♦ పుష్కర భక్తుల్లో కొద్దిమందికే రామయ్య దర్శనం
♦ టిక్కెట్ల అమ్మకంలేక ఆలయ ఖజానాకు గండి
భద్రాచలం నుంచి సాక్షి బృందం : దేశం నలు మూలల నుంచి గోదావరి పుష్కరాలలో స్నానం చేసేందుకు భద్రాచలం బారులు తీరుతున్నారు. భద్రాచలం వచ్చిన భక్తుల సంఖ్య కోటిని సమీపిస్తున్నా అందరూ స్వామి వారిని దర్శించుకొని, ప్రసాదాలు స్వీకరించలేకపోతున్నారు. ఈ పదిరోజుల్లో కేవలం ఆరులక్షల మంది భక్తులే రామయ్య దర్శనం చేసుకున్నారు. భద్రత పేరుతో పోలీసులు విధించిన ఆంక్షల వల్ల దేవస్థానం అధికారులు ఆర్జిత సేవలు, వీఐపీ టిక్కెట్లను పూర్తిగా రద్దు చేయటంతో పాటు లడ్డూ కౌంటర్లను కుది ంచటంతో గోదావరి పుష్కరాలలో రామ య్య ఆదాయానికి భారీ గండి పడింది.
పోలీసుల ఆంక్షలతో టిక్కెట్ల అమ్మకం బంద్
గోదావరి పుష్కరాల ఆదాయంపై దేవస్థానం అధికారులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. కోటి మంది భక్తులు వస్తారనే అంచనాతో నిత్యకల్యాణాలు, రూ. 500, 200 టిక్కెట్ల దర్శనం టిక్కెట్లను 20 వేలకు పైగా ముద్రించారు. కాకపోతే పోలీసు అధికారులు భద్రత, తొక్కిసలాటలు జరుగుతాయనే నెపంతో వీఐపీ టిక్కెట్లను 5 రోజుల తరువాత దేవస్థానం సిబ్బందిని విక్రరుుంచనివ్వలేదు. రూ. 500 వీఐపీ టిక్కెట్లు వెరుు్యకి మించి అమ్ముడుపోలేదు.
స్వామివారి దర్శనానికి 5గంటలకు పైగానే పడుతుండటంతో ఇటు ఉచిత దర్శనం చేసుకోలేక, వీఐపీ టిక్కెట్లు కొందామన్న అమ్మేవారు లేకపోవడంతో ఇటు శీఘ్ర దర్శనం చేసుకోకుండా లక్షలాది మంది భక్తులు నిరుత్సాహంతో ఇళ్లకు పయనమవుతున్నారు. గోదావరి పుష్కరాలలో 10 రోజులలో సుమారు 40 లక్షల మందికి పైగా భద్రాచలం వచ్చారని అధికారులు భావిస్తున్నారు. వీరి ద్వారా రూ. 1,29,53,572 ఆదాయం వచ్చింది. కనీసం పెట్టుబడులు కూడా రావని అధికారులంటున్నారు.
కోటిలో ఆరు లక్షలే..!
Published Fri, Jul 24 2015 2:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement