అంబేద్కర్ విగ్రహావిష్కరణ లైవ్ అప్‌డేట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగం..
- ఇది కేవలం విగ్రహం కాదు.. ఒక విప్లవం
- అంబేడ్కర్ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు
- విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు
- అంబేద్కర్ పేరిట శాశ్వతమైన అవార్డు ఇవ్వాలని నిర్ణయించాం
- ఏటా అంబేద్కర్ జయంతి రోజు అవార్డుల ప్రదానం
- ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు
- అంబేద్కర్ విశ్వ మానవుడు
- అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీయమైనది
- అణగారిన వర్గాల ఆశాదీపం అంబేద్కర్
- అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలి
- అంబేద్కర్ మాటలు ఆచరించాలి
- ఎవడో డిమాండ్ చేస్తే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు
- ఈ విగ్రహ ఏర్పాటులో ఒక బలమైన సందేశం ఉంది
- సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం
- దళితుల ఆర్థికవృద్ధికి దళితబంధు పథకం తీసుకొచ్చాం
► గౌరవ అతిథి ప్రకాష్ అంబేద్కర్ ప్రసంగిస్తూ.. మీ అందరి తరపున తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతులు చెబుతున్నా. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. దేశప్రజలందరూ సంతోషంగా ఉండాలని అంబేద్కర్ ఆకాంక్షించారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఆశించారు. సమాజంలో మార్పు కోసం ఆయన అహర్నిశలు తపించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారు.
► దళిత బంధు విజయగాథ పాటల సీడీని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్‌లు.
► అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. చారిత్రాత్మకం. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని భారీగా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా అమలు అవుతున్న దళిత బంధు పథకం.. ఒక విప్లవాత్మక మార్పును దోహదం చేస్తుంది.
:: మంత్రి కొప్పుల ఈశ్వర్
► రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు, విగ్రహావిష్కరణకు గౌరవ అతిథిగా హాజరైన ప్రకాష్ అంబేద్కర్‌కు కేసీఆర్ శాలువా, పుష్ఫ గుచ్ఛంతో సత్కరించారు. అంబేద్కర్ తనయుడు యశ్వంత్(భయ్యా సాహెబ్)కి తనయుడైన ప్రకాష్(బాలాసాహెబ్ అంబేద్కర్).. రచయిత, న్యాయవాదిగానే కాకుండా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు కూడా.
► అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ, అంబేద్కర్ స్మృతి వనం సందర్శన అనంతరం.. సభా వేదికపైకి చేరుకున్న కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్.
► స్మృతి వనం నుంచి బయటకు వచ్చి సభా ప్రాంగణంలోని ప్రజలకు అభివాదం చేసిన ప్రకాష్ అంబేద్కర్, కేసీఆర్.
► అంబేద్కర్ మహా కాంస్య విగ్రహం కోసం 11.80 ఎకరాల విస్తీర్ణం జాగా, రూ. 146 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ పీఠం 50 అడుగులు పార్లమెంట్ భవనం ఆకారంలో ఏర్పాటు చేయగా.. బీఆర్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులతో ఏర్పాటు చేశారు. విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వాంజీ సుతార్.
► అంబేద్కర్ స్మృతి వనంలోని స్క్రీన్‌పై అంబేద్కర్ విగ్రహ ఏర్పాటునకు సంబంధించిన క్లిప్స్‌ను వీక్షించారు విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రకాశ్ అంబేద్కర్.
► అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కలియదిరిగారు. వెంట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర నేతలంతా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీ, లైబ్రరీ తదితరాలను వీక్షించారాయన.
► పూలు జల్లి అంబేద్కర్‌కు నివాళి అర్పించారు అక్కడ హాజరైన ప్రముఖులంతా.
► హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ జరిగింది. బౌద్ధ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రకాష్ అంబేద్కర్ చేతుల మీదుగా బౌద్ధ గురువులను సన్మానించారు.
► అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.
► విగ్రహావిష్కరణ ఫలకం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్, మంత్రులు, దళిత సంఘాల ప్రముఖులు.
► అంబేద్కర్ మహావిగ్రహంపై హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.
► అంబేద్కర్ స్మృతి వనానికి చేరుకున్న సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్, ఇతరులు.. విగ్రహ విశేషాలను ప్రకాష్ అంబేద్కర్‌కు వివరించిన సీఎం కేసీఆర్.
► ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్, కార్యక్రమ ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్. ప్రాంగణం వద్ద ఘన స్వాగతం.
► జనసంద్రంగా మారిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రాంగణం. కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు.
► ప్రగతి భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు బయల్దేరిన సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్.
► ట్యాంక్ బండ్ విగ్రహావిష్కరణ వేదిక వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు.
► దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని(125 అడుగులు) తెలంగాణ హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నారు. ట్యాంక్ బండ్ మీద సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగనుంది. రాజ్యాంగ నిర్మాతకు గౌరవ సూచీగా ఏర్పాటు చేసిన ఈ భారీ విగ్రహాన్ని టూరిస్ట్ స్పాట్‌గానే కాకుండా నాలెడ్జ్ సెంటర్‌గానూ ప్రమోట్ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
ఇదీ చదవండి: రాజ్యాంగ నిర్మాతకు నిలువెత్తు గౌరవం
Comments
Please login to add a commentAdd a comment