Crop cultivation
-
సాయం అందక.. బీమా పొందలేక...
రైతులను తాము నిండా ముంచుతున్నామని చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. తమ ప్రభుత్వ నిర్వాకం వల్లే 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఒప్పుకుంది. వారిలో ఏ ఒక్కరికీ పైసా పరిహారం చెల్లించలేదని అంగీకరించింది. రబీ సీజన్లో నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణం 60.55 లక్షల ఎకరాలు కాగా, కేవలం 8.80 లక్షల ఎకరాల్లో పంటలకు మాత్రమే బీమా కవరేజ్ కల్పించినట్టుగా కూడా వెల్లడించింది. అంటే తమ ప్రభుత్వ నిర్వాకం వల్లే దాదాపు 52 లక్షల ఎకరాల్లో సాగవుతున్న నోటిఫైడ్ పంటలకు బీమా దూరమైందని కూడా అంగీకరించింది. గత రబీ సీజన్లో 43.82లక్షల మంది రైతులకు నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం అందించగా... నేడు కేవలం 6.50లక్షల మందికే స్వచ్ఛంద నమోదు పంటల బీమా కింద నమోదు చేసినట్టు తెలిపింది. మొత్తం 37.32 లక్షల మంది రైతులకు పంటల బీమా రక్షణ లేకుండాపోయినట్లు అంగీకరించింది. తద్వారా ఐదేళ్లపాటు రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి, కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛంద నమోదు పద్ధతి వల్ల రైతులకు పంటల బీమా రక్షణ లేకుండాపోయిందని ఒప్పుకుంది.ఈ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను గాలికి వదిలేసిన తీరుపై పూర్తి ఆధారాలతో ‘సాక్షి’లో వరుసగా రెండు రోజులపాటు ప్రచురితమైన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు సోమవారం విడుదల చేసిన ప్రకటనల ద్వారా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు సమ్మతించడం గమనార్హం. 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ⇒ సాక్షిలో ‘సర్కారు హత్యలు 97’ కథనంపై వ్యవసాయ శాఖ వివరణ సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12 నుంచి నేటి వరకు 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి ఆరు నెలల్లో 49 మంది చనిపోగా, జూన్ నుంచి డిసెంబర్ వరకు 97 మంది చనిపోయారని తేల్చి చెప్పింది. ‘సర్కారు హత్యలు 97’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సాక్షి’లో పేర్కొన్న 97 మంది రైతుల ఆత్మహత్యలు నిజమేనని ఆ ప్రకటనలో అంగీకరించింది. వారిలో ఏ ఒక్కరికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. రైతుల ఆత్మహత్యల వివరాలను పొందుపర్చేందుకు ప్రభుత్వాదేశాల మేరకు ప్రత్యేకంగా ఇటీవలే చంద్రన్న పోర్టల్ ప్రారంభించినట్టు పేర్కొంది.ఈ 97 మందిలో త్రిసభ్య కమిటీ నిర్ధారించిన రైతుల వివరాలను చంద్రన్న పోర్టల్‌లో అప్లోడ్ చేసి, ఆయా రైతు కుటుంబాలకు రూ.7లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సున్నా వడ్డీ రాయితీ చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించింది. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి అర్హుల వివరాల జాబితాలను అప్లోడ్ చేయడంలో జరిగిన జాప్యం వల్లే రాయితీ విడుదల చేయలేదని పేర్కొంది. ఆ సీజన్లో అర్హత పొందిన 6.31లక్షల మందికి చెల్లించాల్సిన రూ.132 కోట్లను కూడా సాధ్యమైనంత త్వరగానే చెల్లిస్తామని తెలిపింది.పంటల బీమా పరిధిలోకి వచ్చింది 8.80 లక్షల ఎకరాలే ⇒ నేటితో ప్రీమియం చెల్లింపునకు గడువు ముగిసినట్టే.. ⇒ అవగాహన కల్పించినా.. ఆరున్నర లక్షల మందే దరఖాస్తు ⇒ ‘సాక్షి’ కథనంపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సాక్షి, అమరావతి: రబీ సీజన్ నుంచి అమలు చేస్తున్న స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమాలో చేరేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. ఇప్పటి వరకు 6.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 8.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని పంటలు బీమా పరిధిలోకి తీసుకొచి్చనట్టు పేర్కొన్నారు. ‘ప్రీమియం భారం.. బీమాకు దూరం’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు మేరకే ఐదేళ్ల పాటు అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలు చేస్తున్నామని తెలిపారు.పంట రుణాలు పొందని రైతులు ఈ పథకంలో చేరేందుకు మంగళవారంతో గడువు ముగిసిందని తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు పొందే రైతులు మాత్రం పోర్టల్ ద్వారా పూర్తి వివరాలు అప్లోడ్ చేసేందుకు మరో 15 రోజులు వెసులుబాటు కల్పించామని వివరించారు. జీడిమామిడి పంటకు ఏడు రోజులు, వరిపంటకు మరో 15 రోజులు పొడిగించాలని బీమా కంపెనీలను సంప్రదించామని, వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వెబ్‌ల్యాండ్ డేటాతోపాటు కౌలుదారుల సమాచారం సీసీఆర్సీ డేటా బేస్, ఆర్వోఎఫ్ఆర్ భూముల వివరాలను రెవెన్యూ శాఖ సహకారంతో జాతీయ పంటల బీమా పోర్టల్‌తో అనుసంధానం చేశామని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నిరోధించాల్సిన బాధ్యత బ్యాంకులదే ⇒ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నిరోధించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ అన్నారు. బ్యాంకులు మానవీయ కోణంలో స్పందించి రైతులను ఉదారంగా ఆదుకోవాలని ఆయన కోరారు. రైతు ఆత్మహత్యల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం జిల్లా అధికారులు, బ్యాంకర్లతో సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ సీఎస్ మాట్లాడుతూ తుపాన్లు, అధిక వర్షాల వంటి వైపరీత్యాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర ఆటుపోట్లకు గురవుతోందన్నారు.ప్రతికూల పరిస్థితుల నడుమ బ్యాంకర్లు, వ్యవసాయ సిబ్బందికి అవసరమైన చేయూతనివ్వాలన్నారు. పెట్టుబడుల నిమిత్తం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాలు, ఇతర ప్రోత్సాహకాలు అందించాలన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు మాట్లాడుతూ ఎటువంటి హామీ, పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాలను రూ.1.60లక్షల నుంచి రూ.2లక్షలకు ఆర్బీఐ పెంచిన విషయాన్ని రైతులకు తెలియజేయాలని సూచించారు. -
సాగు రైతుకే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసిన భూమిని శాస్త్రీయ పద్ధతిలో లెక్కగట్టి తదనుగుణంగా ‘రైతు భరోసా’ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. రైతులు భూమిని సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు ప్రతి సీజన్లో శాటిలైట్ సర్వే చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారాన్ని తీసుకోనుంది. అదే సమయంలో సహాయ వ్యవసాయ అధికారుల (ఏఏఓలు)తో క్షేత్రస్థాయిలో పంటల లెక్కలు సేకరించనుంది. ఎన్ఆర్ఎస్సీ సాంతికేతిక పరిజ్ఞానంతో ఏ రైతు ఎంత భూమిలో ఏ పంట సాగు చేశాడనే వివరాలను తీసుకుని.. ఏఏఓలు ఇచ్చే నివేదికలతో సరిపోల్చుకొని రైతు భరోసాను జమ చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. తద్వారా సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులను వ్యవసాయం దిశగా ప్రోత్సహించినట్టు అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. దీని ప్రకారం రైతులకు ఖరీఫ్ (వానకాలం)లో వచ్చే పెట్టుబడి సాయానికి, రబీ (యాసంగి)లో అందే సాయానికి మధ్య కూడా తేడా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో రబీలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉంటుండటమే దీనికి కారణం. మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తి రైతులకు ఆరేళ్లుగా అందుతున్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో... కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ‘రైతు భరోసా’ పథకానికి మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తయింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల శాసనసభలో ప్రకటించారు కూడా. ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘రైతు భరోసా’ అమలులో ప్రభుత్వం అనుసరించనున్న విధివిధానాలపై చర్చ జరుగుతోంది. ఏడెకరాల సీలింగ్? ఇక ఒక రైతుకు గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలనే విషయంలో మంత్రివర్గ సమావేశంలో స్పష్టత రానుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి సాయం అందుతున్న నేపథ్యంలో... రాష్ట్ర పథకంలోనూ భూమికి సీలింగ్ విధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు సమాచారం. పదెకరాలలోపు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తొలుత అభిప్రాయం వ్యక్తమైనా.. మధ్యే మార్గంగా ఏడెకరాల సీలింగ్‌ను అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకు పెట్టుబడి సాయం అందదు. రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఎంత భూమి ఉన్నా గరిష్టంగా ఏడెకరాలకు రైతు భరోసా సాయం అందించాలని భావిస్తున్నట్టు సమాచారం. కుటుంబం యూనిట్‌గా తీసుకుంటే..? పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కుటుంబం యూనిట్‌గా తీసుకున్నారు. రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని.. ఒక కుటుంబం మొత్తానికి కలిపి రూ. 2లక్షల రుణమాఫీ చేసింది. ఇప్పుడు రైతు భరోసాకు కూడా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంటే ఒక కుటుంబంలో ఎంత మంది పేర్ల మీద ఎంత భూమి ఉన్నప్పటికీ... ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఏడెకరాలకే ప్రభుత్వ సాయం అందేలా విధి విధానాలు రూపొందించినట్టు తెలిసింది. ఇక గత ఐదేళ్లలో వరుసగా రెండేళ్లపాటు ఆదాయ పన్ను చెల్లించినవారు కుటుంబంలో ఒక్కరున్నా కూడా.. ఆ కుటుంబానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. ఈ విధానాన్ని రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తే పెద్ద సంఖ్యలో అర్హులు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పలు వర్గాలకు కోత! పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇచ్చే పెట్టుబడి సాయానికి కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అందులో ఒకటి ఆదాయ పరిమితి. ఆదాయపన్ను చెల్లించే వ్యాపారులు, కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను పీఎం కిసాన్ సమ్మాన్నిధి నుంచి మినహాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి తీసుకురానున్న రైతుభరోసాలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. సాగు చేసే నిజమైన రైతులకే సర్కార్ సాయం అందాలన్న లక్ష్యంలో భాగంగా వీరికి రైతుభరోసా తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించినట్టు తెలిసింది. అయితే ఇందులో నాలుగో తరగతి ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మినహాయించినట్టు సమాచారం. కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని.. కుటుంబంలోని ఇతర సభ్యులు ఐటీ చెల్లింపుదారులుగా ఉంటే కోత పెట్టాలనే యోచన ఉన్నట్టు తెలిసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయానికి అనర్హులు వీరే.. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు (జీతాలు పొందేవారు, పెన్షనర్లు) ఆదాయ పన్ను చెల్లించేవారు (గత ఐదేళ్లలో కనీసం వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించినవారు. ఒక్కరున్నా ఆ కుటుంబానికి పథకం వర్తించదు) డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్స్ వంటి నిపుణులు కుటుంబంలో ఎంత మంది రైతులు ఉన్నా సరే.. ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం రైతులు, పెట్టుబడి సాయంలో తగ్గుదల కొత్త మార్గదర్శకాలతో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 30 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుండగా.. రైతుబంధు ద్వారా 1,48,70,045 ఎకరాలకు సంబంధించి 65 లక్షల మంది రైతులకు సాయం అందుతూ వస్తోంది. ఏటా సగటున రూ.13 వేల కోట్ల చొప్పున ఆరేళ్లలో రూ.80,453.41 కోట్లను ప్రభుత్వం అందజేసింది. ఇందులో రూ.21,283.66 కోట్లు సాగులో లేని భూములకు, గుట్టలు, రాళ్లతో కూడిన భూములకు అందాయని మంత్రి తుమ్మల అసెంబ్లీలో చెప్పారు. ఇలా సాగులో లేని భూములతోపాటు ప్రభుత్వం పెట్టనున్న ఆంక్షలతో.. ఏటా రూ.3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్ల మేర పెట్టుబడి సాయంలో కోతపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
‘యాసంగి’ పెట్టుబడి ఎట్లా?
రాష్ట్రంలో యాసంగి పంట సాగు అంశం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. సర్కారు నుంచి అందాల్సిన రైతుభరోసాపై అస్పష్టత నెలకొనడం.. రుణమాఫీ పూర్తిగాక బ్యాంకుల నుంచి కొత్త రుణాలు అందే పరిస్థితి లేకపోవడంతో... యాసంగికి పెట్టుబడులు ఎలాగని రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ప్రైవేటు అప్పుల బాటపట్టాల్సిన దుస్థితి వస్తుందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంట కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తోంది. మరోవైపు నవంబర్ ఒకటి నుంచే యాసంగి (రబీ) సీజన్ మొదలైంది. నిజామాబాద్, నల్లగొండ వంటి జిల్లాలతోపాటు పంట కోతలు పూర్తయిన ప్రాంతాలన్నిటా రైతులు యాసంగి సాగు మీద దృష్టి పెట్టారు. దుక్కులు దున్ని, పొలాలను సిద్ధం చేస్తున్నారు. కొన్నిచోట్ల నారు పోస్తున్నారు. కానీ పంట సాగుకు పెట్టుబడులు ఎలాగని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘రైతుభరోసా’పై అస్పష్టత..: రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా 2018 ఖరీఫ్ నుంచి ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023–24 వానాకాలం సీజన్ వరకు 11 విడతలుగా రైతుబంధు మంజూరు చేసింది. చివరిసారిగా 2023–24 వానాకాలం సీజన్లో 68.99 లక్షల మంది రైతులకు రూ.7,624.74 కోట్లు రైతుబంధు సాయంగా అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయాన్ని ఏటా రూ.15 వేలకు పెంచి ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. కానీ 2023–24 యాసంగికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో ఐదెకరాలలోపు భూమి ఉన్న వారికి ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.5,575 కోట్లు విడుదల చేసింది. తర్వాత ఐదెకరాలపైన ఉన్న వారికి కూడా పెట్టుబడి సాయం విడుదల చేసినట్టు ప్రకటించింది. అయితే.. 2024–25 వానాకాలానికి సంబంధించి ‘రైతు భరోసా (రైతుబంధు)’ పెట్టుబడి సాయం రైతులకు అందలేదు. దీనిపై ఇటీవల వ్యవసాయ మంత్రి తుమ్మలను ప్రశ్నిస్తే.. వానాకాలం సీజన్ అయిపోయిందని, యాసంగి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ యాసంగి సీజన్ మొదలై నెలరోజులు గడుస్తున్నా పెట్టుబడి సాయం ఊసే లేదు. దీనితో పంట పెట్టుబడులు ఎలాగని రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. పెట్టుబడి సాయం పెంచి ‘రైతు భరోసా’ ఇవ్వడమేమోగానీ.. రైతు బంధుకూ దిక్కులేకుండా పోయిందని వాపోతున్నారు. రైతులందరికీ ‘భరోసా’ అందేనా? యాసంగి నుంచి పెట్టుబడి సాయం ఇస్తామని మంత్రి తుమ్మల ప్రకటించినా.. ఎవరెవరికి అందుతుందన్న దానిపై స్పష్టత లేని పరిస్థితి. గుట్టలు, రోడ్లు, సాగులో లేని భూములకు పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దానికితోడు గరిష్టంగా ఐదెకరాలకే పెట్టుబడి సాయం ఇచ్చే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రైతుల సాగుభూములపై ఇప్పటికే సర్వే చేపట్టినట్టు తెలిసింది. సాగు జరిగిన భూముల లెక్కలు తేలితేనే పెట్టుబడి సాయం అందించే రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది. దీనిలో ఎంత మంది రైతులకు, ఎంత వరకు పెట్టుబడి సాయం అందుతుందన్న దానిపై అస్పష్టత నెలకొంది. ఈ నెల 28 నుంచి 30 వరకు మహబూబ్‌నగర్‌లో రైతు సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అప్పుడైనా పెట్టుబడి సాయంపై ప్రకటన వెలువడుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ పూర్తవక రుణాలకు ఇబ్బంది కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చిన మేరకు రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తిస్థాయిలో అమలుకాలేదు. రాష్ట్రంలో రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులు సుమారు 40 లక్షల మందికాగా.. ప్రభుత్వం 22 లక్షల మందికి సంబంధించి రూ. 18 వేల కోట్లను మాఫీ చేసింది. మిగతావారికి రుణమాఫీ జరగాల్సి ఉంది. రేషన్‌కార్డు లేకపోవడం, ఆధార్, పాస్ పుస్తకాల్లో పేర్లు తప్పుగా ఉండటం, కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మందికి రుణాలు ఉండటంతోపాటు పలు సాంకేతిక కారణాలతో వారికి రుణమాఫీ జరగలేదు. వ్యవసాయ శాఖ వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించింది కూడా. అయితే పంట పెట్టుబడుల కోసం రుణం కావాలని వెళితే.. పాత రుణాలు ఇంకా మాఫీ కానందున కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయని రైతులు వాపోతున్నారు. అంతేకాదు మాఫీకాని రుణాలకు సంబంధించి వడ్డీలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయని పేర్కొంటున్నారు. వానాకాలం ధాన్యానికి సంబంధించిన సొమ్ము కూడా ఇంకా అందలేదని కొందరు రైతులు చెబుతున్నారు. -
సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణా శిబిరం..
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో ఇమిడి ఉండే అన్ని అంశాలతో పాటు పిజిఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ విషయాలపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలనుకునే తెలుగు వారికి ఇదొక గొప్ప అవకాశం. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో అన్ని విషయాలతో పాటు పిజిఎస్ సర్టిఫికేషన్‌పై లోతైన అవగాహన కల్పించేందుకు 21 రోజుల పాటు తెలుగులో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్/నేచురల్ ఫార్మింగ్ (ఎన్సిఓఎన్ఎఫ్) తోడ్పాటుతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ), కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ (కెఎస్ఎ) సెప్టెంబర్ 5 నుంచి ఉమ్మడిగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సిఎస్ఎ, కెఎస్ఎల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుండటం విశేషం.విజయవాడకు 50 కిమీ దూరంలో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలో శ్రీపద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ నెలకొల్పిన కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. 38 ఎకరాలలో అత్యాధునిక సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తూ ఆచణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన కెఎస్ఎకు సుస్థిర వ్యవసాయ కేంద్రం నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ 21 రోజుల శిబిరంలో బోధన పూర్తిగా తెలుగులో ఉంటుంది. శిక్షణ, భోజన వసతులు ఉచితం. అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 30 మందికి అవకాశం.సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోను, సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారంలోను స్థానికంగా కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి, నిబద్ధత కలిగిన వారికి సంపూర్ణ అవగాహన కలిగించేందుకే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. రామాంజనేయులు వివరించారు. స్థానిక స్వయం సహాయక బృందాలు/ ఎఫ్పిఓలు / ఐసిఎస్/ ఆత్మ, పికెవివై, నామని గంగే లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ పథకాలలో నమోదైన వారికి ్రపాధాన్యం ఉంటుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. గూగుల్ ఫామ్‌లో వివరాలు పొందుపరచటం ద్వారా ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 85002 83300. జుట్చఃఓటజీటజిn్చ uఛీజ్చిఅఛ్చిఛ్ఛీఝy.ౌటజముచ్చింతల్లో ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ శిబిరం..రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో.. కర్షక సేవా కేంద్రం నిర్వహణలో హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్‌వలి, డా. సరళా ఖాదర్లచే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇతర వివరాలకు.. 97053 83666, 70939 73999. -
Yarru Baparao: సేఫ్ ఫుడ్ సేనాని!
కుటుంబ సభ్యులు కేన్సర్ బారిన పడిన ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్న నేపథ్యంలో ఆహారంలో రసాయనాల అవశేషాలే ఇందుకు మూల కారణంగా గుర్తించిన ఓ యువకుడు ఉద్యోగం వదలి ప్రకృతి సేద్య సేనానిగా మారారు. అతనే యర్రు బాపారావు (బాపయ్య). కేవలం ఎకరంన్నర సొంత భూమి మాత్రమే ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయం చేపట్టడంతో పాటు దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. తమిళనాడు వెల్లూరులో ఈషా ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘భారతీయ సంప్రదాయ వరి, ఆహారోత్పత్తుల ఉత్సవం’లో బాపారావు మరో ముగ్గురు తెలుగు రైతులతో పాటు ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు.సేఫ్ ఫుడ్ యువ ఉద్యమకారునిగా బాపారావు (39), లక్ష్మీ సౌజన్య దంపతుల ప్రకృతి వ్యవసాయ జీవన ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. వారి స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట. ఉన్నత విద్యావంతుడైన బాపారావు హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్, 2డి ఏనిమేటర్ గా ఉద్యోగం చేసేవారు. తమ కుటుంబంలోనే ముగ్గురు కేన్సర్ వ్యాధితో కొద్ది కాలంలోనే మృత్యువాతపడటంతో రసాయనాల మయమైన ఆహారమే ఆరోగ్యాన్ని నాశనం చేస్తోందని గ్రహించారు. ఓ వైద్యుని సలహా మేరకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. 9 ఏళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం – సంప్రదాయ ఆహారోద్యమం ్రపారంభించారు. భార్య తోడ్పాటుతో బాపారావు తిరిగి స్వగ్రామం చేరుకొని ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. సొంత భూమి ఎకరంన్నరకు తోడు 7 ఎకరాల కౌలు భూమిలో ఔషధ, పోషక విలువలతో కూడిన దేశీ వరి వంగడాలను గత తొమ్మిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో అత్తోట గ్రామానికి చెందిన 60 మంది రైతులు సమష్టిగా ప్రకృతి వ్యవసాయం చేపట్టి సుమారు 85 ఎకరాల భూమిలో దేశీ వరి రకాలను సాగు చేస్తుండటం విశేషం.ఎకరంలో 365 రకాల దేశీ వరి రకాలను విత్తనాల పరిరక్షణ కోసం బాపారావు సాగు చేస్తున్నారు. 7 ఎకరాల్లో సార్వాలో మైసూర్మల్లిగ, బహురూపి తదితర దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. గట్లపై బంతి, వంగ, చిక్కుడు, ΄÷ద్దు తిరుగుడు, బెండ, అరటి, మునగ, టమాటా, మిర్చి, తోటకూర, గోంగూర, ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. వేసవిలో 20 రకాల ధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలు చల్లి.. 40 రోజులు పెరిగిన తర్వాత కోసి ఆవులకు మేతగా ఉపయోగించుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలు ఇంట్లోకి వాడుకుంటున్నారు. మిగతా పచ్చిరొట్టను భూమిలో కలియదున్ని తర్వాత వరి సాగు చేస్తున్నారు.ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, కూరగాయలను స్నేహితులు, బంధువులకు అమ్ముకొని ప్రతి రోజూ ఆదాయం సంపాదిస్తున్నారు. లక్ష్మి దేవినేని సహకారంతో ‘తానా’ సహకారంతో గ్రామంలోనే ‘భూమి భారతి’ అనే సంస్థను నెలకొల్పారు. భూమి భారతి ద్వారా దేశీ వరి విత్తన నిధిని నిర్వహించటంతోపాటు.. రైతులు పండించిన దేశీ వరి బియ్యాన్ని, విలువ జోడించిన ఇతర ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులను సంతల్లో, సోషల్ మీడియా ద్వారా సుమారు వెయ్యి కుటుంబాలకు విక్రయిస్తున్నారు. రైతు మిత్రుల ద్వారా దేశీ వరి విత్తనోత్పత్తి చేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 4 వేల మంది ప్రకృతి వ్యవసాయదారులకు అందించటం బాపారావు విశేష కృషికి నిదర్శనం.భావితరం కోసం...ఆయన ఇలా చెబుతున్నారు.. ‘రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం వలన భూమి సారం కోల్పోతున్నది, రైతులు అప్పుల పాలవుతూ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి సాగు పద్ధతిలో పండిస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. నీటి తడులు పెట్టడం తగ్గుతుంది. అంతర పంటలతో అధికాదాయాన్ని ΄÷ందుతాం. దేశీ విత్తనం వాడటం వలన ఆ పంటలు తినే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఇతర రైతులు పండించే పంటదిగుబడులను బై బ్యాక్ సిస్టం కింద కొని భూమి భారతి ద్వారా నేరుగా ప్రజలకు అమ్ముతున్నాను. ప్రతి రైతూ ఏటీఎం మోడల్ వేసుకుంటే అదనపు ఆదాయం కూడా వస్తుంది. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తోపాటు మంచి భూమి భావితరానికి కావాలి అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయటమే మార్గం..’ అంటారు బాపారావు.ప్రవాస భారతీయులు మౌనికా రెడ్డి దంపతుల సాయంతో విజయవాడలోని కనకదుర్గ అమ్మ వారికి , మరో ఎన్ఆర్ఐ తాళ్లూరి జయశేఖర్ దంపతుల సాయంతో భద్రాచలంలోని సీతారాముల వారికి ఏడాది ΄÷డవునా నైవేద్యం కోసం దేశీ వరి బియ్యాన్ని పంపుతుండటం మరో విశేషం. వరి కోత సమయంలో వర్షాల కారణంగా ధాన్యం ఎండబెట్టడం, కలుపు తీసే సమయంలో కూలీల కొరత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని ఆయన చెబుతున్నారు. బాలారిష్టాలను అధిగమించి నిలదొక్కుకున్న ఆయన నెలకు రూ. 4 లక్షల టర్నోవర్‌కు చేరుకోవటం విశేషం. ‘ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యదాయక ఆహారమే ఆరోగ్య సోపానమ’ని తన చేతల ద్వారా చాటిచెబుతున్న బాపారావు (91003 07308) దంపతులు యువతకు ఆదర్శ్రపాయులు. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట!
రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన పంట దిగుబడులు పండించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇండియా గుడ్ అగ్రికల్చర్ ్రపాక్టీసెస్ (ఐ.జి.ఎ.పి.– ఇండ్ గ్యాప్) మంచి ఫలితాలనిస్తున్నాయి. అనేక మంది రైతులు గ్యాప్ పద్దతులకు అనుగుణంగా ఆహార పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని దశల వారీగా తగ్గిస్తూ, రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, అధిక పంట దిగుబడుల ఉత్పత్తి సాధించటం ఇండ్ గ్యాప్ పద్ధతిలో ముఖ్యమైన అంశం.తుంగభద్ర సేంద్రియ వ్యవసాయ ధాన్య విత్తన రైతుల పరస్పర సహాయ సహకార సంఘంలో సభ్యులైన రైతులు గ్యాప్ పద్ధతులను ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారు. 2023–24లో కర్నూలు జిల్లాలోని సీ.బెలగల్ మండలం కొండాపురం (రంగాపురం), గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గ్యాప్ పద్ధతులనుపాటిస్తూ బీపీటీ 5204 రకం వరి పంటను సాగు చేశారు. రైతులు ఒక్కొక్కరు అరెకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 24.09 హెక్టార్లలో గ్యాప్ పద్దతులకు అనుగుణంగా వరి పండించారు.గ్యాప్ నిబంధనల ప్రకారం వరి సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. 10–15 రోజులకోసారి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించి రైతులకు గ్యాప్ పద్దతులపై అవగాహన కల్పించారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సి.బెలగల్ ఏవో మల్లేష్ యాదవ్, జిల్లా వనరుల కేంద్రం అధికారులు ప్రతి పొలంబడికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తూ వచ్చారు.కొండాపురం, గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతుల్లో ప్రతి రైతు 100 శాతం గ్యాప్ పద్దతులుపాటించారు. నాట్లకు ముందు సామూహికంగా పచ్చి రొట్ట ఎరువు పంట సాగు చేసి, పూత దశలో పొలంలో కలిపి దున్నేశారు. ఎకరాకు 3–4 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నారు. కొందరు రైతులు వేపచెక్క, వర్మీ కంపోస్టు కలిపి వేసుకున్నారు. పురుగుల బెడదను తగ్గించుకునేందుకు ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా రసాయనిక వ్యవసాయం చేసే రైతులు ఈ ్రపాంతంలో ఎకరానికి 6–8 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తూ ఉంటారు.గ్యాప్ పద్ధతిలో 4 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, అనుమతించిన కొన్ని పురుగుమందులను తగు మోతాదులో మాత్రమే ఉపయోగిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంట సాగు కాలంలో ఏపీ ఆర్గానిక్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అధికారుల బృందం మూడు దఫాలు పరిశీలించింది. వరి కోతలు పూర్తి కాగానే మూడు శ్యాంపుల్స్ సేకరించి గుంటూరులోని వ్యవసాయ శాఖ ల్యాబ్‌కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో రసాయనిక అవశేషాల ప్రభావం జీరో ఉన్నట్లు స్పష్టం కావడంతో సర్టిఫికేషన్ అథారిటీ ఈ సొసైటీ రైతులకు ఉమ్మడిగా ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్‌ను 2024 జనవరిలో జారీ చేసింది. ఆ తర్వాత రైతులు వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముకున్నారు.దిగుబడితో పాటు ధరా ఎక్కువే!అతిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ధాన్యం పండించిన రైతులు బియ్యం క్వింటాలు రూ.5,500 ప్రకారం విక్రయించుకుంటే, ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ పొందిన సహకార సంఘం రైతుల బియ్యానికి రూ.7,000 ధర లభించింది. మామూలుగా అయితే వరి సాగులో ఎకరాకు సగటున రూ. 45 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఇండ్ గ్యాప్ పద్ధతిలో ఖర్చు రూ.28 వేలు మాత్రమే. సగటున ఎకరాకు ధాన్యం దిగుబడి 2.51 క్వింటాళ్లు అదనంగా వచ్చింది. మొత్తం 50 మంది రైతులు 24.09 హెక్టార్లలో 102.9 టన్నుల దిగుబడి సాధించి రూ. 71 లక్షల ఆదాయం పొందారు. సాధారణ రసాయనిక వ్యవసాయ రైతులతో పోల్చితే ఇది రూ. 14.4 లక్షల అధికం కావటం విశేషం. ఈ స్ఫూర్తితో తుంగభద్ర సహకార సంఘం రైతులు ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు కొనసాస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్)నికరాదాయం పెరిగింది..8 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. నేను 2.75 ఎకరాల్లో ఇండ్ గ్యాప్ పద్ధతిలో వరి సాగు చేశాను. మిగతా పొలంలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలు సాధారణ పద్ధతిలోనే పండిస్తున్నాను. సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు చాలా ఏళ్లుగాపాటిస్తుండటంతో గ్యాప్ పద్ధతిని అనుసరించటం నాకు సులువైంది.వేప చెక్కను ఎక్కువగా వినియోగించడం, గో ఆధారిత పద్దతులుపాటించడం వల్ల పంట భూముల్లో సూక్ష్మ జీవులు విశేషంగా అభివృద్ది చెంది వరి పంట ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. కెమికల్స్ వాసన లేకుండా వరి పండించాను.మామూలుగా అయితే ఎకరాకు వరి సాగులో రూ.45–50 వేల వరకు పెట్టుబడి వ్యయం వస్తుంది. గ్యాప్ పద్ధతులుపాటించడం వల్ల ఎకరాకు రూ.28 వేలు చొప్పున 2.75 ఎకరాల్లో రూ. 77 వేలు ఖర్చయింది. 41 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. మిల్లింగ్ చేయగా 27 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. కర్నూలు తీసుకెళ్లి క్వింటా రూ.7,000కు అమ్మాను. క్వింటాకు రూ. వంద రవాణా ఖర్చు వచ్చింది. రూ.1.09 లక్షల నికరాదాయం వచ్చింది. మా సంఘంలోని 50 మంది రైతుల్లో క్వింటా బియ్యం రూ.7,500కి అమ్మిన వాళ్లూ కొందరు ఉన్నారు. ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నాం. – పి.మధుసూదన్‌రెడ్డి (94900 96333), రైతు, కొండాపురం, సీ.బెలగల్ మండలం, కర్నూలు జిల్లాఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్‌కు శ్రీకారం..ఇండ్ గ్యాప్ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులకు దేశంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. మన దేశంలో అమలయ్యే గ్యాప్ పద్ధతులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యు.సి.ఐ.) ‘ఇండ్ గ్యాప్’ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం 2023–24 ఖరీఫ్ నుంచి ఏపీ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ద్వారా ఈ ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ వ్యవస్థ రైతులకు దేశంలోనే తొలిగా అందుబాటులోకి తెచ్చింది. 2023–24లో ఏపీలోని ప్రతి జిల్లాలో పైలెట్ ్రపాజెక్టు కింద ఒక పంటను గ్యాప్ పద్ధతిలో పొలంబడిలో భాగంగా సాగు చేయించడం విశేషం.ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్న అనేక సహకార సంఘాలు, ఎఫ్.పి.సి.లు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం ద్వారా ఇండ్ గ్యాప్ పద్ధతులను అనుసరించి లబ్ధిపొందటం విశేషం. విత్తన ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తులపై పరీక్షలు చేయించి రైతులకు ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. తద్వారా రైతులు మంచి మార్కెట్ ధరకు విక్రయించి మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. దిగుబడులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా క్రమంగా కెమికల్ వాడకాన్ని తగ్గిస్తూ.. అదే సమయంలో సేంద్రియం వైపు మళ్లే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం గమనార్హం.ఇవి చదవండి: పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా? -
ఈ యువరైతుకి.. అరుదైన ఘనత!
సిద్ధేశ్ సాకోర్ (28)... ఒక మారుమూల గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివారు. అయినప్పటికీ, తన తండ్రి వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతుల ఆదాయాలు పెంచటం కోసం స్వగ్రామంలోనే ఉంటూ తన వంతుగా ఏదైనా చెయ్యాలన్నదే తపనంతా! ఈ తపనకు తోడైన ఆచరణే సిద్ధేశ్కి గత నెలలో ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది! దాని పేరే.. భూమి హీరో!ఐక్యరాజ్య సమితికి చెందిన కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ గత నెల 17న బ్రెజిల్లో భూమి పరిరక్షణ కృషిలో క్రియాశీలపాత్ర నిర్వహిస్తున్న పది మంది యువతకు భూమి హీరో పురస్కారాలు అందించింది. ఈ పురస్కార విజేతల్లో సిద్ధేశ్ ఒకరు. మన దేశం నుంచి ఈయనొక్కరికే ఈ గుర్తింపు దక్కింది. ఆయన ప్రయాణం ఆసక్తిదాయకం.. స్ఫూర్తిదాయకం..అతనిది మహారాష్ట్ర పుణే జిల్లా షిరూర్ తాలూకా ధామరి గ్రామం. పేద వ్యవసాయ కుటుంబంలో పెరిగిన సిద్ధేశ్ కరువు పీడిత మెట్ట ్రపాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. తాను వ్యవసాయం చేసి మార్పు తేవాలనుకున్నాడు. కొడుకు వ్యవసాయం చేయటం తండ్రికి ఇష్టం లేదు. కుటుంబ పొలాన్ని ఇవ్వనన్నాడు తండ్రి. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదవమన్నాడు. ఆ ప్రకారంగానే డిగ్రీ చదివిన సిద్ధేశ్ ఆ తర్వాత తమ జిల్లాలోనే గల విజ్ఞానాశ్రమంలో చేరి అనేక చిన్న యంత్రాలను ఆవిష్కరించాడు.వంటింటి వ్యర్థాలతో తక్కువ సమయంలో కంపోస్టు ఎరువు తయారు చేసే యంత్రాలను రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈలోగా కరోనాతో తండ్రి చనిపోయారు. అప్పటికి తండ్రి బ్యాంకు ఖాతాలో రూ. 3వేలు నిల్వ ఉందని చెబుతూ.. ఇదీ చిన్న రైతుల దుస్థితి అంటారాయన. భూములను సారవంతం చేసుకుంటూ రైతుల ఆదాయం పెంచే పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయంతో రైతుల తలరాత మార్చవచ్చని సిద్ధేశ్ బలంగా నమ్మాడు.ఐదెకరాల్లోపు వర్షాధార వ్యవసాయం చేసే రైతులు తగినంత ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆదాయం ఎందుకు రావటం లేదు? వారి భూములు అతిగా రసాయనాలు వాడటం వల్ల నిస్సారమైపోతున్నాయి. సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువగానే ఉంది. ఆ నేలల్లో అరకొర దిగుబడులు రావటం, గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల బడుగు రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ వెతలన్నిటికీ మూలం సాగు భూమి అతిగా నిస్సారమైపోవటం అని గ్రహించిన సిద్ధేశ్ స్వగ్రామంలోనే ఉండి, వారసత్వ చిన్నకమతంలో పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. తోటి రైతులను కూడా ఆ దిశగా నడిపించే పనిని ్రపారంభించారు. ‘ఆగ్రో రేంజర్స్’ అనే లాభాపేక్ష లేని సంస్థను ఐదేళ్ల క్రితం స్థాపించాడు.సీజనల్ పంటలపైనే ఆధారపడకుండా చిన్న కమతాల రైతులు కూడా కొంత మేరకు పండ్ల తోటలు పండించుకుంటూ.. రసాయన వ్యవసాయం నుంచి స్థిరమైన సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఆగ్రో రేంజర్స్ రైతులకు మద్దతు ఇస్తోంది. బహుళ పంటలు పండించే పండ్ల చెట్ల ఆధారిత ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను ఆగ్రో రేంజర్స్ అభివృద్ధి చేసింది. ఇది రైతులకు స్థిరంగా ఆదాయం వచ్చేలా చేస్తుంది. అదే సమయంలో నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది.గత 5 సంవత్సరాలుగా సిద్ధేశ్ బృందం 1,200 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. 23 గ్రామాల్లో వందకు పైగా ఎకరాల్లో రీజనరేటివ్ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను క్షేత్రస్థాయిలో అమల్లోకి తేగలిగారు. రెండు, మూడు సంస్థల్లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా, అనేక సంస్థల ఆర్థిక తోడ్పాటుతో ఆగ్రోరేంజర్స్ బృందం లోపాలను సరిదిద్దుకొని పురోగమిస్తోంది.రైతులు శిక్షణ తీసుకున్నప్పటికీ సాగు పద్ధతి మార్చుకోవటానికి ముందుకు రాకపోవటాన్ని గమనించి.. పండ్ల మొక్కలను, డ్రిప్ లేటరల్స్తో పాటు నాణ్యమైన శిక్షణ ఇవ్వటంతో మార్పు క్రమంగా వస్తోందని సిద్ధేశ్ తెలిపారు. వారికి ఎప్పుడు ఏమి అవసరమైతే అది చెబుతూ ముందుకు తీసుకువెళ్తే ఒక్కసారి ఈ పద్ధతి వల్ల ఆదాయం పెరిగితే ఇక వారికి నమ్మకం కుదురుతుంది. నేల క్షీణతను, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనే దిశగా పునరుజ్జీవ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనా సాగు పద్ధతిని చిన్న, సన్నకారు రైతులకు అందించే కృషిలో గ్రామీణ యువతను విరివిగా భాగస్వామ్యం చేయాలని సిద్ధేశ్ ఆశిస్తున్నారు.పుణేలోని లఖేవాడికి చెందిన రైతు జలంధర్ చేమాజీ మావ్లే మాటల్లో చె΄్పాలంటే.. ‘భూతాపం పెరిగిపోవటం అనే సమస్యను ఎదుర్కోవడానికి, సాధ్యమైనంత ఎక్కువ చెట్లను పెంచటం ఉత్తమం. అందువల్ల, పండ్ల మొక్కలు, బిందు సేద్యం, విలువైన పాఠాలతో నాకు సహాయం చేసిన ఆగ్రో రేంజర్స్ బృందంతో నేను కనెక్ట్ అయ్యాను. ఇది వాతావరణ మార్పుపై పోరాటంలో మాత్రమే కాదు. నాకు స్థిరమైన ఆదాయం కూడా వస్తోంది. రెండు ఎకరాల భూమి గతంలో పండ్ల మొక్కలు నాటాను. ఈ సంవత్సరం మరో మూడు ఎకరాల భూమి కోసం ప్లాన్ చేస్తున్నాను’.ఇవి చదవండి: కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల! -
కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల!
దేశవ్యాప్తంగా పత్తి పంటకు పెనునష్టం కలిగిస్తున్న గులాబీ పురుగును సమర్థంగా అరికట్టే కృషిలో నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశో«దనా సంస్థ (ఐసిఎఆర్–సిఐసిఆర్) పెద్ద ముందడుగు వేసింది. కృత్రిమ మేధ (ఎఐ)తో నడిచే హైటెక్ ఫెరమోన్ ట్రాప్లను పంజాబ్ రైతులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. పంటలపై పురుగుల నియంత్రణలో కృత్రిమ మేధ సాంకేతికతను దేశంలోనే మొట్టమొదటి సారిగా వాడిన ఘనతను సిఐసిఆర్ దక్కించుకుంది.సంప్రదాయ లింగాకర్షక బుట్టలతోపోల్చితే ఈ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ట్రాప్‌లు చాలా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయని పంజాబ్ పత్తి రైతులు సంతోషిస్తున్నారు. పురుగుల తీవ్రతపై ప్రతి గంటకు రైతుల మొబైల్‌కు, కంప్యూటర్‌కు సమాచారం అందించటం ఈ ఎఐ ఫెరమోన్ ట్రాప్ ప్రత్యేకత. దీని ప్రకారం వ్యవసాయ విస్తరణాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు వెంటనే నియంత్రణ చర్యలు సూచిస్తున్నారు.అదే రోజు ఆ చర్యలను రైతులు అమలు చేస్తుండటం వల్ల గులాబీ పురుగు వల్ల నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతున్నానని పంజాబ్ రైతు జగదేవ్‌సింగ్ చె΄్పారు. 2021 నుంచి వరుసగా మూడేళ్లుగా ఉగ్రరూపం దాల్చిన గులాబీ పురుగు బారిన పడి పంటను తీవ్రంగా నష్ట΄ోయిన రైతుల్లో ఈయన ఒకరు. ఎకరంన్నరలో బీజీ2 పత్తి సాగు చేస్తున్నారు. మూడు జిల్లాల్లో మరో 17 మంది రైతులు సిఐసిఆర్ పైలట్ ప్రాజెక్టు వల్ల ఈ ఏడాది పత్తి పంటపై దిగులు లేకుండా గడుపుతున్నారు.పత్తి పంటలో గులాబీ పురుగు తీవ్రతను గుర్తించడానికి హెక్టారుకు 5 చొప్పున లింగాకర్షక బుట్టలు పొలంలో వేలాడగడతారు. గాసిప్లూర్ అనే రసాయనిక ల్యూర్‌ను ఈ బుట్టలో పెడతారు. అది అడ పురుగుల వాసనగా పొరపడి ఆకర్షితులై వచ్చే మగ పురుగులు ఆ బుట్టలో చిక్కుకుంటాయి. వీటి సంఖ్యను బట్టి గులాబీ పురుగు తీవ్రతను అంచనా వేసి, క్రిమిసంహారకాలు చల్లుతారు. స్మార్ట్ ట్రాప్ ఎలా పనిచేస్తుంది?డిజిటలీకరించిన ఈ స్మార్ట్ ట్రాప్ సోలార్ విద్యుత్‌తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ట్రాప్ వ్యవస్థలో సింగిల్ బోర్డ్ కంప్యూటర్, కెమెరా మోడ్యూల్, వాతావరణ సెన్సార్, సోలార్‌తో నడిచే జిఎస్ఎం ట్రాన్స్మిటర్, రీచార్జిబుల్ బ్యాటరీ ఉంటాయి. ట్రాప్‌లోకి వచ్చి అతుక్కు΄ోయిన పురుగులను నిరంతరం ఈ కెమెరా ఫొటోలు తీసి, క్లౌడ్‌లోని రిమోట్ సర్వర్‌కు ఎప్పటికప్పుడు పంపుతుంది. ఆ ఫొటోలను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి ఏయే రకాల పురుగులన్న విశ్లేషణ జరుగుతుంది. గులాబీ పురుగునకు చెందిన రెక్కల పురుగులు ఎన్ని అనే విషయం ఇలా నిర్థారణ అవుతుంది. ఈ సమాచారంతో పాటు వాతావరణ వివరాలు స్మార్ట్ ట్రాప్‌కు అనుసంధానించిన మొబైల్/కంప్యూటర్లకు సంక్షిప్త సందేశాల రూపంలో చేరుకుంటాయి. ఈ విధంగా రైతులు సకాలంలో పురుగు తీవ్రతను గుర్తించి, క్రిమిసంహారాలు వాడి పత్తిని గులాబీ పురుగు నుంచి రక్షించుకుంటున్నారు.‘గతంలో సాధారణ లింగార్షక బుట్టలను పత్తి పొలంలో పెట్టి, ప్రతి 3 రోజులకోసారి స్వయంగా పొలానికి వెళ్లి చూసేవాడిని. నేను వెళ్లి చూసినప్పుడు పురుగులు పెద్దగా లేక΄ోవచ్చు. కానీ, తర్వాత రెండు రోజులు అటు వెళ్లను. ఆ తర్వాత రోజు వెళ్లేటప్పటికే పురుగు ఉధృతితో పంటకు తీవ్ర నష్టం జరిగి΄ోతూ ఉండేది. ఏ రోజు, ఏయే వేళలో పురుగు ఎక్కువ పంటను ఆశించిందీ మాకు తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు ఆ సమస్యల్లేవు. ప్రతి గంటకు మెసేజ్ వస్తుంది. అవసరమనిపిస్తే వెంటనే స్పందించి పిచికారీలు చేసి పంటను కాపాడుకుంటున్నాం..’ అన్నారు రైతు జగదేవ్‌సింగ్. సకాలంలో గులాబీ పురుగుకు చెక్..పత్తి పొలంలోని లింగాకర్షక బుట్టల్లో వరుసగా 3 రోజులు రోజుకు 8 చొప్పున గులాబీ రెక్కల పురుగులు కనిపిస్తే.. పంట దిగుబడిని భారీగా నష్టపరిచే స్థాయిలో పురుగు ఉందని అర్థం. అయితే, సాధారణ లింగాకర్షక బుట్టలను రైతులు పొలంలో పెట్టుకున్నప్పటికీ.. వాటిలో ఎన్ని పురుగులు పడుతున్నాయో గమనించే రైతులను మేం గతంలో చాలా అరుదుగా చూశాం. ఎందుకంటే, ఆ పని చేయటానికి వారికి చాలా సమయం అవసరం పడుతుంది. రైతు లు పత్తితో పాటు ఇతర పంటల పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా.ఈ కొత్త వ్యవస్థ వారి సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతుంది. ఫోన్లోకి వచ్చే సమాచారంతో పత్తి రైతులు గులాబీ పురుగు ఉనికిని సకాలంలో గుర్తించగలుగుతారు. తగిన సమయంలో క్రిమిసంహారకాలను చల్లి, పంట నష్టాన్ని సమర్థవంతంగా తగ్గించుకుంటున్నారు. కృత్రిమ మేధతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్ తక్కువ ఖర్చుతోనే గులాబీ పురుగును సమర్థవంతంగా అరికడుతోంది. ఇవి రైతులు స్వయంగా పొలాల్లో ఏర్పాటు చేసుకోవటానికి ఉద్దేశించి రూపొందించినవి కాదు. తహసిల్ స్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు పురుగు తీవ్రతను సకాలంలో గుర్తించి, రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వటానికి డిజిటల్ సాధనాలుగా వాడుకోవడానికి స్మార్ట్ ట్రాప్స్ ఉపయోగపడుతాయి. తక్కువ సాంద్ర గ్రిడ్ పద్ధతిలో రైతుల పొలాల్లో ప్రభుత్వం ఈ స్మార్ట్ ట్రాప్లను ఏర్పాటు చేయవచ్చు.– డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్ -
‘కనీస’ చట్టబద్ధత ఎండమావేనా?
ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఆశించిన మేరకు లేకపోవడంతో అన్నదాతలకు నిరాశే మిగిలింది. వరి ఎక్కువగా పండించే రాష్ట్రాలు వరి సాధారణ రకానికి రూ. 3,000 నుంచి రూ. 3,200; ఏ గ్రేడ్ రకానికి రూ. 3,200 నుంచి రూ. 3,400 ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేశాయి. కానీ కేంద్రం సాధారణ రకానికి రూ. 2,300; ఏ గ్రేడ్ రకానికి రూ. 2,320 మాత్రమే ప్రకటించింది. పత్తికి రూ. 1,000 నుంచి రూ.1,500 పెంచాలని కోరితే రూ. 500 పెంపుతో సరిపెట్టారు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయా, పెసలు, మినుములు... వంటి పంటలకు రాష్ట్రాల సిఫార్సులకు అనుగుణంగా ధరలు పెంచలేదు. శాస్త్రీయత లేకుండా తోచిన ధర ప్రకటించడంలో ఔచిత్యం ఏమిటి?పంటల సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ వ్యవసాయ పితామహుడు డాక్టర్ స్వామినాథన్ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి అందించిన నివేదికలో స్పష్టం చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ డిమాండ్ అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఆశ్చర్యం ఏమంటే... స్వామినాథన్ కమిషన్ అందించిన సిఫార్సులను 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉండి అమలు చేయకుండా అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని నమ్మబలికింది. మరోపక్క, దేశంలో దశాబ్దాలపాటు అపరిష్కృతంగా, చిక్కుముళ్లుగా బిగుసుకుపోయిన సమస్యలకు తాము పరిష్కార మార్గాలు చూపగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతుంటారు. అయెధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన, ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, చంద్రయాన్ విజయం, సూర్యయాన్‌కు సన్నద్ధత వంటి అంశాలను ఉదహరించే అధికార బీజేపీ గత పదేళ్లుగా రైతాంగ సమస్యలకు అరకొరగా తప్ప శాశ్వత పరిష్కార మార్గాలేమీ చూపించలేకపోవడం గమనార్హం! ఫలితంగానే దేశానికి ఆహార భద్రత చేకూర్చడానికి ఆరుగాలం కష్టపడే అన్నదాతలు దేశం నలుమూలల నుంచి తరలివచ్చి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని ఎండ, వాన, చలిని తట్టుకొని నెలల తరబడి తమ డిమాండ్ల సాధన కోసం ఉధృతమైన ఉద్యమం చేశారు. గత 10 ఏళ్లల్లో నాలుగు దశల్లో దేశ రైతాంగం చేసిన ఆందోళన కార్యక్రమాలు ఇంతకుముందెప్పుడూ కనివిని ఎరుగనివి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 300కు పైగా రైతు సంఘాలు సంఘటితమై ఉద్యమించాయంటే సమస్య తీవ్రత ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 750 మందికి పైగా ప్రాణాలు పోయినా లెక్కచేయక రైతాంగం ప్రదర్శించిన పట్టుదల కారణంగానే కేంద్రం పార్లమెంట్లో మూడు వివాదాస్పద రైతు బిల్లుల్ని ఉపసంహరించుకొంది. కానీ వారి ఇతర డిమాండ్లను మాత్రం నెరవేర్చలేదు.దేశ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న అతి ప్రధాన డిమాండ్ ఎంఎస్పీ(కనీస మద్దతు ధర)కి చట్టబద్ధత. దీనినే ‘కిసాన్ న్యాయ్ గ్యారంటీ’ అంటున్నారు. కేంద్రం ముందు రైతు సంఘాలు పెట్టిన ఇతర డిమాండ్లలో 1) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒప్పందాల నుంచి భారత్ బయటకు రావడం 2) వ్యవసాయ దిగుమతులపై సుంకాల పెంపుదల 3) 2020 విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు 4) ఉపాధి హామీ పనులు ఏడాదికి 200 రోజులకు పెంపు 5) రైతుకు, రైతు కూలీలకు పెన్షన్ వర్తింపు వంటివి ప్రధానంగా ఉన్నాయి. రైతులు పెట్టిన ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపినా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా రైతులు పట్టుబడుతున్న ప్రధాన డిమాండ్ 23 పంటలకు కనీస మద్దతు ధరలతో చట్టబద్ధత కల్పించడం. ఈ అంశాన్ని ప్రభుత్వం ఆర్థిక కోణంలో కాకుండా రైతుల ఆర్థిక కోణంలో చూడాలని అంటున్నారు. కానీ, కేంద్రం ఈ డిమాండ్‌కు తలొగ్గకపోగా మరో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా కంది, మినుము, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు పండిస్తే ఐదేళ్లపాటు కనీస మద్దతుతో కేంద్ర సంస్థలయిన జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్)లు కొంటాయనీ, అందుకుగాను రైతులతో ముందస్తు ఒప్పందం చేసుకొంటాయనీ ప్రతిపాదించింది. దీనిని రైతు సంఘాలు ఒప్పుకోవడం లేదు. కేంద్రం మాత్రం ఈ ప్రణాళికను అమలు చేయాలనే గట్టి పట్టుదలతో ఉంది. పంటమార్పిడి అన్నది అంత తేలికైనది కాదు. రైతులలో పంట మార్పిడి విధానంపై అవగాహన పెంచాలి. ప్రభుత్వ సహకారం అందాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా, దేశంలోని అన్ని ప్రాంతాలలోని వ్యవసాయ భూములు పంట మార్పిడికి పూర్తి అనుకూలంగా లేవన్నది ఓ చేదు వాస్తవం. సమగ్రమైన అధ్యయనం, వాటి ఫలితాలు పరిశీలించిన తర్వాతనే పంటల మార్పిడి విధానం అమలు చేయాలే తప్ప, బలవంతంగా అమలు చేయాలనుకోవడం వల్ల ప్రతిఘటన ఎదురవుతుంది. నిజానికి, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలోనూ, ఇతర డిమాండ్ల పరిష్కారంలోనూ ఎన్డీఏ–2 ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత కారణంగానే బీజేపీ ఈ ఎన్నికలలో 60 లోక్‌సభ స్థానాలకు పైగా నష్టపోయిందని పరిశీలకుల విశ్లేషణ. ప్రధానంగా... పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని మెజారిటీ స్థానాల్లో రైతాంగం బీజేపీని ఆదరించలేదు. అయితే, మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా కొలువుదీరిన ఎన్డీఏ–3 ప్రభుత్వం రైతాంగం చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందా? లేక ఉద్యమాన్ని అణచివేస్తుందా అన్నదే కీలకం. ఎన్నికల ముందు దేశ రైతాంగాన్ని తమ హామీల ద్వారా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ కూటమి పక్షాలు (ఇండియా బ్లాక్) ప్రయత్నించినా అది పూర్తి స్థాయిలో ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే దేశ రైతాంగం ఆశలు, ఆకాంక్షలు ఏమవుతాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే ఏటా కేంద్ర ప్రభుత్వంపై రూ. 12 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని నీతి ఆయోగ్ తేల్చింది. దాదాపు రూ. 50 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో ఇంత మొత్తం కేటాయించడం అసాధ్యమే. పైగా, వ్యవసాయం అంటే కేవలం 23 పంటలే కాదు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయల మాటేమిటి? వాటికి ప్రోత్సాహకాలు అవసరం లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దేశంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాలు, వాటిపట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77వ జాతీయ నమూనా సర్వే వెల్లడించడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం దేశంలోని చిన్న సన్న కారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4,063. ఆదాయాలు పెరగకపోవడం వల్ల వారికున్న రుణభారం తగ్గడం లేదు. ఫలితంగానే రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 11,290 మంది, 2022లో 10,281 మంది, 2021లో 9,898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. రైతుల ఆత్మహత్యల్లో పెరుగుదల 3.7 నుంచి 5.7 శాతంగా ఎన్సీఆర్బీ డేటా వెల్లడిస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 53 శాతం మంది రైతు కూలీలేనన్నది చేదు నిజం. రైతులు, అనుబంధ వృత్తికూలీల ఆదాయం పెరగకపోవడం కారణంగానే గ్రామీణ పేదరికం క్రమేపీ పెరుగుతున్నది. మోదీ చెప్పినట్లు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. ఇప్పట్లో హరియాణాకు తప్ప ఇతర ప్రధాన రాష్ట్రాలకు ఎన్నికలు లేవు కనుక... రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైతులు డిమాండ్ చేస్తున్న ఎంఎస్పీకి చట్టబద్ధత ఓ ఎండమావిగానే మిగిలిపోతుందన్నది నిష్టుర సత్యం.డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
దుక్కి చేయని సేద్యం.. దుఃఖం లేని భాగ్యం!
వరి సాగులో రసాయనిక ఎరువులు, సాగు నీటి వాడకాన్ని దిగుబడి తగ్గకుండా తొలి ఏడాదే సగానికి తగ్గించుకోగలమా? వరి పొలాల నుంచి వెలువడే మిథేన్ వాయువు (బొగ్గుపులుసు వాయువు కంటే ఇది భూతా΄ాన్ని 20 రెట్లు ఎక్కువగా పెంచుతోంది) ని అరికట్టే మార్గం ఏమిటి? ఏటా దుక్కి చేసే పంట భూముల్లో నుంచి ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి వానకు గాలికి కొట్టుకుపోతోంది.దీన్ని ఆపటం ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోగలమా? భారీ ఖర్చుతో నిర్మించిన రిజర్వాయర్లు కొద్ది ఏళ్లలోనే పూడికతో నిండిపోకుండా చెయ్యగలమా..? భూగర్భజలాలు వర్షాకాలంలో (రెండు నెలలుగా మంచి వర్షాలు పడుతున్నప్పటికీ) కూడా అడుగంటే వుంటున్నాయెందుకు? ఈ పెద్ద ప్రశ్నలన్నింటికీ సమాధానం ‘ఒక్కటే’ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.. అవును.. సాగు పద్ధతిని మార్చుకోవటం అనే ఒక్క పని చేస్తే చాలు..వరి, పత్తి వంటి తదితర పంటల సాగును ’సగుణ రీజెనరేటివ్ టెక్నిక్’ (ఎస్.ఆర్. టి.) అనే నోటిల్లేజ్ ఆరుతడి పద్ధతిలోకి మార్చుకుంటే పై సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని అనుభవపూర్వకంగా చెబుతున్నారు రైతు శాస్త్రవేత్త చంద్రశేఖర్.పొలాన్ని దున్ని ఒక్కసారి ఎత్తుమడులను ఏర్పాటు చేస్తే చాలు.. 20 ఏళ్లు మళ్లీ దున్నే పని లేకుండానే ఏటా మూడు పంటలు పండించుకోవచ్చు.వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయ పంటలను సాగు చేస్తూ చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు.రసాయనాలను తగుమాత్రంగా వాడుతూ ఖర్చును, శ్రమను తగ్గించుకొని దిగుబడులతో΄ాటు సేంద్రియ కర్బనాన్ని సైతం 0.3% నుంచి 1.5%కి పెంపొందించానన్నారు.జమ్మికుంటలోని జి.ఎన్.ఎన్.ఎస్. ప్రశాశం కేవీకే ఆవరణలో ఎస్.ఆర్.టి. పద్ధతిలో శాశ్వత ఎత్తుమడులపై ఆరుతడి వరి సాగుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. చంద్రశేఖర్ స్వయంగా హాజరై రైతులకు, శాస్త్రవేత్తలకు మెళకువలు నేర్పించారు. ఇతర వివరాలకు.. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు (98485 73710)ను సంప్రదింవచ్చు.1. 136 సెం.మీ. దూరంలో మార్కింగ్ చేసుకొని.. 100 సెం.మీ. వెడల్పుతో శాశ్వత బెడ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. రెండు వైపులా కాలువలు ఉండాలి.2. ఎస్.ఆర్.టి. ఫ్రేమ్‌తో బెజ్జాలు వేసుకొని బెడ్‌పై వరి విత్తనాలను 5 వరుసలుగా విత్తుకోవాలి. మొక్కలు, వరుసల మధ్య దూరం 25 సెం.మీ.లు.3. కాలువల్లో నీరు పెట్టుకొని.. వరి విత్తనాలను ఇలా విత్తుకోవచ్చు..4. మహరాష్ట్రలోని చంద్రశేఖర్ పొలంలో ఎత్తుమడులపై వరి పంట ఇది. పొలం అంతా ఒకే మాదిరిగా పెరిగి కోతకు సిద్ధమైన దృశ్యం.5. వరి పంటలో నీటిని నిరంతరం నిల్వ ఉంచకూడదు. అవసరాన్ని బట్టి ఆరుతడులు ఇవ్వాలి. ఒక్కసారి మాత్రమే యూరియా వేయాలి.6. విత్తనాలు వేసిన తర్వాత కలుపు మొలవకుండా ఎంపిక చేసిన గడ్డి మందును పిచికారీ చేయాలి.భూమిని పంట వేసిన ప్రతి సారీ దున్నకుండా వ్యవసాయం (నోటిల్లేజ్ / జీరోటిల్లేజ్ వ్యవసాయం) చెయ్యగలిగితే భూమి కోతను అరికట్టి భూసారాన్ని పెంపొందించుకోవటానికి అంతకుమించి మరో ఉత్తమ మార్గం ఉండదు. ఈ పద్ధతిని దీర్ఘకాలం సాగులో ఉండే పండ్ల తోటల్లో త్రికరణశుద్ధితో అనుసరించే ప్రకృతి/సేంద్రియ వ్యవసాయదారులు చాలా మంది కనిపిస్తుంటారు. అయితే, మూడు, నాలుగు నెలల్లో పూర్తయ్యే సీజనల్ పంటలను నోటిల్లేజ్ పద్ధతిలో శ్రద్ధగా సాగు చేసే రైతులు మాత్రం అత్యంత అరుదు. ఈ కోవకు చెందిన వారే చంద్రశేఖర్ హరి భడ్సావ్లే(74).మహారాష్ట్ర రాయ్‌గడ్ జిల్లా కర్జత్ తాలూకాలోని దహివాలి సమీపంలో చంద్రశేఖర్ హరి భడ్సావ్లే వ్యవసాయ క్షేత్రం ‘సగుణబాగ్’ ఉంది. మహారాష్ట్రలో అగ్రిబిఎస్సీ చదివిన తర్వాత అమెరికాలో ఎం.ఎస్.(ఫుడ్ టెక్) చదువుకొని ఇంటికి తిరిగి వచ్చి.. 48 ఏళ్ల క్రితం వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన చంద్రశేఖర్ అప్పటి నుంచి మొక్కవోని దీక్షతో 55 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. సుదీర్ఘ సేద్య అనుభవాన్ని రంగరించి వెలువరించిన అనేక ఆవిష్కరణలతో ఎత్తుమడులపై నోటిల్లేజ్ సాగును ఈయన కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.ఆరుతడి వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి పదికి పైగా పంటలను సాగు చేస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఒకటి తర్వాత మరొకటి పంటల మార్పిడి చేస్తూ ఖర్చుల్ని తగ్గించుకుంటూ దిగుబడులతో΄ాటు పనిలోపనిగా భూసారాన్ని సైతం పెంపొందిస్తున్నారు. తగుమాత్రంగా రసాయనిక ఎరువులతో ΄ాటు కలుపు మందును వాడుతున్నారు. గత 12 ఏళ్లుగా నోటిల్లేజ్ సాగులో చక్కని ఫలితాలు సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ సాగు పద్ధతిని ఇప్పుడు కనీసం మరో పది వేల మంది అనుసరిస్తున్నారు.రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించే సాగు పద్ధతిగా ‘రీజెనరేటివ్ అగ్రికల్చర్’ (పునరుజ్జీవన వ్యవసాయం) అనే మాట వాడుకలో ఉంది. అయితే, ఈ మాటకు తనదైన శైలిలో సరికొత్త అర్థం చెబుతున్నారు చంద్రశేఖర్.ఎత్తుమడులపై ఆరుతడి పంట (వరి కావచ్చు, మరొకటి కావచ్చు) కోసిన తర్వాత మోళ్లు మిగులుతాయి. వాటి కింద నేలలో వేర్లుంటాయి. మరో పంట వేసుకోవటానికి వీలుగా ఈ మోళ్లను వదిలించుకొని శుభ్రం చేయటం ఎలాగన్నది పెద్ద సమస్య.అయితే, ఈ సమస్యనే చంద్రశేఖర్ అద్భుతమైన పరిష్కారంగా మార్చుకున్నారు. మోళ్లను వేర్లతో సహా పీకెయ్యటమో, కాల్చెయ్యటమో కాకుండా.. వాటిని ఒక చిన్న పనితో పొలంలో కురిసే వాన నీటిని అక్కడికక్కడే ఒడిసిపట్ఠి భూమిలోకి ఇంకింపజేసేందుకు చక్కని సాధనంగా మార్చుకుంటున్నారు. మోళ్లపై కలుపుమందు చల్లటంతో నిర్జీవమవుతాయి. తిరిగి మొలకెత్తవు. కుళ్లిపోతాయి. అప్పుడు తదుపరి పంట విత్తనాలను మనుషులతోనో లేదా సీడ్ డిబ్లర్తోనో కోవచ్చు.మోళ్లు, వేర్లు కుళ్లిపోయి పోషకాలు పంటకు అందుబాటులోకి వస్తాయి. ఆఖాళీల ద్వారా వాన నీరు వేగంగా ఇంకుతుంటుంది. వేరు వ్యవస్థలో మట్టికి పుష్కలంగా గాలి, పోషకాలు అందుతాయి. సూక్ష్మజీవరాశి, వాన΄ాములతో ΄ాటు సేంద్రియ కర్బనం పెరుగుతుంది. పంట కోసిన తర్వాత మోళ్లపై కలుపు మందు చల్లుతున్న కారణంగానే ఈ ప్రక్రియ సౌలభ్యకరంగా, వేగవంతంగా జరుగుతోందని చంద్రశేఖర్ చెబుతారు. నోటిల్లేజ్ సాగు పద్ధతిలో ఇది అత్యంత కీలకమైన అంశమని ఆయన అంటున్నారు.‘సగుణ’తో సకల ప్రయోజనాలు!నేను అగ్రికల్చర్ బీఎస్సీ, అమెరికాలో ఎమ్మెస్ చదివి కూడా 48 ఏళ్లుగా 55 ఎకరాల్లో శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నా. గత పన్నెండేళ్లుగా ఎస్.ఆర్.టి. పద్ధతిలో దుక్కి దున్నకుండా వరుసగా అనేక పంటలు పండిస్తున్న అనుభవంతో చెబుతున్నా. నోటిల్లేజ్ సాగు రైతులకు సౌలభ్యకరంగా, అనేక రకాలుగా ప్రయోజనకరంగా ఉంది.ప్రతి పంటకూ ముందు, వెనుక దుక్కి దున్నటం వల్ల వానకు, గాలికి భూమి కోతకు గురై ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. దుక్కి చేయకుండా విత్తనాలు వేస్తున్నందు వల్ల సాయిల్ అగ్రిగేషన్ జరిగి పొలంలో మట్టి వానకు, గాలికి కొట్టుకుపోవటం ఆగిపోతుంది. రసాయనిక కలుపు మందులు వాడటం వల్ల కలుపు సమస్య తీరిపోతుంది. ΄ాత పంటల మోళ్లు, వేర్లు కుళ్లటం వల్ల పోషకాల పునర్వినియోగం జరుగుతుంది.ఆ రంధ్రాల ద్వారా పొలంలోనే వాన నీటి సంరక్షణ అత్యంత సమర్థవంతంగా జరుగుతుంది. బెట్టను తట్టుకునే శక్తి పంటలకు కలుగుతుంది. నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగయ్యే వరి పొలం మాదిరిగా మిథేన్ వాయువు వెలువడదు. కాబట్టి, భూతాపం గణనీయంగా తగ్గుతుంది. కలుపు మందు వల్ల కలిగే నష్టంతో పోల్చితే రైతుకు, భూమికి, పర్యావరణానికి ఒనగూడే ప్రయోజనాలు చాలా ఎక్కువ.నానా బాధలు పడి సాగు చేసే రైతు ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటున్నాడు. ఎస్.ఆర్.టి. సాగు పద్ధతి వల్ల రైతులకు సంతోషం కలుగుతోంది. అగ్రిటూరిజం కూడా ఇందుకు తోడ్పడుతోంది. అందరూ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. భూతా΄ాన్ని తట్టుకునే శక్తి, ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచే శక్తి ‘సగుణ’ సాగు పద్ధతికి ఉందని నా అనుభవంలో రుజువైంది.శాశ్వత ఎత్తుమడులపై ఖరీఫ్‌లో వరిని ఆరుతడి పద్ధతుల్లో సాగు చేయటం, ఆ తర్వాత అవే మడులపై 2,3 పంటలుగా పప్పుధాన్యాలు/ నూనెగింజలు/ కూరగాయలను పంట మార్పిడి ΄ాటిస్తూ సాగు చేస్తున్నాం. వరిలో ఖర్చు 29% తగ్గి దిగుబడి 61% పెరిగింది. పత్తి సాగు ఖర్చు 17% తగ్గి దిగుబడి 96% పెరిగింది. నాతో ΄ాటు మహారాష్ట్రలోని పది వేల మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరైనా వచ్చి చూడొచ్చు. – చంద్రశేఖర్ హరి భడ్సావ్లే (98222 82623), సగుణ రీజెనరేటివ్ టెక్నిక్ ఆవిష్కర్త, రైతు శాస్త్రవేత్త, మహారాష్ట్ర, https://sugunafoundation.ngo/– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Sagubadi: మామిడి సాగులో.. బయోచార్ వినియోగంపై ప్రత్యేక సదస్సు
జూలై 7న నూజివీడులో.. రైతు సదస్సు!ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా నూజిబీడు టీటీడీ కల్యాణ మండపంలో జూలై 7(ఆదివారం)న ఉ. 10 గంటల నుంచి మామిడి సాగులో మెలకువలతో పాటు బయోచార్ వినియోగంపై ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు నూజివీడు సేంద్రియ ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి భోగోలు రాజేశ్ తెలిపారు. బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి రైతులకు అవగాహన కల్పిస్తారని రాజేశ్ (91779 88422) వివరించారు.గోమయ ఉత్పత్తులపై 30న శిక్షణ..ఆవు పేడతో అనేక ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వ్యూహాలపై రైతులు, గోశాలల నిర్వాహకులకు ఈ నెల 30న హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు మురళీధర గోధామం (జగిత్యాల జిల్లా) వ్యవస్థాకులు డాక్టర్ పద్మ తెలిపారు. గోశాలలను ఆర్థికంగా స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 98497 50854.ఆంగ్రూ ఆన్లైన్ కోర్సులు..ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో మిద్దెతోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల పెంపకంపై వేర్వేరుగా ఆన్లైన్లో సర్టిఫికెట్ కోర్సులను ్రపారంభించనుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ కోర్సులు నిర్వహిస్తారు. ఫీజు రూ. 1,500. ఇతర వివరాలకు.. 80087 88776, www.angrau.ac.inఇవి చదవండి: విదేశీ విత్తనాలను, మొక్కల్ని ఆన్లైన్లో కొంటున్నారా? జాగ్రత్త..! -
Sagubadi: విదేశీ విత్తనాలను, మొక్కల్ని ఆన్లైన్లో కొంటున్నారా? జాగ్రత్త..!
విదేశాల నుంచి మొక్కలు, విత్తనాలు, చెక్క వస్తువులు, అలంకరణ చేపలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారా? విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ కంటికి నచ్చిన పూల మొక్కలనో, పంట మొక్కలనో, వాటి విత్తనాలనో అధికారుల కన్నుగప్పి వెంట తెస్తున్నారా?మిరపతో పాటు కొన్ని కూరగాయ పంటలు, మామిడి తోటలను ఇటీవల అల్లాడిస్తున్న నల్ల తామర ఇలాగే విదేశాల నుంచి వచ్చిపడిందేనని మీకు తెలుసా? కొబ్బరి, ఆయిల్‌పామ్ వంటి తోటలను పీడిస్తున్న రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ కూడా విదేశాల నుంచి మన నెత్తిన పడినదే. వీటి వల్ల జీవవైవిధ్యానికి, రైతులకు అపారమైన నష్టం కలుగుతోంది.ఒక దేశంలో ఉన్నప్పుడు పెద్దగా నష్టం కలిగించని పురుగులు, తెగుళ్లు వేరే దేశపు పర్యావరణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి జీవవైవిధ్యానికి పెను సమస్య్ఠగా మారే ప్రమాదం ఉంటుంది.ఒక్కసారి ఆ పర్యావరణంలో అది సమస్యగా మారిన తర్వాత దాన్ని నిర్మూలించటం చాలా సందర్భాల్లో అసాధ్యం. ఉదాహరణ.. మన రైతులను వేధిస్తున్న నల్లతామర, రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ. అందుచేత.. విదేశాల నుంచి సకారణంగా ఏవైనా మొక్కల్ని, విత్తనాలను, అలంకరణ చేపలను తెప్పించుకోవాలనుకుంటే.. అంతకు ముందే ఫైటోశానిటరీ సర్టిఫికెట్తో పాటు ఇతర అనుమతుల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..!తెలిసో తెలియకో పోస్టు, కొరియర్ల ద్వారా మన వంటి వారు కొనుగోలు చేస్తున్న విదేశీ మొక్కలు, విత్తనాలతో పాటు మనకు తెలియకుండా దిగుమతయ్యే సరికొత్త విదేశీ జాతుల పురుగులు, తెగుళ్లు మన దేశంలో పంటలకు, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఆహార భద్రతకు ఎసరు పెట్టే పరిస్థితులూ తలెత్తవచ్చు. అందుకే అంతర్జాతీయంగా జన్యువనరుల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎయిర్‌పోర్టుల్లో, సీపోర్టుల్లో, సరిహద్దుల్లో ప్రత్యేక అధికార వ్యవస్థలను ఏర్పాటు చేశారు.మొక్కలు, విత్తనాలే కాదు.. మట్టి ద్వారా కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి చీడపీడలు తెలియకుండా రవాణా కావొచ్చు. ఆ మధ్య ఒక క్రికెటర్ తనతో పాటు తీసుకెళ్తున్న బూట్లకు అడుగున అంటుకొని ఉన్న మట్టిని సైతం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గుర్తించి, నివారించడానికి ఇదే కారణం.అధికారికంగా వ్యవసాయ పరిశోధనల కోసం దిగుమతయ్యే పార్శిళ్లను ఈ క్వారంటైన్ అధికారులు వాటిని నిబంధనల మేరకు పరీక్షించి, ప్రమాదం లేదనుకుంటేనే దిగుమతిదారులకు అందిస్తారు. జాతీయ మొక్కల జన్యువనరుల పరిశోధనా సంస్థ (ఎన్‌బిపిజిఆర్) ద్వారా ఇది జరుగుతుంది.ఒక వ్యాపార సంస్థ నుంచి నేరుగా వినియోగదారుల మధ్య (బి2సి) జరిగే ఆన్లైన్ వ్యాపారం వల్లనే సమస్య. విదేశాల్లోని వినియోగదారులకు ఓ వ్యాపార సంస్థ నేరుగా అమ్మకాలు జరుపుతున్నందున దిగుమతులకు సంబంధించిన ఫైటోశానిటరీ నిబంధనల అమలు కష్టతరంగా మారింది.అంతర్జాతీయంగా ఈ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ప్రపంచ దేశాల మధ్య ఇంటర్నేషనల్ ΄్లాంట్ ్ర΄÷టెక్షన్ ఒడంబడిక (ఐపిపిసి) గతంలోనే కుదిరింది. ఇటీవల కాలంలో పెద్ద తలనొప్పిగా మారిన ఈ–కామర్స్ పార్శిళ్లను కట్టడి చేయడం కోసం జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థలకు ఐపిపిసి సరికొత్త మార్గదర్శకాలను సూచించింది.- గోల్డెన్ ఆపిల్ స్నెయిల్, - వరి మొక్కపై నత్త గుడ్లుఎవరేమి చెయ్యాలి?దేశ సరిహద్దులు దాటి సరికొత్త చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే, ప్రమాదవశాత్తూ వచ్చినా వాటిని తొలి దశలోనే గుర్తించి మట్టుబెట్టేందుకు సమాజంలోని అనేక వర్గాల వారు చైతన్యంతో వ్యవహరించాల్సి ఉంది.రైతులు: చీడపీడలను చురుగ్గా గమనిస్తూ ఏదైనా కొత్త తెగులు లేదా పురుగు కనిపిస్తే వెంటనే అధికారులకు చె΄్పాలి. పర్యావరణ హితమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు: చీడపీడల నివారణ, నియంత్రణకు మేలైన పద్ధతులను రైతులకు సూచించాలి. వీటి అమలుకు మద్దతు ఇస్తూ.. మొక్కల ఆరోగ్య పరిరక్షణకు సంబంధీకులందరినీ సమన్వయం చేయాలి.ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు, పాలకులు: మొక్కల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించాలి. పర్యావరణహితమైన సస్యరక్షణ చర్యలను ్రపోత్సహించాలి. ప్రమాదరహితమైన వ్యాపార పద్ధతులను ప్రవేశ పెట్టాలి. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో మొక్కల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ సంస్థలను అన్ని విధాలా బలోపేతం చేయాలి.దాతలు–సిఎస్ఆర్: మొక్కల ఆరోగ్య రక్షణ వ్యవస్థలను, సాంకేతికతలను బలోపేతం చేయాలి. ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులు సమకూర్చాలి. రవాణా, వ్యాపార రంగాలు: ప్రస్తుతం అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ఫైటోశానిటరీ చట్టాలను, ఐపిపిసి ప్రమాణాలను తు.చ. తప్పక పాటించాలి.ప్రజలు: విదేశాల నుంచి మన దేశంలోకి మొక్కల్ని, మొక్కల ఉత్పత్తుల్ని తీసుకురావటం ఎంతటి ప్రమాదమో గుర్తించాలి. అధికార వ్యవస్థల కన్నుగప్పే విధంగా ఈ–కామర్స్ వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా విదేశాల నుంచి మొక్కలను, విత్తనాలను ఆర్డర్ చేయకుండా చైతన్యంతో మెలగాలి.విదేశీ నత్తలతో ముప్పు!ఓ కోస్తా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మంచినీటి నత్త జాతికి చెందిన గోల్డెన్ ఆపిల్ స్నెయిల్ను విదేశాల నుంచి తెప్పించి సిమెంటు తొట్లలో పెంచుతూ పట్టుబడ్డాడు. దక్షిణ అమెరికా దీని స్వస్థలం. అయితే, తైవాన్, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పాకిన ఈ నత్త ఆయా దేశాల్లో తామరతంపరగా పెరిగిపోతూ స్థానిక జలచరాలను పెరగనీయకుండా జీవవైవిధ్యాన్ని, వరి పంటను దెబ్బతీయటంప్రారంభించింది.లేత వరి మొక్కలను కొరికెయ్యటం ద్వారా పంటకు 50% వరకు నష్టం చేకూర్చగలదు. ఫిలిప్పీన్స్‌లో ఏకంగా 200 కోట్ల డాలర్ల మేరకు పంట నష్టం కలిగించింది. వేగంగా పెరిగే లక్షణం గల ఈ నత్త మంచినీటి చెరువులు, కాలువలు, వరి ΄÷లాల్లో జీవవైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ వ్యక్తి ఈ నత్తలను పెంచుతూ మాంసాన్ని విక్రయించటంప్రారంభించిన విషయం తెలుసుకున్న అధికారులు అతని వద్ద ఉన్న విదేశీ నత్తలను, వాటి గుడ్లను పూర్తిగా నాశనం చేశారు.దీని వల్ల జీవవైవిధ్యానికి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో ఈ నత్తల్ని పెంచటంప్రారంభించినట్లు చెబుతున్నారు. కొరియర్ ద్వారా గాని, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి నత్తలను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అయితే, సకాలంలో అధికారులు స్పందించటం వల్ల మన వరి ΄÷లాలకు ఈ నత్తల ముప్పు తప్పింది.ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్..ఎండిన, ముక్కలు చేసిన లేదా పాలిష్ చేసిన ధాన్యాలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా చీడపీడలను మోసుకొచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఉడికించటం, స్టెరిలైజ్ చేయటం, వేపటం వంటిప్రాసెసింగ్ చేసిన ఆహారోత్పత్తుల ద్వారా మాత్రం చీడపీడలు రవాణా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి వీటికి ఫైటోశానిటరీ నిబంధనలు వర్తించవు.తేనెటీగలు, సీతాకోకచిలుకలు, మాంటిడ్స్, పెంకు పురుగులు, పుల్లలతో చేసిన బొమ్మ మాదిరిగా కనిపించే పురుగులు (స్టిక్ ఇన్సెక్ట్స్), నత్తలు వంటి వాటిని కొందరు సరదాగా పెంచుకోవటానికి కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి పంపటం లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయటం వంటి పనులు చేస్తుంటారు. వీటి ద్వారా కూడా పురుగులు, తెగుళ్లు, వైరస్లు ఇతర దేశాలకు వ్యాపించే అకాశం ఉంటుంది. న్యూజిలాండ్‌లో మూడేళ్ల క్రితం ఒక స్కూలు విద్యార్థిని ఇంట్లో పెద్దలకు తెలియకుండా అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లను పోర్చుగల్ దేశం నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసి తెప్పించుకుంది. పార్శిల్ వచ్చిన తర్వాత గమనించిన ఆమె తల్లి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారు ఆ పార్శిల్‌ను జాగ్రత్తగా తీసుకెళ్లి పరీక్షించి చూశారు.ఆ దేశంలో అప్పటికే ఉన్న అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్స్ గుడ్లతో పాటు కొత్త రకం ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లు కూడా ఆ పార్శిల్లో ఉన్నాయని గుర్తించి నాశనం చేశారు. ఈ విద్యార్థిని తల్లి చైతన్యం మెచ్చదగినది.సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు!ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా వస్తువుల వ్యాపారం (ఈ–కామర్స్) గతమెన్నడూ లేనంత జోరుగా సాగుతున్న రోజులివి. సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు జరుగుతున్నాయి. 2022లో ఏకంగా 16,100 కోట్ల పార్శిళ్ల కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయి. కరోనా కాలంలో 20% పెరిగాయి. ఇప్పుడు వార్షిక పెరుగుదల 8.5%. 2027 నాటికి ఏటా 25,600 కోట్ల పార్శిళ్లు ఈ కామర్స్ ద్వారా బట్వాడా అయ్యే అవకాశం ఉందని అంచనా.- అమెరికాలోని ఓ తనిఖీ కేంద్రంలో ఈ–కామర్స్ పార్శిళ్లుముఖ్యంగా అసక్తిగా ఇంటిపంటలు, పూల మొక్కలు పెంచుకునే గృహస్తులు చిన్న చిన్న కవర్లలో విత్తనాలను విదేశాల్లోని పరిచయస్తులకు పోస్ట్/ కొరియర్ ద్వారా పంపుతుంటారు. విదేశీ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటూ ఉంటారు. విదేశాల నుంచి విత్తనాలు, ఉద్యాన తోటల మొక్కలు, అలంకరణ మొక్కలు, వాటితో పాటు వచ్చే మట్టి, అలంకరణ చేపలు, చెక్కతో చేసిన వస్తువులు, యంత్రాల ప్యాకింగ్‌లో వాడే వుడ్ ఫ్రేమ్‌ల ద్వారా పురుగులు, తెగుళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి రవాణా అవుతూ అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి.కరోనా కాలం నుంచి ప్రపంచ దేశాల మధ్య పార్శిళ్ల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటంతో నియంత్రణ వ్యవస్థలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. మన దేశంలో నియంత్రణ వ్యవస్థలను నేటి అవసరాలకు అనుగుణంగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కాలుష్య జలాలతో సాగు.. ఆరోగ్యానికి కీడు!
హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో ఒకప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడిన మంచినీటి చెరువులు జల కాలుష్యం వలన ప్రస్తుతం మురికి నీటి కూపాలుగా మారిపోయాయి. ఈ మురికినీటితో కూర కాయల సాగు అనేది విరివిగా జరుగుతోంది. ఈ విధంగా కూరగాయల సాగు చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 11 చెరువులను పునరుద్ధరించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కలుషితం అయిన చెరువు నీటితో కూరగాయలను సాగు చేయడం వలన కూరగాయల లోనికి రసాయన కాలుష్య కారకాలు ప్రవేశించి ఆహారపు గొలుసు ద్వారా ‘బయో మాగ్నిఫికేషన్’ చెందడం వలన అనేక అనారోగ్య, పర్యావరణం సమస్యలు తలెత్తుతాయి.భారతదేశం అంతటా... ముఖ్యంగా దేశంలోని పెద్ద మెట్రోపాలిటన్ నగరాలలో, లెక్కలేనన్ని సంఖ్యలో రైతులు తమ పంటలను శుద్ధి చేయని మురుగునీటితో పెంచుతున్నారు. ఉపరితల నీటికి శుద్ధి చేయని వ్యర్థపదార్థాలు వచ్చి కలిసినట్లయితే ఆ నీరు కలుషితం అవుతుంది. ఈ కలుషితమైన నీటిని రైతులు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. దీని వలన డయేరియా, చర్మవ్యాధులు, కంటి వ్యాధులు వంటివి రైతులకు సంక్రమించే అవకాశం ఉంది. కలుషిత నీటితో వ్యవసాయం చేయడం వలన వ్యవసాయ భూములను సారవంతం చేసే విలువైన సూక్ష్మజీవులు, డీకంపోజర్స్, వానపాములు వంటివి నశించిపోయి సారవంతమైన వ్యవసాయ భూమి నిస్సత్తువ వ్యవసాయ భూమిగా మారిపోతుంది.శుద్ధి చేయని వ్యర్థ జలాల వలన వ్యర్థ జలాలలోని భారీ లోహాలు మొక్కలను విషపూరితం చేస్తాయి. అలాగే ఇది ఆహార కాలుష్యానికి దారితీస్తుంది. అదేవిధంగా ఈ కూరగాయలలో విటమిన్లు లోపిస్తాయి. శరీరంలో రసాయన కాలుష్యకారకాలు పేరుకుపోతాయి. దీని ఫలితంగా క్యాన్సర్లు, జన్యు ఉత్పరివర్తనలు, పోషకాహార లోపం ఏర్పడవచ్చు.2000 నుండి 2003 వరకు పరిశోధన ప్రాజెక్ట్‌లో భాగంగా యూకే డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఢిల్లీలోని వివిధ మార్కెట్ల నుండి ఆజాద్‌పూర్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌నుండి సేకరించిన బచ్చలికూరలో భార లోహాల కాలుష్యాన్ని గుర్తించింది.2015 అధ్యయనంలో, భారతీయ పరిశోధకుల బృందం ఢిల్లీలోని ఐదు మార్కెట్లలో కూరగాయలలో కాడ్మియం, సీసం, జింక్, రాగి అవశేషాలను అంచనా వేసింది. విషపూరిత కలుషితాలకు గురైన కూరగాయలు, పండ్లు వంటి ప్రాథమిక ఉత్పత్తులను పరీక్షించడానికి ఈ రోజు వరకు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఇండియాకు లేదు. ఆహార రంగంలో నియంత్రణాపరమైన పర్యవేక్షణ లేకపోవడం, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో నిరంతర వైఫల్యం భారతదేశ రైతులు, ఆహార కంపెనీలకు ఇబ్బందిగా మారింది.రైతులు తమ పంటలను పెంచడానికి మురుగునీటిని ఉపయోగించటానికి కార ణాలు అనేకం: వేగవంతమైన జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ఆహారం కోసం పెరుగుతున్న డిమాండ్, తీవ్రంగా క్షీణిస్తున్న స్వచ్ఛమైన నీటి నిల్వలు. భూగర్భ జలాలు పడిపోవడం వలన బోర్లు పడక రైతులు కలుషితమైన నీటితో వ్యవసాయం చేస్తున్నారు.నీరు కాలుష్యమయం కాకుండా ఉండటానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. పండగల సందర్భాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను మంచినీటి చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితం అవుతోంది. దీనికి మంచి ఉదాహరణ హుస్సేన్ సాగర్. అందువల్ల మట్టి బొమ్మలనే నిమజ్జనం చేయాలి. గృహ వ్యర్థాలను, పారిశ్రామిక వ్యర్థాలను మంచి నీటి చెరువులలోనికి విడుదల చేయకూడదు. చెరువులను కబ్జా చేసి నివాస స్థలాలుగా మార్చడాన్ని నిరోధించాలి.డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను అవలంబించాలి. కలుషితమైన చెరువులను పునరుద్ధరించి తిరిగి మంచినీటి చెరువులుగా మార్చాలి. కలుషితమైన నీటితో వ్యవసాయ చేసే ప్రదేశాలను గుర్తించి అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మంచి నీటి చెరువులు విలువైన సహజ సంపద కాబట్టి ప్రభుత్వం, ప్రజలు సమష్టి కృషితో వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.– డా. శ్రీదరాల రాము, వ్యాసకర్త ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, 9441184667 -
CABI: 'కాబి' ఉచిత డిజిటల్ టూల్స్..
అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్’ (సిఎబిఐ – కాబి) రైతులకు అవసరమైన ప్రామాణికమైన శాస్త్రీయ సమాచారాన్ని తన వెబ్సైట్, యాప్‌ల ద్వారా తెలుగులో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత 110 సంవత్సరాల నుంచి పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై పరిశోధనలు చేస్తున్న ‘కాబి’తో 48 దేశాలకు చెందిన వ్యవసాయ సంస్థలు కలసి పనిచేస్తున్నాయి. మన ఐసిఎఆర్ కూడా ఇందులో మెంబరే.ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం తోడ్పాటుతో ప్లాంట్వైస్ ప్లస్ టూల్ కిట్’ పేరుతో డిజిటల్ టూల్స్‌ని ‘కాబి’ ఇటీవల తెలుగు, హిందీల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. రైతులకు, విస్తరణ అధికారులకు, డీలర్లకు, విద్యార్థులకు, పరిశోధకులకు ఇవి ఉపయోగకరం.వెబ్సైట్, అనేక యాప్‌ల ద్వారా రైతులకు శాస్త్రీయంగా సరైన సలహాలు పొందొచ్చు. ఇందులో నాలెడ్జ్ బ్యాంక్ పోస్టర్లు, కరపత్రాలు, రైతుల కోసం ఫ్యాక్ట్షీట్లు, వీడియో ఫ్యాక్ట్షీట్లు అందుబాటులో ఉన్నాయి. పంట ఆరోగ్యంపై సమాచారం తెలుసుకోవటం, పురుగుమందుల మోతాదులను లెక్కించటం, ఎరువుల అవసరాలను నిర్ణయించటం, పంట సమస్యను గుర్తించటం, చీడపీడల నియంత్రణకు పురుగుమందులను కనుగొనటం, పురుగులను– తెగుళ్లను గుర్తించే నైపుణ్యాలను మెరుగుపరచుకోవటం, చీడపీడల నియంత్రణ పద్ధతులను సిఫారసు చేయటం, తెగుళ్ల నిర్వహణపై శిక్షణ.. తదితర సమాచారం / నైపుణ్యాలను కాబి వెబ్సైట్, డిజిటల్ టూల్స్ అందిస్తాయి.కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయండిఇవన్నీ తెలుగులో ఉచితంగా అందుబాటులో ఉండటం వల్ల మహిళా రైతులు కూడా సులువుగా వాడుకునేందుకు వీలవుతుంది. ఈ వనరులను ఉపయోగించుకోవడానికి మనకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ లేదా కంప్యూటర్ /ల్యాప్‌టాప్‌తో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు.మొక్కల ఆరోగ్య సమాచారం విభాగంలో.. మన దేశానికి సంబంధించిన పంటల ఆరోగ్యం, తెగుళ్ల నిర్వహణపై సమాచారం ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ప్లాంట్వైజ్ ఫ్యాక్ట్‌షీట్ లైబ్రరీ’ అనే ఉచిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తెగుళ్ల నిర్థారణ, సురక్షిత నిర్వహణకు ఉపయోగపడే తాజా సమాచారం తెలుసుకోవచ్చు. మొక్కల రక్షణ మద్దతు విభాగంలో.. ‘క్రాప్ స్ప్రేయర్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.కాబి క్రాప్ స్ప్రేయర్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయండిసురక్షితమైన పురుగుమందులు, వాటి మోతాదును లెక్కించడానికి సహాయపడుతుంది. ‘కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్’ అనే ఉచిత వెబ్సైట్ పంట తెగుళ్లను నయం చేయటానికి స్థానికంగా నమోదైన బయో పెస్టిసైడ్స్‌ను కనుగొనటంలో, ఉపయోగించటంలో సహాయపడుతుంది. రైతులకు లోతైన అవగాహన కలిగించడం కోసం డిజిటల్ లెర్నింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. పంట తెగులు నిర్థారణ కోర్సు, పంటల చీడపీడల యాజమాన్య కోర్సు, బయోప్రొటెక్షన్ ్రపోడక్ట్స్ కోర్సు అందుబాటులో ఉంది.26న ‘బయోచార్ కార్బన్ క్రెడిట్స్’పై సదస్సు..బయోచార్ (కట్టె బొగ్గు)ను పంట వ్యర్థాలు, తదితర బయోమాస్‌తో భారీ ఎత్తున యంత్రాలతో ఉత్పత్తి చేస్తూ ‘కార్బన్ క్రెడిట్స్’ పొందుతున్న వాణిజ్య సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటువంటి సంస్థలకు మార్గదర్శకత్వం నెరిపేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రొగ్రెసివ్ బయోచార్ సొసైటీ’ ఇటీవల ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ‘బయోచార్ ఉత్పత్తి పరికరాలు–కార్బన్ క్రెడిట్స్’ అనే అంశంపై జూన్ 26న ఉ. 9.30 గం. నుంచి హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నిమ్స్‌మే ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ముఖ్య అతిథి. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 63051 71362.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సాగుకు భరోసా..!
‘వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం.. విత్తనాల తయారీ, ఉత్పత్తిలో ముందడుగు వేశాం.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విత్తనాలపై ఆధారపడి ఇప్పుడు విత్తనాలు ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం.. వివిధ రాష్ట్రాల నుంచి మన విత్తనాలు కావాలని ఇండెంట్ పెడుతున్నారు’ అని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..స్వరాష్ట్రంలో మూడు వ్యవసాయ కళాశాలలు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయమే ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ.నరసింహారావు వెటర్నటీ, కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన యూనివర్సిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరంగల్, జగిత్యాల, పాలెం (మహబూబ్‌నగర్ జిల్లా)లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలకు అనుబంధంగా వ్యవసాయ కళాశాలలను నెలకొల్పింది. గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యవసాయ విద్యనభ్యసించేవారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వ్యవసాయ కళాశాలలలో విద్యార్థులకు పరిశోధనతోపాటు బోధన జరుగుతోంది. వరంగల్‌కు వెటర్నరీ కళాశాల కూడా వచ్చింది.పెరిగిన సాగువిస్తీర్ణం..సమృద్ధిగా వర్షాలు కురవడంతోపాటు ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి అయ్యింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీటి ల«భ్యత, సాగు విస్తీర్ణం పెరిగింది. ధాన్యం, పత్తి దిగుబడి ఎక్కువగా వస్తోంది. ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేస్తున్నాం. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ అధిగ దిగుబడి సాధిస్తున్నాం. కూలీల కొరతను అధిగవిుంచేందుకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.మెరుగైన రైతుల ఆర్థికపరిస్థితి..సాంకేతికతతో పంట దిగుబడులు పెరగడంతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అధిక సాంద్రత పత్తితో రైతులు లాభసాటి సాగు చేస్తున్నారు. పత్తి తీసివేసిన తర్వాత మరో పంట సాగు చేస్తున్నారు. గతంలో పత్తి తర్వాత ఈ భూమిలో పంట వేయకుండా వదిలేసే వారు. రైతులు పెట్టుబడి కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచి్చంది. సకాలంలో పెట్టుబడి అందుతుండడంతో విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. ‡రైతుబీమా రైతు కుటుంబానికి భరోసా కల్పించింది. ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. బీమా చేయించిన రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సొమ్ము వస్తుంది.అనుబంధ రంగాలకు ప్రోత్సాహం..వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన పథకాలు అమలవుతున్నాయి. పశువైద్య, పశుసంవర్థక శాఖ ద్వారా గొర్రెల పంపిణీ పథకం చేపట్టారు. దీంతో పెంపకందారులకు ఆదాయం సమకూరుతోంది. అదేవిధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతోంది. ఉద్యానశాఖ ద్వారా పండ్ల తోటలు, ఆయిల్‌పామ్ తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్..ఏఓలు, ఏఈఓల నియామకాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఒక ఏఈఓను నియమించింది. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించేందుకు, రైతుల సందేహాలు తీర్చుకునేందుకు ప్రతి క్లస్టర్లో రైతు వేదిక నిర్మించింది. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు రైతులకు అందిస్తున్నారు.వాట్సాప్ ద్వారా రైతుల సందేహాల నివృత్తి..వారంలో రెండు రోజులు వాతావరణ పరిస్థితులు వివరిస్తుండడంతో రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటునానరు.అదేవిధంగా పీజేటీఎస్ ఏయూ యూట్యూబ్ చానల్ ప్రారంభించి సాగులో అవలంబించాల్సిన పద్ధతులను వివరిస్తున్నారు. వాట్సా ప్ ద్వారా కూడా రైతుల సందేహాలు తీరుస్తున్నాం.మేలైన వంగడాల వృద్ధి..రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుములు, పెసర, కుసుమ, నువ్వు తదితర మేలు రకమైన వంగడాలు వృద్ధి చేశాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1010 వరి రకానికి ప్రత్యామ్నాయంగా కునారం సన్నాలు, జేజీఎల్–2423 వంగడాలను తీసుకొచ్చాం. బీపీటీ–5204కు ప్రత్యామ్నాయంగా షుగర్ లెస్ వరి విత్తనం ఆర్ఎన్ఆర్–1504 (తెలంగాణ సోనా)ను రైతులకు అందుబాటులోకి తెచ్చాం. కందిలో ఎల్‌ఆర్‌జీ–41కి ప్రత్యామ్నాయంగా డబ్ల్యూజీఎల్–97 వంటి విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడు మన విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల రైతులు సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మే 24న విత్తన మేళా నిర్వహించి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం.విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం.. విలువ ఆధారిత ఉత్పత్తులు సాధించేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. పంట ఉత్పత్తులకు విలువను జోడిస్తే రైతుకు అధిక ఆదాయం వస్తుంది. ఉదాహరణకు మిర్చి, పసుపును పొడిగా మార్చి విక్రయిస్తే రైతులకు అధిక ఆదాయం వస్తుంది. భవిష్యత్‌లో ఈ విధానం పెద్ద ఎత్తున ఆచరించే అవకాశముంది. తాండూరు కంది పప్పు జీఐ ట్యాగ్ సాధించింది.రైతుల వద్దకే వ్యవసాయ అధికారులు..జిల్లాల పునర్విభజన తర్వాత రైతుల ముంగిటికి జిల్లా వ్యవసాయf అధికారులు వస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారుల సంఖ్య గతంలో కంటే పెరిగింది. తద్వారా రైతులకు వ్యవసాయ అధికా రుల సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఏజీ హబ్ ద్వారా గ్రామీణ ప్రాంత యువ రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం.– డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, సహ పరిశోధన సంచాలకుడు -
సాగు పరిశోధనల్లో 'ఏఐ'
సాక్షి, అమరావతి: పంటల సాగులో కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యాన పరిశోధక విద్యార్థులు (రీసెర్చ్ స్కాలర్లు) బాటలు వేస్తున్నారు. పరిశోధనా స్థానాల్లో శాస్త్రవేత్తల కృషికి ఊతమిచ్చేలా సాగుతున్న వీరి పరిశోధనలు సత్ఫలితాలిస్తున్నాయి. చీడపీడల నివారణ, వంగడాల అభివృద్ధితో పాటు కృత్రిమ మేథస్సు (ఏఐ) ద్వారా పంట కీటకాల వర్గీకరణ, గుర్తింపు, నానో జీవ రసాయనాల ద్వారా కీటకాల నియంత్రణా చర్యలు, మార్కర్ టెక్నాలజీ ద్వారా పరమాణు స్థాయిలో అంచనా వేయడం వంటి నూతన ఆవిష్కరణలు, పలు రకాల సాగు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను వారు చూపిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పాటు సంప్రదాయేతర పంటలైన అవకాడో, స్ట్రాబెర్రీ, గోల్డెన్ బెర్రీ, చియా, లిసియాంతస్, ట్యూలిప్స్ వంటి పంటలను మన వాతావరణానికి అనుకూలంగా లాభసాటి సాగుకు ఉన్న అవకాశాలను విశ్లేషిస్తున్నారు. అత్యాధునిక పరికరాలు, రసాయన విశ్లేషణ సాధనాలతో పాటు క్రోమోటోగ్రఫీ, ఫోటోమెట్రీ డీఎన్ఏ యాంప్లిఫికేషన్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈ పరిశోధనలు సాగుతున్నాయి. సీసీఆర్ (నాగ్‌పూర్), ఐఐహెచ్ఆర్ (బెంగళూరు), ఎన్ఆర్సీ (త్రిచీ), ఐఐవీఆర్ (వారణాశి), డీఎఫ్ఆర్ (పూణే), ఐఐఓపీఆర్ (ఆయిల్ పామ్) వారి సహకారంతో వీరు సాగిస్తున్న పరిశోధనలు రైతు క్షేత్రాల్లో విజయవంతమవుతున్నాయి. అడవిజాతి వంగతో సంకరం.. గోదావరి జిల్లాల్లో వంకాయలో ప్యూసెరియం విల్ట్ వ్యాధి, కాయతొలిచే పురుగు అధికంగా ఉంటుంది. రైతులకు తీవ్ర నష్టానికి గురిచేస్తున్న ఈ సమస్య పరిష్కారానికి స్థానిక వంకాయ (సోలనం మెలోంగెనా)తో అడవి వంకాయ జాతులను అంటుకట్టుటపై పరిశోధన చేశా. సోలనమ్ తోర్వుం అనే అడవి జాతి రకం వంకాయలో రోగ నిరోధక శక్తి అత్యధికంగా ఉంది. ఇలా చేయడంవల్ల వంకాయలో వచ్చే ప్యూసెరియం విల్ట్ వ్యాధిని, కాండం తొలిచే పురుగును పూర్తిగా అరికట్టవచ్చు. – ఎం. జస్మిత, పీహెచ్డీ విద్యార్థి టిష్యూ కల్చర్ ద్వారా పూలసాగు ప్రజ్వల రకానికి చెందిన లిల్లీ పువ్వులపై పరిశోధనలు చేశా. పువ్వుల భాగాల నుంచి టిష్యూ కల్చర్ (కణాజాల ప్రవర్థనం) ద్వారా మొక్కలు ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నా. అలాగే, నాణ్యమైన నాటు దుంపల సాగులో దిగుబడి నష్టాలకు గురిచేస్తున్న నెమటోడ్ల సమస్యకు పరిమిత జన్యు వైవిధ్యం కారణంగా గుర్తించాం. కణజాల ప్రవర్థనం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని నిరూపించా. – పీ.ప్రణతి, పీహెచ్డీ విద్యార్థి వైరస్ నిరోధక టమాటా, బెండ రకాల అభివృద్ధి ‘లీఫ్ కర్ల్’ వైరస్ నిరోధక హైబ్రీడ్ రకం టమాటాతో పాటు వైరస్ తెగులు (వైవీఎంవీ)ను తట్టుకునే కొత్త రకం హైబ్రీడ్‌ను అభివృద్ధి చేశా. పర్యావరణంలో అసాధారణ మార్పులను తట్టుకుంటూ నాణ్యమైన దిగుబడినిచ్చేలా వీటిని తీర్చిదిద్దాం. – టి. నవీన్‌కుమార్, పీహెచ్డీ విద్యార్థి రైతులకు మేలు చేకూర్చే పరిశోధనలు స్నాతకోత్తర విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పరిశోధనల్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. వంగడాల అభివృద్ధి, నూతన పంటల అనూకూలత, కృత్రిమ మేథస్సు ద్వారా తక్కువ సమయంలో కీటకాలను గుర్తించి వర్గీకరించడం, నానో టెక్నాలజీ, డ్రోన్స్ ద్వారా పురుగు మందుల దు్రష్పభావాలను తగ్గించే దిశగా చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇవి రైతులకు ఎంతగానో మేలు చేకూర్చేలా ఉన్నాయి. – డాక్టర్ టి. జానకీరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏఐ ద్వారా కీటకాల గుర్తింపు ఏఐ ద్వారా కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్‌ల (సీఎన్ఎన్) ఆధారంగా ఉద్యాన పంటల కీటకాల గుర్తింపు, వరీ్గకరించేందుకు కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఉద్యాన పంటల కీటకాలను ముందస్తుగా గుర్తించడంవల్ల వాటిని నియంత్రించడమే కాదు.. వాటి ద్వారా వచ్చే తెగుళ్ల అణిచివేతకు కూడా సత్వర నివారణా చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని పరిశోధనలో గుర్తించా. – సాయికుమార్, పీహెచ్డీ విద్యార్థి -
36 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో 36 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదికను అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 28.99 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.86 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 49.15 శాతం పత్తి సాగైందని నివేదిక వెల్లడించింది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.39 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 2.80 శాతంలో వరి సాగైందని తెలిపింది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2 లక్షల ఎకరాల్లో (21.25%) సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.23 లక్షల ఎకరాల్లో (54.18%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, 87,179 ఎకరాల్లో సాగైందని వెల్లడించింది. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 92 శాతం సాగు... రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాల్లో 92.05 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 82.86 శాతం విస్తీర్ణంలో, నారాయణపేట్‌లో 55.85 శాతం విస్తీర్ణంలో సాగ య్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 2.41 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలు కాగా, కేవలం 5,474 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగ య్యాయి. కాగా, రాష్ట్రంలో 3 జిల్లాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి. జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాభావం నెలకొందని వ్యవసాయశాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమో దైందని పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్ జిల్లాల్లో మాత్రం సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైంది. కాగా, మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జూన్, జూలై నెలల్లో ఇప్పటివరకు కలిపి చూస్తే సరాసరి 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కాగా, ఈ నెల లో ఐదు రోజుల్లో 29 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల జిల్లాల్లో ఏకంగా 74 శాతం చొప్పు న లోటు వర్షపాతం నమోదుకాగా, కరీంనగర్ జిల్లాలో 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మూసీ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత కేతేపల్లి: నల్లగొండ జిల్లాలోనిమూసీ ప్రాజెక్ట్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు బుధవారం రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి పెద్దగా ఇన్‌ఫ్లో లేకపోయినప్పటికీ తుపాను ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్ట్‌లో నీటిమట్టాన్ని తగ్గించాలని మూసీ అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2,466 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 641.90 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. మూసీ ప్రాజెక్టులో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.67 టీఎంసీల నీరు ఉంది. -
ప్రత్యామ్నాయ సాగుకు బ్రాండ్ అంబాసిడర్
పీవీ సతీశ్ 1987లో రిలయన్స్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసిన దూరదర్శన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తన మిత్రులతో కలిసి ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామీణ, నిరక్షరాస్య, దళిత మహిళల చేత కెమెరా పట్టించి క్రికెట్ మ్యాచ్‌లకు ఏమాత్రం తీసిపోని అంతర్జాతీయ పురస్కారాలు పొందే విధంగా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. చిరు ధాన్యాల గురించి 30 ఏళ్ల ముందు మాట్లాడినప్పుడు అందరూ వెర్రివాడని అనుకున్నా, పట్టుబట్టి వాటిని పండించడమే కాక, ఏకంగా చిరుధాన్యాలతో చేసిన వంటకాలను అందించే హోటల్‌ను ప్రారంభించిన ఆయన ధైర్యాన్ని మెచ్చు కోకుండా ఉండలేము. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రపంచం అంతా జరుపుకొంటున్న ఈ 2023 సంవ త్సరంలోనే సతీశ్ అసువులు బాయడం కాకతాళీయం. వ్యవసాయం, జీవ వైవిధ్యం, సంప్రదాయ పద్ధతులు, విత్తనాలు, మెట్ట వ్యవసాయం – ఇలా ఆయన స్పృశించని అంశమే కనపడదు. 25 ఏళ్ళ ముందు జీవవైవిధ్య జాతరలు మొదలు పెట్టి గ్రామాల్లో వాటి ఆవశ్యకతను అందరికీ తెలి సేలా చేస్తూ, వాటిలో గ్రామస్థుల భాగస్వామ్యం సాధించాడు. ప్రత్యామ్నాయ రేషన్ షాప్ అన్న కలను సాకారం చెయ్యడం కోసం గ్రామాలలో పడావుగా ఉన్న భూములలో జొన్నలను పండించి, గ్రామీణ రైతు కూలీలకు పని కల్పించి, పండిన జొన్నలను సేకరించి, తిరిగి గ్రామాలలోనే పేదవారికి తక్కువ ధరకు అందించడం అనే మహత్తరమైన కార్యక్రమాన్ని దిగ్వి జయంగా నిర్వహించాడు. జహీరాబాద్ ప్రాంతంలో రబీలో కేవలం మంచుకే పండే పంటలను ‘సత్యం’ పంటలుగా ప్రాచుర్యానికి తెచ్చి, వాటి పోషక విలువలను అందరికీ తెలియచేశాడు. అందరూ గడ్డి మొక్కలుగా తీసిపారేసే వాటిని ‘అన్కల్టివేటెడ్ ఫుడ్స్’ (సాగు చేయని ఆహారాలు)గా ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ‘ఎకనామిక్స్ ఆఫ్ ఎకొలాజికల్ అగ్రికల్చర్’ అనే ప్రాజెక్టును మొదలుపెట్టి ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు లేని పంటలను పండించే రైతుల అనుభవాలను క్రమబద్ధంగా డాక్యుమెంట్ చెయ్యడం ద్వారా వారికి ఎటువంటి సహాయం అందాలో అక్షరబద్ధం చేశాడు. కమ్యూనిటీ మీడియా ట్రస్టును ఏర్పాటు చేసి గ్రామీణ, దళిత మహిళల చేత వీడియో డాక్యు మెంట్లను తీయించడమేకాక, అంతర్జాతీయ వేదికలలో ఈక్వేటర్ ప్రైజ్ సాధించే స్థాయిలో వారిని నిలబెట్టాడు. దేశంలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను నెల కొల్పడం, కేవలం 10వ తరగతి చదివిన ఇద్దరు అమ్మాయి లతో దాన్ని నడపడం ఆషామాషీ కాదు. విత్తన బ్యాంక్ ద్వారా దాదాపు 75 గ్రామాలలో విత్తనాలను సకాలంలో అందే ఏర్పాటు చేసి మంచి పంటలు పండించుకునేలా చెయ్యడం చిన్న విషయం కాదు. బడి మానేసిన పిల్లల కోసం ‘పచ్చ సాల’ ఏర్పాటు చేసి, దానిలో పదవ తరగతి పూర్తి చేసేలోపు కనీసం ఆరు రకాల లైఫ్ స్కిల్స్‌లో ప్రావీణ్యం సంపాదించేలా వాళ్లకు తర్ఫీదు ఇప్పించి వారి కాళ్ళ మీద వాళ్ళు బతికే ధైర్యం కల్పించడంలో ఆయన పాత్ర కీలకం. పీజీఎస్ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం) వంటి ఒక ప్రత్యామ్నాయ సర్టిఫికేషన్ పద్ధ తిని మన దేశంలో తీసుకువచ్చి అమలు చేయడం, ఆర్గానిక్ ఫార్మింగ్ సొసైటీలో వ్యవస్థాపక పాత్ర అనేవి చిన్న విజ యాలు కాదు. జన్యుమార్పిడి పంటలపై అలుపెరగని పోరాటం చెయ్యడం ఆయన జీవితంలో ఒక ముఖ్య భూమిక పోషించింది. దీనికోసం ప్రత్యేకంగా సౌత్ ఎగైనెస్ట్ జెనెటిక్ ఇంజి నీరింగ్ అనే వేదికను ఏర్పాటు చేసి, చాలా దేశాలలోని స్వచ్ఛంద సంస్థలను ఒకే తాటిమీదకు తెచ్చి, అసత్య ప్రచారం చేస్తున్న కంపెనీల మాయాజాలాన్ని రుజువులతో సహా ఎండ గట్టి కొన్ని రకాలపై నిషేధం విధించే స్థాయి పోరాటం నెరిపాడు. మిల్లెట్స్ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టి, దేశంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలలో చిరుధాన్యాల మీద చర్చా వేది కలు ఏర్పాటు చేసి వినియోగదారులకు చైతన్యం కలిగించే పనిని నెత్తికెత్తుకుని ప్రపంచం దృష్టిని మిల్లెట్స్ వైపు మరల్చారు.ఇన్ని వైవిధ్యభరితమైన పనులతో నిమిషం తీరిక లేని జీవితం గడిపిన సతీశ్ మన వ్యవసాయ రంగం గురించి కన్న కలలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే సాకారమవుతున్నాయి. ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులకే ఒక బ్రాండ్‌గా నిలిచారు సతీశ్. ఆయన ప్రస్థానంలో నాకూ భాగం కల్పించిన ఆ ప్రియ మిత్రుడికి అశ్రు నివాళి. సక్ఖరి కిరణ్ వ్యాసకర్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వికాస స్వచ్ఛంద సంస్థ -
డాబాపై డ్రాగన్ తోట
రాజాం: ఆయనొక సాఫ్ట్వేర్ ఉద్యోగి. వ్యవసాయమంటే మక్కువ. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో తల్లిదండ్రుల సాయంతో విదేశాల్లో బాగా కలిసివస్తున్న డ్రాగన్ పంట సాగుపై దృష్టిసారించాడు. ఆ పంటకు ఇక్కడ ఉన్న డిమాండ్ గుర్తించాడు. వేసిన పంట ద్వారా ఫలసాయం పొందాలని భావించాడు. ఏకంగా తన ఇంటి డాబానే వ్యవసాయ క్షేత్రంగా మలిచాడు. వందకు పైగా మొక్కలు నాటాడు. సస్యరక్షణ చర్యలు చేపట్టాడు. డ్రాగన్ తోట ఏపుగా పెరిగి దిగుబడి ఆరంభం కావడంతో... కష్టం ఫలించిందంటూ సంబరపడుతున్నాడు. ఆయనే రాజాం పట్టణం పరిధిలోని డోలపేట గ్రామానికి చెందిన సుదర్శనం అధికారి. ఆరు సెంట్ల విస్తీర్ణంలో... సుదర్శనం అధికారి విశాఖపట్నంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి రకరకాల పంటలు సాగుచేయడమంటే ఇష్టం. తల్లిదండ్రులు నర్సమ్మ, శాంతిమూర్తిల ప్రోత్సాహంతో కొంత పొలాన్ని కొనుగోలుచేసి మామిడితోటలు, జీడితోటలతో పాటు పొలాలు, ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు సాగుచేస్తుంటాడు. అదే క్రమంలో కోవిడ్ సమయంలో ఇంటి డాబాపై డ్రాగన్ పంట సాగుకు పూనుకున్నాడు. 25 స్తంభాలు ఏర్పాటుచేసి ఆరుసెంట్లు విస్తీర్ణంలో ఉన్న డాబాపై వందకుపైగా డ్రాగన్ మొక్కలు 2020లో నాటాడు. గతేడాది జూలై నెలలో పూతకు వచ్చాయి. ఒక్కో మొక్కకు 12 నుంచి 15 వరకూ డ్రాగన్ పండ్లు దిగుబడి రావడంతో పాటు నాలుగు నెలలు పాటు పూత సాగింది. ఒక్కొక్కటి 800 గ్రాముల నుంచి 900 గ్రాముల బరువు ఉన్న పండ్లు దిగుబడి వస్తున్నాయి. పోషకాలు మెండుగా ఉన్న డ్రాగన్ పండ్ల కొనుగోలుకు ప్రస్తుతం అధికమంది ఆసక్తిచూపుతున్నారు. నిరంతరం ఇద్దరు.. పొలం, ఇంటి వద్ద మొక్కల సంరక్షణకు ఇద్దరు రైతు కూలీలను నియమించాడు. ప్రతీ రెండు రోజులకు డ్రాగన్ మొక్కలకు నీరు పెట్టడం, ఏపుగా పెరిగిన కొమ్మలు తొలగించడం, పేడ గత్తం, వేప ఆకులతో సేంద్రియ ఎరువు తయారుచేసి మొక్కలపై పిచికారీ చేయడం వంటి పనులను వారు చక్కబెడుతున్నారు. డ్రాగన్ తోట సాగుతో ఇల్లు కూడా చల్లగా ఉంటోందని ఆయన చెబుతున్నారు. అభిరుచితోనే... మా ఇంటిపై ఏవో మొక్కలు వేద్దామని అనుకున్నాను. కోవిడ్ సమయంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ కావడంతో ఆలోచన వచ్చింది. నెట్లో చెక్‌చేసి డ్రాగన్ తోటలుపై దృష్టిసారించారు. ఖమ్మం నర్సరీతో పాటు రేగిడి మండలం కాగితాపల్లి వద్ద దూబ రమేష్ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చాం. రూ.2 లక్షలు వెచ్చించి తోట వేశాం. ఇప్పుడు ఇవి అందంగా ఉండడంతో పాటు సీజన్లో మంచి పూత వస్తోంది. గతేడాది రూ.1.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది. – సుదర్శనం అధికారి, డోలపేట -
సిరుల ‘పట్టు’
చిత్తూరు జిల్లా వి.కోట మండలం రామాపురం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు జి.కుమార్. ఐదెకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. ఒకసారి పంట సాగు చేయడానికి ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుండగా.. ఏటా ఐదారు పంటలు తీస్తున్నామని కుమార్ చెప్పారు. ఇలా ఐదెకరాల్లో ప్రతి పంటకూ రూ.2 లక్షల వరకు ఆదాయం లభిస్తోందని కుమార్ వెల్లడించారు. పట్టు పురుగుల పెంపకం సున్నితమైన అంశమని, చిన్న పిల్లల మాదిరిగా వాటిని పెంచుతామని వివరించారు. వాటికి తగిన ఉష్ణోగ్రత, సమపాళ్లలో వెలుతురు ఉండేలా చూసుకుంటే పట్టు పురుగుల పెంపకం కష్టమేమీ కాదన్నారు. తాను మల్బరీ సాగు చేపట్టి పట్టు పురుగులు పెంచడం చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు తాను ఏ పంటలోనూ నష్టపోలేదని కుమార్ చెప్పారు. సాక్షి, చిత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో మల్బరీ సాగు ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మూడేళ్లుగా మల్బరీ సాగు పెరుగుతూ ప్రస్తుతం.. 1,26,828 లక్షల ఎకరాలకు విస్తరించింది. 2022–23 సంవత్సరంలో మరో 12 వేల ఎకరాల్లో సాగును విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ‘సిల్క్ సమగ్ర–2’ కింద వచ్చే ఐదేళ్లలో పట్టు పురుగుల పెంపకం చేపట్టే ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని, ఇతర రైతులకు 75 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. పట్టు గూళ్లను విక్రయించే రైతులకు రూ.45 కోట్ల మేర రాయితీ చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం 13.35 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న పట్టు పురుగుల పెంపక రంగం (సెరీ కల్చర్) ద్వారా రానున్న రోజుల్లో మరింత మంది రైతుల చేత సాగు చేయించేందుకు కార్యాచరణ చేపట్టింది. గ్రామీణులకు ఉపాధి మార్గం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల సమ్మేళనంగా ప్రసిద్ధి పొందిన పట్టు పరిశ్రమ ఉపాధి ఆధారిత రంగాల్లో మొదటి స్థానంలో ఉంది. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంలో మార్కెటింగ్ తప్ప మిగిలిన కార్యకలాపాలన్నీ కుటీర పరిశ్రమగానే కొనసాగుతున్నాయి. హెక్టారు మల్బరీ సాగుతో ఏడాది పొడవునా 12 మందికి ఉపాధి కలుగుతోంది. ఈ పంట మహిళలకు ఎంతో అనువుగా ఉంటోంది. సెరీ కల్చర్‌లో చిత్తూరుకు రెండో స్థానం చిత్తూరు జిల్లాలో 37,631 ఎకరాల్లో మల్బరీ సాగవుతుండగా.. రాష్ట్రంలోనే ఈ జిల్లా రెండో స్థానంలో ఉంది. కుప్పం, పలమనేరుతోపాటు చిత్తూరు ప్రాంతంలో దీని సాగు విస్తరించింది. కుప్పం పరిధిలో 3, పలమనేరు పరిధిలో 10, చిత్తూరు పరిధిలో 2 చాకీ పురుగుల పెంపక కేంద్రాలు ఉండగా.. పెద్ద పురుగుల్ని పెంచే గదులు కుప్పం డివిజన్లో 6,500, పలమనేరు డివిజన్లో 6,000, చిత్తూరు డివిజన్లో 500 కలిపి 13 వేల వరకు ఉన్నాయి. జిల్లాలో రైతులు పండించిన పట్టు గూళ్లను వినియోగించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టు దారం తీసే కేంద్రాలను పునరుద్ధరించింది. వ్యవసాయేతర యూనిట్లు నెలకొల్పేందుకు వచ్చే ప్రైవేట్ రీలర్లకు యంత్ర సామగ్రి కొనుగోలు కోసం ప్రభుత్వం 75% రాయితీ ఇస్తోంది. -
జోరుగా రబీ సాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు జోరందుకుంటోంది. నిర్దేశించిన లక్ష్యంలో మూడోవంతు విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. మాండూస్ తుపాను ప్రభావం ఈ పంటలపై స్వల్పంగా చూపింది. రాయలసీమలోని మూడు జిల్లాల్లో కొంతమేర పంటలు దెబ్బతినగా, ఆ మేరకు ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో రెండోసారి విత్తుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు.. రబీ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచారు. అనంతపురంలో 70 శాతం సాగు రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.29 లక్షల ఎకరాలు. 2020–21లో రికార్డు స్థాయిలో 62 లక్షల ఎకరాల్లో సాగవగా, 2021–22లో 56.27 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 58లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 18 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది ఇప్పటివరకు 19.53 లక్షల ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 70 శాతం మేర రబీ పంటలు సాగవగా, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం మేర పంటలు సాగయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ పనులు ఊపందుకున్నాయి. ఈసారి వరి సాగు లక్ష్యం 20.77 లక్షల ఎకరాలు రబీలో వరి సాధారణ విస్తీర్ణం 19.72 లక్షల ఎకరాలు. గత సీజన్లో 19.52 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది 20.77లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 3.07లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతేడాది ఇదే సమయానికి 1.9 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అపరాలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. 11.75 లక్షల ఎకరాల్లో అపరాల సాగు ఇక ముతక ధాన్యాలు 8.02 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో సాగైంది. వీటిలో 1.65 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 82 వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల విషయానికొస్తే.. ఈ ఏడాది 23.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 10.85 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 7.56 లక్షల ఎకరాల్లో శనగలు, 3.07 లక్షల ఎకరాల్లో మినుములు సాగయ్యాయి. అలాగే, నూనె గింజల సాగు లక్ష్యం 3.67లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.25 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 1.05 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. ఇతర పంటల విషయానికొస్తే పొగాకు సాగు లక్ష్యం 1.75 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 87 వేల ఎకరాల్లో సాగైంది. సమృద్ధిగా ఎరువుల నిల్వలు రబీ సీజన్‌కు కేంద్రం 22.69 లక్షల టన్నుల ఎరువులు కేటాయించింది. ప్రారంభ నిల్వ 7.29 లక్షల టన్నులుండగా, గడిచిన 45 రోజుల్లో 7.82 లక్షల టన్నులను కేంద్రం సరఫరా చేసింది. డిసెంబర్ 15 నాటికి 7.94 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలకు 3.34 లక్షల టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 7.17లక్షల టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. కేటాయింపు ప్రకారం డిసెంబర్ నెలకు మరో 3.95 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. -
పురుగుమందుల వాడకంపై టార్గెట్లు వద్దు
మాంట్రియల్: ప్రపంచవ్యాప్తంగా పంట సాగులో పురుగుమందుల వాడకాన్ని తగ్గించే క్రమంలో లక్ష్యాలు విధించడం సరికాదని భారత్ పేర్కొంది. పెస్టిసైడ్స్ వాడకంపై విచక్షణను ఆయా దేశాలకే వదిలివేయాలని సూచించింది. వ్యవసాయరంగానికి సబ్సిడీలు ఇవ్వడాన్ని సమర్థించింది. జీవ వైవిధ్యంపై కెనడాలోని మాంట్రియెల్‌లో జరుగుతున్న 15వ కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్(కాప్15) ఉన్నత స్థాయి సదస్సులో శుక్రవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడారు. పురుగుమందుల వాడకం తగ్గింపు విషయంలో ప్రపంచ దేశాలపై సంఖ్యాత్మక లక్ష్యాలను విధించడం తగదన్నారు. ఆ అంశాన్ని ఆయా దేశాలకే వదిలివేయాలని అభిప్రాయపడ్డారు. 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులకు తగ్గించాలన్న గ్లోబల్ బయో డైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభాలో 17% భారత్‌లోనే ఉండగా, కేవలం 2.4% భూభాగం, 4% నీటి వనరులు మాత్రమే ఉన్నాయన్నారు. అయినప్పటికీ, జీవవైవిధ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నామన్నారు. ఎరువులు, పురుగుమందులు సహా వ్యవసాయ రంగంపై భారత ప్రభుత్వం ఏటా 2.2 లక్షల కోట్లను సబ్సిడీగా ఇస్తున్నట్లు ఒక అంచనా. కాప్15 సదస్సుకు 196 దేశాల నుంచి 20 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. -
సాగుకు భరోసా.. విరివిగా పంట రుణాలు
వ్యవసాయరంగానికి జగన్ సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల ద్వారా రైతులకు విరివిగా రుణాలు ఇస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో అంచనాకు మించి పంట రుణాలు మంజూరు చేసింది. రూ.11,957 కోట్ల వార్షిక రుణప్రణాళిక లక్ష్యంలో రెండో త్రైమాసికం ముగిసేలోపు అంటే సెప్టెంబర్ నెలాఖరుకే రూ.9,077 కోట్లతో 76 శాతం సాధించిన బ్యాంకర్లు గడువులోగా వంద శాతం సాధించే దిశగా అడుగులేస్తున్నారు. అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. విత్తు నుంచి పంట విక్రయం వరకు తోడుగా ఉంటోంది. పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో ఇప్పించి వ్యవసాయం సాఫీగా సాగేలా చూస్తోంది. ఖరీఫ్‌లో సాగుకు వీలుగా ఏటా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.3,204.24 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా 127 శాతంతో రూ.4,068.62 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం రూ.2,226.68 కోట్లు లక్ష్యంగా రబీ రైతులకు పంట రుణాల మంజూరు కొనసాగుతోంది. వ్యవసాయ టర్మ్ లోన్ల లక్ష్యం రూ.1,545.32 కోట్లు కాగా.. 121 శాతంతో రూ.1,869.81 కోట్లు మంజూరు చేశారు. ఇక అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.16.61 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల కింద రూ.92.18 కోట్లు ఇచ్చారు. ఇలా... మొత్తంగా వ్యవసాయ, అనుబంధ రంగాల కింద రైతులు, ఇతర లబ్ధిదారులకు రూ.6,047.22 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఇతరత్రా రంగాలకూ విరివిగా రుణాలు వ్యవసాయంతో పాటు ఇతర రంగాలకూ విరివిగా రుణాలు అందించారు. అందులో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం కింద రూ.795.15 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాల కింద రూ.97.61 కోట్లు, నాన్ ప్రయారిటీ సెక్టార్ కింద రూ.1,780.72 కోట్లకు గానూ 116 శాతంతో ఏకంగా రూ.2,081.90 కోట్లు మంజూరు చేశారు. ఇలా రూ.11,957.94 కోట్ల వార్షిక రుణప్రణాళిక (లోన్ క్రెడిట్‌ప్లాన్–2022–23) అమలులో భాగంగా రెండో త్రైమాసికం ముగిసేనాటికే 76 శాతంతో రూ.9,077.42 కోట్లు పూర్తయింది. 2023 మార్చి 31 వరకు గడువు ఉన్నందున ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెరిగిన బ్యాంకింగ్ నెట్వర్క్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ నెట్వర్క్ బాగా పెరిగింది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు సహకార, గ్రామీణ బ్యాంకులు దాదాపు 43 ప్రిన్సిపల్ బ్యాంకులు వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాల మంజూరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రూ.1,567 కోట్లు, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1,429 కోట్లతో పోటీపడుతూ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత యూనియన్ బ్యాంకు, కెనరాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), బ్యాంకు ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, కరూర్ వైశ్యాబ్యాంకు, ఐడీబీఐ తదితర ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. మొత్తమ్మీద చూస్తే... ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రూ.4,453 కోట్లు, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల ద్వారా రూ.4,201 కోట్లు ఇవ్వగా తర్వాత గ్రామీణ, సహకార బ్యాంకుల ద్వారా రైతులు, అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాయి. రుణాల మంజూరుకు పోటీ రైతులతో పాటు అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల పురోభివృద్ధికి ఇటీవల కాలంలో బ్యాంకర్లు పోటీ పడి రుణాలు మంజూరు చేస్తుండటం మంచి పరిణామం. దీంతో వార్షిక లక్ష్యంలో గణనీయమైన పురోగతి సాధించి గడువులోగా వంద శాతం చేరుకునే దిశగా రుణాల మంజూరు కొనసాగుతోంది. రైతులతో పాటు మహిళా సంఘాలు, విద్యా, వాహన, గృహ, పరిశ్రమలు, వ్యక్తిగత రుణాలు... ఇలా అన్నింటికీ అవసరమైన రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు మొగ్గుచూపుతున్నారు. – బి.నాగరాజారెడ్డి, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ (ఎల్డీఎం) రూ.85 వేల పంట రుణం నాకు 2.75 ఎకరాల పొలం ఉంది. బొమ్మగానిపల్లి కెనరా బ్యాంకులో రూ.85 వేల పంట రుణం ఇచ్చారు. దీని వల్ల సకాలంలో పంట పెట్టుబడికి ఉపయోగపడింది. 2021లో తీసుకున్న పంట రుణాలకు వైఎస్సార్ పంట రుణాల సున్నావడ్డీ కింద ఇటీవల రూ.3 వేల వడ్డీ రాయితీ కూడా జమ కావడం సంతోషంగా ఉంది. – విరుపాక్షి, రైతు, ముప్పాలకుంట, బ్రహ్మసముద్రం మండలం -
సరి లేదు ‘వరి’కేదీ!.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో నాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరిసాగు గత ఏడాది రికార్డును బద్దలు కొట్టింది. కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూలేనంత అత్యధికంగా ఈ వానాకాలం సీజన్లో ఇప్పటివరకు సాగవడమే కాకుండా ఇంకా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 62.12 లక్షల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ఈ నెలాఖరు వరకు సీజన్ కొనసాగనున్నందున ఇంకా నాట్లు పడతాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది (2021) కూడా రికార్డు స్థాయిలో ఏకంగా 61.94 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. ఇతర పంటలు ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయ శాఖ చెబుతున్నా..సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం, నీటి వనరులు పుష్కలంగా ఉండటం, పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో పాటు ఉచిత విద్యుత్‌తో రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈసారి ధాన్యపు సిరులు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. ఏటా పెరుగుతున్న సాగు రాష్ట్రంలో వరి సాగు ఏడాదికేడాదికీ పెరిగిపోతోంది. తెలంగాణ రాకముందు 2013లో 29.16 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఇప్పుడు అంతకు రెట్టింపు పైగానే సాగు కావడం విశేషం. ఈ ఏడాది మొత్తం 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 45 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేయాలని ప్రతిపాదించింది. అదే సమయంలో పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలుగా పేర్కొంది. బుధవారం నాటికి 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అయితే పత్తి 49.58 లక్షల ఎకరాలకే పరిమితమైంది. కీలకమైన సమయంలో వర్షాలు కురవడం వల్ల వేసిన పత్తి కూడా లక్షలాది ఎకరాల్లో దెబ్బతింది. రెండోసారి వేసే వీలు కూడా లేకుండాపోయింది. మొత్తం మీద వర్షాలు పత్తి సాగు పెరగకుండా అడ్డుకున్నాయి. దీంతో వరి సాగు గణనీయంగా పెరిగింది. కంది ప్రతిపాదిత సాగు లక్ష్యం 15 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 5.57 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, 4.29 లక్షల ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న 8.18 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 6.14 లక్షల ఎకరాల్లో సాగైంది. పంటల సాగులో నల్లగొండ టాప్.. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో వంద శాతానికి పైగా వానాకాలం సీజన్ పంటలు సాగయ్యాయి. 11.14 లక్షల ఎకరాల సాగుతో నల్లగొండ టాప్‌లో నిలిచింది. 7.75 లక్షల ఎకరాలతో సంగారెడ్డి, 6 లక్షల ఎకరాలతో వికారాబాద్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. సూర్యాపేట (5.91 లక్షలు), ఆదిలాబాద్ (5.61 లక్షలు), ఖమ్మం (5.56 లక్షలు), కామారెడ్డి (5.12 లక్షలు), నిజామాబాద్ (5.10 లక్షలు), నాగర్‌కర్నూల్ (5.10 లక్షలు) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత తక్కువగా మేడ్చల్ (20 వేలు), ములుగు (1.27 లక్షలు), వనపర్తి (2.21 లక్షలు) ఎకరాల్లో సాగయ్యాయి. నీటి వనరులు పెరగడం,ఉచిత విద్యుత్ వల్లే.. వరి రికార్డు స్థాయిలో సాగైంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ ప్రాంతంలో వరి అంతంతే. కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరంతో రిజర్వాయర్లు నిండిపోవడం, పుష్కలంగా నీటి వనరులు అందుబాటులోకి రావడం, ఉచితంగా 24 గంటలూ కరెంటు ఇస్తుండటంతో రైతులు వరి సాగువైపు మళ్లుతున్నారు. కేంద్రం కొనకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్న ధీమాతో వరి వేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ రైతుబంధు సమితి -
మరో 233.68 టీఎంసీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 233.68 టీఎంసీలు అవసరం. గతంలో ఎన్నడూ లేని రీతిలో జూలై ప్రథమార్థంలోనే కృష్ణా ప్రధాన పాయపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌తోపాటు ప్రధాన ఉపనది తుంగభద్రపై ఎగువన ఉన్న తుంగ, భద్ర, తుంగభద్ర జలాశయాలు నిండాయి. ఎగువ నుంచి వచ్చిన ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. సాధారణంగా కృష్ణా నదికి ఆగస్టులో భారీ వరదలు వస్తాయి. ఎగువన ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండటం, ఆగస్టులో కురవనున్న వర్షాలతో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ కృష్ణా ప్రాజెక్టులన్నీ నిండటం ఖాయమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా, తుంగభద్రలపై ఎగువన ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు వరద జలాలను విడుదల చేశారు. గతేడాది కంటే రెండు రోజులు ఆలస్యంగా ఈనెల 13న శ్రీశైలానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. ప్రధాన పాయపై.. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి శ్రీశైలంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో గతేడాది కంటే ఐదు రోజుల ముందే ఈనెల 23న శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తర్వాత వరద తగ్గడంతో గేట్లు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం ఎడమ, కుడిగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న జలాలు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. నాగార్జునసాగర్‌లో 204 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 108 టీఎంసీలు అవసరం. మూసీ వరద ఉద్ధృతితో పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ ఇప్పటికే గరిష్ట స్థాయిలో 40 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిండటానికి మరో ఐదు టీఎంసీలు అవసరం. విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల ద్వారా శ్రీశైలంలో ఏర్పడే ఖాళీని భర్తీ చేసేందుకు మరో 24 టీఎంసీలు అవసరం. శ్రీశైలంపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే.. ► శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తారు. ► తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ఇప్పటికే ప్రాజెక్టులో 8.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే 8.53 టీఎంసీలు అవసరం. బ్రహ్మంసాగర్‌లో 17.74 టీఎంసీలకుగానూ 12.05 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 5.69 టీఎంసీలు కావాలి. సోమశిలలో 78 టీఎంసీలకుగానూ 56.46 టీఎంసీలు, కండలేరులో 68.03కిగానూ 28.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు నిండాలంటే 60.99 టీఎంసీలు అవసరం. మొత్తమ్మీద తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన జలాశయాలు నిండాలంటే ఇంకా 75.21 టీఎంసీలు కావాలి. ► ఎస్సార్బీసీలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్‌లో 12.44కిగానూ 3.7, అవుకు రిజర్వాయర్‌లో 4.15కిగానూ 2.18 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 10.71 టీఎంసీలు అవసరం. ► గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన గండికోటలో 26.85కిగానూ 22.04, సర్వారాయసాగర్‌లో 3.06కిగానూ 0.54, పైడిపాలెంలో 6కిగానూ 4.69, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10కిగానూ 7.88 వెరసి ఈ ప్రాజెక్టులన్నీ నిండటానికి 10.76 టీఎంసీలు అవసరం. ► శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ఈ జలాశయాలన్నీ నిండాలంటే ఇంకా 96.68 టీఎంసీలు అవసరం. ► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 40 టీఎంసీలను తరలించాల్సి ఉంటుంది. కృష్ణాలో వరద ప్రవాహం అక్టోబర్ వరకూ కొనసాగే అవకాశాలు ఉండటంతో నీటి లభ్యత ఆ మేరకు పెరగనుంది. ఖరీఫ్ పంటలకు ముందుగానే నీరు ఏటా అక్టోబర్ చివరిలో, నవంబర్‌లో వచ్చే తుపాన్ల బారి నుంచి ఖరీఫ్ పంటలను కాపాడేందుకు ఈ ఏడాది ప్రభుత్వం ముందుగానే ఆయకట్టుకు నీటిని విడుదల చేసింది. తుపాన్లు వచ్చేలోగా పంట నూర్పిళ్లు పూర్తై దిగుబడులను భద్రంగా ఇంటికి చేర్చడం ద్వారా అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నీటి లభ్యత ఆధారంగా రబీ, మూడో పంట సాగుకు కూడా అవకాశం కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. పాలకుడి సమున్నత లక్ష్యానికి తగ్గట్టుగానే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటం.. నీటి లభ్యత పుష్కలంగా ఉండే అవకాశం ఉండటం.. ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం ముందుగానే నీటిని విడుదల చేయడం పట్ల రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రికార్డు స్థాయిలో పొగాకు ధర
సాక్షి, అమరావతి: పొగాకుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలకడంతో రైతులు ఈ పంట సాగుకు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత సీజన్ (2021–22)లో అంతర్జాతీయంగా పొగాకు పండించే దేశాల్లో దిగుబడి గణనీయంగా తగ్గడంతో దేశీయంగా పొగాకుకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ కారణంగా తొలిసారి బ్రైట్ గ్రేడ్‌తో సమానంగా మీడియం, లో గ్రేడ్ పొగాకు ధర పలికింది. (పొగాకును బ్రైట్, మీడియం, లోగ్రేడ్‌గా వర్గీకరించి విక్రయిస్తారు. బ్రైట్ పొగాకుకు మంచి రేటు వస్తుంది. మీడియం, లో గ్రేడ్ పొగాకుకు డిమాండ్‌ను బట్టి రేటు ఉంటుంది). 2020–21 సీజన్లో కిలోకు గరిష్టంగా రూ.193 పలుకగా, 2021–22లో రూ.245 పలికింది. అన్ని గ్రేడ్ల సరాసరి ధర 2020–21లో కిలో రూ.147.30 చొప్పున రాగా, 2021–22లో రూ.178.53 వచ్చింది. 2020–21 సీజన్లో రూ.1,661 కోట్ల టర్నోవర్ జరగ్గా, 2021–22 సీజన్లో ఇప్పటి వరకు రూ.2,061 కోట్ల వ్యాపారం జరిగింది. రాష్ట్రంలో పొగాకు సాధారణ సాగు విస్తీర్ణం 2.10 లక్షల ఎకరాలు. ప్రధానంగా ప్రకాశం, పశ్చిమగోదావరి, నెల్లూరు, కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాగవుతుంది. ప్రస్తుత సీజన్లో 130 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 115 మిలియన్ కిలోలు మార్కెట్‌కు వచ్చింది. మరో 10 మిలియన్ కిలోల వరకు వచ్చే అవకాశం ఉంది. 2022–23 సీజన్లో 142 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని పొగాకు బోర్డు నిర్దేశించింది. మంచి రేటొచ్చింది 85 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నా. ఎకరాకు ఏడు క్వింటాళ్లు వచ్చింది. 6 క్వింటాళ్లు బ్రైట్, మీడియం గ్రేడ్ పొగాకు రాగా, మరో క్వింటాల్ లో గ్రేడ్ వచ్చింది. సరాసరి ధర కిలో రూ.177 పలికింది. గతంలో ఎప్పుడూ ఇంత ధర రాలేదు. – గుండ్రాళ్ల కొండారెడ్డి, సింగరబొట్లపాలెం, ప్రకాశం జిల్లా సాగుపై ఆసక్తి పెరుగుతోంది గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సరాసరి ధర పలకడంతో రైతులు పొగాకు సాగువైపు ఆసక్తి చూపిస్తున్నారు. 2022–23లో పొగాకు ఉత్పత్తి లక్ష్యం 142 మిలియన్ కిలోలుగా నిర్దేశించాం. సాగుదారులకు బోర్డు అన్ని విధాలుగా అండగా ఉంటోంది. ఈ ఏడాది అదనంగా సాగుకు అనుమతినిచ్చాం. రాయితీపై నాణ్యమైన విత్తనం, ఎరువులందించే ఏర్పాట్లు చేస్తున్నాం. – కృష్ణశ్రీ, ప్రొడక్షన్ మేనేజర్, పొగాకు బోర్డు -
‘పంటల బీమా’లోనూ విషపు నాట్లు
చంద్రబాబు కాకుండా సీఎం కుర్చీలో ఇంకొకరు ఉంటే తన ప్రాణం ఎంతలా కొట్టుకుంటుందో ఈనాడు రామోజీరావు మళ్లీ నిరూపించుకున్నారు. చంద్రబాబు తన పాలనలో కనీసం ఊహకు కూడా తట్టని రీతిలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే కడుపు మంటతో రగిలిపోతున్న ఈనాడు.. నిత్యం అక్షరం అక్షరంలో అసత్యాలు, అభూత కల్పనలు నింపి పాఠకుల మీదకు వదులుతోంది. రైతుల పంటల బీమాకు సంబంధించి టీడీపీ హయాంలో కంటే మిన్నగా అన్నదాతలకు ప్రస్తుత ప్రభుత్వం మేలు చేస్తున్నా రామోజీ పెడబొబ్బలకు అంతులేకుండాపోతోంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి మించింది లేదని బీమా రంగ నిపుణులు కితాబిస్తుంటే.. ఈనాడు మాత్రం జనాల మెదళ్లలో విషపు నాట్లు వేస్తోంది. ఊసరవెల్లి సైతం సిగ్గుతో తలదించుకునేలా ఉన్న రామోజీ తాజా వంటకం ‘పంటల బీమా అగమ్యగోచరం’పై నిజానిజాలు ఇవిగో.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1965లో కేంద్రం తీసుకొచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం ఆ తర్వాత వివిధ రూపాలు మార్చుకుని ప్రస్తుతం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకంగా అమలవుతోంది. అధిక ప్రీమియంతో ఇందులో చేరేందుకు సన్న, చిన్నకారు రైతులు ఆసక్తిచూపే వారుకాదు. ఆర్థిక స్థోమత, అవగాహనలేక లక్షలాది మంది రైతులు తమ పంటలకు బీమా చేయించుకోలేక విపత్తుల బారిన ప్రతిసారీ రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయే వారు. అలాగే, బీమా చేయించుకున్న వారు సైతం ఆ సొమ్ములు ఎంతొస్తాయో.. ఎప్పుడొస్తాయో? తెలీక ఏళ్ల తరబడి నిరీక్షించేవారు. టీడీపీ హయాంలో కూడా కేంద్ర పథకాలపై ఆధారపడి పంటల బీమా వర్తింపజేశారే తప్ప ఏనాడు సన్న, చిన్నకారు రైతులకు లబ్ధిచేకూర్చాలనే ఆలోచన చేయలేదు. దీంతో గడచిన టీడీపీ ఐదేళ్ల పాలనలో సగటున 20.28 లక్షల మంది రైతులు మాత్రమే 23.57 లక్షల హెక్టార్లకు బీమా చేయించుకోగలిగే వారు. తొలి రెండేళ్లు వ్యవసాయ ఇన్సూరెన్స్ స్కీమ్, ఆ తర్వాత పీఎంఎఫ్‌బీవై అమలుచేశారు. దీనికింద 2016–17లో 20.44 లక్షల హెక్టార్లు (17.79 లక్షల మంది), 2017–18లో 24.28 లక్షల హెక్టార్లు (18.22 లక్షల మంది), 2018–19లో 25.99 లక్షల హెక్టార్లకు (24.83 లక్షల మంది) బీమా చేయించుకోగలిగారు. ప్రీమియం రూపంలో ఈ మూడేళ్లలో రైతులు చెల్లించిన ప్రీమియం.. 2016–17లో రూ.347.96 కోట్లు, 2017–18లో రూ.261.29 కోట్లు, 2018–19లో రూ.262.42 కోట్లు చెల్లించారు. హుద్‌హుద్ వంటి పెను తుపానుతో సహా కరువు కాటకాలతో రూ.వేల కోట్ల పంటలను కోల్పోయిన రైతులకు టీడీపీ ఐదేళ్లలో దక్కిన పరిహారం రూ.30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు మాత్రమే. 2014–16 మధ్య అగ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 5.38 లక్షల మందికి రూ.671.94 కోట్ల బీమా దక్కితే.. 2016–19 మధ్య పీఎంఎఫ్‌బీవై కింద 25.47లక్షల మందికి రూ.2,739.26కోట్ల బీమా దక్కింది. కానీ, ఈ వాస్తవాలపై ఈనాడులో ఏనాడు చిన్న వార్త కూడా రాసిన పాపాన పోలేదు. పైసా భారం పడకుండా ఉచితంగా బీమా.. ఇక రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఈ–పంట’లో నమోదే ప్రామాణికంగా పైసా భారం పడకుండా రైతులందరికీ వర్తింపజేస్తోంది. క్లెయిమ్ సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది. ఈ తరహా స్కీమ్ దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడాలేదని బీమా రంగ నిపుణులే చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఐసీఎల్) ఏర్పాటుచేసి చరిత్ర సృష్టించింది. ఈ–పంటలో నమోదైన నోటిఫైడ్ పంటలకు సీజన్ ముగియకుండానే బీమా పరిహారం అందిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 2019–20 సీజన్లో 45.96 లక్షల హెక్టార్లు సాగుచేసిన 49.81 లక్షల మంది బీమా పరిధిలోకి రాగా, వారితో బీమా చేయించగలిగారు. అదేవిధంగా 2020–21లో 61.75 లక్షల హెక్టార్లు సాగుచేసిన 71.30 లక్షల మందీ బీమా పరిధిలోకి వచ్చారు. టీడీపీ హయాంతో పోల్చుకుంటే 198.57 శాతం రైతులు.. 128.51 శాతం విస్తీర్ణం పెరిగింది. ఇక టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి కేవలం రూ.3,411.20 కోట్ల పరిహారం మాత్రమే చెల్లిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలోనే ఏకంగా 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల పంటల బీమా చెల్లించింది. అంతేకాక.. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి అండగా నిలిచింది. కానీ, ఇవేమీ రామోజీకి కన్పించడంలేదు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధిచేకూర్చగా, 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. రికార్డు స్థాయిలో పరిహారం ఇవ్వడమే నేరమా? సాధారణంగా నోటిఫై చేసిన పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారంగానే నష్టాన్ని అంచనా వేసి బీమా పరిహారం ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలా దిగుబడి ఆధారంగా 22, వాతావరణ ఆధారిత 9 పంటలకు బీమా వర్తిస్తుంది. గ్రామం, మండలం, జిల్లా యూనిట్‌గా నోటిఫై అయిన దిగుబడి ఆధారిత పంటలకు గడిచిన ఏడేళ్ల సగటు దిగుబడి కంటే వాస్తవ దిగుబడి తక్కువగా ఉంటే నిర్ధేశించిన పరిహారాన్ని చెల్లిస్తారు. అలాగే.. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తేమ, గాలి, డ్రైస్పెల్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సగటు దిగుబడి కంటే తక్కువ దిగుబడి వచ్చే వాతావరణ ఆధారిత పంటలకు బీమా చెల్లిస్తారు. ఈ వాస్తవాలు ఈనాడుకు తెలియనివి కాదు. ఇక ఖరీఫ్–21లో రికార్డుస్థాయిలో 15.61 లక్షల మంది రైతులకు 36.99 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న 26 పంటలకు రూ.2,977.82 కోట్ల పరిహారాన్ని ప్రస్తుత వైఎస్సార్సీపీ సర్కారు అందించింది. ఈ సీజన్లో దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 8.48 లక్షల మంది రైతులకు రూ.2,143.85 కోట్ల మేర బీమా చెల్లిస్తే, వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి 7.13 లక్షల మంది రైతులకు రూ.833.97 కోట్ల పరిహారం చెల్లించారు. అలాగే, ఖరీఫ్–21లో సాగైన నోటిఫైడ్ పంటల విస్తీర్ణంలో దాదాపు సగానికిపైగా విస్తీర్ణానికి పరిహారం దక్కింది. ఇలా ఒక సీజన్లో ఇన్ని లక్షల మంది రైతులకు ఇంత పెద్దఎత్తున పరిహారం ఇచ్చిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. కానీ, ఇవేమీ రామోజీకి కనిపించవు. కారణం చంద్రబాబు సీఎంగా లేరు కాబట్టి. వాస్తవాలు ఇలా కళ్లెదుట కన్పిస్తుంటే.. టీడీపీ హయాంలో అరకొరగా పరిహారం దక్కినా నోరుమెదపని రామోజీ నేడు ఏదో జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతూ నిత్యం రోతరాతలతో రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. సీజన్ ముగిసే వరకు ఈ పంట నమోదుతో పాటు ఈ–కేవైసీకి అవకాశం కల్పించినప్పటికీ ఈ–పంట, ఈ–కేవైసీకి పొంతన లేదంటూ కాకిలెక్కలతో పొంతన లేని రాతలు రాస్తున్నారు. పంటల బీమాలో అగమ్యగోచరమేమీ లేదు ఖరీఫ్–2021 సీజన్‌కు సంబంధించి జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం నోటిఫై చేసిన పంటలను సాగుచేస్తూ ఈ–పంటలో నమోదై ఈ–కేవైసీ చేయించుకున్న సాగుదారులందరికీ డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేశాం. సాగుచేసిన పంట వివరాలు, ఆధార్ వివరాలతో పాటు ఆర్బీకేల్లో తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని రైతులను చైతన్యపర్చాం. ఈ–పంటలో నమోదైన జాబితాను రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించాం. పారదర్శకతపై ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? గుంటూరు జిల్లాలో వర్షాధారంగా సాగుచేసిన మిరపపంటను వాతావరణ బీమా పథకం ద్వారా కొత్తగా ఈ ఏడాది గుర్తించినట్లుగా అవాస్తవాలను ప్రచురించడం సరికాదు. వాస్తవానికి 2016 నుంచే మిరపను వర్షాధార పంటగా ప్రకటించారు. దీంతో ఆ పంటకూ వాతావరణ ఆధారంగానే బీమా పరిహారం లెక్కించి మార్గదర్శకాలకు అనుగుణంగా చెల్లించాం. ఈ జాబితాలను సంబంధిత ఆర్బీకేల్లో ప్రదర్శించాం. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పంటల బీమా పరిహారాన్ని విడుదల చేసి రైతులను ఆర్థికంగా ఆదుకుంటే తప్పుడు కథనాలతో రైతులను గందరగోళపర్చడం సరికాదు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ -
ప్రకృతి సేద్యంలో ‘ఆచార్య’
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయం(ఏపీసీఎన్ఎఫ్)లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న రైతు సాధికార సంస్థ(ఆర్.వై.ఎస్.ఎస్.) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించనుంది. ఈ ఖరీఫ్ నుంచి రాష్ట్రంలోని ఆరు వ్యవసాయ పర్యావరణ జోన్లలోని వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో ఆర్.వై.ఎస్.ఎస్. సూచించిన రీతిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నారు. ‘అనంత’లో పర్యటన ఎంపిక చేసిన ప్రకృతి వ్యవసాయదారుల క్షేత్రాల్లో సాగు తీరుతెన్నులను నిరంతరం పరిశీలిస్తూ ఖర్చు, ఆదాయం, ఇతరత్రా ప్రయోజనాలపై ఆర్.వై.ఎస్.ఎస్.తో కలిసి కచ్చితమైన గణాంకాలను నమోదు చేసేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నద్ధమవుతోంది. ఈ సన్నాహాల్లో భాగంగా వర్సిటీ పరిశోధనా సంచాలకులు డా. ప్రశాంతి, 6 జోన్లలోని వ్యవసాయ పరిశోధనా స్థానాలకు చెందిన పది మంది శాస్త్రవేత్తలు, పలువురు రైతులు శుక్ర, శనివారాల్లో అనంతపురం జిల్లాలో పర్యటించి వర్షాధార భూముల్లో అనుసరిస్తున్న వినూత్న ప్రకృతి సేద్య పద్ధతులను పరిశీలించారు. సాధారణంగా 20 ఎం.ఎం. వర్షం కురిసిన తర్వాతే విత్తనం విత్తుకోవటం పరిపాటి. అయితే పంట వ్యర్థాలను ఆచ్ఛాదనగా వేసి వర్షాలకు ముందే విత్తనం వేయటం (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్–పీఎండీఎస్), 365 రోజులూ పొలంలో బహుళ పంటలు సాగు చేయటం అనే వినూత్న పద్ధతులను అనంతపురం జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం గత మూడేళ్లుగా పలువురు రైతులతో అనుసరింపజేస్తోంది. అనంతపురం డీపీఎం లక్ష్మణ్‌నాయక్ ఈ పద్ధతులను వర్సిటీ బృందానికి వివరించారు. ఇప్పటికే ఈ పద్ధతులను అనుసరిస్తున్న రైతుల వర్షాధార వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లి చూపించారు. మండుటెండల్లోనూ రక్షక తడుల సహాయంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఏడాది పొడవునా బహుళ పంటలు పండిస్తుండటాన్ని వర్సిటీ బృందం పరిశీలించింది. విత్తనాలు వేసిన తర్వాత శనగ పొట్టును ఆచ్ఛాదనగా పోస్తున్న దృశ్యం ఎకరానికి రూ.50 వేల ఆదాయం రైతు దంపతులు స్వయంగా పనులు చేస్తారు కాబట్టి వారి కష్టం, రక్షక తడులకు పోనూ ఎకరానికి రూ. 50 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని ఎన్జీరంగా వర్సిటీ పరిశోధనా సంచాలకులు డా. ప్రశాంతి ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయ పంటలకన్నా ఉద్యాన పంటలే రైతులకు ఈ పద్ధతుల్లో లాభదాయకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఏడాది నుంచి పీఎండీఎస్, 365 రోజులు పంటలు పండించే పద్ధతులను ఆర్.వై.ఎస్.ఎస్. సూచించిన పద్ధతుల్లో వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో కూడా సాగు చేసి ఫలితాలను క్రోడీకరిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలలో సాగు తీరును, ఖర్చు, పంట దిగుబడులను కూడా పరిశీలించి గణాంకాలను రూపొందిస్తామని తెలిపారు. పీఎండీఎస్ పద్ధతిలో నవధాన్యాల సాగును ప్రకృతి వ్యవసాయ విభాగం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేల ద్వారా రైతులకు సూచిస్తోంది. పీఎండీఎస్ అంటే? ప్రధాన పంట సాగుకు ముందు భూమిని సారవంతం చేయటానికి 25 రకాల విత్తనాలను సాగు చేస్తారు. ఈ విత్తనాలకు బంకమట్టి, ఘనజీవామృతం, బూడిద, ద్రవ జీవామృతంతో లేపనం చేసి గుళికల మాదిరిగా తయారు చేస్తారు. ఈ విత్తన గుళికలను ఎండాకాలంలో పొడి దుక్కిలోనే వర్షానికి ముందే విత్తుతారు. ఈ గుళికలు కొద్దిపాటి వర్షానికే మొలుస్తాయి. పూత దశ (45–50 రోజులకు)లో ఈ పంటను కోసి పొలంలోనే ఆచ్ఛాదనగా వేస్తారు లేదా పశువుల మేతగా ఉపయోగిస్తారు. భూమిని సారవంతం చేయటానికి పండించే ఈ పంటను నవధాన్య పంట అని కూడా అంటారు. ఈ పంటను కోయటానికి ముందే ఖరీఫ్‌లో ప్రధాన పంటగా సాగు చేయదలచిన పంట విత్తనాలను పై విధంగా గుళికలుగా చేసి విత్తుకొని ఆ తర్వాత ఈ పంటను కోస్తారు. -
World Water Day,: ‘సాగు’ మారకుంటే∙ నదులు ఎడారే
కోల్‌కతా: మన పంటల సాగు పద్ధతులు తక్షణమే మారకపోతే దేశంలోని నదులు ఈ శతాబ్దంలోనే ఎండిపోయి ఎడారిగా మారడం ఖాయమని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కల్యాణ్ రుద్ర హెచ్చరించారు. భూగర్భ జలాలు ఎప్పటికీ అంతరించిపోవని చాలామంది భావిస్తున్నారని, అందులోని ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం అనేది నదుల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పంటల సాగు పద్ధతులను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే గంగానదితో సహా ఇతర నదులు ఎండిపోతాయని వెల్లడించారు. తద్వారా మన నాగరికత ఉనికి సైతం ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో కల్యాణ్ రుద్ర మాట్లాడారు. మనదేశంలో పంటల సాగు కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలన్నారు. చెరువులు, కుంటలు విస్తృతంగా తవ్వుకోవాలని, వాననీటిని, ఉపరితల జలాలను సంరక్షించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడడం మానుకోవాలని చెప్పారు. డ్యామ్‌లు, కాలువల నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. -
వెంకన్న లడ్డూకు‘అనంత’ పప్పుశనగ
అనంతపురం అగ్రికల్చర్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రతిఒక్కరూ పరమపవిత్రంగా భావిస్తారు. అంతటి మహిమాన్వితమైన లడ్డూ తయారీకి అవసరమైన పదార్ధాల్లో చక్కెర, నెయ్యితో పాటు శనగపిండి కూడా ముఖ్యమైనది. ఇప్పుడా శనగపిండికి అవసరమైన పప్పుశనగను అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు. అంటే లడ్డూ తయారీలో అక్కడి రైతులు పండిస్తున్న పప్పుశనగకు భాగస్వామ్యం దక్కుతోంది. పూర్తిగా ప్రకృతి సిద్ధంగా సాగుచేసిన పంటను సేకరించడానికి టీటీడీ సైతం చర్యలు చేపట్టింది. ప్రకృతి వ్యవసాయ విభాగం (జెడ్బీఎన్ఎఫ్) డీపీఎం లక్ష్మానాయక్ సహకారంతో ఈనెలాఖరున అవసరమైన పప్పుశనగను వెంకన్న సన్నిధికి చేర్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. 1,396 క్వింటాళ్లకు టీటీడీ ఆర్డర్ జెడ్బీఎన్ఎఫ్ విభాగం ఆధ్వర్యంలో తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో సాగుచేసిన 185 ఎకరాల్లోని దిగుబడి ఆధారంగా 1,396 క్వింటాళ్ల పప్పుశనగకు ఇటీవల టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు డీపీఎం లక్ష్మానాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఇక్కడి రైతులు ఎకరాకు 400 కిలోలు ఘన జీవామృతం, బీజామృతంతో విత్తనశుద్ధి, ప్రతి 20 రోజులకోసారి జీవామృతాన్ని పిచికారీ చేసి పప్పుశనగ పండిస్తున్నారని తెలిపారు. ఎక్కడా రసాయనాలు, పురుగు మందులు లేకుండా పూర్తిగా ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి లాంటి వాటితో తయారుచేసిన ప్రకృతి సిద్ధమైన సేంద్రియ పోషకాలు వాడుతున్నారన్నారు. పప్పుశనగలో అంతర పంటలుగా సజ్జ, అనుము, అలసందతో పాటు ఆవాలు కూడా వేశారన్నారు. అందువల్లే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు నాణ్యమైన పప్పుశనగ దిగుబడులు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఈనెలాఖరున పంట తొలగించి నూర్పిడి చేసిన తర్వాత 1,396 క్వింటాళ్లు టీటీడీకి పంపించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కన్నా 20 శాతం అధికంగా రైతులకు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. క్వింటా ఎంతలేదన్నా రూ.7 వేలకు తక్కువ కాకుండా పలికే అవకాశం ఉందన్నారు. తిరుమల వెంకన్న ప్రసాదం తయారీకి తాము పండించిన పప్పుశనగ వినియోగించనుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని డీపీఎం లక్ష్మానాయక్ వెల్లడించారు. -
పాతాళగంగ ఉప్పొం'గంగ'
గురజాల డివిజన్లోని బొల్లాపల్లి, వెల్దుర్తి తదితర మండలాల్లో గత ఏడాది మేనెలలో భూగర్భ జలాలు భారీగా అడుగంటాయి. గతేడాది జనవరి, మే నెలల్లో డివిజన్ సరాసరి భూగర్భ జల మట్టాలు వరుసగా 11.10, 13.27 మీటర్లుగా నమోదయ్యాయి. అనంతరం జూన్ నుంచి సమృద్ధిగా వానలు కురవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గత ఆరునెలల కాలంలో సాధారణంగా 666.68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 808.93 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఇది సాధారణం కన్నా 21.33 శాతం అధికం. ప్రస్తుతం గురజాల డివిజన్లో భూగర్భ జలాలు 7.58 మీటర్లకు ఎగబాకాయి. అంటే మేనెలతో పోలిస్తే 5.69 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి ’’. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో పాతాళ గంగ పైపైకి ఎగబాకుతోంది. చుక్క నీరు కూడా లేక ఎండిన పోయిన బోర్లు నిండైన నీటి ధారతో ఉప్పొంగుతున్నాయి. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడడం, కృష్ణానదికి వరుసగా వరదలు రావడంతో జిల్లాలోని నాలుగు డివిజన్లలోనూ భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. కరువుసీమ పల్నాడులోనూ జలసిరులు ఉబికివస్తున్నాయి. ఫలితంగా సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. గత మే నెలతో పోలిస్తే.. జిల్లాలో గత ఏడాది మే నెలతో పోలిస్తే 2.89 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. గత మే నెలలో జిల్లాలో సరాసరి భూగర్భ నీటిమట్టం 8.07 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం 5.18 మీటర్లకు భూగర్భ జలాలు ఎగబాకాయి. ప్రస్తుతం న్యూజెండ్ల మండలం చింతలచెరువు గ్రామంలో 0.31 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. గురజాల డివిజన్లోని వెల్దుర్తి గ్రామంలో 46.24 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. జిల్లాలో 57 మండలాలు ఉండగా, 34 మండలాల్లో 0 నుంచి 3 మీటర్లలోపు, 18 మండలాల్లో 3 నుంచి 8మీటర్లలోపు, రెండు మండలాల్లో 8 నుంచి 15 మీటర్లలోపు, మూడు మండలాల్లో 15 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీరు అందుబాటులో ఉంది. నీటికి కటకటలాడే బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాల్లోనూ భూగర్భ జలాలు బాగా వృద్ధి చెందడం విశేషం. ఈ మండలాల్లో ఏప్రిల్ వరకు బోర్లలో నీరు వచ్చే అవకాశం పుష్కలంగా ఉండటంతో రైతులు పంటల సాగు చేపట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో మాత్రం ఒక మీటరు లోతులోపే భూగర్భజలాలు లభ్యమవుతుండడం గమనార్హం. గురజాల మండలం చర్లగుడిపాడులో ఓ వ్యవసాయ బోరు నుంచి మోటారు పెట్టకముందే నీరు బయటకు వస్తున్న దృశ్యం (ఫైల్) భూగర్భంలోకి 30.02 టీఎంసీలు గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు సగటు సాధారణ వర్షపాతం 746.08 మిల్లీమీటర్లుగా నమోదుకాగా, 820.31 మిల్లీమీటర్ల వాన కురిసింది. అంటే 9.94 శాతం అధిక సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గురజాల డివిజన్లో 21.33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాల వల్ల 333.57 టీఎంసీల నీరు జిల్లా భూమిపైకి చేరగా, అందులో 30.02 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకింది. ప్రభుత్వ చర్యల వల్లే మార్పు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలు, చెరువుల పూడిక తీత పనులు అధికమొత్తంలో చేపట్టడం సత్ఫలితాలనిస్తోందని పేర్కొంటున్నారు. ప్రజలు మరింత చైతన్యంతో వ్యవహరించి ఇంకుడు గుంతలు ఎక్కువగా తవ్వితే.. ఇంకా మంచి ఫలితాలు వస్తాయని, జిల్లాలో నీటికి కొదవ ఉండదని అధికారులు సూచిస్తున్నారు. నీటి మట్టాలు పెరిగాయి గతంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో బోర్లలోనూ నీటి మట్టం పెరిగింది. తాగు, సాగునీటి సమస్య తీరింది. బోరు నుంచి ప్రస్తుతం సమృద్ధిగా నీరువస్తోంది. ఐదెకరాల్లో మిరప, శనగ పంట సాగుచేశా. ఇప్పుడు సంతోషంగా పంటలు పండించుకుంటున్నాం. – తవనం వెంగళరెడ్డి, రైతు, రెమిడిచర్ల గ్రామం, బొల్లాపల్లి మండలం పొదుపుగా వాడుకోవాలి వర్షాలు అధికంగా నమోదు కావడంతో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయి. సాధారణ వర్షపాతం కన్నా 9.94 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో 30 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకింది. జిల్లాలో 34 మండలాల్లో 3 మీటర్ల కన్నా లోపే భూగర్భ జలాలు లభిస్తున్నాయి. రైతులు జలాలను పొదుపుగా వాడుకోవాలి. – బి నాగరాజు, ఇన్చార్జ్ డీడీ, భూగర్భ జలవనరుల శాఖ, గుంటూరు -
అడవి కాకరపై రైతన్న దృష్టి .. ఉపయోగాలెన్నో..
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అడవి కాకర (బోద కాకర) సాగుపై జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని శాస్త్రీయ నామం మైమోర్డికా డయాయిక కుకుర్బుటేసి. ఇవి సాధారణ కాకరకు అతిదగ్గర పోలికలుండగా రుచి వేరుగా ఉంటుంది. కాయ సుమారు 4 నుంచి 6 సెం.మీ. పొడవు, 30–40 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలో అధిక పోషక విలువలుంటాయి. రక్తంలోని చక్కెర శాతం తగ్గడం, కంటిచూపు వృద్ధి చెందడం, క్యాన్సర్ నుంచి రక్షణ, మూత్రపిండాల్లోని రాళ్లని కరిగించడం, మొలలను నివారించడం, అధికంగా చెమట రాకుండా చేయడం, దగ్గు నివారణ, జీర్ణశక్తి పెంచడం వంటి ఉపయోగాలు అడవి కాకర వినియోగంతో ఉంటాయి. జిల్లాలో సాగు ఇలా.. సీతంపేట, వీరఘట్టం, భామిని, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో సుమారు 20 హెక్టార్లలో అడవి కాకరను సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ. పదివేల నుంచి 20 వేల రూపాయల వరకూ ఖర్చువుతుండగా.. వెయ్యి నుంచి 1500 కిలోల దిగుబడి వస్తోంది. ఎకరా సాగు చేస్తే సుమారు రూ. 60 వేల నుంచి 80 వేల రూపాయల వరకూ రైతుకు లాభం చేకూరే అవకాశం ఉంది. మామూలు రకంకంటే ఎక్కువ రుచి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మేలైన రకాలు ఇండియా కంకొడ (ఆర్‌ఎమ్‌ఎఫ్–37) రకాన్ని జిల్లాలో సాగు చేస్తున్నారు. ఈ రకం చీడపీడలను తట్టుకుంటుంది. దుంపలను నాటితే సుమారు 35– 40 రోజులకు, అదే విత్తనం ద్వారా 70–80 రోజుల కు పంట కోతకు వస్తోంది. మొదటి సంవత్సరంలో ఎకరాకు 4 క్వింటాళ్లు, రెండో ఏటా 6 క్వింటాళ్లు, మూడో సంవత్సరం 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోంది. నేలల స్వభావం ఇది ఉష్ణమండల పంట. అధిక దిగుబడికి సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ఉష్ణ ప్రాంతాలు అనుకూలం. ఒండ్రు ఇసుక కలిపిన ఉదజని సూచిక 5.5 నుంచి 7.0 ఉండి.. సేంద్రియ పదార్ధం అధికంగా ఉన్న నేలలు సాగుకు మేలు. ఆమ్ల, క్షార స్వభావం ఉండి, మురుగునీటి వసతి లేని చౌడునేలలు సాగుకు పనికి రావు. నాటడం ఇలా.. ఎకరాకు 1.5 నుంచి 3 కిలోల విత్తనం లేదా 3000 నుంచి 5000 దుంపలు కావాలి. వేసవి, వర్షాకాలం పంటగా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా వేసవి పంటను జనవరి–ఫిబ్రవరిలో, వర్షాకాలం పంటను జూలై–ఆగస్టు నెలల్లో నాటుతారు. దుంపలు నాటేందుకు ఫిబ్రవరి–మార్చి నెలలు అనుకూలం. 2–3 విత్తనాలు ఎత్తయిన మడుల మీద 2 సెం.మీ., దుంపలైతే 3 సెం.మీ. లోతులో వరుసల మధ్య 2 మీట ర్లు, వరుసల్లో మొక్కల మధ్య 70–80 సెం.మీ. దూరం ఉండేలా నాటుకోవాలి. నీటి యాజమాన్యం: వర్షాకాలంలో నీటి అవసరం ఉండదు. బెట్ట పరిస్థితుల్లో 3–4 రోజులకోసారి పెట్టాలి. ఎక్కువ నీటిని పారిస్తే తీగలు చనిపోతా యి. మురుగునీరు నిల్వలేకుండా చూసుకోవాలి. ఎరువులు: ఎకరాకు 6 నుంచి 8 టన్నులు బాగా కుళ్లిన సేంద్రియ ఎరువులు ఆఖరి దుక్కిల్లో చేయాలి. విత్తనం లేదా దుంపలు నాటేముందు ఎకరాకు 32 కిలోల భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. 24 కిలోలో నత్రజనిని తీగ ఎగబాకే ముందు, మరో 24 కిలోల నత్రజనిని పూతకు ముందు భూమిలో వేసుకోవాలి. కలుపు నివారణ: నాటిన 24 గంటల్లోగా పిండిమిథాలిన్ 5 మి.లీటర్లు.. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే కూలీలతో, యంత్ర పరికరాలతో కలుపుతీసి పోలాన్ని శుభ్రంగా ఉండాలి. సస్యరక్షణ: అడవి కాకరను ఎక్కువగా పండు ఈగ లు, నులిపురుగులు ఆశించి నష్టం కలుగజేస్తాయి. పండు ఈగ నివారణకు ఎకరాకు 20–30 ఫిరమోన్ ఎరలను అమర్చాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే మలాథియాన్ 1.5 మి.లీ. లేదా డైక్లోరావాస్ ఒక మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నులిపురుగుల నిర్ధారణకు 5 కిలోల పాసిలోమైసిస్, ట్రైకోడెర్మా హర్జియానం, పోచానియా వంటివి ఒక టన్ను పశువుల ఎరువు – 100 కిలోల వేపపిండి మిశ్రమా నికి కలిపి 15 రోజులు నీడలో ఉంచి వృద్ధిచేసి ఎకరా పొలానికి చేసుకోవాలి. దిగుబడి మొదటి సంవత్సరం నాటిన 75–80 రోజుల్లో కోతకు వస్తుంది. రెండో సంవత్సరం మొలకెత్తిన 35–40 రోజుల్లో కోతకు వస్తుంది. కాయ లేతగా, ఆకుపచ్చని రంగులో ఉన్న ప్పుడే కోయాలి. ప్రతి రెండు రోజులకోసారి కాయలు తెంపాలి. ఆలస్యం చేస్తే కాయలు ముదిరి మార్కె ట్ విలువ తగ్గుతుంది. కాయలు తెంపేటప్పుడు తీగకు నష్టం కలుగకుండా చూడాలి. విత్తనం కోసమై తే కాయ పూర్తిగా పసుపు రంగుకు మారి, విత్తనం ఎరుపు రంగు వచ్చినప్పుడు కోయాలి. వీటిని మంచినీటిలో కడిగి నీడలో ఆరబెట్టి బూడిదతో కలిపి నిల్వ ఉంచుకోవచ్చు. అవగాహన పెంచుకొని సాగు చేయాలి అడవి కాకర సాగుపై రైతు లు ముందుగా అవగాహన పెంచుకోవాలి. ఆ తరువాత సాగు చేయాలి. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వస్తుంది. – వై.రామారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఉద్యానశాఖ, శ్రీకాకుళం -
చెరువులు నిండుగా.. రైతులకు పండగ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు, తుపానుల ప్రభావంవల్ల సమృద్ధిగా వర్షాలు కురవడంతో భారీ, మధ్య, చిన్నతరహా నీటి ప్రాజెక్టులు నిండిన తరహాలోనే చెరువులు కూడా నిండిపోయాయి. చిన్న నీటిపారుదల విభాగం కింద ఉన్న 38,169 చెరువుల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 207.53 టీఎంసీలు కాగా.. శనివారం నాటికి 148.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ చెరువుల కింద 25,60,444 ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో చెరువుల కింద ఉన్న ఆయకట్టులో తొమ్మిది లక్షల ఎకరాలకు మించి పంటల సాగుచేసిన దాఖలాల్లేవు. వర్షాభావ పరిస్థితులవల్ల చెరువుల్లోకి వరద నీరు చేరకపోవడమే అందుకు కారణం. కానీ.. ఈ ఏడాది చెరువుల్లో రికార్డు స్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో ఆయకట్టులో పంటలు సాగుచేయడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఇక రాష్ట్రంలో సగటున 859.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 998.2 మి.మీలు కురిసింది. సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఏకంగా 60.9 శాతం అధిక వర్షపాతం కురిసింది. మిగిలిన 12 జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఇలా విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉరకలెత్తాయి. దాంతో ఎన్నడూ నీటిచుక్క చేరని చెరువులు కూడా నిండిపోయాయి. దాంతో ఆయకట్టు రైతుల్లో పండగ వాతావరణం నెలకొంది. నిల్వ సామర్థ్యంలో 50 శాతం కంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్న చెరువుల కింద ఆయకట్టులో పంటలకు జలవనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో భారీఎత్తున పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. -
తెలంగాణలో నీళ్లున్నా బీళ్లాయె! ఆ భయాలతోనే ఈ పరిస్థితి తలెత్తిందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కావాల్సినన్ని నీళ్లున్నాయి. అయినా వ్యవసాయ భూములు ఖాళీగా కనిపిస్తున్నాయి. వరి వేయొద్దని సర్కారు సూచించడంతో రైతులు ఆ పంట సాగు గణనీయంగా తగ్గించేశారు. రైతుబంధు రాదనే ప్రచారం వల్ల కూడా చాలామంది వెనక్కు తగ్గారు. మరోవైపు చెరువుల కింద ఉన్న భూములకు నీరు వదలక పోవడంతో ఆ ప్రాంతాల్లో వరి నాట్లు పడలేదు. అదే సమయంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచాలన్న వ్యవసాయ శాఖ పిలుపును రైతులు పెద్దగా పట్టించుకోలేదు. వరి సాగు తగ్గడం, ప్రత్యామ్నాయ పంటల సాగు పెరగక పోవడంతో లక్షలాది ఎకరాల్లో పంట భూములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అన్ని వసతులున్నా భూములు ఖాళీగా ఉండటం ప్రమాదకరమైన ధోరణి అని, మంచి పరిణామం కూడా కాదని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోళనకరంగా సాగు యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా గత ఏడాది ఏకంగా 68.14 (187%) లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా నీళ్లున్నా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలాగే గతేడాది యాసంగి సీజన్ మొత్తం తీసుకుంటే ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాంతో పోలిస్తే ఇప్పుడు నాలుగో వంతు కూడా నాట్లు పడలేదు. పొద్దుతిరుగుడు, మినుము మినహా వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, పొద్దు తిరుగుడు, శనగ, వేరుశనగ, మినుము వంటి పంటలను సాగు చేయాలని, వాటి విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది. కొద్ది మొత్తంలో సాగయ్యే పొద్దుతిరుగుడు, మినుము మినహా మిగతా పంటల సాగు పెరగలేదు. పొద్దు తిరుగుడు సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలు కాగా, 23,881 ఎకరాల్లో సాగైంది. అలాగే మినుము సాధారణ సాగు విస్తీర్ణం కేవలం 24,018 ఎకరాలు కాగా, 70,827 ఎకరాల్లో సాగైంది. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.01 లక్షల ఎకరాలు కాగా, 3.13 లక్షల ఎకరాల్లో సాగైంది. వేరుశనగను కనీసం ఐదారు లక్షల ఎకరాలకు పెంచాలని అధికారులు భావించినా ఆ మేరకు సాగవలేదు. ఇక శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా, కొద్దిగా పెరిగి 3.27 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ల„ý ల ఎకరాల్లో వరిని నిలిపివేస్తున్నప్పుడు ఆ మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా లక్షల ఎకరాల్లో అదనంగా పెరగాలన్నది సర్కారు ఆకాంక్ష. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. కేవలం వేల ఎకరాల్లో ఉన్న చిన్నపాటి పంటల విస్తీర్ణం మాత్రమే రెండు మూడింతలు పెరిగింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వ్యవసాయశాఖ నిర్లక్ష్యం వల్లే ప్రత్యామ్నాయ పంటల సాగు అనుకున్నంత స్థాయిలో జరగలేదన్న విమర్శలున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు సకాలంలో రైతులకు చెప్పలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా అవసరమైన విత్తనాలను పూర్తిస్థాయిలో అందించలేదన్న విమర్శలున్నాయి. కొన్ని రకాల విత్తనాలను సరఫరా చేశారే కానీ, రైతులు కోరిన వెరైటీలను అందుబాటులోకి తీసుకురాలేక పోయారు. ఇదిగో ఇలా బీడుగా వదిలేసిన ఈ భూమి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన రాంరెడ్డిది. తొమ్మిదెకరాల ఈ పొలం పక్క నుంచే గూడెం ఎత్తిపోతల పథకం కాలువ ఉంది. గతంలోనే బోరుబావి కూడా తవ్వించాడు. ఏటా వరి సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం పుష్కలంగా నీరున్నా ఈ యాసంగిలో ఏ పంట వేయాలో తెలి యక ఆరెకరాలు బీడుగా వదిలేశాడు. ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనబోమని, వరి సాగు చేయొ ద్దని సూచించడంతో వరి వేస్తే ధాన్యం అమ్ముకోవ డం ఇబ్బంది అవుతుందని రెండెకరాల్లోనే వరివేశాడు. కూరగాయలు, నువ్వులు అరెకరం చొప్పున సాగు చేస్తున్నాడు. మిగతా పంటలు ఏం వేయాలో తెలియక ఆరెకరాలు ఇలా బీడుగా వదిలేశాడు. – మంచిర్యాల, అగ్రికల్చర్ మూడెకరాల వరి పొలం బీడే.. ఏటా ప్రాజెక్టు కాలువ కింద యాసంగి వరి పంట సాగు చేసుకునేది. ఈ ఏడాది వరి సాగు వద్దని ప్రభుత్వం చెప్పింది. పంట వేసుకుంటే నష్టపోవుడేనని, వేరే పంటలు వేసుకోవలన్నరు. గట్లని కంది, పెసలు, నువ్వులు వేసుకుంటే పొద్దంతా ఆవులు, రాత్రి అడవి పందులతో నష్టం ఉంటది. చుట్ట పక్కల పొలం రైతులూ వరి వేయలేదు. నా మూడెకరాల వరి పొలం కూడా ఈ ఏడాది బీడే ఉన్నది. – తోట బాపయ్య, నెన్నెల, మంచిర్యాల జిల్లా మాకు తెలిసింది వరి పంటే.. బోరుకింద ఏటా యాసంగిలో దొడ్డు వరి సాగు చేసేది. వరి పంట వేయద్దని చెప్పడంతో పోయిన ఏడాది మూడెకరాల వరి సాగు చేసుకుంటే ఈ ఏడాది ఎకరంలోనే నాటు వేసుకున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా రెండు ఎకరాలు బీడు పోయింది. ఏళ్ల తరబడి వరి పంట తప్ప ఏ పంట వేయలే. మాకు తెలిసిందల్లా వరి పంటే. – ఇజ్జగిరి చంద్రయ్య, కుందారం, జైపూర్, మంచిర్యాల జిల్లా పర్యవసానం తీవ్రంగా ఉంటుంది రైతుకు మార్కెట్లో ఎంతో కొంత మంచి ధర వచ్చేది వరితోనే. మిగతా పంటల్లో రాదు. ఇప్పుడు వరి వేయొద్దనడంతో దాన్ని నిలిపివేశారు. అలాగని మిగతా పంటలూ వేయడం లేదు. ఎవరికి వారు పంటల విరామం ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదో ఒక రకమైన నిరసన. వేరే పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడంపై కూడా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లే లెక్క. దీన్ని సాధారణమైన పరిణామం, స్థితిగా తీసుకోకూడదు. దీని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. వరి భారీగా పండుతున్న సమయంలోనే బియ్యం ధర కిలో రూ. 60కు పైగా పలుకుతోంది. ఆ మేరకు వినియోగదారుడు కొనుగోలు చేస్తున్నాడు. పంట మంచిగా పండితేనే ఆహారం అందరికీ సరిగా దొరకడం లేదు. భవిష్యత్తులో ఎలాంటి ఆహారం అందే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మున్ముందు ప్రభుత్వం మీద భారం పడుతుంది. రేషన్ బియ్యానికి డిమాండ్ 70–80 శాతానికి పెరుగుతుంది. అంతేకాదు పడావు బడ్డాక భూమి ఆరు నెలలు అలాగే ఉంటే పూర్తిగా ఎండిపోతుంది. దాని భూసారం పడిపోతుంది. వరి పండించే భూమి పడావు పడితే ఉప్పు తేలిపోతుంది. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
ధాన్యంపై దండయాత్ర!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తరువాత మొదలైన కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని జిల్లాలను సస్యశ్యామలంగా మార్చింది. పాలమూరు, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని సాగునీటి పథకాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 20 ఏళ్ల కిందట 2002–03లో వానాకాలం, యాసంగి కలిపి కేవలం 6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించిన తెలంగాణ రైతులు.. మారిన పరిస్థితుల్లో వ్యవసాయాన్ని పండుగగా చేసుకొని అధిక దిగుబడి తెస్తున్నారు. గత యాసంగి (రబీ) సీజన్లోనే ఏకంగా 92.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించే స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు నడుస్తున్న వానకాలం (ఖరీఫ్) సీజన్లో ఇప్పటివరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించారు. మరో 20–30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య ధాన్యం రగడ దేశంలో కొత్త సమస్యను తెరపైకి తెచ్చింది. రైతు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన కేంద్రం వరి విషయంలో కొత్త కొర్రీలు పెడుతోంది. కేంద్రం విధించిన ‘ఉప్పుడు బియ్యం’ ఆంక్షల చిచ్చు యాసంగి సీజన్లో వరిని రైతుకు దూరం చేస్తోంది. రైతు పండించిన ధాన్యం నుంచి సెంట్రల్ పూల్ కింద ఏయే రాష్ట్రాల నుంచి బియ్యాన్ని భారత ఆహార సమాఖ్య (ఎఫ్‌సీఐ) ఎంత సేకరించాలో ముందే నిర్ణయించి అంతకుమించి తీసుకోబోమని తెగేసి చెప్పింది. యాసంగిలో రాష్ట్రం నుంచి ఎఫ్‌సీఐకి వెళ్లే బాయిల్డ్ రైస్‌ను ఇక ముందు కిలో కూడా సేకరించబోమని స్పష్టం చేసింది. దీంతో వరి సాగు విషయంలో కొత్త ఆంక్షలు ఎదుర్కొనే పరిస్థితి ఈ ఏడాది రైతాంగానికి ఎదురైంది. యాసంగి ఉప్పుడు బియ్యం లొల్లి తెలంగాణలో వేసవి కాలంలో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ మార్పుల కారణంగా యాసంగిలో ధాన్యం దిగుబడి భారీగానే వస్తుంది. అదే సమయంలో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యం గింజ విరుగుతుంది. నూకల శాతం 35–50 శాతం ఉంటుంది. దీంతో రైతుకు నష్టం ఎక్కువ ఉంటుండటంతో యాసంగి ధాన్యాన్ని ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్)గా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి పంపించడం కొన్నేళ్లుగా సాగుతోంది. అయితే కేంద్రం ఒక్కసారిగా ఉప్పుడు బియ్యం సేకరణకు నిరాకరించింది. అందులోభాగంగా 2021 యాసంగిలో వచ్చిన 92.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి కేవలం 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో హతాశులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కేంద్రంతో సంప్రదింపులు జరిపినా.. పరిస్థితి మారలేదు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి యాసంగిలో వచ్చే 65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 24.75 ఎల్ఎంటీ మాత్రమే తీసుకుంటే కష్టమని, మిగతా బియ్యం ఏం చేసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో కేంద్రం మరో 20 ఎల్ఎంటీ అదనంగా తీసుకొనేందుకు ఒప్పుకుంది. అయితే ఇంకెప్పుడూ ఉప్పుడు బియ్యం ఇవ్వకూడదనే షరుతు విధించింది. దీంతో యాసంగిలో కొనుగోలు కేంద్రాలనే ఎత్తేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. వరిసాగు ఇక రైతుల అభీష్టం మేరకేనని స్పష్టంచేసింది. యాసంగే కాదు.. వానకాలం పంటపైనా.. యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమని చెప్పిన కేంద్రం వానాకాలం సీజన్లో పండించిన బియ్యంపైనా లక్ష్యాన్ని నిర్దేశించింది. వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు మాత్రమే ఒప్పుకోవడంతో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, టీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. మంత్రుల బృందం వారంపాటు ఢిల్లీలో ఉండి కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరిస్తామని కేంద్రం లేఖ రాసింది. పచ్చి బియ్యం ఎంతైనా కొంటామని చెప్పిన కేంద్రం తీరా ఇప్పుడు 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామని చెప్పడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. -
వరికి.. ‘సిరి’సాటి
సాక్షి, అమరావతి: మైదాన ప్రాంతాలతో పోల్చితే బోర్ల కింద వరి సాగు చేసేందుకు రైతన్నలకు వ్యయ ప్రయాసలు అధికం. సీజన్ ఏదైనప్పటికీ బోర్ల కింద వరినే ఆనవాయితీగా పండిస్తూ పెట్టుబడుల భారంతో నష్టపోతున్న అన్నదాతలను ఆరుతడి పంటల వైపు మళ్లించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామాల్లో విస్తృ్తత అవగాహన.. రాష్ట్రంలో సుమారు 12 లక్షల బోర్లు ఉండగా వాటి కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 11.25 లక్షల ఎకరాల్లో సుమారు పది లక్షల మంది రైతులు దశాబ్దాలుగా వరినే నమ్ముకున్నారు. దశల వారీగా ఆరుతడి పంటల వైపు మళ్లించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత రబీ సీజన్లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద 615 క్లస్టర్ల పరిధిలో 30,750 ఎకరాల్లో వరికి బదులు అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటల సాగును ప్రోత్సహించేందుకు రూ.11.28 కోట్లతో కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ ఫలితాలను బట్టి రానున్న రెండేళ్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఆర్బీకేల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. బోర్ల కింద సాగు చేసే రైతులతో సమావేశాలు నిర్వహించి ఆరుతడి పంటల సాగుతో చేకూరే ప్రయోజనాలపై చైతన్యం చేస్తున్నారు. వీడియో సందేశాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపిస్తున్నారు. ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు రైతుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. గ్రామ కూడళ్లలో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి అవగాహన పెంపొందిస్తున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు బోర్ల కింద ఆరుతడి పంటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందించనుంది. హెక్టార్‌కు రూ.15 వేల సబ్సిడీతో స్ప్రింకర్లు అందిస్తారు. వాటితో పాటు చిరుధాన్యాలకు రూ.6 వేలు, అపరాలకు రూ.9 వేలు, నూనెగింజలకు రూ.10 వేల విలువైన విత్తనాలు, విత్తన శుద్ధి కెమికల్స్, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలు ఆర్బీకేల ద్వారా అందజేస్తారు. రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన దాల్ ప్రాసెసింగ్ మిషన్లను 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూప్స్(ఎఫ్ఐజీ)లకు అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు పండించే గ్రూపులకు 50 యూనిట్లు చొప్పున ఇస్తారు. ఎకరం పొలంలో వరి పండించే నీటితో సుమారు 8 ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు. పైగా పెట్టుబడి కూడా సగానికి తగ్గిపోతుంది. బోర్ల కింద, ఆయకట్టు చివరి భూముల్లో వరికి బదులు పెసర, మినుము, ఉలవలు, జొన్న, వేరుశనగ వేసుకోవచ్చు. నేల స్వభావం, నీటి లభ్యత మేరకు పంటలను ఎంపిక చేసుకుని పండిస్తే మంచి దిగుబడులొస్తాయి. ఒత్తిడి లేకుండా అవగాహన రానున్న నాలుగు సీజన్లలో దశలవారీగా కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రైతులపై ఒత్తిడి లేకుండా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ పథకాలను అనుసంధానిస్తూ రాయితీలు అందిస్తున్నాం. – అరుణ్‌కుమార్,కమిషనర్, వ్యవసాయ శాఖ -
డ్రాగన్.. ‘ఫల’కరింపు
సాక్షి, తుని(తూర్పుగోదావరి): అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనుకోలేదాయన.. ఫ్రూట్‌ఫుల్‌గా ఉండే డ్రాగన్ సాగుపై దృష్టిసారించారు. ఔషధగుణాలు అధికంగా ఉండే ఈ పండ్లకు ఉన్న డిమాండ్ తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు వెళ్లి అక్కడ సాగవుతున్న పంటను వారం రోజుల పాటు పరిశీలించారు. ఈ ఏడాది ఆగస్టులో అమెరికన్ బ్యూటీషన్ (ఎంఎం గోల్డ్) రకం విత్తనం తీసుకుని ఎస్.అన్నవరంలో తనకున్న 2.40 ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. ఆయనే తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతానికి చెందిన పోలిశెట్టి రామారావు (టైల్స్ రామారావు). ఒకసారి నాటితే మూడేళ్ల నుంచి 25 ఏళ్లు ఏకధాటిగా (ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు) డ్రాగన్ ఫ్రూట్ ఫలసాయాన్ని పొందవచ్చని ఆయన చెబుతున్నారు. దీని సాగుకు మెట్ట ప్రాంత నేలలు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. సాగు ఇలా.. ఆరు అడుగులు ఎత్తులో చక్రాకారంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ లభించిన మట్టల నుంచి సేకరించిన విత్తనాన్ని సిమెంట్ స్తంభాల చట్టూ నాలుగైదు నాటుకోవాలి. మూడు నెలల్లో సిమెంట్ స్తంభాలకు విస్తరిస్తుంది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా డ్రాగన్ ఫ్రూట్ ఫలసాయం లభిస్తుంది. విస్తారంగా ఫలసాయాన్ని పొందేందుకు నవంబరు, ఫిబ్రవరి మధ్యకాలంలో వచ్చే పూతను రైతులు ఎప్పటికప్పుడు తొలగించడం ఉత్తమం. దీంతో ఫిబ్రవరి నుంచి అధికంగా ఫలసాయం లభించనుంది. తొమ్మిది నెలల్లో ఎకరాకు నాలుగు నుంచి పది టన్నులు డ్రాగన్ ఫ్రూట్స్ లభిస్తాయి. చీడపీడలు ఆశించకపోవడంతో రసాయనక ఎరువులు, మందులు వాడాల్సిన పనిలేదు. విస్తారంగా పంట విరబూసేందుకు గో మూత్రం, వివిధ రకాల ఆకులతో తయారు చేసిన కషాయాల పిచికారీ, కలుపు నివారణ, వేసవిలో రెండు రోజులకు డ్రిప్ పద్ధతిలో ఒక తడుపు వంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఎండవేడిమిని అదుపు చేసేందుకు డ్రాగన్ ఫ్రూట్ చక్రాకార సిమెంట్ స్తంభాలను ఆనుకుని సీతాఫలం మొక్కలు వేసుకోవడం మంచిది. ఫ్రూట్ తొలగించిన రెబ్బలు (మట్టలు) నుంచి రైతు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. విత్తనాన్ని విక్రయించుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అబ్బురపరిచే ఔషధ గుణాలు పుచ్చకాయ మాదిరిగా తియ్యని రుచి కలిగిన డ్రాగన్ ఫ్రూట్స్‌లో అబ్బుర పరిచే ఎన్నోపోషక విలువలు ఉన్నాయి. రక్తంలో చక్కెర నియంత్రణ, తెల్లరక్త కణాలు, ప్రేగుల్లో మంచి చేసే 400 రకాల బ్యాక్టీరియాల వృద్ధి, క్యాన్సర్, కీళ్ల నొప్పులు, మలబద్ధకాన్ని నివారించడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించడం, జీర్ణాశయ రుగ్మతలు తొలగించే పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో డ్రాగన్ ప్రూట్స్కి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. రూ.15 లక్షల పెట్టుబడి డ్రాగన్ ఫ్రూట్స్‌కు ఉన్న డిమాండ్‌తో సాగు చేయాలన్న ఆసక్తి కలిగింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండలో వారం రోజులు పంటను పరిశీలించి, సాగు, సంరక్షణ, సస్యరక్షణ తదితర విషయాలపై అవగాహన వచ్చింది. సీజన్లో ఎకరానికి నాలుగు నుంచి పది టన్నులు దిగుబడి, రూ.లక్షల్లో ఆదాయం వస్తుందని తెలుసుకున్నాను. ఆగస్టులో అమెరికన్ బ్యూటీషన్ (ఎంఎం గోల్డ్) రకం విత్తనం తీసుకువచ్చాను. 2.40 ఎకరాల్లో 12 వందల వలయాకార సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి రూ.15 లక్షలు పెట్టుబడితో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టాను. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నాను. తొలి పంట ఫలసాయం 2022 ఫిబ్రవరిలో లభించనుంది. డ్రాగన్ ఫ్రూట్స్ రుచులను స్థానికులకు అందించాలన్న ఆలోచనతో వ్యాపారులతో ఒప్పందాలకు అంగీకరించలేదు. – పోలిశెట్టి రామారావు, అభ్యుదయ రైతు, తుని -
వైవిధ్య సాగు..భలే బాగు!
‘‘అదనులో చల్లితే.. పొదల్లో పడినా పంట ఎదుగుతుంది’’అన్నది పెద్దల మాట. అనుకూల వాతావరణం ఉన్నపుడు విత్తుకుంటే ఏ పంటైనా, ఎలాంటి నేలలోనైనా మంచి దిగుబడి ఇస్తుంది అన్నది దాని అర్థం. వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయం చేయడంతోపాటు, మార్కెట్‌కు అనుకూలమైన పంటలు ఎంచుకుని సాగు చేయడం కూడా అంతే ముఖ్యం. ఇదే ఆధునిక రైతు విజయరహస్యం. అందరితోపాటు సంప్రదాయ పంటలు వేయకుండా.. మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉన్న వాణిజ్య పంటలను సాగు చేస్తూ పలువురు ఔత్సాహికులు.. వరి రైతులకు భిన్నంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆపిల్ బేర్ పంట వినూత్న వంగడాలు, వైవిధ్య పంటలను సాగు చేసి నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వేసిన పంటలను తిరిగి వేయకుండా పంటల మార్పిడి అవలంబిస్తూ నేలసారం పెంపొందిచేలా యాజమాన్య పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఇంటర్నెట్, యూట్యూబ్‌లో చూసి అరుదైన, డిమాండ్ ఉన్న పంటలను పండిస్తున్నారు. అలాంటి పంటలతో విజయాలు అందుకున్న కొందరు రైతుల విజయగాథలు ఇపుడు తెలుసుకుందాం! – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ఆపిల్ బేర్.. ఆదాయం జోర్ మూస ధోరణి పంటలకు స్వ స్తి పలికి మార్కెట్‌కు అనుగుణంగా ‘సాగు’తూ ఆదాయం గడిస్తున్నాడీ యువకుడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన వైద తిరుపతి తనకున్న భూమిలో పత్తి, వరి పంట లు సాగు చేసేవారు. పనికి తగిన ప్రతిఫలం లేకపో గా పెట్టుబడిరాని పరిస్థితి. నేల వట్టిబారి ఎందుకూ కొరగాకుండా పోయింది. ఈ నేపథ్యంలో యూ ట్యూబ్‌లో ఆపిల్ బేర్ పండ్ల పంట తిరుపతిని ఆకర్షించింది. అనుకున్నదే తడవుగా నారాయణపేట జి ల్లా నుంచి 350 మొక్కలు కొనుగోలు చేసి తన ఎక రన్నర భూమిలో నాటారు. ఈ మొక్క గరిష్ట జీవితకాలం 25 ఏళ్లు. ప్రతీ ఏటా ఆదాయమే. మొదటి సంవత్సరం లక్ష ఆదాయం రాగా క్రమేణా పెరుగుతుందని తిరుపతి ధీమాగా చెబుతున్నారు. 2017 లో మొక్కలు నాటగా ఈ సంవత్సరం రూ. 3 లక్షల ఆదాయం వచ్చిందని వివరించారు. మార్కెటింగ్ విషయంలోనూ ఇబ్బంది ఎదురవలేదు. వ్యాపారులే పంట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి బుచ్చిరెడ్డి సాగు.. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన ఎడ్ల బుచ్చిరెడ్డి కూరగాయల సాగులో లాభాలు గడిస్తున్నారు. కొద్దిపాటి పెట్టుబడితో రోజువారీ లాభం పొందుతున్నారు. ఆయనకు ఎనిమిది ఎకరాల భూమి ఉండగా మార్కెట్లో ఏయే నెలలో ఏ పంటకు డిమాండ్ ఉంటుందో గ్రహించిన బుచ్చిరెడ్డి అలాంటి కూరగాయలు పండిస్తున్నారు. రెండెకరాల్లో టమాట, వంకాయ, పచ్చి మిర్చి, కొత్తి మీర సాగు చేశారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే ఆవు పేడ, మూత్రంతో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. మాములుగా రెండెకరాలకు రూ.50వేల పెట్టుబడి అవసరమైతే.. సేంద్రియ పద్ధతిలో రూ.10 వేల ఖర్చు మాత్రమే ఉంటుంది. దీంతో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ. రోజూ 4 క్వింటాళ్ల వరకు కూరగాయలు విక్రయిస్తుండగా రూ.4 వేల ఆదాయం పొందుతున్నారు. బుచ్చిరెడ్డి ఆలోచనలో మార్పు.. ఆయనకు మంచి ఆదాయానికి మార్గం చూపింది. పంటల మార్పిడే విజయసూత్రం కోరుట్ల మండలం వెంకటాపూర్‌కు చెందిన ఈ రైతు పేరు పడాల వెంకటరాజం. మొత్తం 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తనకున్న భూమిలో ఒకసారి ఒక రకం పండించిన చోట రెండో దఫా అదే పంట సాగు చేయరు. ఎప్పటికప్పటిప్పుడు పంటలు మార్పిడి చేస్తూ.. ఎక్కువగా వాణిజ్య పంటలు సాగు చేస్తారు. వరి, మొక్కజొన్నతో పాటు అక్టోబర్‌లో మూడు నెలల్లో పండే మినుములు, జనవరిలో 15 రోజుల్లో చేతికివచ్చే నువ్వు పంట వేస్తారు. మూడు నెలల విరామం తర్వాత మూడు నెలల్లో పండే మొక్కజొన్న పంటను ఎంచుకుంటారు. మినుములతో రూ. 1.1 లక్షలు, నువ్వులతో రూ.లక్ష, మొక్కజొన్నతో రెండెకరాలకు రూ. 1.2 లక్షలు చొప్పున లాభాలు పొందుతున్నారు. ఇలా వేసవికాలం మూడు నెలలు మినహాయిçస్తూ, పంటలు మారుస్తూ దాదాపు మూడెకరాలకే ఏటా రూ.3.5 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. -
పంటల సాగులో రైతుకు స్వేచ్ఛ లేదా: చాడ
సాక్షి, హైదరాబాద్: రైతులు ఏయే పంటలు సాగుచేయాలనే విషయంలో ప్రభుత్వం శాసించడం ఏమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. వరి విత్తనాల విక్రయంపై వ్యవసాయ శాఖ నిషేధం విధిస్తూ, మరోవైపు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడాన్ని తప్పుబట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఉత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మఖ్దూంభవన్‌లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషాతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలో వరి పంట పండించుకునేందుకు రైతులు అచ్చుకట్టు వేసుకున్నారని, ఇప్పుడు వరి సాగు చేయొద్దనడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. -
శనగ విత్తనం సిద్ధం
సాక్షి, అమరావతి: రబీలో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట శనగ. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 56 లక్షల ఎకరాలు కాగా.. దాంట్లో 11.50 లక్షల ఎకరాల్లో శనగ సాగవుతుంది. 90 శాతానికి పైగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే ఈ పంట వేస్తారు. ఈ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాల్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నాణ్యత పరీక్షించి మరీ.. ఆర్బీకేల ద్వారా 2,32,577 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న వర జేజీ–11 రకం విత్తనం 2,16,880 క్వింటాళ్లు, వర కేఏకే–2 విత్తనం 15,697 క్వింటాళ్లను సిద్ధం చేశారు. సబ్సిడీ పోగా క్వింటాల్ ధర వర జేజీ–11 విత్తనం మొదటి రకం (ïసీ/ఎస్) ధర రూ.5,250, రెండో రకం (టీ/ఎల్) క్వింటా రూ.5175, వర కేఏకే–1 మొదటి రకం (సీ/ఎస్) రూ.6,660, రెండో రకం (టీ/ఎల్) రూ.6,585లుగా నిర్ణయించారు. ఎకరంలోపు భూమిగల రైతుకు బస్తా (25 కేజీలు), ఆ తర్వాత ఎకరానికి ఒకటి చొప్పున ఐదెకరాల్లోపు రైతులకు ఐదు బస్తాల చొప్పున విత్తనాలు పంపిణీ చేస్తారు. సేకరించిన విత్తనాల నాణ్యతను పరీక్షించి ధ్రువీకరించిన అనంతరమే రైతులకు అందజేస్తారు. పంట వేయకపోతే ‘భరోసా’కు అనర్హులు శనగ విత్తనం కోసం ఆర్బీకేల్లో ఈ నెల 3వ తేదీన అనంతపురం, 4న వైఎస్సార్, కర్నూలు, 5న ప్రకాశం, 10న కృష్ణా, 15న నెల్లూరు, అక్టోబర్ చివరి వారంలో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో రైతుల వివరాల నమోదుకు శ్రీకారం చుడతారు. డి.క్రిష్ యాప్ ద్వారా ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు, కౌలు రైతులను వ్యవసాయ సహాయకులు గుర్తిస్తారు. వారికి కావాల్సిన విత్తనం కోసం సబ్సిడీపోను మిగిలిన మొత్తాన్ని ఆన్లైన్లో కట్టించుకుంటారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతి ద్వారా ఈ నెల 4 నుంచి విత్తన పంపిణీకి శ్రీకారం చుడతారు. సబ్సిడీపై విత్తనం పొందిన రైతు సాగు చేసిన పంట వివరాలను విధిగా ఈ క్రాప్‌లో నమోదు చేయాలి. ఒక వేళ విత్తనం తీసుకుని పంట వేయకపోతే ‘వైఎస్సార్ రైతు భరోసా’ వంటి ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తారు. పకడ్బందీగా విత్తన పంపిణీ రానున్న రబీ సీజన్లో సొంతంగా అభివృద్ధి చేసిన శనగ విత్తనాన్ని సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు నాణ్యత ధ్రువీకరించిన విత్తనం అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
ఏపీ: ఖరీఫ్ జోరు.. అన్నదాత హుషారు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగు జోరందుకోవడంతో పల్లెలు పచ్చదనాన్ని సింగారించుకుంటున్నాయి. సీజన్‌కు ఆరంభానికి ముందే వైఎస్సార్ రైతు భరోసా (పెట్టుబడి సాయం) అందడం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయడం.. అవసరమైనన్ని ఎరువులు, పురుగుల మందుల నిల్వల్ని అందుబాటులో ఉంచడం.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. గడచిన రెండేళ్ల ఖరీఫ్ రికార్డులను తిరగరాసే దిశగా దూసుకెళ్తున్నారు. రూ.3,829 కోట్ల పెట్టుబడి సాయం సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 54 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కొక్కరికీ రూ.7,500 చొప్పున రూ.3,829 కోట్ల పెట్టుబడి సాయమందించిన రాష్ట్ర ప్రభుత్వం సాగులోæ అన్నివిధాల అండగా నిలుస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా 7.49 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు రైతులకు అందాయి. వీటిలో 45,412 ప్యాకెట్ల మిరప, 28,144 క్వింటాళ్ల మొక్కజొన్న, పత్తి విత్తనాలు ఉన్నాయి. 5.80 లక్షల టన్నుల ఎరువులు, 10 టన్నుల పురుగుల మందులను సైతం రైతులకు ఇప్పటికే పంపిణీ చేశారు. రికార్డు తిరగరాసే దిశగా.. ఖరీఫ్ చరిత్రలో రికార్డు స్థాయిలో 2019లో 90.38 లక్షల ఎకరాల్లో, 2020లో 90.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. 2021 ఖరీఫ్‌లో 95.35 లక్షల ఎకరాల్లో వివిధ పంటల్ని సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆరంభంలో కాస్త ఆచితూచి అడుగులేసిన అన్నదాతలు పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో ఇప్పుడు సాగు జోరు పెంచారు. ఇప్పటికే 42.8 లక్షల (46శాతం)ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించి నాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది 39.97 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 16.33 లక్షల (43శాతం) ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. గడచిన రెండేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ఇదే సమయానికి 2019లో 15.82 లక్షల ఎకరాలు, 2020లో 16.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఇప్పటివరకు 10.83 లక్షల ఎకరాల్లో నూనె గింజలు, 8.9 లక్షల ఎకరాల్లో పత్తి, 2.6 లక్షల ఎకరాల్లో అపరాల నాట్లు పూర్తయ్యాయి. ప్రోత్సాహం బాగుంది ఖరీఫ్‌లో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. తొలిసారి మా గ్రామంలోని ఆర్బీకే ద్వారా విత్తనాలు, ఎరువులు తీసుకున్నాను. వాతావరణం అనుకూలంగా ఉండటంతో నాట్లు పూర్తయ్యాయి. – గుంజా బసవయ్య, రైతు, కానూరు, కృష్ణా జిల్లా లక్ష్యం దిశగా ఖరీఫ్ సాగు లక్ష్యం దిశగా ఖరీఫ్ సాగు జరుగుతోంది. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతు భరోసా యాత్రలు సత్ఫలితాలనిచ్చాయి. సిఫార్సు చేసిన పంటలను సాగు చేసేవిధంగా రైతుల్లో అవగాహన కల్పించాం. గడచిన రెండేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది ఖరీఫ్ సాగవుతుందని అంచనా వేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
మన్యంలో ‘సుగంధ’ పంటల పరిమళం
సాక్షి, విశాఖపట్నం: సుగంధ ద్రవ్యాల్లో ప్రధానమైన అల్లం, పసుపు, మిరియాల పంటల సాగుకు విశాఖ మన్యం ఇప్పటికే పేరొందింది. తాజాగా జాజికాయ, లవంగం, దాల్చిన చెక్క సాగును సైతం చేపట్టిన గిరిజన రైతులు లాభాల పరిమళాలను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడి సమశీతల వాతావరణం, మెరుగైన వర్షపాతం, సారవంతమైన ఎర్రగరప నేలలు వీటి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మేటిగా నిలుస్తున్న కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కన్నా సేంద్రియ విధానంలో పండిస్తున్న మన్యం మసాలా సరుకులకు క్రమేపీ డిమాండ్ పెరుగుతోంది. వీటిని సాగు చేస్తున్న గిరిజన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి మేలు రకం మొక్కలను తీసుకొచ్చి ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా అందిస్తోంది. పసుపు మిసమిసలు ఇక్కడ పండించిన పసుపు కిలో రూ.82 నుంచి రూ.85 వరకూ ధర పలికింది. ఆర్గానిక్ సర్టిఫికెట్ పొందిన రైతు సహకార ఉత్పత్తి సంఘాలైతే రూ.90 నుంచి రూ.95 వరకూ విక్రయించాయి. 20,552 ఎకరాల్లో సేంద్రియ విధానంలో పండిస్తున్న ఇక్కడి పసుపులో నాణ్యత, ఛాయ అధికంగా ఉంటోంది. ఏటా రెండు వేల ఎకరాల చొప్పున ఐదేళ్లలో మరో 10 వేల ఎకరాల్లో పసుపు సాగును విస్తరించేందుకు పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన రూ.100 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. అదిరే అల్లం మన్యంలో 300 ఎకరాల్లో అల్లం సాగవుతోంది. ఘాటు తక్కువగా ఉన్నా పరిమాణంలో పెద్దగా ఉండటంతో వ్యాపారులు పచ్చళ్ల తయారీకి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దేశవాళీ చింతపల్లి, నర్సీపట్నం రకాల అల్లంలో ఘాటు ఎక్కువ. పీచు కూడా ఎక్కువే. ఒక దశలో కిలో ధర రూ.150 వరకూ వెళ్లింది. ప్రస్తుతం రూ.82 నుంచి రూ.100 వరకు ఉంది. కేరళను తలదన్నే మిరియాలు కాఫీ తోటల్లో అంతర పంటగా 98 వేల ఎకరాల్లో మిరియం సాగు అవుతోంది. ఈ ఏడాది దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచి్చంది. ధర కిలో రూ.360 నుంచి రూ.400 వరకూ ఉంది. కేరళ మిరియం కన్నా మన్యం మిరియంకే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. రెక్కలు తొడుగుతున్న లవంగం కర్ణాటకలోని సిరిసి ప్రాంతం నుంచి పెనాంగ్ రకం లవంగాల మొక్కలను ఉద్యాన శాఖ గత ఏడాది తీసుకొచ్చి గిరిజన రైతులకు ఉచితంగా అందజేసింది. దాదాపు వంద ఎకరాల్లో వేసిన మొక్కలు ఎదుగుదల బాగానే ఉంది. మొలిచిన ‘దాల్చిన’ కేరళలో కాలికట్లోనున్న జాతీయ సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రం నుంచి దాల్చిన మొక్కలను ఉద్యాన శాఖ తీసుకొచ్చి కొంతమంది రైతులకు అందజేసింది. దాదాపు వంద ఎకరాల్లో అంతర పంటగా ఈ మొక్కలను వేశారు. ఈ ఏడాది మరింత విస్తరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సుగంధ ద్రవ్యాల సాగుతో మంచి ఆదాయం నాణ్యమైన సుగంధ ద్రవ్య పంటల సాగుకు మన్యంలోని వాతావరణం, సారవంతమైన నేలలు ఎంతో అనుకూలం. ఈ ప్రాంతంలో అల్లం, పసుపు, మిరియాలే కాకుండా జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క వంటి వాణిజ్య పంటలను విస్తరించడానికి అవకాశం ఉంది. పసుపు, అల్లం సాగుకైతే ప్రభుత్వం హెక్టారుకు రూ.12 వేలు, మిరియం సాగుకు రూ.8 వేలు రాయితీగా ఇస్తోంది. జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క వంటి మొక్కలు వేసిన వారికి రూ.20 వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. – కె.గోపీకుమార్, ఉద్యాన శాఖ ఉపసంచాలకులు, విశాఖ జిల్లా వేళ్లూనుకుంటున్న జాజికాయ గత ఏడాదే మన్యంలోకి జాజికాయ మొక్కలు అడుగుపెట్టాయి. కర్ణాటకలోని సిరిసి ప్రాంతం నుంచి విశ్వశ్రీ రకం మొక్కలను ఉద్యాన శాఖ అధికారులు తీసుకొచ్చి రైతులకు ఇచ్చారు. ప్రస్తుతం 80 ఎకరాల్లో ఏపుగా పెరుగుతున్న ఈ మొక్కలు ఐదో ఏట నుంచి దిగుబడినిస్తాయి. -
ఉద్యాన పంటలకు ఊతం
సాక్షి, అమరావతి: ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఊతమిస్తుండటంతో వాటి రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టీకల్చర్–ఎంఐడీహెచ్) కింద ప్రభుత్వం పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేస్తోంది. దీంతో ఉద్యాన రైతులు ఉత్పత్తి నష్టాలను తగ్గించుకుంటుండగా.. మరోవైపు సాగు విస్తీర్ణం, ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 9 జిల్లాల్లో అమలు రాష్ట్రంలో 17.84 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా 3.12 లక్షల టన్నుల దిగుబడులొస్తున్నాయి. గతంలో పంటను మార్కెట్‌కు తరలించేందుకు, డిమాండ్ ఉన్నచోట గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడేవారు. గ్రేడింగ్, ప్యాకింగ్, రవాణా వంటి సౌకర్యాల లేకపోవడం వల్ల ఉత్పత్తిలో 30 శాతం మేర నష్టపోయేవారు. ఆశించిన స్థాయిలో ఎగుమతులు చేయలేని పరిస్థితి తలెత్తేది. సర్కారు పుణ్యమా అని ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో అమలవుతోంది. గడచిన రెండేళ్లలో 9 జిల్లాల్లోనూ రూ.290.30 కోట్లతో ఈ పథకం కింద కల్పించిన మౌలిక సదుపాయాల వల్ల 31,700 హెక్టార్లు కొత్తగా సాగులోకి వచ్చాయి. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ పథకం కింద పాత తోటల పునరుద్ధరణ, రక్షిత సేద్యం (గ్రీన్, పాలీ హౌస్) మల్చింగ్, నీటికుంటలు, ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, కోల్డ్ స్టోరేజ్, రైపనింగ్ చాంబర్లు, ఉల్లి గిడ్డంగులు, యాంత్రీకరణ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కాపుకొచ్చిన డ్రాగన్ ఫ్రూట్ తోట నీటి కుంటలతో చీనీ తోటలకు రక్షణ బత్తాయి (చీనీ) పంటకు చాలినంత నీటి వనరుల్లేక తోటలు ఎండిపోవడం లేదా నిర్జీవంగా తయారయ్యేవి. ఎంఐడీహెచ్ పథకం కింద పెద్దఎత్తున నీటి కుంటలు (ఫారమ్ పాండ్స్) నిరి్మంచడంతో గడచిన రెండేళ్లుగా చీనీ తోటలు వేసవిలో కూడా కళకళలాడుతున్నాయి. 2019–20లో 435 నీటికుంటల నిర్మాణంతో 3,067 హెక్టార్లు, 2020–21లో 460 నీటికుంటల నిర్మాణంతో 3,250 హెక్టార్లలో తోటలను ఎండిపోకుండా కాపాడగలిగారు. తద్వారా 467 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి పెరిగి రైతులు రూ.1.22 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలిగారు. అరటి ఎగుమతులకు ఊపు ఈ పథకం ద్వారా అరటి, మిరప సాగుతోపాటు వాటి ఎగుమతులను ప్రోత్సహించేందుకు చేపట్టిన బనానా, చిల్లీ వేల్యూ చైన్ ప్రాజెక్టులు సత్ఫలితాలిస్తున్నాయి. అరటిలో టిష్యూ కల్చర్‌తో పాటు ఫ్రూట్‌కేర్ విధానాల వల్ల సాగు విస్తీర్ణంతో పాటు నాణ్యత కూడా పెరిగింది. దీంతో 1,750 హెక్టార్లలో కొత్తగా అరటి సాగులోకి వచ్చింది. అనంతపురంలో రెండు ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌లు, పులివెందులలో రెండు కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించడంతో ఈ ప్రాంతం నుంచి ఏటా 10 వేల టన్నులకు మించని అరటి ఎగుమతులు ఇప్పుడు 1.50 లక్షల టన్నులకు పెరిగాయి. మిరప విషయానికి వస్తే రెండేళ్లలో 38,844 ఎకరాల్లో కొత్తగా సాగు మొదలైంది. తద్వారా ఉత్పాదకతలో 15 శాతం, ఉత్పత్తిలో 8 శాతం వృద్ధి సాధించగలిగారు. ఉత్పత్తి, నాణ్యతకు బూస్ట్ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల వల్ల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత నాణ్యత, ఉపాధి అవకాశాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అంతర పంటల సాగు ద్వారా రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించగలుగుతున్నారు. 2019–20లో ఈ పథకం కింద రూ.132 కోట్లు ఖర్చు చేయగా.. కొత్తగా 15,200 హెక్టార్లు సాగులోకి వచ్చాయి. 2020–21లో రూ.158.30 కోట్లను వెచ్చించగా.. కొత్తగా మరో 16,500 హెక్టార్లు కలిపి రెండేళ్లలో మొత్తంగా 31,700 హెక్టార్లు సాగులోకి వచ్చాయి. దీనివల్ల 2019–20లో 52,500 మంది రైతులు, 2020–21లో 58,270 మంది రైతులు లబ్ధి పొందారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.180 కోట్లు వెచ్చించి.. కొత్తగా 18,500 హెక్టార్లు సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. తద్వారా 75వేల మంది లబ్ధి పొందే అవకాశాలున్నాయని అంచనా. -
నిషేధిత గసగసాల సాగు!
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): మదనపల్లె మండలంలో గుట్టుగా సాగుతున్న మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే నిషేధిత గసగసాల (ఓపీఎం పోపీ) పంట సాగు గుట్టు రట్టయింది. సెబ్ ఎస్ఐ శ్రీధర్ ఆదివారం విలేకరులకు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె మండలంలోని మాలేపాడు పంచాయతీ కత్తివారిపల్లి గ్రామానికి చెందిన బొమ్మరాసి గంగులప్ప కుమారుడు బి.నాగరాజు కత్తివారిపల్లె, దేవళంపల్లె మధ్యలో ఉన్న తన మామిడి తోటలో నిషేధిత గసగసాల పంటను సాగు చేస్తున్నట్లు సెబ్ అధికారులకు సమాచారం అందింది. సిబ్బందితో వెళ్లి తోటలో దాడులు చేయగా గసగసాల సాగు విషయం బట్టబయలైంది. తోటలో సోదాలు చేస్తుండగా యజమాని నాగరాజు ఆదేశాల మేరకు అదే గ్రామానికి చెందిన నాగరాజు దగ్గరి బంధువులు ట్రాక్టర్‌తో అధికారుల కళ్ల ఎదుటే పంటను ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. అధికారులు వారితో వారించి ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. వారి వద్ద నాలుగు బస్తాల గసగసాలను స్వాధీనం చేసుకుని, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గత కొన్నేళ్లుగా ‘సాగు’తున్న దందా.. నాగరాజు గత కొన్ని సంవత్సరాలుగా మదనపల్లె, ములకలచెరువు, కుప్పం, వి.కోట, కర్నాటకలలో కూడా నిషేధిత పంటలను సాగు చేస్తూ, గుట్టు చప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని ఎస్ఐ శ్రీధర్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పట్టుబడిన çగసగసాల విలువ రూ.లక్షల్లో ఉంటుందని, బ్లాక్ మార్కెట్లో అయితే రూ.కోట్లలో ధర ఉంటుందన్నారు. కాగా, ఇదే గ్రామంలో పదేళ్ల క్రితం అప్పటి ఎక్సైజ్ పోలీసులు నిషేధిత గసగసాల పంటలపై దాడులు చేపట్టి, వాటిని ధ్వంసం చేశారు. కొందరిపై కేసులు కూడా పెట్టారు. ఆ కేసుల్లో నాగరాజు కూడా ఉన్నట్లు సమాచారం. -
మక్కలు కొంటాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని సీఎం కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. క్వింటాల్‌కు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయొద్దని ప్రభుత్వం కోరిందని, అయినా రైతులు మక్కలు సాగు చేశారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దంటే మక్కలు సాగు చేశారని, వాస్తవా నికి ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదన్నారు. అయినా రైతులు నష్టపోవొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయిం చినట్లు ఆయన వెల్లడించారు. వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గతేడాది రూ.845 కోట్ల నష్టం.. ‘గత యాసంగిలో 9 లక్షల టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందుకు రూ.1,668 కోట్లు ఖర్చు చేసింది. ఆ మక్కలకు బయట మార్కెట్లో ధర లేకపోవడంతో వేలం వేయాల్సి వచ్చింది. దీనివల్ల రూ.823 కోట్లు మాత్రమే వచ్చాయి. మార్క్‌ఫెడ్‌కు మొత్తంగా రూ.845 కోట్ల నష్టం వచ్చింది. క్వింటాల్‌కు రూ.1,760 చొప్పున ధర చెల్లించి మార్క్‌ఫెడ్ మక్కలను కొనుగోలు చేసింది. సేకరణ, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి క్వింటాల్‌కు రూ.2 వేలు ఖర్చు కాగా, వేలంలో క్వింటాలుకు రూ.1,150 మాత్రమే వచ్చాయి. మక్కలకు దేశవ్యాప్తంగా మార్కెట్ లేకపోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది’అని సీఎం వాపోయారు. ‘ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే వర్షాకాలంలో మక్కలు సాగు చేయొద్దని రైతులను కోరింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పసుపులో అంతర పంటగా కొద్దిపాటి ఎకరాల్లో మక్కలు వేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని, వ్యవసా యాధికారుల సూచనలు పాటించకుండా కొంత మంది మక్కలు సాగు చేశారు. మక్క లకు మద్దతు ధర రాదని తెలిసినా సాగు చేసి నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రైతు సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రైతులు నష్టపోతుంటే చూస్తూ ఉండలేక మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’అని సీఎం వివరించారు. యాసంగిలో కొనుగోలు చేయలేం.. ‘మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖ, పౌరసరఫ రాల శాఖ సమన్వయంతో ధాన్యం, మక్కల కొనుగోళ్లు చేపట్టాలి. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మక్కలు సాగు చేయొద్దని రైతులను మరోసారి కోరుతున్నా. ఇంత చెప్పినా సరే, మళ్లీ ఎవరైనా మక్కలు సాగు చేస్తే ప్రభుత్వ బాధ్యత ఉండదు. యాసంగిలో పండే మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశాల్లేవు’అని సీఎం స్పష్టం చేశారు. -
'పత్తి'కి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి సాగుకు పెద్దపీట పడుతోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 53.64 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు వేసినట్టు వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొంది. సాధారణ పత్తి సాగు 43 లక్షల ఎకరాలే కాగా,ఈ సీజన్లో అది అదనంగా 10 లక్షల ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థాయిలో 53 లక్షల ఎకరాలు దాటిపోయిందని నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం సాగు విస్తీర్ణంలో 84% పంటలు వేశారు. అందులో గత ఖరీఫ్‌లో ఈ సమయానికి సాగు లెక్కల తో పోలిస్తే వరి,కందులు, జొన్న, వేరుశనగ పంటల విస్తీర్ణం పెరగ్గా, మొక్కజొ న్న, చెరకు, సోయా బీన్ పంటల విస్తీర్ణం తగ్గింది. గత సీజన్లో ఈ సమయానికి కురిసిన దానికన్నా 21% ఎక్కువ వర్షపాతం నమోదైంది. నియంత్రిత సాగు బాటలో... ఈ సీజన్లో పంటల సాగు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నియంత్రిత బాటలోనే ఉందని గణాం కాలు చెబుతున్నాయి. సాధారణం కంటే 16 లక్షల ఎకరాలు ఎక్కువగా ఈ ఏడాది పత్తి 60.16 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటికే 53 లక్షలకు పైగా ఎకరాల్లో విత్త నాలు పడ్డాయి. ఇది 89%. పంటల వారీగా చూస్తే వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జొన్న (70%), కందులు (66%), పెసలు (62%), మినుములు (75%), సోయాబీన్ (83%), చెరకు (67%) సాగయ్యాయి. ఇక, వరి ఈ ఖరీఫ్ లో 41.76 లక్షల ఎక రాల్లో సాగు చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక కాగా, అందులో 36% అంటే 15.13 లక్షల ఎకరాల్లో ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి. ఇతర పంటల్లో ఆముదం 33,951 ఎకరాల్లో (37%), వేరుశనగ 11,578 ఎక రాల్లో (28%) సాగయ్యాయి. మక్కలు తగ్గాయి: ఈసారి రాష్ట్రంలో చర్చనీయాంశమైన మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత సీజన్లో ఈ సమయానికి 8 లక్షల ఎకరాలకు పైగా ఈ పంట వేయగా, ఈసారి 1.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ వానాకాలంలో 1,25 ,45,061 ఎకరాల్లో సాగు చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచన కాగా, అందులో 69% అంటే 86, 45,534 ఎకరాల్లో అన్ని రకాల పంటలు కలిపి సాగయ్యాయి. వ్యవసాయ శాఖ నివేదికలోని ముఖ్యాంశాలు.. ► రాష్ట్రంలో ఈ సీజన్ సాధారణ వర్షపాతం 358.3 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 21% అధి కంగా 433.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 18 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, 13 జిల్లాల్లో సాధారణ స్థాయిలో, 2 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ► మొత్తం ఆహార ధాన్యాల సాధారణ సాగు 50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికి 27 లక్షల ఎకరాలకు పైగా సాగైంది. సగటు కన్నా ఎక్కువ వర్షం కురిసిన జిల్లాలు భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్(అర్బన్), కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగుళాంబ, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, నారాయణ్ పేట. సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు ఆదిలాబాద్, కొమురంభీం,మంచిర్యాల, వరంగల్ (రూరల్), జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్, ములుగు, నల్లగొండ. లోటు జిల్లాలు: నిర్మల్, నిజామాబాద్. -
ఇక.. ఇ–పంట
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో మరో వినూత్న ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లలో సాగయ్యే ఆక్వా సహా వివిధ రకాల పంటలను ఎలక్ట్రానిక్ పద్ధతి(ఇ–పంట)న నమోదు చేయనుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ తొట్టతొలి ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త అజమాయిషీలో జరిగే ఇ–పంట నమోదుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే వివిధ స్థాయిల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన ► వీఏఏ, వీహెచ్ఏ, ఆక్వా, పశు సంవర్థక సహాయకులు, గ్రామ సర్వేయర్, వీఆర్వో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనలో పంటను నమోదు చేస్తారు. ఇలా నమోదు చేయడం ఇదే ప్రథమం. ►రైతులకు ముందుగానే తెలియచేసి సర్వే చేపడతారు. రైతును పొలంలో నిల్చోబెట్టి ఫొటో తీసి రికార్డ్ చేస్తారు. ►చేపలు, రొయ్యల చెరువులనూ సర్వే చేసి ఆ వివరాలనూ నమోదు చేస్తారు. పట్టాదారు లేదా కౌలుదారుల పేర్లను మాత్రమే నమోదు చేస్తారు. ఈ మేరకు వారి మొబైల్‌కు సందేశం వస్తుంది. ఇ–పంట డేటానే ప్రామాణికం ► ప్రభుత్వం అమలు చేసే.. సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, కనీస మద్దతు ధర, ప్రకృతి విపత్తుల సహాయం తదితర పథకాలకు ఇ–పంట డేటానే ప్రామాణికంగా తీసుకుంటారు. రైతులు తమ సందేహాల నివృత్తికి రైతు భరోసా కేంద్రాలను లేదా 155251 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఎవరు బాధ్యత వహిస్తారంటే.. ► గ్రామస్థాయిలో వీఆర్వో, వ్యవసాయ, అనుబంధ రంగాల సహాయకులు, గ్రామ సర్వేయర్ బాధ్యత వహిస్తారు. ► మండలస్థాయిలో తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షకులుగా ఉంటారు. సమాచారాన్ని గ్రామాధికారుల వద్ద ఉండే ట్యాబ్‌ల ద్వారా ఇ–పంట యాప్‌లో నమోదు చేస్తారు. ► ప్రతి రికార్డును బయోమెట్రిక్ ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది. ► నమోదు వివరాలను గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. సాగు హక్కు ధ్రువీకరణ పత్రాలపై అవగాహన భూ యాజమాన్య హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కౌలుదారులకు సాగు హక్కు ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గ్రామసభలు నిర్వహించి భూయజమానులకు, కౌలుదారులకు అవగాహన కల్పిస్తున్నారు. సాగు హక్కు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన తేదీ నుంచి 11 నెలలు మాత్రమే అమలులో ఉంటాయి. మూడు సీజన్లలో నమోదు ► సంవత్సరంలో మొత్తం మూడు సీజన్లలోనూ ఇ–పంట నమోదు జరుగుతుంది. తొలి విడత ప్రస్తుత ఖరీఫ్‌కు సంబంధించినది కాగా మిగతా రెండూ రబీ, వేసవి (మూడో పంట) పంటలకు చెందినవి. ► ఖరీఫ్ పంట నమోదు ఈ నెల 13న ప్రారంభమై వచ్చే నెల 31న ముగుస్తుంది. ► రబీ పంటల నమోదు నవంబర్ 1న మొదలై అదే నెల 30న ముగుస్తుంది. ► మూడో పంట నమోదు మార్చి 1న మొదలై ఏప్రిల్ 30న ముగుస్తుంది. ► ఖరీఫ్ పంట నమోదు ఈ నెల 13న ప్రారంభమై వచ్చే నెల 31న ముగుస్తుంది. ► రబీ పంటల నమోదు నవంబర్ 1న మొదలై అదే నెల 30న ముగుస్తుంది. ► మూడో పంట నమోదు మార్చి 1న మొదలై ఏప్రిల్ 30న ముగుస్తుంది. -
వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తాం
-
తిండి పంటలు పండించాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినా.. పోషకాహార భద్రత సాధించలేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప, బలవర్థకమైన ఆహారం తినడం లేదని, అలాంటి ఆహారాన్ని తినేలా ప్రోత్సహించాలని, అలాంటి పంటలే పండించాలని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు, రోగ నిరోధకశక్తి పెరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈసారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ఏటా ప్రతి సీజన్లో కొనసాగాలని కోరారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, పంటకు ధర రాని దుస్థితి ఉండదన్నారు. అంతిమంగా రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులతో మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు. కేసీఆర్ సూచనల్లోని ముఖ్యాంశాలు ►రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు కచ్చితమైన అంచనాలు రూపొందించాలి. రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రాంతానికి ఏ ఆహార పదార్థాల అవసరం ఉందో గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగాలి. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కాక నిరంతరం సాగాలి. దీనికోసం ప్రభుత్వం అగ్రికల్చర్ ప్రొడక్టŠస్ మార్కెటింగ్ కమిటీని నియమిస్తుంది. నిపుణులు, నిష్ణాతులు ఈ కమిటీలో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ – మార్కెటింగ్ – ధరలు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఏ పంటలు వేయడం వల్ల లాభమో సూచిస్తుంది. ►వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెరగడం చాలా ముఖ్యం. సాగు పద్ధతుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులొస్తున్నాయి. ఆధునిక సాగు పద్ధతులు అవలంభించాలి. ఎరువులు, పురుగుమందుల వాడకంలో శాస్త్రీయత ఉండాలి. మేలురకమైన విత్తనాలు వేయాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి అందుకనుణంగా సేద్యం జరగాలి. వీటిపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, తగు సూచనలివ్వడానికి ప్రభుత్వం అగ్రికల్చర్ రీసెర్చి కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ సూచించినట్టుగా సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలి. ►తెలంగాణలో పత్తి ఎక్కువ పండిస్తున్నారు. పత్తిలో ఉత్పాదకత పెంచడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఏ రకమైన పత్తికి మార్కెట్ ఉంది? అలాంటి పత్తి సాగు చేయాలంటే ఏం చేయాలి? వంటివి అధ్యయనం చేసి, తగు సూచనలివ్వడానికి, పత్తి రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రభుత్వం కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ►తెలంగాణలో పండే పత్తికి మంచి డిమాండ్ ఉంది. నూలు పొడవు ఎక్కువ ఉండడం వల్ల మంచి ధర వస్తుంది. పత్తిలో మట్టి, పుల్లలు, ఇతర చెత్త కలవడం వల్ల సరుకులో నాణ్యత (ఫేర్ యావరేజ్ క్వాలిటీ – ఎఫ్.ఎ.క్యూ.) శాతం పడిపోయి, ధర తగ్గుతున్నది. కష్టపడి పంట పండించే రైతులు పత్తి ఏరిన తర్వాత అందులో చెత్తా చెదారం కలవకుండా జాగ్రత్తపడాలి. ► రాష్ట్రంలో జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల సామర్థ్యంపై కచ్చితమైన అంచనాలు వేయాలి. సరిపోను ఉన్నాయా? ఇంకా నెలకొల్పాలా? అనే విషయంపై శాస్త్రీయమైన అంచనా ఉండాలి. పత్తి పండే ప్రాంతాల్లోనే వీటిని నెలకొల్పితే రవాణా వ్యయప్రయాసలు తప్పుతాయి. ► తెలంగాణలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలున్నాయి. ఏ నేల ఏ పంట సాగుకు అనువైనదో తేల్చాలి. దానికి అనుగుణంగా పంటలు వేయాలి. పంటల కాలనీల ఏర్పాటుకు నేలల విభజన చేయాలి. ఈ వివరాలను రైతులకు తెలపాలి. ►ప్రజలు నిత్యం తినే పండ్లు, కూరగాయలను రాష్ట్రంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఏయే రకాల పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకంటున్నామో లెక్కలు తీయాలి. వాటిని మన రాష్ట్రంలోనే పండించాలి. పండ్లు, కూరగాయల విషయంలో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళిక రూపొందించి, అమలుచేయాలి. పట్టణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల అవసరం ఎక్కువ. అందుకే పట్టణ పరిసరాల్లోని భూముల్లో పండ్లు, కూరగాయల సాగుకు అనువైన నేలలను గుర్తించి, రైతులను ప్రోత్సహించాలి. – ఆలుగడ్డలు, అల్లం, ఎల్లిపాయలను ప్రజలు ఎక్కువగా వాడతారు. వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలోనే వాటిని పండించాలి. ఎక్కడ పండించాలి? మేలైన సాగు పద్ధతులేంటి? తదితర విషయాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి. ►ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ఏటా అనిశ్చితి, అస్పష్టత.. ఇలా ఎందుకుండాలి? తెలంగాణ ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు జరగాలి. ఎప్పుడూ కొరత లేకుండా వ్యూహం అవలంభించాలి. ►చిక్కుడు, మునగలో మంచి పోషకాలున్నాయి. వాటిని ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్యపరచాలి. వాటి సాగు పెంచాలి. ► రాష్ట్రంలో కొత్తగా అనేక ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. మిషన్ కాకతీయతో చెరువుల నీటి సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. 24 గంటల ఉచిత విద్యుత్‌తో బోర్ల కింద సాగు పెరిగింది. ఏటా కొత్తగా ఆయకట్టు పెరుగుతోంది. పెరిగిన/పెరిగే విస్తీర్ణాన్ని సరిగ్గా అంచనావేస్తూ, పంటల సాగు ప్రణాళికలు తయారుచేయాలి. ► ఉద్యానవనశాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. ►సరైన పంటల లెక్కల నమోదుకు ప్రత్యేకంగా స్టాటిస్టికల్ విభాగం ఏర్పాటు చేయాలి. ‘పంటల వివరాలను నమోదు చేయండి’ సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలో రైతులు వేసిన పంటల వివరాలను, రైతు పేరు, సర్వే నంబర్ వారీగా, ప్రతి గుంటలో వేసిన పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ విస్తీర్ణాధికారులు ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసే ఈ వివరాలను పర్యవేక్షించడానికి ముఖ్య గణాంక అధికారిగా వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు కె.విజయకుమార్‌ను నియమించామన్నారు. ఈ కార్యక్రమం కోసం క్రాప్ ఏరియా సోన్ మాడ్యూల్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. -
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
నైరుతి వచ్చేసింది
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. రుతు పవనాల ఆగమనానికి సూచికగా సోమవారం ఆ రాష్ట్రంలో చల్లని ఈదురుగాలులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతు పవనాలు విస్తరించాయని భారత వాతావరణ విభాగం సోమవారం ధ్రువీకరించింది. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులను ఈ రుతు పవనాలు పూర్తిగా కమ్ముకున్నాయి. మాల్దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమెరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కాగా, నైరుతి రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలవల్లే దేశంలో 50 శాతంపైగా పంటలు సాగవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అత్యధిక ప్రాంతాల్లో పంటల సాగుకు నైరుతి రుతుపవనాలే కీలకం. నేడు, రేపు వర్షాలు ఇక ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవుల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో.. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, నైరుతి, ఆగ్నేయ రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో భీమిలిలో 3 సెం.మీ, సాలూరు, వెంకటగిరి కోటలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. పిడుగులు పడి నలుగురు మృతి ఇదిలా ఉంటే.. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం ఎస్సీ మరువాడ గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పొలంలోని పాకలో తలదాచుకున్న సమయంలో పిడుగుపడి వీరు బలయ్యారు. వీరితో పాటు ఉన్న మరో ముగ్గురు స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అలాగే, గుంటూరు జిల్లాలో కూడా పిడుగుపడి ఓ రైతు మరణించాడు. అమరావతి మండలం అత్తలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే జిల్లా ఈపూరు మండలంలో దాదాపు రెండు కేజీల బరువు ఉండే వడగళ్లు పడ్డాయి. ఈ ఏడాది 102శాతం వర్షపాతం ఈ సీజన్ (జూన్–సెప్టెంబర్)లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినట్లు ఐఎండీ సోమవారం ఢిల్లీలోనూ, అమరావతిలోనూ ప్రకటించింది. ఈ మేరకు అమరావతి ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా మీడియా సమావేశంలో వివరించారు. ప్రాంతాల వారీగా, నెలల వారీగా కూడా దీర్ఘకాలిక వర్షపాత అంచనాలను ఐఎండీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జూలైలో 103 శాతం, ఆగస్టులో 97 శాతం వర్షపాతం నమోదవుతుంది. ఈ అంచనాలో తొమ్మిది శాతం అటూ ఇటుగా తేడా ఉండవచ్చని తెలిపారు. అలాగే.. దక్షిణాది రాష్ట్రాల్లో 102 శాతం సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. కాగా, ఈ నెల రెండో వారంలో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉంది. -
ఇదిగో పంటల పటం
సాక్షి, హైదరాబాద్ : నూతన వ్యవసాయ విధానం ప్రకారం.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంటల వారీగా సాగుచేయాల్సిన విస్తీర్ణాన్ని వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలు ఖరారు చేశాయి. జిల్లాల వారీగా 2019 వానాకాలంలో పంటల వారీగా సాగు విస్తీర్ణం గణాంకాలను దృష్టిలో పెట్టుకుని 2020 వానాకాలా నికి సంబంధించి పంటల చిత్రపటం (క్రాప్ మ్యాపిం గ్)ను రూపొందించాయి. గతేడాది వానాకాలం, యాసంగి కలుపుకుని రాష్ట్రంలో 1.23 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేయగా, కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతో అదనంగా మరో 10లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో 2020 వానాకాలం, యాసంగి కలుపుకుని 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలు, పంటల వారీగా వానా కాలంలో సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేశారు. సాగులో సం‘పత్తి’ తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న నాణ్యమైన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో ఆ పంటసాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. గతేడాది రాష్ట్రంలో 53లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ ఏడాది 70లక్షల ఎకరాలకు పెంచాలని సీఎం ఆదేశించారు. దీంతో తాజాగా రూపొందించిన పంటల ప్రణాళిక మేరకు రాష్ట్రంలో అదనంగా 10.24లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేయాల్సి ఉంటుంది. మక్క.. వద్దు పక్కా పొరుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నలు తక్కువ ధరకే దొరుకుతుండటంతో రాష్ట్రంలో సాగవుతున్న మక్కలకు కనీస మద్దతుధర లభించట్లేదు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాలుకు రూ.1,760 చెల్లించి మక్కలను కొనుగోలు చేసింది. అయితే రాష్ట్రంలో 25లక్షల టన్నులకు మించి మక్కల వినియోగం లేకపోవడంతో వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయొద్దని సీఎం ఖరాకండీగా చెప్పారు. గతేడాది రాష్ట్రంలో 10.11లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యింది. ప్రస్తుతం రూపొందించిన పంటల చిత్రపటంలో ఈ పంటకు చోటు దక్కలేదు. కంది.. సాగు దండి గతేడాది రాష్ట్రంలో 7.38లక్షల ఎకరాల్లో కంది సాగైంది. పంటల చిత్రపటం రూపకల్పనలో భాగంగా మొక్కజొన్నకు బదులు కంది సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. తెలంగాణలో పప్పుధాన్యాల వినియోగం 11.7లక్షల టన్నులు కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5.6 లక్షల టన్నుల పప్పుధాన్యాలు మాత్రమే దిగుబడి అవుతున్నాయి. ఈ లోటు భర్తీకి 6.1లక్షల టన్నుల మేర పప్పులను రాష్ట్రం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కందితో పాటు మినుములు, పెసలు సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచుతూ కార్యాచరణ ఖరారు చేశారు. క్రాప్ మ్యాపింగ్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6.70లక్షల ఎకరాల్లో కంది, 45వేలకుపైగా ఎకరాల్లో పెసలు, 28వేల ఎకరాల్లో మినుములు సాగు చేయాల్సి ఉంటుంది. వరి..సరిసరి గతేడాది వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 41.19లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ ధాన్యాగారంగా మారింది. ఈ ఏడాది ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో సుమారు మూడోవంతు రాష్ట్రం నుంచి దిగుబడి వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాళేశ్వరం జలాలు కూడా అందుబాటులోకి వస్తుండటంతో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సాగునీటి వసతి ఉన్నచోట కూడా పత్తి సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో వరిసాగు విస్తీర్ణంలో భారీగా కోత పడనుంది. దీంతో పంటల చిత్రపటం ప్రకారం సుమారు 95వేలకుపైగా ఎకరాల్లో వరిసాగును తగ్గించాలని నిర్ణయించారు. ఆముదం.. ప్రధానం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆముదం నూనెలో భారత్ నుంచే 90శాతం వస్తుండగా, తర్వాత స్థానాల్లో బ్రెజిల్, చైనా ఉన్నాయి. దేశంలో గుజరాత్‌లోనే అత్యధికంగా 75శాతం మేర ఆముదం సాగు చేస్తున్నారు. తెలంగాణలో ప్రధానంగా మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఆముదం సాగుచేస్తుండగా, నూతన వ్యవసాయ విధానంలో భాగంగా ఈ సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచాలని నిర్ణయించారు. దీంతో కొత్తగా 73వేలకు పైగా ఎకరాల్లో ఆముదం సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వేరుశనగ బాగు.. సోయా తగ్గు నూనె గింజలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వేరుశనగను కూడా 17వేలకు పైగా ఎకరాల్లో అదనంగా సాగు చేస్తారు. ఆముదం, వేరుశనగ సాగు విస్తీర్ణాలను పెంచుతూనే సోయా సాగు విస్తీర్ణాన్ని 1.74లక్షల ఎకరాల మేర కుదించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గతేడాది 4.28లక్షల ఎకరాల్లో సోయా సాగుచేయగా, ప్రస్తుత వానాకాలంలో సుమారు 3లక్షల ఎకరాలకే పరిమితం కానుంది. పసుపు, ఉల్లి కుదింపు.. జొన్న కాదిక మిన్న ►గతేడాది 34వేల ఎకరాల్లో ఉల్లి సాగుచేయగా 3.40లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వచ్చింది. పంటల చిత్రపటం ప్రకారం ఈ ఏడాది వానాకాలంలో ఉల్లి సాగు విస్తీర్ణాన్ని 24వేల ఎకరాలకుపైగా తగ్గించాలని నిర్ణయించారు. ►పసుపు 1.33లక్షల ఎకరాల్లో సాగు చేయగా 2.81లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. తాజా ప్రణాళికలో భాగంగా ఈ పంట సాగు విస్తీర్ణాన్ని 8,700పైగా ఎకరాలకు కుదిస్తారు. ►ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న జొన్న పంట విస్తీర్ణాన్ని మొత్తంగా 5వేల ఎకరాల మేర తగ్గించాలని పంటల చిత్రపటంలో పేర్కొన్నారు. వరి సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నల్లగొండ 3,30,000 ( ఎకరాలు) సూర్యాపేట 3,20,000 నిజామాబాద్ 3,00,000 పత్తి సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నల్లగొండ 7,25,000(ఎకరాల్లో) నాగర్‌కర్నూలు 4,50,000 ఆదిలాబాద్ 4,35,088 కంది సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు వికారాబాద్ 1,73,900 (ఎకరాల్లో) నారాయణపేట 1,70,000 రంగారెడ్డి 1,00,000 సోయాబీన్ సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నిర్మల్ 60,000( ఎకరాల్లో) కామారెడ్డి 50,000 సంగారెడ్డి 46,473 జొన్న సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు మహబూబ్‌నగర్ 41,500(ఎకరాల్లో) రంగారెడ్డి 22,000 నారాయణపేట 15,000 మినుములు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు సంగారెడ్డి 22,000 (ఎకరాల్లో) కామారెడ్డి 10,000 వికారాబాద్ 9,500 ఆముదం సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు మహబూబ్‌నగర్ 40,530(ఎకరాల్లో) నారాయణపేట 36,000 వనపర్తి 25,050 వేరుశనగ సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు గద్వాల 20,000 (ఎకరాల్లో) వరంగల్ రూరల్ 8,500 వనపర్తి 4,500 చెరుకు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు సంగారెడ్డి 34,200(ఎకరాల్లో) కామారెడ్డి 12,061 వికారాబాద్ 6,508 పెసలు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు సంగారెడ్డి 48,000(ఎకరాల్లో) ఖమ్మం 22,000 వికారాబాద్ 20,800 పసుపు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నిజామాబాద్ 37,350 (ఎకరాల్లో) జగిత్యాల 32,240 నిర్మల్ 20,050 ఉల్లి సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు గద్వాల 7,599(ఎకరాల్లో) వనపర్తి 810 మెదక్ 578 -
పంటలపై రైతులకు సూచనలు చేయాలి
సాక్షి, హైదరాబాద్ : నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు కావడానికి వీలుగా, ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో అధికారులు రైతులకు వెంటనే తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సూచించిన పంటకు సంబంధించిన విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ కేశవులు పాల్గొన్నారు. వానాకాలంలో పంటల సాగు, విత్తనాలు– ఎరువుల లభ్యత, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. పలు సూచనలు చేశారు. ఊ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది. గత వర్షాకాలం వేసిన పంటలతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవు. ఈ వర్షాకాలంలో మక్కలు వద్దని మాత్రమే చెప్పాం. మక్కల స్థానంలో కందులు లేదా పత్తి వేయమని కోరాం. గత ఏడాది వర్షాకాలం లాగానే ఈసారి కూడా 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని చెప్పాం. కాకపోతే మార్కెట్లో డిమాండ్ కలిగిన వరి వంగడాలను ప్రభుత్వం సూచించిన ప్రకారం వేయమన్నాం. గత ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఈసారి మరో 10–15 లక్షలు పెంచమన్నాం. మిగతా పంటల విషయంలో ఎలాంటి మార్పులు సూచించలేదు. కొద్దిపాటి మార్పులే కాబట్టి రైతులు కూడా సంపూర్ణంగా సహకరించడానికి ముందుకొస్తున్నారు. ఊ ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయాలను అధికారులు రైతులకు చేరవేయాలి. జిల్లాల వారీగా తయారుచేసిన ప్రణాళికను జిల్లాలకు వెంటనే పంపాలి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో అధికారులు సమావేశం అవ్వాలి. జిల్లా వ్యవసాయాధికారులు మండల వ్యవసాయాధికారులకు క్లస్టర్ల వారీగా రూపొందిన ప్రణాళిక ఇవ్వాలి. ఆ మరుసటి రోజు మండలాల్లో వ్యవసాయ విస్తరణాధికారుల సమావేశం నిర్వహించాలి. క్లస్టర్ల వారీగా ఏ పంట ఎంత వేయాలో వివరించాలి. తర్వాత ఏఈవోలు రైతులకు వివరించాలి. సూచించిన ప్రకారం పంటలు వేసే విధంగా రైతులను సమన్వయ పరచాలి. శుక్రవారం రాత్రిలోగా అన్ని రకాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండాలి. ఊ మే 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడపాలి. రైతులు ఆలోగానే తమ ధాన్యం అమ్ముకోవాలి. 31 తర్వాత కొనుగోలు కేంద్రాలు నిలిపివేయాలి. వ్యవసాయశాఖ అధికారులు, రైతుబంధు సమితులు జూన్ 1 నుంచి వర్షాకాలం పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించాలి. -
10 లక్షల ఎకరాల్లో తెలంగాణ ‘సోన’
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలం సీజన్‌కు రాష్ట్రంలో తెలంగాణ సోనా రకం వరిని 10 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాంబమసూరి రకాన్ని కూడా 10 లక్షల ఎకరాల్లో సాగు జరిగేలా ప్రణాళిక రచించింది. రాష్ట్రవ్యాప్తంగా మేలు రకం వరి విత్తనాలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఏయే రకాన్ని ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే దానిపై ప్రణాళికలు తయారు చేశారు. (పద్ధతిగా.. పది) పలు దఫాలుగా శాస్త్రవేత్తలతో చర్చించి వరి సాగు విస్తీర్ణంపై నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండు రకాలతో పాటు 35 వేల ఎకరాల్లో జేజీఎల్–1798, 25 వేల ఎకరాల్లో డబ్ల్యూజీఎల్–384, హెచ్ఎంటీ సోనా 25 వేల ఎకరాల్లో, అలాగే జై శ్రీరాం, ఇతరాలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించింది. అలాగే ఇతర సాధారణ వరిలో ఎంటీయూ–1010 రకాన్ని 9 లక్షల ఎకరాలు, 3.5 లక్షల ఎకరాల్లో కేఎన్ఎం–118 రకం, 50 వేల ఎకరాల్లో ఎన్టీయూ–1001, 30 వేల ఎకరాల్లో ఎంటీయూ–1061, ఇతరాలు 1.7 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించారు. మేలు రకం, సాధారణ రకం వరి కలిపి 40 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. మూడు జిల్లాల్లో అత్యధికంగా వరి సాగును వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇందులో నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. మొత్తం ప్రతిపాదిత విస్తీర్ణంలో 24.5 శాతం ఈ మూడు జిల్లాల నుంచే ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వరి విత్తనాల లభ్యత కూడా అధికంగానే ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ విత్తనాల సరఫరా నిలిపివేత.. సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే జిల్లాల్లో వరి, మొక్కజొన్న విత్తనాల విక్రయాలను తాత్కాలికంగా నిలిపేయాలని డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్షేత్రస్థాయిలో రైతులకు ప్రస్తుతం విత్తనాలు అమ్మట్లేదు. రెండు, మూడు రోజుల్లో వరి విత్తనాల విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది. అది కూడా ప్రభుత్వం ఏయే జిల్లాలో ఎంత విస్తీర్ణం చెప్పిందో ఆ మేరకు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక మొక్కజొన్న అసలు వానాకాలంలో సాగు చేయొద్దని ఆ విత్తనాలు అందుబాటులో ఉంచొద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే విత్తన కంపెనీలు, డీలర్లు మాత్రం సాగు సమీపించే సమయంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. -
సర్కారు సూచనలతోనే సాగు!
సాక్షి, హైదరాబాద్: రైతులంతా ఒకే పంట వేసి నష్ట పోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి రాష్ట్రంలో వచ్చి తీరాలని వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయాధి కారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సూచిం చిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలని, వారు పండించిన పంట లకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయ వద్దని సూచించారు. తెలంగాణలో పంటల సాగు విధానం, ప్రత్యామ్నాయ పంటల గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయిం చడం, పండిన పంటకు మంచి ధర వచ్చేలా చూడ డం వంటి అంశాలపై ఆదివారం సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. సాగును లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలను నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని స్పష్టం చేశారు. అలా చేస్తేనే పంటలకు మంచి ధర వస్తుందని చెప్పారు. (చదవండి: వలసలతో టెన్షన్..టెన్షన్) వ్యవసాయరంగ నిపుణుల సూచనలివీ... రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంటసాగు చేసే సంప్రదాయం ఉంది. అలా చేస్తే పండించిన పంటకు మంచి ధర రాదు. అందువల్ల మార్కెట్ డిమాండును బట్టి పంట పండించాలి. ఇలా పండించాలంటే నియంత్రిత పద్ధతి రావాలి. క్రమపద్ధతి అలవాటు కావడం కోసం కొంత కఠినంగానే వ్యవహరించాలి. వ్యవసాయాధికారులు, యూనివర్సిటీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు సరైన అధ్యయనం, పరిశోధన ద్వారా ఎక్కడ ఏ పంట ఎంత మేర వేయాలో నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేయాలి. సూచించిన పంటలు వేయని రైతులకు ప్రభుత్వం అందించే రైతుబంధు సహాయాన్ని నిలిపివేయాలి. వారు పండించిన పంటలను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతుబంధు, కనీస మద్దతు ధర ఇవ్వాలి. (చదవండి: రోజు విడిచి రోజు స్కూలుకు..) ► కరోనా, లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ప్రస్తుతం మానవీయ దక్పథంతో పంటల కొనుగోళ్లు జరుపుతోంది. ప్రతీ ఏటా ఇలాగే కొనుగోళ్లు జరపడం సాధ్యం కాదు. పండించిన పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంటేనే ధర వస్తుంది. అందువల్ల మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగానే పంటలు పండించడం తప్ప మరో మార్గం లేదు. ► తెలంగాణవ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టకుని వ్యవసాయాధికారులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయంలో కొంత నిర్ధారణకు వచ్చారు. ఏడాదిలో రెండు పంటలకు కలిపి వరి 80–90 లక్షల ఎకరాల్లో, పత్తి 50 లక్షల ఎకరాల్లో, కంది 10 లక్షల ఎకరాల్లో మక్కజొన్న 7 లక్షల ఎకరాల్లో, వివిధ రకాల విత్తనాలు 7 లక్షల ఎకరాల్లో, మిర్చి రెండున్నర లక్షల ఎకరాల్లో, కూరగాయలు మూడున్నర లక్షల ఎకరాల్లో, వేరుశనగ రెండున్నర లక్షల ఎకరాల్లో, పసుపు 1.25 లక్షల ఎకరాల్లో, కొర్రలు, మినుములు, పెసర్లు, ఆవాలు, నువ్వులు లాంటి పంటలు మరో రెండు లక్షల ఎకరాల్లో, కొద్దిపాటి విస్తీర్ణంలో సోయాబీన్ పండించడం ఉత్తమం. ► ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడడమే కాకుండా, 30–40 ఏళ్ల పాటు నిరంతరంగా పంట దిగుబడి వచ్చే పామాయిల్ సాగును తెలంగాణలో విస్తరించాలి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 50వేల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 10వేల ఎకరాల్లో పామాయిల్ పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నందున తెలంగాణవ్యాప్తంగా 5 నుంచి 10 లక్షల ఎకరాల వరకు పామాయిల్ సాగు చేయవచ్చు. ► రాష్ట్రంలో 80–90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయవచ్చు. కాని ఇందులో కూడా మార్కెట్ అవసరాలకు తగ్గట్టు రకాలు పండించాలి. సన్నరకాలు ఎన్ని పండించాలి, దొడ్డు రకాలు ఎన్ని పండించాలనే విషయంలో కూడా స్పష్టత ఉండాలి. బియ్యం గింజ పొడవు 6.2 ఎంఎం అంతకన్నా ఎక్కువ ఉన్న రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నందున ఆ రకాలనూ పండించాలి. ► తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన తెలంగాణ సోనా బియ్యం రకానికి మంచి డిమాండ్ ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా మంచివి. ఇందులో గ్లైసమిన్ ఇండెక్స్ తక్కువ శాతం ఉంటుందని, ఇది ఆరోగ్యదాయకమని అమెరికన్ జర్నల్స్ కూడా ప్రచురించాయి. దీనిని ఈ వర్షాకాలం సీజన్లోనే 10 లక్షల ఎకరాల్లో పండించాలి. ► తెలంగాణవ్యాప్తంగా ఏ పంట ఎంత వేయాలో నిర్ణయించిన తర్వాత ఏ పంటను ఎక్కడ ఎంత విస్తీర్ణంలో పండించలానే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం చెప్పిన పంటలను మాత్రమే రైతులు సాగు చేయాలి. ► ప్రభుత్వం సూచించిన పంటలకు సంబంధించన విత్తనాలు మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యేలా చూడాలి. విత్తన వ్యాపారులు తమకు తోచిన విత్తనాలను రైతులకు అంటగట్టే పద్ధతి పోవాలి. ► రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, మార్గదర్శకం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలి. త్వరలో క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులతో సీఎం సమావేశం రాష్ట్రంలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్ర స్థాయి వ్యవసాయాధికారులతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో రైతులు ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో అనేక మార్లు ఆయన చర్చించారు. ఇదే అంశంపై నేరుగా జిల్లా వ్యవసాయాధికారులు, మండల వ్యవసాయాధికారులతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ సమావేశం ఏర్పాటు కానుంది. అనంతరం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అన్ని మండలాలకు చెందిన వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో సీఎం మాట్లాడతారు. రైస్‌మిల్లులు సామర్థ్యం పెంచుకోవాలి... తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఫలితంగా దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అద్భుత తెలంగాణ రూపొందుతోందని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణలో రాబోయే కాలంలో దాదాపు 90 లక్షల ఎకరాల్లో ప్రతీ ఏటా వరి పంట పండుతుంది. రెండు కోట్ల 70 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి అనుగుణంగా రాష్ట్రంలో రైస్ మిల్లులు తమ సామర్థ్యం పెంచుకోవాలి. రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా, ఆ ముడి సరుకును వినిమయ వస్తువుగా మార్చే బాధ్యతను కూడా తీసుకునే క్రియాశీల సంస్థగా పౌర సరఫరాల సంస్థ రూపాంతరం చెందాలి. దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుంది. వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందుతాయి. కల్తీలను అరికట్టవచ్చు’అని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ ఎండీ సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
1.6 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార పంటలు ఆశించిన మేర ఉత్పత్తి అవుతున్నాయి. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్లలో 1.6 కోట్ల టన్నుల ఆహార పంటల ఉత్పత్తి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సామాజిక ఆర్థిక సర్వే–2020 నివేదిక వెల్లడించింది. ఇక 2019–20 రెండో ముందస్తు అంచనాలతో అమాంతం పెరిగింది. ఇందులో ఒక వరినే 98.74 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. దీనిప్రకారం 2018 ఖరీఫ్, రబీ సీజన్లలో వరి 66.69 లక్షల టన్నుల్లో ఉత్పత్తి వచ్చింది. అలాగే మొక్కజొన్న 20.83 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. రాష్ట్రంలో ఆహారేతర పంటల సాగు పెరిగింది. 2016–17కు వచ్చే సరికి 33.6 శాతం ఉండగా 2017–18లో 38.7 శాతానికి పెరిగింది. 2018–19లో 38.8 శాతానికి చేరింది. ఇక పంట రుణాలు 2016–17 సంవత్సరంలో రూ. 26,282 కోట్లు ఇచ్చారు. 2018–19లో రూ.31,410 కోట్లు పంపిణీ చేశారు. 2018–19లో రూ.42,494 కోట్లకు రూ.33,751 కోట్లు బ్యాంకులు ఇచ్చాయి. 6.6 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2019–20 ఫిబ్రవరి వరకు 6.6 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతోంది. ఈ ఆరేళ్ల కాలంలో 2.48 లక్షల మంది రైతులు డ్రిప్ సౌకర్యం పొందినట్లు ఈ నివేదిక పేర్కొంది. డ్రిప్ ద్వారా నీటితో పాటు అనేక విషయాల్లో రైతులకు ఆదాయం మిగిలిందని, నాబ్కాన్స్ సర్వే కూడా వెల్లడించింది. సూక్ష్మసేద్యం అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుంది. ఉద్యాన శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 4.65 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇవ్వగా, 1.89 లక్షల ఎకరాల్లో స్ప్రింక్లర్లు ఇచ్చారు. 2016–17, 2017–18 సంవత్సరాల్లో ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ 2 సంవత్సరాల్లో వరుసగా 55,121, 83,458 మంది రైతులకు సూక్ష్మసేద్యం అందింది. ఇక 2018–19లో 37,596 మంది రైతులకు, 2019–20లో ఇప్పటివరకు 1,745 మంది రైతులకు డ్రిప్ అందింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో 2.48 లక్షల మందికి మాత్రమే సూక్ష్మసేద్యం అందింది. మరింత మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు దీంతో ఈసారి బడ్జెట్ అంచనాల్లో రూ.600 కోట్లు ప్రతిపాదించింది. లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి 51.77 టీఎంసీల ఎత్తిపోత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న లక్ష్మీ (మేడిగడ్డ) పంప్‌హౌస్ నుంచి మార్చి 4వ తేదీ నాటికి మొత్తంగా 51.77 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. అలాగే ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) పంప్‌హౌస్ ద్వారా 46.53 టీఎంసీలు, దాని పైన ఉన్న పార్వతి (సుందిళ్ల) ద్వారా 44.06 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్యాయర్‌లోకి ఎత్తిపోసినట్లు సర్వే తెలిపింది. ఇక ఎల్లంపల్లి నుంచి నంది పంప్‌హౌస్ ద్వారా 59.94 టీఎంసీలు, గాయత్రి పంప్‌హౌస్ ద్వారా 57.64 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు వెల్లడించింది. ఇక మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 27,584 చెరువుల పునరుద్ధరణను రూ.8,735.32 కోట్లతో చేపట్టినట్లు సర్వే వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు 21,601 చెరువుల పనులు పూర్తయ్యాయని, దీనికి రూ.4,352 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. ఈ చెరువుల పునరుద్ధరణ ద్వారా 8.94 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని వెల్లడైంది. మరో 5,983 చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. టీఎస్ ఐపాస్ ద్వారా 13.08 లక్షల మందికి ఉపాధి తెలంగాణ పారిశ్రామిక విధానం ‘టీఎస్ఐపాస్’ద్వారా గతేడాది డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 6,23,071 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. రూ.1,84,655 కోట్ల పెట్టుబడితో 11,857 కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. ఇందులో 9,020 పరిశ్రమల్లో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైంది. టీఎస్ఐపాస్ కింద రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల పురోగతి -
భూగర్భ జలమట్టం.. అందినంత దూరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకు సగటున 0.45 మీటర్ల మేర భూగర్భ జలాలను తోడేస్తున్నారు. రోజుకు సగటున 0.015 మీటర్ల చొప్పున భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సమృద్ధిగా వర్షాలు కురవడం, నదులు ఉప్పొంగడంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం 5.58 మీటర్ల మేర పెరిగింది. పుష్కలంగా భూగర్భ జలాలు లభ్యమవుతుండటంతో రైతులు బోర్లు.. బావుల కింద ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 23.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉంది. 11.79 మీటర్లకు.. ప్రస్తుత సీజన్లో వర్షాకాలం ప్రారంభం కాకముందు అంటే 2019 మేలో రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటు 16.19 మీటర్లుగా ఉండేది. వర్షాకాలం దాదాపు ముగిశాక.. అంటే 2019 డిసెంబర్ 15 నాటికి భూగర్భ జలమట్టం సగటు 10.61 మీటర్లకు పెరిగింది. సగటున 5.58 మీటర్ల మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. వర్షాకాలం ముగియడం, తాగు, సాగునీటి అవసరాలకు తోడేస్తుండటంతో ప్రస్తుతం భూగర్భ జలమట్టం సగటున 11.79 మీటర్లకు చేరుకుంది. 20 శాతం ప్రాంతాల్లో 3 మీటర్ల లోపే.. భూగర్భ జల వనరుల విభాగం రాష్ట్రంలో 661 గ్రామీణ మండలాలు, 9 అర్బన్ మండలాల్లోని 1,261 ప్రాంతాల్లో ఫిజియో మీటర్లను ఏర్పాటు చేసింది. భూగర్భ జలమట్టాలను ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది. - భూగర్భ జల వనరుల శాఖ అధ్యయనం ప్రకారం కోస్తాలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. 9 తీర ప్రాంత జిల్లాల్లో సగటున 9.72 మీటర్లలో భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో సగటున 16.44 మీటర్లలో భూగర్భ జలాలు దొరుకుతున్నాయి. - కనిష్టంగా శ్రీకాకుళం జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 4.91 మీటర్లు ఉండగా.. గరిష్టంగా చిత్తూరు జిల్లాలో 20.64 మీటర్లుగా నమోదైంది. - రాష్ట్రంలో 20.20 శాతం ప్రాంతాల్లో భూగర్భ జలాలు సగటున 3 మీటర్లలోపే లభ్యమవుతున్నాయి. 33.80 శాతం ప్రాంతాల్లో 3 నుంచి 8 మీటర్లలోపు లోతులో లభిస్తున్నాయి. 46 శాతం ప్రాంతాల్లో 8 మీటర్ల కంటే ఎక్కువ లోతులో దొరుకుతున్నాయి. 17.59 లక్షల బోరు బావుల కింద పంటల సాగు భూగర్భ జలమట్టం పెరగడంతో ఎండిపోయిన బోరు బావులు రీఛార్జి అయ్యాయి. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 17,59,584 బోరు బావుల కింద ఖరీఫ్‌లో రైతులు 23,68,439 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రాష్ట్రంలో అక్టోబర్‌లో భూగర్భ జలమట్టం సగటున 10.98 మీటర్లు ఉండేది. బోరు బావుల కింద భారీగా పంటలు సాగు చేసి భూగర్భ జలాలను తోడేస్తున్నా.. నవంబర్, డిసెంబర్లలో కురిసిన వర్షాలకు భూగర్భ జలమట్టం 10.61 మీటర్లకు పెరిగింది. రబీలో ఇప్పటిదాకా 53,57,854.47 ఎకరాల్లో పంటలు సాగుచేయగా.. ఇందులో 19 లక్షల ఎకరాలు బోర్లు, బావుల కింద సాగుచేసిన పంటలే. బోరు బావుల కింద సాగవుతున్న పండ్ల తోటల విస్తీర్ణం అదనం. పంటల సాగుకు, తాగునీటి అవసరాలకు తోడేస్తుండటంతో ప్రస్తుతం భూగర్భ జలమట్టం 11.79 మీటర్లకు చేరుకుంది. జనవరి 18 నాటికి భూగర్భ జలమట్టం 11.34 మీటర్లు ఉండేది. అంటే నెల రోజుల్లో 0.45 మీటర్ల మేర భూగర్భ జలాలను వినియోగించుకున్నట్లు తేటతెల్లమవుతోంది. -
ఇంటింటా సంక్షేమ సంక్రాంతి
సాక్షి, అమరావతి: చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సంక్రాంతి పండుగ కొత్త కళ సంతరించుకుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో తెలుగింట అతి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. పండుగ కొనుగోళ్లతో దుకాణాలు కిటకిటలాడటంతో వ్యాపారుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కాలం కలిసి రావడం, ప్రభుత్వం అండగా నిలవడంతో సాగుతోపాటు వ్యవసాయ దిగుబడులు పెరిగాయి. వైఎస్ జగన్ సర్కారు ‘నవరత్నాల’ పథకాలతో గడప గడపకూ కొత్త కొత్త సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. లక్షలాది మంది చిరుద్యోగులకు వేతనాలు / గౌరవ వేతనాలు పెరిగాయి. వార్డు, గ్రామ సచివాలయాలతో నిరుద్యోగులకు లక్షలాది కొత్త ఉద్యోగాలు వచ్చాయి. రైతులతోపాటు అన్ని వర్గాలకు ఆర్థిక బాసట లభించింది. మొత్తమ్మీద ‘నవరత్నా‘లు ప్రతిఫలించి సంక్షేమ సం‘క్రాంతి’ వెల్లివిరిసింది. వెరసి రాష్ట్రమంతటా వస్త్ర, కిరాణా సరుకుల కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు కిటకిటలాడిన దుకాణాలు రుజువు చేశాయి. పిండి వంటలతో వీధులు ఘుమ ఘుమలాడుతున్నాయి. రంగవల్లులు, గొబ్బమ్మలతో ప్రతి గడపా కొత్త శోభ సంతరించుకుంది. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ఎవరి స్థాయిలో వారు ఇంటిల్లిపాదికీ కొత్త వస్త్రాలు కొనుగోలు చేశారు. ఆడపడుచులను ఆహ్వానించి సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. రైతు భరోసా, ధరల స్థిరీకరణ నిధి లాంటి పథకాలకు తోడు.. వరుణుడు కరుణించడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. కూలీలకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. వీటన్నింటికీ తోడు ప్రతి కుటుంబానికి రెండు మూడు సంక్షేమ పథకాల ఫలాలు అందడం వల్ల ఈ ఏడాది ప్రజలు నిజమైన సంక్రాంతి జరుపుకుంటున్నారు. ఎడ్ల పందేలు, రంగవల్లులు, గంగిరెద్దులు, ఆట, పాటల మధ్య ఊరూరా.. ఇంటింటా.. సంక్రాంతి సంబరం అంబరం అంటింది. రైతు లోగిళ్లలో లక్ష్మీకళ మంచి వర్షాలతో కాలం కలిసి రావడం, రైతు పక్షపాతి వైఎస్ జగన్ సర్కారు తన వంతు పూర్తి స్థాయి ప్రోత్రాహం అందించడంతో అన్నదాతలకు ఆర్థిక భరోసా ఏర్పడింది. భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కడం, రిజర్వాయర్లు నిండటం, ప్రభుత్వం రైతు భరోసా కింద ఆర్థిక దన్ను కల్పించడంతో ఖరీఫ్‌లో పంటల సాగు పెరిగింది. దీంతో వ్యవసాయోత్పత్తుల దిగుబడి ఊహించని విధంగా పెరిగింది. దీంతో రైతు లోగిళ్లు లక్ష్మీకళ సంతరించుకున్నాయి. రబీలోనూ సాగు విస్తీర్ణం రికార్డు స్థాయికి చేరుకుంది. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద పంటల సాగుకు ఖర్చుల నిమిత్తం ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. రూ.13,500 చొప్పున తొలి ఏడాది అందజేసింది. ఈ పథకం కింద 44,92,513 మంది రైతులు, 1,58,116 మంది కౌలు రైతులు.. మొత్తం 46,50,629 మంది లబ్ధి పొందారు. మొదటి ఏడాది కింద ప్రభుత్వం రూ.6,298.98 కోట్లు చెల్లించింది. మరోవైపు ధరల స్థిరీకరణ కోసం కేటాయించిన రూ.3 వేల కోట్ల నిధి నుంచి శనగ రైతులకు సాయం అందించింది. 22 పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి అండగా నిలిచింది. కనీస గిట్టుబాటు ధర లేని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి వంటి వాటికి దేశంలో ఎక్కడా లేని విధంగా సేకరణ ధరలను ప్రకటించడమే కాకుండా వీటిని ప్రతి గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తోంది. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు 217 మార్కెట్ యార్డులు, 150 సబ్ మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేసింది. ఇంతకన్నా ఏం కావాలి? వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి బాగుంది. శానా సంవత్సరాల తర్వాత వర్షాలు బాగా పడ్డాయి. పంటలు సేతికొచ్చాయి. మొన్న నాణ్యమైన వేరుశనగ కాయలు ఇచ్చారు. నల్లరేగడి భూముల రైతులకు పప్పుశెనగ విత్తనాలు ఇచ్చారు. వైఎస్సార్ రైతు భరోసాతో మా లాంటి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్న కారు రైతులకు చాలా ప్రయోజనం కలిగింది. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతోంది. ఇంకా ఉచిత బోర్లు, గిట్టుబాటు ధరలు.. ఇవి కాకుండా అమ్మఒడి లాంటి పథకాల ద్వారా పల్లెల్లో చాలా మంది ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. రైతులకు ఇంతకన్నా ఏమి కావాలి? – ఎస్.గోవిందప్ప, దేవాదులకొండ గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా ఉద్యోగులందరిలోనూ నూతనోత్సాహం ప్రభుత్వ ఉద్యోగులకు పదో వేతన సవరణ సంఘం గడువు ముగిసినందున జగన్ సర్కారు 27 శాతం మధ్యంతర భృతిని గత ఏడాది జూలై నుంచే అమలు చేస్తోంది. దీంతో ఉద్యోగవర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. ఆశ వర్కర్లు, హోంగార్డులు, పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య మిత్రలు, లాంటి చిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం/ వేతనం పెంచింది. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఐఆర్ ఒకేసారి ఇవ్వడం సంతోషం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా 27 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్) ఇవ్వడం సంతోషంగా వుంది. పాదయాత్ర సందర్భంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చారు. గత ప్రభుత్వాలు ప్రకటించిన ఐఆర్‌ను అయిదు నెలల తర్వాత అమలు చేశాయి. ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. – బి.వి.రాణి, తహసీల్దార్, గోపాలపట్నం, జేఏసీ ఉమెన్ వింగ్, విశాఖపట్నం సచివాలయాలతో ఉద్యోగ జాతర ప్రజల గడపకే సంక్షేమ ఫలాలు అందించాలనే ఉదాత్త లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 2.70 లక్షల మందికి గ్రామ వలంటీర్లుగా ఉపాధి లభించింది. 1,34,000 మందికి శాశ్వత ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర చరిత్రలో ఇంత మందికి అతి తక్కువ కాలంలో ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఇప్పటి వరకూ లేకపోవడం గమనార్హం. జగన్ చలువతోనే ఉద్యోగం నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మాట నిలుపుకున్నారు. స్వల్ప కాలంలోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నారు. నేను బీఎస్సీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తి కాగానే నాకు ఉద్యోగం వచ్చింది. నాలా ఎందరో ఉద్యోగాలు పొందారు. ఈ విషయాన్ని ఎప్పటికీ మరచిపోలేం. మేము ఎప్పటికీ సీఎంకు రుణపడి ఉంటాం. – బండారి లక్ష్మీలావణ్య, సచివాలయం కార్యదర్శి, పెదపట్నంలంక, మామిడికుదురు మండలం, తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ వాహన మిత్ర.. ఎంతో అండ ఆటో/ మ్యాక్సీ క్యాబ్‌లను సొంతంగా నడుపుకునే వారికి ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర కింద రూ.10,000 ఆర్థిక సాయం అందించింది. ఈ పథకం ఆటో డ్రైవర్లకు ఎంతగానే అండగా నిలిచింది. ఆటో రిపేర్లకు, ట్యాక్స్ చెల్లింపులకు ఈ మొత్తం బాగా ఉపయోగపడుతుందని పలువురు ఆటో, ట్యాక్రీ డ్రైవర్లు కొనియాడుతున్నారు. ఇదివరకెవ్వరూ ఇలా ఆదుకోలేదు నా కుటుంబానికి నేనే ఆధారం. నాకు ఒక పాప, బాబు ఉన్నారు. వారిని చదివిస్తున్నాను. ఆటో నడిపితే గానీ పూటగడవని పరిస్థితి. ఒక్కో రోజు వచ్చే మొత్తం గిట్టుబాటు కావడం లేదు. ఆటోకు ఏవైనా మరమ్మతులు చేయించాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకున్నా. రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో రూ.10 వేలు నా బ్యాంకు ఖాతాకు జమయ్యాయి. నాలాంటి ఎంతో మంది పేదలకు ఈ పథకం వరం. సీఎం జగన్‌కు మేమంతా రుణపడి ఉంటాం. – బాగుల బాలాజీ, ఆటో డ్రైవర్, రేఖపల్లి, వీఆర్‌పురం మండలం, తూర్పు గోదావరి జిల్లా అగ్రిగోల్డ్ బాధితులకు బాసట నేను గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తుంటాను. అగ్రిగోల్డ్ సంస్థ లక్షలాది మంది ఖాతాదారులను నిలువునా ముంచింది. గత ప్రభుత్వానికి బాధితులు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. వైఎస్ జగన్ మాత్రం.. నేనున్నానంటూ బాధితుల తరఫున న్యాయం చేసేందుకు పూనుకున్నారు. అధికారంలోకి రాగానే తొలి విడతగా అగ్రిగోల్డ్ బాధితులకు రూ.269 కోట్లు ఇచ్చి ఆదుకున్నారు. నేను రూ.10 వేల సాయం అందుకున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ప్రజల అదృష్టం. ఇకపై అగ్రిగోల్డ్ బాధితులు ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదు. రానున్న రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులందరి కష్టాలు పూర్తిగా తీరుస్తారనే భరోసా వచ్చింది. – జి.సుబ్రమణ్యం, నూజెండ్ల, వినుకొండ నియోజకవర్గం, గుంటూరు జిల్లా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఒక వరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించారు. ఇది నిజంగా పోలీసులకు ఓ వరం లాంటిది. ఎప్పుడూ ఉద్యోగ ఒత్తిడిలో ఉండే పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండగలుగుతున్నాం. బ్రిటిష్ కాలం నాటి నుంచి పోలీస్ వ్యవస్థలో వీక్లీ ఆఫ్ అనేది లేదు. ఆ చరిత్రను ఈ సీఎం తిరగరాశారు. – కొప్పిశెట్టి శ్రీహరి, ట్రాఫిక్ కానిస్టేబుల్, రాజమహేంద్రవరం ఎన్నెన్నో పథకాలతో కోట్లాది మందిలో సంక్రాంతి – పిల్లలను చదివించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి పేద విద్యార్థి తల్లికి ప్రోత్సాహకంగా ఏటా రూ.15,000 అందించడం ఈ పథకం ఉద్దేశం. 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్లలో ఈ పథకం కింద రూ.6,456 కోట్లు జమ అయింది. – మగ్గం ఉన్న నేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని కింద ప్రతి లబ్ధిదారు కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. – ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని రూ.2,250కి పెంచింది. దీనిని ఏటా రూ.250 చొప్పునా పెంచుకుంటూ వెళ్తుంది. – డ్వాక్రా మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలను అమల్లోకి తెచ్చింది. రాబడి రాగానే వడ్డీ లేకుండా అసలు మాత్రమే చెల్లించే వెసులుబాటు కల్పించింది. – కొత్తగా ప్రాక్టీసు ప్రారంభించిన న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. – ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడం వల్ల రాష్ట్రంలోని 1.40 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది. రాష్ట్రంలోని ఆసుపత్రులతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం వైద్యం పొందేలా విప్లవాత్మక మార్పులు చేసింది. – జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు పేద విద్యార్థుల పాలిట నిజంగా వరం. పేద విద్యార్థులు ఎంత వరకైనా చదువుకునేలా ఉన్నత చదువులకు అవసరమైన ఫీజు మొత్తాన్ని విద్యా దీవెన పథకం ద్వారా అందజేస్తుంది. హాస్టల్ వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేల సాయాన్ని వసతి దీవెన పథకం కింద ఇస్తుంది. -
పాతాళంలో జలం..అయినా పంటలు పుష్కలం..!
సాక్షి, అమరావతి బ్యూరో: భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతే ఆ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతుంది. కానీ.. అందుకు భిన్నంగా కృష్ణా జిల్లా ముసునూరు మండలం మాత్రం పచ్చని పంటలతో కళకళలాడుతోంది. అలాగని ఆ మండలంలో సాగునీటి ప్రాజెక్టులు లేవు. కేవలం వర్షాలు బోరు బావులు మాత్రమే అక్కడి రైతులకు ఆధారం. ఆ మండలంలో 1990 వరకు భూగర్భ జలాలు అందుబాటులోనే ఉండేవి. ఆ తర్వాత బోర్లు వేయడంతో నీటి వినియోగం బాగా పెరిగింది.. 1999లో 21.67 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 2019 నాటికి 110 మీటర్లు, కొన్నిచోట్ల 150 మీటర్ల లోతుకు కూడా వెళ్లిపోయాయి. భూగర్భ జలాల రాష్ట్ర సగటు 12.82 మీటర్లు కాగా.. రాష్ట్ర సగటు కంటే 8 నుంచి 12 రెట్లు దిగువకు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ మండలంలో 5,352 బోర్లున్నాయి. వీటిలో చాలా బోర్లు వెయ్యి అడుగుల లోతుకు తవ్వారు. ఒకప్పుడు గరిష్టంగా 5 హార్స్పవర్ (హెచ్‌పీ) మోటార్లను వాడేవారు. ఇప్పుడుగా 15, 20 హెచ్‌పీ మోటార్లను వాడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ముసునూరు మండలంలోని 16 గ్రామాల్లో ఒక్క కొర్లకుంట మినహా మిగిలిన అన్ని గ్రామాల్లోనూ వాల్టా చట్టం అమలు చేస్తూ అధికారులు కొత్త బోర్ల ఏర్పాటుపై నియంత్రణ విధించారు. ప్రస్తుతం ఉన్న బోర్లు మరింత లోతుకు తవ్వకుండా ఆంక్షలు పెట్టారు. ఈ మండలాన్ని డార్క్ ఏరియాగా ప్రకటించారు. అక్కడ ఇసుక తవ్వకాలపై కూడా నిషేధం అమలు చేస్తున్నారు. 60 రకాల పంటలతో.. ఈ మండలంలో 13,351 హెక్టార్లలో 60 రకాల పంటలు సాగవుతున్నాయి. బోర్లు వేయకముందు ఇక్కడ పది రకాల పంటలే పండించేవారు. ఏటా రెండు, మూడు పంటలు వేసి గణనీయమైన, నాణ్యమైన దిగుబడులనూ సాధిస్తున్నారు. వీటిలో మొక్కజొన్న, ఆయిల్‌పామ్, వరి, మామిడి, అరటి, పొగాకు, మిర్చి, కొబ్బరి, పత్తి, నిమ్మ, జామ, కూరగాయలు, చెరకు, వేరుశనగ, బొప్పాయి, మినుములు, పెసలు, జీడిమామిడి, బీర, ఉలవలు, టమాటా, కేప్సికం, సుబాబుల్, జొన్న, కంది, బీన్స్, పసుపు, మల్లె, చామంతి, రేగు, ములక్కాడ, పొద్దు తిరుగుడు, కాకర వంటివి ఉన్నాయి. వీటిలో ఏడాది పొడవునా నీరు అధికంగా అవసరమయ్యే ఆయిల్‌పామ్ 2,345 హెక్టార్లలోను, వరి 2,200 హెక్టార్లలోను సాగవుతున్నాయి. నేల గొప్పదనమే ఇది ముసునూరులో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నా నీటి లభ్యతతో పాటు పంటలు పండడానికి అక్కడ ఎర్ర ఇసుక నేలలే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేల కింద ఇసుక రాతి పొరలున్నాయి. ఇవి ఎక్కువ సేపు నీటిని నిల్వ ఉంచే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల భూమిలో లోతుకు వెళ్లినా సమృద్ధిగా నీళ్లు లభిస్తున్నాయి. జలశక్తి అభియాన్‌లో ఎంపిక.. కేంద్ర జలశక్తి అభియాన్ పథకంలో ముసునూరు మండలాన్ని ఎంపిక చేశారు. అక్కడ భూగర్భ జలాలను పైకి తీసుకురావడానికి దోహదపడే నీటి పొదుపు చర్యలు పాటించడం, పొలంలో ఫారం పాండ్స్ ఏర్పాటు, నీటి వినియోగం తక్కువయ్యే ప్రత్యామ్నాయ పంటలు వేయడం వంటివి సిఫార్సు చేస్తూ అధికారులు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. రైతులు క్రమంగా డ్రిప్ ఇరిగేషన్‌పై ఆసక్తి చూపుతుండటంతో సుమారు 7వేల హెక్టార్లలో నీటిని పొదుపు చేస్తున్నారు. మండలంలోని ముసునూరు, సూర్యపల్లి, వేల్పుచర్లల్లో పిజియో మీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జలాల స్థాయిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం.. చింతలపూడి పథకం ద్వారా గోదావరి జలాలను సాగర్ ఎడమ కాలువలోకి మళ్లించి.. తమ్మిలేరు వాగు పరీవాహక ప్రాంతంలోని లోపూడి, గుళ్లపూడి, గుడిపాడు, వలసపల్లి, ఎల్లాపురం గ్రామాలకు కలిపితే చెరువులు నిండి భూగర్భ జలాల వృద్ధికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది సీఎం వైఎస్ జగన్ పుణ్యం కట్టుకోవడం వల్ల చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగాయి. – రేగుల గోపాలకృష్ణ, అధ్యక్షుడు, ముసునూరు పీఏసీఎస్ రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం భూగర్భ జలాల పెంపుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ ఆవశ్యకతను వివరిస్తున్నాం. రెండు వేల మంది రైతులకు శాస్త్రవేత్తలతో కలిసి కిసాన్ మేళా నిర్వహించాం. ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు వస్తున్నాయి. – బి.శివశంకర్, మండల వ్యవసాయాధికారి, ముసునూరు 30 ఏళ్ల క్రితం 25 అడుగుల్లోనే నీరు 30 ఏళ్ల క్రితం మా ప్రాంతంలో 25 అడుగుల్లోనే నీరుండేది. అప్పట్లో బోర్లు వేయడానికి 100 అడుగులు తవ్వితే సరిపోయేది. ఇప్పుడు 600 అడుగుల తోతుకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల 15–20 హెచ్‌పీ మోటార్లు బిగించి నీరు తోడుతున్నారు. చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలి. – ఎం.సుబ్బారావు, రైతు, గుడిపాడు, ముసునూరు మండలం -
గిరి వాకిట సిరులు!
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో దాదాపు గిరిజన రైతులంతా ఖర్చులేని ప్రకృతి సేద్య విధానం (జడ్బీఎన్ఎఫ్)లో రాగులు సాగుచేసి సిరులు కురిపిస్తున్నారు. ఎలాంటి ఎరువులు, రసాయనిక మందులను కూడా వాడకుండా పూర్తిగా గుల్లిరాగి పద్ధతిని అనుసరిస్తున్నారు. ఫలితంగా తక్కువ విత్తనాలతో అదీ దేశవాళీ రకాలతో రికార్డు స్థాయిలో దిగుబడి సాధిస్తున్నారు. ఈ తరహాలో మంచి దిగుబడులు సాధించిన సుమారు 250 మంది గిరిజన రైతులను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ అభినందించారు. సోమవారం ముంచంగిపుట్టు మండలంలోని వణుగుపుట్టులో రైతుసాధికార సంస్థ, ఐటీడీఏ, వ్యవసాయ శాఖ, జడ్బీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మన్యంలోని 21 క్లస్టర్లలోనూ వంద శాతం జడ్బీఎన్ఎఫ్ అమలు చేయడానికి ఐటీడీఏ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైబ్రిడ్ విత్తనాలతో కాకుండా పూర్తిగా దేశవాళీ విత్తనాలతోనే రాగుల సాగులో రికార్డు స్థాయి దిగుబడి సాధించడం విశేషమని జడ్బీఎన్ఎఫ్ జిల్లా మేనేజరు డి.దాసు హర్షం వ్యక్తం చేశారు. రాగులదే ప్రథమ స్థానం.. చిరుధాన్యాల్లో రాగులది ప్రథమ స్థానం. జిల్లాలో వరి, చెరుకు పంటల తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట ఇదే. మొత్తం 17,626 హెక్టార్లలో ఈ ఖరీఫ్‌లో సాగు చేశారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. 2017 ఖరీఫ్‌లో 16,731 హెక్టార్లు, 2018 ఖరీఫ్‌లో 16,731 హెక్టార్లకే పరిమితమైంది. ఈసారి సాగు పెరిగింది. దీనిలో ఎక్కువగా మన్యంలోని 21 వ్యవసాయ క్లస్టర్లలోనే సాగు అయ్యింది. ఇప్పటికే దసరా బూడులు, మింతచోడి, మిలట్రీ చోడి రకాల పంట కోతలు పూర్తయ్యాయి. ఇప్పుడు పెద్దరకం చోడి పంట కోతలు మొదలయ్యాయి. ఇది దాదాపు గుల్లిరాగి సాగు విధానంలోనే సాగింది. గిరిజన రైతులు అద్భుతమైన దిగుబడులు సాధించారు. వ్యవసాయ శాఖ, రైతుసాధికారిక సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు (జడ్బీఎన్ఎఫ్) అధికారులు, సంజీవని, వాసన్, సీసీఎన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో గిరిజన రైతుల ప్రతిభ వెల్లడైంది. తనకు రెండెకరాల్లో రాగులు పంట సాగుచేసిన గిరిజన రైతు పాంగి గోవిందు ఎకరాకు 18.20 క్వింటాళ్ల చొప్పున రికార్డు స్థాయిలో దిగుబడి సాధించి అభినందనలు పొందారు. మన్యంలోని 11 మండలాల్లోనున్న 21 క్లస్టర్లలో 1,260 మంది గిరిజన రైతులు గుల్లిరాగు విధానాన్నే అనుసరించడం విశేషం. సుమారు 824 ఎకరాల్లో ఈ విధానంలో సత్ఫలితాలు సాధించారు. ప్రభుత్వ ప్రోత్సాహం... చిరుధాన్యాల సాగులో ముందంజలోనున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా నిలబడుతున్నాయి. ముఖ్యంగా రాగులకు కనీస మద్దతు ధర బాగా పెరిగింది. 2018–19 సంవత్సరంలో క్వింటాలుకు రూ.2,897లు ఉంది. ఈ ఖరీఫ్ సీజన్లో రూ.3,150కి పెరిగింది. ఈ ప్రకారం రాగులకు మద్దతు ధర గత ఏడాది కన్నా ఈసారి రూ.253 పెరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే చిరుధాన్యాల సాగును పెంచడానికి మరింత ప్రోత్సాహం, ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా త్వరలోనే మిల్లెట్ బోర్డునూ ఏర్పాటు చేయనున్నారు. ఈ బోర్డు ద్వారా చిరుధాన్యాలు పండించే రైతులకు అవసరమైన సాయం, ప్రోత్సాహం అందనున్నాయి. మద్దతు ధరకన్నా తక్కువకు అమ్మవద్దు జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ విధానం విశాఖ మన్యంతో పాటు నాలుగు జిల్లాల్లో అమలు చేస్తున్నాం. రాగుల సాగులో విశాఖ మన్యం రైతులు అద్భుత ప్రగతి చూపిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఎకరాకు 18 క్వింటాళ్లు దిగుబడి సాధించడం గొప్ప విషయం. రాగులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ ధర ఎవ్వరు ఇచ్చినా విక్రయించవద్దని గిరిజన రైతులకు చెబుతున్నాం. గిరిజన సహకార సమాఖ్య (జీసీసీ), పాడేరు ఐటీడీఏ యంత్రాంగం రాగుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. – పి.దేవుళ్లు, రాష్ట్ర రిసోర్స్‌పర్సన్, జడ్బీఎన్ఎఫ్ -
ఉప్పునీటి మొక్కలకు మళ్లీ ఊపిరి!
సాక్షి, అమరావతి : ‘ఈల కూర పప్పులో కూడా ఉప్పేశావా.. టాట్!’.. కోస్తా తీర ప్రాంతాలలో వాడుకలో ఉన్న సామెత ఇది. భార్యతో గొడవ పెట్టుకోవడానికి ఏ కారణం దొరక్కపోతే ఈ సాకుతో పెట్టుకోవచ్చంటారు. ఎందుకంటే ఈల కూర ఆకులే ఉప్పగా ఉంటాయి.. దాన్లో మళ్లీ ఉప్పు వేయాల్సిన పనుండదు కాబట్టి. ఇంత గుర్తింపు ఉన్న ఈ తరహా మొక్కలు మడ అడవులు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు నీటి ఆధారంగా పెరుగుతాయి. వీటిని శాస్త్రీయంగా ‘హాలోఫైట్స్’ అంటారు. చాలా రకాల మొక్కలు తెరమరుగైనట్లే ఇవి కూడా అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వృక్ష శాస్త్రవేత్తలు తిరిగి ఈ మొక్కను పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రత్యామ్నాయంగానే సాగు రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతోపాటు అందుకు నీటి వినియోగం తారాస్థాయికి చేరింది. కిలో బియ్యం (వరి) పండాలంటే సుమారు 2,800 లీటర్ల నీరు కావాలని శాస్త్రవేత్తలు లెక్కతేల్చారు. ఈ తరుణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారు ఉప్పునీటి భూముల్లోనూ పండే పంటలపై దృష్టిసారించారు. వీటి సాగువల్ల సముద్ర తీరప్రాంత కోతల్ని, తుపాన్లనూ తట్టుకోవచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. 1970లలో అమెరికాలో మొదలైన ఈ హాలోఫైట్స్ పంటల సాగు ఇప్పుడు మనకూ వచ్చింది. సెంట్రల్ సాల్ట్, మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ), డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ఇందుకు నడుం కట్టాయి. ప్రధానంగా మూడు రకాలు సాగులోకి.. ఉప్పు నీరు పారే భూముల్లో పెరిగే హాలోఫైట్స్లో చాలా రకాలు ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కొబ్బరిచెట్టుపేట వద్ద ఉప్పునీటి ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా మూడు రకాల మొక్కలను సాగుచేస్తున్నారు. అవి.. పోర్ట్రేసియా కోయక్టటా, ఫిమ్బ్రిస్టిలిస్ ఫెర్గునియా, పాస్పలమ్ వజినాటమ్ రకాలు. ఇవన్నీ గడ్డి జాతి మొక్కలు. పశుగ్రాసానికి పనికివస్తాయి. శాస్త్రీయ నామాలే తప్ప వీటికి స్థానిక పేర్లు ఖరారు చేయలేదు. ఇవి 180 రోజుల్లో కోతకు వస్తాయి. ఈ గడ్డి రకాలను వాణిజ్య పరంగా సాగుచేయవచ్చా అనే దానిపై ప్రస్తుతం విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. మెక్సికో, ఆఫ్రికా తదితర దేశాల్లో చేసిన ప్రయోగాలను బట్టి ఈ రకాల నుంచి ఆయిల్‌ను, జీవ ఇంధనాన్ని, బయోసాల్ట్ను కూడా తయారుచేయవచ్చని తేలింది. ఈ మూడు రకాలు ఉభయతారకం.. ఇవికాక.. సుయోడా మారిటిమా, సేసువియమ్ పోర్చులకాస్ట్రమ్, సాలీకోర్నియా బ్రాచియాట రకాలు అయితే అటు తినడానికి ఇటు పశుగ్రాసానికీ పనికి వస్తాయి. వీటినీ ఉప్పు, మంచినీటిలో సాగుచేయవచ్చు. హెక్టార్‌కు 20 టన్నుల వరకు గడ్డి వస్తుంది. సుయోడా మారిటిమా రకాన్ని స్థానికంగా ఈలకూర అని, సేసువియమ్ పోర్చులకాస్ట్రమ్ను వొంగులేడీ లేదా బుస్కా అని పిలుస్తారు. వీటిని మన పొన్నెగంటి కూర, పాయలాకు, చెంచలాకు, సోయి కూర, తెల్లగలిజేరు, ఎర్రగలిజేరు మాదిరిగా విడిగా లేదా పప్పులో వేసుకుని వండుకోవచ్చు. రొయ్యల కూరలోనూ కలుపుకోవచ్చు. తీరప్రాంత వాసులైతే అచ్చంగా వీటి లేత ఆకులతో కూర తయారుచేస్తుంటారు. ఆకులు ఉప్పగా ఉండడంవల్ల కూర రుచిగా ఉంటుంది. ప్రత్యేకించి వీటి ఆకుల్లో లవణాలు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో విస్తృత ప్రయోజనాలు కొబ్బరిచెట్టుపేట గ్రామ సమీపంలో పెంచుతున్న ఈలకూర, వొంగులేడి మొక్కలు వాస్తవానికి చాలా ప్రాచీనమైనవి. కాలక్రమంలో కనుమరుగయ్యాయి. ప్రస్తుతం వీటిపై విస్తృత ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. విదేశాల్లో ఈ మొక్కలకు చాలా గిరాకీ ఉంది. ఔషధాల్లోనూ వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లోనూ వీటిని పెంచేలా నారును పోశారు. ఇవి తీరప్రాంత కోతనూ నివారిస్తాయి. మంచిపోషక విలువలున్న ఈ మొక్కల్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. – డాక్టర్ రామసుబ్రమణ్యం, స్వామినాథన్ ఫౌండేషన్, చెన్నై -
బుంగ మిర్చి.. బందరు కుచ్చి
సాక్షి, మచిలీపట్నం: బుంగ మిర్చి. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో బుట్ట మిరప అని కూడా పిలుస్తారు. దీనికి మసాలా పెట్టి బజ్జీలేస్తే లొట్టలేసుకుని తినాల్సిందే. కొంచెం కారంగా.. ఇంకొంచెం కమ్మగా ఉండే ఈ బజ్జీ రకం మిర్చి అచ్చం క్యాప్సికమ్‌ను పోలి ఉంటుంది. కానీ.. సైజులో మాత్రం దానికంటే తక్కువ. అరుదైన ఈ రకం దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో మాత్రమే సాగులో ఉంది. ఆ తరువాత మచిలీపటా్ననికి కూతవేటు దూరంలోని పోతేపల్లిలో సాగవుతోంది. ఇక్కడి కౌలు రైతులు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలా వచ్చింది.. మచిలీపట్నంలోని రాజుపేటకు చెందిన ఓ వ్యక్తి సుమారు 50 ఏళ్ల క్రితం కర్ణాటక ప్రాంతం నుంచి ఒక మిరప మొక్కను తీసికొచ్చి నాటారట. దాని నుంచి వచ్చిన విత్తనాలతో రెండు మొక్కల్ని అభివృద్ధి చేసి.. వాటిలో ఒక దానిని పోతేపల్లి గ్రామంలో ఒక రైతుకు ఇచ్చారని చెబుతారు. ఆ ఒక్క మొక్క నుంచి వచ్చిన విత్తనాలతో 40 ఎకరాల్లో సాగు చేపట్టారని రైతులు చెబుతున్నారు. దీనిని అక్కడక్కడా కూర కోసం వినియోగించినా.. ఎక్కువగా బజ్జీలకే వాడతారు. కృష్ణా, గుంటూరు, విజయవాడ నగరాలతోపాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు, బరంపురం ప్రాంతాల్లో ఈ రకం మిర్చికి డిమాండ్ ఎక్కువ. ఇక్కడి నుంచి ప్రతి వారం కనీసం మూడు లారీల కాయలు ఎగుమతి అవుతాయి. ప్రత్యేకతలివీ.. తొలకరిలో ఇతర పంటల మాదిరిగానే జూన్‌లో నారు పోస్తారు. ఆగస్టులో మొక్కలు నాటుతారు. నాటిన మూడో నెల నుంచి 9వ నెల వరకు దిగుబడి వస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకూ వారానికోసారి కాయల్ని కోస్తారు. చల్లటి వాతావరణంలో మాత్రమే సాగయ్యే బుంగ మిరపకు ఎకరానికి రూ.3 లక్షల పెట్టుబడి అవుతుంది. దీనిని కౌలు రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.40 వేల వరకు కౌలు చెల్లిస్తారు. ఎకరానికి కనీసం 12 లక్షల వరకు కాయల దిగుబడి వస్తుంది. ఒక్కో కాయను 40 పైసల నుంచి 60 పైసలకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. కాయ సగటు ధర 50 పైసల వరకు ఉంటుంది. పెట్టుబడి, ఇతర ఖర్చులు పోను ఎకరానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. చిత్రమేమిటంటే ఈ పంట పోతేపల్లి గ్రామంలో మాత్రమే పండుతుంది. ఇక్కడి విత్తనాన్ని తీసుకెళ్లి పొరుగు గ్రామాల్లో సాగు చేసేందుకు ప్రయత్నించినా విజయవంతం కాలేదు. ప్రోత్సహిస్తున్నాం.. క్యాప్సికమ్ జాతికి చెందిన బుంగ మిర్చి రకం ఇసుక నేలల్లోనే పండుతుంది. పోతేపల్లిలో ఇసుక నేలలు ఎక్కువగా ఉండడం వలన ఈ పంట సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకు సలాహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం. –దయాకరబాబు, ఏడీ, హార్టికల్చర్ లాభాలు బాగుంటాయి ఈ రకం మిర్చి ఈ ప్రాంతంలోనే పండుతుంది. దీనిని సాగు చేస్తే లాభాలు బాగుంటాయి. మిగిలిన పంటలతో పోలిసే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కర్ణాటకలోని హుబ్లీ, బెల్గాం, ధార్వాడ ప్రాంతాల నుంచి విత్తనం తెచ్చుకుంటున్నాం. – కె.నూకలయ్య, రైతు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరింత సాగు ఎకరా 20 సెంట్లలో 40 ఏళ్లుగా ఈ పంట సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.రెండు లక్షల వరకు మిగులుతుంది. ఈ ప్రాంతంలో పండించే పంటను సేకరించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నా. ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే బాగుంటుంది. – కటికల రాజేష్, సాగుదారు -
కరువు సీమలో ఆనందహేల
అనంతపురం అగ్రికల్చర్: పాతాళ గంగమ్మ పైపైకి పొంగుతుండగా...బీడువారిన పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. గ్రాసం లభించక కబేళాలకు తరలిన మూగజీవాలు కడుపునిండా పచ్చిగడ్డి మేస్తున్నాయి. వర్షాభావంతో పొట్టచేత పట్టుకుని వలస పోయిన జనాలు తమ భూముల సాగుకు తిరుగుపయనమయ్యారు. ఖరీఫ్ సీజన్లో చాలా ఏళ్ల తరువాత అనంతపురం జల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిండిన చెరువులు... పొంగిన నదులు... ఎప్పుడూ నెర్రలు చీలి కనిపించే పెద్ద చెరువులు తాజా వర్షాలతో పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని వందలాది చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండి ఉధృతంతా ప్రవహిస్తున్నాయి. పూర్తిగా ఎండిపోయి ఎడారిలా కనిపించిన పెన్నా, చిత్రావతి, కుముద్వతి, వేదవతి, హగరి, జయమంగళి లాంటి నదుల్లోనూ నీళ్లు పారుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో భూగర్భజలాలు 27 మీటర్ల దిగువన కనిష్ట స్థాయిలో ఉండగా అక్టోబర్ మొదటి వారంలో 24 మీటర్లకు ఎగబాకడం విశేషం. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా ఇప్పటికే 78.9 మి.మీ నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 552.3 మి.మీ కాగా ఈ ఏడాది అక్టోబరు 7వ తేదీ నాటికే 411.7 మి.మీ. వర్షం నమోదయింది. చాలా సంవత్సరాల తర్వాత జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో అన్నదాత ఇంట ఆనందం వ్యక్తమవుతోంది. లక్ష హెక్టార్లలో సాగుకానున్న పప్పుశనగ భారీ వర్షాలతో ఈ రబీలో పప్పుశనగ కనీసం లక్ష హెక్టార్లలో సాగులోకి వచ్చే పరిస్థితి ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పొలాల్లో నీరు చేరడంతో ఇప్పటికే వేసిన కొన్ని పంటలు దెబ్బతినగా రూ. 20 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. ఒకేరోజు 30.2 మి.మీ వర్షపాతం వరుణుడి ప్రభావంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 25 రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కరువు సీమ కోనసీమలా మారింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 63 మండలాల్లోనూ ఒకే రోజు 30.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గుత్తి, పరిగి, పెద్దవడుగూరు, రొద్దం, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర తదితర మండలాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కిలోమీటర్ల మేర రహదారులు, పదుల సంఖ్యలో కల్వర్టులు దెబ్బతిన్నాయి. రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
చినుకు చక్కగా..
సాక్షి, అమరావతి: జూన్ 1న మొదలైన ఖరీఫ్ (సార్వా) సీజన్ సెప్టెంబర్ 30తో ముగిసింది. నైరుతి రుతు పవనాలు కూడా సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసినట్లే లెక్క. సాంకేతికంగా చూస్తే.. రుతు పవనాలు దాటిపోవడానికి వారం అటూ ఇటూ పట్టవచ్చు. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ఆరంభంలో కొంత నిరాశ కలిగించినప్పటికీ చివరకు వచ్చేసరికి సంతృప్తి మిగిల్చాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన దానికంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం.. మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. నైరుతి సీజన్లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 514.4 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది ఈ సీజన్లో 565.2 మిల్లీమీటర్ల వర్షపాతం (10 శాతం అధికం) నమోదైంది. వాతావరణ శాఖ 50 ఏళ్ల సగటు వర్షపాతాన్ని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తుంది. దీనికంటే 19 శాతం ఎక్కువ కురిసినా, తక్కువ కురిసినా సాధారణ వర్షపాతంగానే పేర్కొంటుంది. సాధారణం కంటే 20 శాతం తక్కువైతే లోటు వర్షపాతంగా, ఎక్కువైతే అధిక వర్షపాతంగా గుర్తిస్తుంది. ప్రాంతాలవారీగా చూస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సాధారణం కంటే 12 శాతం, కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో 9 శాతం అధిక వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో 556.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 676.4 మిల్లీమీటర్లు (22 శాతం అధికం) వర్షపాతం రికార్డయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలో 728.9 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతానికి గాను 874 మిల్లీమీటర్లు (20 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లలో జలకళ ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో అనుకున్న వర్షపాతం నమోదు కావడంతోపాటు ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిశాయి. దీంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార నదుల్లో వరద నీరు పోటెత్తింది. ఫలితంగా శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగుకు, భూగర్భ జలమట్టం పెరుగుదలకు ఇది బాగా దోహదపడుతోంది. ఈ వర్షాలు రబీలో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు కూడా బాగా ఉపకరిస్తాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. సాగు.. బాగు సెప్టెంబర్ 30తో ముగిసిన ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కూడా ఆశాజనకంగానే ఉంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 42.04 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాలన్నది లక్ష్యం. ఈ లెక్కన జూన్ 1నుంచి సెప్టెంబర్ 25 నాటికి 38.30 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 35.26 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. సీజన్ మొత్తమ్మీద చూస్తే.. సెప్టెంబరు 25వ తేదీ వరకూ గణిస్తే 93 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. దీని ప్రకారం చూస్తే ఈ సీజన్లో సాగు సంతృప్తికరంగా ఉన్నట్లే. రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్ ఆరంభం నుంచి రెండు నెలలు సరైన వర్షం కురవకపోవడం వల్ల నిర్ణయించిన సాగు లక్ష్యంలో 93 శాతం విజయవంతమైంది. -
పచ్చని సిరి... వరి
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ పంటల సాగు కోటి ఎకరాలకు మించి సాగైంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, బుధవారం నాటికి 1.02 కోట్ల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సర్కారుకు నివేదిక పంపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండటం, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గణనీయంగా కురవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి నాట్లు పడ్డాయి. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, 26.79 లక్షల ఎకరాలు (111%) సాగు కావడం గమనార్హం. పత్తి సాగు విస్తీర్ణం సాధారణం కంటే పెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 45.32 లక్షల ఎకరాలకు (105%) చేరింది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.46 లక్షల ఎకరాలు (76%) సాగైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.18 లక్షల ఎకరాలు (88%) సాగైంది. పురుగుల దాడి సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.25 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.3 లక్షల ఎకరాలు (82%) సాగైంది. 11 జిల్లాల్లో వంద శాతంపైగా విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అందులో నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో 122 శాతం చొప్పున విస్తీర్ణంలో పంటలు సాగవడం గమనార్హం. నిర్మల్ జిల్లాలో 116 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 113 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఒక్క ఖమ్మం జిల్లాలో అత్యంత తక్కువగా 80 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో వరిపై స్టెమ్ బోరెర్ అనే పురుగు దాడి చేస్తుంది. ఇక మహబూబ్‌నగర్, గద్వాల, ఖమ్మం, జనగాం జిల్లాల్లో మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి చేస్తోంది. జనగాం, జగిత్యాల జిల్లాల్లో పత్తిపై పచ్చ పురుగు దాడి చేస్తోందని వ్యవసాయ శాఖ తెలిపింది. మూడు జిల్లాల్లో లోటు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 611.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 597.6 మిల్లీమీటర్లు (–2%)నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే 28 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వరంగల్ అర్బన్, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
వాన కురిసె.. చేను మురిసె..
సాక్షి, అమరావతి: గడచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు తగ్గింది. గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉంటే ఇప్పుడది 19 శాతానికి తగ్గిపోయింది. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. దీంతో బుధవారానికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 17.54 లక్షల హెక్టార్లకు పెరిగింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరి నాట్లు పుంజుకున్నాయి. గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలు మినహా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నాట్లు జోరుగా పడుతున్నాయి. అలాగే విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాధారిత పంటలతోపాటు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ వరి నాట్లు ప్రారంభించారు. అయితే రాయలసీమ జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నాయి. నాలుగు రాయలసీమ జిల్లాలుసహా మొత్తం ఏడు జిల్లాలు బుధవారానికి 20 శాతం నుంచి 50 శాతం వరకు లోటు వర్షపాతంలో ఉన్నాయి. విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సాధారణ స్థితిలో ఉండగా శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోనూ పరిస్థితి మెరుగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే పంటల సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని చేరుతుందని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే నీరు రావడం ప్రారంభమైంది. ఈసారి శ్రీశైలం, సాగర్లు నిండేందుకు ఆస్కారం కనిపిస్తున్నందున సాగర్ కుడికాలువకు నీరిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగ్గిన వర్షపాతం లోటు... ఈ ఖరీఫ్ సీజన్లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మొత్తంగా 556 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికి 275.4 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే 224.1 మిల్లీమీటర్లే కురిసింది. అయితే గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగైంది. వర్షపాతం లోటు ప్రస్తుతం 19 శాతానికి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం సైతం పెరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 38.30 లక్షల హెక్టార్లుగా ఖరారు చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఇప్పటికి 22.17 లక్షల హెక్టార్లు అంటే సుమారు 79 శాతం విస్తీర్ణంలో పంటలు వేసి ఉండాల్సింది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు 17.74 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో ఎక్కువగా జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు వరి ఉంది. మొక్కజొన్న, రాగి, కంది, పత్తి, చెరకు వంటి పంటలైతే 75 శాతం వరకు వేసినట్టు వ్యవసాయ శాఖ లెక్కలేసింది. ఈ సీజన్లో ఇప్పటికి 7.44 లక్షల హెక్టార్లలో వరినాట్లు పడాల్సి ఉండగా.. 6.33 లక్షల హెక్టార్లలో వేశారు. ఖరీఫ్‌లో మొత్తంగా 15.19 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేయాలన్నది లక్ష్యం. ఇదిలా ఉంటే.. గోదావరి వరదలతో నీట మునిగి దెబ్బతిన్న వరి నారు మళ్లు తిరిగి పోసుకునేందుకు వీలుగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. గమనిక: +19 % నుంచి –19% వరకు ఉంటే సాధారణ వర్షపాతం కింద, +20%, ఆపైన ఉంటే అధిక వర్షపాతం కింద, –20 % నుంచి –59 % వరకు ఉంటే లోటు వర్షపాతం కింద, –59 % నుంచి –99 % వరకు ఉంటే భారీ లోటు వర్షపాతం కింద పరిగణిస్తారు) -
సాగు భళా.. రుణం వెలవెల
రైతును వరుణుడు కరుణిస్తున్నా... బ్యాంకులు మాత్రం దయ చూపడంలేదు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరుమీదున్నాయి. పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కానీ చేతిలో చిల్లిగవ్వ లేక రైతన్న లబోదిబోమంటున్నాడు. ఇటువంటి తరుణంలో బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ రైతును ఇబ్బంది పెడుతున్నాయి. గత వారం పది రోజులుగా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ వర్షాలు లేక ఆగిన వరి నాట్లు ఇక పుంజుకోనున్నాయి. వారం రోజుల క్రితం వరకు 28 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 17 జిల్లాలకే పరిమితమైంది. – సాక్షి, హైదరాబాద్ సాగు విస్తీర్ణాలిలా... - ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 75.81 లక్షల (70%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా పత్తి 41.96 లక్షల (97%) ఎకరాల్లో సాగైంది. - ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.90 లక్షల (33%) ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. తాజా వర్షాలతో అవి ఊపందుకోనున్నాయి. - మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.26 లక్షల (66%) ఎకరాల్లో సాగైంది. - పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.11 లక్షల (78%) ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.20 లక్షల ఎకరాలు, ఇప్పటివరకు 6.19 లక్షల (85%) ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ దాని సాధారణ సాగులో 80 శాతం వేశారు. 40 లక్షల మందికి.. పెట్టుబడి సాయం.. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈసారి రైతులకు పెట్టుబడికింద ఇచ్చే రైతుబంధు సొమ్ము సరఫరా ఆలస్యమైందని అధికారులు అంటున్నారు. ఖరీఫ్‌లో దాదాపు 50 లక్షల మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా, ఇప్పటివరకు 40 లక్షల మందికి రూ. 4,400 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతుబంధు సొమ్ము వచ్చినట్లుగా తమకు మెసేజ్‌లు వచ్చాయని, కానీ బ్యాంకుల్లో సొమ్ము పడలేదని కొందరు రైతులు ఆందోళనతో వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశారు. మూడో వంతే రుణాలు.. సాగు విస్తీర్ణం 70 శాతం కాగా, పంట రుణాలు మాత్రం లక్ష్యంలో దాదాపు 34 శాతానికే పరిమితమైనట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ. 29 వేల కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.10 వేల కోట్లకే పరిమితమైందని తెలిపాయి. వాస్తవంగా పంటల సాగు కంటే అంటే మే నెల నుంచే బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాలి. ఇప్పటికీ సాగు శాతంలో ఇచ్చిన రుణాలు సగమే. మూడు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి. బ్యాంకుల వాదన ఇదీ.. 2015–16 సంవత్సరం నుంచి 2018–19 సంవత్సరం వరకు పేరుకుపోయిన రూ.777 కోట్ల పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల బకాయిలను ప్రభుత్వం తమకు చెల్లించలేదని బ్యాంకర్లు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉండటంతో రిజర్వుబ్యాంకు నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు వస్తాయని అంటున్నారు. మరోవైపు పంటల రుణమాఫీపై తమకు ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, దీంతో రైతులు బకాయిలు చెల్లించడంలేదని చెబుతున్నారు. పాత రుణాలను రైతులు రీషెడ్యూల్ చేసుకోకపోతే నిబంధనల ప్రకారం తాము కొత్త రుణాలు ఇచ్చే ప్రసక్తే ఉండదంటున్నారు. -
వాన కురిసే.. సాగు మెరిసే..
సాక్షి, అమరావతి: చినుకు జాడ కోసం గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న రైతుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ పనులు ముమ్మరం చేశారు. మెట్ట పంటలతో పాటు మాగాణుల్లో నాట్లు వేయడం మొదలైంది. అడుగంటిన జలాశయాలకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతుండటంతో నీటి కొరత ఉండదని రైతులు భావిస్తున్నారు. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వచ్చే వారంలో మంచి వానలు పడే అవకాశం ఉండటం కూడా రైతుల్లో భరోసా నింపుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రుతుపవనాలు విస్తరించి ఉండడం కలిసివచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో విత్తన పంపిణీ నిరాటంకంగా సాగుతోంది. వర్షాధారిత పంటలు వేయడం ఊపందుకుంది. జొన్న, మొక్కజొన్న, అపరాలు, నూనె గింజల పంటల సాగు సైతం పుంజుకుంది. మొత్తం సాగు విస్తీర్ణం 42,04,218 హెక్టార్లు కాగా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ను 38,30,466 హెక్టార్లుగా ఖరారు చేశారు. ఇందులో ఇప్పటికి 19,73,041 హెక్టార్లలో విత్తనాలు పడాల్సి ఉంటే సుమారు 13.84 లక్షల హెక్టార్లలో విత్తినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. వరి, మొక్కజొన్న, రాగి, కంది, వేరుశనగ, ఆముదం, పత్తి, మిరప వంటి పంటలు 26 శాతం నుంచి 50 శాతం వరకు వేయడం పూర్తయింది. చెరకు నాటు దాదాపు 75 శాతం పూర్తయింది. డెల్టాలో ముమ్మరంగా నాట్లు... కృష్ణా, గోదావరి డెల్టాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాట్లు నాట్లు వేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 16.25 లక్షల హెక్టార్లలో వరి సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ పెట్టుకుంది. ఈ సీజన్లో ఇప్పటికి 6.27 లక్షల హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికి 4.81 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదులకు వరద నీరు పెరుగుతుండటంతో అనుకున్న లక్ష్యం మేరకు వరి సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వేరుశనగ పరిస్థితి ఇలా... వేరుశనగను ఈ సీజన్లో 9.16 లక్షల హెక్టార్లలో సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ 7.53 లక్షల హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో ఇప్పటికి 5.13 లక్షల హెక్టార్లలో వేరుశనగ విత్తనాలు పడాల్సి ఉంటే 2.43 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. మంచి వర్షాలు పడితే వేరుశనగ సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. మెట్టపంటలు, ఇతర ఆహార ధాన్యాల సాగు అనుకున్న లక్ష్యం మేరకు సాగుతోందని అధికారులు చెబుతున్నారు. త్వరలో సాధారణ స్థితికి వర్షపాతం.. గత వారంలో 36 శాతంగా ఉన్న లోటు వర్షపాతం ఈ వారానికి 27 శాతానికి చేరింది. మున్ముందు ఇది మరింత తగ్గి సాధారణ స్థితికి చేరుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్లో నైరుతీ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో 556 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాలి. ఇందులో ఇప్పటికి 245 మిల్లీమీటర్లు కురవాలి. కానీ ఇప్పటికి 178.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ సీజన్లో జూలై 31 వరకు ఏ జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదవలేదు. ఉత్తర కోస్తాలోని 5 జిల్లాల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు మినహా మిగతా మూడు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలు సాధారణ స్థితిలో ఉన్నాయి. దక్షిణ కోస్తాలోని గుంటూరు, ప్రకాశం మినహా కృష్ణా, నెల్లూరు జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. రాయలసీమలో చిత్తూరు మినహా వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. వరి రైతులకు సూచనలు ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్న రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం పలు సూచనలు చేసింది. ఆయా మండలాలకు సిఫార్సు చేసిన భాస్వరాన్ని ఆఖరి దమ్ములో వేసుకోవాలి. దీర్ఘకాలిక, మధ్య కాలిక రకాలైతే 25, 30 రోజుల వయసున్న నారును నాటుకోవాలి. స్వల్పకాలిక రకాలు సాగు చేస్తుంటే 20 నుంచి 25 రోజుల నారు నాటుకోవాలి. ప్రతి 2, 3 మీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పున కాలిబాటలు తీసుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజనిని మూడు సమభాగాలు చేసి నాటుకు ముందు ఒకసారి, పిలకల దశలో రెండో సారి, అంకురం దశలో మూడో సారి వేసుకోవాలి. పొటాష్‌లో సగభాగాన్ని మొదటి దశలో, మిగతా సగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. కలుపు నివారణకు నాట్లు వేసిన 3, 5 రోజులలోపు పల్చగా నీరు పెట్టి ఎకరానికి ఒకటిన్నర లీటర్ల బుటాక్లోర్ లేదా 500 మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్ లేదా ఆక్సాడయార్జిల్ 35– 50 గ్రాములు లేదా బెన్సల్ఫూరాన్ మిథైల్ గుళికలు ఎకరానికి నాలుగు కిలోలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించింది. -
నైరుతి రాగం!
-
రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణలోకి శుక్రవారం ప్రవేశించాయి. అనుకున్న సమయానికంటే ఏకంగా 12 రోజులు ఆలస్యంగా వచ్చాయి. వచ్చీ రావడంతోనే ఒకేసారి రాష్ట్రంలో 70 శాతం మేర విస్తరించాయి. ఒకట్రెండు రోజుల్లో మిగిలిన ప్రాంతాల్లోకి కూడా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైరుతి రుతుపవనాల ప్రవేశాన్ని ధ్రువీకరించారు. రుతుపవనాలు మరింత పురోగమనంలో ఉన్నాయని, వచ్చే రెండు వారాలూ అంటే వచ్చే నెల నాలుగో తేదీ వరకు తెలంగాణలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. జూన్‌లో ఇప్పటివరకు తెలంగాణలో 48 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఆ లోటును రానున్న కాలంలో భర్తీ చేసేలా వర్షాలు కురుస్తాయన్నారు. 60 శాతం ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కావడం, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో గాలులు భూమి నుంచి 4 కిలోమీటర్ల ఎత్తు వరకు వీయడం ఈ రెండు అంశాలను లెక్కలోకి తీసుకొని నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని అంచనా వేస్తామన్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు నిర్దారించామన్నారు. ఈ వర్షాలను ఆధారం చేసుకొని రైతు లు పంటలను సాగు చేసుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో రుతుపవనాలు మరింత పురోగమిస్తాయని తెలిపారు. జూలై 15 లోపు దేశమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని వివరించారు. ఈసారి 732 మిల్లీమీటర్ల వర్షం... సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంటే ఆ లెక్కను కూడా సాధారణ వర్షాలుగానే పరిగణిస్తామని వై.కె.రెడ్డి తెలిపారు. తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్ వర్షపాతం 755 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముందన్నారు. గతేడాది ఇదే సీజన్లో సాధారణ వర్షపాతాలే కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించినా 2 శాతం లోటు నమోదైంది. 2016లోనైతే సాధారణం కంటే ఏకంగా 19 శాతం రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైంది. నైరు తి రుతుపవనాలు ఒకసారి ప్రవేశించాక రెండ్రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. కొన్నిసార్లు విస్తరించడానికి నాలుగైదు రోజులు పడుతుంది. గతేడాది ఒకేసారి రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈసారి రెండు రోజుల్లోనే విస్తరిస్తాయని వై.కె.రెడ్డి తెలిపారు. కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడం గత ఆరేళ్ల లెక్కలతో పోలిస్తే ఈసారి చాలా ఆలస్యంగా వచ్చాయి. గతేడాది మే 29న రాగా, 2016లో జూన్ 7న ప్రవేశించాయి. ఈసారి జూన్ 8న వచ్చాయి. ఆలస్యం అనర్థంకాదు... రుతుపవనాలు ఆలస్యమైనంత మాత్రాన ఆ ఏడాది సీజన్ బాగుండదని అనుకోవాల్సిన అవసరం లేదని వై.కె.రెడ్డి తెలిపారు. గతంలో అనేకసార్లు ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదైన పరిస్థితి ఉందన్నారు. ఈ ఏడాది తెలంగాణలోకి జూన్ 8న రుతుపవనాలు వస్తాయని అంచనా వేశామని, కానీ 21న (శుక్రవారం) ప్రవేశించాయన్నారు. 2016లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి జూన్ 8న ప్రవేశించగా, తెలంగాణలోకి 19న వచ్చాయి. కానీ ఆ ఏడాది సీజన్లో సాధారణం కంటే ఏకంగా 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అలాగే 2012లో నైరుతి రుతుపవనాలు జూన్ 5న కేరళలోకి, అదే నెల 16న తెలంగాణలోకి ప్రవేశించాయి. కానీ 4 శాతం అధిక వర్షపాతం అప్పుడు రికార్డు అయింది. 2014లో మాత్రం కేరళలోకి నైరుతి రుతుపవనాలు జూన్ 6న ప్రవేశించగా, తెలంగాణలోకి జూన్ 20న వచ్చాయి. అప్పుడు మాత్రం ఏకంగా 34 శాతం లోటు వర్షపాతం నమోదైంది. గతేడాది మే 29న కేరళలోకి, 8న తెలంగాణలోకి అత్యంత ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ 2 శాతం లోటు వర్షపాతం నమోదైందని వై.కె.రెడ్డి తెలిపారు. గత ఇరవై ఏళ్లలో ఈసారి మాత్రమే అత్యంత ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించాయి. బలహీన రుతుపవనాలంటే? సాధారణంగా కురవాల్సిన దానిలో సగంలోపే వర్షపాతం నమోదైతే బలహీన రుతుపవనాలుగా పరి గణిస్తారు. సాధారణంలో సగానికి మించి నిర్ణీత వర్షపాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు. కనీసం 2 వాతావరణ కేంద్రాల్లో 3 సెంటీమీట్లర్లకంటే ఎక్కువగా నమోదై.. సాధారణ వర్షపాతం కంటే ఒకటిన్నర నుంచి నాలుగు రెట్లు నమోదైతే.. అవి బలమైన రుతుపవనాలు. కనీసం 2 వాతావరణ కేంద్రాల్లో 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా, సాధారణ వర్షపాతంలో నాలుగు రెట్లకు పైగా నమోదైతే.. అప్పుడు అద్భుత రుతుపవనాలుగా పరిగణిస్తారు. 1918లో రికార్డు... 1918వ సంవత్సరంలో నైరుతి రుతుపవనాలు అత్యంత ముందస్తుగా కేరళలోకి ప్రవేశించడం గమనార్హం. ఆ ఏడాది ఏకంగా మే 7నే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత 1943లో మే 12న, 1932లో మే 15న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న జాతీయ రికార్డు. సాధారణంగా కేరళలోకి మే 29న ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక అత్యంత ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సందర్భాలూ ఉన్నాయి. 1972లో ఏకంగా జూన్ 20న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 2003లో జూన్ 13న కేరళలోకి ప్రవేశించా యి. ఇవే ఇప్పటివరకున్న రికార్డులు. విస్తారంగా వర్షాలు... రుతుపవనాల రాకకు ముందు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గురువారం నుంచే తెలంగాణలోని అనేకచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. జనగాం జిల్లా జఫర్‌గఢ్‌లో 10 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. భూపాలపల్లి, పాలకుర్తిలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కరీంనగర్, ఘన్పూర్, పర్కాల్, రామగుండం, లింగంపేట, మొగుళ్లపల్లిలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. డోర్నకల్, సుల్తానాబాద్, మంచిర్యాల, తాడ్వాయిలో 6 సెంటీమీటర్ల చొప్పున.. గోవిందరావుపేట, లక్సెట్టిపేట, బెజ్జంకి, బిక్నూరు, పెద్దపల్లి, కొత్తగూడ, సిర్పూరులో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన చాలా ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. -
అన్నదాతల భగీరథ యత్నం
సాక్షి, చీరాలటౌన్ (ప్రకాశం): ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. చేతికి అందివచ్చే పంటలకు కావాల్సిన ఆఖరి తడి కోసం తంటాలు పడుతున్నారు. మినుము పంటలు సాగుచేసిన రైతులు తమ పంటలు కాపాడుకోవడానికి డీజిల్ ఇంజన్లను వినియోగిస్తున్నారు. వివరాల్లోకెళితే.. మండలంలోని గవినివారిపాలెం, పిట్టువారిపాలెం గ్రామాల్లోని రైతులు మినుము పంటలను 75 ఎకరాల్లో సాగు చేశారు. మరో నెల రోజుల సమయంలో పంట చేతికివచ్చే సమయంలో మినుము పంటకు కావాల్సిన నీటిని సిమెంట్ కాలువ నుంచి డీజిల్ ఇంజన్లు ద్వారా పైపులతో సరఫరా చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులకు కావాల్సిన నీటిని అందించడంతో అధికారులు, ప్రభుత్వం విఫలం కావడంతో డీజిల్ ఇంజన్లతో ఎకరానికి రూ.3వేలు ఖర్చు చేసి పంటలకు నీరు అందిస్తున్నామన్నారు. పంట చేతికందే సమయంలో కూడా నీటి కోసం తాము కష్టాలను అనుభవిస్తున్నామని రైతులు వాపోతున్నారు. సిమెంట్ కాలువల నుంచి డీజిల్ ఇంజన్లుతో నీటిని పైపుల ద్వారా పంట భూములకు తరలిస్తున్నారు. ప్రతిఏటా పంటల సాగుచేసే సమయంలో తాము సాగునీటి కోసం భగీరథ యత్నాలు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. -
ఏరువాక.. ఎందాక..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 17 జిల్లాల్లో వర్షాభావం ఏర్పడింది. బోరు బావుల్లో నీరు అడుగంటింది. దీంతో రబీ ఆశాజనకంగా లేదు. వరి నాట్లు ఇప్పటికీ ఒక్క ఎకరాలోనూ పడలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు మార్గనిర్దేశం చేయాల్సిన వ్యవసాయ శాఖ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై కసరత్తు మొదలు పెట్టలేదు. దీంతో రైతులు గందరగోళంలో పడ్డారు. కంటింజెన్సీ ప్రణాళిక రచించి రైతులను ఆదుకోవాల్సిందిపోయి రోజువారీ పనుల్లోనే పడిపోయారు. రైతుబంధు, రైతుబీమా తప్ప వ్యవసాయ శాఖ మరో అంశాన్ని పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఆ పథకాలకు తప్ప మిగిలిన వాటికి నిధులు కేటాయించట్లేదన్న విమర్శలూ ఉన్నాయి. పడిపోయిన భూగర్భ జలాలు.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిరాశ పరిచాయి. గత జూన్ నుంచి ఇప్పటివరకు 17% లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 15% అధికంగా వర్షపాతం నమోదైనా, జూలైలో ఏకంగా 30% లోటు నమోదైంది. ఆగస్టులో 18% అధికంగా రికార్డు కాగా, సెప్టెంబర్‌లో 35% లోటు నమోదైంది. అక్టోబర్‌లో ఏకంగా 93 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో అనేక ఖరీఫ్ పంటలు ఎండిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్రంలో 9.36 మీటర్ల లోతుల్లో నీరు లభించగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 9.94 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. కంటింజెన్సీ ప్రణాళికే కీలకం.. రబీ పరిస్థితి ఆశాజనకంగా లేదని వ్యవసాయ శాఖ వర్గాలే చెబుతున్నాయి. బోరు బావులు చెరువుల్లో నీళ్లు అడుగంటడంతో వరి అనుకున్నంత మేర సాగయ్యే పరిస్థితి లేదని చెబుతున్నారు. అయితే రబీలో వర్షాభావం నెలకొంటే, వరి సాగయ్యే పరిస్థితి లేకుంటే అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి. నవంబర్ 15 తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఆరుతడి పంటలే కీలకం. జొన్న, మినుములు, నువ్వులు వంటి వాటిని సాగు చేస్తారు. కానీ అదనపు విత్తనాల సరఫరాపై వ్యవసాయ శాఖ దృష్టి సారించలేదన్న ఆరోపణలున్నాయి. రబీలో అవసరమయ్యే విత్తనాలకే పరిమితమయ్యారు కానీ వర్షాభావం నెలకొంటే ఏం చేయాలన్న దానిపై ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం రబీలో 4.72 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో ఇప్పటివరకు 69,204 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. వాటిలో 58,176 క్వింటాళ్లే అమ్ముడుపోయాయి. వాస్తవంగా రబీ వరి విత్తనాలు 2.22 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. రబీలో మొక్కజొన్న విత్తనాలకు డిమాండ్ ఉన్నా వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచలేదు. వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, నువ్వులు, మినుములు, పెసర, కందులు, పిల్లిపెసర వంటి వాటిని అందుబాటులో ఉంచాలి. కానీ సాధారణ రబీకి కూడా వాటిని సరఫరా చేయలేదు. విచిత్రమేంటంటే సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేసేందుకు కూడా వ్యవసాయ శాఖ వద్ద నిధుల్లేవు. వివిధ కంపెనీలకు రూ.100 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు వ్యవ సాయ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దీంతో కంపెనీలు కూడా విత్తనాలను సరఫరా చేసేం దుకు ముందుకు రావట్లేదని చెబుతున్నారు. దారుణంగా వరి.. వరి పరిస్థితి దారుణంగా ఉంది. సాధారణంగా రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఒక్క ఎకరాలోనూ నాట్లు పడలేదని వ్యవసాయ శాఖే ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించింది. వికారాబాద్, మేడ్చల్, సిద్దిపేట, గద్వాల, నల్లగొండ, యాదాద్రి, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఎకరాలో కూడా ఏ పంటలూ సాగు కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. -
కాటేసిన కరువు
ఎండిపోయిన పైర్లు.. బీళ్లుగా మారిన పొలాలు.. కబేళాలకు తరలుతున్న పశువులు, వలస బాట పట్టిన రైతన్నలు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాల్లో ఇలాంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అన్నదాతలు కరువు కాటుకు చిక్కి విలవిల్లాడుతున్నారు. పంటల సాగు కోసం చేసిన అప్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతటి కరువును తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని రైతులు బోరుమంటున్నారు. దుర్భిక్షం ధాటికి పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం సైతం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంట చేతికి రాక, ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేక పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. రాయలసీమ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన పంట భూములు కరువు ధాటికి బీళ్లుగా మారాయి. జూన్ ఆరంభంలో అరకొర వర్షాలకు విత్తిన పైర్లు వాడిపోయాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆలూరు, అనంతపురం జిల్లాలోని కదిరి, గుత్తి, వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, గాలివీడు, చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు, పెద్దమండ్యం తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన వేరుశనగ పైర్లను ట్రాక్టర్లతో దున్నేస్తున్న దృశ్యాలు కంటతడి తెప్పిస్తున్నాయి. తేమలేక ఎండిపోయిన ఉల్లిని చాలామంది రైతులు పీకకుండానే అలాగే పొలాల్లో వదిలేశారు. టమోటా, మిరప, బెండ తదితర కూరగాయల తోటలు సైతం చేతికి రాకుండా పోయాయి. అప్పులు చేసి వేసిన పంటలు కరువు కాటుకు మట్టిలోనే కలిసి పోవడంతో రైతన్నలు కుమిలిపోతున్నారు. చేసిన అప్పులు భయపెడుతున్నాయి. చాలాచోట్ల తాగడానికి గుక్కెడు నీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. దుర్భిక్షం వల్ల మేత, నీరు సమకూర్చడం కష్టం కావడంతో చాలామంది రైతులు విధిలేని పరిస్థితుల్లో పశువులను కారుచౌకగా కబేళాలకు విక్రయిస్తున్నారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు లారీల్లో కబేళాలకు తరలిపోతున్నాయి. ఇప్పటికే రాయలసీమ నుంచి ఎంతోమంది అన్నదాతలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారు. వేరుశనగ రైతులకు రూ.2,250 కోట్ల నష్టం రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట 90 శాతానికి పైగా ఎత్తిపోయింది. ఇప్పటికే పంట కాలం పూర్తికావడం వల్ల పశువుల మేతకైనా మొక్కలు బాగా పెరిగే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రెయిన్ గన్లతో సెంటు భూమి కూడా ఎండిపోకుండా పంటలను కాపాడామని ఘనంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రెయిన్ గన్ల ఊసే మర్చిపోయింది. రాయలసీమలో 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది దీంతో రైతులు రూ.2,250 కోట్ల మేర నష్టపోయినట్లు అనధికారిక అంచనా. మండుతున్న ఎండలు.. వట్టిపోతున్న బోర్లు రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అధికారిక గణాంకాల ప్రకారం 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, ఇందులో 90 శాతం పంట ఎండిపోయింది. కర్నూలు జిల్లాలో 50.3 శాతం, అనంతపురం జిల్లాలో 47.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటలన్నీ ఎండిపోయాయి. వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు మండుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం రాయలసీమలో అక్కడక్కడా కొద్దిపాటి వర్షం పడింది. ఎండిపోయిన పంటలు ఈ వర్షానికి కొంచెం పచ్చగా మారినా మళ్లీ ఎండ తీవ్రత వల్ల వాడిపోతున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చేతికందాల్సిన దశలో ఉల్లిపంట చాలావరకు ఎండిపోయింది. దిగుబడి 25 నుంచి 30 శాతం లోపే వచ్చిందని రైతులు వాపోతున్నారు. వర్షాధారంగా వేసిన పంటలే కాకుండా బోర్ల కింద వేసిన పైర్లు కూడా ఎండిపోతున్నాయి. వరుస కరువులతో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. చందోలిలో నీటికి కటకట కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలో 400 ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామస్థులు తాగునీరు దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామంలో గత నాలుగేళ్లలో 14 బోర్లు వేసినా అన్నీ ఎండిపోయాయని, ఒక బోరులో మోటారు వేస్తే కొద్దిసేపు సన్నటి ధార వచ్చి ఆగిపోతోందని సర్పంచి లక్ష్మీదేవి కుమారుడు రంగప్ప తెలిపారు. గ్రామంలోని బోర్ల నుంచి నీరు రానందున గ్రామస్థులు పొలాల్లో కొద్దికొద్దిగా బోర్ల నుంచి వస్తున్న నీరు తెచ్చుకుంటున్నారని, పంటలు ఎండిపోతున్నందున పొలాల యజమానులు అభ్యంతరం చెబుతున్నారని రంగప్ప వివరించారు. గొర్రెలు, మేకలు ఉన్న వారు ఎడ్ల బండిలో డ్రమ్ములు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. సీమలో 51.1 శాతం వర్షంపాత లోటు రాయలసీమలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ) వరకూ రాయలసీమ జిల్లాల్లో 329.2 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 160.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సాధారణం కంటే 51.1 శాతం తక్కువ వర్షం కురవడం వల్ల పంటలు ఎండిపోయాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ కరువు తీవ్రత అధికంగానే ఉంది. వర్షాభావం వల్ల పంటలు చేతికి రాలేదు. గుంటూరు జిల్లాలో 16.1 శాతం లోటు వర్షపాతమే ఉన్నప్పటికీ పల్నాడు ప్రాంతంలో కరువు ఎక్కువగా ఉంది. ఇలాంటి కరువు ఎప్పుడూ చూడలేదు రాయలసీమ జిల్లాల్లో కరువు వల్ల పనులు దొరక్క, ఉపాధి కోసం ఇప్పటికే చాలామంది రైతులు, రైతు కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వలస వెళ్ల లేని వారు గ్రామాల్లో రచ్చబండలు, గ్రామ చావిళుపై కూర్చుని తీవ్రంగా మథన పడుతున్నారు. పెద్దవయసు వారు పొద్దుపోక మేక–పులి ఆట ఆడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలోని సుంకులమ్మ గుడి వద్ద కూర్చున్న కొందరు రైతులను ‘సాక్షి’ పలుకరించగా.. ఇంతటి కరువును తాము ఇప్పటివరకూ చూడలేదని 65 ఏళ్ల వీరన్న, 64 ఏళ్ల తిమ్మప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే మా గ్రామం నుంచి చాలామంది పనుల్లేక వలస వెళ్లారు. త్వరలో పీర్ల పండుగ ఉందని ఆగాం. పండుగ తర్వాత పౌర్ణమికి మేము కూడా బెంగళూరుకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని చందోలి గ్రామంలోని పలువురు రైతన్నలు చెప్పారు. చివరకు అప్పులే మిగిలాయి ‘‘రెండెకరాల్లో పత్తి, ఒకటిన్నర ఎకరాల్లో వేరుశనగ పంటలు వేశా. నీరు సరిపోదనే ఉద్దేశంతో పత్తికి డ్రిప్ పెట్టా. రూ.40 వేలు వెచ్చించి రాళ్లతో పెద్ద తొట్టి కట్టించా. బోరు నుంచి మొదట నీటిని ఈ తొట్టిలోకి మోటారు ద్వారా ఎక్కించి, తర్వాత తొట్టి నుంచి డ్రిప్ ద్వారా పొలానికి అందించి పంటలను రక్షించుకునేందుకు ప్రయత్నించా. దురదష్టవశాత్తూ పత్తి పంట రెండడుగుల ఎత్తు కూడా పెరగకముందే బోరు ఎండిపోయింది. పత్తి, వేరుశనగ పంటలు చేతికి రాలేదు. ఇన్నాళ్లూ నేను చేసిన కష్టమంతా మట్టిపాలైంది. చివరకు అప్పులే మిగిలాయి’’ – కురువ ఆనంద్, పత్తికొండ, కర్నూలు జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి ‘‘వేరుశనగ ఎండిపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గత నాలుగేళ్లుగా వర్షాభావంతో పంటలు పండలేదు. ఐదు ఎకరాల్లో వేరుశనగ వేస్తే పూర్తిగా ఎండిపోయింది’’ – చింతల రాయుడు,టీఎన్ పాళ్యం, అనంతపురం జిల్లా రూ.30 వేల పెట్టుబడి మట్టిపాలు ‘‘నాకున్న రెండు ఎకరాల్లో వేరుశనగ వేశా. ఇందుకోసం రూ.30 వేలు పెట్టుబడిగా పెట్టా. జూన్‌లో కురిసిన వానకు పంట వేశా. ఆ తరువాత చినుకు జాడేలేదు. దీంతో పంటంతా ఎండిపోయింది. కనీసం పశువుల మేతకు కూడా పనికిరాలేదు. పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలైంది’’ – దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, దేవలంపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా -
నేనింతే!
కురుగొండ్ల మరో వివాదం ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే కండలేరు గేట్లు ఎత్తివేత అధికారుల అత్యవసర సమావేశం నీటి విడుదల నిలిపివేత ఈ ఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలకు ఆదేశం ఎమ్మెల్యే తీరుపై అధికారుల ఆందోళన మంత్రి నారాయణ జోక్యంతో సోమవారం సాయంత్రం నీటి విడుదల సాక్షి ప్రతినిధి - నెల్లూరు: తరచూ వివాదాల్లో ఉండే వెంకటగిరి శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ తన సహజ ధోరణి కారణంగా ఆదివారం మరో వివాదానికి తెర లేపారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు లేకుండానే కండలేరు జలాశయం నుంచి సారుుగంగ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు సీరియస్ అయ్యారు. రిజర్వాయర్ ఈఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వెంటకగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని తెలుగుగంగ కాలువల కింద రైతులు సుమారు 80 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వర్షాలు వస్తాయనే ఆశతో ఇంతకాలం ఎదురు చూసిన రైతులు తమ పంటల ప్రాణాలు కాపాడు కోవడానికి కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కండలేరు జలాశయంలోని నీరు తాగునీటి అవసరాలకే సరిపోని పరిస్థితులు ఉన్నందు వల్ల సాగుకు ఇవ్వలేమని జిల్లా ప్రజాప్రతినిధులతో ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. రైతులు పంటలు వేయకుండా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. రైతులు మాత్రం తాము సాగు చేసిన పంటలను బతికించుకోవడానికి కండలేరు జలాశయం నుంచి నీటిని ఇవ్వాల్సిందేననే డిమాండ్ మరింత పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రైతుల పక్షాన ఆందోళనకు దిగారు. 10వ తేదీలోగా సాగునీరు విడుదల చేయక పోతే 11వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఆగమేఘాలపై రంగంలోకి. రైతుల ఆందోళనలను సీరియస్‌గా తీసుకోని ఎమ్మెల్యే రామకృష్ణ, ఈఈ మీద చర్యలకు ఆదేశం ఎమ్మెల్యే నేరుగా వెళ్లి డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినా ఎందుకు తెలుసుకోలేక పోయారనే కారణంపై కండలేరు జలాశయం ఈఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ ఎస్ఈని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యే అత్యుత్సాహం తమ తలకు తెచ్చిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆమరణ దీక్ష ప్రకటనతో ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. బొమ్మిరెడ్డి ఆమరణ దీక్షకు దిగితే రైతులు రోడ్డెక్కుతారని, రాజకీయంగా తమకు ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయంతో ఆదివారం నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ, మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడి కండలేరు నుంచి నీటి విడుదలకు సరేననిపించారు. మంత్రుల మౌఖిక అంగీకారంతో రామకృష్ణ నేరుగా కండలేరు డ్యాం వద్దకు వెళ్లి సంబంధిత అధికారులెవరూ లేకుండానే గేట్లకు సంబంధించిన స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఎమ్మెల్యే నీరు విడుదల చేయడంపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఆందోళన చెందారు. ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమై విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో నీటి విడుదలను ఆపివేశారు. రామకృష్ణ చర్యలపై మంత్రి అసహనం కండలేరు నుంచి పంట సాగుకు నీటిని విడుదల చేరుుస్తానని తాను చెప్పడంతోనే ఎమ్మెల్యే రామకృష్ణ నేరుగా డ్యాం దగ్గరకు వెళ్లి గేట్లు ఎత్తేయడం పట్ల మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. సోమవారం ఆయన కలెక్టర్ ముత్యాలరాజు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో చర్చించి పంట సాగుకు నీరు విడుదల చేయడానికి అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశంతో ఇరిగేషన్ అధికారులు సోమవారం సాయంత్రం మరోసారి నీటిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణరుుంచారు. ఈ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగానే చేరుుంచారు. -
వర్షం పంటలకు జీవం
ఖరీఫ్ సాగుకు తప్పిన కష్టకాలం రైతుల మోముల్లో ఆనందం కళకళలాడుతున్న పంటలు నారాయణఖేడ్: వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు మూడేళ్లపాటు పంటల సాగుకు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత సీజన్లో కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందం నిలుపుతోంది. వర్షాకాలం ప్రారంభమయ్యాక జూన్ మాసంలో సరైన వానలు పడలేదు. మొదట పంట సాగుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలస్యంగా విత్తనాలు వేశారు. పంట ఎదుగుదల సమయంలో వర్షాలు పడడంతో మొలకలకు జీవం పోసినట్లయ్యింది. జూన్ మాసంలో సాధారణ వర్షపాతం 112 మి.మీటర్లు కాగా 110 మి.మీటర్లు పడింది. అయినా రైతులు విత్తనాలు వేశారు. జూలై మాసంలో 212 మి.మీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా 355 మి.మీటర్లు పడింది. దీంతో పంటలకు మేలు చేకూరింది. ప్రతి ఏటా జొన్న పంట 5,202 హెక్టార్లలో సాగు చేస్తారు. ఇప్పటి వరకు 4,100 హెక్టార్లు సాగయ్యింది. పెసర 11,849 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 13,200 హెక్టార్లు సాగు చేశారు. మినుము 6,898హెక్టార్లకు గాను 8,100 హెక్టార్లు, కంది 6.653 హెక్టార్లకు గాను 8,700 హెక్టార్లు, మొక్కజొన్న 4,237 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 3,500 హెక్టార్ల మేర సాగుచేశారు. పత్తి పంట మాత్రం 10,626 హెక్టార్లు ఇప్పటి వరకు 4,800 హెక్టర్ల మేర మాత్రమే వేశారు. పప్పుదినుసుల సాగు బాగానే ఉంది. వర్షాలతో చీడపీడలు ఎడతెరపి లేని వర్షాల వల్ల పంటలకు చీడపీడలు ఆశిస్తున్నాయి. ఇప్పటికే పలు పంటలకు ఈ సమస్య ఉంది. సోయాబీన్, పెసర, మినుము పంటలకు శనగ పచ్చ పురుగు, పొగాకుకు లద్దెపురుగు, మినుము పంటకు బూడిద తెగులు, పత్తి పంటకు రసం పీల్చు పురుగు, కందికి ఆకు గూడు పురుగు వ్యాప్తి చెందాయి. పంట మంచి ఎదుగుతున్నా చీడపీడలతో రైతులు కాస్త దిగాలు పడుతున్నారు. పెసర, మినుము, సోయా పంటలకు ఆశించిన శనగ పచ్చ పురుగు, పొగాకుకు లద్దెపురుగు నివారణకు మోనోక్రోటోపాస్, ఫినాల్పాస్ పిచికారీ చేయాలని వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మినుకు ఆశిస్తున్న బూడిద తెగులుకు కాపరాస్ క్లోరైడ్, మోనోక్రొటోపాస్ కలిపి పిచికారీ చేయాలని, పత్తిలో రసం పీల్చు పురుగు నివారణకు మిడ్రాక్లూరిఫైడ్, ఎసిపెట్ స్ప్రే చేయాలని చెప్పారు. కంది పంటకు ఆశిస్తున్న ఆకుగూడు పురుగు నివారణకు ఫినాల్ పాస్, మోనోక్రోటోపాస్లలో ఏదైనా పిచికారీ చేయవచ్చని తెలిపారు. కంది, పెసర, మినుములో మిశ్రమంగా సాగు చేస్తున్నందున ఆ పంటలకు మందు పిచికారీ చేస్తున్నందున కందికి ప్రత్యేకంగా అవసరం లేదని ఆ పంటలకు చేసే పిచికారీ వల్లే కందికి సైతం లబ్ధి చేకూరుతుందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
ఆవకు జీఎం ‘చెద’ గండం
ఎస్ఎమ్ఐ వంటి ప్రత్యామ్నాయాల వల్ల పంట దిగుబడి హెక్టారుకు నాలుగు టన్నుల వరకు పెరుగుతుందని తెలియదా? ఈ పద్ధతి వ్యాప్తికి బదులుగా వ్యయభరితమైన, హానికరమైన జీఎం ఆవను ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు? జన్యుమార్పిడి అధిక దిగుబడి ఆవపంటను రైతులు సాగు చేయడాన్ని ఆరేళ్ల క్రితం నిరవధికంగా నిలుపుదల చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దానికి అనుమతించడం తాజాగా వివాదాన్ని రేపు తోంది. జన్యుమార్పిడి శాస్త్ర మద్దతుదార్లు ఈసారి మొన్సాంటోకు భయపడాల్సినదేమీ లేదని, ఈ జన్యు మార్పిడి (జీఎమ్) ఆవను తయారు చేసినది మన ఢిల్లీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలేనని అంటున్నారు. కార్యకర్తలు మాత్రం వివాదాస్పదమైన ఈ సాంకేతికతకు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన నియంత్రణ వ్యవ స్థను ఏర్పాటు చేయాలంటూ దానికి విరుద్ధంగా సరి కొత్త ఆధారాలను చూపుతున్నారు. యూరప్‌లోని చాలా దేశాలు జీఎం పంటల సాగు నుంచి వెనక్కు మళ్లుతు న్నాయి. దీంతో జీఎం పంటల సాగు భారీగా పడి పోయింది. శాస్త్రీయ తనిఖీ లేదా బహిరంగ చర్చ లేకుండా చాలా ఏళ్ల క్రితమే జీఎం సాంకేతికతను వాణిజ్యపరంగా వ్రవేశపెట్టిన అమెరికాలో సైతం జీఎం ఆహార ఉత్పత్తులపై ఆ విషయాన్ని ముద్రించా లనే చర్చ జరుగుతోంది, కనీసం ఒక రాష్ట్రంలో అది జరిగే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో మన దేశంలో జీఎం ఆవ సాగును అనుమతించడం విశేషం. ఇప్పుడు ప్రవేశపెడతామంటున్న జీఎం ఆవ పేరు ‘ధార మస్టర్డ్ హైబ్రిడ్ 11’ లేదా జీఎంహెచ్-11. డాక్టర్ దీపక్ పెంటాల్ నేతృత్వంలో ఢిల్లీ శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుపై ఇంతవరకు దాదాపు రూ. 100 కోట్ల ప్రజా దనాన్ని ఖర్చు చేశారు. పురుష మొక్కలలో వంధ్య త్వాన్ని ప్రేరేపించేలా ఒక బాక్టీరియా (బర్నాసె) జీన్‌ను చొప్పిస్తారు. బర్నాసే జన్యువు ప్రభావాన్ని పరిహరించి ఫలదీకరణశక్తిని పునరుద్ధరించడం కోసం మరో బాక్టీ రియా (బార్స్తర్)ను చొప్పించి జన్యు మార్పిడి చేసిన మరో జన్మకారక శ్రేణితో, ఆ మగ వంధ్యత్వ జన్యు శ్రేణిని సంకరం చేయడంద్వారా ఈ జన్యు మార్పిడి జరుగుతుంది. జీఎంహెచ్ -11కు జన్మకారకాలైన రెండు శ్రేణులలోనూ కలుపు నాశనులను తట్టుకునే బార్ అనే జీన్ ఉంది. దీనికి కలుపు నివారణులను తట్టుకునే రకంగా గాక సంప్రదాయకమైనదిగా అనిపించేలా అధిక దిగుబడి వంగడంగా పేరు పెట్టడంలోనే అసలు దగా అంతా ఉంది. పైగా రైతులకు తామేమీ కలుపు నాశనులను వాడమని సిఫారసు చేయడంలేదని పెంటాల్ బృందం దీన్ని సమర్థించుకుంటోంది. మన దేశంలో క్రిమిసంహారణుల నియంత్రణ ఎంత అధ్వా నమో తెలియంది కాదు. కలుపు నాశనులను తట్టుకునే బీటీ పత్తిని చట్టవిరుద్ధంగా రైతులు సాగు చేస్తూనే ఉన్నా జన్యుమార్పిడి లేదా ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి. గ్లైసోఫేట్ వంటి కలుపు నాశనుల వల్ల కలిగే క్యాన్సర్ వ్యాధికి గురికావడం వంటి హానికర ప్రభా వాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది, వాటిపై నిషేధాలు పెరుగుతున్నాయి. పైగా జీఎం సాంకేతికత భారీ ఎత్తున శ్రమశక్తి వినియోగాన్ని తగ్గించి మన దేశంలో తీవ్ర సామాజిక-ఆర్థిక దుష్పర్యవసానాలకు కూడా దారి తీస్తుంది. ఈ బహుముఖ దుష్ర్పభావాల కారణంగానే వివిధ కమిటీలు జీఎం ఆవకు పూర్తి వ్యతిరేకంగా పదే పదే సూచనలు చేశాయి. అధిక దిగుబడి వంగడాల పేరిట రైతులను ఆకట్టుకునే ఈ డీఎంహెచ్-11 వల్ల పలు ఇతర సమ స్యలు కూడా ఉన్నాయి. వాటిలో పంట దిగుబడులు పడిపోవడం కూడా ఒకటి. రైతులు విత్తనంగా భద్ర పరుచుకునే ఈ ఆవకు కూడా మగ వంధ్యత్వం ఉంటుంది. కాబట్టి సహజంగానే ఆ తదుపరి పంట దిగుబడి తగ్గిపోతుంది. పైగా పంటలో ఒక భాగం కలుపు నాశనులకు దెబ్బతినేది కావడం వల్ల గ్లూఫో సినేట్ వంటి కలుపునాశనులను వాడటంతో ఆ భాగం దెబ్బ తినిపోతుంది. కాబట్టి రైతులు తమ విత్తనాలను వాడితే నష్టపోతారు. లేదంటే పంట పంటకూ విత్తనాల కోసం బహిర్గత వనరులపై ఆధారపడాల్సి వస్తుంది, విత్తన సార్వభౌమత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వరంగ శాస్త్రవేత్తల ముసుగులోని పేటెంటు హక్కుదార్లు వాటిని ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికి అమ్ముకుంటారు. ఆ విత్తన ఉత్పత్తిదార్లు విత్తనాల అమ్మ కాలతో పాటూ, రసాయనాల అమ్మకాల ద్వారా కూడా లాభాలు చేసుకుంటారు. ఇక జీఎం ఆహారంవల్ల ఆరో గ్యపరమైన సమస్యలు వ్యాపించాక వాటికి మందులను అమ్ముకుని ఫార్మసీ కంపెనీలు కూడా లాభాలు చేసుకోవచ్చు. ఇదంతా నూనె గింజల దిగుబడులను, ఉత్పత్తిని పెంపొందింపజేసి వంట నూనెల దిగుమతి వ్యయాలను తగ్గించుకోవడానికేనా? అలాగైతే పైంటాల్ తయారు చేసిన దానితో సహా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఆవ అధిక దిగుబడి వంగడాల వల్ల అది ఎందుకు జరగలేదు? ఆవ సాంద్ర సాగు పద్ధతి (ఎస్ఎమ్ఐ)వంటి ప్రత్యామ్నా యాల వల్ల పంట దిగుబడి హెక్టారుకు నాలుగు టన్నుల వరకు పెరుగుతుందనే విషయం ప్రభుత్వాలకు తెలియ దునుకోవాలా? ఎస్ఎమ్ఐ సాగుకోసం రైతులు బయటి వారెవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. దాదా పుగా పెద్ద పెట్టుబడులను అదనంగా పెట్టాల్సిన పనీ లేదు. కాకపోతే ఉండాల్సింది రాజకీయ సంకల్పం. రైతులకు ఆ పద్ధతిని నేర్పించి, అలవాటు చేసే విస్తరణ సేవలను అందించాల్సి ఉంటుంది. అందుకు బదులుగా కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని వృథా చేసి వ్యయభరిత మైన, హానికరమైన జీఎం ఆవను బాధ్యతారహితంగా ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు? మనకు ఎంత మాత్రమూ అవసరంలేని, ఆవశ్యకంకాని, సురక్షితం కాని జీఎం ఆవను గెంటిపారేయాలి. అందుకు పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల, వినియోగదారుల పరిరక్షణ కోసం పూను కోవడం ఆవశ్యకం. వ్యాసకర్త కన్వీనర్, అలయన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆశా) ఈమెయిల్ : KavitaKuruganti@gmail.com - కవిత కూరుగంటి -
కలుపు మొక్కలు తీసేందుకు కాడెద్దుగా..
మర్పల్లి: పంట సాగులో పెరిగిన కలుపు మొక్కలు తీసేందుకు ఓ మహిళ కాడెద్దుగా మారింది. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన మొల్లయ్యకు వ్యవసాయ భూమి తక్కువగా ఉండడంతో అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వర్షాలు కురవడంతో అద్దె అరకతో మొక్కజొన్న విత్తనాలు వేశాడు. మొక్కజొన్న పంటలో కలుపు మొక్కలు పెరిగాయి. ఎంతకూ కాడెడ్లు అద్దెకు దొరకకపోవడంతో అతని భార్య మొల్లమ్మ కాడుద్దుగా మారి కలుపు మొక్కలు తీసే పరికరాన్ని లాగింది. ఆదివారం ఇలా అరెకరంలో వారు కలుపు మొక్కలు తీశారు. -
సాగు ఖర్చు తగ్గింపునకు మార్గదర్శకాలు
రాష్ట్రాలకు పంపిన కేంద్ర వ్యవసాయశాఖ - వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని సూచన - సన్న, చిన్నకారు రైతులకు సకాలంలో రుణాలు - వర్షాభావ ప్రాంతాల్లో వరి ఉత్పత్తి, ఉత్పాదకతలపై ప్రత్యేక దృష్టి సాక్షి, హైదరాబాద్: పంటల సాగు ఖర్చు తగ్గింపుపై కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. రైతు సంక్షేమం దృష్ట్యా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. సాగు ఖర్చు పెరగడం వల్లే రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారని, అందువల్ల వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలు పంపింది. భూసార కార్డుల ఆధారంగా ఎరువులను, సేంద్రియ ఎరువులను వాడేవిధంగా రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల అనవసర ఎరువుల వాడకం తగ్గి సాగు ఖర్చు తగ్గుతుంది. సాగునీటి యాజ మాన్య పద్ధతులు పాటించాలి. సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాలి. రైతులకు సకాలంలో రుణాలు అందేలా చూడాలి. కౌలురైతులకూ రుణాలు అందజేయాలి. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని, దీనివల్ల సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. అందుకోసం కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి రైతులకు తక్కువ అద్దెకు వ్యవసాయ యంత్రాలను సరఫరా చేయాలని స్పష్టం చేసింది. వచ్చే ఖరీఫ్ నుంచి అమలయ్యే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)పై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. కేంద్ర వ్యవసాయశాఖ మార్గదర్శకాలివే... ► పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలంటే తక్కువ కాలపరిమితి వరి రకాలను ప్రోత్సహించాలి. ఒకే సీజన్లో రెండు రకాల పంటలను సాగు చేయవచ్చు. ► జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతుక్షేత్రాల్లో నీటి కుంటలను తవ్వించాలి. ► వర్షాభావ ప్రాంతాలు, వరదలు వచ్చే ప్రాంతాల్లో వరి ఉత్పత్తి, ఉత్పాదకతలపై దృష్టి సారించాలి. వరదల్లో మునిగిపోయినా తట్టుకోగలిగే వరి విత్తన రకాలను రైతులకు అందించాలి. ► తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. ► ఉద్యానవన సాగులో హైబ్రీడ్ టెక్నాలజీని ప్రోత్సహించాలి. ► ఉద్యాన పంటల్లో సూక్ష్మ పోషకాలను ప్రోత్సహించాలి. ► గడ్డిసాగును ప్రోత్సహించాలి. బై బ్యాక్ పద్ధతిన రైతుల నుంచి కొనాలి. ► రైతుల వద్దకు మొబైల్ వెటర్నరీ సేవలను అందించాలి. తద్వారా వారి పశువుల ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వాలి. -
రుణం.. భారమై..!!
- బోర్లు.. పంట సాగుకోసం రూ.2లక్షల మేర అప్పు - రుణమాఫీ మొత్తాన్ని వడ్డీకిందికి జమకట్టుకున్న బ్యాంక్ అధికారులు - దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతన్న - శాలిపేటలో విషాదం చిన్నశంకరంపేట: సాగును వదులుకోలేక అప్పు తెచ్చిమరీ బోర్లు వేశాడు కానీ, ఎందులోనూ చుక్క నీరు రాలేదు. సరేలే అని మొక్కజొన్న సాగుచేశాడు.. వర్షం లేక అదీ ఎండిపోయింది. మరోవైపు రుణమాఫీ మొత్తాన్ని బ్యాంక్ అధికారులు వడ్డీ కిందకు జమచేసుకున్నారు.. దీంతో కలత చెందిన ఓ రైతు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన భల్యాల ఎల్లం(34) తన వాటాగా వచ్చిన రెండు ఎకరాల్లో వరిసాగు కోసం రూ.60వేలు అప్పు తెచ్చి ఆరు నెలల క్రితం రెండు బోర్లు వేశాడు. కానీ చుక్క నీరు రాలే దు. దీంతో వరి సాగును విరమించుకుని మొక్కజొన్న సాగు చేశాడు. కానీ, వర్షాభావ పరిస్థితులతో పంట ఎండిపోతుంది. పంట చేతికొచ్చే మార్గం కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. మరో వైపు రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వడ్డీ కిందకు జమచేసుకున్నారు. అలాగే భూమి కంటే ఎక్కువ రుణం పొంది నట్లు పేర్కొంటూ బ్యాంక్‌లోని రూ.8 వేల ఫిక్స్డ్ డిపాజిట్‌ను కూడా కలుపుకున్నారు. రెండో విడత రుణమాఫీ మొత్తాన్ని కూడా వారే పట్టుకున్నారు. దీంతో పంట సాగు కోసం మరో రూ.50వేలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద తెచ్చాడు. బ్యాంక్ రుణంతో కలిపి రూ.2లక్షలకు అప్పులు చేరుకున్నా యి. సాగుచేసిన పంట కూడా ఎండిపోతుండడంతో కలత చెందిన రైతు ఎల్లం సోమవారం ఉదయం తల్లి, భార్య మొక్కజొన్న చేను వద్దకు వెళ్లగా ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. మృ తుడి భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ నగేష్ పేర్కొన్నారు. -
నీటిపై రాజకీయం
జిల్లాలోని అధికారపార్టీ నాయకులు నీటి విడుదలలో రాజకీయం చేస్తున్నారు. వీరికి అధికారులు వంతపాడడంతో కొన్ని ప్రాంతాల రైతులు నష్టపోతున్నారు. ఇది రైతుల మధ్య విభేదాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది. అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి 1550 క్యూసెక్కులు (జిల్లా సరిహద్దులోని లెక్కల ప్రకారం) నీటిని వి డుదల చేస్తున్నారు. తుంగభద్ర హైలెవల్ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టుకు, తాగునీటి కోసం పీఏబీఆర్ అక్కడి నుంచి మిడ్‌పెన్నార్, చి త్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పంపకాలు చేపట్టారు.అయితే అధికారపార్టీ నా యకుల ప్రాంతాలకు ఓ విధంగా, ప్రతిపక్ష నాయకుల ప్రాంతాలకు మరోలా నీటి పం పిణీ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో హెచ్‌ఎల్‌ఎంసీ కింద అతిపె ద్ద ఆయకట్టు ఉంది. 20 వేల ఎకరాల్లో వరి, మరో పది వేల ఎకరాలకు పైగా ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తారు. ఈసారి ఆరుతడికి మాత్రమే నీటిని విడుదల చేస్తుండడంతో రోజూ 250 క్యూసెక్కులు నీటిని వదులుతున్నట్లు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయి. ఇది కాగితాల్లో మా త్రమే. అనధికారికంగా మరో 300 క్యూసెక్కు లు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లా సరిహద్దులో 1550 క్యూసెక్కుల నీరు వస్తోంది. పీఏబీఆర్‌కు వచ్చేసరికి 600 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. మరో 150 క్యూసెక్కులు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కు విడుదల చేస్తున్నారు. ఈ రెండింటికీ 750 క్యూసెక్కులు పోగా మి గిలిన 800 క్యూసెక్కులు నీటిలో ప్రవాహ నష్టాలు 200 నుంచి 250 క్యూసెక్కులు ఉంటుంది. మిగిలిన 550 క్యూసెక్కులు హెచ్‌ఎల్‌ఎంసీకి సరఫరా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో అధికారికంగా 250 కాగా, అనధికారికంగా 300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు సమాచా రం. కణేకల్లు, బొ మ్మనహాల్ మండలాలు ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు నియోజకవర్గ ప్రాంతాలు కావడమే ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద మొత్తం 9 డిస్ట్రీబ్యూటరీలు ఉంటే అన్ని ప్రాంతాల్లో పంట సాగు చేయడానికి నీటిని విడుదల చేయడంలే దు. ఒకసారి నాలుగు డిస్ట్రీబ్యూటరీలకు, మరోసారి 5 ఐదు డిస్ట్రీబ్యూటరీలకు చొ ప్పున వదులుతున్నారు. అదికూడా గతేడాది 195 క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల చేశారు. ఈసారీ 150కి మించి విడుదల చేయడం లేదు. దీని వలన పంటలకు నీరందక సకాలంలో సాగు చేసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా రైతులందరినీ సమానదృష్టితో చూడాలని రైతాంగం విజ్ఞప్తి చేస్తోంది.