ప్రభంజనం | Wave | Sakshi
Sakshi News home page

ప్రభంజనం

Published Sat, Jul 18 2015 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

ప్రభంజనం

ప్రభంజనం

♦  మహా పుష్కరం... భక్త జన పరవశం !
♦  నాలుగో రోజు పోటెత్తిన జనవాహిని
♦  4,48,426 మంది పుష్కర స్నానాలు
♦  నేడు, రేపు మరింత పెరగనున్నభక్తుల రద్దీ
♦  అప్రమత్తమైన అధికార యంత్రాంగం
 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో గోదావరి నదీ తీరం భక్తజనంతో ఉప్పొంగింది. నాలుగు రోజులుగా మందకొడిగా ఉన్న  స్నానఘాట్లు ఒక్కసారిగా పుష్కర శోభ సంతరించుకున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉండటంతో శుక్రవారం నుంచి భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ప్రారంభం రోజున 1.50 లక్షల మంది పుష్కరస్నానం చేయగా... మరుసటి రోజు 92,448కి తగ్గింది. గురువారం 1,00,101 మంది భక్తులు హాజరు కాగా, శుక్ర వారం రాత్రి 9 గంటల వరకు భక్తుల సంఖ్య 4,48,428 మందికి చేరింది. ఒకేసారి భక్తుల తాకిడి పెరగడంతో కందకుర్తి, తడపాకల్, పోచంపాడు, తుంగిని, ఉమ్మెడ పుష్కరఘాట్లు కిటకిటలాడాయి. గుమ్మిర్యాల్, బినోల తదితర పుష్కరఘాట్లకు సైతం భక్తుల రద్దీ పెరిగింది. 144 ఏళ్ల తర్వాత గోదావరి నదికి ప్రస్తుతం జరిగేది 12వ పుష్కరాలు. త్రయంబకేశ్వరం వద్ద పుట్టిన గోదావరి.. జిల్లాలో బోధన్ మండలం కందకుర్తి వద్ద మంజీర, హరిద్ర నదులతో సంగమించి ఆరు మండలాలను తాకుతూ సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తోంది.

 పర్యవేక్షించిన కలెక్టర్, అధికారులు..
 గోదావరి మహా పుష్కరాల నాలుగో రోజు శుక్రవారం కందకుర్తి, పోచంపాడు, తడపాకల్, తుంగిని పుష్కరఘాట్లలో భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచే ఇన్సిడెంట్ క మాండర్లు, ఘాట్ ఇన్‌చార్జ్‌లు ఇచ్చిన సమాచారంతో కలెక్టర్ రోనాల్డ్‌రోస్.. పెరిగిన భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. జే సీ  ఎ.రవిందర్‌రెడ్డి, ఏజేసీ రాజారాం, డీఆర్‌డీఏ, హౌసింగ్, డ్వామా పీడీలు, పుష్కరఘాట్ల ఇన్‌ఛార్జ్‌లైన వెంకటేశం, చైతన్యకుమార్, వెంకటేశ్వర్లు సహా ఘాట్ ఇన్‌ఛార్జ్‌లు అప్రమత్తం అయ్యా రు.

త్రివేణి సంగమ వేదిక కందకుర్తి పుష్కర కేత్రానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే సు దూర మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి పుణ్యసాన్నాలు ఆ చరించారు. కందకుర్తి, పోచంపాడు పు ష్కరఘాట్లను డీఐజీ ఎడ్ల గంగాధర్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ సుదీ ప్ లక్టాకియా సందర్శించారు. పెరిగిన భక్తులకు అనుగుణంగా భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.

 తడిసి ముద్దరుున తడపాకల్, పోచంపాడు...
 సెంటిమెంట్‌కు తోడు పుష్కర స్నానం ఆచరించాలనే ఆకాంక్షతో భక్తుల బాట తడపాకల్‌వైపు నడచింది. జన సందోహాంతో మోర్తాడ్ మండలం తడపాకల్, బాల్కొండ మండలం పోచంపాడు పుష్కరక్షేత్రాలు తడిసి ముద్దయ్యాయి. తండోపతండాలుగా తరలివచ్చిన జన సందోహాన్ని ఆపడం పోలీసులకు సాధ్యం కాలేక పోయింది. భక్తి పారవశ్యంతో తరలిన ప్రజలు గంగాదేవిని కొలుస్తూ తరలివచ్చారు. గోదావరి నదీ తీరానికి 1.5 కిలోమీటరు దూరంలో వాహనాలను పోలీసులు నిలిపివేశారు. కామారెడ్డి, బాన్సువాడ, భీమ్‌గల్, సిరికొండ, ధర్పల్లి, వేల్పూర్.

జక్రాన్‌పల్లి, ఆర్మూర్, తదితర ప్రాంతాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. పోచంపాడు జాతీయ రహదారి పక్కన ఉండటంతో హైదరాబాద్, నిజామాబాద్‌ల ప్రయాణం సునాయసంగా ఎంచుకున్న భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఇక్కడ ఒక దశలో పుష్కర స్నానాలను పర్యవేక్షించడానికి ఉన్న అధికారుల వాహనాలు కూడా రోడ్డుపైకి వెళ్లే మార్గం లేక పోయింది. తుంగిని, ఉమ్మెడ పుష్కరఘాట్లకు కూడా భక్తుల రద్దీ పెరిగింది.  

 పెరిగిన వీఐపీల తాకిడి..
 కందకుర్తి, పోచంపాడు, తడపాకల్, తుంగిని, ఉమ్మెడలతో పాటు మిగతా పుష్కరఘాట్లకు కూడ శుక్రవారం భక్తుల తాకిడి పెరిగింది. గోదావరి మహాపుష్కరాల్లో భాగంగా భక్తుల తాకిడితో ఘాట్లు సందడిగా మారాయి. కోస్లీ ఘాట్‌లో భక్తుల సందడి పెరగగా ప్రత్యేక అధికారి మోహన్‌లాల్ పర్యవేక్షించారు. కాగా నాలుగో రోజు వీఐపీల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ ఎప్పటికప్పుడు పుష్కరఘాట్లను పరిశీలిస్తూ, ఇన్‌చార్జ్‌లతో మాట్లాడి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారు. పోచంపాడు పుష్కరఘాట్ల వద్ద ఇంటర్‌నేషనల్ ట్రిబ్యునల్ ఆఫ్ లా జడ్జీ పి.చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులతో పుణ్య స్నానం చేసి పూజలు నిర్వహించారు.

ప్రపంచబ్యాంకు సలహాదారు ఎస్.ఎస్ రావు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానం చేశారు.  తెలంగాణ ఏసీబీ జాయింట్ డెరైక్టర్  ఉమామహేశ్వర్ శర్మ కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం చేసి పూజలు నిర్వహించారు. అలాగే న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, నిజమాబాద్ ఏఎస్పీ ప్రతాప్ రెడ్డి, జీఎంఆర్ సీఈవో కిషోర్, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు పెద్ద కూతురు శారద దేవీ తదితరులు కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానాలు చేశారు. హంపీ పీఠాధిపతి  శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతి స్వామి, శ్రీసరస్వతి విద్యాపీఠం పీఠాధిపతి శ్రీసచ్చిదానంద గిరి స్వామి, బాలరాజ్ మహారాజ్‌లు వేద మంత్రోచ్చరణలతో గంగమ్మతల్లిని స్మరిస్తూ హారతి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement