statue
-
బుద్ధుడిలా ట్రంప్ విగ్రహాలు
డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడూ కాసింత చిరాకు ప్రతిబింబించే ముఖం. అలాంటి ముఖానికి హాంగ్ జిన్ షి అనే చైనా గ్రామీణ కళాకారుడు బుద్ధుడి ప్రశాంతతను ఆపాదించాడు. శాంతచిత్తంతో ఉన్న ట్రంప్ విగ్రహాలను తయారు చేశాడు. బుద్ధుని మాదిరిగా కళ్లు మూసుకుని దైవ చింతనలో కూర్చుని ఉన్న విగ్రహాలను పింగాణీతో రూపొందించాడు. సైజును బట్టి వీటిని 140 నుంచి 2,700 డాలర్ల దాకా విక్రయిస్తున్నాడు. 2021లో ఇ–కామర్స్ ప్లాట్‌ఫాం టావోబావోలో వైరలైన ఈ ట్రంప్ విగ్రహాలు ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మరోసారి ఆకర్షిస్తున్నాయి. సరదాగా మొదలెట్టి... 47 ఏళ్ల హాంగ్ ఇప్పటిదాకా కొన్ని వందల సిరామిక్ వస్తువులను తయారు చేశాడు. ‘‘రాజకీయ నాయకులు సాధారణంగా బోరింగ్‌గా ఉంటారు. కానీ ట్రంప్ అందుకు భిన్నమైన నేత. అందుకే తొలుత సరదాగా ఆయన విగ్రహాలను రూపొందించా. ట్రంప్ వ్యక్తిత్వం, విగ్రహం ఆకారం పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. దాంతో వాటిని కొనేందుకు బాగా ఇష్టపడుతున్నారు’’అని చెప్పుకొచ్చాడు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’నినాదంతో ట్రంప్ గెలిస్తే, హాంగ్ మాత్రం ప్రతి విగ్రహం ప్యాక్‌పైనా ‘మీ కంపెనీని మళ్లీ గొప్పగా చేయండి’అని రాస్తున్నాడు. దీన్ని అనుసరిస్తూ అమెరికాలో పలు ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాంలలో కొన్ని వెర్షన్లు వచ్చాయి. ట్రంప్ పాలనలో ప్రధాన పాత్ర పోషించనున్న కుబేరుడు ఎలాన్ మస్క్ విగ్రహాన్ని కూడా హాంగ్ డిజైన్ చేస్తున్నాడు. అందులో మస్‌్కను ఐరన్ మ్యాన్‌గా చూపిస్తున్నాడు. ట్రంప్‌కు చైనాలో ఇప్పటికీ చాలామంది అభిమానులున్నారని చెప్పాడు చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వివాహ రిసెప్షన్లో తండ్రి ప్రతిమ
సింగరేణి (కొత్తగూడెం): ఇంటిపెద్ద మృతి చెందితే చాలామంది ఇంట్లో ఫొటో ఏర్పాటుచేసి సరిపెట్టుకుంటారు. కానీ ఓ యువకుడు రూ.లక్షలు వెచ్చించి తన తండ్రి ప్రతిమ చేయించి సోదరి వివాహ రిసెప్షన్ వేదికపై ఏర్పాటుచేసి మమకారాన్ని చాటుకున్నాడు. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో ఐటీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన పెరికం బాలరాజు 2019లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత ఆయన కుమార్తె స్నేహకు యాజమాన్యం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగావకాశం కల్పించింది. ఆమెకు శ్రీరాంపూర్ ఏరియాలో అండర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అవినాష్ తో పెళ్లి కాగా.. కొత్తగూడెంలో శనివారం రాత్రి రిసెప్షన్ నిర్వహించారు. ఈమేరకు ముంబైలో రూ.4 లక్షల వ్యయంతో వీల్‌చైర్‌లో కూర్చున్న రూపంలో చేయించిన బాలరాజు విగ్రహాన్ని వేదికపై ఏర్పాటుచేయగా.. స్నేహ దంపతులతో పాటు ఆమె సోదరుడు, తల్లి ఫొటోలు దిగారు. తండ్రి జ్ఞాపకాలు పదిలంగా ఉండాలనే భావనతో విగ్రహాన్ని తయారుచేయించినట్లు కుటుంబీకులు తెలిపారు. -
ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదయిన సందర్భంలో అన్ని వర్గాల్లోనూ చర్చ చాలా లోతుగానే జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తొలి పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తమ ఆకాంక్ష లకు అనుగుణంగా లేదని చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు. తెలంగాణ కోసమే ఒక రాజకీయ పార్టీ స్థాపించి, తెలంగాణ పేరుతో ప్రతినిత్యం తన రాజకీయం నడిపించిన కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు శాశ్వతంగా పట్టం కట్టలేదనీ, కట్టరనీ ఏడాది క్రితం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి.నిజానికి 2014 ఎన్నికల్లో కేసీఆర్‌కు పట్టం కట్టిన ప్రజలు 2019 ఎన్నికలలోపే ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తూ వచ్చారు. ఇది కనిపెట్టిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలతో (2019) పాటు అసెంబ్లీ ఎన్ని కలు జరిగితే మోదీ సునామీలో అధికారం కోల్పోవడం ఖాయం అని ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇతర వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. అందుకే ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ తనదైన టక్కు టమార విద్యలతో 2018 లోనే అసెంబ్లీకి ప్రత్యేకంగా ఎన్నికలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగి ఉంటే అదే స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండేది. రెండవ దఫా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళనుంచి తెలంగాణ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. తెలంగాణలో అనుకోకుండా దుబ్బాక నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నిక ఈ వ్యతిరేకత చూపించడానికి తొలి వేదిక అయ్యింది. సొంత జిల్లా సిద్దిపేటలో అటు గజ్వేల్, ఇటు సిరిసిల్లకు మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు బీజేపీ తరఫున నిల బడిన నన్ను గెలిపించడం దీనికి నిదర్శనం.ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు... ఏడాది కాలంగా సరిగ్గా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నది. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన మేనిఫెస్టోలో 42 పేజీలలో వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మారి ఏడాది కూడా గడవక ముందే తెలంగాణలో కొత్త సర్కారుపై తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకతలు మొదలయ్యాయి.కేసీఆర్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ‘ఆరు గ్యారెంటీల’ పేరుతో అలవి కాని హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కి... ఇప్పుడు ప్రజలపై స్వారీ చేస్తోంది రేవంత్ సర్కార్. 6 గ్యారంటీలలో నెర వేర్చినవి కూడా అరకొరగా మాత్రమే ఉండటం గమ నార్హం. ప్రజలకు అవసరం లేని... పేర్లలో మార్పు, విగ్రహాలలో మార్పు చేయడం మాత్రమే ప్రజా పాలనకు నిదర్శనమా? తెలంగాణ తల్లి విగ్రహం మలిదశ ఉద్యమంలో ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ప్రజల మన సుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహం మార్పు చేయడం వల్ల ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉన్నదా? నిజానికి తల్లి... దేవతతో సమానం. అట్లాంటి తెలంగాణ తల్లిని దేవత రూపంలో ఉండకూడదని కాంగ్రెస్ సర్కార్ అనుకోవడమే వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. మార్పు చేసిన విగ్రహం కూడా తెలంగాణలో బలిదానాలకు మూల కారణమైన సోనియా గాంధీ పుట్టిన రోజున ఆవిష్కరణ చేయడం తెలంగాణ ఆత్మగౌరవ వంచనగా భావించాల్సిందే. ‘అన్ని బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం’ అని ప్రమాణ పత్రంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ... కేవలం ‘పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు’ల్లో మాత్రమే ఆడపడుచులు ప్రయాణించడానికి అర్హులని అవమా నిస్తోంది. ఇలా ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టు మిట్టాడుతోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు అవుతాయని ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి.చదవండి: వ్యవసాయాన్ని పండుగ చేశాం!అత్తాకోడళ్ళతో సహా కుటుంబంలోని మహిళలందరికీ ఇస్తానన్న నెలకు రూ. 2,500 ఎక్కడకు పోయినాయి? వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అని... ఇప్పుడు కేవలం కొన్ని రకాల సన్న ధాన్యాలకు ఇస్తా మని చెప్పడం మోసం చేయడం కాదా? రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి, తర్వాత ‘షరతులు వర్తిస్తాయ’ని కార్పొరేట్ తరహా మోసం చేసిన ప్రభుత్వం ఇది. ‘రైతు భరోసా’ పెంచి కౌలు రైతులకు కూడా 15 వేల రూపా యలు ఇస్తామని ముఖం చాటేసిన గొప్ప సర్కారు ఇది. అందుకే మేనిఫెస్టోలో ఉన్న 42 పేజీలపై ప్రజాక్షేత్రంలో చర్చకు రావాలి. వారు అమలు చేశామని చెప్పుకుంటున్న హామీలపై కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరన్న విషయాన్ని రుజువు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిపక్షంలో ఎన్నికల వరకు కూడా ప్రజలు తిరుగుబాటు చేయకుండా నిలిచే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. తిరుగుబాటు సహజ గుణంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఇది కొత్త కూడా కాకపోవచ్చు.- రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ సభ్యులు -
తెలంగాణ తల్లి మాకొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు
-
తెలంగాణ తల్లి విగ్రహాలను మారుస్తామన్న కేటీఆర్
-
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ (ఫొటోలు)
-
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం(డిసెంబర్ 9) సాయంత్రం ఆరు గంటలకు అట్టహాసంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సెక్రటేరియట్లో 20 అడుగుల తెలంగాణతల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చేతిలో వరి,జొన్న, సజ్జ ధాన్యాలతో విగ్రహాన్ని రూపొందించారు.తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టం: సీఎం రేవంత్మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణతల్లి4 కోట్ల ప్రజల ఆకాంక్షను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందిఉద్యమ సమయంలో టీజీని యువకులు తమ గుండెలపై రాసుకున్నారుబీఆర్ఎస్ టీజీ అని కాకుండా టీఎస్ అని మార్చింది.తమ కుటుంబం కోసమే గత ప్రభుత్వం ఆలోచించిందిఈరోజు తెలంగాణతల్లి విగ్రహం ఆవిష్కరించుకోవడం మన అదృష్టంతెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్చను: భట్టి విక్రమార్కగత ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిందిరూ.7 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నాం ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నాంతెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛను మాత్రమే -
KSR Live Show: విగ్రహం మార్పు రాజకీయం.. ఎవరి వాదన కరెక్ట్ ?
-
తెలంగాణ తల్లి అంటే ప్రజల భావోద్వేగం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు కాదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి అని సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంస్కృతి, సాంప్రదాయాలను తీసుకొచ్చామని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా అని ప్రశ్నించారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినం. తెలంగాణ ఏర్పాటు పునాది పడిన రోజు. అమరుల త్యాగాలకు అనుగుణంగా సోనియా తెలంగాణ ప్రకటన చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు.ఇదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహంపై రేవంత్ ప్రకటన చేశారు. రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి అంటే భావోద్వేగం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. మనల్ని లక్ష్యసాధన వైపు నడిపించిన తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ నేల స్వేచ్చ కోసం పిడికిలి బిగించిన ఉజ్వల జ్వాల. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంస్కృతి, సాంప్రదాయాలను తీసుకొచ్చాం.మెడకు కంటె, గుండు పూసల హారంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. పత్రీ ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలి. సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ స్పూర్తితో విగ్రహం.ఏ తల్లికి కిరీటం ఉండదు. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుంది. తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా. చేతిలో వరి, జొన్నలు, సజ్జలతో తెలంగాణ తల్లి విగ్రహం. పుట్టుక నీది, చావు నీది అన్న కాళోజీ మాటల స్పూర్తితో యువత ఉద్యమించింది. అగ్నికీల్లలో దేహాలు మండినా తెలంగాణ సాధన కోసం యువత వెనకడుగు వేయలేదు. -
తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్
-
TG: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌కు ఆహ్వానం
-
విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్
-
విగ్రహావిష్కరణకు రండి.. కేసీఆర్‌కు రేవంత్ సర్కార్ ఆహ్వానం
సాక్షి, సిద్ధిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. సిద్ధిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన పొన్నం.. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అయితే, సీఎం రేవంత్ సర్కార్ ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తారా..? లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.కాగా, శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ప్రజా పాలన ఉత్సవాలు, సోమవారం సచి వాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్ర గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష నేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, ప్రొటోకాల్ అధికారులు శనివారం వెళ్లి ఆహ్వానాలు అందజేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా కలిసి ఆహ్వానం అందజేశారు.ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై పిటిషన్కొత్తగా కొలువుదీరబోతున్న తెలంగాణ తల్లి ముడిచిన కొప్పు, మెడలో కంటెతో రెండు సాధారణ బంగారు హారాలు, చెవులకు సాధారణ జూకాలు, చిన్న ముక్కు పుడక, చేతులకు ఆకుపచ్చ మట్టి గాజులు, కాళ్లకు పట్టీలు, మెట్టెలు ధరించి ఉంటుంది. సాధారణ నేత తరహా చీర కనిపిస్తుంది. బంగారు వర్ణం అంచు ఉన్న ఆకుపచ్చ రంగు చీర, ఎరుపు వర్ణం రవిక ఉంటుంది. ఇంటి పనుల్లో తలమునకలయ్యే మహిళలు చీర కొంగును ముడిచిన తీరును ప్రతిబింబిస్తుంది. కుడి చేయిని అభయహస్తంగా తీర్చిదిద్దారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, పచ్చ జొన్న, సజ్జ, వరికంకి.. ఇలా తెలంగాణ సంప్రదాయ పంటలైన తృణధాన్యాల గుర్తులు ఏర్పాటు చేశారు. పీఠం దిగువన తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా బిగించిన పిడికిళ్లు కనిపిస్తాయి. పైభాగంలో.. పైకి ఎత్తుతున్న తరహాలో చేతుల రూపాలు ఏర్పాటు చేశారు. -
ముదురుతున్న వివాదం.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది. విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన నిలిపివేయాలని జూలూరి గౌరీశంకర్ పిటిషన్ వేశారు. విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్త్వంపై జరుగుతున్న దాడిగా పిటిషన్లో పేర్కొన్నారు.కాగా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా? విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదంటూ మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా?’’ అంటూ ప్రశ్నించారు.ఇదీ చదవండి: విగ్రహావిష్కరణకు రండి.. కేసీఆర్‌కు రేవంత్ సర్కార్ ఆహ్వానంమరోవైపు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. -
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం
-
రాజ్‌భవన్‌లో సొంత విగ్రహం.. గవర్నర్‌పై విమర్శలు
కోల్‌కతా: బెంగాల్ గవర్నర్ ఆనంద్‌బోస్ మరోసారి వార్తల్లోకెక్కారు. గవర్నర్‌గా రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన చేసిన పని వివాదాస్పదమైంది.స్వయంగా ఆయన విగ్రహాన్ని ఆయనే రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించుకున్నారు బోస్. గవర్నర్‌గా ఓ పక్క ఇంకా పదవిలో ఉండగానే సొంత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించుకోవడమేంటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.విగ్రహావిష్కరణ వీడియోలు సోషల్‌మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.బోస్పై నెటిజన్లు తెగ విమర్శలు చేస్తున్నారు.అయితే దీనిపై రాజ్‌భవన్ స్పందించింది.గవర్నర్ తన విగ్రహాన్ని తాను ఆవిష్కరించుకోలేదని అది ఆయనకు బహుమతిగా వస్తే తెర తీసి చూసుకున్నారని తెలిపింది.బోస్ చర్యపై అధికార తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. సొంత విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎక్కడా వినలేదని తృణమూల్ నేతలు గవర్నర్‌ను ఎద్దేవా చేశారు.📜 On November 23, 2024, Indian Museum embraced the spirit of #ApnaBharatJagtaBengal on the twenty-third day of our month-long celebration, to mark the commencement of Dr. C. V. Ananda Bose, the Hon'ble Governor of West Bengal's third-year in office, as visionary leader of state. pic.twitter.com/qNg7eGhu6Q— Indian Museum (@IndianMuseumKol) November 23, 2024ఇదీ చదవండి: ‘సేనా’ధిపతిషిండే -
చనిపోయిన భార్యపై ప్రేమతో..
బ్రహ్మపూర్: భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటారు. ఆలుమగలులో ఏ ఒక్కరు దూరమైనా మరొకరు విలవిలలాడిపోతారు. ఒంటరితనానికి లోనవుతుంటారు. అయితే ఒడిశాలోని బ్రహ్మపూర్‌కు చెందిన ఓ భర్త తన భార్య చనిపోయాక, ఆమెను మరచిపోలేక చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో ప్రశాంత్ నాయక్(52) అనే వ్యాపారవేత్త భార్య కిరణ్ కరోనా కాలంలో మరణించారు. వారిద్దరికీ 1997లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. ప్రశాంత్ తన భార్య దూరమవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆయన సిలికాన్ మెటీరియల్‌తో భార్య విగ్రహాన్ని తయారు చేయించాడు. దానిని తన డ్రాయింగ్ రూమ్‌లో ఉంచాడు. ప్రశాంత్ తన పెద్ద కూతురు వివాహం సందర్భంగా ఆ సిలికాన్ విగ్రహానికి చీర, నగలు ధరింపజేశాడు.ప్రశాంత్ కుమార్తె మెహక్ తన తల్లి విగ్రహాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ప్రతీరోజూ ఆ విగ్రహానికి చీరలు, నగలు మారుస్తుంటుంది. మెహక్ ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన భార్య తనతోనే ఉన్నట్లు అనిపిస్తుందని ప్రశాంత్ తెలిపారు. ఇంట్లో అమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని తన పిల్లలు కోరారని ప్రశాంత్ పేర్కొన్నారు.బెంగళూరుకు చెందిన శిల్పి ఫైబర్, రబ్బరు, సిలికాన్ ఉపయోగించి ఏడాదిపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రశాంత్ కుమార్ ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రశాంత్ తన పెద్ద కుమార్తె పెళ్లికి ముందు ఇంటికి తీసుకువచ్చారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తమ తల్లి తమతోనే ఉన్నదనిపిస్తుందని ప్రశాంత్ పిల్లలు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. -
ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన : నిందితుడు దొరికాడు
ముంబై : మహారాష్ట్రలో 35 అడుగుల మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనలో విగ్రహ తయారీ దారుడు జయదీప్ ఆప్టేను పోలీసులు అరెస్ట్ చేశారు. జయదీప్ ఆప్టే ప్రస్తుతం రాష్ట్ర డీసీపీ కార్యాలయంలో పోలీసు కస్టడీలో ఉన్నారు. గత నెల ఆగస్ట్ 26న సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం కూలిపోయింది. ఈ ఘటన జరిగిన అనంతరం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరాఠా యోధుడి విగ్రహం ఏర్పాటులో అవినీతి జరిగిందని, నిందితుల్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో తనని పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో జయదీప్ పరారయ్యాడు. ఎట్టకేలకు కణ్యాణ్ ప్రాంతంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.అనుభవం లేకుండా విగ్రహం తయారీమహరాష్ట్రలో దుమారం రేపుతున్న శివాజీ విగ్రహం కూలిన ఘటనపై జయ్‌దీప్ గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. కల్యాణ్ ప్రాంతంలో విగ్రహాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న జయ్‌దీప్‌కు అనుభవం లేదని పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసిన అనుభవం ఉన్న జయ్‌దీప్ 30 అడుగుల భారీ విగ్రహాన్ని ఎలా తయారు చేశారనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. అనుభవం లేకపోవడం, ఫలితంగా విగ్రహం కూలిపోవడంపై పోలీసులు జయ్దీప్పై కఠిన చర్యలు తీసుకోనున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ విగ్రహం కూలిపోవడంతో ఇప్పటికే మహరాష్ట్ర పోలీసులు జయదీప్ ఆప్టే, నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌పై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆగస్టు 31న పాటిల్‌ను అరెస్టు చేయగా..ఆప్టేపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం, సింధుదుర్గ్ పోలీసులు బృందాలుగా విడిపోయి జయ్దీపై కోసం ముంబై, థానే, కొల్హాపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అరెస్ట్ చేశారు. రాజకీయ దుమారంమరికొన్ని రోజుల్లో మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ కూలిపోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. విగ్రహ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.236 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంత భారీ నిర్మాణాన్ని రూపొందించడంలో అనుభవం లేకపోయినా జయదీప్‌కు ఇంత ముఖ్యమైన కాంట్రాక్టు ఎలా ఇచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్కనారు. -
‘వాళ్లకి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు’: ప్రధాని మోదీ
ముంబై : చత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. శిరస్సు వంచి క్షమాపణలు చెప్పారు.మహరాష్ట్రలో రూ.76వేల కోట్లతో నిర్మించనున్న వాడ్‌వాన్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ కూలిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ‘మనమంతా ఛత్రపతి శివాజీని దేవుడిలా కొలుస్తాం. కొందరు వ్యక్తులు దేశ భక్తులను అవమానిస్తున్నారు. వీర సావర్కర్‌ను కూడా ఇష్టారీతిగా తిట్టిపోశారు. దేశభక్తులను అవమానించినవారు క్షమాపణలు చెప్పాల్సిందే. సమరయోధులను గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా వారికి లేదు. కానీ క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారని’ ధ్వజమెత్తారు.నా కొత్త ప్రయాణం ప్రారంభమైంది అప్పుడే 2013లో బీజేపీ నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ప్రకటన అనంతరం నేను చేసిన మొదటి పని రాయ్‌గఢ్‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని భక్తుడిలా సందర్శించా. అప్పటి నుంచే నా కొత్త ప్రయాణం ప్రారంభమైందని’ మోదీ అన్నారు. ముందు ఒక భక్తుడిగా కూర్చుని కొత్త ప్రయాణం ప్రారంభించడం” అని మోదీ పాల్ఘర్లో అన్నారు.#WATCH | Palghar, Maharashtra: PM Narendra Modi speaks on the Chhatrapati Shivaji Maharaj's statue collapse incident in MalvanHe says, "...Chhatrapati Shivaji Maharaj is not just a name for us... today I bow my head and apologise to my god Chhatrapati Shivaji Maharaj. Our… pic.twitter.com/JhyamXj91h— ANI (@ANI) August 30, 2024 -
అమెరికాలో 90 అడుగుల ఎత్తయిన హనుమంతుడు
అమెరికాలోని టెక్సాస్‌లోగల హనుమంతుని భక్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక్కడి హ్యూస్టన్‌లో తాజాగా 90 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ భారీ విగ్రహం అమెరికాలోని మూడవ ఎత్తయిన విగ్రహంగా పేరు తెచ్చుకుంది. ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ ప్రాంతంలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వెనుక చినజీయర్ స్వామి సూచనలు, సలహాలు ఉన్నాయి.‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఈ విగ్రహం యునైటెడ్ స్టేట్స్‌లోని మూడవ అతి ఎత్తయిన విగ్రహం. అలాగే హనుమంతునికి సంబంధించిన 10 ఎత్తయిన విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ నుంచి స్వామివారి విగ్రహంపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. This is the “Third Tallest Statue” in the United States 🇺🇸. A grand Pran Pratishtha ceremony was held in Houston, Texas, on Aug 18, where a 90 foot tall Hanuman statue was inaugurated.pic.twitter.com/Ng7W4CFewV— Gems of Engineering (@gemsofbabus_) August 20, 2024 -
శ్రీరాంపురంలో దివంగత నేత YSR విగ్రహం ధ్వంసం
-
శ్రీరాంపురంలో దివంగత నేత YSR విగ్రహం ధ్వంసం
-
జుకర్ బర్గ్... ప్రేమ మార్క్
షాజహాన్‌కు భార్య పై ఉన్న ప్రేమ పాలరాతి తాజ్‌మహల్‌లో ప్రతిఫలించింది. మెటా బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ విషయానికి వస్తే... భార్యపై ఆయనకున్న ప్రేమ ఇంటి పెరట్లోని సుందరమైన నీలిరంగు విగ్రహంలో ప్రతిఫలిస్తోంది. రొమాంటిక్ హావభావాలతో కూడిన భార్య ప్రిస్కిల్లా చాన్ భారీ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ఏర్పాటు చేశాడు జుకర్ బర్గ్. ఆ విగ్రహం పక్కన నిలబడి ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ విగ్రహం చిత్రాలు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాయి...ఫేస్బుక్ విజయం గురించి చెప్పుకోవడం కంటే తన ప్రేమ విజయం గురించి చెప్పుకోవడం అంటేనే మార్క్ జుకర్ బర్గ్‌కు ఇష్టం. ప్రిస్కిల్లా చాన్‌తో ఎలా పరిచయం అయింది, ఆ పరిచయం ఎలా ప్రేమగా మారింది కథలు కథలుగా చెబుతుంటాడు. అవి ఎప్పుడో జరిగినట్లుగా ఉండవు. నిన్నా మొన్న జరిగినట్లుగానే ఉంటాయి. అది అతడి మాటల చాతుర్యం కాదు. ప్రేమలోని మాధుర్యం!19 మే, 2012 అనేది జుకర్ బర్గ్, చాన్లకు మరచిపోలేని సుదినం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఈ ఔట్‌డోర్ వెడ్డింగ్లోని విశేషం ఏమిటంటే... పెళ్లి నాటి ప్రమాణాలను కాగితాల రూపంలో ఇరువురు ఇచ్చిపుచ్చుకున్నారు.జుకర్‌బర్గ్ చాన్‌కు ఇచ్చిన పేపర్లో ఇలా రాసి ఉంది.... ‘ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో... ఎప్పుడూ ఇలాగే’ అదృష్టవశాత్తు ఆ సంతోషం ఇప్పటివరకు వారికి దూరం కాలేదు. ‘మార్క్ అప్పుడు ఎంత ప్రేమతో ఉన్నాడో ఇప్పుడూ అంతే. అప్పుడు ఎలా నవ్వించేవాడో ఇప్పుడూ అంతే’ అంటూ భర్త గురించి మురిపెంగా చెబుతుంటుంది ప్రిస్కిల్లా చాన్.ఏడు అడుగుల సిల్వర్ అండ్ బ్లూ ప్రిస్కిల్లా చాన్ విగ్రహం వారి బలమైన ప్రేమ బంధానికి ప్రతీకలా కనిపిస్తోంది. ప్రవహిస్తున్నట్లుగా కనిపించే వెండి వస్త్రం విగ్రహాన్ని మరింత ఆకర్షణీయం చేసింది. ఈ విగ్రహం కోసం న్యూయార్క్‌కు చెందిన ఆర్టిస్ట్, అర్కిటెక్చర్, శిల్పి డేనియల్ ఆర్షమ్ను సంప్రదించాడు మార్క్. విగ్రహం ఎలా ఉండాలి? అనే దాని గురించి ఇద్దరి మధ్య ఎన్నోరోజుల పాటు చర్చలు జరిగాయి.చాన్ విగ్రహం పుణ్యమా అని ‘ఎవరీ డేనియల్’ అనే శోధన మొదలైంది. ఈ డేనియల్‌కు ‘ఇన్స్టాగ్రామ్ శిల్పి’ అని పేరు. డ్యాన్స్, డిజైన్, అర్కిటెక్చర్, ఆర్ట్‌ను మిక్స్ చేసిన కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో పెద్ద ప్రాజెక్ట్‌లకు పని చేశాడు. ‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు జుకర్ బర్గ్.టీ సేవిస్తూ తన విగ్రహం దగ్గర ఫొటో దిగిన ప్రిస్కిల్లా చాన్ ఆ ఆర్ట్‌వర్క్‌ను ‘అద్భుతం’ అని ప్రశంసించింది.ఏడు అడుగుల ప్రిస్కిల్లా చాన్ విగ్రహంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. భార్యపై మార్క్ జుకర్‌బర్గ్‌కు ఉన్న ప్రేమను ఎంతోమంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీలిరంగులో ఉన్నందుకు కావచ్చు... కొందరు మాత్రం ఈ విగ్రహాన్ని అవతార్ క్యారెక్టర్లతో పోలుస్తూ జోక్‌లు పేలుస్తున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా... ప్రిస్కిల్లా చాన్ విగ్రహం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.కన్నీళ్లు తుడిచే విగ్రహం‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని జుకర్ బర్గ్ అంటున్నాడుగానీ మన వాళ్లు ఆ పని ఎప్పుడో చేశారు. చేస్తున్నారు! కోల్‌కత్తాకు చెందిన 65 సంవత్సరాల తాపస్ అనే రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి 2.5 లక్షలు ఖర్చు చేసి తన భార్య ఇంద్రాణి సిలికాన్ స్టాచ్యూను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. జీవకళ ఉట్టిపడే ఈ విగ్రహంతో తాపస్ ఎన్నోసార్లు మాట్లాడుతుంటాడు. తన భార్య చనిపోలేదని, విగ్రహం రూపంలో ఇంట్లోనే ఉంది అనుకొని దుఃఖానికి దూరం అయ్యాడు. తాపస్లాంటి భర్తల కథలు మన దేశ నలుమూలలా ఉన్నాయి. -
ఈ ‘బరితెగింపు’.. ఎల్లో మీడియాకు కనబడలేదా?
ఏమిటి ఈ బరి తెగింపు.. ఏమిటీ అరాచకం. చివరికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలిపెట్టరా! ఏపీలో జరుగుతున్న దుష్టపాలనకు ఇది నిలువుటద్దంగా నిలుస్తుంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున భాసిల్లుతున్న అంబేద్కర్ విగ్రహం. అక్కడే ఉన్న పార్కు, లైబ్రరీ అంతా ఒక విజ్ఞాన సంపదగా ఉన్న టూరిస్టు స్పాట్‌పై గురువారం రాత్రి దాడి జరగడం అత్యంత శోచనీయం.ఏపీ సమాజంలో అశాంతి రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి మరింత ప్రమాదకరంగా ఉంది. ఒకవైపు గవర్నర్ బంగళా, మరో వైపు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు, కార్యాలయాలు ఉన్న విజయవాడ స్వరాజ్మైదాన్లోని అంబేద్కర్ విగ్రహంపై దుండగులు దాడికి సాహసించారంటే కచ్చితంగా దీని వెనుక ఎవరో కొందరు పెద్దల హస్తం ఉందన్న అనుమానం సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి అంబేద్కర్ కేంద్రాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును శిలాఫలకం నుంచి తొలగించడానికి జరిగిన యత్నం చూస్తే ఇది టీడీపీ అల్లరి మూకల పనేనన్న సంగతి అర్ధం అవుతుందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ల ప్రమేయంతోనే ఇలాంటి నీచమైన అకృత్యాలు జరుగుతున్నాయని ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది. అంబేద్కర్‌ను దేశ వ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఆయన పట్ల మానవ సమాజం ఎంత అభిమానంతో ఉండేదో తెలుస్తుంది. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన రావడం, దానిని ఎక్కడో మారుమూల కాకుండా విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి జగన్ ప్రభుత్వం సంకల్పించి పూర్తి చేసింది. వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూల నుంచి తరలిరాగా, విగ్రహం.. అంబేద్కర్ లైబ్రరీ, పార్కు మొదలైనవాటిని జగన్ ఆవిష్కరించారు.నిత్యం వేలాది మంది అక్కడకు వెళ్లి అనుభూతి పొందుతారు. 2014 టరమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని, ఆయన పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాని విజయవాడ వంటి సెంటర్లో కాకుండా, అమరావతిలో ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో నెలకొల్పాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం చివరికి దానిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన. జగన్ ప్రభుత్వం ఏదో కుగ్రామంలో కాకుండా, విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సముచితంగా ఉంటుందని భావించింది. స్వరాజ్మైదాన్ను అటు అంబేద్కర్ కేంద్రంగాను, ఇటు పార్కు, వాకింగ్ ట్రాక్ మొదలైనవాటితో టూరిస్టు స్పాట్‌గా అభివృద్ది చేయాలని ప్లాన్ చేసి సుమారు రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసింది.సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్‌ను అంతా చూసుకుంటారు. పేదల గుండెల్లో, ప్రత్యేకించి దళితుల హృదయాలలో ఆయన కొలువై ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. స్వరాజ్మైదాన్ను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చైనా మాల్గా మార్చాలని ప్రయత్నించింది. కాని విజయవాడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ముందుకు వెళ్లలేదు. జగన్ ప్రజలందరికి ఉపయోగపడేలా దానిని తీర్చిదిద్దారు. అంతే కాక అంబేద్కర్ పేరుతో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా రాజకీయం జరిగింది.తొలుత అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు కోనసీమ జిల్లా అని పేరు పెట్టగా దళితవర్గాలు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసి ఆందోళనలకు దిగాయి. ఆ ఉద్యమంలో టీడీపీ, జనసేన వంటివి కూడా పాల్గొని దళితవర్గాలను రెచ్చగొట్టాయి. జగన్ ప్రభుత్వం అందరి అభిప్రాయాల మేరకు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కూడా జత చేసింది. అప్పుడు ఇదే టీడీపీ, జనసేన నేతలు ఇతర వర్గాలను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించాయి. చివరికి అప్పటి మంత్రి, ఒక ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టి అరాచకానికి పాల్పడ్డాయి. టీడీపీ, జనసేనలు డబుల్‌గేమ్ ఆడినా జగన్ ప్రభుత్వం నిర్దిష్ట విధానంతో ముందుకు వెళ్లింది. దాని వల్ల వైఎస్సార్సీపీకి కొంత నష్టం కూడా వాటిల్లింది. ఆ తర్వాతకాలంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపట్టారు.విజయవాడకు ఎటువైపు నుంచి ఎంటర్ అవుతున్నా విగ్రహం కనబడుతుంటుంది. అలాంటి టూరిస్ట్ స్పాట్ పై టీడీపీకి చెందిన కొందరు గూండాలు దాడి చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణంగా ఉంది. అంబేద్కర్ కేంద్ర సిబ్బంది నుంచి సెల్ పోన్లు లాక్కుని మరీ టీడీపీ కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడ్డారు. ఈ విగ్రహాన్ని ప్రారంబించిన జగన్ పేరు అక్కడ ఉండడం వారికి నచ్చలేదు. అంతే ఆ అక్షరాలను పీకేశారట. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమాచారం అంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోవడం శోచనీయం. టీడీపీ గూండాలు హత్యలు, దాడులు, విద్వంసాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు చూసి-చూడనట్లు ఉండడం, పైగా వాటిని ప్రోత్సహించే విదంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వ్యాఖ్యలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో టీడీపీ రౌడీలకు అడ్డు, ఆపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.ఇక తెలుగుదేశం మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాయి. చివరికి ఆంద్రజ్యోతి మీడియా ఈ దాడిని సైతం సమర్ధించే రీతిలో కదనాలు ఇస్తోందంటే అది ఏ రకంగా తయారైంది అర్థం చేసుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ వారు ఎంత అరాచకం చేసినా కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. ఆయనకు పదవి రావడం పరమాన్నంగా మారింది. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. గతంలో ఎప్పుడూ ఇలా విగ్రహాలపై, శిలాఫలకాలపై ఏ రాజకీయ పార్టీ దాడి చేయలేదు. ఒక్కడైనా ఒకటి, అరా జరిగినా, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దగ్ధం చేయడం, ధ్వంసం చేయడం, జగన్ పేరు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న శిలాఫలకాలను ద్వసం చేయడం వంటి అల్లర్లతో టీడీపీ అరాచక శక్తులు రెచ్చిపోయాయి.గుంటూరులో స్వయంగా ఒక టీడీపీ ఎమ్మెల్యేనే గుణపం పట్టుకుని శిలాఫలకాన్ని కూల్చుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ భరత్ ఆద్వర్యంలో ఒక వంతెన నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా టీడీపీ గూండాలు ద్వంసం చేశారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలు నీచంగా వ్యవహరిస్తుంటే నిరోధించవలసిన నాయకత్వం వారిని ఎంకరేజ్ చేసేలా కామెంట్స్ చేస్తూ వచ్చింది. టీడీపీ దళిత నేతలు సైతం నోరు విప్పడం లేదు. గతంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎవరైనా కొద్దిపాటి అపచారం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. అలా వార్తలు ఇవ్వడం తప్పు కాదు. ఏ నాయకుడి విగ్రహంపైన ఎవరూ దాడులు చేయకూడదు. కాని వైఎస్ విగ్రహాలను ద్వంసం చేసినా, చివరికి అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రముఖంగా వార్త ఇవ్వలేదంటే వారు ఏ స్థాయికి దిగజారింది అర్ధం చేసుకోవచ్చు.టీడీపీ మీడియాలో ఈ ఘటనలు రిపోర్టు చేయకపోతే, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా టీడీపీ రౌడీ గ్యాంగ్‌లు, టీడీపీ మీడియా మాఫియా మాదిరి ప్రవర్తిస్తున్న తీరు ఏపీ బ్రాండే ఇమేజీని నాశనం చేస్తున్నాయి. చంద్రబాబు ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోకపోతే మానే, ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారన్న అప్రతిష్టను మూటకట్టుకుంటున్నారు. ఇదంతా ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నలలో జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు టీడీపీ ఇష్టారీతిన విధ్వంసానికి పాల్పడితే, అప్పటి సీఎం పేరును, మంత్రుల పేర్లను ఫలకాల నుంచి తొలగించి ఆనందపడితే, భవిష్యత్తులో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, అప్పుడు ఇదే పరిస్తితి వారికి ఎదురు కాదా అన్న ప్రశ్న వస్తుంది. కాని సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం పలుమార్లు అనుభవం అవుతున్నా, టీడీపీకి చెందిన కొందరు మూర్ఖులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుండడం దురదృష్టకరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అంబేద్కర్ విగ్రహం విధ్వంసం.. మౌనమెందుకు చంద్రబాబూ?
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ మహాశిల్పంపై దాడి ఘటనలో చంద్రబాబు సర్కార్ ఇప్పటికీ స్పందించలేదు. దాడిపై అంబేద్కర్ వాదులు మండిపడుతున్నారు. దాడి జరిగి రెండు రోజులవుతున్నా ఒక్కరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. కనీసం కేసు నమోదు చేసి విచారిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించలేదు. అంబేద్కర్ మహాశిల్పంపై సుత్తెలు, ఇనుప వస్తువులతో దాడి చేయగా, ఇంకా విచారణ చేయకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంబేద్కర్ అవమానించడంపై వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. నేడు ఏపీ వ్యాప్తంగా కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేయనుంది.కాగా, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పనేనని అంబేద్కరిస్టులు, ప్రజాస్వామిక వాదులు, వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. విగ్రహంపై దాడి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు, దళిత సంఘం నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చేపట్టారు.భావితరాలకు స్ఫూర్తిగా, దిక్సూచిగా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరం నడిబొడ్డులో అంబేడ్కర్ విగ్రహం ఉండకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ ఉద్దేశమని, ఈ నేపథ్యంలో విగ్రహాన్ని కూల్చివేసే ప్రయత్నం చేసిందని పలువురు మండిపడుతున్నారు. -
అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి: భరత్
-
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటిరాంబాబు అన్నారు. ఈ విషయమై అంబటి శుక్రవారం(ఆగస్టు9) మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక దాడులు జరిగాయి. ఇప్పటివరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహాలపై, వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై టీడీపీ నేతలకు దాడులకు పాల్పడ్డారు. తాజాగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహంపైనే దాడికి పాల్పడ్డారు. దేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’అని మండిపడ్డారు.బాబు, లోకేష్‌ల ఆధ్వర్యంలోనే దాడి.. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డిడాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి చేయడమే. రాష్ట్రంలో లాఅండ్ఆర్డర్ పనిచేయడం లేదు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఆధ్వర్యంలోనే విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం పై దాడి జరిగింది. అంబేద్కర్ స్మృతివనంపై కుట్ర ప్రకారమే టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాడిలో టీడీపీకి ప్రమేయం లేకపోతే వెంటనే అంబేద్కర్ స్మృతి వనంలో తొలగించిన వైఎస్జగన్ పేరును పున: ప్రతిష్టించాలి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావుయావత్తు దళిత జాతితో పాటు ప్రజాస్వామ్యవాదులంతా రాత్రి విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని ఖండించాలి. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అప్పటివరకు పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఏ ఒక్కరికి భరోసా లేదు. యావత్తు ప్రజానీకం భయాందోళనలో జీవనం సాగిస్తున్నారు.దాడుల పర్వం కొనసాగుతోంది: గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమారాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం కేవలం దాడులకే పరిమితమయింది. సీఎం చంద్రబాబు అభివృద్ధిలో పోటీపడాలి కాని విధ్వంసాలతో పరిపాలన చేయడం మంచి విధానం కాదు. -
ఇది ప్రజాస్వామ్యంపై దాడి: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించిన వైఎస్సార్సీపీ నేతలు.. అంబేద్కర్ స్మృతివనం దగ్గర నిరసనకు దిగారు. భావితరాలకు దిక్సూచిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే టీడీపీ నేతలు దాడి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముంది. వెంటనే దాడి ఘటనపై విచారణ చేయాలి. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు.అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం గుంటూరు: గుంటూరు లాడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం వద్ద శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త నూరీ ఫాతిమా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది: అంబటి రాంబాబుఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ‘‘అంబేద్కర్ స్మృతివనంపై దుండగులు దాడి చేశారు. చంద్రబాబు,లోకేష్ ప్రమేయంతోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగింది. దాడి దురదృష్టకరం. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. దాడి ఘటనపై వెంటనే కేసు నమోదు చేయాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు.టీడీపీ నేతల హస్తం ఉంది: పోతిన మహేష్అంబేద్కర్ విగ్రహంపై దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి. దాడిలో టీడీపీ నేతల హస్తం ఉంది. అధికారుల అండదండలతో దాడి చేశారు వెంటనే ప్రజలకు చంద్రబాబు క్షమాప చెప్పాలి -
అంబేద్కర్‌పై ‘పచ్చ’మూకల ఉన్మాదం.. దళిత సంఘాల ఆందోళన
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడిని దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంబేద్కర్ స్మృతివనం దగ్గర దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ వాదులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. గత రాత్రి జరిగిన దుశ్చర్య అంబేద్కర్ మహనీయుడి పై జరిగిన దాడిగానే చూస్తాం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేయించిన దాడేనని.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.పరాకాష్టకు టీడీపీ దాడులు: మల్లాది విష్ణుఅంబేద్కర్ విగ్రహంపై దాడిని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ మాన్యుమెంట్‌పై వైఎస్ జగన్ పేరును తొలగించిన ప్రాంతాన్ని నేతలు పరిశీలించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అంబేద్కర్‌పై దాడి హేయమైన చర్య అన్నారు.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం: పుష్పశ్రీవాణిపార్వతీపురం మన్యం జిల్లా: డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన కూటమి నేతలను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడులు పరాకాష్టకు చేరాయి. అంబేద్కర్ విగ్రహం పై దాడి చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగ మాత్రం అమల్లో ఉంటుందని అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉండదని చెప్పినట్టుగా వీళ్లు తీరు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ రూ. 440 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో అధికారులు, పోలీసులు సమక్షంలో అంబేద్కర్ విగ్రహం పై దాడి జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది’’ అని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు.విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహంపై తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం.గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేడ్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి.. తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి.రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారు. వీరి మాటలను బట్టిచూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోంది. -
అంబెడ్కర్ విగ్రహ ధ్వంసానికి తరలివచ్చిన ఎల్లో గ్యాంగ్
-
విజయవాడ అంబెడ్కర్ విగ్రహంపై అర్ధరాత్రి టీడీపీ నేతల కుట్ర..
-
ఆగని టీడీపీ శ్రేణుల విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల విధ్వంసకర చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం పలు గ్రామాల్లో ప్రగతిపనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయ భవనంపై టీడీపీ, జనసేన జెండాలు ఎగురవేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ⇒ కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలోని ప్రధాన సెంటరు సమీపంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గతంలో మండలంలోని గొల్లగూడెం పంచాయతీపై యువగళం జెండా ఎగురవేశారు. ఈడుపుగల్లు, కంకిపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఉప్పలూరులో సచివాలయ భవనంపై ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో కూడిన బోర్డును పగులగొట్టారు. ⇒ నెల్లూరు జిల్లా జలదంకి మండలం కేశవరంలో నిర్మాణంలోని ప్రభుత్వ భవనాలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రంతో ఉన్న శిలాఫలకాలను పగులగొట్టారు. సచివాలయం, రైతుభరోసా కేంద్రాల్లో గోడలపై ఉన్న నవరత్నాల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. నిర్మాణంలో ఉన్న విలేజ్ హెల్త్‌క్లినిక్ భవనం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక పంచాయతీ కార్యాలయంపైన ఉన్న సచివాలయం గోడకు అమర్చిన నవరత్నాల శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన వివరాలు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతోసహా ఈ శిలాఫలకంపై ఉన్నాయి. గ్రామ శివారున గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ ఫొటోతో ఉన్న స్వాగత బోర్డులను ఊడబెరికారు.ఈ ఘటనల్ని సర్పంచ్ వీధి వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మద్దింశెట్టి దొరబాబు, నాయకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనాస్థలాన్ని మండపేట రూరల్ సీఐ శ్రీధర్, అంగర ఎస్ఐ అందే పరదేశి పరిశీలించి వివరాలు సేకరించారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు మాట్లాడుతూ సచివాలయం ప్రభుత్వ ఆస్తి అని, దీన్ని ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. ఈ ఘటనలకు పాల్పడినవారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ⇒ అనకాపల్లి జిల్లా మాడుగుల రూరల్ మండలంలో గిరిజన పంచాయతీ అయిన లోవపోన్నవోలు గ్రామ సచివాలయం భవనం మీద కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన జెండాలు ఎగురవేశారు. ఈ విషయమై ఎంపీడీవో ఆర్.కాళీప్రసాదరావును అడగగా.. ప్రభుత్వ కార్యాలయాల మీద జాతీయజెండా మినహా పార్టీ జెండాలు పెట్టకూడదని చెప్పారు. వీటిని వెంటనే తొలగిస్తామని తెలిపారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజెర్లలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ ప్రదేశాన్ని సోమవారం తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్సీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామిదాసు మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా గ్రామాల్లో నెలకొలి్పన నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం అరాచక చర్య అని చెప్పారు.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలకు, కులాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశారని, అలాంటి నాయకుడిని ప్రతి ఒక్కరు గౌరవించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్, వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లా కరుణాకరరావు, కావూరి వినయ్‌కుమార్, కలకొండ రవికుమార్, ఎంపీటీసీ సభ్యురాలు కటుకూరి రాధమ్మ, సొసైటీ మాజీ అధ్యక్షులు నంబూరి వెంకటకృష్ణారావు, నంబూరి కృష్ణారావు, నాయకులు వెంకటరెడ్డి, బాబూరావు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. పేదల ఇంటి నిర్మాణాలు ధ్వంసంచాట్రాయి మండలం పోలవరంలో పేట్రేగిన టీడీపీ నేతలుచాట్రాయి: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో టీడీపీ నాయకులు పేట్రేగిపోయారు. గత ప్రభుత్వం పేదలకు ఇచి్చన స్థలాల్లో లబ్ధిదారులు చేపట్టిన ఇంటి నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి జేసీబీతో రెండు ఇళ్ల పిల్లర్లు, ఫౌండేషన్ నిర్మాణాలను పెకిలించివేశారు. ఈ ఘటన స్థానికంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలవరం గ్రామంలోని మంకొల్లు రోడ్డులో నాలుగో లే అవుట్లో 28 మంది పేదలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంటిస్థలాలు మంజూరు చేసింది.వాటికి రిజి్రస్టేషన్ చేయించి పట్టాలు ఇచ్చింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు దానం బాబూరావు, కొంగర దేవదత్తం తమకు ఇచ్చిన స్థలాల్లో రూ.2 లక్షల వంతున వెచ్చించి ఇంటి నిర్మాణాల కోసం పునాదులు నిర్మించి, పిల్లర్లు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత టీడీపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల అదే గ్రామంలో జగనన్న లే అవుట్లో వేల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రావెల్ రోడ్లను ధ్వంసం చేశారు.రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సొంత నియోజకవర్గంలో ఇలాంటి విధ్వంసాలు చేపట్టడం దారుణమని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి పిల్లర్లు, ఫౌండేషన్ నిర్మాణాలను పెకలించి వేయడంపై బాధితులు ఫిర్యాదు చేశారని, విచారించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తహసీల్దార్ మహ్మద్ మసూద్ అలీ తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లోను ఫిర్యాదు చేసినట్టు లబ్ధిదారులు చెప్పారు. -
అద్దేపల్లిలో వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్ట
భట్టిప్రోలు: బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం పునఃప్రతిష్టించారు. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వర్గీయులు పెట్రోలు పోసి దహనం చేసిన విషయం విదితమే. ఈ చర్యను నిరసిస్తూ, ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి మౌనదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అశోక్‌బాబును రేపల్లె తరలించారు.ఆయన రాత్రి 12 గంటల వరకు రేపల్లె పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించేది లేదని చెప్పడంతో బాపట్ల ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు అశోక్‌బాబును పోలీసులు బలవంతంగా చెరుకుపల్లిలోని ఆదిశంకర వ్యాలీలోగల ఆయన నివాసానికి రాత్రి ఒంటిగంట సమయంలో తరలించారు. అశోక్‌బాబు ఆదివారం కూడా తన నివాసంలో దీక్షను కొనసాగించారు. ఆదివారం ఉదయం ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం మూడుగంటలకు దళితవాడ వాసులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.దళిత హోంమంత్రి, దళిత డీజీపీని పెట్టి పోలీసులతో దళితులపై లాఠీఛార్జి చేయించిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని దహనం చేసిన నిందితులను, వారిని నడిపించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాను అరెస్టు చేయాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసిన వీడియో, ఫొటోలు చూసిన అనంతరమే దీక్షను విరమిస్తామని అశోక్‌బాబు చెప్పడంతో వాటిని చూపించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ నిమ్మరసం ఇచ్చి అశోక్‌బాబుతో దీక్ష విరమింపజేశారు. -
కొనసాగుతున్న విధ్వంసకాండ
కృష్ణగిరి/నాగలాపురం/నల్లజర్ల/జలదంకి: టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోయాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్ విగ్రహాలను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన శిలాఫలకాలను పనిగట్టుకుని పగులగొడుతున్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా కృష్ణగిరిలోని బస్టాండ్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహంతోపాటు రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. విగ్రహం తల, చెయ్యి తొలగించారు. ఆదివారం ఉదయం దీన్ని చూసిన స్థానికులు నాయకులకు సమాచారం ఇచ్చారు.ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాయకులు కటారుకొండ మాధవరావు, శివ, వెంకటేశ్వర్లు, ఎరుకలచెర్వు ప్రహ్లాద, వెంకటరాముడు, అమకతాడు బాలు, మాధవస్వామి, కృష్ణగిరి జయరామిరెడ్డి, హుసేన్‌సాహెబ్, బాలమద్ది తదితరులు ఈ చర్యను ఖండించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని గోవర్ధనగిరి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న వైఎస్సార్సీపీ శిలాఫలకాన్ని శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వీటి ప్రారంభోత్సవ సమయంలో ఈ శిలాఫలకాలను ఏర్పాటు చేశారు.ఈ ఘటనతో గ్రామంలో అలజడి రేగింది. టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ధ్వజమెత్తారు. దీనిపై గోవర్థనగిరి వైఎస్సార్సీపీ సచివాలయ కన్వీనర్ మునిశేఖర్ పిచ్చాటూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్ల సచివాలయం–1 పరిధిలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి నవరత్న పథకాలు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. 26 రోజులుగా సాగుతున్న దాడులు, దాష్టీకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక పాలనలో ఉన్నామా అని సందేహం కలుగుతోందని గ్రామ సర్పంచ్ బండి చిట్టి, ఉప సర్పంచ్ నక్కా పండు ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై మానవ హక్కుల కమిషన్ తక్షణమే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిలాఫలకంపై పేర్లు తొలగింపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాళెంలో 2023లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, పంచాయతీ భవనం రీ మోడలింగ్ తదితర పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షలతో చేపట్టింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లను ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు.ఆదివారం గ్రామంలోని టీడీపీ నాయకులు ఈ శిలాఫలకంలో అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు వారికి నచ్చని పేర్లను పచ్చ పెయింట్‌తో తుడి చేశారు. శిలాఫలకం దిమ్మెలకు కూడా పచ్చ పెయింటింగ్ వేశారు. పంచాయతీ భవనం గోడపై సీబీఎన్ అని రాశారు. గతంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేరు మాత్రం తొలగించలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
-
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్ విగ్రహానికి..
సాక్షి, బాపట్ల: ఏపీలో టీడీపీ దమనకాండకు, అరాచకాలకు తెరపడటం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. పలు చోట్ల గత ప్రభుతానికి సంబంధించిన శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడితున్నారు. -
శిలాఫలకాల ధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు శిలాఫలకాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆదివారం రాత్రి, సోమవారం ధ్వంసం చేశారు. వాహనాల దహనం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ⇒ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో రూ.27 లక్షలతో నిరి్మంచిన పీఏసీఎస్ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. త్రిసభ్య కమిటీ పేరుపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా చైర్మన్‌గా వ్యవహరించిన గంధం వెంకటరత్నం (షావుకారు) పేరు సైతం తొలగించారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు–నేడు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై ఎంఈవో సూచన మేరకు ప్రధానోపాధ్యాయురాలు గంటా రజనీప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మండపేట–ద్వారపూడి రహదారి పనులకు సంబంధించి స్థానిక తాపేశ్వరం రోడ్డులోని లాకులకు వెళ్లే దారిలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫొటోను పూర్తిగా తొలగించారు. ఘటనాస్థలాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ తదితరులు పరిశీలించారు. శిలాఫలకాల ధ్వంసం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వెంటనే స్పందించి, ఇటువంటి ఘటనలను నిలువరించకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ⇒ ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లేదారిలో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలు తెలిపే శిలాఫలకాన్ని తొలగించారు. ఇటువంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని వైఎస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ⇒ పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెం గ్రామంలో బత్తుల రాంబాబు ద్విచక్రవాహనాన్ని దహనం చేశారు. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రాంబాబు ద్విచక్రవాహనాన్ని ఇంటి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో పార్కింగ్ చేశారు. అర్ధరాత్రి దాటాక మంటలు రావటాన్ని గమనించిన స్థానికులు మంటల్ని ఆరి్పవేశారు. అప్పటికే ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. రాంబాబు భార్య స్వాతి గ్రామంలో వలంటీరుగా పనిచేసింది. టీడీపీ నాయకులు విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. అదే సమయంలో ద్విచక్రవాహనం దహనమైంది. ఘటనాస్థలాన్ని ఎస్.ఐ. పి.హజరత్తయ్య పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ⇒ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని మర్లపాడు గ్రామ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు టీడీపీ కండువా వేశారు. టీడీపీ నాయకుల ఆగడాలు తారస్థాయికి చేరాయని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి టీడీపీ కండువా కప్పి అవమానించారని వైఎస్సార్సీపీ మర్లపాడు గ్రామ అధ్యక్షుడు సింగమనేని బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
ఆగని టీడీపీ అరాచకం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల అరాచకాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడమేగాక ప్రగతిపనుల శిలాఫలకాలను ముక్కలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శివాపురంతండాలో ఆదివారం రాత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన విగ్రహాన్ని మాయం చేశారు. దీన్ని గమనించిన స్థానికులు సోమవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడినవారి ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నట్లు నకరికల్లు ఎస్ఐ కె.నాగేందర్రావు చెప్పారు.గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. నాదెండ్ల మండలం సాతులూరులో వడ్డెరపాలెం వెళ్లే మెయిన్ సెంటర్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలు ఆదివారం ధ్వంసం చేశారు. ఇది గమనించిన వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నాడు–నేడు కింద గత ప్రభుత్వంలో నిర్మించిన పాఠశాల ప్రహరీలను ఆదివారం టీడీపీ నాయకులు జేసీబీ యంత్రాలతో కూల్చేశారు. నాడు–నేడు కింద కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గత ప్రభుత్వం తీర్చిదిద్దింది.గ్రామ నడిబొడ్డున ఉన్న పాఠశాలకు ప్రత్యేకంగా రూ.20 లక్షలతో ప్రహారీ నిర్మించింది. ఈ గోడను కొందరు టీడీపీ నాయకులు ఇళ్లకు అడ్డంగా నిర్మించారని ఇప్పుడు కూల్చేశారు. టీడీపీ నాయకుల ఇళ్ల ముందు విశాలంగా స్థలం కావాలని రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీని కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మండలంలోని మల్లానూరు గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. గుత్తార్లపల్లి వద్ద నిర్మించిన వన్నెకుల క్షత్రియ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సైతం కూల్చేశారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ జంగాలపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త పచ్చికాల శీనయ్య రేకుల షెడ్‌ను, ప్రహరీని స్థానిక టీడీపీ కార్యకర్తలు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. శీనయ్య రూ.5 లక్షలతో తన స్థలంలో షెడ్ వేసుకుని చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. ప్రహరీని, షెడ్‌ను ధ్వంసం చేస్తామని టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తుండటంతో శీనయ్య రెండురోజుల కిందట వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు సోమవారం తెల్లవారుజామున జేసీబీతో ప్రహరీని, రేకుల షెడ్‌ను ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అంకమరావు తెలిపారు.తూర్పు గోదావరి జిల్లాలో నియోజకవర్గ కేంద్రమైన గోపాలపురం నుంచి దొండపూడి గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి మాజీ హోం మంత్రి తానేటి వనిత ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. దీనిపై సోమవారం ఉదయం ఆ శిలాఫలకం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్ ఆర్మీ సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం నాలుగురోడ్ల కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు.తాము గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇటువంటి దాడులు, శిలాఫలకాల ధ్వంసాలు చేయలేదని వారు చెప్పారు. టీడీపీ, జనసేన నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు.అంగన్వాడీ స్థలం కబ్జాపెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించిన ఘటన పెద్దపంజాణి మండలంలోని బెరబల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పెద్దపంజాణి పంచాయతీ బెరబల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అక్రమంగా తమ ఆధీనంలో ఉంచుకున్న సుమారు 10 సెంట్ల ప్రభుత్వ భూమిని దాదాపు రెండేళ్ల క్రితం గ్రామస్తుల వినతి మేరకు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలాన్ని అంగన్వాడీ కేంద్రానికి కేటాయిస్తూ ఆక్రమణలకు గురికాకుండా ప్రహరీ ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ భూమిని తిరిగి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. జేసీబీతో ప్రహరీని తొలగించారు. -
జీ7సమ్మిట్‌కు ముందు.. ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం
రోమ్: జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటలీలో ఖలిస్తానీ తీవ్రవాదులు బుధవారం(జూన్12) ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా మరణించిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన నినాదాలను అక్కడ రాసి వెళ్లారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. ఇటలీ విదేశీవ్యవహారాల శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వత్రా తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే విగ్రహ శిథిలాలను ఇటలీ ప్రభుత్వం అక్కడినుంచి తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించింది.ప్రధాని మోదీ జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్న తరుణంలో ఈ దుశ్చర్యకు తీవ్రవాదులు ఒడిగట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇటలీలోని ఎపులియాలో జూన్ 13 నుంచి 15దాకా జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. జీ7లో భారత్ సభ్య దేశం కానప్పటికీ మోదీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్నారు. -
విగ్రహాలపై అక్కసు
సాక్షి నెట్వర్క్ : ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల విధ్వంసకర ప్రవర్తన కొనసాగుతోంది. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.రెండేళ్ల కిందట అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని అప్పటి ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం తలభాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సూచన మేరకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు కనగాల హరిబాబు పార్టీ మండల పార్టీ నాయకులతో కలిసి సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, ఆంజనేయస్వామి దేవస్థానంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దుండగుల ఆచూకీ తెలుసుకోవాలని కోరారు.మండలంలోని కపిలేశ్వరపురం, వీరంకిలాకు, పమిడిముక్కల, ఐనపూరు గ్రామాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని, దాడులను అరికట్టాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్ పార్టీ నాయకులతో కలిసి స్టేషన్లో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీ సభ్యుడు గుర్విందపల్లి వంశీ, కోఆప్షన్ సభ్యుడు దియానత్అలీ, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కోట మణిరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు అక్కినేని సతీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. శిలాఫలకాలపై గునపాలతో దాడికాకినాడ జిల్లా కరప మండలం కూరాడ గ్రామ సచివాలయంపై ఉన్న దివంగత నేత వైఎస్సార్, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చిత్రాలను సోమవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గునపాలతో పగులకొట్టి తొలగించారు. గత ఏడాది ఈ సచివాలయం నిర్మించి, ఇరువైపులా వైఎస్సార్, జగన్, కన్నబాబు ముఖ చిత్రాలను సిమెంట్‌తో చెక్కించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలుపొందారు.ఈ నేపథ్యంలో కూరాడలో జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ సచివాలయంపై ఉన్న వైఎస్సార్సీపీ నాయకుల చిత్రాలను, గ్రామంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను కూడా తొలగించారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో అభివృద్ధి శిలాఫలకాలను సోమవారం టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. 20 రోజుల కిందట కురిసిన వర్షాలకు గతంలో టీడీపీ నేతలు అభివృద్ధి పనుల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం కింద పడిపోయింది. అయితే ఇది వైఎస్సార్సీపీ వర్గీయుల పని అని టీడీపీ నేతలు అనుమానించారు. ఈ నేపథ్యంలో వారు సోమవారం గ్రామ సచివాలయం వద్ద ఉన్న శిలాఫలకం, రహదారి పక్కనున్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు.వీటిపై పంచాయతీ కార్యదర్శి విశ్వనాథరెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను సోమవారం టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబునాయుడు, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే స్వామి ఉన్న ఫ్లెక్సీలను రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై అంటించి కవ్వింపు చర్యలకు దిగారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీని చింతలపట్టెడలో నూతనంగా నిర్మించిన సెంగుంధ మొదలియార్ కమ్యూనిటీ హాలు వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు.సోమవారం ఉదయం మండపం వద్ద శిలాఫలకం ధ్వంసం కావడాన్ని గమనించిన మున్సిపల్ చైర్మన్ పి.జి.నీలమేఘం, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.ఆర్.వి.అయ్యప్పన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సీఐ సురేష్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు నగరిలో లేదని తెలిపారు. దీన్ని కట్టడి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కురువల్లిలో సోమవారం టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. గ్రామ సచివాలయం, అంగన్వాడీ భవనాల వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ జయరామ్‌రెడ్డి తెలిపారు. -
ఎస్కేయూలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) ఉన్నతాధికారులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అవమానకర రీతిలో తొలగించారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు లక్షలాది విద్యార్థులకు ఉచిత విద్యనందించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని విశ్వవిద్యాలయంలో ప్రతిష్టించాలని గతంలో విద్యార్థులు, అధ్యాపకులు కోరారు. దీనికి గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి, వర్సిటీ క్యాంపస్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు వర్సిటీ నయా పైసా ఖర్చు చేయలేదు. ఎనిమిది మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఇచ్చిన నిధులతో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే.. తాజాగా టీడీపీ అధికారంలోకి రావడంతో ఎస్కేయూలోని వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించాలని టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.హుస్సేన్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్యలను గురువారం డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రంలోపు విగ్రహాన్ని తొలగించాలని, లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో హడలిపోయిన వీసీ, రిజిస్ట్రార్ గురువారం సాయంత్రమే హడావుడిగా పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు. పాలక మండలి సభ్యుల్లో సింహభాగం వైఎస్సార్ విగ్రహం తొలగించడానికి సమ్మతించలేదు. అయినప్పటికీ వర్సిటీ ఉన్నతాధికారులు ఏకపక్షంగా శుక్రవారం ఉదయమే విగ్రహాన్ని తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ వెంటనే పొక్లెయిన్‌తో విగ్రహాన్ని తొలగించారు. విగ్రహం తీసుకెళ్లాలని దాని ఏర్పాటుకు ఆర్థిక సాయం చేసిన అసోసియేట్ ప్రొఫెసర్లను కోరారు. వారు సమ్మతించలేదు. దీంతో విగ్రహాన్ని తమ తోటలో భద్రంగా పెట్టుకుంటామని ఓ వైఎస్సార్సీపీ నాయకుడు చెప్పడంతో ఆక్కడికి తరలించారు. టీడీపీ బెదిరింపులకు భయపడి, వర్సిటీ ఉన్నతాధికారులు విగ్రహాన్ని తొలగించడం పలు విమర్శలకు తావిచ్చింది.టీడీపీ నేతల వైఖరి అప్రజాస్వామికంఎస్కేయూలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడం అప్రజాస్వామికం. గతంలో విగ్రహాల తొలగింపు సంస్కృతి లేదు. విద్యా వ్యవస్థ బలోపేతానికి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఎందరో పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు వైఎస్సార్ కృషి చేశారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఎస్కేయూలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు టీడీపీ నేతల ఒత్తిడితో విగ్రహాన్ని తొలగించడం గర్హనీయం. అనంతపురం జేఎన్టీయూలో ఎన్టీఆర్ ఆడిటోరియం నిర్మించి, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినా వైఎస్సార్సీపీ పాలనలో ఏనాడూ ఆ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయలేదు. ఇందుకు భిన్నంగా టీడీపీ నేతలు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడం దారుణం. ప్రజలకు మేలు చేసేందుకు ఎన్నికల్లో గెలిపిస్తే, టీడీపీ నేతలు కక్ష సాధింపులకు, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు. ఎస్కేయూలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేయాలి. ఇందుకోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం.– మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రారామిరెడ్డి -
AP: వైఎస్సార్ విగ్రహాల విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు విధ్వంస కాండను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై దాడులకు పాల్పడటంతో పాటు పనిగట్టుకుని వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ట్రాక్టర్లతో కూల్చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గురువారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. పొగ రావడాన్ని గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలార్పారు.అంతకు ముందు విగ్రహానికి తాళ్లు కట్టి ట్రాక్టర్‌తో లాగి కూల్చేయడానికి విఫలయత్నం చేశారు. విగ్రహం ముందు వైపు ట్రాక్టర్ స్లిప్ అయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అనంతరం మడ్డి ఇంజన్ ఆయిల్ తీసుకొచ్చి విగ్రహం మీద పోసి నిప్పు పెట్టారు. ఆ మేరకు విగ్రహం పక్కనే మడ్డి ఆయిల్ డబ్బాలు కూడా ఉన్నాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం పెదగోగులపల్లెలో శుక్రవారం సాయంత్రం టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి.వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సమీపంలో ఉన్న బోర్డును నేలమట్టం చేశారు. సమీపంలోని ఆర్వో ప్లాంటులోకి చొరబడి పైపులను విరిచేశారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం చీకటీగలపాలెం అడ్డరోడ్డులో కూడా ఇదే రీతిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు. ⇒ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట, పుత్తూరు–చిత్తూరు జాతీయ రహదారిలోని దీపిక కల్యాణ మండపం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఎన్నికల్లో ఈ వాహనాన్ని ఉపయోగించారు. పోలింగ్ అనంతరం ఆ వాహనాన్ని దీపిక కల్యాణ మండపం వద్ద పార్కింగ్ చేశారు. దుండగులు వాహనానికి నిప్పంటించిన తర్వాత కల్యాణ మండపంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. వీవీ.పురం, కొత్తపల్లి మహభారతం, వినాయకస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసి శిలాఫలకాల్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మండలాధ్యక్షడు మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ⇒ కూటమి శ్రేణులు విజయవాడలో వైఎస్సార్ విగ్రహం మెడలో టీడీపీ కండువా, చేతిలో ఆ పార్టీ జెండా పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డులో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బీజేపీ కార్యాలయం దాటి శివాలయం సెంటర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఓ యువకుడు పొక్లెయిన్‌పైకి ఎక్కి మహానేత వైఎస్సార్ విగ్రహం మెడలో పచ్చ కండువా వేశాడు. చేతిలో టీడీపీ జెండా పెట్టాడు. భవానీపురం పోలీసులు వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. ర్యాలీ ముందుకు కదిలిన తర్వాత పోలీసులు టీడీపీ కండువా, జెండాను తొలగించారు.⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని కుప్పంబాదూరు గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని ప్రధాన రహదారి సమీపంలో ఎన్నో ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 10 గంటల వరకు విగ్రహం అక్కడే ఉందని, ఉదయం లేచి చూసేసరికి విగ్రహం లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.⇒ టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో హల్ చల్ చేశారు. పట్టణంలోని పలుచోట్ల శిలాఫలకాలు ధ్వంసం చేయడంతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, మొండితోక అరుణ్ కుమార్ల బోర్డులను తొలగించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. -
సలాం బాబా సాహెబ్
‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్’ ప్రాంగణం అడుగడుగునా అద్భుతమైన ఆవిష్కరణలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడు అంబేడ్కర్ స్ఫూర్తి అంబరమంత ఎత్తున నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహా శిల్పం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. 18.81 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 206 అడుగుల ఎత్తయిన సామాజిక న్యాయ మహా శిల్పంతో పాటు ప్రతి నిర్మాణం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. రూ.404.35 కోట్లతో చేపట్టిన నిర్మాణంలో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు సందర్శకులకు గొప్ప అనుభూతిని పంచుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితమిచి్చన ఈ సామాజిక మహా శిల్పం, అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రపంచంలోనే అతి పెద్దవిగా రికార్డు సొంతం చేసుకున్నాయి. నాలుగేళ్లకు పైగా పట్టే ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏడాదిన్నరలోనే పూర్తి చేసినట్టు ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్(డీజెడ్‌ఎం) మహ్మద్ అబ్దుల్ రహీమ్ సాక్షికి తెలిపారు. తుపాను... భూ కంపాలు తట్టుకునేలా ‘మహా స్థూపం’ 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహా స్థూపం (కోర్ వాల్) తుపాను గాలులు, భూ కంపాల తీవ్రతను తట్టుకునేలా డిజైన్ చేశారు. భూ కంపాలతో పాటు 250 కిలోమీటర్ల వేగంతో వీచే తుపాను గాలుల తీవ్రతను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. వంద అడుగుల లోతు పునాదితో పాటు 81 అడుగుల పీఠం, దానిపై 510 మెట్రిక్ టన్నుల బరువు, 125 అడుగుల ఎత్తుతో, విగ్రహాన్ని ఠీవిగా నిలబెట్టారు. కాలచక్ర మహా మండపం నీటి కొలను మధ్యలో కాలచక్ర మహా మండపం డిజైన్‌తో 81 అడుగుల ఎత్తు, 3,481 చదరపు అడుగుల వెడల్పుతో పీఠం నిరి్మంచారు. బౌద్ధం, మయన్, ఈజిప్ట్ నాగరికతలను సమ్మిళితం చేసి 50 డిగ్రీల వంపుతో ఇది ఉంటుంది. పింక్ శాండ్ స్టోన్ (ఇసుక రాయి)తో తాపడం చేయించారు. కలర్ స్టోన్ నిర్మాణం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదు. పీఠం లోపల జి+2 అంతస్తులను ఐసాసిలెస్, ట్రెపీజియం ఆకారంలో నిరి్మంచారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం పాదాల వద్దకు వెళ్లేందుకు రెండు లిఫ్ట్‌లున్నాయి. అంబేడ్కర్ చైత్య అంబేడ్కర్ చైత్య (బౌద్ధంలో చైత్య అంటే పవిత్ర క్షేత్రం) పేరుతో గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆ మహనీయుని జననం నుంచి మరణం వరకు అన్ని ప్రధాన ఘట్టాలు ఇందులో డిజిటల్ టెక్నాలజీతో ఆవిష్కరించారు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఏదైనా ప్రశ్న అడిగితే అంబేడ్కర్ బదులిచి్చనట్టు అనుభూతిని కలిగించేలా వీడియో సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు.‘విహార’ థియేటర్ గ్రౌండ్ ఫ్లోర్లో 75 మంది కూర్చొని సినిమా చూసేలా విహార థియేటర్‌ను నిరి్మంచారు. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలుసుకునేందుకు, విజ్ఞానం, భౌగోళిక, సంస్కృతి, చరిత్ర వంటి అనేక అంశాలకు సంబంధించిన సినిమాలు ప్రదర్శించనున్నారు. సినిమా టైమింగ్స్, టికెట్ ధర నిర్ణయించాల్సి ఉంది. దక్షిణ భారత్‌తో అంబేడ్కర్ అనుబంధం దక్షిణ భారత్‌తో అంబేడ్కర్ అనుబంధానికి సంబంధించిన ఘట్టాలతో మొదటి అంతస్తును తీర్చిదిద్దారు. దక్షిణ భారత దేశంలో అంబేడ్కర్ తిరిగిన ప్రదేశాలు, సభలు, సమావేశాలకు సంబంధించిన ఘట్టాలకు అద్దం పట్టేలా మ్యూజియం ఏర్పాటు చేశారు. ఒక భాగంలో ఉన్న స్టడీ రూమ్‌లో ఆయన కూర్చున్న మైనపు బొమ్మను పెట్టారు. మరొక భాగంలో 50 మంది విద్యార్థులు కూర్చొని అంబేడ్కర్ జీవిత చరిత్రపై స్టడీ చేసేందుకు ఇంటరాక్షన్ క్లాస్ రూమ్, మరో భాగంలో లైబ్రరీ ఉన్నాయి. మరెన్నో ప్రత్యేకతలు ఈ ప్రాంగణంలో ధ్యాన మందిరం, కుడ్య చిత్రాలు, అతి పెద్ద మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్, చి్రల్డన్ ప్లే ఏరియా, యువత కోసం మల్టీ ప్లే విభాగాలు, అవుట్డోర్ జిమ్, రెండు క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్(ఎరీనా), అతి పెద్ద ఫుడ్ కోర్ట్‌లను తీర్చిదిద్దారు. భూమిపై రెండు నెమలి (పికాక్) ఆకారంలో తీర్చిదిద్దిన పచ్చదనం, ఆగ్రాలోని మొఘల్ గార్డెన్ తరహాలో తీర్చిదిద్దిన పూలవనం, సాహిత్య, కళారూపాల ప్రదర్శనకు యాంఫీ థియేటర్, కిలో మీటరున్నర మేర కాలిబాట.సందర్శన వేళలు: ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు. ఎంట్రీ ఫీజు: రూ.5 యిర్రింకి ఉమా మహేశ్వరరావు, సాక్షి, అమరావతి -
'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం'.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో బన్నీ మేనరిజం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు మన ఐకాన్ స్టార్. దుబాయ్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.. నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో ఈ రోజే విడుదలైంది. ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. ముఖ్యంగా నా అభిమానుల (ఆర్మీ) అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరూ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నా.' అని పోస్ట్ చేశారు. It’s a very spl day today 🖤 . My 1st movie #Gangotri was released today in 2003 & today I am launching my Wax statue at #madametussauds dubai . It’s been an unforgettable journey of 21 years . I am grateful to each and every one of you in this journey & special thanks to my Fans… pic.twitter.com/kWRQemlwgi — Allu Arjun (@alluarjun) March 28, 2024 -
ఐకాన్ స్టార్ అరుదైన ఘనత.. ఆ రోజే ముహుర్తం ఫిక్స్!
పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌తో బిజీ ఉన్నారు. అయితే బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన అల్లు అర్జున్ కొలతలను గతేడాది అక్టోబర్‌లోనే సేకరించారు. దీంతో తమ అభిమాన హీరో విగ్రహం ప్రారంభోత్సవం కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అభిమానుల నిరీక్షణకు తెరదించారు. బన్నీ మైనపు విగ్రహం ప్రారంభోత్సవానికి తేదీని నిర్ణయించారు. మార్చి 28న అల్లు అర్జున్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నారు. మార్చి 28న రాత్రి 8 గంటలకు ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ విషయాన్ని దుబాయ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో బన్నీ విగ్రహం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. View this post on Instagram A post shared by Madame Tussauds Dubai (@tussaudsdubai) -
పార్కింగ్ స్థలంలో 1800 ఏళ్ల నాటి పురాతన విగ్రహం!
కొన్ని పురాతన వస్తువులు చాలా విచిత్రంగా బయటపడతాయి. పురావస్తు శాస్త్రవేత్తలకు చిక్కని కొన్ని మిస్టీరియస వస్తువులు సాధారన కూలీలకు లేదా భవన నిర్మాణ కార్మికులకు కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పాపం వారు అదేదో సాధారణ వస్తువుగా పరిగణిస్తారు. అదికారులకు చెంతకు చేరే వరకు అదేంటన్నది తెలియదు. అలాంటి విచిత్ర ఘటన యూకేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఇంగ్లండ్‌లోని లింకన్ షైర్ కౌంటీలో ఉన్న 16వ శతాబ్దపు పురాతన భవనం బర్గ్లీ హౌస్ పార్కింగ్ స్థలంలో నిర్మాణ పనులు చేస్తుండగా పాలారాతి శిల్పం కనిపించింది. అదేదో రాయిగా భావించానని గ్రెగ్ క్రాలే అనే కార్మికుడు చెబుతున్నాడు. దాన్ని ఒక బకెట్లో పెడుతుండగా తిరగబడటంతో అది విగ్రహం తల అని అర్థమయ్యింది. దాన్ని అధికారుల వద్దకు తీసుకెళ్లి చూపగా అది పురాతన రోమన్ విగ్రహమని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని అన్నాడు క్రాలే. చాలా ప్రత్యేకమైనది, పురాతనమైనదని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు క్రాలే. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ విగ్రహం మెండెం భాగం కూడా లభించింది. ఆ తర్వాత తలను, మెండెంను దగ్గరకు చేర్చి అసలు రూపంలోకి మార్చారు నిపుణులు. ఇది మొదటి లేదా రెండో శతాబ్దానికి చెందిన పురాతన విగ్రహ అవశేషాలుగా చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్ధే ప్రక్రియలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇలాంటి పురాతన ప్రతిమలను ఇటలీలో గ్రాండ్ టూర్ అని పిలిచే కులీనులే తయారు చేస్తారని, ఆ ప్రతిమ చెక్కిన తీరులో అది కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు దీన్ని 9వ ఎర్ల్ తన గ్రాండ్ టూర్ ఆఫ్ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఈ శిల్పాన్ని బర్గ్లీకి తీసుకువచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: వందేళ్ల క్రితం కరెంట్ లేకుండా పనిచేసిన ఫ్రిడ్జ్) -
విగ్రహంపైనా టీడీపీ విష రాజకీయం
సాక్షి ప్రతినిధి, కడప: కాదేదీ దుష్ప్రచారానికి అనర్హం అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిష్ట దెబ్బతీసేలా వారి వైఖరి ఉంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ జిల్లా పులివెందుల కేంద్రంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సైతం రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. పులివెందుల మోడల్ టౌన్లో భాగంగా వివిధ సర్కిల్స్‌లో జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు పాడా (పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జాతిపిత మహాత్మాగాం«దీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను తెలంగాణ నుంచి తీసుకువచ్చారు. ఇవి శుక్రవారం సాయంత్రానికి పులివెందుల చేరుకున్నాయి. పాత బస్టాండు సమీపంలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుకు పిల్లర్ సిద్ధం చేశారు. అక్కడే విగ్రహాలు క్రేన్ సహాయంతో లారీ నుంచి దించారు. వైఎస్సార్ విగ్రహాన్ని పిల్లర్‌పైన పెట్టారు. అలాగే జాతిపిత విగ్రహం ఆవిష్కరణకు కోర్టు సర్కిల్ వద్ద ఏర్పాట్లు చేశారు. గరండల్ బ్రిడ్జి సమీపంలో సుందరీకరణతోపాటు అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచారు. ఇంకా పిల్లర్, సుందరీకరణ పూర్తికాకపోవడంతో కాంట్రాక్టర్ నిరంజన్‌రెడ్డి ఇంట్లో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని భద్రపర్చారు. అంతలోనే క్రేన్ నుంచి కిందికి దించిన విగ్రహాన్ని ఫొటో తీసి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో అంబేడ్కర్ విగ్రహాన్ని వైఎస్సార్ విగ్రహం కింద ఉంచారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు మోడల్ టౌన్లో భాగంగా సుందరీకరణ పనులు, జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు పాడా కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు పనులు కొనసాగుతున్నాయి. అంతలోనే రాజకీయ స్వలాభం కోసం సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రతిష్టను దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పిల్లర్ లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని ప్రశి్నస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనం నుంచి దించి ఉన్న విగ్రహాన్ని ఫొటో తీసి ప్రచారం చేయడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు. అంబేడ్కర్‌ను కించపరిచే విధంగా అవాస్తవాలు ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత సుందరంగా అంబేడ్కర్ విగ్రహం పులివెందుల మోడల్ టౌన్లో భాగంగా సుందరంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పులివెందులలో మాటా్లడుతూ స్థానిక గరండాల్ బ్రిడ్జి దగ్గర విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్, పార్టీ పట్టణ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి స్థానిక ఎస్సీ, బీసీ నాయకులతో కలిసి స్థల పరిశీలించారని తెలిపారు. అందులో భాగంగా శిల్ప కళాకారుడితో ప్రత్యేకంగా కళాత్మకంగా రూపొందించిన అంబేడ్కర్ విగ్రహం కూడా పులివెందులకు చేరుకుందన్నారు. టీడీపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. -
TS: గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథార్టీ(HMDA) ఆమోదించింది. ఈ క్రమంలోనే అవసరమైన స్థలాన్ని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ ఏర్పాటు కావల్సిన స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి రావటంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించటం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
భక్తరామదాసు విగ్రహం ఇదిగో!
నేలకొండపల్లి శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆలయ నిర్మాత రామదాసు ఎలా ఉండేవారు, ఆయన ఆహార్యం ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఉహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు రూపొందించారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కంచర్ల గోపన్న నివాసంలో కొనసాగుతున్న ధ్యాన మందిరంలోని కాంస్య విగ్రహం, ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉన్న మరో విగ్రహాన్ని కళాకారులు తమ ఊహల మేరకు రూపొందించారు. ఈ క్రమంలో తాజాగా నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఆవరణలోని రావిచెట్టు వద్ద ఉన్న ఓ విగ్రహాన్ని గుర్తించారు. దీంతో ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, కోకన్వినర్ కట్టా శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం అది రామదాసు విగ్రహామేనని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద వెలుగుచూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై బి.సతీశ్ చేతుల మీదుగా రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావుకు అప్పగించగా ధ్యానమందిరంలో ఏర్పాటు చేశారు. రామదాసు జయంతి ఉత్సవాల నాటికి ఈ విగ్రహం ప్రతిష్టాపనపై భద్రాచలం దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించాలని వారసులు కోరారు. విగ్రహం ఎలా ఉందంటే.. కాసెపోసి కట్టిన ధోవతి, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా.. అంజలి ముద్రతో మొన కిందికి పెట్టిన కత్తి, మీసాలు, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖతో విగ్రహం కనిపిస్తోంది. కుడి, ఎడమ భుజాలపై శంకుచక్రాలు ఉండడంతో వైష్ణవ భక్తునిగా తెలుస్తోంది. కాగా, ఈ విగ్రహం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్న, మాదన్నలది కాదని, వారి మేనల్లుడుభక్త రామదాసుదేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టేషన్‌కు ఎలా చేరింది? నేలకొండపల్లిలో పాత సెంటర్‌గా పేరున్న రావిచెట్టు బజార్లో చాలా ఏళ్ల క్రితం పోలీస్‌స్టేషన్ ఉండేది. 1997లో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌కు పాత స్టేషన్ నుంచి ఫరి్నచర్, తాజాగా బయటపడిన విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో విగ్రహాన్ని స్టేషన్ ఆవరణలోని రావి చెట్టు తొర్రలో భద్రపర్చగా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఆ విగ్రహం పాత పోలీసుస్టేషన్‌కు ఎలా చేరింది? ఎవరు తీసుకొచ్చారనే అంశంపై ఎక్కడా రికార్డులు లేవని చెపుతున్నారు. -
బొమ్మ కోసం ఆర్డర్.. భారీ విగ్రహం డెలివరీ!
తల్లితండ్రులు తమ పిల్లలపై చూపే ప్రేమకు హద్దులంటూ ఉండవు. పిల్లల కోర్కెలు తీర్చేందుకు, వారి ఆశలు నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుమారునిపై తండ్రికి ఉన్న ప్రేమకు పరాకాష్ఠగా నిలిచింది ఈ ఉదాహరణ. నాలుగేళ్ల కుమారుడు అడిగిన బొమ్మను ఎలాగైనా తెచ్చివ్వాలని తండ్రి భావించాడు. ఈ బొమ్మ కోసం కొడుకు పట్టిన మంకుపట్టు ఆ తండ్రికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకపోగా, అదొక ఛాలెంజ్‌గా అనిపించింది. కుమారుడు కోరిన బొమ్మ అత్యంత భారీగా ఉండటంతో దానిని ఇంటికి తెచ్చేందుకు తండ్రి క్రేన్‌ను కూడా బుక్ చేయాల్సివచ్చింది. ‘మిర్రర్’ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటిష్ ద్వీపం గుర్న్కు చెందిన ఆండ్రీ బిస్సన్ను అతని నాలుగేళ్ల కుమారుడు థియో.. తనకు డైనోసార్ బొమ్మకావాలని కోరాడు. ఆ పిల్లాడు ఆడుకునేందుకు అనువైన బొమ్మను అడిగినప్పటికీ అతని చెంతకు అత్యంత భారీ విగ్రహం చేరింది. కుమారుడు కోరిన విధంగా ఆండ్రీ బిస్సన్ ఆన్లైన్లో డైనోసార్ బొమ్మను ఆర్డర్ చేశాడు. అయితే అతను ఆర్డర్ చేసింది ఒక బొమ్మ కాదని బాగా ఎత్తుగా ఉన్న విగ్రహం అని అతనికి లేటుగా తెలిసింది. ఆండ్రీ బిస్సన్ ఈ విగ్రహాన్ని వెయ్యి యూరోలు అంటే మన కరెన్సీలో రూ. ఒక లక్షా 5 వేల మొత్తానికి కొనుగోలు చేశాడు. ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు క్రేన్ అవసరమయ్యింది. ఆన్లైన్లో అమ్యూజ్మెంట్ పార్క్ క్లియరెన్స్ సేల్‌లో ఆండ్రీ ఈ విగ్రహాన్ని కనుగోలు చేశాడు. ఈ ఉదంతం గురించి ఆండ్రీ బిస్సన్ మీడియాతో మాట్లాడుతూ ఈ బొమ్మ ఇది 3 మీటర్ల ఎత్తు, 1.5 మీటర్ల వెడల్పు ఉంటుందని తాను అనుకున్నానని, అయితే, ఆ బొమ్మ ఐదు మీటర్ల ఎత్తు ఉండటంతో ఆశ్చర్యపోయానన్నారు. డెలివరీ కంపెనీ ఆండ్రీ బిస్సన్కు ఫోన్ చేసి, లారీలో విగ్రహం సరిపోదని, అది రెండు టన్నులు ఉండడంతో జేసీబీలో తీసుకొస్తున్నామని తెలిపారు. ఆ డైనోసార్ విగ్రహం చాలా బరువు ఉన్నందున అది ఆండ్రీ బిస్సన్ ఇంటికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. -
డ్రోన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సీఎం జగన్ ఫొటో
-
పెత్తందారీ పోకడలూ అంటరానితనమే
ఎన్నటికీ మరణం లేని మహనీయుడు అంబేడ్కర్‌ను తలుచుకుంటూ తరతరాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. అభివృద్ధి– అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేడ్కర్ భావజాలం. మనం అదే భావజాలంతో పని చేస్తుంటే రాష్ట్రంలో పెత్తందార్ల పార్టీలకు, పెత్తందార్ల నాయకులకు నచ్చట్లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా అగ్రవర్ణ పేదలకు మంచి చేయాలనే సామాజిక న్యాయ విప్లవం తెచ్చానని చెప్పేందుకు గర్విస్తున్నా – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: ‘అంటరానితనంపైతిరుగుబాటు, విప్లవం, స్వాతంత్య్ర పోరాటాలకు ఉమ్మడి రూపమే మన బాబా సాహెబ్ అంబేడ్కర్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అలాంటి పరిస్థితులు వేర్వేరు రూపాల్లో ఇవాల్టికీ ఉన్నాయని, పెత్తందారీ పోకడలతో అంటరానితనం, వివక్ష రూపం మార్చుకుని సంచరిస్తున్నాయని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో దేశానికే తలమానికంగా నిర్మించిన రాజ్యాంగ రూపశిల్పి, భారత రత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 206 అడుగుల ఎత్తైన ‘సామాజిక న్యాయ మహాశిల్పం’ విగ్రహాన్ని సీఎం జగన్ శుక్రవారం రాత్రి జాతికి అంకితం చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణతో మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యాలవాడగా కనిపిస్తోందన్నారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక సమతా సంకల్ప సభ’లో మాట్లాడుతూ కుల అహంకార వ్యవస్థల దుర్మార్గాలపై తన పోరాటానికి అంబేడ్కరే స్ఫూర్తి అని తెలిపారు. చరిత్ర గతిని మార్చిన సంఘ సంస్కర్త అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి మనం విన్నాం. ఇక మీదట స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహాశిల్పం) అంటే ఇండియాలోని విజయవాడ అని మార్మోగుతుంది. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి ఈ విగ్రహం నిలువెత్తు నిదర్శనం. అంబేడ్కర్ జన్మించిన 133 ఏళ్ల తర్వాత, ఆయన మరణించిన 68 ఏళ్ల తర్వాత సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది వేల సంవత్సరాల భారత సామాజిక, ఆర్థిక, మహిళా చరిత్రలను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం. బాబా సాహెబ్ మన భావాల్లో జీవించే ఉంటారు. మన అడుగుల్లో, బతుకుల్లో, భావాల్లో ఎప్పటికీ కనిపిస్తుంటారు. పెత్తందారీతనం, అంటరానితనం, కుల అహంకార వ్యవస్థలు, అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి అందిస్తూనే ఉంటారు ఆ మహా మనిషి. 75వ గణతంత్ర దినోత్సవానికి ముందు.. విజయవాడలో.. అది కూడా స్వాతంత్య్ర సమర చరిత్ర కలిగిన మన స్వరాజ్య మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకి సరిగ్గా వారం ముందు మనం ఆవిష్కరిస్తున్న అంబేడ్కర్ మహా విగ్రహం స్ఫూర్తిదాయకం. అది చూసినప్పుడల్లా పేదలు, మహిళలు, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, సమానత్వ ఉద్యమాలు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. పుణె ఒప్పందం.. అండనిచ్చే మహాశక్తి ఆయన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అంటరానితనం, ఆధిపత్య భావజాలంపై ఓ తిరుగుబాటుగా మనకు కనిపిస్తుంటారు. సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా మనందరికీ గుర్తుకొస్తారు. రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే మహా శక్తిగా మనందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తారు. గొంతు విప్పలేని దళిత వర్గాలు, అల్ప సంఖ్యాకులు, వాయిస్ లెస్ పీపుల్, అట్టడుగు వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్లు కల్పించాలని చరిత్ర గతిని మార్చిన పుణె ఒప్పందానికి కారకులు అంబేడ్కర్. ఈ రోజు దళిత జాతి నిలబడిందన్నా, అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతున్నారన్నా, రిజర్వేషన్లు కల్పించి ఒక్క తాటిపైకి తెచ్చే కార్యక్రమం జరిగిందంటే అంబేడ్కరే స్ఫూర్తి. ప్రతివాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, శక్తిని, అండను ఇస్తుంది. మహాశక్తిగా తోడుగా నిలబడుతుంది. ఆకాశమంతటి వ్యక్తిత్వం రూపం మార్చుకున్న అంటరానితనంపై 56 నెలలుగా మనం చేస్తున్న యుద్ధానికి నిదర్శనం సామాజిక న్యాయం. మనం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా అంబేడ్కర్ విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంది. ఇది దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నా. 81 అడుగుల వేదిక మీద 125 అడుగుల మహా విగ్రహం.. మొత్తం 206 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన ఆకాశమంతటి ఆ మహానుభావుడి వ్యక్తిత్వాన్ని అంతా గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడూ, ప్రతి పాపా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధి – అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేడ్కర్ భావజాలం. ఇలాంటి భావజాలం పెత్తందార్లకు నచ్చదు. పెత్తందార్లంటే ఎవరో మీ అందరికీ ఈ పాటికి బాగా అర్థమై ఉంటుంది. ఆయన చదివింది ఇంగ్లీషు మీడియంలో.. ఈరోజు కూడా ఈ దురహంకారులు, ఈ పెత్తందార్లు తమ పత్రికలో రాశారు. అంబేడ్కర్ తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అని అన్నారట. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారట. వీళ్లు అబద్ధాలు ఏ స్థాయిలో చెబుతున్నారో చూస్తుంటే బాధేస్తోంది. అంబేడ్కర్ చదువుకున్నది ఇంగ్లీషు మీడియంలో. ఆయన 4వ తరగతి పాసైనప్పుడు బంధుమిత్రులంతా పండగ చేసుకున్నారు. ఈనాడు చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ రాతలు రాస్తోందంటే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ పెత్తందార్ల పత్రిక, ఆ ఈనాడు పత్రిక ముసుగులో తాము పాటించే అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేస్తోంది. ఇలాంటి దుర్మార్గులు, నీచులు మన దళితులు, బహుజనులకు వ్యతిరేకులు. అంటరానితనం.. మరో రూపంలోస్వాతంత్య్రం వర్థిన 77 ఏళ్ల తర్వాత కూడా అంటరానితనం, వివక్ష సమసిపోలేదు. పెత్తందార్ల పోకడలతో రూపం మార్చుకుంది. అంటరానితనం అంటే.. ఫలానా వ్యక్తుల్ని భౌతికంగా ముట్టుకోకూడదని దూరం పెట్టడం మాత్రమే కాదు. పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ గవర్నమెంట్ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటిస్తూ పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీషు మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మనుషులు చనిపోతున్నాకరుణించని పాలకులు.. పేద కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగానే ఉండిపోవాలట. తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట. తమ అవసరాలు తీర్చేవారిగానే మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో, ఎక్కడ వారికి ఉచితంగా వైద్యం అందుతుందో, అటువంటి ప్రభుత్వ ఆస్పత్రులను నీరుగార్చడం కూడా అంటరానితనమే. పేదలు బస్సు ఎక్కే ఆర్టీసీని కూడా ప్రైవేట్‌కు అమ్మేయాలనుకోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా, పేదవాడికి ఏ పథకం కావాలన్నా లంచాలు ఇచ్చుకుంటూ, వివక్షకు లోనవుతూ, కార్యాలయాలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగిన దుస్థితి కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అవ్వాతాతలు పెన్షన్ కోసం, రైతన్నలు ఎరువుల కోసం పొద్దున్నే లేచి పొడవాటి లైన్లలో నిలబడాల్సి రావడం, మనుషులు చనిపోతున్నా పాలకుల గుండె కరగకపోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల మీద పెత్తందారీ భావజాలంలో ఇవన్నీ కూడా భాగాలే. ఎస్సీల అసైన్డ్ భూముల్ని కాజేసి గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలని కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని కోర్టులకు వెళ్లి కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద వర్గాల పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వటానికి వీల్లేదని కుట్ర కథనాలు రాయడం, వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పెత్తందార్లకు ఏనాడైనా తోచిందా? దళితుల ఇళ్ల నిర్మాణాలకు చంద్రబాబు సెంటు భూమి అయినా ఇచ్చింది లేదు. అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించింది అంతకంటే లేదు. చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఏ కోశానా, ఏనాడూ ప్రేమే లేదు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాల్లో ఆ సామాజిక వర్గాలు ఎలా బతకగలుగుతాయనే కనీస ఆలోచన చేయలేదు. బీసీలను తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు. పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఆ వ్యక్తికి మన మాదిరిగా పేద అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేయాలని ఎందుకు అనిపిస్తుంది? చదువుకొనే మన పేద పిల్లలకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యా కానుక, ట్యాబ్‌లు, ఇంగ్లీషు మీడియం చదువులు, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, గవర్నమెంట్ బడుల్లో డిజిటలైజేషన్, ఐఎఫ్‌పీలు, నాడు–నేడుతో చదువులు మార్చాలని అలాంటి òపెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? మన అక్కచెల్లెమ్మలకు ఒక దిశా యాప్, అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చి చిరునవ్వులు చూడాలని పెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? మన రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఆర్బీకే వ్యవస్థను తేవాలని వారికి ఎందుకు అనిపిస్తుంది? పేదలకు ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల ఉచిత వైద్యం, ఆరోగ్య ఆసరా, 104, 108 సేవలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, వైద్య ఆరోగ్యశాఖలో 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ఆ పెత్తందారు చంద్రబాబుకు ఎందుకు అనిపిస్తుంది? గ్రామ స్థాయిలో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు తెచ్చి ప్రతి పేదవాడికీ అందుబాటులో ఉండాలని పెత్తందారు పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది? నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే దక్కేలా ఏకంగా చట్టం చేయాలని పెత్తందార్లకు ఎందుకు అనిపిస్తుంది? విప్లవాత్మక వ్యవస్థలు పెత్తందారీ పార్టీలు, పెత్తందారీ నాయకులకు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల కోసం నవరత్నాల పాలన అందించాలని ఏ రోజైనా అనిపించిందా? కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వాతాత వరకు అందరి పట్ల ప్రేమ, మమకారం చూపాలని పెత్తందారీ పార్టీ నాయకులకు ఏరోజైనా అనిపించిందా? మీ బిడ్డ 56 నెలల పాలనలో నేరుగా బటన్ నొక్కి రూ.2.47 లక్షల కోట్లు పారదర్శకంగా అందించాడు. లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి. ఇవాళ గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తున్నారు. 2 వేల జనాభాకు సచివాలయం. 50 ఇళ్లకు వలంటీర్ ఉన్నారు. ప్రతి పేదవాడు, రైతన్న, అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఇదీ అంబేడ్కర్ కలలుగన్న రాజ్యం అని ఆ చెల్లెమ్మలు, తమ్ముళ్లు దేశానికే చూపిస్తున్నారు. ఈ స్థాయిలో మరెక్కడైనా ఉందా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు మేలు చేయడంలో దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 56 నెలల పాలనలో అడుగులు పడ్డాయి. మంత్రి మండలిలో ఏకంగా 4 ఉప ముఖ్యమంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. మంత్రి మండలిలో 68 శాతం పదవులూ వారికే ఇచ్చాం. ఇది సామాజికపరంగా దేశ చరిత్రలో రికార్డు. శాసనసభ స్పీకర్‌గా బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా మైనార్టీ అక్కకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డదే. రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారే. మన పార్టీకి మండలిలో 43 మంది సభ్యులుంటే వారిలో 29 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 13 జెడ్పీ చైర్మన్లలో 9 పదవులు, 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 12 మేయర్లు, 87 మున్సిపాలిటీలుంటే 84 మీ బిడ్డ గెలుచుకోగా వాటిలో ఏకంగా 58 మున్సిపాలిటీల్లో, 196 మార్కెట్ కమిటీల్లో 117 చైర్మన్లు, 137 కార్పొరేషన్లలో 79 చైర్మన్లు ఇలా అన్నింటా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకే అవకాశం కల్పించాం. మన ప్రభుత్వం అధికారంలోకి వర్థిన తర్వాత 56 నెలల కాలంలో 2.10 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా? ప్యూన్ రాకపోతే మంచినీళ్లూ పుట్టవు! చదువుకునేందుకు వీల్లేదని తరతరాలుగా అణచివేతకు గురైన వర్గంలో జన్మించినా, చదువుకొనేందుకు తమకు మాత్రమే హక్కుందని భావించిన వారికంటే గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేడ్కర్. ఆయన చదువుకుంటున్న రోజుల్లో దళితుడు కాబట్టి స్కూల్లో కుండలో నుంచి గ్లాసు ముంచుకొని నీళ్లు తాగేందుకు కూడా అనుమతించలేదు. ఆయన తెచ్చుకున్న గ్లాసులో ప్యూన్ పైనుంచి నీళ్లు పోసేవాడట. ఏ రోజైనా బడికి ప్యూన్ రాకపోతే ఆ రోజు తాగడానికి మంచినీళ్లు లేనట్లే అన్న మాటలు ఎంతో బాధ కలిగిస్తాయి. ప్రతి గ్రామంలో మార్పు మీ కష్టం తెలిసిన మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలోనూ మార్పు తీసుకొచ్చింది. రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకోండి. ప్రతి గ్రామంలోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఇంటింటా చదువుల విప్లవం, మహిళా సాధికార విప్లవం, పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో ఎప్పుడూ చూడని అభివృద్ధి కనిపిస్తుంది. వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నడూ ఊహించని రీతిలో గ్రామ స్థాయిలో సాకారమైన మరో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి. -
అంబేడ్కర్ స్మృతివనానికి మొత్తం ఖర్చు రూ.404.35 కోట్లు
-
విజయవాడ నగరం నడిబొడ్డున భారీ విగ్రహం ఏర్పాటు
-
అంబేడ్కర్ విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు
-
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: విజయవాడ ప్రతిష్ట ఆకాశమంత ఎత్తుకు..
మనం ఎవరిమైనా అమెరికాకు వెళ్లినప్పుడో, ప్రత్యేకంగా న్యూయార్క్ నగరానికి వెళ్లినప్పుడో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడాలని అనుకుంటాం. మనం ఆ నగరానికి వెళ్లామన్న సంగతి తెలిసిన స్నేహితులు కూడా లిబర్టి విగ్రహాన్ని చూసి వచ్చావా అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అమెరికానే వెళ్లనవసరం లేదు. ఆ స్థాయి విగ్రహాన్ని చూడాలంటే విజయవాడ నగరాన్ని సందర్శిస్తే చాలు. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం అంతకన్నా గొప్పగా కనిపిస్తుంంది. కృష్ణానది ఆవల నుంచి సుమారు పది, పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహం దర్శనమిస్తుంది. దేశ రాజ్యాంగ నిర్మాతగా వాసికెక్కిన డాక్టర్ BR అంబేడ్కర్ భారీ విగ్రహం అది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. విజయవాడ నగరానికి ఒక శాశ్వత చిరునామాగా, ఒక ప్రఖ్యాత టూరిస్టు కేంద్రంగా రూపుదిద్దుకునే అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలవబోతుంది. ఇది వినడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది! మూడేళ్ల క్రితం వరకు విజయవాడలో ఇంత పెద్ద టూరిస్ట్ స్పాట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని ఒక నేత సమర్ధతకు నిదర్శనంగా ఇది రూపొందింది. ఆయన ఎవరో కాదు.. ఏపీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అని వేరే చెప్పనవసరం లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా మూడు అంతస్థులలో అంబేడ్కర్‌కు చెందిన వివిధ చిత్రపటాలు, డాక్యుమెంటరీలు, ఆయన గురించి తెలియచేసే సినిమాను వేయడానికి వీలుగా ఒక హాలు, ఎన్నో విశేషాలు అందులో కనిపిస్తాయి. 206 అడుగుల ఎత్తున తయారైన ఈ విగ్రహ ప్రాంగణం అంతా రంగు, రంగుల కాంతుల మధ్య అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. అక్కడే పలు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. నగర ప్రజలకే కాకుండా, విజయవాడ సందర్శించే టూరిస్టులకు కూడా అదొక విజ్ఞాన, వినోద కేంద్రంగా భాసిల్లబోతోంది. దేశ ప్రజలకు స్వేచ్చను, ప్రత్యేకించి బలహీనవర్గాలకు ఎంతో స్పూర్తిని ఇచ్చే ఈ విగ్రహ ప్రతిష్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటికీ, దానిని మించిన రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఢిల్లీలో విగ్రహం తయారీతో పాటు హంగులను స్థానికంగా హనుమాన్ జంక్షన్‌కు చెందిన శిల్పిద్వారా చేయించడం కూడా హర్షించదగిన అంశమే. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నారు. అందులో వివిధ బలహీనవర్గాల ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెబుతున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలియజేసినట్లయింది. కేవలం విగ్రహంతోనే అభివృద్ది అయిపోతుందని కాదు. కాని ఆ విగ్రహాన్ని చూస్తే వచ్చే చైతన్యం, అనుభూతి చెప్పనలవికానిది. ఏదో కొద్ది మంది అగ్రవర్ణ దురహంకారులకు తప్ప, సమానత్వం కోరుకునే ఎవరికైనా ఈ విగ్రహం చూడగానే ఒక అనుభూతి కలుగుతుంది. ఏపీలోని వివిద జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ విగ్రహాన్ని వీక్షించనున్నారు. గతంలో అమరావతి రాజధాని పేరుతో ఒక భ్రమరావతిని సృష్టించాలని భావించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడో మారుమూల, ఎవరికి కనిపించని చోట అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని చూశారు. ఇందు కోసం కొన్ని కోట్ల రూపాయల వ్యయం చేశారు. అయినా ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. చంద్రబాబు హయాంలో చాలామంది అంబేడ్కర్ అభిమానులు ఎవరికి కనిపించని చోట విగ్రహం పెట్టడమేమిటని విమర్శించేవారు. అయినా అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదు. చిత్తశుద్దితో చేసి ఉంటే అక్కడ విగ్రహం తయారై ఉండేదేమో! మొక్కుబడి కార్యక్రమంగా సాగించారన్న భావన ఉంది. తదుపరి వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట కన్నా, విజయవాడ నడిబొడ్డున ప్రతిష్టించడం ద్వారా రాష్ట్ర ప్రజలనే కాక, దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకర్షించవచ్చని భావించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరుగాంచిన అంబేడ్కర్ విగ్రహంతో పాటు విజయవాడ నగరవాసులకు ఆహ్లాదంగా ఉండేలా అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తలపెట్టారు. మూడేళ్ల నుంచి అందుకు సన్నాహాలు సాగించారు. నిజానికి ఆరు నెలల క్రితమే ఈ పనులు పూర్తి చేయాలని అనుకున్నారు కాని, సాధ్యపడలేదు. అయినా పనుల వేగం పెంచి జనవరి 19న ప్రారంభోత్సవానికి రంగం సిద్దం చేశారు. ఇది జగన్ సమర్ద నాయకత్వ లక్షణానికి దర్పణం పడుతుంది. 'చెప్పాడంటే చేస్తాడంతే!' అన్న నమ్మకానికి అనువుగా ఈ విగ్రహం ఏర్పాటు పూర్తి అయింది. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఏర్పాటు అవుతోంది. ఇప్పటికే విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద, కనకదుర్గమ్మ గుడి వద్ద భారీ వంతెనలను పూర్తి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణలంక ప్రాంతంలో నివసించే వేలాది మంది బీద ప్రజలకు పెద్ద ఊరట కల్పిస్తూ.. నది అంచున రిటైనింగ్ వాల్ నిర్మించింది. కిలోమీటర్ల కొద్ది నిర్మించిన ఈ వాల్ కూడా విజయవాడ అభివృద్ధికి మారుపేరుగా కనిపిస్తుంది. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయలేని విశిష్టమైన పనులను చేపట్టి, పూర్తి చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మన్ననలు పొందగలుగుతున్నారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అందరికి ఆహ్వానం పలుకుతూ జగన్ ఇచ్చిన సందేశం కూడా హృద్యంగా ఉంది. ఆకాశమంతటి వ్యక్తిత్వంతో దేశగతిన మార్చిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని ఆయన ప్రశంసించారు. పెత్తందార్ల భావాలపై తిరుగుబాటుకు స్పూర్తి ఇచ్చేలా అంబరాన్ని తాకేలా ఈ సమాజిక న్యాయ మహాశిల్పం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్) ఏర్పాటు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు తన చేతితో ఒక దిశను చూపుతున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం నిజంగానే విజయవాడ ప్రతిష్టను అకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంత బ్రహ్మాండంగా విగ్రహ ప్రారంభోత్సవం జరుగుతుంటే నిత్యం ఏడ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా యధా ప్రకారం పెత్తందారి, అగ్రవర్ణ దురహంకార మనస్తత్వంతో చెత్త కథనాలను ప్రచురించింది. నీచత్వానికి పరాకాష్టగా రామోజీ, రాధాకృష్ణలు వ్యవహరిస్తూ తమ మీడియాను దిగజార్చుతూ ఈ రోజు కూడా ఛండాలపు స్టోరీలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమ విద్వేషాన్ని వెళ్లగక్కారు. సుమారు నాలుగు వందల కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
విజయవాడకు బయలుదేరిన ప్రజలు..!
-
ఆకాశమంత అంబేద్కర్..!
-
ఈ యుగం బాబాసాహెబ్‌దే!
ఇవ్వాళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇందులో కొందరు అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించేవారూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బాబాసాహెబ్ ఏం చెప్పారో దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీయ చూస్తున్నవారూ ఉండటం! విభిన్న భౌగోళిక ప్రాంతాలూ, అనేక జాతులూ, మతాలూ, కులాలూ, భాషలూ ఉన్న భారతదేశం సమాఖ్య లౌకిక రాజ్యంగా విలసిల్లాలని అంబేడ్కర్ ఆశించారు. ఆ మేర రాజ్యాంగంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కానీ నేడు కొందరు పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా అడుగులు వేస్తుండడం విషాదకరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, సిద్ధాంత అన్వ యం గురించి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి, కుల నిర్మూలనా సిద్ధాంత ప్రతిపాదన గురించి చర్చ జరుగుతోంది. ఆయన తన జీవిత కాలంలో విస్తృతంగా రచనలు చేశారు. ఆయన మేధో సంపన్నత ఆయన గవేషణ పద్ధతిలోనే ఉంది. ముఖ్యంగా వేదాలను పరిశీలించిన పద్ధతి వినూత్నమైనది, విప్లవాత్మకమైనది. ఎందుకంటే అంతకుముందు వేదాల గురించి పరిశోధించిన మాక్స్ ముల్లర్, సురేంద్ర దాస్ గుప్తా, సర్వేపల్లి రాధాకష్ణన్ వంటివారు ఎవరూ కూడా వేదాలు అశాస్త్రీయమైన భావాలతో రూపొందాయని చెప్ప లేకపోయారు. ముఖ్యంగా శంకరాచార్యులు, రామా నుజాచార్యులు, మధ్వాచార్యులు తమ తమ కోణాల్లో వేద సమర్థుకులుగా భాష్యం రాసు కున్నారు. అంబేడ్కర్ ఒక్కరే వేదాలను, భగవద్గీ తను హింసాత్మక గ్రంథాలుగా పేర్కొన్న సాహస వంతుడు. అలాగే ఆయన ‘శాక్రెడ్ ఆఫ్ ఈస్ట్’ పేరుతో వచ్చిన 50 వాల్యూమ్స్ చదివి రాసుకున్న నోట్స్ ఎంతో విలువైనది. దాన్ని ముద్రిస్తే ప్రపంచ మూల తత్త్వ శాస్త్రానికి ఎంతో విలువైన సమా చారం జోడించగల గ్రంథాలు అందుబాటులోకి వస్తాయి. ఆయన తాత్త్విక దర్శనాలు శాస్త్రీయమైన చర్చతో కూడి ఉంటాయి. మార్క్స్, ఎంగెల్స్‌లు రాసిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’, ఎంగెల్స్ రాసిన ‘డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్’, మోర్గాన్ రాసిన ‘ఏన్షియంట్ సొసైటీ’ వంటి వాటి స్థాయిలో... ఆయన తాత్విక, సామాజిక, రాజకీయ చర్చలు ఉంటాయి. వేదాల గురించి అంబేడ్కర్ ఇలా అన్నారు. ‘వేదాలు హిందువుల మతసాహిత్యంలో అత్యు న్నత స్థానాన్ని ఆక్రమించుకున్నాయని చెప్పడం వాటిని గురించి చాలా తక్కువ చెప్పినట్టే అవుతుంది. వేదాలు హిందువుల పవిత్ర సాహిత్యం అని చెప్పినా సరిపోనిదే అవుతుంది. ఎందుచేతనంటే అవి తప్పు పట్టడానికి వీలు లేనివి. వాటిని అపౌరు షేయాలని నమ్ముతారు కాబట్టి’. అంటే వేదాలు మానవ కల్పితాలు కావు అని అర్థం. మానవ కల్పితాలు కాకపోవడం వల్ల సాధారణంగా ప్రతి మానవుడు చేసే తప్పిదాలకు, దోషాలకు, పొరపాట్లకు అవి అతీతంగా ఉంటాయి. అందుచేతనే అవి అమోఘమైనవిగా భారతీయులు నమ్ముతున్నారు. అయితే అంబేడ్కర్ వేదాలను మానవ మాత్రులైన రుషులే రచించారని చెప్పారు. ఒకరిని ద్వేషించే, అపహాస్యం చేసే, హింసను ప్రోత్సహించే ఏ గ్రంథా లైనా అవి విశ్వజనీనమైనవి కావు అని అంబేడ్కర్ చెప్పారు. అంబేడ్కర్ ప్రతిభ బహుముఖీనం. ప్రధానంగా ఆయన తాత్వికులు. ముందు తన్ను తాను తెలుసుకున్నారు. తర్వాత తన చుట్టూ ఉన్న సమా జాన్ని కూడా తెలుసుకున్నారు. తనకూ సమాజానికీ ఉండే అంతఃసంబంధాలను అధ్యయనం చేశారు. సమాజానికి అంతః ప్రకృతి అయిన రాజ్యాన్నీ, దాని అంగమైన ప్రభుత్వాన్నీ, వాటి పునాదుల్నీ పరిశోధించారు. వాటికీ తనకూ ఉండే వైరుధ్యాలనూ బయటకు తీశారు. ఈ దృష్టితో చూసిన ప్పుడు భారతావనిలో బుద్ధుని తర్వాత అంత లోతైన నైతిక వ్యక్తిత్వం అంబేడ్కర్‌దే అవుతుంది. ఆయన సామాజిక జీవితానికి పునాది బుద్ధుని బోధనా తత్వంలోనే అంతర్లీనంగా ఉంది. ఆయన బోధనలో ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, ఆచరణ, దుఃఖ నివారణ, సంఘ నిర్మాణం, నైతికత, త్యాగం, ప్రధానమైనవి. ఆయన ఎంతో నిబద్ధంగా జీవించారు. రాత్రి పది గంటలకు ఆయన అన్నం తినేటప్పుడు పుస్తకాల జ్వలనంతో పాటు ఆకలి మంట కూడా రగులుతూనే ఉండేది. లండన్ వీధుల్లో అర్ధాకలితో తిరిగారు. ఆయన ధనాన్ని జ్ఞానానికి ఎక్కువ ఖర్చు చేశారు. ఆకలి తీర్చుకోవడానికి తక్కువ డబ్బు వాడేవారు. కాల్చిన రొట్టె ముక్క లను ఒక కప్పు టీలో ముంచి తిని అనంత అధ్యయనం చేసిన త్యాగశీలి ఆయన. ఈరోజు స్కాలర్‌షిప్‌తో చదు వుకుంటున్న కొందరు దళిత విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని విలాసాలకు వాడుతున్న వైనం చూస్తుంటే అంబేడ్కర్ నుంచి వీరు ఎంత నేర్చు కోవాలో అర్థమవుతుంది. అంబేడ్కర్ పరీక్షల కోసం చదవలేదు. విజ్ఞానం కోసం, అవగాహన కోసం సిద్ధాంత నిర్మాణం కోసం, సాక్ష్యాధారాల కోసం చదివారు. రాత్రంతా చదువుతూ కనిపించే అంబేడ్కర్‌తో రూవ్ుమేట్ ఎప్పుడైనా చదువు ఆపు అంటే...‘నా పరిస్థితులు, నా పేదరికం, నేను ఎంత త్వరగా విద్యార్జన పూర్తి చేస్తే అంత మంచిది. నా కాలాన్ని నేను ఎంత విద్యార్జనలో గడిపితే, ఎంత సద్వి నియోగం చేసుకుంటే అంత మంచిది’ అని చెప్పే వారు. ఆయన చదువు పట్ల చూపిన నిబద్ధతని ఈనాటి దళిత విద్యార్థి లోకం అనుసరించినట్లయితే మేధోసంపన్నత వీరి సొంతమై వీరు భారత దేశ పునర్నిర్మాణానికి ముందుకు వస్తారు. నీటి వినియోగం పైన అంబేడ్కర్ పెట్టిన శ్రద్ధ ఏ జాతీయ నాయకుడూ పెట్టలేదు. అంతగా పట్టించుకోలేదు. ఆయన ప్రణాళికలు నిర్దిష్టమై నవి. కార్మి కుల అభివృద్ధి కోసం, వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన పోరా డారు. గ్రామీణ శ్రామి కులను పారిశ్రామిక పనుల్లో ఉపయోగించుకుంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొలంబియా, హార్వార్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో అంబేడ్కర్ మీద జరిగి నంత పరిశోధన భారతదేశంలో జరగడం లేదు. అన్ని కేంద్రీయ, రాష్ట్రీయ, దేశీయ విశ్వ విద్యాలయాల్లోనూ అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు నిర్మించి... తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించటం ద్వారా ఆయన రచనల లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా అంశాలపై పరి శోధనలు జరిగేలా చూడాలి. ఆయన నడిపిన పత్రికలు, ఆయన నిర్మించిన సంస్థలు, పార్టీలు, ఆయన ప్రణాళికలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శ కాలు. ముఖ్యంగా భూమినీ, పరిశ్రమలనూ జాతీయం చేయాలనే ఆయన ఆలోచన... దళిత, బహుజన, మైనారిటీలు రాజకీయ అధికార సాధన మీద ఆధారపడి ఉంది. అంబేడ్కర్ ముందటి భారతదేశం వేరు. ఆయన తర్వాతి భారతదేశం వేరు. అందుకే అంబేడ్కర్ యుగ కర్త. ఈ యుగం ఆయనదే. ఆయన మార్గంలో నడుద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారమే భారత్‌లో సమాఖ్య ప్రభుత్వాలు పూర్తిగా నడవక పోయినా... రాజ్యాంగ మౌలిక సూత్రాలను మాత్రం గత ఆరు దశాబ్దాల్లో అవి అతిక్రమించ లేదనేది వాస్తవం. ఒక వేళ అటువంటి పరిస్థితులు తలెత్తినా న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు తన న్యాయ సమీక్షాధికారం ద్వారా రాజ్యాంగాన్ని రక్షిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకున్న బీజేపీ ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం’ అంటూ నియంతృత్వ భారతాన్ని నిర్మించడానికి వడి వడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత రాజ్యాంగం బోధిస్తున్న బహుళత్వం, పరస్పర సహకారం, రాష్ట్రాల హక్కులు, స్థానిక స్వయం పరిపాలన వంటి వాటిని తుంగలో తొక్కడానికే అఖండ ఏకైక భారత్ ప్రాపగాండా అనేది స్పష్టం. ఈ దేశంలోని వేల కులాలు, విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాల అస్తిత్వాలను కనుమరుగు చేసి మెజారిటీ మతాన్నీ, భాషనూ ఇతరులపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇంతకన్నా ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ‘రాష్ట్రాలు మిథ్య, కేంద్రమే నిజం’ అన్న రీతిలో కేంద్రంలోని అధికార పార్టీ విధానాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం చైతన్యరహితంగా తన పాత పద్ధతుల్లోనే వ్యవహ రిస్తూ అనేక రుగ్మతలతో కునారిల్లుతోంది. దేశ నవ నిర్మాణంపై స్పష్టమైన జాతీయ విధానాలు లేని మిగతా జాతీయ పార్టీలు నామమాత్రంగానే మను గడ సాగిస్తున్నాయి. మరో పక్క చాలా ప్రాంతీయ పార్టీలు అవినీతికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో ప్రభావ వంతమైన పాత్రను పోషించే స్థితిలో లేవు. ఈ పరిస్థితులను అనువుగా తీసుకుని బీజేపీ ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటూ, దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలని వ్యూహం పన్నుతోంది. నిజంగా ఈ వ్యూహం ఫలిస్తే రాజ్యాంగానికి భారీ సవరణలు చేపట్టి దాని మౌలిక స్వరూపాన్ని మార్చడం బీజేపీకి సులువవుతుంది. మెజారిటీ మతం దేశ ప్రజలందరి మతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మతానుయాయుల సంస్కృతే మొత్తం దేశ సంస్కృతిగా చలామణీ అవుతుంది. ఇప్పటికే మైనారిటీలు, నిమ్నవర్గాల ఆహార విహారాలపై ఛాందసవాదుల దాడులు, ఆంక్షలను చూస్తూనే ఉన్నాం. బీఫ్‌ను ఆహారంగా తీసుకున్న వారు మత విలువల్ని కించపరచిన వారుగా దాడులకు గురవుతున్నారు. ఎక్కువగా ఉత్తరాదికి పరిమితమైన మూక దాడుల సంస్కృతిని దక్షిణాదికీ, ఈశాన్య భారతానికీ ఛాందస వాదులు విస్తరింపచూస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ మైన భారత్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సైనిక, ప్రజా తిరుగుబాటులు జరుగలేదంటే అందుకు రాజ్యాంగం ఇచ్చిన లౌకిక ప్రజాస్వామ్య విలువలే ప్రధాన కారణం. అన్ని కులాలూ, జాతులూ, మతాలూ, భాషలూ, ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించడమనే మౌలిక సూత్రం రాజ్యాంగంలో ఉన్నది కాబట్టే తిరుగుబాట్లు తలెత్తలేదు. కానీ ఒకే దేశం, ఒకే జాతి లాంటి నినాదాలను ముందుకు తెచ్చి కేంద్రీకృత నియంతృత్వ విధానాలనూ, ఫాసిజాన్నీ దేశంలో అమలు చేయడానికి నేడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ తన నియంతృత్వ ధోరణిలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను రాత్రికి రాత్రే తీసుకుని ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశ నిర్మాణంలో భాగంగా డాక్టర్ అంబేడ్కర్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా వెనుక బడిన కారణంగా వారికి రాజ్యాంగంలో రిజర్వే షన్లు పొందుపరచి... విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారు. కానీ అంబేడ్కర్ నిర్దేశించిన రిజ ర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఆర్థికంగా వెనుకబాటు ఆధారంగా 10 శాతం అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లను ఎటువంటి కమిషన్ వేయ కుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల్లోనే పార్లమెంట్లో ఆమోదింపచేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సామా జిక న్యాయాన్ని పాటిస్తూ అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి ముఖ్యమ్రంతి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 135 కోట్ల జనా భాను పాలించే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనీసం అయిదు ప్రాంతాలకు అయిదు గురు ఉపప్రధానులను చేస్తే తప్పేమిటి? 1955 లోనే మొదటి ‘రాష్ట్రాల విభజన కమిషన్’కు భారత రాజ్యాంగ పిత అంబేడ్కర్ ఓ లేఖ రాస్తూ... ఉత్తరాదిన ఢిల్లీని మొదటి దేశ రాజధానిగానూ, దక్షిణాదిన ఉన్న హైద్రాబాద్‌ను దేశ రెండో రాజ ధానిగానూ చేయాలని ప్రతిపాదించారు. ఇంత వరకు కాంగ్రెస్ కాని, బీజేపీ కానీ ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పాలన, అధికార వికేంద్రీకరణ జరిగితేనే కదా అన్ని ప్రాంతాల ప్రజలకూ న్యాయం జరిగేది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... 135 కోట్ల జనాభాకు కేవలం 29 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అన్ని అంశాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న భారత్ రాష్ట్రాల సంఖ్య విషయంలో ఎందుకు తీసుకోదో అర్థం కాదు. 35 కోట్ల జనాభాకన్నా తక్కువే ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. స్వయం నిర్ణ యాధికారాలూ, సొంత సుప్రీంకోర్టు, సొంత రాజ్యాంగం, సొంత జెండా, ఎజెండా కలిగి ఉండే స్వేచ్ఛ అక్కడి రాష్ట్రాలకు ఉంది. అందుకే అక్కడ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయి. బాబా సాహెబ్ సూచించినట్లు భారత్‌లో 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చొప్పున ఏర్పాటు చేస్తే మేలు జరిగి ఉండేది. జాతీయ వాదం ముసుగులో దళిత, మైనార్టీలపై దాడులు చేస్తే... దేశ జనాభాలో 35 శాతం ఉన్న ఈ వర్గాలు ఎలా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతాయి? అందుకే బీజేపీ పాల కులు దుందుడుకు పోకడలకు పోకుండా అంబే డ్కర్ ఆశయాల సాధనకు పాటు పడితే దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. డా. గాలి వినోద్ కుమార్ వ్యాసకర్త ఫౌండర్ చైర్మన్, నవ భారత్ నిర్మాణ్ ఛారిటబుల్ ట్రస్టు (ఈ వ్యాసం Apr 14, 2023 రోజున sakshi.comలో ప్రచురితమైనది) -
ఉత్సవ విగ్రహమే ఇంత సమ్మోహనంగా ఉందంటే..
అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆలయ ట్రస్టు ఎంతగానో కృషి చేస్తోంది. సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండటంతో రామాలయానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రతిరోజూ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే అత్యంత ఆకర్షణీయమైన రామ్‌లల్లా విగ్రహానికి సంబంధించిన తొలి ఫొటో వెలుగులోకి వచ్చింది. పల్లకీలో కూర్చున్న రామ్‌లల్లా ఆలయ ప్రాంగణంలో ఊరేగారు. అయితే ఇది గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహం కాదు. ఇది ప్రతీకాత్మక విగ్రహం. గర్భగుడిలో ప్రతిష్టించే బాలరాముని విగ్రహాన్ని ఈనెల 18న(ఈరోజు) రామాలయ ప్రాంగణానికి తీసుకురానున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కర్నాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ నూతన రామాలయంలో ప్రతిష్ఠించే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. జనవరి 22న జరిగే పవిత్రోత్సవానికి ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆలయ ట్రస్టు తొలుత బాలరాముని విగ్రహాన్నే ఆలయ ప్రాంగణంలో ఊరేగించాలని భావించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి, శ్రీరాముని ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించి, భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలిగించారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇది కూడా చదవండి: 22న స్కూళ్లకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే.. -
సామాజిక న్యాయ మహాశిల్పం
-
ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: సీఎం వైఎస్ జగన్
-
Vijayawada Ambedkar Statue: విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు (ఫొటోలు)
-
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర
-
చరిత్రలో నిలిచిపోయే ఘట్టం... అందరూ ఆహ్వానితులే
-
ఎంపీ విజయసాయిరెడ్డి అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్‌ను విడుదల చేశారు
-
AP: అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ విడుదల
సాక్షి, తాడేపల్లి: డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. అందరూ ఆహ్వానితులే: విజయసాయిరెడ్డి అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపం అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని విజయసాయి అన్నాయి. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరిస్తున్నామని.. ఆయన విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదిలోంచి వ చ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది. ►ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం ► విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ► దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ–597 అడుగుల ఎత్తు)ది మొదటి స్థానం. దీన్ని గుజరాత్‌లోని నర్మదా డ్యామ్‌కు ఎదురుగా నిర్మించారు. 2018 అక్టోబర్ 31న జాతికి అంకితం చేశారు. ► రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ము చ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ–216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. శ్రీరామ నగరంలో పంచ లోహాలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ► మూడో స్థానం విజయవాడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ )ది. ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి తరలించి, విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు. పెడస్టల్ భాగం 85 అడుగులు కాగా, కాంస్య విగ్రహం 125 అడుగులు. ఇది అంబేడ్కర్ విగ్రహాల్లో మొదటి స్థానంలోను, అన్ని విగ్రహాల్లో మూడో స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు(ఫెడస్టల్ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు) ఉంది. -
అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు మోసం చేశారు: మంత్రి మేరుగ
సాక్షి, విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్.. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్ భావితరాల భవిషత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. ‘‘అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. గత పాలనలో అవమానాలు.. అవహేళనలు.. దాడులు.. చూశాం. సీఎం జగన్ వల్లే మేం రాజ్యాధికారం పొందగలిగాం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారు. చెప్పినట్లుగానే రూ. 425 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు’’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన: మంత్రి ఆదిమూలపు పేదరికం విద్యకు అడ్డు కాకూడదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు. బడుగు, బలహీన,అణగారిన,దళిత వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు. చిట్టచివరి వారికి సైతం సంక్షేమం అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. అవినీతి లేని పాలన.. పారదర్శకత.. జవాబుదారీ తనం మా ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలు. నేను ఉన్నాను...నేను విన్నానని పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ అండగా నిలిచారు’’ అని మంత్రి అన్నారు. ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే తెలుగు భాషను చంపేస్తున్నారని నానా యాగీ చేశారు. సీఎం జగన్ ధైర్యంగా పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారు. ఈ రోజు మావంటి వారు క్యాబినెట్లో ఉన్నారంటే సీఎం జగనే కారణమని మంత్రి అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర: మల్లాది విష్ణు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్ ఆలోచన అభినందనీయమని.. భారతదేశంలో ఏపీ అగ్రగామిగా నడవాలంటే అంబేద్కర్ ఆలోచనలతోనే సాధ్యమన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ప్రభుత్వం.. వైఎస్ జగన్ ప్రభుత్వమని విష్ణు అన్నారు. -
అయోధ్య: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు?
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రామ్‌లల్లా నేడు(బుధవారం) ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించనున్నారు. ముందుగా రామ్‌లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి కాంప్లెక్స్‌కు తీసుకువెళతారు. అనంతరం గర్భగుడిని శుద్ధి చేసి, గురువారం శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలోనికి తీసుకువస్తారు. రామాలయంలో ప్రతిష్ఠించేందుకు తొలుత మూడు బాలరాముని విగ్రహాలను రూపొందించగా, అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు ఎంపిక చేశారు. దీంతో మిగిలిన రెండు విగ్రహాలను ఏమిచేయనున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదలాడింది. దీనికి సమాధానాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించారు. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించేందుకు మూడు విగ్రహాలు తయారు చేయించామని, దానిలో ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేశామని, మిగిలిన రెండు విగ్రహాలను ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల్లో ఏర్పాటు చేస్తామని చంపత్ రాయ్ తెలిపారు. రామ మందిరం మొదటి అంతస్తు సిద్ధమైన వెంటనే రెండు రామ్‌లల్లా విగ్రహాలలో ఒకదానిని వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 2025 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత, మిగిలిన రెండవ విగ్రహాన్ని రెండవ లేదా చివరి అంతస్తులో ప్రతిష్ఠించనున్నామన్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామాలయం గర్భగుడిలో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన నల్లరాతి విగ్రహాన్ని ఆలయ ట్రస్ట్ ఎంపిక చేసింది. మిగిలిన రెండు విగ్రహాలలో ఒకటి కర్నాటకకు చెందిన గణేష్ భట్ నల్లరాతితో తీర్చిదిద్దారు. ఇంకొక విగ్రహాన్ని రాజస్థాన్‌కు చెందిన సత్య నారాయణ పాండే తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించారు. ఈ మూడు విగ్రహాలూ 51 అంగుళాల ఎత్తులో ఉన్నాయి. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
సామాజిక న్యాయ మహాశిల్పం ఇది
సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ మహాశిల్పం సామాన్యమైనది కాదని.. అదొక గొప్ప సామాజిక న్యాయ మహాశిల్పమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు ఈ మహాశిల్పం ఆవిష్కరణ జరగనుందని చెప్పారు. ఇక్కడ సమతా మహాసభ జరుగుతుందని, దీనికి దళిత సోదర, సోదరీమణులు, అంబేడ్కర్ ఆశయాలు నచ్చినవారు, పాటించేవారు కులాలు, మతాలకు అతీతంగా విచ్చేస్తారని చెప్పారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ప్రారంభానికి సిద్ధం అవుతున్న అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నేతలతో కలిసి మంగళవారం విజయసాయిరెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌కు బీఆర్ అంబేడ్కర్‌పై ఉన్న అభిమానంతోనే అతిపెద్ద విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు. అంబేడ్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా సీఎం జగన్ నవరత్నాలు రూపొందించారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ మహాశిల్పం ఏర్పాటు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. 81 అడుగుల వేదికపై 125 అడుగుల మహాశిల్పం ఏర్పాటుకు (మొత్తం 206 అడుగులు ఎత్తు) రూ.400 కోట్లకు పైగా వెచ్చించామన్నారు. తరతరాల వివక్షను రూపుమాపేందుకే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, దేశంలోని వ్యవస్థలన్నీ ఇంత సక్రమంగా పని చేస్తున్నాయంటే అంబేడ్కర్ మహనీయుడి పుణ్యమేనని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు చూడలేదన్నారు. అంబేడ్కర్ ఆశయాలను, లక్ష్యాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారని వివరించారు. అంబేడ్కర్ అందరివాడు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని.. విగ్రహావిష్కరణ సందర్భంగా సమతాసభ ఏర్పాటు చేశామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సభకు అన్ని ప్రాంతాల నుంచి అన్నివర్గాల ప్రజలు తరలిరానున్నారని చెప్పారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా? అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. అంబేడ్కర్ ప్రజల మనిషి అని, బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసిన వాడని, ఆయన అందరి వాడని సమాధానమిచ్చారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అనే భేదం లేకుండా అందరూ పాల్గొంటారని చెప్పారు. దార్శినికుడి విగ్రహావిష్కరణకు ప్రత్యేక ఆహా్వనం అవసరం లేదన్నారు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్ చేపట్టారని.. ఇందులో పార్టీ, ప్రభుత్వం అని తేడా చూపించకూడదన్నారు. 1.20 లక్షల మంది రాక రాష్ట్రం నలుమూలల నుంచి 1.20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు లేజర్ షో లేదా డ్రోన్ షో ఉంటుందని చెప్పారు. ప్రారంభ కార్యక్రమం తర్వాత ఈ నెల 20వ తేదీ నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుందన్నారు. భవిష్యత్‌లో గొప్ప పర్యాటక కేంద్రంగా అంబేడ్కర్ విగ్రహం ప్రాంతం నిలిచిపోతుందని చెప్పారు. లోపల ఆడిటోరియం, వెనుక కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం అన్నీ పర్యాటకుల్ని ఆకర్షిస్తాయని తెలిపారు. ఆయన వెంట ఎంపీ కేశినేని నాని, మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ఆసిఫ్, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాశ్, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఉన్నారు. -
పేదల పట్ల సీఎం జగన్‌కు ఎంతో మమకారం: విజయసాయిరెడ్డి
-
అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 19న విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ కేశినేని నాని, మంత్రి మేరుగ నాగార్జున, సీం టూర్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి ఆసిఫ్, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 400 కోట్లకు పైగా వ్యయం చేసి అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశాం. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తరతరాల వివక్షతను రూపుమాపేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. అంబేద్కర్ కృషి మరువలేనిది. అంటరానితనం నిర్మూలించాలని పోరాడిన యోధులు అంబేద్కర్. సమసమాజ నిర్మాణానికి అంబేద్కర్ న్యాయ మహాశిల్పం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. అంబేద్కర్ భారత గడ్డ పై పుట్టి ఉండకపోతే నేటికీ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెంది ఉండేవి కాదు. అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగానే నవరత్నాలను రూపొందించారు’’ విజయసాయి పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా సమతాసభ ఏర్పాటు చేశాం. సమతా సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తరలిరానున్నారు. లక్షా 20 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. 6 గంటలకు లేజర్ షో లేదా డ్రోన్ షో ఉంటుంది. 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. దార్శనికుడి విగ్రహావిష్కరణకు ప్రత్యేక ఆహ్వానం అవసరం లేదు. చరిత్రలో గొప్ప పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహం నిలిచిపోతుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
సామాజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’
‘‘అంబేడ్కర్ స్మతివనం చరిత్రాత్మకమైనది. ఇది సామాజిక న్యాయ స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తుంది. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప నిర్మాణం ఇది’’ – విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా, ఆంధ్రప్రదేశ్ నడిరోడ్డున ఉన్న విజయవాడ నగరంలో సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం ఆవిష్కృతమవుతోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహోన్నత రూపం ప్రజలకు దర్శనమివ్వబోతోంది. ► పెడస్టల్‌తో కలిపి 210 అడుగుల ఎత్తయిన నిర్మాణం ► 18.81 ఎకరాల్లో స్మృతివనం నిర్మాణం ► రూ.400 కోట్లతో చరిత్రలో నిలిచేలా... ► అంబేడ్కర్ ఫొటో గ్యాలరీ, జీవిత విశేషాల శిల్పాలు ► కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టులు యిర్రింకి ఉమమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి: బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదిలోంచి వ చ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహా శిల్పం)’గా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ స్మృతివనం ప్రజల సందర్శనకు సిద్ధమైంది. స్మృతివనాన్ని, అంబేడ్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించనుంది. అంబేడ్కర్ ఆలోచనలకు అద్దం పట్టే అద్భుత కళాఖండంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అంబేడ్కర్ విగ్రహ పీఠం కింది భాగంలో నిర్మించే భవనంలో అంబేడ్కర్‌కు సంబంధించిన ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాల శిల్పాలు, ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకాలతో కూడిన గ్రంధాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అవసరమైన జీవిత చిత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు. అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ధ్యాన కేంద్రం కూడా నిరి్మస్తున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, పచ్చటి తివాచీ పరిచినట్టు అందమైన గార్డెన్లు. మ్యూజిక్ ఫౌంటెయిన్, వాటర్ ఫౌంటెయిన్లు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా కింది భాగంలో గడ్డితో తీర్చిదిద్దిన నెమళ్ల ఆకృతులను సందర్శకులను కట్టిపడేసేలా తీర్చిదిద్దారు. స్మృతివనం భవనంలో గోడలపై స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చాక ఘట్టాలను అపురూప కళాఖండాలుగా ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నేతల ఫొటోలతో కూడిన కళాఖండాలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్మృతివనం చుట్టూ ప్రహరీ మొత్తం రాజస్థాన్ పింక్ కలర్ రాళ్లతో అద్భుతంగా నిర్మించారు. అక్కడక్కడా పాల రాతిని ఉపయోగించారు. ప్రహరీ చుట్టూ ఆకట్టుకునే ఆకృతుల్లో వాటర్ ఫౌంటేయిన్లు, ఎలివేషన్ డిజైన్లతో తీర్చిదిద్దారు. స్మృతివనం చుట్టూ దారి పొడవునా గ్రీనరీ ఉండేలా నిర్మాణాలు చేపట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం ► విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ► దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ–597 అడుగుల ఎత్తు)ది మొదటి స్థానం. దీన్ని గుజరాత్‌లోని నర్మదా డ్యామ్‌కు ఎదురుగా నిర్మించారు. 2018 అక్టోబర్ 31న జాతికి అంకితం చేశారు. ► రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ము చ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ–216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. శ్రీరామ నగరంలో పంచ లోహాలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ► మూడో స్థానం విజయవాడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ )ది. ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి తరలించి, విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు. పెడస్టల్ భాగం 85 అడుగులు కాగా, కాంస్య విగ్రహం 125 అడుగులు. ఇది అంబేడ్కర్ విగ్రహాల్లో మొదటి స్థానంలోను, అన్ని విగ్రహాల్లో మూడో స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు(ఫెడస్టల్ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు) ఉంది. ‘సామాజిక సమతా సంకల్పం’ అంబేడ్కర్ స్మృతివనం, విగ్రహం ప్రారం¿ోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తోంది. ‘సామాజిక సమతా సంకల్పం’ పేరుతో ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవాన్ని తెలియజేస్తూ గ్రామ, వార్డు సచివాయాల్లో ప్లెక్సీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు, సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికార సిబ్బంది భాగస్వాములయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 19న విజయవాడలో ప్రారం¿ోత్సవానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా స్మృతివనం దేశంలోనే మరెక్కడా లేని విధంగా విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. విగ్రహ నిర్మాణం వేగంగానే పూర్తయింది. స్మృతివనం కూడా పూర్తయ్యాకే ప్రారం¿ోత్సవం చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అన్ని పనులను అంతే వేగంగా పూర్తి చేశాం. సందర్శకులు ఒక్కసారి స్మృతివనానికి వస్తే అంబేడ్కర్ చరిత్ర పూర్తిగా అవగతమయ్యేలా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. గతంలో చంద్రబాబు అంబేడ్కర్ స్మృతివనాన్ని అమరావతి రాజధానిలో నిరి్మస్తానని ప్రకటించి దాన్ని గాలికి వదిలేసి దగా చేశాడు. – మేరుగు నాగార్జున, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రికార్డు సమయంలో స్మృతివనం పనులు పూర్తి అంబేడ్కర్ స్మృతివనం పనులు రికార్డు సమయంలో శరవేగంగా పూర్తయ్యాయి. సీఎం వైఎస్ జగన్ మహోన్నత సంకల్పంతో చేపట్టిన ఈ గొప్ప ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఎనలేని కృషి చేశారు. ఈ నెల 19న అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దేశంలోనే ఇది అద్బుత కళాఖండంగా నిలుస్తుంది. ఈ ప్రాంతం గొప్ప దర్శనీయ క్షేత్రంగా మారుతుంది. – శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇవీ ప్రత్యేకతలు ► బేస్ (పెడస్టల్) 85 అడుగులు (జి ప్లస్ టు అంతస్తులు) ► విగ్రహం తయారీకి ఉపయోగించిన స్టెయిన్లెస్ స్టీల్ 400 మెట్రిక్ టన్నులు ► 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని విగ్రహం కోసం ఉపయోగించారు ► 2,200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయి తాపడం ► కన్వెన్షన్ సెంటర్, యాంఫీ థియేటర్ ► మెడిటేషన్ సెంటర్ ► విశాలమైన కారిడార్లు (నడక దారులు) ► పచ్చని గార్డెన్, అందమైన మొక్కలు -
దేశానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహం: విక్టర్ ప్రసాద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశంలోనే అతి ఎత్తైన 125 అడుగుల డా. బీఆర్.అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు రూ.400 కోట్లతో స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని బడుగు, బలహీనవర్గాలవారు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విజయవాడకే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిఒక్కరూ కుల, మత, పార్టీలకతీతంగా స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ భావజాలంతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. అందరివాడైన అంబేద్కర్ స్మృతి వనాన్ని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా డా.బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, స్కై లైటింగ్, ఫౌంటెన్లు, లైబ్రరీ వంటి వాటితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. అటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, ప్రతి ఒక్కరూ పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పండగ వాతావరణంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వీటిలో రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. -
అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో ఇలా రాశారు.. ‘రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యం జరిగినదనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్‌లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుండి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లన్నింటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలో లభించిన శ్యామ శిల, రాజస్థాన్‌లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్లను ఎంపిక చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైనది. అలాగే కర్నాటకలోని శ్యామ శిల.. శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్ళు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్(37) ఎంబీఏ పూర్తిచేశారు. ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుణ్ యోగిరాజ్.. మహారాజా జయచామరాజేంద్ర వడయార్‌తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్‌నాథ్‌లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని రూపొందించారు. అలాగే మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-IV, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే! "ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು" ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q — Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024 -
అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఎంపిక
లక్నో: అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని ఎంపిక చేశారు. మూడు విగ్రహాల్లో 51 అంగుళాలు ఉన్న రాముని శ్యామవర్ణ(నీలిరంగు) విగ్రహాన్ని ఆలయ కమిటీ ఫైనల్ చేసింది. ఎంపిక చేసిన ఈ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్, కే.ఎల్ భట్లు తయారు చేశారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ జరిగింది. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో బాలరాముని శ్యామవర్ణ విగ్రహం ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది. ఈ విగ్రహాన్నే గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఓటింగ్‌లో బాలరాముని మూడు విగ్రహాలను సమర్పించారు. ఇందుకు 51 అంగుళాలు ఉన్న ఐదేళ్ల రాముని విగ్రహాలను శిల్పులు రూపొందించినట్లు ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. బాల రాముని దైవత్వం కళ్లకు కట్టినట్లు కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని ఆయన ఇప్పటికే చెప్పారు. ఏడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవం జనవరి 16న ప్రాయశ్చిత్త కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో బాలరాముని విగ్రహం ఊరేగింపు ఉంటుంది. ఆచార స్నానాలు, పూజలు, అగ్ని ఆచారాలు వరుసగా ఉంటాయి. జనవరి 22న, ఉదయం పూజ తరువాత మధ్యాహ్నం పవిత్రమైన మృగశిర నక్షత్రాన బాల రాముడు మందిరంలో కొలువు దీరనున్నాడు. ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్ -
ముగ్గురు రాముళ్లు... ఒకరికి ప్రాణ ప్రతిష్ట... ఎంపిక నేడు!
లక్నో: అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని నేడు ఎంపిక చేయనున్నారు. విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో నేడు ఓటింగ్ జరుగుతుంది. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేయనున్నారు. ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. నేడు జరగనున్న ఓటింగ్‌లో బాలరాముని మూడు విగ్రహాలను సమర్పిస్తారు. ఇందుకు 51 అంగుళాలు ఉన్న ఐదేళ్ల రాముని విగ్రహాలను శిల్పులు రూపొందించినట్లు ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. బాల రాముని దైవత్వం కళ్లకు కట్టినట్లు కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. జనవరి 22న జరగనున్న పట్టాభిషేక మహోత్సవానికి తేదీ సమీపిస్తున్న తరుణంలో రామజన్మభూమి మార్గం, ఆలయ సముదాయంలో జరుగుతున్న నిర్మాణ పనులను శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పరిశీలించారు. నిర్మాణం వేగంగా పూర్తి చేయడానికి కంటే కూడా నాణ్యతపైనే దృష్టి పెట్టామని మిశ్రా తెలిపారు. ఏడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవం జనవరి 16న ప్రాయశ్చిత్త కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో బాలరాముని విగ్రహం ఊరేగింపు ఉంటుంది. ఆచార స్నానాలు, పూజలు, అగ్ని ఆచారాలు వరుసగా ఉంటాయి. జనవరి 22న, ఉదయం పూజ తరువాత మధ్యాహ్నం పవిత్రమైన మృగశిర నక్షత్రాన బాల రాముడు మందిరంలో కొలువు దీరనున్నాడు. ఇదీ చదవండి: సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్ -
బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో షకీరా విగ్రహం ఆవిష్కరణ
గ్రామీ అవార్డు విజేత సింగర్ షకీరా బెల్లి డ్యాన్స్‌కు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు! తన బెల్లి డ్యాన్స్‌తో అభిమానుల ప్రేమను కొల్లగొట్టిన ఈ కొలంబీయన్ సింగర్ క్యాంసం విగ్రహన్ని ఆమె సొంత సిటీ బారన్క్విల్లాలో ఆవిష్కరించారు. బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో ఉన్న 6.5 మీటర్లు (21 అడుగుల) విగ్రహాన్ని బారన్క్విల్లా మేయర్ జైమ్ పుమారెజో, ఆమె తల్లిదండ్రుల సమక్షంలో నగరంలోని మాగ్డలీనా నది తీరంలో మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కాంస్య విగ్రహంలో షకీరా.. పొడవాటి రింగుల జుట్టుతో చేతులు పైకి ఎత్తి బెల్లి డ్యాన్స్ చేస్తున్న పోజ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ విగ్రహ రూప శిల్పి అయిన యినో మార్క్వెజ్ మాట్లాడుతూ..‘అమ్మాయిలు తమ జీవితంలో ఎటువంటి కలలు కంటారో. వాటిని ఎలా సాధిస్తారో షకీరా కాంస్య విగ్రహం ద్యారా తెలుస్తుంది’ అని తెలిపారు. స్థానిక పిల్లలకు సంబంధించి పలు పాటల కాన్సెర్టుల్లో షకీరాను చూశానని మేయర్ జైమ్ పుమారెజో తెలిపారు. షకీరా 2023లో మూడు లాటిన్ గ్రామీ అవార్డులు గెలుపొందారు. oh shakira, don't end the liberty statue like that pic.twitter.com/6w5a5HUaAw — alexander AG7 ERA (@grandesrockwell) December 26, 2023 మరోవైపు ఆమె ‘పైస్ డెస్కాల్జోస్’, ‘బేర్ ఫుట్’ అనే సంస్థల ద్వారా పిల్లల కోసం స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షకీరా మియామిలో ఉంటోంది. తన కాంస్య విగ్రహం ఆవిష్కరణపై మేయర్ కార్యాలయానికి ఆమె ఓ సందేశం పంపారు. ‘నా కాంస్యం విగ్రహం ఆవిష్కరించం పట్ల చాలా గొప్పగా భావిస్తున్న. ‘బారన్క్విల్లా’ సీటీ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సిటీ నాకు సొంత ఇల్లుతో సమానం’ అని షకీరా తెలిపారు. -
దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ జ్ఞాపకార్థంగా శిలవిగ్రహం
దివంగత ప్రఖ్యాత దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.బాలచందర్‌కు శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయనుందని తమిళనాడు హౌసింగు బోర్డు సొసైటీ అధ్యక్షుడు పూచి మురుగన్ వెల్లడించారు. దర్శకుడు కె.బాలచందర్ 9వ స్మారక దినోత్సవం కార్యక్రమం స్థానిక టి.నగర్‌లోని టక్కర్బాబా ఆవరణంలో శనివారం జరిగింది. (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) కె.బాలచందర్ అభిమాన సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైలాపూర్ శాసనసభ్యుడు వేలు, తమిళనాడు హౌసింగ్ బోర్డు సొసైటీ అధ్యక్షుడు పూచి మురుగన్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూచి మురుగన్ మాట్లాడుతూ దర్శకుడు కె.బాలచందర్ శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. రజనీకాంత్, కమలహాసన్, మమ్ముట్టి తదితర ప్రముఖ నటుల విజ్ఞప్తి లేఖల కారణంగా, కె.బాలచందర్ అభిమాన సంఘం కార్యదర్శి బాబు వినతిపత్రం ప్రభుత్వ పరిశీలన చివరి దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా కె.బాలచందర్ నివాసం ఉన్న వీధికి ఆయన పేరు పెట్టాలన్న కోరికను వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ప్రముఖ హాస్య నటుడు మృతి.. సడన్‌గా అలా జరగడంతోనే) -
Tallest Statues In The World: ప్రపంచంలోని ఎత్తయిన విగ్రహాలు (ఫోటోలు)