
సాక్షి, హైదరాబాద్: రైతులు ఏయే పంటలు సాగుచేయాలనే విషయంలో ప్రభుత్వం శాసించడం ఏమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. వరి విత్తనాల విక్రయంపై వ్యవసాయ శాఖ నిషేధం విధిస్తూ, మరోవైపు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడాన్ని తప్పుబట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఉత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం మఖ్దూంభవన్‌లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషాతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలో వరి పంట పండించుకునేందుకు రైతులు అచ్చుకట్టు వేసుకున్నారని, ఇప్పుడు వరి సాగు చేయొద్దనడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment