జూలై 7న నూజివీడులో.. రైతు సదస్సు!
ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా నూజిబీడు టీటీడీ కల్యాణ మండపంలో జూలై 7(ఆదివారం)న ఉ. 10 గంటల నుంచి మామిడి సాగులో మెలకువలతో పాటు బయోచార్ వినియోగంపై ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు నూజివీడు సేంద్రియ ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి భోగోలు రాజేశ్ తెలిపారు. బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్‌రెడ్డి రైతులకు అవగాహన కల్పిస్తారని రాజేశ్ (91779 88422) వివరించారు.
గోమయ ఉత్పత్తులపై 30న శిక్షణ..
ఆవు పేడతో అనేక ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వ్యూహాలపై రైతులు, గోశాలల నిర్వాహకులకు ఈ నెల 30న హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు మురళీధర గోధామం (జగిత్యాల జిల్లా) వ్యవస్థాకులు డాక్టర్ పద్మ తెలిపారు. గోశాలలను ఆర్థికంగా స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 98497 50854.
ఆంగ్రూ ఆన్‌లైన్ కోర్సులు..
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో మిద్దెతోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల పెంపకంపై వేర్వేరుగా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ కోర్సులను ్రపారంభించనుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ కోర్సులు నిర్వహిస్తారు. ఫీజు రూ. 1,500. ఇతర వివరాలకు.. 80087 88776, www.angrau.ac.in
ఇవి చదవండి: విదేశీ విత్తనాలను, మొక్కల్ని ఆన్‌లైన్‌లో కొంటున్నారా? జాగ్రత్త..!
Comments
Please login to add a commentAdd a comment