Aghora
-
సాహసం: అఘోరాగా మారిన బాలకృష్ణ!
కంటి చూపుతో చంపేస్తానని వార్నింగ్ ఇచ్చే బాలయ్య ఈసారి నిజంగానే భయపెట్టేందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా ఆయన ఎవరూ ఊహించలేని అవతారంలోకి మారిపోయాడట. ఆ మధ్య గుండు గెటప్ వేసుకున్న ఆయన ఈసారి ఏకంగా అఘోరా గెటప్ వేసుకున్నాడట. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న BB3(వర్కింగ్ టైటిల్) సినిమా చిత్రీకరణలో భాగంగా ఈ గెటప్ వేసినట్లు సమాచారం. పైగా ఈ వేషంలో బాలయ్య యాక్షన్ ఫీట్లు సైతం చేస్తున్నాడట. ఎలాగో మిగతా హీరోలకు భిన్నంగా ఫ్లైట్లు చేస్తూ శత్రువులను అల్లల్లాడించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే కాబట్టి ఈ ఫైటింగ్ సీన్లను కూడా అలవోకగా చేస్తున్నట్లు వినికిడి. ఏదేమైనా బాలయ్యను అలాంటి పాత్రలో చూసి అభిమానులు థ్రిల్ ఫీలవ్వడం ఖాయం. కాగా 'రూలర్'తో డిజాస్టర్ అందుకున్న బాలకృష్ణ, 'వినయ విధేయ రామ'తో దారుణ ఫ్లాఫ్‌ను మూటగట్టుకున్న బోయపాటి శ్రీను ఈసారి సూపర్ హిట్ అందుకోవాలన్న కసితో ఈ సినిమా డీల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ఇటీవలే ప్రకటించింది. కానీ ఇప్పటివరకు టైటిల్ మాత్రం వెల్లడించలేదు. ఫస్ట్‌లుక్ మాత్రం రిలీజ్ చేసింది. ఇందులో మాత్రం బాలకృష్ణ యంగ్ అండ్ స్టైలిష్‌గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో హీరో రెండు వైవిధ్యమైన పాత్రలను పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రగ్యా జైశ్వాల్ ఓ కథానాయికగా నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై 'జయ జానకి నాయక' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. గతంలో తమిళ హీరో ఆర్య 'నేను దేవుణ్ణి' సినిమాలో అఘోరాగా కనిపించాడు. ఈ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోగా, ఈసారి నందమూరి నటసింహం బాలకృష్ణ అఘోరా పాత్రలో పరకాయ ప్రవేశం చేయనున్నాడు. ఈ గెటప్‌లో బాలయ్య చెప్పే డైలాగ్స్, దానితో ముడిపడ్డ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని అంటున్నారు. ఇక అఘోరాగా బాలయ్య లుక్‌ను చూడటం కోసం తహతహలాడుతున్నారు అభిమానులు. చదవండి: ‘బలరామయ్య బరిలో దిగితే’ ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ వార్: చిరు Vs బాలయ్య.. సై అంటున్న వెంకీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1521341774.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేను అఘోరాను.. బయటకు రాను!
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఓ అఘోరా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. గొయ్యిలో కూర్చుని పూజలు చేస్తున్న అతడికి సర్ది చెప్పి, బయటకు తీసుకువచ్చేసరికి వారి తలప్రాణం తోకకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. తేని జిల్లాలోని ఆండీపట్టికి చెందిన సొక్కనాథన్ చిన్నపుడే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో కాశీకి చేరుకున్న అతడు అఘోరాల చెంతకు చేరి వారితోనే జీవించసాగాడు. పాతికేళ్లపాటు అక్కడే ఉన్న సొక్కనాథన్ కూడా వారిలాగే అఘోరాగా మారిపోయాడు. అయితే ఒకానొక రోజు, తాను పుట్టిపెరిగిన సొంతూరుకు వెళ్లాలనే కోరిక పుట్టడంతో, కాశీ నుంచి నేరుగా తమిళనాడు వచ్చేశాడు. తన పేరును అఘోర స్వామిజీగా మార్చేసుకుని, నివాసం ఉండేందుకు వీలుగా ఊరి చివర ఓ 12 అడుగుల గొయ్యి తీసుకున్నాడు.(చదవండి: ఎల్లో అలర్ట్: చెన్నై ఉక్కిరిబిక్కిరి.. ) అందులోనే దేవుడి ఫోటోలు పెట్టుకుని పూజలు చేయడం మొదలు పెట్టాడు. సొక్కనాథన్ ఆహార్యం, వ్యవహారశైలితో బెంబేలెత్తిపోయిన స్థానికులు, అతడు క్షుద్ర పూజలు చేస్తున్నాడని భావించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. గొయ్యిలో ఉన్న అఘోరా స్వామిజీ అలియాస్ సొక్కనాథన్ విన్యాసాలు చూశారు. గొయ్యిలోంచి పైకి రమ్మని నచ్చజెప్పారు. కానీ సొక్కనాథన్ వారి మాటలను లెక్కచేయలేదు. ‘‘నేను అఘోరాను .. ఆహారం ముట్టుకోను.. శివుడిని ప్రార్థిస్తూ గంజాయి తాగుతూ బతికేస్తున్నాను'.. అంటూ వాగ్వాదానికి దిగాడు. అతడి ప్రవర్తనతో విసిగెత్తిపోయిన పోలీసులు.. సొక్కనాథన్‌ను బలవంతంగా గొయ్యిలోంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం గొయ్యిని పూడ్చేశారు. పూజల పేరుతో భయాందోళనలు సృష్టించే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తే కఠిన శిక్ష తప్పదంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
అఘోరాగా బాలకృష్ణ
ఆడియన్స్ మాస్ పల్స్ పట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రేక్షకులకు మాస్ కిక్ ఎక్కించే హీరో బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది డబుల్మాసే. బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో ఆల్రెడీ వచ్చిన ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) చిత్రాల మాస్ సక్సెస్‌లే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మరో మూవీ రూపు దిద్దుకుంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 26 నుంచి వారణాశిలో జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రెండు కోణాల్లో కనిపించే బాలయ్య, ఓ పాత్రలో అఘోరాగా కనిపిస్తారని టాలీవుడ్ టాక్. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి వుండగా, బాలయ్య లుక్ ను మార్చాలని నిర్ణయించుకున్న బోయపాటి, అందుకోసం మరింత సమయాన్ని ఇస్తూ, కాస్తంత ఆలస్యమైనా ఫిల్మ్ పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తున్నారట. ఇక చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనిపించే సన్నివేశాలు అత్యంత కీలకమని సినీ వర్గాల సమాచారం.ఇందులో ఇద్దరు కథానాయికలని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి శ్రియ, నయనతార కథానాయికలని ప్రచారం జరుగుతుండగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. -
రూ.1.30 కోట్లు ‘బూడిద’పాలు!
నాగ సాధువులు ఎక్కడ..? 12 రోజులు మహాయజ్ఞం..నాగసాధువులు, అఘోరాలు, అష్టావధానుల ఆశీర్వచనాలతో ఆధ్యాత్మిక హడావిడి..గోదావరి పుష్కరాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈసారే విశ్వశాంతి మహాయజ్ఞానికి శ్రీకారం చుడుతున్నాం..’ అంటూ ఒకటే ఊదర. భక్తులు లక్షల్లో ఇక్కడికి వస్తారని ప్రచారం..ప్రభుత్వం స్పందించింది.. పుష్కరాలకంటే కూడా ఈ మహాయజ్ఞం అద్భుతంగా ఉంటుందని భావించింది.. అప్పటికప్పుడు రూ.1.30 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇప్పుడు సీన్ రివర్సైంది.. నాగసాధువులు రాలేదు..అఘోరాల ఆచూకీ లేదు..కోట్లాది రూపాయల నిధుల ఊసేలేదు. బూర్గంపాడు మండలం సారపాక సమీపంలో విశ్వశాంతి మహాయజ్ఞ ప్రాంగణం బోసిపోరుుంది. సాధువులు రాక వెలవెలబోతోంది. మరీ రూ.1.30 కోట్లు ఇక ‘బూడిద’పాలేనా..! అనే చర్చ మొదలైంది. సారపాక యజ్ఞశాల నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలానికి భక్తులు పోటెత్తుతారు కాబట్టి అక్కడ విశ్వశాంతి మహాయజ్ఞాన్ని నిర్వహించాలని పాల్వంచకు చెందిన ట్రస్ట్ నిర్వాహకులు భావించారు. రెండు నెలల క్రితం నుంచే దీనికి ప్రణాళికలు రచించారు. భక్తులకు దీవెనల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ యూగానికి దేవాదాయ శాఖ నుంచి రూ.1.30 కోట్లు మంజూరు అయ్యూరుు. కానీ ముందుంగా అనుకున్నట్లు సాధువులు రాలేదు. పుష్కరాలు ప్రారంభమైన 14వ తేదీ దాకా ఏర్పాట్లు సాగకపోవడంతో అంతా డీలా పడ్డారు. పుష్కరాల ప్రారంభరోజు నిర్వాహకులు అయోధ్యకు చెందిన 108వ మహాంతి పరమేశ్వరదాస్, నవకిరణ్దాస్ల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పిఠాపురానికి చెందిన 15 మంది పండితులతో ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టించారు. పుష్కరాల సందర్భంగా 1,500 మంది హిమాలయ సాధువులు, నాగసాధువులు, అఘోరాలు వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ వారు రాకపోవడంతో పుష్కరాలకు వచ్చిన భక్తులు అటువైపు వెళ్లని పరిస్థితి. మరోవైపు గురువారం సైతం భారీ యాగశాలలను నిర్మిస్తున్న అధికారులు ఇక్కడకు భక్తులు ఎందుకు రావడం లేదనే దానిపై దృష్టి సారించకపోవడం గమనార్హం. రూ.1.30 కోట్లతో వ్యయంతో చేస్తున్న ఈ మహాయజ్ఞం వైపు అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం చర్చనీయూంశంగా మారింది. షెల్టర్ జోన్లుగా మారిన భారీ ఏర్పాట్లు... విశ్వశాంతి మహాయజ్ఞం కోసం హిమాలయ సాధువులు, నాగసాధువులు రాకపోవడంతో భక్తులు అటువైపుగా వెళ్లడం లేదు. పార్కింగ్ స్థలం వద్దనే యాగశాల నిర్మించడంతో అక్కడ బందోబస్తుకు వచ్చిన పోలీసులు సేద తీరేందుకు ఈ యాగశాలలను వినియోగించుకుంటున్నారు. ఇంతటి మహాత్కార్యానికి సాధువులు ఎందుకు రాలేదు. పుష్కరాల ప్రారంభానికి ముందు హడావిడి చేసిన వారు ఇప్పుడు ఏమయ్యూరు. వేరే వర్గానికి చెందినవారు వసతులపై అసత్యప్రచారం చేయడం వల్లనే సాధువులు రాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిలో వాస్తవమెంత? ఇప్పటికే మూడురోజులు పుష్కరాలు గడిచినా యంత్రాంగంలో ఈ యజ్ఞం నిర్వహణపై ఆసక్తి లేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?... ఇలాంటి ప్రశ్నలెన్నో భక్తుల నుంచి తలెత్తుతున్నారుు. -
ఆఘోరాల జాగారం..!
-
ఆఘోరాలపై ఒక పరిశోధన..!