పులకించిన గంగ | Pulakincina Ganga | Sakshi
Sakshi News home page

పులకించిన గంగ

Published Fri, Jul 24 2015 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

పులకించిన గంగ

పులకించిన గంగ

♦ పదో రోజూ పుష్కరఘాట్లు కిటకిట
♦ {పవాహంలా తరలివచ్చిన జనం
♦ పొరుగు రాష్ట్రాల నుంచీ వచ్చిన భక్తులు
♦ గోదారిలో పవిత్రస్నానాల కోలాహలం
♦ వానలోనూ ఏమాత్రం తగ్గని ఉత్సాహం
♦ అంతటా కొనసాగిన స్వచ్ఛంద సంస్థల సేవలు
♦ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, కలెక్టర్, ఎస్‌పీ
♦ ఆది పుష్కరాల ముగింపునకు ఇక రెండు రోజులే
 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పదవ రోజు కూడా మహాపుష్కరాలకు భక్తుల తాకిడి కొనసాగింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్యస్నానాల కోసం జనం బారులు తీరారు. దాదాపు 11,64,370 మంది భక్తులు పవిత్ర స్నానమాచరించారు. జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సం ఖ్యలో తరలివస్తున్నారు. వీఐపీల తాకిడి కూడా రోజు రోజు కూ పెరిగిపోతోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీకళాకారులు, విదేశీయులు సైతం పుష్కరస్నానాలను ఆచరించారు. పోచంపాడ్, కందకుర్తి, తడపాకల్, గుమ్మిర్యాల, తుంగిని, దోంచంద, ఉమ్మెడ, సావెల్ తదితర ప్రాంతాలలో లక్షలాది మంది భక్తులు స్నానమాచరించి వెళుతున్నారు.

ఆది పుష్కరాల చివరి రోజులు దగ్గరపడడంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర, మహారాష్ర్ట భక్తులు అధిక సంఖ్య తరలివస్తున్నారు. వర్షం పడుతున్నప్పటికీ రద్దీ తగ్గ లేదు. పుష్కరఘాట్‌లు, దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్, జాయింట్ కలెక్టర్ ఎ.రవీంద ర్‌రెడ్డి పుష్కరఘాట్లను పరిశీలిస్తూ, సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి పుష్కరఘాట్లలో బం దోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

 పోచంపాడ్‌కు కొనసాగుతున్న భక్తుల రద్దీ
 పోచంపాడ్‌కు భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం పుష్కరస్నానాలు చేసిన భక్తుల సంఖ్య సు మారుగా నాలుగు లక్షలకు చేరింది. జాతీయ రహదారికి అనుకొని ఉండడంతో హైదరాబాద్‌తోపా టు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. దీంతో రహదారులను వాహనాలు, జ నాలతో కిక్కిరిసిపోతున్నాయి. పుష్క ర ఘాట్లు ఇ సుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. రాత్రి వరకు భక్తుల తాకిడి కొనసాగింది. ఘాట్లకు ఉన్న అన్ని దారుల నుంచి భ క్తులు కాలి నడకన తరలి వచ్చారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీలో నీరు పరిశుభ్రం గా ఉందన్న సమాచారం భక్తుల ద్వారా వెళ్లడంతో అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. శనివారంతో పుష్కరాలు ముగుస్తున్నందున నేడు, రేపు రెండు రోజులు కూడ భక్తుల రద్దీ పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

 త్రివేణి సంగమంలోనూ జనవాహిని
 కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర క్షేత్రంలో భక్త జనజాతర సాగింది. పుణ్యస్నానాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నాం 12 గంటల సమయం లో 20 నిమిషాల పాటు వర్షం కురిసింది. వర్షంలోనే నదీ స్నానాలకు వెళ్లారు. వికలాంగులు, వృద్ధులను నది లోపల నుంచి ఒడ్డుకు చేర్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు, అంగన్‌వాడీలు, సత్యసాయి సేవ సమితి సభ్యులు, ఎన్‌సీసీ విద్యార్థులు పాట్లు పడ్డారు. ఉదయం వర్ష సూచన కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

అదనంగా బోధన్, రెంజల్ మండలా ల నుంచి రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ సేవకులను రప్పించారు. చివరి రెండు రోజుల్లో భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ మేరకు వివిధ శాఖల సిబ్బందిని నియమించారు. స్వచ్చంద సంస్థలు సేవలను కొనసాగించాయి. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ లయన్స్ క్లబ్ శాఖ భక్తులకు ఉచితంగా పులిహోర, నీళ్ల ప్యాకెట్లను పంపిణి చేశారు.

 పుష్కరఘాట్లకు జనశోభ
 జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 పుష్కరఘాట్లకు ఉద యం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. పోచంపాడ్, కందకుర్తితో పాటు మోర్తాడ్ మండలంలోని తడపాకల్, గుమ్మిర్యాల్, దోంచందకు ఉదయం నుం చే జనసందోహం మొదలయింది. భక్తులు ప్రైవేట్‌వాహనాలు, బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో పుష్కరఘాట్లకు చేరుకొని పుష్కరస్నా నాలు ఆచరించారు. రద్దీ అధికంగా ఉండడంతో కొంత ఇబ్బంది పడ్డారు. పుష్కరాలకు గడువు సమీపించడంతో వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. తడపాకల్‌లో సుమారు 1.70 లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు.

గుమ్మిర్యాల్, దోంచందలో 45 వేల మంది పుణ్యస్నానాలు చేశారు. నవీపేట మండలంలోని తుంగిని ఘాట్లో 1.15 లక్షల మంది భక్తులు పుష్క ర స్నానాలు చేశారు. నందిపేట మండలం ఉమ్మెడలో పదవ రోజు ఉమ్మెడలో భక్తుల తాకిడి తగ్గ లే దు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఖ మ్మం, నల్గొండ, వరంగల్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుంచి తరలి వ  చ్చారు. అలాగే మహారాష్ట్రలోని పర్భణీ, నాందేడ్, లాతూర్ నుంచి భక్తులు వచ్చారు.

గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కోస్లీకి సుమారు 11వేలకుపైగా భక్తులు రావడంతో పుష్కరఘాట్ల వద్ద రద్దీ ఏర్పడింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పుష్కరఘాట్‌ను పరిశీలించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. తాడ్ బిలోలి పుష్కరఘాట్  భక్తులతో కిటకిటలాడింది. పుణ్యస్నానాల కోసం సు  మారు ఏడు వేల మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. సావెల్‌కు భక్తులు పెద్ద సం ఖ్య లో హాజరై పుణ్యస్నానాలు చేశారు.

 బారులు తీరిన వీఐపీలు
 పదో రోజున పుష్కరఘాట్లకు వీఐపీల తాకిడి పెరిగింది. శాసనసభలో బీజేపీ ప నేత డాక్టర్ లక్ష్మణ్ దోంచందలో పుష్కర స్నానం చేసి, గుమ్మిర్యాల్ శ్రీకష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్ట ర్ జె.గీతారెడ్డి మోర్తాడ్ మండలం తడపాకల్‌లో పుష్కర స్నానం చేశారు. మాజీ శాసనసభాపతి కేఆర్ సురేష్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మజారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచందర్‌రెడ్డి తడపాకల్‌లో పుష్కరస్నానం చేశారు. ఒలింపిక్ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జె రంగారావు కందకుర్తిలో పుష్కర స్నానం ఆచరిం  చి, పెద్దలకు పిండప్రదానం చేశారు. దోంచందలో టీవీ నటులు హరిత, జాకీ, విజయ్ పవిత్ర స్నానాలు చేశారు. ఐసీడీఎస్ కమిషనర్ విజయేం   ద్ర దోంచందలో పుష్కరస్నానమాచరించారు. సావె   ల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన స్టీఫెన్ హుక్, సం ట్రాన్ పుష్కర స్నానామాచరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement