అశ్లీల నృత్యాల ఘటనలో 24 మంది అరెస్టు | Police Arrest 24 People In Eluru District In This Incident, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అశ్లీల నృత్యాల ఘటనలో 24 మంది అరెస్టు

Published Fri, Dec 20 2024 5:23 AM | Last Updated on Fri, Dec 20 2024 10:32 AM

Police arrest 24 people in Eluru district

అరెస్టయిన వారిలో జనసేన నేత ఇంద్రకుమార్‌ 

మరో 21 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు కూడా అరెస్టు 

నిడమర్రు: ఏలూరు జిల్లా బావాయిపాలెంలో జనసేన నేతల అశ్లీల నృత్యా­ల బాగోతంలో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఈ వ్యవహారానికి సూత్రధారి అయి­న జనసేన పార్టీ క్రొవ్విడి గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమా­ర్, మరో 21 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు ఉన్నట్లు గణపవరం సీఐ సుభాష్‌ గురువారం తెలిపారు. ఈ అశ్లీల నృత్యాల వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వీఆర్వో భుజంగరావు ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్టయిన వారిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 292, 296 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

ఇదీ జరిగింది: ఈ నెల 12వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్‌ మిల్లులో వాకమూడి ఇంద్రకుమార్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వేడుకలకు హాజరైన వారిలో పలువురు మద్యం సేవించారు.  

భీమవరానికి చెందిన ఇద్దరు హిజ్రాలతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఈ నృత్యాలను మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల పైనుంచి సెల్‌ఫోన్‌లో రహస్యంగా చిత్రీకరించి, బుధవారం సోషల్‌ మీడియాలో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసి జనసేన నేతలు టీడీపీ వారిపై ఆగ్రహంతో ఉన్నారు. 

ఇదే తొలిసారి: ఈ ప్రాంతంలో ఇలా అశ్లీల నృత్యాలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇదే కొనసాగితే జనసేన నాయకుల ఆగడాలు ఎలా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వైఖరిని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. మరోపక్క ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఇంద్రకుమార్‌ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement