మాధవ సేవగా భావిస్తున్నాం
♦ పండుగలా ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు
♦ భక్తులకు లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం
♦ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కందకుర్తి సాక్షి బృందం : మానవసేవయే మాధవ సేవగా భావిం చి ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గోదావరి మహా పుష్కరాలలో ము క్కోటి దేవతలను ప్రత్యక్షంగా చూడకున్నా, నదీ స్నానాలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి మాధవసేవ చేసుకున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. గురువారం మంత్రి పోచా రం కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మా ట్లాడారు. పదవ రోజు వరకు జిల్లాలోని 18 క్షేత్రాలలో 65 లక్షల మంది భక్తులు పవిత్ర స్నా నాలు చేశారని తెలిపారు. చివరి రెండు రోజు లలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
ముఖ్యమంత్రి కే సీఆర్ పుష్కరాల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తు, ప్రత్యేక శ్రద్దతీసుకుంటున్నారని వివరించారు. తెలంగాణలో ఏర్పాట్లు బాగుండటంతో చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని అన్నారు. అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, హోంగార్డు నుంచి డీఐజీ వరకు ప్రతీ ఒక్కరు తమ ఇంట్లో పండుగ జరిగితే ఎంత శ్రద్ధ తీసుకుంటారో పుష్కరాలలో సైతం అదే తరహాలో సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించడంలేదని, భక్తులకు సౌకర్యాలపైనే ప్రదానంగా దృష్టిని సారించిందని అన్నా రు. ప్రకృతి సహకరించకున్నా ఉన్న వనరులను వినియోగించుకుని గోదావరి నదిలో నీటి సౌకర్యం కల్పించామని, నీరు కలుషి తం కాకుండా అన్ని చ ర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు.
క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలి
పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని మంత్రి పోచారం సూచించారు. వాహనాలను అతివేగంగా నడపవద్దన్నారు. సిద్ధిపేట వద్ద రోడ్డు ప్రమాదం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మంత్రి వెంట డ్వామా పీడీ వెంకటేశం, ఆర్‌డీఓ శ్యాంప్రసాద్‌లాల్, డీఎస్‌పీలు రాంకుమార్, రవీందర్, తహశీల్దార్లు రాజేశ్వర్, వెంకటయ్య, సర్పంచ్ ఖలీంబేగ్ తదితరులు ఉన్నారు.