నీటిపై రాజకీయం
జిల్లాలోని అధికారపార్టీ నాయకులు నీటి విడుదలలో రాజకీయం చేస్తున్నారు. వీరికి అధికారులు వంతపాడడంతో కొన్ని ప్రాంతాల రైతులు నష్టపోతున్నారు. ఇది రైతుల మధ్య విభేదాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది.
అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి 1550 క్యూసెక్కులు (జిల్లా సరిహద్దులోని లెక్కల ప్రకారం) నీటిని వి డుదల చేస్తున్నారు. తుంగభద్ర హైలెవల్ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టుకు, తాగునీటి కోసం పీఏబీఆర్ అక్కడి నుంచి మిడ్‌పెన్నార్, చి త్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పంపకాలు చేపట్టారు.అయితే అధికారపార్టీ నా యకుల ప్రాంతాలకు ఓ విధంగా, ప్రతిపక్ష నాయకుల ప్రాంతాలకు మరోలా నీటి పం పిణీ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో హెచ్‌ఎల్‌ఎంసీ కింద అతిపె ద్ద ఆయకట్టు ఉంది. 20 వేల ఎకరాల్లో వరి, మరో పది వేల ఎకరాలకు పైగా ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తారు.
ఈసారి ఆరుతడికి మాత్రమే నీటిని విడుదల చేస్తుండడంతో రోజూ 250 క్యూసెక్కులు నీటిని వదులుతున్నట్లు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయి. ఇది కాగితాల్లో మా త్రమే. అనధికారికంగా మరో 300 క్యూసెక్కు లు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లా సరిహద్దులో 1550 క్యూసెక్కుల నీరు వస్తోంది. పీఏబీఆర్‌కు వచ్చేసరికి 600 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. మరో 150 క్యూసెక్కులు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కు విడుదల చేస్తున్నారు. ఈ రెండింటికీ 750 క్యూసెక్కులు పోగా మి గిలిన 800 క్యూసెక్కులు నీటిలో ప్రవాహ నష్టాలు 200 నుంచి 250 క్యూసెక్కులు ఉంటుంది. మిగిలిన 550 క్యూసెక్కులు హెచ్‌ఎల్‌ఎంసీకి సరఫరా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇందులో అధికారికంగా 250 కాగా, అనధికారికంగా 300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు సమాచా రం. కణేకల్లు, బొ మ్మనహాల్ మండలాలు ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు నియోజకవర్గ ప్రాంతాలు కావడమే ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద మొత్తం 9 డిస్ట్రీబ్యూటరీలు ఉంటే అన్ని ప్రాంతాల్లో పంట సాగు చేయడానికి నీటిని విడుదల చేయడంలే దు. ఒకసారి నాలుగు డిస్ట్రీబ్యూటరీలకు, మరోసారి 5 ఐదు డిస్ట్రీబ్యూటరీలకు చొ ప్పున వదులుతున్నారు.
అదికూడా గతేడాది 195 క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల చేశారు. ఈసారీ 150కి మించి విడుదల చేయడం లేదు. దీని వలన పంటలకు నీరందక సకాలంలో సాగు చేసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా రైతులందరినీ సమానదృష్టితో చూడాలని రైతాంగం విజ్ఞప్తి చేస్తోంది.