తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పంచాంగకర్తలు నిర్ణయించిన ముహూర్తం మేరకు గోదావరి పుష్కరాలు జూలై 14 ...
ఏపీ శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో మంత్రి మాణిక్యాలరావు వెల్లడి
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పంచాంగకర్తలు నిర్ణయించిన ముహూర్తం మేరకు గోదావరి పుష్కరాలు జూలై 14 నుంచి ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. గురువారం ఏపీ శాసన మండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని 1,971 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం రూ. 1,162.11 కోట్లు మంజూరు చేశామన్నారు. కేంద్ర సహాయం కింద రూ.600 కోట్లు అడిగామని, రూ.200 కోట్ల మేరకు సాయమందిస్తామనే సంకేతాలు వచ్చినట్లు మంత్రి వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.