కఠిన చర్యలంటూ కాలయాపన! | RTC illigality caught | Sakshi
Sakshi News home page

కఠిన చర్యలంటూ కాలయాపన!

Published Thu, Aug 20 2015 4:56 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

కఠిన చర్యలంటూ కాలయాపన!

కఠిన చర్యలంటూ కాలయాపన!

- ఆర్టీసీలో టెండర్ గోల్‌మాల్ కథ కంచికేనా?
- నివేదిక అందజేసి ఆరు నెలలు
- అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
నిజామాబాద్ నాగారం :
ఆర్టీసీలో టెండర్ అక్రమాల కథ కంచికి చేరింది. ఒక షాపును దక్కించుకునే ప్రయత్నంలో తప్పులు చేసి అడ్డంగా దొరికిపోయారు. అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరిపి నివేదిక కూడా ఆరు నెలల క్రితం అందజేశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నారుు. నివేదికను స్టడీ చేస్తున్నామని అధికారులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాలు ఇలా ఉన్నారుు. 2014 సంవత్సరంలో అక్టోబర్ 31న ఆర్టీసీలో దుకాణాల సముదాయాలకు సంబంధించి టెండర్ జరిగింది.
 
ఆర్టీసీలో విధులు నిర్వర్తిస్తున్న వారే ప్రత్యక్షంగా టెండర్‌లో పాల్గొన్నారు. ప్రధాన యూనియన్ నాయకుడి కుటుంబ సభ్యురాలు పేరు మీద టెండర్ వేశారు. ఇదే దుకాణానికి ఇద్దరు వ్యక్తులు పోటీకి వచ్చారు. ఒక వ్యక్తి రూ.16వేలు కోట్ చేయగా, యూనియన్ నాయకుడికి చెందిన వా రు. రూ.11వేలు కోట్ చేశారు. ఎలాగైనా దుకాణాన్ని దక్కించుకోవాలనే ప్రణాళిక సిద్ధం చేశారు. తమకు అనుకూలంగా ఉండే వారినే టెండర్ తెరిచేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కువ ధర ఉన్న వ్యక్తికి దుకా ణం ఇవ్వాల్సి వస్తుందనే విషయం సదరు సిబ్బంది యూనియన్ నాయకుడికి తెలిపారు. అప్పటికప్పుడు టెండర్ వేసిన రూ.11 వేల స్థానంలో రూ.21 వేలుగా దిద్దారు.అక్షరాల్లో రాసిఉన్న ప్రాంతంలో సైతం కొట్టి వేసి కొత్తగా రాశారు. గమనించిన కమిటీ సభ్యులు టెండర్ ఫారంలో,డీడీపై కొట్టివేతలు ఉన్నట్లు గుర్తించారు. ఈ దుకాణం టెం డర్ తర్వాత వేయాలని కమిటీ సభ్యలు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విజిలె న్సు అధికారులతో విచారణ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పలుమార్లు సాక్షిలో కథనాలు కూడా వచ్చాయి.
 
నివేదిక ఇచ్చి ఆరు నెలలు..
టెండర్ గోల్‌మాల్‌పై అప్పటి ఆర్‌ఎం కృష్ణకాంత్ విచారణకు ఆదేశించారు. డిపో-2లో సీఐగా పనిచేసిన ఆనంద్‌ను విచారణాధికారిగా నియమించారు. తర్వాత ఆర్‌ఎంగా రమాకాంత్ వచ్చారు. సీఐ ఆనంద్ విచారణ చేసి పూర్తిస్థారుు నివేదికను ఆరు నెలల కిత్రం అధికారులకు అందజేశారు. ఇంతలోనే ఆన ంద్‌కు డిపో మేనేజర్‌గా పదోన్నతి లభిం చింది. విచారణ నివే దిక ఇచ్చి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తప్పు చేసిన వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఇతర యూని యన్ నాయకులు ఆర్‌ఎంను ప్రశ్నిం చారు. 10 మంది వరకు ఇందులో బాధ్యులుగా ఉన్నారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement