Balakrishna Become Aghora In Boyapati Srinu Movie - Sakshi
Sakshi News home page

పెద్ద సాహసమే: అఘోరా వేషంలో బాలయ్య!

Published Tue, Feb 9 2021 12:36 PM | Last Updated on Tue, Feb 9 2021 1:21 PM

Nandamuri Balakrishna Get Up As Aghora - Sakshi

మిగతా హీరోలకు భిన్నంగా ఫ్లైట్లు చేస్తూ శత్రువులను అల్లల్లాడించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే కాబట్టి ఈ ఫైటింగ్‌ సీన్లను కూడా అలవోకగా చేస్తున్నట్లు వినికిడి.

కంటి చూపుతో చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చే బాలయ్య ఈసారి నిజంగానే భయపెట్టేందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా ఆయన ఎవరూ ఊహించలేని అవతారంలోకి మారిపోయాడట. ఆ మధ్య గుండు గెటప్‌ వేసుకున్న ఆయన ఈసారి ఏకంగా అఘోరా గెటప్‌ వేసుకున్నాడట. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న BB3(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా చిత్రీకరణలో భాగంగా ఈ గెటప్‌ వేసినట్లు సమాచారం. పైగా ఈ వేషంలో బాలయ్య యాక్షన్‌ ఫీట్లు సైతం చేస్తున్నాడట. ఎలాగో మిగతా హీరోలకు భిన్నంగా ఫ్లైట్లు చేస్తూ శత్రువులను అల్లల్లాడించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే కాబట్టి ఈ ఫైటింగ్‌ సీన్లను కూడా అలవోకగా చేస్తున్నట్లు వినికిడి.

ఏదేమైనా బాలయ్యను అలాంటి పాత్రలో చూసి అభిమానులు థ్రిల్‌ ఫీలవ్వడం ఖాయం. కాగా 'రూలర్'‌తో డిజాస్టర్‌ అందుకున్న బాలకృష్ణ, 'వినయ విధేయ రామ'తో దారుణ ఫ్లాఫ్‌ను మూటగట్టుకున్న బోయపాటి శ్రీను ఈసారి సూపర్‌ హిట్‌ అందుకోవాలన్న కసితో ఈ సినిమా డీల్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్‌ చేస్తామని చిత్రయూనిట్‌ ఇటీవలే ప్రకటించింది. కానీ ఇప్పటివరకు టైటిల్‌ మాత్రం వెల్లడించలేదు. ఫస్ట్‌లుక్‌ మాత్రం రిలీజ్‌ చేసింది. ఇందు‌లో మాత్రం బాలకృష్ణ యంగ్‌ అండ్‌ స్టైలిష్‌గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో హీరో రెండు వైవిధ్యమైన పాత్రలను పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రగ్యా జైశ్వాల్ ఓ కథానాయికగా నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై 'జయ జానకి నాయక' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

గతంలో తమిళ హీరో ఆర్య 'నేను దేవుణ్ణి' సినిమాలో అఘోరాగా కనిపించాడు. ఈ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోగా, ఈసారి నందమూరి నటసింహం బాలకృష్ణ అఘోరా పాత్రలో పరకాయ ప్రవేశం చేయనున్నాడు. ఈ గెటప్‌లో బాలయ్య చెప్పే డైలాగ్స్‌, దానితో ముడిపడ్డ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌ అవుతాయని అంటున్నారు. ఇక అఘోరాగా బాలయ్య లుక్‌ను చూడటం కోసం తహతహలాడుతున్నారు అభిమానులు.

చదవండి: ‘బలరామయ్య బరిలో దిగితే’ ఎలా ఉంటుంది?

బాక్సాఫీస్ వార్‌: చిరు Vs బాలయ్య.. సై అంటున్న వెంకీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement