వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం
స్పీకర్ కోడెల శివప్రసాదరావు విజ్ఞప్తి
గుంటూరు వెస్ట్ : ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనసభా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరులోని ఐబీలో జరిగిన మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తాను అమెరికాలో జరిగిన తానా, నాటా సభల్లో పాల్గొన్నానని, అక్కడి ప్రజల జీవనస్థితులు, అలవాట్లు తనను బాగా ఆకర్షించాయని అన్నారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 15లక్షల మంది తెలుగువారు స్థిరపడ్డారని, వారు ఫా ర్మా, ఐటి, హోటల్ తదితర రంగాల్లో బాగా అభివృద్ధిని సాధించారన్నారు.
అక్కడి వారు తమ సేవల్ని రాష్ట్రానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిచ్చే నిధుల్ని ఉపయోగించుకొని స్మార్డ్ వార్డుల్ని, స్మార్ట్ గ్రామాల్ని తయారుచేసుకొని ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో పయనించేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నా రు. మరుగుదొడ్ల నిర్మాణంపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా రు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గా ల్లో సుమారుగా 33 వేల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. నీరు-చె ట్టు కార్యక్రమం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయని, చెరువును తవ్విన ప్రతి వ్యక్తి ఆ గ్రామంలో 100 చెట్లు నాటాలని స్పీకర్ సూచించారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాల్సి వుందన్నారు.
ఆ సంఘటన దురదృష్టకరం
రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. అధికారులు మరింత శ్రద్ధతో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని సూచించారు.