Farmers Conferences
-
రైతన్నలూ.. ఆయిల్‌పాం సాగు చేయండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రైతులంతా ఆయిల్‌పాం సాగుపై దృష్టి పెట్టాలి. మొదటి మూడే ళ్లు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది. అంతర పంటలు వేస్తే బోనస్ ఇచ్చే బాధ్యత కూడా మాదే. మీ పంటను ఇంటి వద్దే కొనిపించే బాధ్యత తీసు కుంటాం. వెంటనే మీ ఖాతాలో డబ్బులు వేస్తాం. పామాయిల్ పంట వేయండి.. మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖపరంగా మీరు ఏ శిక్ష విధించినా దానికి సిద్ధంగా ఉంటాం. రైతులకు నష్టం రాకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో మూడు రోజుల రైతు పండుగ సదస్సును పద్మశ్రీ అవార్డుగ్రహీత, రైతు వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఆహార పదార్థాలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించేలా మైదానంలో ఏర్పాటు చేసిన 117 స్టాళ్లు, ఎగ్జిబిట్లను తిలకించిన అనంతరం సదస్సులో మంత్రి తుమ్మల మాట్లాడారు. రాష్ట్రానికి అప్పులు, కష్టాలు ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నట్లు తెలిపారు.అనుకున్నవన్నీ నాలుగేళ్లలో చేస్తాం..రైతులు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, వచ్చే నాలుగేళ్లలో అనుకున్న వ న్నీ చేసి అన్నదాతల చేత శెభాష్ అనిపించుకుంటా మని మంత్రి తుమ్మల చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు వ్యవసాయాన్ని ఎలా ఆగం చేశారో, ఈ పది నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో ఈ నెల 30న జరి గే సభలో సీఎం రేవంత్‌రెడ్డి చెబుతారని తుమ్మల తెలిపారు. రైతులను సమీకరించి సంక్రాంతికి ముందే రైతు పండుగను నిర్వహించుకుంటామన్నారు.సాగు దండగ కాదు.. పండగని వైఎస్ నిరూపించారు: దామోదరఉమ్మడి ఏపీలో 2003–04లో వ్యవసాయం దండగ అని ప్రచారం జరిగితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టు లను చేపట్టి కొంత వరకు పూర్తి చేశారని.. వ్యవసాయం దండగ కాదు.. పండగని నిరూ పించారని మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొ న్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వ్యవసా య రంగాన్ని నిర్లక్ష్యం చేసినా ప్రస్తుత ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకొన వాటిని సాకారం చేసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయన్నా రు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెలేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రైతుబడి అగ్రి షో!
తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు రాజేంద్రరెడ్డి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 17, 18 తేదీల్లో నల్గొండలోని నాగార్జున గవర్నమెంటు కాలేజీ ఆవరణలో జరిగే తొలి వ్యవసాయ ప్రదర్శనలో వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు చెందిన 150 దేశ విదేశీ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. సందర్శకులు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఉచిత పాస్‌లు పొందవచ్చు. ఇతర వివరాలకు.. rbagrishow.com28న అమలాపురంలో కొబ్బరి రైతుల సదస్సు..‘కలసి నడుద్దాం – కొబ్బరికి లాభసాటి ధర సాధిద్దాం’ నినాదంతో ఈ నెల 28 (బుధవారం) ఉ. 10 గం. నుంచి అమలాపురంలో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సును నిర్వహించనుంది. దేశం నలుమూలల నుంచి కొబ్బరి రైతులు ఈ సదస్సులో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఇతర వివరాలకు.. 94906 66659, 95425 9966629 నుంచి హైదరాబాద్‌లో నర్సరీ మేళా..హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ΄్లాజాలో ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 16వ అఖిలభారత నర్సరీ మేళా జరగనుంది. 140 సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు...98492 61710.15న తార్నాకలో సేంద్రియ సంత..గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15న సికింద్రాబాద్‌లోని తార్నాకలో మర్రి కృష్ణ హాల్లో ఉ. 10 గం. నుంచి సా. 6 గం. వరకు బ్యాక్ టు రూట్స్ మూలం సంత పేరిట సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తుల సంతను నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు.. 94908 50766, 63051 82620.17న హైదరాబాద్‌లో బయోచార్‌పై సెమినార్..హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నిమ్స్‌మే ఆడిటోరియంలో ఈ నెల 17(శనివారం) ఉ. 9.30 నుంచి సా. 6 గం. వరకు బయోచార్ (కట్టెబొగ్గు)పై జాతీయ సదస్సు జరగనుంది. ్ర΄ోగ్రెసివ్ బయోచార్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, నిమ్స్‌మే, రెయిన్బో బాంబూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 63051 71362.18న పెనుకొండలో..బయోచార్ (కట్టెబొగ్గు) ఉత్పత్తిపై ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండలో చార్ గోల్డ్ సంస్థ ఆవరణలో వర్క్‌షాప్ జరగనుంది. బయోచార్ నిపుణులు డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి, ప్రేమ్‌రాజ్ అవగాహన కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. వాట్సప్ – 92463 52018.11న సేంద్రియ చెరకు సాగు, 18న మట్టి సేద్యంపై శిక్షణ..‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘కర్షక సేవా కేంద్రం’ నిర్వహణలో హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో ఈ నెల 11,18 తేదీల్లో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 11 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ పద్ధతిలో చెరకు సాగు, చెరకుతో బెల్లం తయారీ విధానం’పై రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిక్షణ ఇస్తారు.18(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ సాగులో మట్టి ద్రావణంతో పురుగులు తెగుళ్ళ నివారణ ఎలా?’ అనే అంశంపై రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. హాజరుకాగోరే వారు తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 95538 25532, 70939 73999. -
Sagubadi: మామిడి సాగులో.. బయోచార్ వినియోగంపై ప్రత్యేక సదస్సు
జూలై 7న నూజివీడులో.. రైతు సదస్సు!ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా నూజిబీడు టీటీడీ కల్యాణ మండపంలో జూలై 7(ఆదివారం)న ఉ. 10 గంటల నుంచి మామిడి సాగులో మెలకువలతో పాటు బయోచార్ వినియోగంపై ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు నూజివీడు సేంద్రియ ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి భోగోలు రాజేశ్ తెలిపారు. బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి రైతులకు అవగాహన కల్పిస్తారని రాజేశ్ (91779 88422) వివరించారు.గోమయ ఉత్పత్తులపై 30న శిక్షణ..ఆవు పేడతో అనేక ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వ్యూహాలపై రైతులు, గోశాలల నిర్వాహకులకు ఈ నెల 30న హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు మురళీధర గోధామం (జగిత్యాల జిల్లా) వ్యవస్థాకులు డాక్టర్ పద్మ తెలిపారు. గోశాలలను ఆర్థికంగా స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 98497 50854.ఆంగ్రూ ఆన్లైన్ కోర్సులు..ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో మిద్దెతోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల పెంపకంపై వేర్వేరుగా ఆన్లైన్లో సర్టిఫికెట్ కోర్సులను ్రపారంభించనుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ కోర్సులు నిర్వహిస్తారు. ఫీజు రూ. 1,500. ఇతర వివరాలకు.. 80087 88776, www.angrau.ac.inఇవి చదవండి: విదేశీ విత్తనాలను, మొక్కల్ని ఆన్లైన్లో కొంటున్నారా? జాగ్రత్త..! -
ఈనెల 18న వారణాసికి మోదీ.. రైతుల సదస్సుకు హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 18న ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. అక్కడ జరగబోయే 'కిసాన్ సమ్మేళన్'లో (రైతుల సదస్సు) మోదీ ప్రసంగించనున్నారు. అయితే మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ.. వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.మోదీ పర్యటనపై స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. వారణాసిలోని రొహనియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతుల సదస్సుకు వేదిక ఉండనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గులాబ్‌బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో మహానగర, జిల్లా అధికారుల సమావేశం నిర్వహించారు.వారణాసిలో ఒకరోజు పర్యటన సందర్భంగా దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో ప్రధాని మోదీ పాల్గొంటారని, అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని కాశీకి చెందిన బీజేపీ అధికారి దిలీప్ పటేల్ తెలిపారు. వారణాసిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలందరికి పిలుపునిచ్చారు. రైతు సదస్సుకు పార్టీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించే ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్‌పై 1.5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
వ్యవసాయ రుణాల్లో 25 శాతం వృద్ధి లక్ష్యం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల విభాగంలో 25 శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) హైదరాబాద్ జోన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి వీటి పరిమాణం రూ. 9,100 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 600 కోట్ల పైచిలుకు రుణాలు అందించడంతో.. ఇది సుమారు రూ. 9,700 కోట్లకు చేరింది. బీవోబీ నిర్వహిస్తున్న రైతు పక్షోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ (జీఎం) మన్మోహన్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీవోబీ కార్యకలాపాలు హైదరాబాద్ జోన్ పరిధిలోకి వస్తాయి. కరోనా వైరస్ విజృంభణ అనంతరం ఎకానమీ నెమ్మదిగా కుదుటపడుతున్న నేపథ్యంలో మొండిబాకీల రికవరీ క్రమంగా మెరుగుపడుతోందని గుప్తా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమకు 397 బ్రాంచీలు ఉన్నాయని, తమ శాఖలు లేని చోట్ల కూడా బ్యాంక్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. వ్యవసాయానికి తోడ్పాటు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 4వ విడత ‘‘బరోడా రైతు పక్షోత్సవాలు’’ నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 16న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 31 దాకా కొనసాగుతాయని వివరించారు. ‘మన చర్యలే మన భవిష్యత్’ నినాదంతో చేపట్టిన ఈ పక్షోత్సవాల్లో భాగంగా రైతుల కోసం క్రెడిట్ క్యాంపులు, చౌపల్స్, పశువులకు ఆరోగ్య పరీక్షలు, ఆర్థిక సాక్షరత క్యాంపులు మొదలైనవి నిర్వహిస్తున్నామని గుప్తా చెప్పారు. అలాగే వ్యవసాయ రుణాల కోసం ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా తమ 18 జోనల్ కార్యాలయల్లో సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెసింగ్ (సీఏఎంపీ) పేరిట ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో ఒకటి హైదరాబాద్ జోన్లో కూడా ఉందని పేర్కొన్నారు. -
ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలు
ఢిల్లీ: వ్యవసాయ వ్యర్థాలతో ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున.. ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ 2025 కల్లా పూర్తి చేయాలని చెప్పారు. వాయు కాలుష్యం నివారణకు జాతీయ స్వచ్చ వాయు ప్రణాళిక రూపొందిందన్నారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని రైతులతో భేటీ అయ్యారు. ఇథనాల్ ఉత్పత్తి పంపిణీకి పుణె ల్యాబ్ ఈ-100 పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు. చదవండి: Corona downtrend: దేశంలో తగ్గుతున్న కొత్త కేసులు -
రాజధాని అని అంతా అన్యాయం చేశారయ్యా..
పచ్చని పారాణి పూసుకుని కొత్త పెళ్లికూతురి వలే కళకళలాడే పంట భూములు .. బీడు వారి చిల్ల చెట్లు కప్పుకుని ఉంటే ఆ రైతుల గుండెలు చెరువయ్యాయి. మూడు పూటలా నాలుగు మెతుకులు పెట్టే భూములను బలవంతంగా లాక్కుంటే ఆ రైతుల జీవితాల్లో దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. తమ భూములు రాజధాని పేరుతో సాగించే దోపిడీకి ఇవ్వబోమని తెగేసి చెబుదామంటే అప్పటి టీడీపీ నేతల బెదిరింపులు గొంతు నొక్కేశాయి. ఇలా ఐదేళ్లపాటు కష్టాలను పంటి బిగువున దాచుకుని కాలం వెళ్లదీశారు రాజధాని రైతులు. బుధవారం రైతు సంక్షేమ ప్రభుత్వ వారథులుగా ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తుళ్లూరు మండలం రాయపూడి వచ్చారు. రైతులను పలకరించగానే వారి గుండెల్లో పొంగిన వేదనలన్నీ కన్నీటి ప్రవాహమయ్యాయి. రాజధానిలో అంతా అన్యాయం చేశారయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా బెదిరించి భూములు లాక్కున్నారని వాపోయారు. విచారించి న్యాయం చేస్తామంటూ ఎమ్మెల్యేలు భరోసా కల్పించారు. సాక్షి, అమరావతి : అమరావతి నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం చేసిన అవినీతిని త్వరలోనే బట్టబయలు చేస్తామని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో మల్లెల హరీంద్రనాథ్‌చౌదరి నివాసంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు, భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్న రైతులు సమావేశమయ్యారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరై రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. రాజధానికి భూములు ఇవ్వాలని బలవంతపెట్టారని, భూములు ఇవ్వకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొని స్వచ్ఛందంగా ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలు అందకుండా చేశారని, విద్యుత్ సర్వీసులను తొలగించారని, సబ్సిడీలు రాకుండా అడ్డుకున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. భూములు తీసుకున్న తర్వాత ప్లాట్లు కేటాయించే సమయంలో టీడీపీ నాయకులు పాల్పడిన కుంభకోణాలను కూడా ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చారు. రాయపూడి గ్రామానికి చెందిన కస్తాలదిబ్బ, రూతమ్మ దిబ్బ, లంక భూములు సాగు చేసుకునే రైతులను దగా చేశారని వాపోయారు. విజయవాడకు చెందిన దళారితో కలసి స్థానిక సీఆర్డీఏ అధికారులు ఏవిధంగా తమ భూములు ఆక్రమించుకున్నారో వివరించారు. బలవంతంగా లాక్కునేందుకు యత్నం లింగాయపాలకెం, తాళ్లాయిపాలెం, వెంకటపాలెం లంక రైతులు మాట్లాడుతూ తమ భూములను గత ప్రభుత్వం అన్యాక్రాంతం చేయాలని యత్నించిందని, మా భూములను ప్రభుత్వ భూములుగా పరిగణించి బలవంతంగా లాక్కునేందుకు సీఆర్డీఏ అధికారులు తీవ్రంగా యత్నించారని తెలిపారు. తమవి జరీబు భూములైతే మెట్టగా పరిగణించి ప్యాకేజీ తగ్గించి ఇచ్చారని బోరుపాలెం, అబ్బరాజుపాలెం రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. అవినీతిని బయటపెడతాం అనంతరం ఎమ్మెల్యేలు ఆర్కే, శ్రీదేవి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతికి అడ్డూఅదుపులేదని పేర్కొన్నారు. వేల ఎకరాలను రైతుల వద్ద నుంచి బలవంతంగా తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిందని విమర్శించారు. దళితులు సాగు చేసుకుంటున్న అసైన్డ్, సీలింగ్, లంక భూములను కారుచౌకగా తీసుకునేందుకు ప్రయత్నించిందన్నారు. ప్యాకేజీ విషయంలో తీవ్ర వివక్ష చూపించిందని చెప్పారు. భూములు ఇవ్వని రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే సీబీఐ విచారణ రాజధానిలో భూకొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, టీడీపీ నాయకులు పాల్పడిన భూ కుంభకోణాలపై అవసరమైతే సీబీఐ విచారణ కోరతామని ఎమ్మెల్యేలు తెలిపారు. దళితులు ఆర్థికంగా బలోపేతమవడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. స్విస్ చాలెంజ్ పేరుతో రైతుల భూములను సింగపూర్ కంపెనీలకు అప్పగించారని, ఈ ఒప్పందాలను సమీక్షించి అవసరమైతే కేటాయింపులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు తెలిపిన సమస్యలను సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపుతామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి సహజ వనరులను నాశనం చేస్తూ, కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేసి, నదీ స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఐదేళ్లుగా టీడీపీ నిరంకుశత్వంపై పోరాడాం. గత పాలకుల నిర్వాకంపై ఎన్జీటీలో కేసులు కూడా వేశాం. గ్రామాల్లో రైతులు, కూలీలతో సమావేశాలు నిర్వహిస్తే వాటిని అడ్డుకుని అక్రమంగా అరెస్టులు చేసి, కేసులు బనాయించారు. వాటిని కొట్టేసి, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. – అనుమోలు గాంధీ, లింగాయపాలె రాజధానికి భూములిస్తే రికార్డులు తారుమారు నాకు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 84, 85లో ఉన్న 2 ఎకరాల 30 సెంట్ల భూమిని సీఆర్డీఏ ఇచ్చా. కౌలు చెల్లింపులో వ్యత్యాసం రావడంతో అధికారులను అడిగితే పూలింగ్‌లో నేను ఇచ్చింది ఎకరా 90 సెంట్లు మాత్రమేనన్నారు. దీనిపై నేను గట్టిగా నిలదీస్తే అసలు గుట్టు తెలిసింది. స్థానిక టీడీపీ నాయకులు నా భూమిలో 40 సెంట్లు వారి పేరుపై నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించుకుని పరిహారం కాజేశారు. – తరిగొప్పుల వసంతరావు, అనంతవరం గ్రామం, తుళ్లూరు -
పెట్టుబడిలేని సాగు పెద్ద దగా : వందనా శివ
సాక్షి, అమరావతి: పెట్టుబడి లేని వ్యవసాయం (జెడ్బీఎన్ఎఫ్) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిషేధించాలని ప్రముఖ పర్యావరణ వేత్త, రచయిత, సామాజిక కార్యకర్త డాక్టర్ వందనా శివ విజ్ఞప్తి చేశారు. పెట్టుబడి లేని వ్యవ సాయమనేది భారతదేశానికి కొత్తదేమీ కాదని, కొన్ని వేల ఏళ్ల కిందటి నుంచి ఉన్నదేనని వివరించారు. విత్తనంపైన, సాగుపైన గుత్తాధిపత్యాన్ని సాధిం చేందుకు కార్పొరేట్లు పన్నిన వలలో ఉద్దేశ పూర్వకంగానే చిక్కుకున్న కొందరు పెద్దలు ఈ విధానాన్ని తామేదో కొత్తగా కనిపెట్టినట్టు ప్రచారంచేయడాన్ని ఆమె ఖండించారు. పెట్టుబడి లేని వ్యవసాయానికి ప్రపంచ బ్యాంకు నుంచి పిఎన్ ఫరబాస్ అనే కార్పొరేట్ సంస్థ నుంచి వందల కోట్ల రూపాయలు నిధులు ఎందుకు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరులో ఏర్పాటు చేసిన మూడు రోజుల రైతు సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. 2022 నాటికి రాష్ట్రంలో ప్రకృతి సాగు పేరిట అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడంలో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. 2022 నాటికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయానికి కొత్త ఒరవడిని సృష్టించి దేశానికి దిక్చూచిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం జగన్ విధానాల వైపు దేశం వేచి చూస్తోందని చెబుతూ నవరత్నాలలో భాగంగా ప్రకటించిన వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రశంసించారు. రాష్ట్రంపై బహుళజాతి సంస్థల పంజా... నక్కలాంటి బహుళజాతి విత్తన కంపెనీలు ఇప్పుడు ఆంధ్రాను ఆక్రమింపిజూస్తున్నాయని, వారి ఆటలు సాగకుండా చూసి రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత జగన్‌పై ఉందని వందనా శివ అన్నారు. మోన్శాంటో లాంటి సంస్థలపై పోరాడిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకించి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉందని గుర్తు చేశారు. సందర్భంగా ఆమె రైతు రక్షణ వేదిక ప్రచురించిన ’రైతుల విత్తన హక్కుపై కంపెనీల దాడి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. -
భరోసా ఇవ్వని ‘ఆహార భద్రత’
=మురుగుతున్న నిధులు = రైతుల దరిచేరేందుకు యత్నించని అధికారులు సాక్షి, విశాఖపట్నం : పథకం ఎంత గొప్పదైనా ఫలితం క్షేత్రస్థాయికి చేరితేనే ప్రయోజనం. ఏటా కోట్లాది రూపాయలు రాయితీగా ఇవ్వాలని నిర్ణయించినా వాటిని సకాలంలో అందించికపోతే ఫలితం శూన్యం. ఆ కోవలోకి ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం చేరింది. దీంతో విడుదలైన కోట్లాది రూపాయల నిధులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. సుస్థిరమైన పద్ధతిలో సాగుచేసి ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా జాతీయ ఆహార భద్రతా మిషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ మేరకు నూతన యాజమాన్య సాగు పద్ధతులు, శ్రీ వరి సాగు, హైబ్రిడ్ వరిసాగు, పప్పు దినుసుల సాగు ప్రదర్శన, సస్య రక్షణ రసాయనాలు, జీవ సంబంధిత మందులకు ప్రోత్సాహకాలు, వ్యవసాయ పనిముట్లకు ప్రోత్సాహకాలు, పొలంబడి పద్ధతిలో రైతులకు శిక్షణ ఇవ్వవల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమాలేవి సక్రమంగా జరగడం లేదు. సాగు ప్రదర్శనలు తప్ప మిగతావేవి రైతులకు చేరడం లేదు. ఈ ఏడాది వరి, పప్పు దినుసుల సాగు ప్రోత్సాహం కోసం 50 శాతం సబ్సిడీతో వివిధ పనిముట్లు అందజేసేందుకు జిల్లాకు రూ.1.13 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 1248 యూనిట్లు పంపిణీ చేయాలన్ని లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ ఇంతవరకు రూ.43 లక్షల విలువైన 443 యూనిట్లు మాత్రమే రైతులకు చేరాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 1097 యూనిట్లు పంపిణీ చేసేందుకు గాను రూ.2.01 కోట్లు విడుదలవ్వగా వీటిలో రూ.6.19 లక్షలు విలువైన 313 యూనిట్లు మాత్రమే రైతులకు అందజేశారు. అక్కరకురాని నిధులు జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద ఈ ఏడాది 100 హెక్టార్లను ఒక క్లస్టర్‌గా తీసుకొని, ప్రదర్శన కోసం వరి సాగు చేయడానికి రూ.2.68 కోట్లు విడుదల చేయగా ఇంతవరకు కేవలం రూ.1.64 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అలాగే 100 హెక్టార్లను ఒక క్లస్టర్‌గా చేసుకుని పప్పు దినుసులు సాగు చేయడానికి రూ.1.21 కోట్లు విడుదల చేయగా ఇంతవరకు కేవలం రూ. 3 లక్షలు మాత్రమే వెచ్చించారు. దీన్ని బట్టి జిల్లాలో ఆహార భద్రతా మిషన్ కార్యక్రమం అమలు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటి కోసం విడుదలైన నిధులు ఎంతమేర అక్కరకు రాకుండా ఉన్నాయో గమనించొచ్చు. వాస్తవానికైతే వీటిని రైతుల దరిచేర్చేందుకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రైతు సదస్సులు, కిసాన్ మేళాలు ద్వారా అర్హులైన సాగు రైతుల్ని గుర్తించి, యూనిట్లు అందజేయవచ్చు. అలాగే రైతు మిత్ర సంఘాలు, ఆదర్శ రైతుల ద్వారా అర్హులైన రైతులను ఎంపిక చేసి ప్రయోజనం కల్పించడానికి అవకాశం ఉంది. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విడుదలైన కోట్లాది రూపాయల నిధులు కాగితాలకే పరిమితమయ్యాయని స్పష్టమవుతోంది.