ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 18న ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. అక్కడ జరగబోయే 'కిసాన్ సమ్మేళన్'లో (రైతుల సదస్సు) మోదీ ప్రసంగించనున్నారు. అయితే మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ.. వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మోదీ పర్యటనపై స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. వారణాసిలోని రొహనియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతుల సదస్సుకు వేదిక ఉండనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గులాబ్‌బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో మహానగర, జిల్లా అధికారుల సమావేశం నిర్వహించారు.
వారణాసిలో ఒకరోజు పర్యటన సందర్భంగా దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో ప్రధాని మోదీ పాల్గొంటారని, అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని కాశీకి చెందిన బీజేపీ అధికారి దిలీప్ పటేల్ తెలిపారు. వారణాసిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలందరికి పిలుపునిచ్చారు. రైతు సదస్సుకు పార్టీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించే ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపారు.
కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్‌పై 1.5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment