క్రిష్ణగిరి : పుష్కలమైన నీరు, సమీపంలో నే మార్కెట్ కాయకష్టపడి పంటలు పండించి కుటుంబ పోషణ చేసుకుందామనుకున్న రైతు ఆశలు మాత్రం నెరవేరడం లేదు. పోడూరు అటవీ ప్రాంతంలోని వెంకటరెడ్డికి 10 ఎకరాల పొలం ఉంది. దక్షిణ పెన్నానదీలో నీరు పుష్కలంగా ఉంది. పంటలు ఏపుగా పెరుగుతాయి. కానీ అసలు సమస్య ఏనుగులు. రాత్రికి రాత్రే ఏనుగులు పంటపొలాలను ధ్వం సం చేసి వెళుతున్నాయి. వెంకటరెడ్డి గత కొన్నేళ్లుగా ఏనుగుల ధాటికి పంటలు పండించలేకపోతున్నాడు. గత ఏడు వెం కటేశ్ అనే రైతు కౌలుకు తీసుకొన్నాడు. పంటలు పండించాడు. ఒక రోజు ఏనుగు లు పది ఎకరాల పంటను ధ్వంసం చే శాయి.
కాపలా ఉన్న వెంకటేశ్ ప్రాణాల తో బయటపడడం కష్టమైంది. ఏనుగులు వెంటాడడంతో చెట్టెక్కి కూర్చొని ప్రా ణాలు కాపాడుకొన్నాడు. వెంకటేశ్ మళ్లీ వ్యవసాయం జోలికి పోలేదు. ఈ ఏడు అత్తిముగంకు చెందిన రైతు త్యాగరాజు ఆ పది ఎకరాలను కౌలుకు తీసుకొని దోసకాయలు, కొత్తమీర, పుదీనా పంట లు పండించాడు. పోడూరు అడవిలో మకాం వేసిన ఆరు ఏనుగుల మంద వరుసగా పంటలను ధ్వంసం చేశాయి. కాపలాకు వేసిన గుడిసెను కూడా ధ్వంసం చేశాయని త్యాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
సుబ్బగిరి గ్రామంలో ఏనుగు లు సోమవారం రాత్రి ఇళ్లవద్దకు చేరా యి. ఇళ్లు తలుపులు వేసుకొని ప్రాణాలు కాపాడుకోవలసివచ్చిందని ఆ గ్రామాని కి చెందిన మణివేలు తెలిపారు. గ్రామ ం వద్ద ఏనుగులు మాటు వేశాయి. కు క్కలు మొరగడంతో ఏనుగులు కుక్క ను లాగి విసిరిపారేశాయని అక్కడున్న మణివేలు తప్పించుకొని ఇల్లు చేరాడని తెలి పారు. ఏనుగులు పోడూరు అడవి నుం చి కదలలేకపోవడంతో రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయాన్ని వదులుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట సాగుకు దూరమవుతున్న రైతులు
Published Wed, Mar 25 2015 3:19 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement