Jana Sena
-
మహిళా ఉద్యోగిపై జనసేన నాయకుల అమానుషత్వం
తణుకు అర్బన్: తనపై పెట్టిన ప్రైవేటు కేసును ఉపసంహరించుకోవాలని చిన్ని అనే జనసేన నాయకుడు మరో సహచర నాయకునితో కలిసి ఒక మహిళా ఉద్యోగినిపై అమానుషత్వం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, తాజాగా తనకు ప్రాణభయం ఉందని వాపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి బాధితురాలు తెలిపిన వివరాలు పరిశీలిస్తే, పంచాయతీ బిల్లు కలెక్టర్‌గా కాంట్రాక్టు పద్ధతిలో నీలం వెంకటలక్ష్మి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతేడాది జూలైలో ఆమె బావ నరసింహస్వామి అలియాస్ అంతర్వేదికి– జనసేన దువ్వ అధ్యక్షుడు శ్రీరాములు దుర్గారావు అలియాస్ చిన్నికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అంతర్వేదికి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్లో దీనిపై కేసు నమోదైంది. సదరు కేసును వెనక్కి తీసుకునేలా అంతర్వేదిని ఒప్పించాలని చిన్ని, జనసేన పార్టీ తణుకు మండల అధ్యక్షుడు చిక్కాల వేణుతో కలిసి ఆమెపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. తలుపులు వేసి మరీ దుర్భాషలు..ఈ నేపథ్యంలో మార్చి 28న ఫీల్డులో ఉన్న వెంకటలక్ష్మిని పంచాయతీ కార్యాలయానికి రావాల్సిందిగా జనసేన నాయకులు ఫోన్ చేశారు. పంచాయతీ కార్యాలయానికి వచ్చిన తరువాత ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. అయితే ఆ ఫిర్యాదుతో తనకు సంబంధం లేదని, అంతర్వేదితోనే మాట్లాడుకోమని ఆమె చెప్పారు.దీంతో రెచ్చిపోయిన నాయకులు ఇరువురు తలుపులు వేసి మరీ చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తున్నట్లు తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో దువ్వ పంచాయతీ కార్యాలయాన్ని కూటమి పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పాలిటిక్స్‌లో బిల్డప్ బాబాయ్ అవతారమెత్తిన పీకే!
-
కిరణ్ రాయల్‌కు ముందే ఎలా తెలుసు?
తిరుపతి: కూటమి ప్రభుత్వంలోని నేతల అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. అరెస్టులు, దాడులు తప్పితే న్యాయం జరగదు. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి చూస్తూనే ఉన్నాం. మరీ ఎక్కువగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే ‘రెడ్‌బుక్’ పాలన షురూ చేస్తారు.ఆంధ్రా బిడ్డకు ఈ అన్యాయమేంటో?.నాకు అన్యాయం జరిగింది మహాప్రభో.. న్యాయం చేయండి.. నేను ఒక జనసేన నాయకుడి చేతిలో మోసపోయాను’ అని అరిచి గీపెట్టుకుంటే ఆమెను అరెస్ట్ చేసిన వైనం ఏమిటో అర్థం కాదు. అది కూడా జైపూర్ పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తారు. ఎక్కడో ముంబై లో ఉండే సినీనటి కాదంబరి జెత్వానిని తీసుకొచ్చి ఆడబిడ్డకు న్యాయం చేస్తాం అంటూ బీరాలు పలికిన కూటమి ప్రభుత్వం.. నేడు ఆంధ్ర ఆడబిడ్డకు జనసేన నేత అన్యాయం చేశాడు అని కేస్ పెడితే రివర్స్ లో పాత కేస్ ఏదో ఉందని ఇప్పుడు ఆ మహిళను అరెస్ట్ చేయించారు.కూటమి ప్రభుత్వంలో ఒక్కో మహిళకు ఒక్కో న్యాయం అనుకుంటా...?అరెస్ట్ అంటూ ముందుగానే జోస్యం?రెండు రోజుల్లో ఆమెను అరెస్ట్ చేస్తారంటూ మీడియా ముఖంగా చెప్పాడు కిరణ్ రాయల్. తిరుపతి జనసేన ఇంచార్జిగా ఉన్న కిరణ్ రాయల్ చేతికి కోటి ఇరవై లక్షలతో పాటు బంగారం కూడా కొంత ఇచ్చి మోసం పోయింది లక్ష్మీ అనే మహిళ. అయితే ఇదే విషయాన్ని బహిర్గతం చేస్తే.. ఆమెపై తిరిగి ఆరోపణలు చేశాడు కిరణ్ రాయల్. ‘ చూడండి.. ఆమె రెండు రోజుల్లో అరెస్ట్ అవ్వుది.. జైపూర్ నుంచి పోలీసులు వస్తారు’ అని చెప్పాడు.ఆమెను అరెస్ట్ చేయడానికి జైపూర్ పోలీసులు వస్తారని కిరణ్ కు ఎలా తెలుసు. ఆమెను ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా పాత కేసును తిరగతోడి రాజస్థాన్ పోలీసుల్ని రప్పించారా? ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు వస్తాయని, ఏకంగా జైపూర్‌కు వెళ్లారా? దీని వెనుక ఉన్నది ఎవరు? అసలు జైపూర్ నుంచి పోలీసుల్ని ఇక్కడకు రప్పించి ఆమెను అరెస్ట్ ేచేయిండంలో చక్రం తిప్పింది ఎవరు? అనే వాదన తెరపైకి వచ్చింది. అదే సమయంలో #saveAPFromRedbookRuling అనేది ‘ఎక్స్’లో ట్రెండ్ అవుతోంది. -
నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా: కిరణ్‌రాయల్
నీ పిల్లల కాళ్లు విరిచేస్తానంటూ జనసేన నేత హెచ్చరిక దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ ఆయన బాగోతంపై మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు మరెంతో మంది కిరణ్‌రాయల్ బాధితులు బయటకొస్తారు మీడియాతో బాధితురాలు లక్ష్మి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా.. నాలుగు రోజుల్లో బెయిల్‌పై బయటకొస్తా.. నీ వల్ల ఏమైతే అది చేసుకో.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. నీ కొడుకులు పెద్దవాళ్లయ్యారని విర్రవీగొద్దు.. వాళ్ల కాళ్లు విరిచేస్తా..’ అంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్‌రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి తీవ్ర దుర్భాషలాడిన ఆడియో కలకలం రేపుతోంది.తనను ప్రేమించి, నమ్మించి తన నుంచి రూ.1.30 కోట్ల నగదు, 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన లక్ష్మీరెడ్డి.. కిరణ్‌రాయల్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫ్.. కైపు.. నైఫ్.. అంటూ లక్ష్మీతో కిరణ్‌రాయల్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కిరణ్‌రాయల్ ఆమెకు ఫోన్ చేసి పైవిధంగా బెదిరించాడు.పత్రికలో రాయలేని భాషలో ఆ మహిళను తిట్టిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కిరణ్‌రాయల్ తనతో ప్రైవేటుగా ఉన్న వీడియో క్లిపింగ్‌ను ఆమె ఆదివారం తెల్లవారు జామున మీడియాకు విడుదల చేసింది. వారిద్దరూ బెడ్‌పై ఏకాంతంగా ఉన్న వీడియో అది. ఆ వీడియోలో లక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాన్ని కిరణ్‌రాయల్ మెడలో వేసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్‌కళ్యాణ్ న్యాయం చేయాలి: బాధితురాలు ఆడబిడ్డకు కష్టం వస్తే నేను అండగా ఉంటానంటున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కిరణ్‌రాయల్ బాధితురాలు లక్ష్మి వేడుకున్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌రాయల్ తనను మోసం చేసి తీసుకున్న డబ్బు, బంగారాన్ని పవన్‌కళ్యాణ్ తనకు ఇప్పించాలని కోరారు. భవిష్యత్తులో మరింత మంది ఆయన బాధితులు బయటకొస్తారని చెప్పారు. కాగా, కిరణ్‌రాయల్‌పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆదివారం లక్ష్మి ఫిర్యాదు చేశారు. తన కుమారులిద్దరినీ చంపేస్తానని కిరణ్‌రాయల్ బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన నగదును ఇప్పించాలని కోరారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలి.. ఇదిలా ఉండగా.. కామాంధుడు కిరణ్‌రాయల్‌ను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లక్ష్మికి అండగా వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై పద్మజ, గీతాయాదవ్, మధుబాల, విజయరాయల్, దుర్గా, రాధ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షుణ్ణంగా పరిశీలించండి : పవన్‌కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తమ పార్టీ నేత కిరణ్‌రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించారు. అతని గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కిరణ్‌రాయల్ పార్టీకి దూరంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కిరణ్‌రాయల్‌పై గతంలోనే లక్ష్మి ఫిర్యాదుఅయినా పట్టించుకోని పోలీసులు తిరుపతి క్రైం: కిరణ్‌రాయల్‌పై 2023 నవంబర్ 23న లక్ష్మీరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు వైరల్‌గా మారింది. లక్ష్మి భర్త బృందకుమార్రెడ్డి 2021 జూన్ 6న అనారోగ్యంతో మరణించాడు. బృందకుమార్రెడ్డికి కిరణ్‌రాయల్ స్నేహితుడు కావడంతో లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని, ఆమె పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటానని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. నా వెనుక పవన్‌కళ్యాణ్ ఉన్నాడు.. ‘నా ఆరి్థక కష్టాలు తీరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను.. నాకు రావాల్సిన డబ్బుతో నీ పిల్లలను చదివిస్తూ నీ దగ్గర తీసుకున్న బంగారు నగలను, డబ్బులను తిరిగి ఇచ్చేస్తా..’ అంటూ ఆయన భార్య రేణుక ముందే కిరణ్‌రాయల్ ఒప్పించాడని లక్ష్మి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక కారు కోసం రూ.పదకొండు లక్షలు, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రూ.కోటీ ముప్పై రెండు లక్షలు, 300 గ్రాముల బంగారు నగలను తీసుకుని.. ఆ తర్వాత తనను పట్టించుకోవడమే మానేశాడని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.అంతటితో ఆగకుండా మరికొందరు అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నట్టు తెలిపారు. డబ్బుల కోసం ఫోన్ చేస్తే ‘నిన్ను, నీ బిడ్డలను నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తా’ అంటూ బెదిరించే వాడని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని, తన వెనుక పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి పెద్ద వాళ్లున్నారని బెదిరించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని ఆధారాలనూ సైతం పోలీసులకు అందించారు. అయితే అప్పట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. -
తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలు.. మహిళ ఆత్మహత్యాయత్నం
తిరుపతి: తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిందో మహిళ. తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ పేర్కొంది. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాను అప్పు చేసి నగలు తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని ఇచ్చానని స్పష్టం చేసింది.‘నావద్ద నుంచి తిరుపతి జనసేన ఇన్చార్జ్గా ఉన్న కిరణ్ రాయల్ అనే వ్యక్తి కోటి 20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ీతీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. నేను కూడా అప్పు చేయడమే కాకుండా ఉన్న నగల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును తెచ్చాను. రూ. 30 లక్షలు ఇచ్చేందుకు ాబాండ్స్, ెచెక్ రాసిచ్చాడు. నన్ను బెదిరించి, భయపెట్టి వీడియో తీసుకున్నారు. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ల వద్ద నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి. నాకు చావే శరణ్యం’ అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది లక్ష్మి అనే మహిళ. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాసేపటికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమెకు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సీఐపై భార్య ఫిర్యాదు -
కోనసీమలో మంత్రి అచ్చెన్నకు జనసేన కార్యకర్తల షాక్
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చారు. పి.గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశంలో గందరగోళం నెలకొంది.జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడతారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటే పవన్ పేరు పలకరా అంటూ నిరసన వ్యక్తం చేశారు.జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించక పోవడంతో టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. దీంతో వివాదం మరింత ముదిరింది. షాక్ తిన్న అచ్చెన్నాయుడు సభ నుంచి వెళ్లిపోయారు. -
వైఎస్సార్ జిల్లా: కూటమి నేతల కుమ్ములాట
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇసుక టెండర్ల దాఖలులో కూటమి నేతలు కొట్లాటకు దిగారు. జిల్లాలో రెండు ఇసుక క్వారీలకు టెండర్లు వేయగా, రంగంలోకి దిగిన బీటెక్ రవి అనుచరులు హల్చల్ చేశారు. ఇద్దరు మీడియా ప్రతినిధులను బీటెక్ అనుచరులు నిర్భంధించారు.సిద్ధవటం మండలం మూలపల్లి ఇసుక క్వారీ విషయంలో బీటెక్ రవి, జనసేన నేతల మధ్య వార్ జరుగుతోంది. ఎవర్నీ టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ జనసేన నేత అతికారి కృష్ణ హల్చల్ చేశారు. పోలీసులపై జనసేన నేతలు దౌర్జన్యానికి దిగారు. చక్రాయపేట మండలం గండికొవ్వూరు ఇసుక రీచ్ టెండర్లలతో బీటెక్ రవి, కడప టీడీపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది.దీంతో మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులపైకి జనసేన నేతలు తిరగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో టెండర్ల స్వీకరణను అధికారులు నిలిపివేశారు. -
కోడి పందాల బరుల దగ్గర బరితెగిస్తున్న టీడీపీ నేతలు
-
నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి : నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్లో అవకాశం ఇవ్వడం లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పవన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..‘భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు.గతంలో జరిగిన ఎన్నికల్లో నాకు కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు వేయలేదు. అందుకే ఇక్కడ అన్నింటిని పక్కన పెట్టి ధైర్యమైన నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నాను.బీసీ, ఎస్సీ,ఎస్టీలు,అధికార, ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారు. జనసేన బలమైన పార్టీగా ఎదిగేదాకా నాకు ఆ వర్గాల నుంచి మద్దతు దొరకడం కష్టం. నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్లో అవకాశం ఇవ్వడం లేదు. నాతో సమానంగా పనిచేశారు. నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఇంకెవరు ఉన్నా ఇచ్చే వాళ్లం. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు.నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత నాతో కలిసి చేసి ఉంటే వాళ్ళకే కేబినెట్ పదవి ఇచ్చే వాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళను వారసత్వంగా చూడలేం. మొదట ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబు కేబినెట్లోకి వస్తారు. వచ్చే ఏడాది మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు’ అని వ్యాఖ్యానించారు. -
అశ్లీల నృత్యాల ఘటనలో 24 మంది అరెస్టు
నిడమర్రు: ఏలూరు జిల్లా బావాయిపాలెంలో జనసేన నేతల అశ్లీల నృత్యాల బాగోతంలో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన జనసేన పార్టీ క్రొవ్విడి గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్, మరో 21 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు ఉన్నట్లు గణపవరం సీఐ సుభాష్ గురువారం తెలిపారు. ఈ అశ్లీల నృత్యాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీఆర్వో భుజంగరావు ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్టయిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 292, 296 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదీ జరిగింది: ఈ నెల 12వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వేడుకలకు హాజరైన వారిలో పలువురు మద్యం సేవించారు. భీమవరానికి చెందిన ఇద్దరు హిజ్రాలతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఈ నృత్యాలను మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల పైనుంచి సెల్ఫోన్లో రహస్యంగా చిత్రీకరించి, బుధవారం సోషల్ మీడియాలో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసి జనసేన నేతలు టీడీపీ వారిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే తొలిసారి: ఈ ప్రాంతంలో ఇలా అశ్లీల నృత్యాలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇదే కొనసాగితే జనసేన నాయకుల ఆగడాలు ఎలా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వైఖరిని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. మరోపక్క ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఇంద్రకుమార్‌ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించారు. -
జనసేన నేతల గ్రామ బహిష్కరణ
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తూ టీడీపీ ఆధ్వర్యాన గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద కేఎస్‌ఈజెడ్‌లో ఇటీవల ఒక కంపెనీ నిరి్మస్తున్న పైప్‌లైన్‌వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని స్థానిక మత్స్యకారులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కొందరు జనసేన నేతలు కంపెనీ వద్ద రూ.6 కోట్లు తీసుకున్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ మేరకు గ్రామంలో గురువారం సమావేశం ఏర్పాటుచేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేనకు చెందిన పల్లేటి బాపన్నదొర, పల్లేటి దారకొండ, పల్లేటి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనుతో పాటు వారి కుటుంబ సభ్యులకు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తులైన ఆరుగురు వ్యక్తులు టీడీపీ నేతలపై దాడికి దిగగా ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారి తరఫున టీడీపీ నేతలు కొత్తపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, దాడిచేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో కోనపాపపేటలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించినట్లు గ్రామస్తుల పేరుతో శుక్రవారం మైక్‌లో ప్రచారం చేశారు. అలాగే, వారి ఫొటోలతో గ్రామంలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటుచేశారు. ఈ నాలుగు కుటుంబాల వారితో ఎవరైనా మాట్లాడినా, వారికి సహకరించినా, వారి దుకాణాల వద్ద ఏ విధమైన వస్తువులు కొన్నా, వారికి చేపలు అమ్మినా, కొన్నా రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు బహిరంగంగా ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి చేరుకుని గ్రామ బహిష్కరణ ప్రచారాన్ని నిలుపుదల చేశారు. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు అధికారులకు ఫిర్యాదు చేయగా.. తమపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టుచేయాలని టీడీపీ నేతలూ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో కొత్తపల్లి పోలీసులు గ్రామంలో పహారా ఏర్పాటు చేశారు. కొండెవరంలో టీడీపీ–జనసేన కుమ్ములాట.. మరోవైపు.. కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో టీడీపీ–జనసేన నేతలు శుక్రవారం కుమ్ములాటలకు దిగారు. గ్రామంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలూ తనకు తెలియడంలేదని, ప్రొటోకాల్ పాటించడంలేదని టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు దుళ్ల సత్తిబాబు ఇటీవల ఎంపీడీవో రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీఓ శుక్రవారం కొండెవరం గ్రామ సచివాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. దీనికి ఎంపీటీసీ సభ్యుడ్ని ఆహ్వానించగా.. ఆయన టీడీపీ నేతలను వెంటబెట్టుకుని సచివాలయానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలూ గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో మీకు పనేంటి.. వెంటనే వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీచేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఇరువర్గాలనూ అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సంఘటనపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. -
అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు!
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల పాత్రలో పరస్పరం సహకరించుకుంటూ అనేక రాజకీయ డ్రామాలను రక్తి కట్టించిన చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ ద్వయం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను అనుసరిస్తోంది! కూటమి ప్రభుత్వంపై కొద్ది నెలల్లోనే తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సరికొత్త డ్రామాకు తెర తీసింది!! రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో సర్కారు దారుణ వైఫల్యాలపై సామాన్య ప్రజలతో పాటు అధికార పక్షంలోనూ వ్యతిరేకత వెల్లువెత్తుతున్న విషయం విదితమే. శాంతి భద్రతల వైఫల్యంపై టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్రతరమవుతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను నమ్మించే యత్నాల్లో నిమగ్నమయ్యారు. దీనిపై ఆయన నిజంగానే నిజాయితీగా వ్యవహరించదలచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా నిలదీసి ప్రశ్నించాలి. లేదంటే మంత్రివర్గంలో తనూ భాగమే కాబట్టి.. ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహించాలి. అయితే అలాంటిదేమీ లేకుండా.. శాంతి భద్రతలను నేరుగా పర్యవేక్షించే ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా.. దళిత మహిళ అయిన హోంమంత్రి అనితపై నెపాన్ని నెట్టేసే విధంగా పవన్ మాట్లాడటాన్ని చూస్తుంటే.. కొత్త డ్రామాను రక్తి కట్టిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం పిఠాపురం పర్యటన సందర్భంగా గొల్లప్రోలు సభలో పవన్‌కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. ‘రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, అరాచకాలు మితిమీరిపోయాయి. పోలీసులు శాంతి భద్రతలను గాలికొదిలేసి మీనమేషాలు లెక్కిస్తున్నారు. బయటకెళ్లాలంటే ప్రజలు ఏం ప్రశ్నిస్తారో అని భయమేస్తోంది. మమ్మల్ని తిడుతున్నారు. వారికి సమాధానం చెప్పలేక బయటకు వెళ్లలేకపోతున్నాం. మూడేళ్ల బాలికపై హత్యాచారం జరిగితే పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఆడబిడ్డల మాన, ప్రాణ రక్షణకు తగిన చర్యలు తీసుకోమని ఎన్నిసార్లు చెబుతున్నా స్పందన కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు ఇసుకలో లాభాలు చూసుకుంటున్నారేగానీ అరాచకాలను ప్రశ్నించడం లేదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఆడపిల్లలను ఇబ్బందులు పెడుతుంటే కూటమి ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పట్టించుకున్నారా?’ అని తాజాగా పవన్ వ్యాఖ్యలు చేశారు. అయితే శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకుగానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనకు గానీ ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా.. హోంమంత్రి అనిత ఇందుకు బాధ్యత వహించాలంటూ పవన్‌కళ్యాణ్ ఆ సభలో డిమాండ్ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అందుకు బాధ్యత బాబుదే కదా..! హోంమంత్రి అనిత అయినప్పటికీ వాస్తవానికి శాంతి భద్రతల విభాగం పూర్తిగా ముఖ్యమంత్రి ఆ«దీనంలో కొనసాగుతుంది. మూడేళ్ల చిన్నారులపై అత్యాచారాలు జరిగినా, ఆడబిడ్డలపై లైంగిక దాడులు, హత్యాచారాలు చోటు చేసుకున్నా అవన్నీ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కిందకే వస్తాయి. అలాంటప్పుడు ఉప మఖ్యమంత్రి మాట్లాడిన మాటల ప్రకారమే.. శాంతి భద్రతల శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలి. ఇందుకు విరుద్ధంగా మహిళా మంత్రి, పైపెచ్చు దళిత మంత్రి అయిన హోంమంత్రి అనిత వీటికి బాధ్యత తీసుకోవాలని పవన్‌కళ్యాణ్ డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘హోంశాఖ మంత్రిగా మీరు బాధ్యత వహించండి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, హత్యలను పట్టించుకోండి. నేను హోంశాఖను తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకున్నానంటే పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తోడుదొంగల డ్రామాను బహిర్గతం చేస్తున్నాయని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు భీషణ ప్రతిజ్ఞలు.. ఇప్పుడు భయమేస్తోందంటూ! ఎన్నికల్లో చంద్రబాబుతో కలసి కూటమిగా పోటీ చేసిన పవన్‌కళ్యాణ్ పలు సభల్లో ఆయన తరపున కూడా తానే హామీలిచ్చేశారు. ‘రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ఏ ఆడ్డబిడ్డపైనా అఘాయిత్యం జరగకుండా బలమైన చట్టాలు తెస్తాం..’ అని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై వరుసగా అఘాయిత్యాలు, చిన్నారులపై అకృత్యాలు జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ కనీసం ఖండిస్తూ ప్రకటనలు కూడా ఇవ్వలేదని సర్వత్రా విమర్శలున్నాయి. జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తమను తిడుతున్నారని.. జనంలోకి వెళ్లాలంటే భయమేస్తోందని పవన్ స్వయంగా పిఠాపురం సభలో చెప్పారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకతను హోంమంత్రి పైకి మళ్లించి వైఫల్యాల నుంచి చంద్రబాబు, తాను బయట పడే వ్యూహాన్ని పవన్‌కళ్యాణ్ ఎంచుకున్నారు. ప్రభుత్వమంటే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మొత్తానిది ఉమ్మడి బాధ్యత అని గుర్తులేదా? పవన్‌కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందంటే.. మంత్రివర్గం మొత్తం వైఫల్యం కిందకే వస్తుందని రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ప్రైవేటీకరణ ఆపకుంటే.. కూటమి నుంచి వైదొలగాలి..
సీతమ్మధార: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం తక్షణమే ఆపాలని.. లేకుంటే టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రానికి తమ మద్దతును ఉపసంహరించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వినర్ వీవీ రమణమూర్తి డిమాండ్ చేశారు. పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును.. ఇప్పుడు ఉద్యమించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో రాజకీయ పార్టీలకతీతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం మహా పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై ఆయన ప్రసంగించారు. ఆనాడు తమనంపల్లి అమృతరావు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఊపిరి స్టీల్ ప్లాంట్ అని, ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో పోరాడి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకుని సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, రూ.10 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలని, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని, బదిలీలను నిలిపివేసి నిర్వాసితులందరికీ ఉద్యోగాలిచి్చ.. కాంట్రాక్ట్ కార్మికుల్ని క్రమబదీ్ధకరించాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని తదితర తీర్మానాలను రమణమూర్తి సభలో చదివి వినిపించారు. తరలి వచ్చిన జనవాహిని అంతకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ జన సంద్రమైంది. మార్గంమధ్యంలో ప్రజలు ఈ యాత్రకు నీరాజనాలు పలికారు. ర్యాలీకి సంఘీభావంగా దారి పొడవునా పలువురు వ్యాపారులు మద్దతు పలికారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు మహా పాదయాత్ర చేరగానే అక్కడ ఉద్యమ పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉద్యమకారులు చేసిన నినాదాలతో ప్రజా ఉద్యమ వేదిక సభా ప్రాంగణం దద్ధరిల్లింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు తిలక్, నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ బాలమోహన్‌దాస్, భారత నాస్తిక సమాజం జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామమూర్తి వై.నూకరాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కేఎస్ చలం, మురికివాడల సంక్షేమ సంఘం తరఫున కె.రవికుమార్, ఇసరపు లక్ష్మి, హెచ్ఆర్ఎఫ్ నుంచి శరత్, ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున కె.అన్నపూర్ణ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట కార్యదర్శి అత్తిలి విమల, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం, దళిత సేన అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్, వివిధ ప్రజా సంఘాలు, అఖిలపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి లడ్డూపై ఉన్న శ్రద్ధ స్టీల్ ప్లాంట్‌పై లేదుసీతమ్మధార: రాష్ట్ర ప్రభుత్వానికి తిరుపతి లడ్డూతో రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ధ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణపై లేదని అఖిలపక్ష సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా సెయిల్‌లో విలీనం చేయాలని, ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలని మాజీ వీసీ ప్రొఫెసర్ చలం, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యాన్నారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు లోకనాథం డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల జేఏసీ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి0ది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున నిరహార దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని చెప్పిన నాయకులు నేడు బీజేపీ చర్యల్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అఖిలపక్ష కార్మిక, ప్రజ సంఘాల పోరాట కమిటీ జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, వైస్ చెర్మన్ నాగభూషణం, మన్మథరావులు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు స్టీల్ ప్లాంట్‌ను బీజేపీకి తాకట్టుపెట్టే విధానాలు అవలంభిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు, సీఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి ఎ.కనకారావు, ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి కె.శంకరావు, ఏపీఎఫ్‌టీయూ కె.దేవా, మల్లన్న, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
జనసేన నేత వ్యాఖ్యలను ఖండించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు
-
కాళ్లు పట్టుకో.. వదిలేస్తా
చిలకలపూడి(మచిలీపట్నం): కూటమిలో వర్గపోరుకు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బ్యానర్ చించిన ఘటనలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. టీడీపీ నేత ఒకరు రంగప్రవేశం చేసి, జనసేనలోని ఓ వర్గం నాయకుడితో కాళ్లు పట్టించుకొని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. చివరకు పరస్పరం కేసులు పెట్టుకున్నారు.ఇదీ జరిగింది..కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరం పరాసుపేట సెంటరులో జనసేన పార్టీకి చెందిన ఓ వర్గం నాయకులు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి బ్యానరు కట్టారు. ఈ బ్యానర్లో అదే పార్టీకి చెందిన యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు ఫోటోలు లేవు. తమ ఫొటోలు లేకుండా తమ నుంచి చందాలు ఎలా తీసుకుంటారని నాని సోమవారం అక్కడి నిర్వాహకులను ప్రశ్నించారు. అక్కడి బ్యానర్‌ను నాని చేతితో కొట్టడంతో అది చిరిగిపోయింది. దీంతో బ్యానర్ ఏర్పాటు చేసిన వర్గం నానితో వాగ్వాదానికి దిగింది. నాని క్షమాపణ చెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. సోమవారం సాయంత్రం నాని మద్యం సేవించి వచ్చి ఆ బ్యానర్‌ను పూర్తిగా చించేశాడు. దీంతో బ్యానర్ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్లి సామాన్లను ధ్వంసం చేశారు. వారిద్దరినీ రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టి వచ్చేశారు. నాని తిరిగి తమపై దాడి చేస్తారన్న భయంతో టీడీపీ నాయకుడు శంకు శ్రీను, మరికొందరిని తీసుకొని నాని, శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్లారు. వారిద్దరినీ కా ళ్లతో తంతూ చితకబాదారు. జనసేన నాయకుడు నాని టీడీపీ నాయకుడు శంకు శ్రీనును కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు వదల్లేదు. చివరికి రెండు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు చిలకలపూడి సీఐ అబ్దుల్ నబీ తెలిపారు. -
గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు
గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడ కూటమి పార్టీల్లో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. పట్టణంలోని నాగవరప్పాడు సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవలే ఏర్పాటు చేసిన ఆ జెండా దిమ్మను ప్రారంభించడానికి వీల్లేదని, దానిని తొలగించాలని టీడీపీ నేత దారం నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం అర్ధరాత్రి నరసింహారావుకు జన సైనికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరసింహారావు పలుగుతో జెండా దిమ్మను ధ్వంసం చేశాడు.ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ జనసేన కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నరసింహారావు వెళ్లిపోయారు. వెంటనే జనసేన కార్యకర్తలు ఎంఎన్‌కె రహదారిపై బైఠాయించారు. నరసింహారావును అప్పగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తే అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనసైనికులు ఆందోళన విరమించి బైక్ ర్యాలీగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నరసింహారావుపై ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసిన దారం నరసింహారావును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని బూరగడ్డ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆధిపత్యం కోసం దారం నరసింహారావు పట్టణంలో వర్గ విభేదాలు సృష్టించి సంఘ విద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ ఉల్లంఘనే
సాక్షి, అమరావతి: వక్ఫ్ బోర్డు నిబంధనల్లో సవరణలు చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఏపీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ స్పష్టంచేశారు. పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించడంపై ఆయన హర్షంవ్యక్తంచేశారు. ఈ మేరకు మునీర్ అహ్మద్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వక్ఫ్ భూములు పట్టణ ప్రాంతాల్లో అతి విలువైనవిగా ఉండటంతో వాటిని కొట్టేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం మనోభావాలను గొప్ప మనసుతో అర్థం చేసుకుని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించి మైనార్టీలకు మరోసారి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ తెచ్చిన వక్ఫ్ సవరణలకు మద్దతు పలికిన టీడీపీ, జనసేన కూటమి ముస్లింలకు తీరని ద్రోహం చేశాయన్నారు. ముస్లింలకు టీడీపీ వ్యతిరేకం: నాగుల్‌మీరా ఎన్నికల ప్రచారంలో ముస్లింల హక్కులను కాపాడతానని నమ్మించి, నేడు కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజ ఆస్తులను కాజేయాలనే కుట్రతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తీసుకొస్తే సంపూర్ణ మద్దతు ఇచ్చిన టీడీపీ మరోసారి ముస్లింల వ్యతిరేక పార్టీ అని తేటతెల్లమైందని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా అన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు తాము వ్యతిరేకమని పార్లమెంటులో తెలిపిన వైఎస్సార్సీపీకి ముస్లిం సమాజం రుణపడి ఉంటుందని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ టీడీపీకి మద్దతు ఇచ్చిన ముస్లిం మైనార్టీ సంఘాలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ముస్లిం సమాజంలో తిరుగుతాయని ప్రశ్నించారు. కాగా, వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం చంద్రబాబు, మంత్రి ఫరూఖ్‌ను పలు మైనారిటీ సంఘాల నాయకులు కలిసి వినతిపత్రాలు అందజేశారు. -
ఇదేం రూల్?.. విశాఖ ఎలక్షన్ కోడ్‌లో అధికారుల ఓవరాక్షన్
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారు. కానీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం ముసుగు వేయకుండా వదిలేశారు. అంతే కాకుండా కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకుండా వదిలిపెట్టారు. విశాఖ నగరంలో ఎక్కడికక్కడ కూటమి నాయకుల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలివేయడంపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు లెక్క చేయకపోవటం గమనార్హం. ఇక.. ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
చంద్రబాబు సర్కారుపై.. ఉపాధ్యాయుల ఆగ్రహజ్వాల
సాక్షి నెట్వర్క్: గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్)ను రద్దుచేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేరుస్తామని మాటిచ్చి ఇప్పుడు నాలుక మడతేయడంపై ఆయా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా వ్యవహరిస్తున్న టీడీపీ–జనసేన–బీజేపీ ప్రభుత్వంపై అవి తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దొడ్డిదారిన ఉత్తర్వులు జారీచేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి. జీపీఎస్ అమలుపై జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. విశాఖ నగరంలోని ఎన్ఏడీ సెంటర్లో గెజిట్ ప్రతులను దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత ప్రభుత్వాన్ని సీపీఎస్ రద్దుచేయాలని కోరితే జీపీఎస్ అమలుచేస్తామని చెప్పిందని, కానీ.. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు మాత్రం రద్దుచేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జీపీఎస్‌ను అమలుచేస్తూ రాజపత్రాన్ని విడుదల చేయటం.. అది కూడా 2023 అక్టోబరు నుంచి అమలుచేస్తున్నట్లు పేర్కొనడం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమేనని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ గెజిట్‌ను తక్షణమే రద్దుచేయాలని, పాత పెన్షన్ విధానమే అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. అల్లూరి జిల్లా చింతూరు, పాడేరుల్లోనూ ఉపాధ్యాయులు జీఓ కాపీని దగ్ధంచేశారు. » కూటమి ప్రభుత్వం గురువులను మోసం చేసిందని విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆరోపించి గెజిట్ కాపీలను దగ్ధంచేశారు. పాత పెన్షన్ విధానాన్ని తమతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని ఆశించామని.. బాబు ఎప్పటిలాగే మోసం చేశారని మండిపడ్డారు.» శ్రీకాకుళం జిల్లాలోనూ పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. సోంపేటలో గెజిట్ కాపీలు దగ్ధం చేశారు. రాజపత్రాన్ని విడుదల చేయటం దుర్మార్గమని నేతలన్నారు. » ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కూడా ఆందోళనలు జరిగాయి. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జీపీఎస్ గెజిట్ కాపీలను దగ్ధం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే పోరాటం చేయాల్సి వస్తోందన్నారు.» ఏలూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతుంటే పాత తేదీతో జీఓ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. » కృష్ణాజిల్లా అవనిగడ్డలోని యూటీఎఫ్ కార్యాలయం ముందు నేతలు గెటిజ్ పత్రాలను దగ్ధం చేశారు. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ అమలుచేస్తామని చెప్పారని.. కానీ, ఇప్పుడిలా చేయడం చాలా దుర్మార్గమని నాయకులు ఫైర్ అయి పెద్దఎత్తున నినాదాలు చేశారు. » గుంటూరు యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు జీఓ జీవో ప్రతులను దగ్ధంచేశారు. జీపీఎస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు ఇందులో పాల్గొన్నారు.» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి గెజిట్ ప్రతులను దగ్ధంచేశారు. కూటమి ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నేతలు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చలేకుంటే ఇవ్వడం ఎందుకని వారు ప్రశ్నించారు.» కర్నూలు కలెక్టరేట్, మహత్మగాం«ధీ విగ్రహం దగ్గర జీపీఎస్ గెజిట్ పత్రాలను యూటీఎఫ్ నాయకులు దగ్ధంచేశారు. సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగుల కోసం మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన వారు ఇప్పుడు మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తక్షణమే జీపీఎస్ గెజిట్‌ను వెనక్కి తీసుకోవాలన్నారు. నంద్యాలలోనూ గెజిట్ పత్రాలను కాల్చివేశారు.» వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల ఆందోళనలు చేశారు. కడపలోని కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ నాయకులు జీపీఎస్ రాజపత్రాలను దగ్ధం చేశారు. జీపీఎస్ అమలును నిలిపివేయకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, ఇతర నేతలు హెచ్చరించారు.» జీపీఎస్ గెజిట్ విడుదల దుర్మార్గమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ చిత్తూరులో ఆరోపించారు. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
ఏదీ మా ‘నిధి’?
సాక్షి, అమరావతి: కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందచేస్తామన్న సీఎం చంద్రబాబు ఇంతవరకూ ఆ హామీ అమలు ఊసే ఎత్తకపోవడం, తొలి సంతకాలలో ఆ ప్రస్తావనే లేకపోవడం, ఇప్పటికే జూన్‌లో సాయం అందక నష్టపోయిన నేపథ్యంలో కనీసం బకాయిలతో కలిపి అయినా చెల్లిస్తారా? అనే ఆందోళన కోట్లాది మంది అక్కచెల్లెమ్మల్లో వ్యక్తమవుతోంది. 19 – 59 ఏళ్ల వయసు మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజాగళంలో హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య, వితంతు తదితర పింఛన్లు తీసుకుంటున్న దాదాపు 38 లక్షల మంది మహిళలను మినహాయించినా కూటమి మేనిఫెస్టో ప్రకారం 1.72 కోట్ల మందికిపైగా అక్క చెల్లెమ్మలు రూ.1,500 చొప్పున ప్రతి నెలా సాయం పొందేందుకు అర్హులని స్పష్టమవుతోంది. ఈ హామీ అమలులో జరుగుతున్న జాప్యంతో అక్కచెల్లెమ్మలు నెలకు రూ.2,588 కోట్ల చొప్పున ఏడాదికి రూ.31,065 కోట్లు దాకా నష్టపోతున్నారు. జూన్‌లో ఇప్పటికే రూ.2,588 కోట్లు నష్టపోయారు. పోనీ భవిష్యత్తులో ఇచ్చే డబ్బులు బకాయిలతో కలిపి ఇస్తారా? అనే అనుమానాలు మహిళల్లో వ్యక్తమవుతున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి ‘ఆడబిడ్డ నిధి’ నుంచి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈమేరకు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ – ఇది బాబు ష్యూరిటీ’ పేరుతో ఇంటింటికీ చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాలను పంచారు. అధికారం దక్కించుకునేందుకు ఎడాపెడా హామీలు గుప్పించిన కూటమి నేతలు హామీల అమలుపైనా అంతే ఉత్సాహం చూపాలని ప్రజానీకం కోరుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ – జనసేన– బీజేపీ కూటమిగా పోటీ చేసినా కమలనాథులతో సంబంధం లేకుండా సూపర్ సిక్స్ పేరిట టీడీపీ, షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన రూపొందించుకున్న అంశాలతో ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏడాది ముందే బాబు సంతకంతో గ్యారెంటీ కార్డులు..ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ప్రతి ఇంటికీ తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున సాయంతోపాటు సూపర్ సిక్స్‌లోని అన్ని అంశాలను కచ్చితంగా అమలు చేస్తారని నమ్మబలుకుతూ ‘గ్యారెంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని, తమను గెలిపించాలని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి బహిరంగ సభలోనూ చంద్రబాబు అభ్యర్థించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు తనది గ్యారంటీ అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సైతం ఎన్నికల ప్రచార సభల్లో, రాజకీయ వేదికలపై ప్రకటించారు. ఎన్నికలు ముగిసి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్‌కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో కొనసాగుతున్న నేపథ్యంలో జాప్యం చేయకుండా మేనిఫెస్టో హామీలను నెరవేర్చి తమకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని మహిళలు కోరుతున్నారు.1.72 కోట్ల మంది నిరీక్షణ..కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఓటర్లుగా నమోదైన వారిలో 19–59 ఏళ్ల వయసు మహిళలంతా చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి నెలా రూ.1,500 చొప్పున పొందేందుకు అర్హులేనని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పింఛన్లు పొందుతున్న మహిళలను మినహాయించినా 1.72 కోట్ల మందికిపైగా ఈ పథకానికి అర్హులేనని పేర్కొంటున్నారు. హామీ అమలులో ఆలస్యం కారణంగా వారంతా ప్రతి నెలా రూ.2,588 కోట్ల చొప్పున నష్టపోతున్నారని గుర్తు చేస్తున్నారు.నాడు మొహం చాటేసిన జనసేనానిఎన్నికల హామీలను చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ అమలు చేస్తారా? లేదంటే 2014 తరహాలో మరోసారి మోసం చేస్తారా? అనే చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. 2014లోనూ టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యతను నెత్తికెత్తుకున్నానని, అమలు చేయకుంటే నిలదీసే బాధ్యత తనదేనంటూ నమ్మకంగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మొహం చాటేసిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉండగా హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబును నాడు జనసేనాని కనీసం ప్రశ్నించని వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతు రుణాల మాఫీతోపాటు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాడు కుప్పలు తెప్పలుగా హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా నిలువునా వంచించిన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా మేనిఫెస్టోను సైతం టీడీపీ వెబ్సైట్ నుంచి మాయం చేయడం గమనార్హం.డ్వాక్రాకు ద్రోహం..బేషరతుగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఐదేళ్లలో 70 లక్షల మందికి పైసా కూడా మాఫీ చేయకపోవడంతో పొదుపు సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్‌పీలు (నిరర్థక ఆస్తులు)గా మిగిలాయి. సంఘాలు రుణాలు కట్టకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలిచ్చేందుకు నిరాకరించాయి. నాడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత తమ ప్రభుత్వం డ్వాక్రా రుణహామీని అమలు చేయలేదని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించడం గమనార్హం.అన్నదాతకు వెన్నుపోటు..2014 ఎన్నికల నాటికి రాష్ట్రంలో రైతుల పేరిట రూ.8,7612 కోట్లు వ్యవసాయ రుణాలు ఉండగా కోటయ్య కమిటీ పేరుతో కాలయాపన చేసిన చంద్రబాబు కోతలు వేసి విడతలవారీగా అంటూ అరకొర మాఫీతో సరిపుచ్చారు. రైతు సాధికారికత పేరుతో టీడీపీ సర్కారు ఇచ్చిన రుణ బాండ్లు చెల్లుబాటు కాక చిత్తు కాగితాల్లా మిగిలిపోయాయి. -
రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి శ్రేణులు చేస్తున్న దాడులు, విధ్వంసాలను అరికట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరింది. వైఎస్సార్సీపీ నేతలు, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నేతృత్వంలోని పార్టీ బృందం శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి, ఈమేరకు వినతిపత్రం అందించింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు పేట్రేగిపోతున్నాయని ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయని తెలిపింది. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, అస్థిరత నెలకొందని వివరించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపింది. తక్షణమే జోక్యం చేసుకొని టీడీపీ అరాచకాలకు అడ్డకట్ట వేయాలని గవర్నర్‌ను వైఎస్సార్సీపీ బృందం కోరింది. అనంతరం వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి మీడియాతో మట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల ధ్వంసం జరుగుతున్నా సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం : వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులుగా టీడీపీ, జనసేన శ్రేణులు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైన, ఇళ్లపైన దాడులు చేస్తున్నారని, దారుణంగా అవమానిస్తున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు చేస్తున్నారని, పారీ్టకి చెందిన, వైఎస్సార్ పేరు ఉన్న శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. అయినా పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదన్నారు. కనీసం కేసులు కూడా నమోదు చేయడంలేదని అన్నారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. అయినా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదన్నారు. దాడులు, విధ్వంసం కొనసాగుతూనే ఉందని అన్నారు. వైఎస్సార్సీపీకి ఓట్లేసిన దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాలను కూడా తగలబెడుతున్నారని అన్నారు. పరిస్థితులు దారుణంగా ఉండటంతో తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. హింసాత్మక ధోరణి కొనసాగరాదు : ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వాళ్లు విజయాన్ని ఆస్వాదిస్తూ ఒక పద్ధతిలో ఓడిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చేలా ఉండాలని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 2014 –19లో చంద్రబాబు తెచ్చిన జీవో, నిబంధనల ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని తెలిపారు. నిబంధనల ప్రకారమే పార్టీ ఆఫీసుల నిర్మాణం జరుగుతోందని, ఇవి అక్రమ నిర్మాణాలు కాదని స్పష్టం చేశారు. అయినా వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందంటూ దు్రష్పచారం చేస్తున్నారన్నారు. ఒక్కో ఆఫీసు 10 వేల చదరపు అడుగులు ఉంటుందని, ఈరోజు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు ఉందన్నారు. అంటే ఒక్కో ఆఫీసు నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇలా ఇప్పటి వరకు 18 ఆఫీసులకు దాదాపు రూ.60 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. కానీ రూ.500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లు ప్రజాధనం దురి్వనియోగమైనట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్,, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ ఆఫీసుల్లోకి ప్రవేశించి బెదిరింపులు గతంలో టీడీపీ ప్రభుత్వంలో వాళ్ల పార్టీ భవనాలకు, బీజేపీ ఆఫీసులకు, కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులకు స్థలాలు మంజూరు చేసిన విధంగానే, ఆ నిబంధనల ప్రకారమే వైఎస్సార్సీపీ ఆఫీసులకు స్థలాలు తీసుకున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్నాక భవనాలు నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణం పూర్తయ్యే వాటి వద్దకు వెళ్లి టీడీపీ, జనసేన కార్యకర్తలు అక్కడున్న తమ కార్యకర్తలు, సిబ్బందిని బెదిరించి భవనాలను కూలగొడతామంటున్నారని, వీటన్నింటినీ అడ్డుకోవాలని గవర్నర్‌ని కోరామని తెలిపారు. వీటికి సంబంధించి ఫొటోలను కూడా గవర్నర్‌కు చూపించామన్నారు. కొన్ని ఫొటోలను చూసి ‘ఇంత దారుణంగా పరిస్థితి ఉందా’ అని గవర్నర్ చాలా ఆశ్చర్యపోయారని తెలిపారు. -
అటు ప్రమాణం.. ఇటు విధ్వంసం
సాక్షి నెట్వర్క్: ఒకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, కూటమి శ్రేణులు మరింత రెచ్చిపోయి విధ్వంసాలకు దిగాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల పేర్లు మార్చేశారు. ప్రగతి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను నేలకూల్చారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై టీడీపీ జెండాలు కట్టారు. వైఎస్సార్సీపీ జెండాదిమ్మెల్ని ధ్వంసం చేశారు. అనంతపురం రూరల్ మండలం కాటిగానికాలువ గ్రామంలో రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు కాటిగానికాలువ రైతుభరోసా కేంద్రంలోకి కేక్ తీసుకొచ్చి కట్ చేశారు. అనంతరం బయటకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఒక మహిళ చేతికి సుత్తి ఇచ్చి పగులగొట్టించారు. తర్వాత ఇద్దరు కార్యకర్తలు ఆ శిలాఫలకాన్ని బయటకు తీసుకెళ్లి పూర్తిస్థాయిలో ధ్వంసం చేశారు. సచివాలయ భవనంపైకెక్కి టీడీపీ జెండా కట్టారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ కార్యాలయ భవనంపై కట్టిన టీడీపీ జెండాను పీకేయించారు. ఈ ఘటనపై మహిళా పోలీసు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన కేసులో వీడియో ఆధారంగా అదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, రామాంజనేయులు, చంద్రమౌళినాయుడుపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే కొందరు బెదిరింపులకు దిగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎవరైనా బెదిరిస్తే బాధితులు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బెదిరించేవారిపట్ల పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. » కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామంలో విధ్వంసానికి పాల్పడ్డారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని ప్రజలు చూసేందుకు పంచాయతీ అధికారులు రైతుభరోసా కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు పేకేటి దొరబాబు, తదితరులు అక్కడున్న ఆర్బీకే ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని కరపత్రాలు, అధికారిక పత్రాలను తగులబెట్టారు. ఇదెక్కడి దౌర్జన్యం అంటూ సర్పంచ్ భర్త ఆకుల వీరబాబు నిలదీశారు. దీంతో దొరబాబు, వీరబాబు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ రవికుమార్, ఎస్ఐ వెలుగుల సురేష్ అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. » చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని అగరం గ్రామ పంచాయతీలో సచివాలయం భవనం ప్రారంభోత్సవం నాడు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అప్పటి మంత్రి రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని పగులగొట్టారు. ఈ విషయమై బుధవారం స్థానికులు అధికారులకు ఫిర్వాదు చేశారు. » తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) కార్యాలయానికి ఉన్న డాక్టర్ వైఎస్సార్ పేరును దౌర్జన్యంగా తొలగించారు. ఆ స్థానంలో ఎన్టీఆర్ పేరు ఏర్పాటు చేశారు. కార్యాలయం లోపల ఉన్న వైఎస్సార్ ఫొటో అక్కడి నుంచి తొలగించారు. » కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లిలో శిశు విద్యామందిర్ వద్ద ఉన్న 45వ డివిజన్ సచివాలయానికి పసుపు పచ్చని నూతన బోర్డు ఏర్పాటు చేశారు. ఆ డివిజన్ టీడీపీ నాయకుడు పి.వి.ఫణికుమార్‌తో కలిసి నాయకులు, కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి పవన్‌కళ్యాణ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి చిత్రాలతో తయారు చేసిన సచివాలయం బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటుకు సచివాలయ సిబ్బంది సహకరించారు. ఫణికుమార్ కేక్ కట్ చేశారు. » శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డికాలనీలో వైఎస్సార్సీపీ జెండాను, స్థూపాన్ని, శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని నెల్లూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు ఎస్కే జమీర్‌అహ్మద్, పలువురు పార్టీ నాయకులు పరిశీలించారు. » చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తయిండ్లు గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను ధ్వంసం చేశారు. మొదటి నుంచి టీడీపీకి పట్టున్న గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను గెల్చుకున్న వైఎస్సార్సీపీ వర్గీయులు జెండా ఎగురవేసారు. అప్పటి నుంచి వైఎస్సార్సీపీపై అక్కసు వ్యక్తంచేస్తున్న టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి జెండా పీకేసి స్థూపాన్ని ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు. » శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఆర్.హెచ్.పురంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మంగళవారం రాత్రి కూల్చివేశారు. గ్రామంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అనంతరం విద్యుత్ సరఫరా నిలిపేసి సుమారు 15 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి పొదల్లో పడేశారు. దీనిపై కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు.» ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన నాయకులు బుధవారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు సచివాలయం–2 భవనం ప్రారంభ సమయంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల వద్ద బాణసంచా కాలుస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ మణికుమార్ చెప్పారు. » తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపుసావరం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ శృతితప్పింది. మోటారు సైకిళ్లపై ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు గ్రామంలోని జక్కంపూడి గ్రామ మోహన్‌రావు మల్టీపర్పస్ సెంటర్ గేట్లు తెరుచుకుని గ్రౌండ్లోకి ప్రవేశించారు. అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు. కళ్యాణ మంటపం గోడపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల పేర్లున్న శిలాఫలకాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు రాళ్లు విసిరారు. దీంతో పలు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. శిలాఫలకం పాక్షికంగా దెబ్బతింది. -
జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్
-
గుడి కోసం టీడీపీ–జనసేన కుమ్ములాట
పిఠాపురం/సాక్షి, అమరావతి : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో రెండ్రోజుల క్రితం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కారుపై జనసేన శ్రేణుల దాడి ఘటన మరువక ముందే.. అదే మండలం తాటిపర్తి గ్రామంలోని అపర్ణాదేవి ఆలయ నిర్వహణ విషయంలో రెండు పార్టీలు ఆదివారం మళ్లీ కుమ్ములాడుకున్నాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలు తమదేనని టీడీపీ నేతలు.. కాదు తమదేనంటూ జనసేన నేతలు రచ్చకెక్కారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలివీ..తాటిపర్తి అపర్ణాదేవి ఆలయ నిర్వహణ విషయంలో గ్రామంలో పూర్వం నుంచీ ఒక ఆనవాయితీ ఉంది. నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా నెగ్గితే ఆ పార్టీకి చెందిన నేతలు ఐదేళ్లూ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. వారి ఆధ్వర్యంలోనే ఉత్సవాల వంటి అన్ని కార్యక్రమాలూ నిర్వహిస్తారు. ఇప్పటివరకూ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన నాయకులు ఆలయ బాధ్యతలు చూసేవారు. ఇటీవల టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆలయ బాధ్యతలు అప్పగించేస్తామంటూ వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ, జనసేన నాయకులకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్దకు వస్తే అందరి సమక్షంలో ఆలయ తాళాలు ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో కూటమి నేతలు ఆదివారం ఉదయం ఆలయం వద్దకు వచ్చారు. పిఠాపురంలో జనసేన నెగ్గడంతో ఆ పార్టీకి చెందిన నేతలకు వైఎస్సార్సీపీ నాయకులు అందరి సమక్షంలో ఆలయ తాళాలు అందజేశారు. దీనికి గ్రామస్తులందరూ ఆమోదం తెలిపారు.సంయమనం పాటించాలి : నాగబాబుమరోవైపు.. ఈ ఘటనపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందిస్తూ.. కూటమి సభ్యుల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన ఘటన వివరాలు సేకరిస్తున్నామని, ఇందులో తమ పార్టీ వారు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాటిపర్తిలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై కూడా నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పదిరోజుల్లో పవన్ పిఠాపురం వస్తారని చెప్పారు.వివాదానికి టీడీపీ ఆజ్యం..అయితే, ఈ విషయం టీడీపీ నియోజకవర్గ నేతకు తెలిసింది. జనసేనను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న ఆ నేత టీడీపీ వారికే ఆలయ పెత్తనం ఇచ్చేలా పట్టుబట్టాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో అప్పటివరకూ అన్నింటికీ అంగీకారం తెలిపిన టీడీపీ నేతలు.. ఒక్కసారిగా వివాదానికి తెరలేపారని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల్లో నెగ్గింది జనసేన అయినా గెలిపించింది తామేనని.. అందుకే తమకే ఆలయ తాళాలు అప్పగించాలని టీడీపీ నాయకులు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో జనసేన–టీడీపీ వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.ఇరువర్గాలూ బాహాబాహీకి దిగడంతో ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న కాకినాడ డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో పిఠాపురం సీఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, ఇరువర్గాలనూ చెదరగొట్టారు. అయినప్పటికీ తాళాలిచ్చే వరకూ కదిలేదిలేదని టీడీపీ నేతలు ఆలయం వద్ద బైఠాయించారు. ఇరువర్గాలతో చర్చించిన పోలీసులు వివాదం తేలేవరకు ఆలయ తాళాలు అధికారుల వద్ద ఉండేలా ఒప్పించారు. అనంతరం తాళాలను స్థానిక వీఆర్ఓకు అప్పగించారు. తమకు ఎలాగూ ఆలయం దక్కేదిలేదని గ్రహించిన టీడీపీ నేతలు ఆలయాన్ని దేవదాయ శాఖకు అప్పగించాలనే డిమాండును తెరపైకి తీసుకువచ్చారనే ప్రచారం గ్రామంలో జోరుగా జరుగుతోంది. అపర్ణాదేవి ఆలయం దేశంలోనే పేరొందింది. ఇక్కడకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనేకమంది భక్తులు, వీఐపీలు వస్తూంటారు. ఆదాయం కూడా అంతలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆలయంపై పెత్తనం తమకు దక్కకపోతే.. జనసేనకూ దక్కకూడదని భావించిన టీడీపీ నేతలు.. ఈ ఆలయాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. -
దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. శనివారం వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన రౌడీ మూకలు ఉద్దేశ పూర్వకంగా, అధికార మదంతో మారణహోమం సాగిస్తున్నా, విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు, జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. వారి కార్యకర్తలు చేస్తున్న దాడులపై ప్రేక్షకపాత్ర వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తుండటం విచారకరం అన్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీసుకొచ్చారని విమర్శించారు. రౌడీషీటర్లు స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఏరా.. ఉద్యోగం చేయాలని లేదా.. నువ్వు ఇక్కడే ఉంటావా.. లేక వీఆర్‌కు వెళతావా.. అని మాట్లాడుతున్నా పోలీసులు మిన్నకుండి పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలతో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. కళ్లెదుటే దాడులు.. అచేతనంగా పోలీసులు‘బందరు గొడుగుపేటలోని ఎంకులు బంకులు ఎదురుగా ఉన్న సందులో ఒక యాదవ కుటుంబం ఇంట్లో సామగ్రి, టీవీని ధ్వంసం చేస్తే, కేసు పెట్టినా ఇనుగుదురుపేట పోలీసులు పట్టించుకోలేదు. బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామగ్రి కొంటే ఇలాగే ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. స్థానిక చిలకలపూడి గోడౌన్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైఎస్సార్సీపీకి పని చేశారనే కారణంతో వారి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. అడ్డుపడిన వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ దంపతులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో 25కు పైగా కేసులు ఉన్న రౌడీషీటర్ నవీన్.. ఆసుపత్రికి వెళ్లి నెలల పిల్లాడిని ఎత్తుకున్న ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినా రౌడీ షీటర్‌పై కేసు పెట్టకపోగా, బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీలే డీఎస్పీలు, సీఐలుగా భావించేలా చంద్రబాబు తయారు చేశారు. మహేష్ అనే వ్యక్తి విచ్చలవిడిగా బరితెగించి కుర్చీలతో ఎస్ఐ పైనే దాడి చేశాడు. కార్లు ధ్వంసం చేశాడు. అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ స్పందించకపోవటం విచారకరం. మాజీ ఎమ్మెల్యేలు అందరం ఎస్పీని కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వల్లభనేని వంశీ, కైలే అనిల్కుమార్లను పోలీసులు రానివ్వకుండా నిర్బంధించారు. రేపో, ఎల్లుండో డీజీపీ, ఎస్పీలను కలిసి దాడుల ఘటనలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. ఈ దాడుల ఘటనలపై వీడియో ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం’ అని పేర్ని నాని తెలిపారు.మేం వస్తున్నాం.. ధైర్యంగా ఉండండి...మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగుతూ చేతులు, కాళ్లు విరగ్గొట్టడంతో పాటు గ్రామాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నారన్నారు. ఈ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ‘దాడులు జరుగుతుంటే పోలీసులు నిలబడి చూస్తూ ఎంజాయ్ చేస్తుండటం దారుణం.స్థానికంగా దాడులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించినా, స్పందించడం లేదు. వచ్చినా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ ఘటనలపై కేసులు కట్టడం లేదు. దాడులు చేస్తున్న వారే కాకుండా దాడులను చూస్తూ మిన్నకుండిపోయిన పోలీసులపై కూడా కేసులు వేస్తాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నాయకులందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతాం. ఇకనైనా దాడులు ఆగకుంటే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పైకి వస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురైతే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, మచిలీపట్నం, పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రమేష్ (రాము) పాల్గొన్నారు.పేర్ని కిట్టు, నాయకులను అడ్డుకున్న పోలీసులుటీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాబి దంపతులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బందరు పట్టణంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే బాబి దంపతులు వైఎస్సార్సీపీ పక్షాన నిలిచారనే నెపంతో కూటమి శ్రేణులు వారి నివాసంపై దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా శనివారం బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తన నివాసం నుంచి నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్‌దాదా, కార్పొరేటర్లతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి పరామర్శకు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు.అదనపు బలగాలను రప్పించి దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరామర్శకు అనుమతి ఏమిటని పేర్ని కిట్టు, తదితరులు పోలీసులను దాటుకుని వెళ్లి బాబి దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, జోగి చిరంజీవి, ఐనం తాతారావు, మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, పర్ణం సతీష్, శ్రీరాం చిన్నా ఉన్నారు. -
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్‌కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేబినెట్లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.టీడీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు. -
టీడీపీ, జనసేన విధ్వంసం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. యథేచ్ఛగా విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నాయి. వాహనాలను ధ్వంసం చేస్తున్నాయి. మంగళవారం మొదలుపెట్టిన ఈ అరాచకపర్వాన్ని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బుధవారం కూడా కొనసాగించారు. ఈ రెండురోజులు ప్రభుత్వ భవనాల వద్ద ఫలకాలను చిత్రపటాలను ధ్వంసం చేస్తూ స్వైరవిహారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసి, విగ్రహాల వద్ద కూటమి జెండాలు ఏర్పాటు చేశారు.ఇప్పటంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్మించిన దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ భవనం పైభాగంలో జనసేన, టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో 1, 2 సచివాలయాల వద్ద వైఎస్ జగన్ డిజిటల్ బోర్డులను తొలగించి రోడ్డుపై పడవేసి చిత్రపటంపై రాళ్లు వేశారు. నూతన సచివాలయం శిలాఫలకంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాన్ని చిన్నపిల్లలతో పగులగొట్టించారు. రైతుభరోసా కేంద్రంపై నవరత్నాల బోర్డును ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా గోళ్ళపాడులో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ శిలాఫలకాన్ని పగులగొట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరులో పలు ఆలయాల వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాలను బుధవారం సాయంత్రం తెలుగుదేశం నాయకులు ధ్వంసం చేశారు. శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయం లోపల ఏర్పాటు చేసిన అన్నదాన, కళ్యాణోత్సవ మండప శిలాఫలకాన్ని, ఆరేటమ్మ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనుల పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, గేట్పుత్తూరులోని గోవిందమ్మ ఆలయం వద్ద ప్రారంభించిన జగనన్న సమావేశమందిర శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం నాయకులు డి.జి.ధనపాల్, బి.శ్రీనివాసులు చేసిన ఈ విధ్వంసంపై పుత్తూరు సెంగుంధర్ మక్కల్ నల సంఘం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎస్.ఎన్.గోపిరమణ, టి.జి.శక్తివేలు, ఎం.ఎస్.తిరునావక్కర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని యలమంచిపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త షేక్ మస్తాన్‌పై టీడీపీ నాయకులు దాడిచేశారు. అడ్డుకోబోయిన ఆయన తల్లి షేక్ బీబీ తలపైకొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆమెను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తడకలూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త యలమా వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. మరికొన్ని గ్రామాల్లో కూడా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. గ్రామాల్లో వివాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. పంచాయతీలో ఫైళ్ల అపహరణ ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచివాలయం, హెల్త్‌క్లినిక్ ఆవరణలోని శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, అబ్బయ్యచౌదరి ఫొటోలను సుత్తితో పగులగొట్టారు. తన కార్యాలయంలో వస్తువుల్ని ధ్వంసంచేసి ఫైళ్లు అపహరించారని సర్పంచ్ జిజ్జువరపు నాగరాజు చెప్పారు. కొప్పులవారిగూడెంలోని సచివాలయ ఆవవరణలోని శిలాఫలకాలను, ప్రభుత్వ సామగ్రిని ధ్వంసం చేశారు. సచివాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే స్థూపానికి టీడీపీ జెండా కట్టారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో బొర్రా నారాయణరావు చికెన్ దుకాణాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనిపై నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సచివాలయం–1పై ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వార్డు సభ్యులు ముప్పిడి లక్ష్మణరావు, లక్ష్మణరావులపై దౌర్జన్యానికి దిగారు. నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నంలో సచివాలయం, హెల్త్‌క్లినిక్ పైలాన్లను ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసాలకు పాల్పడుతుండగా సమాచారం ఇచ్చినా పోలీసులు స్పందించలేదని పలు గ్రామాల్లో బాధితులు తెలిపారు.కైకలూరులో వైఎస్సార్‌విగ్రహం ధ్వంసంకైకలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం వడ్లకూటితిప్పలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద 2010లో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆకతాయిలు కూలగొట్టారు.ఈ ఘటనను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డీఎన్నార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఖండించారు. విగ్రహాల కూలి్చవేత ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.నీ జీవితం నా చేతుల్లో..వలంటీర్‌కు టీడీపీ నేత బెదిరింపుపల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామానికి చెందిన వలంటీర్ బాబురావును గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తీవ్రంగా బెదిరించారు. ‘అరేయ్ బాబురావుగా నీ పతనం స్టార్ట్ కాబోతుంది.. ఇక నువ్వు ఫిక్స్ అయిపో.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉందిరా.. నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకున్నా.. నిన్ను వేరే వాళ్ళు కాపాడాలన్నా.. నీ జీవితాన్ని నేను తిరగరాసినా ఇప్పుడు. నీకు భయం అంటే ఏంటో చూయిస్తారా.. నా కొడకా. అరేయ్ బాబురావుగా.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉంది రా.. నీ తలరాత బ్రహ్మ రాసినా ఇప్పుడు నీ జీవితాన్ని నేను తిరగరాస్తా.. కొడకా..’ అంటూ స్టేటస్ పెట్టి మరీ హెచ్చరించారు. మరోవైపు పెదమక్కెన గ్రామంలోని ఎస్సీ కాలనీలో దళితుల ఇళ్లపై టీడీపీ వారు రాళ్లు, సీసాలు విసిరారు. అజయ్‌కుమార్ జీవనాధారమైన ఆటోను ధ్వంసం చేశారు.వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలపై దాడులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ వర్గీయులపై కర్రలు, రాళ్లతో దాడులు చేస్తున్నారు. అడ్డొచ్చినవారిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏలూరు రూరల్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరాజు, రాష్ట్ర వడ్డికుల కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, గార్లమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణ కారులో వెళుతుండగా విజయరాయి వద్ద టీడీపీ వారు దాడిచేశారు. ‘గెలిచింది మేమే.. మాకు తిరుగులేదు.. రండి ఇప్పుడు..’ అంటూ కర్రలు, రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. కారులో ఉన్న కృష్ణను బలవంతంగా బయటకు లాగి పిడిగుద్దులు గుద్ది రోడ్డుపై పడేశారు. కొంతదూరం లాక్కెళ్లి కొట్టారు. గతంలో చింతమనేని ప్రభాకర్‌పై చేసిన విమర్శలకు క్షమాపణలు చెబుతున్నా అంటూ కృష్ణతో చెప్పించి వీడియో రికార్డు చేశారు. అడ్డుపడేందుకు ప్రయత్నించిన శ్రీనివాసరాజు, సంజీవ్‌కుమార్‌లను తోసేశారు. కారు అద్దాలు పగలడంతో వైఎస్సార్సీపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ దాడిని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చెర్లకోట పంచాయతీ సిద్ధాయపాలెంలో సింహం లలిత, ఆమె తండ్రి చొప్పరపు బాలస్వామిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాలస్వామిని తొలుత మార్కాపురం జిల్లా వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యూట్యూబర్ సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ వర్గీయులు కొడవళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో ఆదిశేషు ఇంట్లో లేకపోవడంతో వారు మహిళలతో దురుసుగా మాట్లాడి సామగ్రిని చిందరవందర చేశారు. ఆదిశేషు భార్య, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అటు అధికారం.. ఇటు విపక్ష హోదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన భాగస్వామ్యం ఉంటుందని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పారు. అయితే అదే సమయంలో జనసేన ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెడుతోందని, ఈ రెండింటి మధ్య టెక్నికల్‌గా ఎలా సాధ్యమో చూడాలంటూ వ్యాఖ్యానించారు.బుధవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విజయం సాధించిన జనసేన అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి నాగబాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఓటును బాధ్యతగా భావించి జవాబుదారీతనంతో పని చేయాలని జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈ సందర్భంగా పవన్ సూచించారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కీ లభించని గెలుపును రాష్ట్ర ప్రజలు జనసేనకు అందించారన్నారు. జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు.రూపాయి జీతం మాటలు చెప్పను.. కేవలం రూపాయి జీతం తీసుకుంటాననే ఆర్భాటపు మాటలు కాకుండా ఓ ప్రజా ప్రతినిధిగా ఖజానా నుంచి సంపూర్ణ జీతం తీసుకుంటా. దీనివల్ల తాము చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నందున పనులు ఎందుకు చేయవనే అధికారం ప్రజలకు ఉంటుంది. అందుకే సంపూర్ణంగా జీతం తీసుకొని అంతే సంపూర్ణంగా ప్రజల కోసం కష్టపడతా. ప్రజల కోసం ఎంత జీతం తీసుకున్నా దానికి వెయ్యి రెట్లు వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్తా. యువతకు ప్రజాప్రతినిధులు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా జనసేన ప్రయాణం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి. వ్యక్తిగత దూషణలు లేకుండా కొత్త ఒరవడిని తెద్దాం. కొత్తగా నిరి్మస్తున్న జనసేన కార్యాలయం తలుపులు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేందుకు నిరంతరం తెరిచే ఉంటాయి. -
సీఎస్ మా భూముల వద్దకు రాలేదు..
విశాఖ సిటీ: అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై బురద జల్లడానికి ప్రయత్నించిన ఎల్లో మీడియా యత్నాలు బెడిసికొట్టాయి. సీఎస్‌పై విశాఖ జీవీఎంసీ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని వెల్లడైంది. సీఎస్ ఎన్నడూ తమ భూముల వద్దకు రాలేదని, భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే సమయంలో రోడ్డు మీదుగా మాత్రమే వెళ్లారని జనసేన, టీడీపీ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో రైతులు కుండబద్ధలు కొట్టారు. విశాఖలో 800 ఎకరాల అసైన్డ్ భూములను సీఎస్ రైతుల నుంచి బలవంతంగా రాయించుకొని ఫ్రీ హోల్డ్ అనుమతులు పొందినట్లు పీతలమూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. దీన్ని ఆధారాలతో నిరూపిస్తానని బీరాలు పలికిన ఆయన శుక్రవారం టీడీపీ కార్యాలయంలో రైతులు చిట్టెమ్మ, అప్పన్న, నారాయణతో ప్రెస్‌మీట్ నిర్వహించి చివరకు తెల్లమొహంవేశారు. అగ్రిమెంట్లు చేయలేదన్న రైతులు తమ భూములను ఎవరికీ అగ్రిమెంట్ చేయలేదని మీడియా సమావేశంలో రైతులు స్పష్టం చేశారు. సీఎస్ ఎప్పుడైనా మీ భూములు ఇవ్వాలని బలవంతం చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అసలు జవహర్‌రెడ్డి ఎన్నడూ తమ భూముల వద్దకే రాలేదని రైతులు స్పష్టం చేశారు. ఇటీవల భోగాపురం విమానాశ్రయం పనుల పరిశీలన నిమిత్తం వచ్చినప్పుడు ఇటుగా వెళ్లడంతో అలా భావించామనడంతో టీడీపీ నేతలు, జనసేన కార్పొరేటర్ కంగుతిన్నారు. 700 ఎకరాలకే ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్ గత ఎనిమిది నెలల్లో విశాఖ జిల్లాలో 700 ఎకరాల అసైన్డ్ భూములకు మాత్రమే ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. రాష్ట్రంలో అత్యల్పంగా అనుమతులు ఇచ్చిన జిల్లాల్లో విశాఖ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.1 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ప్రకారం తెలుస్తోంది. దళితులకు అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో జీవో 596 ఇచ్చింది. ఇరు గ్రామాల మధ్య ఐదేళ్లుగా వివాదం టీడీపీ, జనసేన నేతలు తీసుకొచ్చిన రైతుల మధ్య భూ వివాదాలు ఐదేళ్లుగా నలుగుతున్నాయి. భీమిలి మండలం అన్నవరం, భోగాపురం మండలం తూడెం పంచాయతీల మధ్య అసైన్డ్ భూముల వివాదాన్ని సీఎస్‌కు అంటగట్టేందుకు ప్రయత్నించి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ భంగపడ్డాడు. రైతులు మాట్లాడుతుండగా సీఎస్ పేరు చెప్పాలని ఆయన గదమాయించడం గమనార్హం. జవహర్‌రెడ్డి పేరు కూడా తెలియని వారంతా తడబడుతూ జవర్ అని పేర్కొన్నారు. పార్టీకి సంబంధం లేదు.. సీఎస్‌పై పీతల మూర్తి యాదవ్ ఆరోపణల గురించి జనసేన విశాఖ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌ను ఇటీవల మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పడం గమనార్హం. ఆయన బయట చేసే వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
May 28th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 28th AP Elections 2024 News Political Updates..07:00 PM, May 28th, 2024 కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!: మంత్రి మేరుగు నాగార్జునపోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలుఅయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర! పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?-మంత్రి మేరుగు నాగార్జున#TDPLosing#YSRCPWinningBig pic.twitter.com/FLV1NZcVbf— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 06:00 PM, May 28th, 2024 నెల్లూరు..మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ, ఎస్పీ అరిఫ్ హఫీజ్..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల్లో భద్రత ను ఏర్పాటు చేశాం: కలెక్టర్కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ ఆంక్షలువుంటాయి.కౌంటింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో వుంటుంది.కౌంటింగ్ కేంద్రం వద్దకు కేవలం అభ్యర్థులు,ఎజెంట్ లకు మాత్రమే అనుమతి.కౌంటింగ్ రోజు బాణాసంచా కాల్చడం, డీజేలు పెట్టడం పూర్తిగా నిషేధం.. ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీకౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు,బయట రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలు ఉంటాయి.అల్లర్లకు అవకాశం వుండే వారిని ఇప్పటికే బైండోవర్ చేశాం2:00 PM, May 28th, 2024సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు..ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి?పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంపైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుంది.బాధితులు రీపోలింగ్ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యింది1:30 PM, May 28th, 2024ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుందిపేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది. పేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది.#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/YvbPmfC2sj— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 12:30 PM, May 28th, 2024సచివాలయంమాజీమంత్రి పేర్ని నాని కామెంట్లు..ఈసీ అధికారులును కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశాంఅన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారుపోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారుగెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారుస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారుకానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారుదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారుఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందిఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదుఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందిఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలుచేస్తారు అని ఆడిగాంఈ నిబంధనలపై పునరాలోచించాలి అని కోరాం11:57 AM, May 28th, 2024తిరుమలఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కామెంట్లు..వైఎస్సార్సీపీకి 175/175 సీట్లు రావడం ఖాయంఈవీఎం ట్యాంపరింగ్ అనేది టీడీపీ అభూత కల్పితం మాత్రమే2019లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేక పోయాడుగెలిస్తే ప్రజల మద్దతు.. ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాటలు మారుస్తాడు చంద్రబాబుప్రజా మద్దతు ఉన్నట్లు కేవలం టీడీపీ భ్రమ కల్పించే ప్రయత్నం చేసిందిఅనేక ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది.. ఒక ప్లాన్ ప్రకారం వైఎస్సార్సీపీ నాయకులను ఇరికించడానికి చేసిన కుట్రతెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు ప్రజలు గమనించారుఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండని చంద్రబాబు పార్టీ కేడర్‌కు ఆదేశాలు ఇచ్చారుమహిళా ఓటింగ్ అధికంగా ఉండటం వల్ల చంద్రబాబుకు భయం.. జగన్‌కు ధైర్యం వచ్చింది 11:44 AM, May 28th, 2024ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరటమూడు కేసుల్లో మందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టుఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టుకండీషన్లతో బెయిల్ మంజూరు 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదన్న హైకోర్టు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి11:27 AM, May 28th, 2024తిరుమల:వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్లు.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా రావడం ఖాయంఅశాంతి కిషోర్ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవుఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందిప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయిఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైఎస్సార్సీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదుటీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందిమా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారుప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదుఅసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్లో 22కు పైగా సీట్లు వైఎస్సార్సీపీ గెలవబోతుందిపెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయం 10:30 AM, May 28th, 2024నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజంనమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!Remembering Shri. Nandamuri Taraka Rama Rao Garu on his Jayanthi Today.నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!#CBNKilledNTR pic.twitter.com/A5PJ6b4NAQ— YSR Congress Party (@YSRCParty) May 28, 20249:34 AM, May 28th, 2024విజయవాడపిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పునిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలుపిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరుపిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్రఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశంహైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులుఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడిహైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాదిరికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదుహైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయంమరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లుతీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి 8:09 AM, May 28th, 2024మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలుహైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులుపిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడిపోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయంపిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు నేటికి వాయిదామరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరుటీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరుపిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులుపోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటజూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టుకౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్రహత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులువాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులుకాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులుపోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరంఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరంవెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టుపిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడిఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్‌కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిపీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్‌ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిహైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాదిరికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయంకోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చచివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టుమరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయంకనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులుతొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనంఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరుబాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్‌మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024 -
May 20th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 20th AP Elections 2024 News Political Updates9:01 PM, May 20th, 2024తూర్పు గోదావరి జిల్లా :ఓర్వలేకే టీడీపీ కుట్రలకు, భౌతిక దాడులకు పాల్పడుతుంది: హోంమంత్రి తానేటి వనితకుట్రలు, భౌతిక దాడులు ఈ కూటమి నేతలు చేస్తున్న తీరు చూస్తుంటే జగనన్నకు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అని స్పష్టమవుతోంది.మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కడుపు మంటతో టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారు.ఇటీవల నల్లజర్లలో సైతం స్వయంగా నామీదకు దాడికి పాల్పడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెబుతారు.టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేశారుప్రజలకు తెలుసు జగనన్న పేదలకు భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదని.పోలీసులు వైఎస్సార్సీపీకి కొమ్ముకాశారు అనడం అవాస్తవం.అలాగైతే ఇటీవల స్వయంగా నామీద జరిగిన దాడికి పోలీసులు ఏం చేశారో చెప్పాలి.టీడీపీ, జనసేన నేతలు కలసి అధికార దాహంతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. 4:41 PM, May 20th, 2024మంగళగిరి:సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్‌ని కలిసిన వైఎస్సార్సీపీ నేతలుఅనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ నేతలుపోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై సిట్ చీఫ్‌ని కలిశాం: అంబటి రాంబాబుటీడీపీతో కొందరు పోలీస్ అధికారులు కుమ్మక్కై అయ్యారనే దానిపై ఇసి ఆదేశాలతో బయటపడిందిఈసి ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ని కలిసి ఫిర్యాదు చేశాంహింసాత్మక ఘటనలలో కొందరు ఐపిఎస్ అధికారుల పాత్ర కూడా ఉందిఎన్నికల సమయంలో అధికారులని మార్చడం సహజంకానీ ఎపిలో జరిగిన బదిలీలలో పురందేశ్వరి లేఖ ఆధారంగానే జరిగిందిఅధికారులని మార్చిన చోటే హింసాత్మక ఘటనలు జరిగి అధికారులు సస్పెండ్లు జరిగాయిఅనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలలో ఎస్పీలని పురందేశ్వరి ఫిర్యాదు ఆధారంగా మార్చిన చోటే హింస జరిగింది... అక్కడే సస్పెన్షన్లు జరిగాయిఇద్దరు ఐపిఎస్లని సస్పెండ్ చేశారంటే పోలీసుల పాత్ర అర్ధమవుతుందిపోలీసు శాఖ టీడీపీతో పూర్తిగా కుమ్మక్కైందిఇది చాలా దురదృష్టకరమైన పరిస్ధితిపోలీస్ యంత్రాంగం బాద్యత వహించాలివైఎస్సార్ సిపి ఇచ్చిన ఫిర్యాదులని కనీసం ఎన్నికల సమయంలో తీసుకోలేదువైఎస్సార్ పై తప్పుడు సెక్షన్లు, కేసులని నమోదు చేయాలని చూస్తున్నారుతప్పుడు కేసులని నివారించాలని కోరాంపోలీస్ అధికారుల కాల్ డేటాని పరిశీలించాలని కోరాంప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిట్ ఛీఫ్ ని కోరాందేశంలోనే పోలీస్ అధికారులు టిడిఇతో కుమ్మక్కు కావడం చాలా సీరియస్ అయిన విషయంవినీత్ బ్రిజ్ లాల్ మంచి సమర్ధవంతమైన అధికారి అని నమ్ముతున్నాం.నాగరిక సమాజంలో ఈ తరహా సంఘటనలు జరగకూడదుపెద్దారెడ్డి ఇంటికి వెళ్లి సిసి కెమారాలు ద్వంసం చేసి టీడీపీ జెండాలు ఎగురవేయడం ఏమిటిఅధికారుల మార్పు వల్ల టీడీపీకి మేలు జరుగుతుందనే ఇలా చేశారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి కుట్రలు చేసింది: జోగి రమేష్హింసాత్మక సంఘటనలు ప్రేరేపించడానికి కూటమే కారణంకలెక్టర్లు, ఎస్పీలు మార్చిన చోటే పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయిప్రజాస్వామ్యంలో హింసని ప్రేరేపించింది చంద్రబాబేమళ్లీ సిఎంగా వైఎస్ జగన్ వస్తారుప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలాయిపూర్తి స్ధాయిలో విచారణ జరిపి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్సీ, ఎస్టీ, బిసిలు వైఎస్ జగన్‌కి అండగా ఉన్నారనే కక్షతో హింసకి పాల్పడ్డారు: రావెల కిషోర్బాబుచాలా గ్రామాలలో ఎస్సీ, బిసీలు ఊళ్లకి ఊళ్లే ఖాళీ అవుతున్నాయి.టీడీపీ పై చర్యలు తీసుకోవాలిగ్రామాలలో సాధారణ పరిస్ధితులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిఘటనలకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలిప్రజాస్చామ్యాన్ని పునరుద్దించాలి 3:41 PM, May 20th, 2024విజయవాడఢీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ప్రాధమిక నివేదిక అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఈసి ఆదేశాల మేరకు సిట్ విచారణరెండు రోజుల పాటు నాలుగు బృందాలగా క్షేత్ర స్ధాయిలో పర్యటనపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలలో పర్యటించిన సిట్ బృందాలుహింసాత్మక ఘటనలకి కారణాలు విశ్లేషిస్తూ ప్రాధమిక నివేదిక150 పేజీల ప్రాధమిక నివేదిక డిజిపికి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ 2:20 PM, May 0th, 2024ఏపీలో కొత్త పోలీస్ అధికారుల నియామకంఈసీ సస్పెండ్ చేసిన అధికారుల అధికారుల స్థానంలో కొత్తవాళ్ల నియామకం నరసరావుపేట డీఎస్పీ గా - ఎం.సుధాకర్ రావు గురజాల డీఎస్పీగా - సీహెచ్ శ్రీనివాసరావు తిరుపతి డీఎస్పీగా - రవి మనోహరచారి తిరుపతి ఎస్ బీ డీఎస్పీగా - ఎం.వెంకటాద్రి తాడిపత్రి డీఎస్పీగా - జనార్దన్ నాయుడు నియామకంపల్నాడు DSB - I సీఐగా- సురేష్ బాబు పల్నాడు DSB - II సీఐగా - U. శోభన్ బాబు కారంపూడి ఎస్సై గా - కె.అమీర్ నాగార్జున సాగర్ ఎస్సై గా - ఎం.పట్టాభి 2:06 PM, May 20th, 2024కాసేపట్లో డీజీపీకి సిట్ నివేదికఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాధమిక నివేదిక సిద్దంఉదయం నుంచి డిజిపి ప్రధాన కార్యాలయంలోనే కూర్చుని ప్రాధమిక నివేదిక సిద్దం చేస్తున్న ఐజీ వినీత్ బ్రిజ్ లాల్మరికాసేపట్లో డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి సిట్ ప్రాధమిక నివెదికసిట్ ప్రాధమిక నివేదికపై తీవ్ర ఉత్కంఠగత రెండు రోజులగా పల్నాడు, అనంతపురం,తిరుపతి జిల్లాలలో సిట్ బృందాలు క్షేత్రస్ధాయి పర్యటన33 ఎఫ్ఐఆర్ లు, సీసీ కెమెరా ఫుటేజ్ లు పరిశీలనఘటనలు జరిగిన గ్రామాలు సందర్శన1:32 PM, May 20th, 2024చింతమనేని ఎక్కడ?పరారీలో దెందులూరు కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పోలింగ్ టైంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పీఎస్‌పై చింతమనేని దాడిసినీ ఫక్కీలో దాడి చేసి అరెస్టైన వ్యక్తిని విడిపించిన చింతమనేనిచింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు16 రాత్రి నుంచే అజ్ఞాతంలోకి.. బెంగళూరు వెళ్లినట్టు ప్రాథమిక సమాచారంఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసుల గుర్తింపునూజివీడు డీఎస్పీ పర్యవేక్షణలో 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు12:51 PM, May 20th, 2024మంగళగిరిపల్నాడు హింసలో బాధితులుగా పలువురు మహిళలుమహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన చినగణేషునిపాడు మహిళలుటీడీపీ నేతలు ఎస్సీ, బీసీ మహిళల ఇళ్లపై దాడులు జరపడంతో భయాందోళనకు గురై ఓ గుడిలో రెండ్రోజుల పాటు తలదాచుకున్న మహిళలుపోలీసుల సాయంతో బంధువుల ఇళ్లకు వెళ్లినట్టు మహిళా కమిషన్ కు ఫిర్యాదుతమకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కమిషన్ ను కోరిన మహిళలుసాక్షితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మిపల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి వారిని చిత్రహింసలకు గురిచేశారు: గజ్జల వెంకటలక్ష్మిబాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠినశిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాFeg: గజ్జల వెంకటలక్ష్మిఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులు చేయడం దుర్మార్గం: గజ్జల వెంకటలక్ష్మిప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధం: గజ్జల వెంకటలక్ష్మిమహిళలకు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేసే హక్కు లేదా..?: గజ్జల వెంకటలక్ష్మివారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన చంపేస్తారా..? : గజ్జల వెంకటలక్ష్మిచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరించారు: గజ్జల వెంకటలక్ష్మిఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు: గజ్జల వెంకటలక్ష్మిఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల బాధితులను పరామర్శించలేదు: గజ్జల వెంకటలక్ష్మిత్వరలోనే బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్తాం: గజ్జల వెంకటలక్ష్మి 12:11 PM, May 20th, 2024విజయనగరండిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలుఎంపీ పోస్టల్ బ్యాలెట్ ను తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రానికి తరలించడం లో అధికార్ల సమాచార లోపం వుంది.వైస్సార్సీపీ అభ్యర్థి ఏజెంట్ ను ఈ ప్రక్రియ కోసం పంపించాము.టీడీపీ అభ్యర్థి ఏజెంట్ హాజరు కాక పోవడం వారి ఇష్టం. అయినా రాజకీయం చేసే ప్రకటనలు చేస్తున్నారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం గా జరగాలని వైస్సార్సీపీ మనస్పూర్తి గా కోరుకుంటుంది.గతం లో గెలిచినా, ఓడినా లేకితనం రాజకీయాలు చేయలేదు.12:00 PM, May 20th, 2024పోలీసుల అదుపులో బళ్ల బాబీఎన్నికల ఫలితాలు వెలవడక ముందే నరసాపురంలో జనసేన నాయకుల దౌర్జన్యంపశ్చిమగోదావరి మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ సమీపంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబీ.. ఆటోలో వెళ్తున్న కుటుంబం పై దాడికారుకు ఆటో సైడ్ ఇవ్వలేదని ఆటోను వెంబడించి.. అందులోని ఇద్దరు మహిళలు,పిల్లలు, మరో ఇద్దరిపై దాడి చేసిన బాబీ అతని స్నేహితులుమీరు ఎవరు వైఎస్ఆర్ సీపీకి ఓటు వేశారా? జనసేనకు ఓటు వేశారా...? అంటూ నిలదీసిన బాబి అండ్ కోమీరు బీసిల్లా ఉన్నారు వైఎస్ఆర్ సీపీకే ఓటు వేసి ఉంటారని బాబి అతడి స్నేహితులను దాడి.. ఆపై అక్కడి నుంచి జారుకున్న బ్యాచ్‌నరసాపురం ఆసుపత్రికి బాదితులను తరలించిన స్థానికులుఆసుపత్రిలో బాధితులను పరామర్శించి.. వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్..కేసు నమోదు చేసి బళ్ల బాబీని అదుపులకు తీసుకున్న పోలీసులు11:32 AM, May 20th, 2024విజయవాడఎన్నికల సంఘానికి నేడు సిట్ ప్రాధమిక నివేదికపోలింగ్ అనంతర అల్లర్లపై నివేదిక సిద్ధం చేస్తున్న సిట్ ఇన్‌ఛార్జి వినీత్ బ్రిజ్‌లాల్‌నేడు ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పణఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన నాలుగు బృందాలుతాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, గురజాల, నరసారావుపేట ఘటనలపై కీలక ఆధారాలు సేకరణకేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసిన సిట్కేసుల విచారణపై ఇకపై కూడా పరివేక్షణ కొనసాగించనున్న సిట్రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్న సిట్డీజీపీకి నివేదిక సమర్పించిన తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయనున్న సిట్11:01 AM, May 20th, 2024గుంటూరుసాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ను కలవనున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంపోలింగ్ నాడు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై ఫిర్యాదుపల్నాడు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరిగిన దాడుల ఆశారాలను అందించే అవకాశంఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన అంశాలపై కూడా సిట్ కి వివరించనున్న పార్టీ బృందం10:38 AM, May 20th, 2024ప్రకాశంఎల్లో మీడియా పై మాజీమంత్రి బాలినేని ఆగ్రహంతప్పుడు కథనాలు ప్రచురిస్తే ఖబడ్దార్నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మహాటీవి పై పరువునష్టం దావా వేస్తాఎవరెన్ని కుట్రలు చేసినా...అబద్ధాలు ప్రచారం చేసుకున్నా..కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయంరాబోయేది వైస్సార్సీపీ ప్రభుత్వమే130 సీట్లకు పైగా వైస్సార్సీపీ కైవసం చేసుకోబోతోందిజూన్ 9 న ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు10:14 AM, May 20th, 2024కాకినాడ సిటీ, పిఠాపురంలో అల్లర్లకు ఛాన్స్!కాకినాడ సిటీ, పిఠాపురంపై కేంద్ర నిఘా విభాగం(ఇంటెలిజెన్స్ బ్యూరో) అలర్ట్‌కౌంటింగ్‌కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం!కాకినాడ, పిఠాపురంపై ఎన్నికల సంఘానికి ఐబీ నివేదికకాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టిఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై ఇప్పటికే పోలీసుల నిఘా10:00 AM, May 20th, 2024ఈసీకి సిట్ రిపోర్ట్ఏపీలో అల్లర్లపై నేడు ఎన్నికల సంఘానికి సిట్ నివేదికఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై చివరి అంకానికి చేరుకున్న సిట్ దర్యాప్తుతాడిపత్రిలో ముగిసిన సిట్ విచారణపల్నాడు, తిరుపతిలో ఇవాళ మూడో రోజు కొనసాగనున్న విచారణక్రొసూరు, అచ్చంపేట మండలాల్లో నేడు పర్యటించనున్న సిట్ బృందాలుఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి సిట్ నివేదికసెక్యూరిటీ వైఫల్యం వల్లే అల్లర్లు జరిగినట్లు సిట్ ప్రాథమిక అంచనాఆ వెంటనే ఈసీకి నివేదిక పంపనున్న డీజీపీసమగ్ర దర్యాప్తు కోసం సిట్‌కు గడువు పొడిగించాలని కోరే అవకాశంసమగ్ర కథనం: సిట్ నివేదికలో కీలకాంశాలు9:27 AM, May 20th, 2024ఆగని పచ్చ చిలుక పలుకులుమరోసారి వైఎస్సార్సీపీపై విషం చిమ్మిన ప్రశాంత్ కిషోర్‌చంద్రబాబు డైరెక్షన్లోనే పని చేస్తున్న మాజీ ఎన్నికల వ్యూహకర్తఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోతుందంటూ బర్కాదత్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలుబీజేపీకి మాత్రం సానుకూలంగానే పీకే స్వరంఐ-ప్యాక్ టీంతో భేటీ సమయంలో సీఎం జగన్ గెలుపు వ్యాఖ్యలుపీకే చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యానించిన సీఎం జగన్‌పీకే చేసేది ఏం లేదని.. అంతా ఐప్యాక్ టీం కష్టం ఉందన్న సీఎం జగన్జగన్ వ్యాఖ్యలపై పీకేకు నూరిపోసిన చంద్రబాబువైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఢీలా పరిచేందుకు ఎల్లో మీడియా ప్రయత్నాలు9:05 AM, May 20th, 2024పల్నాడుమాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి పిచ్చయ్య బైక్ తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులురాత్రి ఇంటిముందు పార్క్ చేసిన బైక్ ను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులుతెలుగుదేశం పార్టీకి చెందిన వారే తగలబెట్టి ఉంటారని అనుమానం8:00 AM, May 20th, 2024అనంతపురం: సిట్ అధికారులకు వినతి పత్రం అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవితమ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై, తమ ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిట్ అధికారులను కోరారు 7:30 AM, May 20th, 2024విజయవాడఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంనేటి సాయంత్రానికి డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్నాలుగు బృందాలగా సిట్ దర్యాప్తుపల్నాడు జిల్లాలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన రెండు బృందాలుపల్నాడు జిల్లాలోని రెండు బృందాలని పర్యవేక్షించిన అదనపు ఎస్పీ సౌమ్యలతతిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్యటించిన మరొక బృందంఅనంతపురం జిల్లాలోని తాడిపర్తిలో మరొక బృందం పర్యటనడీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణఎప్పటికపుడు నాలుగు బృందాల నుంవి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిలో హెడ్ క్వార్టర్స్ నుండి పర్యవేక్షిస్తున్న మరో అదనపు ఎస్పీమొత్తంగా 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్ బృందాలుదాదాపు 300 మందికి నిందితులు ఈ హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్లలో నమోదుఇప్పటికే వంద మందికి పైగా నిందితులు అరెస్ట్సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలనక్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలుపోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలనసస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌ల పనితీరుపైనా సిట్ అనుమానాలుటీడీపీ రౌడీలు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి సిట్ బృందాలకి కూడా ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీనాలుగు బృందాల క్షేత్రస్ధాయి సమాచార సేకరణ ఆధారంగా నేటి సాయంత్రం 4 గంటల లోపు డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ఇచ్చే ప్రాధమిక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపూర్తిస్ధాయి దర్యాప్తుకి మరికొన్ని రోజుల సమయం పొడిగించాలని కోరే అవకాశంసిట్ ప్రాధమిక నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్ తదుపరి చర్యలకి అవకాశం7:00 AM, May 20th, 2024మార్చినచోటే మారణకాండ ‘సిట్’కు ఆధారాలు అందించిన మంత్రి అంబటిచంద్రబాబు, పురందేశ్వరి కుట్రతో చెలరేగిన హింస ఓటమి భయంతో బాబు రాక్షసత్వంతలలు పగులుతున్నా పోలీసులు స్పందించలేదుడబ్బులకు లొంగిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలితొండపిలో ప్రాణ భయంతో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు 6:30 AM, May 20th, 2024ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబుఫైబర్‌నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణశంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులుసుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతిపర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలునాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేశ్ -
మీ ఆస్తిపత్రాలు ఎవరి వద్ద ఉన్నాయి చంద్రబాబూ?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఆస్తిపత్రాలు ఎవరివద్ద ఉన్నాయని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చారా? అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు విషం గక్కుతున్నారని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో మోదీపై విమర్శలు చేస్తే ఈసీ ఆంక్షలు విధిస్తోందని, కానీ ఇక్కడ జగన్‌ని చంపేయండంటున్నా మిన్నకుంటుందని పేర్కొన్నారు. మే 14 తర్వాత పథకాలు అమలు చేయండని తెలంగాణలో ఈసీ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రామోజీ, రాధాకృష్ణలు.. చంద్రబాబు కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారని, తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పారు. పవన్‌కళ్యాణ్‌ను వాడుకుని జగన్‌కి కాపులను దూరం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నాడని, దళితులను చీల్చడానికి మంద కృష్ణమాదిగను తెచ్చాడని, కానీ బీసీలను చీల్చుదామంటే వారు ప్రశ్నించడం మొదలు పెట్టారని వివరించారు. ఎన్నిచేసినా పెద్ద గీత జగన్ పక్కన చంద్రబాబు చిన్న గీతగానే మిగిలాడని, ఇక ఏమీ చేయలేక భూములపై విషప్రచారం మొదలుపెట్టారని చెప్పారు. ఇవన్నీ ఆగాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..దుష్టచతుష్టయం కుటిల పన్నాగాలు ఫెయిల్ ఎన్నికలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పనితీరుపై జరగకూడదని రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ దుష్ట పన్నాగాలు పన్నారనేది స్పష్టం అవుతోంది. జగన్ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను చేపట్టిందని, అది దుర్మార్గమైన వ్యవస్థ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వలంటీర్ వ్యవస్థ పెద్ద మాఫియా అని, వలంటీర్లు అమ్మాయిలను రెడ్‌లైట్ ఏరియాకు అమ్మేస్తున్నారని పవన్‌కళ్యాణ్ మాట్లాడారు. ఏపీలో అమ్మాయిలు మిస్సయ్యారని, కేంద్ర నిఘావర్గాలు తనకు చెప్పాయని దుష్ప్రచారం చేశారు. ఈ సంచులు మోసే వలంటీర్లు మగవాళ్లు ఇంట్లోలేని సమయంలో తలుపులు కొట్టి ఆడవాళ్లను లోబరుచుకుంటారని చంద్రబాబు మాట్లాడాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వలంటీర్ వ్యవస్థపై నీచంగా వార్తలు రాశాయి. కానీ ప్రజల్లో ఈ వ్యవస్థపై ఇసుమంతైనా నమ్మకం సడలలేదు. కోవిడ్ సమయంలో దేశంలోనే అత్యద్భుతంగా సేవలందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ హైదరాబాద్‌లో ఇళ్లల్లోంచి బయటకు రాలేదు. జగన్ ఇక్కడే ఉండి రూ.30 వేల కోట్లు కోవిడ్ కోసం ఖర్చుచేసి మందులు, వైద్యం అందించారు.కులాలను వాడుకుని దెబ్బతీయాలని బోర్లా పడ్డారు చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రానికి ఫలానా మేలు చేశానని చెప్పుకొనే పరిస్థితి ఉందా? చేసిందేమీ లేక కులాలను వాడుకుని జగన్‌ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడు. మహిళలనూ చీల్చుదామని చూశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.14 వేల కోట్ల రుణాలు బేషరతుగా మాఫీచేస్తానని, ప్రతి మహిళకు సెల్‌ఫోన్ కొనిస్తానని, పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.25 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. రాష్ట్రంలో ఉన్న సుమారు మూడు కోట్లమంది మహిళలు సీఎం జగన్‌కు అండగా ఉన్నారు.2019 నుంచీ ఎవరి ఆస్తిపత్రాలు వారి వద్దే..ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై వదంతులు సృష్టించారు. ఈ యాక్ట్ 2019లోనే వచ్చింది. ఇప్పుడు 2024లో దానిగురించి మాట్లాడుతున్నారు. 2019లో చట్టం వస్తే.. ఇప్పటివరకు చంద్రబాబు కొనుక్కున్న ఆస్తుల కాగితాలు అతని వద్దే ఎందుకు ఉన్నాయి? పవన్‌కళ్యాణ్ ఈ ఐదేళ్లలో మూడో, నాలుగో ఆస్తులు కొన్నారని చెబుతున్నారు. మరి ఆయన కాగితాలు ఆయన వద్దే ఎలా ఉన్నాయి? ఈ రాష్ట్రంలోని టీడీపీ, జనసేన నాయకులు కొనుక్కున్న ఆస్తుల ఒరిజనల్స్ ఎవరివి వారివద్ద ఎందుకున్నాయి?బరితెగించిన చంద్రబాబు తప్పుడు ప్రచారంపై ఎన్నికల కమిషన్ కేసులు పెడితే.. చంద్రబాబు బరితెగించి ఫుల్‌పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆయనకు వ్యవస్థలంటే లెక్కలేదు. రాష్ట్రంలోని 26 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటివరకు ఆరువేల గ్రామాల్లోనే సర్వే జరిగింది. అక్కడ టీడీపీ వారు లేరా? సర్వే సందర్భంగా ఒక్కరన్నా ఆరోపణలు చేశారా? అసెంబ్లీలో చట్టం చేసేటప్పుడు టీడీపీ సమర్థించింది. ఇప్పుడు ఎన్నికల కోసం విషం చిమ్ముతోంది. చంద్రబాబు బీసీ సర్టిఫికెట్ ఇస్తే.. దానిపై ఆయన బొమ్మ ఉంటే ఆ బీసీ.. కమ్మ ఆయిపోతారా? పాసు పుస్తకం లోపల తహసీల్దారు సంతకం ఉంటుంది. పైన ఫొటో ముఖ్యమా? లోపల సంతకం ముఖ్యమా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. -
జగన్ కోసం జనం సిద్ధం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ప్రచారపర్వం శనివారం సా.6 గంటలకు ముగిసింది. గత 59 నెలలుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా చేసిన మంచిని వివరిస్తూ.. అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో మరింత మంచి చేస్తానని హామీ ఇస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రచారం నిర్వహించారు. మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటువేసి ఆశీర్వదించాలంటూ ఆయన వినమ్రంగా చేసిన విజ్ఞప్తికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ‘జగన్ కోసం సిద్ధం’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 47 వేల పోలింగ్ బూత్‌ల పరిధిలో 2.50 లక్షల మంది బూత్ కన్వినర్, సభ్యుల బృందం నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో.. కోటి మందికిపైగా ప్రజలు స్వచ్ఛందంగా స్టార్ క్యాంపెయినర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో 2014–19 మధ్య టీడీపీ–జనసేన–బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మంచేమీ లేకపోవడంతో చెప్పుకునేందుకు ఏమీలేక చంద్రబాబు, పవన్.. సీఎం జగన్‌పై తిట్లు, శాపనార్థాలకు పరిమితమయ్యారు.కూటమి ప్రచార సభలు వెలవెల.. టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు.. బీజేపీతో 2 పార్టీలు జతకలిశాక ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభ జనంలేక వెలవెలబోయాయి. మూడు పారీ్టల కలయికను అవకాశవాదంగా జనం భావించడంవల్లే ఆదిలోనే ఆ పొత్తును తిరస్కరించారనడానికి తాడేపల్లిగూడెం, చిలకలూరిపేట సభలే నిదర్శనమని అప్పట్లో రాజకీయ పరిశీలకులు చెప్పారు. ఇక ఎన్నికల షెడ్యూలు వెలువడ్డాక టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి తరఫున చంద్రబాబు, పవన్ సంయుక్తంగా.. వేర్వేరుగా నిర్వహించిన ప్రచార సభలకు జనం నుంచి స్పందన లభించలేదు. ఇది బాబు, పవన్‌కు నిరాశ, నిస్పృహకు గురిచేసింది. దాంతో సీఎం జగన్‌పై బూతులు, శాపనార్థాలతో వారు విరుచుకుపడ్డారు. నీ అమ్మ మొగుడు.. నీ అమ్మమ్మ మొగుడు.. సీఎం జగన్‌ను చంపితే ఏమవుతుందంటూ చంద్రబాబు తన స్థాయిని మరిచి, దిగజారి బూతులు అందుకుంటే.. పవన్‌కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి వైఎస్సార్సీపీ నేతలను తరిమితరిమి కొట్టండి అంటూ రంకెలేశారు. చివరకు.. సాక్షాత్తూ ప్రధాని మోదీని రప్పించి.. రాజమహేంద్రవరం, అనకాపల్లి, కలికిరిలలో నిర్వహించిన సభలకు, విజయవాడలో నిర్వహించిన రోడ్‌షోకు ఆశించినంత జనస్పందన లభించలేదు. కళ్ల ముందు ఘోర పరాజయం కన్పిస్తుండటంతో చంద్రబాబు, పవన్ తమ నోటికి మరింతగా పనిచెప్పారు. ప్రచారం ముగింపులో నంద్యాల సభలో సిగ్గెగ్గులు గాలికొదిలేసిన చంద్రబాబు.. సీఎంగా విశాఖపట్నంలో కాదు ‘ఇడుపుపాయలో మీ నాన్న సమాధి వద్ద ప్రమాణం స్వీకారం చెయ్.. శ్మశానంలో చెయ్’ అంటూ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడటంతో జనం విస్తుపోయారు. సిద్ధం.. సిద్ధం అంటూ హోరెత్తిన జనం.. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జనసంద్రాలను తలపించాయి. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమన్నది సిద్ధం సభల్లోనే వెల్లడైందని రాజకీయ పరిశీలకులు అంచనాకొచ్చారు. ఎన్నికల తొలివిడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మార్చి 27న ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో ప్రారంభించిన బస్సుయాత్ర ఏప్రిల్ 24న టెక్కలి సమీపంలో ముగించారు. మొత్తం 22 రోజులు.. 23 జిల్లాలు.. 106 నియోజకవర్గాల్లో సాగిన ఈ యాత్రలో 16 చోట్ల జగన్ నిర్వహించిన బహిరంగ సభలు ‘సిద్ధం’ సభలను తలపించాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో నిర్వహించిన రోడ్ షోలకైతే లక్షలాది మంది జనం బస్సుయాత్ర వెంట పరుగులు పెడుతూ.. మంచిచేసిన మిమ్మల్ని గెలిపించే పూచీ మాది అంటూ భరోసా ఇచ్చారు. ఎన్నికలప్పుడు అధికారంలోకి వస్తే నాయకులు హామీలు ఇవ్వడం సాధారణం. కానీ.. బస్సు యాత్రలో తద్భిన్నంగా మంచి చేసిన మిమ్మల్ని గెలిపించి.. సీఎంగా చేసుకునే పూచీ మాది అంటూ జనం సీఎం జగన్‌కు భరోసా ఇవ్వడాన్ని రాజకీయాల్లో అపూర్వ ఘట్టంగా పరిశీలకులు అభివరి్ణస్తున్నారు. ఇలా బస్సుయాత్రతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా vముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చేశారు. -
చంద్రబాబుకు చివరి పంచ్.. బాంబు పేల్చిన శర్మాజీ!
ఎన్నో వైద్యాలు చేస్తున్నాం.. హోమియోపతి.. అల్లోపతి.. నేచురోపతి.. ఆయుర్వేదం.. కేరళ మూలికావైద్యం.. ప్రకృతివైద్యం.. అన్నీ చూశాం. ఎన్ని చేస్తున్నా రోగిలో చలనం లేదు.. కళ్ళలో కళ లేదు.. కాళ్ళూ చేతులూ కదలడం లేదు.. శ్వాస కష్టంగానే ఉంది. నాడీ అందడం లేదు.. గుండె కూడా నీరసంగా కొట్టుకుంటోంది.. నాకైతే నమ్మకంలేదు.. దగ్గరోళ్ళు.. రావాల్సినవాళ్లు ఉంటే పిలిపించుకోండి. పనిలోపనిగా అటు కట్టెలు.. కుండ.. పాడె.. చిల్లర పైసలు సిద్ధం చేసుకోండి.. అని డాక్టర్ చెప్పినమాదిరిగానే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా చంద్రబాబుకు చెప్పేశాడట.మీకోసం ఎన్నో ప్రోగ్రాములు డిజైన్ చేశాం. బాదుడే బాదుడు.. వస్తున్నా మీకోసం.. సైకో పోవాలి-సైకిల్ రావాలి. ఇదేం ఖర్మ, యువగళం వంటి ఎన్ని ప్రోగ్రాములు చేసినా పార్టీకి మైలేజి రాకపోగా బాబు విశ్వసనీయత మీద ప్రజల్లో సందేహాలు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గడం లేదు. మరోవైపు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఆయన చెప్పిందే చేస్తారు అనే అంశాన్ని ప్రజలు బాగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధమే అనేది ఒక బ్రాండ్ ప్రజల్లో ఉండిపోయింది.దీంతో ఆయన ఎన్ని హామీలు ఇస్తున్నా నమ్మడం లేదు.. దానికితోడు కూటమి కట్టిన బీజేపీ.. జనసేన మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరినట్లు లేదు.. ఎక్కడికక్కడ విభేదాలు పొడసూపుతున్నాయి. లోకేష్ పార్టీకి బలం అని అనుకుంటున్నారు.. తప్ప అయన ఎక్సట్రా లగేజ్ అనే విషయం కూడా రాబిన్ శర్మ చెప్పేసారు. ఇటు తమ పార్టీ ప్రోగ్రాములు డ్యామేజ్ అయిపోగా అటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు.. వాలంటీర్లు.. పెన్షన్ల వంటి అంశాలను టీడీపీ నెత్తికి ఎత్తుకుంది. అది కూడా నెత్తి బొప్పి కట్టింది తప్ప ప్రయోజనం లేకపోయింది. ఆసరా... విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలకు నిధులు విడుదల చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను సైతం కోర్టులో కేసువేసి అడ్డుకున్న చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఇక ప్లెయిన్ రోడ్లో డ్రైవింగ్ కష్టం అనుకున్న చంద్రబాబు వెనుకడోర్ నుంచి యుద్ధానికి తెగబడ్డారు. కేవలం దుష్ప్రచారం ద్వారా ఓటర్లకు తికమకపెట్టి గెలవాలన్నదే వాళ్ళ ప్లాన్. అందుకే దేశంలో ఎక్కడా.. ఏ రాష్ట్రంలోనూ ఇబ్బందిలేని ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి జనాన్ని తమవైపునకు తిప్పుకోవాలన్నది అయన పార్టీ ప్లాన్‌గా మారింది. చంద్రబాబు ఏమి చేస్తాడు.. ఏమి చేయలేదు.. అనేది చెప్పినా ప్రజలు నమ్మేలా లేరు. అందుకే ఇక మ్యానిఫెస్టోను మడిచి పొయ్యిలో పెట్టిన టీడీపీ ఇప్పుడు ఏకంగా కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పదిరోజులుగా అన్ని పత్రికలూ.. ఛానెళ్లలో అదే అంశం మీద తప్పుడు సమాచారంతో పేజీల కొద్దీ ప్రకటనలు కుమ్ముతున్నారు. ఇక గత ఇరవయ్యేళ్ళుగా తెలుగుదేశానికి వచ్చిన సీట్లు చూస్తే ఇలా ఉన్నాయ్.. 2004 - 34 సీట్లు2009 - 54 సీట్లు2014 - 102 సీట్లు2019 - 23 సీట్లుఆంటే జనసేన.. బీజేపీలతో పొత్తుపెట్టుకున్న 2014 లో మాత్రమే మూడంకెల స్కోర్ వచ్చింది తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి 294 సీట్లు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం మూడంకెల స్కోర్ చేరలేదు.. అంటే టీడీపీ బలం ఎప్పుడూ యాభై సీట్లకు అటు ఇటుగా ఉంది తప్ప గొప్పగా ఏమి లేదు. ఇప్పుడు కూడా సేమ్ ఆలాగే సీట్లు వస్తాయి తప్ప అధికారం దక్కడం అసాధ్యం అనేది విశ్లేషకుల అంచనాగా ఉంది. -
‘వంగవీటి త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్, వంగవీటి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని, కానీ వంగవీటి రాధా టీడీపీలో చేరి సీఎం జగన్‌ని విమర్శించటం సరికాదని రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘2014లో సీటు ఇస్తే రాధా ఓడిపోయారు. 2019లో వేరే సీటు ఇస్తానని సీఎం జగన్ చెప్తే కాదని పార్టీ మారారు. అంతకుముందు వరకు నా తండ్రిని చంపినది టీడీపీ వారే అని చెప్పారు. ఇప్పుడేమో మాట మార్చి మాట్లాడుతున్నారు. వంగవీటి రంగా త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు. రంగా ఆశయం టీడీపీ పతనం. కానీ రాధా మాత్రం అదే టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరు గార్చారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజధాని అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు ఓట్లు వేయిస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయం ఉంటుందా?. .. వైఎస్సార్సీపీకి చెందిన కాపు మహిళలపై కమ్మ నేతలు దాడి చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదు?. తెనాలిలో గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?. జనసేనలోని వీర మహిళలకు ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు?. వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయాలి. జనసేనను చంద్రబాబుకు తాకట్టు పెట్టిన పవన్ కల్యాణ్‌ను గట్టిగా ప్రశ్నించాలి. .. ధవళేశ్వరం బ్యారేజి కట్టించిన కాటన్ దొరని ప్రజలు ఇప్పటికీ పూజలు చేస్తున్నారు. మరి హైదరాబాద్‌ని కట్టించానని చెప్పుకునే చంద్రబాబును ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు?. ఎందుకంటే.. చంద్రబాబు పచ్చి మోసగాడు, అబద్దాల కోరు అని తెలుసు కాబట్టే. సీఎం జగన్ ప్రజలకు మేలు చేసినందునే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు’’ అని వంగవీటీ నరేంద్ర అన్నారు. -
అందరివాడికే అందలం
తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు ఎన్నడూ కననిదీ, విననిదీ. బహుశా దేశంలోనే ఏ నాయకుడు కూడా ఇంత ఆత్మవిశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులే అన్నది ఈ విశ్వాసానికి కారణం. దానికి రుజువే ఎన్నికల ప్రచారంలో ఆయనకు లభిస్తున్న అమితమైన ఆదరణ! ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మరోసారి ఆయన్ని అధికార పీఠం ఎక్కించడానికి ‘సిద్ధం’గా ఉన్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది.‘కాణి’ ముత్యాలు ఇంటికే – మళ్లీ పట్టం జగన్‌కే!ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోమారు విస్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వనున్నారు. ఇది తెలుసుకోవడానికి ‘సర్వేశ్వరులను’ అడగనవసరం లేదు. గతంలో సర్వేలన్నీ సుప్రసిద్ధ మీడియా సంస్థలు నిర్వహించేవి. ఇప్పుడు ఎవరికి నచ్చిన విధంగా వారు సర్వేలు చేయించుకుంటూ ‘స్వింగ్’ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి ఇటు వైసీపీ, అటు కూటమి ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక, ప్రజాస్పందన నిశితంగా పరిశీలిస్తే, తీర్పు ఎలా ఉండబోతోందో మనకే అర్థమవుతుంది.జగన్ అన్ని పార్టీల కంటే ముందుగానే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేన అవగాహన కుదుర్చుకున్నా, చివరి వరకూ బీజేపీ జత కడుతుందో లేదో తెలియని సందిగ్ధం. అందుకే చాలాచోట్ల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేసుకున్నారు. తీరా బీజేపీ వచ్చి చేరాక, మళ్ళీ అభ్యర్థుల ప్రకటనలో కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో కాక అతి తక్కువ సీట్లు జనసేన తీసుకోవడం, బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా సిసలైన బీజేపీ వారికి టికెట్లు దక్కకపోవడం వంటివి లుకలుకలకు కారణమయ్యాయి. పేరుకే మూడు పార్టీల జెండాలు. జన శ్రేణులు మాత్రం కలిసి పనిచేసే పరిస్థితి చాలా చోట్ల లేకుండా పోయింది.పోనీ నిలబెట్టిన టీడీపీ అభ్యర్థుల్లో ఆణిముత్యాల లాంటి వారు ఉన్నారా అంటే, అబ్బే! చాలావరకు కాణి ముత్యాలే! ఇంచుమించు చంద్రబాబు మహా దోపిడీలో భాగస్వాములు లేదా ఆ దోపిడీ నుంచి స్ఫూర్తి పొందినవారే. ఇటు బెజవాడ దుర్గమ్మ, అటు విశాఖ కనకమహాలక్ష్మి, ఆ పక్క అనకాపల్లి నూకాలమ్మ సాక్షిగా వీరంతా కాణి ముత్యాలు. ఇలాంటివాళ్లే చంద్రబాబుకు కావాలి. టిప్పర్ డ్రైవర్లు, కమతగాళ్లు అంటే ఆయనకు అసహ్యం. ఈ బాపతు కాణి ముత్యాల్ని జనం ఆదరించరని చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే వీళ్ళు ఎక్కువగా ‘బ్యాక్ డోర్ పాలిటిక్స్’ నడుపుతుంటారు.ఇక ప్రచార తీరు పరిశీలిస్తే, తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు... బహుశా దేశంలోనే ఏ నాయకుడు ఇంత ఆత్మ విశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. ఆయన ప్రచారాస్త్రాలు కూడా విలక్షణంగా ఉన్నాయని చెప్పాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా విమర్శలకే పరిమితమయ్యారు తప్ప స్థాయి మరచి తిట్లులంకించుకోలేదు, హుందాతనాన్ని కోల్పోలేదు. మరి కూటమి విషయానికొస్తే– వెకిలితనం, బూతు పురాణం, కొట్టండి, చంపండి, నరకండి అని జనాల్ని ప్రేరేపించటం సభ్య సమాజాన్ని విస్తుపరిచాయి. జగన్‌పై విసిరిన రాయి దాడిని ఖండించాల్సింది పోయి ‘గులక రాయి’ అని వెకిలితనాన్ని ప్రదర్శించటం, వలంటరీ వ్యవస్థను కట్టడి చేయడం, పండు టాకుల, పుండు రెక్కలపై ఆక్రోశం వెలిబుచ్చి వాళ్ళ చావుకి కారణం కావడం, లేని భూయాజమాన్య హక్కు చట్టంపై దుష్ప్రచారానికి పూనుకోవడం వంటివి అన్నీ బూమరాంగ్ ఆయ్యాయి. అయితే జగన్ పని అయిపోయింది, ఇక తామే అధికారంలోకి వస్తున్నామనే ఫేక్ సర్వేలలో మాత్రం ముందున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 13 లక్షలు. ఇందులో అర్బన్ ఓటర్లు కేవలం 87 లక్షలు. జగన్‌కు పెట్టని కోటల వంటి గ్రామీణ ఓటర్ల సంఖ్య 3 కోట్ల 20 లక్షలు. అందులో సంక్షేమ పథకాల లబ్ధిదారులే అధికం. ఇక కులాల ప్రాతిపదికగా చూస్తే... ఎస్సీలు 35 లక్షల 46 వేల 748, ఎస్టీలు 25 లక్షల 85 వేల 726, ముస్లింలు 23 లక్షల 84 వేల 449, బీసీ యాదవులు 25 లక్షలు, మత్స్యకారులు 15 లక్షల 74 వేల 868, గౌడలు 19 లక్షల 78 వేల 866,చంద్రబాబు చేత తీవ్ర అవమానాలకు గురైన రజకులు, నాయీ బ్రాహ్మణులు 8 లక్షల 41 వేల 400+ 4 లక్షల 15 వేల 520, బ్రాహ్మణులు 7 లక్షల 4 వేల 165. క్రైస్తవులు 3 లక్షల 15 వేల 320... ఈ సామాజిక వర్గాలలో అత్యధికులు జగన్ వైపే ఉన్నారు. అధిక శాతం ఉన్న మరొక వర్గం, గోదావరి జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తి అని చెబుతున్న కాపులు, రాయలసీమలోని బలిజలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లో ప్రధానంగా, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు, ఒంటరులు మొత్తం 52 లక్షల 97 వేల 748 మంది. వీరిలో జనసేన వైపు ఆశగా చూసి భంగపడిన వారు, చంద్రబాబు సామాజిక వర్గంతో దశాబ్దాల వ్యతిరేకత ఉన్నవారు, వైసీపీలోని కాపు నాయకుల వెంట ఉన్నవారు... ఇలా భిన్నాభిప్రాయాలతో అటూ ఇటూ ఉంటారు. ఇక రెడ్డి వర్గంలోని 26 లక్షల 748 మందిలో అధికులు జగన్ వైపు ఉండగా, కమ్మ వర్గంలోని 26 లక్షల 46 వేల 748 మందిలో అత్యధికులు చంద్రబాబు వైపు ఉంటారు. ఇతర బీసీలు, 13 లక్షల పైచిలుకు ఉన్న వైశ్యులు ఆయా ప్రాంతాల పార్టీ అభ్యర్థుల ప్రాతిపదికన రెండు వైపులా చీలతారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అధిక శాతం వైసీపీ వైపే ఉన్నారు. గెలుపును నిర్ణయించే మరో శక్తి, నారీ శక్తి. అలాంటి మహిళలు జగన్ వైపే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. దీనిని బట్టి, ‘మళ్లీ పట్టం జగన్‌కే – కాణి ముత్యాలు ఇంటికే!’_వ్యాసకర్త పూర్వ సంపాదకుడు- పి. విజయబాబుముస్లింలు బీజేపీని ఓడించాలి – వైసీపీని గెలిపించాలి!ప్రధాని నరేంద్ర మోదీజీ, బీజేపీల నాయకత్వంలో పదేళ్ళుగా కేంద్రంలో అధికా రంలో వున్న ఎన్డీయే ప్రభుత్వం దేశ సంపదను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెడు తున్నది. ఒకవైపు భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానంటూనే మరోవైపు దేశ ప్రజల్ని పేదరికం లోనికి నెట్టి వేస్తున్నది. దేశ ప్రజలంటే 80 శాతం హిందువులు, 14 శాతం ముస్లింలు, 6 శాతం క్రైస్తవులు, సిక్కులు, తదిత రులు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హ్యాపీనెస్ రిపోర్టులో భారతదేశం 126వ స్థానంలో వుంది. భారత ప్రజలు సంతోషంగా లేరు. అణిచివేతకు గురవుతున్న ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే ముస్లిం, ఐదుగురు హిందువులు. దీని అర్థం ఏమంటే మోదీ పాలనకు ప్రధాన బాధితులు హిందువులు. ఈ వాస్తవాన్ని కప్పి పుచ్చడానికి, హిందూ–ముస్లింల మధ్య తగువుపెట్టి ఎన్నికల్ని ఒక మత యుద్ధంగా మార్చడానికిస్వయంగా మోదీజీ నడుం బిగించారు. 2019 లోక్ సభ ఎన్నికల్ని ఆ పార్టీ 1761 నాటి పానిపట్టుయుద్ధంతో పోల్చేది. ఆ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ దుర్రానీ చేతుల్లో పీష్వా బాలాజీ బాజీరావు ఓడిపోవడంతో హిందువులు 250 ఏళ్లు అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేసి, మళ్ళీ అలాంటి దుఃస్థితి వస్తుందని భయపెట్టింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని ఔరంగజేబ్, శివాజీ మహారాజ్‌ల మధ్య పోరాటంగా ప్రచారం చేసింది. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టిప్పూ సుల్తాన్‌కు ఓటేస్తారా? రాణి అబ్బక్కకు ఓటేస్తారా? అని అడిగింది.వివిధ రాష్ట్రాలు విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ సమా జంలోని కింది కులాలకు కేటాయిస్తామని బీజేపీ చెపుతున్నది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని విస్తారంగా ప్రచారం చేశారు. ఆ రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ మాటల్ని నమ్మలేదు. మత ప్రాతి పదికన రిజర్వేషన్లను బీజేపీ ఆమోదించదని మరో బూటకపు ప్రచారాన్ని ప్రధాని సాగిస్తున్నారు. నిజానికి మత ప్రాతిపదికనే కులాలుంటాయి. భారత రాజ్యాంగం కొన్ని సమూహాలకు ఇచ్చిన రిజర్వేషన్లు వాస్తవా నికి మత రిజర్వేషన్లే. మాల సామాజిక వర్గానికిచెందిన ఒక వ్యక్తి తాను హిందువుననిగానీ, సిక్కును అనిగానీ ప్రకటించుకుంటేనే ఎస్సీ రిజర్వేషను పొందు తాడు. క్రైస్తవుడినని ప్రకటించుకుంటే బీసీ రిజర్వేషను పొందుతాడు. ఏమిటి దీనర్థం? బీజేపీ ముస్లిం రిజర్వేషన్‌గా ప్రచారం చేస్తున్నది కూడా నిజానికి ముస్లిం రిజర్వేషన్ కాదు. ముస్లిం సమాజంలో ఓసీలుగా పరిగణించే సయ్యద్, పఠాన్, మొఘల్, బేగ్‌లకు బీసీ రిజర్వేషన్ వర్తించదు. మహా అయితే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన సమూహాల (ఇడబ్ల్యూఎస్) కోటాలో లబ్ధి పొందవచ్చు. ముస్లింలను సాంస్కృతిక రంగంలో వివక్షకు గురి చేయడం, ఆర్థిక రంగంలో అతి క్రూరంగా బుల్ డోజర్లతో కూల్చి వేయడం బీజేపీ విధానంగా మారింది. ఏపీలో ప్రధాన పోటీదారులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ మొదటి నుండీ మత సామరస్యవాదుల నేల, సామ్యవాదుల భూమి. మతవిద్వేషాన్ని రగిల్చితే తప్ప రాజకీయ మనుగడ సాగించలేని బీజేపీ ఈ నేల మీద తనంత తానుగా మొలకెత్తలేని విత్తనం. 2019 ఎన్నికల్లో విడిగా పోటీచేస్తే బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడ రాలేదు. లోక్ సభ, అసెంబ్లీల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. జాతీయ స్థాయిలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రమే. ఏపీ ముస్లింలు ఈసారి ఒక లెక్క ప్రకారం కాంగ్రెస్‌కు మద్దతు పలకాలి. అయితే, కర్ణాటక, తెలంగాణాల్లా ఏపీలో కాంగ్రెస్ నిర్మాణం బలంగా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎంచుకున్న ప్రాధాన్య తల్ని ఆ పార్టీ ఏపీ నాయకులు పట్టించుకుంటున్నట్టు లేదు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బీజేపీని ఓడించాలనే పట్టుదల వున్నట్టు లేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని గెలిపించాలా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాలా? అనేది ఏపీ ముస్లింల ముందున్న ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసమో, మరో కారణాలతోనో వైసీపీ జగన్ ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ఎన్డీయేతో సఖ్యంగా వున్నారు. ఇప్పుడు ఆయనే ఏపీ నేల మీద బీజేపీని ఎదుర్కోవాల్సిన స్థితిలో పడ్డారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసేలోగా బీజేపీ, జగన్‌ల మధ్య పోరు మరింత వుధృతం అవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్సా? వైఎస్సార్ కాంగ్రెస్సా? అనే ప్రశ్న మళ్ళా ముస్లింల ముందుకు వచ్చి నిలిచింది. ఇది రాజకీయ సమస్య మాత్రమే కాదు. ఒక విధంగా నైతిక సమస్య కూడా. ఆంధ్రప్రదేశ్ భౌతిక రాజకీయ సమీకరణలు, కాంగ్రెస్ ఏపీ యూనిట్ వాస్తవిక బలాబలాలు, పనితీరుల్ని పరిగణన లోనికి తీసుకుంటే ముస్లింలు వైసీపీకి మద్దతు ఇవ్వడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. అది అవసరం కూడా. ఇటీవల విజయవాడలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ముస్లిం జేఏసీ), ముస్లిం ఆలోచనాపరుల వేదిక(ఎంటీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ముస్లిం ఉలేమాలు, ఆలోచనాపరులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రొఫె షనల్స్తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. -వ్యాసకర్త ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటీఎఫ్) కన్వీనర్-ఏఎం ఖాన్యజ్దానీ డానీ -
బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేక గుంపుగా వస్తున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలోని ప్రముఖ నేతలు తమ సొంత స్థానాల్లో ఎదురీదుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి ఎలా ఉన్నా సొంత నియోజకవర్గాల్లోనే వీళ్లంతా ఓటమి బాటలో పయనిస్తుండడం ఆసక్తికరంగా మారింది. పైకి వీరంతా గంభీరంగా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నా గెలిచే పరిస్థితిలేదని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎప్పుడూలేని విధంగా కుప్పం ప్రజలు వణికిస్తున్నారు.ఈసారి ఆయన గెలవడం కష్టమనే పరిస్థితి నెలకొనడంతో టీడీపీ అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించినా పెద్దగా మార్పురాలేదని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీని చేజార్చుకోవడంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ చంద్రబాబు తొలిసారి భంగపడడంతోనే ఆయన ఓటమికి బీజంపడింది. దీంతో కుప్పంలో గెలవడమే తప్ప ఎప్పుడూ నియోజకవర్గాన్ని పట్టించుకోని చంద్రబాబు నియోజకవర్గం చుట్టూ తిరగక తప్పలేదు. ఇప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా అక్కడే మకాం వేసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఆమె ఇలా ప్రచారం చేసిన దాఖలాల్లేవు. శాంతిపురం మండలంలో ఈసారి చంద్రబాబుకు గట్టి షాక్ తగిలే పరిస్థితి ఉంది. బెంగుళూరు నుంచి 200 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ని రెండునెలలుగా కుప్పంలో ఉంచి పనిచేయిస్తున్నా గెలుస్తామనే నమ్మకం చంద్రబాబులో కనిపించడంలేదు. సీఎంగా చేసినప్పుడు కూడా కుప్పం గురించి ఆయన పట్టించుకోలేదనేది స్థానికుల నిశ్చితాభిప్రాయం. ఆయన్ను కుప్పం ప్రజలు ఎనిమిదిసార్లు గెలిపించినా చంద్రబాబు కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా చేయలేకపోయారు. వైఎస్ జగన్ వచ్చాక కుప్పం రెవెన్యూ డివిజన్, పోలీసు సబ్‌డివిజన్ ఏర్పాటుచేశారు. ఇన్నాళ్లూ కనీసం కుప్పంలో సొంత ఇల్లు కూడా చంద్రబాబు కట్టుకోలేదు. కేవలం తనకు ఓట్లేసే మిషన్లుగా అక్కడి జనాన్ని ఆయన చూశారు. దీన్నిబట్టే ఆయనకు కుప్పంపై ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని అక్కడి ప్రజలు గమనించారు.మరోవైపు.. అభివృద్ధితోపాటు ప్రజలకు ఎలాంటి భేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అందడంతో వైఎస్ జగన్‌పట్ల ఆదరణ కనిపిస్తోంది. దీంతో కుప్పంలో చంద్రబాబును ఓటమి భయం వెంటాడుతోంది. ఇవే తన చివరి ఎన్నికలు కాబట్టి తనను గెలిపించాలంటూ ఆయన అభ్యర్థిస్తుండడాన్ని బట్టి ఆయన్ను ఓటమి భయం వెంటాడుతోందని స్పష్టమవుతోంది. పిఠాపురంలో పవన్‌కు నాన్‌లోకల్ గండంజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో గెలుపునకు చాలా దూరంలో ఉన్నారు. ఒక్కసారి తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆయన దీనంగా ప్రాథేయపడుతున్నా జనం మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. సినిమా స్టార్ కాబట్టి చూడ్డానికి రావడం తప్ప ఓటు వేస్తారా లేదా అనే దానిపై జనసేన నాయకులకే నమ్మకం కలగడంలేదు.నాన్ లోకల్ కావడం, కేవలం కులం ఓట్ల ప్రాతిపదికనే పవన్ అక్కడ పోటీచేస్తుండడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్లుగా మారాయి. పవన్ తమ ఎమ్మెల్యే అయితే ఆయన్ను కలవడం కుదరదని, తమకు ఏమైనా సమస్య వస్తే వెళ్లి చెప్పుకునే అవకాశం ఉండదనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఆయన పూర్తిస్థాయి రాజకీయ నేత కాకపోవడంతో ఎంతవరకూ నమ్మవచ్చనే అనుమానాలూ జనంలో ఉన్నాయి.అయితే, జబర్దస్త్ షో ఆర్టిస్టులు, సినిమా వాళ్లు, పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు పిఠాపురంలో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తూ హడావుడి చేయడం అక్కడి జనానికి వినోదం పంచుతోంది. టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ పైకి పవన్ కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా, లోపాయకారీగా టీడీపీ కేడర్‌ను సైలెంట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎంత హంగామా చేసినా జనంలో మాత్రం పవన్ గెలుపునకు దోహదపడే అంశాలు కనిపించడంలేదు. ఈసారి బాలయ్యకూ నిరాశే..హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కూడా ఈసారి గట్టెక్కడం కష్టంగా మారింది. మైనారిటీలు ఎక్కువగా ఉండడంతో వారు ఈసారి బాలయ్యకు ఝలక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. కూటమి రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి టీడీపీ ఓట్లను భారీ సంఖ్యలో చీల్చే అవకాశం ఉంది. అలాగే, టీడీపీ కేడర్, ద్వితీయశ్రేణి నేతల్లోనూ బాలకృష్ణ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాలకృష్ణ వల్ల ఉపయోగం లేకుండాపోయిందని బాధపడుతున్నారు. ఆయన ఇక్కడ ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం, ఎప్పుడూ నందమూరి కుటుంబాన్ని గెలిపించడమే తప్ప వారిక్కడ లేకుండా తమపై పెత్తనం చేయడంపై వారిలో అసహనం కనిపిస్తోంది. దీనికితోడు వైఎస్సార్సీపీ బీసీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఆ ఓట్లలోనూ భారీ చీలిక తప్పదంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ కంచుకోట బద్దలవుతుందని గట్టిగా వినిపిస్తోంది.ఓటమి అంచున ఉత్తరాంధ్ర ముఖ్యనేతలు..ఉత్తరాంధ్రలో టీడీపీ ముఖ్య నేతలైన గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితిలు సైతం ఈ ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారింది. » తరచూ నియోజకవర్గాలు మార్చే నేతగా ముద్రపడిన గంటా శ్రీనివాసరావును భీమిలి జనం నమ్మడంలేదు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే భూ కుంభకోణాలతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేయడాన్ని వారింకా మరచిపోలేదు. గంటా గెలిస్తే తమ భూములు ప్రమాదంలో పడతాయనే ఆందోళన ఉంది. అలాగే, గెలిచినా నియోజకవర్గాన్ని పట్టించుకోరనే వాదనా ఉంది. వీటికితోడు విశాఖను పరిపాలనా రాజధానిగా చేసే విషయంలో ఆయన వైఖరిపైనా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో గంటా గెలవడం సాధ్యంకాదని చెబుతున్నారు. » నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఎదురీదుతున్నారు. వివాదాలు, నోటి దురుసుతనంతో ఆయన ప్రజల ఆదరణ కోల్పోయారు. » ఎవరూ పోటీచేయడానికి ముందు రాకపోవడంతో చీపురుపల్లి బరిలో నిలుచున్న కళా వెంకట్రావుకు గెలుపు ఆశలేలేవని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణను ఎదురొడ్డి కళా నిలబడడం అసా«ద్యమని ఆదిలోనే తేలిపోయింది. ఆయన మొక్కుబడిగానే ప్రచారం చేస్తున్నారు. » ఇక విజయనగరంలో అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి సెంటిమెంటునే నమ్ముకుని తనను గెలిపించాలని కోరుతున్నా స్థానికంగా అంత స్పందన రావడంలేదు. ఆమె గెలిచినా కోటకే పరిమితమవుతారని అందుబాటులో ఉండరనే అభిప్రాయం నెలకొంది. టీడీపీ రెబల్‌గా మీసాల గీత ఉండడం, ఆమె చీల్చే ఓట్లు గణనీయంగా ఉండే అవకాశం ఉండడంతో అదితికి ఓటమి తప్పదంటున్నారు. » అనకాపల్లిలో జనసేన తరఫున కొణతాల రామకృష్ణ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆయన ప్రజలకు దూరమై చాలాకాలం కావడంతో ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. » రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డోన్‌లో కోట్ల సూర్యప్రకాశరెడ్డి గెలుపు అవకాశాలకు దూరంగానే ఉన్నారు. » మంగళగిరిలో చంద్రబాబు తనయుడు లోకేశ్ ఎంత ప్రయత్నిస్తున్నా గెలుపు ఊపు రావడంలేదు. తాయిలాలపైనే నమ్మకం పెట్టుకున్నా అది కూడా నెరవేరే సూచనలు కనిపించడంలేదు. రెండోసారి మంగళగిరి ప్రజలు ఆయన్ను తిరస్కరిస్తారనే వాతావరణం కనిపిస్తోంది.సీఎం రమేష్, సుజనా, కిరణ్, పురందేశ్వరి, నాదెండ్ల..పొత్తులో సీట్లు దక్కించుకుని బీజేపీ తరఫున అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట ఎంపీ స్థానాల నుంచి పోటీచేస్తున్న సీఎం రమేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలకు గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి, తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ధనబలం, కులబలంతో గెలవొచ్చని వారు బరిలోకి దిగినా అందుకు అవకాశాలు లేకపోవడంతో వారికి కళ్లెదుటే ఓటమి సాక్షాత్కరిస్తోంది. -
ఏపీ కూటమి: ఉత్తరాంధ్రలో ఒకలా.. బెజవాడలో మరోలా!
సాక్షి, అమరావతి: ఏ ఎండకు ఆ గొడుగు!.. ఏ రోటికాడ ఆ రోటి పాట! ఏరు దాటాక తెప్ప తగలేయడమే తన ఆనవాయితీ అని టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మరోసారి విస్పష్టంగా చెప్పింది! ప్రజాక్షేత్రంలో మరోసారి ఘోర పరాజయం ఖాయమని నిర్ధారణకు రావడంతో ఉనికి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కో డ్రామాలాడుతోంది. రాజధానిపై బుధవారం దినపత్రికల్లో కూటమి ఇచ్చిన ప్రకటనలే ఇందుకు తార్కాణం. ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందేందుకు రాజధానిపై ప్రాంతాల వారీగా రెండు రకాల ప్రకటనలు ఇచ్చే స్థాయికి దిగజారింది. సాధ్యం కాదన్న బాలయ్య అల్లుడువిశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్ ఓట్ల కోసం విశాఖే రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కాదని స్పష్టం చేస్తూ.. అమరావతిని అభివృద్ధి చేయాలంటే చాలా పెట్టుబడి అవసరమని ఓ ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇండర్వ్యూలో భరత్ తేల్చి చెప్పారు. అన్ని డబ్బులు వెచ్చించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. అదే విశాఖ అయితే వేగంగా అభివృద్ధి చెందుతుందని, గ్రోత్ ఇంజన్ ఏమిటనేది చూడాలని వ్యాఖ్యానించారు. గ్రోత్ ఇంజన్ విశాఖతో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందంటూ ఓట్ల కోసం రెండు నాలుకల ధోరణితో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రూ.వేల కోట్లు పెట్టుబడి పెట్టే స్థితిలో లేదని భరత్ చెప్పారు. అమరావతి అనేది 20 సంవత్సరాల తరువాత మాట అని, అదే విశాఖ మనకు వెంటనే గ్రోత్ ఇంజన్ లాంటిదని బాలకృష్ణ అల్లుడు భరత్ తెలిపారు. టీడీపీతో పాటు బీజేపీ, పవన్ అమరావతే రాజధాని అని చెబుతుండగా విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్ మాత్రం విశాఖ రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొనటాన్ని బట్టి కూటమి లక్ష్యం ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందడమేనని స్పష్టమవుతోంది. రెండు ప్రాంతాలు.. రెండు నాలుకలు!తాజాగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా విజయవాడ, విశాఖ ఎడిషన్లలో ఆయా ప్రాంతాల ప్రజలను మభ్యపుచ్చేలా కూటమి వేర్వేరు ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఈమేరకు విజయవాడ, విశాఖలో ఈనాడు, హిందూ దినపత్రికల తొలి పేజీల్లో కూటమి ప్రచార ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ప్రధాని మోదీతో పాటు బాబు, పవన్ ఫొటోలున్నాయి. విజయవాడ ఎడిషన్‌లో మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి అంటూ పత్రికల్లో ప్రకటన ఇవ్వగా విశాఖలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికాసం కోసం అంటూ ముగ్గురి ఫొటోలతో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఓ విధానం లేకుండా..జాతీయస్థాయిలో ఎనీడీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న పార్టీలు రాజధాని విషయంలో ఒక విధానం లేకుండా ప్రాంతానికో రకంగా వ్యవహరించడం అంటే ఓటర్లను మోసం చేయడమేనని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓటమి భయంతోనే ప్రాంతాలవారీగా మభ్యపెడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతిని రాజధాని చేయాలంటే రూ.లక్షల కోట్లు అవసరమని, అంత ఖర్చు చేసినా చాలా ఏళ్లు పడుతుందని తొలి నుంచీ వైఎస్సార్సీపీ వాస్తవిక దృక్పథంతో చెబుతోంది. అదే విషయాన్ని ఇప్పుడు ఓట్ల కోసం భరత్ వల్లె వేయడం గమనార్హం. రాజధాని అమరావతి సాధ్యం కాదని పేర్కొనడం విశేషం. రాష్ట్రంలో విజయవాడ భాగమైనప్పటికీ ఉత్తరాంధ్ర ఎడిషన్లలో మాత్రం అమరావతి ప్రస్తావన లేకుండా ప్రచార ప్రకటనలు జారీ చేయటాన్ని బట్టి ఇదంతా ఓట్ల రాజకీయమేనని స్పష్టమవుతోంది. -
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకొపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు..? అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుంది. అదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పింది.కానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోంది. ఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారు. చంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్.. నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?’ అని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. -
జనం.. జనం.. ప్రభంజనం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం హిందూపురం, పలమనేరు, నెల్లూరుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. ముఖ్యంగా టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటలా నిలుస్తున్న హిందూపురంలో సీఎం జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు సునామీలా జనం కదిలివచ్చారు. ఆ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ ఏ నాయకుడికీ ఈ స్థాయిలో జనస్పందన లభించలేదని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే హిందూపురంలో ఈసారి ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు. ఓవైపు సీఎం జగన్ నిర్వహిస్తున్న ప్రచార సభలకు సునామీలా జనం పోటెత్తుతుండటం.. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందనే లేకపోవడంతో కూటమి శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.నెల్లూరులో జనసునామీ..షెడ్యూలు ప్రకారం నెల్లూరులో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న ఆ నియోజకవర్గ ప్రజలు గాంధీ విగ్రహం సెంటర్‌కు భారీగా చేరుకున్నారు. తీవ్ర ఉక్కపోతను కూడా లెక్క చేయకుండా రెండు గంటలపాటు నిలబడిన చోట నుంచి కదల్లేదు. సీఎం జగన్ సాయంత్రం 5 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకోగానే.. జగన్నినాదాలతో జననీరాజనాలు పలికారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించారు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న జనం.. మంచి చేసిన మిమ్మల్ని గెలిపించుకుని మళ్లీ సీఎంగా చేసుకుంటామని నినదించారు.జనసంద్రమైన హిందూపురం..షెడ్యూలు ప్రకారం హిందూపురంలో ఉదయం పది గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న ప్రజలు.. నియోజకవర్గం నలుమూలల నుంచి ఊళ్లకు ఊళ్లు కదిలివచ్చాయి. దీంతో హిందూపురం జనసంద్రంగా మారింది. సీఎం జగన్ హిందూపురానికి చేరుకునేసరికి మధ్యాహ్నం 12.10 గంటలైంది. మిట్టమధ్యాహ్నం 43 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా లెక్కచేయకుండా వేలాది మంది ప్రజలు అంబేడ్కర్ సెంటర్లో నిలబడ్డారు. సీఎం జగన్‌ను చూడగానే ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పలమనేరులో వర్షంలోనూ చెక్కుచెదరని జనం..పలమనేరులో షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభం కావాలి. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఉప్పెనలా వెల్లువెత్తడంతో పలమనేరు జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ మధ్యాహ్నం రెండు గంటలకు పలమనేరుకు చేరుకున్నారు. అంతకుముందు పలమనేరులో ఓ మోస్తరు వర్షం కురిసింది. అయినప్పటికీ వర్షంలోనూ తడుస్తూనే క్లాక్ టవర్ సెంటర్లో వేలాది మంది ప్రజలు నిలబడ్డారు. సీఎం జగన్ అక్కడికి చేరుకోగానే సీఎం సీఎం అంటూ నినదించారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధమా అని సీఎం జగన్ పిలుపునివ్వగా సిద్ధం సిద్ధం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పేదల చేతిలో పెత్తందారుల ఓటమి ఖాయం రామోజీ, రాధాకృష్ణ కులగజ్జితో పిచ్చిరాతలు వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు (దర్గామిట్ట): ఈ ఎన్నికల్లో పెత్తందారుల పక్షాన జతకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలను ఓటనే ఆయుధంతో బంగాళాఖాతంలో కలిపేయడానికి పేదలంతా సిద్ధంగా ఉన్నారని నెల్లూరు వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో శనివారం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వారి అరాచక బృందం పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నదన్నారు.ఈనాడు రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ కులగజ్జితో పిచి్చరాతలు రాస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మరని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ తరహాలో నెల్లూరును అభివృద్ధి చేస్తామని తెలిపారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందజేసేందుకు సచివాలయ , వలంటీర్ వ్యవస్థను జగన్ ప్రవేశపెట్టారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో రైతుల భూములు కాజేస్తారని అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ఎన్డీఏ కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ అభ్యర్థి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుని తలుచుకుంటే కరువు గుర్తొస్తుందన్నారు. నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ అందరికీ సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. ప్రజలు ఆశీర్వదించి వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. -
వైఎస్సార్సీపీ దూకుడు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రచారంలో వైఎస్సార్సీపీ శ్రేణులు దూసుకెళ్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు జనం సునామీలా పోటెత్తుతూ నీరాజనాలు పలుకుతుంటే.. కూటమి ప్రధానంగా టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రచారానికి జనస్పందన కన్పించడంలేదు. కానీ, ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతుంటే.. కూటమి అభ్యర్థుల ప్రచారానికి ప్రజా స్పందన లభించడంలేదు. ఇది కూటమి కార్యకర్తలను నైరాశ్యానికి గురిచేస్తే.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి ‘జగన్ కోసం సిద్ధం’ పేరుతో ఇంటింటా ప్రచారానికి పార్టీ శ్రేణులు శ్రీకారం చుట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 శాసనసభ స్థానాల్లోని 47 వేల పోలింగ్ బూత్‌ల పరిధిలో బూత్ కమిటీల కన్వినర్లు, అందులోని సభ్యులు మొత్తం కలిపి 4.70 లక్షల మంది ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ అమలుచేశారని వివరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వివరిస్తూ.. నవరత్నాలు ప్లస్ ద్వారా పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా చేసేందుకు సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ‘మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ ఇంట్లో మీకు మేలు జరిగి ఉంటే.. మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి.. స్టార్ క్యాంపెయినర్లుగా మారి ప్రభుత్వం చేసిన మంచిని వంద మందికి వివరించి, ప్రతి ఒక్కరితో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయించండి’ అని సీఎం జగన్ ఇచ్చిన పిలుపును గుర్తుచేస్తున్నారు. ప్రజలు బ్రహ్మరథం ఇదిలా ఉంటే.. తొలిరోజున స్వచ్ఛందంగా తొమ్మిది లక్షల మంది సీఎం జగన్‌కు, వైఎస్సార్సీపీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారుతామని తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ప్రచారపర్వం ముగిసే వరకూ ‘జగన్ కోసం సిద్ధం’ పేరుతో ఇంటింటా ప్రచారాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహించనున్నాయి. మద్యం సరఫరా, విక్రయాలపై నిరంతర నిఘా సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిస్టిలరీలు, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్‌కు చెందిన ఐఎంఎల్ మద్యం డిపోలు, మద్యం దుకాణాల్లోని మద్యాన్ని ఎన్నికల అక్రమాలకు వినియోగించకుండా ఎక్సైజ్ శాఖ పటిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నది. అందుకోసం రాష్ట్రంలోని 37 డిస్టిలరీలు, 4 బ్రూవరీలలో తయారైన మద్యాన్ని 29 ఐఎంఎల్ డిపోలకు సరఫరా.. డిపోల నుంచి మద్యం దుకాణాలు, బార్లకు సరఫరా వరకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది. మద్యం సరఫరా చేసే అన్ని వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తుంది. ఇక రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలు, మద్యం డిపోలు, మద్యం దుకాణాల్లో 363 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమాండ్కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి నిశితంగా పర్యవేక్షిస్తుంది. -
మోసం.. వంచన.. అప్పుడూ, ఇప్పుడూ బాబు మేనిఫెస్టో అదే..
2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్👉: 58 నెలల్లో నవరత్నాల పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లు జమ 👉: సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో మరో రూ.95,001 కోట్లు 👉: డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.3,61,811 కోట్లు.. ఏటా సగటున రూ.72,362 కోట్లు వ్యయం 👉: సీఎం రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు అండ్ గ్యాంగ్ 👉: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరం 👉: అంటే.. ఇప్పటి కంటే ఏటా రూ.92,638 కోట్లకుపైగా అదనంగా అవసరం 👉: టీడీపీ మేనిఫెస్టో అమలుకు ఐదేళ్లలో మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లకుపైగా అవసరం 👉: డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు వ్యయం చేసిన దాని కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం 👉: సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు 👉: పద్నాలుగేళ్ల బాబు పాలనలో ప్రతిఏటా రెవెన్యూ లోటేనని సాక్ష్యాలతో వివరించిన సీఎం జగన్👉: ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో మురళీమోహన్ వంటి బినామీలకే సంపద సృష్టించిన చంద్రబాబు 👉: 2014–19 మధ్య అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా బినామీలకు భూ సంపద సృష్టించిన వైనం 👉: ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఖజానా నుంచి ఖర్చు పెట్టి బినామీలకు సంపద సృష్టించేలా ఎత్తుగడ 👉: 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నారని మేనిఫెస్టోను ముట్టుకోని బీజేపీ 👉: పథకాల అమలుకు నిధులు ఎలా తెస్తారో వివరణ ఇవ్వాలంటున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు 👉: వివరణ ఇవ్వకపోతే తాను మోసం చేస్తున్నట్లు చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టీకరణసాక్షి, అమరావతి: ఎన్నికల్లో అలవికాని హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈసారి విశ్వరూపం ప్రదర్శించారు. జనసేన, బీజేపీలతో జత కట్టినా ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి వచ్చి ఉనికి చాటుకోవడం కోసం ఆచరణలో అమలుకు వీలుకాని రీతిలో హామీలతో ముంచెత్తుతూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన తరహాలోనే ఈసారీ ప్రజలను వంచించడానికి సిద్ధమయ్యారని గ్రహించిన బీజేపీ.. మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదని టీడీపీ వర్గాలే చర్చించుకుంటుండటం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. గత 58 నెలల్లో నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్ష చూపకుండా.. అవినీతికి తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.95,001 కోట్లు వ్యయం చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటిదాకా రూ.3,61,811 కోట్లు వ్యయం చేశారు. అంటే ఏడాదికి సగటున రూ.72,362 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తుంటే.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి శ్రీలంకగా మార్చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడితే.. ఎల్లో మీడియా అదే పల్లవి అందుకుంది.అదనంగా రూ.4,63,189 కోట్లు ఎలా తెస్తావ్ బాబూ? టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్‌తోపాటు పేర్కొన్న ఇతర హామీల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరమని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే అదనంగా ఏటా రూ.92,638 కోట్లు అవసరం. ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లు అవసరం. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు ఐదేళ్లలో చేసిన వ్యయం కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎలా తెస్తావని ప్రశి్నస్తుంటే సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు తప్పించి స్పష్టంగా లెక్క చెప్పలేక తప్పించుకుంటున్నారు. హైటెక్ సిటీలో, అమరావతిలో బినామీలకే సంపద సృష్టి గతంలో సంపద సృష్టించానని, ఇప్పుడూ సంపద సృష్టించి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1995–2004 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు.. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో మురళీమోహన్ వంటి బినామీలు, వందిమాగధులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేయించారు. ఆ తర్వాత హైటెక్ సిటీ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసి బినామీలకు సంపద సృష్టించారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక.. విజయవాడ–గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసే చోటు గురించి బినామీలు, వందిమాగధులకు ముందుగా లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. వేలాది ఎకరాల భూములు తక్కువ ధరలకే కొల్లగొట్టారు. ఆ భూ సంపదను రెట్టింపు చేయడానికి రాజధానిగా అమరావతిని చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ ఖజానా నుంచి అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి.. బినామీలు, వందిమాగధులు కాజేసిన భూ సంపదను మరింతగా పెంచడానికి ఎత్తులు వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజన తర్వాత రాష్ట్రాన్ని 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పాలించా రు. ఆ 14 ఏళ్లు.. ప్రతి ఏటా రెవెన్యూ లోటే. ఎడాపెడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని రుణాల ఊబిలోకి నెట్టిందీ చంద్రబాబే. 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్‌రేట్ (సీఏజీఆర్) 21.87 శాతం. కానీ.. సీఎం జగన్ హయాంలో 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. దీన్ని బట్టి చంద్రబాబే ఎడాపెడా అప్పులు తెచ్చినట్లు స్పష్టమవుతోంది. 👉: అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు అధికారంలోకి రాక ముందు అంటే 2014 జూన్ 7 నాటికి రాష్ట్రానికి రూ.1,53,346 కోట్ల అప్పు ఉంటే.. 2019 మే 29 నాటికి అది రూ.4,12,288 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ అప్పులు రూ.7,03,471 కోట్లకు చేరాయి. 👉: సంపద సృష్టించానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ.. వాస్తవానికి చంద్రబాబు హయాం (2014–19)లో మూలధన వ్యయం ఏటా సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం జగన్ గత ఐదేళ్లు ఏటా సగటున రూ.17,757 కోట్లు ఖర్చు చేశారు. 👉: జీడీపీలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది స్పష్టమవుతోంది. 👉: చంద్రబాబు హయాంలో జీఎస్డీపీలో పన్నుల భారం సగటున 6.57 శాతం ఉంటే.. జగన్ హయాంలో అది 6.35 శాతమే. అంటే.. సీఎం జగన్ హయాంలోనే పన్నుల భారం తక్కువ. ఇది ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా), కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తేల్చిన లెక్క.అప్పుడు అమెరికా అవుతుందా? పేదరిక నిర్మూలనే ధ్యేయంగా.. అవసరమైన మేరకు తక్కువగా అప్పులు చేస్తూ.. ప్రజలపై తక్కువగా పన్నుల భారం మోపుతూ.. ఆరి్థక క్రమశిక్షణ పాటిస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సీఎం జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయి. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలకు ఐదేళ్లలో రూ.8.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందా? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.నిధులు ఎలా తెస్తారో చెప్పండిటీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లు అవసరం. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే రూ.92,638 కోట్లు అదనంగా అవసరం. ఈ లెక్కన ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం. ఆ నిధులను ఎలా తెస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలని ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నానని చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టం చేస్తున్నారు. -
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
సాక్షి, అమరావతి: దేశమంతటా ఎన్డీయే మిత్రపక్షాలుగా కొనసాగుతున్న వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ గుర్తుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో, బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం ఫొటో జత పరిచి ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు – పవన్‌కల్యాణ్‌లు అమలుకు సాధ్యం కాని ఆల్ ఫ్రీ హామీలు ఇస్తుండడంతో ఉమ్మడి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేనట్లు బీజేపీ వ్యవహరించిందని స్పష్టమవుతోంది. అందువల్లే మంగళవారం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోలో మోదీ, కమలం ఫొటోలు చోటుచేసుకోలేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనప్పటికీ.. లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఆ రాష్ట్రంలోని పీఎంకే, తమిళ్ మానిల కాంగ్రెస్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ ఇటీవల వేరుగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ముఖచిత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించింది. పీఎంకే కూడా విడిగా మేనిఫెస్టోను విడుదల చేయగా, దాని చివరి పేజీలో బీజేపీ గుర్తు కమలం సహా అన్ని మిత్రపక్ష పార్టీల గుర్తులను ముద్రించింది. ఇందుకు బీజేపీ కూడా అంగీకారం తెలిపింది. ఒక్క ఏపీలో మాత్రమే చంద్రబాబు, పవన్‌ల మేనిఫెస్టోపై తమ ముద్ర ఏదీ లేకుండా బీజేపీ జాగ్రత్త పడటం.. అసలు ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్ సింగ్ ఇష్టపడక పోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాబు అల్ ఫ్రీ హామీలను నమ్మే పరిస్థితి లేదు పదేళ్ల కిత్రం 2014లో టీడీపీ–బీజేపీ–జనసేనలు ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు ఇచి్చన హామీలలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాదాపు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు అదే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మూడు పార్టీల పొత్తులో మళ్లీ అన్నీ అల్ ఫ్రీ హామీలనే ఇవ్వడంతో వాటి అమలులో సాధ్యాసాధ్యాలపై బీజేపీకి నమ్మకం కుదరలేదని తెలుస్తోంది. అందుకే పొత్తులో ఉన్నప్పటికీ ఉమ్మడి మేనిఫెస్టోకు దూరం జరిగింది. ‘గత వారం బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రాలలో పొత్తులో ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు మా మద్దతు ఉంటుంది’ అనే ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. అయితే బీజేపీ కేవలం కంటితుడుపుగా తమ మిత్రపక్షాలను సంతృపి పరచడం కోసమే ఈ వ్యాఖ్యలు చేసిందని పలువురు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు.. బీజేపీ జాతీయ స్థాయిలో ఎన్డీయే మేనిఫెస్టోను ప్రకటించినప్పటికీ, రాష్ట్ర పార్టీ వేరుగా మేనిఫెస్టోను విడుదల చేసింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఒక మేనిఫెస్టోను, సీమాంధ్రకు మరొక మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. 2019 ఎన్నికల సమయంలోనూ బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను ప్రకటించినప్పటికీ, రాష్ట్ర స్థాయిలో వేరుగా మరొక మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ పరంపరలో కేవలం చంద్రబాబు–పవన్‌ల మేనిఫెస్టోలోని హామీలపై నమ్మకం లేకే బీజేపీ ఢిల్లీ పెద్దలు జాతీయ మేనిఫెస్టోతో సరిపెట్టి, మద్దతు మాత్రమే ఇచ్చారని రాష్ట్ర బీజేపీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఈ అవమానకర విషయాన్ని ఎలా అధిగమించాలో తెలియక చంద్రబాబు అండ్ గ్యాంగ్ తల పట్టుకుంది. -
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా
మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న -
గ్లాసు ముక్కలైంది.. సేనానినే గుచ్చుతోంది
ఏయ్ జగన్. నువ్వెంత.. నీ బతుకెంత అని అరిచి గగ్గోలు పెట్టాడు.. నాకు మోడీ తెలుసు.. అమిత్ షా తెలుసు.. వాళ్ళ ఫోన్ నంబర్ల తెలుసు.. నాకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉంది.. ఒక్కటి గుర్తెట్టుకో.. గ్లాసు పగిలేకొద్ది పదునెక్కుతుంది. ఇన్ని కబుర్లు చెప్పాడు.. ఇప్పుడు చూస్తే చివరకు సేనాని గాజు గ్లాసును కాపాడుకోలేకపోయారు. జనసేనా పోటీ చేస్తున్న 21 చోట్ల మాత్రం గాజుగ్లాసు ఆ అభ్యర్థులకు కేటాయించారు. అలా జనసేన పోటీలో లేని చోట్ల మాత్రం ఆ గ్లాసు గుర్తును ఓపెన్ సింబల్‌గా ఉంచేసి స్వాతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తు కేటాయించారు. దీంతో ఈ పరిణామం చూస్తుంటే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాల ఈవీఎంల్లోనూ గాజుగ్లాసు ఉంటుందన్నమాట. ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో జనసేన పార్టీ ఉనికి చాటుకోలేకపోవడం, అసలు ఎన్నికల్లో పోటీ చేసి నిబంధనల మేరకు ఓట్లు సాదించకపోవడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్న ఎన్నికల సంఘం ఇప్పుడు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ చేసేసి అందరికీ పంచేసింది. ఇదిప్పుడు కూటమి అభ్యర్థులపాలిట పెనుముప్పుగా మారిందిఅసలు పార్టీని సీరియస్‌గా నడిపే ఉద్దేశ్యం లేని పవన్ కేవలం చంద్రబాబుకు మద్దతుదారుగా ఉండడానికే మొగ్గు చూపి చివరకు పార్టీ ఉనికికి ముప్పు తెచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ఎన్ని చోట్ల, ఎన్ని నియోజకవర్గాల్లో ఒరిజినల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇంకెన్ని చోట్ల టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న గెస్ట్ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నది కూడా పవన్‌కు తెలీనట్లె ఉంది. ప్రజలకు అయితే అసలు ఎక్కడెక్కడ జనసేనా బరిలో ఉందో తెలీదు. అయితే అధికారికంగా మాత్రం కేవలం 21 అసెంబ్లీ, మచిలీపట్నం కాకినాడ రెండు ఎంపీ సీట్లలో జనసేన అధికారికంగా పోటీ చేస్తూ మిగతా చోట్ల టీడీపీ-బిజెపి అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది. అంటే జానసేన పోటీలో లోని చోట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు ఓటర్లు అటు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. వేయిస్తారు అన్నమాట. మరి ఇప్పుడు అన్నిచోట్లా స్వాతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గ్లాసు గుర్తు కేటాయించేయడంతో జనసేనకు, టీడీపీ అభ్యర్థులకు పెద్ద చిక్కొచ్చి పడింది. మా ఊళ్ళో మాకు రావాల్సిన జనసేన ఓట్లు గాజు గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్ అభ్యర్థికి పోలైతే.. ఆ మేరకు తమకు నష్టం కలుగుతుందని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. 2014లో మంగళగిరి నుంచి వైసిపి తరఫున గెలిచిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కేవలం 12ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఇంకా 2019లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కేవలం పాతిక ఓట్ల మెజారిటీతో బొండా ఉమాను ఓడించి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక విశాఖ జిల్లాలో టీడీపీ తరఫున గంటా శ్రీనివాస్ 1944 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజోలులో జనసేన తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ మెజారిటీ కేవలం 814 ఓట్లు.. అంటే ఇలా తక్కువ మెజారిటీ ఉన్నచోట మూడునాలుగు వేల జనసేన ఓట్లు కానీ గాజు గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్లు పట్టుకుపోతే తమ పరిస్థితి ఏమిటని కూటమి కలవరపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో గాజు గ్లాసు గుర్తు పొందిన కొందరు స్వాతంత్ర అభ్యర్థులు జాబితా ఇదిగో.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు... జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో... గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించబడిన అభ్యర్ధులు...విజయనగరం మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్ధగా నామినేషన్ వేసిన మీసాల గీతమైలవరం లో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్విజయవాడ సెంట్రల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్టెక్కలిలో స్వతంత్రం అభ్యర్థి అట్టాడ రాజేష్కాకినాడ జిల్లా: జగ్గంపేట నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రపెదకూరపాడు లో కుట్ర కోణం: ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు, స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన నంబూరు కళ్యాణ్ బాబుకు గ్లాస్ టంబ్లర్ గుర్తును కేటాయింపుగన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణమంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్ధి రావుసుబ్రహ్మణ్యం కి గాజుగ్లాసు గుర్తు కేటాయించిన రిటర్నింగ్ అధికారిమదనపల్లె లో ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న షాజహాన్అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీకి చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప్విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి.. నవతరం పార్టీ అభ్యర్ధి కృష్ణ కిషోర్రాజమండ్రి సిటీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ కు పోటీ చేస్తున్న, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థి మేడా శ్రీనివాసరావు గాజు గ్లాసు గుర్తు పై కోర్టులో విజయం సాధించిన హైకోర్టు అడ్వకేట్ మెడా శ్రీనివాసరావు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరుపున గాజు గ్లాసు గుర్తు తో రాష్ట్రంలో ఇంకా కొంతమంది పోటీలో ఉన్నారు.:::: సిమ్మాదిరప్పన్న -
కూటమికి గుచ్చుకున్న గాజు గ్లాసు!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి మరో తల నొప్పి మొదలైంది. టీడీపీ, జనసేన పార్టీ రెబల్స్ ఇస్తున్న షాక్‌కు కూటమికి గాజు గ్లాసు గుచ్చుకుంటోంది. గాజు గ్లాసుతో టీడీపీ, జనసేన రెబల్స్ పోటీలోకి దిగుతున్నారు. తాజాగా గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈసీపై.. టీడీపీ, బీజేపీ పార్టీల ఒత్తిడి ఫలించదు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించింది.దీంతో 21 అసెంబ్లీ చోట్ల జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తుండగా.. ఈసీ ప్రకటనతో మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించే అవకాశం ఉంది. కాగా, టీడీపీ, జనసేన రెబల్స్.. గాజు గ్లాస్ గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు, జగ్గంపేట జనసేన రెబల్ సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాస్ కేటాయించింది. ఇక.. ఎస్ కోటలో జనసేన రెబల్ కొట్యాడ లోకాభిరామకోటి గాజు గ్లాస్‌తో పోటీకి దిగుతున్నారు. మరోవైపు.. టీడీపీకి పలు నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద తప్పటం లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, పెనుగొండ, హిందూపురంలో బరిలో రెబల్ అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. సినీనటుడు బాలకృష్ణపై పరిపూర్ణానంద స్వామి, పరిటాల సునీతపై ప్రొఫెసర్ రాజేష్, అదితి గజపతిపై మీసాల గీత , జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర, రఘురామకృష్ణంరాజుపై ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు, పోలవరంలో టీడీపీ రెబల్ మొడియం సూర్యచంద్రరావు బరిలో నిలుస్తున్నారు. -
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్‌సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్‌తో వైఎస్సార్సీపీలో జోష్ -
ఇలాగైతే కష్టం... గ్యారంటీగా గెలవం హామీలతో ముంచేద్దాం
సాక్షి, అమరావతి: జనసేన, బీజేపీతో జట్టుకట్టినా ఘోర పరాజయం తప్పదని ఆందోళన చెందుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అలవికాని బోగస్ హామీలు గుప్పించేందుకు సన్నద్ధమయ్యారు. గతేడాది మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి సూపర్ సిక్స్ ముసుగుతో మినీ మేనిఫెస్టో అంటూ ప్రకటించారు. ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోవడం.. చంద్రబాబు అంటేనే మోసాలకు మరోపేరు అని ప్రజలు గుర్తించడంతో ‘సూపర్ సిక్స్’ను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు తరహాలో బోగస్ హామీలతో మేనిఫెస్టోను వదిలేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోను తాను ప్రకటిస్తే జనం పొరపాటున కూడా నమ్మరని పసిగట్టిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో దాన్ని విడుదల చేయించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ముఖచిత్రాన్ని మార్చేసిన ‘సిద్ధం’ సభలు, బస్సు యాత్ర..సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు తాడేపల్లిగూడెంలో పవన్‌కళ్యాణ్‌తో కలిసి నిర్వహించిన జెండా సభ, ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అవకాశవాద పొత్తును జనం ఛీకొట్టారనడానికి జెండా సభ, చిలకలూరిపేట సభ నిదర్శనంగా నిలిస్తే.. సీఎం జగన్‌పై ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ‘సిద్ధం’ సభలు నిలిచాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ఏ ప్రాంతంలోనూ జన స్పందన కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27 నుంచి ఈ నెల 24 వరకూ 23 జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తీవ్ర ఫ్రస్టేషన్‌తో ఊగిపోతున్న బాబు..సీఎం జగన్ బస్సు యాత్ర సృష్టించిన ప్రకంపనలతోపాటు ఏకంగా 20కిపైగా జాతీయ మీడియా సంస్థలు, పొలిటికల్ కన్సెల్టెన్సీలు నిర్వహించిన సర్వేల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని తేల్చిచెప్పడంతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో నైరాశ్యం నెలకొంది.నామినేషన్ల ఘట్టంలోనే కాడి పారేస్తున్నాయి. తీవ్ర ఫ్రస్టేషన్ (నిరాశ, నిస్పృహ)తో సీఎం జగన్‌పై నోరు పారేసుకుంటున్నారు. ఇటీవల విజయనగరంలో ప్రజాగళం సభలో సీఎం జగన్‌ను తూలనాడే క్రమంలో.. నెత్తిపై రూపాయి పెడితే పైసాకు కొనుక్కోవడానికి కూడా పవన్ కళ్యాణ్ పనికి రారంటూ చంద్రబాబు తన మనసులో మాట బయట పెట్టడమే అందుకు నిదర్శనం. ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరి తన వద్ద పనిచేసే బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బూతుపురాణం వల్లించడం వారి ఫ్రస్టేషన్‌కు పరాకాష్ట. వైఎస్సార్సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగాలంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతుండటం చూస్తే వారిలో ఫ్రస్టేషన్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటిలాగే బోగస్ హామీలతో ఇప్పుడూ..విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీలతో జట్టుకట్టిన చంద్రబాబు వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానంటూ నాడు 650కిపైగా అలవికాని హామీలిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫోటోలను ముద్రించిన పత్రంతో ముఖ్యమైన హామీలంటూ తన సంతకం చేసి మరీ ఇంటింటికీ పంపి ప్రచారం చేయించారు. అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేశారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో ఎన్నికల మేనిఫెస్టోను ఏకంగా టీడీపీ వెబ్సైట్ నుంచి చంద్రబాబు మాయం చేయించారు.ఇప్పుడూ అదే కూటమిగా జట్టు కట్టిన చంద్రబాబు 2014 తరహాలోనూ బోగస్ హామీలతో మరోసారి ప్రజలను బురిడీ కొట్టించేందుకు ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోను తాను ప్రకటిస్తే ప్రజలు ఛీకొడతారని గుర్తించడంతో మే 3వ తేదీన రాష్ట్రంలో నిర్వహించే సభలో ప్రధాని మోదీతో విడుదల చేయించేందుకు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనం ఖాయంరాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సీఎం జగన్ బస్సు యాత్ర సమూలంగా మార్చేసిందని.. పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ, కూటమి అభ్యర్థులు తేలాక జాతీయ మీడియా సంస్థలు, ప్రతిష్టాత్మక పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన 20 సర్వేల్లో ‘‘ఫ్యాన్’’ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేల్చాయి.సీ–ఓటర్ సర్వే ఒక్కటి మాత్రమే కూటమి విజయం సాధిస్తుందని పేర్కొంది. అయితే సీ–ఓటర్ నిర్వహించే సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత ఉండదు. 2004, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుందని సీ–ఓటర్ పేర్కొనగా ఆ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తుందని సీ–ఓటర్ ఢంకా భజాయిస్తే వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. -
April 20th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
-
April 19th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 19th AP Elections 2024 News Political Updates.. 08:50 PM, Apr 19th, 2024 షర్మిలకు ఈసీ నోటీసులు వైఎస్ వివేకా హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఈసీ నోటీసులు వివేకా హత్య కేసులో పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న షర్మిల అవినాష్‌రెడ్డి, మల్లాది విష్ణు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలకు నోటీసులు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే విచక్షణాధికారంతో చర్యలు తీసుకుంటామని స్పష్టం 05:20 PM, Apr 19th, 2024 కాకినాడు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగం.. ముఖ్యంశాలు ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ నగరా మోగింది. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారు ఇంటింట ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్‌వార్ జరుగుతోంది ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుంది ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. రాబోయే 60 నెలల పాటు ఎలాంటి పరిపాలన ఉండాలని నిర్ణయించే ఎన్నికలు వచ్చే ఐదేళ్ల కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు కొనసాగలా.. వద్దా అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం అవుతుంది జగన్‌కు ఓటేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే.. పథకాలన్నీ కొనసాగతాయి లేదంటే బాబు మార్క్‌తో. మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి ఇది బాబు చెబుతున్న చరిత్ర.. బాబు చూసిన ఏ ఒక్కరికైనా అర్థమయ్యే చరిత్ర మ్యానిఫెస్టోతో మోసం చేయడానికి బాబు మళ్లీ సిద్ధం అయ్యాడు జగన్‌కు ఓటేస్తే.. పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ జగన్ మార్క్ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్‌తో కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుంది. అదే సమయంలో పెన్షన్ అందిస్తున్న జగన్ మార్క్ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలను నేరుగా నా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశాం ఎక్కడ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పాలన కొనసాగింది. లేదంటే ఇప్పుడు జరుగుతున్న దానికి బాబు మార్క్ ముగింపు ఉంటుంది మళ్లీ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది.. మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి.. వదల బొమ్మాలి అంటూ మీ రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తాడు ఫ్యాన్‌కు ఓటేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్‌తో ముగింపు పడుతుంది. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. ఉచిత పంటల బీమా.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే రుణాలు, ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే.. రైతన్నకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. దళారిలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు, ఇతర పంటలు కొనుగోలు అన్నది జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే అనేది గుర్తుపెట్టుకోండి లేదంటే.. చంద్రబాబు మార్క్‌తో ముగింపు ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్ బడుల్లో రూపు రేఖలు మార్చే నాడు-నాడు ఫ్యాన్‌కు ఓటేస్తేనే మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ బోధన, మూడో తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ఆరో తరగతికి వచ్చేసరికి డిజిటల్ బోధన, ఐఎఫ్బీ ప్యానల్స్, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఇక పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ దీనిలో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన డిగ్రీ చదువుతున్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువుల్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ద్వారా విదేశాల్లో అతి ఉన్నత విద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం తొలిసారి డిగ్రీలో మ్యాండెటరీ ఇంటెర్న్షిప్ ఇవన్నీ కొనసాగి మీ పిల్లలు ఎదగాలంటే.. మీ బిడ్డ వైఎస్ జగన్ 10 ఏళ్లు ఇదే స్థానంలో ఉంటే జగన్ మార్క్ విప్లవాలు కొనసాగుతాయి. 05:00 PM, Apr 19th, 2024 పుట్టపర్తి సొమ్ములు ఎక్కడికి పోయాయంటే.? మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ కిరణ్ కుమార్ రెడ్డి దోపిడీ దొంగ పుట్టపర్తి సాయిబాబా చనిపోయినప్పుడు వేల కోట్లు దోచుకున్నాడు సాయిబాబా మరణ వార్తను వారంపాటు ప్లాన్ ప్రకారం బయట పెట్టలేదు అదే సమయంలో నగదు, బంగారం ట్రక్కుల ద్వారా తరలించాడు చిదంబరానికి డబ్బు సంచులు ఇచ్చి సీఎం పదవి తెచ్చుకున్నాడు అప్పుడే రాష్ట్ర విభజనకు కుట్ర జరిగింది 04:50 PM, Apr 19th, 2024 మంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే దౌర్జన్యాలు,అరాచకాలకు పాల్పడేలా టిడిపి నేతలను ప్రోత్సహిస్తున్న లోకేష్. మేకా వెంకటరెడ్డిపై దారుణంగా హత్యాయత్నం చేశారు. ఓటమి భయంతోనే లోకేష్ ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకుని బాధ్యులను శిక్షించి బ్రెయిన్ డెడ్ అయిన వెంకటరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలి. -వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల డిమాండ్ 04:40 PM, Apr 19th, 2024 కృష్ణాజిల్లా: 25 సంవత్సరాలు వైఎస్సార్సీపీ అధికారంలో ఉంటుంది: జోగి రమేష్ వచ్చే 23 రోజులు కీలకం. 25 సంవత్సరాలు వైఎస్సార్సీపీ అధికారంలో ఉంటుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడం లేదు ఎమ్మెల్యే అయితే చాలనుకుంటున్నాడు. అన్ని సర్వేలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయి బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతుంది. 25న సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మేనిఫెస్టో ప్రకటిస్తాం 03:50 PM, Apr 19th, 2024 లోకేష్‌ను అరెస్టు చేయాలి: ఎమ్మెల్యే ఆర్కే తెలుగుదేశం కార్యకర్తల దాడిలో గాయపడి బ్రెయిన్ డెత్ అయిన మేకా వెంకట రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నారా లోకేష్ ఓటమి భయంతోనే మంగళగిరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నాడు. మేకా వెంకట్ రెడ్డిని అత్యంత దారుణంగా బైక్ తో గుద్దారు. తెలుగుదేశం కార్యకర్తల దాడిలో గాయపడిన మేకా వెంకట్ రెడ్డి కు బ్రెయిన్ డెత్ అయిందని వైద్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని వైద్యులు చెప్తున్నారు. 15 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనం పైన తెలుగుదేశం నాయకులు దాడి చేశారు. లోకేష్‌కే ఈ దాడులు చేయిస్తున్నాడు. వెంటనే లోకేష్‌ను అరెస్టు చేయాలి. తెలుగుదేశం కార్యకర్తల దాడిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ కామెంట్స్. తెలుగుదేశం నాయకుల దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఎలాంటి దాడులకు చోటు లేదు. మంగళగిరిలో తెలుగుదేశం నాయకులు భయపెట్టి ఎన్నికలు చేయాలనుకుంటే కుదరదు. తెలుగుదేశం కార్యకర్తల దాడిలో మేక వెంకట్ రెడ్డికి బ్రెయిన్ డెత్ అయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు. 03:15 PM, Apr 19th, 2024 ఏపీ అప్పులపై చంద్రబాబు, రామోజీరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కొండా రాజీవ్, వైఎస్సార్ అధికార ప్రతినిధి సీఎం జగన్ హయాంలో రూ. 2.68 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశారు రాష్ట్రం మొత్తం అప్పు రూ. 7 లక్షల కోట్లు కానీ చంద్రబాబు, రామోజీరావు రూ. 12 లక్షల కోట్లు అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు చంద్రబాబు హయాంలో జి ఎస్ డి పి వృద్ధి 5.44 శాతం తో 22 వ స్థానంలో ఉంచాడు సీఎం జగన్ హయాంలో 18.4 శాతం జీఎస్డీపీ వృద్ధి సాధించాం ఈ రాష్ట్రంలో 16 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చెప్పింది తలసరి ఆదాయం పెరిగి.మన ర్యాంక్ 9 వస్థానానికి పెరిగింది నిరుద్యోగ శాతం తగ్గిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క పోర్టు,.ఒక్క మెడికల్ కాలేజి కట్టలేదు సిగ్గులేదా..? గుజరాత్ కంటే ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి చంద్రబాబు, పచ్చ మీడియా ఎన్ని తప్పుడు కథనాలు రాసినా ప్రజలు సీఎం జగన్‌కే మళ్ళీ పట్టం కడతారు 02:19 PM, Apr 19th, 2024 నిరాడంబరంగా ఉండటం నా నైజం: వైఎస్ అవినాష్‌రెడ్డి నిరాడంబరంగా కడప పార్లమెంట్ స్దానానికి నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి అందుకే నామినేషన్ నిరాడంబరంగా దాఖలు వేశాను ఈ ఎన్నికల్లో భగవంతుడి అశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్దిస్తున్నా ప్రజల అశీస్సులు కూడా మెండుగా ఉండాలని కొరుతున్నా ఈ ఐదేళ్లు జిల్లా అభివృద్ది విషయంలో వెనకపడకుండా చూశాం పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాం బద్వేలులో సెంచూరీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 1200 మంది పని చేస్తున్నారు కొప్పర్తిలోను పలు పరిశ్రమలొచ్చాయి కొప్పర్తిలో లక్ష మందికి ఉపాధి కల్పించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం పులివెందులలోను అదిత్య బిర్లా వంటి పరిశ్రమలను ఏర్పాటు చేశాం గండికోటలో 27 టీసీఎంల నీరు నింపగలిగాం గండికోటలో నీరు నిలువ చేయడం వల్లే ఇంతటి కరవు సమయంలోను దాహర్తిని తీర్చగలిగాం ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది జరుగుతోంది కోవిడ్ ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగాయి ఈ ఐదేళ్ల కాలంలో పార్లమెంట్లో అనేక అంశాలు ప్రస్తావించాను ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను కృష్ణా జలాల రీ అలకేషన్ కు సంబంధించి ప్రస్తావించాను కడప ఎయిర్ పొర్టు టర్మినల్ అభివృద్దికి కృషి చేశా కడప-బెంగుళురు రైల్వే లైన్‌కు రాష్టం నుంచి ఇవ్వాల్సిన వాట ఇవ్వలేమని గత టీడీపీ ప్రభుత్వం లేఖ రాసింది కర్ణాటకలోను భూసేకరణ ఉండటం వల్ల అలస్యమవుతోంది ఫీజు బుల్టి సాధ్యపడితే కడప-బెంగుళూరు ప్రయాణం కల సాకారం అవుతుంది 01:56 PM, Apr 19th, 2024 తణుకులో టీడీపీ, జనసేన నేతల ఓవరాక్షన్ నామినేషన్ దాఖలుకు అభ్యర్థితో పాటు నలుగురికి అనుమతి బారికేడ్లు తోసుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలు 01:38 PM, Apr 19th, 2024 రాజానగరం అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా నామినేషన్ రాజానగరం నియోజకవర్గంలో గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం కరోనా సమయంలో ప్రజలకు విస్తృతంగా సహాయం అందించాం రానున్న రోజుల్లో ఉపాధి పరిశ్రమలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తాం ఐదేళ్లుగా నిరంతరం ప్రజల్లోనే ఉన్నాము మందగా వచ్చే ప్రతిపక్షాలను ప్రజలు నమ్మరు సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర ప్రజలంతా తోడుంటారు 01:17 PM, Apr 19th, 2024 నగరి ప్రజలు నా వెన్నంటే ఉన్నారు: మంత్రి ఆర్కే రోజా నా కష్టాన్ని గుర్తించిన జగనన్న చెల్లెలుగా భావించి అండగా నిలిచారు: మంత్రి ఆర్కే రోజా నగరి నుంచి గెలిచి అసెంబ్లీ ప్రజల సమస్యలు, రాష్ట్ర సమస్యలను వినిపించాను నా సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చారు. 3వ సారి టికెట్ లేదని ప్రచారం చేశారు. సీఎం జగన్ అండతో నామినేషన్ వేశాను నగరి ప్రజలు అండగా నిలిచారు.. నామినేషన్ కాదు విజయోత్సవ ర్యాలీలా ఈ రోజు ర్యాలీ జరిగింది. 151 సీట్లు ప్రజలు ఇస్తే సంక్షేమం, అభివృద్ధి చేశారు తప్పకుండా హ్యాట్రిక్ కొడతాను 10 వేల మెజారిటీ గెలుస్తా.. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు అండగా ఉంటాను. మూడో సారి నగరిలో హ్యాట్రిక్ విజయం సాధించి అన్నకు గిప్ట్గా ఇస్తా నగరి ప్రజలు నా వెన్నంటి ఉన్నారు నగరి లో వెన్నుపోటు రాజకీయాలు చేసే నాయకులకు మే 13 ప్రజలు తగిన బుద్ధి చెబుతారు సీఎం జగన్ సహకారంతో నగరి మరింత అభివృద్ది చేస్తాం 11:34 AM, Apr 19th, 2024 జగ్గయ్యపేట టీడీపీలో భగ్గుమన్న విబేధాలు జగ్గయ్యపేట కూటమి అభ్యర్ధి టీడీపీ నేత శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య)కు నిరసనసెగ వత్సవాయి మండలం తాళ్లూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీరామ్ రాజగోపాల్ రాజగోపాల్‌ను అడ్డుకున్న టీడీపీ నాయకుడు బొల్లా రామకృష్ణ వర్గం రామకృష్ణ టీడీపీ వ్యక్తి కాదని ఇటీవల వ్యాఖ్యలు చేసిన శ్రీరామ్ రాజగోపాల్ బొల్లా రామకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై తమకు సమాధానం చెప్పాలంటూ శ్రీరామ్ రాజగోపాల్‌ను అడ్డుకున్న రామకృష్ణ వర్గం నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు బొల్లా రామకృష్ణ ఇంటిలోకి పంపించేసిన పోలీసులు ఇంటి లోపల నుంచే ప్లకార్డులతో నిరసన తెలిపిన బొల్లా రామకృష్ణ అనుచరులు శ్రీరామ్ రాజగోపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు 11:23 AM, Apr 19th, 2024 సీఎం జగన్‌పై హత్యాయత్నం వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి సీఎం జగన్‌పై 2 సార్లు ఎటాక్ జరిగింది.. 2 సార్లూ చంద్రబాబే చేయించారు మానవత్వం, విలువలు లేని వ్యక్తి చంద్రబాబు 11:14 AM, Apr 19th, 2024 ఆరు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మారే అవకాశం? రఘురామకృష్ణరాజు కోసం ఉండి ఎమ్మెల్యేకి చంద్రబాబు వెన్నుపోటు ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి టికెట్ రఘురామకృష్ణరాజుకు దాదాపు ఖరారు తమ ఎంపీ అభ్యర్థులను మార్చేది లేదని చెప్పేసిన బీజేపీ నరసాపురం ఎంపీ సీటును ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన బీజేపీ ఇన్నాళ్లు వాడుకున్న రఘురామకృష్ణరాజుకి ఉండి ఎమ్మెల్యే సీటు ఇస్తున్న చంద్రబాబు ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి చేతులు దులుపుకొనున్న చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లిస్తానని గతంలో చెప్పి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు అనపర్తి - దెందులూరు మధ్య ఇంకా తేలని పంచాయితీ అనపర్తి సీటు టీడీపీకి, దెందులూరు సీటు బీజేపీకి ఇచ్చేలా ప్రతిపాదనలు దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌తో అధిష్టానం చర్చలు మాడుగులలో పైలా ప్రసాద్ బదులు బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చే అవకాశం మడకశిర అభ్యర్థి అనిల్ కుమార్‌కు బదులు ఎమ్మెస్ రాజుకు ఇచ్చే ఆలోచన తంబళ్లపల్లె అభ్యర్థి జై చంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదా సరళా రెడ్డికి ఇచ్చే అవకాశం 11:11 AM, Apr 19th, 2024 విశాఖ వెస్ట్: టీడీపీ ఎమ్మెల్యే గణబాబు చీఫ్ ట్రిక్స్ గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ నామినేషన్ వేస్తున్నారని గుడి తాళం తీయడంలో జాప్యం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తీసే ఆలయం తలుపులు ఎనిమిది గంటలకు తెరవని ఆలయ నిర్వాహకులు గుడి తాళం తెరవకపోవడంతో రెండు గంటలుగా ఆలయం బయట ఉన్న భక్తులు ఓటమి భయంతో గణబాబు చీఫ్ పాలి ట్రిక్స్ చేస్తున్నారని భక్తులు ఆగ్రహం గోపాల్‌పట్నం గ్రామానికి చెందిన నూకాంబిక ఆలయాన్ని తన కుటుంబ సభ్యుల ఆధీనంలో వుంచుకున్న గణబాబు 10:42 AM, Apr 19th, 2024 కాకినాడ జిల్లాలో టీడీపీ, జనసేనకు ఎదురు దెబ్బ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన జనసేన నేతలు పొలసపల్లి సరోజ, విజయ్ గోపాల్, టీడీపీ నేతలు తోట నాయుడు, ముత్యాల శ్రీనివాస్ 10:39 AM, Apr 19th, 2024 వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరికలు వైఎస్సార్సీపీలోకి నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుకాంత్‌రెడ్డి, జనసేన నేతలు కాటంరెడ్డి జగదీష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజర్ల సుబ్బారావు, కాంగ్రెస్ నేతలు పంతం నెహ్రూ, ఇందిర 10:13 AM, Apr 19th, 2024 సీఎం జగన్ బస్సు యాత్రతో ప్రతిపక్షాల్లో వణుకు: మంత్రి వేణు తూర్పుగోదావరిలో సీఎం జగన్ రోడ్ షో అత్యద్భుతంగా జరిగింది స్వచ్ఛందంగా వేల సంఖ్యలో జనం తరలివచ్చారు ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు సీఎం రాక కోసం ఎదురు చూశారు సీఎం జగన్ పై తమకున్న ప్రేమాభిమానాలను జనం చూపించారు సీఎంకు ఉన్న జనాభిమానాన్ని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి వారి మీడియాలో అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు ఎవరేనుకున్నా వైఎస్ జగన్‌కు అత్యధిక ప్రజాదరణ రోడ్ షోలో మరోసారి స్పష్టమైంది 09:10 AM, Apr 19th, 2024 అనకాపల్లి: మాడుగుల టీడీపీలో గందరగోళం మాడుగుల టీడీపీ అభ్యర్థి మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం నామినేషన్ వేసేందుకు సిద్దమైన పైల ప్రసాదరావు టికెట్ తనదేనంటున్నబండారు సత్యనారాయణ తగ్గేదే లేదంటూ నేడు నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకున్న పైలా ప్రసాదరావు మాడుగుల టీడీపీ అయోమయం ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో క్యాడర్.. 07:46 AM, Apr 19th, 2024 వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’మూక హత్యాయత్నం కళ్యాణదుర్గంలో దారుణం మూకుమ్మడి దాడికి దిగిన టీడీపీ అభ్యర్థి అమిలినేని బంధువులు, బౌన్సర్లు ప్రచార రథం తాళాలు లాక్కుని కవ్వింపు వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాలువలో పడేసి పిడిగుద్దులు గుండెలపై రాళ్లతో కొట్టి, కాళ్లతో తొక్కి చంపే ప్రయత్నం గాయపడిన ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థి వాహన డ్రైవర్ విధుల్లో ఉన్న పట్టణ సీఐ హరినాథ్‌పైనా చిందులేసిన టీడీపీ నేతలు 07:31 AM, Apr 19th, 2024 గోదావరి పొడవునా.. ఉరకలెత్తిన జనం 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు.. జనసంద్రమైన రావులపాలెం.. రాజమహేంద్రి.. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు కడియపులంకలో సీఎం వైఎస్ జగన్‌పై పూల వర్షం వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో దిష్టి తీసిన మహిళలు అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణలశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు అడుగడుగునా అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం నుదుట గాయం బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం రాజమండ్రిలో జనజాతర🔥 మేమంతా సిద్ధం యాత్రకి భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు దిష్టి తీసి, హారతులు ఇచ్చి స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు సాయంత్రం 5.15 నుండి కొనసాగిన రోడ్ షో జనాలతో కిక్కిరిసిన దేవి చౌక్, ఆజాద్ సెంటర్లు జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన రాజమహేంద్రవరం.… pic.twitter.com/uJvhhlHh77 — YSR Congress Party (@YSRCParty) April 19, 2024 07:30 AM, Apr 19th, 2024 ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాజకీయాలకు అతీతంగా ఎన్నికల నిర్వహణ.. 12,459 సమస్యాత్మక కేంద్రాల్లో లోపల, బయట కెమెరాలు మొత్తం 30,111 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌టెలికాస్టింగ్ ఇప్పటి వరకు రూ.121 కోట్ల విలువైన నగదు, వస్తువుల జప్తు సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తుపై పోలీసు అబ్జర్వర్ల పర్యవేక్షణ ప్రభుత్వ ఉద్యోగులు పాలనాంశాలపై మాట్లాడటం నిబంధనల ఉల్లంఘనే 07:10 AM, Apr 19th, 2024 బొండా బ్యాచ్ స్కెచ్.. సీఎం జగన్‌ను హత్య చేసేందుకే.. తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక కుట్రదారుల ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు ఏ1 సతీశ్ పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో సీఎంపై దాడి శాస్త్రీయ ఆధారాలతో కుట్రను ఛేదించిన పోలీసులు ఏ2తోపాటు తెరవెనుక కుట్రదారుల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకినిందితులిద్దరూ బొండా ఉమాతో కలసి దిగిన ఫొటోలు వైరల్ 07:07 AM, Apr 19th, 2024 రాష్ట్రానికి మీ కూటమి చేసిన మేలేమిటి? చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారు సీఎం జగన్‌ని మీరు ఎంత మాటైనా అనొచ్చు.. తిరిగి మిమ్మల్ని అంటే ఏడుపులా? టీడీపీలో ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు మంచోడు, మా పార్టీలో ఉంటే చెడ్డోడా? వాస్తవాలు చెప్పే జగన్ కావాలా?.. అబద్ధాల బాబు కావాలా?: పేర్ని నాని 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు మాట్లాడేవన్నీ పాపపు మాటలే నా కొడుకు గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ఆరోపణలు చేయడం దుర్మార్గం. -మాజీ మంత్రి పేర్ని నాని#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/KypoZ8Usk0 — YSR Congress Party (@YSRCParty) April 18, 2024 07:05 AM, Apr 19th, 2024 టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో చేటే ముస్లింలకు మేలు చేసింది సీఎం జగనే.. ఆయనతోనే ముస్లిం సమాజానికి భద్రత, భరోసా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా టీడీపీ భుజంపై గన్ పెట్టి ముస్లిం సమాజంపైకి గురిపెట్టిన బీజేపీ -
ఏపీలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
Updates ఏలూరు జిల్లా : నూజివీడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రబోయిన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురు దెబ్బ రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ రాప్తాడు ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్ పరిటాల సునీత ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా... రామచంద్రపురం ఆర్డీఒ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్.... పిల్లి సూర్యప్రకాష్ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి సుధా సుధా సాగర్‌కు అందజేత. అనంతపురం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ శాంత తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు అన్నమయ్య : రాజంపేటంలో అట్టహాసంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అకేపాటి అమరనాథరెడ్డి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించిన అమరనాథరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తిరుపతి కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు సూళ్లూరుపేట రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య హాజరైన ఎన్డీసిసిబి బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి, కలికి మాధవరెడ్డి ఎన్టీఆర్ జిల్లా నామినేషన్ సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ పూనూరు గౌతమ్ రెడ్డి తూర్పుగోదావరి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు కొవ్వూరులో ఆర్డిఓ ఆఫీస్ వద్ద 10 వేలమంది పార్టీ కార్యకర్తలు అభిమానులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు నెల్లూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కర్నూలు జిల్లా నామినేషన్ వేసిన బుట్ట రేణుక ఎమ్మిగనూరులో పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్ట రేణుక పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, వీరశైవ లింగాయత్ కార్పోరేషన్ చైర్మన్ రుద్ర గౌడ్ వైఎస్సార్ జిల్లా నామినేషన్ వేసిన రఘురామి రెడ్డి మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామి రెడ్డి పాల్గొన్న వైఎస్ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు భూమన అభినయ్ రెడ్డి నామినేషన్ దాఖలు తిరుపతి నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వెంట మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యుడు వెంకటేష్ తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన ఎం.సీ విజయనందరెడ్డి చిత్తూరులో అటహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం సి విజయనందరెడ్డి పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీ రెడ్డప్ప, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్ రెడ్డి తదితరులు నామినేషన్ దాఖలు చేసిన కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్సార్సీపీ తరుఫున కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక శ్రీశైలం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చక్రపాణిరెడ్డి ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న బుట్టా రేణుక మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న లోకేష్ చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న విజయానందరెడ్డి దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న శివ ప్రసాద్‌రెడ్డి నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ నేటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం నేడు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు. అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్‌గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేశారు. ఫారం–26 తప్పనిసరి.. ఇక నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్ సింబల్ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. నామినేషన్ రుసుం ఇలా.. పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నామినేషన్‌తో పాటు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది. నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్ నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి. ముఖ్యమైన తేదీలు నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్ 25 గురువారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18 గురువారం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 సోమవారం పోలింగ్ తేదీ మే 13 సోమవారం ఓట్ల లెక్కింపు జూన్ 4 మంగళవారం ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్ 6 గురువారం -
April 18th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 18th AP Elections 2024 News Political Updates.. 6:45PM, Apr 18th, 2024 నెల్లూరు: కుట్రలు చేస్తున్న చంద్రబాబుకీ ఇవే చివరి ఎన్నికలు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రాష్ట్ర సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించిన విషయాలన్నీ వాస్తవాలు సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంపాలని చూశారు హత్యయత్నం వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు.. వారి పాత్ర పై విచారణ జరపాలి.. కుట్రలు చేస్తున్న చంద్రబాబుకీ ఇవే చివరి ఎన్నికలు 6:38PM, Apr 18th, 2024 అమరావతి: చంద్రబాబు , పవన్ ఇప్పుడేమని సమాధానం చెబుతారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు చంద్రబాబు , పవన్ ప్రచార సభల్లో సీఎంపై వాడుతున్న అసభ్యకర పదజాలం పై ఈసీకి పిర్యాదు చేసాము నర్సీపట్నం లో అయ్యన్నపాత్రుడు సీఎం వైఎస్ జగన్‌ని దుర్భాషలాడారు రాజకీయ విలువలను దిగజార్చేలా మాట్లాడారు సభ్యసమాజం తలదించుకునేలా అయ్యన్న చేసిన వాఖ్యలపై కూడా పిర్యాదు చేశాం సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై కూడా ఈసీకి పిర్యాదు చేశాం చంద్రబాబు ,పవన్ విలువలు విశ్వసనీయత లేని నాయకులు దగా , కుట్రలకు కూటమి నిలువెత్తు నిదర్శనం సీఎంపై దాడి చేసిన వారికి చంద్రబాబు , పవన్ వత్తాసు పలికారు దాడి బూటకమని ఆరోపించారు నిందితులను పోలీసులు అరెస్ట్ చెసి కోర్టులో హాజరు పరిచారు చంద్రబాబు ,పవన్ ఇప్పుడేమని సమాధానం చెబుతారు 5:32PM, Apr 18th, 2024 అమరావతి: నేటి ఉదయం 11 నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. ముఖేష్ కుమార్ మీనా, ఏపీ సీఈవో ఈ నెల 25 వరకూ నామినేషన్లు స్వీకరణ..26న నామినేషన్లు పరిశీలన ఈ నెల 29 వరకూ నామినేషన్లు ఉపసంహరణ గడువు . ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్. అరకు, పాడేరు,రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ పోలింగ్ 50 మంది సాధారణ పరిశీలకులు ఉంటారు మొదటిసారి ఏపీ ఎన్నికలకు 18 మంది పోలీసు పరిశీలకులను నియమించారు. 85 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ అవకాశం. ఇవాల్టి నుంచి హోం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. 29 వరకూ హోం ఓటింగ్ కోసం అప్లికేషన్లు తీసుకుంటాం. మే 2 నుంచి 10 వరకూ ఇంటింటికీ పోలింగ్ టీమ్స్ వెళ్లి ఓటింగ్ తీసుకుంటాయి. సర్వీస్ ఓటర్లకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. మే 5 నుంచి 10 వరకూ ఎన్నికల విధుల్లో ఉన్న వారికి ఫెసిలిటిషవ్ సెంటర్లలో ఓటింగ్. 5,26,000 మందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంది . 4:20PM, Apr 18th, 2024 తాడేపల్లి: సీఎం జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే: సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ఆర్ఐలు స్వచందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చెయ్యడం సంతోషం ప్రజల్లో సీఎం జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు మన రాష్ట్రంలో మళ్ళీ సీఎం జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారు సీఎం జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే ఇది ఆకతాయిల చర్య కాదు దీని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అర్థరహితం ఈ ఘటన వెనుకనున్నవారు బయటకు రావాలి వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది బోండా ఉమానా, ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా విచారణలో తేలుతుంది తప్పు చేసినోడు నన్ను ఇరికించారాని మాట్లాడితే చెల్లుతుందా? 4:15PM, Apr 18th, 2024 తాడేపల్లి: బాబు, పవన్ అబద్ధాలు చెబుతూ ఓట్లు అడుగుతున్నారు: పేర్ని నాని చంద్రబాబు నోరు తెరిస్తే అసత్యాలే చంద్రబాబు మాట్లాడిన ప్రతీ మాట అబద్ధమే శిరోముండనం కేసు 1996లో జరిగింది 1995-2020 వరకూ తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు చంద్రబాబు బొంకు మాటల నాయుడు బాబు, పవన్‌పై నేను ఏనాడు బూతులు మాట్లాడలేదు బాబుకు వయసు పెరిగింది కానీ.. ఏం మాట్లాడాలో తెలియదు 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందరుకు ఏం చేశారు బందరుకు పూర్వవైభవం రావడానికి కారణం సీఎం జగన్ కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించాం పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నాం 26వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చాం కరోనా సమయంలో నా కొడుకు పేదలకు సేవ చేశాడు 75 ఏళ్ల వయసున్న చంద్రబాబువి అన్నీ పాపపు మాటలే నా కొడుకు గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారాలు చంద్రబాబు తీరును ప్రశ్నిస్తే నేను బూతులు నానినా? 3:15PM, Apr 18th, 2024 ఏలూరు జిల్లా: నూజివీడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రబోయిన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు టీడీపీలో ఉన్నదంతా ప్యాకేజ్ బ్యాచ్ రెండు సార్లు నాకు నామాలు పెట్టారు 3:10PM, Apr 18th, 2024 విజయవాడ: 4 శాతం రిజర్వేషన్లు తీసేస్తామని అమిత్ షా చెప్పిందే కిషన్‌రెడ్డి, పురంధేశ్వరి చెప్తున్నారు సాక్షితో వైఎస్సార్సీపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ బీజేపీ నేతల స్టేట్మెంట్లను చంద్రబాబు ఖందించట్లేదు అంటే సమర్ధిస్తున్నట్టే కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న కూటమిని ఏపీ ప్రజలు నమ్మరు చంద్రబాబు ముస్లింల ద్రోహి గుంటూరు నారా హమారా సభలో నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులను కేసులు పెట్టి హింసించింది చంద్రబాబే చంద్రబాబును ముస్లిం సమాజం నమ్మదు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారు సీఏఏ, ఎన్ఆర్ సి వంటి నల్ల చట్టాలు అమలులోకి వస్తాయి పవన్ కళ్యాణ్ శాంతి భద్రతలను రెచ్చగొట్టేలా అనేక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతల వ్యాఖ్యలతో అన్నదమ్ముల్లాంటి హిందూ, ముస్లిం, కృష్టియన్లకు గొడవలు మొదలవుతాయి 2:50PM, Apr 18th, 2024 అనంతపురం: టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురు దెబ్బ రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ రాప్తాడు ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్ పరిటాల సునీత ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ 2:20PM, Apr 18th, 2024 తాడేపల్లి జూపూడి ప్రభాకర్ రావు, సోషల్ జస్టిస్ సలహాదారు.. కామెంట్లు ఈనాడు పత్రిక సీఎం జగన్‌పై దారుణంగా రాశారు దళితులను విడగొట్టి, దళితులను నీరు గార్చిన వ్యక్తి చంద్రబాబు కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదా రామోజీరావుకి కారంచేడు ఘటన కనిపించలేదా దళితులని ముక్కలు చేసి, సాక్ష్యాలు లేకుండా చేసింది చంద్రబాబు కాదా ఈనాడు లో ఒక్క రోజైన దళితుల వృద్ధి కోసం వార్త రాశావా మాదిగ పల్లెలు మీద దాడి చేసి చంపింది టీడీపీ కాదా ట్యాంక్ బండ్ మీద దళితులను గుర్రాలతో తొక్కించి చంపించింది చంద్రబాబు కాదా సీఎం జగన్ నా ఎస్సి, నా బీసీ, నా మైనారిటీ అంటుంటే రామోజీరావు తట్టుకోలేకపోతున్నాడు రామోజీరావు ని వయస్సుకి కూడా బుద్ధి లేదా దళితులు మురికిగా ఉంటారని చంద్రబాబు కేబినెట్లో మంత్రి అనలేదా ఎస్సిలకు ఎందుకురా రాజకీయాలు అన్నది టీడీపీ నాయకులు కాదా వై ఎస్ కుటుంబం లో దళితులను వివాహం చేసుకున్నారు ఉన్నారు రామోజీరావు, చంద్రబాబు ఇంట్లో ఎవరైనా ఎస్సిలు ఉన్నారా 14 ఏళ్ల లో చంద్రబాబు ఏనాడైనా దళితులకు మేలు చేశాడా సీఎం జగన్‌ని చూసి అన్నీ తడుపుకుంటున్నారు సీఎం జగన్‌ని చంపాలని కూడా చూశారు ఆ విచారణలో నిజాలు బయటకొస్తున్నాయ్ కాస్కోండి సీఎం జగన్ బి ఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయం సూత్రాన్ని అమలు చేస్తున్నారు చరిత్రలో ఎవ్వరు ఇవ్వని రాజకీయ అవకాశాలు ఇచ్చారు దళితుల్లో విషం నింపాలని రామోజీరావు తప్పుడు వార్తలు రాస్తున్నాడు 14 ఏళ్ళు ఎవడికి ఏం చేశాడో.. చంద్రబాబు చెప్పాలి బాలయోగిని స్పీకర్ కాకుండా అడ్డుకోవాలని చూడలేదా అబ్దుల్ కలాంని రాష్ట్రపతి ని చేశావంటే ఎవరైనా నమ్ముతారా నీకు, అబ్దుల్ కలాంకి ఏంటి సంబంధం సింగణమలలో ఓ సాధారణ టిప్పర్ డ్రైవర్ అయిన దళితుడికి సీటు ఇస్తే చంద్రబాబు అవమానించారు రామోజీరావు శరీరం దళితుల రక్తం, దళితుల చెమట, దళితుల వ్యతిరేక భావం తో నిండిపోయింది రాజధానిలో దళితులు ఉండటానికి వీల్లేదని చెప్పిన వాళ్ళు చంద్రబాబు, రామోజీ రావులు పేదవాడి వాసన, పేదవాడి నీడ వాళ్ళ మీద పడకూడదంట.! విజయవాడలో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చూడని దళిత వ్యతిరేక స్వభావం చంద్రబాబుది.! 01:45PM, Apr 18th, 2024 అన్నమయ్య జిల్లా : రాజంపేటంలో అట్టహాసంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ రాజంపేటలో వైసిపిదే గెలుపు: అమరనాథ్ రెడ్డి స్థానికుడిని, అందరికి అందుబాటులో ఉండే వాడిని సిఎం వైఎస్ జగన్ పాలనకు బ్రహ్మరథం పట్టడం ఖాయం 01:45PM, Apr 18th, 2024 ఢిల్లీ: మళ్లీ వాయిదాలు ఇవ్వం,. ఇదే చివరి అవకాశం ఓటుకు నోటు కేసు విచారణలో చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసిన సుప్రీం కోర్టు కేసు ప్రారంభం కాగానే విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు కేసు విచారణ జూలై 24కి వాయిదా ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని కోరిన తెలంగాణ తరఫున న్యాయవాది సెలవుల తర్వాత విచారణ జరపాలనుకొని చంద్రబాబు తరఫు న్యాయవాది ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలని , దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని పిటిషన్ చార్జిషీట్లో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ప్రస్తావించిన ఏసీబి 01:30PM, Apr 18th, 2024 అనకాపల్లి జిల్లా వైవీ సుబ్బారెడ్డి కామెంట్లు రాజధాని పేరిట దోచుకోవడానికే చంద్రబాబు నాయుడు అమరావతి నినాదం కేంద్రం దాతలు ఇచ్చిన నిధులు ఎప్పుడో దోచేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామంటే అడ్డుకుంటున్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖ రాజధానిని ఇప్పటికే సీఎం ప్రకటించారు విశాఖ రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది సీఎంపై రాళ్లదాడి వెనక టిడిపి ప్రమేయం కచ్చితంగా ఉంది ఆ విషయం దర్యాప్తులోనే తేలుతుంది సీఎం గెలుపు ఓర్వలేక ఈ ఇలాంటి దాడులకు టిడిపి పురి గొలుపుతోంది 01:00PM, Apr 18th, 2024 విజయవాడ: చంద్రబాబు, పవన్ పై మంత్రి జోగి రమేష్ మండిపాటు జగన్ పై విషం చిమ్ముతున్నారు జనప్రభంజనం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు సభలకు ఎక్కడా జనం లేరు జగన్ సభలకు ఎండ తీవ్రత లెక్కచేయకుండా జనం వస్తున్నారు చంద్రబాబును జనం నమ్మే పరిస్థితిలో లేరు పిఠాపురంలో గాజు గ్లాసు పగిలిపోవడం ఖాయం ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో జగన్ చూపించారు ఇద్దరు మోసగాళ్లు వెళ్లి ఢిల్లీ పార్టీతో కలిశారు విలువలు, విశ్వసనీయత వదిలేసి పొత్తులు పెట్టుకున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ-జనసేన అడ్రస్ గల్లంతే కుప్పంలో బాబు, పిఠాపురంలో పవన్ ఓడిపోతున్నారు ప్రజల మనస్సులు గెలిచిన నాయకుడు జగన్ 12:40PM, Apr 18th, 2024 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు లో టీడీపీకి ఎదురు దెబ్బ టీడీపీ అభ్యర్ధి వరుపుల సత్యప్రభ తీరుతో మనస్తాపం చెందిన జిల్లా అధికార ప్రతినిధి పైలా సుభాష్ చంద్రబోస్ తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా టీడీపీలో బీసీలకు గుర్తింపు లేదు పార్టీ ఆవిర్భావం నుండి సేవ చేస్తున్న తనకు గుర్తింపు లేకపోవడంతో పాటుగా.. అనేక అవమానాలు ఎదుర్కోన్నాని బోసు ఆవేదన 12:20PM, Apr 18th, 2024 విశాఖపట్నం: మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్.. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చెప్పిన మాటమీద నిలబడటం కోసం ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటారు విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు రేపు గెలిచిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది.. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయి చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్ర ను పట్టించుకోలేదు టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు 12:10PM, Apr 18th, 2024 కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండకూడదు.. ఆయనది చీప్ క్యారెక్టర్ కోవూరులో నన్ను ఓడించేందుకు.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశారు.. ఆయన బాగోతం అంతా నా దగ్గర ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో మరోసారి నామినేషన్ వేశా కోవూరు నియోజకవర్గము నల్లపురెడ్డి కుటుంబానికి అడ్డా.. కోవూరు ప్రజలు మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గడపగడపకి వెళ్లాయి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నా 12:00PM, Apr 18th, 2024 తండ్రిని అడ్డం పెట్టుకుని లోకేష్ మంత్రి కాలేదా?: దేవినేని అవినాష్ కామెంట్స్ స్కూల్స్ రూపు రేఖలు మార్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్ ప్రభుత్వమే గుర్తుకు వస్తోంది ప్రజలను మభ్య పెట్టి కాలం గడుపుతున్న స్థానిక టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏ ఇంటి తలుపు తట్టిన ఏది ఒక పథకం వచ్చింది అని ప్రతి మహిళ అంటున్నారు జూన్ 4 తరువాత రామరాజ్యం తలపించే జగన్ పాలన ప్రారంభమవుతుంది ప్రజలు కోరు కుంటున్నది జగన్ ప్రభుత్వమే రామాయణంలో రాముడు ఒక్కడే ఒకవైపు రావణ సమూహం ఒకవైపు ఉన్నాయి అదే చందంగా జగన్ ఒక్కడు ఒకవైపు రాక్షస కూటమీ ఒక వైపు నిలిచింది ఒక సీఎం కొడుకుగా గత ఎన్నికలలో లోకేష్ ఓడిపోలేదా పవన్ కళ్యాణ్‌ది వారసత్వం రాజకీయం కాదా చిరంజీవి లేక పవన్ కల్యాణ్‌కు సినీ జీవితం, రాజకీయ జీవితం ఎక్కడది వారసత్వ రాజకీయం గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవటానికి సిద్ధంగా వుండాలి పవన్ రాజకీయ జీవితం నాశనం చేసేది చంద్రబాబు నిత్యం ప్రజల్లో వుండే వ్యక్తులకు ప్రజలు ఎప్పుడూ అండగా వుంటారు బీసీ నేత లాకా వెంగళరావు యాదవ్ పాయింట్స్ గతం లో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు జగన్ అందించారు ఆరోగ్య శ్రీతో అనేక మందికి పేదలకి ఆరోగ్యం అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది 14 సీఎంగా చేసి ప్రజలకు ఉపయోగ పడే ఏ మేలు చేశారో.. చంద్రబాబు చెప్పాలి ఎవరు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారో ప్రజలు కూడా ఆలోచించాలి రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 100 స్థానాలు కేటాయించిన జగన్ వైఎస్ఆర్సీపీ అంటే పేదల పార్టీ 11:45AM, Apr 18th, 2024 ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ కేసు విచారణ జూలై 24 చివరికి వాయిదా ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని కోరిన తెలంగాణ తరఫున న్యాయవాది సెలవుల తర్వాత విచారణ జరపాలనుకొని చంద్రబాబు తరఫు న్యాయవాది ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని పిటిషన్ చార్జిషీట్లో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ప్రస్తావించిన ఏసీబి అయినా చంద్రబాబు నాయుడు పేరు నిందితుడిగా తెలంగాణ ఎసిబి చేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విచారణ జరిపిన జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తెలంగాణ ఏసిబి ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటపెట్టిన ఏసిబి "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ 11:30AM, Apr 18th, 2024 నెల్లూరు గందరగోళం సృష్టించాలని టీడీపీ నేతల కుట్రలు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. -నామినేషన్ సందర్భంగా గందరగోళం సృష్టించాలని తెలుగుదేశం పార్టీ నేతల కుట్రలు.. లోపలకీ అనుమతి ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వివాదం టిడిపి కార్యకర్తలని చెదరగొట్టిన పోలీసులు.. -వేమిరెడ్డి ప్రభాకర్ వందల కోట్లు ఖర్చుపెట్టి కోవూరులో గెలవాలని చూస్తున్నాడు.. సీఎం జగన్ బొమ్మతో ప్రజల్లోకి వెళ్తున్న తనను.. ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఎమ్మెల్యే ప్రసన్న ధీమా.. 11:10AM, Apr 18th, 2024 చిత్తూరు పుంగనూరులో టిడిపికి భారీ షాక్ టిడిపి నుంచి వైయస్ఆర్సీపీ లోకి భారీగా వలసలు టిడిపి నేత కృష్ణమూర్తి తో పాటు ఆయన భార్య మాజీ కౌన్సిలర్ లక్ష్మి తో పాటు మరో 100 కుటుంబాలు మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పెద్దిరెడ్డి 11:00AM, Apr 18th, 2024 ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు 10:30AM, Apr 18th, 2024 విజయవాడ దేవాలయాలని కూల్చి వేసిన దుర్మార్గుడు చంద్రబాబు: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రామతీర్థం, అంతర్వేది పూర్వవైపు తేచ్చింది సీఎం జగన్నే చంద్రబాబు బూట్లు వేసుకొని పూజ చేసే వ్యక్తి రూ. 70 కోట్ల నిధులతో బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయని అభివృద్ధి చేసింది సీఎం జగన్ శ్రీరామనవమి రోజు దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు సీఎం జగన్‌పై దాడిపట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారు బోండా ఉమా మాటల్లోనే అర్థమవుతుంది సీఎం జగన్‌పై దాడి చేసింది ఎవరో..? బోండా ఉమకి బుద్ధి జ్ఞానం లేదు ఎవరైనా కంటిమీద దాడి చేయించుకుంటారా..? బోండా ఉమా ఓడిపోతారని తెలుసు భూ కబ్జాలు, రౌడీయిజం, చేస్తారని ప్రజలందరికీ తెలుసు సీఎం జగన్ బస్సు యాత్ర సక్సెస్ అయిందని బోండా ఉమ సునకానందం పొందాడు పోలీసు వ్యవస్థ దర్యాప్తు చేస్తుంటే బోండా ఉమ ఎందుకు పారిపోతున్నాడు తప్పు నువ్వు చేసావు కాబట్టే భయపడుతున్నావ్ రాష్ట్రంలోని చేతులన్నీ బొండా ఉమా వైపే చూపెడుతున్నాయి బొండా మామ టీ షర్టులు వేసుకుని మారువేషంలో తిరుగుతున్నాడు తప్పు చేశాడు కాబట్టే మారువేషణలో తిరుగుతున్నాడు సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది అని ఆయన చెప్తున్నాడు ఎంపీ కేశినేని నాని కామెంట్స్ బొండా ఉమా వారిద్దరు కుమారులు రౌడీయిజం, గుండాయిజానికి పాల్పడుతున్నారు బోండా ఉమ బుడమేరును ఆక్రమించి భూకబ్జాలు చేశాడు కీచకుడు, కాలకేయుడు బోండా ఉమ సీఎం జగన్ తలకు వెల్లంపల్లి శ్రీనివాస్ కన్నుకు దాడికి పాల్పడటం దారుణమైన విషయం బోండా ఉమాకి దాడి చేయించిన విషయం తెలుసు చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రుడు బోండా ఉమా నిన్న బోండా ఉమ మా వాళ్లే కొట్టారు అన్న క్యాంటీన్ తీసినందుకానీ అనలేదా..? బోండా ఉమా రెండు రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చాడు ఏబీఎన్ ఛానల్లో బోండా ఉమా క్లియర్‌గా చెప్పాడు దాడి చేసామని చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాడు 10:00AM, Apr 18th, 2024 ప్రకాశం జిల్లా నేడు నామినేషన్ వేయనున్న దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కామెంట్స్ వైఎస్సార్సీపీకి జనంలో అనూహ్య స్పందన ఉంది ముఖ్యమంత్రి జగన్‌ను మళ్లీ సీఎంని చేసుకుంటాం అని జనం ముక్తకంఠంతో చెబుతున్నారు దర్శిలో నా గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు దర్శిలో అత్యధిక మెజారిటీతో నేను గెలవడం ఖాయం 9:30AM, Apr 18th, 2024 ఏపీలో మళ్లీ ఎగరబోతున్న వైఎస్సార్సీపీ జెండా! ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లని వైఎస్సార్సీపీ గెలవబోతున్నట్లు తేల్చిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ పోల్ స్కాన్ సర్వే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకుని వచ్చినా.. సింగిల్‌గానే 52.6 శాతం ఓటు షేర్ని వైఎస్సార్సీపీ కొల్లగొట్టబోతున్నట్లు తేల్చేసిన సర్వే మళ్లీ గెలిచేది జగనే ఏపీలో మళ్లీ ఎగరబోతున్న వైయస్ఆర్సీపీ జెండా! ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లని వైయస్ఆర్సీపీ గెలవబోతున్నట్లు తేల్చిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ పోల్ స్కాన్ సర్వే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకుని వచ్చినా.. సింగిల్‌గానే 52.6% శాతం ఓటు షేర్ని వైయస్ఆర్సీపీ… pic.twitter.com/y1eZEJLrhc — YSR Congress Party (@YSRCParty) April 18, 2024 9:00AM, Apr 18th, 2024 నామినేషన్ల పర్వం.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక శ్రీశైలం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చక్రపాణిరెడ్డి ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న బుట్టా రేణుక మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న లోకేష్ చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న విజయానందరెడ్డి దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న శివ ప్రసాద్‌రెడ్డి 08:45AM, Apr 18th, 2024 అనంతపురం: కళ్యాణదుర్గంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ ప్రచార రథంపై దాడి అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను విచక్షణా రహితంగా కొట్టిన టీడీపీ నేతలు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో ఘటన టీడీపీ నేతల గూండా గిరిపై కళ్యాణదుర్గం లో భయాందోళనలు 08:30AM, Apr 18th, 2024 తణుకు వైఎస్సార్సీపీలో చేరిన రాజోలు జనసేన ఇంచార్జ్ బొంతు రాజేశ్వరరావు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేరిన బొంతు రాజేశ్వరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్ 08:10AM, Apr 18th, 2024 ఢిల్లీ: నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలని , దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని పిటిషన్ చార్జిషీట్లో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ప్రస్తావించిన ఏసీబి అయినా చంద్రబాబు నాయుడు పేరు నిందితుడిగా తెలంగాణ ఎసిబి చేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విచారణ జరపనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తెలంగాణ ఏసిబి ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటపెట్టిన ఏసిబి "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ 07:50AM, Apr 18th, 2024 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేనకు షాక్ జనసేన పార్టీ కి రాజీనామా చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ బొంతు రాజేశ్వరరావు రాజేశ్వరరావు తోపాటు రాజీనామా చేసిన జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు ఇవాళ తణుకులో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్న బొంతు రాజేశ్వరరావు 07:40AM, Apr 18th, 2024 పార్వతీపురం మన్యం బీజేపీ అరకు పార్లమెంట్ టికెట్ ఆశావహుడు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్‌ను పార్టీ నుండి తొలగించిన బీజేపీ అరకు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎస్టీ కుల ధ్రువీకరణ ను ప్రశ్నించినందుకు వేటు వేసిన రాష్ట్ర పార్టీ ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్దపడుతున్న జయరాజ్ 07:30AM, Apr 18th, 2024 చెప్పిన మాట తప్పితే నాయకుడు ఎలా అవుతారు? చెప్పిన మాట తప్పితే నాయకుడు ఎలా అవుతారు? @Pawankalyan pic.twitter.com/CeTwj5Bh1u — YSR Congress Party (@YSRCParty) April 18, 2024 07:15AM, Apr 18th, 2024 పచ్చవన్నె మేధావులు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో చంద్రబాబుకుకొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల ఊడిగం వారికున్నది రాష్ట్రంపై ప్రేమ కాదు.. సీఎం జగన్‌పై కక్ష ముఖ్యమంత్రిపై బురద జల్లడమే వారి ఎజెండా సర్వీసులో ఉన్నప్పుడే చంద్రబాబు కోసం పరితపించిన ‘నిమ్మగడ్డ’ చట్ట పరిధిని దాటి స్థానిక ఎన్నికల్లో టీడీపీకి గులాంగిరి సీబీఐ డైరెక్టర్‌గా పనికిరాడని సుప్రీంకోర్టు తేల్చిన వ్యక్తి నాగేశ్వరరావు సర్వీసు పొడిగించలేదనే అక్కసుతో విషం కక్కుతున్న మరో మేధావి పీవీ రమేష్ ఇప్పుడు వీళ్లంతా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షకుల అవతారం సొంత ప్రయోజనాలు, రాజకీయ ఎజెండాతో ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు 07:00AM, Apr 18th, 2024 బాబు నుంచి షర్మిలకు రూ. 60 కోట్లు చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడిది? చంద్రబాబు డ్రామాలో షర్మిల, సునీత పాత్రధారులు వైఎస్ వివేకా హత్య కేసులో రాజకీయ కోణం లేదు.. మరో సంబంధం ఉంది సునీత, రాజశేఖర్ రెడ్డికి నార్కో అనాలసిస్ టెస్టులు చేయాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి 06:40AM, Apr 18th, 2024 నేటి నుంచి నామినేషన్ల పర్వం రాష్ట్రంలో మే 13న 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ.. 26న పరిశీలన 29 వరకు ఉపసంహరణకు చాన్స్ ఉ.11 నుంచి మ.3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి కి ఒకరు, స్వతంత్ర అభ్యర్థికి పదిమంది ఓటర్లు ప్రతిపాదించాలి ఎంపీ అభ్యర్థి నామినేషన్ రుసుం రూ.25,000.. ఎమ్మెల్యేకు రూ.10,000 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం రాయితీ.. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి 06:30AM, Apr 18th, 2024 వ్యూహకర్తలు హ్యాండ్సప్.. జారిన జాకీలు! విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం జనసేన, బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు సీట్లు అమ్ముకుంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని రాబిన్ నిర్వేదం.. సర్వేలు, స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా సీట్లిచ్చారు పార్టీ కోసం పని చేసిన వారిని పక్కనపెట్టి.. ధనవంతులకే సీట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించినా పట్టించుకోనప్పుడు మేమెందుకు? తమ ప్రయత్నాలు అంతా వృథా అయ్యాయని ఆక్రోశం రాబిన్ శర్మ చేతులెత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్ బృందం 06:20AM, Apr 18th, 2024 అవినీతి జీవి రూ.వందల కోట్లు కైంకర్యం వందలాది ఎకరాలభూముల ఆక్రమణ నకిలీ ఎరువులతో రైతులను నట్టేట ముంచిన వైనం రేషన్, ఇసుక, అక్రమ మద్యం మాటున అక్రమార్జన ఉపాధి హామీ, నీరు చెట్టు, సీసీరోడ్ల పేరుతో ప్రజాధనం లూటీ మరుగుదొడ్ల బిల్లుల్లోభారీగా చేతివాటం అభివృద్ధి పనుల్లోనూ మాయాజాలం వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు అవినీతి చిట్టా 06:10AM, Apr 18th, 2024 నీకింత..నాకింత...భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–4 అమరావతిని ముక్కలు చేసి పంచుకున్న చంద్రబాబు అండ్ కో లింగమనేని కోసం ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ మార్పులు ఆ భూముల విలువ రూ.2 వేల కోట్లకు పైగా చేరేలా పన్నాగం.. ప్రతిగా క్విడ్ ప్రోకోలో హెరిటేజ్‌కు భూములు, బాబుకు కరకట్ట బంగ్లా నారాయణ విద్యా సంస్థల కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు.. పవన్ కల్యాణ్‌కూ లాభం చేకూరుస్తూ అమరావతిలో ప్యాకేజీ 06:00AM, Apr 18th, 2024 కూటమి బలం 'నీటి బుడగే'! బస్సు యాత్రలో అడుగడుగునా సీఎం జగన్‌కు జన నీరాజనం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉప్పొంగిన అభిమాన సంద్రం వారధిపై పాదయాత్ర నాటి ప్రభంజనాన్ని తలపించిన బస్సు యాత్ర మండుటెండైనా.. అర్ధరాత్రయినా రోడ్ షోలకు పోటెత్తుతున్న జన సంద్రం విజయవాడలో 4.30 గంటలపాటు జైత్రయాత్రలా సాగిన రోడ్ షో తామెన్నడూ ఈ ప్రజా స్పందనను చూడలేదంటోన్న ఉద్యోగ, వ్యాపార వర్గాలు తాము పుంజుకున్నామనే చోట బస్సు యాత్ర సక్సెస్‌తో టీడీపీలో నైరాశ్యం తమది బలుపు కాదు వాపే అంటున్న టీడీపీ సీనియర్ నేతలు తొలిసారి ఓటేయబోతున్న 18–21 ఏళ్ల విద్యార్థులంతా జగన్ వెంటే.. మళ్లీ రాబోయేది వైఎస్సార్సీపీ సునామీయేనంటున్న రాజకీయ విశ్లేషకులు -
చౌదరికి 3డీ సినిమా ఖాయం!
అవును, సుజనా కోసం బీసీలు బలయ్యారు. ముస్లిం మైనార్టీలు మోసపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకే చెందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులను పక్కా ప్రణాళికతో బలి పశువుల్ని చేశారు. పార్ట్నర్ పవన్‌తో పోతిన వెంకట మహేష్ ను పొడిపించేశారు. పెత్తందారీ పోకడలకు ప్రతీకగా ప్రత్యేక గుర్తింపు పొందిన చౌదరి (సుజనాను బాబుతో సహా టీడీపీలోని ముఖ్యులు సైతం చౌదరి అనే సంభోదిస్తుంటారు) కోసం బాబు తమను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఫణంగా పెట్టేశారని ప శ్చిమలోని బీసీ, మైనార్టీ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని నిప్పులు చెరుగుతున్నారు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని ఆక్రమించేసుకున్నాక చంద్రబాబు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఆప్షన్‌గా ఎంచుకున్నారు. అక్కడి నేతలు సొంతంగా బలపడకుండా చూసుకోవడంలో జాగ్రత్త పడుతున్నట్లు ప్రతి ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు నిర్ధారిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం అనంతరం ఒంటరిగా పోటీ చేసింది తక్కువే. 1998 లోక్‌సభ ఉప ఎన్నిక మొదలు 1999, 2004, 2009, 2014 జనరల్ ఎలక్షన్లలో వామపక్షాలు, బీజేపీ, మహాకూటమి, జనసేనలతో టీడీపీ కూటమి కట్టి తలపడింది. 2019లో నేరుగా పోటీ అన్నట్లు కలరింగ్ ఇచ్చినా, జనసేనతో లోపాయికారీ ఒప్పందం లేకపోలేదు. 2004, 2009, 2019 ఎన్నికల్లో తలపడిన టీడీపీ ఓటమి చెందింది. 1983లో మాత్రమే టీడీపీ నుంచి బి.ఎస్.జయరాజ్ పోటీచేసి సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. కాగా సైద్ధాంతికంగా భిన్న ధృవాలైన సీపీఐ, బీజేపీలకు ప శ్చిమ సీటును కేటాయించడం బాబుకే సాధ్యమైంది. తరచూ ఇంఛార్జిల మార్పుతో ఏమార్పు పశ్చిమలో సంస్థాగతంగా పార్టీ బలపడక పోవడానికి, నిలకడగా ఏ ఒక్కరికీ నాయకత్వాన్ని అప్పగించక పోవడానికి.. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం బాబుకు లేకపోవడమే. కూటమి కట్టినప్పుడల్లా ప శ్చిమ సీటును ఇతరులకు కేటాయించడం బాబుకు పరిపాటి. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలతో పాటు పోటీ చేసి ఓడిన బీసీలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా (దూదేకుల), మైనార్టీ వర్గానికి చెందిన జలీల్‌ఖాన్, ఆయన కూతురు షబనా ఖాతూన్, మొహమ్మద్ ఫతావుల్లా, ఎంఎస్ బేగ్ తదితర నాయకులు టీడీపీ నుంచి ఉన్నారు. వీరిలో ఎవరికి వారికి నియోజకవర్గ ఇంఛార్జి స్థాయి నీదే అనడం, ఆ తర్వాత కొంత కాలానికి పక్కన పెట్టేయడం చంద్రబాబుకు ఇక్కడ చెల్లుబాటయ్యింది. ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ను అడ్డుగా పెట్టి.. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ను దాదాపు రెండన్నరేళ్లకు పైగా ప శ్చిమ నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగిస్తూ అదే ప్రాంతానికి చెందిన బుద్ధా వెంకన్న, జలీల్‌ఖాన్, నాగుల్‌మీరా, ఫతావుల్లా తదితరులను పక్కన పెట్టుకుని వారి చేతనే కేశినేనికి వ్యతిరేకంగా వ్యవహరింపజేయడం బాబుకే చెల్లిందని నగర నేతల ఏకాభిప్రాయం. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రచారమప్పుడు నగరమంతా నవ్వుకునేలా ముఖ్య నాయకులను వీధుల్లోకి చేర్చి తిట్ల దండకాలను కొనసాగించడం కొసమెరుపు. ఒకే ఎత్తుగడతో అందర్నీ చిత్తు చేయడమనేది బాబు నైజమని ఆ పార్టీలోని సీనియర్లు వల్లెవేసే మాట. పవన్ చేత పోతినను... జనసేన కోసం ఏళ్ల తరబడి పనిచేసిన, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి 22,367 ఓట్లు పొందిన బీసీ వర్గానికి చెందిన పోతిన వెంకట మహే‹Ùను సుజనా చౌదరి సీటు కోసం తన రాజకీయ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ చేత చంద్రబాబు పొడిపించేశాడని స్థానికంగా వాడ వాడ కోడైకూస్తోంది. చివరి నిమిషం వరకు సీటు ఆశించి మోసపోయిన పోతిన, జనసేనను వీడి వైఎస్సాఆర్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి కోటీశ్వరుడైనంత మాత్రాన బీసీలు డబ్బులకు అమ్ముడుపోతారని అనుకోవడం పొరపాటని పోతిన బాహాటంగానే ధ్వజమెత్తారు. ‘ధనికుడైనందున చౌదరిని బీజేపీ అభ్యర్థిగా తాము అంగీకరిస్తామని మా అధినేత అనుకుని ఉండొచ్చు. నోట్లతో ఓటర్లను, భారీ బేరసారాలతో మమ్మల్ని లొంగదీసుకోవచ్చనే అంచనాకు వచ్చి ఉండొచ్చు. సమకాలీన రాజకీయాల్లోని లోతుపాతులు మాకూ తెలిసొచ్చా యి. పెత్తందారు పచ్చనోట్లకు పేదలు, మాబోటి నాయకులందరూ లొంగి పోతారనుకోవడం పొరపాటని ‘పెద్దలు’ గ్రహించేలా గుణపాఠం నేర్పుతాం’ అని టీడీపీ, జనసేనల్లోని బీసీ, మైనార్టీల నేతలు చెబుతున్నారు. ‘వాళ్లు చేయాల్సింది చేశారు.. మేం చేయగలిగింది చేసి చూపిస్తాం’ అని వేర్వేరుగా ‘సాక్షి’తో వారు మనసులో మాట వెలిబుచ్చారు. సుజనా మాటకు నాని అడ్డుచెప్పరనే.. బీజేపీలోకి సుజనాను పంపింది, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప శ్చిమ సీటును కేటాయించిందీ బాబు అనేది జనమెరిగిన సత్యం. పొత్తు కుదరక ముందు వరకు.. సుజనా చౌదరి విజయవాడ లోక్‌సభ అభ్యర్థి అని పచ్చమీడియా, సోషల్ మీడియా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. సుజనా, కేశినేనిల మధ్య సాన్నిహిత్యం మెండుగా ఉన్నందున, చౌదరి మాటను నాని జవదాటరనేది బాబు నమ్మకం. బహుశా ఆ దృష్ట్యానే కేశినేనిని పశ్చిమ ఇంఛార్జిగా కొనసాగిస్తూ బీసీలు, మైనార్టీలను దూరంచేసే ప్రణాళికను బాబు అమలు పరిచారు. కాకపోతే ఊహించని రీతిలో బాబు ఎత్తులను చిత్తు చేస్తూ నాని టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పవన్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్
సినిమా వాళ్లకు అభిమానులు ఉండటం సహజం. తమ హీరో ఇంత గోప్పవాడు అంటూ ఫ్యాన్స్ కూడా ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో అద్దాల మేడలో ఉన్న సినిమా హీరోలు ఎప్పుడైతే జనం మధ్యకు వస్తారో వారి అసలు స్వరూపం మెల్లగా బయటపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో సినిమాల్లో పవర్ స్టార్‌గా ఉన్న పవన్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో ఆయన అసలు రూపం ఏంటో జనాలకు తెలిసొచ్చింది. సీఎం అవుదామనే మోజుతో పాలిటిక్స్‌లోకి వచ్చిన వవన్‌ను కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రజలు గెలిపించలేదు. కమల్ హాసన్,రజనీకాంత్,విజయ్ కాంత్,చిరంజీవి,ఉపేంద్ర వంటి స్టార్స్ అందరూ కూడా రాజకీయాలను టచ్ చేసిన వారే.. రాజకీయంగా ఒక ట్రయల్ వేద్దామని ఈ స్టార్స్ అందరూ గట్టిగానే ప్రయత్నించారు. రాజకీయంలో కొన్ని డక్కామొక్కీలు తిని పోరాటం చేశారు. కానీ సినిమా ఇమేజ్ ఇక్కడ పనికిరాదని గ్రహించారు. తొందరగానే ప్రజల స్పందన ఏమిటనేది వారికి అర్థమయ్యింది. దీంతో చిల్లర మాటలు మాట్లాడకుండా కాస్త గౌరవంగానే రాజకీయాలు చేశారు. వీరిలో రజనీకాంత్ అయితే రాజకీయ యుద్ధంలో అడుగు పెట్టకుండానే మిడిల్ డ్రాప్ అయ్యారు. ప్రజాదరణ పొందకపోతే పరువు పోతుందనే భావనతో నీట్‌గా తప్పుకున్నారు. ఇక్కడ చెప్పుకున్న ఈ హీరోలు అందురూ ఎవరి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చి రాణించిన వారు కావడం విశేషం. కమల్ హాసన్,రజనీకాంత్,విజయ్ కాంత్,చిరంజీవి,ఉపేంద్ర ఈ స్టార్స్ అందరూ కూడా వారసత్వాలతోనో, కుటుంబసభ్యులను అడ్డు పెట్టుకుని సినిమాల్లో ఎదిగిన వారు కాదు. అందుకే వారిలో విజ్ఞత కనిపించింది. వారు రాజకీయాల నుంచి తప్పుకున్నా వారిపై సమాజంలో గౌరవం మిగిలే ఉంది. కానీ పవన్ కల్యాణ్ పరిస్థితి వేరు. తన అన్నయ్య మెగాస్టార్ లేకపోతే.. ఎందుకూ అవసరం లేని ఒక ఆకతాయిగా మిగిలిపోయేవాడు. ఇదీ గ్రహించే ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు అవుతున్నా కనీసం సర్పంచ్ స్థాయి నాయకుడిని కూడా ఆయన తయారు చేయలేకపోయాడు. దీనంతటికి కారణం పవన్ మాటల్లో ఉన్న కష్టం చేతల్లో ఎక్కడా కనిపించదు. కేవలం ఎవరినో ఓడించాలనే ధోరణితోనే ఆయన రాజకీయ జీవితం కొనసాగుతుంది. ఇలాంటి ధోరణి తన సినిమాల్లో కూడా కనిపించదే.. సినిమాల్లో అయినా ఇలాంటి నీతిలేని పాత్రలో కనిపించే సాహసం పవన్ చేయగలుగుతాడా..? ఆ హీరోల అభిమానులకు గాలం వేస్తున్న పవన్ జీవితంలో తాను గెలవకపోయినా ఫర్వాలేదంటున్న పవన్.. సీఎం జగన్ ఓడిపోవాలని కోరుకుంటూనే చంద్రబాబును గెలిపించాలని తాపత్రయం పడుతున్నాడు. ఈ క్రమంలో బాబు చేతిలో పావుగా మారిన పవన్ ప్రజల్లో పరువు పోగొట్టుకోవడానికి అయినా రెడీ అయిపోయాడు. అందుకే చంద్రబాబు కోసం ఇతర హీరోల ఫ్యాన్స్‌ను అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే మహేష్ బాబు అభిమానులకు ఓసారి బిస్కెట్ వేశాడు. తనకంటే మహేష్ పెద్ద సూపర్ స్టార్ అన్నాడు. మహేష్ తనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడని కూడా గొప్పలు చెప్పాడు. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసే ప్లాన్ పవన్ వేస్తున్నాడు. వారి అభిమానులను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు. ప్రభాస్ గారు మా వాళ్లే.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ కూడా నాకు కావాల్సిన వాళ్లే అంటూ వారి అభిమానులందరూ నాకు సహకరించాలని వేడుకుంటున్నాడు. పవన్ నైజం తెలిసే ఇప్పటి వరకు కనీసం చిన్న హీరో కూడా జనసేనకు సపోర్ట్‌గా బయటకు రాలేదు. ఎవరూ లేకపోవడంతో జబర్ధస్త్‌గా నాగబాబు కమెడియన్ బ్యాచ్‌ను రంగంలోకి దింపాడు. తమ్ముడి కోసం మెగాస్టార్ రూ. 5 కోట్లు విరాళం అయితే ఇచ్చారు. కానీ వారి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి పవన్ కోసం పనిచేస్తున్నట్లు ఎక్కడా ప్రకటన లేదు. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి సభల్లో ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ అభిమానులు తమ హీరో ఫోటోతో పాటు జగన్ గారి ఫోటోను చేర్చి కనిపించడం విశేషం. ఇప్పుడు కొత్తగా ఓట్ల కోసం పవన్ వేస్తున్న గాలంలో ప్రభాస్,అల్లు అర్జున్,ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎట్టిపరిస్థితిల్లో పడరని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మంత్రి అమర్నాథ్ సమక్షంలో ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైసీపీ పార్టీలో చేరారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇతర హీరోలకు సంబంధించిన ఏ వేడుకలు జరిగినా కూడా పవన్ ఫ్యాన్స్ ఎలాంటి గోల చేస్తారో సినిమా అభిమానులకు చెప్పక్కరలేదు. ఇప్పుడు కూడా పవన్, ఆయన అభిమానులు ఓట్ల కోసం మాత్రమే ఇతర హీరోల అభిమానలను ఎలా బుట్టలో దించాలనే ప్రయాత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభాస్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్, మహేశ్ ఫ్యాన్స్ అంత అమాయికులేం కాదు.. గతాన్ని వారు మరిచిపోలేదు. సమయం వచ్చింది ఇప్పుడు సరిగ్గా పవన్‌కు బుద్ధి చెప్తారు. View this post on Instagram A post shared by Gudivada Amarnath (@gudivadaamarnath) -
ఫ్యాన్ గాలి ప్రచండం
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా, ఎక్స్.. వేదికగా ఒకటే చర్చ.. ‘ఈసారీ వైఎస్సార్సీపీనే వస్తుంది.. జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేలన్నీ పక్కాగా లెక్కలేసి చెబుతున్నాయి. సైంటిఫిక్ పారామీటర్స్‌తో సర్వే చేసి మరీ నొక్కి వక్కాణిస్తున్నాయి. పత్రికలకు సంపాదకులుగా పని చేసిన వాళ్లు, సీనియర్ పాత్రికేయులు కూడా అదే చెబుతున్నారు. కచ్చితంగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే జగన్ చేసిన మంచి పనులు అలాగున్నాయి కాబట్టి’ అంటూ ఊరూరా జనం చెబుతున్నారు. ‘మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయితేనే మా బతుకులు మారతాయని మా నమ్మకం. మేమంతా జగన్ బాటలోనే నడుస్తాం. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావడం తథ్యం. జగన్ అంటే విశ్వాసం.. చంద్రబాబు అంటే మోసం..’ అని నిన్న సిద్ధం సభల్లో.. ఇప్పుడు బస్సు యాత్రలో అశేష ప్రజానీకం తేల్చి చెబుతున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. గతంలో ఏం చేశామన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక, భవిష్యత్‌లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించింది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత భారీ విజయం సాధించిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చాక ప్రజా సంకల్ప పాదయాత్రలో.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొలి ఏడాదే 95 శాతం.. మొత్తమ్మీద 99 శాతం సీఎం జగన్ అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. లంచాలకు తావు లేకుండా.. వివక్షకు చోటు లేకుండా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో 87 శాతం కుటంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్‌డీబీటీ ద్వారా పేదలకు రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి కలిగింది. దేశ చరిత్రలో ఈ స్థాయిలో పేదలకు మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దనే ప్రజలకు అందిస్తున్నారు. వైద్య, విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి.. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. వీటన్నింటి వల్ల సుపరిపాలనతో నవచరిత్ర లిఖించిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకూ పెరుగుతోంది. 58% మహిళల ఓట్లు జగన్‌కే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాం. 50% కంటే ఎక్కువ ఓట్లతో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. సీఎం జగన్ నాయకత్వానికి మహిళలు 58% మంది మద్దతు పలుకుతున్నారు. దేశంలో ఏ నాయకుడికీ మహిళల్లో ఇంతటి ఆదరణ లేదు. సంక్షేమ పథకాల నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల వరకూ మహిళలకు పెద్దపీట వేస్తూ సాధికారతకు జగన్ తీసుకున్న చర్యలే ఆయన నాయకత్వంపై మహిళల్లో అత్యధికంగా ఆదరణ ఉండటానికి కారణం. - పార్థ దాస్ సెఫాలజిస్ట్, చాణక్య కన్సల్టెన్సీ జగన్‌పై విశ్వసనీయతే విజయానికి సోపానం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాం. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. సీఎం జగన్ నాయకత్వానికి మహిళలు 58 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. దేశంలో ఏ నాయకుడికీ మహిళల్లో ఇంతటి ఆదరణ లేదు. సంక్షేమ పథకాల నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల వరకూ మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతకు సీఎం జగన్ తీసుకున్న చర్యలే ఆయన నాయకత్వంపై మహిళల్లో అత్యధికంగా ఆదరణ ఉండటానికి కారణం. - పద్మజా జోషి, సీనియర్ న్యూస్ ఎడిటర్, టైమ్స్‌నౌ అప్రతిహతంగా బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం కడలిలా తరలివచ్చారు. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన బస్సు యాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సీఎం జగన్‌ను చూసేందుకు యువతీ యువకులతో కలిసి చంటి బిడ్డలను చంకనేసుకుని మహిళలు పోటీపడుతూ బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. మండుటెండైనా.. అర్ధ రాత్రయినా సీఎం వైఎస్ జగన్‌ను దగ్గరి నుంచి చూసేందుకు.. కరచాలనం చేసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. మేలు చేశాం.. ఓటేయండి అనేది మామూలుగా నేతల మాట. కానీ.. బస్సు యాత్రలో తద్భిన్నంగా ‘మీ పాలన వల్ల మాకు మంచి జరిగింది.. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం’ అంటూ ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు భరోసా ఇస్తున్నారు. రాజకీయాలలో ఇలాంటి అరుదైన ఘట్టాలను తానెన్నడూ చూడలేదని సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ జత కలిశాక, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు జనం ముఖం చాటేస్తుండటం.. నాడు సిద్ధం సభలు.. నేడు బస్సు యాత్రకు వస్తున్న స్పందనను చూస్తుంటే.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరో చారిత్రక విజయం ఖాయం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు, చాణక్య, బీపీఎస్, జన్మత్ పోల్స్, లోక్ పోల్స్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, మ్యాట్రిజ్ వంటి పొలిటికల్ కన్సల్టెన్సీలు అటు దేశ వ్యాప్తంగా.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాడి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాయి. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మ్యాట్రిజ్, డెక్కన్ 24/7 వంటి జాతీయ మీడియా సంస్థలు.. చాణక్య, మ్యాట్రిజ్ నుంచి జన్మత్ పోల్స్ వరకూ పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన డజనుకు పైగా సర్వేల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడించాయి. దాంతో జనసేన–బీజేపీతో చంద్రబాబు జట్టుకట్టారు. మూడు పార్టీల జెండాలు జత కలిసినా వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు కూటమి నిలబడలేదన్నది సర్వేల్లో వెల్లడైంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైఎస్సార్సీపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతూ వస్తోందని సర్వేలు వెల్లడించాయి. సుమారు 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు నిర్వహించిన సర్వేలు తేల్చి చెబుతున్నాయి. -
పథకం ప్రకారమే హత్యాయత్నం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అంతమొందించడమే లక్ష్యంగా పక్కా పథకం ప్రకారం హత్యాయత్నం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో క్యాటర్ బాల్ కంటే శక్తివంతమైన ఆయుధాన్ని వాడి ఉండొచ్చన్నారు. గురి తప్పకుండా కాల్చగల షార్ప్ షూటర్లే ఇలాంటి పనులు చేస్తారని చెప్పారు. ఎవరో శక్తివంతమైన వ్యక్తుల మద్దతు లేకుండా ఆగంతకులు ఈ పనిచేయరన్నారు. ఈ దారుణ ఘటనలో అదృష్టం బాగుండి సీఎం జగన్ బయటపడ్డారని తెలిపారు. తాము అనుకున్నది జరగలేదు కాబట్టే టీడీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇంతటి దుర్ఘటనను కూడా ఆ పార్టీ డ్రామాగా కొట్టిపారేయడం దారుణమన్నారు. ఎవరైనా తమ సునిశిత శరీర భాగంలో దాడి చేయించుకుంటారా అని నిలదీశారు. చంద్రబాబును చేయించుకోమనండి చూద్దామన్నారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌పై దాడి చేయాలని టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ చంద్రబాబు చేసిన పలు ప్రసంగాల వీడియో క్లిప్పులను మీడియాకు ప్రదర్శించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే.. సీఎం జగన్‌పై దాడిని దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఇక్కడ చంద్రబాబు ఖండించినా.. ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ నేతలు డ్రామా అంటూ హేళన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వీళ్లు మనుషులేనా అని అనిపిస్తోంది.. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం ప్రభంజనంలా తరలివస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. రెండు రోజుల క్రితం కూడా ‘రాళ్లతో కొట్టి, ఫ్యాన్ గుర్తు లేకుండా చేయండి.. జగన్‌ను మసి చేయండి.. టీడీపీ మీతో ఉంటుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టి సీఎం జగన్‌పై ఆయన హత్యాయత్నానికి పురిగొలిపినట్టనిపిస్తోంది. ఇవన్నీ ఎన్నికల సంఘానికి నివేదించి.. దాడులకు పురిగొలిపేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని తక్షణం అడ్డుకోవాలని కోరాం. గతంలో చంద్రబాబు అలిపిరి ఘటనను తానే చేసుకుని, సానుభూతి పొంది ఎన్నికలకు వెళ్లాలని చూశారా?.. నాడు చంద్రబాబు విషయంలో ఇలాంటి చిల్లర మాటలు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు సీఎం జగన్‌ను అనడానికి నోరెలా వస్తుంది? గతకొద్ది రోజులుగా చంద్రబాబు నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్‌పై విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. దీనివల్లే విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎం జగన్‌పై ‘ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్’ జరిగింది. ఇది రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. అంతా షాక్‌కు గురయ్యారు. ఆగంతకుడు విసిరిన పదునైన వస్తువు తగిలి సీఎం జగన్‌కు ఎడమ కనుబొమ పైభాగాన తీవ్ర గాయమైంది. అదే కొంచెం కింద తగిలి ఉంటే కంటి చూపే పోయేది. కణతకు తగిలితే ప్రాణానికే ప్రమాదం జరిగేది. అదృష్టం బాగుండి సీఎం జగన్ బయటపడ్డారు. బురదజల్లడమే టీడీపీ, జనసేన పని.. ప్రభుత్వంపై టీడీపీ, జనసేన బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయి. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే దానికి కూడా వక్రభాష్యం చెబుతున్నాయి. ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజువారీ కార్యకలాపాల నుంచి ప్రభుత్వం దూరం జరిగింది. చంద్రబాబులా మేమెప్పుడూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించి, దబాయించ లేదు. ఇలాంటప్పుడు ఎవరినీ ప్రభావితం చేసి, ప్రలోభపెట్టే అవకాశమే లేదు. రాత్రి 8 గంటల సమయంలో సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగితే.. గంటన్నర తర్వాత ఫొటోలు బయటకు ఇచ్చాం. ఇది ఆకతాయిల పనికాదని గాయం తీవ్రత చూశాకే తెలిసింది. షార్ప్ షూటర్లతోనే ఇలాంటివి సాధ్యం.. సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి పదునైన వస్తువును చేతితో విసరడం, క్యాటర్ బాల్ వాడటం కంటే మరేదో శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించి ఉండొచ్చు. సీఎంను అంతమొందించే కుట్రతోనే కణతను లక్ష్యంగా చేసుకుని పదునైన వస్తువుతో హత్యాయత్నం చేశారు. గురి తప్పకుండా కొట్టగలిగే షార్ప్ షూటర్లు మాత్రమే ఇలాంటివి చేయగలరు. దీనికి శక్తివంతమైనవారి మద్దతు ఇవ్వకుండా ఇదంతా సాధ్యపడదు. సింగ్‌నగర్ ప్రాంతంలో సీఎం జగన్ యాత్ర వెళ్తుందని తెలుసుకుని.. పక్కా ప్రణాళిక ప్రకారం ఓ ప్రైవేటు పాఠశాల వెనుక నక్కిన ఆగంతకులు సీఎం కణతపై గురిపెట్టి పదునైన వస్తువుతో హత్యాయత్నం చేశారు. సీఎం జగన్ టక్కున తల తిప్పడంతో ప్రాణాపాయం తప్పింది. పదునైన వస్తువు చాలా వేగంగా రావడంతోనే సీఎం ఎడమ కనుబొమ పైభాగాన బలంగా తగిలి.. పక్కనే ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికీ తీవ్ర గాయమైంది. వెలంపల్లి కంటి కార్నియాకు బలంగా తాకడంతో 48 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. ఒక వస్తువు ఇద్దరు వ్యక్తులను బలంగా గాయపరిచిందంటే.. ఎంతటి శక్తివంతమైన ఆయు«దాన్ని ఉపయోగించారో తెలుస్తోంది. ఇవన్నీ దర్యాప్తులో బయటపడతాయి. నిందితులను పట్టుకోవాలని ప్రతిపక్ష నేతలెవరూ కోరలేదు సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని ప్రతిపక్ష నాయకులు ఎవరూ కోరట్లేదు. చంద్రబాబు సైతం సీఎం త్వరగా కోలుకోవాలని కాకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. సీఎం తన రోడ్‌షోలో కరెంటు తీయించుకుని ఆయనే చేతులారా ఈ ఘటనకు కారణమయ్యారని టీడీపీ నేతలు అనడం దారుణం. రోడ్‌షోల్లో చంద్రబాబు బస్సు ఎక్కినా కరెంట్ తీస్తారు.. లేదంటే ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సీఎం జగన్‌పై హత్యాయత్నాన్ని భద్రతా వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆ విషయాన్ని పోలీసు శాఖ, ప్రభుత్వం చూసుకుంటుంది. చంద్రబాబుపై అలిపిరి ఘటన సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సంఘీభావంగా వెళ్లి మౌన దీక్ష చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా విభేదించాలి తప్ప ఇలాంటి ఘటనలను ప్రోత్సహించకూడదు. కానీ, టీడీపీ వ్యవహారశైలి పూర్తి భిన్నంగా ఉంది. ఇలాంటి దుశ్చర్యలను సీఎం జగన్ ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటారు. సోమవారం నుంచి యధావిధిగా బస్సుయాత్ర ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి అఖండ విజయం సాధిస్తుంది. ఎన్నికల సంఘానికి, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దాడి ఘటనలో టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం సచివాలయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ సోషల్ మీడియా, ఐటీడీపీ.. వివేకం సినిమా సీన్లను పోస్టు చేసి దుష్ప్రచారం చేస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనకు సంబంధించి దోషులను తక్షణమే పట్టుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో డీజీపీని వైఎస్సార్సీపీ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేయడం, గొడ్డలితో పోస్టులు పెట్టడం, టీడీపీ పాటలు సహా పలు అంశాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలకు టీడీపీ చేస్తున్న ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు, బల్క్ మెసేజ్‌ల గురించి డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సీఎం, వైఎస్సార్సీపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కట్టడి చేయాలని కోరామని తెలిపారు. సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక టీడీపీ గూండాల హస్తం ఉందని ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన టీడీపీ నేతలు పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా చంద్రబాబు పదేపదే చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు హత్యాయత్నానికి మూలకారణమన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేష్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, రావెల కిశోర్‌బాబు, మనోహర్‌రెడ్డి ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు!
పెళ్లి కార్డు చూసి.. అందులోని కుటుంబాలు.. బంధువుల తీరు చూసి అది ఎంత గొప్ప సంబంధమో చెప్పేయొచ్చు. సినిమా పోస్టర్‌లోని పేర్లు చూసి.. అంటే హీరో హీరోయిన్లు.. డైరెక్టర్.. మ్యూజిక్.. విలన్స్.. ఇతర టెక్నీషియన్స్‌ను చూసి అది ఎలాంటి కాంబినేషలో చెప్పేయొచ్చు. క్రికెట్ టీమ్ లోని సభ్యులను బట్టి ఆయా జట్టు ఎంత బలమైందో ఒక అంచనాకు రావచ్చు. అదే విధంగా ఒక రాజకీయ పార్టీ తానూ ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బట్టి.. దానికోసం ఆ పార్టీ చేసిన కసరత్తును బట్టి.. ప్రచార శైలిని బట్టి దానికి రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది.. ఆ పార్టీ గమనం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అందుకే పెద్దలు కాళ్ళు తొక్కినపుడే కాపురం కళ తెలిసిపోతుందని అనేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన ప్రకటించిన అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి ప్రజలు.. కార్యకర్తలు నీరుగారిపోగా ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే ప్రధాన ప్రచారకర్తలు (స్టార్ క్యాంపెయినర్లను) చూసి కూడా జనం నివ్వెరపోతున్నారు. మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ @JanaSenaParty కి అంత కామెడీ అయిపోయాయి! ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్షీట్లు చూసుకోండి! #PackageStarPK… https://t.co/4Sh27uDfyq — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 వాస్తవానికి ఏదైనా పార్టీ తరఫున ప్రముఖ రాజకీయ నాయకుడు.. లేదా పెద్ద క్రీడాకారుడు.. సినిమా స్టార్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటారు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్.. ఇతర టీవీ షోల్లో కామెడీ కార్యక్రమాలు వేసే కామెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు. డాన్స్ మాస్టర్ జానీ.. హైపర్ ఆది.. గెటప్ శీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇలాంటివాళ్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుని రాజాకీయ ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్లకు రాజకీయాలు గురించి ఏమైనా తెలుసా? వాళ్లకు కనీస అవగాహనా అయినా ఉందా.? అసలు ఆ పార్టీని నెత్తినపెట్టుకుని మోయాల్సిన అవసరం.. ఆ జనసేనకు వత్తాసు పలకాల్సిన అవసరం వాళ్లకు ఏముందనున్నది అర్థం కానీ విషయం. ఇక పార్టీలో కేవలం చందాలు వసూళ్లకు మాత్రమే ముందుకు వచ్చే నాగబాబు ఎక్కడా ప్రచారసభల్లోకి వెళ్లడం లేదు. పోనీ జనసేన పోటీ చేస్తున్న చోట్ల కూడా నాగబాబు ప్రచారం చేయడం లేదు. ఇదిలా ఉండగా కేవలం కొద్దిమంది టీవీ ఆర్టిస్టులు మినహా పవన్ వెంట ఎవరూ కనిపించడం లేదన్నది మరోమారు స్పష్టమైంది. పవన్‌కు రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం.. ఎలాంటి దృక్పథం ఉందన్నాడో ఈ ప్రచార కమిటీ చూస్తే తెలుస్తోందని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తమ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందినపేదలు, లబ్దిదారులే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు. -సిమ్మాదిరప్పన్న -
దుష్ప్రచారాన్ని కట్టడి చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న పత్రికలు, మీడియా చానళ్లు నిరాధార ఆరోపణలతో తమపై చేస్తున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కీలకమైన ఎన్నికల తరుణంలో ఐపీఎస్ అధికారులతోపాటు యావత్ పోలీసు వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి 19 మంది ఐపీఎస్ అధికారుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు కాంతిరాణా టాటా, రవీంద్రబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు శనివారం సమర్పించారు. ఆ వినతిపత్రంతో పాటు ఇటీవల ఐపీఎస్ అధికారులపై టీడీపీ, బీజేపీ, జనసేన అనుకూల మీడియాలో వచ్చిన 17 నిరాధారమైన వార్తా కథనాలను జత చేశారు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు ఆ పార్టీలకు వత్తాసు పలుకుతున్న పత్రికలు, టీవీ చానళ్లు పక్కా కుట్రతోనే దుష్ప్రచారం సాగిస్తున్నాయి. ముందుగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేస్తారు. అనంతరం అవే ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. వారు చేసేఆరోపణలకు ఎలాంటి ఆధారాలుండవు. కానీ పదే పదే అసత్య ఆరోపణలు చేయడం ద్వారా పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నది ఆ పా ర్టీల కుట్ర. దాంతో పోలీసు వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోంది. అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆ ఆరోపణలను పునరుద్ఘాటిస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసు అధికారులకు వ్యతిరేకంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థత మొదలైన నిందలు వేస్తారు. ప్రతిపక్ష పా ర్టీల ఆరోపణలను ఆ పార్టీలకు కొమ్ముకాస్తున్న పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తాయి. మీడియా చానళ్లు పదే పదే వాటినే ప్రసారం చేస్తాయి. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఆ దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తాయి. మళ్లీ మరో అసత్య ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తాయి... మళ్లీ అదే తంతు సాగుతుంది. ఇలా ఈ దుష్ప్రచారాన్ని పదే పదే కొనసాగిస్తారు. కొన్ని ప్రధానపత్రికలు, టీవీ చానళ్లు ప్రతిపక్ష పార్టీల కుట్రలో భాగస్వాములవడం దురదృష్టకరం. ఈ దుష్ప్రచారంతో గత రెండు నెలల్లోనే 30మందికి పైగా పోలీసు అధికారులు మనోవేదనకు గురయ్యారు. ఈసీ నిర్ణయాలపైనా దుష్ప్రచారం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, వాటికి వత్తాసు పలికే మీడియా పదే పదే చేస్తున్న దుష్ప్రచారం తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ఇటీవల ఓ ఐజీ, కొందరు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లను ఈసీ బదిలీ చేసింది. అనంతరం వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తూ ఈ నెల 4న ఉత్తర్వులిచ్చింది. öత్తగా నియమితులైన ఆ అధికారులు ఇంకా బాధ్యతలు తీసుకోకముందే వారికి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన అనుకూల మీడియా మళ్లీ దుష్ప్రచారం మొదలెట్టింది. ‘వీళ్లా కొత్త ఎస్పీలు ... సగానికి పైగా వైకాపా విధేయులే’అని కథనాన్ని ప్రముఖంగా ప్రచురించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. పోలీసు వ్యవస్థను నిర్విర్యం చేసే కుట్ర ఇలా రోజూ పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారం పోలీసు వ్యవస్థ మనో స్థైర్యాన్ని, చొరవను దెబ్బతీస్తోంది. వాస్తవానికి అధికార యంత్రాంగం ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి విధులు నిర్వహిస్తోంది. కాబట్టి ఆ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించాల్సి వస్తోంది. పోలీసు అధికారులు ఎన్నికల విధుల నుంచి పూర్తిగా వైదొలిగేలా చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు, వారికి కొమ్ముకాసే మీడియా కుట్ర పన్నుతోంది. వాస్తవానికి సక్రమంగా ఎన్నికల నిర్వహణ కోసం ఈసీకి విజ్ఞప్తి చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు అందుకు విరుద్ధంగా మీడియాను అడ్డంపెట్టుకుని పోలీసు అధికారులపై దుష్ప్రచారానికే ప్రాధాన్యమిస్తోంది. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నిస్తోంది. తద్వారా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. నిబద్ధతతో పని చేస్తున్న పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి క్రియాశూన్యంగా చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేనలు కుట్ర పన్నుతున్నాయి. వారి కుట్రతో రాజ్యంగబద్ధ సంస్థలపై ప్రజల్లో సందేహాలు కలిగిస్తే సమాజంలో వైషమ్యాలు చెలరేగే ప్రమాదం ఉంది. మావోలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచి్చన నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బృహత్తర బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది. ఇంతటి కీలక తరుణంలో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకూ పోలీసు యంత్రాంగం మనోస్థైర్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాబట్టి పోలీసు వ్యవస్థపై జరుగుతున్న దుష్ప్రచారం కట్టడి చేయాలి. ఆ కుట్రకు పాల్పడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, ఆ పార్టీలకు వత్తాసు పలుకుతున్న పత్రికలు, టీవీ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -
హారతి ఇచ్చుకో.. వెయ్యి పుచ్చుకో!
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల తాయిలాలకు తెరతీశారు. ఇందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. హారతి పట్టు, వెయ్యి కొట్టు అన్న చందంగా తొలిరోజు వీరి ప్రచారం సాగింది. శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురంలోని 40, 41 డివిజన్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ పర్యటనలో మహిళలు హారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టారు. హారతి పళ్లానికి రూ.వెయ్యి, టెంకాయ కొట్టినందుకు రూ. వెయ్యి చొప్పున సుజనా చౌదరి, కేశినేని చిన్ని మహిళలకు తాయిలాలు అందజేశారు. ప్రచారంలో మహిళలు వరుసగా నిలబడడం అభ్యర్థులకు హారతులు పట్టడం తంతుగా మారింది. హారతులు పట్టిస్తూ కొబ్బరి కాయలు కొట్టిస్తూ అభ్యర్థులు యథేచ్ఛగా నగదు పంపిణీ చేశారు. కూటమి అభ్యర్థుల ప్రచారం కాస్ట్లీగా మార్చేశారు. తొలిరోజే ఇలా ఉంటే ఎన్నికల వరకు ఇంకెంత విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తారో.. ఇంకెన్ని వినూత్న మార్గాలు ఎంచుకుని డబ్బులు పంచుతారో అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఒక సామాన్యుడిపై బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగిన సుజానా చౌదరి ప్రచారం ప్రారంభం రోజే డబ్బులు వెదజల్లడం చూసి ఈ ఎన్నికలు పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధమేనని పలువురు చర్చించుకుంటున్నారు. హారతి పట్టించుకుంటూ పళ్లంలో రూ. వెయ్యి చొప్పున వేస్తూ సుజనా చౌదరి కోడ్ ఉల్లంఘించారు. అనర్హులుగా ప్రకటించాలి పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన తెలుగుదేశం విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని), విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిలను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్‌కుమార్ ఓ ప్రకటనలో ఎన్నికల సంఘాన్ని కోరారు. భవానిపురం ప్రాంతంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు హారతుల పేరుతో డబ్బులు వేసి ఆశ చూపారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. -
నవరంగ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి జనసేన బెదిరింపు
తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయడానికి వీలు లేదంటూ జనసేన పార్టీ నేతలు తనను బెదిరించి బీఫామ్ పత్రాలు లాక్కున్నారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఖాన్ ఆరోపించారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి తన తలపై గన్ పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో షేక్ జలీల్‌ఖాన్ మాట్లాడారు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గ్లాసు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ రెండూ ఒకే పోలికతో ఉండటంతో తనను 15 రోజులుగా జనసేన నేతలు బాలÔౌరి, నాదెండ్ల మనోహర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. రూ.5 కోట్లు ఇస్తామని, బీఫామ్‌లు తమకిచ్చేయాలని బాలÔౌరి ఒత్తిడి చేశారన్నారు. రెండుసార్లు ఇదే విషయమై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో ఫోన్లో మాట్లాడించారని చెప్పారు. తాను ఒప్పుకోకపోవడంతో జనసేన కార్యకర్తలతో చంపిస్తామని మనోహర్ బెదిరించారన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి విజయవాడ ఐలాపురం హోటల్ వద్ద ఉన్న తనను వల్లభనేని బాలÔౌరి గన్ పెట్టి బెదిరించారన్నారు. తన వద్ద ఉన్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌లు లాక్కున్నారని వాపోయారు. పవన్ నీచ రాజకీయాలు బీజేపీతో కలసి మైనార్టీలను అణగదొక్కేందుకు పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని జలీల్ ఖాన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై పిఠాపురంలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో బాలÔౌరిపైన, ఆయనకు సహకరించిన పవన్, మనోహర్‌పైనా ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని మైనార్టీలను సర్వనాశనం చేసిన చంద్రబాబుతో జతకట్టిన పవన్‌కు రాష్ట్ర ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
వీళ్లా.. అభ్యర్థులు!
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్నకోద్దీ తెలుగుదేశం పార్టీ మరింతగా బలహీనపడిపోతోంది. 2019లో ప్రజలు కొట్టిన దెబ్బకు పార్టీ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే దొరకలేదు. డబ్బున్నదనో, ఇతర కారణాలతోనే మొత్తంమీద అభ్యర్థులనైతే ఎంపిక చేశారు. వీరిలో అధిక శాతం పోటీకైతే సిద్ధమయ్యారు కానీ, క్షేత్రస్థాయిలో కనీస ప్రభావం చూపించలేకపోతున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. కొందరిని అయినా మార్చి ఇంకా ధన బలం ఉన్న వారిని పోటీకి పెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. మరోపక్క సీఎం జగన్ చేపట్టిన సిద్ధం సభలు, బస్సు యాత్రతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కనీస పోటీ ఇచ్చేందుకైనా మరింత బలమైన అభ్యర్థులను నిలపాలని బాబు భావిస్తున్నారు. పనిచేయని పొత్తులు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిపోవడంతో ఈ ఎన్నికల్లో ఇతర పారీ్టలతో పొత్తులు ఉంటే తప్ప ముందుకు వెళ్లే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు జనసేన, బీజేపీతో కలిశారు. అయినా పార్టీ బలం పెరగకపోగా మరింతగా క్షీణించడంతో సహనం కోల్పోయి ఎన్నికల ప్రచార సభల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. మరోవైపు చంద్రబాబు సభలు, రోడ్‌షోలకు జనం నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీలో ఆందోళన పెరిగిపోతోంది. ఒకవైపు వైఎస్ జగన్ రోడ్‌షోలు, సభలకు జనం పోటెత్తుతుంటే తమ సభలకు జనం రాకపోవడంతో టీడీపీ నాయకులకు కళ్లెదుటే ఓటమి కనిపిస్తోంది. చంద్రబాబు నాలుగు నెలల క్రితమే ప్రకటించిన మేనిఫెస్టో, ఇప్పుడు తాజాగా ఇస్తున్న ఎన్నికల హామీలు ప్రజలను ఏమాత్రం నమ్మించలేకపోతున్నాయి. సత్యవేడు అభ్యర్థి మార్పు! చిత్తూరు జిల్లా సత్యవేడులో ఫిరాయింపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని మార్చడం దాదాపు ఖాయమైనట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలానికి ప్రజల్లో ఆదరణ లేదని గ్రహించిన వైఎస్సార్సీపీ సీటు నిరాకరించింది. ఆయన్ని టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు అదే సీటు కేటాయించారు. ఇప్పుడు తత్వం బోధపడటంతో ఆదిమూలాన్ని తప్పించి మరో వ్యక్తికి సీటు ఇవ్వాలని చూస్తున్నారు. అడ్డగోలు వాదనలు చేయడం ద్వారా ఎల్లో మీడియాలో గుర్తింపు పొందిన కొలికపూడి శ్రీనివాస్‌ని గొప్ప వ్యక్తిగా భావించి తిరువూరు సీటు ఇచ్చేశారు. కానీ అక్కడ ఆయన్ని తట్టుకోలేక సొంత పార్టీ నేతలే లబోదిబోమంటున్నారు. దీంతో శ్రీనివాస్‌ని వదిలించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. చింతలపూడిలో స్థానిక నేతలను కాదని ఎన్ఆర్ఐ సొంగా రోషన్‌ను ఎంపిక చేశారు. ఆయన కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదని తెలియడంతో మరొక డబ్బున్న నేత కోసం కసరత్తు చేస్తున్నారు. గజపతినగరం, శ్రీకాకుళం, పాతపట్నం, మడకశిర స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారమూ పని చేయలేదు.. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మొన్నటివరకు తప్పుడు ప్రచారం ద్వారా హంగామా సృష్టించారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా, మౌత్ క్యాంపెయినర్ల ద్వారా వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేయించి ప్రజలను తికమక పెట్టాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. అయినా వాపునే బలుపు అనుకుని టీడీపీ గ్రాఫ్ పెరిగిపోయిందని చంద్రబాబు, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా గాల్లో తేలిపోయారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చాక వైఎస్సార్సీపీ నిర్వహించిన నాలుగు ‘సిద్ధం’ సభలు టీడీపీ అబద్ధపు ప్రచారాన్ని పటాపంచలు చేశాయి. ఇప్పుడు వైఎస్ జగన్ చేపడుతున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఉన్న ఆదరణను తేటతెల్లం చేస్తోంది. దీంతో టీడీపీ అంతర్మథనంలో మునిగిపోయింది. పొత్తులు కూడా వికటించినట్లు తేలడంతో ఇప్పుడు 10 శాతం అభ్యర్థులనైనా మార్చి ఉన్నంతలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే దిశగా చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉండి, అనపర్తి సీట్లపై అనిశ్చితి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటుపైనా అనిశ్చితి నెలకొంది. ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ప్రకటించినప్పటికీ, చంద్రబాబు ఒత్తిడితో వివాదాస్పద నేత రఘురామకృష్ణరాజును అక్కడ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. రఘురామరాజుకు బీజేపీ నర్సాపురం ఎంపీగా అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. రఘురామరాజు నర్సాపురం ఎంపీ సీటు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది సాధ్యం కాకపోతే ఉండి సీటు కేటాయించక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని మాడుగల అభ్యర్థిని మార్చాలని అక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఒత్తిడి తెస్తుండడంతో ఆ దిశగానూ కసరత్తు నడుస్తోంది. కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానాల మార్పుపైనా చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. అనపర్తి సీటు మళ్లీ తిరిగి టీడీపీకి కేటాయించే దిశగా బీజేపీ, టీడీపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు కేటాయించిన నర్సాపురం స్థానాన్ని టీడీపీ తీసుకుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తంగా 20కిపైగా ఎమ్మెల్యే, ఒకట్రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చడం ద్వారా బలమైన వైఎస్సార్సీపీకి కనీస పోటే ఇచ్చేలా వాతావరణాన్ని మార్చాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. -
మరో రెండు జనసేన సీట్లు బాబు ఖాతాలోకే
సాక్షి, అమరావతి/సాక్షి, మచిలీపట్నం/ఓబులవారిపల్లె/అవనిగడ్డ : చంద్రబాబుతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్లకి, బాబు చెప్పిన వాళ్లకి, బాబు పంపిన వాళ్లకి టికెట్లిచ్చేయడమే. జనసేనకు కేటాయించిన మరో రెండు సీట్లనూ చంద్రబాబు ఇలాగే కొట్టేశారు. పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు అభ్యర్థిని మార్చగా, కృష్ణా జిల్లా అవనిగడ్డ స్థానానికి మొన్నటివరకు టీడీపీ నేత, రెండురోజుల క్రితం జనసేనలోకి వచ్చిన అసెంబ్లీ మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. బుద్ధప్రసాద్‌కు సీటు కేటాయించడం అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనలో చిచ్చు రేపింది. ఈ టికెట్ ఆశించిన పలువురు జనసేన నేతలు కూటమి అభ్యర్థికి సహకరించకూడదని నిర్ణయించారు. మరికొందరు నేతలు వారి పదవులకు రాజీనామా చేస్తున్నారు. కాగా జనసేనకు కేటాయించిన మరో నియోజకవర్గం పాలకొండ అసెంబ్లీ స్థానం అభ్యర్థిని రెండు రోజుల్లో నిర్ణయాన్ని ఆ పార్టీ తెలిపింది. ఎస్సీ రిజర్వ్డ్ అయిన రైల్వేకోడూరు నియోజకవర్గం అభ్యర్థిగా యనమల భాస్కరరావును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకు ముందే ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వానికి చంద్రబాబు మోకాలడ్డారు. అక్కడ తాను చెప్పిన వ్యక్తికి టిక్కెటివ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో పవన్‌కు అభ్యర్థిని మార్చక తప్పలేదు. అక్కడ ఇప్పుడు ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి ప్రధాన అనుచరుడు, ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్‌ను జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. ‘రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే ఎనమల భాస్కర్ పేరును పవన్ ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో లోతుగా అధ్యయనం చేస్తున్నాం. అక్కడ అభ్యర్థిని మార్చాలని నాయకులు అభిప్రాయాలను తెలియజేశారు’ అని పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గురువారం ఉదయం ప్రకటన జారీ చేశారు. సాయంత్రానికి మళ్లీ మరో ప్రకటన విడుదల చేశారు. రైల్వే కోడూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ ఖరారు చేసినట్టు హరిప్రసాద్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అవనిగడ్డ బుద్ధప్రసాద్‌కే అవనిగడ్డ శాసన సభ స్థానం జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ ఖరారు చేసినట్టు హరిప్రసాద్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. బుద్ధప్రసాద్ గత ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారీ అవనిగడ్డ నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే ఈ స్థానం జనసేనకు వెళ్లడంతో ఆయన ఆశలకు గండి పడింది. ఈ సీటు కోసం గట్టిగా ప్రయత్నించారు. మరోపక్క ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న జనసేన నేతలూ టికెట్ కోసం గట్టిగా పట్టుపట్టారు. దీంతో ఇక్కడ జనసేన అభ్యర్థి ఎంపిక గందరగోళంలో పడింది. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన వారిని కాదని, ఇటీవలే టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్‌కే పవన్ టికెట్ ఇచ్చారు. వీరి ఆశలపై నీళ్లు అవనిగడ్డ అసెంబ్లీ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన నేతలకు పార్టీ అధినేత పవన్ మొండి చేయి చూపారు. ఆ పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు, తొలి నుంచి పార్టీలో ఉన్న బండ్రెడ్డి రామకృష్ణ, కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీను, ఎన్అర్ఐ బొబ్బా గోవర్ధన్, మచిలీపట్నం కన్వీనర్ బండి రామకృష్ణ టిక్కెట్ ఆశించారు. ముందు నుంచి పార్టీలో ఉంటూ కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కొత్తగా చేరిన మండలికి టికెట్ ఇవ్వడం వెనుక బాబు హస్తం ఉందని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన మండలికి టికెట్ ఇస్తే సహకరించబోమని, తమ పార్టీ నాయకుల్లో ఎవరికి ఇచ్చినా పని చేస్తామని ఇటీవలే జనసేన నేలు బహిరంగంగానే ప్రకటించారు. అయినా వారి మాటను ఖాతరు చేయకుండా టిక్కెట్‌ను మండలికే ఇవ్వడంతో ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండాలని సీనియర్ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు నాయకులు రాజీనామా బాట పట్టారు. జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు గురువారం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వాట్సప్ ద్వారా పార్టీ అధ్యక్షుడు పవన్‌కు పంపినట్లు చెప్పారు. మిత్రులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తానన్నారు. జనసేన అవనిగడ్డ టౌన్ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు, పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు చెన్నగిరి సత్యనారాయణ కూడా పదవులకు రాజీనామా చేశారు. -
ఒకటికి రెండు.. రెండుకు నాలుగు! బెట్టింగ్ బంగార్రాజుల జోరు
రండన్నా రండి.. వెయ్యికి రెండు వేలు.. లచ్ఛకు రెండు లచ్చలు.. గవర్నమెంట్ ఎవరిదీ వస్తుంది.. జగనా ? చంద్రబాబా ? ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి. రండి పందెం కాసుకోండి అంటున్నారు గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు.. కోడిపందాలు.. క్రికెట్ పందాలు.. ఇలా రకరకాల పందేలకు పేరుగాంచిన భీమవరంలో ఇప్పుడు రాజకీయ పందేలు మొదలయ్యాయి. ఇంకా నెలన్నరలో ఎన్నికలు జరగనుండగా.. ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటూ ఇప్పుడే పందేలు కాస్తున్నారు.. ఈ మేరకు అగ్రిమెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఈ రాజకీయ పందేలు గత దసరా నుంచే మొదలయ్యాయి...అప్పట్లో కొందరు టీడీపీ అభిమానులు సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెసుకు యాభై సీట్లకన్నా తక్కువే వస్తాయని చెబుతూ అలా పందెం కాశారు. అది కూడా కోసు పందెం... అంటే ఫ్యానుకు యాభై సీట్లకు మించి వస్తే టీడీపీ వాళ్ళు రెండు రెట్లు.. మూడు రెట్లు డబ్బులిస్తారన్నమాట.. అంటే లక్ష పందెం కాసారనుకోండి.. జగన్ పార్టీకి యాభై సీట్లకు లోపు వస్తే ఆ లక్ష పోయినట్లు... కానీ యాభైకి మించి వస్తే టీడీపీ వాళ్ళు.. రెండు.. మూడు లక్షలు ఇస్తారన్నమాట.. ఇలా అప్పట్లో పందేలు ఫిక్స్ చేసుకుని నోట్లు.. అగ్రిమెంట్లు.. పెద్దమనుషుల సమక్షంలో మాట కూడా తీసుకోవడం జరిగింది.. ఇదిలా ఉండగా సంక్రాంతి పోయాక పందెం తీరు మారింది... జగనుకు 70 - 80 సీట్లు వస్తాయంటూ సమపందెం కాస్తున్నారు. అంటే పందెంలో ఎంత వేస్తె అంత వస్తుంది.. ఎంత కాస్తే అంతే ఓడిపోతారు తప్ప.. రెండు మూడు రెట్లు అనేది ఉండదు. ఇదిలా ఉండగా మర్చి నెలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. మళ్ళీ జగన్ వస్తున్నారట.. పేదలు.. బీసీలు.. మహిళలు.. రైతులు అందరూ జగన్ పక్షాన ఉండడంతో ప్రభుత్వానికి ఎదురేలేదట.. నూట ఇరవై సీట్లతో మళ్ళీ జగన్ గెలుస్తున్నారట అనే భావన పల్లెల్లో మొదలైంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అనేదానిమీద పందేలు కాస్తున్నారు. అయితే గతంలో జగన్ కు 50 సీట్లకు మించి రావంటూ రెండు మూడు రెట్లు ఇచ్చేలా పందెం ఖరారు చేసుకున్నవాళ్ళంటా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కూటమిలో సీట్ల చిచ్చు.. వాళ్ళిస్తున్న మ్యానిఫెస్టో.. హామీలను ప్రజలు నమ్మకపోవడం... గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎలా తుంగలోకి తొక్కింది.. ఇవన్నీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.. అంతేకాకుండా చెప్పినమాటమీద.. ఇచ్చిన హామీ మీద నిలబడే జగన్ అంతే జనానికి నమ్మకం కుదిరిందని, ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి కూడా చేసి చూపుతున్న జగన్ గెలుపు విషయంలో సందేహాలు లేనేలేవని ప్రజల్లో అభిప్రాయాలూ గట్టిగా వినిపిస్తుండడంతో ఇప్పుడు పందెం తీరు మారింది. ఎన్ని సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.. వంద.. నూట ఇరవై.. ఇలా ఇప్పుడు పందేలు కాస్తున్నారు.. మొత్తానికి గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు పూర్తి భిన్నంగాఉండడంతో పందెం రాయుళ్లు ఇప్పుడు జగన్ గెలుపు మీద కాపు కాస్తున్నారు.. అయితే గతంలో టీడీపీ గెలుపు మీద లక్షల్లో అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్లంతా ఇప్పుడు దిగాలు పడిపోతున్నారు.. ఈ నెలలో పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పరిస్థితి మరింత మెరుగై... నూట నలభై.. వరకూ ఎగబాకుతుందని.. కూడా పందెం రాయుళ్లు అంటున్నారు.. మరోవైపు జగన్ గెలిస్తే లక్ష ఇస్తాం.. టీడీపీ గెలిస్తే మీరు అరవై.. డెబ్బై వేలు ఇస్తే చాలు అన్నట్లుగా ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది. -సిమ్మాదిరప్పన్న -
పిఠాపురంలో పవన్‌కే దిక్కులేదు: రాజు రవితేజ
రాజు రవితేజ.. ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకం.. రాజు రవితేజ గతంలో పవన్‌కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్‌తో రాజు రవితేజ నడిచారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్‌బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి..? గత ఐదేళ్లలో జనసేన ప్రభావం ఎంటి..? పవన్‌కు పెద్ద దిక్కు లేకుంటే ఎలాంటి పనిచేయలేడా..? పవన్ పిరికివాడా లేదా ధైర్యవంతుడా..? పవన్ విషయంలో జనసేన క్యాడర్‌కు నచ్చనిదేంటి..? ఏపీలో పవన్ ఇమేజ్ పడిపోయిందా..? భవిష్యత్‌లో పవన్ సినిమాల పరిస్థితి ఏంటి..? పవన్ వెంట ఉన్న వారందరూ ఎందుకు దూరం అయ్యారు..? జనసేనకు 21 సీట్లు ఉంటే 16 మంది అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? 2024లో ఏపీలో అధికారం ఎవరిది..? ఇలా ఎన్నో ప్రశ్నలకు రాజు రవితేజ ఈ పూర్తి వీడియోలో సమాధానం ఇచ్చారు. -
కూటమి.. నిప్పుల కొలిమి
అహర్నిశం ప్రజాహితం కోరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘పొత్తు’గట్టిన దుష్టగ్రహ కూటమి నిప్పుల కొలిమై రగులుతోంది. మండుతున్న ఎండలకు దీటుగా అసమ్మతి జ్వాలతో ఎగసిపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల ప్రకోపానికి గడగడలాడుతోంది. ఫలితంగా ఏం చేయాలో పాలుపోక టీడీపీ, బీజేపీ, జనసేన త్రయం తలలు పట్టుకుంటోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ/ఎంవీపీకాలనీ (విశాఖజిల్లా): తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకు సొంత పార్టీలోనే నిరసన ఎదురవుతోంది. ఆది నుంచి ఆయన వివాదాస్పద తీరు పార్టీ కార్యకర్తలకు, ఆయనకు మధ్య అంతరం పెంచుతోంది. ఆయన ఏకపక్ష ధోరణి ఇప్పుడు సీటుకే ఎసరు తెచ్చేలా ఉంది. అసలు ఈ నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని కొలికపూడి అమరావతి జేఏసీ కన్వీనర్ ముసుగులో పచ్చ పార్టీకి అనుకూలంగా పని చేయడంతో పారాచ్యూట్ నేతగా ఊడిపడ్డారు. స్థానిక ముఖ్యనేతలకూ సమాచారం ఇవ్వకుండానే ఆయనను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. టీడీపీ అధినేత సొంత సామాజికవర్గ నేతలే కొలికపూడి తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మరో అభ్యర్థిని పరిశీలించాలని విన్నవించారు. లేకుంటే ఓటమి తప్పదని కరాఖండిగా చెప్పారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతలూ మాజీ మంత్రి జవహర్‌కు టికెట్ ఇవ్వాలని విన్నవించారు. దీంతో అభ్యర్థి«త్వం మార్పుపై అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రజల నుంచీ కొలికపూడికి నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవల గంపలగూడెం మండలం మంచిరాలపాడులో ప్రచారానికి వెళ్లిన ఆయన సైకిల్ రావాలి..సైతాన్ పోవాలి అని అనడంతో మహిళలు గట్టిగా ప్రతిస్పందించారు.ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటూ చేతులూపుతూ కౌంటర్ ఇచ్చారు. ♦ అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పార్టీలో చేరడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు సీటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. జనసేన నేత విక్కుర్తి శ్రీను ఇంటి నుంచి బయలుదేరిన ర్యాలీ మండలి కార్యాలయం ముందు నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ పార్టీ కోసం తొలి నుంచీ కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇవ్వాలని కోరారు. డబ్బులే పరమావధిగా సాగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని చెప్పిన బుద్ధప్రసాద్ వారంలోనే రూ.50 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారని విక్కుర్తి శ్రీను ప్రశ్నించారు. మండలి స్వగ్రామమైన భావదేవరపల్లికి చెందిన జనసేన నాయకుడు భోగాది భానుప్రకాష్ మాట్లాడుతూ ఆయనకు సీటిస్తే 150 కుటుంబాలు వైఎస్సార్ సీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. బచ్చు వెంకటనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విక్కుర్తి శ్రీనుకు టికెటిస్తే గెలిపించుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కండువాలు మార్చే బుద్ధి తనకు లేదంటూ మండలి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను జనసేన నేతలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. సీటు కోసం రాత్రికి రాత్రే ఆయన పార్టీ మారడంపై నెటిజన్లూ మండిపడుతున్నారు. ♦ విశాఖపట్నం ఎంపీ సీటును టీడీపీకి కేటాయించడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ఈమేరకు మంగళవారం విశాఖ లాసన్స్ బే కాలనీలోని ఆ పార్టీ నగర కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. విశాఖలో తొలి నుంచి బీజేపీకి పట్టుందని, సీటును టీడీపీకి కేటాయించడం తగదని పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో బీజేపీ గాజువాక సమన్వయకర్త కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ అభివృద్ధికి కృషి చేశారని, ఆయనకు ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రకు అందించారు. ఈ పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపిస్తున్నట్లు వివరించారు. వీలులేకుంటే బీజేపీ విడిగా స్నేహపూర్వక వాతావరణంలో పోటీ చేసేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పలువురు నేతలు మాట్లాడుతూ పురంధేశ్వరి బీజేపీని టీడీపీకి అమ్మేశారని దుయ్యబట్టారు. యనమల కోటలో నిట్టనిలువునా చీలిపోయిన టీడీపీ సాక్షి ప్రతినిధి, కాకినాడ: యనమల రామకృష్ణుడు, కృష్ణుడు ఇద్దరూ అన్నదమ్ముల బిడ్డలు. అయినా ఒక తల్లి కన్న బిడ్డల కంటే ఎక్కువగానే కలసిమెలిసి ఉన్నారు. ఏకంగా 40 ఏళ్లు పాటు కలసి నడిచారు. రాష్ట్రమంతా వారిద్దరూ సొంత అన్నదమ్ములనే అనుకునేంతగా పేరుపొందారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ చంద్రబాబు తరువాత పెద్దన్న పాత్ర పోషించిన రామకృష్ణుడు రాష్ట్రంలో.. తునిలో కృష్ణుడు చక్రం తిప్పారు. అటువంటి వారిద్దరి మధ్య ఇన్నేళ్ల తరువాత తొలిసారి తలెత్తిన ఆధిపత్య పోరు వల్ల తునిలో టీడీపీ తునాతునకలైంది. తునిలో ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక రామకృష్ణుడు స్వచ్ఛందంగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. ఆయన స్థానంలో కృష్ణుడు పదేళ్లుగా పోటీ చేస్తున్నా.. వైఎస్సార్ సీపీ హవా ముందు నిలబడలేకపోయారు. ఈ నేపథ్యంలో ఉనికి కోసం పాకులాడుతున్న రామకృష్ణుడు ఈసారి తన కుమార్తె దివ్యను బరిలోకి దింపారు. దశాబ్ద కాలంగా తునిలో టీడీపీని నడిపించిన కృష్ణుడిని దూరం పెట్టారు. టీడీపీ అభ్యర్థి దివ్య ప్రచారంలోనూ పాల్గొనవద్దని కృష్ణుడికి తెగేసి చెప్పేశారనే చర్చ జరుగుతోంది. తునిలో టీడీపీ అంటే కృష్ణుడు అని భావించిన ఆ పార్టీ శ్రేణులు ఈ పరిణామాలతో కంగుతిన్నాయి. దీంతో పార్టీ రెండువర్గాలుగా నిట్టనిలువునా చీలిపోయింది. ఫలితంగా ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు చెల్లాచెదురైపోతున్నారు. కొందరు ఎవరిపక్షాన నిలవాలో అర్థంకాక స్తబ్దుగా ఉండిపోతున్నారు. రామకృష్ణుడి ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశానని, ఇప్పుడు తననే ఆయన దూరం పెట్టారని కృష్ణుడు సన్నిహితుల వద్ద మధనపడుతున్నట్టు సమాచారం. ఇంత అవమానం భరిస్తూ టీడీపీలో కొనసాగలేమనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకుందామని అనుచరుల నుంచి కృష్ణుడిపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. అన్నదమ్ముల తగవు చంద్రబాబు దృష్టికి వెళ్లినా ఆయన కిమ్మనకుండా ఉండడంపైనా కార్యకర్తలు పెదవివిరుస్తున్నారు. -
కూటమిలో కుతకుత
సాక్షి నెట్వర్క్: క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటలు చల్లారడం లేదు. టికెట్ ఆశించి భంగపడినవారు అక్కడి అభ్యర్థులకు సహకరించడానికి ససేమిరా అంటున్నారు. టికెట్ దక్కించుకున్నవారితో నేరుగా వాదులాటకు దిగుతున్నారు. కొందరు నాయకులు అభ్యర్థిత్వాల ఎంపికకు నిరసనగా రాజీనామా చేస్తుండగా... మరికొందరు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. తమకు నచ్చని వ్యక్తులకు అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో వారిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. జరుగుతున్న పరిణామాలు కూటమి నేతలకు శిరోభారంగా మారుతున్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆయా అభ్యర్థులకు ఎదురుగాలి తప్పదని శ్రేణులు ఖరాకండీగా చెబుతున్నాయి. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. అక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయిన శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)కు టికెట్ ఇవ్వడాన్ని మాజీమంత్రి నెట్టెం రఘురాం, బీఆర్కే చానల్ యజమాని, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల ఓటుబ్యాంకు కలిగిన కమ్మ సామాజికవర్గానికి గడచిన నాలుగు పర్యాయాల నుంచి టికెట్ కేటాయించకుండా అవమానిస్తోందని ఆ సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. పాడేరు అసెంబ్లీ టికెట్‌పై కొనసాగుతున్న టీడీపీ నిరసన పాడేరు అసెంబ్లీ టీడీపీ టికెట్ కిల్లు రమేష్‌నాయుడుకు కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసన కొనసాగిస్తున్నారు. జీసీసీ మాజీ చైర్మన్ ఎం.వి.ఎస్.ప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొయ్యూరులో ఆదివారం ఆ పార్టీ నేతలు పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. రెండు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ప్రసాద్‌కు అన్యాయం చేయడం తగదని అధిష్టానం నిర్ణయంపై మండిపడ్డారు. రమేష్ నాయుడు ఎవరో కనీసం కార్యకర్తలకు కూడా తెలియదని, అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు ప్రభాకర్ చౌదరి నిర్ణయం అనంతపురం అర్బన్ నుంచి అభిమానులు కోరితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి వెల్లడించారు. ఆదివారం ఆయన అనంతపురంలోని కమ్మభవన్‌లో పార్టీ కార్యకర్తలు, తన వర్గీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కడ టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ను ఎంపిక చేయడం సరికాదన్నారు. ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి ఆస్తులు కోల్పోయానని, కేసుల్లో ఇరుక్కున్నానని, అయినా అధిష్టానం తన శ్రమను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని మిరియాల శిరీషా దేవిని తక్షణమే మార్చాలని రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయతీలకు చెందిన టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం రాజవొమ్మంగిలో వారు సమావేశమై అభ్యర్థిని మార్చకుంటే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ♦ ఎన్టీఆర్ జిల్లా నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో ఆదివారం రాత్రి ‘మన పల్లెకు మన సౌమ్య’ కార్యక్రమం ముగించుకుని వస్తుండగా కార్యకర్తలు అడ్డగించారు. గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలకు పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకపోవడంపై మహిళలు మండిపడ్డారు. ♦ అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ టీడీపీ టికెట్ గుమ్మనూరు జయరామ్‌కు కేటాయించడాన్ని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్.జితేంద్రగౌడ్ తప్పు పట్టారు. ♦ గుంతకల్లులోని తన కార్యాలయంలో పార్టీ క్లస్టర్, బూత్ ఇన్చార్జులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో అధినేత పునరాలోచన చేయకపోతే దేనికైనా సిద్ధంగా ఉండాలని తన వర్గీయులకు పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ మధ్య ఫ్లెక్సీల రగడ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం నిర్వహించిన చంద్రబాబు ప్రజాగళం యాత్ర సభ టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చుపెట్టింది. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటో లేకపోవడంపై ఆ పార్టీ బీజేవైఎం రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ జి.వి.రెడ్డి, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా కిసాన్‌మోర్చా ఇన్చార్జి కె.వి.రమణారావు కూడా టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. పేరుకే కూటమిలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం టీడీపీ నాయకులు విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ అరకు ఎంపీ టిక్కెట్ ఆర్థిక నేరస్తురాలైన కొత్తపల్లి గీతకు ఎలా ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు నిమ్మక జయరాజ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గీత నిజమైన ఎస్టీ కాదని కూడా చెప్పారు. ♦ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ జనసేన కార్యకర్తలను విస్మరిస్తున్నారని పార్టీ అద్దంకి మండల కార్యదర్శి సాధు వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సంతమాగులూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్దేశ పూర్వకంగానే జనసైనికులను దూరం పెడుతున్నారని ఆరోపించారు. -
టీడీపీ నేతకే ఇచ్చేసేనా?
సాక్షి, మచిలీపట్నం: కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయోమయంలో పడ్డారు. ఇక్కడ పార్టీలోని ఆశావహులను కాదని టీడీపీ నేతల వైపు ఆయన చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ జనసేన రోజుకో పేరుతో ఫోన్ సర్వేలు చేయిస్తుండడం పార్టీ శ్రేణుల్లో అసహనం పెంచుతోంది. గతనెలలో జనసేనలో చేరిన అవనిగడ్డకు చెందిన కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీనుతోపాటు ఎడ్లంకకు చెందిన ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్, జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ కన్వినర్ బండి రామకృష్ణ ఈ సీటును ఆశిస్తున్నారు. బండ్రెడ్డి రామకృష్ణ సొంతూరు నాగాయలంక మండలం మర్రిపాలెం. ఈయన తొలి నుంచీ పార్టీలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా ఇంతకాలం పార్టీకి సేవలందించానని తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే బందరు అసెంబ్లీ టికెట్ టీడీపీకి కేటాయించడంతో తనకు అవనిగడ్డలో అవకాశం ఇవ్వాలని బండి రామకృష్ణ అడుగుతున్నారు. ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ ఇంగ్లాండ్‌లో ఉద్యోగం చేసుకుంటూ.. హోటల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంత వరకు పార్టీలో చేరలేదు. టికెట్‌పై స్పష్టమైన హామీ ఇస్తే చేరతానని చెబుతున్నట్టు సమాచారం. బాపట్ల జిల్లాకు చెందిన సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కూడా అవనిగడ్డ టికెట్ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. రేసులో ముందున్న టీడీపీ నేతలు ఈ సీటు కోసం జనసేన నుంచి టీడీపీ నేతలూ పోటీ పడుతున్నారు. ఇక్కడ వంగవీటి రాధాకృష్ణను బరిలోకి దించుతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మండలి బుద్ధప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. -
ఆహ్వానం లేదు.. ఫొటోకూ చోటు లేదా!
కొవ్వూరు: ‘పదవి గొప్ప.. మర్యాద సున్నా’ అన్నట్టుగా ఉంది మాజీ మంత్రి కేఎస్ జవహర్ పరిస్థితి. మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అయిన ఆయన తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. ఎంత చరిత్ర ఉంటేనేం.. ఎన్ని పదవులు ఉంటేనేం.. కొవ్వూరులో శనివారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయనకు కనీస ఆహ్వానం కూడా లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారిగా మూడు పార్టీలతో టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబు ఆధ్వర్యాన ఈ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ సమావేశానికి జవహర్‌కు ఆహ్వానం లేకపోగా.. ఆ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సైతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన ఫొటోకు చోటు దక్కలేదు. దీనినిబట్టి దళిత సామాజికవర్గ నేతకు టీడీపీలో దక్కిన గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దళితులపై చిన్నచూపు కేవలం దళిత నేత కావడమే ఆయన చేసిన పాపమా? అంటూ టీడీపీ దళిత నాయకులు మండిపడుతున్నారు. ఆ పార్టీలో దళితులపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని ఆరోపిస్తున్నారు. తానెవరికీ తలవంచే ప్రసక్తే లేదని, పెత్తందార్ల పైనే తన పోరాటమని, పార్టీకి బానిసగా పని చేస్తానని పలు సందర్భాల్లో జవహర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే పెత్తందార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి జవహర్‌ను ఆహ్వానించలేదంటూ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి జవహర్ వర్గీయులు గైర్హాజరయ్యారు. టీడీపీలో పెత్తందార్ల హవానే నడుస్తోందని చెప్పడానికి ఈ సమావేశమే ఓ ఉదాహరణని విమర్శిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా మరోవైపు జవహర్‌కు కొవ్వూరు టికెట్ కేటాయించాలని కోరుతూ దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యాన తాడేపల్లిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు దళిత, ప్రజా సంఘాలు, మాదిగ దండోరా నేతలు పాల్గొని పార్టీ పెద్దలకు వినతిపత్రం సమర్పించారు. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన డప్పు కళాకారులు, చర్మకారులు, ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు నియోజకవర్గ దళిత నాయకులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జవహర్‌కు టికెట్‌పై టీడీపీలో మరోసారి రచ్చ నడుస్తోంది. తాను పోటీలో ఉంటానని జవహర్ ఇప్పటికే ప్రకటించగా.. ఆయనను అచ్చిబాబు వర్గం పూర్తిగా పక్కన పెట్టి దూకుడుగా వ్యవహరించడంతో విభేదాలకు మళ్లీ ఆజ్యం పోసినట్టయ్యింది. ఎన్నికల వేళ టీడీపీలో విభేదాలు సద్దుమణగకపోవడం చూసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. -
టీడీపీ, జనసేనకు వరుస షాక్‌లు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయా పార్టీల అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు మనస్తాపం చెందిన నాయకులంతా వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. ఆయా పార్టీల్లో ఎన్నాళ్లుగానో ఉంటూ కోట్లు ఖర్చుచేసి పార్టీ పటిష్టత కోసం పనిచేసినా టిక్కెట్ దక్కకపోవడం, అవమానాలకు గురికావడంతో కూటమిని వీడుతున్నారు. జనసేన, టీడీపీలో డబ్బులే ప్రామాణికంగా తీసుకుని టిక్కెట్లు కేటాయించడంపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని)కు తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, పైగా ఆయన్ను అవమానించేలా వ్యవహరించడంతో ఆయన ఆ పార్టీని వీడారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య టికెట్ విషయంలో తనకు అన్యాయం చేయడంతో ఆయన కూడా టీడీపీనుంచి బయటకు వచ్చారు. అవసరానికి తనను వాడుకుని కోట్లాదిరూపాయల ఆస్తులు పార్టీకోసం వెచ్చించిన తనకు చివరి నిమిషంలో ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్‌యాదవ్ టీడీపీని వీడారు. ఇక జనసేన పార్టీకోసం అహర్నిశలు కృషి చేసి... పార్టీ పురోభివృద్ధికి కృషి చేసినప్పటికీ తమను పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలు అవలంబిస్తుండటంతో చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణ ఆ పార్టీకి రాంరాం చెప్పారు. కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడంతో శెట్టి గురునాథం ఆ పార్టీని వీడారు. తాజాగా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కూడా శెట్టిబలిజలకు ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీనుంచి బయటకు వచ్చారు. వారంతా వైఎస్సార్సీపీలో చేరేందుకు క్యూ కట్టారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, ఆచంట, ఉంగుటూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరంలో ముఖ్య నేతలు ఇవే కారణాలతో నేరుగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో అయితే నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నారు. బీసీలకు పట్టం కట్టడం, గడచిన ఐదేళ్లలో సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరడంతో పార్టీకి ఆకర్షితులై పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఈలి నానితో మొదలై.. తాడేపల్లిగూడెం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని) ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. నియోజకవర్గంలో ఈలి కుటుంబానికి మంచి పేరుంది. ఆయన తండ్రి ఈలి ఆంజనేయులు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఆయన భార్య వరలక్ష్మి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆంజనేయులు ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. నాని 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక పర్యాయం పనిచేశారు. రాజకీయంగా నియోజకవర్గంలో మంచి పేరుంది. 2019లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ నేపథ్యం ఉన్నప్పటికీ పార్టీ అవమానకర రీతిలో వ్యవహరించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ♦ నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ పార్టీ టికెట్ విషయంలో పరాభవం చెందడంతో వైఎస్సార్సీపీలో చేరారు. ♦ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ జనసేన పార్టీలో ఆచంట ఇన్చార్జిగా పనిచేశారు. పార్టీలో ప్రాధాన్యం లేకపోవడం, ఇతర కారణాలతో జనసేనను వీడి ఫ్యాన్ గూటికి చేరారు. ♦ ఉంగుటూరులో జెడ్పీటీసీగా రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన నౌడు వెంకటరమణ 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత రాజకీయంగా అక్కడ ప్రాధాన్యమివ్వకపోవడంతో ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ♦ జంగారెడ్డిగూడెంలో బలమైన కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉన్న జెట్టి గురునాథం పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారు. ఆయన కూడా కాంగ్రెస్ విధానాలు నచ్చక వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. టీడీపీలో అవమానాలు ఎదుర్కొన్న గోపాల్ టీడీపీ ఎంపీ టిక్కెట్ ఆశావహి, ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్యాదవ్కు టీడీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. సింగపూర్‌లో వ్యాపారం చేసుకుంటున్న ఆయన్ను పిలిచి మరీ టిక్కెట్ నీదే, ఖర్చుకు వెనుకాడకుండా పనిచేయమని చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ చెప్పడంతో ఏడాది నుంచి ఏలూరు పార్లమెంట్ సీటు లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా పనిచేశారు. యువగళం మొదలుకొని, చంద్రబాబు బహిరంగ సభల వరకు అనేక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఖర్చుచేశారు. చివరికి హ్యాండ్ ఇచ్చి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చారు. మనస్తాపానికి గురైన గోపాల్ యాదవ్ వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల వేళ కీలక నేతల రాకతో వైఎస్సార్సీపీ కేడర్‌లో కొత్త జోష్ నెలకొంది. టికెట్లు అమ్ముకున్న పవన్: పితాని ముమ్మిడివరం: జనసేన పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలసి టికెట్లు అమ్ముకున్నారని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో సానబోయిన మల్లికార్జునరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీకోసం కోట్లాదిరూపాయల ఆస్తిని అమ్ముకున్న తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పార్టీని ఏర్పాటు చేశానని చెప్పి, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ టికెట్ ఇవ్వకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో శనివారం చేరనున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన పార్టీ సర్వనాశనం అయిందన్నారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ముమ్మిడివరంలో పొన్నాడ సతీ‹Ùకుమార్‌తో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీచేస్తున్న బీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని పితాని తెలిపారు. జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించడమే తన ధ్యేయమని చెప్పారు. కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా నాదెండ్ల తీరుపై మండిపడ్డారు. -
పేదల తలరాతలు మార్చే ఎన్నికలివి : సీఎం వైఎస్ జగన్
సాక్షి, నంద్యాల : వైఎస్సార్సీపీ 58నెలల పాలనలో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారిపోయాయని, ఈ ఎన్నికలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు మారాయి. సర్కారు స్కూళ్లలో డిజిటల్ బోధన వచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. వైఎస్సార్ ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామాన్ని జల్లెడ పడుతూ పేదవాడికి ఆరోగ్య పరీక్షలతోపాటు మందులు కావాలన్నా ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నాం’ అని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలను అందజేస్తున్నామన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆళ్లగడ్డలోని రాత్రి బస ప్రాంతం నుంచి గురువారం ఉదయం మొదలైంది. అక్కడి నుంచి సీఎం జగన్ ఉదయం 11 గంటల సమయంలో ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకుని రైతులు, వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని మాట్లాడారు. ప్రతి అక్కచెల్లెమ్మ తమ సొంత కాళ్లమీద నిలబడేలా రుణాలు, ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తున్నాం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ దిశ యాప్ తీసుకొచ్చాం. ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలను నిమిషాల వ్యవధిలో ఆదుకుంటున్నాం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశామని గొప్పలు చెప్పుకునే వారు ఏ రోజూ కనీసం ఆలోచన చేయని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల వ్యవధిలో గొప్ప మార్పులు తెచ్చాడు. వ్యవస్థల్లో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను గమనించండి. ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయండి. దేవుడి దయవల్ల ఇంత మంచి చేయగలిగాం. వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మీరు సలహాలు ఇవ్వవచ్చు. అందరికీ ఓ విన్నపం.. ఎన్నికల కోడ్ కారణంగా పథకాలకు ఆటంకం తలెత్తకుండా ఈ మధ్య కాలంలో ఈబీసీ నేస్తం, చేయూత బటన్లు నొక్కాం. ఇది వరకు వారం రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. కోడ్ కారణంగా పది రోజులు అటు ఇటుగా పథకాల లబ్ధి నేరుగా మీ ఖాతాల్లోకి జమ అవుతుంది. దీని గురించి ఆందోళన చెందవద్దు. చిన్న పిల్లాడు చేసిన పనులు..మీరెందుకు చేయలేదు? నేను చాలా చిన్న పిల్లాడిని. మన ప్రభుత్వం కంటే ముందు మీరు చాలా ప్రభుత్వాలను చూశారు. నాకన్నా వయసులో పెద్దోళ్లు, ఎంతో అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే వారు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక నా కంటే ముందు 75 ఏళ్ల ముసలాయన పరిపాలన చేశారు. ఆయన ఏకంగా 14 ఏళ్లు పాలించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను వయసులో ఆయన కంటే చాలా చిన్నోడిని. నేను ఒకటే అడుగుతున్నా. ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశారా? మీరంతా దీనిపై ఆలోచన చేయాలి. ఈ రోజు ఏ రకంగా మన బతుకులు, జీవితాలు మారాయి? ఏ రకంగా వ్యవస్థల్లో మార్పులు తేగలిగాం? అనే విషయాలను అందరూ ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. రైతన్నకు ప్రతి అడుగులో అండగా.. ప్రతి రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. రైతన్నల కోసమే ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. గత పాలనలో బ్యాంకులలో పంట రుణాలు అందకుంటే ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలో తెలియని దుస్థితి. అలాంటిది ఈ రోజు గ్రామంలోనే ఆర్బీకేలను తీసుకొచ్చి ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, పంట నష్టపోతే సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తున్నాం. రైతన్నకు పెట్టుబడి సాయంగా రూ.13,500 చొప్పున మీ బిడ్డ హయాంలోనే అందుతోంది. మీ కుటుంబంతో చర్చించండి.. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నా. ఓటు వేయలేదని వివక్ష చూపించలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధిని అందజేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు వచ్చాయి. విద్యార్థులకు డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. ఒకవైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు మీడియంతో ప్రచురించిన పుస్తకాలను పిల్లలకు అందజేస్తున్నాం. విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఉచితంగా ఇస్తున్నాం. మీరంతా ఒక్కసారి ఇంటికి వెళ్లి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో సాకారమైన మార్పులను గమనించండి. ఇది కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నికలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలు. అందరూ ఇంటికి వెళ్లాక ఒక్కసారి మీ భార్య, పిల్లలు, ఇంట్లో అవ్వాతాతలతో మాట్లాడండి. అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. నేడు ఎమ్మిగనూరులో సీఎం జగన్ సభ సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజైన శుక్రవారం కర్నూలు జిల్లా పెంచికలపాడులో సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. బస్సు యాత్ర శుక్రవారం షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ పెంచికలపాడు నుంచి బయలుదేరి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంటారు. ఆ ప్రాంతంలో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకొని మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్‌కు దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. ఒక్క ఊరికే రూ.49 కోట్ల ఉపకారం కేవలం ఒక్క ఎర్రగుంట్ల గ్రామానికే 58 నెలల వ్యవధిలో వివిధ పథకాల ద్వారా డీబీటీతో రూ.49 కోట్ల మేర లబ్ధి చేకూర్చగలిగాం. ఈ గ్రామంలోని రెండు సచివాలయాల పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఎంత మంది లబ్ధిదారులున్నారు? ఎవరెవరికి ఏయే పథకాలు అందాయి? అనే విషయాలను కాసేపటి క్రితమే అడిగి తెలుసుకున్నా. గ్రామంలో 1,496 ఇళ్లు ఉండగా, 1,391 ఇళ్లకు ప్రభుత్వ పథకాల ద్వారా రూ.48,74,34,136 అందాయి. 93 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందాయి. ఒక్క ఈ ఊరులోనే వైఎస్సార్ పెన్షన్ కింద రూ.16.52 కోట్లు పంపిణీ చేశాం. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.6.81 కోట్లు, అమ్మఒడితో 1,043 మంది తల్లులకు రూ.4.69 కోట్లు అందజేశాం. వైఎస్సార్ ఆసరా కింద రూ.3.88 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 492 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2.96 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 837 మందికి రూ.2.46 కోట్లు, హౌసింగ్ కింద రూ.2.75 కోట్లు, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.2.24 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీతో రూ.1.13 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.కోటి, సున్నా వడ్డీ కింద రూ.86 లక్షలు, క్రాప్ ఇన్సూరెన్స్ కింద రూ.67 లక్షలు, జగనన్న తోడు కింద ఇచ్చిన రుణాలు రూ.41.30 లక్షలు, చేదోడు కింద రూ.40 లక్షలు, కాపు నేస్తం కింద రూ.31 లక్షలు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.21.48 లక్షలు అందజేశాం. మీ బిడ్డ గత 58 నెలల వ్యవధిలో ఒక్క గ్రామానికే ఇంత మంచి చేశాడనే విషయాన్ని గమనించాలని కోరుతున్నా. వీటితోపాటు గోరుముద్ద, ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డులు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ కింద మరింత అదనంగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా ఎవరూ లంచం అడగడం లేదు. అర్హత ఉంటే చాలు పారదర్శకంగా ప్రయోజనాన్ని అందిస్తున్నాం. చివరిగా.. ఈ ముఖాముఖిలో వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం. సమయాభావం వల్ల అందరికీ మాట్లాడే అవకాశం దొరకలేదు. మీ అందరికీ స్లిప్పులు ఇచ్చాం. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అందులో రాసి బాక్సులో వేస్తే నా దగ్గరికి వస్తాయి. వ్యవస్థను ఇంకా బాగుపరిచే సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి మేలు ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులను సీఎం జగన్ చేసి చూపించారు. తెలంగాణలో నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేయాలని తలపెట్టి చేతులెత్తేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సర్కారు బడుల రూపురేఖలు మార్చి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. – హుసేన్‌బాషా, ఎర్రగుంట్ల ఎన్నో పథకాలు అందించారు నాలాంటి వారికి అన్నగా, పిల్లలకు మేనమామలా, అవ్వాతాతలకు మనవడిగా ఎంతో మందికి కుమారుడిగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధిస్తారు. – పుష్పలత, ఎర్రగుంట్ల రూ.5 లక్షలు బీమా వచ్చింది మా అత్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందింది. నాలుగుసార్లు అమ్మ ఒడి పథకం వర్తించింది. అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నారు. – పద్మావతి, గోవిందపల్లె స్కూళ్ల రూపురేఖలు మార్చారు ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా తీర్చిదిద్దారు. ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తున్నారు. గతంలో మా పాఠశాలకు ప్రహరీ లేదు. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి. నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. మరుగుదొడ్ల వసతి కల్పించారు. గోరుముద్ద ద్వారా చిక్కీలు, గుడ్లు, రాగిజావతో ఆరోగ్యకరమైన భోజనం అందిస్తున్నారు. – చర్విత, విద్యార్థిని, శిరివెళ్ల ఆదుకున్న సీఎంఆర్ఎఫ్.. నా కుమారుడికి చిన్న వయసులోనే గుండెకు రంధ్రం పడి పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తింది. ఆపరేషన్‌కు రూ.6 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆపరేషన్ చేశారు. నా కుమారుడు బతికి బయటపడ్డాడంటే సీఎం జగన్ చలవే. ఆయనే మళ్లీ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – నాగరాజు దంపతులు, ఎర్రగుంట్ల పాదయాత్ర హామీలన్నీ నెరవేర్చారు చంద్రబాబు 600కిపైగా హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌కు మాత్రమే దక్కుతుంది. మాకు మళ్లీ అధికారం ఇస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తాం, పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు ఆర్థిక చేయూతనందిస్తామని చెబుతున్నాం. కానీ, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో ఒక్కసారి గమనించండి. ఒకరేమో తమ దగ్గర ఎర్ర పుస్తకంలో పేర్లు రాసుకున్నామని, అధికారంలోకి వస్తే వారి అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఇంకొకరేమో తాము అధికారంలోకి వస్తే మీరంతా గుడుల్లో, బడుల్లో దాక్కోవాలంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. పగటి కలలు కనడం మానండి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేది జగనే. – గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ పేదల కోసం పెత్తందార్లతో యుద్ధం సీఎం జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈ రోజు ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ జనం కోసం నిలబడిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పు యాత్రలో, పాదయాత్రలో ప్రజల బాధలు విన్నారు. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. పేదల కోసం పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నారు. ఈ రోజు అక్కచెల్లెమ్మల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం అలాగే ఉండాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యుల జెండాను, అణగారిన వర్గాల అజెండాను మోసుకుంటూ, నడుచుకుంటూ వచ్చారు. కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు తగిన సమయం వచ్చింది. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ రెండో రోజు యాత్ర సాగిందిలా.. మేమంతా సిద్ధం అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు గురువారం ఉదయం ప్రారంభమైంది. ♦ రాత్రి బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9.40 గంటలకు సీఎం జగన్ బయటకు వచ్చారు. ♦ 9.45 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు మీదుగా ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ♦ 11.10 గంటలకు ఎర్రగుంట్ల గ్రామంలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖిలో పాల్గొని ప్రసంగించారు. ♦ 12.50 గంటలకు సభ నుంచి బయటకు వచ్చి వెంకటాపురం, శిరివెళ్ల మెట్ట మీదుగా దీబగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ♦ మధ్యాహ్నం 2 గంటలకు దీబగుంట్ల వద్ద ఎమ్మెల్యే శిల్పా రవి పుష్పగుచ్చాలు అందజేసి నంద్యాల నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు. ♦ 2.40 గంటలకు చాబోలు వద్ద భోజన విరామం కోసం ఆగారు. ♦ సాయంత్రం 4.40 గంటలకు చాబోలు నుంచి రైతు నగరం క్రాస్ మీదుగా బొమ్మలసత్రం ఫ్లై ఓవర్ మీదుగా ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభ వద్దకు 5.30 గంటలకు చేరుకున్నారు. ♦ 5.40 గంటల నుంచి 7.10 వరకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ♦ 8.10 గంటలకు ఆర్జీఎం కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థులకు అభివాదం చేశారు. ♦ 9.40 గంటలకు పాణ్యం, సుగాలిమెట్ట, హుసేనాపురం, ఓర్వకల్లు మీదుగా నన్నూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. ♦ పెద్దటేకూరు, మార్కాపురం క్రాస్ మీదుగా రాత్రి 11.06 గంటలకు బస చేయనున్నపెంచికలపాడుకు చేరుకున్నారు. -
ప్రభం‘జనం’.. సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేననే మరోసారి రుజువైంది. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రెండో రోజు జైత్రయాత్రలా కొనసాగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ క్రాస్ వద్ద సీఎం జగన్ బస చేసిన శిబిరం వద్దకు గురువారం ఉదయం నుంచే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు. ప్రజల కేరింతల మధ్య రెండో రోజు బస్సు యాత్ర ఉదయం 9.30 గంటలకు మొదలైంది. ఆళ్లగడ్డ క్రాస్ నుంచి నల్లగట్ల వరకూ కిలోమీటర్ల కొద్దీ జనం బారులు తీరారు. సీఎం తమ వద్దకు చేరుకోగానే ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై బంతిపూల వర్షం కురిపించారు. నల్లగట్ల వద్ద అంబులెన్స్‌కు దారి ఇచ్చిన జగన్.. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల సమీపంలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులను ఆశీర్వదించారు. ఎర్రగుంట్ల గ్రామముఖ ద్వారంలో సీఎం జగన్ బస్సుపై బంతి పూలవర్షం కురిపిస్తూ హారతులు ఇస్తూ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో మమేకమై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి ఇంటికీ మంచి చేశారంటూ సీఎం జగన్‌పై ఎర్రగుంట్ల వాసులు ప్రశంసలు కురిపించారు. అనంతరం ఎర్రగుంట్ల నుంచి శిరివెళ్ల మండలం గోవిందపల్లి, చాబోలు మీదుగా బస్సు యాత్ర సాగింది. చాబోలులో భోజన విరామం తరువాత నంద్యాల నియోజకవర్గం నూనెపల్లికు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. నంద్యాలలో జనహోరు.. నంద్యాలలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ప్రారంభమవుతుందని ప్రకటించినా ఉదయం 11 గంటల నుంచే జనప్రవాహం మొదలైంది. ఎండ వేడి పెరిగేకొద్దీ జనం పెరిగారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఆళ్లగడ్డ క్రాస్ నుంచి నూనెపల్లి వరకూ జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టడంతో గంట ఆలస్యంగా సాయంత్రం 5.30 గంటలకు సీఎం జగన్ చేరుకున్నారు. సభా వేదికపైకి సీఎం జగన్ చేరుకోగానే జనం హర్షద్వానాలు, కేరింతలతో సభా ప్రాంగణం హోరెత్తింది. సీఎం జగన్ ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తున్నప్పుడు జనం జయహో జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. సంక్షేమాభివద్ధి పథకాల ద్వారా చేసిన మంచి, రాష్ట్రం రూపురేఖలు మార్చేలా చేసిన అభివృద్ధిని వివరించడంతోపాటు 2014–19 మధ్య టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు. మళ్లీ ఇప్పుడు అదే కూటమితో చంద్రబాబు పోటీ చేస్తుండటాన్ని ప్రస్తావించినప్పుడు విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు.. మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చినప్పుడు మేమంతా సిద్ధం అంటూ దిక్కులుపిక్కటిల్లేలా జనం నినదించారు. విద్యార్థుల ఉత్సాహం.. నంద్యాల సభ రాత్రి 7 గంటలకు ముగియగా అనంతరం బస్సు యాత్ర తిరిగి ప్రారంభమైంది. సీఎం జగన్ బస్సు యాత్ర కడప–కర్నూలు జాతీయ రహదారిపై నిర్వహించనున్నట్లు తెలియడంతో ఆర్జీఎం కాలేజీ విద్యార్థులు మధ్యాహ్నం నుంచే భారీగా తరలి వచ్చారు. రాత్రి 8.30 గంటలకు సీఎం జగన్ బస్సు చేరుకోగానే విద్యార్థులు హర్షధ్వానాలు చేయగా వారికి సీఎం జగన్ అభివాదం చేశారు. అక్కడి నుంచి బస్సు యాత్ర పాణ్యం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సుగాలిమిట్ట వద్ద ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. హుస్సేనాపురం, ఓర్వకల్లుల్లో రాత్రి 9.30 గంటలైనా జనం రోడ్డుపైనే నిలబడ్డారు. నన్నూర్ వద్ద నారాయణ కాలేజీ విద్యార్థులను యాజమాన్యం నియంత్రించినా లెక్క చేయకుండా భారీ ఎత్తున రహదారిపైకి చేరుకుని బంతిపూల వర్షంతో స్వాగతం పలికారు. నన్నూర్ వద్ద బస్సు యాత్ర కర్నూలు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కర్నూలు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ సార«ద్యంలో నేతలు అక్కడ సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం మీదుగా పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ రాత్రి 11.06 గంటలకు చేరుకున్నారు. -
టీడీపీ, జనసేన వేధింపులు తాళలేకపోతున్నాం
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న తమను టీడీపీ, జనసేన నాయకులు వేధిస్తుండడంతో రాజీనామా చేస్తున్నట్లు రాజమహేంద్రవరం నగరానికి చెందిన 15 మంది వలంటీర్లు చెప్పారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు వారి రాజీనామాలను అందజేశారు. వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరం 1వ డివిజన్ 2వ సచివాలయానికి చెందిన ఒకరు, 48వ డివిజన్ 89వ సచివాలయానికి డివిజన్‌కు చెందిన ఐదుగురు, 90వ సచివాలయానికి చెందిన తొమ్మిది మంది వలంటీర్లు రాజీనామాలను అడ్మిన్ సెక్రటరీలకు అందజేశారు. ఈ సందర్భంగా వలంటీర్లు మాట్లాడుతూ.. తాము ప్రజలకు నిస్వార్థంగా సేవచేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరువ అయ్యేటట్టు చూస్తున్నామన్నారు. అయితే క్షేత్ర స్థాయిలో విధినిర్వహణ సమయంలో టీడీపీ, జనసేన నాయకులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మిత్రులు, బంధువులతో మాట్లాడినా అనుమానంగా చూస్తున్నారని, ఇది భరించలేకపోతున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వలంటీర్లుగా కొనసాగలేమని చెప్పారు. ఈ విషయమై నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సత్యవేణి స్పందిస్తూ.. 15 మంది వలంటీర్ల రాజీనామాలు అందాయన్నారు. వాటిపై కమిషనర్‌కు నివేదిక సమర్పిస్తున్నట్లు తెలిపారు. -
దిక్కుతోచని ‘కూటమి’!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మల్లగుల్లాలు పడుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానం తెలుగుదేశం పార్టీకి దక్కింది. రోజులు గడుస్తున్నా అభ్యర్థి ఎవరో తేల్చకుండా నాన్చుతోంది. ప్రస్తుతం మాగుంట కుటుంబానికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ కుటుంబం పాత్ర ఉండటంతో ఏం చేయాలో తెలియక సందిగ్ధ పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. ఈ ఎన్నికల్లో తప్పకుండా బీసీ నేతకు ఎంపీగా టికెట్ ఇస్తానని ఇచ్చిన హామీని బాబు గాలికొదిలేశారు. ఎన్నికలు వేడెక్కుతున్నా అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో మూడు పార్టీల నేతలు, కేడర్ అయోమయంలో పడ్డారు. వాస్తవంగా రెండు నెలల ముందు వరకూ ఈ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థి కరువయ్యారు. పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు ముందుంచారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు హామీ ఇచ్చారు. తీరా ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి బాలాజీ పేరు మరుగున పడిపోయింది. బీసీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. తొలుత రాఘవరెడ్డి పేరు.. టీడీపీలో చేరిన మాగుంట ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమారుడు రాఘవరెడ్డిని నిలబెట్టాలని జోరుగా ప్రచారం చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అడ్డం పడింది. దాంతో రాఘవరెడ్డి స్థానంలో ఎంపీ శ్రీనివాసులు రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో తన తండ్రి శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని రాఘవరెడ్డి ఒక ప్రకటన కూడా విడుదలచేశారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు మాత్రం ఏ ఒక్కరి పేరూ ప్రకటించకపోవటం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. మాగుంట రాఘవరెడ్డిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో అరెస్ట్ చేయగా తీహార్ జైలులో కొంతకాలం రిమాండ్‌లో ఉండి ప్రస్తుతం బెయిల్‌పై వచ్చారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా తిహార్ జైలుకు పంపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు.. మాగుంట కుటుంబం విషయంలో డోలాయమానంలో పడ్డాడన్న ప్రచారం సాగుతోంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి ఇరువురూ ఈడీ ముందు అప్రూవర్లుగా మారిన సంగతి తెలిసిందే. మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న లిక్కర్ స్కాం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా దన్ను ఉన్న వ్యక్తి కోసం టీడీపీ గాలింపు మొదలెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పేరు బయటకు రావడంతో అప్పటినుంచే వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వారిని పక్కనపెట్టిన విషయం విధితమే. ఒంగోలు ఎంపీ సీటు ఆ కుటుంబానికి ఇచ్చేదిలేదని కూడా ముఖ్యమంత్రి తెగేసి చెప్పారు. దీంతో మాగుంట టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిత్వంపై నేటికీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న మాగుంట కుటుంబానికి టికెట్ ఇస్తే ప్రధాని మోదీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనన్న సందిగ్ధంలో బాబు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రచారంలో దూసుకుపోతున్నచెవిరెడ్డి భాస్కరరెడ్డి టీడీపీ, ఎన్డీఏ కూటమి పరిస్థితి కుడితో పడిన ఎలుకల చందంగా ఉంటే వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను సీఎం జగన్ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి గ్రామ గ్రామాన ఆయన ప్రచారం చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరికల వెల్లువ
గుమ్మలక్ష్మీపురం/పెదవేగి/ఉండి/నరసాపురం రూరల్/తణుకు అర్బన్: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన టీడీపీ, జనసేన, సీపీఎం నుంచి నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్దసంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో అందించిన సంక్షేమ పాలనను మెచ్చి తామంతా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నేతృత్వంలో వైఎస్సార్సీపీలో చేరినట్టు ప్రకటించారు. గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ కుంబురుక దీనమయ్య, జెడ్పీటీసీ మండంగి రాధిక, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, లక్ష్మణరావు ఆధ్వర్యంలో కేదారిపురం, డుమ్మంగి, పెదఖర్జ, తోలుఖర్జ, ఎల్విన్‌పేట, గుమ్మలక్ష్మీపురం, లక్కగూడ, చాపరాయి బిన్నిడి గ్రామాలకు చెందిన 200 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహా్వనించారు. పార్టీ లో చేరిన వారిలో లక్కగూడ గ్రామానికి చెందిన టీడీపీసీనియర్ నాయకుడు బోగపురపు నాగు, కురుపాం మండలం పి.లేవిడికి చెందిన పత్తిక మోహన్‌దాసు, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కీలకపాత్ర పోషించిన వై.తారకేశ్వరరావుతోపాటు విశ్రాంత ఉద్యోగులు పార్టీ లో చేరారు. దెందులూరులో టీడీపీకి షాక్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రవర్తనతో విసుగు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పాలడుగు భానుప్రకాష్ మంగళవారం ఆ పార్టీ కి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. భానుప్రకాష్ తోపాటు టీడీపీ నాయకులు కమ్మ రాజారావు, కండేపు బాబూరావు, పిట్టా రవి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కూర్మారావుపేటలో 30 మంది మహిళలు, గౌడపేటలో 25 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. తణుకులో భారీగా చేరికలు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని 25, 27, 30 వార్డులకు చెందిన 200 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికీ మంత్రి కారుమూరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య తదితరులు పాల్గొన్నారు జనసేన నుంచి వైఎస్సార్సీపీలోకి... పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంకలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ తిరుమాని నాగరాజు ఆధ్వర్యంలో జనసేన నుంచి నాయకులు పెద్దఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. ప్రభుత్వ చీఫ్ విప్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వీరికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో సంకరపు పాండురంగారావు, వాతాడి హరిచంద్ర, బొడ్డు సోమరాజు, మైలా శాంతారావు, మైలా లక్ష్మీనరసింహ (నాని), సంకరపు విష్ణు, ఒడుగు సురేష్ తదితరులు జనసేన నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. -
Prakasam: కూటమిలో లుకలుకలు.. రెబల్ అభ్యర్థిగా ఆమంచి స్వాములు!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొత్తు పారీ్టల్లో కుమ్ములాటలు ముదిరి పాకాన పడుతున్నాయి. పొత్తుల పేరుతో సీట్లు దక్కని జనసేనలు అసమ్మతి రాగాన్ని ఆలపిస్తున్నారు. జిల్లాలో పొత్తులో భాగంగా దర్శి, గిద్దలూరు నుంచి అవకాశం వస్తే పోటీ చేయాలని ఆశించారు. అయితే గిద్దలూరు సీటు టీడీపీకి కేటాయించడంపై గ్లాసు పార్టీ నేతలు భంగపడి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ పార్టీ నేత ఆమంచి స్వాములు ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమవుతున్నారు. దర్శి సీటును ఒకవేళ జనసేనకు ఇచ్చినా టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక జిల్లా కేంద్రం ఒంగోలులో టీడీపీ ప్రచారానికి జిల్లా జనసేన నేతలు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంది రెండు పార్టీల పరిస్థితి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పశ్చిమ ప్రకాశంలో కీలకమైన గిద్దలూరు నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించడం పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మొదటి నుంచి ఈ సీటును జనసేనకు ఇస్తామంటూ ప్రచారం చేసి చివరికి తెలుగుదేశం పార్టీకి కేటాయించడం వెనక దుష్ట శక్తుల కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. అయితే టీడీపీ, జనసేన పొత్తుల తరువాత కూడా కొంతకాలం ఇదే కథ నడిపించారు. చివరికి గిద్దలూరు సీటు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన నాయకులు మోసపోయినట్లు గ్రహించారు. నమ్మించి మోసం చేశారని ఆగ్రహం చెందిన ఆమంచి స్వాములు జనసేన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాలు జరుగుతుండగానే టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి జనసేనలో చిచ్చు పెట్టారు. రెండు గ్రూపులను సృష్టించారు. జనసేనలో కాసుల పాండు, బెల్లంకొండ సాయిబాబు గ్రూపులు ఏర్పడ్డాయని కార్యకర్తలు మండిపడుతున్నారు. దర్శిపై దోబూచులు.. దర్శి నియోజకవర్గంలో సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇది కూడా మొదట్నుంచీ జనసేనకు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఎన్నారై గరికపాటి వెంకట్ ప్రచారాన్ని సైతం చేసుకుంటూ వచ్చారు. సీటు తనకే వస్తుందని ఆశపడ్డారు. పలు కార్యక్రమాలను సైతం నిర్వహించారు. అయితే ఈ సీటుపై టీడీపీ అధినేత చంద్రబాబు తనస్టైల్లో కుట్రలకు తెరతీశారు. దర్శిపై దోబూలాట మొదలెట్టారు. ఎల్లో మీడియా ద్వారా రోజుకో ప్రచారాన్ని చేయిస్తూ వస్తున్నారు. ఈ సీటును జనసేనకు కాకుండా టీడీపీకి కేటాయిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రటించినప్పటికీ దర్శిపై క్లారిటీ ఇవ్వలేదు. నోటిఫికేషన్ వచ్చి పది రోజులవుతున్నా ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేస్తోంది. దీంతో కూటమి పారీ్టలో నాయకులు, కార్యకర్తలు చిరాకుపడుతున్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి జనసేన తరఫున ఎవరు పోటీ చేసినా అభ్యర్థి మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ఉండేలా చంద్రబాబు తెరవెనుక మంత్రాంగం నెరపుతున్నట్టు సమాచారం. రెబల్‌గా స్వాములు.. ఆమంచి స్వాములు ఆదివారం రాత్రి కంభంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో తెలుగుదేశం నాయకత్వంపై ఫైర్ కావడం సంచలనం సృష్టించింది. ఓడిపోయే సీట్లను జనసేనకు కట్టబెడుతున్నారని ఆయన చేసిన విమర్శలు పెద్ద దుమారం లేపాయి. జిల్లా నుంచి కనీసం ఒక్క సీటైనా జనసేనకు ఎందుకు కేటాయించలేదన్న ఆయన ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, పొత్తు విషయంలో పునరాలోచించుకోవాలని పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్‌కు ఆయన సూచించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమంచి స్వాములు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్వాములు ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన కూటమిలో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. జనసేనలో...గొడవలు.. గ్రూపులు జనసేన పార్టీలో ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా గ్రూపులు, గొడవలతో సతమతమవుతోంది. కొండపి నియోజకవర్గంలో ఇన్చార్జి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షుడు బత్తిన రాజేష్ గ్రూపులు కొనసాగుతున్నాయి. ఈ రెండు గ్రూపుల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉంది. ఇటీవల సింగరాయకొండలో ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒంగోలు సంగతి తెలిసిందే. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ వర్గాలు తరచుగా ఘర్షణ పడుతున్నారు. గత నెలలో రియాజ్ వర్గం అరుణను వెంటాడి దాడి చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అరుణ తన మీద జరిగిన దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా ఇప్పడు తాను పొత్తుల పనిలో బిజీగా ఉన్నాను.. ఎన్నికల తరువాత కూచొని మాట్లాడుదామని చెప్పడం విమర్శలపాలైంది. యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జిగా పి.గౌతం రాజును నియమించారు. గుంటూరులో వైద్యం చేసే ఆయన ఏడాది క్రితమే ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వీలు చిక్కినప్పుడు మాత్రమే యర్రగొండపాలేనికి వచ్చిపోతున్నారు. మార్కాపురం, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో జనసేన నామమాత్రంగా ఉంది. మార్కాపురంలో ఇమ్మడి కాశీనాథ్ ఒక్కడే హోల్ అండ్ సోల్ నాయకుడిగా చెలాయిస్తున్నారు. -
జనసేన నేతలకు పవన్ ఉచిత సలహా!.. విస్తుపోవాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: జనసేన నుంచి టికెట్లు దక్కని వారికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సరికొత్త ఆఫర్ ఇచ్చారు. అలా సీట్లు రాని ఆశావహులు తన గెలుపు కోసం కృషి చేయాలని వర్తమానం పంపారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ ఇచ్చిన పిలుపు ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారుతోంది. భంగపడ్డ జనసేన నేతలకు పార్టీ ముఖ్య నేతలతో ఈ తరహా ఫోన్లు చేయిస్తున్నారు. పవన్ గెలుపు కోసం పని చేయడం ఓ గొప్ప అవకాశంగా భావించాలని ఉచిత సలహా కూడా ఇస్తుండడంతో నిరాశావహులంతా విస్తుపోతున్నారు. ఇలా ప్రచారం చేస్తే ఆయన దృష్టిలో పడతారని, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యతనిస్తారని మరో ఆశ కల్పిస్తున్నారు. ఎందుకిలా... మేం ఉండే నియోజకవర్గాలను వదిలి పిఠాపురం ఎందుకు రా.. రమ్మంటున్నారన్న సందేహం ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. తాము ఇక్కడుంటే టికెట్ రాలేదన్న అసంతృప్తితో టీడీపీకి సహాయనిరాకరణ చేస్తామనే అపనమ్మకమా? అక్కడ మా వల్ల ప్రయోజనం ఉంటుందన్న నమ్మకం నిజంగా ఆయనకు ఉందా? అని వారిలో వారు చర్చించుకుంటున్నారు. ఏదైతేనేం. అధినేత పిలుస్తున్నారు కదా.. ఓ సారి వచ్చిపోదామని బయల్దేరుతున్నారు. ♦ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భీమిలి జనసేన సీటును పంచకర్ల సందీప్ ఎప్పటినుంచో ఆశిస్తున్నారు. ఊరించి ఊరించి ఆయనకు ఆఖరికి ‘సారీ’ చెప్పేశారు. తీవ్ర ఆవేదనతో ఉన్న ఆయనకు పిఠాపురం వచ్చేయాలని కబురొచ్చింది. దీంతో ఆయన పిఠాపురం బయల్దేరి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ♦గాజువాక సీటును ఆశించి భంగపడ్డ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు కోన తాతారావుకు కూడా పిఠాపురం రావాలని పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఇప్పటికే పిఠాపురం వెళ్లారు. అక్కడ ప్రచారంలో పాల్గొనడంతోపాటు జనసేన ఎన్నికల ప్రణాళికలు, వ్యూహాల్లో పాలుపంచుకున్నారు. ♦చోడవరం అసెంబ్లీ స్థానంపై ఆశలు పెట్టుకున్న పీవీఎస్ఎన్ రాజుకు కూడా పిలుపు వచ్చింది. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, అక్కడ టీడీపీ సీటును ఆశిస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మకు పీవీఎస్ఎన్ రాజు సమీప బంధువు. దీంతో రాజు పిఠాపురం వెళ్లి వర్మ అభిమతానికి భిన్నంగా, పవన్‌కు అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయడంపై మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలుస్తోంది. 30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ ఈనెల 30న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ ప్రచారాన్ని ఆరంభించి, మూడు విడతలుగా ప్రచారం కొనసాగిస్తారని సోమవారం జనసేన పార్టీ పేర్కొంది. ఇదీ చదవండి: ‘దేశం’లో కమలం కల్లోలం -
‘దేశం’లో కమలం కల్లోలం
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీలో ‘కమలం’ కల్లోలం రేగింది. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం దక్కించుకున్న బీజేపీ.. అనపర్తి అసెంబ్లీ సీటులోనూ పోటీ చేస్తుందన్న ప్రచారం టీడీపీ శ్రేణుల్లో అగ్గి రాజేసింది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలోనే ప్రకటించారు. ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఈ తరుణంలో అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలైంది. దీంతో టీడీపీ అధిష్టానం వైఖరికి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ సీటును బీజేపీకి ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి వెళుతున్న టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఆదివారం అడ్డుకున్నారు. టికెట్ ఖరారుపై చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ ప్రచారానికి వెళ్లవద్దని పట్టుబట్టారు. తొలుత బిక్కవోలు మండలం కాపవరంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి మహాలక్ష్మి చేస్తున్న ఇంటింటి ప్రచారాన్ని.. నల్లమిల్లిలో మనోజ్‌రెడ్డి ప్రచారాన్ని టీడీపీ, జనసేన నాయకులు అడ్డుకున్నారు. బిక్కవోలులో అనపర్తి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో రామకృష్ణారెడ్డి పాల్గొనకుండా అడ్డుకున్నారు. అనంతరం రామకృష్ణారెడ్డి తన నివాసం వద్ద పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ అంశంపై వేచి చూడాలని చెప్పారు. ఇది జరిగి ఒక రోజు గడిచినా ఇప్పటివరకూ చంద్రబాబు స్పందించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశాయి. తమ రాజీనామా పత్రాలను టీడీపీ జోన్–2 ఇన్చార్జి సుజయ్ కృష్ణ రంగారావుకు టీడీపీ ముఖ్య నేతలు సోమవారం అందజేశారు. అనపర్తిలో బీజేపీ ఎలా గెలుస్తుందో చూస్తామంటూ సవాల్ విసిరారు. ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలోనూ చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం 615 ఓట్లు సాధించిన బీజేపీకి ఈ సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సోము వీర్రాజు ససేమిరా? అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఆయన మాత్రం ఎంపీగా తప్ప అసెంబ్లీకి పోటీ చేయనని రెండు రోజుల క్రితమే తన సన్నిహితుల వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో అనపర్తి నుంచి బరిలోకి దింపేందుకు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తోంది. టీడీపీ నేతలకు అన్యాయం స్వప్రయోజనాల కోసం చంద్రబాబు జనసేన, బీజేపీతో జత కట్టడంతో ఇప్పటికే పలువురు టీడీపీ సీనియర్ నేతలకు అన్యాయం జరిగిన విషయం తెలిసిందే. జనసేన నేత దుర్గేష్‌ను నిడదవోలు పంపించి, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు తీరని ద్రోహం చేశారన్న విమర్శలు ఉన్నాయి. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానాన్ని సైతం బీజేపీకి, రాజానగరం అసెంబ్లీ సీటును జనసేనకు కట్టబెట్టి టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు. బాబుకంటే సీనియర్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థిత్వం విషయంలో స్పష్టత ఇచ్చేందుకు నానా తిప్పలూ పెట్టారు. ఇప్పుడు అనపర్తి విషయంలోనూ అదే పంథా కొనసాగిస్తున్నారు. -
ఆరు అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం
సాక్షి, అమరావతి: అసమ్మతి నేతల నిరసనలతో సతమతమవుతున్న టీడీపీలో కూటమి సీట్ల సర్దుబాటు మరింత గందరగోళంగా మారింది. పెండింగ్‌లో ఉంచిన ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరారులో పార్టీ అధినేత చంద్రబాబు అయోమయానికి గురవుతున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి 144, జనసేనకు 21, బీజేపీకి 10 స్థానాలు కేటాయించారు. అయితే, బీజేపీ పోటీ చేసే 10 స్థానాలు ఏమిటన్నదీ ఇప్పటికే తేలలేదు. చంద్రబాబు ఇప్పటివరకు 139 సీట్లలోనే టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే అన్ని వర్గాలు వ్యతిరేకించడంతో పి గన్నవరం అభ్యర్థి రాజేష్‌ను పోటీ నుంచి తప్పించి ఆ స్థానాన్ని జనసేనకు ఇచ్చారు. తాజాగా అభ్యర్థిని ప్రకటించిన అనపర్తి సీటును బీజేపీకి ఇవ్వజూపుతున్నారు. అయితే, అనపర్తిలో బీజేపీ పోటీపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మిగిలిన ఆరు సీట్లలో బీజేపీకి ఏవి వెళ్తాయో తెలియదు. ‘సీమ’లో సీట్ల తంటా ప్రధానంగా రాయలసీమలో బీజేపీకి కేటాయించే సీట్లపై మల్లగుల్లాలు పడుతున్నారు. గుంతకల్లు, ఆలూరు, ఆదోని సీట్లలో బీజేపీ పోటీ చేసే స్థానంపై గందరగోళం నెలకొంది. టీడీపీలోకి ఫిరాయించిన గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు దాన్ని బీజేపీతో ముడిపెట్టి పెండింగ్‌లో పెట్టారు. ఒకవేళ ఆ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాల్సి వస్తే జయరాం సీటు గల్లంతైనట్లే. అక్కడి ఇన్‌ఛార్జి జితేంద్ర గౌడ్ కూడా టిక్కెట్టు కోసం పట్టుబడుతున్నారు. ఆలూరు స్థానం కూడా సీట్ల సర్దుబాటు జాబితాలో ఉంది. దీంతో అక్కడా అభ్యర్థిని ఖరారు చేయలేదు. జమ్మలమడుగు స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లు చెబుతున్నా అదీ తేలలేదు. ఆదినారాయణరెడ్డి కోసం ఆ సీటును బీజేపీకి ఇస్తారనే ప్రచారం జరుగుతుండడంతో అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి, ఆయన కుటుంబానికే చెందిన భూపేష్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబంలో గొడవల నేపథ్యంలో రాజంపేటను బీజేపీకి ఇస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో రాజంపేట టీడీపీ నేతలు బత్యాల చెంగల్రాయుడు, ఇతర నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు సీట్లలో బీజేపీకి ఏది ఇస్తారనే దానిపై ప్రతిష్టంభన ఏర్పడింది. సీట్ల సర్దుబాటు నేపథ్యంలోనే అనంతపురం అర్బన్ స్థానంలోనూ చంద్రబాబు అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరోవైపు ప్రకాశం జిల్లా దర్శిలో అభ్యర్థి దొరక్క ఎవరైనా రాకపోతారా అని ఎదురుచూస్తున్నారు. చీపురుపల్లి, భీమిలిపై అనిశ్చితి విజయనగరం జిల్లా చీపురుపల్లిలోనూ చంద్రబాబు అభ్యర్థిని ఖరారు చేయలేకపోతున్నారు. ఓడిపోయే చోట పోటీ చేసేందుకు సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అక్కడి ఇన్‌ఛార్జి నాగార్జున ఒప్పుకోవడంలేదు. దీంతో ప్రస్తుతం టీడీపీలో చీపురుపల్లి స్థానంపై ఉన్నంత టెన్షన్ మరే స్థానంలోనూ లేదు. విశాఖ జిల్లా భీమిలి స్థానాన్ని మొదట జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరిగినా, ఇప్పుడు అది టీడీపీకే రావడంతో అక్కడ అభ్యర్థి ఖరారుపై చంద్రబాబు ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతున్నారు. 6 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులేరీ? మరోవైపు పొత్తులో పోటీ చేయాల్సిన 17 ఎంపీ సీట్లలో ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం స్థానాలకు అభ్యర్థుల కోసం ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నారు. విజయనగరం సీటును కళా వెంకట్రావుకు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నా, ఆయన అంగీకరించడంలేదని తెలుస్తోంది. అనంతపురం సీటు కోసం జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్ గట్టిగా పట్టుపడుతున్నా దానిపైనా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కడప, కర్నూలు సీట్లలో అభ్యర్థుల కోసం ఇంకా వెదుకులాట కొనసాగుతోంది. -
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధంచేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో గత కొన్నిరోజులుగా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసి సిద్ధంచేసిన అభ్యర్థుల జాబితాపై కూలంకషంగా చర్చించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ డా. కె.లక్ష్మణ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ.. సీఈసీ భేటీలో ఏపీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ సహా మొత్తం 11 రాష్ట్రాల నాయకత్వాలు సిద్ధంచేసిన లోక్‌సభ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలపై వారితో విడివిడిగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజులు ఈ భేటీలో పాల్గొన్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించిన ఆరు స్థానాల విషయంలో రాష్ట్ర సీనియర్ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో ఎవరి అభ్యర్థిత్వానికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే అంశంపై ఆసక్తి నెలకొంది. పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. రాజమండ్రి, రాజంపేట, అమలాపురం, తిరుపతి, అరకు, నరసాపురం, విజయనగరం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారన్న ఊహాగానాల నేపథ్యంలో ఏ ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక టీడీపీ గెలిచే స్థానాలను తమ వద్ద ఉంచుకుని మిగిలిన స్థానాలను తమకు కేటాయించిందని అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాష్ట్ర సీనియర్ నాయకులు ఇటీవల రాసిన లేఖను అధిష్టానం ఏ మేరకు సీరియస్‌గా తీసుకుందనేది ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా విడుదలయ్యే జాబితాతో వెల్లడవుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
మహాసేన రాజేష్‌కు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అంటే వెన్నుపోటు.. వెన్నుపోటు అంటే చంద్రబాబు.. ఎన్నికల సమయంలో బాబు వెన్నుపోటు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. తాజాగా టికెట్ విషయంలో మహాసేన రాజేష్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పి.గన్నవరం టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వ్యతిరేకత పేరుతో జనసేనకి సీటు కేటాయించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుండి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. విజయవాడలో పి.గన్నవరం సీటును జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొదట పి.గన్నవరం సీటు టీడీపీకి టికెట్ కేటాయించారు. పి.గన్నవరంలో మహాసేన రాజేష్‌ను చంద్రబాబు ప్రకటించారు. మహాసేన రాజేష్ అభ్యర్దిత్వాన్ని స్ధానిక జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. మహాసేన రాజేష్‌ను పి.గన్మవరంలో పర్యటించకుండా జనసేన నేతలు అడ్డుకున్నారు. మహాసేన రాజేష్‌కు టికెట్ ఇవ్వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేశాయి. వ్యతిరేకత, ఆందోళనల నేపధ్యంలో పి.గన్నవరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటన చేశారు. కొన్ని రోజుల తర్వాత పి.గన్నవరం నుంచే పోటీకి దిగుతానని మహాసేన రాజేష్ మళ్లీ ప్రకటన చేశారు. ఇదే సమయంలో మహాసేన రాజేష్‌కు వెన్నుపోటు పొడిచి పి.గన్నవరం టికెట్ జనసేన పార్టీకి కేటాయించారు చంద్రబాబు. మహాసేన రాజేష్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించిన గిడ్డి సత్యనారాయణకే జనసేన నుంచి పి.గన్నవరం టికెట్ పవన్ కల్యాణ్ ఇచ్చారు. సత్యనారాయణకి నియామక పత్రాలు పవన్ కల్యాణ్ అందించారు. -
‘వై నాట్ 175?’ నినాదం స్ఫూర్తితో...
ఎట్టకేలకు ఎన్నికల నగార మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4 ‘సిద్ధం’ సభల ద్వారా తమ సత్తా ఏంటో చాటుకుంది. అభ్య ర్థులను అన్ని పార్టీల కన్నా ముందే ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 ఎంపీ స్థానాలకు సామాజిక న్యాయాన్ననుసరించి అభ్యర్థులను నిర్ణయించారు వైఎస్సార్సీపీ వారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటుకు కలిపి మొత్తం 59 టికెట్లు ఇచ్చారు. ఆశ్చర్యమేమిటంటే వీరిలో చాలామంది అతిపేదలు. ఇది రాజకీయానికి ఒక కొత్త నిర్వచనంగా చెప్పవచ్చు. మరోపక్క అప్పటికప్పుడు సూట్‌కేసులతో విమానాలు దిగిన పెద్దలకు మాత్రమే చంద్రబాబు సీట్లు కేటాయిస్తున్నారు. అందులోనూ స్వజాతి పక్షులే ఎక్కువ. సీనియర్లు దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. ఇదిలావుంటే ‘గండస్యోపరిపిటకవత్’ అనే సామెత (గోడదెబ్బ – చెంపదెబ్బ)గా ఇష్టంలేని పొత్తుల వల్ల టీడీపీ – జనసేన కార్యకర్తలు బాహాబాహీ యుద్ధానికి దిగుతున్నారు. ఇక అసలు నాయకుడు ఎన్డీయే పొత్తుకోసం నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసి, చూసి రాయబారాలు పంపీ, పంపీ ఎట్టకేలకు వదినగారి దయతో చేరి పోయారు. తన జన్మధన్య మైందనుకుంటూ రాష్ట్రానికి తిరిగి వచ్చి సీట్ల పంపిణీ ప్రారంభిస్తే... అది పూర్తిగా బెడిసికొట్టి సిగపట్ల వ్యవ హారం సీరియస్‌గా సాగుతున్నది. పోనీ సభల ద్వారా వాటిని కవర్ చేసుకుందామంటే వెయ్యి రూపాయలు, క్వార్టర్ బాటిల్, బిర్యానీ ఇచ్చినా తినేసి పోతున్నారు కానీ సభదాకా రావడంలేదు. ‘రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదనట్లు’ మోసాలు, అడ్డ దారులు తప్ప నిఖార్సయిన రాజకీయం తెలియని ఈ అబద్ధాల కోరును భరించలేమని జనాలు 2019లోనే అధికారం నుండి తోసేస్తే, అదేమీ గుర్తించకుండా తనకుతానే గొప్పనాయకుడిని అనుకుంటూ మతిలేని ఉపన్యాసాలు ఇస్తున్న ఇతనికి తోడు దత్తపుత్రుడొకరు. రాసిచ్చిన డైలాగులు ఆవేశంలో వూగిపోతూ చదవటం తప్ప సొంత ఆలోచన లేదు పవన్ కల్యాణ్‌కు. ఇక అసలు పుత్రుడిని చూద్దామంటే అతని పేరెత్తితేనే పార్టీ పారిపోతున్నది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదేదారిలో ఉన్నాడు. అతడికి సర్టిఫికెట్స్ తప్ప ఏ భాషా రాదు. కొత్తగా వచ్చిన మరో తోడు వదినగారు. ప్రస్తుతం తన ఒక్కసీటు గెలిస్తే చాలు వచ్చే ఎన్డీయే ప్రభుత్వంలో ఎలాగయినా మంత్రిపదవి దక్కించుకోవాలని సొంత పార్టీనే తాకట్టు పెడుతున్నారు. ఈ నలుగురు ఇలా నడుస్తుంటే... వీళ్ళకేడరు మాత్రం నియోజక వర్గాల్లో తన్నుకోవడంలో యమ బిజీగా ఉన్నారు. సిద్ధాంత బలం లేక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్కమాట మాట్లాడలేక పోతున్నారు. కానీ జగన్‌ను తిట్టడానికి మాత్రం ఒకేదారిలో నడుస్తున్నారు. వాళ్ళకున్న సిద్ధాంతమల్లా జగన్ ఓడిపోవాలి. ఎందుకంటే సమా ధానం లేదు. వీళ్ళ ఎజెండాలో కులగర్జనలు, మతాల పూత్కా రాలు, ముఖ్యమంత్రి మీద విష ప్రచారాలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. అదుపు తప్పిన కట్టుబాట్లతో, అబద్ధపు రాతలే తమ ధ్యేయ మన్నట్లు కులఅహంకారంతో పిచ్చిరాతలు రాస్తున్నాయి పచ్చ పత్రికలు. ఒక అవినీతిపరుడి కొమ్ముకాస్తూ అవి ఏనాడో విలువల్ని పోగొట్టు కున్నాయి. మరోవైపు మరో దత్తపుత్రిక వచ్చి చేరింది. కుటుంబ వ్యవస్థను నాశనం చేసే విద్యలో ఎన్నో డిగ్రీలు పొందిన చంద్రబాబు మరో కుటుంబ వినాశనానికి పూనుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చి ఇంటి పెద్దను నాశనం చేసిన ఇతడు, పచ్చగా, సమష్టిగా కష్టాలను సమైక్యంగా ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులను అధిగమించి అధికారాన్ని సాధించుకున్న వైఎస్సార్ కుటుంబం మీద తన వక్రదృష్టి సారించాడు. ఫలితంగా అదికూడా చీలిపోయింది. ఈ దురాశాపరులు అభివృద్ధిలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ భవిష్య త్తును నాశనం చెయ్యటానికి కంకణం కట్టుకున్నారు. సామాజిక సహ జీవనంతో సౌభ్రాతృత్వంగా వర్ధిల్లుతున్న ఆంధ్రుల ప్రశాంతతను చెరపటానికి ఈ కూటమి ప్రయత్నిస్తున్నది. కానీ ఆంధ్రులు అమా యకులు కాదు. స్వాతంత్య్ర పోరాటం నుండి ఇప్పటి వరకు ఎన్నో రాజకీయాలను, ఎందరో నాయకులను చూసిన అనుభవం వారిది. అందుకే ఈ దుష్టగ్రహ కూటమి సభలకు వెళ్ళకుండా తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. వారి ఏ సభ చూసినా, ఖాళీ కుర్చీలే. వీరి పతనం చివరిదశకు చేరిందనటానికి ఇవన్నీ సంకేతాలే. రాజనీతిజ్ఞుడు, అనుభవజ్ఞుడు అయిన మోదీ ఈ పొత్తుకు సుముఖంగా లేరనే విషయం వారి ప్రవర్తన, ప్రసంగధోరణి చెప్పకనే చెప్పాయి. జగన్ గురించి ఏమీ విమర్శించక పోవటం, వైరి గుండెల్లో గునపాలు గుచ్చినట్లే వుంది. పక్క రాష్ట్రాలయిన తెలంగాణ, కర్ణాటక, చెన్నై సభల్లో అక్కడి ముఖ్యమంత్రులను ఏకిపారేశారు మోదీ. ఆ ప్రసంగాలతో పోల్చి చూస్తే ఏపీ ముఖ్యమంత్రిని, ఆయన పాలనను ప్రధాని మెచ్చినట్లే కనిపించింది. ఇంకో విషయం కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అది జగన్ పట్ల వారికున్న అభిమానం. ప్రధానమంత్రి కంటే ఐదు నిమిషాల ముందు ప్రసంగించిన చంద్ర బాబు జగన్‌ను విమర్శిస్తూ ‘తల్లిని, చెల్లిని చూసుకోలేనివాడు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ కెలా మేలుచేస్తాడు...’ అంటూ తన లేకితనాన్ని ప్రదర్శించుకున్నాడు. కానీ మోదీ ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా ‘అన్నా, చెల్లి ఒకటే. ఇది కాంగ్రెస్–వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ’ అంటూ చంద్రబాబు గొప్పగా ప్రయోగించాలనుకున్న షర్మిల అస్త్రాన్ని ఉపసంహరించారు. ప్రైమ్ మినిస్టర్ ముందు జగన్‌ను పెద్ద విలన్‌గా చూపించాలనుకున్న వీళ్ళ ఎత్తుగడను ఆయన చిత్తుచేసి ప్రజల్ని ఒక అయోమయంలో ఉంచి వెళ్ళిపోయారు. ‘ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు’ ఈ సభ ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలనుకున్న చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌లకు అవమానాలే మిగిలాయి. లక్షల్లో వస్తారన్న జనం రాలేదు. వచ్చిన ప్రధానమంత్రి వీరి పేరయినా ఎత్తలేదు. మరో పక్క పొత్తుకు గండికొడుతున్నాడని బీజేపీ సీనియర్లు అధిష్టానానికి లేఖ రాశారు. ఆ పొత్తు చివరిదాకా వుంటుందో లేదో తెలియదు. జనసైన్యం అసలు సహకరించటం లేదు. ఇక ఓట్లు షేర్ చేసుకునే దెప్పుడు? ‘కత్తితో చంపేవాడు ఆ కత్తితోనే చస్తాడు’ అన్నట్లు అవగాహన, రాజకీయ సంస్కారం లేని ముఠాలను తయారుచేసుకున్న దత్తపుత్రుడి సైన్యం తమ నాయకుల మీదే తిరుగుబాటు చేస్తోంది. ఎటుచూసినా పంచకూళ్ళ కూటమికి గందరగోళంలా తయారయ్యింది పరిస్థితి. కలసినా ఒకళ్ళనొకళ్ళు ఓడించుకుంటారు. మరోవైపు జగన్ ఒక్కడే తన సైన్యంతో ముందుకు దూసుకు పోతున్నాడు. అతని ఆయుధం ప్రజాబలం. అతని నినాదం పేదల సంక్షేమం. అతని సైన్యం ఐకమత్యంతో నాయకుడిని అనుసరించే పార్టీ. ఇప్పుడు చెప్పండి – ముఖ్యమంత్రి జగన్ అన్నట్లుగా ‘వైనాట్– 175?’ సాధించి చూపెడదాం – ఆదర్శ రాజ్యాన్ని నిలబెడదాం. - వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ - డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
పశ్చిమగోదావరి: టీడీపీ-జనసేనలో భగ్గుమన్న అసమ్మతి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ-జనసేన అధినేతల వ్యవహార శైలి, సీట్ల ప్రకటన ఇరు పార్టీల కేడర్‌కు మింగుడు పడటం లేదు. పొత్తుల పేరుతో ఇరు పార్టీల నేతలు కత్తులు నూరుకుంటున్నాయి. జిల్లాలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్‌కు సీటు కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ కొత్తపల్లి సుబ్బారాయుడు అలకబూనారు. భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జనసేన నేతల్లో వర్గ పోరు నెలకొంది. తణుకు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో విడివాడ రామచంద్రరావు నైరాశ్యంలో మునిగిపోయారు. తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనంటూ ఆయన శపథం పూనుతున్నారు. దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు సమాచారం. పోలవరం సీటుపై పంచాయితీ తేలలేదు. టీడీపీ నుంచి బొరగం శ్రీనివాస్, లేదా జనసేన నుంచి బాలరాజు కేటాయించుకుంటే.. తాము సహకరించబోమని కేడర్ తేల్చి చెబుతోంది. -
తిరుపతి టీడీపీ-జనసేనలో అసమ్మతి జ్వాలలు
సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి టీడీపీ-జనసేనలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. తిరుపతి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను టీడీపీ, జనసేనలో ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. లోకల్ ముద్దు - నాన్ లోకల్ వద్దు అంటూ టీడీపీ- జనసేన నాయకులు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. నాగబాబు వద్దకు తిరుపతి పంచాయితీ చేరింది. మరోవైపు, టికెట్ ఇస్తే జనసేన నుంచి పోటీకి సిద్ధమని సుగుణమ్మ అంటున్నారు. శ్రీకాళహస్తిలో ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్పీవీ వర్గం వ్యతిరేకిస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న కోనేటి ఆది మూలం వద్దని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. టీడీపీ రెబెల్‌గా సత్యవేడు మాజీ ఇన్ఛార్జ్ జీడి రాజశేఖర్ బరిలో దిగారు. మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషాను దొమ్మల పాటి రమేష్, జనసేన పార్టీ నేత రామ్ దాస్ చౌదరి వ్యతిరేకిస్తున్నారు. తంబల్లపల్లెలో జయచంద్రారెడ్డికి కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం ఆగ్రహంతో ఉన్నారు. ఇదీ చదవండి: బాబును నమ్ముకో.. ఉన్నది అమ్ముకో.. -
టక్కుటమారి.. టముకుతో సరి
నరసరావుపేట ఎంపీ, కనిగిరి, కందుకూరు అసెంబ్లీ స్థానాల కేటాయింపుసాక్షిప్రతినిధి, ఒంగోలు: జయహో బీసీ... అంటూ వారిని ఉద్దరిస్తామని టీడీపీ–జనసేన సంయుక్తంగా ప్రకటించి నేడు విస్మరించాయి. బీసీలను అందులో ప్రధానంగా యాదవ సామాజికవర్గానికి ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క సీటు కూడా కేటాయించకుండా చంద్రబాబు వారి వెన్ను విరిచారు. కానీ బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి భరోసా కల్పించారు. ఈ మూడు జిల్లాల్లో 50 శాతానికి పైగా బీసీ ఓట్లు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో 2.50 లక్షల నుంచి 3.50 లక్షల వరకు యాదవ ఓటర్లు ఉన్నారు. అయితే ఆ జిల్లాల్లో పార్లమెంట్ కానీ, అసెంబ్లీకి కానీ టికెట్లు కేటాయించకపోవటంతో టీడీపీపై యాదవులు రగిలిపోతున్నారు. కానీ యాదవులకు వైఎస్సార్సీపీ సముచిత స్థానం కల్పించింది. ఆ జిల్లాల్లో వారికి పెద్దపీట వేసింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యాదవ నేత బీదా మస్తాన్‌రావును రాజ్యసభకు పంపింది. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్‌కుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీకి సాధారణ జెడ్పీటీసీ సభ్యుడిని ప్రకటించి సంచలనం సృష్టించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కందుకూరు అసెంబ్లీకి పోటీలో నిలబెట్టింది. మరోవైపు గురజాల నియోజకవర్గానికి చెందిన యాదవ నేత జంగా కృష్ణమూర్తికి టీడీపీలో చాన్సే లేకుండా పోయింది. ఆయన గురజాల టికెట్ కావాలని వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో ఆయనకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత కల్పించారు. పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే గురజాల అసెంబ్లీ సీటు ఇస్తానని జంగాకు టీడీపీ నమ్మబలికి మొండిచేయి చూపింది. చీరాలలో టీడీపీ నేత, నియోజకవర్గ ఇన్చార్జ్ మద్దులూరి మాలకొండయ్యను దాదాపు ఆ పార్టీ పక్కన పెట్టేసింది. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి బాబు మొండిచేయి చూపారు. యాదవుల్లో సమర్థులు లేరా? ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో టీడీపీలో యాదవ సామాజికవర్గానికి చెందిన సమర్థులు లేరా? ఒకప్పటిలా టీడీపీ పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ సీట్లిచ్చి సీఎం జగన్ యాదవులను ఎంతగానో గౌరవించారు. మాకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలనే ఆదరిస్తాం. – మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు -
ఆందోళనలతో ‘కూటమి’ కుతకుత
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్/డోన్/కాళ్ల/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/వెంకటగిరి రూరల్ (తిరుపతి జిల్లా)/శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా)/దేవరపల్లి: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. సీనియర్ నాయకులు తమకు టికెట్ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను హెచ్చరిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవిందబాబును ప్రకటించడానికి టీడీపీ అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోందని నిరసిస్తూ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి విలేకరుల సమక్షంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నరసరావుపేట మండలం పాలపాడులోని తన స్వగ్రహంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మధ్యే పార్టీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అరవిందబాబుకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇంకా పార్టీలో చేరని జంగా కృష్ణమూర్తి, మరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇప్పించేందుకు ఆయన పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ ద్రోహి శ్రీకృష్ణదేవరాయలు అని మండిపడ్డారు. అనంతరం పక్కనే ఉన్న పురుగుమందు డబ్బాను అందుకుని తాగారు. కార్యకర్తలు ఆయనను నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇదంతా చదలవాడ ఆడిస్తున్న డ్రామా అని ప్రత్యర్థివర్గాలు ఆరోపిస్తున్నాయి. కేఈ, కోట్లది చీకటి ఒప్పందం కేఈ, కోట్ల కుటుంబాలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని తాము మాత్రమే డోన్ రాజకీయాలను శాసించాలనే విధంగా ప్రవర్తిస్తున్నాయని టీడీపీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మండిపడ్డారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. మూడేళ్ల క్రితం కోట్ల, కేఈ కుటుంబాలు డోన్ టీడీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటే తాను పార్టీని బతికించానని, రెండున్నరేళ్ల క్రితమే తనను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మోసం చేసింది : శివరామరాజు పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో బుధవారం జైన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తే తనను అధిష్టానం మోసం చేసిందని విమర్శించారు. కష్టపడిన వారికి గుర్తింపు లేదు టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొలిగర్ల మస్తాన్‌యాదవ్ విమర్శించారు. తిరుపతిజిల్లా వెంకటగిరి పట్టణంలోని తనచారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ కోసం సేవ చేస్తే చివరకు టికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మస్తాన్ యాదవ్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్దిపాటిని మార్చకుంటే బరిలోకి రెబల్ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజును మార్చకుంటే పార్టీలో తిరుగుబాటు తప్పదని కార్యకర్తలు హెచ్చరించారు. బుధవారం నల్లజర్లలోని ప్రియాంక కన్వెన్షన్ హాల్లో మద్దిపాటి వ్యతిరేకవర్గం సమావేశమైంది. మద్దిపాటిని మార్చకుంటే రెబల్ అభ్యర్థిని బరిలో దింపుతామని అలి్టమేటం జారీ చేశారు. బొజ్జలకు మద్దతు లేదు బొజ్జల సుదీర్‌రెడ్డికి తాము మద్దతివ్వలేదని మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య స్పష్టం చేశారు. ఎస్సీవీ నాయుడు స్వగృహంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సు«దీర్‌రెడ్డి తమను కలిశారని, అయితే మద్దతిస్తున్నట్టు ఆయనకు తాము చెప్పలేదని పేర్కొన్నారు. తానూ చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే టికెట్ కోరతానని స్పష్టం చేశారు. బలిచ్చే మేకపోతు మాకొద్దు విశాఖ దక్షిణ జనసేన టికెట్ వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఇవ్వొద్దంటూ కార్పొరేటర్ సాధిక్ వర్గీయులు పట్టుబడుతున్నారు. దీంతో సాధిక్ కార్యాలయం వద్ద వంశీకృష్ణ శ్రీనివాస్, సాధిక్ వర్గీయులు బుధవారం బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులకు సిద్ధమయ్యారు. దీంతో సాధిక్, వీరమహిళలు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. ‘‘బలిచ్చే మేకపోతు మాకొద్దు’’ అంటూ ఓ మేకను తీసుకొచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. -
పిఠాపురంలో జనసేనకు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి శేషకుమారి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి. మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాకినీడి శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికలలో 28 వేల ఓట్లు తనకు వచ్చాయని తెలిపారు. ‘పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు. పవన్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు. జనసేనకి అసలు విధివిధానాలే లేవు. పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు. జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. సీఎం జగన్‌తో అసలు పవన్‌ను ఎవరూ పోల్చుకోరు. సీఎం జగన్ స్థాయి వేరు. పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం. ఆచరణలో ఏమీ చేయరు’ అని తెలిపారు. నన్ను జనసేనలోకి రమ్మనటం పవన్ అవివేకం డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఓట్లేయమని అడుగుతాం. కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది. నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ. నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం. పవన్‌ను కూడా నేను మా వైఎస్సార్సీపీలోకి రమ్మంటే బావుంటుందా?. సీఎం జగన్ మీద జనానికి నమ్మకం ఉంది. ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు. పవన్‌కు అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు. జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదు’ అని వంగా గీత అన్నారు. -
ఆ ఒక్కటీ.. ఇంకా తేలదేమిటీ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమిలో సీట్ల పంపకంపై స్పష్టత కుదరడం లేదు. టీడీపీ, జనసేనలోనే కాదు బీజేపీలో కూడా టెన్షన్ నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో కేటాయించే సీటు విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేకపోవడంతో బీజేపీ నాయకుల్లో అయోమయం వీడడం లేదు. చంద్రబాబు, పవన్‌తో జరిగిన సమావేశంలో జాతీయ స్థాయి నాయకులు పాల్గొనడం, అందులో రాష్ట్ర నాయకులు లేకపోవడంతో బీజేపీకి కేటాయించే సీటుపై గందరగోళం నెలకొంది. ఇప్పుడున్న సమాచారం మేరకు శ్రీకాకుళం కంటే పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాలకే ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా బీజేపీ నాయకులు అభిప్రాయడుతున్నారు. పొత్తు కుదరకముందు ప్రతి నియోజకవర్గానికి ముగ్గురేసి అభ్యర్థులను రాష్ట్ర నాయకులు జాతీయ అధిష్టానానికి ప్రతిపాదించారు. ఈ లోగా పొత్తు కుదరడంతో సీట్ల పంపకాలపై పార్టీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ఒక సీటు ఇవ్వాలని ఒప్పందం జరిగింది. ఇక్కడే కాస్త సమాచారం లోపం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో ఒక సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్కటీ శ్రీకాకుళం కావచ్చని చాలారోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం జిల్లాకు ఒకటి అన్నది శ్రీకాకుళం పేరు మీద జరిగినందున.. అది శ్రీకాకుళం నియోజకవర్గం అయి ఉండొచ్చనే ప్రచారానికి తెరలేచినట్టుగా భావిస్తున్నారు. అదే జరిగితే శ్రీకాకుళం నుంచి ప్రతిపాదిత జాబితాలో ఉన్న పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాల్‌తో పాటు రాయలసీమ జిల్లాకు చెందిన సురేంద్రకుమా ర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వవచ్చని ఊహాగానాలు, విశ్లేషణలు జరిగిపోయాయి. తాజా సమాచారం ప్రకారం ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాలకే ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాతపట్నంలో టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీ భ్రష్టు పట్టి పోవడంతో ఎందుకొచ్చిన సమస్య అని బీజేపీకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు భోగట్టా. అలాగే ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో బీజేపీకి ఇచ్చేస్తే తలనొప్పి ఉండదని కూడా చంద్రబాబు భావించి ఉండొచ్చని.. ఈ రెండింటిలో బీజేపీ ఏది కోరితే ఆ సీటు ఇచ్చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్టు కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ అభిప్రాయం మేరకు ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని జాతీయ నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉందని జిల్లా నాయకత్వం కూడా భావిస్తోంది. వాస్తవంగా ఇటీవల బీజేపీలో చేరిన ఒకప్పటి టీడీపీ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు ఆ వ్యూహంలో భాగమని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఒకవేళ పాతపట్నం కాదనుకుంటే ఎచ్చెర్లకు చెందిన ఎన్ఈఆర్( నడికుదిటి ఈశ్వరరావు)కైనా ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఎన్ఈఆర్ కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పెద్ద ఎత్తున ప్రయతి్నస్తున్నట్టుగా ఓ వర్గం చెబుతుండగా, టిక్కెట్ గ్యారంటీ ఇవ్వడంతోనే సిరిపురం తేజేశ్వరరావు పారీ్టలోకి చేరారని మరోవర్గం స్పష్టం చేస్తోంది. మొత్తానికి బీజేపీకి జిల్లాలో ఒక సీటు కేటాయించడం ఖాయం. అది ఏది అన్నది తేలాల్సి ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్‌తో తెరపైకి వచ్చిన శ్రీకాకుళం అవుతుందా? కాస్త బలంగా ఉన్నామని భావిస్తున్న ఎచ్చెర్ల, పాతపట్నంలో ఒకటవుతుందా అన్నది చూడాల్సి ఉంది. బీజేపీలో జరుగుతున్న తర్జనభర్జన నేపథ్యంలో టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయి. బీజేపీతో తమ సీటు గల్లంతు అవుతుందేమోనని అటు శ్రీకాకుళం నుంచి గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్, పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు, ఎచ్చెర్ల నుంచి కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు భయాందోళనలో ఉన్నారు. మొత్తానికి ఏదో ఒక నియోజకవర్గంలో ఇద్దరికీ సీటు చిరగడం మాత్రం ఖాయమని పొత్తు ఒప్పందం ప్రకారం స్పష్టమవుతోంది. -
రగులుతున్న పొత్తు కుంపట్లు
సాక్షి, చిత్తూరు/సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షిప్రతినిధి, కాకినాడ/సాక్షి, భీమవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య క్షేత్రస్థాయిలో పొత్తు పొసగడం లేదు. కార్యకర్తలు, నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటనా ఇంకా కాలేదు. ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ సీట్లలోనూ మూడు పార్టీలూ ఏకతాటిపైకి రావడం లేదు. బాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ చేతులెత్తేసింది. ఇక్కడ టీడీపీ తీరుతో విసిగి జనసేనలో చేరిన నేతలు ఇప్పుడు ఇరుపార్టీల మధ్య పొత్తు కుదరడం, బాబే మళ్లీ పోటీ చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ నాయకులూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పూతలపట్టు, నగరి, పుంగనూరు, జీడీ నెల్లూరు, పలమనేరుల్లోనూ టీడీపీ అభ్యర్థులకు మిత్రపక్షాల నుంచి సహకారం లేదు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్నాయుడు పట్టుకోసం పార్టీ నాయకులపై స్పై ఆపరేషన్ చేస్తున్నట్టు సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిని బాబు ఇంకా తేల్చలేదు. ఐఆర్ఎస్ అధికారి ప్రసాద్‌రావుతోపాటు ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వెంకటరమణా.. ఎంపీ సీటూ గోవిందా! రాజానగరం అభ్యర్థిత్వం చేజారిన బొడ్డు వెంకటరమణ చౌదరికి మళ్లీ భంగపాటు తప్పేలా లేదు. అప్పట్లో రాజమహేంద్రవరం ఎంపీ స్థానం ఆశ చూపిన అధిష్టానం ఇప్పుడు మొండిచేయి ఇచ్చేలా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా ఎంపీగా పురంధరేశ్వరి బరిలో దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీడని బీజేపీ ‘సీటు’ముడి శ్రీకాకుళం జిల్లాలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే సీటుపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పాతపట్నం, ఎచ్చెర్లలో ఒక నియోజకవర్గం బీజేపీకి కేటాయించవచ్చని తెలుస్తోంది. బీజేపీ ఈ రెండింటిలో ఏదడిగినా ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ‘కొండ’ఎక్కిన సీటు ఆశలు తెలుగుదేశం పార్టీలో కాకినాడ సిటీ సీటు పంచాయితీ ఎటూ తేలడం లేదు. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) ఆశలు కొండెక్కాయనే ప్రచారం జరుగుతోంది. అన్న సత్యనారాయణ రూపంలో కొండబాబుకు ఇంటిపోరు ఎదురుకావడంతోపాటు పార్టీలోనూ వ్యతిరేకత ఉండడంతో బాబు పునరాలోచనలో పడ్డారని సమాచారం. కొండబాబు స్థానంలో అతని అన్న సత్యనారాయణ పెద్ద కోడలు సుస్మిత పేరును ఐవీఆర్ఎస్ సర్వేలో చేర్చారని చర్చ జరుగుతోంది. పశ్చిమలో పోరు పశ్చిమగోదావరి జిల్లాలో కూటమిలో సెగ రగులుతోంది. జనసేన పార్టీ నాయకుడు బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గాలు ఎడముఖంపెడముఖంగా ఉండడంతో శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ఉండి టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించడం శ్రేణుల్లో చీలిక తెచ్చింది. తణుకు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న జనసేన నేత విడివాడ రామచంద్రరావు పార్టీకి దూరంగా ఉన్నారు. భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు జనసేన టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో నిరసన వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు , రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్కస్థానాన్నీ ఎన్డీఏ కూటమి మహిళలకు కేటాయించలేదు. అధికార వైఎస్సార్ సీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చింది. పోలవరం, గోపాలపురం అసెంబ్లీ స్థానాలతోపాటు, నరసాపురం ఎంపీ స్థానాన్ని మహిళలకు కేటాయించింది. -
మరో ఫ్లాప్ షో.. ప్రజాగళం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, నరసరావుపేట: ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన చేరిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సభ ప్రధానికి అవమానంతో మొదలై, జనం రాక, మైకులు పనిచేయక చివరకు నవ్వులపాలై ఓ ఫ్లాప్ షోగా మిగిలింది. ప్రధాని మోదీ వస్తుండటంతో 15 లక్షల మందితో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రచారం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటిస్తామని చెప్పారు. తీరా చూస్తే సభకు పట్టుమని లక్ష మంది కూడా రాలేదు. మేనిఫెస్టో కూడా లేదు. వైఎస్సార్సీపీ సిద్ధం సభలు పది లక్షలు, పదిహేను లక్షల జనంతో విజయవంతమై చరిత్ర సృష్టించాయి. వాటి స్థాయిలో నిర్వహించాలన్న భావనతో టీడీపీ, జనసేన ఏర్పాట్లు చేశాయి. తీరా చూస్తే కనీసం లక్ష మంది కూడా రాలేదు. మరోపక్క జనం లేకపోవడాన్ని కవర్ చేయడానికి చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో చేయించిన హడావుడి ప్రధాని మోదీని అసహనానికి గురి చేసింది. టీడీపీ కార్యకర్తలు సౌండ్ బాక్సుల పైకి దూసుకురావడంతో చాలాసార్లు మైకులు మొరాయించాయి. కార్యకర్తలు సౌండ్ బాక్సుల టవర్లు, లైటింగ్ టవర్ల పైకి ఎక్కడంతో మోదీ తీవ్రంగా వారిని హెచ్చరించారు. 100 ఎకరాల్లో సభకు 30 ఎకరాలే బొప్పూడి వద్ద సుమారు దాదాపు 100 ఎకరాల్లో ఈ సభకు ఏర్పాట్లు చేశారు. అందులో పార్కింగ్‌కి పోను కేవలం 40 ఎకరాలను సభ కోసం కేటాయించారు. అందులో వేదిక, హెలీప్యాడ్ల కోసం పది ఎకరాలు కేటాయించగా మిగిలిన 30 ఎకరాల్లో మాత్రమే కార్యకర్తల కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 2 వేల కుర్చిలు వేశారు. అవి కూడా ఒక కుర్చికి ఇంకో కుర్చికి మధ్య రెండు అడుగులు గ్యాప్ ఉండేలా వేశారు. మొత్తం 48 వేల కుర్చిలు వేసినట్లు చెబుతున్నారు. వాటిలో 6 వేల కుర్చిలు కూడా నిండలేదు. మోదీ ప్రసంగం మొదలైన నిమిషానికే మైకు మొరాయించడంతో రెండు నిముషాలు ఆగాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఎక్కువ మంది లేచి వెళ్లిపోవడం మొదలెట్టారు. మోదీ మాట్లాడే సమయంలో మూడుసార్లు అంటే దాదాపు ఏడు నిమిషాలకు పైగా మైకులు ఆగిపోవడంతో సభా ప్రాంగణం ఖాళీ అయిపోయింది. టీడీపీ ప్రోద్బలంతో టవర్లెక్కిన కార్యకర్తలు.. హెచ్చరించిన ప్రధాని సభా వేదికపైకి మోదీ వచ్చిన సమయానికి కూడా జనం లేకపోవడంతో చంద్రబాబు, పవన్‌లో ఆందోళన కనిపించింది. మోదీ వేదిక మీదకు వచ్చిన తరువాత పవన్, బాబు ప్రసంగించారు. దీన్ని గమనించిన చంద్రబాబు అండ్ టీం పరువు కాపాడుకోవడానికి తమకు తెలిసిన టక్కుటమార విద్యలను ప్రదర్శించారు. ఖాళీ కుర్చిల నుంచి మోదీ దృష్టి మళ్లించేందుకు సభలో టీడీపీ కార్యకర్తలతో గందరగోళం సృష్టించి జనం భారీగా వచ్చారన్న భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారు. ముందు ఉన్న కార్యకర్తలు స్టేజ్ వద్దకు దూసుకువస్తున్నట్టు ప్రయత్నించారు. సౌండ్ బాక్స్ టవర్లను సైతం ఎక్కి హడావుడి చేశారు. పవన్ మాట్లాడుతున్న సమయంలో చాలా మంది మైక్ టవర్స్, లైటింగ్ కోసం కట్టిన టవర్లపై ఎక్కడాన్ని మోదీ గమనించారు. పవన్‌ను ఆపి మోదీ మాట్లాడారు. ఏదైనా జరగరానిది జరిగితే ఇబ్బందులు ఎదురౌతాయని, దయచేసి దిగాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధాని గట్టిగా హెచ్చరించడంతో టీడీపీ కార్యకర్తలు టవర్ల పైనుంచి కిందికి దిగారు. మొరాయించిన మైకులు..ప్రధాని అసహనం ప్రధాని మోదీ మాట్లాడుతుండగా మైకులు పదే పదే మొరాయించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. జనం రాకపోవడాన్ని కవర్ చేయడంలో భాగంగా చంద్రబాబు తన కార్యకర్తలతో చేయిస్తున్న హడావుడిలో భాగంగా వారంతా సౌండ్ సిస్టం వద్దకు దూసుకుపోయారు. వారి తాకిడితో వైర్లు, ఇతర పరికరాలు కదిలిపోయి మైకులు మొరాయించాయి. పవన్, చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఒకటి, రెండుసార్లు అంతరాయం కలిగింది. ప్ర«ధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో తొలుత మూడు నిమిషాలు మైకులు పనిచేయలేదు. తరువాత ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా మరోసారి ఐదు నిమిషాల దాకా అంతరాయం కలిగింది. దీంతో మోదీ అసహనానికి గురయ్యారు. ‘దయ ఉంచి అక్కడ ఉన్నవారంతా వెనక్కి వెళ్తే మైక్ పనిచేస్తుంది. సభకు అంతరాయం కలిగించవద్దు. మీ ఉత్సాహం, మీ జోష్ నాకు ఇష్టమే. కానీ మీరు కొంచెం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. దూరంగా ఉన్నవారు ప్రశాంతంగా ఉన్నారు. మీరెందుకు హడావిడి చేస్తున్నారు’ అంటూ మోదీ చిరాకు పడ్డారు. తొలి మీటింగే ఫెయిలవడంతో... బీజేపీతో పొత్తు కుదరడంతో టీడీపీ నిర్వహించిన తొలి సభ విఫలమవడంతో టీడీపీ, జనసేన కేడర్ నైరాశ్యంలోకి వెళ్లింది. గట్టిగా ఓ మీటింగ్ నిర్వహించలేకపోతున్నాం.. ఇదేమి ఖర్మ.. అంటూ టీడీపీ కార్యకర్తలు అక్కడే వ్యాఖ్యానించారు. మరోవైపు సభలో సామాన్య ప్రజలు కనిపించలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. చిలకలూరిపేట సమీపంలో టీడీపీ నేతల మిల్లుల్లో పనిచేసే నార్త్ ఇండియా వలస కూలీలు కూడా సభలో అధిక సంఖ్యలో కనిపించారు. మహిళలు ఈ సభకు దూరంగా ఉన్నారు. సభలో స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆర్టీసీ బస్సులతోపాటు నారాయణ, భాష్యం వంటి టీడీపీ అనుకూల విద్యా సంస్థల నుంచి వందలాది బస్సులు గ్రామాలకు పంపినా జనం లేక ఖాళీగానే వచ్చాయి. కొన్నింటిలో సగం మంది కూడా లేరు. ఒక్కొక్కరికి రూ.500 నుంచి రూ.1,000 దాకా నగదు, మందు బాటిల్, బిర్యానీ పొట్లం ఇచ్చినా సభకు రాలేదని నేతలు చిరాకుపడ్డారు. బొçప్పూడి సభతో ప్రజల నాడి అర్థమవుతోందన్న భావన వారిలో నెలకొంది. ప్రజలు సీఎం వైఎస్ జగన్ వైపు ఉన్నారన్న విషయం ఈ సభ ద్వారా మరోసారి రుజువైందని టీడీపీ కార్యకర్తలే సభ బయట వ్యాఖ్యానించారు. వైఫల్యాన్ని పుల్లారావుపై నెట్టేశారు సభ వైఫల్యాన్ని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు పైకి తోసే ప్రయత్నం మొదలైంది. సభ అట్టర్ ఫ్లాప్ అవడం, ప్రధానికి వేదికపై అవమానం జరగడం, మైకులు పనిచేయకపోవడానికి పుల్లారావే కారణం అంటూ ఎల్లో మీడియా ప్రచారం మొదలు పెట్టింది. మైక్ సిస్టమ్‌కు సరైన రక్షణ ఏర్పాట్లు చేయలేదని, అసలు ఏర్పాట్లను పుల్లారావు పట్టించుకోలేదంటూ ప్రచారం చేస్తున్నారు. వ్యాఖ్యాతను కూడా సరైన వారిని పెట్టలేదంటూ కామెంట్లు మొదలుపెట్టారు. దీంతో పుల్లారావు మీడియా ముందుకు వచ్చి పోలీసుల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. సభకు ప్రజలు రాకపోవడానికి కారణాన్ని ఎల్లో మీడియా కూడా పోలీసులపై నెట్టేసింది. ట్రాఫిక్ జామ్ అయ్యిందని, పోలీసులు సరిగా పర్యవేక్షించలేదంటూ ఎల్లో మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. సభా వేదికపై ప్రధానికి అవమానం రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్డీఏ కూటమి సభకు హాజరైన ప్రధాన మంత్రి మోదీకి సభా వేదికపైనే అవమానం జరిగింది. దేశ ప్రధాని కోసం కనీసం ఒక పూల బొకే తీసుకురావాలన్న ఆలోచన 40 ఏళ్ల రాజకీయం అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పనిచేసన టీడీపీ అధినేత చంద్రబాబుకు, వందలాది పుస్తకాలు చదివానని చెప్పుకొనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాలేదు. ప్రధాని హెలికాప్టర్ దిగి వేదిక పైకి రాగానే వట్టి చేతులతోనే ఆహా్వనం పలికారు. ఆయన కూర్చున్న తర్వాత ప్రధాని మంత్రి మోదీని చంద్రబాబునాయుడు సన్మానిస్తారని, పవన్ పూల బొకే ఇస్తారని వ్యాఖ్యాత చెప్పారు. దీంతో మోదీ సహా అందరూ లేచి నిల్చున్నారు. అయితే, అక్కడ శాలువా లేదు, పూల బొకే లేదు. దీంతో చంద్రబాబు, పవన్ దిక్కులు చూస్తూ నిల్చున్నారు. శాలువా కోసం అటూఇటూ చూశారు. విషయం గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తాను సభ పూర్తి అయిన తర్వాత మోదీని సన్మానించేందుకు తీసుకువచ్చిన వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబుకు మోదీ క్లాస్! ఏ సభలో అయినా ఉత్సాహంగా ప్రసంగించే ప్రధాని మోదీ ఈ సభలో జనం లేకపోవడం, పదే పదే మైకులు మొరాయించడంతో కొంత కోపంగా ప్రసంగించారని బీజేపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని సభా వేదికపై ఉన్నంతసేపూ కోపంగానే ఉన్నారు. చంద్రబాబు, పవన్‌తో అంటీముట్టనట్లుగానే ఉన్నారు. మీటింగ్ జరిగిన తీరుపై ప్రధాని మోదీ చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేస్తూ క్లాస్ పీకినట్టు సమాచారం. సభ జరుగుతున్నంత సేపు చంద్రబాబు, పవన్‌ల మొహాల్లోనూ ఏమాత్రం ఆనందం లేదు. అన్నమో ‘నారాయణా’ ♦ ప్రజాగళం సభకు నుంచి జనాన్ని పంపిన మాజీ మంత్రి నారాయణ ♦ ఒంగోలు వద్ద భోజనం పెడతామని పంపారు.. సాయంత్రం 4 దాటినా భోజనాలు అందని వైనం ♦ ఆకలితో అలమటించిన మహిళలు ♦ సభకు వెళ్లకుండానే వెనక్కి వెళ్లిన బస్సులు మద్దిపాడు: చిలకలూరిపేట సమీపంలో ఆదివారం జరిగిన ప్రజాగళం సభకు బయల్దేరిన జనం ఆకలితో అలమటించి, మధ్యలోనే ఆగిపోయారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలను తరలించారు. నెల్లూరు, చుటుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రజలను ఈ సభకు తరలించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నారాయణ విద్యా సంస్థల బస్సులను తెప్పించి, మధ్యాహ్నం 12 గంటలకే వాటిలో కార్యకర్తలు, మహిళలను తరలించారు. వారికి మధ్యాహ్నం 2 గంటలకు ఒంగోలు సమీపంలోని సూరారెడ్డిపాలెం వద్ద భోజనాలు అందిస్తారని చెప్పారు. వారు అక్కడికి మధ్యాహ్నం వేళ చేరారు. అక్కడ నారాయణ పంపిన బస్సుల్లోని వారికి భోజనాలు అందలేదు. సాయంత్రం 4 దాటినా భోజనం పెట్టలేదు. బస్సుల్లో ఉన్న మహిళలు ఆకలికి తట్టుకోలేకపోవడంతో వారితో వచ్చిన ద్వితీయ శ్రేణి నేతలు గుండ్లాపల్లి సమీపంలో బస్సులు నిలిపి స్థానికంగా ఉన్న ధాబాల వద్ద వారికి భోజనం పెట్టించి వెనక్కి తీసుకువెళ్లారు. మీటింగ్‌కు వెళ్లరా.. అని ద్వితీయ శ్రేణి నాయకులను అడగ్గా.. మీటింగ్ సంగతి ఎత్తితే మహిళలు కొట్టేలా ఉన్నారని, తెలిపారు. మీటింగ్‌కు వెళ్లడానికి డబ్బులు ఇచ్చారా... అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. -
బాబుపై తిరుగుబావుటా
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: టీడీపీ టికెట్ల మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. టికెట్లు రాని టీడీపీ సీనియర్లు రగిలిపోతున్నారు. చంద్రబాబుపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. పొత్తులు, సామాజిక సమీకరణాల పేరుతో తమ గొంతు కోశారని మండిపడుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించినా వారు వినడంలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనకు సర్దిచెప్పేందుకు టీడీపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కృష్ణా జిల్లా పెడన సీటును ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలో కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తిలు సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడాన్ని తప్పుపడుతూ బండారు సత్యనారాయణమూర్తి ఎవరికీ అందుబాటులోకి లేకుండాపోయారు. ఎచ్చెర్ల సీటును కళా వెంకట్రావుకు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో ఆయన భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. గంటా శ్రీనివాసరావు అడుగుతున్న సీటును ఇవ్వకపోవడంతో ఆయన ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. కళా వెంకట్రావు, గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు చెప్పగా.. ఆ సీటు ఆశిస్తున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో రగిలిపోతున్నారు. మైలవరం, పెనమలూరులో తేలని పంచాయితీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు, మైలవరం సీట్లు కాకరేపుతున్నాయి. పెనమలూరు సీటు ఇవ్వడంలేదని చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రచారం కూడా ప్రారంభించారు. ఆ సీటు దేవినేనికి ఇస్తారని ప్రచారం జరుగుతుండడంతో ఆయన మండిపడుతున్నారు. మైలవరం వసంత కృష్ణప్రసాద్‌కి ఇస్తానని చెప్పినా ఖరారు చేయకపోవడం, దేవినేని, వసంత మధ్య పోటీ పెట్టడంతో అక్కడ గందరగోళం నెలకొంది. అనంతపురం జిల్లా ధర్మవరం సీటును బీజేపీకి ఇవ్వడాన్ని పరిటాల శ్రీరామ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వరదాపురం సూరికి తన సీటు ఇవ్వడాన్ని శ్రీరామ్ తప్పుపడుతున్నారు. టీడీపీ, జనసేన మధ్య తేలని పంచాయితీ అమలాపురం నియోజకవర్గంలో టీడీపీ–జనసేన మధ్య వివాదం రోడ్డున పడింది. టికెట్ జనసేనకే ఇవ్వాలని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు రెండు రోజులుగా అమలాపురంలో ఆందోళన చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె పాము సత్యశ్రీ పేరుపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. మరోవైపు సీటు తమకే ఇవ్వాలంటూ జనసేన నేతలు, కార్యకర్తలు అమలాపురంలో రోడ్డెక్కారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో జరిగిన ధర్నాలో పార్టీ అల్లవరం మండల అధ్యక్షుడు బాలయోగిఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన తోటి నాయకులు, కార్యకర్తలు బాలయోగిని అడ్డుకున్నారు. రాజోలులో రోడ్డెక్కిన జనసేన బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ శనివారం రోడ్డెక్కింది. పార్టీ టికెట్ దేవ వరప్రసాద్‌కు ఇస్తారనే ప్రచారంతో ఆందోళన నిర్వహించారు. స్థానికుడు కాని వరప్రసాద్‌కు టికెట్టు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బొంతు రాజేశ్వరరావుకే టికెట్టు ఇవ్వాలని నినాదాలు చేశారు. పార్టీ నాయకులు మలికిపురం కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. బండారుకు టికెట్ ఇవ్వాల్సిందే.. పెందుర్తి టికెట్‌ను టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించాలని పార్టీ కార్యకర్తలు శనివారం వెన్నలపాలెంలో నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద బండారుకు అనుకూలంగా నినాదాలు చేశారు. గౌరవం లేని చోట ఉండను గౌరవం లేనిచోటు ఉండకూడదని నిర్ణయించుకున్నానని, అవమానాల మీద అవమానాలు భరించలేనని సూళ్లూరుపేట టీడీపీ నేత వేనాటి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో లోకేశ్ జోక్యం పెరిగాక తన సొంత సామాజికవర్గాన్ని పెంచుకునేందుకు తమను అవమానాలకు గురి చేస్తున్నారని అన్నారు. శనివారం సూళ్లూరుపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 42 ఏళ్లుగా టీడీపీకి సేవచేశామన్నారు. టీడీపీలో కులపిచ్చి పెరగడం వల్ల ఇమడలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. గుమ్మనూరుకు టికెట్ ఇస్తే సహించేది లేదు: జితేంద్రగౌడ్ ఎక్కడి నుంచో వచ్చి నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తామంటే సహించబోమని, మాజీ మంత్రి గుమ్మనూరుకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.జితేంద్రగౌడ్ హెచ్చరించారు. శనివారం గుంతకల్లులో మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లు టీడీపీ కోసం కష్టపడ్డామని, ఇందుకు గుర్తింపుగా గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నానన్నారు. చేనేతలకు అన్యాయం: నిమ్మల చేనేతలకు సీట్ల కేటాయింపులో చంద్రబాబు అన్యాయం చేశారని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో హిందూపురం పార్లమెంట్ పరిధిలోని పలు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. నిమ్మలకు టికెట్ నిరాకరించడాన్ని నాయకులు తప్పుబట్టారు. టికెట్ ఇవ్వని పక్షంలో పార్టీకి రాజీనామా చేసి.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు. -
పొత్తులే కత్తులై..
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్ : పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరుపెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్లు బజారుకెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కేనని అధిష్టానం చెప్పడంతో ఉమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కూ టికెట్ లేదని పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తనను కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, ఎంకే బేగ్ ఖంగుతిన్నారు. బుద్దా వెంకన్న అనుచరులతో సమావేశం నిర్వహించి మరీ పార్టీకి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. జలీల్‌ఖాన్ పార్టీ వీడతానని బెదిరించారు. ఇప్పుడు ఈ సీటును బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కూ షాక్ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బండారుకు చుక్కెదురు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన రగిలిపోతున్నారు. ఈ సీటును పంచకర్ల రమేష్‌బాబుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించడంతో బండారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పంచకర్లను ఓడిస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళావెంకట్రావుకు ఎచ్చెర్ల సీటు ఖరారు చేయకుండా ఇంకా గాల్లోనే పెట్టారు. వయసు రీత్యా ఆయనను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత గంటా శ్రీనివాసరావు సీటును ఇంకా ఖరారు చేయలేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సీటు నిరాకరించి ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వడంపై ఆయన రంకెలు వేస్తున్నారు. మెలవరం సీటు గందరగోళంగా మారింది. పల్నాడు జిల్లాలో ఆశావహుల డీలా పల్నాడు జిల్లాలో సైకిల్ పార్టీ డీలా పడింది. నరసరావుపేట అసెంబ్లీ సీటుపై ఇంకా సందిగ్ధం వీడలేదు. టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆందోళన చెందుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సీటులో బీజేపీ పోటీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కావడంతో వైఎస్సార్సీపీకి దూరం జరిగి టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న జంగా కృష్ణమూర్తి డైలమాలో పడ్డారు. జవహర్‌కు అవమానం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు కోసం ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఘోరంగా అవమానించింది. ఈ సీటును గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నిడదవోలు సీటు ఆశిస్తున్న శేషారావుకు శరాఘాతం తగిలింది. ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోపాలపురం సీటును మద్దిపాటు వెంకట్రాజుకు కేటాయించడంతో అక్కడ పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం వెంట్రాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. పరిటాలకు బాబు ఝలక్ అనంతపురం జిల్లా ధర్మవరం సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్ చతికిలపడ్డారు. సీటును బీజేపీకి కేటాయించడంతో వరదాపురం సూరి ఎగరేసుకుపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీరామ్ తల్లడిల్లుతున్నారు. పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి కేటాయించడంతో బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ వడ్డెర సామాజికవర్గ నేతలు టికెట్ ఆశించారు. కదిరిలో 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కందికుంట వెంకట ప్రసాద్‌కు డీడీల కేసులో శిక్ష పడింది. ఆయన భార్యకు ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురం, గుంతకల్లు సీట్లపై టీడీపీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. జనసేనకు అన్ని టికెట్లా.. తీవ్ర అసంతృప్తి ♦ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఆరు టికెట్లు కేటాయించడంపై టీడీపీ కేడర్ రగిలిపోతోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలవరాన్ని కూడా జనసేనకు కేటాయిస్తున్నట్టు సమాచారం. ♦ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్‌నేతలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కన్నబాబు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ వలస నేత ఆనం రామనారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలిల్లోనూ ఆ పార్టీ ఆశావహులు టికెట్ల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోవూరు సీటును ఇటీవలే టీడీపీలో చేరిన ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి ఇవ్వడంతో ఇన్నాళ్లూ అక్కడ పార్టీ కోసం పనిచేసిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కుటుంబం రగిలిపోతోంది. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ♦ ఉమ్మడి చిత్తూరులో చిచ్చు రేగింది. సత్యవేడు సీటును టీడీపీలో కూడా చేరని ఆదిమూలంకు ఇవ్వడంపై తెలుగుదేశం ఆశావహుల్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. గతంలో బాబు నుంచి హామీ పొందిన మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానాన్ని వరదరాజులరెడ్డికి కేటాయించడం పట్ల లింగారెడ్డి, సురేష్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ♦ తిరుపతి సీటును ఆరణి శ్రీనివాసులుకు జనసేన కేటాయించడంపై ఆ పార్టీలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ‘ఆరణి’ గో బ్యాక్’ అనే నినాదాలతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రగిరి సీటును పులవర్తి నానికి కేటాయించడంతో రియల్టర్ డాలర్ దివాకర్‌రెడ్డి నీరుగారారు. ♦ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని నారాయణరెడ్డి తనయుడు, పార్టీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డిని ఊరించి, చివరికి జమ్మలమడుగు సీటు బీజేపీ(ఆదినారాయణరెడ్డి)కి కేటాయించినట్లు వెల్లడించడంతో నారాయణరెడ్డి కుటుంబం సంకట స్థితిలో పడింది. -
సోషల్ మీడియా చీడ పురుగులు
సాక్షి, అమరావతి:పేదింటి పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఇంగ్లిష్‌లో గలగలా మాట్లాడితే వారికి కడుపు మంట..వారిపై సోషల్ మీడియాలో హేళనలు... వేధింపులు ప్రభుత్వ బడిలో చదువుకుని ప్రతిభా పాటవాలతో అమెరికా వెళ్లి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తే చాలు... సోషల్ మీడియాలో ఈసడింపులు... చీత్కారాలు.. ప్రభుత్వం తనకు ఇల్లు ఇచ్చిందని పేద మహిళ సంతోషం వ్యక్తం చేస్తే చాలు... సోషల్ మీడియాలో దూషణలు, దుర్భాషలు.. పేదలు, సామాన్యులు హాయిగా నవ్వితే ఓర్చుకోలేరు... సంతోషంగా ఉంటే తట్టుకోలేరు... జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కితే సహించలేరు. దూషణలతో వేధిస్తూ.. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. చివరికి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అవమానభారంతో నలుగురులోకి రాలేని పరిస్థితి తీసుకువస్తారు. తాజాగా తెనాలికి చెందిన గీతాంజలి ఉదంతమే అందుకు తార్కాణం. రాష్ట్రంలో దాదాపు ఐదేళ్లుగా టీడీపీ, జనసేనలు సాగిస్తున్న వికృత క్రీడ ఇది. మహిళలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై ట్రోలింగ్‌తో పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. అందుకోసం టీడీపీ, జనసేన పార్టీలు ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి మరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడుతుండటం ఆ రెండు పార్టీల దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట.. ఓటమిని జీర్ణించుకోలేక దిగజారుడు రాజకీయాలు 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘోరపరాజయంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు బరితెగించారు. సాధారణ మహిళలు, విద్యార్థులు, సామాన్యుల్ని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గ రాజకీయాలకు తెరతీశారు. సోషల్ మీడియా ద్వారా అసభ్య కామెంట్లతో దాడులు చేయమని తమ పార్టీ సోషల్ మీడియా విభాగాలకు ఆదేశించారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. టీడీపీ, జనసేన పార్టీలు పక్కా పన్నాగంతో సోషల్ మీడియా వేదికగా కుట్రకు తెరతీశాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి వందలాది మందిని తమ సోషల్ మీడియా విభాగాల్లో నియమించాయి. వేలాది ఫేక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా సామాన్యులను వేధించడం మొదలుపెట్టాయి. టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తిలు కూడా సోషల్ మీడియా ద్వారా సామాన్యులను వేధించడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆ రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాలకు చెందిన వందలాది మంది ట్రోలింగ్ పిశాచాలుగా మారి సామాన్యులను వేధింపులకు గురిచేశారు. లబ్ధిదారులే లక్ష్యం పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, వాహనమిత్ర, చేయూత, తోడు, చేదోడు, సున్నావడ్డీ, రైతు భరోసా తదితర పథకాల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తే చాలు వారిని వ్యక్తిగతంగా దూషిస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయకుండా కట్టడిచేయాలన్నదే టీడీపీ, జనసేన పార్టీల కుట్ర. న్యాయ వ్యవస్థపైనా ట్రోలింగే టీడీపీ, జనసేన పార్టీలు చివరికి న్యాయ వ్యవస్థను కూడా విడిచిపెట్టకపోవడం పరాకాష్ట. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోనం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి లక్ష్యంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌ను గతేడాది నవంబర్ 27న పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, సీఐడీ కఠిన చర్యలు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులపై పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టింగులు పెడుతున్నవారిరి ఐపీ అడ్రస్‌లతో గుర్తించి కేసులు నమోదు చేస్తోంది. సైబర్ బుల్లీషీట్లను తెరచి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో సీఐడీ 2,919 సైబర్ బుల్లీషీట్లను నమోదు చేసింది. సోషల్ మీడియా వేధింపులకు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సీఐడీ విభాగం కోరుతోంది. సామాన్యుల గొంతు నొక్కే కుట్ర ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శించవచ్చు... పథకాల్లో లోపాలను ప్రశ్నించవచ్చు. అందుకు విరుద్ధంగా పథకాలు, కార్యక్రమాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని వారిని వ్యక్తిగతంగా వేధించేందుకు బరితెగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విధానంపై ప్రశంసలు వ్యక్తమవడం ప్రతిపక్ష పార్టీలకు నచ్చలేదు. కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో అనర్గళంగా ప్రసంగించడంతో ఓర్వలేక వారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ, జనసేన నేతలు, సోషల్‌మీడియా విభాగాలు వేధింపులకు పాల్పడ్డాయి. అమెరికాలోని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులనూ అదే రీతిలో వేధించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే ఆ రెండు పార్టీల లక్ష్యం. ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి మాట్లాడకుండా చేయాలన్నదే కుతంత్రం. వేధిస్తే కఠిన శిక్షలు ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు పాల్పడేవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. 67 ఐటీ చట్టం: ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్‌లకు పాల్పడితే ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 354: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని వేధిస్తే ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు. మహిళను నేరుగా గానీ ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల ద్వారా అదే పనిగా సంప్రదించడం, వెంటపడటం, దూషించడం, అవమానించడం, వేధించడం తీవ్రమైన నేరాలు.. అందుకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 509: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను తమ మాటలు, చేతలు, సైగల ద్వారా అవమానించడం, ఆమె గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన నేరం. గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 306: ఒకర్ని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేయడం. బాధ్యులకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఐపీసీ 120ఎ: ఇద్దరు గానీ అంతకంటే ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా ఒకరిని నేరుగా లేదా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల ద్వారా వేధించడం తీవ్రమైన నేరం. ఐపీసీ 504: ఉద్దేశ పూర్వకంగా గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన నేరం. రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఫిర్యాదు ఇలా...సైబర్ క్రైమ్ పోర్టల్: https:// cybercrime. gov. in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 ఇంగ్లిషులో మాట్లాడితే ఓర్వలేక.. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జెడ్పీ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం’ (ఎల్ఐపీ), ‘ లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడే స్థాయికి వచ్చారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడడం నేర్పించారు. అమెరికాలోని అట్లాంటా, జార్జియా ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, వారి స్నేహితులతో ఆన్లైన్లో విద్యార్ధులతో డిబేట్ నిర్వహించారు. తోలెం మేఘన, తేజస్విని వంటి విద్యార్థినులు మెరికల్లా రాణించారు. అమెరికన్ యాసలో అనర్గళంగా మాట్లాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇవి టీడీపీ నేతలకు కంటగింపుగా మారాయి. ఆ విద్యార్థినులకు వ్యతిరేకంగా ట్రోల్ చేయించారు. ఆ విద్యార్థినులు టెన్త్‌లో ఫెయిల్ అయ్యారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నోరుపారేసుకున్నారు. ఆ విద్యార్థిని టెన్త్‌లో 478 మార్కులతో పాసైంది. ఆ విద్యార్థిని తల్లి తొండంగి పోలీసులకు 2022 జూన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. మేఘనపై అసభ్యకర పదజాలంతో ట్రోలింగ్ చేశారు. ఆమె తల్లి తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 509, ఐటీ యాక్ట్ 2020 సెక్షన్ 67 కింద ట్రోలర్స్‌పై అప్పటి ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేశారు. -
16న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల సమర భేరి మోగించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా ఇప్పటికే శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు. ఒకవైపు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై అసమ్మతి సెగలు పొగలు కక్కుతుండగా రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులను ఖరారు చేసి కదనరంగంలోకి దూకేందుకు వైఎస్సార్ సీపీ సన్నద్ధమైంది. ఈమేరకు ఈనెల 16వతేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద 2019 ఎన్నికల తరహాలోనే ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రోజుకు రెండు లేదా మూడు సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది. రోజూ ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు చోట్ల బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఉరిమే ఉత్సాహంతో.. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లో నిర్వహించిన సిద్ధం సభల ద్వారా వైఎస్సార్ సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఆ సభలకు జనం పోటెత్తడం, ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో ఉరిమే ఉత్సాహంతో కదనరంగంలోకి దూసుకెళ్లడానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ అమలు చేయగలిగే హామీలతో మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అది తుది దశకు చేరుకుంది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచార భేరి మోగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులను ప్రకటించేలోగా ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. చేసిన మంచిని వివరిస్తూ.. మోసాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎంతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు ప్రజల్లోనే ఉన్నారు. జనంతో మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా 87 శాతం కుటుంబాల ఖాతాల్లో డీబీటీ రూపంలోనే రూ.2.65 లక్షల కోట్లను సీఎం వైఎస్ జగన్ నేరుగా జమ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ఇంటి గుమ్మం వద్దే అందిస్తున్నారు. వీటితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రచారపర్వంలో వివరించనున్నారు. ఇదే అంశాలను ఇంటింటా వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలియచేయనున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో 650 హామీలతో మేనిఫెస్టోను ప్రకటించి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చాక టీడీపీ–బీజేపీ–జనసేన ప్రభుత్వం పది శాతం హామీలను కూడా అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసం చేసింది. మళ్లీ ఇప్పుడు అదే కూటమి ఎన్నికల బరిలోకి దిగి హామీలు గుప్పిస్తూ మరోసారి మోసం చేసేందుకు వస్తోందనే అంశాన్ని సీఎం జగన్ ప్రజలకు వివరించనున్నారు. ఇంటింటా ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ఇవే అంశాలను తెలియచేస్తాయి. -
చనిపోయినా 'చిత్రవధ'..
మధ్య తరగతి కుటుంబం.. ఎంతో విలువలతో కూడిన జీవితం. అత్తమామల మెప్పు పొందింది. పిల్లల అభిమానాన్ని... భర్త అనురాగాన్ని చూరగొంది. ప్రభుత్వం చేసిన సాయానికి పొంగిపోయింది. ఓ సాధారణ మహిళగా తన ఆనందాన్ని అందరితోనూ పంచుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. పచ్చ రాబందుల దుష్ట పన్నాగానికి బలైపోయింది. సోషల్ మీడియా వేదికగా చేసిన నీచాతినీచమైన వ్యాఖ్యలకు తల్లడిల్లిపోయింది. ఆమె ఆనందం ఎంతోసేపు నిలవనివ్వని సోషల్ మాఫియా వేధింపులకు మానసికంగా కలత చెందింది. నలుగురికి తన బాధను చెప్పుకోలేక రైలుకింద పడి ప్రాణం తీసుకుంది. ఇదీ తెనాలికి చెందిన బీసీ(విశ్వబ్రాహ్మణ) మహిళ గొల్తి గీతాంజలిది. ఇప్పుడు ఆమె చావుపైనా ఆ ‘పచ్చ’మూక తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. ఆ సంఘటనకు తమకేమాత్రం బాధ్యతలేదని తప్పించుకోజూస్తోంది. కానీ పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి వాస్తవాలు వెలికి తీస్తోంది. ఆ నీచుల భరతం పట్టేందుకు సమాయత్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి కుటుంబానికి చాలావరకూ వర్తించాయి. ఇటీవలే తనకు ఇంటి స్థలం ఇచ్చారని.. తనకు ఎంతో సంతోషంగా ఉందని, అమ్మఒడి, పింఛన్, వైఎస్సార్ చేయూత వంటి మరెన్నో పథకాలు వచ్చాయని ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాతో ఎంతో అమాయకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పింది. సహజంగానే పచ్చనేతలకు ఆమె చెప్పిన విషయాలు రుచించలేదు. ఆమెపై టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియా ప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటం ప్రారంభించారు. ఆ ట్రోలింగ్లు చూసి గీతాంజలి తట్టుకోలేకపోయింది. ఆమె భర్తను దుర్భాషలాడుతూ, అమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టింగులు చూసి విలవిలలాడి పోయింది. అవమానంతో కుంగిపోయింది. కనీసం ఇంట్లో వారితో కూడా తన బాధను పంచుకోలేక రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది కచ్చితంగా ఆత్మహత్యకాదు... సోషల్ మీడియా చేసిన హత్యేనని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని గీతాంజలి భర్త బాలచంద్ర తెలిపారు. అన్యాయంగా తన భార్యను బలి తీసుకున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. రెచ్చిపోతున్న పచ్చ సోషల్ మూక సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన పోస్టింగ్‌లపై కేవలం సెక్షన్ 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఐటీడీపీ, జనసేన సోషల్‌మీడియా రెచ్చిపోతోంది. వారి దాష్టీకంవల్లే ఆ నిండుప్రాణం బలైపోయింది. ఈ దుర్ఘటన యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. పచ్చబ్యాచ్ దుర్మార్గాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. ఆమె కుటుంబానికి పలువురు అండగా నిలిచారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టబోమని ప్రకటించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డిని కలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గీతాంజలి కుటుంబ సభ్యులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ, ఎమ్మెల్సీ పోతుల సునీత, పార్టీ నేతలు వరుదు కళ్యాణి, వాసిరెడ్డి పద్మ, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మహిళా కమిషన్ సభ్యురాలు వెంకటలక్ష్మి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది సోషల్‌మీడియా టెర్రరిజమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ ముమ్మరం గీతాంజలి ఆత్మహత్యకు పురిగొల్పినవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సోషల్‌మీడియాలో ఆమెపై అసభ్యంగా ట్రోలింగ్ చేసిన 26 మందిని గుర్తించారు. ప్రైవేటు వ్యక్తులే కాకుండా పార్టీల అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి కూడా ఘోరంగా ట్రోల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కనీసం విచారం వ్యక్తం చేయని తెలుగుదేశం నేతలు... మరింత బరితెగించి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది ఏడోతేదీ కాగా, ట్రోలింగ్ ఎనిమిది నుంచి మొదలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆమె వీడియో వైరల్ అయిన ఆరో తేదీనే అజయ్‌చౌదరి సజ్జా, స్వాతీరెడ్డి మరికొందరు నీచాతినీచంగా ట్రోల్ చేశారు. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో ట్రోల్స్ వచ్చాయి. ఆమె చనిపోయిందని తెలిసిన వెంటనే ఆ పోస్టులన్నీ డిలీట్ చేశారు. అయితే అప్పటికే పోలీసులు ఈ పోస్టులను సేకరించారు. రూ.20 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలి పెట్టదని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు నేతలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు. సెన్సేషనల్ అంటూ ఫేక్ వీడియో టీడీపీ, జనసైనికుల సోషల్‌మీడియా ట్రోలింగ్‌లకు బలైన గీతాంజలి విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి తప్పుడు ప్రచారానికి సిద్ధం అయ్యింది. సెన్సేషనల్ అంటూ ఒక వీడియోను విడుదల చేసింది. అందులో గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో లోకో పైలెట్ ఆమెను రైలులోనే రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చిన దృశ్యాన్ని చూపిస్తూ ఆమెను ఎవరో ఇద్దరు తోసేశారంటగా మావా.. అంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు వాయిస్ ఓవర్‌తో ఒక వీడియో విడుదల చేశారు. ఇంటి పట్టా వచ్చినందుకు ఆనందంగా మీడియాతో మాట్లాడినందుకే ట్రోల్ చేసిన తెలుగుదేశం సోషల్‌మీడియా ఇప్పుడు ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుండటంతో దాని నుంచి బయటపడేందుకు గీతాంజలి క్యారెక్టర్‌ను తప్పుగా చూపించేలా ప్రచారం మొదలుపెట్టింది. ఆమె ఎవరో ఇద్దరితో రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు, వారు ఆమెను రైలు కిందకి తోసేసి పారిపోయారన్నట్లుగా వాయిస్ ఓవర్‌తో ప్రచారం చేస్తోంది. ఆ వీడియో గమనించిన ఎవరికైనా అది ఎడిటింగ్ వీడియో అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ వ్యవహారం తమ దృష్టికి కూడా వచ్చిందని, ఈ వీడియోపై కూడా విచారణ జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు గీతాంజలిని ట్రోల్ చేసి ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే బాధ్యులను గుర్తించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఓవర్‌యాక్షన్ చేసి కొంత మందిని ఇబ్బంది పెట్టిన వారిపై 6,970 సోషల్‌మీడియా బుల్లీయింగ్ షీట్లు నమోదు చేశాం. సుమారు 7వేల మందిని అరెస్ట్ చేశాం. సైబర్ క్రైమ్‌కు సంబంధించి 2023 సంవత్సరంలో ఆయా అకౌంట్‌దారులపై 327 కేసులు నమోదు చేశాం. హైకోర్టు జడ్జిని దూషించిన కేసులో 53 మందిపై కేసులు నమోదు చేశాం. దిశ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా సైబర్, సోషల్ మీడియా అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేలా పొందుపరిచి బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. – పాలరాజ్, ఐజీ, గుంటూరు రేంజ్ -
టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, అమరావతి: ఆమె చేసిన తప్పల్లా... తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లలో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధికుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతీజాతీ లేని ఈ ఆన్లైన్ మారీచులు.... తాము మనుషులమన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదికమీదా ఆమెను నానా దుర్భాషలాడారు. అక్కచెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే లేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ, అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యమనుకుంది. రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వెంటాడి వెంటాడి చేసిన దారుణమైన హత్య. గొల్తి గీతాంజలి (30) భర్త చంద్రశేఖర్ తెనాలిలోని వహాబ్ పార్క్ ప్రాంతంలో బంగారం పని చేస్తుంటారు. వాళ్లకిద్దరు పిల్లలు. గీతాంజలి కొద్దిరోజుల కిందట ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు ఇంటిపట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మ ఒడి వస్తోందని, అత్తమామలకు చేయూత, పింఛన్ కానుక అందుతున్నాయని చెబుతూ సీఎం వైఎస్ జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తామంటూ.. ఆమె ఎదురు ప్రశి్నంచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన కిరాయి మూకలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్ చేశాయి. వాస్తవానికి గీతాంజలికి గతంలోనే ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేసింది. ఈ నెల 4న కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఈ ఇంటర్వ్యూ వ్యవహారం చోటుచేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితోపాటు ఎమ్మెల్యే శివకుమార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పట్టాను అందుకున్నాక తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ చానల్‌తో పంచుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కల నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్నను గెలిపించుకోవటం తమ బాధ్యతని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మఒడి ఆసరాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జై జగన్.. అని నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడియా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడంతో తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న టీడీపీ, జనసేన ‘సోషల్ మాఫియా’ బాధితురాలిని దారుణంగా ట్రోల్ చేసింది. ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పడుతూ, రాయలేని భాషలో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కారణంగా ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల తాను, తన కుటుంబం లబ్ధి పొందినట్లు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. గీతాంజలిని ఆత్మహత్యకు పురిగొల్పేలా దారుణ వ్యాఖ్యలతో వికృతంగా వ్యవహరించిన సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. గీతాంజలిని బూతులు తిడుతూ టీడీపీ, జనసేన అభిమానులు పెట్టిన పోస్టులు, కామెంట్లు.. గీతాంజలి మృతదేహం వద్ద రోదిస్తున్న ఇద్దరు కుమార్తెలు పచ్చ మీడియాపై బాధిత కుటుంబం ఆగ్రహం ఇద్దరు చిన్నారులతో ఎంతో చలాకీగా అందరితో కలిసి మెలసి ఉండే గీతాంజలిని సోషల్ మాఫియా పొట్టన పెట్టుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద కన్నీరు మున్నీరయ్యారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లల గతి ఏం కావాలంటూ విలపించారు. సోషల్ మీడియా ఆమెను పొట్టనపెట్టుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చ సోషల్ మీడియా కళ్లు ఎప్పుడు పచ్చగానే ఉంటాయని, పేదింటి మహిళకు ఇంత సంతోషం దక్కడం వారికి ఇష్టం లేదంటూ మండిపడ్డారు. గీతాంజలికి తల్లితండ్రి దూరంగా ఉండటంతో అమ్మమ్మ, తాతయ్య, మేనమామ కలిసి వివాహం చేశారని, గీతాంజలి సంతోషం పచ్చ సోషల్ మీడియాకు కంటగింపుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారులు ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి అంతిమ సంస్కారాలు సోమవారం రాత్రి జరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష అనంతరం చినరావూరుతోటలోని హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను భర్త బాలచంద్ర నిర్వహించారు. తల్లి భౌతికకాయాన్ని చూసి చిన్నపిల్లలైన కుమార్తెలు రిషిత, రిషిక హృదయ విదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అక్కడకు చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం ఆదేశానుసారం మంగళవారం వారి ఇంటికి వచ్చి బిడ్డల భవిష్యత్ కోసం ఏం చేయాలనే అంశంపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన అరాచకత్వానికి బీసీ మహిళ బలి: పద్మ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన బీసీ మహిళ గీతాంజలి సంతోషాన్ని చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విచక్షణ మరచిన పచ్చ మూకలు అరాచకంగా ట్రోల్ చేయడంతో తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆప్యాయంగా పలకరించేది.. మా ఇంటికి ఎదురుగా నివసించే గీతాంజలి ఎప్పుడూ సంతోషంగా, చలాకీగా ఉంటుంది. ఎక్కడ కనిపించినా మామ్మగారూ... అంటూ చాలా ఆప్యాయంగా పలకరించేది. రెండు రోజులుగా కనిపించకపోతే శివరాత్రి కావడంతో ఎటైనా వెళ్లిందేమో అనుకున్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాధనిపిస్తోంది. – అవ్వారు పద్మావతి, ఇస్లాంపేట, తెనాలి జీవితంలో మర్చిపోలేనంటూ.. మేం ఇస్లాంపేటలో సోడాలు విక్రయిస్తాం. గీతాంజలితో కొద్ది రోజుల పరిచయమే అయినా చాలా కలివిడిగా మాట్లాడేది. ఇటీవలే చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రం తీసుకున్నానని ఎంతో సంతోషంగా చెప్పింది. నా పేరు మీద ఇచ్చారు... జీవితంలో మర్చిపోలేనని చెప్పి మురిసిపోయింది. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తోందని చెబుతుండేది. ఆమె చనిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నా. – షేక్ రేష్మా, ఇస్లాంపేట, తెనాలి -
నారా లోకేష్‌కు చేదు అనుభవం!
సాక్షి, అనంతపురం: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబుకి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే లోకేష్ పాల్గొంటున్న శంఖారావం సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. ఇక ఇప్పుడు పొత్తు పార్టీల కుమ్మలాటలు కూడా చినబాబు సమక్షంలోనే జరుగుతుండడం గమనార్హం. అనంతపురంలో నారా లోకేష్ శంఖారావం సభలు జరుగుతున్నాయి. అయితే అక్కడ టీడీపీ-జనసేన పొత్తు బెడిసి కొట్టింది. అనంత అర్బన్ టికెట్ తమకేనంటూ టీడీపీ-జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని ఘర్షణ వాతావరణం సృష్టించారు. లోకేష్ స్టేజ్ మీద మాట్లాడుతున్న టైంలోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. అనంత అర్బన్ టికెట్‌కు టీడీపీ తరఫున ప్రభాకర్ చౌదరి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే జనసేన తరఫున టీసీ వరుణ్ ఆశిస్తున్నారు. కలిసి పని చేయాలని ఇరు పార్టీల నేతలు పదే పదే చెబుతున్నా.. ఆయా వర్గాల నేతలు, కార్యకర్తలు ససేమిరా చెబుతుండడం విశేషం. -
టీడీపీలో ఎగసిన ఆగ్రహ జ్వాలలు
పొత్తుల వ్యవహారం పలు జిల్లాల్లో చిచ్చురేపింది. ఇప్పటికే జనసేన పొత్తు ఖరారు కాగా.. తాజాగా బీజేపీ కూడా చేతులు కలపడం.. సీట్ల కేటాయింపులు కూడా జరిగిపోవడంతో ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ఆశావహులు భగ్గుమన్నారు. కొన్ని చోట్ల శనివారం తమ అనుచరులతో నిరసన గళాలు వినిపించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని కొనసాగుతుంటే తమ ఆశలను నట్టేటా ముంచారని అధినేతపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పార్టీ సమావేశంలో కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేసి టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. పలు చోట్ల నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. యలమంచిలి రూరల్/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, పుట్టపర్తి/పాడేరు: పొత్తులో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలి టికెట్ జనసేనకు కేటాయిస్తున్నట్టు టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన సమాచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహజ్వాలలు రగిలించింది. ఐదేళ్లూ పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని జనసేనకు టికెట్ కట్టబెట్టడమేమిటని ప్రశ్నిస్తూ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. తమ నేతకు సీటు ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు తమ అసంతృప్తిని తెలియజేస్తూ శనివారం యలమంచిలి పట్టణంలోని కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేశారు. సీనియర్లంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు వేదికపైకి దూసుకెళ్లడంతో సమావేశం రసాభాసగా మారింది. ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంతో ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు తీవ్ర అన్యాయం చేశారని పలువురు నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రగడ నాగేశ్వర్రావుకు మొండిచెయ్యి చూí³స్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. అధిష్టానం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే సీనియర్లతోపాటు కార్యకర్తలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించారు. పోలవరంలో పొత్తు రగడ ఏలూరు జిల్లా పోలవరంలో పొత్తు రగడ తారస్థాయికి చేరింది. టికెట్ జనసేనకు కేటాయించామని టీడీపీ నేతలకు పార్టీ స్పష్టత ఇవ్వడంతో అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. శనివారం నియోజకవర్గ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం తెలుగుదేశం పార్టీలో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఏళ్ల తరబడి నుంచి టికెట్ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఫర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు కేటాయించవద్దంటూ జిల్లా అధ్యక్షుడు మొదలుకొని జాతీయ అధ్యక్షుడి వరకు అందరికీ విన్నవించారు. కట్ చేస్తే.. ఈ సీటు జనసేనకు కేటాయించి.. పొత్తు ధర్మం పాటించండి అంటూ చంద్రబాబునాయుడు నుంచి ఫోన్ రావడంపై బొరగం శ్రీనివాస్ వర్గం మండిపడుతోంది. శనివారం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ నేతృత్వంలో బుట్టాయగూడెంలో ఏడు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సీటు ఇవ్వకపోతే సామూహిక రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అయోమయంలో టీడీపీ శ్రేణులు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో నలుగురైదుగురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఎవరిని సీటు వరిస్తుందో తెలియని పరిస్థితి. ఈ సారీ జనసేనకో, బీజేపీకో కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి, కిల్లు రమేష్‌నాయుడు, ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ‘శంఖారావం’ను పట్టించుకోని నేతలు నారా లోకేశ్ చేపట్టిన శంఖారావ సభలు ‘శంకా’రావాలుగా మారిపోతున్నాయి. పుట్టపర్తి జిల్లాలో శంఖారావ సభలకు శుక్రవారం వచ్చిన లోకేశ్ టికెట్ల ఖరారుపై స్పష్టత ఇస్తారని స్థానిక టీడీపీ నేతలు భావించారు. కానీ ఆయన ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారు. ఫలితంగా ధర్మవరం టికెట్ ఆశిస్తున్న పరిటాల శ్రీరామ్, కదిరిపై ఆశలు పెట్టుకున్న వెంకటప్రసాద్, పుట్టపర్తి టికెట్ కోరుతున్న పల్లె రఘునాథరెడ్డి అలకబూనారని తెలిసింది. బీజేపీతో పొత్తులో భాగంగా హిందూపురం పార్లమెంటులో ఏ సీటు ఇస్తారనే దానిపై టీడీపీ నాయకుల్లో గుబులు రేగుతోంది. లోకేశ్ శంఖారావం సభలను కీలక నేతలు పట్టించుకోలేదు. మడకశిరలో గుండుమల తిప్పేస్వామి, పెనుకొండలో బీకే పార్థసారథి వర్గాలు లోకేశ్ సభలకు గైర్హాజరయ్యాయి. నాయకులు పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి లేకుండా ఫ్లెక్సీలు, పేపరు ప్రకటనలు రావడం గమనార్హం. పల్లెకు టికెట్ వద్దని కొందరు తెగేసి చెబుతున్నట్టు తెలిసింది. -
AP: ఖాయంగా తు‘ఫ్యానే’
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని టౌమ్స్ నౌ – ఈటీజీ రీసెర్చ్ సర్వే తేల్చి చెప్పింది. వైఎస్సార్ సీపీ 49 శాతం ఓట్లతో 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. టీడీపీ – జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3 నుంచి 4 లోక్‌సభ స్థానాలకే పరిమితం కానుందని తేల్చింది. బీజేపీ 2 శాతం ఓట్లు, కాంగ్రెస్, వామపక్షాలు తదితరులు 4 శాతం ఓట్లు దక్కించుకుంటాయని అంచనా వేసింది. జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు సైతం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధించడం ఖాయమని ఇప్పటికే తేల్చాయి. టీడీపీ – జనసేన పొత్తు కుదిరాక గతేడాది డిసెంబర్ 13 నుంచి ఈనెల 7 వరకూ రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన 3,23,257 మంది అభిప్రాయాలను సేకరించి సర్వే ఫలితాలను రూపొందించినట్లు టైమ్స్‌నౌ – ఈటీజీ సర్వేను శుక్రవారం టైమ్స్‌నౌ ఛానెల్లో సమర్పించిన సంస్థ సీనియర్ న్యూస్ ఎడిటర్ పద్మజా జోషి వెల్లడించారు. ఆ అభిప్రాయాలను క్రోడీకరిస్తే వైఎస్సార్సీపీ సంచలన విజయం సాధించడం ఖాయమని తేలిందన్నారు. టీడీపీ–జనసేన పచ్చి అవకాశవాదంతో పొత్తు పెట్టుకున్నాయని అధిక శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. హామీల్లో 99 శాతం అమలు, సుపరిపాలన ద్వారా సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయత చాటుకున్నారని, వైఎస్సార్సీపీ ఘనవిజయానికి ఇదే బాటలు వేస్తున్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు. -
కాపుల డిక్లరేషన్ ఎప్పుడు పవన్?
పాలకొల్లు సెంట్రల్: జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు జయహో బీసీ అంటూ పది హామీలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు సరే.. మరి కాపుల డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారని మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు చేగొండి హరిరామజోగయ్య ప్రశ్నించారు. బుధవారం ‘జయహో కాపూస్ జయహో బీసీస్’ అంటూ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ సరే, కాపుల డిక్లరేషన్ ఎప్పుడంటూ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. 52 శాతం ఉన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమేనని, కాపులకూ డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సిందని సూచించారు. మంగళగిరిలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్‌లు బీసీ డిక్లరేషన్ పేరుతో 10 ఎన్నికల హామీలిచ్చారని, ఇందులో పవన్ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా 25 శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైనా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపి –జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకూ ప్రకటించాల్సిందేనన్నారు. ఇదిలా ఉండగా, మదనపల్లికి.. శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి.. ఆరణి శ్రీనివాస్, రాజంపేట.. ఎంవీ రావు, అనంతపురం.. టీసీ వరుణ్, పుట్టపర్తి.. శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర, గుంతకల్లు.. మణికంఠకు కేటాయించాలని సూచిస్తూ పవన్‌కు జోగయ్య మరో లేఖ రాశారు. -
పవన్‌ను నమ్ముకుంటే గోదారే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, భీమవరం: ఎన్నికలు నెలన్నర ఉందనగా జనసేనాని అస్త్రసన్యాసంతో గోదావరి జిల్లాల్లో జనసైనికులు, నేతలు డీలా పడ్డారు. వారాహి యాత్రలో ఊగిపోయే ప్రసంగాలు చేసి తమను ఎన్నికల రణరంగంలోకి దూకమని చెప్పి ఇప్పుడు చంద్రబాబుకు దాసోహమని కాడి వదిలేయడంపై ఆ పార్టీ కేడర్ రగిలిపోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దున్నేస్తామంటూ హడావుడి చేసిన తమ అధినేత ఎన్నికల సమరం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీ నేతలను, కేడర్‌ను డీగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, కార్యకర్తల్ని ప్రశ్నించవద్దంటూ ఆదేశించడాన్ని ఆ పార్టీ నాయకులు, పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఇప్పుడు పార్టీ శ్రేణులను అవమానించడంతో తమ మనసుల్లో ఆయన పట్ల ఉన్న ప్రతిష్టను దిగజార్చుకున్నారని స్పష్టం చేస్తున్నారు. జనసైనికులు, కార్యకర్తలు తీవ్ర నిస్పృహలో ఉంటే పవన్ మాత్రం హైదరాబాద్‌లో ఉండి తమాషా చూడడంపై ఆవేదనలో మునిగిపోయారు. తమ అధినేత తీరు ఇలాగే కొనసాగితే పార్టీని, తమను గోదాట్లోకి నెట్టేసినట్లేనని, ఆ పరిస్థితి రాకముందే తట్టాబుట్టా సర్దుకుని జాగ్రత్తపడడం మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన నేతలు పార్టీ మారుతుండగా.. మరికొందరు ఆ దారిలో ఉన్నారు. పవన్ ప్రసంగంతో పార్టీలో పెనుదుమారం ఇటీవల టీడీపీ, జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెం వద్ద నిర్వహించిన జెండా సభలో పార్టీ శ్రేణులను చిన్నబుచ్చుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారాన్నే రేపాయి. ఆయన ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కేడర్ అయోమయంలో పడిపోయింది. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్నా పార్టీ అధ్యక్షుడిగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడంతో జన సైనికులకు ఎటూ పాలుపోవడం లేదు. 24 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్.. ఇంతవరకూ ఐదు స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇచ్చారు. ఇది జరిగి దాదాపు పదిరోజులవుతున్నా మిగిలిన 19 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించలేని దయనీయ స్థితిలో పవన్ ఉన్నారు. ఇలాగైతే టీడీపీ ఖాతాలోకి భీమవరం.. ఎన్నికల ప్రచారం మొదలైన తొలినాళ్లలో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం బలంగా వినిపించింది. తాజాగా పిఠాపురం పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఈ రెండింటిలో ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనేది తేల్చుకోలేని పరిస్థితుల్లోకి పవన్‌కళ్యాణ్‌ను చంద్రబాబు నెట్టేశారని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. భీమవరం నుంచి స్థానికేతరుడిగా ప్రతికూలత ఎదురవుతుందని పవన్‌ను బురిడీ కొట్టించిన చంద్రబాబు భీమవరాన్ని సైతం తన ఖాతాలో వేసుకునే ఎత్తుగడ వేశారని మండిపడుతున్నారు. అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును జనసేనలోకి తీసుకుని పోటీ చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేరుకు జనసేన అయినా టీడీపీ నాయకుడినే పోటీ చేయించడం చంద్రబాబు వ్యూహమంటున్నారు. ఎక్కడి నుంచి పోటీ అన్నదానిపై పవన్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోతే.. తమ పరిస్థితి ఏంటని వివిధ నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. ఇంకా ఆ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ముందుచూపుతో ఆ పార్టీలోని ముఖ్యమైన నేతలు ప్రత్యామ్నాయదారులు వెదుక్కుంటున్నారు. జనసేన ఆచంట నియోజకవర్గ ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని, పూర్తిస్థాయిలో సీట్ల ప్రకటన జరిగితే ఆ పార్టీకి మరిన్ని తలనొప్పులు తప్పవంటున్నారు. పార్టీలో నెంబర్ 3కే సీటు లేకపోతే ఎలా? రాజమహేంద్రవరం రూరల్ నుంచి పార్టీలో నెంబర్ 3గా ఉన్న దుర్గేష్కే సీటని ఇటీవల రాజమహేంద్రవరం పర్యటనలో పవన్ స్వయంగా ప్రకటించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి ఇప్పుడు దుర్గేష్‌ను నిడదవోలుకు సాగనంపి, రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీ నేత గోరంట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ ఇలా చేస్తారనుకోలేదని దుర్గేష్ వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. జగ్గంపేటలో పాటంశెట్టి సూర్యచంద్రరావు తన భార్యతో సహా ఆమరణ దీక్ష చేస్తే పవన్ నుంచి కనీస స్పందన రాలేదు. ఒక్క సీటూ ప్రకటించరా? పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలకు గాను తణుకు, ఉండి, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలకు ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను ప్రకటించేయగా.. వారు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించేశారు. మిగిలిన మూడు సీట్లలో ఎన్ని జనసేనకు ఇస్తారో ఇంతవరకూ స్పష్టత లేదు. సొంత సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ మూడు స్థానాల్లో ఒక్క సీటు కూడా జనసేనాని ప్రకటించకపోవడం కేడర్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందగా.. పొత్తులో భాగంగా ఈసారి ఆ సీటును బీజేపీ అడిగే అవకాశం ఉందంటున్నారు. ఇక టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన సీట్లలో అవమానంతో జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి. తణుకులో టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత విడివాడ రామచంద్రరావు, ఆయన వర్గీయులు తాడేపల్లిగూడెం బహిరంగ సభను బహిష్కరించారు. ఇంతవరకూ ఆయనతో ఎవరూ మాట్లాడలేదు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేరికతో నరసాపురం జనసేనలో ముసలం రేగింది. నరసాపురం సీటు మత్స్యకార వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్‌కు ఇస్తారని భావించగా.. ఆ సీటు తమదేనంటూ సుబ్బారాయుడు వర్గం ప్రచారం చేసుకుంటోంది. పవన్‌కు నాయకత్వ పటిమ లేదు సినిమా డైలాగులే తప్ప పవన్‌కళ్యాణ్ వల్ల ఏమీ కాదని అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటంతటి నాయకత్వ పటిమ, గుండెధైర్యం ఉన్నట్లు అనిపించడం లేదు. ముందు భీమవరం అన్నారు. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. అక్కడి నుండి పోటీ చేస్తే మాత్రం పవన్‌కు పరాభవం తప్పదు. ఈ పరిస్థితులు చూస్తుంటే అసలు పవన్ పోటీలో ఉంటారో లేదో కూడా అనుమానంగా ఉంది. అందుకే భీమవరంలో పులపర్తి అంజిబాబు ఇంటికి వెళ్లి నేను పోటీ చేయకపోతే మీరు చేస్తారా? అని పవన్ బతిమాలారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ నాయకత్వ పటిమ, గుండె ధైర్యం ఏపాటివో అర్థమవుతోంది. – చేగొండి సూర్యప్రకాష్, వైఎస్సార్ సీపీ నాయకుడు, పాలకొల్లు జాప్యంతో మరింత చిచ్చు పొత్తులో జనసేనకు టీడీపీ కేటాయించిన 24 సీట్లలో అభ్యర్థులను ప్రకటించడంలో పవన్‌కళ్యాణ్ జాప్యం చేయడం సరి కాదు. ఈ జాప్యం వల్లే పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల మధ్య విభేదాలు పెరిగిపోయి, కొందరు బయటకు పోతున్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించకుండా జాప్యం చేయడం మంచిది కాదు. ఓ కాపు నాయకుడిగా ఈ పరిణామాలు నన్ను కొంత బాధిస్తున్నాయి. – పత్తి దత్తుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి, కాపు సంక్షేమ సేన, అంబాజీపేట -
బాబు ఓకే చేస్తేనే పవన్ యాక్షన్..
సాక్షి, అమరావతి: ఒక రాజకీయ పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి.. స్వీయ నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ట్రబుల్ షూటర్ లక్షణాలు.. కార్యకర్తలు, నేతల అభిప్రాయాలకు విలువివ్వడం.. ఇలాంటివన్నీ పుణికిపుచ్చుకోవాలి. కానీ, ఇవేవీ లేనివాళ్లను ఏమనాలి? జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అనాలి. ఎందుకంటే.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఆయన వేసే ప్రతీ అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం తెలుగుదేశం అధినేత చంద్రబాబు కనుసైగ చేస్తేనే జరుగుతోంది. ఇది ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న విమర్శ కాదు.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాక్షాత్తు జనసేన శ్రేణులు వ్యక్తంచేస్తున్న నిశ్చితాభిప్రాయం. ఎందుకంటే.. టీడీపీతో పొత్తులో జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ సీట్లలో ఇప్పటికీ కేవలం ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన పవన్‌కళ్యాణ్, మిగిలిన 19 స్థానాల పేర్లు ఇంకా ప్రకటించలేదు. ఇందుకు కారణం.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తుది అనుమతి కోసం ఎదురుచూస్తున్నారట. ఇదే విషయం ఇప్పుడు జనసేనలో హాట్‌టాపిక్‌గా మారింది. చంద్రబాబు సూచన మేరకు రెండు, మూడు జాబితాలుగా వెలువడే అవకాశముందని జనసేన నేతలు చెబుతున్నారు. చివరకు.. పవన్ తాను పోటీచేసే స్థానంపై ఇరువురు నేతలు సూచనప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దానిని అధికారికంగా ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని వారంటున్నారు. ఇక వారం రోజుల క్రితం జరిగిన టీడీపీ–జనసేనల సీట్ల కేటాయింపు ప్రకటనకు ముందే రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేనే పోటీచేస్తుందని పవన్ ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత ఈనెల 24న చంద్రబాబు–పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన మీడియా సమావేశంలో గతంలో చంద్రబాబు ప్రకటించిన రెండు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారుగానీ.. పవన్ ప్రకటించిన రెండింటిలో రాజోలు అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టేశారు. అక్కడ పవన్‌కళ్యాణ్ ముందుగా అనుకున్న పేరుపై చంద్రబాబు అభ్యంతరం చెప్పిన కారణంగానే జనసేన తొలి జాబితాలో అదిలేదని జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన.. జనసేన పోటీచేసే మిగిలిన 19 స్థానాల జనసేన అభ్యర్థుల ఎంపికకు కూడా చంద్రబాబు ఆమోదం కావాల్సి ఉంటుందని వారు స్పష్టంచేస్తున్నారు. అలాగే.. ఆయా స్థానాల్లో తమకు సీట్లు ఖాయమని ఇప్పటివరకూ అనుకుంటున్న జనసేన నేతలు కూడా తమ అభ్యర్థిత్వానికి టీడీపీ అధినేత ఎసరు పెడతారేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. చంద్రబాబు జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలే కేటాయించడాన్ని కూడా పవన్ పవిత్ర గాయత్రీ మంత్రంతో గొప్పగా పోల్చుకున్నారని.. నిజానికి.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మంత్రాన్ని íచెవిలోనే ఉపదేశిస్తుంటారని.. ఈలెక్కన జనసేనకు కేటాయించిన ఆ 24 సీట్లలో ఎవరు పోటీచేయాలన్నది చంద్రబాబు పవన్ చెవిలో చెప్పిన తర్వాతే తమ అధినేత అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందని జనసేన నాయకులే ఛలోక్తులు విసురుతున్నారు. బాబు చెప్పుచేతల్లో పవన్.. లోకేశ్ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు ఇప్పటికే పవన్ మాటలకు విలువ లేకుండా చేశారని వారంటున్నారు. ఒక వ్యూహం ప్రకారం తమ అధినేతను ఆయన తన చెప్పుచేతల్లో ఉంచుకునే ఎత్తుగడలో ఉన్నారని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. తొమ్మిది నెలల క్రితం తణుకులో పవన్ అక్కడి స్థానిక పార్టీ ఇన్చార్జి వి. రామచంద్రరావుకు సీటు ఇస్తానని ఇచ్చిన మాటకు విలువలేకుండా ఆ స్థానంలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని వారు ఉదహరిస్తున్నారు. అలాగే, సీట్ల కేటాయింపు ప్రకటనకు వారం రోజుల ముందే పవన్ రాజమండ్రి పర్యటనలో రూరల్ స్థానంలో జనసేనే పోటీచేసేలా చంద్రబాబును ఒప్పిస్తానని స్థానిక పార్టీ నేతలకు మాటిచ్చారు. కానీ, ఆ స్థానం ఇప్పటివరకూ అధికారికంగా ఖరారు కాకపోయినా, అనధికారికంగా ఆ స్థానం టీడీపీకి కేటాయించినట్లు ఇరు పార్టీలు వెల్లడిస్తున్నాయి. ఇంకోవైపు.. 2019 ఎన్నికల్లో టీడీపీతో సంబంధం లేకుండా జనసేన వేరుగా పోటీచేసినప్పుడే పవన్ 30 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న పలు స్థానాలను కూడా ఇప్పుడు పొత్తులో జనసేనకు కేటాయించకుండా, ఏదో ఒక సాకుతో అక్కడ టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసేసి ఆ ఎన్నికలో జనసేనకు కేవలం 7,633 ఓట్లు మాత్రమే వచ్చిన నెల్లిమర్ల.. 11,988 ఓట్లే వచ్చిన అనకాపల్లి వంటి నియోజకవర్గాలను తమ పార్టీకి కేటాయించారని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. -
కాపు కాయలేం
ఇన్నాళ్లూ ఓ అసమర్థుడి వెంట నడిచామన్న చేదు నిజాన్ని ఆలస్యంగా తెలుసుకున్నందుకు సిగ్గు పడుతున్నాం. కాపులకు రాజ్యాధికారం అనే ఆశ మళ్లీ చిగురిస్తోందని సంబర పడుతున్న వేళ ఏమిటీ ప్రేలాపనలు? ఇదేం స్ట్రాటజీ? ఇవేం ఎత్తుగడలు? కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారెవరైనా ఒక బహిరంగ సభలో ఇలా మాట్లాడతారా? ప్యాకేజీ స్టార్ అని వైసీపీ వాళ్లు అంటున్న మాట నిజమేనని ఆయన నోటే చెప్పకనే చెప్పారు. మా ఆశలను కూకటివేళ్లతో సహా పెకిలించేశారు. – సోషల్ మీడియాలో జనసేన అభిమానులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాతిని ఉద్ధరిస్తారని పవన్ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సామాజికవర్గం ఉడికిపోతోంది. ఆ వర్గాలు ఇక పవన్ కోసం కాపు కాయలేమంటున్నాయి. పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చంద్రబాబుతో చేసుకున్న రాజకీయ ఒప్పందం మేరకు లభించిన సీట్లతో ఆ సామాజికవర్గం విసుగెత్తిపోయింది. ఇక ముందు పవన్‌ను నమ్మి రాజకీయాలు చేయలేమని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నారు. టీజే (తెలుగుదేశం–జనసేన) ఉమ్మడి సభలో పవన్ దిగజారుడుతనం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలో, ఏం చేయకూడదో సామాజికవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వృద్ధతరం మేధావులు సోదాహరణంగా వివరిస్తున్నా పవన్ పెడచెవిన పెట్టడం వారికి ఆవేదన కలిగించింది. పైగా ఆ పెద్దల మాటలు చెవి కెక్కించుకోకపోవడం అటుంచి, అటువంటి వారు తనకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరమే లేదని తెగేసి చెప్పడాన్ని కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ అభిమానులు సైతం ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ యవనికలో కుట్రలకు కేరాఫ్‌గా నిలిచే చంద్రబాబుతో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ప్రస్తావన వచ్చిన ప్రారంభంలోనే జనసేన నేతలు, పవన్ అభిమానుల్లో పెదవి విరుపు మొదలైంది. ఇందుకు చంద్రబాబుతో పవన్‌కు ఎదురైన అనుభవాలను వారందరూ ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ లెక్క పెట్టకుండా చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారు. వారందరిదీ అదే ఆవేదన గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉన్నా కూడా, కాదని కాలదన్నుకోవడం పట్ల జనసేన శ్రేణులు, అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంఖ్యా బలానికి తగిన రీతిలో గౌరవప్రదమైన స్థానాలు దక్కలేదనే ఆవేదన ఆ సామాజికవర్గం అంతటా నెలకొంది. గోదావరి జిల్లాల్లో అపార రాజకీయ అనుభవం కలిగిన చేగొండి హరిరామజోగయ్య మొదటి నుంచీ ముఖ్యమంత్రి పదవితో పవర్ షేరింగ్, కనీసం 50 అసెంబ్లీ స్థానాలు సాధించుకోవాలని పలుమార్లు లేఖల ద్వారా చెబుతూనే ఉన్నారు. అలాగైతేనే జనసేన శ్రేణుల నుంచి ఓట్ షేరింగ్ ఉంటుందని, లేదంటే పొత్తు ధర్మం చిత్తు అవుతుందని అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. తాజాగా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా గురువారం బహిరంగ లేఖ ద్వారా అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన ముద్రగడ.. తాజా రాజకీయ పరిణామాలపై తొలిసారి పవన్‌ను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. కాపు ఉద్యమం సందర్భంగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు కాపుల పైన, తన కుటుంబం పైన జరిపిన దాషీ్టకాలను సైతం దిగమింగుకుని పవన్‌కు మద్దతుగా నిలవాలని భావించానని చెప్పారు. అంతేకాకుండా ఆయనతో కలసి పని చేసి రాష్ట్రంలో కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలని కలలుగన్న విషయాన్నీ తన లేఖలో ప్రస్తావించారు. పవన్ అభిమానులు ఆయనను ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటే ఆయన మాత్రం 24 సీట్లకు మాత్రమే అంగీకరించడంపై ముద్రగడ విస్మయం వ్యక్తంచేశారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం, ముందుగా రెండేళ్లు సీఎం, 80 అసెంబ్లీ సీట్లు కోరాల్సిందని ముద్రగడ తన మనసులో మాట బయటపెట్టారు. బాబు మాటే పవన్‌కు శాసనం పవన్ తీరుతో మరో చారిత్రక తప్పిదం జరిగిపోయిందని కాపులు అంతర్మ«థనం చెందుతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయ్యి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు జైలుకు వెళ్లి భరోసా ఇవ్వడం ద్వారా బాబు పరపతి పెరగడానికి పరోక్షంగా పవనే కారకులయ్యారు. కానీ ఆ స్థాయిలో సీట్లు తీసుకు రాలేకపోవడంతో పవన్‌పై పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలై ఆ సామాజికవర్గంలో అంతర్మధనం మొదలైంది. సీట్లు, ఓట్లు బదిలీ, పవర్ షేరింగ్ కోసం అడుగుతున్న వారిపై పవన్ మాటలతో ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితుల్లో ఓటు షేరింగ్ ఎందుకు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ‘గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడించారు. ఎలక్షన్ అంటే డబ్బుతో కూడుకున్న పని. అంత సత్తా మనకు ఉందా? కనీసం మనం భోజనాలు పెట్టించలేం..’ అని ప్రశ్నిస్తూ.. పవన్ తనకు తానుగానే పార్టీ శ్రేణులు, అభిమానుల్లో నిస్సత్తువ ఆవరించే పరిస్థితికి కారకులయ్యారని విశ్లేషిస్తున్నారు. అభిమానులు, ఆ సామాజికవర్గం మునుపటి మాదిరిగా ఉత్సాహంగా తాడేపల్లిగూడెం సభకు వెళ్లిన దాఖలాలు లేకపోవడానికి పవన్ నిర్ణయాలే కారణమని కాపు సామాజికవర్గ నేతలు అంటున్నారు. చంద్రబాబు మాటే పవన్‌కు శాసనమైందని వాపోతున్నారు. కనీసం 50 సీట్లు తీసుకుని ఉండాల్సింది పొత్తులో భాగంగా జనసేన కేవలం 24 సీట్లకు పరిమితం కావడం నాలాంటి కాపు నాయకులకు ఇబ్బందిగా ఉంది. పవన్ జనసేన పార్టీ అధ్యక్షుడు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థాయికి తగినట్టుగా కనీసం 50 సీట్లు తీసుకుని ఉండుంటే మాకు సంతృప్తిగా ఉండేది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ప్రయాణిస్తున్న క్రమంలో సీఎం పదవిలో కూడా షేరింగ్ ఉండుంటే మేమందరం ఆనందించే వాళ్లం. కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య ఆవేదన కూడా ఇదే. – కల్వకొలను తాతాజీ, కాపు జేఏసీ నేత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పవన్ నిర్ణయం సరికాదు పవన్ కాపు జాతిని నిరాశ పరిచారు. ఎన్నో ఏళ్లుగా కాపులు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. పవన్ ద్వారా సాధ్యమవుతుందని కలలు కన్నాం. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని కేవలం 24 సీట్లలో పోటీకి సిద్ధమయ్యారు. ఇలాగైతే ఏ విధంగా సీఎం అవుతారు? చంద్రబాబుకు వత్తాసు పలకడానికే పవన్ ఉన్నట్టుంది. పవన్ నిర్ణయం సరికాదు. – కురుమళ్ల చిన్ని, కాపు నాయకుడు, కిర్లంపూడి, కాకినాడ జిల్లా 50–60 సీట్లు తీసుకోవాల్సింది రాష్ట్ర జనాభాలో 22 శాతం కాపులు ఉన్నారు. కాపు వర్గం వారు ఏ రోజైనా సీఎం అవుతారని ఊహించాం. టీడీపీతో పొత్తులో భాగంగా 50–60 సీట్లు వరకు తీసుకుంటారని ఆశించాం. కానీ 24 సీట్లకే పరిమితమవడం నిరుత్సాహానికి గురిచేసింది. – గుండాబత్తుల శ్రీను గోవిందరావు, మామిడికుదురు మండల కాపు నాడు అధ్యక్షుడు, కోనసీమ జిల్లా పవన్‌కు సీఎం పదవి ప్రకటిస్తారని ఆశించాం కోస్తా జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. పవన్ ద్వారా సీఎం పదవి వస్తుందని ఆశించాం. టీడీపీతో పొత్తు పేరిట 24 సీట్లకే పరిమితమయ్యారు. పొత్తులో భాగంగా పవన్‌కు సీఎం పదవిని ఏడాదో, రెండేళ్లో ప్రకటిస్తారనుకున్నాం. ఆయన ఎందుకు తగ్గి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదు. – వెలుగుబండి సుబ్బారావు, కాపు నాయకుడు, వాకలపూడి, కాకినాడ జిల్లా -
జెండా సభలో జనం లేక ‘జంట’ షాక్
సాక్షి, అమరావతి: రహస్య అజెండాతో ఐదేళ్లుగా ముసుగులో గుద్దులాట.. బేరసారాల అనంతరం ప్రకటించిన టీడీపీ – జనసేన పొత్తుల వ్యవహారం తొలి అడుగులోనే బెడిసికొట్టింది! పొత్తులు కుదిరాక తొలిసారిగా బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా సభ’ జనం లేక వెలవెలబోయింది. పొత్తుల పేరుతో తమకు సీట్లు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు, కేడర్ ఈ సభను బహిష్కరించి దూరంగా ఉండటం గమనార్హం. ఉమ్మడిగా నిర్వహించిన మొదటి సభకు ఐదారు లక్షల మంది తరలివస్తారంటూ రెండు పార్టీల అగ్రనేతలు ఎంతో నమ్మకం పెట్టుకోగా కేవలం 40 వేల నుంచి 50 వేల మంది లోపే హాజరైనట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జనం లేక సభా ప్రాంగణం కళ తప్పడంతో ఇరు పక్షాల నేతలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిర్రుబుర్రులాడారు. తీవ్ర నిరాశ నిస్పృహకు గురైన వారిద్దరూ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా సీఎం జగన్‌పై పోటీ పడి దూషణలకు దిగడం ఇరు పక్షాల శ్రేణులను విస్మయానికి గురి చేసింది. ‘గూడెం’ దెబ్బకు గుండె గుభేల్ ఉమ్మడిగా నిర్వహించిన తొలి సభే అట్టర్ ప్లాప్ కావడంతో టీడీపీ–జనసైన శ్రేణులు నైతిక స్థైరాన్ని కోల్పోయాయి. దీంతో ఎన్నికలకు ముందే కాడి పారేసే దిశగా కదులుతున్నాయి. మరోవైపు సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభలు మూడూ ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడంతోపాటు ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ ఘన విజయం ఖాయమని జీ న్యూస్ మ్యాటరైజ్, జనాధార్ ఇండియా, టైమ్స్ నౌ లాంటి డజనకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు వెల్లడిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహంతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. పొత్తు ఆదిలోనే ‘చిత్తు’.. పొత్తులో భాగంగా 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలను జనసేనకు కేటాయించాక కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే గోదావరి జిల్లాల్లో సభను నిర్వహించడం ద్వారా బలం చాటుకోవాలని తాడేపల్లిగూడెంను వేదికగా ఎంచుకున్నారు. అయితే అవకాశవాద పొత్తును ప్రజలు ఆదిలోనే చిత్తు చేశారనేందుకు ఆ సభ వెలవెలబోవడమే నిదర్శనమని పేర్కొంటున్నారు. 2014లో జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే తనకు నష్టం జరుగుతుందని చంద్రబాబు వారించడంతో పోటీకి దూరంగా ఉన్నట్లు పలు సందర్భాల్లో చెప్పారు. నాడు టీడీపీ–బీజేపీ కూటమిలో చేరి చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి నుంచి వేరుపడ్డ పవన్ బీఎస్పీ–సీపీఐతో జతకట్టి పోటీ చేశారు. ఇప్పుడు చంద్రబాబును గద్దెనెక్కించడమే లక్ష్యంగా మళ్లీ టీడీపీతో జత కలిశారు. వీటిని పరిశీలిస్తున్న ప్రజలు చంద్రబాబు కోసం.. చంద్రబాబు చేత.. చంద్రబాబే ఏర్పాటు చేయించిన పార్టీ జనసేన అని భావిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ శ్రేణుల దూకుడు..: సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేస్తూ సీఎం జగన్ ‘సిద్ధం’ సభలను తొలుత భీమిలిలో ఆ తర్వాత దెందులూరులో నిర్వహించారు. ఆ రెండు సభలకు సముద్రాన్ని తలపించే రీతిలో జనం కదలి వచ్చారు. ఇక ఈనెల 18న రాప్తాడులో నిర్వహించిన మూడో ‘సిద్ధం’ సభకు 10–11 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా రాప్తాడు సభ నిలిచిపోయింది. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ప్రతీకగా రాప్తాడు సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేయడం, పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా డీబీటీతో నేరుగా రూ.2.55 లక్షల కోట్లను పారదర్శకంగా అందించడం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తేవడంతో సీఎం జగన్‌పై విశ్వాసం ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల నాడిని గుర్తించేందుకు పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. ♦ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 0–1 స్థానంలో మాత్రమే ఉనికి చాటుకునే అవకాశం ఉందని టైమ్స్‌నౌ సర్వే తేల్చింది. ♦ రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకుగానూ 19 ఎంపీ సీట్లలో వైఎస్సార్సీపీ విజయభేరీ మోగిస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 6 స్థానాలకే పరిమితం అవుతుందని జీన్యూస్ మ్యాటరైజ్ సర్వే స్పష్టం చేసింది. ♦ 49.2 శాతం ఓట్లతో 125 శాసనసభ, 17 లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 46.3 శాతం ఓట్లతో 50 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని జనాధార్ ఇండియా సర్వే వెల్లడించింది. 62 శాతం మంది ప్రజలు సీఎం వైఎస్ జగన్ పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. -
త‘లెక్క’డ పెట్టుకోవాలన్నా!
పెందుర్తి/ఏలూరు (టూటౌన్): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తిక్కతో విసిగిపోయి సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. టీడీపీ ముష్టి విసిరినట్టు కేవలం 24 సీట్లు విదిల్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తలెక్కడ పెట్టుకోవాలంటూ అవమానభారంతో కుమిలిపోతున్నారు. టీడీపీకి ఊడిగం చేయాలా అంటూ మండిపడుతున్నారు. బహిరంగంగా మాట్లాడకపోయినా పవన్ తీరు ప్యాకేజ్ మహిమే అని నిర్ధారణకు వచ్చేసినట్టు వారి పోస్టులు ఉన్నాయి. జనసేన క్యాడర్లో నెలకొన్న నైరాశ్యానికి అవి అద్దం పడుతున్నాయి. టికెట్ల ప్రకటన సందర్భంగా ఎంపీ సీట్లలోని అసెంబ్లీ స్థానాలనూ కలిపి పవన్ చెప్పిన వింత లెక్కపైనా విస్మయం వ్యక్తమవుతోంది. పెందుర్తి సీటు టీడీపీకి కేటాయిస్తారని జరుగుతున్న ప్రచారంపైనా జనసేన క్యాడర్ అసంతృప్తిగా ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి సహకరించబోమని స్పష్టం చేస్తోంది. ఏలూరులో నిరసన ఏలూరు అసెంబ్లీ సీటును జనసేన పార్టీకి కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ ఏలూరు కార్యాలయంలో బుధవారం కార్యకర్తలు ధర్నాకు దిగారు. పార్టీ నగర అధ్యక్షుడు కె.నరేష్ మాట్లాడుతూ జనసేన తరఫున రెడ్డి అప్పలనాయుడికి టికెట్ ఇవ్వాలని, ఏలూరు సీటుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభను తాము బహిష్కరించినట్టు వివరించారు. జనసైనికులు పెట్టిన కొన్ని పోస్టులివీ.. లాగిపెట్టి కొట్టినట్టయింది ‘మాకు 24 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే బాబు ఇచ్చాడు. అయితే మా అధినేత పవన్ అన్నట్లు మూడు ఎంపీ స్థానాల్లో ఉన్న 21 (ఎంపీ స్థానానికి ఏడు చొప్పున) అసెంబ్లీ స్థానాలను కలుపుకుంటే 45 సీట్లలో మా పార్టీ పోటీ చేస్తుందని ఓ టీడీపీ మిత్రుడి దగ్గర అన్నాను. వెంటనే ఆ టీడీపీ కార్యకర్త ‘మా పార్టీ 151 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. పవన్ చెప్పినట్లు మిగిలిన 22 ఎంపీ స్థానాలతో కలిపితే అవి మరో 154 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. అంటే మేం 305 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు’ కదా అన్నాడు. దెబ్బకు లాగిపెట్టి కొట్టినట్లయింది.’ – ఫేస్బుక్లో పెందుర్తికి చెందిన ఓ జనసైనికుడి ఆక్రోశం ముద్ద దిగట్లేదన్నా ‘జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం అన్నారు. టీడీపీ సీట్లు ఇవ్వడం కాదు. మేమే తీసుకుంటాం అన్నారు. తీరా 24 సీట్లు ఇస్తే సూపర్ డూపర్ అంటున్నారు. మనం చెప్పే డైలాగులకు.. మనకు పడేసిన సీట్లకు ఏమైనా సంబంధం ఉందా పవనన్నా’. ‘అంతన్నవ్ ఇంతన్నవ్.. చివరకు 24తో సరిపెట్టావ్. ‘పవనన్నా నువ్వు చేసిన పనికి ముద్ద దిగడం లేదన్నా’ – మరికొందరు కార్యకర్తల ఆక్రందన -
టీజే ఫ్లాప్ షో!
ఆరు లక్షల మందన్నారు.. సిద్ధం సభలను మించి జనం కదిలివస్తారని ఊదరగొట్టారు.. ఈ సభకు హాజరయ్యే జనసందోహంతో అధికార పార్టీ దిమ్మ తిరిగిపోతుందని పగటి కలలుగన్నారు.. అందుకే రెండు పార్టీలకు పట్టున్న ప్రాంతంలో ఉమ్మడిగా సభ పెట్టారు.. ఎంత చేసినా జనం రారని తెలుసుకాబట్టే తక్కువ స్థలంలో ఏర్పాట్లు చేశారు.. ఆ స్థలం కిక్కిరిస్తే.. దానినే కొండంతలు చేసి చూపిస్తూ చంకలు గుద్దుకోవాలని స్కెచ్ వేశారు.. తీరా 40–50 వేలు కూడా దాటక పోవడంతో బిక్క మొహం వేయడం బాబు, పవన్‌ల వంతు అయితే.. ఇలాగైతే ఈ ఎన్నికల్లోనూ ఏడిసినట్లే అనుకోవడం ఇతర నేతలు, కార్యకర్తల వంతు అయింది. ‘అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టిందిరో టీ–జే మీటింగ్’ అని పాడుకోవాల్సిన తరుణమిది. సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, భీమవరం : జనాదరణ లేక టీడీపీ–జనసేన (టీజే) తొలి బహిరంగ సభ తుస్సుమంది. అంతా.. ఇంతా.. నభూతో.. అన్నట్లు నాలుగైదు రోజులుగా ఊదరగొట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు ఈ సభకు వచ్చిన జనం మాటెత్తడం లేదు. టీడీపీ–జనసేన పొత్తుకు జనం మద్దతును ఈ సభతో చాటిచెబుతామంటూ ఇరు పార్టీల అధినేతలు హడావుడి చేశారు. కేడర్ నిరసనల్ని, మనోభావాల్ని లెక్కచేయకుండా చంద్రబాబు, పవన్‌ల వ్యక్తిగత అ‘జెండా’తో నిర్వహించిన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆరు లక్షల మంది తరలివస్తారంటూ ఎల్లో మీడియాలో మోత మోగించారు. తాడేపల్లిగూడెం సమీపంలో 22 ఎకరాల ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటే.. తీరా టీడీపీ–జనసేన పార్టీల కేడర్ నిరాదరణతో కాస్తా ఫ్లాప్ షోగా మిగిలింది. ఈ పొత్తు తమకు అంగీకారం కాదని స్పష్టం చేస్తూ నాయకులు, కింది స్థాయి కేడర్ సభను తుస్సుమనిపించారు. ప్రజలు పొత్తుకు బ్రహ్మరథం పడతారని చంద్రబాబు, పవన్‌లు ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. టీడీపీ–జనసేన సంయుక్తంగా నిర్వహించిన తొలి బహిరంగ జెండా సభకు వారి లక్ష్యంలో పది శాతం మంది కూడా రాకపోవడం ఆ పార్టీల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావాలని ఫోన్లలో సమాచారం అందించినా, ఆ సభకు హాజరైన వారి సంఖ్య చూసి ఆ పార్టీల అగ్ర నేతలు విస్తుపోయారు. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సగం పైగా కుర్చీలు ఖాళీగా కనిపించడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కంగుతిన్నారు. టీ–జే పార్టీ నేతల్లో నైరాశ్యం పొత్తు ముసుగు తొలగిపోయి జనసేన 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రెండు పార్టీల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ‘సిద్ధం’ సభలు ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుండగా మరోవైపు టీడీపీ – జనసేనలో భగ్గుమన్న విభేదాలతో క్యాడర్ చెల్లాచెదురైంది. ఈ నేపథ్యంలో టీడీపీ–జనసేన నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఉన్న 22 ఎకరాల మైదానాన్ని ఎంచుకున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే రెండు పార్టీల నేతలు సుమారు 500 మంది కూర్చోవడానికి వీలుగా వేదికతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వేర్వేరుగా హెలికాఫ్టర్లలో రానుండటంతో అక్కడకు సమీపంలో రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. వేదిక, హెలి ప్యాడ్లు, వీవీఐపీల రెస్ట్ రూమ్‌లు, పార్కింగ్‌కు ఏడు ఎకరాలు పోగా మిగిలిన 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు సిద్ధం చేశారు. ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీల చొప్పున 22 గ్యాలరీల్లో 33 వేల కుర్చీలు వేశారు. మొత్తం కుర్చీలన్నీ నిండిపోయి 15 ఎకరాల ప్రాంగణం కిక్కిరిసిపోతే దాదాపు 60 వేల మంది హాజరైనట్లు లెక్క. అయితే సభ ప్రారంభం నుంచి చివరిదాకా సగం గ్యాలరీలు ఖాళీగానే ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటించారు. రెండు గంటలు ఆలస్యంగా 5.30 గంటలకు మొదలైంది. మొత్తం 22 గ్యాలరీలు ఏర్పాటుచేసి ప్రముఖులు, మీడియా, మహిళల కోసం ఆరు గ్యాలరీలు, మిగిలినవి కార్యకర్తలకు కేటాయించారు . పట్టుమని 11 గ్యాలరీలు కూడా నిండలేదు. మిగిలిన గ్యాలరీలన్నీ సగం ఖాళీగానే కనిపించాయి. సాయంత్రం 5 గంటలకు కూడా సగం గ్యాలరీలు నిండలేదు. వాస్తవానికి ఆరు లక్షల మంది జనం వస్తారని టీడీపీ–జనసేన నేతలు చెప్పారు. అయితే అది సాధ్యం కాదని వారికీ తెలుసు. అందుకే తక్కువ స్థలం ఉన్న చోట సభ నిర్వహించి, జనం కిక్కిరిసిపోతే.. దానినే కొండంతలు చేసి చూపాలన్న టీడీపీ, జనసేన అగ్రనేతల పన్నాగం బెడిసికొట్టింది. మొత్తంగా 40–50 వేల మంది కూడా హాజరు కాకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ప్రసంగాలకు స్పందన నిల్ సినీ నటుడు బాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా పలువురు టీడీపీ, జనసేన నేతలు ప్రసంగించారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేసేవారికే ప్రసంగించే అవకాశం ఇచ్చారు. కేడర్ నుంచి మాత్రం వారి ప్రసంగాలకు స్పందన రాలేదు. చంద్రబాబునాయుడు ప్రసంగాన్ని రెండు పార్టీల కేడర్ తేలిగ్గా తీసుకున్నారు. ఆయన ప్రసంగిస్తుండగానే అనేక మంది తిరుగుముఖం పట్టారు. పవన్‌కళ్యాణ్ ప్రసంగించే సమయానికి జనం మరింత పల్చబడ్డారు. ఈ సభలో అన్నీ వెరైటీలే. సభా ఏర్పాట్ల నుంచి అన్ని వన్ బై టూ ఫార్ములాలోనే కొనసాగాయి. జనసేన, టీడీపీ కేడర్ కూడా ఏర్పాట్లు చూసి విచిత్రంగా అనిపించి నవ్వుకున్నారు. గ్యాలరీల్లో ప్రతి కుర్చీలో టీడీపీ, జనసేన జెండాలు పెట్టారు. ఏ పార్టీ నాయకుడు మాట్లాడితే ఆ పార్టీ జెండా ఊపుతూ ఈలలు వేసేలా ఏర్పాటు చేశారు. గ్యాలరీలు నిండక, జనాలు రాక, రెండు జెండాలు పట్టుకోవడానికి కేడర్ ఇష్టపడక పోవడంతో అసలు ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఈ సభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఇద్దరూ చెరో హెలికాప్టర్లో చేరుకున్నారు. తర్వాత ఒకే బస్సులో ముప్పావు గంటకు పైగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి వేదికపైకి వచ్చి మొత్తం కలియదిరిగి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఇద్దరూ కరచాలనం చేస్తూ హడావుడి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీ జెండాను, పవన్ కళ్యాణ్ జనసేన జెండాను ఊపి, తర్వాత జెండాలు మార్చుకున్నారు. వేదికపై చంద్రబాబుకు కుడివైపున టీడీపీ నేతలు ఒక గ్రూపుగా, పవన్‌కళ్యాణ్‌కు ఎడమ వైపున జనసేన నేతలు మరొక గ్రూపుగా కూర్చున్నారు. ఇది ప్రజల పొత్తు, చారిత్రక అవసరమంటూ చంద్రబాబు ముగించగా, 24 సీట్లు ఏమీ తక్కువ కాదు.. నన్ను అభిమానించే వాళ్లెవరూ ప్రశ్నించవద్దంటూ పొత్తుల ప్రస్తావనకు పవన్ ఫుల్స్టాప్ పెట్టారు. బూత్ స్థాయిలో బలం లేని మనం ఎక్కువ సీట్లు ఎలా అడగాలంటూ జనసేన కార్యకర్తల్ని పవన్ తీవ్రంగా నిరాశపరిచారు. టీడీపీ నేత నారా లోకేశ్ తొలి ఉమ్మడి సభకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. సభలంటే అలా పెట్టాలి టీడీపీ–జనసేన ఉమ్మడి సభకు హాజరైన పలువురు కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సభల గురించి మాట్లాడుకున్నారు. ఆ స్థాయిలో ఈ సభ ఉంటుందనుకున్నామని, ఇలా పేలవంగా జరుగుతుందనుకోలేదని నిట్టూర్చారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ భీమిలిలో గత నెల 27వ తేదీన సిద్ధం తొలి సభను నిర్వహించారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. సిద్ధం రెండో సభను ఈనెల 3న ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద 110 ఎకరాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి 6–7 లక్షల మందికిపైగా జనం తరలివచ్చారు. రాప్తాడులో 18న నిర్వహించిన ‘సిద్ధం’ మూడో సభకు వేదికపోనూ ప్రజల కోసం ఏకంగా 250 ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరి«ధిలోని 52 నియోజకవర్గాల నుంచి 10 నుంచి 11 లక్షల మంది హాజరయ్యారు. -
అందరికీ సీట్లు ఇవ్వలేం
సాక్షి, భీమవరం/తాడేపల్లిగూడెం: కోరుకున్న వారందరికీ సీట్లు ఇవ్వలేమని, నాయకులు ఎవరూ ఇగోలకు పోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ నేతలతో పాటు జనసేన నేతలకూ హితబోధ చేశారు. బుధవారం పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారి బైపాస్ పక్కన జరిగిన టీడీపీ, జనసేన పార్టీల తొలి ఉమ్మడి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రెండు పార్టీలు కలిసి నిర్వహించిన ఈ మొదటి సభ రాష్ట్రం దిశను మార్చబోతోందన్నారు. ఇప్పటికి 99 సీట్లు ప్రకటించామని, మిగిలినవి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. 1.3 కోట్ల మంది ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అందువల్ల కోరుకున్న వారందరికీ సీట్లు రావని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండే వాళ్లనే గుర్తించి అభ్యర్థులుగా ప్రకటిస్తున్నామన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తామని, బీసీ, ఎస్సీ డిక్లరేషన్ ప్రకటనతో పాటు ఎస్టీలు, మహిళలు, ఉద్యోగులు, రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ మేరకు త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నాకు సలహాలివ్వొద్దు తాను 24 స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని కొందరు అంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు సలహాలు, సూచనలు ఇచ్చే వాళ్లు అవసరం లేదని స్పష్టం చేశారు. యుద్ధం చేసే వాళ్లు కావాలని అన్నారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు పోటీ చేయకుండా రాష్ట్రం కోసం టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. గతంలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి మానసికంగా కుంగిపోయానని, దక్షిణాఫ్రికాలో గాందీజీని గెంటివేసిన సందర్భాన్ని గుర్తుచేసుకుని స్ఫూర్తి పొందానని తెలిపారు. సంస్థాగతంగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతో పోటీ పడలేమని, తన వ్యూహాన్ని ఎవరూ తప్పు పట్టవద్దన్నారు. జగన్‌ను ఆయన వెనుక ఉన్న సమూహం ప్రశ్నించదని, మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారంటూ జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులను ప్రశ్నించారు. తనతో నడిచే వాళ్లే తన వాళ్లని, నిజంగా తన మద్దతు దారులైతే తనను ప్రశ్నించొద్దని ఆదేశించారు. తనకు తెలుగుదేశం పార్టీలా బూత్‌లెవల్ వరకు పనిచేసే బలమైన నెట్వర్క్ లేదన్నారు. కోట్ల రూపాయల అక్రమ సంపాదన లేదన్నారు. 24 సీట్లతోనే ప్రభంజనం సృష్టించి తాడేపల్లి ప్యాలెస్‌ను బద్దలు కొడతామని చెప్పారు. యువతకు 10 కిలోల బియ్యం, రూ.5 వేలు ఇవ్వడం కాదని, వారికి 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పొత్తులు పెట్టుకున్నానని తెలిపారు. ఇదిలా ఉండగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగం అయోమయానికి గురిచేసింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ పదవికి రాజీనామా చేసిన కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. టీడీపీ– జనసేన కూటమి నుంచి నర్సాపురం పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తానని తనంతకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ సభకు కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు గైర్హాజరయ్యారు. వినకపోతే వారి ఖర్మ: హరిరామ జోగయ్య సాక్షి, అమరావతి: ఒకరి మంచి కోసం సలహాలు ఇస్తే వాటిని పట్టించుకోకపోతే అది వారి ఖర్మ అంటూ పార్లమెంటు మాజీ సభ్యుడు హరిరామజోగయ్య అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీల బాగు కోసం తాను ఇస్తున్న సలహాలు ఆ పార్టీల అధినేతలకు నచ్చుతున్నట్లు లేదన్నారు. అది వారి ఖర్మ.. ఇక తాను చేసేదేమీ లేదని చెప్పారు. -
నేడు టీడీపీ – జనసేన ఉమ్మడి సభ.. లక్షల్లో గొప్పలు.. వేలుదాటని కుర్చీలు
సాక్షి, అమరావతి: పిల్ల కాలువను సముద్రంలా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. టీడీపీ – జనసేన ఉమ్మడిగా ప్రత్తిపాడు వద్ద నేడు తలపెట్టిన తొలి సభను జనవాణినితో ఉప్పొంగిన ‘సిద్ధం’ సభలతో పోలుస్తూ చంకలు గుద్దుకుంటోంది. చంద్రబాబు – పవన్ కోసం రెండు హెలిప్యాడ్లు, సేద తీరడం కోసం సభా ప్రాంగణంలో సగం స్థలంలో ఏర్పాట్లు చేశారని, అక్కడి మైదానంలో వేల మంది మాత్రమే కూర్చునే వీలుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమరనాదంతో వైఎస్సార్సీపీ భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జన సముద్రాలను తలపించాయి. మార్మోగుతున్న రణ నినాదం.. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ భీమిలిలో గత నెల 27వతేదీన సిద్ధం తొలి సభను నిర్వహించారు. సీఎం జగన్ సమర శంఖం పూరించిన ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. సిద్ధం రెండో సభను ఈనెల 3న ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద నిర్వహించారు. వేదికపోనూ కార్యకర్తలు, అభిమానులు కూర్చొని సభను వీక్షించడానికి 110 ఎకరాల మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి 6 – 7 లక్షల మందికిపైగా ఈ సభకు తరలివచ్చారు. ఇక రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ మూడో సభకు వేదికపోనూ ప్రజల కోసం ఏకంగా 250 ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరి«ధిలోని 52 నియోజకవర్గాల నుంచి 10 నుంచి 11 లక్షల మంది హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా రాప్తాడు సిద్ధం సభ నిలిచిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఉన్న విశ్వాసానికి ‘సిద్ధం’ సభలు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. స్థైర్యం నింపేందుకు పాట్లు... జనసేన 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రెండు పార్టీల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ‘సిద్ధం’ సభలు ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుండగా మరోవైపు టీడీపీ – జనసేనలో భగ్గుమన్న విభేదాలతో క్యాడర్ చెల్లాచెదురైంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీడీపీ–జనసేన శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఎల్లో మీడియా తంటాలు పడుతోంది. మొత్తం 33 వేల కుర్చీలు టీడీపీ–జనసేన నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఉన్న 22 ఎకరాల మైదానాన్ని ఎంచుకున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే రెండు పార్టీల నేతలు సుమారు 500 మంది కూర్చోవడానికి వీలుగా వేదికతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వేర్వేరుగా హెలికాఫ్టర్లలో రానుండటంతో అక్కడకు సమీపంలో రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. వేదిక, హెలి ప్యాడ్లు, వీవీఐపీల రెస్ట్ రూమ్‌ల నిర్మాణానికి ఏడు ఎకరాలు పోగా మిగిలిన 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు సిద్ధం చేశారు. ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీలు వేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంటే 22 గ్యాలరీల్లో 33 వేల కుర్చీలు పట్టే అవకాశం ఉంది. మొత్తం కుర్చీలన్నీ నిండిపోయి 15 ఎకరాల ప్రాంగణం కిక్కిరిసిపోతే దాదాపు 60 వేల మంది హాజరైనట్లు లెక్క అని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇలా వేల మంది మాత్రమే హాజరయ్యే సభలను జన సముద్రాలతో పోల్చడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సభకు ఓ నమస్కారం! సాక్షి, భీమవరం: టీడీపీ – జనసేన ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలిసభ ‘తెలుగు జనజెండా’కు అసమ్మతి సెగ తగిలింది. పొత్తుల పేరుతో 24 సీట్లకే పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు, శ్రేణులు ఈ సభకు ముఖం చాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సభా ప్రాంగణం, ఏర్పాట్ల విషయంలో రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం కొరవడటంతో ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్ద తణుకు నియోజకవర్గ ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు నిరసన గళం వినిపించారు. తణుకులో ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శివరామరాజును పిలవకపోవడంతో ఆయన వర్గీయులు హాజరు కాలేదు. కొత్తపేటలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, ఆయన అనుచరులు డుమ్మా కొట్టారు. మండపేటలో ఉమ్మడి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ప్రకటించడంపై జనసేన ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ గుర్రుగా ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ సీటు కందుల దుర్గేష్‌కు సీటు కేటాయించపోవడంతో సభకు దూరంగా ఉండాలని ఆయన వర్గం భావిస్తున్నట్లు సమాచారం. -
బాబు లీల.. కేడర్ గోల
సాక్షి, అమరావతి: అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేస్తున్న హడావుడితో తెలుగుదేశం పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొంది. తమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రోజుకో నేత పేరు.. అదీ సంబంధం లేని ప్రాంతాలకు చెందిన వారి పేర్లు వస్తుండటంతో కేడర్ నిర్ఘాంతపోతున్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఇప్పటికే పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మిగిలిన సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కసరత్తు కేడర్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారో, ఎందుకు అలా చేస్తున్నారో అర్థంకాక పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.ఐవీఆర్ఎస్ సర్వే అంటూ కేడర్‌కు వారి నియోజకవర్గానికి సంబంధం లేని కొత్త వ్యక్తుల పేర్లు చెప్పి వారు ఆ స్థానంలో పోటీ చేస్తే గెలుసారో లేదో చెప్పండని నిలదీస్తుండటంతో ఏమి చేయాలో కార్యకర్తలకు పాలుపోవడం లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సీటును వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో ఉమా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పెనమలూరుకు సిద్ధంగా ఉండాలని ఉమాకు చంద్రబాబు సూచించారు.పెనమలూరులో అభ్యర్థి ఉమా అయితే సమ్మతమేనా అని ఫోన్లు వస్తుండడంతో కేడర్ తెల్లబోతోంది. ఉన్నట్టుండి ఉమాను ఇక్కడకు దిగుమతి చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్ తనకు కాకుండా మరొకరికి సీటు ఇస్తే తాను చేతగానివాడిలా చూస్తూ ఊరుకోనంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దేవినేని ఉమా కూడా పెనమలూరులో కొందరు టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందని ఆరా తీస్తుండటంతో ఇదేమి పరిస్థితంటూ స్థానిక నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావును నిన్నటి వరకు చంద్రబాబు గాల్లో పెట్టారు. మొదటి జాబితాలో ఆయన పేరు గల్లంతైంది. ఇప్పడు ఆయన్ని గురజాల నుంచి నర్సరావుపేటకు మార్చాలనే ఆలోచన చేస్తున్నారు. నర్సరావుపేట టీడీపీ అభ్యర్థిగా యరపతినేని అయితే ఎలా ఉంటుందోనని ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. దీంతో అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు వర్గం లబోదిబోమంటోంది. మరోవైపు గురజాలలో వలస వచ్చిన నేత జంగా కృష్ణమూర్తి అభ్యర్థిత్వంపై సర్వే చేస్తున్నారు. గురజాలలో తనను కాదని ఉన్నట్టుండి జంగాను తేవడంతో యరపతినేని కారాలు మిరియాలు నూరుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అయితే ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం చేస్తుండడంతో ఉత్తరాంధ్ర టీడీపీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఆయన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తేవడం, ఆయన నిరాకరిస్తుండటం గందరగోళానికి దారితీసింది. విజయవాడ పశ్చిమ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. మరోవైపు ఆ సీటు తమదేనని జనసేన హడావుడి చేస్తోంది. ఈ మూడు శిబిరాలు నివ్వెరపోయేలా కొత్తగా ఎంకే బేగ్‌ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఆయన అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుండటంతో స్థానిక నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
సైకిల్ సతమతం
సాక్షి, అమరావతి, నెట్వర్క్: పొత్తు ప్రకంపనలు టీడీపీలో కొనసాగుతూనే ఉన్నాయి. సీట్లు దక్కని నేతలతోపాటు పొత్తులతో అవకాశం కోల్పోయిన అసంతృప్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని నిరసనలతో హోరెత్తిస్తున్నారు. జనసేనతో కలిసి 99 మంది ఉమ్మడి అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పలు చోట్ల నేతలు భగ్గుమంటున్నారు. ♦ విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీ టికెట్‌ను తన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాస్‌కి కేటాయించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆదివారం గజపతినగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడాన్ని నిరసిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ♦ టీడీపీ బలోపేతం కోసం కష్టపడ్డ తనను అవమానించారని, ఇండిపెండెంట్‌గా ఎన్నికల బరిలోకి దిగుతానని ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ప్రకటించారు. చంద్రబాబు తనకు కనీస గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సహకరించేది లేదన్నారు. ♦ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సీటును సవితకు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గం నిరసనలతో హోరెత్తిస్తోంది. ఆదివారం పెనుకొండలో పార్థసారథి అనుచరులు భారీ బైక్ ర్యాలీతో బల ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ వెళ్లి చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటానని పార్ధసారథి ప్రకటించారు. కనీసం సంప్రదించకుండా అభ్యర్థిని ఎంపిక చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు. ♦ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌యాదవ్‌కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బి.కొత్తకోటలో నిరసన నిర్వహించారు. ♦ నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. దీనిపై నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతోపాటు కుందుల సత్యనారాయణ వర్గాలు మండిపడుతున్నాయి. వారంతా టీడీపీకి మూకుమ్మడి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. చిత్తూరులో బీసీలు భగ్గు టీడీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజర్వుడు స్థానాలను మినహాయించి చిత్తూరు (కమ్మ), కుప్పం (కమ్మ), నగరి (కమ్మ), తంబళ్లపల్లె (రెడ్డి), పలమనేరు (రెడ్డి) స్థానాలను ఓసీలకు కేటాయించడంపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన బీసీ నేత సీఆర్ రాజన్‌కు టీడీపీ మొండి చేయి చూపడంపై ఆయన సామాజిక వర్గం మండిపడుతోంది. శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు బస్సు యాత్ర నిర్వహించి బీసీలను చైతన్యం చేయాలని నిర్ణయించింది. బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న గురజాల జగన్మోహన్ నాయుడుకు చిత్తూరు టికెట్ ఇవ్వడంపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన కాపు నేతలు కటారి హేమలత, ఆదికేశవులు కుమార్తె తేజస్విని, మనవరాలు చైతన్య, కాజూరు బాలాజీ తదితరులు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. జనసేనలోనూ మంటలు... ♦ తణుకు జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ విడివాడ రామచంద్రరావు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన అరిమిల్లి రాధాకృష్ణపై నిప్పులు కక్కుతున్నారు. తన ఇంటికి రావద్దంటూ అరిమిల్లిపై మండిపడ్డారు. విడివాడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి యోచనలో ఉన్నారు. ♦ కాకినాడ జిల్లా జగ్గంపేట టికెట్ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించడాన్ని నిరసిస్తూ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ఆలయాల్లో పూజలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 48 గంటల్లో అధినేత స్పందించకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ గోకవరం మండలాధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం చెప్పారు. ♦ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని జనసేన కార్యాలయం వద్ద పార్టీ నాయకులు చల్లా బాబీ, గుత్తుల నాగేశ్వరరావు, బి.రాంబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చించి రోడ్డుపై వేసి నిప్పంటించారు. అతి తక్కువ సీట్లకు ఒప్పందం కుదుర్చుకుని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. కొత్తపేట నియోజకవర్గాన్ని టీడీపీకి కట్టబెట్టడం దారుణమన్నారు. పదేళ్లుగా అహర్నిశలూ శ్రమిస్తే పార్టీని టీడీపీకి అప్పగించి తమను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ కాకినాడ జిల్లా పెద్దాపురం సీటును టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించటాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నేతలు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ♦ పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పెడన ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించకపోవడంతో ఆ పార్టీ కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టి»ొమ్మను కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో ఆ పార్టీ నాయకుడు సమ్మెట బాబు విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ను గుడ్డిగా నమ్మామని అన్నారు. గౌరవప్రదమైన పొత్తుకు విఘాతం కలిగినట్టుగా జనసైనికులు భావిస్తున్నారని తెలిపారు. -
వంగవీటి రాధాకు తలుపులు క్లోజ్
టీడీపీ, జనసేన టికెట్ల కేటాయింపు ప్రకటనతో ఆగ్రహ జ్వాలలు రగులుకున్నాయి. భుజాలు కందేలా టీడీపీ జెండాలు మోసిన తమను కాదని పారాచూట్ నాయకులకు టికెట్లు కేటాయించడంతో పలువురు నాయకులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ తమ ఇమేజ్ను వాడుకుని టికెట్ల వద్దకొచ్చేసరికి మొండి చేయి చూపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం తాము కష్టపడితే బలంలేని జనసేనకు టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. జనసేన టికెట్లపై ఆశలు పెట్టుకున్నవారు సైతం అధ్యక్షా అని పిలిచే అవకాశం లేకపోయిందని నిర్వేదంలో తల్లడిల్లుతున్నారు. తమను కాదని టికెట్లు ఇచ్చారుగా.. వారు ఎలా గెలుస్తారో చూస్తామంటూ రెండు పారీ్టల నాయకులు సవాళ్లు విసురుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎమ్మెల్యే అభ్యర్థుల తొలిజాబితా ప్రకటన ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన పారీ్టలను కకావికలం చేస్తోంది. ఇప్పటికే రగులుకొంటున్న పొత్తుల మంటలపై టికెట్ల కేటాయింపు మరింత అసంతృప్తికి ఆజ్యం పోసింది. దీర్ఘకాలికంగా పారీ్టకి సేవ చేస్తున్న వారితో పాటు ఇటీవల పారీ్టలో చేరి టికెట్లపై ఆశలు పెట్టుకున్న వారికి మొండి చెయ్యే మిగిలింది. తిరువూరులో టీడీపీకి షాక్ తిరువూరులో టీడీపీకి షాక్ తగిలింది. టికెట్ ఆశించి భంగపడిన ఇన్చార్జి శావల దేవదత్తు పారీ్టకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని అధినేతతో తాడోపేడో తేల్చుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. కె. శ్రీనివాసరావు టికెట్ల ప్రకటన అనంతరం దేవదత్తును కలి సేందుకు ప్రయతి్నంచగా ఆయన ముఖంచాటేయడం టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. ఎన్నికల సమయానికి పారాచూట్ నాయకులను తీసుకొచ్చి తమ నియోజకవర్గంపై రుద్దడం ఏమిటని తిరు వూరు తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. కుప్పకూలిన బూరగడ్డ వేదవ్యాస్ పెడన టీడీపీ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ హతాశుడయ్యాడు. తనకు టికెట్ లేదని తెలియడంతో కృత్తివెన్ను మండలం చినపాండ్రాకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన జిల్లా టీడీపీలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ఆ రెండు సీట్లపై పీటముడి మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్, కేశినేని చిన్ని మధ్య కుర్చీలాట కొనసాగుతోంది. నలుగురికీ ఆశపెడుతూ వస్తున్న చంద్రబాబు చివరికి తమను నట్టేట ముంచుతారని టీడీపీ తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మైలవరం, పెనమలూరు సీట్లను ప్రస్తుతానికి ఎవరికీ కేటాయించకపోవడంతో ఆ నలుగురిలో టెన్షన్ కొనసాగుతోంది. చివరికి బాబుగాని, ఆయన కుటుంబ సభ్యులకు గాని సీటు కేటాయించుకుని ఆశావహులందరికీ హ్యాండ్ ఇస్తారేమోనని వారంతా లోలోన మ«థన పడుతున్నారు. ఆ రెండూ జనసేనకేనా? విజయవాడ వెస్ట్, అవనిగడ్డ సీట్లు జనసేనకు కేటాయిస్తారనేది స్పష్టమైంది. దీంతో విజయవాడ వెస్ట్‌లో రక్తంతో చంద్రబాబుపై అభిమానం చాటిన బుద్దా వెంకన్నతోపాటు జలీల్‌ఖాన్, ఎంకే బేగ్, నాగుల్ మీరా వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. జనసేనకు టికెట్ కేటాయిస్తే పారీ్టపై తిరుగుబాటు చేసేందుకు వారంతా సిద్ధమవుతున్నారు. అవనిగడ్డలో పార్టీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ అయోమయంలో పడ్డారు. చంద్రబాబును నమ్ముకొని తమ కుటుంబ రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేసుకున్నానని ఆయన వాపోతున్నట్లు సమాచారం. రాజకీయాలు కళ్ల ముందే మారిపోయాయని, డబ్బు కీలకంగా మారిందని, తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో పంజరంలో నుంచి బయటకు వచ్చిన పక్షిలా స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందినట్లు ఉందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వంగవీటి రాధాకు తలుపులు క్లోజ్ విజయవాడ సెంట్రల్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు చంద్రబాబు ముఖం చాటేశారు. ఇటీవల లోకేష్ పాదయాత్రలో రాధా ఇమేజ్ను వాడుకున్న ఆయన టికెట్ల కేటాయింపునకు వచ్చేసరికి చెయ్యిచ్చారు. చంద్రబాబు తీరుతో రాధా వర్గం రగిలిపోతోంది. కనీసం విజయవాడ తూర్పులో తమకు అవకాశం ఇస్తారని భావించినా అక్కడ కూడా ఆశలు ఫలించలేదు. దీంతో రాధాకు టీడీపీలో తలుపులు మూసేసినట్టే అన్నది స్పష్టమైంది. విజయవాడలో మంచి పట్టు ఉన్న వంగవీటి కుటుంబాన్ని చంద్రబాబు కూరలో కరివేపాకులా తీసిపడేశారని ఆయన అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తూర్పులో అంబశెట్టి వాసు, బత్తిన రాములు జనసేన తరఫున టికెట్ ఆశించారు. టికెట్ల ప్రకటన వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరో సారి చంద్రబాబు కాపులను మోసం చేశారని వారు మండిపడుతున్నారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. టికెట్ల కేటాయింపు ఇలా... ఎనీ్టఆర్ జిల్లాలో... విజయవాడ సెంట్రల్లో బొండా ఉమా, విజయవాడ ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్, నందిగామలో తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), తిరువూరులో కె. శ్రీనివాసరావుకు సీట్లు కేటాయించారు. మైలవరం, విజయవాడ వెస్ట్ సీట్లను ఎవరికీ కేటాయించలేదు. కృష్ణా జిల్లాలో... మచిలీపట్నంలో కొల్లురవీంద్ర, గుడివాడలో వెనిగండ్ల రాము, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, పామర్రులో వర్ల కుమారరాజాకు టికెట్లు కేటాయించారు. అవనిగడ్డ, పెనమలూరు టికెట్లను పెండింగ్‌లో ఉంచారు. -
బాబుకే భ'జనసేన'!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీల మాదిరే జనసేన కూడా పూర్తిగా తోకపార్టీగా మారిపోవడంపట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన–టీడీపీ మధ్య కుదిరిన పొత్తులో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను పవన్ పార్టీకి కేవలం 24 అసెంబ్లీ స్థానాలు.. మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం గతంలో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాటికి కేటాయించిన సీట్లతో పోల్చితే ఇప్పుడు జనసేనకు కేటాయించిన సీట్లు చాలా తక్కువని జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో పవన్‌కళ్యాణ్ స్వయంగా జైలుకెళ్లి ఆయన్ను కలిసొచ్చిన తర్వాత అక్కడికక్కడే పొత్తు ప్రకటన చేసిన తీరుతో తమ పార్టీకి తప్పకుండా 40–45 స్థానాలకు మధ్య సీట్ల కేటాయింపు ఉంటుందని జనసేన శ్రేణులు భావించారు. కానీ, తీరా శనివారం కేవలం 24 అసెంబ్లీ స్థానాలేనని ప్రకటించడం ఆ పార్టీ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో టీఆర్ఎస్కు మూడో వంతు సీట్లు గతంలో పొత్తుల పెట్టుకున్నప్పుడు ఆయా పార్టీలకు టీడీపీ కేటాయించిన సీట్లకు ఇప్పుడు జనసేనకు కేటాయించిన సీట్ల సంఖ్యకు పొంతనే లేదని అటు జనసేనలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఉదా.. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహాకూటమి పేరుతో ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఉన్న మొత్తం సీట్లలో మూడో వంతుకు పైగా కేటాయించింది. అంటే.. 119 సీట్లకు 45 సీట్లను కేటాయించగా.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా 32 సీట్లను కేటాయించింది. నిజానికి.. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటములు చవిచూసింది. అయినా, టీడీపీ ఆ పార్టీకి ఎక్కువ సీట్లను కేటాయించింది. అయితే, ఇప్పుడు ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ప్రస్తుతం జనసేన బాగా పుంజుకుందని పవన్‌కళ్యాణ్ కొంతకాలంగా చెబుతున్నారు. అలాంటప్పుడు 175 సీట్లలో మూడో వంతు 33 శాతం సీట్లు కాకుండా కేవలం 13 శాతం సీట్లకే పవన్ అంగీకరించడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేక ఆయన్ను తూర్పారబడుతున్నారు. పవన్‌కు సీఎం పదవి అంతే సంగతులా!? ఇక పవన్‌కళ్యాణ్‌ను సీఎంగా చేయడమే తమందరి లక్ష్యమని ఆ పార్టీ శ్రేణులందరూ భావిస్తూ ఉంటారు. కానీ, ఈ పొత్తులో జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడంతో పవన్ ఇక ఎప్పటికీ సీఎం అయ్యే అవకాశాలను పూర్తిగా వదులుకున్నారని అటు జనసేన పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. వాస్తవానికి.. 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన మొదలైనప్పటి నుంచి సీఎం అభ్యరి్థత్వంపై పవన్ పార్టీ సమావేశాల్లో ‘పొత్తులు, ఎన్నికల వ్యూహం నాకు వదిలేయండి’ అంటూ పార్టీ శ్రేణులందర్నీ మభ్యపెట్టారు. అలాగే, గత ఎన్నికల్లో 30–40 సీట్లు గెలిచి ఉంటే సీఎం పదవిలో వాటా కావాలని అడిగే అవకాశం ఉంటుందని.. టీడీపీ అధినేత స్థానంలో తానున్నా జనసేనకు సీఎం పదవిలో వాటా ఇచ్చేవాడ్ని కాదని పవన్ పార్టీ సమావేశాల్లో అనేకసార్లు పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచే తీరులో వ్యాఖ్యానించారు. దీనికితోడు.. పొత్తులో చంద్రబాబే సీఎం అభ్యర్థి అని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో సైతం వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే.. సీఎం పదవి వాటా చర్చకు ద్వారాలు మూసుకున్నట్లేనని స్పష్టమవుతోందని వారంటున్నారు. 2014లో బీజేపీకి ఇచ్చిన సీట్లతో పోల్చినా.. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ–జనసేన పొత్తులో జనసేన ఒక్కచోట కూడా పోటీచేయలేదు. ఆ సమయంలో విభజిత ఏపీలోనే బీజేపీకి 15 అసెంబ్లీ స్థానాలు, ఐదు లోక్‌సభ స్థానాలను టీడీపీ కేటాయించింది. అప్పటికి రాష్ట్రంలో కేవలం 2–3 శాతం ఓట్లకే బీజేపీ పరిమితమైంది. కానీ, ఇప్పుడు జనసేనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు తమ పార్టీ ఓట్ల శాతం 15 శాతం ఉంటుందని పవన్‌కళ్యాణ్ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 24 అసెంబ్లీ సీట్లు, మూడు లోకసభ సీట్లు తీసుకోవడం చాలా తక్కువని వారు అభిప్రాయపడుతున్నారు. బాబు కోసమే పవన్ ఆరాటం 2014 జనసేన ఏర్పాటు నుంచీ పరిశీలిస్తే.. పవన్‌కళ్యాణ్ కార్యక్రమాలన్నీ తన సొంత పార్టీ కంటే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే ఆరాటపడి పనిచేస్తున్నట్లు అర్థమవుతోందని జనసేన శ్రేణులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఎందుకంటే.. ♦ పార్టీ ఏర్పాటుచేసి కూడా 2014 ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా పోటీచేయకుండా పూర్తిగా చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ పనిచేశారు. ♦ ఆ ఎన్నికల్లో టీడీపీ అనేక హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయకపోయినా పవన్ ఆయన్ను సమరి్థస్తూనే వచ్చారు. ♦ ఇక 2019 ఎన్నికల్లో జనసేన బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోగా, అది కూడా కేవలం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే. ♦ ఎందుకంటే అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్సార్సీపీకి వెళ్లకుండా టీడీపీకి సహకరించారనే విమర్శలున్నాయి. ♦ తిరిగి 2024 ఎన్నికల సమయానికి వచ్చేసరికి.. వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. అంటే.. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని కారణంగా లాభపడే అవకాశం చంద్రబాబు ఒక్కరికే ఉంటుంది. అందుకే పవన్ ఇప్పుడు టీడీపీతోనే పొత్తుపెట్టుకున్నారు. ♦ మరోవైపు.. గత పదేళ్లుగా జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి పవన్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా టీడీపీకి అనుకూలాంశమే. ఇవన్నీ బాబుకు భజన చేసేవేనని జనసేన శ్రేణులు విమర్శిస్తున్నారు. -
సమన్వయం లేనిచోటే సమన్వయ సభ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంటే.. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ధర్మం ఒకటి ఉంటుంది. ఏ పనైనా కలిసికట్టుగా చేయాలన్న ఓ కట్టుబాటు ఉంటుంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేనల మధ్య ఇదే కొరవడింది. సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాట్లు దీనికో తాజా ఉదాహరణ. ఈ నెల 28న టీడీపీ, జనసేన సంయుక్తంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. దీనిలో భాగంగా ఏర్పాట్ల పరిశీలనకు రెండు పార్టీల నాయకులతో కమిటీలు వేస్తామని ప్రకటించారు. కానీ.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నేతలు 100 మందితో సభ జరిగే ప్రత్తిపాడు ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం పరిశీలించి వెళ్లిపోయారు. అంతకు ముందు గురువారం సాయంత్రమే టీడీపీ నాయకులు కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. పరిశీలన సమయంలో వీరు వారిని, వారు వీరిని పిలవలేదు. నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం పరిశీలించారని తెలియగానే ఆ సాయంత్రమే టీడీపీ జోన్–2 కోఆర్డినేటర్ నేతృత్వంలో తాడేపల్లిగూడెంలో హడావుడిగా సమావేశం పెట్టారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి, కొందరు మాజీ ఎమ్మెల్యేలు హడావుడిగా ఏర్పాట్లు పరిశీలించి అంతా టీడీపీయే చేస్తోందని, జనసేనది ఏమీ లేదన్నట్టు వ్యవహరించారు. మరోవైపు సభా ప్రాంగణాన్ని తానే మాట్లాడి సెట్ చేశానని, అంతా తామే చేస్తున్నామని జనసేన ఇన్చార్జి మౌత్ పబ్లిసిటీ ప్రారంభించారు. ఇలా ఎవరికి వారుగా పనిచేస్తుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న మాటల యుద్ధం తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వలవల బాబ్జి, జనసేన ఇన్చార్జిగా బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తూ బరిలో ఉన్నారు. ఇద్దరూ టికెట్ మాదంటే మాదంటూ వారి స్థాయికి మించి భారీగా ప్రకటనలు చేసుకుంటున్నారు. జనసేన మొదట ప్రకటించే సీటు తాడేపల్లిగూడెమేనని బొలిశెట్టి శ్రీనివాస్, 20 ఏళ్ల తరువాత టీడీపీ గెలిచే సీటు తాడేపల్లిగూడేమని వలవల బాబ్జీ ప్రకటించడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. ఒకరి సమావేశాలకు మరొకరు వెళ్లకుండా అదే రోజు కౌంటర్ ప్రోగ్రామ్‌లు నిర్వహించే స్థాయికి ఇది చేరింది. పార్టీలు రెండు దారుల్లో వెళ్తున్న ప్రాంతంలో సభ నిర్వహించనుండటంతో కొత్త చిచ్చు మొదలైందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇక టీడీపీ, జనసేన తొలి జాబితాలో మొదటి సీటు తాడేపల్లిగూడెం ఉంటుందని నానా హడావుడి చేశారు. తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ, బహిరంగ సభ నేపథ్యంలో వివాదం జరగకుండా టికెట్‌ను పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది. -
గోదాట్లో కాపుల నిమజ్జనం.. నిండా ముంచేసిన చంద్రబాబు
కాపులే మా బలం.. మేమే కాపులకు అసలైనప్రతినిధులం అని చెప్పుకునే జనసేనకు సరైన చోట దెబ్బ పడింది. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో తమదే హవా.. అక్కడ మాకు మాగ్జిమమ్ సీట్లు ఇవ్వాలని .. ఇస్తారని ఆశించిన జనసేనకు వెన్నుపోటు రుచి ఏమిటో తెలిసొచ్చింది. ఆరెండు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తొలివిడత మొత్తం 118 సీట్లలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశానికి 13 సీట్లు.. ఇవ్వగా రెండు స్థానాలు మాత్రం జనసేనకు ఇచ్చారు. అంటే ఇంకా అక్కడ 19 స్థానాలు ఉన్నాయ్.. అందులో జనసేనకు ఎన్ని ఇస్తారన్నది సందేహమే.. మొత్తం 34 స్థానాల్లో తమకు ఇరవై వరకూ సీట్లు ఇస్తారని సైనిక్స్ ఆశించారు.. గోదావరి జిల్లాలను స్వీప్ చేస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా చూస్తే ఇప్పుడిచ్చినవి రెండు సీట్లు పోనూ మిగిలిన 19 స్థానాల్లో మహా ఇస్తే పది ఇస్తారేమో .. అప్పుడు మొత్తం పన్నెండు ఇచ్చినట్లు అవుతుంది.. మరి గోదావరి జిల్లాల్లో జనసేన పెత్తనం .. పెద్దరికం.. ప్రాధాన్యం ఎక్కడుంది... చంద్రబాబు ప్లాన్ ఎలా ఉంటుందంటే ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కున్నట్లు ఉంటుంది. దీంతో జనసైనికులు మాత్రం చంద్రబాబును నమ్ముకుని నిలువుగా గోదావరిలో మునిగిపోయినట్లు అయిందని నిర్వేదంలో ఉన్నారు. గోదావరి రెండు జిల్లాల్లో మాదే హవా.. ప్రజలను, ఓటర్లను మేము శాసిస్తాం... అందుకే పెద్ద మొత్తంలో టిక్కెట్లను ఆశిస్తున్నాం అని చెప్పుకున్న జన సైనిక్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కాపుల మద్దతు మాత్రం కావాలి.. జనసేన ఓట్లు కావాలి కానీ వాళ్లకు టిక్కెట్లు మాత్రం ఎక్కువగా ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ మీద పని చేసిన చంద్రబాబు... సరిగ్గా తాను అనుకున్నట్లే దెబ్బ కొట్టారు.. దీంతో జనసైనికుల నడుం విరిగినంత పని అయింది.. కొన్నాళ్లుగా కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖలు రాస్తూ కాపులకు, జనసేనకు కనీసం యాభై టిక్కెట్లు ఇవ్వకపోతే పొత్తు పొసగదు అంటూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు మత్తులోపడిన పవన్... ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు.. దీంతో చంద్రబాబు తాను అనుకున్న ప్రకారమే గుప్పెడు సీట్లు పవన్ మొహాన పడేసి సింహభాగం తాను ఎత్తుకెళ్లారు. ఇదిలా ఉండగా జనసేనకు ప్రస్తుతం కేటాయించిన 24 సీట్లలో ఐదింటికి అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 19 చోట్ల అభ్యర్థులను తేల్చలేదు. అంటే అక్కడ కూడా చంద్రబాబే కొందర్ని పంపించి పోటీచేసే అవకాశాలు ఉన్నాయ్. ఏది ఏమైనా జనసేనకు టిక్కెట్లు, అభ్యర్థులను సైతం సప్లై చేస్తూ మెల్లగా ఆ పార్టీని నిర్వీర్యం చేసి జనసేనానిని పూర్తిగా పీల్చి పిప్పి చేసేసి వదిలేస్తారు అని సైనిక్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న చంద్రబాబు..లోకేష్.. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ..అయ్యన్నపాత్రుడు వంటి వాళ్లంతా తమ నియోజకవర్గాలను ప్రకటించుకున్నారు. ఈ లిస్టులో వారి పేర్లు ఉన్నాయి కానీ ఆశ్చర్యంగా పవన్ కళ్యాణ్ మాత్రం తన నియోజకవర్గాన్ని సైతం బహిర్గత పరచలేదు..ముందే చెబితే ఓడగొట్టెందుకు సీఎం వైఎస్ జగన్ గట్టి ప్రణాళిక వేస్తారని భయపడ్డారో.. ఇంకేదైనా కారణం ఉందో కానీ పవన్ తన నియోజకవర్గాన్ని సైతం ప్రకటించే సాహసం చేయకపోవడం కాపులను, జనసైనికులను మరింత కలవరపరుస్తోంది.. ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్నా కనీసం తన నియోజకవర్గం పేరును వెల్లడించలేని నాయకుడు ఇక పార్టీని ఎలా నడుపుతాడు అని విమర్శలు వస్తున్నాయి. ::: సిమ్మాదిరప్పన్న -
‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’
సాక్షి, విశాఖపట్నం: తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసులకు గోల్డ్ కవరింగ్ ఇస్తూ.. తాము బలంగా ఉన్నామన్న భ్రమలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఎండాడ వైఎస్ఆర్సీపి కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి మేము ఓట్లు అడుగుతామని చెప్పారు. అదే జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తే బలమని భావిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కేవలం 24 సీట్లు మాత్రమే జనసేనకి ఇచ్చి చంద్రబాబునాయుడు చేతులు దులుపుకొన్నారని, జనం కోరితే తాను ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సీట్లతో ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారని, ఆ పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని అమర్నాథ్ ప్రశ్నించారు. కాపులను హింసించిన బాబును ఎలా నమ్ముతారు? గడచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏఏ మేళ్లను చేసిందో ధైర్యంగా చెప్పి మా పార్టీ అభ్యర్థులు ఓటు అడుగుతారని, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు తాను ఫలానాది చేశానని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అమర్నాథ్ విమర్శించారు. జనసేన టిడిపి విడుదల చేసిన జాబితాను పరిశీలిస్తే కాపుల్ని కమ్మలు... కమ్మ కులస్తులను కాపులు నమ్మడం లేదనేది తేలిపోయిందని అమర్నాథ్ అన్నారు. వంగవీటి మోహన్ రంగా నుంచి ముద్రగడ పద్మనాభం వరకు కాపులను హింసించిన వారిని ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. అది ప్యాకేజీ ఇంజినీరింగ్ జనసేన, టిడిపి ఉమ్మడి జాబితాలో సోషల్ ఇంజనీరింగ్ జరిగిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అక్కడ సోషల్ ఇంజనీరింగ్ కన్నా ప్యాకేజీ ఇంజనీరింగ్ కనిపించిందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయాన్ని స్పష్టత ఇవ్వలేదని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మానికి విరుద్ధంగా రెండు సీట్లను ప్రకటిస్తే, పవన్ కళ్యాణ్ అందుకు ప్రతిగా రెండు సీట్లు ప్రకటించారని, అప్పట్లో పవన్ కళ్యాణ్ తీరును అందరు అభినందించారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 94 సీట్లను ప్రకటించినప్పుడు, పవన్ కళ్యాణ్ కేవలం ఐదు సీట్లతోటి ఎందుకు సరిపెట్టుకున్నారని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. సామాజిక న్యాయం ఎక్కడ? తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించిన తొలి జాబితాను పరిశీలిస్తే, ఈ రెండు పార్టీలు సామాజిక న్యాయాన్ని పాటించ లేదన్న విషయం అర్థమవుతోందని అన్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించారో ఈ రెండు పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని, మరోమారు జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. -
హే..‘కృష్ణా’ .. ఇదేమి తంటా ?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే టీడీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. ఐదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా హఠాత్తుగా దిగిపడుతున్న పారాచూట్ నేతలకు చంద్రబాబు పెద్ద పీట వేస్తుండటం టీడీపీలో తమ్ముళ్లను కకావికలం చేస్తోంది. జనసేన పొత్తుతోపాటు, బీజేపీతో కూడా ఖాయం అనుకుంటున్న పొత్తు టీడీపీ నేతల టికెట్ అవకాశాలను దెబ్బతీస్తోంది. దీంతో సీనియర్ నేతలతోపాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మొండి చెయ్యి మిగలనుందని స్పష్టం అవుతోంది. దీంతో అసలు పార్టీలో ఏమి జరుగుతోందో అన్న స్పష్టత లేక టీడీపీ తమ్ముళ్లు మరింత గందరగోళానికి గురవుతున్నారు. బొండా ఉమాకు సీటు గండం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తనకు పోటీ లేదని భావిస్తున్న బొండా ఉమాకు గడ్డుకాలం మొదలైంది. బీజేపీ పొత్తు రూపంలో ఆయనకు గండం పొంచి ఉంది. దీనికితోడు వంగవీటి రాధా సైతం తనకే సీటు కావాలని పట్టు పడుతుండటంతో విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఎవరన్నది తేలక నేతలు అయోమయంలో పడ్డారు. మరోవైపు పొత్తులో భాగంగా సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయిస్తే బొండా టికెట్ గల్లంతు కావడం ఖాయం. తిరువూరు తెరపైకి రోజుకో అభ్యర్థి... తిరువూరు నియోజకవర్గంలో రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే అక్కడ టీడీపీ ఇన్చార్జిగా శావల దేవదత్తు ఉన్నారు. ఆయనను కాదని కొలికిపూడి శ్రీనివాస్ తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ మరికొందరు నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో తమదే టికెట్ అని చేసుకొంటున్న ప్రచారం అక్కడ తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి కూడా టీడీపీ తరఫున టికెట్ రేసులోకి వచ్చారు. తీరా ఎన్నికల సమయానికి ఇక్కడికి పారాచూట్ నేతలను తీసుకొస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో నైరాశ్యం నెలకొంది. జగ్గయ్యపేట అభ్యర్థి నేనే‘నయా’ ఇప్పటికే చంద్రబాబు జగ్గయ్యపేట నియోజకవర్గం పర్యటనలో పార్టీ అభ్యర్థిగా శ్రీరాం తాతయ్యను ప్రకటించారు. కానీ అక్కడ మాజీ మంత్రి నెట్టెం రఘురాం చాపకింద నీరులా టికెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది చాలదన్నట్లు మరో టీడీపీ నాయకుడు బొల్లా రామకృష్ణ పేరుతో ‘గెలిస్తే న్యాయం చేస్తా, ఓడినా సాయం చేస్తా, మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా’ అంటూ జగ్గయ్యపేటలో వెలిసిన ఫ్లెక్సీలు అక్కడ టికెట్‌పై కొత్త చర్చకు దారితీసేలా చేశాయి. చంద్రబాబు ఇప్పటికే ఇన్చార్జిలుగా ప్రకటించిన అభ్యర్థుల్లో సైతం తమకు బీ ఫాం ఇచ్చే వరకు టికెట్ అనుమానమే అన్న భావనను పలువురు వ్యక్తంచేస్తున్నారు. ఇది క్యాడర్లో తీవ్ర గందరగోళం రేపుతోంది. సీట్లు తన్నుకు పోతున్న పారాచూట్లు... ఇప్పటికే నూజివీడులో కొలుసు పార్థసారథి, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడలో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పారాచూట్లుగా వచ్చి టికెట్లు తన్నుకుపోయారు. మరోవైపు ఇతర నియోజకవర్గాల్లో కూడా పారాచూట్లకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుండటంతో పారీ్టకోసం పనిచేసిన నేతలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మైలవరంలో తెరపైకి కేశినేని చిన్ని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి మైలవరం అభ్యర్థిగా పోటీ చేద్దామనుకుంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీతో పొత్తు ఆయన సీటుకు ఎసరు పెట్టనుంది. ఎంపీ సీటుపై బీజేపీ కర్చిప్ వేసింది. ఈ నేపథ్యంలో చిన్నికి ఎక్కడైనా టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన్ను మైలవరం నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. అదే జరిగితే మైలవరంపై ఆశలు పెట్టుకున్న వసంతకు ఆశాభంగమే. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి పెనమలూరు టికెట్ ఇస్తామని చెబుతున్నారు. కానీ అక్కడ బోడే ప్రసాద్ వర్గం అందుకు ససేమిరా అంటోంది. మరోవైపు దేవినేని ఉమా పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. ఇప్పటికే మైలవరంలో టికెట్ ఆయనకు లేదని తేలిపోవడంతో పెనమలూరుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అక్కడ బోడే వర్గంతోపాటు, వసంత పోటీకి రావడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. కుప్పంలో ఎదురుగాలి వీస్తుండటంతో చంద్రబాబు మరో నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన కన్ను పెనమలూరుపై పడిందని సమాచారం. అదే జరిగితే బోడే ప్రసాద్, వసంత, దేవినేని ఉమా ముగ్గురి సీట్లు గల్లంతయినట్టే. -
జనసేన అంటే త్యాగరాజులే..!
తనకు అచ్చొస్తుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్న గోదావరి జిల్లాల్లో జనసేనకు పొత్తు పార్టీ తెలుగుదేశంతో సెగ తగులుతోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తే.. దానికి విరుద్ధమైన పరిస్థితులనుటీడీపీ నేతలు సృష్టిస్తున్నారు. తణుకు.. ఎవరికి వణుకు? పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనతో జనసేన- టీడీపీ రాజకీయం ముదిరి పాకాన పడినట్టయింది. తణుకు అసెంబ్లీ సీటుపై పవన్ కళ్యాణ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. తణుకు జనసేన అభ్యర్ధిగా విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని వారాహియాత్రలో కూడా ప్రకటించాడు పవన్ కల్యాణ్. కానీ ఇక్కడ తెలుగుదేశం కర్చీఫ్ వేస్తున్నట్టు ప్రకటించడం జనసేన క్యాడర్‌కు మింగుడు పడడం లేదు. తణుకులో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదని, ఓడిపోయే సీటు కోసం పోటీ ఎందుకు పడుతున్నారని జనసైనికులు వాదిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం నుంచి తణుకు టికెట్‌ను టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆశిస్తున్నారు. పైకి టీడీపీ, జనసేనకు పొత్తులు ఉన్నా.. విడివాడ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇద్దరూ టికెట్టు నాదంటే నాదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నరసాపురం.. ఎవరి పరం? పొత్తులో భాగంగా నరసాపురం టికెట్ జనసేనకు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడుని పార్టీలోకి తీసుకోవాలన్నది పవన్ ప్లాన్. గత వారం రోజులుగా సుబ్బరాయుడుతో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో పవన్ సమక్షంలో కొత్తపల్లి సుబ్బరాయుడు చేరతాడంటూ జనసేన నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే నరసాపురంలో తామే పోటీ చేస్తామని టీడీపీ నేతలు ఖరారుగా చెబుతున్నారు. పైకి పొత్తులు.. లోన కత్తులు ఇప్పటికే తూర్పుగోదావరిలో పర్యటన సందర్భంగా పవన్ కళ్యాన్ చేసిన హడావిడి రెండు పార్టీల మధ్య భగ్గుమనేలా చేసింది. రాజమండ్రి రూరల్, రాజానగరంలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన టీడీపీ సీనియర్లకు మంట పుట్టిస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరీ లాంటి సీనియర్‌ను పట్టించుకోకుండా.. పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటనలు ఎలా చేస్తారంటూ టీడీపీ సీనియర్లు మండిపడుతున్నారు. పవన్‌తో పొత్తు వల్ల టీడీపీకి వచ్చే లాభమేమీ లేకపోగా.. కీలక స్థానాల్లో అభ్యర్థులను పెట్టడం వల్ల అసలుకే మోసం వస్తుందంటున్నారు. పైగా తనవల్లే బీజేపీ ఒప్పుకుంటుందని పవన్ ప్రకటనలు చేయడం టీడీపీ స్థాయిని తగ్గించడమేనని, పవన్ పక్కన ఉండగానే జనసేన నాయకులు మూడో వంతు సీట్లలో అంటే 58 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం సరికాదని తప్పుబడుతున్నారు. అయినను హస్తినకు..! భీమవరం టూర్ తర్వాత ఢిల్లీకి పవన్ కల్యాణ్ వెళతాడని జనసేన నాయకులు చెబుతున్నారు. అక్కడి నుంచి పిలుపేమీ లేకున్నా.. ఓ సారి అటెండెన్స్ వేసుకురావాలన్న తొందర పవన్‌లో కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా... బీజేపీ ఇంకా పొత్తులకు సంబంధించి ఏమీ చెప్పకపోవడం.. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబుకు తేలు కుట్టిన దొంగలా కిమ్మనకుండా ఉండడం పవన్‌ను చిర్రెత్తిస్తున్నాయి. ఈనెల 25లోపు ఏదో ఒక రోజు ఢిల్లీ వెళ్లి అపాయింట్మెంట్ ఇచ్చే పెద్దలను కలిసి రావాలన్నది పవన్ ఆలోచనలా కనిపిస్తోంది. ఇప్పటికే తాను వస్తానని రెండు సార్లు సమాచారం పంపినా.. నేషనల్ కౌన్సిల్ సమావేశాల వరకు ఆగుమని బీజేపీ నేతలు చెప్పినట్టు సమాచారం. ముందు క్షేత్ర స్థాయిలో బాగా ప్రచారం చేసుకోవాలని, తర్వాత పొత్తుల గురించి మాట్లాడుదామని బీజేపీ నేతలు సూచించినట్టు సమాచారం. అగ్రనేతలు కలుస్తారా? పవన్ ఢిల్లీకి వెళ్తే.. ప్రధాని మోదీ, అమిత్ షాలను పవన్ కల్యాణ్ కలుస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు. అక్కడ మాత్రం అంత సీను లేదని, సార్వత్రిక ఎన్నికలతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా చాలా బిజీగా ఉన్నారని, అసలు ఏపీపై వారిద్దరి దృష్టి అంతగా లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి అపాయింట్మెంట్ దొరక్కపోతే ఏంటన్న ఆందోళన కూడా జనసేన నేతల్లో కనిపిస్తోంది. ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు అన్నట్టు.. పార్టీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ త్యాగాల గురించి చెబుతున్నారట. ఢిల్లీ పర్యటన తర్వాత టీడీపీ అధిష్టానంతో కలిసి టికెట్లు ప్రకటిస్తామని, టికెట్లు రాని వారు త్యాగాలకు సిద్ధపడాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేస్తున్నారట. ముక్తాయింపుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. జనసేనలో చేరే వాళ్లందరూ త్యాగరాజులేనని పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రచారంలో ఉంది. -
పార్థసారథికి టికెటిస్తే ఓడిస్తాం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. తాజా పరిణామాలు ఆ పార్టీ ఆశావహ అభ్యర్థి పార్థసారథికి గట్టి షాక్ ఇస్తున్నాయి. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ ఇప్పటికే పార్టీ కి రాజీనామా చేయగా.. రెండు రోజుల్లో టికెట్ విషయం తేల్చకపోతే తన దారి తాను చూసుకుంటానని ముద్దరబోయిన అల్టిమేటం ఇచ్చారు. స్థానికేతరుడికి టికెటిస్తే ఓడించి తీరతామని అల్టిమేటం జారీచేశారు. టీడీపీ కేడర్‌తో శనివారం జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్థసారథికి టీడీపీ కేడర్ ఝలక్ పార్థసారథి టీడీపీలో చేరడం ఇప్పటికే ఖరారైంది. చంద్రబాబు చింతలపూడిలో నిర్వహించిన సభకు పార్థసారథి వాహనాలు ఏర్పాటు చేసి జనాలను తరలించారు. దీంతో పాటు నియోజకవర్గంలోనూ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజులుగా టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో పార్టీ కేడర్‌కు ఫోన్లు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం గోగులంపాడులో టీడీపీ మండల నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్థసారథి పాల్గొన్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గ నాయకులు మినహా మిగిలినవారు ఎవరూ హాజరుకాలేదు. నూజివీడు టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ టికెట్ పోరాటంలో అలసిపోయి పార్టీ కి రాజీనామా చేశారు. టికెట్ కోసం ముద్దరబోయినపై కాపా గట్టి పోరాటం చేశారు. పోటీ కార్యక్రమాలు, పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఇన్చార్జిపై ఫిర్యాదు కూడా చేశారు. చివరకు పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. మూటలతో వస్తే మద్దతివ్వం: ముద్దరబోయిన శనివారం సాయంత్రం ముద్దరబోయిన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి జనసేన నేతలను కూడా ఆహ్వానించగా వారు సభకు దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడిని కలిస్తే మీకు సర్వేలన్నీ బాగున్నా.. టికెట్ సర్దుబా టు చేయలేకపోతున్నామని తనకు చెప్పారని కేడర్ ముందు ఆయన వాపోయారు. పదేళ్ల నుంచి ఓడిపోతున్నా పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తుంటే ఇప్పుడు టికెట్ లేదనడం కరెక్ట్ కాదని, రెండు మూడు రోజుల్లో టికెట్ విషయం తేల్చి చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తన దారి తాను చూసుకుంటానని అధిష్టానానికి ముద్దరబోయిన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్థసారథి వస్తే ఓడించి తీరుతామని, పార్టీ కోసం పనిచేసేవారికి కాకుండా మూటలతో వచ్చిన వారిని సమరి్ధంచమని సమావేశంలో బహిరంగంగానే ప్రకటనలు చేశారు. -
బ్రో’... డైలాగ్ మారింది
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన అంశం.. ప్రత్యేక హోదా విషయం.. పార్టీ లతో పొత్తుల వ్యవహారం.. ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మాటలు మార్చుతూ రాజకీయాల్లో ‘యూ టర్న్’ నాయకుడిగా చంద్రబాబు ఎక్కువ ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు అచ్చు గుద్దినట్టు చంద్రబాబు మాదిరే రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్ రికార్డుల మోత మోగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు అన్ని అంశాలలోనూ ఎప్పటికప్పుడు మాట మార్చుతూ తాను ‘నయా యూ టర్న్’ నేతనని నిరూపించుకుంటున్నారు. నలభై ఏళ్ల అనుభవంలో చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటే.. పార్టీ పెట్టి ఆరీ తీరీ పదేళ్లు కాకుండానే అన్ని పార్టీలతో పవన్ పొత్తులు పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు ఏ విషయంపై ఏం మాట్లాడుతారోనని రాజకీయ విశ్లేషకులే నిర్ఘాంతపోతున్నారు. గాలి వాటంగా వ్యవహరించే ఆయన ఎప్పుడు ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటారో కూడా ఎవరికీ అంతుపట్టడం లేదంటున్నారు. పవన్ కేవలం ఒక్క వలంటీర్లకు సంబంధించిన అంశంలోనే కాదు.. అనేక సందర్భాల్లో అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట మార్చుతూ తనకు చాలా నాలుకలున్నాయని రుజువు చేస్తున్నారు. అమరావతి రాజధాని, కాపు రిజర్వేషన్ల అంశంతోపాటు అనేక కీలక అంశాలన్నింటిలోనూ జనసేనాని రాజకీయ వైఖరి పూర్తి యూ టర్న్ అన్న రీతినే సాగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పుడు పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబుపై 2014లో ఒకలా, 2019లో మరోలా, ఇప్పుడు ఇంకోలా మాట్లాడారు. తన కుటుంబాన్ని, తన తల్లిని కించపరిచేలా మాట్లాడిన టీడీపీ నేతల సంగతి చెబుతానన్న పవన్.. ఇప్పుడు వారితోనే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. పవన్ నాలుక మడత ఇలా.. ‘రాష్ట్రంలో మహిళల ఆదృశ్యాలకు వలంటీర్లే కారణం. వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి గ్రామంలో వలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఆ సమచారాన్ని కొంత మంది విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్లు కిడ్నాప్, ట్రాప్ చేస్తున్నారు. దీంతో మహిళలు ఆదృశ్యమవుతున్నారు. నాతో సాక్షాత్తూ కేంద్ర నిఘా వర్గాలే ఈ మాటలు చెప్పాయి.’ – 2023 జులై 10వ తేదీన పవన్ ‘ఈ వలంటీర్ వ్యవస్థపై జనసేన కోర్టులో ఛాలెంజ్ చేస్తోంది. మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఛాలెంజ్ చేయాలి జగన్.. నీ ఇష్టం. సై అంటే సై.. తేల్చుకుందాం. దేనికైనా రెడీ. వలంటీరు అనే సమాంతర వ్యవస్థపై నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పకుండా, విచారణకు సిద్ధంగా ఉండాలని ప్రత్యేక జీవో ఇచ్చావ్. జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా సిద్ధం. అరెస్టు చేసుకోండి. చిత్రహింసలు పెట్టుకోండి. తప్పు జరిగితే కచ్చితంగా ఎత్తిచూపుతామని సవాల్ విసురుతున్నా’. – 2023 జులై 20న మరోసారి పవన్ ‘ఆడపిల్లలు వైఎస్సార్సీపీ వలంటీర్ల వల్లే ఆదృశ్యమై పోయారని నేను అన్నానట.. ముఖ్యమంత్రి అంటున్నారు.. దానికి వివరణ ఇస్తున్నా. నేను చెప్పింది మీ వలంటీర్లు సమాచారం సేకరించడం వల్ల, ఆ డేటా ఎటెటో వెళ్లి పోయిందని చెప్పాను. అంతే తప్ప, ఏ రోజూ వలంటీర్లే అంతా చేశారని నేను అనలేదు. వాళ్ల మీద గౌరవం ఉంది. వలంటీర్ల వ్యవస్థను నేను తప్పు పట్టలేదు. వలంటీర్లుగా పని చేస్తున్న వారి భవిష్యత్ కోసం మేమందరం సంపూర్ణంగా పని చేస్తాం’ – 2024 ఫిబ్రవరి 15 తేదీన తాజాగా పవన్ పలుకులు పవన్ నోట ఇంకా ఇలా.. ♦ 2014 తర్వాత మందడంలో చంద్రబాబుతో కలిసి సంకాంత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ ‘అమరావతే ఆంధ్రప్రదశ్ రాజధాని. మన (టీడీపీ–జనసేన) ప్రభుత్వంలో ఇదే ప్రాంతంలో బంగారు రాజధానిని నిర్మించుకుందాం’ ♦ ‘అమరావతి ఇన్‌క్లూజివ్ క్యాపిటల్ కాదు. కేవలం కొద్ది మంది కోసమే. అది టీడీపీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్‌లా ఉంది. ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి ఏమీలేని ఈ క్యాపిటల్‌కు రావాలంటే ఎంత ఇబ్బంది పడతారు? వాళ్లు ఇక్కడకు వచ్చి ఎలా స్థిరపడతారు?’ అని గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2018లో వ్యాఖ్యానించారు. ♦ 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చామా.. అని బాధపడుతున్నా. యువతకు ఉపాధి, ఆడపడుచులకు రక్షణ ఉంటుందని ఆశిస్తే అవేవీ టీడీపీ పాలనలో లేవు. ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులు చేయడంలోనే అభివృద్ధి చూపించారు. ♦ 2018 అక్టోబర్ 2న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సభలో ‘నాలుగేళ్లు రాష్ట్రానికి ఏం చేశారని మిమ్మల్ని మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి చంద్రబాబూ? మీరు చేసిన అద్భుతాలు ఇక చాలు. ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. ఉన్నవాటిని కూడా మూసేస్తున్నా పట్టించుకోవడం లేదు. మీ పాలన మాకొద్దని ప్రజలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు.’ ♦ ‘దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాలవల్ల 2019లో టీడీపీకి మద్దతు ఇవ్వలేకపోయా. అందుకే ఇప్పుడు మద్దతు ఇస్తున్నా’ అని గత డిసెంబరు 20వ తేడీన లోకేష్ యువగళం ముగింపు యాత్రలో వ్యాఖ్యానించారు. -
‘పొత్తు’లాటతో అంతర్యుద్ధం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకూ నైరాశ్యం పెరిగిపోతోంది. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై అందరిలోనూ సందేహం వ్యక్తమవుతోంది. పొత్తులపైనా నిర్దిష్ట నిర్ణయం జరగక దిగువ స్థాయి కేడర్ సతమతమవుతోంది. టికెట్‌పై స్పష్టత కొరవడడంతో సీనియర్లలోనూ నిరాసక్తత పెరిగిపోతోంది. అసలు ఎన్నికలు సమీపిస్తున్నా అభ్యర్థులెవరన్నది తేలకపోవడంతో ఎక్కడా ఆ హడావుడి మాత్రం కనిపించడం లేదు. ఓ వైపు అధికార పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంటే తమ పార్టీ అధినేత మీనమేషాలు లెక్కించడం కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. మరోవైపు ప్రతి చోటా పొత్తు ధర్మం పేరుతో మిత్రపక్షమైన జనసేన అభ్యర్థుల హడావుడి వారిని తీవ్రంగా కలచివేస్తోంది. ఇప్పటికే జనంలోకి వైఎస్సార్సీపీ దూసుకుపోతూ... ప్రజల్లో విశ్వాసం కూడగడుతుంటే తాము మాత్రం ఏం చేశామో... భవిష్యత్తులో ఏం చేస్తామో... చెప్పుకోలేక... డీలాపడిపోతోంది. దీనికి తోడు అప్పుడప్పుడు పెదబాబు... ఇటీవల చినబాబు చేసిన పర్యటనలకు ఖర్చులు పెట్టలేక టికెట్లు ఆశిస్తున్న నాయకులు చేతులెత్తేస్తున్నారు. తీరా ఏర్పాటుచేసిన సభల్లో వారి ప్రసంగాలు ఆకట్టుకోలేకపోవడం... సభలు వెలవెలబోవడంతో ఎక్కువమంది పార్టీ వీడే యోచనలో ఉన్నారు. – సాక్షి నెట్వర్క్ బత్తులకు ఉత్తచెయ్యేనా... తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం టీడీపీలో అభ్యర్థిత్వాల వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. ఈ స్థానంలో తమ పార్టీ పోటీచేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఇప్పటివరకూ తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్న ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణకు తాజాగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రూపంలో షాక్ తగిలేలా ఉంది. ఆయనకు కాకుండా జనసేనకు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లడంతో పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విభేదాలు బట్టబయలు శ్రీసత్యసాయి జిల్లాలో ఏ నియోజకవర్గం పరిశీలించినా.. వేరు కుంపట్లు కనిపిస్తున్నాయి. దీనిపై విసిగెత్తిపోతున్న కేడర్ టీడీపీకి టాటా చెబుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో టీడీపీ ఖాళీ అయ్యింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆ జిల్లాలో జరిపిన పర్యటనల్లో పార్టీ నాయకుల మధ్య గొడవలు వెలుగు చూడటం గమనార్హం. పెనుకొండలో నియోజకవర్గ ఇన్చార్జ్ బి.కె.పార్థసారథి కంటే సవితమ్మ ఎక్కువ హడావుడి చేశారు. మడకశిరలో దళితులను వెనక్కి నెట్టి.. గుండుమల తిప్పేస్వామి అన్నీ తానై వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. రాప్తాడులో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత హడావుడి చూసి శ్రీరామ్ ధర్మవరం వైపు ఎందుకొస్తున్నారంటూ చాలా మంది టీడీపీ వీడుతున్నారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం ఏకంగా ఎన్నికల ప్రచారమే చేస్తోంది. వియ్యంకుల్లో ఒకరికేనట! పల్నాడు జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులు జి.వి.ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ల టికెట్ల కేటాయింపునకు బంధుత్వం అడ్డుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వియ్యంకులైన ఈ ఇద్దరిలో జీవీ వినుకొండ, కొమ్మాలపాటి పెదకూరపాడు టికెట్లు ఆశిస్తున్నారు. ఇదే కోరికతో వారు చంద్రబాబును ఇటీవల కలిశారట. అప్పుడు ఆయన ఒక్కరికే సీటు ఇవ్వగలనని, ఆ ఒక్కరూ ఎవరో మీరే తేల్చుకోండని వారిపైనే ఆ భారం నెట్టేసి చేతులు దులుపుకున్నారట. పరోక్షంగా పెదకూరపాడులో డబ్బు దండిగా పెట్టగల భాష్యం ప్రవీణ్‌కు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన చెప్పడంతో శ్రీధర్ తన వర్గీయులతో శుక్రవారం గుంటూరు నగరంలోని ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి తనకు అండగా నిలవాలని కోరారు. మిత్రత్వంలో శతృత్వం ఏలూరులో టీడీపీ, జనసేన మధ్య టిక్కెట్ ఫైట్ తీవ్రంగా ఉంది. జనసేనకు టిక్కెట్ ఇస్తే కాపుకాసేది లేదని టీడీపీ నేతలు చెబుతుంటే... టీడీపీ అభ్యర్థి టిక్కెట్ దక్కించుకుంటే తాము సహకరించబోమని, పోటీలో కచ్చితంగా ఉంటామని జనసేన నేతలు బహిరంగంగా చెబుతున్నారు. పొత్తుల్లో ఈ స్థానం టీడీపీకి ఖరారైందని ఆ పార్టీ ఇన్చార్జి బడేటి చంటి ప్రచారం చేసుకుని ఏకంగా హోర్డింగులతో హడావుడి చేశారు. దీనికి కౌంటర్‌గా జనసేన నాయకులు ‘మేము రెడీ.. టిక్కెట్ మాదే..’ అంటూ ఫ్లెక్సీలతో హంగామా చేశారు. అంతేనా... ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడే అంటూ అతను నిర్వహించిన ఆతీ్మయ సమావేశంలో జిల్లా జనసేన నేతలే ప్రకటించారు. ఇదిలా కొనసాగుతుండగా జనసేనలో అకస్మాత్తుగా తెరపైకి మరో కొత్త నేత వచ్చి తనకే టికెట్ అంటూ నగరమంతా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరో గందరగోళానికి దారితీశారు. అనంతపురంలో అంతర్గత పోరు అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్ చౌదరికి అసమ్మతి బెడద ఎక్కువైంది. ఆయన మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ పవన్‌కల్యాణ్ పోటీచేస్తే తాను తప్పుకుని ఆయన గెలుపునకు పాటుపడతానని ప్రభాకర్ చెబుతుండగా ‘త్యాగం చెయ్యడానికి, గెలిపించడానికి నువ్వెవరు? ఇదేమైనా నీ తాత, తండ్రుల సొత్తు కాదు కదా!’ అని తెలుగుదేశం పార్టీలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మునిరత్నం మీడియా ముఖంగా ధ్వజమెత్తారు. ‘తమ్ముళ్ల’ హడావుడితో జనసైనికుల ఆగ్రహం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీట్ల పంపకం తేలకున్నా... మిత్రపక్షాన్ని సంప్రదించకుండా టీడీపీ ఇన్చార్జులు, పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు ప్రచారం ప్రారంభించడంపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పొత్తులో భాగంగా ఈ జిల్లా నుంచి తమకు అధిక సీట్లు కావాలని జనసేన కేడర్ పట్టుబడుతోంది. కానీ దానిని పట్టించుకోకుండా అమలాపురం టీడీపీ ఇన్చార్జి ఆనందరావు ఏకంగా ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావును గెలిపించాల్సిందిగా చంద్రబాబు మండపేట సభలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజోలు నుంచి తాము పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. మిగిలిన ఐదు స్థానాల పరిస్థితి తేలాల్సి ఉంది. కొత్తపేట, ముమ్మిడివరంలో టీడీపీ ఇన్చార్జిలు బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) తామే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. యర్రగొండపాలెంలో డిష్యుం..డిష్యుం యర్రగొండపాలెంలో టీడీపీపై అసమ్మతి బుసలు కొడుతోంది. డాక్టర్ మన్నె రవీంద్ర కారణంగా ఇక్కడ తెలుగు దేశం పార్టీ గెలవడం లేదని నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు వర్గం చెబుతుండగా ఆయన గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయనకు టికెట్ఇస్తే సహకరించేది లేదని, అవసరమైతే రాజీనామాకు కూడా వెనకాడబోమని డాక్టర్ రవీంద్ర వర్గం కరాఖండీగా చెబుతోంది. -
పొత్తు.. టీడీపీ సీనియర్లు చిత్తు
సాక్షి, అమరావతి : ప్రజల్లో ఆదరణ కోల్పోయినా, పొత్తుల ద్వారా గట్టెక్కుదామనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అవి కూడా శరాఘాతాల్లా మారాయి. పొత్తులో భారీగా సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో చాలా మంది సీనియర్ల మెడపై కత్తులు వేలాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 67 పేర్లతో జాబితాను చంద్రబాబుకు ఇచ్చారు. వాటిలో కనీసం 50కి పైగా సీట్లు తమకు కేటాయించాలని కోరుతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడంతో ఆ పార్టీకి ఆరు ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పొత్తులు ఖరారైతే బీజేపీ, జనసేనకు 75 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలు వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది సీనియర్ల సీట్లు గల్లంతవుతున్నాయి. పొత్తులతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సీనియర్ నేతలు లబోదిబోమంటున్నారు. అన్ని సీట్లు వదులుకుంటే పార్టీ అధికారంలోకి రావడం అటుంచి అసలు విలువే లేకుండా పోతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అయినా పొత్తులు లేకపోతే దిగజారిపోయిన పార్టీ మనుగడే కష్టమైపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. తద్వారా పార్టీని రేసులోనైనా నిలపవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల అనేక మంది సీనియర్ నాయకుల రాజకీయ జీవితాలకు ముగింపు తప్పదని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర కకావికలం ఈ పొత్తులు ఖరారైతే ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గౌతు శిరీష, బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జి, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద్, పల్లా శ్రీనివాసరావు తదితర నేతల పేర్లు గల్లంతవనున్నాయి. ఎచ్చెర్లపై ఎన్నో అశలు పెట్టుకున్న కళా వెంకట్రావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. విశాఖలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సీటు ఎగిరిపోనుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అశోక్‌గజపతిరాజు వంటి సీనియర్ తన కుమార్తెకు సీటు ఇప్పించుకోలేక సతమతమవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలకు తప్పని పొత్తు పోట్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కీలకమైన సీనియర్లకు పొత్తు పోట్లు తప్పేలా లేవు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, బొండా ఉమామహేశ్వరరావులను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడనుంది. అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెనాలిలో ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు వంటి నేతలకు షాక్ తగలనుంది. ఆలపాటి రాజా ఇప్పటికే తన సీటు పోతే ఒప్పుకునేది లేదని అనుచరులను ముందుపెట్టి హడావుడి చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్, భూమా అఖిలప్రియకు టాటా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పలువురు కీలక నాయకులు పొత్తుతో రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, నగరిలో గాలి భానుప్రకాష్, తిరుపతిలో సుగుణమ్మ, శ్రీకాళహస్తిలో బొజ్జల సుదీర్‌రెడ్డి, రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు, జమ్మలమడుగులో భూపే‹Ùరెడ్డి వంటి నేతలు పోటీ నుంచి తప్పుకోక తప్పదంటున్నారు. పొత్తులో బీజేపీ విశాఖ, విజయవాడ, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి గత ఎన్నికల్లో లోకేశ్ తోడల్లుడు భరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఆ సీటు బీజేపీకి పోతే ఆయన భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. విజయవాడ సీటును సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో అక్కడి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో కేశినేని చిన్నికి సీటు పోయినట్లేనని భావిస్తున్నారు. జనసేన కోరుతున్న నియోజకవర్గాలు ♦ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస ♦ ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల. ♦ ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక. ♦ ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం. ♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట. ♦ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు. ♦ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు : దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం. గోదావరి జిల్లాల్లో సీనియర్ల సీట్లు గల్లంతే గోదావరి జిల్లాల్లోనూ చాలా మంది ముఖ్య నాయకుల మెడపై కత్తి వేలాడుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోట సీతారామలక్ష్మి, కేఎస్ జవహర్, ఎస్వీఎస్ వర్మ వంటి వారు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. బుచ్చయ్యచౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబట్టి తన సీటు ఉంటుందని చెప్పుకుంటున్నా దానికి గ్యారంటీ లేదు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సీటు ఇప్పటికే ఎగిరి పోయింది. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం సీటును నిరాకరిస్తుండడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం సీటు జనసేనకు పోతుండడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఇప్పటికే తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. వీరు కాకుండా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ పిల్లి అనంతక్ష్మి, ఐతాబత్తుల ఆనందరావు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు వంటి నేతలకు టికెట్లు గల్లంతవనున్నాయి. -
భీమిలీ కోసం జనసేన టీడీపీల మధ్య బిగ్ ఫైట్...!
విశాఖపట్నం: భీమిలిలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య మూడు ముక్కలాటకు తెరలేచింది. భీమిలి టికెట్ తమకంటే తమకని టీడీపీ నుంచి ఇన్చార్జి కోరాడ రాజబాబు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన ఇన్చార్జి పంచకర్ల సందీప్ ప్రకటించుకుని.. పార్టీల క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నారు. భీమిలిలో పోటీపై చంద్రబాబు, పవన్‌లు ఏకాభిప్రాయానికి వచ్చినా.. తగ్గేదేలేదని ఇక్కడి ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేస్తున్న పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎవరికివారు యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కోరాడ, గంటా, పంచకర్ల వర్గాలు నిర్వహించే కార్యక్రమాలకు మరొక వర్గం గానీ, పార్టీల నాయకులు గానీ హాజరుకావడం లేదు. 2019 ఎన్నికల సమయంలో భీమిలి నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వలస వెళ్లిపోయిన గంటా శ్రీనివాసరావు నాలుగున్నరేళ్లుగా ఇక్కడి కార్యకర్తలు, నాయకుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాగే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినా కలవడానికి వెళ్లలేదు. ఈ నెల 10న విశాఖ వచ్చిన లోకేష్‌ను కూడా గంటా కలవకపోవడం విస్మయపరుస్తోంది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సబ్బం హరి మరణంతో ఇక్కడ పార్టీ దాదాపు దిక్కులేనిది అయిపోయింది. దీంతో చాలా వరకు వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. టీడీపీలో మిగిలిన వారు సైతం రెండుగా విడిపోయి కోరాడ, గంటా వర్గీయులుగా చలామణి అవుతున్నారు. పార్టీ కష్టకాలంలో దూరంగా వెళ్లిపోయిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వస్తారని కోరాడ వర్గీయులు అంటున్నారు. చంద్రబాబు, లోకేష్‌లు గంటాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని కోరాడకే టికెట్టు ఇవ్వనున్నట్టు అతని వర్గీయులు అంటున్నారు. ఇటీవల ఆ పార్టీ చేసిన సర్వేలో కూడా కోరాడ పేరు ఒక్కటే ఉందంటున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 15 లోగా గంటాకు పార్టీ అధినాయకత్వం భీమిలి టికెట్టు కేటాయిస్తుందని అతని వర్గం ఇటీవల భోగాపురం సమీపంలోని సవరవిల్లి వద్ద సమావేశంలో ప్రకటించింది. ఆటలో అరటి పండు 2019 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో నాలుగో వంతు ఇక్కడ జనసేన అభ్యర్థికి వచ్చాయి. ఇటీవల సేన తరఫున సందీప్ పాదయాత్ర పేరుతో వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాలకు పొత్తు కుదరలేదనేది స్పష్టమయింది. ఏ ఒక్క టీడీపీ కార్యకర్త, నాయకుడు సేన వెంట వెళ్లేందుకు ఇష్టపడలేదు. సందీప్ పోటీకి డబ్బులు సిద్ధం చేసుకున్నారని, ఈ నెల 14న సందీప్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తారని సేన కార్యకర్తలు చేస్తున్న వ్యాఖ్యలను.. టీడీపీ వర్గీయులు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. భీమిలిలో నూకాలమ్మ జాతరకు ముందే జరుగుతున్న ఈ పొలిటికల్ మూడు ముక్కలాటను ఇక్కడి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. -
మీరెలా చెబితే అలా..!
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో సుపరిపాలన అందిస్తూ పూర్తిస్థాయిలో ప్రజాదరణ పొందిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే పుట్ట గతులుండవని తేలిపోవడంతో ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ బలమూ సరిపోకపోవడంతో బీజేపీ కాళ్లపై పడ్డారు. బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చారు. బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఎలాగైనా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్న భావనతో సీట్ల సర్దుబాటులో వారెలా చెబితే అలా చేస్తానని చెప్పారు. రాత్రి ఏడున్నర గంటలకే ఈ భేటీ ఉంటుందని ప్రచారం జరిగినా, రాత్రి 11.30 గంటలకు అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు, బీజేపీకి అందించే సహకారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తనకు పూర్తి సహకారం అందిస్తే బీజేపీ ఎలా చెబితే అలా నడుచుకుంటానని బాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ బలంగా ఉన్న చోట సైతం త్యాగాలు చేసేందుకు సిధ్దపడతాననే హామీ ఇ చ్చి నట్లుగా చెబుతున్నారు. హోటల్లో రహస్య భేటీ కాగా ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు నేరుగా పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్తారని అందరూ భావించారు. అయితే, బాబు అక్కడికి కాకుండా లీ మెరిడియన్ హోటల్‌కు వెళ్లారు. ఆయన వెంట ఉన్న ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రఘురామకృష్ణంరాజు, ఇతర నేతలు హోటల్ లాబీల్లోనే ఉండిపోయారు. బాబు ఒక్కరే హోటల్లోకి వెళ్లారు. గంటన్నర తర్వాత బయటకు వచ్చారు. చంద్రబాబు హోట్ల్లో ఎవరితో అంత రహస్యంగా భేటీ అయ్యారో టీడీపీ ఎంపీలు, ఇతర నేతలకు కూడా తెలియలేదు. హోటల్ నుంచి గల్లా ఇంటికి వెళ్లారు. అక్కడ బాబుతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీ అయ్యారు. ముందే రాయబారం నడిపిన సీఎం రమేశ్, కంభంపాటి కాగా అమిత్‌షాతో చంద్రబాబు భేటీ, పొత్తులపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్రావు ముందుగానే రాయబారం నడిపారు. వారు మంగళవారమే అమిత్‌షాను ప్రత్యేకంగా కలిశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే లాభించే అంశాలపై వివరణ ఇచ్చారు. పొత్తు కుదిరిన పక్షంలో ఎలాంటి షరతులకైనా బాబు సిధ్దంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. దీంతో బాబుతో భేటీకి బీజేపీ అగ్రనేతలు అంగీకరించినట్లు సమాచారం. పొత్తులతో ప్రయోజనం ఏమిటి? ఈ చర్చల్లో పొత్తుతో బీజేపీకి లాభించే అంశాలు, ఓట్ల బదిలీ అవకాశాలు, జనసేన పార్టీ బలాబలాలు వంటి అంశాలపై బీజేపీ పెద్దలు ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని తమ నివేదికలు చెబుతున్నాయని, ఈ నేపథ్యంలో పొత్తులతో ఒనగూరే ప్రయోజనాలు ఏమిటన్న ప్రశ్నలనే నేతలు లేవనెత్తినట్లు సమాచారం. కచ్చితంగా పొత్తు అవసరమైతే బీజేపీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు, 25 వరకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని, అప్పుడే ఇరు పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటుందని అమిత్‌షా, నడ్డా స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే బీజేపీకి ఆ స్థాయిలో అభ్యర్థులు లేరని, 10 నుంచి 15 స్థానాల వరకైతే అభ్యంతరం ఉండబోదని బాబు చెప్పినట్లుగా తెలిసింది. లోక్‌సభ స్థానాల్లో 5 లేదా 6 బీజేపీకి ఇచ్చేందుకు బాబు సిద్ధపడినట్లు తెలిసింది. పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా తాను సిద్ధమని బాబు అన్నట్లు సమాచారం. రెండు పార్టీలకు సమాన లబ్ధి చేకూరే పక్షంలోనే పొత్తులు ఉంటాయని బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేన అధినేత పవన్ కళ్యాన్‌తో కూడా చర్చించిన అనంతరం పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కబురు చేస్తామని వారు బాబుకు చెప్పినట్లు సమాచారం. -
పరువు కోసం ‘ఉమ్మడి’ సభలు
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం రెండు విడతలు సుదీర్ఘంగా చర్చలు జరిపినా సీట్లపై కొలిక్కి రాలేదు. 3 గంటలు చొప్పున మంతనాలు జరిపినా సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఆదివారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తిరిగి వెళ్లిపోయి చీకటి పడ్డాక రాత్రి మరోసారి చంద్రబాబు ఇంటికి వచ్చి గంటల తరబడి చర్చలు జరిపారు. పవన్ కళ్యాణ్ 50కిపైగా సీట్లు అడుగుతుండగా చంద్రబాబు ఎటూ తేల్చకుండా ఉత్కంఠ కొనసాగిస్తున్నారు. తమకు కేటాయించే సీట్ల గురించి తేల్చాలని, కనీసం కొన్ని సీట్లనైనా ప్రకటిస్తే బాగుంటుందని పవన్ కోరినా అప్పుడే ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు దాటవేసినట్లు తెలిసింది. జనసేనకు సీట్లు ఇవ్వడం వల్ల తమ పార్టీ నేతలు ఆందోళనకు దిగే అవకాశం ఉందని, ముందు వారికి నచ్చజెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అలాంటి వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ‘ఫ్యాన్’ ఫుల్ స్పీడ్ ముఖ్యమంత్రి జగన్ దూకుడుగా ముందుకెళుతున్నా తాము ఏమీ తేల్చుకోలేకపోవడంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. జగన్ ఒకవైపు అభ్యర్థుల ఎంపికను వేగంగా పూర్తి చేస్తున్నా టీడీపీ–జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల గురించి కనీసం స్పష్టత లేకపోవడం వల్ల క్షేత్ర స్థాయిలో ఇబ్బంది నెలకొందనే విషయం చర్చకు వచ్చింది. సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’ సభలకు జనం భారీగా వస్తుండడాన్ని పవన్ ప్రస్తావించారు. భీమిలి సభ విజయవంతమవడం, ఆ తర్వాత నిర్వహించిన దెందులూరు సభకు అంతకు మించిన స్పందన వచ్చిందనే అంశం చర్చకు వచ్చింది. పరువు కాపాడుకునేందుకు.. అభ్యర్థుల ఎంపికలో దూకుడుతోపాటు సిద్ధం సభలతో వైఎస్సార్ సీపీ మంచి ఊపు మీద ఉందని, అదే సమయంలో తమ వైపు ఆ జోరు లేకపోవడం ఇబ్బంది కలిగిస్తుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దీంతో వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభ స్థాయిలో తాము కూడా ఒక సభను ఉమ్మడిగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అమరావతిలో సభ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరిగింది. చంద్రబాబు సభలకు జనం మొహం చాటేస్తుండటంతో పవన్ కళ్యాణ్‌ను రప్పించి టీడీపీ – జనసేన కలిసి ఉమ్మడి సభ నిర్వహించాలని నిర్ణయించారు. ‘రా కదలిరా’ సభలన్నీ పేలవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో జనసేనతో కలసి ఉమ్మడి సభలపై ప్రణాళిక రూపొందించిన చంద్రబాబు సమావేశంలో దానిపై చర్చించారు. బీజేపీ స్పష్టత కోసం.. పొత్తుపై బీజేపీ స్పష్టత ఇచ్చే వరకు వేచి ఉండక తప్పదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఆ పార్టీ అగ్ర నేతలతో భేటీకి పవన్‌కళ్యాణ్ ప్రయత్నిస్తున్నా అటు నుంచి స్పందన లేదని ఇరువురు చర్చించుకున్నట్లు తెలిసింది. కమలనాథులు తమ నిర్ణయం ప్రకటించే వరకు సీట్ల సర్దుబాటుపై తేలడం కష్టమనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ ముఖ్య నేతలను కలవడానికి ప్రయత్నాలు కొనసాగించాలని, 10వతేదీలోపు ఎలాగైనా కలిసేలా ప్రయత్నించాలని పవన్‌కు చంద్రబాబు సూచించారు. -
పవన్ ప్రకటనపై భగ్గుమన్న టీడీపీ
మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీకి దిగుతారని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటనపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన మలికిపురంలో ఆదివారం జరిగిన సమావేశంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీను మాట్లాడుతూ.. రాజోలు టికెట్ జనసేనకు ఇస్తే ఎంపీపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి గొల్లపల్లి వెంటే వెళ్తానని ప్రకటించారు. పార్టీ నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు కాండ్రేగుల లావణ్య భవాని మాట్లాడుతూ.. తాను కూడా తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్సీపీ నుంచి లేదా ఇండిపెడెంట్‌గా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత కుసుకుర్తి త్రినాథ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పరిస్థితిపై మాట్లాడటానికి అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు. చివరగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కార్యకర్తల మనోభావాలను మరోసారి అధిష్టానానికి చెబుదామని, తరువాతే నిర్ణయం తీసుకుందామని అన్నారు. నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి చేశామని, భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానిస్తే ఇంటింటికీ తిరిగి ఖండించానని, అటువంటి తనపట్ల పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని అన్నారు. కాగా, జనసేనతో కలసి ఇప్పటివరకూ ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ.. ఈ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ ఫొటో కానీ, నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు ఫొటో కానీ వేయకపోవడం గమనార్హం. -
టీడీపీకి ‘తూర్పు’ సెగ
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం సీట్ల పంచాయితీ శనివారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఆ రెండు సీట్లలో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేతలు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముఖ్య నేతలను నిలదీశారు. రాజోలు టీడీపీ ఇన్చార్జి గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో చంద్రబాబు లేకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారితో మాట్లాడారు. రాజానగరం నేతలు అచ్చెన్నకు వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు త్వరలో రాజానగరం, రాజోలు నాయకులతో మాట్లాడతారని అచ్చెన్న సర్దిచెప్పారు. కార్యకర్తలు వినకపోవడంతో తర్జనభర్జన తర్వాత అధిష్టానం నుంచి వచ్చిన సూచనల ప్రకారం ఆ రెండు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు నిరసన తెలిపారు. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెగేసి చెప్పారు. ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో అచ్చెన్న వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా కొద్దిసేపు ఉండి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. రాజాన‘గరం’ రాజానగరం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలి ఆది నుంచీ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై గతంలో బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశా వ్. అధికారంలో ఉండగా అనుభవించి, ఇప్పుడు గాలికి వదిలేస్తావా?’ అంటూ విరుచుకుపడ్డారు. బాబు వ్యవహార శైలితో విసుగు చెందిన పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పదవికి గుడ్‌బై చెప్పారు. ఆయన తర్వాత నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ దుకాణం కొన్నాళ్లు బంద్ అయింది. పెందుర్తి కి అప్రధాన పదవి అప్పగించారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతరం బొడ్డు వెంకట రమణ చౌదరిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. రాజానగరం టికెట్ తనకే దక్కుతుందని ఇన్నాళ్లూ చౌదరి ధీమాగా ఉన్నారు. ఈ తరుణంలో పవన్ ప్రకటనతో చౌదరి వర్గంలో ఆగ్రహం పెల్లుబికింది. రాజానగరం టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడికి ఇచ్చిన వినతిపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫేక్ అని ప్రచారం చేసేందుకు టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు. -
చంద్రబాబు ఝలక్.. జనసేన కౌంటర్!
సాక్షి అమలాపురం: ఓ వైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతారు..మరోవైపు తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తారు..ఇదీ బాబు మార్కు మిత్ర ధర్మం. రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల అధినేతలూ ప్రకటించారు. కానీ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ఇప్పటివరకూ కొలిక్కి రాలేదు. అయినప్పటికీ టీడీపీ చేపట్టిన ‘రా.. కదలి రా’ సభల్లో మాత్రం తమపార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడం జనసేన నేతలకు, ఆశావహులకు మింగుడుపడడం లేదు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా... కదలిరా..’ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంటరీ జనసేన ఇన్చార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. వాస్తవానికి సభలో టీడీపీ కార్యకర్తలకన్నా జన సైనికుల సందడే అధికంగా ఉంది. ఇంతమంది ఉన్న సభలో చంద్రబాబు.. మండపేట నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో జనసేన మండపేట ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ అక్కడే ఉన్నారు. సభలో తమ అభ్యర్థి జోగేశ్వరరావు అని బాబు ప్రకటించడంతో లీలాకృష్ణతో పాటు జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. బాబు పక్కనే ఉన్న గంటి హరీష్‌ను మాత్రం పార్లమెంట్‌కు పంపాలని బాబు పిలుపునివ్వకపోవడం గమనార్హం. ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు? సీట్ల సర్దుబాటు ఖరారు కాకున్నా.. చంద్రబాబు ఏకపక్షంగా తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించడం చూసి, జనసేన ఆశావహులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఇలా ఏకపక్షంగా జోగేశ్వరరావును మళ్లీ గెలిపించండంటూ చంద్రబాబే పిలుపునివ్వడంపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా బాబు ప్రవర్తించడంతో టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలెవ్వరూ వెళ్లవద్దంటూ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి లీలాకృష్ణ ఆదేశించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లీలాకృష్ణ తానలా చెప్పలేదన్నా.. జనసేన అనుకూల సోషల్ మీడియాలో టీడీపీపై సెటైర్లు కొనసాగుతూనే ఉన్నాయి. చాలాచోట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు తమదే సీటు అంటూ ప్రచారం చేస్తుండడం కూడా జనసేన ఇన్చార్జిలకు మింగుడు పడడంలేదు. ‘మా పార్టీ అధినేత పొత్తుకు వెళ్లినట్టు లేదు.. కాళ్ల బేరానికి వెళ్లినట్టుంది’ అంటూ సగటు జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘తూర్పు’ బరిలో డిష్యుం..డిష్యుం
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. ఎమ్మెల్యే సీటు నాదంటే నాదంటూ బాహాటంగా ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంబిస్తూ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారు. పలుమార్లు జిల్లాలో పర్యటించిన బాబు స్వపక్ష నేతల మధ్య నెలకొన్న వైషమ్యాలను చక్కదిద్దలేక చేతులెత్తేశారు. దీనికి తోడు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనన్న మీమాంస నెలకొంది. ఆది నుంచీ ఉన్న వారికి భంగపాటు తప్పదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిడదవోలులో ‘సోషల్’ వార్ నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై స్వపక్షంలో అయోమయం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, టీడీపీ నేత కుందుల సత్యనారాయణలు సీటు కోసం నువ్వా నేనా? అనే రీతిలో చక్రం తిప్పుతున్నారు. అధినేత ప్రసన్నం కోసం ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో వార్‌కు దిగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మా నాయకుడే ఎమ్మెల్యే అవుతాడని ఇరు వర్గాలూ పోస్టులు పెడుతూండటంతో ద్వితీయ స్థాయి నాయకులు ఎవరి వెంట నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తనకే కేటాయించాలని టీడీపీ అధిష్టానానికి కుందుల సత్యనారాయణ భారీగా ముట్టజెప్పినట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు జనసేన నుంచి మరో ముగ్గురు బరిలోకి దిగేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉండే సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో పాటు తణుకు జనసేన ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశిస్తుండగా.. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ సైతం రేసులో ఉన్నారు. పొత్తులో భాగంగా నిడదవోలు జనసేనకు కేటాయిస్తారని, తామే పోటీ చేస్తామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న అంశం టీడీపీ నేతల్లో మింగుడు పడటం లేదు. గోపాలపురం.. గందరగోళం గోపాలపురం నియోజకవర్గంలో వర్గ విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. ఆది నుంచీ పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో మద్దిపాటి వెంకట్రాజును బాబు నియమించారు. కనీస సమాచారం లేకుండా ఎందుకు మార్చారని ముప్పిడి వర్గం చంద్రబాబును నిలదీసింది. వచ్చే ఎన్నికల్లో మద్దిపాటే పోటీ చేస్తారని బాబు ప్రకటించడంతో ఇరు వర్గాల మధ్య విభేదాల అగ్గి మరింతగా రాజుకుంది. అప్పటి నుంచీ ముప్పిడి వర్గం, ఎస్సీ సామాజికవర్గ నేతలు టీడీపీ అధినేతపై గుర్రుగా ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా.. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోగా తాడోపేడో తేల్చుకునేందుకు అధిష్టానం వద్ద బలప్రదర్శనకు దిగుతున్నారు. కొవ్వూరులో ఎస్సీలకు అవమానం ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన కొవ్వూరులో ఆ సామాజిక వర్గాలకు ఘోర అవమానం ఎదురవుతోంది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి, తమకు అన్యాయం చేస్తున్నారని ఎస్సీ సామాజిక వర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా కొవ్వూరు పార్టీ వ్యవహారాలకు ఆయనను దూరం పెట్టారు. పెండ్యాల అచ్చిబాబుకు అందలం వేయడం.. జవహర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ద్వితీయ స్థాయి నేతలు పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కొవ్వూరు అభ్యర్థిత్వం తనదేనంటూ చెప్పుకుంటూండటంతో ఇరు వర్గాలూ కత్తులు దూస్తున్నాయి. రాజానగరం.. గరంగరం రాజానగరంలో రాజకీయం రంజుగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రాజానగరం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే సీటు తనకే వరిస్తుందని జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధిష్టానానికి భారీ స్థాయిలో పార్టీ ఫండ్ ఇచ్చారని.. అందుకే అంత ధైర్యంగా ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామం ఇప్పటికే రాజానగరం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గంలో అగ్గి రాజేస్తోంది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను కాదని, జనసేనకు టికెట్ ఇస్తారన్న ప్రచారం రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. మరోవైపు బొడ్డు వెంకట రమణ చౌదరిని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గం ఇప్పటికే పార్టీ అధినేతపై గరంగరంగా ఉంది. ఒకవేళ టీడీపీకే ఈ సీటు కేటాయించినా ఇటు పెందుర్తి వర్గం, అటు జనసేన శ్రేణులు వెంకట రమణ చౌదరికి జెల్ల కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలా కాదని జనసేనకే కేటాయించినా ఆ పార్టీ అభ్యర్థికి టీడీపీ వర్గాలు మద్దతు తెలిపే అవకాశాలు కనిపించడం లేదు. రాజమహేంద్రవరం రూరల్‌లో తేలని పంచాయితీ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై టీడీపీ – జనసేన మధ్య నెలకొన్న పంచాయితీ నేటికీ కొలిక్కి రావడం లేదు. పొత్తు నేపథ్యంలో తనకే ఈ సీటు దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ చెబుతూండగా.. తన స్థానంలో పోటీ చేసే ధైర్యం ఇతరులెవరికైనా ఉందా? తానే పోటీ చేస్తానని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం రెండు పార్టీల నేతల్లో విభేదాలకు ఆజ్యం పోస్తోంది. -
టీడీపీలో సెల్ఫ్‘షో’లు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏమాత్రం నమ్మకం లేని ఆ పార్టీ సీనియర్ నేతలు ‘సెల్ఫ్ షో’లకు దిగుతున్నారు. ఏదో సాకుతో తీవ్రస్థాయిలో హడావుడి చేస్తేగాని తమకు టికెట్ దక్కేట్టు లేదన్న అనుమానాలతో భావోద్వేగాల ముసుగేస్తున్నారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటామంటూ నానా హంగామాతో రక్తి కట్టించేందుకు యత్నిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో ప్రధానంగా బాబు సామాజిక వర్గానికే చెందిన వివిధ జిల్లాల సీనియర్ నేతలు ఉండటం గమనార్హం. వైఎస్సార్సీపీపై ఒంటరిగా పోటీచేసి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేమనే నిర్ధారణకు వచ్చిన బాబు జనసేనతో సహా కలిసొచ్చే ఏ పార్టీనైనా కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికొచ్చి పావులు కదుపుతున్నది బహిరంగ రహస్యమే. మరోవైపు బాబు, లోకేశ్ పలు నియోజకవర్గాలలో వేర్వేరుగా మద్దతిస్తూ నేతల మధ్య పోటీ పెంచుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో తమకు సీటు నిరాకరిస్తారేమోననే అనుమానాలతో ఎవరికివారు వ్యక్తిగత వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్, పులివర్తి నాని, యరç³తినేని శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారు. ఆలపాటి అలక.. గుంటూరు జిల్లా తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తారని, సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారనే ప్రచారం విస్తతంగా జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనకే టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. తెనాలిలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలపాటికే టికెట్ ఇవ్వాలని, లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు చేసుకుంటామని ఆయన అనుయాయులు వేదికనెక్కి గందరగోళం చేశారు. ఆరేడు శాతం ఓట్లు కూడా లేని మనోహర్‌కు సీటివ్వాలని కోరడమేంటని నిలదీశారు. మీటింగ్ హాల్ బుక్ చేసింది, సమావేశానికి వెళ్లమని పురమాయించింది, పెట్రోల్ డ్రామాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎవరనేది టీడీపీ అధిష్ఠానం గుర్తించి సెల్ఫ్షోలు చాలించాలని తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో ఆలపాటి వర్గం మౌనం దాల్చక తప్పలేదని స్వపక్షీయులు అంటున్నారు. పులివర్తి ఆందోళన చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి టీడీపీ ఇన్చార్జిగా పులివర్తి నాని వ్యవహరిస్తున్నారు. నానికి టికెట్ ఇవ్వవద్దని అదే నియోజకవర్గానికి చెందిన గల్లా అరుణకుమారి కుటుంబం అడ్డుకుంటోంది. మరో సామాజికవర్గానికి చెందిన రియల్టర్ పేరు బాబు పరిశీలనలో ఉందని తెలియడంతో టికెట్ దక్కించుకునే ఎత్తుగడలో పులివర్తి తనదైన శైలిలో డ్రామాకు తెరతీశారని పరిశీలకులు అంటున్నారు. ఓటర్ల చేర్పులు, తొలగింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ఈనెల 8న తిరుపతి ఆర్డీవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన నాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ నానా హంగామా చేశారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన చంద్రబాబు నానిని పరామర్శించారు కూడా. యరపతినేని ఎత్తుగడ పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎత్తుగడ మరోవిధంగా ఉందని ఆ పార్టీ నాయకుల్లోనే చర్చ జరగుతోంది. సీటు దక్కుతుందో.. లేదోనన్న అనుమానంతో యరపతినేని పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. వైఎస్సాఆర్సీపీ వారే ఇలా చేయించారని ఆయన ధ్వజమెత్తారు. వాస్తవంగా తప్పుడు ట్రోల్ చేయించింది ఎవరనేది అధిష్ఠానానికి బాగా తెలుసని టీడీపీలోని నాయకులే అంటున్నారు. బాబును నమ్మిబాగుపడినోడు లేడు విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంత సోదరుల మధ్య రాజకీయ వివాదం రేపింది, సీటు అంశంలో వారివురిని తగాదా వరకు తీసుకెళ్లింది, పార్టీలోని ఇతర నాయకుల చేత ఎంపీని తిట్టించింది ఎవరనేది అందరికీ తెలిసిందేనని పరిశీలకులు అంటున్నారు. బాబును నమ్మి బాగుపడినోడు లేడనేది స్వపక్షీయుల మాట. ఈ విషయం ముఖ్యంగా ఆయన సామాజికవర్గానికి చెందిన సన్నిహిత సీనియర్లకు బాగా తెలుసని గుర్తుచేస్తున్నారు. -
గాజువాకలో టీడీపీ-జనసేన సిగపట్లు!
పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తేనే దిక్కులేదు.. ఇప్పుడు మీరు పోటీ చేసి ఏం గెలుస్తారు? గాజువాకలో జనసేన నేతలపై టీడీపీ నాయకులు సెటైర్లు పేలుస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పోటీ చేశారు కనుక ఈసారి గాజువాక తమకే ఇవ్వాలని జనసేన నేతలు పట్టుపడుతున్నారు. పవన్ గెలవలేనపుడు మీకు సీటు ఎందుకివ్వాలని టీడీపీ స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సిగపట్లు మొదలయ్యాయి. ఇంకా రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు మొదలు కాకముందే గాజువాకలో గలాటా మొదలైంది. అసలక్కడ ఏం జరుగుతోందో చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయి రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబుకు కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం గాజువాకలో సొంత పార్టీ అభ్యర్థికే చంద్రబాబు ప్రచారం చేయలేదు. పక్క నియోజకవర్గంలో ప్రచారం చేసి పవన్ పోటీ చేస్తున్న గాజువాకలో టీడీపీకి ప్రచారం చేయకుండా వెనుదిరిగారు. గత ఎన్నికల్లో తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఈసారి గాజువాక తమకే కేటాయించాలని జనసేన నాయకులు కోరుతున్నారు. జనసేన తరఫున పోటీ చేయడానికి కోన తాతారావు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో జనసేన తరఫున ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కోన తాతారావు. గాజువాకలో జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొదటినుంచి పార్టీని నమ్ముకుని రాజకీయం చేస్తున్నానని అవకాశవాద రాజకీయాల కోసం తానేమి పార్టీలోకి కొత్తగా రాలేదంటున్నారు. నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచి పదవులు అనుభవించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాగా తమ నాయకుడు జనసేనలోకి రాలేదని కోన తాతారావు అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గాజువాకలో పోటీ చేయాల్సిందే అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ క్యాడర్ మొత్తం చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్‌కి మద్దతు తెలిపిందని చెబుతున్నారు. అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన గాజువాక సీటును మళ్లీ ఎందుకు జనసేనకి ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్ మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. జనసేనతో పోలిస్తే టీడీపీనే ఇక్కడ బలంగా ఉందంటున్నారు. తమను కాదని జనసేనకి సీటు ఇచ్చినట్లయితే సహకరించేది లేదని టీడీపీ నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. జనసేనకు సీటు ఇచ్చినట్లయితే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను కూడా పంపుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు మొదలు కాకముందే గాజువాకలో రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది. జనసేన అధ్యక్షుడికే గాజువాకలో దిక్కులేనపుడు..మామూలు నాయకుడు పటిష్టమైన స్థితిలో ఉన్న వైస్ఆర్ కాంగ్రెస్‌ను ఎదుర్కొనగలడా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడదాకా వెళుతుందో చూడాలి. -
పొత్తులమారి నక్క!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సహచర పక్షాలను మోసగించే ‘పొత్తులమారి నక్క’ తెలుగుదేశం పార్టీ ఎప్పటిలానే ఈసారి జనసేనకు ఝలక్ ఇచ్చేందుకు వ్యూహం పన్నుతోంది. ఉత్తరాంధ్రలో ఉన్న 35 సీట్లలో కేవలం విశాఖ దక్షిణ, భీమిలి నియోజకవర్గాలతోపాటు పెందుర్తి/యలమంచిలిలో ఏదో ఒక స్థానాన్ని కలిపి మొత్తం మూడు మాత్రమే జనసేనకు కేటాయించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అంతర్గతంగా టీడీపీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. సర్వేల సాకుతో పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. టీడీపీ ఎత్తులను పసిగట్టిన జనసేన తన బలం పెంచుకునేందుకు కొత్త నేతలకు ఆహ్వానం పలుకుతోంది. పెద్దగా ప్రజాబలం లేకున్నా.. గతంలో ఎన్నడో రాజకీయాలు చేసిన వారిని పార్టీలో చేర్చుకుంటోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పడాల అరుణను చేర్చుకుంది. తాజాగా అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను ఆహా్వనిస్తోంది. తమ వద్ద బలమైన నేతలు ఉన్నారని చూపించుకునేందుకు తహతహలాడుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ‘సీట్ల ముడి’ అంత సులువుగా వీడేలా కనిపించడం లేదు. నాలుగు జిల్లాల్లో జనసేనకు ‘సున్న’ం! ఉత్తరాంధ్ర జిల్లాల పునర్విభజన తర్వాత శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలుగా రూపాంతరం చెందింది. ఈ ఆరు జిల్లాల్లో 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో విశాఖ జిల్లాలో రెండు సీట్లు, అనకాపల్లి జిల్లాలో ఒక్క సీటు మాత్రమే జనసేనకు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. అంటే నాలుగు జిల్లాల్లో జనసేనకు మొండిచేయి చూపనుందన్నమాట. దీంతో జనసేన నేతలు రగిలిపోతున్నారు. వీరందరికీ మొండిచేయేనా..! ♦ శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నుంచి విశ్వక్సేన్, పాతపట్నం నుంచి గేదెల చైతన్య జనసేన తరఫున సీట్లను ఆశిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉంది. ♦ విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, గజపతినగరం నుంచి పడాల అరుణ జనసేన తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమె జనసేన పొలిటికల్ కమిటీ మెంబర్‌గా కూడా ఉన్నారు. ♦ పార్వతీపురం జిల్లాలో సాలూరు సీటును తమకు కేటాయించాలని జనసేన నేతలు కోరుతున్నారు. ♦అయితే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించే అవకాశం లేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ♦ విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ దక్షిణంలో ఏదో ఒక సీటును జనసేన తరఫున వంశీకృష్ణ యాదవ్ ఆశిస్తుండగా.. పెందుర్తి సీటు తనదే అన్న రీతిలో పంచకర్ల రమేష్ బాబు మొన్నటివరకు కార్యక్రమాలు చేశారు. గట్టి హామీ లేకపోవడంతో ఆయన సందిగ్ధంలో పడిపోయారు. ♦ యలమంచిలి నుంచి జనసేన తరఫున సుందరపు విజయ్‌కుమార్ పోటీకి యత్నింస్తున్నారు. అనకాపల్లి నుంచి పరుచూరి భాస్కర్‌రావు రేసులో ఉన్నారు. విశాఖ దక్షిణం నుంచి కందుల నాగరాజు, సాదీక్‌లు, విశాఖ ఉత్తరం నుంచి ఉషాకిరణ్, భీమిలిలో పంచకర్ల సందీప్ జనసేన తరఫున సీటు కోసం యత్నాలు చేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు తమకు కచ్చితంగా సీటు వస్తుందని బలంగా నమ్ముతున్న నేతలు ఒక్కరూ లేకపోవడం గమనార్హం. ♦ కొత్తగా చేరుతున్న కొణతాల రామకృష్ణ తనకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారని చెబుతున్నా.. ఇప్పటికే టీడీపీ నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న ఒకరికి హామీ ఇచ్చారని తెలుస్తోంది. -
పచ్చ ‘సేన’
సాక్షి, అమరావతి: పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అరకొర సీట్లకూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎసరు పెట్టారు! పచ్చ ముఖాలకే జనసేన ముసుగు వేసి ఆ పార్టీకి కేటాయించే సీట్లలో పోటీకి దించే ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. వారంతా పైకి మాత్రం జనసేనలో కొనసాగుతూ తాను చెప్పినట్లు నడుచుకునేలా వ్యూహం సిద్ధం చేశారు. పథకం ప్రకారం ఒక్కో నేతను జనసేనలో చేర్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలు పెట్టారు. బాబు ఆదేశాలతో బూరగడ్డ..! కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ గురువారం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. వేదవ్యాస్‌తోపాటు మరో టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్ కూడా పెడన టిక్కెట్ ఆశిస్తుండగా, పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాలంటూ జనసేన ఇప్పటికే ప్రతిపాదించడం గమనార్హం. వేదవ్యాస్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన పవన్‌ను కలసినట్లు జనసేనలో చర్చ సాగుతోంది. టీడీపీకే చెందిన మాగంటి బాబు, జలీల్‌ఖాన్ తదితరులు కూడా పవన్ కళ్యాణ్‌తో సమావేశం కావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లు జనసైనికులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ చేరిక కూడా.. వైఎస్సార్సీపీ అసెంబ్లీ టికెట్ నిరాకరించడంతో ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇటీవల జనసేనలో చేరారు. ఆయన తొలుత చంద్రబాబును సంప్రదించారని, టీడీపీ అధినేత ఆదేశాల మేరకే జనసేనలో చేరారనే చర్చ సాగుతోంది. జనసేనకు కేటాయించే సీట్ల సంఖ్య ఇంకా ఖరారు కాకున్నా, అతి తక్కువగా కేటాయించడంతోపాటు అందులోనూ ఇన్నాళ్లూ జనసేనను నమ్ముకున్న నాయకులకు కాకుండా తన మనుషులను చంద్రబాబు ప్రవేశపెడుతున్నట్లు రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల అనంతరం తమ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. 2014 పొత్తులే నిదర్శనం.. 2014 ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు ఇదే ఎత్తుగడ అమలు చేసినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి తొలుత 15 అసెంబ్లీ సీట్లను కేటాయించి నామినేషన్ల సమయానికి 11కి పరిమితం చేశారు. తీరా అందులోనూ మూడు చోట్ల స్నేహపూర్వక పోటీ పేరుతో టీడీపీ అభ్యర్ధులను కూడా బరిలోకి దించినట్లు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ఆ ఎన్నికల ముందు కొత్తగా బీజేపీలో చేరిన చంద్రబాబు మనుషులకే టిక్కెట్లు దక్కాయని పేర్కొంటున్నారు. -
స్థల వివాదంలో తన్నుకున్న జన సైనికులు
సాక్షి, కృష్ణా జిల్లా: హనుమాన్ జంక్షన్లో జన సైనికులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేట్ స్థలం సరిహద్దుపై గత కొన్ని నెలలుగా జనసేనకు చెందిన రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. స్థల వివాదం సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో ఇరు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి. కొట్టుకునేందుకు సమయం చెప్పి ఇరువర్గాలు ఘర్షణకు సిద్ధమయ్యాయి. గన్నవరం నియోజకవర్గం జనసేన ఇంఛార్జి చలమలశెట్టి రమేష్.. ఒక వర్గానికి నాయకత్వం వహించారు. ఆయన వర్గం ఓవైపు.. మరో వర్గం ఇంకోవైపు రోడ్డెక్కారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎందుకు ఘర్షణ జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. -
మూడునెలలు టీడీపీ–జనసేన జెండాలు పట్టుకోండి
సాక్షి, నంద్యాల: రాష్ట్రంలో వచ్చే మూడునెలలు టీడీపీ–జనసేన జెండాలు పట్టుకుని తిరగాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గోదావరి నుంచి 350 టీఎంసీలు రాయలసీమకు తరలించి సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తామని, నంద్యాల జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని, పాసు పుస్తకాలపైనా తన బొమ్మలు వేసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దోపిడి దొంగలుగా మారారని, ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు నాశనమయ్యాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మంత్రులది సామాజిక యాత్ర కాదని అది మోసాలయాత్ర అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పెద్దఎత్తున పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నందికొట్కూరులో విత్తన సరఫరా యూనిట్‌ను, ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కును జగన్ ధ్వంసం చేశారని ఆరోపించారు. జగన్ వదిలిన బాణం ఎక్కడ తిరుగుతోందని వైఎస్ షర్మిలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. -
‘గ్లాసు’కు రేటు కట్టిన మాజీ మంత్రి నారాయణ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకుని రానున్న ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కాగా జనసేన నేతలు మాత్రం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ స్థానాన్ని వదులుకుంటే ‘గ్లాసు’ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తానని ప్రకటించినట్లు ప్రచారం ఉంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు కుంపటి రగులుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారు కావడంతో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో నూతన జిల్లాలో జనసేన పార్టీ స్థానం ఎక్కడనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన మాత్రం నెల్లూరు నగర నియోజకవర్గం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా నారాయణకు ఎసరు పెట్టే అవకాశం ఉండడంతో సీటు కోసం గ్లాసుకు ఖరీదు కట్టినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నెల్లూరు నగర సీటు వదులుకుంటే జనసేనకు బంపర్ ఆఫర్ ఇస్తానని ప్యాకేజీ ప్రకటించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ‘ఉనికి’పాట్లు ప్రస్తుతం జిల్లాలో అటు తెలుగుదేశం, ఇటు జనసేన పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఆ రెండు పార్టీలకు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ప్రజల మద్దతు లేకపోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య కుదిరిన పొత్తు ద్వారా బలం పెంచుకోవాలని భావిస్తోంది. అయితే ఈ రెండు పార్టీల పొత్తు జిల్లాలో వికటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఏ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయిస్తారనే అంశంపై స్పష్టత లేనప్పటికీ జిల్లాలో జనసేనకు సీటు కావాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. సీటు వదులుకుంటే బంపర్ ఆఫర్ ప్రస్తుతం జనసేన నేతలు నెల్లూరు నగర నియోజకవర్గం సీటు కావాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం ఉండగా, నాదెండ్ల మనోహర్ ద్వారా నగర సీటు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నెల్లూరు నగర సీటు జనసేనకు కేటాయించే పరిస్థితి వస్తే మాజీ మంత్రి నారాయణను ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే నెల్లూరు నగర నియోజకవర్గంలో పోటీ చేస్తానంటూ ప్రకటించుకున్న నారాయణ తన సొంత ఎన్నికల టీంను రంగంలోకి దింపి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఉన్న పళంగా సీటు జనసేనకు కేటాయిస్తే తన పరువు పోతుందని భావించి జనసేనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. జిల్లాలో నెల్లూరు నగర సీటు తప్పించి ఏ సీటు అడిగినా టీడీపీ అధినేత చంద్రబాబును ఒప్పించడమే కాకుండా జనసేన అభ్యర్థికి అయ్యే ఎన్నికల ఖర్చు మొత్తం తానే చూసుకుంటాననడంతోపాటు జనసేన నేతలకు మరో ప్రత్యేక ప్యాకేజీ కూడా ఆఫర్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో జనసేన నేతలు ప్యాకేజీ ఆఫర్‌తో పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. నెల్లూరు నగరం సీటు కాకుంటే నెల్లూరు రూరల్ సీటుపై దృష్టిపెడుతున్నట్లు కూడా మరో ప్రచారం ఉంది. నెల్లూరు రూరల్ సీటు ఆశిస్తే తప్పక టీడీపీ అధినేతను ఒప్పించి, ఎన్నికల ఖర్చు, ప్యాకేజీ కూడా ఇప్పించేందుకు మాజీ మంత్రి నారాయణ తెర వెనుక ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ప్రచారం ఉంది. మరి జనసేనకు ప్యాకేజీ ఆఫర్ ఎంత మేర పనిచేస్తుందో వేచి చూడాలి. జిల్లాల పునర్విభజన తరువాత జిల్లా 8 (నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, ఉదయగిరి, కావలి, కందుకూరు) నియోజకవర్గాలకు పరిమితమైంది. ఈ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకు పెద్దగా ఆదరణ లేదు. పైగా ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా ప్రస్తుతం లేరు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మనుక్రాంత్‌రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్‌తో ఉన్న అనుబంధం, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో టీడీపీ పొత్తుతో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి మనుక్రాంత్‌రెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
మళ్ళీ జగనే సీఎం
-
బుచ్చయ్యకు పొత్తు సెగ!
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన పొత్తు సెగ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తగిలిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం జనసేనకు కేటాయించేందుకు ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతుండటంతో బుచ్చయ్యకు భంగపాటు తప్పదు అని చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బుచ్చయ్య.. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా పనిచేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్రియాశీల పాత్ర పోషించారు. అలాంటి బుచ్చయ్యకు జనసేనతో పొత్తు వల్ల ఇప్పుడు సీటు దక్కే పరిస్థితి లేకుండా పోతోంది. వచ్చే ఎన్నికల్లో బుచ్చయ్య స్థానంలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత కందుల దుర్గేష్ పోటీకి ఇరు పార్టీల అధినేతల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఇప్పటికే బుచ్చయ్యకు స్పష్టత ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి తోడు తానే అభ్యర్థినంటూ దుర్గేష్ కూడా ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. తాను నమ్ముకున్న పా ర్టీయే తన సీటుకు ఎసరు పెడుతోందని తెలిసి బుచ్చయ్య ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. సీనియర్ నేతకు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం పట్ల స్థానిక టీడీపీ కార్యకర్తలు, బుచ్చయ్య అభిమానులు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ పేరుతో సాగనంపేందుకు.. పొమ్మనలేక పొగబెట్టే క్రమంలో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలని బుచ్చయ్యకు టీడీపీ అధిష్టానం సూచించినట్లు తెలిసింది. తనకు ఇష్టం లేకపోవడంతో బుచ్చయ్య ససేమిరా అన్నట్లు సమాచారం. తాను రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పినట్లు తెలిసింది. మరోపక్క రాజమండ్రి సిటీ స్థానం టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసుకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఇక్కడి జైల్లో ఉన్నపుడు ఆయన కుటుంబం రాజమండ్రిలోనే బస చేసింది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసి వాసు అధిష్టానం దృష్టిలో పడ్డాడని దాంతో అతనికే టికెట్ ఇస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారింది. పైగా చంద్రబాబు జైల్లో ఉన్నపుడు ఒక్కసారి కూడా బుచ్చయ్యకు ములాఖత్ అవకాశం ఇవ్వలేదు. అంతేగాక టీడీపీ, జనసేన నేతల ఉమ్మడి సమన్వయ కమిటీలో కూడా సీనియర్ నేత బుచ్చయ్యకు చోటు కల్పిం చలేదు. ఇలా అధిష్టానం బుచ్చయ్యను అవమానిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తోందంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ వెనక కాదట.. పక్కన నడుస్తున్నారట..!
కొంత కాలం క్రితం బహుశా 2019 ఎన్నికలు ముందు అనుకుంటా!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అందులో మనం ఎంతకాలం తెలుగుదేశంకు బానిసత్వం చేస్తామని గట్టిగా గొంతు చించుకుని ప్రశ్నించారు. కాపులను ఉద్దేశించి ఆయన ఆ మాటలు అన్నారు. అంతేకాదు.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అప్పట్లో టీడీపీలో ఉండేవారు.ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతికి ద్రోహం చేస్తావా? అంటూ ప్రశ్నించారు.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. ✍️ఇప్పుడు ఈ వీడియో ఎందుకు బయటకు వచ్చిందా అని చూస్తే అసలు విషయం అర్ధం అయింది. పవన్ కళ్యాణ్్ తాజాగా మంగళగిరి కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఉపన్యసిస్తూ తెలుగుదేశం పార్టీని జనసేనవారు ఎవరైనా ఏమైనా అంటే తాను ఊరుకోనని హెచ్చరించారు. సోషల్ మీడియాలో టీడీపీ,జనసేన పొత్తుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలను సహించబోనని అన్నారు. టీడీపీ వారిని నిందించడానికి వీలు లేదని అన్నారు. తాను టీడీపీ వెనుక నడవడం లేదని, పక్కన నడుస్తున్నానని చెప్పుకున్నారు. అంతేకాదు..ఆయన రాజకీయాన్ని, సిద్దాంతాన్ని బీజేపీ పెద్దలు కూడా అర్ధం చేసుకున్నారట. ✍️ఇలా ఏవేవో మాట్లాడడం వింటే ఎవరికైనా మతిపోవలసిందే! పవన్ కళ్యాణ్ తనను తాను మోసం చేసుకుంటున్నారా?లేక జనసేన కార్యకర్తలందరిని మోసం చేస్తున్నారా అన్న ప్రశ్న వస్తుంది. టీడీపీకి జనసేనవారు కాని, కాపులు కాని బానిసలు కాదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్ గా ఎందుకు అంతగా ఆ పార్టీకి లొంగిపోయారు? దానిని బానిసత్వం అని అనరా! తాను కాబట్టి పదేళ్ల నుంచి అధికారం లేకపోయినా పార్టీని నడుపుతున్నానని చెప్పారు. నిజమే. తాను,నాదెండ్ల మనోహర్ , మహా అయితే తన సోదరుడు నాగబాబులే పార్టీగా నడుపుతున్న ఘనత ఆయనదే. ఉండేది హైదరాబాద్‌లో. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడేది మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో. ఎప్పుడైనా అవసరాన్ని బట్టి , బహుశా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఏపీలో వారాహి వాహనం ఎక్కి ముఖ్యమంత్రి జగన్ ను, వైసిపి ప్రభుత్వాన్ని దూషించుకుంటూ తిరగడం తప్ప ఏమి చేశారు. ✍️పార్టీకి నిర్దిష్ట కమిటీలు ఉన్నాయా? గ్రామ స్థాయి నుంచి పార్టీని నెలకొల్పడానికి ప్రయత్నించారా? ఆ దిశలో ఎన్నడైనా ఆలోచించారా? ఏదో సినిమా యాక్టర్ కాబట్టి ,అమాయకపు అభిమానులు, తెలిసి తెలియని వయసులో ఉన్న వారు ఆయన సభలకు హాజరై, ఆయనేమి చెబుతున్నారో వినకుండానే చప్పట్లు, ఈలలు కొడుతుంటారు.అది చూసి ఇదంతా తన బలమే అనుకుని ఈయన మురిసిపోతుంటారు. అసలు ప్రపంచంలో మరో పార్టీపై ఆధారపడి , ఆ పార్టీవారు ఏమన్నా పడి ఉండండి అని సొంతపార్టీవారికి చెప్పే ఏకైక నేత పవన్ కళ్యాణ్ మాత్రమే కావచ్చు.ఈ మధ్య మాత్రం టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ తన పాదయాత్రలో పవన్ కళ్యాణ్ కు జిందాబాద్ కొడుతున్నారు. అది ఎందుకో అందరికి తెలుసు! పవన్ అభిమానులనండి.. ఆయన ముఖ్యమంత్రి అవుతారేమోనని ఆశపడే కాపులను మాయ చేయడానికే అన్న సంగతి ఎవరికైనా అర్ధం అవుతుంది. పవన్ నాయకత్వం వర్దిల్లాలి అని అంటున్న లోకేష్ మరి ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం లేదు? సరే పవన్ కళ్యాణే ఆ పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ✍️తాను ఆ పదవికి అంత అర్హుడిని కానని ఒకసారి, పదవి ఇస్తే తీసుకుంటానని మరోసారి ...ఇలా ఏదో మాట్లాడుతూ పార్టీవారిని గందరగోళంలో పెడుతుంటారు. పవన్ కళ్యాణ్ ప్రజలలో కాకపోయినా, కనీసం తన పార్టీ కార్యకర్తల ప్రశ్నలు లేదా సందేహాలకైనా జవాబు ఇవ్వాలి కదా! తెలంగాణలో బీజేపీ తో పొత్తు పెట్టుకుని జనసేన పోటీచేస్తే అక్కడ ఎందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు ఇవ్వలేదు? అది జనసేనను అవమానించడానికి కాదా? కాపు సామాజికవర్గం నేతలు స్వయంగా కుకట్ పల్లిలో టీడీపీ వారికి ,కమ్మవారికి విజ్ఞప్తి చేసి జనసేనకు ఓటు వేయమని అడిగినా కూడా ఫలితం లేకపోయిందే!దాని గురించి ఒక్క ముక్క ఎందుకు పవన్ మాట్లాడడం లేదు.ఎన్నికల సమయంలో చంద్రబాబును కలిసినప్పుడు జనసేన తెలంగాణ అభ్యర్ధులకు మద్దతు ఇవ్వండని ఎందుకు అడగలేకపోయారు? అది సొంత పార్టీ అభ్యర్ధులకు వెన్నుపోటు పొడవడం కాదా? అలాంటివాటిని ప్రశ్నిస్తారనే కదా తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ముందుగా మీటింగ్ తంతు నడిపి ఎవరూ మాట్లాడవద్దని హూంకరించింది? ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని అడిగితే ఈయనేమి జవాబిస్తారు. ✍️రాష్ట్ర ప్రజల కోసమే తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని చెబుతున్న పవన్ కళ్యాణ్ 2019 కి ముందు టీడీపీ అంత అవినీతి పార్టీ లేదని ఎలా అన్నారు!బీజేపీని వదలివేసి బిఎస్పి ,సిపిఐ,సిపిఎం లతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? రెండు చోట్ల పోటీచేసి దారుణ పరాజయం చెందిన తర్వాత మళ్లీ బీజేపీ పెద్దలను బతిమలాడుకుని వారితో స్నేహం ఎందుకు చేయవలసి వచ్చింది?తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో పెట్టుకుంటారో,లేదో ఎందుకు చెప్పలేకపోతున్నారు?ఇలా అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా తప్పించుకోవడానికే పవన్ కళ్యాణ్ చివరికి తన సొంత పార్టీ కార్యకర్తలనే బెదిరించే స్థితికి చేరుకోవడం ఓ ట్రాజెడి. ఇందులోనే ఆయన బలహీనత కనిపిస్తుంది.కులం పునాదుల మీద పార్టీని నడుపుతూ , అదే కులం వారిని వేరే పార్టీకి లొంగిపనిచేయాలని అంటే ఆత్మగౌరవం ఉన్నవారెవరైనా దానిని సహించగలుగుతారా? తాను మాట ఇస్తే నిలబడతానని ఉపన్యాసాలలో చెబుతూ, ఆచరణలో పూర్తి విరుద్దంగా ఎన్ని మాటలు మార్చుతుంది వీడియో సహితంగా కనిపిస్తున్న సాక్ష్యాల గురించి ఏమి వివరణ ఇస్తారు?వీటన్నిటికన్నా పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఒక్క మాట చెబితే బాగుండేది. ✍️ఈసారి కూడా తాను అసెంబ్లీకి ఒంటరిగా గెలవలేనని, అందుకే తన భవిష్యత్తు కోసం టీడీపీతో కలుస్తున్నానని చెప్పుకుని ఉంటే కొంతమందైనా హర్షించేవారు. అలాకాకుండా పైకి ఒకటి,లోపల మరొకటి పెట్టుకుని దానికి సిద్దాంతం ,విధానం వంటి డైలాగులు చెబితే వినడానికి ప్రజలు కాదు కదా.. జనసేన కార్యకర్తలు కూడా సిద్దంగా ఉండరని తెలుసుకోవాలి! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
దిక్కుతోచకే దుర్మార్గపు రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జనసేనతో జట్టు కట్టినా సరే వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఘోర పరాజయం తప్పదని టీడీపీ అగ్రనేతలకు అర్థమైంది. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోవడంతో టీడీపీ శ్రేణులు పూర్తిగా నీరుగారిపోయాయి. అందుకే రాజకీయంగా టీడీపీ ఉనికిని కాపాడేందుకు పచ్చదండు గురువు రామోజీరావు.. అభూతకల్పనలు, పచ్చి అబద్ధాలు రంగరించి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురదజల్లుతూ రోజూ ‘ఈనాడు’లో తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారు. మంత్రులు, కీలక ఎమ్మెల్యేలపై ఆధారాలు లేకుండా రోతరాతలు రాస్తూ టన్నుల కొద్దీ విషం చిమ్మి.. వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించడం నిత్యకృత్యమైపోయింది. ఇలాగైనా టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపాలన్నది రామోజీ ఎత్తుగడ. అందుకే ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ‘ఆయనో భూచోడు’ శీర్షికన అడ్డగోలుగా తప్పుడు కథనాన్ని మంగళవారం ‘ఈనాడు’లో అచ్చేశారు. ఆ కథనంలోని ప్రతి అక్షరంలో ఎమ్మెల్యేపై రామోజీరావుకున్న అసూయ, ద్వేషం ప్రతిబింబిస్తోంది. క్లీన్‌స్వీప్ లక్ష్యంగా వైఎస్సార్సీపీ.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని.. ప్రతిపక్ష టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా ఘోర పరాజయం తప్పదని పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడం.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించడం.. సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు రోజురోజూకూ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే వైఎస్సార్సీపీ తిరుగులేని విజయానికి బాటలు వేస్తాయని ఆ సర్వేలు విశ్లేషించాయి. ఇక వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సామాజిక సాధికార యాత్ర’, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనాలు పలుకుతుండటం.. టీడీపీ, జనసేన చేపట్టిన కార్యక్రమాలకు జన స్పందన కన్పించకపోవడంతో ప్రధానంగా ప్రతిపక్ష టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రజల ఆశీర్వాదం కోరుతూ 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ దూసుకెళ్తుంటే.. అధిక స్థానాల్లో పోటీచేయడానికి కూడా అభ్యర్థులు దొరక్క చంద్రబాబుతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు విలవిల్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు.. ఇక ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూలు రానుంది. మార్చిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇందుకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని అర్థమవడంతో టీడీపీ అగ్రనేతలు ఎన్నికలకు ముందే కాడి దించేస్తున్నారు. ఇది ఆ పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇలాగైతే టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని ఆందోళన చెందుతున్న చంద్రబాబు.. దుష్టచతుష్టయంలోని తన గురువైన రామోజీరావుతో కలిసి ప్రభుత్వంతోపాటు మంత్రులు, వైఎస్సార్సీపీ కీలక ఎమ్మెల్యేలపై బురదజల్లుతూ ఈనాడులో క్షుద్ర రాతలను అచ్చేయడం ద్వారా వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిత్యం కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వంపై, మంత్రులపై, కీలక ఎమ్మెల్యేలపై విచ్చలవిడిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ విషం కక్కుతున్నారు. మరోవైపు.. ఇదే అంశాన్ని ప్రతి సభలోనూ సీఎం వైఎస్ జగన్ ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. పెత్తందార్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న దుష్టచతుష్టయం కుట్రలను చిత్తు చేయాలంటూ ఇస్తున్న పిలుపునకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాత్రికేయ విలువలకు వలువలు వదిలేసి.. టీడీపీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే రామోజీరావు తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారని ప్రజలు గ్రహిస్తున్నారు. -
ష్యూరిటీగా గొడవ – గ్యారంటీగా నిరసన!
నగరంపాలెం: టీడీపీ నిర్వహిస్తున్న ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారంటీ’ అనే కార్యక్రమం టీడీపీ, జనసేన నాయకుల మధ్య గొడవకు దారితీసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫొటో మినహా గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఇతర నాయకుల ఫొటోలు లేకపోవడమే వివాదానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం గుంటూరు నగరంలోని 18వ డివిజన్ శ్రీనివాసరావుపేట ఆరో వీధిలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ– భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఉందంటూ వారి గ్రూప్‌ల్లో పోస్ట్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. అయితే ఆ పోస్ట్‌లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఫొటోలు ఉండగా, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాసరావు ఫొటోలు ముద్రించకపోవడంతో గొడవకు దారితీసింది. ఈలోగా బాబు ష్యూరిటీ– భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమ నిర్వహించేందుకు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ కొవెలమూడి రవీంద్ర (నాని), నాయకులు తాళ్ళ వెంకటేశ్ యాదవ్‌తోపాటు పలువురు శ్రీనివాసరావు పేటకు చేరుకున్నారు. అయితే అక్కడ జనసేన సైనికులు ఎవరూ కనిపించలేదు. దీనిపై కోవెలమూడి నాని ఆరాతీశారు. ఈలోగా జనసేన డివిజన్ నాయకులను ఫోన్లల్లో సంప్రదించారు. జనసేన జిల్లా నాయకులు ఫొటోల్లేవని, ఫ్రొటోకాల్ పాటించనప్పుడు అక్కడికి హాజరు కాలేమని బదులిచ్చారు. దీంతో టీడీపీ నాయకులకు ఏం చేయాలో అర్ధం కాక అక్కడి నుంచి వెనుదిరిగారు. -
జనసేన x టీఢీపీ
గండేపల్లి/గోకవరం/మదనపల్లె/పెడన/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు)/తుమ్మపాల (అనకాపల్లి జిల్లా) : టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశాలు ఇరు పార్టీ నేతల మధ్య అంతరాలను బట్టబయలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల నేతలకు ఏ దశలోనూ అసలు పొసగడం లేదు. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు బాహాబాహీకి దిగుతూ సమావేశాలను రసాభాసగా మార్చేస్తున్నారు. తాజాగా గురువారం జరిగిన సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ జనసేన నేతకు టికెట్ ఇస్తే మద్దతివ్వం: టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ టీడీపీ, జనసేన పొత్తు కాకినాడ జిల్లాలో ఆదిలోనే వికటిస్తోంది. ఇటీవల పిఠాపురంలో ఈ రెండు పార్టీల సమావేశం రసాభాసగా ముగియగా, తాజాగా గురువారం జగ్గంపేట నియోజకవర్గ సమావేశానిదీ అదే పరిస్థితి. సమావేశానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్‌కుమార్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర, పెద్దాపురం, పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జిలు తుమ్మల బాబు, తంగెళ్ల ఉదయశ్రీనివాస్ హాజరయ్యారు. గోకవరం మండల జనసేన పార్టీ కన్వినర్ ఉంగరాల మణిరత్నంపై ఇటీవల టీడీపీ నేత గణేష్ దాడి చేసిన అంశాన్ని సమావేశం ప్రారంభంలోనే సూర్యచంద్ర ప్రస్తావించారు. నెహ్రూ ప్రసంగిస్తుండగానే.. దాడి వ్యవహారాన్ని తేల్చాలంటూ పట్టుబట్టారు. జ్యోతుల నవీన్ కలుగజేసుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. సూర్యచంద్రను నవీన్ గెంటివేయడంతో ఒక్కసారిగా ఇరు పార్టీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. జనసేన టికెట్టు సూర్యచంద్రకు ఇస్తే మద్దతిచ్చేది లేదంటూ జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ చేశారు. దీంతో సూర్యచంద్ర, ఆ పార్టీ నాయకులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మాకన్నా తక్కువ స్థాయి నేతకు మైక్ ఎలా ఇస్తారు? అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగిన టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు హాజరయ్యారు. జనసేన నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్, రాయలసీమ కోకన్వినర్ గంగారపు రాందాస్‌చౌదరి, చేనేత విభాగం అధ్యక్షుడు అడపా సురేంద్ర పాల్గొన్నారు. మొదట రాందాస్‌చౌదరి, తర్వాత రమేష్ ప్రసంగించారు. తర్వాత జనసేన తరఫున శివరాం, సురేంద్రకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనిని మైఫోర్స్ మహేష్ తమ్ముడు, అతడి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ నాయకుడికి కాకుండా తమకంటే తక్కువ స్థాయి నాయకుడికి మైక్ ఎలా ఇస్తారంటూ రాందాస్‌చౌదరిపై తిరుగుబాటు చేయడమేగాక.. గొడవకు దిగారు. కాగా, జనసేన మదనపల్లె అభ్యరి్థగా ప్రచారం చేసుకుంటున్న రామాంజనేయులు, దారం అనిత వర్గం సమావేశానికి డుమ్మా కొట్టారు. కుర్చిలతో కుమ్ములాట కృష్ణా జిల్లా పెడనలో సమావేశం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలోని కొందరికి సమాచారం వెళ్లింది. మరికొంతమంది ముఖ్య నేతలకు సమాచారం చేరకపోవడంతో.. తమ నాయకుడికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసేందుకు టీడీపీలోని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వర్గానికి చెందిన కొందరు ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. జనసేన పెడన నియోజకవర్గ ఇన్చార్జిగా ఇటీవల ఉరివి సర్పంచ్ సురేష్‌ను నియమించడం తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించిన రామ్‌సుదీర్‌ను కాదని వేరే వారికి పదవి ఇవ్వడంపై రామ్సు«దీర్ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీ నేతలు జనసేన ఇన్చార్జి సురేష్ వేదికపైకి ఆహ్వనించి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు యత్నించారు. దీంతో రామ్‌సుదీర్ వర్గీయులు గొడవకు దిగారు. ఆ సమయంలోనే జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ సభావేదిక వద్దకు చేరుకున్నారు. సురేష్‌ను ఏ విధంగా పెడనకు ఇన్చార్జిగా నియమించారంటూ రామ్సు«దీర్ వర్గీయులు నిలదీశారు. అక్కడే ఉన్న జనసేనలోని మరో వర్గం వారు కూడా రామ్‌సుదీర్ వర్గంతో గొడవకు దిగడంతో రసాభాసగా మారింది. ఒక వర్గంపై మరో వర్గం వారు కుర్చిలు విసురుకున్నారు. జనసేన వాళ్లు కుమ్ములాడుకుంటున్న సమయంలో టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సభా వేదిక వద్దకు వచ్చారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించి బయటకు వెళ్లిపోయారు. జనసేన రాష్ట్ర నేత పిలిచినా.. డోంట్ కేర్! విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల ఆత్మియ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ వచ్చారు. ఆయన రాగానే జనసేన నాయకులు లేచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పక్కన కుర్చీ వేశారు. అయితే మూర్తియాదవ్ అక్కడ కాకుండా లైన్ చివరిలో కూర్చున్నాడు. సత్యనారాయణ పలుమార్లు పిలిచినా కనీసం ఆయన వైపు కూడా మూర్తియాదవ్ చూడలేదు. టీడీపీ నాయకులు సైతం పిలిచినా ఆయన స్పందించలేదు. జనసేన నేతలకు అధిష్టానం షోకాజ్.. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగిన అనకాపల్లి నియోజకవర్గంలోని జనసేన నేతలకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులిచ్చింది. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తమకు షోకాజ్ నోటీసులిచ్చి అవమానించడం అన్యాయమని దూలం గోపీనాథ్, మళ్ల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
61 సీట్లపైనే గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 61 సీట్ల కన్నా ఎక్కువ మెజారిటీని బీజేపీ గెలుచుకుంటుందని రాష్ట్ర బీజేపీ ఎన్నికల కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ తరహాలో 119 నియోజకవర్గాల్లోనూ బలంగా ఉన్న ‘సెటిల్డ్’పార్టీ బీజేపీ కాదన్నారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్లో ఈటలతో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. టీయూడబ్లు్యజే రాష్టప్రదాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ ప్రధాన కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈటల రాష్ట్రంలో బీజేపీకి ఉన్న అనుకూలాంశాలను, కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... మూలమైన అంశాలు మూలకు.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మూలమైన నీళ్లు, నిధులు, నియా మకాలు అనే అంశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. అన్ని పనులు ఆపి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒనగూరిన ప్రయోజనం లేకపోగా ప్రాజెక్టు పునాదులే కదిలాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలతో మొత్తం ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకమైంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అప్పటి వరకు ఉన్న రూ. 74 వేల కోట్ల అప్పును రూ. 5.5 లక్షల కోట్లు చేశారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. 17 పోటీ పరీక్షలు నిర్వహిస్తే అన్నీ లీక్ అయ్యాయి. దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, వడ్డీలేని రుణాలు, రుణమాఫీలన్నీ అటకెక్కాయి. పేదలకు భూములు ఇవ్వకపోగా ఎన్నో ఏళ్ల కింద దళితులకు ఇచి్చన ప్రభుత్వ, దేవాలయ భూములు సేకరిస్తున్నారు. గజ్వేల్‌లో 30 వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వారంతా కేసీఆర్ బాధితుల సంఘానికి నన్ను అధ్యక్షుడిగా చేసుకున్నారు. హంగ్‌వస్తే కాంగ్రెస్–బీఆర్ఎస్ ఒకటవుతాయి బీఆర్ఎస్తో బీజేపీ జట్టు కట్టిందని.. ఆ రెండు పార్టీలు ఒకటేనని మాపై ఒక వదంతి పుట్టించారు. రెండు పార్టీలు ఒకటి అయితే నేను గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఎందుకు పోటీ చేస్తా? టీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది తప్ప బీజేపీతో ఎప్పుడూ పొత్తులేదు. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటవుతాయి తప్ప కాంగ్రెస్, బీజేపీ కలుస్తా యా? 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా మూ కుమ్మడిగా బీఆర్ఎస్లో చేరారు. 2018లో 19 మందిని గెలిపిస్తే 13 మంది శాసనసభ్యులు కేసీఆర్ పంచన చేరారు. బీజేపీ మాత్రమే కేసీఆర్‌ను నివారించగలదు. మోదీ పాలనలో స్కాం లేదు. దేశ ఆత్మగౌరవం పెరిగింది. సెటిల్డ్ పార్టీ కాదు బీజేపీ.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్‌గా లేదు. జనసేనతో మాకు అవసరం ఉంది కాబట్టే పొత్తు పెట్టుకున్నాం. 8 సీట్లలో ఆ పార్టీ పోటీ చేస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తరహాలో ‘సెటిల్డ్’ పార్టీ కాదు. అందుకే నాయకులు వస్తుంటారు... పోతుంటారు. బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్టీలు ఎందుకు నాయకులను చేర్చుకుంటున్నాయి? కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, జీహెచ్ఎంసీలలో బీజేపీ సంపూర్ణంగా బలంగా ఉంది. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కొంత మేరకే ప్రభావం చూపుతాం. మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్ మొదలైన మిగతా జిల్లాల్లోనూ బలం పెరిగింది. ఈ లెక్కన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్లకన్నా ఎక్కువే సాధిస్తాం. బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీ బీఆర్ఎస్ ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబమే ముఖ్యమంత్రి పదవి చేపడుతుంది. 1947 నుంచి ఇప్పటివరకు తెలుగునాట బీసీ సీఎం లేరు. జనాభాలో 52 శాతం ఉన్నా పరిపాలన అందని ద్రాక్షే. అందుకే బీజేపీ బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటిస్తే.. రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. దేశంలో బీసీలకు అవకాశాలు కల్పించిందే బీజేపీ. కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. నేడో రేపో బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. -
చిత్తూరు బరిలో నాగబాబు.. గందరగోళంలో టీడీపీ
సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ, జనసేన గందరగోళంలో పడ్డాయి. ప్రజాబలం లేకపోవడం, మరో వైపు అభ్యర్థుల కొరత ఆ రెండు పార్టీలను పట్టిపీడిస్తున్నాయి. నోటాకు వచ్చే ఓట్లు కూడా రాని బీజేపీ శ్రీకాళహస్తిపై ఆశలు పెట్టుకుంది. టీడీపీ–జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ రెండు పార్టీల శ్రేణులు అధికారంలోకి వచ్చేసినట్లు ఎవరికి వారు సీట్లు ప్రకటించుకుంటున్నారు. అందులో భాగంగా తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి తామేనంటూ పసుపులేటి హరిప్రసాద్, మరో వైపు కిరణ్‌రాయల్ ప్రకటించుకుంటున్నారు. లేదు లేదు తామే పోటీలో ఉన్నామంటూ టీడీపీ చెప్పుకుంటోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ, జనసేనకు చెందిన కొందరు ఓ ఒప్పందానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ లేదా నాగబాబు పోటీ చేస్తే తాము తిరుపతి టికెట్‌ని త్యాగం చేస్తామని కొందరు టీడీపీ శ్రేణులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరిసింహయాదవ్ వర్గీయులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇన్నేళ్లు పార్టీని నమ్ముకుని, పార్టీ కోసం కష్టపడుతుంటే, పొత్తంటూ వచ్చి తిరుపతి టికెట్ తన్నుకెళ్తామంటే ఒప్పుకునేది లేదని భీష్మించుకున్నారు. వీరిద్దరూ కాకుండా మరో ఇద్దరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. చిత్తూరు తీసుకోండి చిత్తూరులో టీడీపీని నమ్ముకుని ఉన్న మాజీ మేయర్ కఠారి హేమలత, గీర్వాణి చంద్రప్రకాష్‌ను ప్రస్తావించకుండా ఆ పార్టీ అధినాయకులు జనసేనకు ఆఫర్ ఇచ్చారు. చిత్తూరులో బలమైన అభ్యర్థులు లేరని, కావాలంటే జనసేన నుంచి ఎవరైనా పోటీచేస్తే తాము మద్దతు ఇస్తామని టీడీపీ అధినాయకత్వం చెప్పినట్లు సమాచారం. అయితే టీడీపీలోని కొందరు తమను సంప్రదించకుండా జనసేనకు ఎలా మాట ఇస్తారని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. అధిష్టానం ఏదైనా ఆదేశిస్తే ముందుండి చేసేది మేమైతే.. పొత్తంటూ జనసేనకు ఇవ్వడం ఎంత వరకు న్యాయం అని ఆ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభ్యర్థులు, ప్రజాబలం లేని జనసేన పార్టీ గంగాధరనెల్లూరు, సత్యవేడు నుంచి కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించుకుంటున్నారు. ఎవరినీ సంప్రదించుకుండా జనసేన వారు లేని పోని ప్రచారాలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు శ్రీకాళహస్తిలో మూడు ముక్కలాట నోటాకు వచ్చే ఓట్లు కూడా రాని బీజేపీ శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని స్థానిక నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగా తానే అభ్యర్థి అని కోలా ఆనంద్ చెప్పుకుంటున్నారు. తాము పోటీ చేస్తాను కాబట్టి జనసేన శ్రేణులు తమకే మద్దతు ఇవ్వాలని కమలనాథులు కోరుతున్నారు. అదెలా కుదురుతుంది, తామే పోటీచేస్తామంటూ జనసేన అంటోంది. ఈ రెండు పార్టీలు ఇలా ఉంటే, పొత్తులో భాగంగా జనసేన టీడీపీకి మద్దతు ఇస్తుందని బొజ్జల సుధీర్‌రెడ్డి, మరో వైపు ఎస్సీవీ నాయుడు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా, శ్రీకాళహస్తి కమలనాథులు తమకే మద్దతు ఇస్తారని చెప్పడం గమనార్హం. తెలంగాణాలో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటే, ఏపీలో జనసేన టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించింది. టీడీపీ మాత్రం ఎన్నికల బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మేలు చేసేందుకు పరోక్షంగా మద్దతు ఇస్తోంది. 2019 ఎన్నికల్లో ఒకే సీటుతో సరిపెట్టుకున్న టీడీపీ, ఉనికే లేని జనసేన, నోటా ఓట్లు కూడా రాని బీజేపీ ఎవరికి వారు తాము పోటీ చేస్తున్నాం అంటూ ప్రచారం చేసుకుంటుంటే జనం నవ్వుకుంటున్నారు. అధికారం కోసం ఇంతగా దిగజారటం ఏంటో ఇటు ఓటర్లూ, అటూ రాజకీయ పార్టీలు అయోమయంలో మునిగిపోయారు. -
జనం లేని సేన
రాజకీయ నేతగా అవతారం ఎత్తిన సినీ హీరో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉనికి చాటేందుకు ఉత్సాహ పడుతున్నారు. ఈ నవంబరులో జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏకంగా 32 సీట్లు తమకు కావాలని బీజేపీతో బేర సారాలు మొదలు పెట్టారు. అవి కూడా ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలు, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న స్థానాలు కావడం విశేషం. ఏపీలో రాజకీయాలు చేస్తున్న జనసేనకు వాస్తవానికి తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో కేసును ఎదుర్కొంటున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా వీరంగం కట్టిన పవన్ కళ్యాణ్ 2024 ఏపీ శాసన సభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుని తమ భాగస్వామ్యం గురించి ప్రకటన కూడా చేశారు. తెలంగాణ శాసన సభ ఎన్నికలు వేదికగా.. జనసేన పార్టీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అయిదు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఎన్నికల అరంగేట్రం చేసింది. కానీ, ఒక్క చోటా ఆ పార్టీ గెలవలేకపోయింది. సినిమా హీరోగా ఉన్న అభిమానమే పునాదిగా జనసేన ఇక్కడ రాజకీయ కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తున్నా ఇప్పటి దాకా ఆ దిశలో పడిన అడుగులు తక్కువే. కానీ, ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కనీసం 32 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు తాము ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని చర్చలు జరుపుతున్న బీజేపీ నాయకత్వం వద్ద ఈ ప్రతిపాదన కూడా పెట్టింది. ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరం పరిధిలోని పటాన్ చెరు, కూకట్ పల్లి, సనత్ నగర్, కుద్బుల్లా పూర్, శేరిలింగం పల్లి, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్.బి.నగర్ నియోజకవర్గాలలో పోటీ చేయాలని యోచిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఈ ఓటర్లంతా టీడీపీ వెనక నిలబడినట్లు నాటి ఎన్నికల ఫలితాలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ 15 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంత నియోజకవర్గాలే ఏడు కావడం ప్రస్తావనార్హం. తెలంగాణలో ఆంధ్రా సెటిలర్స్ జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉండే.. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా పోటీ కోసం జనసేన ఉవ్విళ్ళూరుతోంది. ఒక్క నల్గొండ జిల్లాలోనే 4 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో ఈసారి పోటీ ఎందుకంటే..? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటికే 2014, 2018 లో శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎన్నికల్లో జనసేప పోటీ చేయలేదు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 5 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఫలితం సాధించలేక పోయింది. ఇక్కడ సత్ఫలితాలు సాధించేంతగా జన బలం లేదని తెలిసినా ఈ సారి ఏకంగా 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన ఎందుకు నిర్ణయించుకుంది..? 2019 లోక్ సభ ఎన్నికల తర్వాతి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో బలపడేలా కార్యక్రమాలు ఏమన్నా నిర్వహించిందా..? జనంలోకి చొచ్చుకుపోయిందా ..? అన్న ప్రశ్నలకు ఒక్క దానికి కూడా ఆ పార్టీ నేతల దగ్గర సరైన సమాధానం దొరకదు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ స్కామ్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముద్దాయిగా కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలను ఎదుర్కోవడమే గగన కుసుమంగా మారిన కారణంగా తెలంగాణలో టీడీపీ చేతులు ఎత్తేసింది. చివరి నిమిషం దాకా తేల్చకుండా తీరా మూడు రోజుల కిందట తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు చావుకబురు చల్లగా చెప్పిన చంద్రబాబు తీరుతో టీటీడీపీ నాయకులు, శ్రేణులు షాక్ గురయ్యాయి. దీంతో రెండు రోజుల కిందట టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువా కప్పేసుకున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయదన్న విషయం జనసేన అధినేతకు ముందే తెలుసా..? ఆ కారణంగానే ఆయన బీజేపీలో పొత్తుల రాయబారం నడిపారా..? తెలంగాణలో టీడీపీకి ఉన్నట్లు భావిస్తున్న అంతో ఇంతో ఓటు బ్యాంకు చెదిరిపోకుండా ఈ ఎన్నికల్లో జనసేనను బరిలోకి దింపుతున్నారా అన్న అంశాలు ఇపుడు చర్చకు వస్తున్నాయి. దిగజారిన టీడీపీ స్థానంలో.. జనసేను నిలబెట్టే ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైంది. 2014 లో 15 సీటులు గెలుచుకున్నా టీటీడీఎల్పీని నాటి టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 3 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. చివరకు 2023 ఎన్నికల్లో పోటీ చేయకుండా పక్కకు తప్పుకుని ముందే అస్త్ర సన్యాసం చేసింది. ఇపుడు టీటీడీపీ స్థానంలో జనసేనను నిలబెట్టే ప్రయత్నాలు తెలంగాణలో జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు మంచి ఊపు మీదున్న బీజేపీ ఆ తర్వాత చతికిల పడింది. పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది. ఏ పార్టీలతో పొత్తు లేదు.. ఈ సమయంలో జనసేన తాము ఉన్నామంటూ పొత్తుల కోసం వస్తోంది. పొత్తుల అంశం ఇంకా ఖరారు కాకున్నా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోసం తాము పోటీ చేసిన స్థానాల నుంచి వైదొలిగిన జనసేన ఈ సారి 32 సీట్లలో తాము పోటీ చేస్తామని, తమకు మద్దుత ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్.డి.ఎ)లో బీజేపీతో కలిసి జనసేన భాగస్వామ్య పక్షంగా పనిచేస్తోంది. ఈ అంశాన్ని ముందు పెట్టి తెలంగాణలో బీజేపీ అండదండలతో పాగా వేసే ప్రతయ్నాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -మిత్ర. ఎన్ -
ఎవరు ఈ రుక్మిణి కోట ?..పవన్ కళ్యాణ్ కి రుక్మిణి కోటకు ఉన్న సంబంధం అదే..
-
జనసేనకు వెన్నుపోటేనా?
వెన్నుపోటు అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటేనే వెన్నుపోటు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు నుంచి వెన్నుపోటు తప్పదా? సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన వెనక్కి తగ్గాల్సిందేనా?, టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లతోనే జనసేన సరిపెట్టుకోవాల్సిందేనా? అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తును ఆగమేఘాల మీద ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైలమాలో పడ్డారు. సీట్ల విషయంలో పవన్‌కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు పవన్ సర్దుకుపోదామనుకున్నా.. జనసేన కనీన స్థానాల్లో పోటీ చేయకపోతే అభిమానులు మాత్రం జీర్ణించుకోలేరు. కాగా, వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు చంద్రబాబు .. ఇప్పుడు తననునమ్ముకుని తిరుగుతున్న పవన్‌కు వెన్నుపోటు పొడవడం ఖాయమా?, ఇదే అంశం జన సైనికుల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అసలు జససేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే అంశంపై ‘సాక్షి. కామ్‌లో పోల్ క్వశ్చన్ నిర్వహించగా 10 నుంచి 20 సీట్లు మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడ్డారు. గతంలో మామకు వెన్నుపోటు పొడిచిన తరహాలో పవన్‌కు కూడా వెన్నుపోటు తప్పదా అంటూ తర్జనభర్జనలు పడిపోతున్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే దానిపై ఒక అంచనా రాలేకపోతున్నారు పవన్ అభిమానులు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అసలు జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందో అనే విషయం స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. మరొకవైపు చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలంతా నీరుగారిపోయారు. పార్టీ పనైపోయిందంటూ అంతర్గతంగా కుమిలిపోతున్నారు. నడిపించే నాయకుడు లేక తలోదారి చూసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన సమయంలో టీడీపీ సీనియర్ నేతలంతా పక్కన విధేయులుగా నిలబడినా ఈ ప్రకటనను ‘తమ్ముళ్లు’ జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన పొత్తు అంశం తమ సీట్లకే ఎసరు తెస్తుందని తమ్ముళ్లలో కలవరం మొదలైంది. ఇది కూడా చదవండి: పవన్‌కు ఎందుకంత కడుపుమంట? ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
‘పొత్తు గురించి చంద్రబాబు చెప్పాలి గానీ, ప్యాకేజీ స్టార్ చెప్పేదేంటి?’
టీడీపీతో పొత్తు ఉంటుందంటూ ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన.. ఇప్పుడు టీడీపీని కలవరపాటుకు గురిచేస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న టీడీపీ నేతలు పోటీ చేసేందుకు జంకుతున్నారు. పొత్తులో నిజంగా జనసేనకు టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. అందువల్లే చాలా మంది టీడీపీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో కేడర్‌ను కాపాడుకునే క్రమంలో టీడీపీ ముఖ్య నేతలు కులాల వారీగా పదవులు కట్టబెడతామని ఆశ చూపుతూ బీసీ, ఎస్సీ కులాల వారితో హడావుడి చేయిస్తున్నారు. అసలు పొత్తు గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన చేయకుండా, ఇలా పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం ఏంటనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలంతా నీరుగారిపోయారు. పార్టీ పనైపోయిందంటూ అంతర్గతంగా కుమిలిపోతున్నారు. నడిపించే నాయకుడు లేక తలోదారి చూసుకుంటున్నారు. ఈ తరుణంలో కొందరు టీడీపీ నేతలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు, నిరసనలు చేయిస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం అమాయక ప్రజలను కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జిల్లాలో నాలుగైదు చోట్ల వెలుగు చూశాయి. ధర్నాల్లో పాల్గొంటే పార్టీలో పదవులు ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కేసులు మోసుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశచూపి ప్రేరేపిస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు కు(టి)ల రాజకీయాలు చేస్తున్నారు. పదవుల పేరుతో ఆశచూపి.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇటీవల టీడీపీ నేతలు ధర్నాలు, దీక్షలు చేపట్టారు. అయితే సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా స్పందన కరువైంది. దీంతో ‘ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డారు. ధర్నాలు చేయండి.. దీక్షల్లో పాల్గొనండి.. పోలీసులపై తిరగబడండి...రానున్న రోజుల్లో పే...ద్ద పదవులు వస్తాయి. ముందుకు రండి’అని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కేడర్‌ను రెచ్చగొడుతున్నారు. కానీ ఇన్నాళ్లూ అంతా తామే...అన్నీ తామే అంటూ పెత్తనం చేసిన నేతలు ఇప్పుడు ఇలా ‘బాబ్బాబు’ అంటూ అడుక్కుంటున్నా... కేడర్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మీ పార్టీలో పోస్టులొద్దు... మీరూ వద్దూ అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు కొందరికి డబ్బు, మద్యం ఎరగా వేసి ప్రేరేపిస్తున్నారు. పార్టీ కమిటీలోనూ ఉన్నత పదవులిస్తామంటూ చిన్నస్థాయి కార్యకర్తలకు ఆఫర్లు ఇస్తున్నారు. సీటు గ్యారెంటీ లేక... జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేతలంతా పక్కన విధేయులుగా నిలబడగా రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట పవన్ చేసిన ఈ ప్రకటనను ‘తమ్ముళ్లు’ జీర్ణించుకోలేకపోతున్నారు. పొత్తు గురించి తమ నాయకుడు చెప్పాలి గానీ, ఈ సినిమా యాక్టర్ చెప్పేదేందంటూ రగిలిపోతున్నారు. మరోవైపు ఇక టీడీపీని కూడా తామే నడిపిస్తామని జనసైనికులు చెప్పుకుంటున్నారు. జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాలు కూడా పొత్తులో తమకే వస్తాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. -
జనసేనతో పొత్తు ఉందో.. లేదో పైవాళ్లే చెప్పాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుతం బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతోందా లేదా అన్నది తమ అధిష్టానమే చెబుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పురందేశ్వరితో పాటు పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ సుజనాచౌదరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ , కోర్‌కమిటీ సభ్యులు చంద్రమౌళి, రేలంగి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దయాకర్‌రెడ్డి, సీతారామాంజనేయచౌదరి, శివన్నారాయణ, కాశీవిశ్వనాథరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేనతో పొత్తు అంశం, ఇటీవల పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ బీజేపీ పేరు కనీసం ఉచ్ఛరించకపోవడం తదితర అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. సమావేశ వివరాలను పురందేశ్వరి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేనతో ప్రస్తుతం బీజేపీ పొత్తు కొనసాగుతోందా.. లేదా.. అని ఓ విలేకరి ప్రశ్నించగా.. పురందేశ్వరి బదులిస్తూ ‘దానిపై నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిని మేం మా నాయకత్వానికి వివరించి చెబుతాం. వారు (పవన్‌కళ్యాణ్) ఏకారణంతో ఆ నిర్ణయం తీసుకున్నారో వారే చెప్పారు. అవన్నీ మేం మా నాయకత్వానికి చెబుతాం. దానిపై నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది..’ అని చెప్పారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలంటే వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంటాయిగానీ, తమది జాతీయ పార్టీ అని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలో ప్రతిదానికి ఒక ప్రొసీజరు ఉంటుందని, దాని ప్రకారమే వెళతామని చెప్పారు. బీజేపీతో కలిసి వెళితే ఓట్లు వస్తాయేమోగానీ, జనసేన నుంచి ఎంతమంది అసెంబ్లీకి వెళతామో గ్యారంటీ ఇవ్వలేమంటూ పవన్ తమ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన మాటలను విలేకరులు గుర్తుచేయగా.. ‘అది ఆయన కామెంట్. వారి ప్రతి కామెంట్ మీద నేను స్పందించాల్సిన అవసరం లేదు. మా పార్టీ, మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుకూలంగానే వెళతాం..’ అని బదులిచ్చారు. జనసేన–టీడీపీ పొత్తు కచ్చితం, మాతో బీజేపీ కలిసివస్తుందో రాదో తేల్చుకోవాలని పవన్‌కళ్యాణ్ అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా.. ‘వారి (పవన్) వైపు నుంచి ఆయన చెప్పారు. మాకు కూడా పైనుంచి రావాలి కదా. మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అనుసరించి వెళతాం’ అని ఆమె పేర్కొన్నారు. దసరాకు ముందే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం దసరా పండుగకు ముందే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని కోర్ కమిటీ సమావేశం నిర్ణయించినట్లు పురందేశ్వరి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నాయకుడు సంతోష్ ఆ సమావేశానికి వస్తారని తెలిపారు. -
నైతికత వదిలేసిన చంద్రబాబు
కాకినాడసిటీ: రాష్ట్రంలో తమకు ప్రజాదరణ తగ్గిపోయిందని గ్రహించిన చంద్రబాబు తన కేడర్‌ను, నాయకులను నమ్మలేక జనసేనను పక్కన పెట్టుకొని రాజకీయ నైతికతను మొత్తం వదిలేశారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ తనను నమ్ముకున్న అనేక వర్గాలను హింసించడానికి తోడ్పడ్డాడని విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రతిసారీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది అరాచక పాలన అంటున్నారని, పేదలు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరీ వారి సంక్షేమం కోసం పాటు పడటమే అరాచకమా? వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చడం కోసం పని చేయడం అరాచకమా? చెప్పాలని మంత్రి వేణు నిలదీశారు. -
‘కనీసం 10 చోట్లయినా పవన్‌కు అభ్యర్థులున్నారా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తనను నమ్మిన అభిమానులని మోసం చేశారని మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. జైలులో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ధ్వజమెత్తారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి పవన్ అని విమర్శించారు మంత్రి రోజా. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పవన్.. సీఎం జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సోనియానే ఢీకొన్న దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని మరోసారి గుర్తుచేశారు రోజా. మంత్రి ఆర్కే రోజా ఇంకా ఏమన్నారంటే.. తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ తన తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్. సీఎం జగన్కఉ ఎంపీగా 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. జగన్ ఫొటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయావు. పవన్ మిగిలిన పార్టీ జెండాలు మోసే కూలీగా మారిపోయారు. తండ్రి అడుగుజాడల్లో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్. పవన్ తన స్థాయికి తగినట్టు మాట్లాడాలి. అమిత్ షాకు కంప్లైంట్ చేస్తానంటూ పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ దేనిలో నైనా సక్సెస్ అయ్యారా ?, యుద్దానికి సీఎం జగన్ ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. పవన్‌కు 10 చోట్లయినా అభ్యర్థులున్నారా? కనీసం 10 చోట్లయినా పవన్‌కు అభ్యర్థులున్నారా ?, సీఎం జగన్ సింహంలా సింగిల్ గానే వస్తారు. చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికినా వీరికి సిగ్గు లేదు. టీడీపీ సానుభూతి డ్రామాలు ప్రజలు నమ్మడం లేదు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు తప్పించుకున్నారు. అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయకుండా ఉంటారా ?, అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ తో అందరికీ అర్థమైంది. బ్రాహ్మణి టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివారు. బ్రహ్మణికి రాజకీయంగా ఏమి తెలీదని నిన్ననే అర్ధమైంది బ్రహ్మిణికి ఏం తెలుసనీ మాట్లాడుతున్నారు లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలీదు. బ్రహ్మణికి ఏం తెలుసనీ మాట్లాడుతున్నారు. స్కిల్ స్కామ్ గురించి వీరెవరూ ఎందుకు మాట్లాడరు. చంద్రబాబు సంతకాలు పెట్టారో లేదో సీఐడీ ఆఫీసుకు వెళితే చూపిస్తారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో 13 చోట్ల సంతకాలు పెట్టారా లేదా ?, సీమెన్స్ సంస్థ ఒప్పందం చేసుకోలేదని చెప్పిందా లేదా ?, బోగస్ కంపెనీలకు నిధులు విడుదల చేశారా లేదా ?, అధికారులు వద్దని చెప్పినా చంద్రబాబు ఒత్తిడి చేశారా లేదా?, ఈ ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలి. ఉద్యోగాలు పేరుతో చంద్రబాబు యువతను మోసం చేశారు. సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న వ్యక్తి సీఎం జగన్. బ్రాహ్మణి చంద్రబాబు మేనిఫెస్టో తెప్పించుకుని చూడాలి.స్కిల్ స్కామ్ ను జీఎస్టీ , ఈడీ వెలుగులోకి తెచ్చాయి పవన్ పిచ్చికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం సీఎం జగన్ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడితే పవన్ అయిన, ఎవడికైనా పళ్లు రాలగొడతామన్నారు మంత్రి ఆర్కే రోజా. ‘పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరింది. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం. సీమన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ ఓ పెద్ద దొంగ. దొంగ చెప్పే మాటలు ఎవరు పట్టించుకుంటారు. సుమన్ బోస్ మాజీ ఎండి ఎందుకయ్యారు?, సీమన్స్ సంస్థ కోర్టులోనే ఈ వ్యక్తి తమకు తెలియకుండా చేశాడని కోర్టులోనే చెప్పారు’ అని రోజా తెలిపారు. చదవండి: సైకిల్ గుర్తుతో జనసేన పోటీ? -
పొత్తు పొడిచింది అమరావతి కోసమే
ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడుని పరామర్శించారు పవన్ కళ్యాణ్. వెనువెంటనే పొత్తు వుంటుందని ప్రకటించారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన వెనువెంటనే పవన్ కళ్యాణ్ వైఖరి, చంద్రబాబుని అరెస్ట్ చేసినపుడు ఏపీ బార్డర్ వద్ద పవన్ వైఖరి జైలు వద్ద పొత్తు ప్రకటన వీటన్నిటి వెనుక అమరావతి అంశంతో సంబంధం ఏమిటి అనే చిదంబర రహస్యం శోధించే ప్రయత్నం చేద్దాం భూములు ఇచ్చిన రైతులు : 29000 పైచిలుకు భూమి విస్తీర్ణం : 33,000 ఎకరాలు CRDA చట్టం ప్రకారం రోడ్లు, పార్కులు, ఎమినటీస్ 50% అనగా రమారమి 16,500 ఏకరాలు రైతుల వాటా : రమారమి 8,250 ఎకరాలు ప్రభుత్వ వాటా : రమారమి 8,250 ఎకరాలు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే రాజధాని కొనసాగి వుంటే 25% ప్రభుత్వ మిగులు భూమి ఎకరాల విలువ 2,00,000 కోట్లకు చేరి వుండేది అన్నారు. ఆయన లెక్క ప్రకారం 8,250 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి విలువ రూ. 2,00,000 కోట్లు అయినపుడు రైతులకి ఇచ్చిన వాటాష కూడా 25% కావున ఆ భూమి విలువ కూడా రూ.2,00,000 కోట్లకీ చేరి వుండాలి. అంటే సీఎం జగన్ సూచించినట్టు ల్యాండ్ పూలింగ్ ద్వారా కాకుండా ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టినట్టు ఐతే రైతులకి అంగుళం భూమి కూడా ఇవ్వవలసిన ఆవశ్యకత వుండేది కాదు. అపుడు రైతుల వాటాగా చెబుతున్న భూమి విలువ 2,00,000 కోట్లు కూడా ఖజానాకి వచ్చేది కదా. జగన్మోహన రెడ్డి గారు ముందు చూపుతో 33,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని నిర్మించి తద్వారా పెరిగిల లాభాలు ఖజానాకి చేర్చి తద్వారా ప్రజలకి చేర్చాలని చూసిన విజనరీ కాదా చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ విధానం వలన ప్రభుత్వ ఖజానాకి రావలసిన రెండు లక్షల కోట్లు 29,000 పైచిలుకు రైతుల ముసుగలో దూరిపోయిన అస్మదీయులకి చేర్చాలని చూశారు. దీనిని స్కాం అనకుండా ఏమి అంటారు. ల్యాండ్ పూలింగ్ కాకుండా భూసేకరణ చేసి వున్నట్టు ఐతే ఏమి జరిగేదో చూద్దాం ప్రభుత్వ భూమి 33,000 ఎకరాలు ఒకే చోట లేదు కావున మేము భూసేకరణ దిశగా నిర్ణయం తీసుకున్నామనీ అది అమరావతి పరిసర ప్రాంతాల లోనే నిర్మించాలనేది ప్రభుత్వ నిర్ణయం అనేది ప్రభుత్వ వాదన. 2014లో అమరావతి గ్రామాల్లో ఓపెన మార్కెట్ లో భూమి విలువ ఏకరాకి 8-10 లక్షలు మాత్రమే వున్నది. ఇక రెవెన్యూ శాఖ వారి కార్డ్ విలువ ప్రకారం రిజిస్టర్ ఆఫీసు విలువ 2-3 లక్షలుగా వున్నది. ►2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజస్టర్ ఆఫేసులో నమోదైన విలువకి 2-3 రెట్లు ఇవ్వాలి అనగా ఎకరా నాలుగు నుండి తొమ్మిది లక్షలు విలూవ కట్టి చెల్లించాలి. ఐతే అది దాదాపు మార్కెట్ విలువ ఐన 10 లక్షల దరిదాపులకే చేరుతుంది. కావున రైతులు భూమి ఇచ్చేందుకు నిరాకరించే వారు. ►CRDA ల్యాండ్ పూలింగ్ చట్టం బదులు ఓపెన్ మార్కెట విలువకి రెట్టింపు అనగా ఎకరా ఇరవై లక్షలు ధర నిర్ధారించి చట్ట ప్రకారం మీ భూమి విలువ తొమ్మిది లక్షలుహమాత్రమే కానీ ప్రభుత్వం మీకు ఇరవై లక్షలు ఇవ్వాలని నిర్థారించినది అని ప్రతిపాదన పెట్టి వుంటే దాదాపు రైతులు అందరూ అంగీకరించే వారు. ఒకవేళ అంగీకరించని పక్షంలో ఏ చోట ఐతే రైతులు అటువంటి ప్రతిపాదనని అంగీకరించే వారో అక్కడే రాజధాని నిర్మించుకుని వుండాల్సింది. ఇలా ఎకరా ఇరవై లక్షల చొప్పున చెల్లించి వుంటే 33,000 ఎకరాల కొనుగోలుకి అయ్యే ఖర్చు 6,600 కోట్లు మాత్రమే అయ్యేది. ►చంద్రబాబు లెక్క ప్రకారం ప్రభుత్వ వాటా 25% భూమి విలువ రెండు లక్షల కోట్లు అయినపుడు రైతుల వాటా కూడా 25% కావున వారి వాటా విలువ కూడా రెండు లక్షల కోట్లే కావున నాడు రైతులకి రెట్టింపు ధరతో రూ.6,600 కోట్లు చెల్లించి మొత్తం భూమి రైతుల నుండి సర్వ హక్కులతో కైవశం చేసుకుని వుంటే మొత్తం ప్రభుత్వ భూమి అయి వుండేది. రైతులకి మార్కెట్ రేట్ చొప్పున చెల్లించిన రూ. 6,600 కోట్లు పోనూ నేడు ప్రభుత్వ ఖజానాకి రూ.1,93,400 కోట్లు మిగిలి వుండేవి. ప్రభుత్వ ఖజానాకి వెళ్ళ వలసిన ఈ రూ. 1,93,400 కోట్లు 29,000 మంది రైతులకి చట్టబధ్ధంగా బదిలీ చేయటం స్కాం అనకుండా ఏమి అంటారు ? ►ఇవి మాత్రమే కాకుండా పదేళ్ళ పాటు ఏటా చెల్లించ వలసిన కౌలు అదనంగా ఖజానా పై దాదాపు రూ.1800 కోట్ల భారం ప్రభుత్వం పైన పడినది. ఔట్ రైట్ భామి కొని వున్నట్టు ఐతే ఖజానాపై ఈ భారం పడేది కాదు. ప్రభుత్వ ఖజానాకి రావలసిన లక్షల కోట్ల రూపాయలు రైతుల పేరిట భూస్వాములకి దోచిపెట్టడాన్ని స్కాం అనేందుకు విపక్షాల నోరు ఎందుకు రావటం లేదో అంతపట్టని అంశం. తెలుగుదేశం నాయకులు చెబుతున్న కుంటి సాకులు ►2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావున ప్రభుత్వ ఖజానాలో 33,000 ఎకరాల కొనుగోదుకి చెల్లించవలసినంత డబ్బు లేదు అని. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి సంవత్సరం భడ్జట్ 1,11,823 కోట్లు కాగా మరుసటి సంవత్సర బడ్జట్ 1,13,049 రెండు సంవత్సరాల బడ్జట్ కలిపితే 2,24,872 కోట్లు. ఈ బడ్జట్ నుండి 6,600 కోట్లు తీయటం పెద్ధ సమస్య ఏమీ కాదు. రాజధాని నిర్మాణ నిర్ణయం డిసెంబరులో తిసుకున్నందున రైతులకి చెల్లించవలసిన డబ్బు రెండు ఆర్థిక సంవత్సరాల లోపు చెల్లించాలి అని నిర్ణయం తీసుకున్నా అనగా 2014-15 & 2015-2016 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ కేటాయింపులలో పరిగణలోకి తీసుకున్నా పెద్ద కష్టమైన అంశం కాదు. 2018-2019 బడ్జట్ 1,91,064 కోట్ల నుండి 20,000 కోట్లు పసుపు కుంకుమ కోసం సునాయసంగా తీయగలిగారు. రైతులు ఇచ్చిన భూమిలో రాజధాని కడితే ఆ లాభాలలో ప్రభుత్వ ఖజానాకి హక్కు వుంటుందా ? ►రాజధాని ప్రకటనకి పూర్వం అమరావతిలో భూమి విలువ ఎకరా 8-10 లక్షలు మాత్రమే. అక్కడ రాజధాని కట్టాలంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేల, అధికారులు ప్రభుత్వ సిబ్బంది తదితర నివాస గృహాలు నిర్మించాలి. అనగా అవి ప్రభుత్వ ఆస్తులు అంటే ఐదు కోట్ల మంది ప్రజల ఆస్తులు. ►అక్కడ ఐదు కోట్ల మందికి చెందిన ఆస్తులు అయినాప్రభుత్వ భవనాల కట్టడం వలన ఆ భూమి విలువ పెరిగిందే తప్ప ఆ భూముల విలువ అమానతంగా పెరిగిపోవటానికి కోహినూర్ వజ్రాల గనులు లేదా బంగారు గనులు ఏమీ లేవు. ఐదు కోట్ల మందికి చెందిన ప్రభుత్వ భవనాల నిర్మాణం వలన భూమి విలువ అనూహ్యంగా పెరిగితే దాని లాభం హకాకు ప్రభుత్వ ఖజానాకే చెందుతుందని కానీ ఆ లాభాలలో రైతులని భాగస్వాములు చేయటం ఖజానాకి ద్రోహం చేయటమే. ►భూములు ఇచ్చినందుకు రైతులకి మార్కెట్ ధర కంటే రెట్టింపు ఇవ్వటం పూర్తిగా న్యాయబధ్ధం. ►ఒకవేళ రైతులు తాము వ్యవసాయమే చేస్తాము అని కోరితే అదే సారవంతమైన భూమి అవే పంటలు పండే భూమి రాజధాని పరిధి బయట ఎకరాకి రెండెకరాలు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించి వుండవలసినది. నిజంగా రైతులది త్యాగమా ? ►ప్రభుత్వ అనుకూల మిడియాలో రైతులు ఇచ్చిన భూమిలో 25% కి మాత్రమే ప్రతిఫలం తీసుకుని 75% భూమి త్యాగం చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. చూడటానికి ఇది నిజమే కదా అని అనిపించినా దీని వెనుక అసలు మతలబు ఏమిటి అసలు మర్మం ఏమిటో ప్రజలు తెలుసుకోవాలి. ►రైతులు కేవలం 25% భూమిని మాత్రమే తిరిగి పొందుతున్నప్పటికీ మిగిలిన 75% భూమిలో ఏమి చేస్తున్నారో రైతులు కానీ టీడీపీ కానీ వారి అనుకూల మీడియా కానీ చెప్పరు. ఆ 75% భూమిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్ గవర్నర్, ముఖ్యమంత్రి నివాసాలు, ప్రభుత్వ భవనాలు, ఉన్నతాధికారులు సిబ్బంది భవనాలు, రోడ్లు, పార్కులు, భవనాలు కట్టడం వలన భూమి విలువ అమాంతంగా పెరిగిపోతుంది. అక్కడ ఎకరా 10 లక్షల నుండి 20 కోట్లకి చేరుతుంది. అంటే వారి వాటా కింద వచ్చే 25% భూమి విలువ 5 కోట్లకి చేరుతుంది. రాత్రికి రాత్రి తమ భూమి విలువని 10 లక్షల నుండి ఐదు కోట్లకి అంటే అమాంతంగా 50 రెట్లు పెంచుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకునేందుకు 75% శాతం భూమి అందజేస్తామన్నారు కాని ఏదో రాష్ట్రానికి దానం చేసేందుకు కాదు త్యాగం అంతకంటే కాదు. ►దురదృష్టవశాత్తు భూమి ఇచ్చి కోట్ల లాభం పొందే స్కీం ని సైతం రైతులు చేస్తున్న త్యాగం అని అభివర్ణించటంలో టీడీపీ ఎల్లో మీడియా ప్రచారం చేయటంలో నవరసాలు ఒలికించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సీఎం జగన్‌పై అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నారు అనే విషయానికి వధ్ధాము. ►2019 ఎన్నికలకు పూర్వం ప్రచారంలో భాగంగా కర్నూలు వెళ్ళిన పవన్ కళ్యాణ్ కర్నూలే నా మనసుకి రాజధాని అన్నారు. విశాఖపట్నం వెళ్ళినపుడు విశాఖ రాజధాని అయితే బావుండేది అన్నారు. అమరావతి ఒక సామాజిక వర్గానికి గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నారు. వాస్తవానికి జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన వెనువెంటనే పవన్ కళ్యాణ్ ఒక నిలువెత్తు బొకే వెంట తీసుకుని జగన్మోహన్రెడ్డి గారిని కలిసి కౌగిలించుకుని లేదా కనీసం ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి. ‘‘మీ నిర్ణయం నా ఆలోచనలకి దగ్గరగా వున్నది, కర్నూలే నా మనసుకి రాజధాని అని ఆ ప్రజలతో చప్పట్లు కొట్టించుకున్నాను అక్కడ హైకోర్టు పెడుతున్నారు, విశాఖలో అదే మాట చెప్పాను అక్కడ సెక్రటేరియట్ కడుతున్నారు, అమరావతి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నాను అక్కడ అన్ని కులాలకి చెందిన యాభై వేలమందికి గృహాలు నిర్మించి ఇస్తున్నారు. ధన్యవాదములు’’ అని చెప్పాలి. ►ప్రజల ముందు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఎన్నికలకి పూర్వం తాను చెప్పిన ఆలోచలనలని అమలు చేస్తున్నందుకు సంతోషించవలసిన పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గమనిస్తే షాక్‌కు గురిచేస్తోంది. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే అమరావతి చేరుకున్నాడు. చేతులు విసిరాడు, జుట్టు ఎకరేసాడు, తల ఎగరేశాడు, కంచెలు దూకాడు, పోలీసులపై విరుచుకు పడ్డాడు. ఏదో కోల్పోయిన వాడిలా, మతిస్థిమితం కోల్పోయిన వాడిలా, మతిస్థిమితం కోల్పోయి, మానసిక సమతుల్యం కోల్పోయి, ఒకే రోజు యావదాస్తి కోల్పోయిన స్టాక్ బ్రోకర్ వలె ఉన్నది ఆ రోజు ఆయన వ్యవహార శైలి. అంతకు మునుపు కర్నూలు లో రాజధాని అనీ, విశాఖలో రాజధాని అనీ అమరావతి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అన్న పవన్ కళ్యాణ్ ని మూడు రాజధానుల ప్రకటన అంతలా ఎందుకు కలవరపెట్టినది అంతగా ఎందుకు ఖంగుతిన్నాడు అంతలా ఎందుకు బెంబేలెత్తిపోయాడు అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించవలసిన అంశం. ►మూడు రాజధానుల ప్రకటన వచ్చిన పిదప అమరావతిలో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేసిన పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీ పరుగులు పెట్టాడు. ఎన్నికల ముందు మోదీ సహా బీజేపీ నాయకులని బండబూతులు తిట్టిన బీజేపీ పెద్దలని కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం నానా ప్రయత్నాలు చేశాడు. అపాయింట్మెంట్ దొరక లేదు. మోదీ దృష్టిని ఆకట్టుకునేందుకు మాజీ సైనికుల సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించి ఇచ్చినది సైనికుల సహాయ నిధికి ఐతే ఎందుకో గానీ మోదీని ట్యాగ్ చేస్తూ నేను మాజీ సైనికుల సహాయ నిధికి కోటి విరాళం ఇచ్చానని ట్వీట్ కూడా చేశాడు. ►అదేమిటో గానీ పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో సైనికులు మరణించినపుడు గానీ, జమ్మూ కాశ్మీర్ లోని ఉరి ఉగ్రవాద దాడిలో 18 మంది సైనికుల జరిగి సైనికులు మరణించినపుడు గానీ, పుల్వామా దాడిలో 44 మంది సైనికులు మరణించినపుడు గానీ మాజీసైనికుల సహాయనిధికి డబ్బు ఇవ్వాలనే ఆలోచన రాని పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల ప్రకటన వచ్చిన పిదప మోదీ అపాయింట్మెంట్ దొరకక తిప్పలు పడుతున్నపుడు సైనికుల మీద అమాంతం ప్రేమ పుట్టుకువచ్చినది. ఏదేమైతేనేమీ ఎట్టకేలకు బీజేపీతో పొత్తు కుదిరింది. ఆరు నెలల పిదప వైసీపీ కూడా ఎన్డీఏలో చేయనున్నదని ఊహాగానాల నేపథ్యంలో విలేకరులు పవన్ కళ్యాణ్‌ని ఎన్డీఏ లోకి వైకాపా చేరితే మీరు వుంటారా లేక వైదొలగుతారా అని అడుగగా వైకాపా ఎన్డీఏలో చేరితే మేము ఎందుకు వుంటాము మేము పొత్తు పెట్టుకున్నది మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించేందుకు అన్నారు. ►ఇది నా నేల అంటూ డబ్బా కొట్టే పవన్ కళ్యాణ్ ప్రత్యేకహోదా కోసమో కాదు ఏ పోలవరం నిధుల కోసమో కాదు మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడంటే అతనికి అమరావతిలో ఉన్న ఆసక్తి ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి. అంత ఆఘమేఘాల మీద ఢిల్లీ పరుగులు పెట్టి పొత్తు పెట్టుకోవలసినంత కొంపలు అంటుకుపోయే కారణాలు ఏముంటాయి ? ►చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు తనకూ మంచి మిత్రుడు, జనసేన విజయవాడ కార్యాలయం యజమాని, జనసేన మంగళగిరి కార్యాలయం లేఔట్ వేసిన వ్యక్తి అన్నీ ఒకరే ఐన లింగమనేని చంద్రబాబు సహా చాలా మందికి బినామీ అంటారు. మూడు రాజధానుల ప్రకటన పిదప పవన్ కళ్యాణ్ కలవరం, ఆపై అనునిత్యం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇతర వైసీపీ నాయకులపై అక్కసు వెళ్ళగక్కటానికి కారణం మూడు రాజధానుల ప్రకటన అనే అనుమానం బలపరుస్తుంది. ఇవన్నీ పరిశీలిస్తే పవన్‌కి మూడు రాజధానుల ప్రకటన వలన కోలుకోలేని దెబ్బ తగిలింది అని భావించాలి. ►పరిటాల శిరోముండనం, శ్రీజ వివాహం దుష్ప్రచారం, మా బ్లడ్డు వేరు బ్రీడు వేరు అనీ, అలగాజనం సంకరజాతి జనం వంటి ఆత్మాభిమానం చంపేసేలా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ఆఖరికి కన్న తల్లిని దూషించిన వారినే వెనకేసుకువస్తున్నాడంటే వాటన్నిటీని మరిచిపోయి మైమరపించే అంశం అమరావతిలో ఏమై వుంటుందా అన్నది ప్రజలే గ్రహించాలి. ►అమరావతి అంశంలో చంద్రబాబుని విపక్షాలు ఎందుకు సమర్థిస్తున్నాయి.. అమరావతి అంటే ప్రభుత్వ ఖజానాని దోచి 29,000 మంది రైతులకి దోచి పెట్టడమే అని పైన వివరించిన అంశాలు తెలియక మునుపు విపక్షాలు చంద్రబాబుని సమర్థించి వుంటే పొరపాటు. కానీ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వ ఖజానా నుండి కోట్ల రూపాయలు దోచి 29,000 మందికి పంచటమే అని తెలిసిన పిదప కూడా ఇకపై దానిని విపక్షాలు సమర్థిస్తే వారికి కూడా అమరావతి దోపిడీ దారుల నుండి గణనీయమైన ముడుపులు అందుతున్నాయని భావించాల్సి వుంటుంది. ►టీడీపీ జనసేన పొత్తులు అసలు మతలబు అమరావతిలో రాజధాని కడితే చంద్రబాబు అనుయాయులకి లక్షల కోట్ల లబ్ధి చేకూరనున్నది మనం చూశాము. పవన్ కళ్యాణ్ కలవరపాటు చూశాము. ►స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబుని అరెస్టు చేసిన వెంటనే ఫ్లైట్ లో వద్దామని ప్రయత్నించి కుదరక హుటాహుటిన బయలు దేరిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర సరిహద్దు వద్ద చేసిన విన్యాసాలలో కూడా కంగారు కలవరపాటు కనపడ్డాయి. చంద్రబాబు జైలుపాలైతే అమరావతి ఆశలు అడియాశలే అనే ఆదుర్దా వలన ఆ చిత్రవిచిత్రమైన విన్యాసాలకి కారణమా అనే అనుమానం రాక మానదు. ►ఆఘమేఘాల మీద రాజమండ్రి జైలు సందర్శన పొత్తుల ప్రకటన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లలో ఆందోళన ఏ స్థాయిలో వున్నదో చెబుతున్నది. ఆఘమేఘాల మీద పొత్తు ప్రకటనకి అసలు కారణాలు అవే అన్న అనుమానం రాకమానదు. అమరావతి భూముల కోసం అవసరమైతే పవన్ కళ్యాణే సీఎం ►చంద్రబాబు & అనుచర గణం ఉచ్వాసనిశ్వాసలు అధికారంతో ముడిపడి వుంటాయి. ఐతే అంతకుమించిన మమకారం అమరావతి ఆస్తుల పైన వుంటుంది. అమరావతిలో కేవలం భూమి సేకరణ కోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం లోనే లక్షల కోట్ల రూపాయల స్కాం అని మన అధ్యయనంలో తేలిపోయింది. ఇక ప్రభుత్వం వాటా కింద వచ్చిన 25% భూమి ఎవరెవరికి ఏయే రేట్లలో కేటాయించాలి అనే అంశంలో మరో భారీ అవినీతి వుంటుంది. ►అలాగే శాశ్వత సెక్రటేరియట్, శాశ్వత అసెంబ్లీ & శాశ్వత హైకోర్టు నిర్మాణంలో భారీగా దోచుకునే ఆస్కారం వున్నది. ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ ఖర్చు కంటే తక్కువ. అంతకు పన్నెండు రెట్లు పెద్దది అయిన భారత నూతన పార్లమెంట్ భవనం విస్టా పూర్తి చేశారు. ఏపీ సెక్రటేరియట్ ఖర్చులో 60% తో అంత కంటే 5 రెట్లు పెద్దది ఐన తెలంగాణ సెక్రటేరియట్ పూర్తి చేశారు. దీనిని బట్టి అమరావతే రాజధానిగా వుంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగేదో మనం ఊహించ వచ్చు. జగన్మోహన్రెడ్డిని ఓడిస్తేనే అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుంది. పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి అనిపించినపుడు అవసరమైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని సీఎం అని ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ఒకసారి ఒప్పందం చేసుకున్నాక రద్దు చేయకూడదా ? ►ప్రభుత్వ ఖజానాకి గండికొట్టే ఏ అంశం ఐనా అవినీతి కిందకే వస్తుంది. ఐతే అవినీతి దాగి ఉన్న దానిలో ఒప్పందం జరిగిపోయినది కావున దానిని అలాగే కొనసాగించాలి అనే వాదన దివాలాకోరు దగుల్బాజీ రాజకీయాలకి నిదర్శనం. 2G స్పెక్ట్రం కేసులో టెలీకాం ఆపరేటర్లు అందరూ కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకి రావలసిన ఆదాయానికి గండి కొడుతున్నారు అనే ఆరోపణల నేపధ్యంలో ఒప్పందాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయటం జరిగినది. ఇక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకి లక్షన్నర కోట్ల నష్టం వాటిల్లుతున్నందున CRDA ల్యాండ్ పూలింగ్ రద్దు చేయాల్సిన ఆవశ్యకత వున్నది. ►త్వరలో ఈ సమాచారం మొత్తం "అరచేతిలో అమరావతి అవినీతి ఆధారాలు" పేరుతో కరపత్రంగా ముద్రించి యావత్ రాష్ట్ర ప్రజలకి నిజానిజాలు తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను. ►ఈ ప్రయత్నంలో ప్రభుత్వ యంత్రాంగం, వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు, ZPTCలు, MPTCలు, సర్పంచులు వార్డు సభ్యుల ప్రజాప్రతినిధులు ఈ మెగా భూ కుంభకోణం కరపత్రాలుగా ముద్రించి ప్రజలకి అందుబాటులోకీ తెచ్చినా లేక వారి పరిధిలోని గ్రామాల కూడళ్ళ వధ్ధ భారీ హోర్డిగులు ఏర్పాటు చేసి ప్రదర్శించిన ఎడల ప్రజలకి నిజానిజాలు తలుస్తాయి. -చింతా రాజశేఖర రావు, పొలిటికల్ అనలెస్ట్