Ample Godavari
-
‘షాహీ’ స్నానానికి సిద్ధమైన గోదావరి
సాక్షి, ముంబై : ఆధ్యాత్మిక జ్ఞానంతోపాటు మన సంస్కృతి సంప్రదాయాల సంగమంగా పేర్కొనే గోదావరి నదీ సింహస్త కుంభమేళాలో భాగంగా శనివారం మొదటి షాహీ స్నానం జరగనుంది. 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు జూలై 14న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉత్సవాల్లో కీలక ఘట్టం అయిన తొలి షాహీ స్నానం శ్రావణ పౌర్ణమి శనివారం జరగనుంది. ఇప్పటికే లక్షలాది భక్తులు, అఖాడాలు, సాధువులు నాసిక్, త్రయంబకే శ్వర్‌కు చేరుకున్నారు. షాహీ స్నానానికి విచ్చేసే వారి కోసం నాసిక్‌లో దాదాపుగా 350 ఎకరాల్లో, త్రయంబకేశ్వర్‌లో 17 ఎకరాల్లో సాధుగ్రామ్లను ప్రభుత్వం నిర్మించింది. భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉగ్ర దాడులు జరగొచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో దాదాపు 24 వేల మందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. నాసిక్ చుట్టుపక్క ప్రాంతాల్లో 20 వరకు పార్కింగ్ జోన్లు సిద్ధం చేసింది. నాసిక్ లోని రోడ్లన్నింటినీ శుక్రవారం సాయంత్రం నుంచే మూసేశారు. ఇక మొత్తం ఘాట్లనన్నింటినీ రూ.2,500 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాల వెలుగులో గోదావరి మరింత సౌందర్యాన్ని సంతరించుకుంది. రోడ్ల వివరాల కోసం వెబ్సైట్ కుంభమేళా తొలి షాహీ స్నానం నేపథ్యంలో వాహనాల పార్కింగ్, మూసివేసిన రోడ్లు, వెళ్లాల్సిన మార్గాలు వంటి వివరాల కోసం ప్రభుత్వం ఓ వెబ్సైట్ ను ప్రారంభించింది. ‘ఎంఐటీ కుంభయాన్’ తరఫున http://tiny.cc/roadnashik అనే వెబ్సైట్లో రోడ్లకు సంబంధించిన వివరాలను మ్యాప్‌లతో సహా పొందుపరిచారు. ‘నో వెహికల్ జోన్, మోటర్‌సైకిళ్ల కోసం ప్రత్యామ్నయ మార్గాలు, నగరం వెలుపల, లోపల ఉన్న పార్కింగులు తదితరాలన్ని వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. విద్యుద్దీపాల వెలుగుల్లో ఘాట్లు షాహీ స్నానం నేపథ్యంలో నాసిక్, త్రయంబకేశ్వర్లు మిలమిల మెరిసిపోతున్నాయి. రామ్‌కుంద్, గోదాఘాట్ పరిసరాలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. అహల్యబాయి హోట్కర్ వంతెన నుంచి రామ్‌కుంద్, ఏక్‌ముఖి దత్త మందిరం, రామ్‌సేతు, గాడ్గే మహారాజ్ వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 24 గంటల హెల్ప్‌లైన్ కుంభమేళా నేపథ్యంలో 24 గంటలపాటు నిరంతరాయంగా సేవలందించే హెల్ప్‌లైన్‌ను అధికారులు ప్రారంభించారు. ఐసీఐసీఐ బ్యాంకు సహాయంతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో దాదాపు 70 మంది సిబ్బంది దాకా పనులు నిర్వహిస్తున్నారు. షాహీ స్నానాల వివరాలు ఆగస్టు 29 : తొలి షాహీ స్నానం సెప్టెంబరు 13: రెండో షాహీ స్నానం సెప్టెంబరు 18: మూడో షాహీ స్నానం సెప్టెంబరు 25: వామన్ ద్వాదశి స్నానం హెల్ప్‌లైన్ నెంబర్లు: 08390300300, 18002339985, 0253-2226100, 0253-6642300 -
పుష్కరాలకు ..ఆ నిధులు!
ముద్దనూరు : బహిరంగ మల విసర్జన సాంఘిక దురాచారం.. వ్యక్తి గత మరుగు దొడ్డి నిర్మించుకోవడం గౌరవప్రదం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం తీరా బిల్లుల చెల్లుంపులో ఆలస్యం చేస్తోంది. ప్రభుత్వం ప్రచారంంతో మరుగు దొడ్డి సౌకర్యం లేని వేలాది మంది ఇళ్లలో మరుగు దొడ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. గత నెల చివరి వరకు మరుగు దొడ్ల మొదటి దశ నిర్మాణాలకు కొంత మందికి బిల్లులు చెల్లించారు. సుమారు 25 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మరుగు దొడ్ల నిర్మాణాలకు కేటాయించిన బిల్లులు చెల్లింపునకు అనధికారికంగా బ్రేక్ పడింది. ఆ నిధులు గోదావరి పుష్కరాలకు మళ్లించడం వల్ల చెల్లింపులు ఆగాయని తెలిసింది. అయితే సాఫ్ట్వేర్ సమస్య వల్ల చెల్లించడం లేదని అధికారులు చెబుతున్నారు. బిల్లులు అందక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. మరుగు దొడ్ల నిర్మాణ లక్ష్యమిదీ.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగు దొడ్డి నిర్మించుకోవాలి. జిల్లాలో సుమారు 4.77 లక్షల కుటుంబాలుండగా, అందులో 2.39 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని సర్వేలో వెల్లడైంది. దీంతో మొదటి దశలో 2016 మార్చి నాటికి జిల్లాలో 1.33 లక్షల కుటుంబాలకు మరుగు దొడ్ల సౌకర్యం కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సుమారు 50 వేల కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణానికి దశల వారీగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో మరుగుదొడ్డి, బాత్ రూం కలిపి నిర్మిస్తే రూ.15 వేలు, కేవలం మరుగుదొడ్డి మాత్రమే నిర్మిస్తే రూ.12 వేలు మంజూరు చేస్తున్నారు. అందులో మొదటి దశలో ఒక కేటగిరీకి రూ. తొమ్మిది వేలు, మరుగుదొడ్డి మాత్రమే నిర్మించుకున్న వారికి రూ. ఆరు వేలు చెల్లించాలి. ఆ రెండు వర్గాలకు కొందరికి మాత్రమే చెల్లింపులు జరిగాయి. రెండో దశలో చెల్లింపులను గత నెల నుంచి పూర్తిగా ఆపేశారు. ఈ నిధులు గోదావరి పుష్కరాలకు మళ్లించారని తెలిసింది. దీంతో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్‌లో ఉంచారని తెలుస్తున్నది. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులును సంప్రదించగా, సాఫ్ట్వేర్ సమస్య కారణంగా చెల్లింపులు ఆగిపోయాయన్నారు. త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు. -
మాధవ సేవగా భావిస్తున్నాం
♦ పండుగలా ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు ♦ భక్తులకు లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం ♦ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కందకుర్తి సాక్షి బృందం : మానవసేవయే మాధవ సేవగా భావిం చి ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గోదావరి మహా పుష్కరాలలో ము క్కోటి దేవతలను ప్రత్యక్షంగా చూడకున్నా, నదీ స్నానాలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి మాధవసేవ చేసుకున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. గురువారం మంత్రి పోచా రం కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మా ట్లాడారు. పదవ రోజు వరకు జిల్లాలోని 18 క్షేత్రాలలో 65 లక్షల మంది భక్తులు పవిత్ర స్నా నాలు చేశారని తెలిపారు. చివరి రెండు రోజు లలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కే సీఆర్ పుష్కరాల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తు, ప్రత్యేక శ్రద్దతీసుకుంటున్నారని వివరించారు. తెలంగాణలో ఏర్పాట్లు బాగుండటంతో చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని అన్నారు. అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, హోంగార్డు నుంచి డీఐజీ వరకు ప్రతీ ఒక్కరు తమ ఇంట్లో పండుగ జరిగితే ఎంత శ్రద్ధ తీసుకుంటారో పుష్కరాలలో సైతం అదే తరహాలో సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించడంలేదని, భక్తులకు సౌకర్యాలపైనే ప్రదానంగా దృష్టిని సారించిందని అన్నా రు. ప్రకృతి సహకరించకున్నా ఉన్న వనరులను వినియోగించుకుని గోదావరి నదిలో నీటి సౌకర్యం కల్పించామని, నీరు కలుషి తం కాకుండా అన్ని చ ర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు. క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలి పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని మంత్రి పోచారం సూచించారు. వాహనాలను అతివేగంగా నడపవద్దన్నారు. సిద్ధిపేట వద్ద రోడ్డు ప్రమాదం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మంత్రి వెంట డ్వామా పీడీ వెంకటేశం, ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, డీఎస్పీలు రాంకుమార్, రవీందర్, తహశీల్దార్లు రాజేశ్వర్, వెంకటయ్య, సర్పంచ్ ఖలీంబేగ్ తదితరులు ఉన్నారు. -
ఇకనైనా వర్షాలు కురవాలి
♦ {పజలు సుఖంగా ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకున్నా.. ♦ మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి మోర్తాడ్ : గోదావరి పుష్కరాలు ముగిశాక అయినా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మతల్లిని వేడుకున్నానని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. మండలంలోని తడపాకల్‌కు గురువారం పుష్కర స్నానానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలతోనైనా వాతావరణ పరిస్థితులు మారాలని ఆకాంక్షించారు. పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయని, స్థానికుల సహకారంతో సజావుగా సాగుతున్నాయని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారన్నారు.ఆమె వెంట నాయకులు శ్రీనివాస్, సుమన్, సతీష్ ఉన్నారు. సోనియూ ఆశించినట్టుగానే అభివృద్ధి... సోనియా గాంధీ ఆశించినట్లుగానే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని కల్వకుర్తి ఎమ్మెల్యే, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన గుమ్మిర్యాల్‌లో పుష్కర స్నానం చేశాక మాట్లాడారు. -
పులకించిన గంగ
♦ పదో రోజూ పుష్కరఘాట్లు కిటకిట ♦ {పవాహంలా తరలివచ్చిన జనం ♦ పొరుగు రాష్ట్రాల నుంచీ వచ్చిన భక్తులు ♦ గోదారిలో పవిత్రస్నానాల కోలాహలం ♦ వానలోనూ ఏమాత్రం తగ్గని ఉత్సాహం ♦ అంతటా కొనసాగిన స్వచ్ఛంద సంస్థల సేవలు ♦ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, కలెక్టర్, ఎస్పీ ♦ ఆది పుష్కరాల ముగింపునకు ఇక రెండు రోజులే సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పదవ రోజు కూడా మహాపుష్కరాలకు భక్తుల తాకిడి కొనసాగింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్యస్నానాల కోసం జనం బారులు తీరారు. దాదాపు 11,64,370 మంది భక్తులు పవిత్ర స్నానమాచరించారు. జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సం ఖ్యలో తరలివస్తున్నారు. వీఐపీల తాకిడి కూడా రోజు రోజు కూ పెరిగిపోతోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీకళాకారులు, విదేశీయులు సైతం పుష్కరస్నానాలను ఆచరించారు. పోచంపాడ్, కందకుర్తి, తడపాకల్, గుమ్మిర్యాల, తుంగిని, దోంచంద, ఉమ్మెడ, సావెల్ తదితర ప్రాంతాలలో లక్షలాది మంది భక్తులు స్నానమాచరించి వెళుతున్నారు. ఆది పుష్కరాల చివరి రోజులు దగ్గరపడడంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర, మహారాష్ర్ట భక్తులు అధిక సంఖ్య తరలివస్తున్నారు. వర్షం పడుతున్నప్పటికీ రద్దీ తగ్గ లేదు. పుష్కరఘాట్లు, దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్, జాయింట్ కలెక్టర్ ఎ.రవీంద ర్‌రెడ్డి పుష్కరఘాట్లను పరిశీలిస్తూ, సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పుష్కరఘాట్లలో బం దోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోచంపాడ్‌కు కొనసాగుతున్న భక్తుల రద్దీ పోచంపాడ్‌కు భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం పుష్కరస్నానాలు చేసిన భక్తుల సంఖ్య సు మారుగా నాలుగు లక్షలకు చేరింది. జాతీయ రహదారికి అనుకొని ఉండడంతో హైదరాబాద్‌తోపా టు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. దీంతో రహదారులను వాహనాలు, జ నాలతో కిక్కిరిసిపోతున్నాయి. పుష్క ర ఘాట్లు ఇ సుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. రాత్రి వరకు భక్తుల తాకిడి కొనసాగింది. ఘాట్లకు ఉన్న అన్ని దారుల నుంచి భ క్తులు కాలి నడకన తరలి వచ్చారు. ఎస్ఆర్ఎస్పీలో నీరు పరిశుభ్రం గా ఉందన్న సమాచారం భక్తుల ద్వారా వెళ్లడంతో అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. శనివారంతో పుష్కరాలు ముగుస్తున్నందున నేడు, రేపు రెండు రోజులు కూడ భక్తుల రద్దీ పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలోనూ జనవాహిని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర క్షేత్రంలో భక్త జనజాతర సాగింది. పుణ్యస్నానాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నాం 12 గంటల సమయం లో 20 నిమిషాల పాటు వర్షం కురిసింది. వర్షంలోనే నదీ స్నానాలకు వెళ్లారు. వికలాంగులు, వృద్ధులను నది లోపల నుంచి ఒడ్డుకు చేర్చేందుకు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, అంగన్వాడీలు, సత్యసాయి సేవ సమితి సభ్యులు, ఎన్సీసీ విద్యార్థులు పాట్లు పడ్డారు. ఉదయం వర్ష సూచన కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదనంగా బోధన్, రెంజల్ మండలా ల నుంచి రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ సేవకులను రప్పించారు. చివరి రెండు రోజుల్లో భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ మేరకు వివిధ శాఖల సిబ్బందిని నియమించారు. స్వచ్చంద సంస్థలు సేవలను కొనసాగించాయి. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ లయన్స్ క్లబ్ శాఖ భక్తులకు ఉచితంగా పులిహోర, నీళ్ల ప్యాకెట్లను పంపిణి చేశారు. పుష్కరఘాట్లకు జనశోభ జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 పుష్కరఘాట్లకు ఉద యం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. పోచంపాడ్, కందకుర్తితో పాటు మోర్తాడ్ మండలంలోని తడపాకల్, గుమ్మిర్యాల్, దోంచందకు ఉదయం నుం చే జనసందోహం మొదలయింది. భక్తులు ప్రైవేట్వాహనాలు, బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో పుష్కరఘాట్లకు చేరుకొని పుష్కరస్నా నాలు ఆచరించారు. రద్దీ అధికంగా ఉండడంతో కొంత ఇబ్బంది పడ్డారు. పుష్కరాలకు గడువు సమీపించడంతో వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. తడపాకల్‌లో సుమారు 1.70 లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు. గుమ్మిర్యాల్, దోంచందలో 45 వేల మంది పుణ్యస్నానాలు చేశారు. నవీపేట మండలంలోని తుంగిని ఘాట్‌లో 1.15 లక్షల మంది భక్తులు పుష్క ర స్నానాలు చేశారు. నందిపేట మండలం ఉమ్మెడలో పదవ రోజు ఉమ్మెడలో భక్తుల తాకిడి తగ్గ లే దు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఖ మ్మం, నల్గొండ, వరంగల్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుంచి తరలి వ చ్చారు. అలాగే మహారాష్ట్రలోని పర్భణీ, నాందేడ్, లాతూర్ నుంచి భక్తులు వచ్చారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కోస్లీకి సుమారు 11వేలకుపైగా భక్తులు రావడంతో పుష్కరఘాట్ల వద్ద రద్దీ ఏర్పడింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పుష్కరఘాట్‌ను పరిశీలించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. తాడ్ బిలోలి పుష్కరఘాట్ భక్తులతో కిటకిటలాడింది. పుణ్యస్నానాల కోసం సు మారు ఏడు వేల మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. సావెల్‌కు భక్తులు పెద్ద సం ఖ్య లో హాజరై పుణ్యస్నానాలు చేశారు. బారులు తీరిన వీఐపీలు పదో రోజున పుష్కరఘాట్లకు వీఐపీల తాకిడి పెరిగింది. శాసనసభలో బీజేపీ ప నేత డాక్టర్ లక్ష్మణ్ దోంచందలో పుష్కర స్నానం చేసి, గుమ్మిర్యాల్ శ్రీకష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్ట ర్ జె.గీతారెడ్డి మోర్తాడ్ మండలం తడపాకల్‌లో పుష్కర స్నానం చేశారు. మాజీ శాసనసభాపతి కేఆర్ సురేష్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మజారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచందర్‌రెడ్డి తడపాకల్‌లో పుష్కరస్నానం చేశారు. ఒలింపిక్ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జె రంగారావు కందకుర్తిలో పుష్కర స్నానం ఆచరిం చి, పెద్దలకు పిండప్రదానం చేశారు. దోంచందలో టీవీ నటులు హరిత, జాకీ, విజయ్ పవిత్ర స్నానాలు చేశారు. ఐసీడీఎస్ కమిషనర్ విజయేం ద్ర దోంచందలో పుష్కరస్నానమాచరించారు. సావె ల్లో ఆస్ట్రేలియాకు చెందిన స్టీఫెన్ హుక్, సం ట్రాన్ పుష్కర స్నానామాచరించారు. -
స్వచ్ఛ భద్రాద్రికి సమాయత్తం..!
భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరాలు ముగిసిన మరుసటి రోజు నుంచి స్వచ్ఛ భద్రాద్రి పేరుతో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఈ మేరకు ఆయా శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. గోదావరి పుష్కర స్నానం కోసం భద్రాచలానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీ సీతారాముల వారి దర్శనం చేసుకోవాలనే వాంఛతో భద్రాచలం పుష్కర ఘాట్లలోనే స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పుష్కర స్నానం చేసిన భక్తులు గోదావరి తీరంలో పూజాది కార్యక్రమాల పేరిట వివిధ రకాల వ్యర్థ పదార్థాలను విడిచిపెడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం పట్టణం, గోదావరి తీరం చిత్తడిగా మారింది. ఇప్పటికే గోదావరి పరిసర ప్రాంతాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతోంది. అయితే గత పుష్కరాల అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్న అధికారులు, భద్రాచలం మొత్తాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దితేనే భవిష్కత్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని నిర్ణయించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపటంతో అధికారులు ఇందుకనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు భద్రాచలంలోనే ఉండి, చెత్త చెదారాన్ని తొలించే కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణరుుంచారు. పుష్కర ఘాట్ల నుంచి బ్రిడ్జి సెంటర్, ఇందిరా గాంధీ విగ్రహం మొదలుకొని ఆర్డీవో కార్యాలయం మీదుగా రామాలయంనకు వెళ్లే దారి మొత్తాన్ని అవసరమైతే నీటితో కడిగేసేలా ఆలోచన చేస్తున్నారు. మిగతా ఐదు రోజుల్లో పారిశుధ్య కార్మికులతో పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ పేరుతో క్లీన్ భద్రాద్రి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అవసరమైతే ఆ వారం రోజుల పాటు భద్రాచలం రామాలయూనికి ఇతర ప్రాంతాల నుంచి భక్తులను అనమతించకుండా, స్వచ్ఛ భద్రాద్రిని చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
కోటిలో ఆరు లక్షలే..!
♦ పుష్కర భక్తుల్లో కొద్దిమందికే రామయ్య దర్శనం ♦ టిక్కెట్ల అమ్మకంలేక ఆలయ ఖజానాకు గండి భద్రాచలం నుంచి సాక్షి బృందం : దేశం నలు మూలల నుంచి గోదావరి పుష్కరాలలో స్నానం చేసేందుకు భద్రాచలం బారులు తీరుతున్నారు. భద్రాచలం వచ్చిన భక్తుల సంఖ్య కోటిని సమీపిస్తున్నా అందరూ స్వామి వారిని దర్శించుకొని, ప్రసాదాలు స్వీకరించలేకపోతున్నారు. ఈ పదిరోజుల్లో కేవలం ఆరులక్షల మంది భక్తులే రామయ్య దర్శనం చేసుకున్నారు. భద్రత పేరుతో పోలీసులు విధించిన ఆంక్షల వల్ల దేవస్థానం అధికారులు ఆర్జిత సేవలు, వీఐపీ టిక్కెట్లను పూర్తిగా రద్దు చేయటంతో పాటు లడ్డూ కౌంటర్లను కుది ంచటంతో గోదావరి పుష్కరాలలో రామ య్య ఆదాయానికి భారీ గండి పడింది. పోలీసుల ఆంక్షలతో టిక్కెట్ల అమ్మకం బంద్ గోదావరి పుష్కరాల ఆదాయంపై దేవస్థానం అధికారులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. కోటి మంది భక్తులు వస్తారనే అంచనాతో నిత్యకల్యాణాలు, రూ. 500, 200 టిక్కెట్ల దర్శనం టిక్కెట్లను 20 వేలకు పైగా ముద్రించారు. కాకపోతే పోలీసు అధికారులు భద్రత, తొక్కిసలాటలు జరుగుతాయనే నెపంతో వీఐపీ టిక్కెట్లను 5 రోజుల తరువాత దేవస్థానం సిబ్బందిని విక్రరుుంచనివ్వలేదు. రూ. 500 వీఐపీ టిక్కెట్లు వెరుు్యకి మించి అమ్ముడుపోలేదు. స్వామివారి దర్శనానికి 5గంటలకు పైగానే పడుతుండటంతో ఇటు ఉచిత దర్శనం చేసుకోలేక, వీఐపీ టిక్కెట్లు కొందామన్న అమ్మేవారు లేకపోవడంతో ఇటు శీఘ్ర దర్శనం చేసుకోకుండా లక్షలాది మంది భక్తులు నిరుత్సాహంతో ఇళ్లకు పయనమవుతున్నారు. గోదావరి పుష్కరాలలో 10 రోజులలో సుమారు 40 లక్షల మందికి పైగా భద్రాచలం వచ్చారని అధికారులు భావిస్తున్నారు. వీరి ద్వారా రూ. 1,29,53,572 ఆదాయం వచ్చింది. కనీసం పెట్టుబడులు కూడా రావని అధికారులంటున్నారు. -
‘అమ్మ’ ఒడిలో..
భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరఘాట్లు జనంతో నిండారుు.. పదోరోజు గురువారం కూడా జిల్లాలోని అన్ని ఘాట్లకు జనం పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్యస్నానాలు చేసే భక్తులతో ఘాట్లు కళకళలాడాయి. ఎనిమిది ఘాట్లకు సుమారు 4 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. భద్రాచలంలోని ఘాట్లలో సుమారు రెండు లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తుల రాక అధికంగా ఉండటంతో రహదారులు వాహనాలతో నిండిపోయాయి. కొత్తగూడెం నుంచి రద్దీ ఎక్కువగా ఉండటంతో భద్రాచలంతోపాటు ఇతర ఘాట్లకు చేరుకునేందుకు వాహనాలకు మూడు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం నుంచి భద్రాచలానికి హాజరైన భక్తులు తిరుగుముఖం పట్టడంతో రామాలయం దారి నుంచి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేరట్రాఫిక్ స్తంభించింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు జనం పోటెత్తారు. దర్శనం క్యూలైన్లు జనంతో నిండిపోయాయి. రామయ్య దర్శనానికి నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పట్టింది. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుటుంబ సమేతంగా రామాలయంలో పూజలు చేశారు. మోతె ఘాట్‌లో మాజీ ఎమ్మెల్యే సంభాని చంద్రశేఖర్ పుష్కరస్నానం చేశారు. మణుగూరులోని ఘాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. చిన్నరావిగూడెంలో రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయం ప్రారంభించారు. ఏపీలోని నర్సారావుపేటకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబసమేతంగా చిన్నరావిగూడెంలో స్నానమాచరించారు. అటు టీడీపీ ఎమ్మెల్యేలు.. ఇటు భట్టి పుష్కరస్నానం భద్రాచలంలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పుష్కరస్నానం చేసింది. అనంతరం గోదావరి ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ పుష్కర స్నానం చేసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటే ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఉచిత భోజనం, టిఫిన్ సౌకర్యం కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క సతీసమేతంగా భద్రాచలంలో పుష్కరస్నానం చేశారు. గోదావరి ఘాట్లను పరిశీలించారు. దేవుడి పేరుతో ప్రభుత్వం ప్రజాధనం దోచుకుంటోందని ఆరోపించారు. రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి వాహనాల రద్దీ ప్రమాదాలకు దారితీస్తోంది. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు వాహనాల రాకపోకలు భారీగా ఉన్నారుు. కొత్తగూడెం సమీపంలోని రేగళ్ల వద్ద టాటాఎస్‌ను మినీ బస్సు ఢీ కొట్టడంతో వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన బానోత్ కిరణ్ (6), డ్రైవర్ బానోత్ బాలకృష్ణ (35) మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. భద్రాచలం ఘాట్ వద్ద కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఆంజనేయులు (50) అనే వ్యక్తి బీపీతో మరణించాడు. -
గోదావరి తీరంలో జనజాతర
రాజమండ్రి : ఎన్నో ఇబ్బందులు.. మరెనో అవాంతరాలు.. ఇవేమీ భక్తిపారవశ్యాన్ని అడ్డుకోలేకపోయాయి. ‘పుష్కర’ రోజులు తరిగిపోతున్నకొద్దీ భక్తుల్లో పుష్కర పుణ్యస్నానం చేయాలనే ఆరాటం పెరిగిపోతోంది. ఒక్కసారైనా గోదావరిలో పుష్కర స్నానం చేయాలని.. లేకుంటే మరో 12 ఏళ్లు పుణ్యస్నాన భాగ్యం దక్కదన్నట్టుగా భక్తులు గోదావరి తీరానికి వెల్లువలా తరలివస్తున్నారు. ఎక్కడెక్కడివారో రెక్కలు కట్టుకు వచ్చి వాలిపోతున్నారు. పుష్కరాల తొమ్మిదో రోజైన బుధవారం కూడా యాత్రికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళవారం.. సెంటిమెంట్ కారణంగా కాస్త తగ్గినప్పటికీ బుధవారం తిరిగి పోటెత్తారు. భక్తజనుల తాకిడికి ఈ మహాపర్వం తొమ్మిదో రోజుకే 2003 పుష్కరాలకు వచ్చిన భక్తుల రికార్డు బద్దలు కావడం విశేషం. బుధవారం రాత్రి 9 గంటల సమాయానికి జిల్లావ్యాప్తంగా 32 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీంతో గడచిన తొమ్మిది రోజులుగా జిల్లావ్యాప్తంగా పుష్కర స్నానాలు చేసినవారి సంఖ్య 2.41 కోట్లకు చేరింది. గత పుష్కరాల్లో 12 రోజుల్లో 2,19,75,140 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ ఏడాది ఈ సంఖ్యను తొమ్మిది రోజులకే అధిగమించారు. మిగిలిన మూడు రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఇదేవిధంగా కొనసాగనుంది. జనం రాక చూస్తుంటే ఈ ఏడాది జిల్లాలో పుష్కర స్నానాలు చేసేవారి సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. రాజమండ్రి నగరంలో యాత్రికుల తాకిడి అధికంగా కనిపించింది. నగరంలోని ఘాట్లు మరోసారి భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అడపాదడపా పెద్ద వర్షమే పడినా భక్తులు లెక్క చేయలేదు. తండోపతండాలుగా ఘాట్లకు చేరుకున్నారు. వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చిన మహిళలు సైతం వర్షంలోనే తడుస్తూ ఘాట్ల వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. వర్షంవల్ల ఘాట్లవద్ద పిండప్రదానాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలీచాలని సౌకర్యాల నడుమ వర్షంలో తడుస్తూనే పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. గోదావరి హారతికి మంత్రివర్గం గోదావరి నిత్యహారతి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్గం తరలివచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రివర్గంతోపాటు వేలాదిగా భక్తులు రావడంతో గోదావరి హారతి కన్నుల పండువగా సాగింది. -
జలజలా వచ్చి.. జలమ్మను అర్చించి
జడివాన సవ్వడి చేసింది. పుష్కర యాగాన్ని చూసే యోగం దక్కిందన్నట్టుగా వరుణుడు కుండపోత వర్షం కురిపించాడు. తడిసి ముద్దవుతూనే గోదారమ్మ చెంతకు జనకోటి జలజలా తరలివచ్చింది. జలదేవత గోదారమ్మకు ప్రణమిల్లింది. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, వస్త్రాలు సమర్పించి ఆ ఆమ్మను అర్చించింది. పావన వాహిని మహాపర్వం మొదలై తొమ్మిది రోజులైనా యాత్రికుల సందడి ఏమాత్రం తగ్గలేదు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : జోరు వానలోనూ భక్తజనం పోటెత్తింది. బుధవారం భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని అన్ని ఘాట్లవద్ద యాత్రికుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. జిల్లాలో పుష్కర స్నానాలు ఆచరించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. కుండపోత వర్షం కురవడంతో పుష్కర ఏర్పాట్లలోని డొల్లతనం బయటపడింది. పుష్కరాలు ప్రారంభమైన తర్వాత అడపాదడపా ఓ మాదిరి వర్షాలు కురిసినా బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో పుష్కర యాత్రికులు అవస్థలకు గురయ్యారు. జూలై నెలలో వర్షాలు భారీగా పడతాయని తెలిసినప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారు. ఫలితంగా బుధవారం వేకువజామునుంచి మధ్యాహ్నం వరకు కుంభవృష్టిగా కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొవ్వూరు బురదమయం బుధవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కొవ్వూరు పట్టణం బురదమయంగా మారింది. గోష్పాద క్షేత్రంలోని ప్రధాన ఘాట్‌తోపాటు మిగిలిన 9 ఘాట్లలో నీరు నిలిచిపోయింది. వేలాది మంది భక్తులు బురదలోనే పుష్కర స్నాలు ఆచరించి పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని ఘాట్లలో పిండప్రదాన షెడ్లు సరిపోకపోవడంతో ఇటీవలే టెంట్లు వేశారు. అవన్నీ వర్షానికి ఆ తడిసి.. లోనికి వాననీరు చేరడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అనేక మంది బురదలోనే పిండప్రదానాలు నిర్వహించారు. దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన టెంట్లు కూడా తడిసిపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. అలాగే తాత్కాలిక బస్టాండ్ పూర్తిగా బురదతో నిండిపోవడంతో భక్తులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వేస్టేషన్ రోడ్డు సహా పట్టణంలోని ప్రధాన రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ మాగంటి మురళీమోహన్ గోష్పాద క్షేత్రంలో పుష్కర స్నానాలు ఆచరించారు. నరసాపురంలో అవస్థలు నరసాపురం పట్టణంలో పుష్కర యాత్రికుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఘాట్లకు వెళ్లే రహదారులు కిక్కిరిసిపోయాయి. వర్షం కారణంగా పిండప్రదానాలు చేసుకోవడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. ఆరుబయట గొడుగులు వేసుకుని ఈ తంతును కష్టం మీద పూర్తి చేసుకున్నారు. పారిశుధ్య నిర్వహణలో లోపా లు యథావిధిగా కొనసాగుతున్నాయి. వలంధర రేవులోని వీఐపీ ఘాట్‌లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సిద్ధాంతంలో బురద వరద పెనుగొండ మండలం సిద్ధాంతంలోని ఘాట్లు వర్షంలోనూ భక్తులతో కిక్కిరిశాయి. కేదారీఘాట్ వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపించింది. వర్షం కారణంగా ఘాట్లకు వెళ్లే రహదారులు బురదగా మారిపోయాయి. హిందూ ప్రతిష్టాక్ పీఠాధిపతి కమలానంద భారతీస్వామి కేదారీ ఘాట్‌లో పుణ్యస్నానం చేశారు. కూలిన టెంట్లు పెరవలి మండలంలోని ఘాట్లలో భారీ వర్షానికి పిండ ప్రదాన షెడ్లు, టెంట్లు కూలిపోయాయి. ఘాట్లకు వెళ్లే రహదారులు బురదగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే రంగంలోకి దిగి ఇసుక పొరలు వేశారు. ఖండవల్లి, ఇమ్మిడివారిపాలెం, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు ఘాట్లకు వెళ్లే రహదారులపై పేరుకుపోయిన బురదపై ఇసుక వేసి తాత్కాలికంగా ఇబ్బందులను తొలగించారు. పట్టిసీమ క్షేత్రానికి రాకపోకలు బంద్ నీటిమట్టం పెరగడంతో పోలవరం మండలంలో భక్తుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. పట్టిసీమ లాంచీల రేవులోని ప్లాట్‌ఫామ్‌లు నీట ముని గాయి. దీంతో మధ్యాహ్నం నుంచి లాంచీల రాకపోకలను నిలిపివేశారు. ఇసుక బస్తాలు వేసి ప్లాట్‌ఫామ్‌ను మెరక చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పుణ్య పుష్కర స్నానం అనంతరం పట్టిసీమ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారికి నిరాశ ఎదురైంది. ప్రమాదకరంగా ఘాట్లు నిడదవోలు మండలంలోని కల్యాణ్ఘాట్లో ప్లాట్‌ఫామ్ రాళ్లు పైకి లేచిపోయి స్నానాలు దిగిన భక్తులు గాయాల పాలవుతున్నారు. ఆచంట మండలం భీమలాపురం, కరుగోరుమిల్లి ఘాట్లలో వర్షం కారణంగా పిండ ప్రదానాలు చేసుకునే వీలు లేక ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. యలమంచిలి మండలంలో ఘాట్లకు వెళ్లే రహదారులు బురదతో నిండిపోయినా భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు. -
గోదావరిలో మునిగి ఏడూళ్ల బయ్యారం వాసి మృతి
♦ తూర్పుగోదావరి జిల్లాలో ♦ పుష్కరస్నానం చేస్తుండగా ప్రమాదం పినపాక : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక మండలం గొల్లగూడెం గ్రామం వద్ద అనధికారిక పుష్కరఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో ఖమ్మం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన కాకర్ల రమేష్(25) మృతిచెందాడు. ఖమ్మం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన కాకర్ల రమేష్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక మండలం సీతాపురం గ్రామానికి చెందిన జ్యోతితో వివాహమైంది. తాపీమేస్త్రీగా పని చేస్తూ జీవిస్తున్న రమేష్ మహాపుష్కరాల సందర్భంగా పుష్కర స్నానం చేసేందుకు భార్య జ్యోతితో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. ఆ గ్రామంలో యువకులతో కలిసి కుటుంబ సమేతంగా గొల్లగూడెంలోగల అనధికారిక పుష్కరఘాట్ వద్దకు వెళ్లి పుష్కర స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ అతడు గోదావరిలో మునిగి పోయాడు. గమనించిన స్థా నికులు మునిగిపోయే వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. గజఈతగాళ్లు సుమారు 2 గంటలపాటు గాలించిన అనంతరం మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య జ్యోతి, 2 నెలల బాబు, మూడేళ్ల కుమారుడు కొడుకు ఉన్నారు. కుమారుడి మృతితో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
మహా.. ప్రసాదం
భక్తులకందని రాములోరి ఫలహారం ♦ లడ్డూ ప్రసాదాల విక్రయానికి ఒకటే కౌంటర్ ♦ ‘తానీషా’ మండపం వద్ద భక్తుల పడిగాపులు ♦ పోలీసు ఆంక్షలతో సవాలక్ష ఇబ్బందులు ♦ దేవస్థానం ఆదాయూనికి భారీ గండి ♦ 8 రోజులకు 7.50 లక్షల లడ్డూలే విక్రయం ♦ లడ్డూ తయారీపై ఆచితూచి అడుగులు భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కర స్నానం చేసేం దుకు భద్రాచలం వచ్చిన భక్తులకు రాముడి ప్రసాదం కరువైంది. రాములోరి దర్శనం అనంతరం స్వామి వారి లడ్డూ ప్రసాదాలను తీసుకుందామని గుడి చుట్టూ తిరిగినా...విక్రయశాలలు కనిపించటం లేదు. స్థానిక తానీషా కల్యాణ మండపం వద్ద ఒకే ఒక్క కౌంటర్ ఏర్పాటు చేయడంతో లక్షలాదిగా వచ్చిన భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందటం లేదు. రోజుకు 2.50 లక్షలకు పైగా భక్తులు భద్రాచలం వస్తున్నారని తెలిసినా, అధికారులు దీనిపై ఏమాత్రం దృష్టి సారించటం లేదు. ఉన్న ఒకే కౌంటర్ వద్దనే పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేసి లడ్డూలను విక్రయిస్తున్నారు. మంగళవారం లడ్డూ విక్రయ కౌంటర్ వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది. మండు టెండలో పంచాయితీ కార్యాలయం వరకూ క్యూ లైన్లో వేచి ఉండి భక్తులు లడ్డూలను కొనుగోలు చేశారు. ఎందుకిలా జరుగుతోంది..? గోదావరి పుష్కరాల 12 రోజుల పాటు ఒక్క భద్రాచలానికే 50 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే 20లక్షల లడ్డూలను విక్రయించి సుమారుగా రూ.3 కోట్ల ఆదాయాన్ని సముపార్జించాలని భావించారు. ఇందుకోసం భద్రాచలంలో టీటీడీ, శ్రీ రామనిలయం, సీతానిలయం, తానీషా కల్యాణ మండపం, శ్రీరామ సద నం, సౌమిత్రి సదనం, కల్యాణ మండపం ఏరియా, రూ.200 క్యూలైన్, శ్రీఆంజనేయస్వామి వారి ఆలయం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి మూడు రోజుల పాటు ఈ కౌంటర్ల ద్వారానే లడ్డూ ప్రసాదాల ను విక్రరుుంచారు. భక్తులు ఎక్కువగా ఈ కేంద్రాల వద్ద వేచి ఉండటం వల్ల జనం గుమిగూడుతున్నారని పోలీసుల వీటిని తొలగించాల్సిందిగా దేవస్థానం అధికారులకు సూచించారు. పోలీసుల ఆంక్షలతో కేవలం ఒక్క తానీషా కల్యాణ మండపం వద్దనే కౌంటర్‌ను ఏర్పాటు చేసి ప్రసాదాలను విక్రరుుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 8 రోజులకు 7.50 లక్షల లడ్డూల విక్రయం పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి మంగళవారం వరకు 7.50 లక్షల లడ్డూలను విక్రయించారు. అధికారులు ముందుగా వేసిన లెక్కల ప్రకారం రోజుకు 1.50 లక్షలకు పైగా విక్రయించాల్సి ఉంది. కానీ భక్తులకు అందుబాటులో కౌంటర్లు లేకపోవటంతో లడ్డూల విక్రయం ఆశించిన స్థాయిలో లేదు. పుష్కరాల ప్రారంభమైన తొలిరోజున 1.30 లక్షల లడ్డూలను విక్రయించారు. 15వ తేదీన 61 వేలు, 16న 67 వేలు, 17న 54 వేలు, 18న 1.75 లక్షలు, 19న 1.14 లక్షలు, 20న 88 వేలు, 21వ తేదీన 70 వేల లడ్డూలను అమ్మారు. పోలీసుల ఆంక్షలతో లడ్డూలు ఆశించిన స్థాయిలో విక్రయించే పరిస్థితి లేక తయారీ విషయంలో దేవస్థానం అధికారులు ఆలోచనలో పడ్డారు. మొదటి నాలుగు రోజుల పాటు తగిన రీతిలో విక్రయాలు లేకపోవటంతో, రెండు రోజుల పాటు లడ్డూ తయారీని పూర్తిగా నిలిపివేశారు. ఆదాయానికి భారీ గండి ఓ పక్క ఆర్జిత సేవలను పూర్తిగా నిలిపివేయటంతో టిక్కెట్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేవస్థానం పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది. లడ్డూ ప్రసాదాలను కూడా అమ్ముకోనివ్వకుండా పోలీసులు ఇలా ఆంక్షలు విధిస్తుండటంపై దేవస్థానం అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలపై ‘కోట్ల’ ఆశలు పెట్టుకున్న దేవస్థానం అధికారులకు ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన నాలుగు రోజుల్లో మరో 4 లక్షలకు మించి లడ్డూలమ్మలేమని వాపోతున్నారు. -
ఇక్కడ ఖాళీ.. అక్కడ రద్దీ
సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు దేశం నలుమూల నుంచీ రాజమండ్రి తరలివస్తున్న యాత్రికులు రాత్రి బస చేయడంలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగర శివార్లలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్ల నుంచి ఘాట్లకు దూరం ఎక్కువగా ఉంటోంది. అంత దూరం నడిచి వెళ్లడానికి వారు ఇక్కట్లు పడుతున్నారు. దీంతో దూరప్రాంతంలోని పుష్కర నగర్లు ఖాళీగా ఉంటున్నాయి. కానీ స్నానఘట్టాలకు దగ్గరగా ఉన్న రైల్వే వెయిటింగ్, ప్రైవేటు వసతి ప్రదేశాలు మాత్రం కిక్కిరిసిపోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లోనూ అవి ముగిసిన తర్వాత అక్కడే కుర్చీల్లో భక్తులు సేద తీరుతున్నారు. అయితే ఇక్కడ వారికి ఎలాంటి సదుపాయాలూ లభించడం లేదు. కనీసం తాగునీరు కూడా దొరకడం లేదు. ఆర్ట్స్ కళాశాల, లూథర్ గిరి, రైల్వే గూడ్స్ షెడ్, సాంస్కృతిక కళాశాల మైదానాల్లో ప్రధాన పుష్కర నగర్లు ఉన్నాయి. ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. అక్కడినుంచి పుష్కర ఘాట్లకు వెళ్లేందుకు ఆర్టీసీ ఉచిత బస్సులను అందుబాటులో ఉంచారు. కానీ పుష్కర నగర్‌లకు జనం వెళ్లకపోవడంతో ఉచిత బస్సులు యాత్రికులకు సగమే ఉపయోగపడుతున్నాయి. దీనికి పూర్తి భిన్న పరిస్థితులు రైల్వే స్టేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాల్లో కనిపిస్తోంది. గోదావరి రైల్వే స్టేషన్ పుష్కర్ ఘాట్‌కు అతి సమీపంలో ఉండటంతో రైలు దిగిన యాత్రికులు ఇక్కడే ఉంటున్నారు. వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో ఫ్యాన్లు, పడుకోవడానికి కార్పెట్లవంటివి లేవు. దీంతో భక్తులు మట్టిలోనే పడుకుంటున్నారు. కొందరు రైల్వే బ్రిడ్జి కింద పిండప్రదానాల కోసం వేసిన టెంట్లలోనే సేద తీరుతున్నారు. పక్కనే వందలాది టాయిలెట్లు ఉండటంతో దుర్గంధంతో పాటు దోమల బెడదతో నరకం చవి చూస్తున్నారు. సుబ్రహ్మణ్య మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత యాత్రికులు అక్కడే కుర్చీల్లో పడుకుంటున్నారు. వారిని పట్టించుకున్న నాథుడే లేడు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన పుష్కర నగర్లను కనీస ప్రణాళిక లేకుండా దూరప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో ఆ నిధులు నిరుపయోగమైనట్టు అయింది. కనీసం ఘాట్ల దగ్గర్లో సేద తీరే భక్తుల బాగోగులు పట్టించుకుంటే కొంతలో కొంత ఊరట లభిస్తుంది. -
ఉత్తుంగ తరంగమై..
♦ గోదారి తీరాన్ని ముంచెత్తుతున్న భక్తజనం ♦ రోజు రోజుకీ అదే జోరు ♦ జిల్లాలో 45 లక్షలకు పైగా భక్తుల పుణ్యస్నానాలు ♦ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తగ్గని రద్దీ ♦ కొంతమేర గట్టెక్కిన ట్రాఫిక్ ఇక్కట్లు పశ్చిమ కనుమల్లో చిరుపాయగా జన్మమెత్తి.. ఉప నదులను అక్కున చేర్చుకుని.. క్రమక్రమంగా విస్తరించి.. కొండకోనలు దాటి..ప్రకృతి సౌందర్య వేదిక.. పాపికొండలను అధిగమించి.. మైదాన ప్రాంతంలో అడుగు పెట్టి.. చారిత్రక రాణ్మహేంద్రిని చేరి.. మహాజలధిగా మారి.. ఆపై పాయలుగా విడివడి.. సాగరంతో సంగమిస్తున్న నదీమతల్లి గోదావరికి.. పుష్కర పర్వవేళ.. అశేష జనవాహిని ప్రణమిల్లుతోంది. ఆ పుణ్యవాహినిలో స్నానమాడి పాప ప్రక్షాళన చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో జిల్లాలోని వివిధ స్నానఘట్టాల్లో భక్తులు ఉత్తుంగతరంగమై ఎగసిపడ్డారు. రాజమండ్రి : భక్తజన ప్రభంజనం గోదారి తీరాన్ని చుట్టేస్తోంది. అవాంతరాలెన్ని ఎదురైనా అధిగమించి మరీ వస్తున్న యాత్రికులతో గోదారి స్నానఘట్టాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆదివారం కావడంతో వివిధ జిల్లాల నుంచే కాకుండా స్థానికంగా కూడా భక్తులు ఘాట్ల వద్దకు తరలివచ్చారు. వరుసగా వచ్చిన సెలవులతో గడచిన రెండు రోజులుగా గోదావరి తీరాలు పుష్కర స్నానాలకు వచ్చే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం వారి సంఖ్య మరింత పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు, వ్యాపార సంస్థలకు కూడా సెలవులు కావడంతో ఆదివారం పుష్కర ఘాట్లవద్ద భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. హైదరాబాద్ నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉంది. అంచనాలకు మించి యాత్రికులు రావడంతో ఘాట్లు కిటకిటలాడాయి. రాత్రి ఏడు గంటల సమయానికి 41.07 లక్షల మంది రాజమండ్రి, జిల్లాలోని గ్రామీణ ఘాట్లలో పుణ్యస్నానాలు చేసినట్టు అధికారులు తెలిపారు. రాత్రి తొమ్మిది గంటల సమాయానికి ఈ సంఖ్య సుమారు 43 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. యాత్రికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా 24 గంటలపాటు స్నానాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అర్ధరాత్రి 12 గంటల సమయానికి 45 లక్షలకు పైబడి స్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వెల్లువెత్తారు శుక్రవారం మొదలైన భక్తుల రాక.. శనివారం ఉదయం నుంచి పోటెత్తింది. ఆదివారం మధ్యాహ్నం వరకూ యాత్రికుల రాక కొనసాగుతూనే ఉంది. అయితే సాయంత్రం నుంచి భక్తుల రాక కాస్త తగ్గింది. జిల్లాలోని మొత్తం ఘాట్లను పరిశీలిస్తే తెల్లవారుజామున 3 నుంచి 9 గంటల వరకూ 14.84 లక్షల మంది స్నానాలు చేయగా, 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ 18.49 లక్షల మంది స్నానాలు చేశారు. అక్కడ నుంచి రాత్రి 7 గంటల సమయానికి 7.74 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం నుంచి భక్తుల సందడి తగ్గడంతో స్నానాల సంఖ్య తగ్గినట్టు అధికారులు తెలిపారు. ‘సి’ ఘాట్లలోను పోటెత్తారు గ్రామీణ ఘాట్లలో సైతం భక్తుల రద్దీ అధికంగా ఉంది. కోటిపల్లి ఘాట్‌లో 2.05 లక్షలమంది, కుండలేశ్వరంలో 60 వేలు, సోపంల్లిలో 1.60 లక్షలు, అంతర్వేదిలో 70 వేలమంది స్నానాలు చేయగా, అప్పనపల్లిలో రికార్డు స్థాయిలో 2.01 లక్షల మంది స్నానాలు చేశారు. ఇవే కాదు ‘సి’ గ్రేడ్ ఘాట్లలో సైతం భక్తుల ఎక్కువగా పుణ్యస్నానాలు చేశారు. కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక, కపిలేశ్వరపురం ఘాట్లలో 40 వేల చొప్పున, తాతపూడిలో 25 వేలు; ఆలమూరు మండలం జొన్నాడలో 50 వేలు; అల్లవరం మండలం బోడసకుర్రు, బెండమూర్లంక, గోపాయిలంకల్లో లక్ష మంది; ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో 46 వేలు; పల్లవారిపాలెంలో 38 వేల మంది చొప్పున స్నానాలు చేయడం గమనార్హం. అవే కష్టాలు శనివారంతో పోలిస్తే ఆదివారం కొంతవరకూ ట్రాఫిక్ మెరుగుపడింది. అయితే టోల్గేట్ల వద్ద మాత్రం గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. అంచనాలకు మించి భక్తులు రావడంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడాయి. సమయానుకూలంగా లేని బస్సులు, అందుబాటులో లేని రైళ్లతో జనం ఇక్కట్ల పాలయ్యారు. పుష్కర నగర్‌లకు సంబంధించి సరైన సమాచారం లేకపోవడంతో కొన్నిచోట్ల భక్తుల తాకిడి ఎక్కువగాను, మరికొన్నిచోట్ల ఖాళీగాను దర్శనమిచ్చాయి. మరుగుదొడ్ల వద్ద మాత్రం పరిస్థితి మెరుగుపడలేదు. స్వచ్ఛంద సంస్థలు సహితం మంచినీరు, మజ్జిగవంటివి అందుబాటులోకి తేవడంతో భక్తుల దాహార్తి తీరింది. వాతావరణం చల్లబడడం కూడా కాస్త ఉపశమనాన్నిచ్చింది. -
తొక్కిసలాటలో పుష్కర యూత్రికుడు మృతి
♦ గోదావరి రైల్వేస్టేషన్లో ఘటన ♦ మృతుడి స్వగ్రామం దువ్వ కంబాలచెరువు (రాజమండ్రి)/తణుకు టౌన్ : గోదావరి రైల్వేస్టేషన్లో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రయాణికుడు మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వకు చెందిన రైతు మేడిశెట్టి తాతారావు(45), భార్య రాఘవ, తల్లితో కలసి ఆదివారం వేకువ జామున గోదావరి రైల్వే స్టేషన్లో దిగారు. పుష్కర స్నానం ముగించుకుని ఉదయం 11 గంటలకు తిరిగి దువ్వ వెళ్లేందుకు గోదావరి రైల్వే స్టేషన్‌కు చేరారు. భీమవరం ప్యాసింజర్ రెండో నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. రైలు ఎక్కేందుకు ప్రయూణికులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. తాతారావు కిందపడిపోయాడు. ప్రయాణికులు అతడిని పక్కకు లాగి చూసేసరికి అపస్మారకస్థితికి వెళ్లిపోయాడు. వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించారు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
పుష్కర పాట్లు
♦ నాలుగు గంటల పాటు ప్రయాణికుల నరకయాతన ♦ జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు బారులు తీరిన వాహనాలు ♦ ఉప్పల్ నుంచి ఘట్కేసర్కు కూడా ఇదే పరిస్థితి ♦ ఎల్బీనగర్ రింగ్ రోడ్డులోనూ అవే తిప్పలు సాక్షి, సిటీబ్యూరో : గోదావరి పుష్కరాల కోసం నగరవాసులు భారీసంఖ్యలో క్యూకట్టారు. వరుస సెలవుల నేపథ్యంలో కరీంనగర్‌లోని ధర్మపురి, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కాళేశ్వరం, ఖమ్మంలోని భద్రచలం ప్రాంతాల్లో గోదావరి పుష్కరాల కోసం రోడ్డెక్కారు. శనివారం ఉదయమే పెద్దసంఖ్యలో వాహనాలు రోడ్లెక్కడంతో నగరశివార్లలో నాలుగు గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తార్నాక, సంగీత్ చౌరస్తా మీదుగా సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌కు వచ్చేందుకు దాదాపు గంటన్నరకు పైగా పట్టింది. జేబీఎస్, తిరుమలగిరి, బొల్లారం, శామీర్‌పేట్ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. జేబీఎస్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్ మార్గాల్లోనూ ట్రాఫిక్ స్తంభించింది. మేడ్చల్ ప్రాంతంలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎంపీ మల్లారెడ్డి కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కొని మందుకెళ్లలేక మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. వరంగల్ వెళ్లేందుకు ఉప్పల్ చేరుకున్న నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బొడుప్పల్, మేడిపల్లి, నారపల్లి, ఘట్కేసర్ వరకు వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి కనిపించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజమండ్రి, భద్రాచలం వెళ్లే ప్రయాణికులతో ఎల్బీనగర్ రింగురోడ్డు వాహనాల రద్దీతో కనిపించింది. ఎల్బీనగర్ రింగురోడ్డులో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్, సివిల్ పోలీసులు రంగంలోకి దిగినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపోయాయి. వరంగల్, బాసర, నిజామాబాద్, అదిలాబాద్ వెళ్లే ప్రయాణికుల వాహనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో అల్కాపురి, నాగోలు, ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏపీ టూరిజంకు యమ గిరాకీ - 21వ తేదీ వరకు రిజర్వేషన్లు క్లోజ్ సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ పర్యాటక శాఖ పుష్కరాల సందర్భంగా ప్రకటించిన ట్యూర్ ప్యాకేజీకు విశేషమైన స్పందన లభించినంది. దీంతో ఈ నెల 21 వరకు టికెట్లు రిజర్వయ్యాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని హరిత హోటళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. నగరం నుంచి టూరిజం శాఖ ఆధ్వర్యంలో రోజు 17 బస్సులు నడుపుతున్నాయి. ట్యాంక్‌బండ్ సమీపంలోని శాఖ కార్యాలయం వద్ద నగరవాసులు క్యూ కట్టారు. సంస్థ ఆధ్వర్యలో నడుస్తున్న అన్ని బస్సుల టికెట్లు అమ్ముడుపోయాయని, డిమాండ్ మేరకు మరో మూడు బస్సులు అదనంగా నడుపుతున్నామని, సోమవారం తర్వాత మరిన్ని బస్సులు నడి పేందుకు చర్యలు తీసుకుంటామని సంస్థ అధికారులు పేర్కొన్నారు. బస్సులన్నీ ఫుల్ అఫ్జల్‌గంజ్: వరుసగా సెలవులు రావడంతో మహానగరం నుంచి పుష్కరాలకు నగరవాసులు శనివారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఎంజీబీఎస్ (ఇమ్లిబన్), గౌలిగూడ బస్స్టేషన్ల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే బస్సుల్లో భక్తులు పుష్కరాలకు బయలుదేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాపుష్కరాలు ఉండటంతో నగరంలో ఉండే రెండు రాష్ట్రాల ప్రజలు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లారు. వారాంతం కావడం, రెండు రోజలు సెలవులు రావడంతో శుక్రవారం రాత్రి నుంచే ఎంజీబీఎస్‌లో పుష్కర ప్రయాణికుల రద్దీ పెరిగింది. రాజమండ్రి, నర్సాపురం, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, శ్రీకాకుళం, ధర్మపురి మార్గాల్లో వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిటకిటలాడింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా... ఆర్టీసీ సిటీ రీజియన్ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దీంతోగౌలిగూడ సిటీ బస్టాండ్‌కు బాసరకు వెళ్లే భక్తులు అధిక సంఖ్యతో తరలివచ్చారు. దీంతో పాటు నగరంలోని ఎల్బీనగర్, ఉప్పల్, సంతోష్‌నగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి బాసరకు ప్రత్యేక బస్సులు నడుపుతుండంతో అక్కడి నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు బాసరకు వెళ్లారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
పుష్కరాలకు దారేది..
ద్వారకానగర్ : గోదావరి పుష్కర యాత్ర భక్తులను నరకయాతనకు గురి చేస్తోంది. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేయాలన్న వీరి సంకల్పానికి ఆదిలోనే అవరోధాలెదురవుతున్నాయి. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు సెలువులు కావడంతో అంతా పుష్కర బాట పట్టారు. శుక్రవారం రాత్రి నుంచే ఆర్టీసీ ద్వారకాబస్‌స్టేషన్ రద్దీతో కిటకిటలాడింది. ఆర్టీసీ ముందుస్తు సన్నహాలు చేసినా ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. పుష్కరాలు ప్రారంభం నుంచి ఆర్టీసీ అధికార యంత్రాంగం రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచుతున్నా శనివారం భక్తుల సంఖ్య పతాక స్థాయికి చేరుకుంది. మరోపక్క రహదారుల్లో ఎక్కడిక్కడ బస్సులు ట్రాఫిక్ జాములలో ఇరుక్కొవడం, దీంతో నిర్ణీత సమయానికి తిరిగి చేరుకోక పోవడం వంటి పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ అధికారులు పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో శ్రీకాకుళం, విజయనగర ం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు విశాఖలో ద్వారకాబస్‌స్టేషన్‌లో గంటల తరబడి పడిగాపులు కాస్తూనే ఉన్నారు. శనివారం ఒక్కరోజే 620 బస్సులతోపాటు ఇతర డిపోల నుంచి అదనంగా 120 బస్సులు నడిపుతున్నారు. అయినా రద్దీ తగ్గలేదు. దీంతో ఈ రద్దీని తట్టుకోలేక ఆర్టీసీ చేతులేసే పరిస్థితి వచ్చింది. మరోపక్క రిజర్వేషన్ కౌంటర్లు సైతం జనంతో కిక్కిరిసిపోయాయి. రిజర్వేషన్ చేయించుకున్న పరిస్థితి అగమ్యగోచరం ఆర్టీసీలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారుకూడా పడిగాపులు పడలేక ఏబస్సు ముందుస్తే అదెక్కిపోతున్నారు.బస్సుల్లో సీట్లు కూడా దొరకని పరిస్థితి. చాలామంది ప్రయాణీకులు తమ లగేజీలు, పిల్లలు, వృద్దులతో అవస్థలు పడుతూ బస్సుఎక్కే సమయంలో తీవ్ర తొక్కిసిలాట చోటు చేసుకున్నాయి. రాజమండ్రి బస్సు ప్లాట్‌ఫాంపైకి రాకుండానే బస్సుకూడా పరుగులు తీస్తూ కొందరు ప్రయాణీకులు కిందపడిపోయి గాయాలకు గురయ్యారు. ఓ వ్యక్తికి చేయి విరిగిపోయి ఆసుపత్రిపాలయ్యాడు. 80శాతం బస్సులన్నీ రాజమండ్రివైపే రీజనల్ పరిధిలో ఉన్న డీలక్స్, సూపర్ డీలక్స్,సూపర్ ఎక్సెప్రెస్,మెట్రో,పల్లెవెలుగు, తదితర బస్సులన్నీ రాజమండ్రివైపే పరుగుతు తీస్తున్నాయి. 24 గంటలు బస్సు సర్వీసు సదుపాయాలు చేపట్టినప్పటికీ సీట్లు లభించక వేలాడుతున్నారు. బలముంటేనే బస్సులో సీటుగా మారింది. దాదాపు 80శాతం బస్సులను రాజమండ్రి నడుస్తున్నాయి. దారిమధ్యలో ట్రాఫిక్ జామ్ కావడంతో సరియైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. గణనీయంగా పెరుగుతున్న ఆర్టీసీ ఆదాయం నష్టాలో అలమటిస్తున్న ఆర్టీసీ పుష్కర పుణ్యమా అంటూ నష్టాలను అధికమిస్తోంది. సాదారణ రోజుల్లో రోజుకు రూ.70-90లక్షలు వచ్చే ఆదయం పుష్కరాలతో దీని ఆదాయం రూ. కోట్లురూపాయలు పెరిగింది. శనివారం ఒక్క రోజు ఆదాయం రూ. ఒక కోటీ 40లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా.. శుక్రవారం రాత్రి నుంచి ద్వారకాబస్‌స్టేషన్‌లో పుష్కర భక్తులకు రద్దీ పెరిగింది. ప్రయాణికుల సంఖ్యను అనుగుణంగానే బస్సుల సంఖ్యను చాలావరకు పెంచాం. అన్నీ డిపోల బస్సుల్లో 60శాతం పుష్కరాలకు మళ్లీంచాం. రోజయ 80వేలకు పైగా భక్తులను తరలిస్తున్నాం.-జి.సుధీష్కుమార్, ఆర్టీసీ ఆర్ఎం. విశాఖ రీజయన్ తెల్లవారుజామున వచ్చాం రాజమండ్రి బస్సుకోసం శ్రీకాకుళం జిల్లా నుంచి తెల్లవారుజామున వచ్చాం. బస్సు ఎక్కిదామంటే ఏబస్సు చూసినా తొక్కిసలాటే. భయపడి పిల్లలతో ఎక్కలేపోయాం. -బి. శంకుంతుల,శ్రీకాకుళం జిల్లా. బలముంటేనే బస్సుల్లో సీటు : ప్రయాణీకుల రద్దీ పెరగడం వల్ల బస్సులో సీటులు దొరకాలంటే బలం ఉండాలి. తీవ్రంగీ తొక్కిసలాటలు జరగుతున్నా నివారించే పోలీసులు అంతమంత్రంగానే ఉన్నారు. అందువల్ల చాలా మంది పడిపోయి గాయాలకు గురవుతున్నారు. -అమర శాంతకుమార్, బీటెక్, శ్రీకాకుళం. -
భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు
డిప్యూటీ స్పీకర్ ఏటూరునాగారం : గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి శనివారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌ను సందర్శించారు. ఘాట్ నుంచి సుమారు కిలో మీటరు దూరంలోని జంపన్నవాగు సమీపంలోకి వెళ్లారు. అక్కడ షామినాయాల వద్ద భక్తుల సౌకర్యాలు, ఇబ్బందులు పరి శీలించారు. ఘాట్ నుంచి నదిలోని నీటి ప్రాంతం వరకు ఇసుక బస్తాలపై కాలి నడకన వెళ్లారు. నదీతీరంలో మరోమూ డు టెంట్లు వేయూలని, నీటిసౌకర్యం కల్పించాలని ఆర్డీవో మహేందర్‌జీని ఆదేశించారు. ఘాట్‌కు కొద్ది దూరంలోని మూలమలుపు వద్ద నీటి ఉధృతి ఉం దని, అక్కడ ఘాట్ నిర్మిస్తే బాగుండేదని డిప్యూటీ సీఎంతో అన్నారు. రామన్నగూడెం ఘాట్‌ను సందర్శించిన ఎంపీ సీతారాంనాయక్.. అధికారులు భక్తుల సేవ లో నిమగ్నం కావాలని ఆయన కోరారు. -
పోటెత్తిన భక్తజన గోదారి
ఏపీలో ఒక్కరోజే 41 లక్షల మంది పుణ్య స్నానాలు వేచి ఉన్న మరో ఐదు లక్షల మంది భక్తులు వరుస సెలవులతో పెరిగిన రద్దీ రాజమండ్రి: గోదావరి రేవుల్లో భక్తజన గోదారి పరవళ్లు తొక్కింది. రాష్ర్టంలోని వివిధ జిల్లాలతోపాటు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో గోదావరికి ‘తూర్పు’న రాజమండ్రి, ‘పశ్చిమ’న కొవ్వూరు రహదారులు జనగోదారులను తలపిస్తున్నాయి. ఐదో రోజైన శనివారం నాడు వేకువజాము నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు 41లక్షల మంది భక్తులు స్నానమాచరించారని అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 31,91,742 మంది, పశ్చిమ గోదావరిలో 9,21,043 మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని పేర్కొన్నారు. మరో ఐదు లక్షల మంది(అంచనా) పుష్కర స్నానం కోసం వేచి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికి కోటిన్నర మంది గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించగా, 8 లక్షల మంది పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. తరలివచ్చిన భక్తకోటితో గోదావరి జిల్లాల్లో ఊరూవాడా పుష్కర శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా అఖండ గోదావరి తీరం రాజమహేంద్రికి రేయింబవళ్లు తేడా లేకుండా భక్తులు పోటెత్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో అనేకమంది కుటుంబ సమేతంగా పుష్కరాలకు తరలివస్తున్నారు. సగానికిపైగా ఉత్తరాంధ్ర భక్తులే పుష్కరాలకు వస్తున్న భక్తుల్లో సగానికి పైగా ఉత్తరాంధ్ర జిల్లాలవాసులే కనిపిస్తున్నారు. వారిలో కూడా ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో పిల్లాపాపలతో తరలివస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ప్రతి ఇంటిలో సగం మంది రావాలని, లేకుంటే కనీసం ఒకరైనా పుష్కర స్నానం చేసి తిరిగి వెళుతూ గోదావరి నీటిని తీసుకెళ్లి మిగిలినవారి నెత్తిన చల్లుతామని ఆ జిల్లా నుంచి వచ్చిన మహిళలు చెప్పారు. ధవళేశ్వరం మృతులకు పిండప్రదానం గత నెలలో ధవళేశ్వరం బ్యారేజిపై నుంచి తుపాన్ వ్యాన్ బోల్తాపడిన ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలైన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన 22 మందికి గాయత్రీ బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో పిండప్రదానం చేశారు. ప్రతిదారీ పద్మవ్యూహమే! ఏపీలో పుష్కర యాత్రికులకు ట్రాఫిక్ కష్టాలు రాజమండ్రి/కొవ్వూరు: పవిత్ర గోదావరి పుష్కరాలు.. వరుసగా రెండురోజుల సెలవులు.. ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది. రాష్ట్రంలో వాహనాలు గోదావరి తీరం వైపే సాగాయి. గోదావరికి దారితీసే అన్ని రహదారులు నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని రీతిలో కార్లు, మినీ వ్యాన్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, సరకు రవాణా లారీలతో కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలతో కష్టాలు రెట్టింపయ్యాయి. వీటివద్ద కనుచూపుమేర దాకా వాహనాలు బారులు తీరాయి. పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఉత్సాహంగా బయల్దేరిన లక్షలాది మంది భక్తులు నడిరోడ్డుపై గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. జనం నరకయాతన అనుభవించారు. ఆకలిదప్పులతో అలమటించారు. కొందరు పుష్కర యాత్రను వాయిదా వేసుకొని వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు రైళ్లు కూడా 5 నుంచి 9 గంటలపాటు ఆలస్యంగా నడిచాయి. యాత్రికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పుష్కరాల నేపథ్యంలో శనివారం రహదారులపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించారు. విశాఖ జిల్లా నక్కపల్లి టోల్గేట్ నుంచి తూర్పుగోదావరి జిల్లా లాలాచెరువు వరకు 16వ నంబర్ జాతీయరహదారిపై తెల్లవారుజాము నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై కనీసం మోటార్ సైకిల్, ఆటోలు కూడావెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహనచోదకులు, భక్తులు కాలినడకన రాజమండ్రికి రావాల్సి వచ్చింది. -
చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడియాల మచిలీపట్నం టౌన్ : గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు డిమాండ్ చేశారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో స్నానాలు చేయకుండా షూటింగ్‌కు భక్తుల రద్దీ ఉండాలనే కారణంతో నాలుగు గంటల పాటు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్నానాలు, పూజలు చేయడం కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహించాలని కోరారు. జిల్లాలోని పలు గ్రామాల్లో జ్వరాల తాకిడి అధికమైనా ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయన విమర్శించారు. మాజేరులో విష జ్వరాలు ఉన్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని తమ పార్టీ నాయకులు ముందు నుంచీ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోగా అధికార టీడీపీ నాయకులు తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వాల్‌పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల 24న అనంతపురం జిల్లాలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్వహించనున్న రైతు భరోసా పాదయాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బందరు నియోజకవర్గ ఇన్చార్జి చలమలశెట్టి ఆదికిరణ్, పార్టీ నాయకులు కె.వెంకటేశ్వరరావు, కె.చంద్రశేఖర్, నాగరాజు, బ్రహ్మానందం, శామ్యూల్, రజియాసుల్తానా, కుమారి, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
జామ్.. జామ్..
సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తరువాత వరుసగా రెండు రోజులు సెలవు రావడంతో పుష్కరాల్లో ఐదో రోజైన శనివారం వేల మంది పుష్కర స్నానాలకు తరలి వెళ్లారు. ఉదయం 5 గంటల నుంచి రాజమండ్రి వైపు వెళ్లే మార్గం వాహనాలతో కిక్కిరిసింది. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి విజయవాడవైపు వచ్చే మార్గం వాహనాలతో కిటకిటలాడింది. పలు చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ జామైంది. విజయవాడ నుంచి రాజమండ్రికి సాధారణంగా నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. ట్రాఫిక్‌జామ్ కారణంగా ప్రయాణానికి 10 గంటలకు పైగా పడుతోంది. తిరుగు ప్రయాణం ఎక్కువ సమయం పడుతోంది. రైలులో 40 వేల మంది ప్రయాణికులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు విజయవాడ రైల్వే స్టేషన్ మీదగా రాజమండ్రి, నరసాపురం, కొవ్వూరు, గోదావరి స్టేషన్లకు సుమారు 40 వేల మంది ప్రయాణికులు వెళ్లారని రైల్వే అధికారులు తెలిపారు. రాజమండ్రికి 10 ప్రత్యేక రైళ్లు వేశారు. 20 బోగీలతో వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు 24 బోగీలు తగిలించారు. రాజమండ్రిలో స్టేషన్లో ఫ్లాట్‌ఫారాలు ఖాళీగా లేకపోవడంతో తాడేపల్లిగూడెం తరువాత ఏ స్టేషన్ ఖాళీగా ఉంటే అక్కడే ప్రత్యేక రైళ్లను ఆపేస్తున్నారు. తాడేపల్లిగూడెం వరకు రెండు గంటల్లో రైలు చేరుకున్నా.. అక్కడ నుంచి రాజమండ్రి వెళ్లేందుకు నాలుగు గంటలు పడుతోంది. జనరల్, రిజర్వేషన్ బోగీలు కిటకిటలాడుతున్నాయి. బోగీల్లో చోటులేక ద్వారం వద్దే వెలాడుతూ ప్రయాణిస్తున్నారు. పుష్కర సమాచారం తెలిపేందుకు విజయవాడలో రెండు విచారణ కేంద్రాలు, ఆరు టికెట్ కౌంటర్లను అదనంగా తెరిచారు. బస్సుల్లో 18 వేల మంది ప్రయాణం శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై 120 స్పెషల్ బస్సులకు తోడుగా మరో 250 బస్సులను నడిపారు. శనివారం మధ్యాహ్నానానికి ఒక్క విజయవాడ నుంచే 18వేల మంది ప్రయాణికులు రాజమండ్రి, కొవ్వూరు వెళ్లారని చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. రాజమండ్రిలో ఉదయం 8 గంటలకు బయలుదేరిన బస్సు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ బస్‌స్టేషన్‌కు చేరుకుంది. రాజమండ్రి వెళ్లిన బస్సులు తిరిగి వస్తే వాటినే తిరిగి ఆదివారం రాజమండ్రికి పంపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. డిపోలోని బస్సులు అన్నింటినీ పుష్కరాలకు పంపినందున అదనంగా బస్సులు నడపడం కష్టమంటున్నారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పుష్కర సాన్నాలకు వెళ్తూనో, లేక తిరుగు ప్రయాణంలోనో విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. కర్ణాటక, తమిళనాడు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి జనకీలాద్రిగా మారింది. ఒక శనివారమే 70 వేల నుంచి 80వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అంచనా. కారు కిరాయి భారం సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి రాజమండ్రికి అంబాసిడర్ కారుకు రూ.3 వేలు ఇండికాకు రూ.3,500, టవేరాకు రూ.4,500, ఇన్నోవాకు రూ.5 వేల చొప్పున తీసుకునేవారు. శనివారం అంబాసిడర్‌కు రూ.7వేలు, ఇండికాకు రూ.8వేలు, టవేరా,ఇన్నోవాలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున వసూలు చేశారు. పది నుంచి 15 మంది ప్రయాణించే ట్రావెలర్స్, తుఫాన్ వంటి మినీ బస్సులు, వానులకు రూ.17 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేశారు. ట్రాఫిక్‌జామ్‌లో వాహనాలు చిక్కుకుంటే వెయిటింగ్చార్జీ చెల్లించాలంటూ ట్రావెల్స్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. టోల్గేట్లు చార్జీలు కూడా ప్రయాణికులే చెల్లించాలని కొంతమంది వాహన యజమానులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఆదివారం మాటేమిటీ..? ఆదివారం రోజున పుష్కర ట్రాఫిక్ యథాతథంగా కొనసాగుతుందని అంచనా. అయితే ఇప్పటికిప్పుడు రైళ్లు, బస్సుల సంఖ్య పెంచడం సాధ్యం కాదని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు.ట్రాఫిక్ జామ్ కారణంగా రాజమండ్రి వైపు వెళ్లడానికి డ్రైవర్లు ముందుకు రావడం లేదని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు చెబుతున్నారు. కీసర వద్ద బారులు తీరిన కార్లు కంచికచర్ల : మహారాష్ట్ర, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు వెళ్లే కార్లు, ఇతర వాహనాలు శనివారం మండలంలోని కీసరలో స్వర్ణటోల్గేట్ వద్ద బారులుదీరాయి. ఈ ఒక్క రోజు టోల్ గేట్ నుంచి 976 కార్లు వెళ్లాయని, రూ.50 వేల ఆదాయం వచ్చిందని టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు. టోల్గేట్ జంక్షన్ జామ్ గన్నవరం : పుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనలతో చెన్నై-కోల్కత్తా జాతీయ రహదారి శనివారం కిక్కిరిపోయింది. రామవరప్పాడు నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభిం చింది. వాహనాల రద్దీ తెల్లవారుజాము నుంచే మొదలైంది. పొట్టిపాడు టోల్‌గేటు వద్ద ఉదయం మూడు గంటల సమయంలో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఉంగుటూరు పోలీసులు తీవ్రంగా యత్నించినా ఫలితం లేకపోయింది. టోల్గోటులో వసూలు నిలిపివేసి వాహనాలను వదిలేయడంతో ట్రాఫిక్ అదుపులోకి వచ్చింది. -
ప్రభంజనం
♦ మహా పుష్కరం... భక్త జన పరవశం ! ♦ నాలుగో రోజు పోటెత్తిన జనవాహిని ♦ 4,48,426 మంది పుష్కర స్నానాలు ♦ నేడు, రేపు మరింత పెరగనున్నభక్తుల రద్దీ ♦ అప్రమత్తమైన అధికార యంత్రాంగం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో గోదావరి నదీ తీరం భక్తజనంతో ఉప్పొంగింది. నాలుగు రోజులుగా మందకొడిగా ఉన్న స్నానఘాట్లు ఒక్కసారిగా పుష్కర శోభ సంతరించుకున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉండటంతో శుక్రవారం నుంచి భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ప్రారంభం రోజున 1.50 లక్షల మంది పుష్కరస్నానం చేయగా... మరుసటి రోజు 92,448కి తగ్గింది. గురువారం 1,00,101 మంది భక్తులు హాజరు కాగా, శుక్ర వారం రాత్రి 9 గంటల వరకు భక్తుల సంఖ్య 4,48,428 మందికి చేరింది. ఒకేసారి భక్తుల తాకిడి పెరగడంతో కందకుర్తి, తడపాకల్, పోచంపాడు, తుంగిని, ఉమ్మెడ పుష్కరఘాట్లు కిటకిటలాడాయి. గుమ్మిర్యాల్, బినోల తదితర పుష్కరఘాట్లకు సైతం భక్తుల రద్దీ పెరిగింది. 144 ఏళ్ల తర్వాత గోదావరి నదికి ప్రస్తుతం జరిగేది 12వ పుష్కరాలు. త్రయంబకేశ్వరం వద్ద పుట్టిన గోదావరి.. జిల్లాలో బోధన్ మండలం కందకుర్తి వద్ద మంజీర, హరిద్ర నదులతో సంగమించి ఆరు మండలాలను తాకుతూ సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తోంది. పర్యవేక్షించిన కలెక్టర్, అధికారులు.. గోదావరి మహా పుష్కరాల నాలుగో రోజు శుక్రవారం కందకుర్తి, పోచంపాడు, తడపాకల్, తుంగిని పుష్కరఘాట్లలో భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచే ఇన్సిడెంట్ క మాండర్లు, ఘాట్ ఇన్‌చార్జ్‌లు ఇచ్చిన సమాచారంతో కలెక్టర్ రోనాల్డ్‌రోస్.. పెరిగిన భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. జే సీ ఎ.రవిందర్‌రెడ్డి, ఏజేసీ రాజారాం, డీఆర్డీఏ, హౌసింగ్, డ్వామా పీడీలు, పుష్కరఘాట్ల ఇన్ఛార్జ్లైన వెంకటేశం, చైతన్యకుమార్, వెంకటేశ్వర్లు సహా ఘాట్ ఇన్ఛార్జ్లు అప్రమత్తం అయ్యా రు. త్రివేణి సంగమ వేదిక కందకుర్తి పుష్కర కేత్రానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే సు దూర మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి పుణ్యసాన్నాలు ఆ చరించారు. కందకుర్తి, పోచంపాడు పు ష్కరఘాట్లను డీఐజీ ఎడ్ల గంగాధర్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ సుదీ ప్ లక్టాకియా సందర్శించారు. పెరిగిన భక్తులకు అనుగుణంగా భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. తడిసి ముద్దరుున తడపాకల్, పోచంపాడు... సెంటిమెంట్‌కు తోడు పుష్కర స్నానం ఆచరించాలనే ఆకాంక్షతో భక్తుల బాట తడపాకల్వైపు నడచింది. జన సందోహాంతో మోర్తాడ్ మండలం తడపాకల్, బాల్కొండ మండలం పోచంపాడు పుష్కరక్షేత్రాలు తడిసి ముద్దయ్యాయి. తండోపతండాలుగా తరలివచ్చిన జన సందోహాన్ని ఆపడం పోలీసులకు సాధ్యం కాలేక పోయింది. భక్తి పారవశ్యంతో తరలిన ప్రజలు గంగాదేవిని కొలుస్తూ తరలివచ్చారు. గోదావరి నదీ తీరానికి 1.5 కిలోమీటరు దూరంలో వాహనాలను పోలీసులు నిలిపివేశారు. కామారెడ్డి, బాన్సువాడ, భీమ్‌గల్, సిరికొండ, ధర్పల్లి, వేల్పూర్. జక్రాన్‌పల్లి, ఆర్మూర్, తదితర ప్రాంతాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. పోచంపాడు జాతీయ రహదారి పక్కన ఉండటంతో హైదరాబాద్, నిజామాబాద్‌ల ప్రయాణం సునాయసంగా ఎంచుకున్న భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఇక్కడ ఒక దశలో పుష్కర స్నానాలను పర్యవేక్షించడానికి ఉన్న అధికారుల వాహనాలు కూడా రోడ్డుపైకి వెళ్లే మార్గం లేక పోయింది. తుంగిని, ఉమ్మెడ పుష్కరఘాట్లకు కూడా భక్తుల రద్దీ పెరిగింది. పెరిగిన వీఐపీల తాకిడి.. కందకుర్తి, పోచంపాడు, తడపాకల్, తుంగిని, ఉమ్మెడలతో పాటు మిగతా పుష్కరఘాట్లకు కూడ శుక్రవారం భక్తుల తాకిడి పెరిగింది. గోదావరి మహాపుష్కరాల్లో భాగంగా భక్తుల తాకిడితో ఘాట్లు సందడిగా మారాయి. కోస్లీ ఘాట్‌లో భక్తుల సందడి పెరగగా ప్రత్యేక అధికారి మోహన్‌లాల్ పర్యవేక్షించారు. కాగా నాలుగో రోజు వీఐపీల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ ఎప్పటికప్పుడు పుష్కరఘాట్లను పరిశీలిస్తూ, ఇన్‌చార్జ్‌లతో మాట్లాడి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారు. పోచంపాడు పుష్కరఘాట్ల వద్ద ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆఫ్ లా జడ్జీ పి.చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులతో పుణ్య స్నానం చేసి పూజలు నిర్వహించారు. ప్రపంచబ్యాంకు సలహాదారు ఎస్.ఎస్ రావు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానం చేశారు. తెలంగాణ ఏసీబీ జాయింట్ డెరైక్టర్ ఉమామహేశ్వర్ శర్మ కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం చేసి పూజలు నిర్వహించారు. అలాగే న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, నిజమాబాద్ ఏఎస్పీ ప్రతాప్ రెడ్డి, జీఎంఆర్ సీఈవో కిషోర్, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు పెద్ద కూతురు శారద దేవీ తదితరులు కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానాలు చేశారు. హంపీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతి స్వామి, శ్రీసరస్వతి విద్యాపీఠం పీఠాధిపతి శ్రీసచ్చిదానంద గిరి స్వామి, బాలరాజ్ మహారాజ్‌లు వేద మంత్రోచ్చరణలతో గంగమ్మతల్లిని స్మరిస్తూ హారతి ఇచ్చారు. -
జనమెత్తిన గోదావరి
గౌతమి చెంత.. భక్తుల పులకింత.. ♦ పిండప్రదానాలు.. పుణ్యస్నానాలు ♦ భద్రాద్రిలో పుష్కర స్నానం చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ♦ నేడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి తీరం భక్తజనసందోహంతో పులకించిపోయింది. జనప్రవాహం సాగుతోందా అన్నట్లుగా ఎటూ చూసినా జనమే జనం. ఒకవైపు భక్తుల పుణ్యస్నానాలు... మరోవైపు పితృదేవతలకు పిండప్రదానాలతో నదీ తీరం కిక్కిరిసిపోయింది. వచ్చి పోయే భక్తులతో కరకట్ట, ఘాట్ రోడ్డు మొత్తం నిండిపోయింది. ముందురోజు రాత్రి వచ్చిన భక్తులంతా తెల్లవారు జామునే గౌతమి తీరానికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించడంతోపాటు పితృదేవతలకు తర్పణాలు వదిలారు. తెల్లవారు జామున 4 గంటలకు ప్రారంభమైన జనవాహిని క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. వేల నుంచి లక్షల సంఖ్యకు భక్తజనం పెరిగింది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు గోదావరి ఒడిలో స్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. యువత గోదావరి తల్లి ఒడిలో ఆడుకుంటూ కేరింతలు కొట్టారు. జిల్లాలోని మొత్తం 8 ఘాట్లు పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన వీల్ చైర్ల ద్వారా వారిని పుష్కర ఘాట్లకు తరలిస్తూ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు సేవలు అందించారు. భక్తులకు అవసరమైన సమాచారం, మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేశారు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ఆధ్యాత్మిక వేత్తలచే ప్రవచనాలు అందిస్తూ భక్తులను భక్తిపారవశ్యంలోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు స్టేడియం వెనుకవైపు ఏర్పాటు చేసిన కళా వేదికపై ఉదయం నుంచి రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని నింపుతున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కుటుంబ సభ్యులతో సహా భద్రాచలంలోని పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం రాములవారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా మోతెఘాట్‌లో పుష్కరస్నానం చేశారు. నేడు,రేపు భక్తుల రద్దీ రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు కాగా, భక్తులు జిల్లాలోని పుష్కర ఘాట్లకు పోటెత్తే అవకాశం ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రధాన రహదారిపై బస్టాండ్ నుంచి ఆలయానికి, ఘాట్‌కు వెళ్లే రోడ్లవెంబడి బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను రప్పించారు. అధికారులు ఎప్పటికప్పుడు భద్రత చర్యలను పర్యవేక్షించడంతోపాటు శని, ఆదివారాలు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించుకుంటున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ రెండురోజులు కీలకం కావడంతో ఎలాగైనా పుష్కరాలను విజయవంతం చేయాలని అధికారులు భావించి అన్నివిధాలా చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికుల కోసం అదనపు బస్సులు రెండు భద్రాద్రికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 360 బస్సులు నడుస్తుండగా వాటి సంఖ్యను 450 వరకు అవసరాన్ని బట్టి పెంచనున్నారు. అదేవిధంగా సారపాక నుంచి భద్రాచలం వరకు ప్రస్తుతం తిప్పుతున్న 110 షటిల్ బస్సులను 125కు పెంచుతున్నట్లు భద్రాచలం ఆర్టీసీ డీఎం నామా నర్సింహా ‘సాక్షి’కి తెలిపారు. పర్యవేక్షణకు ఇద్దరు మంత్రులు జిల్లాలో పుష్కరాలను పర్యవేక్షించేందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు మంత్రులను ఇన్చార్జిలుగా నియమించారు. రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డితోపాటు రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఇన్చార్జిలుగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే తుమ్మల భద్రాచలంలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తుండగా శుక్రవారం రాత్రికి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చేరుకోనున్నారు. అదేవిధంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను సైతం స్పెషల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వీరిలో మానిక్‌రాజ్, యోగితారాణాలు ఉన్నారు. భక్తులందరికీ ఆలయ దర్శనం : మంత్రి సామాన్య భక్తులకు కూడా ఆలయ దర్శనం ఉంటుం దని, దీనిలో ఎటువంటి అపోహలు వద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కళ్యాణ మండపంలో స్వామి మూర్తులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంత సమయమైనా వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటామనేవారికి ఆలయ దర్శనం ఉంటుందన్నారు. శని, ఆదివారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులు సహకరించాలని కోరారు. -
గౌతమికి నీరాజనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గోదావరి మహా పుష్కరాలకు భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. మూడోరోజు గురువారం వేలాది మంది భక్తులు గోదావరి ఒడిలో పవిత్ర స్నానాలు చేశారు. కంద కుర్తి మొదలు..పోచంపాడ్, తడపాకల్, గుమ్మిర్యాల, తుంగిని, ఉమ్మెడ సహా జిల్లాలో అన్ని ఘాట్ల వద్ద భక్తుల సందడి కనిపించింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు మహారా ష్ర్ట, కర్ణాటక నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించి పునీతులయ్యారు. పుష్కరఘాట్లలో సౌకర్యాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అధికారులతో సమీక్షించారు. కందకుర్తి, పోచంపాడ్, తుంగిని తదితర ఘాట్లను సందర్శించిన ఆయన మొదటి, రెండోరోజు ఎదురైన సమస్యలను గుర్తించి భక్తులకు తగిన ఏర్పాట్లను చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తడపాకల్ను సందర్శించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కుటుంబసభ్యులతో ఎస్ఆర్ఎస్పీ వద్ద పవిత్ర స్నానమాచరించారు. కాగా, శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నందున పుష్కరఘాట్లకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బం దోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. వాచ్టవర్ల ద్వారా వీవీఐపీ, వీఐపీల సందర్శన, భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు, ఘాట్ ఇన్‌చార్జ్‌లు, ప్రత్యేక విభాగాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రధాన పుష్కరఘాట్ కందకుర్తిలో నీటి సమస్య ఏర్పడింది. పుష్కరాల కోసం శ్రీరాంసాగర్ నుంచి పోచంపాడ్, సావెల్ తదితర ఘాట్లకు నీటి విడుదల చేపడుతుండటంతో ప్రాజెక్ట్ నుంచి నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. నిరంతరం మూడు వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదులుతున్నారు. నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సరస్వతీ కాలువ ద్వారా 800 క్యూసెక్కులు వదులుతుండగా, గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్ట్ నీటి మట్టం 2.5 అడుగుల మేరకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం 1,091 అడగులు కాగా, గురువారం సాయంత్రానికి 1055.30 అడుగుల నీరు ఉంది. -
కందకుర్తిలో జన సందోహం
కందకుర్తి, సాక్షి బృందం : పుష్కర అమావాస్యను పురస్కరించుకుని గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు గురువారం కందకుర్తికి భక్తులు పెద్ద సంఖ్య లో తరలి వచ్చారు. భక్తుల అవసరాల మేరకు అధికారులు సౌకర్యాలు కల్పించారు. బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, డీఎస్పీ రాంకుమార్, నిజామాబాద్ డీఎస్పీ గ ంగాధర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుష్కరాల జిల్లా బాధ్యులు, బాల కార్మిక నిర్మూలన ప్రాజెక్టు అధికారి ఎం సుధాకర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ బసవేశ్వరీ త్రివేణి సంగమ క్షేత్రాన్ని. ఇక్కడ దాదాపు 20 వేల మంది భక్తులు పుణ్యసాన్నాలు ఆచరించారు. నది స్నానాలకే భక్తుల పరుగు కందకుర్తి త్రివేణి పుష్కర క్షేత్రంలో గోదావరి నదీ తీరాన నిర్మించిన నాలుగు ఘాట్ల వద్ద కూడా షవర్లు ఏర్పాటు చేశారు. కానీ, భక్తులు నది సాన్నాలకే ప్రాధాన్యం ఇ చ్చారు. దీంతో షవర్లు వెలవెలబోయాయి. నదిలో నీటి సదుపాయం కల్పించేందుకు అధికారులు నానా పాట్లు పడ్డారు. కిలోమీటరు దూరంలో ఉన్న సంగమేశ్వరాలయం వద్ద ఉన్న పెద్ద గుంత నుంచి కాలువల ద్వారా నీటిని ఘాట్ల వద్దకు మళ్లించారు. ఇందుకోసం ఒకటవ ఘాట్ సమీపంలో ఇసుకతో అడ్డుకట్ట వేశారు. మళ్లించిన నీళ్లు ఘాట్ల అంచు వరకు చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్యంపై అప్రమత్తం ఘాట్ల వద్ద, నదిలోపల భక్తులు సాన్నాలు చేసే చోట పారిశుద్ధ్యం లోపించకండా అధికారులు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు నీ టితో ఘాట్లను శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. వైద్య సేవలు పుష్కర క్షేత్రంలో తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యరోగ్య శాఖ నుంచి కూడా శిబిరం ఏర్పాటు చేసి వైద్య సిబ్బ ందిని అప్రమత్తంగా ఉంచారు. స్వచ్చంద సేవలు సత్యసాయి సేవా సమితి, బోధన్‌కు చెందిన విద్యావికాస్ జూనియర్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారు. సత్య సాయి సేవ సమితికి 250 మంది వంతులవారీగా పని చేస్తున్నారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధ్వర్యంలో వనదుర్గ ఆలయం వద్ద సాంస్కృతి కార్యక్రమాల ద్వారా సంక్షేమ పథకాల పై అవగాహన కల్పిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల అధ్వర్యంలో భక్తులను పుష్కర క్షేత్రం నుంచి బస్టాండ్ వరకు వృద్ధులు, వికలాంగులను తర లించేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. పోలీసులు వారికి సహాయం అందిస్తున్నారు. వనదుర్గ ఆలయం సమీపంలో ఇందూరు పుష్కర సమితి అధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన నిత్యాన్నదాన శిబిరానికి భక్తులు వెళ్లేందుకు అధికారులు వాహనం ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసు నిఘా కందకుర్తి పుష్కర క్షేత్రంలో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. షవర్లు వదిలి నదిలో సాన్నాలకు భక్తులు ఆసక్తి చూపడంతో పోలీసులు నదిలో అడుగడుగనా నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు ఫొటోలు తీయకుండా, వీడియో చిత్రీకరించకుండా నిషేధం విధించారు. ఈ క్రమంలోనే నలుగురు అకతాయి యువకులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో 20 మంది పోలీసుల బృందం బందోబస్తులో పాల్గొన్నారు. భక్తులు సాన్నాలు చేసే పలుచోట్ల మ హిళా పోలీసులను నియమించారు. అంగన్వాడీ టీచర్లను ఘాట్ల పర్యవేక్షణకు నియమించారు.