Indra Kumar
-
అశ్లీల నృత్యాల ఘటనలో 24 మంది అరెస్టు
నిడమర్రు: ఏలూరు జిల్లా బావాయిపాలెంలో జనసేన నేతల అశ్లీల నృత్యాల బాగోతంలో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన జనసేన పార్టీ క్రొవ్విడి గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్, మరో 21 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు ఉన్నట్లు గణపవరం సీఐ సుభాష్ గురువారం తెలిపారు. ఈ అశ్లీల నృత్యాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీఆర్వో భుజంగరావు ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్టయిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 292, 296 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదీ జరిగింది: ఈ నెల 12వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వేడుకలకు హాజరైన వారిలో పలువురు మద్యం సేవించారు. భీమవరానికి చెందిన ఇద్దరు హిజ్రాలతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఈ నృత్యాలను మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల పైనుంచి సెల్ఫోన్లో రహస్యంగా చిత్రీకరించి, బుధవారం సోషల్ మీడియాలో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసి జనసేన నేతలు టీడీపీ వారిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే తొలిసారి: ఈ ప్రాంతంలో ఇలా అశ్లీల నృత్యాలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇదే కొనసాగితే జనసేన నాయకుల ఆగడాలు ఎలా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వైఖరిని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. మరోపక్క ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఇంద్రకుమార్‌ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించారు. -
యూనివర్సిటీలు సామాజిక బాధ్యత పెంచే కేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని పెంచడమే కాకుండా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచే కేంద్రాలుగా నిలుస్తున్నాయని ఏపీ గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏయూ కట్టమంచి రామలింగారెడ్డి కాన్వొకేషన్ హాల్లో శనివారం నిర్వహించిన ఆంధ్ర విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమలు–శాస్త్ర రంగంలో జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జున, అవంతి ఫీడ్స్ సంస్థ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్, సాహిత్యం–కళా రంగాలలో ఎస్వీ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్‌లకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్ అందించారు. 690 మంది డాక్టరేట్లను, 600 మంది మెడల్స్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాస్టల్, భారత్–ది జీ20 ప్రెసిడెన్షియల్ హాస్టల్, శతాబ్ది క్లాసిక్ హాస్టల్ భవనాల్ని గవర్నర్ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. జ్ఞానం అంతఃదృష్టి కలిగి ఉండాలని, దానికి నైతికత జోడిస్తేనే విలువ ద్విగుణీకృతమవుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నత విద్య జ్ఞాననిధిగా మారిందని.. దేశంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలుస్తోందని అన్నారు. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఈ విశ్వవిద్యాలయం సర్ సీఆర్ రెడ్డి, సర్వేపల్లి, డాక్టర్ వీఎస్ కృష్ణ వంటి వారి సారథ్యంలో ఎంతో ప్రగతి సాధించిందని కొనియాడారు. ఏయూ అమలు చేస్తున్న నూతన విధానాలను ఇతర విశ్వవిద్యాలయాలు సైతం అమలు చేస్తే ప్రతిభ కలిగిన యువతను దేశంలో స్థిరపడే విధంగా చేయడం సాధ్యమన్నారు. నాక్‌లో ప్రతిసారి అత్యుత్తమ గ్రేడ్ సాధించడం శుభపరిణామమని అభినందించారు. ఏయూ తెలుగు ప్రజలందరిదీ: బొత్స రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ప్రజలందరిదీ అన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని.. విద్య కోసం ఏ రాష్ట్రం చేయనంత ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సమగ్రాభివృద్ధి, విద్యా నైపుణ్యం దిశగా ఏయూ అడుగులు వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు అనుగుణంగా ఇంజినీరింగ్, సైన్స్, ఫార్మసీ రంగాల్లో ఆవిష్కరణలు జరిపే సౌలభ్యంతో కూడిన మౌలిక వసతులు కలి్పస్తూ ప్రోటో టైప్, కమర్షియలైజేషన్ దిశగా నడిపిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నెలకొలి్పన నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ 17 స్టార్టప్స్‌కు స్థానం కలి్పంచిందన్నారు. ఏయూ పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయుక్తంగా 54 ఎంఓయూలు చేసుకున్నట్టు చెప్పారు. ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మధురమైన జ్ఞాపకం
‘‘మా పదో వివాహ వార్షికోత్సవం కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరిగింది’’ అన్నారు రంభ. ఈ వేడుకల గురించి ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారామె ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేను, నా భర్త (ఇంద్రకుమార్) మా పిల్లల (కుమార్తెలు లాణ్య, సాషా, కుమారుడు శివన్) సమక్షంలో మా వివాహ వార్షికోత్సవాన్ని ఇంట్లోనే చేసుకున్నాం. ఈ వేడుకలో మా బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. అయినప్పటికీ ఇది మా జీవితాల్లోనే ఒక మధురమైన వేడుక అని చెప్పగలను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎన్నో అందమైన అనుభూతులు, జ్ఞాపకాలను పంచిందీ వేడుక. ఒకొరికొకరం సాయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లూ మేమే చేసుకున్నాం. ఆర్డర్ చేయకుండా మా కేక్‌ను మేమే సొంతంగా తయారు చేసుకున్నాం. ఈ కేక్‌లోని ప్రతి చిన్న భాగంలోనూ మా పదేళ్ల ప్రేమ దాగి ఉంది. మా కుమార్తెలు లాణ్య, సాషా మాకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ గ్రీటింగ్ కార్డ్‌ను బహుమతిగా ఇచ్చి మా ఆనందాన్ని మరింత పెంచారు. ఈ సెల్ఫ్ క్వారంటైన్ సమయంలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబంతో సమయాన్ని గడపండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అని పేర్కొన్నారు రంభ. 1992 నుంచి 2010 వరకు నటిగా వెండితెరపై సత్తా చాటారు రంభ. ఆ తర్వాత బుల్లితెర షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరించారామె. 2010 ఏప్రిల్ 8న కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను రంభ వివాహం చేసుకున్నారు. ఫ్యామిలీతో రంభ -
అడ్వంచరస్ ఫన్ రైడ్ : టోటల్ ధమాల్
2011లో ఘనవిజయం సాధించిన డబుల్ ధమాల్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న సినిమా టోటల్ ధమాల్. అజయ్ దేవగణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, జానీ లివర్, రితేశ్ దేశ్‌ముఖ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా 22న రిలీజ్ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, మారుతి మల్టీనేషనల్ సంస్థలతో కలిసి అజయ్ దేవగన్ స్వయంగా నిర్మిస్తున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వైల్డెస్ట్ అడ్వెంచర్ కామెడీతో రూపొందించిన ఈ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిమేష్ రేషమియా సంగీతమందించాడు. -
హీరో కాదు!
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మరో సినిమాకు సైన్ చేశారు. అయితే హీరోగా కాదు. నిర్మాతగా. ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోందని తెలిసిందే. తాజాగా స్టాక్ మార్కెట్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుందని బాలీవుడ్ టాక్. స్టాక్ మార్కెట్లో హర్షద్‌కి బిగ్ బుల్ అనే నిక్ నేమ్ కూడా ఉందట. ఈ సినిమాను అజయ్ దేవగన్, బాలీవుడ్ డైరెక్టర్ ఇంద్రకుమార్ కలిసి నిర్మిస్తారట. అయితే ఇందులో అజయ్ హీరోగా నటించరు. ఓ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారట టీమ్. ఈ సినిమాకి కుకీ గులాటి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇంతకుముందు ‘విక్కీ డోనర్, పీకు, అక్టోబర్’ చిత్రాలకు కో–రైటర్‌గా పనిచేశారాయన. ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ధమాల్ ప్రాంచైజీలో మూడో భాగం ‘టోటల్ ధమాల్’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
జవాన్ పెళ్లి కల చెదిరిపోయిన వేళ..
తాండూర్(బెల్లంపల్లి) : ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జీవితాంతం చెదిరిపోని జ్ఞాపకంగా మిగిలిపోయే ఘనమైన ఘట్టమది. అలాంటి క్షణాల కోసం యువతీ యువకుల ఎదురుచూపుల గురించి చెప్పనక్కర్లేదు. సరిగ్గా అలాంటి సందర్భంలోనే జరగరానిది ఘటన జరిగితే.. ఎంత విషాదం..! ఇంద్రకుమార్... సీఆర్పీఎఫ్ జవాన్. వయస్సు 29 ఏళ్లు. తాండూర్ మండలం కిష్టంపేట గ్రామం. తండ్రి లింగాల బానయ్య చనిపోయాడు. తల్లి మల్లమ్మ, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అక్కాచెళ్లెళ్లకు పెళ్లి కాగా.. తల్లి, తమ్ముడికి ఇతడే ఆధారం. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరగాలని పెద్దలు అంటారు కదా! ఇంద్రకుమార్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉండటంతో ఇంట్లోవాళ్లు పెళ్లి సంబం దాలు చూశారు. ఈనెల 25న నిశ్చితార్థం ఖరారు చేసి సమాచారం అందించారు. 2014లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఇంద్రకుమార్ రాయ్‌ఘడ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తన నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు ఈనెల 19న సెలవుపై ఇంటికి వచ్చేందుకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఘోరం జరిగిపోయింది. ఇంద్రకుమార్ రైలులో వస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు వద్ద రైలునుంచి జారిపడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయాడు. కుటుంబసభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. సీఆర్ఎఫ్ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని శుక్రవారం కిష్టంపేటకు తీసుకొచ్చారు. వరంగల్ రేంజ్ సీఆర్పీఎఫ్ కమాండర్ రమేష్ కబాడియా, ఎస్సైలు సిగ్గు కుమార్, అర్జున్‌రెడ్డి, 58 బెటాలియన్ జవాన్లు, తాండూర్ తహసీల్దార్ రామచంద్రయ్య, తాండూర్ ఎస్సై రవి.. ఇంద్రకుమార్ భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పి నివాళులర్పించారు. అనంతరం సీఆర్పీఎఫ్ జవానులు గాలిలోకి కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ తరపున మృతుడి తల్లి మల్లమ్మకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎక్స్‌గ్రేషియా, మృతుడి తల్లికి పెన్షన్‌ను త్వరగా వచ్చేలా చూస్తానని సీఆర్పీఎఫ్ కమాండర్ రమేష్ కబాడియా హామీ ఇచ్చారు. -
సామరస్యంగా పరిష్కరించుకోండి
పెరంబూర్: నటి రంభ, ఆమె భర్త ఇంద్రకుమార్ తమ సమస్యలను సామరస్యంగా చర్చిం చుకుని పరిష్కరించుకోవాలని చెన్నై హైకోర్టు సూచించింది. వివరాలు.. నటి రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను ప్రేమించి 2010లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కెనడాలో కాపురం పెట్టిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రంభకు ఇంద్రకుమార్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తడంలో రంభ తన ఇద్దరు పిల్లలను తీసుకుని చెన్నైకి తిరిగొచ్చేశారు. కాగా 2016లో భర్తతో తనను కలపాలని కోరుతూ చెన్నై హైకోర్టు, కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పిల్లల విద్య, సంరక్షణ ఖర్చుల కోసం నెలకు రూ.2.5 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. నటి రంభ తన ఇద్దరు పిల్లలతో కోర్టుకు హాజరయ్యారు. అదే విధంగా ఆమె భర్త ఇంద్రకుమార్ కూడా కోర్టుకు వచ్చారు. దీంతో ఇది కుటుంబ సమస్య కాబట్టి రంభను ఆమె భర్తను ఒక ప్రత్యేక గదిలో ఉంచి సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకునేలా ఒక న్యాయవాదిని నియమించారు. కాగా తదుపరి విచారణలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
సామరస్యంగా పరిష్కరించుకోండి
పెరంబూర్: నటి రంభ, ఆమె భర్త ఇంద్రకుమార్ తమ సమస్యలను సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని చెన్నై హైకోర్టు సూచించింది. వివరాలు.. నటి రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను ప్రేమించి 2010లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కెనడాలో కాపురం పెట్టిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రంభకు ఇంద్రకుమార్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తడంలో రంభ తన ఇద్దరు పిల్లలను తీసుకుని చెన్నైకి తిరిగొచ్చేశారు. కాగా 2016లో భర్తతో తనను కలపాలని కోరుతూ చెన్నై హైకోర్టు, కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పిల్లల విద్య, సంరక్షణ ఖర్చుల కోసం నెలకు రూ.2.5 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. నటి రంభ తన ఇద్దరు పిల్లలతో కోర్టుకు హాజరయ్యారు. అదే విధంగా ఆమె భర్త ఇంద్రకుమార్ కూడా కోర్టుకు వచ్చారు. దీంతో ఇది కుటుంబ సమస్య కాబట్టి రంభను ఆమె భర్తను ఒక ప్రత్యేక గదిలో ఉంచి సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకునేలా ఒక న్యాయవాదిని నియమించారు. కాగా తదుపరి విచారణలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.