
దేశంలో రెండో స్థానంలో ఏపీ
ఇండియా జస్టిస్ నివేదిక వెల్లడి
పోలీసుల పనితీరు, న్యాయ సహాయం, జైళ్ల పరిస్థితిపై అధ్యయనం
వైఎస్సార్‌సీపీ పాలనలో గణనీయంగా మెరుగుపడిన వ్యవస్థలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ సమర్థ పనితీరుకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. మూడు ప్రధాన విభాగాలు– పోలీసుల పనితీరు, న్యాయ సహాయం, జైళ్ల పరిస్థితికి సంబంధించి మొత్తం 102 అంశాల ప్రాతిపదికన విడుదలైన ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్– 2025’నివేదిక రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను రెండవ స్థానంలో (10 పాయింట్లకు 6.32 స్కోర్) నిలిపింది. 2024 క్యాలñæండర్ ఇయర్ ప్రాతిపదికన ఈ నివేదిక విడుదలైంది.
2024 సంవత్సరం జూన్‌లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటికీ, అప్పటికి గడచిన ఐదేళ్లలో పోలీసింగ్ వ్యవస్థలో జగన్ ప్రభుత్వం అత్యుత్తమ సంస్కరణలను తెచ్చింది.ఈ సంస్కరణల ప్రభావం తాజా ర్యాంకింగ్‌లో ప్రతిబింబించింది. అలాగే 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దిగజారిన పోలీసు వ్యవస్థలో అన్ని విభాగాలూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గణనీయంగా మెరుగుపడుతూ వచ్చినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కామన్‌కాజ్ సంస్థతో కలిసి లోక్‌నీతి ‘సెంటర్ ఫర్ ద స్డడీ డెవలపింగ్ సొసైటీ’(సీఎస్‌డీఎస్) గతంలో ‘ద స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్–2025’పేరుతో నిర్వహించిన మరో సర్వేలో కూడా జగన్ పాలనా కాలం 2023–24లో శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల పరిష్కారంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ దేశంలోనే రెండోస్థానంలో నిలవడం గమనార్హం.
చంద్రబాబు హయాంలో దేశంలో 13వ స్థానంలో..
దేశంలో పోలీసు, న్యాయ సహాయం, జైళ్ల స్థితిగతులను మెరుగుపరిచే ఉద్దేశంతో 2018 నుంచి ‘ఇండియా జస్టిస్ రిపోర్టు’ ఇస్తున్నారు. కేంద్ర నేర గణాంక విభాగం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు శాఖల గణాంకాలు న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందుతోంది. 18 పెద్ద రాష్ట్రాలు, 11 చిన్న రాష్ట్రాలను వేర్వేరు విభాగాలుగా అధ్యయనం చేస్తూ ఈ నివేదిక విడుదలవుతోంది.
2018లో దేశంలోని పోలీసింగ్ వ్యవస్థను (మూడు విభాగాలూ కలిసి) విశ్లేషిoచి 2019లో విడుదలైన నివేదిక ప్రకారం 18 పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. అంటే కింద నుంచి ఆరో స్థానంలో నిలవడం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోలీసు శాఖ అధ్వాన్న పనితీరుకు దర్పణం పడుతోంది.
సంస్కరణల బాటన నడిపిన జగన్ ప్రభుత్వం
2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచి్చన తరువాత రాష్ట్ర పోలీసు వ్యవస్థను అత్యుత్తమ సంస్కరణల బాటలో నడిపింది. దీనితో 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్వాన్న స్థితిలో ఉన్న పోలీసు శాఖ వైఎస్ జగన్ పాలనా కాలంలో క్రమంగా మెరుగుపడుతూ వచి్చంది. ఈ ఫలితాలు తాజా ఇండియా జస్టిస్ రిపోర్ట్‌లో ప్రతిబింబిస్తున్నాయి.
2022 నివేదిక ప్రకారం (2021లో పనితీరు ఆధారంగా) ఆంధ్ర ప్రదేశ్ పోలీసింగ్ వ్యవస్థ (మూడు విభాగాలూ కలిసి) దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో 5వ స్థానానికి ఎగబాకింది. 2025 నివేదిక ప్రకారం (2024లో పనితీరు ఆధారంగా) దేశంలో రెండోస్థానం సాధించింది. 2020, 2021, 2023, 2024లో నివేదికలు విడుదల కాలేదు.

బాబు ఘనతగా నమ్మించేందుకు కుయుక్తి
తనది కాని ఘనతను తనదిగా చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. తమ సోషల్ మీడియా విభాగం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచారని ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్’నివేదిక స్పష్టం చేసింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి ఏపీ పోలీసు శాఖ దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో 13వ స్థానంలో ఉందని ఆ నివేదిక వెల్లడించింది.
అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ పనితీరు క్రమంగా మెరుగుపడిందని సవివరంగా పేర్కొంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2024 నాటికి ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానానికి చేరుకుందని తెలిపింది. వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం ఆ ఘనతను చంద్రబాబు ప్రభుత్వానికి ఆపాదించేందుకు తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేసేందుకు పడరానిపాట్లు పడుతోంది.
