సాక్షి, గుంటూరు: పవన్ కల్యాణ్‌పై ఇప్పటం గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటంలో ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. రోడ్ల విస్తరణకు ప్రహారీ గోడలు, మెట్లు మాత్రమే తొలగించారు. గ్రామ అభివృద్ధిని పవన్ కల్యాణ్ అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలు తొలగించడానికి అధికారులు ఫిబ్రవరిలోనే మార్కింగ్ చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలంటూ ఏప్రిల్, మే నెలలోనే అధికారులు నోటీసులు ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఇప్పుడు పవన్ వచ్చి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.
ఇప్పటం అభివృద్ధికి రూ. 50 లక్షలు ఇస్తానన్న పవన్ ఇప్పటికీ ఇవ్వలేదు. పవన్‌కు ఇప్పటంలో పర్యటించే అర్హత లేదంటు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటంలో అధికారులు అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నారని స్థానికులు స్పష్టం చేశారు. పథకం ప్రకారమే ఇప్పటంపై జనసేన కుట్ర చేస్తోంది. మా గ్రామం గురించి పవన్‌కు ఏమీ తెలియదు. ఇప్పటం గ్రామ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ. 6కోట్ల నిధులు కేటాయించారు అని గ్రామస్తులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘పవన్ కల్యాణ్ పనికిమాలిన పిచ్చికూతలు కూస్తున్నాడు’
Comments
Please login to add a commentAdd a comment