రూ.1.30 కోట్లు ‘బూడిద’పాలు! | Rs .1.30 crore wastage | Sakshi
Sakshi News home page

రూ.1.30 కోట్లు ‘బూడిద’పాలు!

Published Fri, Jul 17 2015 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

రూ.1.30 కోట్లు ‘బూడిద’పాలు!

రూ.1.30 కోట్లు ‘బూడిద’పాలు!

నాగ సాధువులు ఎక్కడ..?
 

 12 రోజులు మహాయజ్ఞం..నాగసాధువులు, అఘోరాలు, అష్టావధానుల ఆశీర్వచనాలతో ఆధ్యాత్మిక హడావిడి..గోదావరి పుష్కరాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈసారే విశ్వశాంతి మహాయజ్ఞానికి శ్రీకారం చుడుతున్నాం..’ అంటూ ఒకటే ఊదర. భక్తులు లక్షల్లో ఇక్కడికి వస్తారని ప్రచారం..ప్రభుత్వం స్పందించింది.. పుష్కరాలకంటే కూడా ఈ మహాయజ్ఞం అద్భుతంగా ఉంటుందని భావించింది.. అప్పటికప్పుడు రూ.1.30 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇప్పుడు సీన్ రివర్సైంది.. నాగసాధువులు రాలేదు..అఘోరాల ఆచూకీ లేదు..కోట్లాది రూపాయల నిధుల ఊసేలేదు. బూర్గంపాడు మండలం సారపాక సమీపంలో విశ్వశాంతి మహాయజ్ఞ ప్రాంగణం బోసిపోరుుంది. సాధువులు రాక వెలవెలబోతోంది. మరీ రూ.1.30 కోట్లు ఇక ‘బూడిద’పాలేనా..! అనే చర్చ మొదలైంది.     

  సారపాక యజ్ఞశాల నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలానికి భక్తులు పోటెత్తుతారు కాబట్టి అక్కడ విశ్వశాంతి మహాయజ్ఞాన్ని నిర్వహించాలని పాల్వంచకు చెందిన ట్రస్ట్ నిర్వాహకులు భావించారు. రెండు నెలల క్రితం నుంచే దీనికి ప్రణాళికలు రచించారు. భక్తులకు దీవెనల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ యూగానికి దేవాదాయ శాఖ నుంచి రూ.1.30 కోట్లు మంజూరు అయ్యూరుు. కానీ ముందుంగా అనుకున్నట్లు సాధువులు రాలేదు. పుష్కరాలు ప్రారంభమైన 14వ తేదీ దాకా ఏర్పాట్లు సాగకపోవడంతో అంతా డీలా పడ్డారు.

పుష్కరాల ప్రారంభరోజు నిర్వాహకులు అయోధ్యకు చెందిన 108వ మహాంతి పరమేశ్వరదాస్, నవకిరణ్‌దాస్‌ల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పిఠాపురానికి చెందిన 15 మంది పండితులతో ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టించారు.  పుష్కరాల సందర్భంగా 1,500 మంది హిమాలయ సాధువులు, నాగసాధువులు, అఘోరాలు వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ వారు రాకపోవడంతో పుష్కరాలకు వచ్చిన భక్తులు అటువైపు వెళ్లని పరిస్థితి. మరోవైపు గురువారం సైతం భారీ యాగశాలలను నిర్మిస్తున్న అధికారులు ఇక్కడకు భక్తులు ఎందుకు రావడం లేదనే దానిపై దృష్టి సారించకపోవడం గమనార్హం. రూ.1.30 కోట్లతో వ్యయంతో చేస్తున్న ఈ మహాయజ్ఞం వైపు అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం చర్చనీయూంశంగా మారింది.

 షెల్టర్ జోన్లుగా మారిన భారీ ఏర్పాట్లు...
 విశ్వశాంతి మహాయజ్ఞం కోసం హిమాలయ సాధువులు, నాగసాధువులు రాకపోవడంతో భక్తులు అటువైపుగా వెళ్లడం లేదు. పార్కింగ్ స్థలం వద్దనే యాగశాల నిర్మించడంతో అక్కడ బందోబస్తుకు వచ్చిన పోలీసులు సేద తీరేందుకు ఈ యాగశాలలను వినియోగించుకుంటున్నారు. ఇంతటి మహాత్కార్యానికి సాధువులు ఎందుకు రాలేదు. పుష్కరాల ప్రారంభానికి ముందు హడావిడి చేసిన వారు ఇప్పుడు ఏమయ్యూరు. వేరే వర్గానికి చెందినవారు వసతులపై అసత్యప్రచారం చేయడం వల్లనే సాధువులు రాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిలో వాస్తవమెంత? ఇప్పటికే మూడురోజులు పుష్కరాలు గడిచినా యంత్రాంగంలో ఈ యజ్ఞం నిర్వహణపై ఆసక్తి లేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?... ఇలాంటి ప్రశ్నలెన్నో భక్తుల నుంచి తలెత్తుతున్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement