ముఖం చాటేసిన వరుణుడు.. సగం కూడా నమోదుకాని వర్షపాతం..అడుగంటుతున్న జలవనరులు. పర్యావసానంగా జిల్లాలో ఎడగారు సాగువిస్తీర్ణం సగానికి పడిపోయింది.
సాక్షి, నెల్లూరు : ముఖం చాటేసిన వరుణుడు.. సగం కూడా నమోదుకాని వర్షపాతం..అడుగంటుతున్న జలవనరులు. పర్యావసానంగా జిల్లాలో ఎడగారు సాగువిస్తీర్ణం సగానికి పడిపోయింది. సాధారణంగా 90 వేల హెక్టార్లలో రెండో పంట సాగు చేయాల్సివుండగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 48 వేల హెక్టార్లకే పరిమితమైంది. మిగిలిన పొలాలన్నీ బీళ్లుగా మిగిలాయి. జూన్ ముగిసినా సాధారణ వర్షపాతం కూడా నమోదుకాకపోవడంతో రైతులు ఇక జూలైపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఈ నెలలో వరుణుడు కరుణించకపోతాడా.. అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వర్షాలు లేక సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. సోమశిల నీటిపైనే ఆధారపడి ఎడగారు సాగుచేపట్టినా, వర్షాలు తోడైతేనే ఫలితం ఉంటుంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 56 మిల్లీమీటర్లు కాగా సోమవారానికి 33.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35,901 హెక్టార్లలో వరి, 90 హెక్టార్లలో పెసర, 43 హెక్టార్లలో సజ్జ, 26 హెక్టార్లలో మొక్కజొన్న, 2,876 హెక్టార్లలో వేరుశనగ, 299 హెక్టార్లలో నువ్వు లు, 157 హెక్టార్లలో సన్‌ఫ్లవ ర్, 5,689 హెక్టార్లలో పత్తి తదితర పంటలు సాగుచేశారు. ఆశిం చిన మేర వర్షాలు కురిసింటే వీటి సాగు ఎక్కువ విస్తీర్ణంలో జరిగేది.