కందకుర్తిలో జన సందోహం | rabble In the kandakurti | Sakshi
Sakshi News home page

కందకుర్తిలో జన సందోహం

Published Fri, Jul 17 2015 3:48 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

rabble In the kandakurti

కందకుర్తి, సాక్షి బృందం : పుష్కర అమావాస్యను పురస్కరించుకుని గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు గురువారం కందకుర్తికి భక్తులు పెద్ద సంఖ్య లో తరలి వచ్చారు. భక్తుల అవసరాల మేరకు అధికారులు సౌకర్యాలు కల్పించారు. బోధన్ ఆర్‌డీఓ శ్యాంప్రసాద్‌లాల్, డీఎస్‌పీ రాంకుమార్, నిజామాబాద్ డీఎస్‌పీ గ ంగాధర్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుష్కరాల జిల్లా బాధ్యులు, బాల కార్మిక నిర్మూలన ప్రాజెక్టు అధికారి ఎం సుధాకర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ బసవేశ్వరీ త్రివేణి సంగమ క్షేత్రాన్ని. ఇక్కడ దాదాపు 20 వేల మంది భక్తులు పుణ్యసాన్నాలు ఆచరించారు.

 నది స్నానాలకే భక్తుల పరుగు
 కందకుర్తి త్రివేణి పుష్కర క్షేత్రంలో గోదావరి నదీ తీరాన నిర్మించిన నాలుగు ఘాట్ల వద్ద కూడా షవర్లు ఏర్పాటు చేశారు. కానీ, భక్తులు నది సాన్నాలకే ప్రాధాన్యం ఇ చ్చారు. దీంతో షవర్లు వెలవెలబోయాయి. నదిలో నీటి సదుపాయం కల్పించేందుకు అధికారులు నానా పాట్లు పడ్డారు. కిలోమీటరు దూరంలో ఉన్న సంగమేశ్వరాలయం వద్ద ఉన్న పెద్ద గుంత నుంచి కాలువల ద్వారా నీటిని ఘాట్ల వద్దకు మళ్లించారు. ఇందుకోసం ఒకటవ ఘాట్ సమీపంలో ఇసుకతో అడ్డుకట్ట వేశారు. మళ్లించిన నీళ్లు ఘాట్ల అంచు వరకు చేరే విధంగా చర్యలు తీసుకున్నారు.

 పారిశుద్ధ్యంపై అప్రమత్తం
 ఘాట్ల వద్ద, నదిలోపల భక్తులు సాన్నాలు చేసే చోట పారిశుద్ధ్యం లోపించకండా అధికారులు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు నీ టితో ఘాట్లను శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు.

 వైద్య సేవలు
 పుష్కర క్షేత్రంలో తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యరోగ్య శాఖ నుంచి కూడా శిబిరం ఏర్పాటు చేసి వైద్య సిబ్బ ందిని అప్రమత్తంగా ఉంచారు.

 స్వచ్చంద సేవలు
 సత్యసాయి సేవా సమితి, బోధన్‌కు చెందిన విద్యావికాస్ జూనియర్ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు, ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారు. సత్య సాయి సేవ సమితికి 250 మంది వంతులవారీగా పని చేస్తున్నారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధ్వర్యంలో వనదుర్గ ఆలయం వద్ద సాంస్కృతి కార్యక్రమాల ద్వారా సంక్షేమ పథకాల పై అవగాహన కల్పిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల అధ్వర్యంలో భక్తులను పుష్కర క్షేత్రం నుంచి బస్టాండ్ వరకు వృద్ధులు, వికలాంగులను తర లించేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. పోలీసులు వారికి సహాయం అందిస్తున్నారు. వనదుర్గ ఆలయం సమీపంలో ఇందూరు పుష్కర సమితి అధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన నిత్యాన్నదాన శిబిరానికి భక్తులు వెళ్లేందుకు అధికారులు వాహనం ఏర్పాటు చేశారు.
 
 అడుగడుగున పోలీసు నిఘా
 కందకుర్తి పుష్కర క్షేత్రంలో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. షవర్లు వదిలి నదిలో సాన్నాలకు భక్తులు ఆసక్తి చూపడంతో పోలీసులు నదిలో అడుగడుగనా నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు ఫొటోలు తీయకుండా, వీడియో చిత్రీకరించకుండా నిషేధం విధించారు. ఈ క్రమంలోనే నలుగురు అకతాయి యువకులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో 20 మంది పోలీసుల బృందం బందోబస్తులో పాల్గొన్నారు. భక్తులు సాన్నాలు చేసే పలుచోట్ల మ హిళా పోలీసులను నియమించారు. అంగన్‌వాడీ టీచర్లను ఘాట్ల పర్యవేక్షణకు నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement