గ్రేటర్ పోలింగ్ 45.27 శాతం
లెక్క తేల్చిన అధికారులు
గత ఎన్నికలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు లెక్క తేల్చారు. బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. పోలింగ్ జరిగిన మంగళవారం సాయంత్రం వరకు పూర్తి సమాచారం అందకపోవడంతో సాయంత్రం 4.30 గంటల వరకు తమవద్ద ఉన్న సమాచారం మాత్రమే వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాదాపు 45 శాతం పోలింగ్ జరిగినట్లు మీడియా సమావేశంలో వెల్లడించడం తెలిసిందే.
దాదాపుగా అంతే పోలింగ్ నమోదైంది. వివిధ వర్గాల ద్వారా, సామాజిక వేదికల ద్వారా, వీఐపీల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడంతో ఈసారి కనీసం 50 నుంచి 60 శాతం వరకు పోలింగ్ నమోదు కాగలదని అంచనా వేశారు. అయితే నగర ప్రజల్లో పోలింగ్‌పై ఇంకా చైతన్యం పెరగాల్సి ఉందని తేలింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 3 శాతం పోలింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైన వార్డు విజయనగర్ కాలనీయే కావడం విశేషం.
ఇవీ వివరాలు..
2002లో ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు..
మొత్తం ఓటర్లు : 26,78,009
పోలైన ఓట్లు: 11,58,913
పోలింగ్ శాతం: 43.27
2009లో జీహెచ్‌ఎంసీ తొలి ఎన్నికల్లో..
మొత్తం ఓట్లు: 56,99,639
పోలైన ఓట్లు: 23,98,105
పోలింగ్ శాతం: 42.07
2016.. ప్రస్తుత ఎన్నికల్లో
మొత్తం ఓట్లు: 74,23,980
పోలైన ఓట్లు: 33,60,543
పోలింగ్ శాతం: 45.27