గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
డిప్యూటీ స్పీకర్
ఏటూరునాగారం : గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి శనివారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌ను సందర్శించారు. ఘాట్ నుంచి సుమారు కిలో మీటరు దూరంలోని జంపన్నవాగు సమీపంలోకి వెళ్లారు. అక్కడ షామినాయాల వద్ద భక్తుల సౌకర్యాలు, ఇబ్బందులు పరి శీలించారు.
ఘాట్ నుంచి నదిలోని నీటి ప్రాంతం వరకు ఇసుక బస్తాలపై కాలి నడకన వెళ్లారు. నదీతీరంలో మరోమూ డు టెంట్లు వేయూలని, నీటిసౌకర్యం కల్పించాలని ఆర్డీవో మహేందర్‌జీని ఆదేశించారు. ఘాట్‌కు కొద్ది దూరంలోని మూలమలుపు వద్ద నీటి ఉధృతి ఉం దని, అక్కడ ఘాట్ నిర్మిస్తే బాగుండేదని డిప్యూటీ సీఎంతో అన్నారు. రామన్నగూడెం ఘాట్‌ను సందర్శించిన ఎంపీ సీతారాంనాయక్.. అధికారులు భక్తుల సేవ లో నిమగ్నం కావాలని ఆయన కోరారు.