
నేడు (ఏప్రిల్ 14) అంబేద్కర్ జయంతి. దేశంలోని దళితుల అభ్యన్నతికి పాటు పడిన అంబేద్కర్(Ambedkar)కు హైదరాబాద్‌పై ప్రత్యేక అభిప్రాయం ఉంది. అప్పట్లో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ సూచించారు. కొంతకాలం దీనిపై చర్చ జరిగింది. అయితే మారిన కాలంతో పాటు చోటుచేసుకున్న పరిణామాలతో ఈ అంశం కొంతమేరకు మరుగున పడింది.
భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రెండో రాజధాని(Second capital) అవసరమనే ఆలోచనను 1950వ దశకంలో తన పుస్తకం 'థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్'లో ప్రతిపాదించారు. ఈ పుస్తకంలో ఆయన దేశానికి రెండో రాజధాని అవసమని పేర్కొన్నారు. తద్వారా ఉత్తర-దక్షిణ ఉద్రిక్తతలను తొలగించేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. ఒక్క రాజధాని భారతదేశానికి సరిపోతుందా? అని అంబేద్కర్ ప్రశ్నించారు. దేశ రెండో రాజధానిగా కలకత్తాను ఎంచుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
కలకత్తా టిబెట్‌కు సమీపంలో ఉందని, అలాగే ముంబై సముద్ర తీరంలో ఉండటం వల్ల అది కూడా రెండో రాజధానిగా సురక్షితం కాదని అంబేద్కర్ భావించారు. ఈ దశలో చివరగా ఆయన హైదరాబాద్(Hyderabad)ను ఎంచుకున్నారు. ఈ ప్రాంతపు భౌగోళిక స్థానం దేశంలోని అన్ని దిశల నుంచి సమాన దూరంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని అంబేద్కర్ పేర్కొన్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్- బొలారం ప్రాంతాలను చీఫ్ కమిషనర్ ప్రావిన్స్‌గా ఏర్పాటు చేసి, భారతదేశ రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ నాడు సిఫారసు చేశారు.
అంబేద్కర్ ఈ సూచనను భాషాపరమైన రాష్ట్రాలు ఏర్పడకముందే, అంటే 1960కి ముందు చేశారు. అయితే నేడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో రెండో రాజధాని వాదన వినిపించింది. కాగా అంబేద్కర్ నాగ్‌పూర్‌ను రెండో రాజధానిగా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని పలువురు విశేషంగా చెబుతుంటారు. అంబేద్కర్ 1956లో నాగపూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరించి, లక్షలాది మందిని కుల వివక్ష నుంచి విముక్తి చేసే చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం