000లు, స్కూలు యానివర్సిడే పేరుతో రూ.1,500 లు దండుకుంటున్నారు. ఇలా రకరకాల ఫీజులతో త ల్లిదండ్రులకు తడి సి మోపెడవుతుంది. సంఖ్యకు మించి బోధన పాఠశాలలో 40 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను నియమించాలన్న నిబంధనను యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నా యి. ఒక్కో క్లాసులో 60 మందికి పైగా విద్యార్థులను కూర్చోబెట్టి బోధన చేయిస్తున్నారు. తనిఖీచేయాలని ఆదేశించాం: -ఆంజనేయులు, డీఈఓ జిల్లాలోని కార్పొరేట్ విద్యాసంస్థలను తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. అర్హతలేని ఉపాధ్యాయుల ఉన్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. ఈవిషయంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదు. -
బంగారుతల్లి భరోసానిచ్చేనా..?
తెరుచుకోని వెబ్సైట్ శాఖల మధ్య సమన్వయ లోపం పథకాన్ని కొనసాగించాలని తల్లిదండ్రుల వేడుకోలు కావలిఅర్బన్ : మొదటి, రెండవ ఆడశిశువులకు బంగారుతల్లి పథకం 2013 మే 1వ తీదీ నుంచి వర్తించేవిధంగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పథకానికి రూపకల్పన చేసింది. అప్పట్లో ఆన్లైన్లో తల్లీ బిడ్డల పూర్తి వివరాలు పుట్టిన 21 రోజుల్లోపు నమోదు చేసుకునే వారు. నమోదైన ఆడశిశువుల పేరిట సంవత్సరానికి రూ 2,500 అకౌంట్లో వేసేవారు. కానీ ్రపస్తుత ప్రభుత్వం పథకాన్ని మరుగున పడేసింది. దీంతో ఇప్పుడు పుట్టిన పిల్లలకు ఆ పథకం వర్తిస్తుందో లేదో తెలియక ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. అమలులో శాఖల మధ్య సమన్వయ లోపం: ప్రారంభంలో ఇందిరా క్రాంతి పథం అధికారులు ఈ పథకాన్ని సమీక్షించేవారు. జనన ధ్రువీకరణ పత్రం, రేషన్, ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ నంబర్ తదితర వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేసేవారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న తొలి ఏడాది రూ 2,500లు, తరువాతి సంవత్సరం రూ 2,000లు ఆ తరువాతి సంవత్సరం కొంత నగదు నేరుగా తల్లీబిడ్డల ఖాతాల్లో జమయ్యేది. డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాత మొత్తంగా రూ 2,16,000లు ఇస్తారు. వివాహ సమయం నాటికి ఈ నగదును ఉపయోగించుకోవడమే పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఆ పథకం ప్రక్రియ నిలిచిపోయింది. బంగారు తల్లి పథకానికి ఆన్లైన్లో ధరఖాస్తులు చేసుకుందామని సంఘమిత్ర కార్యాలయానికి వెళ్తే ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగడంలేదంటూ సిబ్బంది సమాధానం చెబుతున్నారని అంటున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్లైన్ సైట్ తెరుచుకోవడంలేదని చెబుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు సుమారు 270, మున్సిపాలిటీలో సుమారు 300 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేశామని ఆయా శాఖల అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే దరఖాస్తులు చేసుకోవడం ఎలా అని అడిగితే ఐసీడీఎస్ అధికారులకు ఇచ్చారని కొందరు చెప్పడంతో అక్కడకు వెళ్లి ఆరా తీస్తున్నారు. బంగారుతల్లి పథకం కొనసాగిస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్న దురాలోచనతోనే టీడీపీ ప్రభుత్వం దానిని నిలిపివేసిందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పథకాన్ని కొనసాగించి ఆడబిడ్డలను ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బంగారుతల్లి పథకం కొనసాగించాలి: నాకు మొదటి కాన్పులో బాబు పుట్టాడు. రెండవ కాన్పులో ఇద్దరు ఆడశిశువులు పుట్టారు. బంగారుతల్లి పథకం ఉందనుకుంటున్నాను. ప్రస్తుతం పథకం ప్రక్రియ జరగడంలేదని తెలియడంతో ఆవేదనగా ఉంది. పథకాన్ని యథాతదంగా కొనసాగించి ఆదుకోవాలి. - ఉమ్మడిశెట్టి కామేశ్వరి, కొత్తపల్లి, కావలి మండలం. ఆన్లైన్ సైట్ ఓపెన్ కావడంలేదు: గత కొద్ది నెలలుగా బంగారుతల్లి పథకంలో ఆన్లైన్ ఫారమ్‌లు నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ సైట్ ఓపెన్ కావడంలేదు. అది వచ్చిన వెంటనే యథావిధిగా ప్రక్రియను కొనసాగిస్తాం. - షాలీమ్రోజ్, ఏపీఎం. ఐకేపీ కావలి మండలం. ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం భరోసా కరువైంది. ప్రస్తుతం ఈ పథకం అమలులో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉండడంతో తల్లిదండ్రులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. -
ఇంత నిర్లక్ష్యమా...?
జీజీహెచ్ అధికారులపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వస్తున్న ప్రజలు వైద్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి నిప్పులు చెరిగారు. జీజీహెచ్‌లో ఎలుకలు కొరికి పసికందు మరణించిన అంశంపై బుధవారం వైఎస్సార్సీపీ నేతలు సూపరింటెండెంట్‌ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి దుస్ధితి దాపురించిందని మండిపడ్డారు. తక్షణమే మృతిపై విచారణ జరిపించి 15 రోజుల్లోగా నివేదిక తయారు చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని అధికారులను హెచ్చరించారు. పది రోజుల క్రితం ఎలుకల బెడద ఉందని అధికారులు తెలియజేస్తే పట్టించుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫా మాట్లాడుతూ తాను స్వయంగా పలుమార్లు అధికారులతో చర్చించినా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పసికందు మరణానికి అధికారులు, ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ పలు విభాగాల నేతలు ఎలికా శ్రీకాంత్‌యాదవ్, పల్లపు రాఘవ, ఆరుబండ్ల వెంకట కొండారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎంటెక్.. ఉత్త టెక్కే!
- అధ్యాపకులు, వారి సర్టిఫికెట్లూ బోగస్సే - ఎంటెక్‌లో 550 సీట్లు, ఎంఫార్మసీలో 250 సీట్ల కోత యూనివర్సిటీ : ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. జేఎన్టీయూ (ఏ) పరిధిలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో 10 వేలమంది విద్యార్థులు ఎంటెక్‌ను అభ్యసిస్తున్నారు. జేఎన్టీయూ అధికారులు ప్రతి ఏటా నిజనిర్ధారణ కమిటీ కళాశాల మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది, ల్యాబొరేటరీ, గ్రంథాలయం వంటి అంశాలను పరిశీలించి నివేదికను అందిస్తుంది. తనిఖీల సమయంలో మాత్రం మొబైల్ ప్యాకింగ్ చేస్తున్న కళాశాలలు, తరువాత గాలికి వదిలేస్తున్నాయి. ఏఐసీటీఈ తనిఖీల్లో ఈ లోటుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. దాగుడు మూతలు : ఒక కళాశాలలో ఉన్న వారినే మరో కళాశాల అధ్యాపకులుగా చూపించడం, అర్హతలు లేకున్నా బోధన సిబ్బందిని నియమించడం, కొంత మంది అర్హతలతో రికార్డులు సృష్టించుకొన్నా వారి సర్టిఫికెట్ బోగస్ అని నిర్ధారణ అవుతున్నాయి. చాలా కళాశాలల్లో అర్హత పత్రాలు చూస్తే అటువంటి వర్సిటీలు దేశ, విదేశాల్లో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీటెక్‌లలో సీట్లు అరకొరగా భర్తీ అవుతున్నా, ఎంటెక్‌లో మాత్రం సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అవుతున్నాయి. ఒక్క జేఎన్టీయూ అనంతపురం పరిధిలో 4 వేల మంది విద్యార్థులు కళాశాలల్లో అడుగు పెట్టకుండానే ఎంటెక్ పట్టా అందుకొంటున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని జేఎన్టీయూ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే బయోమెట్రిక్‌ను ట్యాంపర్ చేసి పరీక్షలకు హాజరు శాతాన్ని చూపిస్తున్నారు. పంపిన డేటా నకిలీదా? సరైనదా? అని తేల్చడానికి వర్సిటీ వద్ద సరైన యంత్రాంగం లేకపోవడంతో ఇవి అలంకారప్రాయంగానే కళాశాలలో ఉండిపోయాయి. ఎం ఫార్మసీ అడ్మిషన్ పొందితే... : గతేడాది ఎంఫార్మసీ సీట్లు నింపుకోవడానికి విద్యార్థులకు ఉచితంగా ైబె క్, ల్యాప్‌టాప్ కంప్యూటర్లు ఇచ్చారు. ఒక్కో విద్యార్థికి రూ.2లక్షలు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వస్తుంది. దీంతో విద్యార్థి తరగతులకు హాజరైనట్లు చూపుతున్నా రు. ఎంటెక్ కోర్సు రెండేళ్లకు రూ.1,14,000 వస్తుండడంతో తాయిలాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో పీజీఈ సెట్ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 3వరకు అనంతపురంతోపాటు మరో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో విద్యార్థుల సర్టిఫికెట్స్ పరిశీలన నిర్వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు, వసతులను దృష్టిలో ఉంచుకుని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (ఏ) పరిధిలో 550 ఎంటెక్ సీట్లు, 250 ఎం.ఫార్మసీ సీట్లు కోత విధించారు. -
పల్లెకు జ్వరం
పల్లెలు పడకేస్తున్నాయి. జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అధ్వానంగా ఉన్న పారిశుధ్యం, దీంతో ఉధృతమవుతున్న దోమలు, మరోవైపు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం... వెరసి గ్రామాలు ‘గజగజ’ వ ణికిపోతున్నాయి. - జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న విషజ్వరాలు - మంచికలపూడిలో ఇంటింటికీ జ్వరపీడితులు - ఈపూరులో రెండురోజుల కిందట జ్వరంతో ఇద్దరు మృతి - ఆలస్యంగా వైద్యశిబిరాల ఏర్పాటు - నిర్లిప్తంగా అధికారులు సాక్షి నెట్వర్క్: జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి. పదిరోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా తెనాలి డివిజన్, ఈపూరు, పెదకూరపాడు, అమరావతి ప్రాంతాల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా విషజ్వరాలకు విలవిల్లాడుతున్నారు. దుగ్గిరాల మండలంలోని మంచికలపూడిలో సుమారు 100మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు. వీరిలో కొందరు తెనాలి ప్రభుత్వ వైద్యశాలతో చికిత్స పొందుతుండగా, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. రెండ్రోరోజుల నుంచి ఇక్కడ వైద్యశిబిరం ఏర్పాటుచేసి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆదివారం డీఎంహెచ్‌వో పద్మజరాణి ఈ శిబిరానికి వచ్చి బాధితులను పరామర్శించారు. కొల్లిపర సామాజిక ఆరోగ్యకేంద్రానికి రోజుకు 50మందికి పైగా జ్వరపీడుతులు వస్తున్నారు. వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజుకు సుమారు 20 మంది, తెనాలి మండలం సంగంజాగర్లమూడి పీహెచ్సీ పరిధిలో రోజూ 125మంది జ్వరపీడితులు చికి త్స కోసం వస్తున్నారు. కొలకలూరు పీహెచ్సీ పరిధిలో అదే పరిస్థితి నెలకొంది.ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజులు 200 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పిట్టలవానిపాలెం, భవనంవారిపాలెంలో సీజనల్ జ్వరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వారంరోజులుగా ప్రజలు జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. గ్రామంలోని రామమందిరం సమీపంలోని రెండు వీధుల్లో అధికశాతం మంది టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని సభ్యులకు జ్వరం రావడంతో ప్రైవేట్ వైద్యులతో చికిత్స చేయించుకున్నారు. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్ వెళ్లి అక్కడ వైద్యపరీక్షలు చేయించుకోగా తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిందని వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సమాచారం. పెదకూరపాడు నియోజకవర్గంలో విషజ్వరాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండ్రోజుల కిందట జిల్లా మలేరియా అధికారులు 75త్యాళ్ళూరులో పర్యటించి డెంగీవ్యాధికి కారణమయ్యే దోమల లార్వా ఇక్కడ అధికంగా ఉందని తేల్చారు. పరిశుభ్రంగా ఉండే 75త్యాళ్ళూరులోనే ఈ పరిస్థితి నెలకొంటే పునరావాస కేంద్రాలు, తండా, శివారు గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్ధమవుతుంది. అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో తండా గ్రామాల్లో విషజ్వరాలు అధికంగా ఉన్నాయి. ఈపూరు మండలంలోని ఊడిజర్ల కాలనీలో విషజర్వాలతో మంచానపట్టారు. పలువురు వినుకొండ, నర్సరావుపేట, గుంటూరుల్లోని ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొంతుతున్నారు. రెండ్రోజుల కిందట గ్రామానికి చెందిన నంబూరి మరియదాస్(35) గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే కాలనీకి చెందిన కాకాని తిరుపల్(30) జ్వరంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ క్రమంలో కాలనీలో వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికీ తిరిగి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. కూలికి వెళ్లలేక.. జ్వరాలతో బాధపడుతున్న వారిలో ఎ క్కువమంది వ్యవసాయ కూలీలే ఉన్నా రు. వారంతా అనారోగ్యంతో పనులకు వెళ్లలేక, ఇల్లు గడవడం కష్టంగామారి తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ప్రజలూ ఇవి పాటించాలి.. - ఇంటిలోపల బయట నీటి నిల్వలు లేకుండా చూడాలి. - ప్రతి శుక్రవారం వీక్లీ డ్రైడేగా పాటించాలి. ఇంటి ఆవరణలో కొబ్బరిబోండాలు, పాతటైర్లు, రోళ్లలో నీటినిల్వలు ఉండకుండా చూడాలి. - నీటి గుంతలో కిరోసిన్, మడ్డి ఆయిల్ చల్లించాలి. పందులు జనావాసాలకు దూరంగా ఉంచాలి - దోమతెరలు వాడాలి. దోమలు కుట్టకండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధుల బారినపడితే వైద్యులను సంప్రదించాలి. -
తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
♦ వైఎస్సార్ సీపీ కార్యకర్త సుబాబుల్ తోట నరికివేత ♦ కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరించిన టీడీపీ కార్యకర్తలు ♦ బాధితుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని తహ శీల్దార్, ఎస్సై ♦ న్యాయం కోసం పోరాడుతున్న వృద్ధుడు లక్ష్మీనరసయ్య చిలంకూరు (మర్రిపూడి) : ఆ గ్రామంలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్తను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన పెంచుకున్న సుబాబుల్ చెట్లను నరికి కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించినా తహశీల్దార్, ఎస్సై నోరుమెదపకపోవడం గమనార్హం. బాధితుని కథనం ప్రకారం.. మండలంలోని చిలంకూరుకు చెందిన రాయపాటి లక్ష్మీనరసయ్యకు 81 ఏళ్లు. ఆయన వైఎస్సార్ సీపీలో కార్యకర్తగా వ్యవహరిస్తునా ్నరు. గ్రామంలోని సర్వే నంబర్ 82-3లో సుమారు 10 ఎకరాల భూమి ఉంది. లక్ష్మీనరసయ్యకు ఆ భూమి తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చింది. భూమికి సంబంధించి పట్టాదారుపాస్‌పుస్తకాలు, ఎఫ్‌ఎల్‌ఆర్, ఒన్‌బీ, అడంగల్.. అన్ని సక్రమంగానే ఉన్నాయి. లక్ష్మీనరసయ్య తమ భూమి చుట్టూ రాతి స్తంభాలు పాతుకుని చుట్టూ ఇనుప కంచె వేసుకున్నాడు. గట్లపై టేకు, కొబ్బరి, వేప చె ట్లు నాటుకున్నాడు. అవి దాదాపు 30 అడుగుల ఎత్తు పెరిగాయి. 3 బోర్లతో పాటు ఓ బావి తవ్వించి మామిడి, సపోట, బత్తాయి చెట్లు సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో చెట్లు ఎండు ముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఆ భూమిపై టీడీపీ నేతల కన్నుపడింది. గ్రామంలో లక్ష్మీనరసయ్య వైఎస్సార్ సీపీ సానుభూతి పరునిగా, గ్రామస్థాయి నాయకునిగా ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. దీంతో టీడీపీ వర్గీయులు ఆయనపై కక్ష పెంచుకున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారులు రాయపాటి కోటేశ్వరరావు, ఆర్.కోటయ్య, ఆర్.ఆంజనేయులు, అనుసూయలు రంగంలోకి దిగి కూలీలతో ఈ నెల 17న ఫెన్సింగ్ తీగ తెగ్గొట్టి, రాళ్లు విరగ్గొట్టి దాదాపు 1000పైగా ఉన్న సుబాబుల్ చె ట్లను నరికేశారు. పోరుకు దిగిన బాధితుడు బాధితుడు లక్ష్మీనరసయ్య విషయాన్ని తహశీల్దార్ శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. అధికారులు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్డు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చాడు. కోర్టు ఆదేశాలను సైతం భేఖాత ర్ చేసి నాయకులు, అధికారుల అండతో లక్ష్మీనరసయ్య భూమిని స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ మద్దతుదారులు రంగం సిద్ధం చేసుకున్నారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని బాధితుడు చెప్పాడు. -
నిలువు దోపిడీ
‘సెకండ్ హ్యాండ్ బైక్’ పేర కుచ్చుటోపీ ♦ ఫైనాన్స్ వ్యాపారుల మాయాజాలం ♦ రూ.కోట్లలో గుట్టుగా వ్యాపారం ♦ పుట్టగొడుగుల్లా దుకాణాలు ♦ చోద్యం చూస్తున్నఅధికారులు ఈజీ ఫైనాన్స్ ముసుగులో రూపాయికి రూపాయి.. వడ్డీలకు చక్రవడ్డీ.. ఏ చట్టానికి చిక్కకుండా గుట్టుగా వ్యాపారం.. ఆటోమొబైల్ వ్యాపారంలో బడా ఆర్థిక నేరం... బడుగులే టార్గెట్.. యువత కోరికలు, బలహీనతలే కాసులు కురిపిస్తున్నాయి.. పల్లెలకు సైతం విస్తరించిన సెకండ్ హ్యాండ్ బైక్ ఫైనాన్స్ సంస్థలపై ‘సాక్షి’ కథనం.. తూప్రాన్ : పట్టణానికి చెందిన రాజు ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. పనిలో భాగంగా అక్కడక్కడా తిరగాలి. అరకొర వేతనంతో బైక్ కొనాలంటే కష్టం.. స్థిరాదాయం లేనందున మోటారు సైకిల్ కొనుగోలుకు అప్పిచ్చేవారు లేరు. రాజే కాదు.. ఇలా చాలామంది ఉన్నారు. ఇటువంటి వారి అవసరాలను సొమ్ము చేసుకోవడానికి బైక్ ఫైనాన్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. సామాన్యుడికి సులువుగా అప్పులిచ్చి నిలువు దోపిడీ చేస్తున్నాయి. అసలు వ్యాపారులు హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించి బ్రాంచీలుగా పల్లెల్లో నిరుద్యోగ యువకులను ఏజెంట్లుగా పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నారు. పుట్టగొడుగుల్లా షాపులు ప్రతి మండల కేంద్రంలోనూ కనిపిస్తున్న షాపులు సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్‌లే. ఇవి.. చిన్నచిన్న వ్యాపారులు, రోజువారి కూలీలు, చిరుద్యోగులు, దిగువస్థాయి, మధ్యతరగతి యువకులు, విద్యార్థులకు ఎలాంటి షరతులూ లేకుండా కేవలం ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులతో సెకండ్ హ్యాండ్ బైక్‌లను నెలవారి చెల్లింపుల పద్ధతిలో అమ్ముతున్నాయి. దీంతో ఈ వర్గాల జనానికి బైక్ ముచ్చట తీరుతోంది. కానీ బైక్ తీసుకున్నాక అసలు కష్టాలు మొదలవుతున్నాయి. బైక్ సొం తం చేసుకోవాలనే కుతూహలంతో ఫైనాన్సియ ర్లు చెప్పిన చోటల్లా కొనుగోలుదారులు సంతకాలు చేసేస్తున్నారు. దీంతో బైక్ మీద వీరికి ఎటువంటి హక్కూ లేకుండాపోతోంది. నెల వా యిదా ఆలస్యమైతే ఈ మొత్తం రోజు వారి వడ్డీ కింద వ్యాపారులు లెక్కిస్తారు. వాయిదా వసూలుకు ఎన్నిసార్లు వస్తే అంత వసూలు చార్జీలు అ దనంగా చెల్లించాలి. ఇదంతా అప్పడికప్పుడు తె లియదు. వాయిదాలన్నీ తీరాక బైక్ ఆర్సీ బుక్ అడిగితే ఇవన్నీ లెక్కగట్టి ఆఖర్లో చెప్తారు. అప్పు డు లబోదిబోమన్నా లాభం లేదు. ఎందుకంటే బైక్ హక్కులు తమ పేరున లేకపోవడంతో నోరెత్తకుండా చెల్లించి బయటపడుతున్నారు. ఇది మరో రకం దందా.. ధరలో పాతికి శాతం డబ్బు కడితే బైక్ ఇస్తున్నా రు. తర్వాత రెండు వాయిదాలు సరిగా కట్టకపోతే బైక్‌ను ఫైనాన్సియర్ మనుషులు స్వాధీనం చేసుకుంటారు. ఇటువంటి సందర్భంలో ముందు చెల్లించిన పాతిక శాతం డబ్బు వెనక్కి ఇవ్వరు. ఇలా చోరీ వాహనాలు, ప్రమాదాలకు గురైన వాహనాలను సైతం సులువుగా అంటగట్టి మరింత సొమ్ము చేసుకుంటున్నారు. దారితప్పుతున్న విద్యార్థులు చాలామంది యువకులు కాలేజీలకు బైక్‌లపైనే వెళ్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు కొనే పరి స్థి తి లేకున్నా, ఒత్తిడి చేయడంతో ఫైనాన్స్‌ల్లో బైక్ లు ఇప్పిస్తున్నారు. తీరా కొన్ని నెలల పాటు ఫై నాన్స్ డబ్బులు కట్టకపోయేసరికి విద్యార్థుల ఇళ్ల వద్ద ఫైనాన్సియర్లు గొడవ చేస్తే పరువుపోతుం డడంతో పుస్తెలు తాకట్టు పెట్టి అప్పులు తీర్చిన దాఖలాలున్నాయి. బైక్ అనేది గ్రామాల్లో స్టేటస్ సింబల్‌గా మారడంతో చాలామంది వీటి ని సొంతం చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థల ఉ చ్చులో పడిపోతున్నారు. ఇక, ఇలా విక్రయిస్తు న్న బైక్‌ల్లో దొంగ వాహనాలూ ఉంటున్నాయి. వీటికి నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. పోలీసులకు పట్టుబడినప్పడే ఇది వెలుగుచూస్తోంది. పట్టించుకోని అధికారులు: ఫైనాన్స్ వ్యాపారానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ఎంత వడ్డీ గుంజుకున్నా ఇచ్చేవాడి ఇష్టం, తీసుకునే వాడి అవసరం అన్నట్లు ఉం టుంది. సెకండ్ హ్యాండ్ బైక్ అయినప్పటికీ త క్కువకు కొని ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. ఈ లావాదేవీలపై ఎటువంటి పన్ను లెక్కలోకి రావడంలేదు. వడ్డీపై లాభాలు వస్తున్నా ఇది కూడా ఐటీ శాఖ పరిధిలోకి రావడంలేదు. పెద్దపెద్ద షోరూంలు ఏర్పాటు చేస్తున్నా కస్టమ్స్ శాఖ గానీ, వాణిజ్య పన్నుల శాఖ గానీ, ముస్సిపాలిటీ, పంచాయతీలు చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ఈ వ్యాపారం మాఫియాలా మారి దోపిడీకి తెడబడుతోంది. గ్యారెంటీలు అవసరం లేదు పాత వాహనాలు విక్రయించేటప్పుడు తీసుకోవాల్సిన నిబంధనలు మా వద్ద ఉన్నాయి. కొనుగొలుదారుల నివాస ధ్రువపత్రాలు మాత్రమే పరిశీలిస్తాం. ముందస్తు బ్యాంకు చెక్కులు ఇస్తే చాలు. గ్యారంటీలు అవసరం లేదు. ఒకరిని జమానత్‌గా తీసుకుంటాం. మొదట వ్యాపారం నిర్వహించేందుకు స్థానిక గ్రామ పంచాయతీలో లెసైన్స్ పొందుతాం. ఫైనాన్స్ వ్యాపారం కావడంతో ఇన్‌కంటాక్స్ మాత్రమే చెల్లిస్తాం. -ఓ వ్యాపారి -
‘అనుబంధం’లో ‘జ్యోతి’ లేదు!
తండాల వైపు దృష్టి సారించని యంత్రాంగం కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన సమస్యలు కమిటీల్లో పేర్ల వరకే పరిమితమైన అధికారులు అభివృద్ధి పనులు ఇంకెప్పుడని ప్రశ్నిస్తున్న ప్రజలు తాండూరు రూరల్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం అనుబంధ గ్రామాల్లో కొనసాగడంలేదు. ఎన్నాళ్లుగా తిష్టవేసిన సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ఆశపడిన ప్రజలు నిరాశ కు గురవుతున్నారు. కమిటీల్లో పలువురి పేర్లను నామమాత్రంగా చేర్చిన నోడల్ అధికారులు ఆ పిదప పట్టించుకోవడంలేదంటున్నారు. గ్రామాలపై వివక్ష కనబరుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వారంరోజులవుతున్నా ఇటువైపు చూసిన నాథుడే కరువయ్యాడని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాండూరు మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో గోపన్‌పల్లి, చిట్టిఘనాపూర్, గుంతబాసుపల్లి, చింతమణిపట్నం, బోంకూర్, రాంపూర్, రాంపూర్చిన్నతండా, పెద్దతంవీర్శెట్టిపల్లి, సంకిరెడ్డిపల్లి, గుండ్లమడుగుతండా, జినుగుర్తితండా, ఉద్దాండపూర్ తండాలు అనుబంధ గ్రామాలున్నాయి. ఈ నెల 17న ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజులవుతున్నా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కాల్వల్లో మురుగు ఎక్కడికక్కడే పేరుకుపోయింది. తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయడంలేదు. పైపులైన్ల లీకేజీలతో పాటు పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. అయితే.. నోడల్ అధికారులు మాత్రం అనుబంధ గ్రామాల నుంచి వార్డు సభ్యులను, మరికొందరిని గ్రామకమిటీలో చేర్చుకున్నారు. అధికారులు కమిటీలలో పేర్లు చేర్చుకోవడం వరకే పరిమితమయ్యారు. తమ గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరినా స్పందించడంలేదని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుబంధ గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక అధికారుల్ని ఆదేశించాం గ్రామజ్యోతి పథకం కింద ముందుగా పంచాయతీలకు ప్రాధాన్యమిస్తున్నాం. అనుబంధ గ్రామాల్లోని వార్డు సభ్యులు, యువకులు కమిటీలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని అనుబంధ గ్రామాల్లో పనులు చేశాం. గ్రామజ్యోతి పథకం ద్వారా వచ్చిన నిధులు కూడా అనుబంధ గ్రామాలకు కేటాయించాం. ఆయా గ్రామాల్లో గ్రామజ్యోతి పనులు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదే శాలిచ్చాం. - జయరాజ్, గ్రామజ్యోతి మండల చేంజ్ అధికారి -
ఎండిపోయిన ‘ఖరీఫ్’
♦ 11 లక్షల హెక్టార్లలో పంట నష్టం ♦ 2014 కన్నా దారుణమైన పరిస్థితి ♦ ధరలు పెరిగే అవకాశం ఉందన్న అధికారులు సాక్షి, ముంబై : రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంట పూర్తిగా ఎండిపోయింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో లక్షల హెక్టార్ల పంట నాశనమైంది. జొన్నలు, సజ్జలు, పెసర్లు, మొక్కజొన్న, మినుమలు లాంటి పంటలు 70 శాతం ఎండిపోయాయి. జూన్ నెలలో వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల హెక్టార్లలో రైతులు విత్తనాలు నాటారు. అయితే వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ ఎండిపోయాయి. 2014 కంటే కూడా ఈ ఏడాది పరిస్థితి మరింత దిగజారిందని అధికారులు అంటున్నారు. తిరిగి ఖరీఫ్ పంట వేయాలన్నా పరిస్థితులు అనుకూలించలేదని పేర్కొన్నారు. పంట దిగుబడి తగ్గడం వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 144 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంట సాగు చేస్తారని, అయితే ఇప్పటివరకు 123 లక్షల హెక్టార్లలో విత్తనాలు నాటగా వర్షాభావ పరిస్థితుల వల్ల 11 లక్షల హెక్టార్ల పంట నాశనమైందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మినుములు, పెసర్లు, సోయాబీన్, సజ్జలు పప్పు ధాన్యాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు అంటున్నారు. పెసర్లు, సోయాబీస్ అధికంగా పండించే మరాఠ్వాడా ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటుంది. రబీ సీజన్ సమీపిస్తుండటంతో పాడైపోయిన పంటల స్థానంలో తిరిగి విత్తనాలు వేసినా లాభం ఉండదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పుణే జిల్లాలోని ఇందాపూర్, బారామతి, శిరూర్, దౌండ్లలో పంటలు ఎండిపోయాయని, నాసిక్, జల్గావ్, షోలాపూర్, సాంగ్లీ, అహ్మద్‌నగర్‌లలో పరిస్థితి మరింతగా దారుణంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పుణే జిల్లాలో 1.60 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంట ఎండిపోయిందని, అధికమొత్తంలో పంట పనికి రాకుండా పోయిందని చెబుతున్నారు. పుంధర్, బారామతి, ఇందాపూర్, దౌండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల నుంచి వర్షాలు కురవలేదని, దీంతో 15 వేల హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. -
అధికారులపై ఎర్రబెల్లి ఆగ్రహం
డెంగీతో వార్డు సభ్యుడు శ్రీవేణు మృతి కోలుకొండలో తాండవిస్తున్న పారిశుద్ధ్యలోపం కోలుకొండ(దేవరుప్పుల) : సీజనల్ వ్యాధు ల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడంలో అనుబంధ శాఖల తీవ్రవైఫల్యంతోనే విషజ్వరాలు విజృంభిస్తున్నాయని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కోలుకొండలో టీడీపీ నేత, ఆరె సంక్షేమ సంఘ మండల అధ్యక్షుడు సింధె శ్రీవేణు డెంగ్యూ జ్వరంతో మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని సందర్శించి ఆయా శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల కిందట ఇక్కడి పరిస్థితిపై డీఎంహెచ్ఓ సాంబశివరావు దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యం చేశారని, దీనికితోడు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇంటింటా విషజ్వరాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లో జనగామ ఆర్డీఓ, డీఎంహెచ్ఓలపై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుటాహుటిన వచ్చిన డీఎంహెచ్ఓ సాంబశివరావు గ్రామానికి చేరుకొని కనీసం వాహనం దిగకుండా అరనిమిషంలోనే తిరుగుప్రయాణం పట్టడం నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుంది. అనంతరం వచ్చిన జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి పంచాయతీ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో వీధులను పరిశీలించి పారిశుధ్యంపై సత్వర చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు పారిశుధ్యలోపంపై అసహనం వ్యక్తం చేశారు. -
తగ్గని జ్వరం
మచిలీపట్నం : జిల్లాలో విషజ్వరాలు అదుపులోకి రావటం లేదు. సోకింది విషజ్వరమో, డెంగీ జ్వరమో తేలక ప్రజలు సతమతమవుతున్నారు. చల్లపల్లి మండలం మాజేరులో విషజ్వరాలతో 18 మంది మరణించినా, ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోని పరిస్థితి నెలకొంది. తోట్లవల్లూరులో 700 మంది జ్వరంబారిన పడ్డారు. ఈ గ్రామంలో 20 రోజుల పాటు వైద్యశిబిరం నిర్వహించారు. తాజాగా నాగాయలంక మండలం గణపేశ్వరంలో వంద మందికి పైగా జ్వరంబారిన పడ్డారు. గ్రామానికి చెందిన నక్కల నిరీక్షణరావు అనే వృద్ధుడు జ్వరంతో శనివారం మృతి చెందాడని సమాచారం. దీంతో గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌వో ఆర్.నాగమల్లేశ్వరి, ఆర్డీవో పి.సాయిబాబు గ్రామాన్ని సందర్శిం చారు. బందరు మండలం చిన్నాపురంలో 250 మందికి పైగా విషజ్వరాల బారినపడ్డారు. ఈ గ్రామంలోనూ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశిబి రాల్లో నామమాత్రంగా మందులు ఇస్తుండటంతో రోగులు విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంత కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జ్వరపీడితులు 2,56,244 మంది జిల్లాలో ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు 2,56,244 మందికి జ్వరం సోకిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 157 మలేరియా కేసులు, 44 డెంగీ కేసులని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. 8,800 మందికి టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించగా 2,843 మందికి టైఫాయిడ్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం జ్వరం రాగానే విపరీతమైన ఒళ్లు నొప్పులు వచ్చి నాలుగైదు రోజులు తగ్గడంలేదు. కొందరికి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతోంది. తీవ్రజ్వరం బారినపడిన వారు పీహెచ్‌సీలకు వెళ్తే డెంగీ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం లేని పరిస్థితి ఉంది. గత ఏడాది మచిలీపట్నం, విజయవాడ ప్రభుత్వాస్పత్రులకు డెంగీ నిర్ధారణ కిట్లు ఇచ్చారు. ఈ ఏడాది మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి డెంగీ నిర్ధారణకిట్లు ఇచ్చినా పెద్దగా ఇక్కడ పరీక్షలు జరపని పరిస్థితి ఉంది. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో రెండు నెలల్లో నాలుగు డెంగీ కేసులే నమోదయ్యాయని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. డెంగీ కేసులను దాచేస్తున్నారా..! జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ విషజ్వరాలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో సరైన వైద్యసేవలు అందక జ్వరపీడితులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. డెంగీకేసులను నిర్ధారిస్తే ఆస్పత్రులపై చర్యలు తప్పవని జిల్లా వైద్యశాఖాధికారులు జారీ చేసిన హెచ్చరికలతో ప్రైవేటు వైద్యుల తమ వద్దకు వచ్చిన రోగులకు సివియర్ ఫీవర్ అనే కొత్త పేరు పెట్టి చికిత్సచేస్తున్నారు. రక్తంలో తెల్లరక్త కణాల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు ఇంజక్షన్లు చేస్తున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్‌కు రూ.2300 చొప్పున వసూలు చేస్తున్నారు. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉంటే మూడు నుంచి ఐదు ఇంజక్షన్లు చేయాల్సి వస్తోంది. ఇవి కాకుండా డెంగీ లక్షణాలను తగ్గించేందుకు చేస్తున్న కోర్స్ ఇంజక్షన్లకు రూ.1600 ఖర్చవుతోందని రోగులు పేర్కొంటున్నారు. డెంగీ లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లిన రోగులు కోలుకునేందుకు రూ.30 వేల నుంచి రూ.35 వేల ఖర్చు చేయాల్సి వస్తోంది. రోగులు డిశ్చార్జి అయ్యే సమయంలో ‘ఇంతకాలం మీరు డెంగీకి చికిత్సపొందారు. అయితే అధికారికంగా ధ్రువీకరించలేం. మందులు జాగ్రత్తగా వాడండి’ అని వైద్యులు చెప్పి పంపుతున్నారు. బందరు మండలం వాడపాలేనికి చెందిన కాండ్ర వెంకటేశ్వరరావు, బొడ్డు లక్ష్మణరావు, ఇంతేటి శేషారావు డెంగీ లక్షణాలతో చికిత్స పొందారు. కాండ్ర వెంకటేశ్వరరావు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డెంగీకి చికిత్స చేయించుకున్నారు. దీంతో అతనికి మాత్రమే డెంగీ సోకిందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో విజయవాడలో మూడు, మిగిలినవి జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. -
నల్లమలలో నిఘా నేత్రాలు
పెద్దదోర్నాల : నల్లమల పరిరక్షణకు అటవీశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అటవీశాఖ ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నల్లమల పరిసరాల్లోని ఫారెస్టు చెక్‌పోస్టుల వద్ద అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి వాహనంపై డేగకన్ను వేసేలా చర్యలు చేపట్టింది. దీంతో కొంత కాలం నుంచి ప్రమాదాల సంఖ్యతో పాటు, నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్లలో నల్లమలలో ప్రయాణించే వాహనాల నుంచి పర్యావరణ రుసుం వసూలు చేస్తుండటంతో పాటు అటవీశాఖకు ఏటా రూ.18 లక్షలకుపైగా అదనపు ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులతో నల్లమలలో ప్రయాణికులు జారవిడిచే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ప్లాస్టిక్ ఫ్రీజోన్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా 32 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని ఏర్పాటు చేసి తద్వారా నల్లమల్లలో ప్రయాణించే వారు జారవిడిచే ప్టాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అటవీ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన వాకీటాకీలను ఉపయోగిస్తున్నారు. నిఘా కెమెరాలు, టోల్ గేట్ల ఏర్పాటుతో ఉపయోగాలు ఎన్నో... అటవీ సంపద అక్రమ తరలింపు అరికట్టేందుకు పెద్దదోర్నాల సమీపంలోని గణపతి చెక్‌పోస్టు వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. నల్లమలలో హాయిగా విహరించే జంతువులు రోడ్లపై తిరుగుతూ తరుచూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న నేపథ్యంలో నల్లమల అటవీప్రాంతంలో ప్రయాణించే వాహనాల వేగనియంత్రణ, ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటుతో మంచి ఫలితాలు వస్తున్నాయి. నల్లమలలో ప్రయాణించే వాహనాలు ఏ సమయంలో చెక్‌పోస్టుల వద్దకు వచ్చాయి. ఎంత సమయం అటవీప్రాంతంలో ప్రయాణించి అవతలి చెక్‌పోస్టులను దాటాయి. ఇలా వివరాలన్నీ కంప్యూటర్లు, నిఘా కెమెరాలలో రికార్డు అవుతుండటంతో కేసులు చేధించటం సులభతరంగా మారింది. దీని వల్ల అటవీ ప్రాంతంలో సంచరించే వన్య ప్రాణులకు ప్రమాదం కలిగించే వాహనాలను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేయటం, నల్లమలలో జరిగే అక్రమ రవాణా, వన్యప్రాణుల ప్రాణాలను బలిగొనే వాహనాల గుర్తింపుతో పాటు, పోలీసు శాఖకు సంబంధించి ఎన్నో నేరాలు, నేరపూరిత వ్యక్తుల కదలికల గుర్తింపు, ప్రమాదాలకు కారణమైన వాహనాల గుర్తింపు సైతం సులభతరంగా మారింది, చెక్ పోస్టుల వద్ద కంప్యూటర్ ఎన్క్లోజర్లతోపాటు టోల్గేట్, ఎలక్ట్రానిక్ గేటు ఏర్పాటు చేశారు. నల్లమలలోని ముఖ్య ప్రాంతాల్లో ట్రాప్డ్ కెమెరాలను ఏర్పాటు చేసి వన్యప్రాణుల కదలికలతో పాటు ఇతరుల సంచారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. -
వలలో పడుతున్నారు...
ఇంటర్‘నెట్’లో యువత చిక్కుకుని విలవిలలాడుతోంది. నట్టింటిలోకి దూసుకొస్తున్న ఈ సాంకేతిక మాయాజాలం కుర్రాళ్లపై విషపు వలను విసురుతోంది. ఫలితంగా యువత పెడదారిన పడుతున్నారు. జిల్లాలో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో మైనర్లే నిందితులుగా ఉండడం దిగ్భ్రాంతికరమైన విషయం. యువత దారి మారుతున్న వైనంపై కథనం. నీతి కథలు చెప్పే అమ్మమ్మ, తాతయ్యలు చాలా మందికి దూరమయ్యారు... మంచి మాటలు చెప్పే బంధువులు ఇంకా చాలా మందికి కనిపించకుండాపోయారు. ఇప్పటి బాల్యానికి నేస్తాలు టీవీలు, సెల్ఫోన్లే. కాలక్షేపానికి ఉన్నది ఇంటర్‘నెట్’ ఒక్కటే. ఎనిమిదో తరగతికే చేతిలో సెల్‌ఫోన్, పదో తరగతికి పార్టీల అలవాటు, ఇంటర్‌కు గర్ల్‌ఫ్రెండ్స్... ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. పర్యవేక్షణ లేని ఇళ్లు, కట్టుబాట్లు లేని కాలేజీలు, స్కూళ్లు కలిపి యువత దారిని మార్చేస్తున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న సాంకేతికత అభివృద్ధికి ఎంతగా దోహదపడుతోందో తెలీదు గానీ యువతపై చెడు ప్రభావాన్ని చూపడంలో మాత్రం నూటికి రెండొందలు శాతం పనిచేస్తోంది. నట్టింట్లోకి వచ్చిన నెట్ మాయాజాలం. మైనర్ల కళ్లకు ‘నీలి’ గంతలు కట్టి ఆడిస్తోంది. బాలికలపై లైంగికదాడులు పెరుగుతున్న నేపథ్యంలో యువత దారిని తల్లిదండ్రులు పర్యవేక్షించాల్సిన సమయం వచ్చింది. కుర్రాళ్ల కదలికలపై గురువులు కన్నెయ్యాల్సిన సందర్భం ఆసన్నమైంది. జిల్లాలోనూ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఈ కేసుల్లో పలు సందర్భాల్లో మైనర్లే నిందితులుగా ఉండడం జిల్లాలోని పరిస్థితికి అద్దం పడుతోంది. విజయనగరం ఫోర్ట్, విజయనగరం క్రైం: బాలికలపై లైంగిక దాడి... చదవడానికే అదోలా అనిపిస్తుంది. కానీ మన చుట్టుపక్కలే అభంశుభం తెలీని చిన్నారులు చాలా మంది మృగాళ్ల విపరీత కోరికలకు బలైపోతున్నారు. ప్రమాదం జరిగితే గానీ స్పందించని అధికారులు, ఆందోళనలు చేస్తే గానీ పట్టించుకోని నాయకుల మధ్య వీరి భద్రత ప్రశ్నార్థకమైపోతోంది. దీనికి కారణాలు వెతికితే కొన్ని చూపుడు వేళ్లు మనవైపు కూడా చూపిస్తాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రతి వ్యక్తికీ అందుబాటులో ఉంటున్న ఇంటర్నెట్ సదుపాయం, పర్యవేక్షణ లేని పెంపకాలు... ఇలా చాలా కారణాలు చిన్నారి బతుకులను నిప్పులపాలు చేస్తున్నాయి. మైనర్లే బాలికలపై ఎక్కువగా లైంగికదాడులకు పాల్పడుతుండడం దీనికి ఉదాహరణగా కనిపిస్తోంది. ఇప్పటి రోజుల్లో తినడానికి తిండి లేకపోయినా ప్రతి ఇంటిలోను సెల్‌ఫోన్ ఉంది. అరచేతిలో నీలిచిత్రాలను చూడగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ఇది యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎలిమెంటరీ, హైస్కూల్ పిల్లలు కూడా సెల్ఫోన్లను వాడేస్తున్నారు. దీనికి తోడు ఇంటి వద్ద తగు పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు పార్టీల పేరిట మద్యానికీ అలవాటు పడుతున్నారు. అసలు కారణాలేంటి..? - చిన్నపిల్లలపై లైంగిక దాడికి పాల్పడే అపసవ్య మనస్తత్వాన్ని సైకాలజీలో పెడోఫిలియా అంటారు - ఇలా లైంగికదాడికి గురైన వారికి గాయాలు లేకపోయినా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు - తమ లైంగిక సామర్థ్యంపై విశ్వాసం లేని వారు కూడా చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతారు - టీవీ, ఫేస్బుక్, ఇంటర్నెట్, చెడుప్రవర్తన కలి గిన వ్యక్తులతో తిరగడమూ ఓ కారణమే. ఇవీ కేసులు... - 2015 జవవరి 8న భోగాపురం మండలం చేపల కంచేరు గ్రామంలో ఏడేళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. - జూన్ 26న విజయనగరం మండలం అయ్యన్నపేటలో 15 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. - జూలై 23న నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామంలో 14 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. - దుప్పాడ గ్రామంలో మూడేళ్ల చిన్నారిపై యువకుడు లైంగిక దాడి చేయడంతో బాధితులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. - ధర్మపురి గ్రామంలో ఓ కామాంధుడు ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి నీళ్లకుండిలో పడేసి హత్య చేశాడు. - దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లిలో మూడున్నరేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలలు లైంగిక దాడికి పాల్పడ్డారు. సినిమాల ప్రభావమూ ఉంది సినిమాల ప్రభావం అధికంగా విద్యార్థులపై పడుతోంది. సినిమాలో చూసినవి అక్కడతో మర్చిపోవాలన్న విషయాన్ని ముందు తల్లితండ్రులు అవగాహన కల్పించాలి. పాఠశాలల్లో ఆడపిల్లలను గౌరవించాలని, మర్యాదగా నడుచుకోవాలని వారే చెప్పాలి. - డి.అరుణ, ఉపాధ్యాయురాలు, విజయనగరం నీలి చిత్రాలు నిషేధించాల్సిందే... చదువుకోవాల్సిన పిల్లలు నీలి చిత్రాలు చూసి పాడైపోతున్నారు. ఆడా మగా విచ్చలవిడిగా తిరగకూడదనే విషయాన్ని తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. మగ పిల్లలు బయట మర్యాదపూర్వకంగా నడుచకోవాలన్న విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడం లేదు. నేరం చేసినా శిక్షలు ఆలస్యం కావడం వల్ల ఏమీ కాదనే భావన నెలకొంది. తప్పు చేసిన 10 రోజుల్లో శిక్ష పడితే ఇలాంటి సంఘటనలు జరగవు. - పట్నాల భవాని, స్పార్క్ సొసైటీ అధ్యక్షరాలు, విజయనగరం కౌన్సెలింగ్ అందించాలి లైంగికదాడికి పాల్పడే వారి లక్షణాలను గుర్తించి కౌన్సెలింగ్ అందించాలి. లైంగిక సామర్థ్యంపై విశ్వాసం లేనివారు పిల్లలపై అత్యాచారాలకు ఒడిగడతారు. ముందుగా దగ్గరి బంధువులకు సంబంధించిన పిల్లల అవయవాలు తాకడం ద్వారా ఈ ప్రక్రియ మొదలై తర్వాత అపరిచిత బాలికల అవయవాలకు తాకాలనే కోరికలు పుడతాయి. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి - ఎస్వీ రమణ, సైకాలజిస్ట్ నైతిక విలువలు పెంచాలి... సెల్ఫోన్లో చాటింగ్‌లు, మేసేజ్‌లు విద్యార్థులపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. నైతిక విలువలు పెంపొందించాల్సి ఉంది. సెల్‌ఫోన్ నిత్య వాడకంగా మారింది. మంచి, చెడులు గురించి తల్లిదండ్రులు తెలియజేయాలి - జీకే దుర్గ, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ తరగతులు నిర్వహించాలి... నైతిక విలువల గురించి పిల్లలకు శిక్ష ణ ఇప్పించాలి. ఏదో మంచి, ఏది చెడు అన్న విషయాలను తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. సెల్ఫోన్లు సాధ్యమైనంతవరకు పిల్లలకు ఇవ్వకూడదు. - గంటా హైమావతి, బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు కఠిన చర్యలు తీసుకుంటాం లైంగికదాడులకు పాల్పడటం నేరం. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువత, విద్యార్థులు చెడు ప్రవర్తలు, అత్యాచారాలు తదితర నేరాలకు పాల్పడకుండా పోలీసు స్టేషన్ల వారీగా అవగాహన సదస్సుల నిర్వహిస్తున్నాం - టి.త్రినాథ్, ఎస్బీ డీఎస్పీ జిల్లాలో గత మూడేళ్లలో నమోదైన లైంగికదాడి కేసుల వివరాలు.. సంవత్సరం కేసులు 2012 19 2013 27 2014 25 -
కఠిన చర్యలంటూ కాలయాపన!
- ఆర్టీసీలో టెండర్ గోల్మాల్ కథ కంచికేనా? - నివేదిక అందజేసి ఆరు నెలలు - అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు నిజామాబాద్ నాగారం : ఆర్టీసీలో టెండర్ అక్రమాల కథ కంచికి చేరింది. ఒక షాపును దక్కించుకునే ప్రయత్నంలో తప్పులు చేసి అడ్డంగా దొరికిపోయారు. అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరిపి నివేదిక కూడా ఆరు నెలల క్రితం అందజేశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నారుు. నివేదికను స్టడీ చేస్తున్నామని అధికారులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాలు ఇలా ఉన్నారుు. 2014 సంవత్సరంలో అక్టోబర్ 31న ఆర్టీసీలో దుకాణాల సముదాయాలకు సంబంధించి టెండర్ జరిగింది. ఆర్టీసీలో విధులు నిర్వర్తిస్తున్న వారే ప్రత్యక్షంగా టెండర్లో పాల్గొన్నారు. ప్రధాన యూనియన్ నాయకుడి కుటుంబ సభ్యురాలు పేరు మీద టెండర్ వేశారు. ఇదే దుకాణానికి ఇద్దరు వ్యక్తులు పోటీకి వచ్చారు. ఒక వ్యక్తి రూ.16వేలు కోట్ చేయగా, యూనియన్ నాయకుడికి చెందిన వా రు. రూ.11వేలు కోట్ చేశారు. ఎలాగైనా దుకాణాన్ని దక్కించుకోవాలనే ప్రణాళిక సిద్ధం చేశారు. తమకు అనుకూలంగా ఉండే వారినే టెండర్ తెరిచేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కువ ధర ఉన్న వ్యక్తికి దుకా ణం ఇవ్వాల్సి వస్తుందనే విషయం సదరు సిబ్బంది యూనియన్ నాయకుడికి తెలిపారు. అప్పటికప్పుడు టెండర్ వేసిన రూ.11 వేల స్థానంలో రూ.21 వేలుగా దిద్దారు.అక్షరాల్లో రాసిఉన్న ప్రాంతంలో సైతం కొట్టి వేసి కొత్తగా రాశారు. గమనించిన కమిటీ సభ్యులు టెండర్ ఫారంలో,డీడీపై కొట్టివేతలు ఉన్నట్లు గుర్తించారు. ఈ దుకాణం టెం డర్ తర్వాత వేయాలని కమిటీ సభ్యలు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విజిలె న్సు అధికారులతో విచారణ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పలుమార్లు సాక్షిలో కథనాలు కూడా వచ్చాయి. నివేదిక ఇచ్చి ఆరు నెలలు.. టెండర్ గోల్‌మాల్‌పై అప్పటి ఆర్ఎం కృష్ణకాంత్ విచారణకు ఆదేశించారు. డిపో-2లో సీఐగా పనిచేసిన ఆనంద్‌ను విచారణాధికారిగా నియమించారు. తర్వాత ఆర్ఎంగా రమాకాంత్ వచ్చారు. సీఐ ఆనంద్ విచారణ చేసి పూర్తిస్థారుు నివేదికను ఆరు నెలల కిత్రం అధికారులకు అందజేశారు. ఇంతలోనే ఆన ంద్కు డిపో మేనేజర్‌గా పదోన్నతి లభిం చింది. విచారణ నివే దిక ఇచ్చి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తప్పు చేసిన వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఇతర యూని యన్ నాయకులు ఆర్ఎంను ప్రశ్నిం చారు. 10 మంది వరకు ఇందులో బాధ్యులుగా ఉన్నారని తెలుస్తోంది. -
ఉద్యోగమిక్కడ..నివాసమెక్కడ!
కర్నూలు : ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు.. స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. పనిచేస్తున్న చోట కాకుండా.. సమీప పట్టణాల్లో కాపురం ఉంటున్నారు. జరగరాని ఘటనలు చోటు చేసుకుంటే.. వీరు ఆ ప్రాంతానికి చేరుకునే లోపు పుణ్యకాలం గడిచిపోతుంది. ఈ విషయంలో ఎస్పీ ఆదేశాలను సైతం లెక్క చేయని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు స్థానికంగానే నివాసం ఉండాలని.. లేని పక్షంలో కఠినంగా చర్యలు ఉంటాయని ఏడాది క్రితం ఎస్పీ హెచ్చరించినా ఇప్పటికీ మార్పు కరువైంది. జిల్లాలో 20 మంది ఎస్ఐలు, ముగ్గురు, నలుగురు సీఐలు స్థానికంగా నివాసం ఉండటం లేదు. ఆరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో 89 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సబ్ డివిజన్ కేంద్రాల్లో 20 పోలీస్ స్టేషన్లు ఉండగా.. మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో సగం స్టేషన్ల అధికారులు తమ పిల్లల చదువులు, ఇతర అవసరాల నిమిత్తం పట్టణాల్లో ఉంటున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు వారి రాకకోసం సిబ్బంది ఎదురు చూడాల్సి వస్తోంది. అంతా అప్ అండ్ డౌన్ నందవరం, నాగలాపురం పోలీస్ స్టేషన్లో పని చేసే అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరూ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. రాత్రి అయితే ఒకరిద్దరు కానిస్టేబుళ్లు మినహా గస్తీ విధులకు కూడా సిబ్బంది ఉండడం లేదు. నందవరం ఎస్ఐ వేణుగోపాల్ రాజు ఎమ్మిగనూరులో నివాసం ఉంటున్నారు. ఏఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది కూడా ఎమ్మిగనూరులోనే నివాసం. దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అనుకోని ఘటన జరిగితే ఇక్కడి నుంచి వెళ్లే వరకు సిబ్బంది ఎదురు చూడాల్సిన పరిస్థితి. కె.నాగలాపురంలో సుమారు 20 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ కర్నూలులోనే కాపురం ఉంటున్నట్టు సమాచారం. గూడూరు స్టేషన్లోనూ సగం మంది కానిస్టేబుళ్లు కర్నూలు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. కర్నూలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని స్టేషన్లలో పనిచేసే సిబ్బంది పరిస్థితి ఇదే. ఓర్వకల్లు, బ్రాహ్మణకొట్కూరు, ఉలిందకొండ ప్రాంతాల్లో పని చేస్తున్న సిబ్బంది కూడా రోజూ కర్నూలు నుంచి విధులకు వెళ్తున్నారు. దీంతో జిల్లాలోని సగం పోలీస్ స్టేషన్లలో రాత్రి వేళ వెళ్లిన బాధితులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉన్న ఒకరిద్దరు కానిస్టేబుళ్లు వచ్చిన వారిని దబాయించి పంపుతున్నారు. సారు లేరు రేపు రాపో అంటూ కానిస్టేబుళ్లు ఇచ్చే సమాధానాలతో రోజుల తరబడి బాధితులు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. స్థానికంగా ఉండాల్సిందే.. నిబంధనల మేరకు ఉద్యోగులు పనిచేసే చోటే నివాసం ఉండాలి. అందులోనూ పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసు సిబ్బంది స్థానికంగా ఉండాల్సిందే. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. - ఎస్పీ ఆకె రవికృష్ణ -
తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
♦ ప్రభుత్వ పాఠశాల స్థలం కబ్జా ♦ మరుగుదొడ్లు కూల్చివేసి పొలాల్లోకి రోడ్డు వేస్తున్న వైనం ♦ విమర్శలు గుప్పిస్తున్న గ్రామస్తులు తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. భావి భారత పౌరులను తయారు చేసే పాఠశాల స్థలంపై కన్నేశారు. అనుకున్నదే తడవుగా అక్కడ ఉన్న మరుగుదొడ్లు కూల్చివేశారు. ఆ స్థలంలో తమ పొలాలకు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనిపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అనంతపురం రూరల్ : అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. గతంలో పనిచేసిన కలెక్టర్ జనార్దన్‌రెడ్డి పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యం కోసం అదనంగా 1.17 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. పాఠశాలలో అభివృద్ధి పనుల కోసం రూ.7.5లక్షలతో ప్రణాళికలు పంపడంతో ప్రస్తుతం రూ.4.5 లక్షల నిధులు మంజూరుయ్యాయి. వాటితో పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. ప్రహరీ గోడ ఏర్పాటు చేస్తే తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి ఉండదనే స్వార్థంతో కొందరు తెలుగు తమ్ముళ్లు పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే జేసీబీల సాయంతో పాఠశాలలోని మరుగుదొడ్లను కూల్చివేశారు. పాఠశాల స్థలంలోనే రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లను కూల్చివేసి రోడ్డు ఎందుకు వేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలిజ ప్రశ్నిస్తే మా పొలాల్లోకి వెళ్లడానికి దారి ఏర్పాటు చేయాలని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన అనుమతితోనే మరుగుదొడ్లను కూల్చివేసి రోడ్డు వేస్తున్నామని సమాధానం ఇచ్చారు. అనుమతి పత్రాలు చూపాలని హెచ్ఎం కోరితే దాటవేస్తున్నారు. విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లు కూల్చివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల చర్యలను నీతిమాలినవిగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’ తహశీల్దార్ మహబూబ్‌బాషాను వివరణ కోరింది. రహదారి నిర్మించుకోవాలని ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పాఠశాల స్థలాన్ని పరిశీలించి ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
జైలులా ఉంది!
ఏఎన్‌యూ : తాము యూనివర్సిటీలో ఉన్నట్లు లేదని మితిమీరిన నిబంధనలతో జైలు జీవితం గడిపినట్లుందని పలువురు పరిశోధకులు మండిపడ్డారు. సోమవారం రాత్రి వర్సిటీ ఆవరణలో వాకింగ్ చేస్తున్న పరిశోధకులను పోలీసులు ప్రశ్నించడం, తిరగవద్దని ఆదేశించడంపై సోమవారం అర్థరాత్రి పరిశోధకులు ధర్నా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పరిశోధకులతో మంగళవారం ఉదయం యూనివర్సిటీ రిజిస్ట్రార్ యూనివర్సిటీ పరిపాలనా భవన్‌లోని కమిటీ హాలులో పరిశోధకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశోధకులు తమ సమస్యలను వివరించారు. గుర్తింపు కార్డుల తనిఖీ పేరుతో పోలీసులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బైకులపై తిరిగే వారిని లెసైన్స్, సీబుక్ తదితర ఆధారాలు చూపించాలని నిలదీస్తున్నారని తెలిపారు. నిబంధనలు సడలించి పోలీసుల అజమాయిషీ తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన రిజిస్ట్రార్ ఇటీవల యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు విధించాల్సి వచ్చిందని కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయన్నారు. డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ యూనివర్సిటీ అధికారుల సూచనల మేరకే తాము చర్యలు తీసుకుంటున్నామని తె లిపారు. ఇకమీదట గుర్తింపు కార్డులు మాత్రమే పరిశీలించాలని నిర్ణయించారు. బాలుర వసతి గృహాలవైపు ఉన్న గేటును తెరవాలని, గుర్తింపు కార్డులు పరిశీలించి రాత్రి 11 గంటల వరకు రాకపోకలకు అనుమతి ఇవ్వాలని, పరిశోధకులకు నాలుగు సంవత్సరాల వరకు వసతి గృహ అడ్మిషన్ కల్పించాలని, వసతి గృహాల్లో ఉండే పరిశోధకులందరికీ యూనివర్సిటీ రీసెర్చిఫెలోషిప్లు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పరిశోధకులకు ల్యాప్‌టాప్‌లు బ్యాంకు రుణాల ద్వారా ఇప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు కోరారు. దీనికి రిజిస్ట్రార్ స్పందిస్తూ బాలుర వసతి గృహాలవైపు గేటు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని, పరిశోధకులకు బ్యాంకుల ద్వారా ల్యాప్‌లాప్‌లు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. -
పైసలిస్తేనే 'ప్రవేశం'
ట్యూషన్ ఫీజు ముందే ఇవ్వాలంటున్న కళాశాలలు ♦ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో తీవ్ర జాప్యం ♦ డబ్బులు వచ్చాక తిరిగితీసుకోవాలని స్పష్టీకరణ ♦ విధి లేని పరిస్థితుల్లో చెల్లిస్తున్న విద్యార్థులు ♦ తలకు మించిన భారమంటూ తల్లిదండ్రుల ఆందోళన నరేష్ ఇటీవల ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఘట్కేసర్లోని ఓ ప్రముఖ కళాశాలలో సీటు సాధించాడు. ప్రభుత్వ కోటాలో సీటు రావడంతో ఫీజు కట్టాల్సిన పనిలేదనే ధీమాతో కాలేజీలో ప్రవేశం కోసం వెళ్లి తెల్లబోయాడు. ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే చేర్చుకుంటామని, రీయింబర్స్మెంట్ నిధులొచ్చాక తిరిగి తీసుకోవచ్చని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేయడంతో నరేష్ ఆలోచనలో పడ్డాడు. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో అప్పుచేసి ఫీజు చెల్లించాడు. జిల్లాలో పలు కళాశాలల్లోనూ ట్యూషన్ ఫీజులు చెల్లించాలంటూ యాజ మాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. సకాలంలో నిధులివ్వకపోవడంతో నిర్వహణ భారమవుతున్న నేపథ్యంలో ఇలా ఫీజులు వసూలు చేస్తున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నప్పటికీ.. విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం తలకుమించిన భారంగా మారుతోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు జాప్యం చేయడం విద్యార్థులకు శాపంగా మారింది. గతేడాదికి సంబంధించి విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంటు నిధుల విడుదల ఊసెత్తడంలేదు. దీంతో తాజా విద్యాసంవత్సరంలో కొత్తగా ఇంజినీరింగ్ తదితర కోర్సులలో చేరే విద్యార్థులకు యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఫీజు డబ్బులు చెల్లిస్తేనే కాలేజీలో చేర్చుకుంటామని తేల్చిచెబుతున్నాయి. దీంతో ఆయా విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జిల్లాలో 124 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది కొత్తగా 35వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ సీట్లు సాధించి ప్రవేశాలు పొందుతున్నారు. కౌన్సెలింగ్ ద్వారా సీటు దక్కించుకోవడంతో ఉచితంగా విద్యనభ్యసించవచ్చు. వీరికి సంబంధించిన ఫీజు ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుంది. కానీ ఇప్పుడు భిన్నపరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఏళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో.. ఆ భారం విద్యార్థులపై పడుతోంది. కోర్సుకు సంబంధించిన ఫీజు విద్యార్థి చెల్లిస్తేనే అడ్మిషన్‌కు అనుమతిస్తున్నారు. ఘట్కేసర్లోని ప్రముఖ కాలేజీతో పాటు ఇబ్రహీంపట్నంలోని మరో కాలేజీలో దాదాపు వందమందికి పైగా విద్యార్థులు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత సాధించినప్పటికీ.. సొంతంగా ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందారు. గత బకాయిలు రూ. 465కోట్లు..! 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. దీంతో అధికారులు వాటి పరిశీలన ప్రక్రియ మొదలుపెట్టారు. వాస్తవానికి గతేడాది ఆగస్టు నాటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ముగియాల్సి ఉండగా.. ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. దీంతో కోర్సు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించింది. 2014-15 విద్యాసంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ కేటగిరీలకు సంబంధించి పోస్టుమెట్రిక్ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 1,09,610 మంది ఫ్రెషర్స్ అర్హత సాధించారు. అదేవిధంగా రెన్యువల్ విద్యార్థులు 1,57,845 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా వీరికి ఫీజు రీయింబర్స్ కింద రూ. 465 కోట్లు చెల్లించాల్సి ఉంది. విద్యాసంవత్సరం ముగిసినప్పటికీ ప్రభుత్వం నిధుల ఊసెత్తకపోవడంతో ఇప్పటికే కోర్సు పూర్తిచేసుకున్న పలువురు విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు పొందడం గమనార్హం. -
వామ్మో.. అతిసారం
జిల్లా ఆస్పత్రిలో పెరుగుతున్న బాధితులు కలుషిత నీరే కారణమంటున్న వైద్యులు తాండూరు రూరల్ : మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెతో కొన్నిరోజులుగా వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. దీంతో అతిసారం ప్రబలగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో రోగులు చేరుతున్నారు. అసలే వర్షాకాలం.. ఆపై పారిశుద్ధ్యం పట్ల ప్రజాప్రతిని ధులు, అధికారులు, వైద్యసిబ్బంది జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రోజురోజుకూ గ్రామీణ ప్రజలు అతిసారంతో అల్లాడుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే దీని బారిన పడుతున్నారని ఇక్కడి వైద్యులు నిర్ధారిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటిని సరఫరా చేసే ఓవర్‌హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతోనే ఈ సమస్య పెరుగుతోంది. దీనికితోడు పైప్లైన్లు లీకేజీలు లేకుం డా, ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలేవీ తీసుకోవడం లేదు. తాండూరు డివిజన్లోని చాలా గ్రామాల్లో తాగునీటి కుళాయిల వద్ద మురుగు చేరి, చేతిపంపుల వద్ద అపరిశుభ్రంగా మారింది. ఈనెల 1 నుంచి 13వ తేదీ వరకు 367 మంది అతిసారం రోగులు జిల్లా ఆస్పత్రిలో చేరారు. 1న 26 మంది, 2న-30 మంది, 3న 25 మంది, 4న 26 మంది, 5న 30 మంది, 6న 26 మంది, 7న 27 మంది, 8న 20 మంది, 9న 31 మంది, 10న 30 మంది, 11న 31మంది, 12న 33 మంది, 13న 32 మంది ఈ ఆస్పత్రికి వచ్చారు. కాగా, జిల్లా ఆస్పత్రిలో రోగులకు కనీస వసతులు లేవు. సరైన మంచాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే మంచంపై ఇద్దరేసి రోగులు పడుకొని వైద్యం చేయించుకునే పరిస్థితి నెలకొంది. మొరపెట్టుకున్నా స్పందనలేదు గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని పలుమార్లు ‘ప్రజాదర్బారు’లో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో గ్రామంలో చాలా వరకు అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా తాగునీటి కుళాయిల వద్ద మురుగు, అపరిశుభ్ర వాతావరణంతోనే ఈ సమస్య పెరుగుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యసిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి. - వెంకటేషం, గౌతాపూర్ జాగ్రత్తలు తప్పనిసరి ప్రస్తుతం వర్షాకాలం ఉంది కాబట్టి తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవద్దు. ఎక్కువగా ఫిల్టర్ నీటిని లేదా మరగబెట్టిన నీటిని తాగే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తాగునీటి కుళాయిల వద్ద పరిశుభ్ర వాతావరణం ఉండే విధంగా జాగ్రత్తలు పాటించాలి. - జయప్రసాద్, వైద్యుడు, తాండూరు జిల్లా ఆస్పత్రి -
యథేచ్ఛగా నీటి దందా
- జేబులు నింపుకుంటున్న వ్యాపారులు - రోజురోజుకు పెరిగిపోతున్న నీటి వ్యాపారం - ఏటా తగ్గిపోతున్న భూగర్భజలాలు - కాలనీల్లో నీటి కొరత - ఇబ్బంది పడుతున్న జనం - పట్టించుకోని అధికారులు పటాన్చెరు: పట్టణంలో ట్యాంకర్లతో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు లేక భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. బోర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పటాన్చెరు శాంతినగర్‌లో బోర్లలో నీరు తగ్గుతోంది. శాంతినగర్ పక్కన దాదాపు వందెకరాల శిఖంతో ఉన్న సాకి చెరువులో నీరు తగ్గింది. వర్షాలు లేక పోవడంతో చెరువులో ఉండాల్సిన నీరు లేదు. అలాగే పటాన్చెరు పట్టణంలో భూగర్భ జలాల లభ్యత ఉన్న కారణంగా ఈ ప్రాంతం నుంచి రాత్రింబవళ్లు బోరు నీటిని తోడి అమ్ముకునే వ్యాపార సంస్థలు ఎక్కువయ్యాయి. పటాన్చెరు పట్టణంలోని పెట్రోలు బంక్‌లో బోరు వేసి నీటిని రాత్రింబవళ్లు తోడేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శాంతినగర్‌లో ప్రైవేటు వ్యక్తులు ఆర్వో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ వాటర్ ప్లాంట్ల కారణంగా సమస్యలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అక్రమ పద్ధతుల్లో నీటిని తోడుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్‌ను వివరణ కోరగా ఆయన నీటి వ్యాపార కేంద్రాలను వెంటనే గుర్తించి వాటిని తొలగిస్తామన్నారు. తమ దృష్టికి అలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదన్నారు. స్థానికులు తాజాగా ఫిర్యాదు చేశారని దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాల్టా చట్టం అమలు చేయరా? పటాన్చెరు పట్టణంలో వాల్టా చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రోజురోజుకూ నీటి వ్యాపారం పెరుగుతోంది. 24 గంటలూ బోర్లు నడుపుతుండడంతో భూగర్భజలాలు తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. - జగన్‌రెడ్డి, శాంతినగర్ పటాన్చెరు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా స్పందించడంలేదు. నీటి వ్యాపార కేంద్రాల నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నీటి వ్యాపార నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరితే లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. - చిదంబరం, శాంతినగర్