
వైఎస్సార్ విగ్రహాన్ని తొలగిస్తున్న దృశ్యం
తాడేపల్లిరూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఇప్పటంలో కమిషనర్ శారదాదేవి ఆదేశాల మేరకు వైఎస్సార్ విగ్రహాన్ని సోమవారం తొలగించారు. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటం ప్రాంతానికి రూ.6 లక్షల నిధులు కేటాయించడంతో పెదవడ్లపూడి నుంచి కొలనుకొండ జాతీయ రహదారి వద్ద ఉన్న అండర్‌పాస్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు.
దానిలో భాగంగా వైఎస్సార్ విగ్రహ బేస్ మట్టాన్ని 10 రోజుల కిందటే పగులగొట్టారు. అయితే విగ్రహ తరలింపు కొద్దిగా ఆలస్యమైంది. చివరకు ఈ విషయంలోనూ రాజకీయాలు చేస్తుండటంతో అధికారులు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి వైఎస్సార్‌సీపీ నాయకులకు అప్పగించారు.