Ippatam Village
-
ఇప్పటంలో జనసేన మూకల ఓవరాక్షన్.. గుడిలోకి వెళ్లి తాళాలు వేసి..
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా ఇప్పటంలో గతంలో తొలగించకుండా మిగిలిపోయిన ఆక్రమణల విషయంలో జనసేన మూకలు శనివారం మరోసారి గ్రామంలో చిచ్చుపెట్టేందుకు యత్నించారు. అధికారులు ఎంతచెప్పినా వినకపోవడంతోపాటు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. సదరు ఆక్రమణలు ప్రభుత్వ భూమిలోనివేనని అధికారులు స్పష్టంచేయడం.. పోలీసుల హెచ్చరికలతో జనసేన మూకలు తోకముడిచాయి. వివరాల ప్రకారం.. గతంలో నానా రభస సృష్టించి ఇప్పటంలో అభివృద్ధి పనులను జనసేన శ్రేణులు అడ్డుకోవడంతో మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) అధికారులు అప్పట్లో కొన్ని ఆక్రమణలను తొలగించలేదు. వీటిని తిరిగి శనివారం తొలగించేందుకు సిద్ధమవుతుండగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జనసేన, టీడీపీ శ్రేణులు గ్రామంలో మరోసారి రగడ సృష్టించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని రాయడానికి వీల్లేని భాషలో ఇష్టానుసారం దూషించారు. కానీ, ఎంటీఎంసీ అధికారులు మాత్రం సంయమనం పాటించారు. అంతేకాక.. తామేమీ ప్రైవేట్ ఆస్తులను తొలగించడంలేదని.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించుకున్న ప్రహరీ గోడలు, మెట్లు, వ్యాపార సముదాయాలు మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టంచేశారు. ఇంతలో అది ప్రభుత్వ భూమి అయితే ఆధారాలు చూపాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయగా అధికారులు అందుకు సరేనన్నారు. అదే సమయంలో గ్రామంలో బయట వ్యక్తులు ఎవరూ ఉండకూడదని పోలీసులు హెచ్చరించడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. వారిని అడ్డుకునే ప్రయత్నంలో జనసేన మూకలు రెచ్చిపోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు అక్కడి రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఇంతలో ఎంటీఎంసీ అధికారులు 1916 నాటి రికార్డులను తీసుకొచ్చి వారికి చూపించారు. దీంతో.. అధికారులు ఆక్రమణలపై చేసిన మార్కింగ్ కొలతలు.. రికార్డుల్లో ఉన్న కొలతలు ఒకటేనని తేలిపోయింది. ఇక ఏం మాట్లాడాలో అర్ధంకాక అధికారులతో జనసేన మూకలు వాదనకు దిగాయి. పోలీసులు హెచ్చరించడంతో వారు బయటకొచ్చి వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది. ఇదిలా ఉంటే.. జనసేన శ్రేణులు గుడిలోకి వెళ్లి తాళాలు వేసుకోవడం.. ప్రభుత్వం, సీఎంపై నానా మాటలు అనడంతో గ్రామానికి చెందిన మహిళలు బహిరంగంగానే ఆక్షేపించారు. -
Ippatam: ప్రహరీ గోడల తొలగింపు షురూ
సాక్షి, గుంటూరు: ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రహరీ గోడలను తొలగించే పనులను చేపట్టారు. గతంలో ఈ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయడంతో వాళ్లకు చెందిన ప్రహరీ గోడలు తొలగింపు పనులు అధికారులు ఇవాళ ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. గతంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు 14 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించిన ఏపీ హైకోర్టు. -
ఇప్పటం ఇళ్ల యజమానులకు ధర్మాసనంలోనూ షాక్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు ఇళ్ల యజమానులకు హైకోర్టు ధర్మాసనం సైతం గట్టి షాక్‌నిచ్చింది. రోడ్డు మార్జిన్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడమే కాకుండా వాటిని కూల్చివేసేందుకు అధికారులు నోటీసులిచ్చినా ఆ విషయాన్ని దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందిన ఇళ్ల యజమానులు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఖర్చులు విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈమేరకు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ 14 మంది ఇళ్ల యజమానులు దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టి వేసింది. ఖర్చుల మొత్తాన్ని తగ్గించాలన్న విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. వాస్తవాలను దాచి పెట్టి కోర్టుల నుంచి సానుకూల ఉత్తర్వులు పొందే తీరును తామెంత మాత్రం ప్రోత్సహించబోమని తేల్చి చెప్పింది. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుందని, వారు సకాలంలో కోర్టును ఆశ్రయించి న్యాయం పొందే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 14 మంది రూ.14 లక్షలను ఖర్చుల కింద చెల్లించాలంటూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ నేపథ్యం.. రహదారి విస్తరణలో భాగంగా పలు ఇళ్ల కూల్చివేతకు నిర్ణయం తీసుకున్న తాడేపల్లి మునిసిపల్ అధికారులు రోడ్ మార్జిన్లను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు ఈ ఏడాది మే 21న చట్ట ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయితే రాజకీయ పార్టీల అండతో ఈ నోటీసులను సవాలు చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది ఇళ్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సింగిల్ జడ్జి జస్టిస్ రవినాథ్ తిల్హారీ... పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అటు తరువాత ఆ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా ఇళ్ల కూల్చివేత విషయంలో పిటిషనర్లకు అధికారులు ముందుగానే షోకాజ్ నోటీసులతో పాటు ఇతర నోటీసులు కూడా అందచేశారంటూ అందుకు సంబంధించి అన్ని ఆధారాలను మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తి ముందుంచారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి హైకోర్టును ఆశ్రయించిన 14 మంది పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందుకుని కూడా నోటీసులు ఇవ్వలేదంటూ హైకోర్టును తప్పుదోవ పట్టించడంపై మండిపడ్డారు. కోర్టు ముందు వాస్తవాలను దాచి పెట్టినందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున 14 మందికి రూ.14 లక్షలను ఖర్చులుగా విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆ 14 మంది ఇళ్ల యజమానులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారు... ఇళ్ల యజమానుల తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ పిటిషనర్లందరూ వ్యవసాయదారులని పేర్కొన్నారు. వారికి షోకాజ్ నోటీసులకు, తుది నోటీసులకు తేడా తెలియదన్నారు. దీంతో నోటీసులు ఇవ్వలేదని చెప్పారన్నారు. అంతేకానీ కోర్టును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం వారికి లేదన్నారు. జరిగిన తప్పులకు క్షమాపణ చెబుతున్నామన్నారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. ఇలాంటి వ్యాజ్యాల వల్ల కోర్టుల సమయం వృథా అవుతోందని పేర్కొంది. వాస్తవాలను తొక్కి పెట్టి పిటిషన్ దాఖలు చేయడం ద్వారా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా మిగిలిన కక్షిదారుల వ్యాజ్యం విచారణ జాబితాలో వచ్చే అవకాశం లేకుండా పోయిందని, ఇది ఓ రకంగా అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించింది. కేసులు సకాలంలో విచారణకు రాకపోవడంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, అందుకు ఇప్పటం ఇళ్ల యజమానులు లాంటి వారు దాఖలు చేసే వ్యాజ్యాలే కారణమని పేర్కొంది. ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు హైకోర్టు ఎంతో సమయం వెచ్చించిందని తెలిపింది. ఆ సమయాన్ని నిజమైన బాధితులు దాఖలు చేసే వ్యాజ్యాలను విచారించేందుకు వెచ్చించి ఉంటే వారికి న్యాయం జరుగుతుందని పేర్కొంటూ అప్పీల్‌ను కొట్టేసింది. -
ఇప్పటం కేసులో పిటిషనర్లకు మరోసారి ఎదురుదెబ్బ..
సాక్షి, అమరావతి: ఇప్పటం కేసులో పిటిషనర్లకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో కోర్టును మోసం చేయటంపై 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించింది సింగిల్ బెంచ్. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టులో రిట్ ఆప్పీల్ దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ధర్మాసనం బుధవారం కొట్టేసింది. ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్లు అంతా రైతులేనని, వాళ్లకు తెలియక తప్పు చేశారని ధర్మాసానికి తెలియజేశారు పిటిషన్ తరపున న్యాయవాది. దీంతో వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారేగా మీకు తెలియదా అని పిటిషన్ల తరఫున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేయటం మంచిది కాదని తెలిపింది. చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి? -
ఇప్పటం లోగుట్టు లోకేష్‌కు ఎరుక.. ఆర్కే తనదైన శైలిలో..
సాక్షి, గుంటూరు: జనసేన, టీడీపీ ముఖ్యుల నోట తాజా మాట ‘ఇప్పటం’. వారి అంతర్గత చర్చల్లోనూ అదే నిత్యం నానుతోంది. సినిమా డైలాగుల్లా పవన్ పరుష పదాల స్క్రిప్టునే వల్లెవేస్తున్నారు. నేతల తాజా వేదనకు మంగళగిరి వేదికగా మారిందనేది రాజకీయ వర్గాల్లో చర్చ. దీని లోగుట్టంతా లోకేష్, బాబులకే ఎరుక అనే వాఖ్యలూ విస్తృతమయ్యాయి. నియోజకవర్గంలోని పేదవర్గాలను వైఎస్సార్సీపీ అక్కున చేర్చుకుంటున్న వైనం, పదవుల పంపిణీలో అనుసరిస్తున్న సామాజిక న్యాయం, కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. స్వపుత్రుడు లోకేష్ మంగళగిరి నుంచే పోటీకి సాహసిస్తే రాజకీయ భవిష్యత్తు కొడిగడుతుందేమోననే ఆందోళనలతో దత్తపుత్రుడి ద్వారా రాజకీయ చదరంగాన్ని బాబు ఆడిస్తున్నారనేది పరిశీలకుల అభిప్రాయం. అందుకే ఇప్పటంను కేంద్రబిందువుగా చేసుకుని పావులు కదుపుతున్నారని విశ్లేషిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్లతో గెలిచిన ఆళ్ల పార్టీ మార్గదర్శనంలో రాజకీయంగా పాతుకుపోతున్నారని ప్రతిపక్షం గుర్తించింది. పై రెండు ఎన్నికలే కాకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి తొమ్మిది పర్యాయాలు ఎన్నికలు జరగ్గా 1983, 85లో మాత్రమే ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. మిత్రపక్షాలుగా ఇతర పార్టీలకు టీడీపీ మద్దతిచ్చినా 1994లో సీపీఎం విజయం సాధించింది. తక్కిన నాలుగు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. పదవుల పంపిణీలోనూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాజకీయ పదవుల నియామకాలలో ఎవరూ ఊహించని, అంచనాలకు అందని వెనుకబడిన వర్గాల వారికి ప్రాధాన్యం దక్కడం మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకతగా నిలిచింది. దుగ్గిరాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అత్యంత ప్రాధాన్యమైనదనేది ఈ ప్రాంతవాసులకు తెలియనిదేమీకాదు. కొండూరు ముత్తయ్య, షేక్ బాజిలు చైర్మన్లు అయ్యారు. డైరెక్టర్ల నియామకంలోనూ వెనుకబడిన సామాజికవర్గాలకు ప్రాధాన్యం దక్కింది. మంగళగిరి ఏఎంసీ చైర్మన్ల నియామకాలూ గతానికి భిన్నంగా జరిగాయి. యార్డు డైరెక్టర్లు అందరూ మహిళలు కావడం మరీ ప్రత్యేకం. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు, శాప్ డైరెక్టర్.. ఇలా ప్రతి నియామకంలో సోషల్ ఇంజినీరింగ్ ప్రత్యేకత ప్రతిబింబించింది. లోకేష్‌ది చుట్టపుచూపు ఎమ్మెల్యే పనితీరుతో పోల్చినప్పుడు నారా లోకేష్‌ది నియోజకవర్గానికి చుట్టపుచూపే. అది కూడా మంగళగిరి పట్టణానికి పరిమితం అవుతున్నారు. ఆయన ఎర్రబాలెం, నీరుకొండ, కురగల్లు, ఈమని, దుగ్గిరాల, చిలువూరు, తుమ్మపూడి గ్రామాలలో పర్యటించగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గమంతా నిత్యం కలియతిరుగుతున్నారు. ప్రజలతో ఉంటున్నారు. గడప గడపకూ కార్యక్రమం వీటన్నింటికీ అదనం. పవన్‌ను ఇప్పటం పంపడం ద్వారా.. మంగళగిరిలో లోకేష్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయిస్తున్న చంద్రబాబు తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్‌ను నియోజకవర్గంలోని ఇప్పటంలో దింపారని విశ్లేషకులు భావిస్తున్నారు. నానా హడావుడి చేయడానికి కూడా అదే కారణమంటున్నారు. వాస్తవంగా ఇప్పటంలో ఏం జరిగిందనేది హైకోర్టు తీర్పు తెలియజెప్పింది. ప్రజలూ నిశితంగా గమనిస్తూ అభివృద్ధి పనులకు, ప్రగతి కాముకులకు మద్దతుగా నిలుస్తుండటంతో ప్రత్యర్థి పార్టీ నేతలకు పాలుపోవడం లేదు. ఆందోళనలకు తెరతీస్తూ పచ్చని పల్లెల్లో చిచ్చు రేపడానికి కంకణం కట్టుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అభివృద్ధి పనుల్లో పారదర్శకత మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు, అభివృద్ధి పనులతో పాటు నియోజకవర్గంలో జరిగే ప్రతి పనీ పారదర్శకతతో కూడుకున్నదే. రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, డొంకల బాగుచేత, విద్యుత్ లైన్ల మార్పు, కమ్యూనిటీ హాళ్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, టిడ్కో ఇళ్లు.. అన్ని నిర్మాణాలూ వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పనినీ ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. సమీక్షిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం పనులను ఉదయం నుంచే పరిశీలిస్తున్నారు. ప్రతిపక్షం పట్టున్న ప్రాంతాల్లోనూ పాగా టీడీపీకి మద్దతుగా నిలిచే మంగళగిరి పట్టణ ఓటర్లు మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రివర్స్ అయ్యారు. దుగ్గిరాల ప్రాంతంలో టీడీపీకి పట్టు కలిగినవనే గుర్తింపు ఉన్న రేవేంద్రపాడు, మంచికలపూడి, ఈమని తదితర గ్రామాలలో వేగంగా రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. దుగ్గిరాల పంచాయతీలో దశాబ్దాలుగా కాంగ్రెస్ కానీ, వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గానీ గెలవలేదు. కానీ గత ఎన్నికల్లో 1,200 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్ సీపీ మద్దతుదారు విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికారపారీ్టకి మద్దతు లభించింది. ఇతర గ్రామాలలోని ప్రత్యర్థి పార్టీల సానుకూల వర్గాలు, నాయకులు వైఎస్సార్ సీపీకి మద్దతుగా మారుతుండటం లోకేష్, ఆయన అనుచరులకు మింగుడుపడటంలేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆర్కే తనదైన శైలిలో.. వైఎస్సార్ సీపీ మార్గదర్శనంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పనితీరును రాజకీయ ప్రత్యర్థి నారా లోకేష్ అందుకోవడంలో బాగా వెనుకపడిపోతున్నారు. చివరికి తన పార్టీ ముఖ్యనాయకులు, సీనియర్లలో విశ్వాసం కల్పించకలేకపోతుండటంతో వారు వరుసగా పార్టీని వీడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రధాన సామాజికవర్గం నాయకులుగా గుర్తింపు కలిగిన వారిలో గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు వైఎస్సార్సీపీలో చేరారు. 2014లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి. అంతకుముందు మురుగుడు మాజీ మంత్రి. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు తొలి నుంచి జగన్‌కు అభిమానిగా కొనసాగుతున్నారు. మరో సామాజికవర్గ ప్రముఖుడు, ఏడేళ్లపాటు టీడీపీ మండల అధ్యక్షుడిగా వ్యవహరించిన చావలి ఉల్లయ్య ఆళ్లకు మద్దతుగా నిలిచారు. టీడీపీకే చెందిన మరో సామాజికవర్గ నాయకుడు వైఎస్సార్ సీపీలో చేరనున్నారనేది సమాచారం. -
పవన్ కళ్యాణ్.. ఈ 39 మంది ఎవరు?
సాక్షి, అమరావతి: మంగళగిరిలో నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామానికి చెందిన 39 మందికి రూ.లక్ష చొప్పున ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పవన్ చెక్కులు అందజేసిన 39 మందిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చిన వారెవరూ లేకపోవడం విశేషం. ఇప్పటంలో రోడ్డు ఆక్రమించుకున్నారని అధికారులు 53 మందికి నోటీసులిచ్చారు. ఒకరు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో మిగతా 52 మంది ప్రహరీలను మాత్రమే కూల్చివేశారు. ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. అయితే మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములిచ్చినందునే ఇళ్లు కూల్చి వేశారని పవన్ నానా యాగీ చేస్తున్నారు. ఇప్పుడు బాధితుల పేరుతో పవన్ చెక్కులు ఇచ్చిన 39 మందిలో ఆ రోజు సభకు భూములిచ్చిన వారిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. జనసేన ఆవిర్భావ సభను ఇప్పటంలో 6.70 ఎకరాల్లో నిర్వహించామని ఆ పార్టీ నేత నాదండ్ల మనోహర్ చెప్పారు. వింటా సాంబిరెడ్డి, తిరుమలశెట్టి సామ్రాజ్యం, ఎల్.ఆదినారాయణ, గాజుల సాంబయ్య, శంకరశెట్టి శ్రీనివాసరావు, శంకరశెట్టి పిచ్చయ్య, శంకరశెట్టి రాయుడు, ఉమామహేశ్వరరావు, గాజుల నరసయ్యల భూమి అది. (క్లిక్ చేయండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా?) ఇందులో 8 మంది పేర్లు ఆక్రమణల జాబితాలోనే లేవు. వాళ్లలో ముగ్గురు అసలు ఆ గ్రామంలోనే ఉండరు. ఇంకొకరు ఆక్రమణల పరిధిలోకి వచ్చినా, అతడు ముందే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అతని ప్రహరీని తొలగించలేదు. అయితే ఆదివారం పవన్ చెక్కులు పంపిణీ చేసిన వాళ్లలో వీళ్లెవరూ లేరు. ప్రహరీలు తొలగించిన రోడ్డులో ఇల్లు లేని వారికి, నోటీసులు కూడా అందుకోనివారికి చెక్కులు పంపిణీ చేశారని ఇప్పటం గ్రామస్తులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: జన సైనికులే 420లు.. న్యాయస్థానమే తప్పు పట్టినా మారరా?) -
జన సైనికులే 420లు.. న్యాయస్థానమే తప్పు పట్టినా మారరా?
తాడేపల్లి రూరల్: ‘జనసైనికుల మాట వినలేదని రైతుల్ని, ఇప్పటం గ్రామస్తుల్ని 420 అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 420 లాగా వ్యవహరించి, కోర్టును పక్కదోవ పట్టించింది జనసేన పార్టీ వారు. అందుకే కోర్టుకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ రూ.లక్ష జరిమానా పడింది. కోర్టును సైతం తప్పుదోవ పట్టించిన వారు 420లా? లేక గ్రామస్తులా? అనేది పవన్ కళ్యాణే చెప్పాలి’ అని ఇప్పటం ప్రజలు ప్రశ్నించారు. రోడ్డును ఆక్రమించిన వారి ప్రహరీలు మాత్రమే తొలగిస్తే, ఇళ్లు తొలగించారని పవన్ కళ్యాణ్ నానాయాగీ చేస్తూ వారికి ఆదివారం రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేయగా, పలువురు ఆ చెక్కులు తీసుకునేందుకు నిరాకరించారు. మున్నంగి వెంకటరెడ్డి, మున్నంగి జగన్మోహన్రెడ్డి, మున్నంగి శ్రీకాంత్‌రెడ్డి, లచ్చి వెంకటేశ్వర్లు, లచ్చి సాంబయ్య, మున్నంగి బాలకోటిరెడ్డి, మున్నంగి శివారెడ్డి, రెడ్డిబత్తుల సుబ్బారెడ్డి, మున్నంగి శివశంకరరెడ్డిలు తమకు ఆ సాయం అవసరం లేదని స్పష్టం చేశారు. ఇకనైనా విష ప్రచారం మానండి ‘అసలు పోలీస్‌స్టేషన్ గుమ్మం ఎక్కని ఇప్పటం గ్రామాన్ని హైకోర్టు వరకు తీసుకువెళ్లి విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ ప్రచారాలు మానుకుని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఆ రోజు సభలో ఇప్పటం అభివృద్ధికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఆ డబ్బులు అడుగుతున్నందుకే పంటపొలాలు ఇచ్చిన రైతుల ఇళ్లను కూల్చారంటూ విషప్రచారం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసింది. మరో రూ.6కోట్లు కేటాయించింది. మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ప్రహరీలు, షాపులను తొలగించారు. వారందరికీ కూడా పవన్‌కళ్యాణ్ లక్ష రూపాయల చొప్పున కేటాయిస్తే ఎంతో సంతోషిస్తాము. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 325 చిన్న చిన్న గుడిసెలను తొలగించారు. వారికి కూడా లక్ష రూపాయలు ఇస్తే ఆ కుటుంబాలు మీ పేరు చెప్పుకుంటాయి’ అని ఇప్పటం వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. మొదట తొలిగించింది నా ప్రహరీనే ఇప్పటంలో మొట్టమొదటగా తొలగించింది నా ప్రహరీనే. గతంలో పంచాయతీగా ఉన్నప్పుడు రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడలను కట్టాం. ఇప్పుడు కార్పొరేషన్ అయ్యింది. కార్పొరేషన్‌కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. గతంలో మా గ్రామానికి రూ.10 లక్షల నిధులు ఇస్తే ఎక్కువ. ఏకంగా ఈ మూడు సంవత్సరాల్లో రూ.3 కోట్లు ఖర్చుపెట్టారు. మరో రూ.6 కోట్లు కేటాయించారు. రహదారులు అభివృద్ధి చేస్తే ప్రజలందరికి ఎంతో మేలు జరుగుతుంది. – లచ్చి వెంకటేశ్వర్లు, ఇప్పటం మా కుటుంబాన్ని అవమానిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన చెక్కులను మేము నిరాకరించాం. మేము గ్రామ అభివృద్ధి కోరుకున్నాం. రోడ్డును ఆక్రమించి మేము ప్రహరీ నిర్మించిన మాట వాస్తవమే. అందువల్లే ప్రహరీని తొలగించారు. మాకేం బాధ లేదు. మా ఇంటి మీద ఒక్క ఇటుకను కూడా కదిలించలేదు. అదేమాట చెప్పినందుకు మా కుటుంబ సభ్యులపై 420లు, ప్యాకేజీ బాబులు అంటూ జనసేన పార్టీ సోషల్ మీడియా వారు మా కుటుంబాన్ని అవమానిస్తున్నారు. – మున్నంగి వెంకట రమణమ్మ, ఇప్పటం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతోంది ఎక్కడో మండలానికి చివరన ఉన్న ఇప్పటం గ్రామంలో గతంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పవన్ కళ్యాణ్ మూలంగా ఇప్పటాన్ని హైకోర్టుకు పరిచయం చేశారు. నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదంటూ కోర్టుకు వెళ్లారు. కోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఏమనాలి? గ్రామాల్లో పవన్ కళ్యాణ్ చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అర్థమవుతోంది. గోడలు తొలగిస్తే ఇళ్లు తొలగించారని టీడీపీ, జనసేన ప్రచారం చేయడం విడ్డూరం. – లచ్చి సాంబయ్య, ఇప్పటం -
పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా సంచలన కామెంట్స్
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని హితవు పలికారు. ఇక, మంత్రి రోజా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ రోడ్డుపై రౌడీలా రోడ్‌షోలు చేయడమేంటి?. నిజంగా పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాలి. ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే గెలుస్తారు. పాలిటిక్స్ అంటే ప్రతీరోజు యుద్ధమే. పవన్ నువ్వు సినిమాలో హీరో వేషాలు వేసి ఇక్కడకి వచ్చి జీరో వేషాలు వేస్తే ప్రజలు హీరోను చేయరు. ఇప్పటంలో జరిగిన దానికి ప్రధాన కారణం చంద్రబాబు. నారా లోకేశ్ అక్కడ పోటీచేసి ఓడిపోతే అక్కడ ఓ సమస్య వస్తే లోకేశ్ లేదా చంద్రబాబు వెళ్లాలి. అలాకాకుండా పవన్‌ను పంపించి ఫూల్‌ని చేసింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబును తిట్టకుండా సంబంధంలేని సీఎం వైఎస్ జగన్‌ను నిందిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే కేవలం తన ఉనికి కోసమే సీఎం జగన్‌పై నిందలు వేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు అని వ్యాఖ్యలు చేశారు. -
పవన్ పై మంత్రి రోజా ఫైర్
-
పవన్ పార్టీ విప్లవసేన కాదు కిరాయి విప్లవసేన : పేర్ని నాని
-
పవన్ కల్యాణ్ పగటి వేషగాడు : మంత్రి జోగి రమేష్
-
గన్ షాట్ : రాజకీయ లబ్ది కోసం కోర్టులనే తప్పుదోవ పట్టిస్తారా..?
-
ఒక్క ఇంటినీ కూల్చకున్నా.. ‘ఇప్పటం’ అబద్ధాలు ఇంకా..
సాక్షి, అమరావతి: తప్పుడు అఫిడవిట్లు సమర్పించి సానుకూల ఉత్తర్వులు పొందడంపై కన్నెర్ర చేస్తూ 14 మంది ఇళ్ల యజమానులు రూ.లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని సాక్షాత్తూ హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిన తర్వాత కూడా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ‘ఇప్పటం’ అబద్ధాలను ఇంకా కొనసాగించేందుకు సన్నద్ధం కావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నెల 27వతేదీన పవన్‌కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల యజమానులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేస్తారని ఆ పార్టీ పేర్కొంది. ఇప్పటంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలను రూ.1.65 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నగర పాలక సంస్థ అధికారులు ఈ నెల 4వ తేదీన ఆక్రమణలు తొలగించిన విషయం తెలిసిందే. మానవతా దృక్పథంతో ఇళ్ల జోలికి వెళ్లకుండా ఆక్రమించి కట్టిన ప్రహారీ గోడలు, మెట్లు లాంటి వాటినే అధికారులు తొలగించగా ప్రభుత్వం ఇళ్లను కూల్చి వేసిందంటూ పవన్‌కళ్యాణ్ ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు ప్రయత్నించారు. ఓ వర్గం మీడియా కూడా తప్పుడు కథనాలను ప్రచురించింది. అయితే జనసేన సభకు భూములిచ్చిన రైతులెవరు వారిలో లేరని సాక్ష్యాధారాలతో ఇప్పటికే రుజువైంది. చదవండి: హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ -
బిగ్ క్వశ్చన్ : కరకట్ట బాబు, కల్యాణ్ బాబు కుతంత్రాలు
-
హైకోర్టు తీర్పు తో ఇప్పటం గ్రామం పరువు పోయింది : స్థానికులు
-
హైకోర్టుకు వెళ్లిన ఇప్పటం పిటిషనర్లకు షాక్
-
‘ఇప్పటం’ అబద్ధాలు అడ్డం తిరిగాయి
(సాక్షి–అమరావతి): ఫక్తు రాజకీయం. ప్రభుత్వం ఏం చేసినా... అదో అరాచకమంటూ... అన్యాయమంటూ గగ్గోలు పెట్టడమే తెలుగుదేశం పని. ఆ పనిలో అడుగడుగునా సహకరించడానికి జనసేన. వీళ్లిద్దరికీ తోడు ఎల్లో మీడియా. ‘ఇప్పటం’ గ్రామంలో వీళ్లంతా కలిసి ఆడిన.. ఆడించిన నాటకం రాష్ట్ర హైకోర్టు సాక్షిగా బట్టబయలయింది. ఒకదానికి ఒకటి జోడిస్తూ వరస అబద్ధాలతో నకిలీ ఉద్యమాన్ని నిర్మించబోయిన ఈ పార్టీలకు గట్టి షాకే తగిలింది. రోడ్డు విస్తరణ కోసం అడ్డుగా ఉన్న ప్రహరీలను తొలగిస్తే... ఏకంగా ఇళ్లే కూల్చేశారన్నారు. తొలగించడానికి ముందు నోటీసులిస్తే... సమాచారమేదీ లేకుండా రాత్రికి రాత్రే నిరాశ్రయులను చేశారన్నారు. రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడో మొదలైనా... స్థానికంగా జరిగిన జనసేన సభకు అక్కడి కొందరు స్థలాన్నిచ్చారని, అందుకే పగబట్టి వారి ఇళ్లు కూల్చేస్తున్నారని దుష్ప్రచారానికి దిగారు. ఈ ప్రచారమంతా నిజమంటూ తెలుగుదేశం, జనసేన నేతలు పర్యటనలూ చేశారు. బాధితులకు రూ.లక్ష చొప్పున తానే పరిహారమిస్తానంటూ కూడా పవన్ కల్యాణ్ ఆవేశపడ్డారు. కానీ... కథ అడ్డం తిరిగింది. అందరికీ ముందే నోటీసులిచ్చినట్లు రుజువయింది. అలా నోటీసులు అందుకున్న వారిలో అసలు పవన్ సభకు స్థలమిచ్చినవారే లేరన్నది కూడా బట్టబయలయింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రహరీలే తప్ప ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదని స్పష్టమయ్యింది. అన్నిటికన్నా ముఖ్యంగా... ఈ రాజకీయమంతా హైకోర్టుకు అర్థమయ్యింది. అందుకే... తమకు నోటీసులివ్వకుండానే తమ ఇళ్ల నిర్మాణాలను కూల్చేస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించిన వారికి న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. వాస్తవాలను తొక్కి పట్టి అబద్ధాలతో పిటిషన్లు వేస్తారా? అని వారిపై ఆగ్రహించటమే కాక... కోర్టులతో ఎప్పుడూ ఆటలాడవద్దని హెచ్చరిస్తూ ఆ 14 మందికీ తలా రూ.లక్ష చొప్పున కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. కోర్టులతోనే ఆటలా? సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతో అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా తమ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ రాజకీయ నాయకుల మద్దతుతో హైకోర్టును ఆశ్రయించిన గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు ఇళ్ల యజమానులకు న్యాయస్థానం గట్టి షాక్‌నిచ్చింది. రాజకీయ నాయకులను నమ్ముకుని కోర్టు ముందు వాస్తవాలు దాచి పెట్టి అబద్ధాలతో పిటిషన్ దాఖలు చేసినందుకు భారీ మొత్తంలో కోర్టు ఖర్చులు విధించింది. రోడ్డు మార్జిన్లను ఆక్రమించి కట్టిన నిర్మాణాల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించిన 14 మంది ఇళ్ల యజమానులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రూ.14 లక్షలను ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని పిటిషనర్లను ఆదేశిస్తూ కోర్టులతో ఎప్పుడూ ఆటలాడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ గురువారం తీర్పు వెలువరించారు. నిజాలను దాచిపెట్టి సానుకూల ఉత్తర్వులా? పిటిషనర్లు వాస్తవాలను తొక్కి పెట్టి అవాస్తవాలు కోర్టు ముందుంచి సానుకూల ఉత్తర్వులు పొందారంటూ హైకోర్టు ఆక్షేపించింది. ఇలాంటి పద్ధతులకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. నిజాలను దాచి పెట్టి కోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు పొందడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనంటూ ఇళ్ల యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు కోర్టుకు రావడం వెనుక ఎంత మాత్రం సదుద్దేశం కనిపించడం లేదంది. షోకాజ్ నోటీసులు అందుకుని కూడా అవి అందలేదంటూ కోర్టు ముందే ఇళ్ల యజమానులు బుకాయించారని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అంతేకాక నోటీసుల్లో ఏముందో తెలియలేదన్న పిటిషనర్ల వాదన ఎంత మాత్రం నమ్మశక్యంగా లేదంటూ ఇళ్ల నిర్మాణాల కూల్చివేతలపై వారు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. నోటీసులివ్వలేదంటూ మధ్యంతర ఉత్తర్వులు పొందిన పిటిషనర్లు.. రోడ్డు విస్తరణలో భాగంగా తాడేపల్లి మునిసిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు ఈ ఏడాది మే 21న చట్ట ప్రకారం నోటీసులు జారీ చేశారు. అధికారులు మానవత్వంతో వ్యవహరించి ఇళ్ల జోలికి వెళ్లకుండా ప్రహరీలను మాత్రమే తొలగించినా కొన్ని పార్టీలు రాజకీయం చేశాయి. రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించటాన్ని తప్పుబడుతూ రాద్ధాంతం చేశాయి. దీనికి కులం రంగు పులిమాయి. రాజకీయ పార్టీల మద్దతుతో ఈ నోటీసులను సవాల్ చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది ఇళ్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హారీ.. కూల్చివేత నోటీసుల ఆధారంగా పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్లకు అధికారులు ముందుగానే షోకాజ్ నోటీసులతో పాటు ఇతర నోటీసులు కూడా అందచేశారంటూ అందుకు సంబంధించి అన్ని ఆధారాలను మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాది మలసాని మనోహర్‌రెడ్డి, నరేష్ కుమార్‌లు కోర్టు ముందుంచారు. దీంతో ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి నిలదీయడంతో అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ వాస్తవాన్ని అంగీకరించారు. దీంతో ఇళ్ల యజమానుల తీరుపై న్యాయమూర్తి మండిపడ్డారు. కోర్టు ముందు వాస్తవాలను దాచిపెట్టారంటూ పిటిషన్ దాఖలు చేసిన 14 మంది ఇళ్ల యజమానులను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశించిన విషయం విదితమే. ఇలాంటి వారిని వదిలిపెట్టడానికి వీల్లేదు.. హైకోర్టు ఆదేశాల మేరకు 14 మంది ఇళ్ల యజమానుల్లో 11 మంది గురువారం ఉదయం కోర్టు ముందు హాజరయ్యారు. ముగ్గురు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. మొదటి పిటిషనర్ బెల్లంకొండ వెంకట నారాయణను న్యాయమూర్తి తన దగ్గరకు పిలిచి స్వయంగా మాట్లాడారు. మీకు ఇంగ్లీష్, హిందీ వచ్చా? అని ఆరా తీశారు. తనకు రాదని వెంకట నారాయణ పేర్కొనడంతో కోర్టు అడుగుతున్న ప్రశ్నలను తెలుగులో వివరించాలని న్యాయవాది ఎస్.లక్ష్మీనారాయణరెడ్డిని న్యాయమూర్తి కోరారు. దీంతో న్యాయమూర్తి ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నలను లక్ష్మీనారాయణరెడ్డి తెలుగులో అనువదించి వివరించారు. మే నెలలోనే నోటీసులు అందుకున్నామని, వాటిని తీసుకుని ఎమ్మెల్యే వద్దకు వెళ్లామని వెంకట నారాయణ వెల్లడించారు. ఆ నోటీసులో ఏం రాశారో తెలియదని, తాము పెద్దగా చదువుకోలేదని చెప్పారు. ఈ సమయంలో ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది స్పందిస్తూ పిటిషనర్లందరూ రైతులని తెలిపారు. సాధారణ నోటీసుకు, షోకాజ్ నోటీసుకు వారికి తేడా తెలియదన్నారు. వారు వాస్తవాలను దాచిపెట్టలేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. షోకాజ్ నోటీసులు అందుకుని కూడా అందలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సానుకూల ఉత్తర్వులు పొందడం వాస్తవాలను దాచిపెట్టడం కాదా? అని నిలదీశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టడానికి వీల్లేదన్నారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ఖర్చులు విధించడమే సరైన చర్యని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 14 మంది రూ.14 లక్షలను ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్లపై దయ చూపాలని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది కోరగా ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇలాంటి వారిపై జాలి చూపితే సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందన్నారు. పిటిషనర్లు చేసిన పనికి వారిపై క్రిమినల్ కోర్టు ధిక్కారం కింద చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఆ పని చేయడం లేదని, కేవలం ఖర్చులు విధించేందుకే పరిమితం అవుతున్నామంటూ ఆ మేరకు ఉత్తర్వులిచ్చారు. -
‘ప్రతిరోజూ ఇలానే అనేక తప్పుడు ప్రచారాలు’
తాడేపల్లి: ఇప్పటంలో లేనిదానిపై చంద్రబాబు అండ్ కో అనవసరపు రచ్చ చేసి నానా హంగామా చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇలా రోజువారీ అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సజ్జల తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన సజ్జల.. ‘ఇప్పటంలో లేనిదానిపై రచ్చ చేశారు.. చివరకు కోర్టు మొట్టికాయలు వేసింది. టీడీపీకి తెలిసిన ఏకైక విద్య తప్పుడు ప్రచారం. రోజువారీగా అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారు.. ఏదో ఊహించుకుంటూ తనను తాను మోసం చేసుకుంటున్నారు. ఇప్పటం విషయంపై అనవరసర రాద్దాంతం చేశారు. ప్రజలను ప్రతిపక్షాలు కావాలనే తప్పుదోవ పట్టించాయి. పవన్ సభకు భూములిచ్చిన వారి ఇళ్లు కూల్చడం అనేది పచ్చి అబద్ధం.నోటీసులు ఇచ్చి ఆక్రమణలు తొలగించారు. హైకోర్టు సాక్షిగా నిజం బట్టబయలైంది’ అని తెలిపారు. -
'ఇప్పటం' పిటిషనర్లకు ఏపీ హైకోర్టు షాక్
సాక్షి, అమరావతి: ‘ఇప్పటం’ కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున హైకోర్టు జరిమానా విధించింది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు 14 మందికి 14 లక్షలు జరిమానా కోర్టు విధించింది. అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చినా.. ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పి పిటిషనర్లు స్టే తెచ్చుకున్నారు. కాగా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన యజమానులు చివరకు వాస్తవాన్ని హైకోర్టుకు నివేదించారు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దీంతో వారిపై హైకోర్టు మండిపడింది. షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఇవ్వలేదంటూ కోర్టుకొచ్చి, కూల్చివేతలపై స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషనర్లకు జరిమానా విధించింది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు -
‘ఇప్పటం’ పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన యజమానులు చివరకు వాస్తవాన్ని హైకోర్టుకు నివేదించారు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దీంతో వారిపై హైకోర్టు మండిపడింది. షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఇవ్వలేదంటూ కోర్టుకొచ్చి, కూల్చివేతలపై స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాక కూల్చివేతల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రోడ్డును ఆక్రమించుకున్న ఇప్పటంలోని ఇళ్ల యజమానులకు మే 21న నోటీసులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హారీ కూల్చివేత నోటీసుల ఆధారంగా పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు మలసాని మనోహర్‌రెడ్డి, జి.నరేష్ కుమార్‌లు వాదనలు వినిపించారు. పిటిషనర్లకు కొందరికి పోస్టు ద్వారా, మరికొందరికి వ్యక్తిగతంగా గతంలోనే నోటీసులు అందజేశామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచారు. దీనిపై ఏమంటారని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో పిటిషనర్లు వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ పిటిషనర్ల న్యాయవాది టి.సాయిసూర్య అంగీకరించారు. ఆ విషయాన్ని పిటిషన్లో ఎందుకు ప్రస్తావించలేదని న్యాయమూర్తి నిలదీశారు. ఉదయం కూల్చివేతలు మొదలుపెట్టడం, దానిపై హడావుడిగా లంచ్‌మోషన్ పిటిషన్ వేయడం, పిటిషనర్లు నిరక్షరాస్యులు కావడం తదితర కారణాలతో షోకాజ్ నోటీసుల విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించలేదని సాయిసూర్య చెప్పారు. ఈ వివరణతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని చెప్పడంవల్లే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేశారు. కోర్టు ముందు వాస్తవాలను తొక్కిపెట్టినందుకు క్రిమినల్ కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించారు. పిటిషనర్లు కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని వారి తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. -
ఇప్పటం అక్రమ నిర్మాణాల తొలగింపు కేసు: పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి: ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు తొలగింపులకు సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చినా తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వాస్తవాలు తొక్కిపెట్టి స్టే ఉత్తర్వులు పొందినందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటూ పిటిషనర్లకు చురకలు అంటించింది. కాగా, ఇప్పటం రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు(మంగళవారం) హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా అక్రమ నిర్మాణాలకు తొలగింపులకు సంబంధించి అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చారని కోర్టు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాస్తవాలు తొక్కిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. -
గన్ షాట్ : నీ ప్యాకేజీ మాకొద్దు ..
-
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదయ్యింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్‌విత్ 177ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదయింది. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చోని వెళ్లడం, కార్ ర్యాష్ డ్రైవింగ్‌పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ మేరకు స్పందించారు. హైవేపై పవన్ కాన్వాయ్‌ని పలు వాహనాలు అనుసరించడంపై కూడా కేసు ఫైల్ చేశారు. తెనాలి మారిస్పేటకు చెందని శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పవన్ కల్యాణ్, కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (జనసేన నాయకుల ఓవరాక్షన్.. దెబ్బకు జారుకున్నారు) -
ఆధారాలు ఉన్నందునే ఆక్రమణల తొలగింపు
దొండపర్తి (విశాఖ దక్షిణ): అన్యాక్రాంతమైన భూములను ఆంధ్రా యూనివర్శిటీ తిరిగి స్వాధీనం చేసుకోవడం దారుణమా? ఆక్రమిత భూముల్లో నిర్మించిన దుకాణాలను తొలగించడం కూల్చివేతల కలకలమా? ఏయూ ఆస్తులను కబ్జా చేసి అనుభవిస్తున్న ప్రైవేట్ వ్యక్తులపై టీడీపీ నేతలకు ఎందుకంత ప్రేమ? ఈనాడు ప్రచురించినట్లుగా 16 షాపుల్లో 200 మంది పని చేస్తుంటే అవి చిన్న దుకాణాలా? టీడీపీ నాయకుల డ్రామాలు, ఎల్లో మీడియా కథనాల్లో నిజం ఉందా? కబ్జాదారుల చెర నుంచి తమ భూములను ఆంధ్రా యూనివర్శిటీ స్వాధీనం చేసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రైవేట్ వ్యక్తులను సమర్థించటాన్ని అంతా తప్పుబడుతున్నారు. ఏయూ స్థలాన్ని ఆక్రమించి షెడ్లు నిర్మించిన వారి వద్ద ఆ స్థలానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవు. దుకాణదారులంతా తమ వస్తువులు తీసుకొని మధ్యాహ్నానికే అక్కడ నుంచి వెళ్లిపోయారు. చాలా ఏళ్లుగా ఆక్రమణలకు గురైన విలువైన ఏయూ భూములను స్వాధీనం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఏయూ పూర్వ విద్యార్థులు, నగరపౌరులు దీనిని స్వాగతిస్తున్నారు. ► విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీకి పాత సీబీఐ జంక్షన్ నుంచి పోలమాంబ ఆలయం వరకు సువిశాలమైన భూమి ఉంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి పోలమాంబ ఆలయం వరకు రహదారికి ఆనుకుని ఉన్న విలువైన స్థలాన్ని కొందరు ఆక్రమించి అనధికారంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. బడాబాబుల అండదండలతో కార్ షెడ్లు, మాంసం దుకాణాలు, టీ పాయింట్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తూ అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. టీడీపీ హయాంలో కబ్జాదారులు దుకాణాలను నిర్మించుకుని నెమ్మదిగా విస్తరించినా కన్నెత్తి కూడా చూడలేదు. తాజాగా ఏయూ అధికారులు మరోసారి జీవీఎంసీకి ఫిర్యాదు చేయడంతో అక్రమ నిర్మాణాలను సోమవారం తొలగించారు. ► పెదవాల్తేరు పోలమాంబ ఆలయానికి ఆనుకుని ఏయూకు 2.5 ఎకరాల భూమి ఉంది. 1941లోనే దీన్ని నిర్ణీత రుసుము చెల్లించి కొనుగోలు చేసింది. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం అప్పటి నుంచి ఆ భూమి ఏయూ స్వాధీనంలోనే ఉంది. టౌన్ సర్వే రిజిస్టర్ ప్రకారం ఈ భూములు ఏయూకు చెందినవేనని 1989 నాటి అడంగల్ కాపీలు ఏయూ వద్ద ఉన్నాయి. ► 1992లో ఈ స్థలాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నించిన కొందరు కోర్టుకు వెళ్లగా స్పెషల్ కోర్టు ఏయూకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 1993 ఫిబ్రవరి 16న తహశీల్దార్ స్వయంగా ఇక్కడ ఉన్న తాటాకు ఇళ్లను తొలగించారు. ఆక్రమణదారులైన కుందం అప్పారావుతో పాటు మరో 13 మంది నుంచి భూమిని స్వాధీనం చేసుకొని ఖాళీ స్థలాన్ని ఏయూకు అప్పగించారు. దీనిపై ఏయూకే సర్వహక్కులు ఉన్నాయంటూ తహశీల్దార్ ఏయూకు లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. ► పెట్రోల్ బంక్ నుంచి పోలమాంబ ఆలయం వరకు రహదారి విస్తరణకు ఏయూకు చెందిన ఈ స్థలం నుంచే కొంత భూమిని జీవీఎంసీకి అప్పగించింది. దీనికి పరిహారంగా ఏయూకు జీవీఎంసీ ప్రత్యామ్నాయ భూమిని సైతం ఇచ్చింది. అందులోనే ఏయూ అంతర్జాతీయ విద్యార్థినుల హాస్టల్ సముదాయాన్ని నిర్మించింది. అన్ని ఆధారాలున్నాయి.. ఆక్రమణలు తొలగించిన స్థలం నిస్సందేహంగా ఏయూదే. ఆ పత్రాలన్నీ మావద్ద ఉన్నాయి. గతంలో పనిచేసిన వీసీలు, రిజిస్ట్రార్లు కూడా వీటిని స్వాధీనం చేసుకోవాలని ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో అప్పటి ప్రభుత్వాలను కోరారు. – ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి, వీసీ -
మీ సానుభూతి మాకు అవసరం లేదు: పవన్‌కు దిమ్మ తిరిగే కౌంటర్
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లు కూల్చి వేస్తోందంటూ జనసేన, తెలుగుదేశం నాయకులు వారం రోజులుగా నానా హడావుడి చేశారు. వాస్తవానికి రోడ్డును ఆక్రమించిన వారి ఇళ్లను ప్రభుత్వం ఎక్కడా కూల్చలేదు. కేవలం ప్రహరీ, మెట్లను మాత్రమే తొలగించారు. దీనిని రాజకీయంగా వాడుకుని, లబ్ధి పొందాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల అక్కడ పర్యటించి హంగామా చేశారు. జనసేన సభకు భూములిచ్చిన వారి ఇళ్లను కూల్చి వేశారంటూ విష ప్రచారం చేశారు. ఆ తర్వాత ఒక్కో ఇంటికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తానని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పటం వాసులకు విసుగు తెప్పించింది. ‘ప్రభుత్వం మా ఇళ్లను కూల్చ లేదు. మీ సానుభూతి మాకు అవసరం లేదు. డబ్బులు ఇచ్చి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయొద్దు’ అంటూ బుధవారం ఆయా ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (‘ఈనాడు’కు ఎందుకంత కడుపుమంట?.. రామోజీకి కళ్లు కనపడట్లేదా?’) -
ఇప్పటంలో వైఎస్సార్ విగ్రహం తరలింపు
తాడేపల్లిరూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఇప్పటంలో కమిషనర్ శారదాదేవి ఆదేశాల మేరకు వైఎస్సార్ విగ్రహాన్ని సోమవారం తొలగించారు. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటం ప్రాంతానికి రూ.6 లక్షల నిధులు కేటాయించడంతో పెదవడ్లపూడి నుంచి కొలనుకొండ జాతీయ రహదారి వద్ద ఉన్న అండర్‌పాస్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. దానిలో భాగంగా వైఎస్సార్ విగ్రహ బేస్ మట్టాన్ని 10 రోజుల కిందటే పగులగొట్టారు. అయితే విగ్రహ తరలింపు కొద్దిగా ఆలస్యమైంది. చివరకు ఈ విషయంలోనూ రాజకీయాలు చేస్తుండటంతో అధికారులు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి వైఎస్సార్సీపీ నాయకులకు అప్పగించారు. -
ఇప్పటంపై జనసేన మరో కొత్త నాటకం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోవడంతో జనసేన మరో కొత్త నాటకానికి తెర తీసింది. తమ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణకు ఎవరెవరు స్థలాలిచ్చారో అదే రోజు వేదికపైనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు అధికారులు తొలగించిన ఆక్రమణల జాబితాలో వారెవరూ లేకపోవడం గమనార్హం. తొమ్మిది మంది సభకు స్థలాలు ఇచ్చినట్లు నాడు జనసేన ప్రకటించగా అందులో ఒక్కరికి మాత్రమే అధికారులు ఆక్రమణల కింద నోటీసులు జారీ చేశారు. మిగిలిన వారి ఇళ్లు, దుకాణాలు రోడ్డుకు దరిదాపుల్లోనే లేవు. అయితే ఆ ఇంటి యజమాని కూడా ఈ ఏడాది జూన్‌లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అధికారులు ఆ నివాసాన్ని వదిలేసి మిగిలిన ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇళ్ల కూల్చివేతల ఆరోపణలు బెడిసికొట్టడంతో మార్చిలో నిర్వహించిన జనసేన ప్లీనరీకి 31 మంది భూములిచ్చారని, వారి ఇళ్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. పార్కింగ్‌కు వాడుకుని.. ఇప్పటంలో ప్రధాన రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు మార్కింగ్ చేసినప్పుడు మొత్తం 53 ప్రైవేట్ ఆస్తులు, ఒక పంచాయతీ భవనం ఆక్రమణల పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 31 మంది తమ ప్లీనరీకి భూములిచ్చిన సానుభూతిపరులంటూ జనసేన బుకాయిస్తోంది. నిజానికి వీరి భూములు సభ జరిగిన ప్రాంతాన్ని ఆనుకుని ఉండటం, ఆ సమయంలో పొలాల్లో ఎలాంటి పంటలు లేకపోవడంతో ప్లీనరీ వాహనాల పార్కింగ్‌గా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా వారి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే వాడుకోవడం గమనార్హం. సభకు భూములిచ్చింది 9 మందే.. ఇప్పటంలో జనసేన సభకు భూములిచ్చిన తొమ్మిది మందికి సర్వే నం.167, 167(బి)లో పొలాలున్నాయి. సభ నిర్వహణకు వారు అంగీకరిస్తున్నట్లు స్థానిక తహశీల్దార్‌కు అర్జీ అందింది. జనసేన నేతలు చెబుతున్న 31 మంది పొలాలు సమీపంలోనే ఉన్నా అనుమతి తీసుకోలేదు. స్థానిక టీడీపీ నాయకుడైన శంకరశెట్టి పిచ్చయ్య గతంలో సర్పంచ్‌గా పని చేశారు. తర్వాత ఆయన భార్య కూడా సర్పంచ్‌గా ఉన్నారు. జనసేన సభకు పొలాలు ఇచ్చిన 9 మందిలో ఆయన ఇల్లు మాత్రమే రోడ్డును ఆనుకుని ఉంది. ఆయన ఇంటి ప్రహరీ, మెట్లు ఆక్రమణ పరిధిలోకి రావడంతో అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై ఆయన జూన్‌లో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందడంతో పిచ్చయ్య ఇంటి ప్రహరీని అధికారులు తొలగించలేదు. గతంలోనే విగ్రహ తొలగింపు ప్రక్రియ ఇప్పటంలో ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణ పరిధిలోకి 53 ప్రైవేట్ ఆస్తులు, రెండు దేవాలయాలు, మరో రెండు వైఎస్సార్ విగ్రహాలు వచ్చాయి. వీటిలో ఒక విగ్రహ తొలగింపు ప్రక్రియ గతంలోనే చేపట్టి రెయిలింగ్, దిమ్మె తొలగించారు. మరో ప్రాంతానికి తరలించే లోగా జనసేన రాద్దాంతం సృష్టించింది. ఆ విగ్రహాన్ని సోమవారం తరలించారు. మరో విగ్రహాన్ని రోడ్డు పనులు ప్రారంభించే లోగా తరలించాలని నిర్ణయించారు. జనసేన సభకు భూములిచ్చిన వారి వివరాలు 1. వింటా సాంబిరెడ్డి (సర్వే నం.167(బి): సొంతూరు గన్నవరం సమీపంలోని తేలప్రోలు కాగా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి వెనుక ఉన్న వజ్ర రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఎండు చేపల వ్యాపారం చేసే ఈయన ఇప్పటంలో ఏడెనిమిదేళ్ల క్రితం పొలం కొనుక్కున్నారు. ఇప్పటంలో ఎలాంటి నివాసం లేదు. 2. లక్కాకుల ఆదినారాయణ: ఈయన నివాసం ఊరు మధ్యలో ఉంది. 3. తిరుమలశెట్టి సామ్రాజ్యం: లక్కాకుల ఆదినారాయణ సోదరి. చీరాలలో ఉంటారు. ఈమెకు ఇప్పటంలో సొంతిల్లు లేదు. 4. గాజుల సాబయ్య: ఈయన ఇల్లు కూడా ఆదినారాయణ ఇంటికి సమీపంలోనే ఊరికి మధ్యన ఉంది. 5. శంకరశెట్టి శ్రీనివాసరావు: (పిచ్చయ్య తమ్ముడు) గుంటూరులో ఉంటారు. వారసత్వంగా వచ్చిన ఇల్లు గ్రామంలో ఉంది. 6. శంకరశెట్టి పిచ్చయ్య: ఈయన ఇల్లు పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉంది. ప్రహరీతో పాటు ఇంటి మెట్లు ఆక్రమణల పరిధిలోకి వచ్చాయి. ఏప్రిల్, మేలో నోటీసులు ఇవ్వడంతో జూన్‌లో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అధికారులు ఈయన ఆస్తిని ముట్టుకోలేదు. 7. శంకరశెట్టి రాయుడు, 8. శంకరశెట్టి ఉమామహేశ్వరరావు, 9. గాజుల నర్సియ్య: వీరి నివాసాలు గ్రామంలోనే ఉన్నాయి. -
ఇళ్లన్నీ భద్రం.. విద్వేషాలను రగిల్చేందుకు పవన్ పథకం
ఇప్పటం నుంచి సాక్షి ప్రతినిధులు మేడికొండ కోటిరెడ్డి, నానాజీ అంకంరెడ్డి: ఆక్రమణల తొలగింపు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో స్థానిక వైఎస్సార్ సీపీ నేత ఇంటి ప్రహరీని సైతం అధికారులు తొలగించారు. పార్టీలు, కుల మతాలనే వివక్ష లేకుండా మానవత్వంతో విధులు నిర్వర్తించారు. విపక్షాలు బురద చల్లుతున్నట్లుగా ఏ ఒక్క ఇంటినీ కూల్చలేదు. సాధారణ పాలన ప్రక్రియలో భాగంగా ఆక్రమణలను గుర్తించి కేవలం ప్రహరీలను మాత్రమే తొలగించారు. వాస్తవాలు ఇలా ఉండగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాత్రం శనివారం నానా హంగామా చేస్తూ ఇప్పటం వెళ్లి విద్వేషాలను రేకెత్తించారు. రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం ఇళ్లను కూల్చి వేస్తోందంటూ అడ్డగోలు విమర్శలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వైషమ్యాలను రగిల్చేందుకు పథకం వేశారు. ఈ నేపథ్యంలో నిజానిజాలను పరిశీలించేందుకు ‘సాక్షి’ ప్రతినిధి బృందం ఆదివారం ఇప్పటం గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడింది. ఇంటి ముందు ఉండే ప్రహరీ గోడలు మాత్రమే తొలగించారని, ఏ ఒక్క నివాసాన్నీ కూల్చి వేయలేదని స్పష్టంగా వెల్లడైంది. రాజకీయ చిచ్చే.. గౌడులు, నాయుళ్లు, రెడ్లు నివసించే ఇప్పటంలో ఎన్నికలప్పుడు ఎవరి రాజకీయాలు వారు చేసుకున్నా గ్రామస్తులంతా సామరస్యంగా జీవిస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జనసేన ఆవిర్భావ సభను అక్కడ నిర్వహించాలని భావించినప్పుడు ఇప్పటంలో మూడు ప్రధాన కులాల పెద్దల సమావేశం నిర్వహించి చర్చించారు. జనసేన సభ జరిగిన వేదిక ఆ పార్టీ సానుభూతిపరుల పొలం ఉండే ప్రాంతంలోనే ఉన్నా ఆ చుట్టు పక్కల పొలాల యజమానుల్లో అన్ని పార్టీల వారున్నారు. ఇప్పటం అభివృద్దికి రూ.50 లక్షల విరాళం ఇస్తామని జనసేన ప్రకటించడంతో ఆ డబ్బుతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై గ్రామంలోని మూడు సామాజిక వర్గాలు మరోసారి సమావేశమై చర్చించాయి. ఈ ఏడాది జూన్‌లో కూడా మూడు సామాజిక వర్గాలు కలసి రూ.2.50 లక్షల చందాలు సేకరించి ఉమ్మడిగా పోతురాజు ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. అలాంటి ప్రశాంత ఇప్పటంలో జనసేనాని రగిల్చిన చిచ్చుతో విద్వేష వాతావరణం నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 31నే గ్రామానికి వచ్చి వెళ్లిన నాదెండ్ల.. ఇప్పటంలో రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇంటి ప్రహరీలు, షెడ్లు నిర్మించుకున్న వారికి మంగళగిరి– తాడేపల్లి నగర కార్పొరేషన్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రెండు విడతలు నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు ఫిబ్రవరిలోనే ఆక్రమణలకు సంబంధించి మార్కింగ్ చేశారు. తొలగింపుపై జూన్‌లో మైక్ ద్వారా ప్రచారం చేశారు. రూ.25 లక్షలతో సైడు కాలువల నిర్మాణం సమయంలోనే ఆక్రమణల పరిధిలోకి వచ్చిన 8 ఇళ్ల ప్రహరీ గోడలను ఆగస్టులోనే తొలగించి పనులు పూర్తి చేశారు. తాజాగా రూ.1.65 కోట్లతో రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి అక్టోబరులో టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెల 2వతేదీతో టెండర్ల గడువు ముగియగా పనులను సంబంధిత కాంట్రాక్టరుకు అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఇళ్లకు సంబంధించిన ప్రహరీ గోడల అక్రమణలను నాలుగో తేదీన తొలగించనున్నట్లు గత నెల 31, ఈ నెల 1వతేదీన ఇప్పటంలో పంచాయతీ మైక్ ద్వారా ప్రచారం కూడా చేశారు. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ గత నెల 31న గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో కరెంట్ పోవడంతో కావాలనే ప్రభుత్వం విద్యుత్తు నిలిపి వేసిందంటూ చిందులు తొక్కారని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. అనంతరం నాలుగో తేదీన ఆక్రమణల తొలగింపు సమయంలో అత్యధికులు ఎలాంటి అభ్యంతరం చెప్పకున్నా జనసేన మద్దతుదారులు కొందరు అడ్డుకునే యత్నం చేయడం, ఆ మరుసటి రోజే పవన్‌కళ్యాణ్ పర్యటించడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటంలో ఇన్నాళ్లూ టీడీపీ మద్దతుదారులే కాంట్రాక్టు పనుల్లో పెత్తనం చలాయించారు. వీరంతా ఇప్పుడు జనసేన ముసుగు కప్పుకున్నారు. ఇప్పటంలో గత మూడేళ్లలో రూ.2.85 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఇప్పటికే పూర్తి చేయగా మరో రూ.6 కోట్ల పనులు మంజూరై టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. పచ్చని పల్లెలో పవన్ చిచ్చు ప్రశాంతంగా ఉన్న ఇప్పటంలో బయటి నుంచి వచ్చిన కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చిచ్చు రేపారు. సుమారు 2 వేల మంది జనాభా, 1,350 ఓటర్లున్న ఈ గ్రామం మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. రెండేళ్ల క్రితమే కార్పొరేషన్లో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటంలోనూ రోడ్ల విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. 53 నివాసాలు, ఒక పంచాయతీ భవనం (మొత్తం 54) ఆర్ అండ్ బీ రోడ్డు స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించి మార్కింగ్ చేశారు. ప్రతి ఇంటికీవెళ్లి తొలగింపుపై అవగాహన కల్పించారు. చట్ట ప్రకారం ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవాలని స్థానికులు సైతం కోరారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ రాకతో గ్రామంలో ప్రశాంతత భగ్నమైంది. సగం దూరం తగ్గుతుంది.. దుగ్గిరాల మండలంలోని ఐదు ఊర్లను వడ్డేశ్వరం వద్దనున్న హైవేతో ఇప్పటం కలుపుతుంది. దుగ్గిరాల ప్రాంతం నుంచి విజయవాడ రావాలంటే ప్రధాన మార్గంలో వెళ్తే 14 కి.మీ ప్రయాణించాలి. అదే ఇప్పటం మీదుగా ప్రయాణిస్తే 7 కి.మీ దూరం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటంలో ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణకు సంబంధిత శాఖ అధికారులు పనులు చేపట్టారు. మురుగు అంతా రోడ్డుపైకి.. ఇప్పటం మీదుగా వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు ఆక్రమణలతో ఇరుకుగా మారిపోవడం, సరైన డ్రైనేజీ లేకపోవడంతో మురుగు అంతా రోడ్డుపైనే చేరుతోంది. దీంతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణానికి అధికారులు అనివార్యంగా చర్యలు చేపట్టారు. టెండర్లు పిలిచి 350 మీటర్ల పరిధిలో రోడ్డు నిర్మించేందుకు రూ.1.65 కోట్లతో పనులు చేపట్టారు. ఇళ్లకు నష్టం లేకుండా.. ఇప్పటంలో ప్రధాన రోడ్డు అంతా ఒకే వెడల్పుతో లేదు. ఒకచోట 60 అడుగులు, మరో చోట 75 అడుగులు.. ఇంకోచోట 118 అడుగులు చొప్పున ఉంది. దీంతో అధికారులు మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో ఒకచోట ఎక్కువ ఆక్రమణలు, మరోచోట తక్కువ తొలగించే పరిస్థితి తలెత్తింది. అందరికీ ఒకేలా తొలగింపు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరడంతో బ్రిటిష్ హయాంలో వేసిన సర్వే రాళ్ల ఆధారంగా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. సరిహద్దు రాళ్ల ఆధారంగా తొలగింపు చేపట్టగా కొన్ని నివాసాలు దెబ్బతినే ప్రమాదం ఉండడంతో అధికారులు ఇళ్లకు నష్టం జరగకుండా కేవలం ప్రహరీలు, అదనంగా నిర్మించిన షెడ్లను మాత్రమే తొలగించారు. రెండు నెలల క్రితం ఇలా ఆక్రమణలను తొలగించిన చోట డ్రైనేజీ నిర్మాణం చేయడంతో నివాసితులు తమ ఇళ్లకు మార్పులు సైతం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే.. ఇప్పటంలో ఆక్రమణల గుర్తింపు మార్కింగ్ ఫిబ్రవరిలో చేపట్టడమే తొలిసారి కాదని స్థానికులు వెల్లడించారు. 30 ఏళ్ల క్రితం ఒకసారి, 15 ఏళ్ల క్రితం మరోసారి మార్కింగ్ చేశారని చెప్పారు. తాము ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన మాట వాస్తవమేనని, అందువల్ల సహకరించామని తెలిపారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియ రెండు నెలలుగా సాగుతున్నా ఈనెల 2వ తేదీన కొందరు అలజడికి తెర తీశారని గ్రామస్తులు పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలు కలసి మెలసి జీవించే తమ గ్రామానికి ఇప్పటిదాకా పోలీసులు వచ్చిందే లేదని పేర్కొంటున్నారు. వైఎస్సార్ కల్యాణ మండపం.. ఇప్పటంలో ప్రజల చందాలతో ప్రభుత్వ స్థలంలో కల్యాణ మండపాన్ని నిర్మించారు. గతంలో ఈ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు రూ.11 లక్షలు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో రూ.30 లక్షలు ఇవ్వగా ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్థలం సరిపోకపోవడంతో మరో కొంత ప్రభుత్వ స్థలాన్ని అదనంగా తీసుకున్నారు. స్థానిక పెద్దలు ఈ భవనానికి ‘డాక్టర్ వైఎస్సార్ కల్యాణ మండపం’ అని నామకరణం చేయాలని తీర్మానించగా జనసేన వర్గం కోర్టుకు వెళ్లగా వారి పిటిషన్‌ను కొట్టివేసింది. రికార్డుల ప్రకారం తీసుకున్నారు.. 2014లో ఇల్లు కట్టా. ఆక్రమణల తొలగింపులో మొదట తొలగించింది మా ఇంటి ప్రహరీనే. రోడ్డు పక్క ఖాళీగా ఉండడంతో గోడ కట్టా. గతంలో రెండుసార్లు మార్కింగ్ చేసినా చర్యలు తీసుకోలేదు. ఫిబ్రవరిలోనూ మార్కింగ్ చేసినా తొలగించరనుకున్నాం. అధికారులు రెండుసార్లు నోటీసులిచ్చి ప్రతి ఇంటికీ వచ్చి పరిస్థితిని వివరించారు. రికార్డుల్లో ఉన్నట్లుగానే తొలగించాలని వారిని కోరాం. దీంతో మా ఇంటి ప్రహరీ తొలగించారు. ఇదంతా రెండు నెలల క్రితమే జరిగింది. అందరివీ ప్రహరీలు, చిన్నచిన్న షెడ్లు మాత్రమే తొలగించారు. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. – పొన్నంగి శివారెడ్డి, ఇప్పటం ఎవరి ఇల్లూ కూల్చలేదు రోడ్డు విస్తరణకు ఆక్రమణల తొలగింపు కోసం పూర్వం వేసిన సర్వే హద్దు రాళ్లను ప్రామాణికంగా తీసుకున్నారు. హద్దు దాటి కట్టిన నిర్మాణాలను మాత్రమే తొలగించారు. ఇళ్లు ఎవరికి వారు తమ సొంత స్థలంలోనే కట్టుకుని అవకాశం ఉన్నవారు గోడలు, షెడ్లు రోడ్డు ఆనుకుని నిర్మించారు. రెండు నెలల క్రితం తొలగించినప్పుడు ఎలాంటి వివాదం లేదు. ఎవరి ఆస్తులూ పోకపోయినా ఇప్పుడు గొడవలు సృష్టించారు. మా ఇంటి గోడ కూడా ప్రభుత్వ స్థలంలో కట్టిందే. దాన్ని తొలగించి డ్రైనేజీ కట్టారు. – మున్నంగి సాంబిరెడ్డి, బాలకోటిరెడ్డి, ఇప్పటం ప్రభుత్వానిది కాబట్టి ఇచ్చేశాం రోడ్డు ఆనుకుని చిల్లర కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాం. ఆ స్థలం ప్రభుత్వానిది అని తెలుసు. ఖాళీగా ఉందని షెడ్డు వేసుకున్నాం. సర్వే చేసి దాన్ని తొలగిస్తామని అధికారులు ముందుగానే చెప్పి నోటీసులిచ్చారు. ఇంటికి వచ్చి కూడా చెప్పారు. ఇంటిని మాత్రం ముట్టుకోలేదు. ఆ స్థలం ఏదో రోజు తప్పకుండా తీసుకుంటారని తెలుసు. అందుకే అడ్డు చెప్పలేదు. – వీరంకి సుమలత, ఇప్పటం రెండు నెలల క్రితమే 8 ప్రహరీల తొలగింపు ఆది నుంచి టీడీపీ మద్దతుదారులైన యామినేని వెంకట కృష్ణారావు, మల్లిఖార్జునరావు నివాసాలు ఇవి. ఇప్పటంలో కొత్తగా రూ.1.65 కోట్లతో నిర్మించ తలపెట్టిన రహదారి అవసరాల మేరకు అక్రమణలను తొలగించాల్సి వస్తే ఈ ఇద్దరు అన్నదమ్ముల ఇంటి గుమ్మం కూడా కూల్చివేతల పరిధిలోకే వస్తుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వీరిద్దరి ఇళ్లలో ముందువైపు గదుల్లో సగం దాకా ఆక్రమణలు తొలగించాలి. కానీ మానవత్వంతో వ్యవహరించిన ప్రభుత్వం శ్లాబ్ భాగం ఉండే ఇంటిని కూల్చకుండా గుమ్మం ముందు దాదాపు రెండు అడుగుల స్థలం కూడా వదిలేసి మిగిలిన ప్రహరీ గోడను మాత్రమే తొలగించింది. మొత్తం 54 భవనాలు ఆక్రమణల తొలగింపు పరిధిలోకి రాగా అందులో ఎనిమిది ఇళ్ల ప్రహరీలను రెండు నెలల కిత్రమే ఆగస్టు 28వ తేదీన తొలగించారు. ఇళ్లను తాకలేదు మా నాన్న సమయం నుంచి మేం టీడీపీ అభిమానులం. ఆక్రమణల తొలగింపు సమయంలో అధికారులు మా ఇంటికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ప్రహరీ మాత్రమే తొలగించారు. చాలా మంది ఇళ్లు ప్రభుత్వ స్థలంలోకి వచ్చినా అధికారులు వాటిని తాకలేదు. కేవలం ప్రహరీలే తీసేశారు. – యామినేని వెంకట కృష్ణారావు, ఇప్పటం -
బాబు డైరెక్షన్లోనే పవన్: మంత్రి రోజా
తిరుమల: రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బాబు అండ్ కో ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. శ్రీవారి కల్యాణోత్సవంలో ఆమె తన భర్త సెల్వమణితో కలిసి శనివారం పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఏం ఉద్ధరించాడని ఇప్పటం వెళ్తున్నారని ప్రశ్నించారు. అక్కడ ప్రజలకు ఆరు నెలల ముందే నోటీసులు ఇచ్చామని చెప్పారు. దానికి ప్రజల అంగీకారం తెలిపారని గుర్తు చేశారు. గడిచిన మూడేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చర్చించటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. -
పవన్ పిచ్చికూతలు.. బాబు చెత్త ట్వీట్లు
సాక్షి, అమరావతి: కుట్ర రాజకీయాల్లో భాగంగానే పవన్‌కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో ప్రభుత్వంపై పిచ్చి కూతలు కూస్తున్నాడని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీకెండ్లో ప్యాకేజీ స్టార్ వచ్చి నాలుగు సినిమా డైలాగులు చెప్పి.. కథలు అల్లి రాజకీయాలు చేసుకునే వ్యక్తి రక్తాలు చిందిస్తాం అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పార్ట్–1 రెక్కీ, పార్ట్–2 రాయి, పార్ట్–3 ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతతో మూడ్రోజులుగా సీరియల్ డ్రామా నడిపిస్తున్నారన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఇప్పటం గ్రామంలో ఒక్క ఇంటిని కూడా కూల్చలేదు. అక్కడ రోడ్డు విస్తరణ పనులతో తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. జనవరిలో విస్తరణలకు మార్కింగ్ ఇస్తే, ఏప్రిల్–మే నెలల్లోనే మొదటి విడత పనులు ప్రారంభమయ్యాయి. కానీ, తన సభకు స్థలం ఇచ్చారనే కక్షతో ప్రభుత్వం ఇళ్లు కూల్చేసినట్లు పవన్ ఆరోపిస్తుంటే, సిగ్గులేకుండా తానా తందానా అంటూ చంద్రబాబు చెత్త ట్వీట్లు పెడుతున్నాడు. అలాగే, ఇప్పటంలో టీడీపీ, జనసేన పార్టీ వాళ్ల ఇళ్లు కూల్చేశారంటూ పచ్చ పత్రిక ఈనాడులో పిచ్చి రాతలు రాశారు. కళ్లుండి చూడలేని రామోజీరావు హైదరాబాద్‌లో కూర్చుని నిత్యం సీఎం జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. రామోజీ ఇప్పటం వచ్చిచూస్తే వాస్తవాలు తెలుస్తాయి. కూల్చివేతలకు కేరాఫ్ చంద్రబాబు కూల్చివేతలపై మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఆయన హయాంలో పుష్కరాల పేరుతో అనేక ఇళ్లను, గుళ్లను కూల్చేశారు. ఇబ్రహీంపట్నంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని అర్ధరాత్రి కూలగొట్టించి.. బుడమేరు కాల్వలో పడేశారు. మేం అధికారంలోకి వచ్చాక గాంధీ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాం. అలాగే, ఇప్పటంలో గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది. వాటిని పంచాయతీ కార్యాలయంలో భద్రంగా ఉంచాం. త్వరలోనే మళ్లీ ప్రతిష్టిస్తాం. ఆక్రమణల తొలగింపులో భాగంగా రాజశేఖర రెడ్డిగారి విగ్రహం దిమ్మెను కూడా పగులగొట్టారు. ఇక ‘ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతానందని’ ఇడుపులపాయపై హైవే వేస్తామంటూ పిచ్చి కళ్యాణ్ ప్రేలాపనలు చేస్తున్నాడు. గతంలో ఇప్పటంలో సభ పెట్టి గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని కోతలు కోశాడు. ముందు వాటిని ఇచ్చి చూపించాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే పవన్ పనిగా పెట్టుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదు. రూ.250 కోట్ల సుపారీ ఇచ్చి తనపై రెక్కీ నిర్వహించారని చెప్పడం.. రెండ్రోజులు డ్రామా నడపడం సిగ్గుచేటు. రెక్కీపై తెలంగాణ పోలీసులు వాస్తవాలు చెబితే.. వీళ్ల దిమ్మతిరిగింది. పవన్ నీ జోలికి ఎవడు వస్తాడు? నీకు నష్టం చేస్తే తద్వారా లబ్ధిపొందేది ఒక్క చంద్రబాబే. రెక్కీలు, సుపారీలు చేస్తే ఆయనే చేయాలి. జగన్ సర్కార్‌ను ఇంచు కూడా కదల్చలేరు.. కుప్పకూలిపోయిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మా ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ కలలు కంటున్నారు. వీరిద్దరికీ ఒక్కటే చెబుతున్నా.. మా నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదల్చలేరు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని మీరు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, వీధి నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకి దమ్ముంటే 175 స్థానాల్లో టీడీపీ ఒంటరిగా పోటీచేసి ముఖ్యమంత్రి అవుతానని చెప్పాలి. 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్, భీమవరం, గాజువాకల్లో ఎక్కడ పోటీచేస్తే అక్కడ పవన్ ఓటమి ఖాయం. -
కూల్చింది ప్రహరీలే.. ఇళ్లు కాదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఈ ఏడాది మార్చిలో జనసేన సభకు స్థలం ఇచ్చినందునే కక్షసాధింపుతో తమ పార్టీ వారి ఇళ్లను పడగొడుతున్నారంటూ పవన్ తప్పుడు ఆరోపణలు చేశారు. మొత్తం 53 ఇళ్లకు సంబంధించి ఆక్రమణలు తొలగింపు చేపడితే అందులో ఒక్కరే జనసేన సభ కోసం స్థలం ఇచ్చారు. అతను కూడా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో ఆ స్థలం మినహా మిగిలిన స్థలాల్లో ఉన్న ఆక్రమణలను మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. కేవలం ఆక్రమిత స్థలంలో ఉన్న ప్రహరీలు, చిన్నచిన్న దుకాణాలను మాత్రమే తొలగించారు. ఇక ఇప్పటం రోడ్డు ప్రస్తుతం 50–60 అడుగుల వరకూ మాత్రమే ఉంది. రికార్డుల ప్రకారం ఆ డొంక రోడ్డు 73 నుంచి 80 అడుగుల వరకూ ఉండాలి. మిగిలిన భూమిని స్థానికులు ఆక్రమించి ప్రహరీలు నిర్మించగా, కొంతమంది షాపులు కట్టి అద్దెలకు ఇచ్చారు. ఈ రోడ్డును రికార్డుల ప్రకారం 73 నుంచి 80 అడుగుల వరకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఆక్రమణలు తొలగించాలంటూ నోటీసులిచ్చారు. ఎవరూ స్పందించలేదు. మొత్తం 53 అతిక్రమణలు ఉన్నట్లు గుర్తించగా ఒకరు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. మిగిలిన 52 అతిక్రమణలను అధికారులు బుధ, గురువారాల్లో తొలగించారు. ఈ రోడ్డు ఆర్ అండ్ బీది కాగా, డ్రెయిన్ల నిర్మాణం, నిర్వహణ మున్సిపల్ కార్పొరేషన్ చూస్తోంది. ఆక్రమణలను తొలగించే అధికారం స్థానిక సంస్థలకు ఉంటుంది. అయితే, ఇప్పటం గ్రామంలో 120 అడుగుల వరకూ రోడ్డును విస్తరిస్తున్నారని, ఒక గ్రామంలో అంత రోడ్డు ఎందుకంటూ పవన్‌కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. దీనికి ఎల్లో మీడియా కూడా వంతపాడుతోంది. చట్టప్రకారం నోటీసులు జారీచేసి యాభై శాతం ఆక్రమణలు తొలగించే పనుల చేపట్టారు. ఆక్రమణలు మొత్తం 53 వుండగా పంచాయతీ కార్యాలయం పోను మిగిలిన ఆక్రమణలలో కాపులు 28, రెడ్లు 13, బీసీలు 12 మంది ఉండగా.. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులవి మాత్రమే కూల్చుతున్నట్లు పవన్‌కళ్యాణ్‌తో పాటు మిగిలిన రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం దుర్మార్గమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చాకే పనులు చేపట్టారు రోడ్డు విస్తరణలో నా ప్రహరీ పోయింది. అధికారులు నాకు నోటీసు ఇవ్వగా దానిని తీసుకుని సహకరించాను. ఇరవై ఏళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే మార్కింగ్ చేశారు. తర్వాత పట్టించుకోలేదు. జనసేన ఇప్పుడు వచ్చింది.. జనసేన నాయకుల గురించి చేశారనేది అపోహే. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను మాత్రమే తొలగించారు. ఇళ్లు తొలగించలేదు. కేవలం రాజకీయాల కోసమే గ్రామంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. – లచ్చి వెంకటేశ్వరరావు, ఇప్పటం జనసేన ఆరోపణలు కరెక్టు కాదు జనసేన గురించి చేశారనేది పూర్తిగా అవాస్తవం. రోడ్లు వెడల్పుగా లేకపోవడంతో స్కూలు బస్సులు రావడం ఇబ్బందిగా వుంది. ఇప్పటివరకు గ్రామంలో అందరం అన్నదమ్ముల్లా ఉన్నాం. రాజకీయాల కోసం గ్రామాభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు గ్రామంలో అశాంతిని సృష్టించొద్దు. – వీరంకి బాజి, ఇప్పటం ఎవర్ని పరామర్శిస్తారు పవన్‌కళ్యాణ్ ఇప్పటం వచ్చి ఎవరిని పరామర్శిస్తారు. ఆక్రమణలు తొలగించారు కాని ఏ ఒక్క ఇల్లు కూల్చలేదు. పవన్ సభకు భూములిచ్చిన ఏ ఒక్కరి స్థలం పోలేదు. ఒక్కరే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే ఆర్కే రూ ఆరు కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రకటించిన విధంగా గ్రామానికి రూ.50 లక్షలు ఇవ్వాలి. – మోదుగుల బ్రహ్మారెడ్డి, ఇప్పటం -
ఇప్పటం: ‘పవన్.. ఆ 50 లక్షలు ముందు తీసుకురండి’
సాక్షి, గుంటూరు: పవన్ కల్యాణ్‌పై ఇప్పటం గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటంలో ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. రోడ్ల విస్తరణకు ప్రహారీ గోడలు, మెట్లు మాత్రమే తొలగించారు. గ్రామ అభివృద్ధిని పవన్ కల్యాణ్ అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలు తొలగించడానికి అధికారులు ఫిబ్రవరిలోనే మార్కింగ్ చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలంటూ ఏప్రిల్, మే నెలలోనే అధికారులు నోటీసులు ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఇప్పుడు పవన్ వచ్చి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటం అభివృద్ధికి రూ. 50 లక్షలు ఇస్తానన్న పవన్ ఇప్పటికీ ఇవ్వలేదు. పవన్‌కు ఇప్పటంలో పర్యటించే అర్హత లేదంటు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటంలో అధికారులు అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నారని స్థానికులు స్పష్టం చేశారు. పథకం ప్రకారమే ఇప్పటంపై జనసేన కుట్ర చేస్తోంది. మా గ్రామం గురించి పవన్‌కు ఏమీ తెలియదు. ఇప్పటం గ్రామ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. 6కోట్ల నిధులు కేటాయించారు అని గ్రామస్తులు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘పవన్ కల్యాణ్ పనికిమాలిన పిచ్చికూతలు కూస్తున్నాడు’