
విజయవాడ తాను సిట్ విచారణకు హాజరవుతానని చెప్పినా అరెస్టు చేశారని ఏసీబీ కోర్డులో రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు(మంగళవారం) రాజ్ కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీనిలో భాగంగా రాజ్ కేసిరెడ్డిని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు.
సోదాల్లో ఏమైనా సీజ్ చేశారా? అని న్యాయమూర్తి అడగ్గా, కారు తప్ప ఏమీ సీజ్ చేయలేదని కేసీరెడ్డి తెలిపారు. తన ఇంటితో పాటు బంధువులు ఇళ్లల్లో,స్నేహితుల ఇళ్లల్లో సోదాలు చేశారని కేసిరెడ్డి తెలిపారు. విచారణ పేరుతలో తల్లి దండ్రలను ఇబ్బందులు పెట్టారని తెలిపిన కేసిరెడ్డి.. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, తాను సంతకాలు చేయలేదని కోర్టుకు తెలిపారు.