![Ippatam Case: AP High Court Dismisses writ Petition Filed By Petitioners - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/14/Andhra-pradesh-high-court_1.jpg.webp?itok=OfAxJIwy)
సాక్షి, అమరావతి: ఇప్పటం కేసులో పిటిషనర్లకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో కోర్టును మోసం చేయటంపై 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించింది సింగిల్ బెంచ్. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టులో రిట్ ఆప్పీల్ దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ధర్మాసనం బుధవారం కొట్టేసింది. ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
పిటిషనర్లు అంతా రైతులేనని, వాళ్లకు తెలియక తప్పు చేశారని ధర్మాసానికి తెలియజేశారు పిటిషన్ తరపున న్యాయవాది. దీంతో వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారేగా మీకు తెలియదా అని పిటిషన్ల తరఫున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేయటం మంచిది కాదని తెలిపింది.
చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?
Comments
Please login to add a commentAdd a comment