ఫైల్‌ఫోటో
సాక్షి, అమరావతి: తప్పుడు అఫిడవిట్లు సమర్పించి సానుకూల ఉత్తర్వులు పొందడంపై కన్నెర్ర చేస్తూ 14 మంది ఇళ్ల యజమానులు రూ.లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని సాక్షాత్తూ హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిన తర్వాత కూడా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ‘ఇప్పటం’ అబద్ధాలను ఇంకా కొనసాగించేందుకు సన్నద్ధం కావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నెల 27వతేదీన పవన్‌కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల యజమానులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేస్తారని ఆ పార్టీ పేర్కొంది.
ఇప్పటంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలను రూ.1.65 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నగర పాలక సంస్థ అధికారులు ఈ నెల 4వ తేదీన ఆక్రమణలు తొలగించిన విషయం తెలిసిందే. మానవతా దృక్పథంతో ఇళ్ల జోలికి వెళ్లకుండా ఆక్రమించి కట్టిన ప్రహారీ గోడలు, మెట్లు లాంటి వాటినే అధికారులు తొలగించగా ప్రభుత్వం ఇళ్లను కూల్చి వేసిందంటూ పవన్‌కళ్యాణ్ ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు ప్రయత్నించారు. ఓ వర్గం మీడియా కూడా తప్పుడు కథనాలను ప్రచురించింది. అయితే జనసేన సభకు భూములిచ్చిన రైతులెవరు వారిలో లేరని సాక్ష్యాధారాలతో ఇప్పటికే రుజువైంది.
చదవండి: హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ
Comments
Please login to add a commentAdd a comment