పుష్కరాలకు దారేది..
ద్వారకానగర్ : గోదావరి పుష్కర యాత్ర భక్తులను నరకయాతనకు గురి చేస్తోంది. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేయాలన్న వీరి సంకల్పానికి ఆదిలోనే అవరోధాలెదురవుతున్నాయి. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు సెలువులు కావడంతో అంతా పుష్కర బాట పట్టారు. శుక్రవారం రాత్రి నుంచే ఆర్టీసీ ద్వారకాబస్‌స్టేషన్ రద్దీతో కిటకిటలాడింది. ఆర్టీసీ ముందుస్తు సన్నహాలు చేసినా ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. పుష్కరాలు ప్రారంభం నుంచి ఆర్టీసీ అధికార యంత్రాంగం రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచుతున్నా శనివారం భక్తుల సంఖ్య పతాక స్థాయికి చేరుకుంది.
మరోపక్క రహదారుల్లో ఎక్కడిక్కడ బస్సులు ట్రాఫిక్ జాములలో ఇరుక్కొవడం, దీంతో నిర్ణీత సమయానికి తిరిగి చేరుకోక పోవడం వంటి పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ అధికారులు పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో శ్రీకాకుళం, విజయనగర ం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు విశాఖలో ద్వారకాబస్‌స్టేషన్‌లో గంటల తరబడి పడిగాపులు కాస్తూనే ఉన్నారు. శనివారం ఒక్కరోజే 620 బస్సులతోపాటు ఇతర డిపోల నుంచి అదనంగా 120 బస్సులు నడిపుతున్నారు. అయినా రద్దీ తగ్గలేదు. దీంతో ఈ రద్దీని తట్టుకోలేక ఆర్టీసీ చేతులేసే పరిస్థితి వచ్చింది. మరోపక్క రిజర్వేషన్ కౌంటర్లు సైతం జనంతో కిక్కిరిసిపోయాయి.
రిజర్వేషన్ చేయించుకున్న పరిస్థితి అగమ్యగోచరం
ఆర్టీసీలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారుకూడా పడిగాపులు పడలేక ఏబస్సు ముందుస్తే అదెక్కిపోతున్నారు.బస్సుల్లో సీట్లు కూడా దొరకని పరిస్థితి. చాలామంది ప్రయాణీకులు తమ లగేజీలు, పిల్లలు, వృద్దులతో అవస్థలు పడుతూ బస్సుఎక్కే సమయంలో తీవ్ర తొక్కిసిలాట చోటు చేసుకున్నాయి. రాజమండ్రి బస్సు ప్లాట్‌ఫాంపైకి రాకుండానే బస్సుకూడా పరుగులు తీస్తూ కొందరు ప్రయాణీకులు కిందపడిపోయి గాయాలకు గురయ్యారు. ఓ వ్యక్తికి చేయి విరిగిపోయి ఆసుపత్రిపాలయ్యాడు.
80శాతం బస్సులన్నీ రాజమండ్రివైపే
రీజనల్ పరిధిలో ఉన్న డీలక్స్, సూపర్ డీలక్స్,సూపర్ ఎక్సెప్రెస్,మెట్రో,పల్లెవెలుగు, తదితర బస్సులన్నీ రాజమండ్రివైపే పరుగుతు తీస్తున్నాయి. 24 గంటలు బస్సు సర్వీసు సదుపాయాలు చేపట్టినప్పటికీ సీట్లు లభించక వేలాడుతున్నారు. బలముంటేనే బస్సులో సీటుగా మారింది. దాదాపు 80శాతం బస్సులను రాజమండ్రి నడుస్తున్నాయి. దారిమధ్యలో ట్రాఫిక్ జామ్ కావడంతో సరియైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు.
గణనీయంగా పెరుగుతున్న ఆర్టీసీ ఆదాయం
నష్టాలో అలమటిస్తున్న ఆర్టీసీ పుష్కర పుణ్యమా అంటూ నష్టాలను అధికమిస్తోంది. సాదారణ రోజుల్లో రోజుకు రూ.70-90లక్షలు వచ్చే ఆదయం పుష్కరాలతో దీని ఆదాయం రూ. కోట్లురూపాయలు పెరిగింది. శనివారం ఒక్క రోజు ఆదాయం రూ. ఒక కోటీ 40లక్షలకు పైగా ఆదాయం సమకూరింది.
ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా..
శుక్రవారం రాత్రి నుంచి ద్వారకాబస్‌స్టేషన్‌లో పుష్కర భక్తులకు రద్దీ పెరిగింది. ప్రయాణికుల సంఖ్యను అనుగుణంగానే బస్సుల సంఖ్యను చాలావరకు పెంచాం. అన్నీ డిపోల బస్సుల్లో 60శాతం పుష్కరాలకు మళ్లీంచాం. రోజయ 80వేలకు పైగా భక్తులను తరలిస్తున్నాం.-జి.సుధీష్‌కుమార్, ఆర్టీసీ ఆర్‌ఎం. విశాఖ రీజయన్
తెల్లవారుజామున వచ్చాం
రాజమండ్రి బస్సుకోసం శ్రీకాకుళం జిల్లా నుంచి తెల్లవారుజామున వచ్చాం. బస్సు ఎక్కిదామంటే ఏబస్సు చూసినా తొక్కిసలాటే. భయపడి పిల్లలతో ఎక్కలేపోయాం.
-బి. శంకుంతుల,శ్రీకాకుళం జిల్లా.
బలముంటేనే బస్సుల్లో సీటు : ప్రయాణీకుల రద్దీ పెరగడం వల్ల బస్సులో సీటులు దొరకాలంటే బలం ఉండాలి. తీవ్రంగీ తొక్కిసలాటలు జరగుతున్నా నివారించే పోలీసులు అంతమంత్రంగానే ఉన్నారు. అందువల్ల చాలా మంది పడిపోయి గాయాలకు గురవుతున్నారు.
-అమర శాంతకుమార్, బీటెక్, శ్రీకాకుళం.