Eluru District
-
అశ్లీల నృత్యాల ఘటనలో 24 మంది అరెస్టు
నిడమర్రు: ఏలూరు జిల్లా బావాయిపాలెంలో జనసేన నేతల అశ్లీల నృత్యాల బాగోతంలో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన జనసేన పార్టీ క్రొవ్విడి గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్, మరో 21 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు ఉన్నట్లు గణపవరం సీఐ సుభాష్ గురువారం తెలిపారు. ఈ అశ్లీల నృత్యాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీఆర్వో భుజంగరావు ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్టయిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 292, 296 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదీ జరిగింది: ఈ నెల 12వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వేడుకలకు హాజరైన వారిలో పలువురు మద్యం సేవించారు. భీమవరానికి చెందిన ఇద్దరు హిజ్రాలతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఈ నృత్యాలను మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల పైనుంచి సెల్ఫోన్లో రహస్యంగా చిత్రీకరించి, బుధవారం సోషల్ మీడియాలో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసి జనసేన నేతలు టీడీపీ వారిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే తొలిసారి: ఈ ప్రాంతంలో ఇలా అశ్లీల నృత్యాలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇదే కొనసాగితే జనసేన నాయకుల ఆగడాలు ఎలా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వైఖరిని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. మరోపక్క ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఇంద్రకుమార్‌ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించారు. -
అధికారుల అండతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నం
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు(శనివారం) ఇంటి ముందు వంటా వార్పు పేరుతో చింతమనేని అనురులు డ్రామాకు దిగారు. దీంతో చింతమనేని అనుచరులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చింతమనేని అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. -
ద్వారకా తిరుమల ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో శ్రీవారి క్షేత్ర డ్రోన్ విజువల్స్ హల్చల్ చేశాయి. ఆలయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఒక యూట్యూబర్ పట్టపగలు క్షేత్రంపై డ్రోన్ ఎగురవేశారు. విజువల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఆలయ భద్రతా వైఫల్యమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై, ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
తెలుగు తమ్ముళ్ల మధ్య రచ్చకెక్కిన ‘అక్రమ మైనింగ్’ పంచాయతీ
సాక్షి, ఏలూరు జిల్లా: నూజివీడులో తెలుగు తమ్ముళ్ల అక్రమ మైనింగ్ పంచాయతీ రచ్చకెక్కింది. కూటమి అధికారంలోకి వచ్చాక తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ సాగుతుండగా.. చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్‌కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వయంగా ఫిర్యాదు చేశారు. దీంతో ముద్దరబోయిన తీరుపై నూజివీడు మండలం రావిచర్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు.ముద్దరబోయిన కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు అన్నారు. రావిచర్లలో అక్రమ మైనింగ్ జరిగితే ఏ చర్యలైనా తీసుకోండని అధిష్టానాన్ని కోరుతున్నాం. సొంత పార్టీలోని నేతలపైనే బురద చల్లడం బాధాకరం. అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ముద్దరబోయిన చర్యలున్నాయి. తక్షణం ముద్దరబోయినను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
తల్లి, కుమారుడి దారుణహత్య
మండవల్లి/కైకలూరు: ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణహత్యకు గురయ్యారు. శనివారం తెల్లవారి చుట్టుపక్కలవారు మృతదేహాలను గమనించడంతో హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో వీరి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం గ్రామానికి చెందిన రొయ్యూరు సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు నగేష్‌బాబు (55) సంతానం. అతడు పుట్టిన తర్వాత నాంచారమ్మ మరణించడంతో ఆమె చెల్లెలు భ్రమరాంబను సుబ్బారావు రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సురేష్ (35) సంతానం. సుబ్బారావు 20 సంవత్సరాల కిందట మరణించాడు. నగేష్‌బాబు విజయవాడలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఐటీడీపీలో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్న సురేష్ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి గన్నవరంలో 40 సెంట్ల పొలం, ఒక భవనం, 6 సెంట్ల స్థలం తండ్రి ఆస్తిగా ఉన్నాయి. వీటి విషయంలో నగేష్‌బాబు, సురేష్‌ల మధ్య విభేదాలున్నాయి.కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల 40 సెంట్ల పొలాన్ని చెరిసగం పంచుకున్నారు. భవనం విషయంలో గొడవలు ముదిరాయి. సురేష్ భార్య గాయత్రి తండ్రి సంవత్సరీకం కావడంతో భార్య, భర్త, పిల్లలు గురువారం ముసునూరు వెళ్లారు. తల్లి ఇంటివద్ద ఒంటరిగా ఉందని సురేష్ శుక్రవారం గన్నవరం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఇంట్లో మంచంపై పడుకున్న సురేష్ మెడను కోసి హత్యచేశారు. బయట పడుకున్న భ్రమరాంబను తలపై నరికి చంపేశారు. శనివారం తెల్లవారిన తరువాత భవనం వరండాలో రక్తపుమడుగులో ఉన్న భ్రమరాంబను చుట్టుపక్కలవారు గమనించారు. వచ్చి చూడగా రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఘటనాస్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రవణ్‌కుమార్, కైకలూరు సీఐ వి.రవికుమార్, ఎస్ఐ రామచంద్రరావు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు భావిస్తున్నామన్నారు. మొదటి భార్య కుమారుడు నగేష్‌బాబు పాత్రతో పాటు ఇతర కారణాలపై విచారిస్తున్నట్లు చెప్పారు. -
సుందర్ కుమార్ అక్రమ అరెస్ట్..
-
టీడీపీ Vs జనసేన.. తారాస్థాయికి వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-జనసేనలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొల్లేరు గ్రామాల్లో జనసేన నాయకులపై టీడీపీ నేతల వరస దాడులకు తెగబడుతున్నారు. పెన్షన్ల పంపిణీ అంశంలో టీడీపీ నేతలే పంచి పెట్టాలని ఎమ్మెల్యే చింతమనేని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన జనసేన నేతలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తన అనుచరులతో దాడి చేయించి కేసులు పెట్టించారు.కొల్లేరులో టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు పట్టాలంటే ఎమ్మెల్యేకు ఎకరాకు లక్ష కట్టాలంటూ కొల్లేరు వాసులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రౌడీ మూకలతో జనసేన నాయకులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.నేడు జిల్లాలో పర్యటించనున్న పవన్‌కల్యాణ్‌ను కలిసి చింతమనేని తీరుపై నియోజకవర్గ ఇన్ చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఫిర్యాదు చేయనున్నారు. కొన్ని అరాచక శక్తులు జనసేనలో చేరాయంటూ చింతమనేని వ్యాఖ్యానించారు. కొత్తగా పార్టీలో చేరి పెత్తనం చలాయిస్తే ఊరుకోమని.. పెన్షన్ పంపిణీకి, అలాంటి వారికి ఏం సంబంధం అంటూ చింతమని హెచ్చరించారు. -
బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మహిళలు సజీవదహనం
ఉండ్రాజవరం/సాక్షి, అమరావతి: దీపావళి పండుగ వారి జీవితాల్లో అమావాస్యను మిగిల్చింది. కూటికోసం కూలికొచ్చిన ఇద్దరు మహిళల్ని పిడుగుపాటు సజీవదహనం చేసింది. బాణసంచా తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు వారిని కాల్చేశాయి. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపాలెంలో జనావాసాలకు దూరంగా వేగిరోతు రామశివాజీ ఆధ్వర్యంలో సాయి ఫైర్వర్క్స్ పేరిట దీపావళి బాణసంచా తయారీ కేంద్రం కొనసాగుతోంది. తణుకు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, పురుషులు ఇక్కడ పనిచేస్తున్నారు. గురువారం దీపావళి నేపథ్యంలో బాణసంచా తయారీ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం ఆ కేంద్రం సమీపంలోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. ఆ నిప్పురవ్వలు బాణసంచా తయారీ కేంద్రం మీద పడ్డాయి. బాణసంచా అంటుకుని మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న వేగిరౌతు శ్రీవల్లి (50), గుమ్మడి సునీత (35) సజీవంగా కాలిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి స్వల్పగాయాలయ్యాయి. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సూర్యారావుపాలెంలో పిడుగుపాటుతో బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయపడిన వారికి తక్షణమే మైరుగైన వైద్యసదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పీఎస్‌లో రెడ్‌బుక్ రాజ్యాంగం.. అమలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, ఏలూరు జిల్లా: తలకడిపూడి పీఎస్‌లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హల్చల్ చేశారు. ఎస్సై కుర్చీలో కూర్చొని టిఫిన్ చేసిన ఆయన.. పోలిస్ స్టేషన్లో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినట్లుగా వ్యవహరించారు. పోలిస్ స్టేషన్‌ను సెటిలిమెంట్లకు అడ్డగా మార్చారు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్. పోలిస్ స్టేషన్లో ఎస్సై కుర్చీలో కూర్చొని ఆదేశాలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏలూరులో మహిళపై సామూహిక అత్యాచారం
ఏలూరు టౌన్: కోల్‌కతాలో డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. ఏలూరులో ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో భర్తను చితక్కొట్టి.. భార్యను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన ఆ మృగాళ్ల ఉన్మాదానికి పరాకాష్టగా నిలుస్తోంది. పోలీసులు వెంటనే స్పందించకపోవడం, ఘటన వివరాలు ఓ వ్యక్తి వెంటనే తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తే.. కూటమి సర్కారులో మహిళలకు భద్రత కరువైందన్న దానికి తార్కాణంలా ఈ ఘటన నిలుస్తోంది.భర్త ఫిర్యాదుతో ఏలూరు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలికి ఏలూరు జీజీహెచ్‌లో వైద్యచికిత్స అందిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ అమానుష ఘటన వివరాలు.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలానికి చెందిన భార్యాభర్తలు జీవనోపాధి కోసం 20 రోజుల క్రితం ఏలూరు నగరానికి వచ్చారు. వన్‌టౌన్ ప్రాంతంలోని ఓ హోటల్లో పనికి కుదిరారు. రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న ఆధ్యాతి్మక వేదిక రామకోటిలో నిద్రపోయి.. ఉదయం లేచి పనులకు వెళుతున్నారు. జీతం వచ్చాక అద్దె ఇల్లు కూడా తీసుకోవాలని భావించారు. వీరు ఇలా జీవించడం చూసిన ముగ్గురు జులాయి యువకులు కొద్ది రోజులుగా భర్తతో స్నేహంగా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు భర్తకు మద్యం తాగించారు. అతను మత్తులో మునిగి నిద్రపోగా.. అతని భార్య (35)ను అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయగా.. మెలకువ వచి్చన భర్త వారిని అడ్డగించాడు. యువకులు బలమైన కర్రతో భర్త కాళ్లను చితక్కొట్టారు. అనంతరం మహిళను సమీపంలోని భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె ముఖంపైనా బలంగా కొట్టారు. పోలీసుల అలసత్వం కాళ్లపై బలంగా దెబ్బతిన్నా.. భర్త రోడ్డుపైకి వచ్చి సాయం కోసం అరిచాడు. సినిమా చూసి అటుగా వెళుతున్న బాలాజీ అనే యువకుడు ఇది గుర్తించి డయల్ 100కు ఫోన్ చేయగా సిబ్బంది పట్టించుకోలేదు. చేసేది లేక ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడి సిబ్బందికి జరిగిన విషయాన్ని చెప్పగా.. వారు వెంటనే స్పందించకుండా ఆలస్యం చేశారు. పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో బాలాజీ.. తన స్నేహితులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి వెళ్లాడు. వీరు వెళ్లాక నిందితులు ముగ్గురూ బాధిత మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ముగ్గురినీ ఏలూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఏలూరు వన్‌టౌన్ గజ్జవారి చెరువు వద్ద బిట్టు బార్ ఎదురుగా రోడ్డుపై నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జులాయిగా తిరిగే ఈ నిందితులు ఏలూరు టీచర్స్ కాలనీలో చెంచుకాలనీ రోడ్డు ప్రాంతానికి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేట, సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన నారపాటి నాగేంద్ర, ఎంఆర్ఆర్ కాలనీ 13వ రోడ్డు ప్రాంతానికి చెందిన గడ్డి విజయకుమార్ అని పోలీసులు వెల్లడించారు. -
నల్ల బంగారులోకం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆంధ్రా సింగరేణిగా ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతం వెలుగొందనుంది. నల్ల బంగారు గనులతో రాష్ట్రానికి కాసుల పంట పండించనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. నవ్యాంధ్ర అభివృద్ధికి ఊతం అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 బొగ్గు గనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జాబితాలో ఏలూరు జిల్లా చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లు 44, 45 స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు సెక్టార్లు కూడా చింతలపూడి మండలంలోనే ఉండటం విశేషం. దీంతో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు తవ్వకాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే వేలంలో చోటు దక్కినా...!చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి చింతలపూడి వరకు 2వేల మిలియన్ టన్నుల నుంచి 3వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలోని సింగరేణి తరహాలో ఇక్కడ బొగ్గు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి 2015లో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ) లేఖ రాసింది. దానిపై కేంద్రం స్పందించలేదు. కానీ, గతంలో కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ప్రస్తుతం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం, తడికలపూడితోపాటుగా చింతలపూడి బ్లాక్‌లోని జంగారెడ్డిగూడెం కూడా ఉన్నాయి. ఈ వేలంలో సింగరేణి సంస్థ పోటీలో లేక పోవడంతో బొగ్గు గనుల వేలం వాయిదా పడింది. తాజాగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దేశవ్యాప్తంగా నూతన బొగ్గు గనుల వేలం జాబితాను ప్రకటించగా, చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లకు చోటు దక్కింది. దీంతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు.60 ఏళ్ల నుంచి అన్వేషణ.. » ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో బొగ్గు గనులను కనుగొనేందుకు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)తోపాటు వివిధ సంస్థలు 60 ఏళ్ల నుంచి సర్వేలు చేశాయి. తొలి దశలో 1964 నుంచి 2006 వరకు నాలుగు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. 2006 నుంచి 2016 వరకు మళ్లీ సర్వేలు కొనసాగాయి. » అన్ని సర్వేల్లోనూ చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించారు. ఆయా సర్వే సంస్థల నివేదికల్లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ చింతలపూడి మండలంలో 30 కిలో మీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. » లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో నాటి కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు గనులపై అధ్యయనం చేసింది. చాట్రాయి మండలం సోమవరం నుంచి చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో లభించే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన గ్రేడ్–1 రకం బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అది కూడా భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించింది. » సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ మరో సంస్థతో కలిసి చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేపట్టింది. ఈ 120 పాయింట్ల ద్వారా సుమారు 65,000 మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40,000 మీటర్ల పనులు పూర్తి చేసింది. » ఇక్కడ గనుల్లో తవ్వకాలు ప్రారంభమైతే ఏడాదికి 8 వేల మెగావాట్లు చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరిపోతుందని వివిధ సర్వే రిపోర్టుల ఆధారంగా అధికారులు అంచనా వేశారు. -
Eluru District: పందికొక్కుల మెక్కేస్తున్నారు..
-
తెగిపోయిన పెదవాగు ప్రాజెక్టు ఆనకట్ట
వేలేరుపాడు: కుండపోత వర్షాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాన్ని ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నీటి ప్రవాహం ఉధృతం కావడంతో పెదవాగు ప్రాజెక్టు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తెగిపోయింది. దీంతో మండలంలోని మేడేపల్లి, కమ్మరగూడెం, అల్లూరి నగర్, ఒంటిబండ, రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్, సొంబే గొల్లగూడెం, గుల్లవాయి, పాత పూచిరాల గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. అకస్మాత్తుగా ప్రాజెక్టు నీరు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. పెదవాగు ప్రాజెక్టుకు చేరువలో ఉన్న మేడేపల్లి, అల్లూరి నగర్, ఒంటి బండ, కమ్మరగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా నీరు రావడంతో సమీపంలోని గుట్టల పైకి, భవనాల పైకి ఎక్కారు. వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. సహాయక చర్యలు అందించేందుకు ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లాలన్నా రహదారి సౌకర్యం లేదు. ఆయా గ్రామాల ప్రజలే సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వేలేరుపాడు మండలం మేడేపల్లి మొదలుకొని అల్లూరి నగర్, కోయ మాధవరం, గుల్లవాయి తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ నీట మునిగాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో వేళ్లవాగు, ఎద్దెల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎద్దెల వాగు వద్ద వంతెన అప్రోచ్ కొట్టుకుపోయింది. వేలేరుపాడు నుంచి రుద్రమ్మకోటకు వెళ్లే రహదారిలో పెదవాగు వంతెన వద్ద రహదారి అంతా నీట మునిగింది. -
నిద్రమత్తు ముగ్గురిని బలిగొంది..
ద్వారకాతిరుమల: కారు డ్రైవర్ నిద్రమత్తు మూడు నిండు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన ఏలూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామానికి చెందిన రాచాబత్తుని నాగార్జున హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.అతని భార్య భాగ్యశ్రీ (30) సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ నిమిత్తం ఈ నెల ఆరో తేదీన భీమవరానికి చెందిన తన తల్లిదండ్రులు బొమ్మా నారాయణరావు, కమలాదేవి (57)తో పాటు, తన ఇద్దరు పిల్లలు నాగనితిన్ కుమార్ (4), నాగషణ్ముఖను తీసుకుని కిరాయి కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంటర్వ్యూ ముగించుకుని ఏడో తేదీ రాత్రి స్వగ్రామానికి అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. నారాయణరావు విజయవాడలో కారు దిగి, భీమవరానికి వెళ్లిపోగా, మిగిలినవారు రాజవోలుకు బయలుదేరారు.అయితే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం మారంపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారి వద్దకు రాగానే డ్రైవర్ దుర్గా వంశీ నిద్రమత్తులో రోడ్డు పక్కన నిలిపివున్న కంటైనర్‌ను వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో భాగ్యశ్రీ,, ఆమె తల్లి కమలాదేవి, ఆమె చిన్న కుమారుడు నాగనితిన్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పెద్ద కుమారుడు నాగషణ్ముఖ, డ్రైవర్ దీవి వంశీకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా ఎస్పీ మేరి ప్రశాంతి ఘటనాస్థలిని పరిశీలించారు. భీమడోలు సీఐ బి.భీమేశ్వర రవికుమార్, ద్వారకా తిరుమల ఎస్ఐ జి.సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుడే పింఛన్ల తొలగింపు
సాక్షి నెట్వర్క్: అనుకున్నంతా అయింది. నెలకే మొదలైంది. ఐదేళ్లుగా కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్ అందుకున్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. కూటమి నాయకులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. పలు గ్రామాల్లో పింఛన్లను నిలిపేశారు. పలువురి పింఛన్లు తొలగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే అడుగడుగునా తమ నైజం బయటపెట్టుకున్నారు. పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీని టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపించారు.ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కారణంతో పలు గ్రామాల్లో కొందరికి పింఛన్లు అందకుండా చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇళ్లపై టీడీపీ జెండా ఐదేళ్లు ఎగిరితేనే పింఛన్ ఇస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ఒక లబ్ధిదారుడికి పింఛన్ ఆపేశారని ఫోన్ చేసిన టీడీపీ కార్యకర్తతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచితంగా మాట్లాడారు. తొక్కగాడివి.. మొనగాడిననుకుంటున్నావా.. అంటూ విరుచుకుపడ్డారు. దెందులూరు మండలంలో పింఛన్లు రాలేదని నిరసన తెలుపుతున్న వారిని ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 41 మందికి ఆగిన పింఛన్ ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేదు. వారు మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు వచ్చి తమ పింఛన్ ఎందుకు ఇవ్వలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వీరిని సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త తీడా శ్రీనుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో మనస్తాపం చెందిన తీడా శ్రీను వెంటనే అక్కడినుంచి వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చాడు. టీడీపీ కార్యకర్తలు తనపై దాడిచేసినచోటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. సర్పంచ్ పరసా లక్ష్మీసుజాత, వైఎస్సార్సీపీ నేత పరసా కనకరాజు సూచన మేరకు వైఎస్సార్సీపీ నాయకుడు ఉదయభాస్కర్ తదితరులు శ్రీనును ద్విచక్ర వాహనంపై భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు శ్రీనుకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. 41 మందికి పెన్షన్లు ఎందుకు నిలిపేశారని పరసా కనకరాజు, కోటిపల్లి సత్తిరాజు, ఉదయభాస్కర్, వర్రె సత్తిబాబు, రాజు ప్రశ్నించారు.వెంటనే గ్రామానికి చెందిన 41 మంది పెన్షనర్లకు నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి, ఏపీ ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు తెలియజేస్తామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై దెందులూరు ఎంపీడీవో వి.శ్రీలతను వివరణ కోరగా.. ఫిర్యాదులు రావడంతో పెన్షన్లు నిలిపేసినట్లు చెప్పారు. వాటిని పరిశీలించి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగులపై కక్ష గుంటూరు జిల్లా గరికపాడులో ఈనెల 1వ తేదీన 11 మంది వికలాంగుల పింఛన్లను టీడీపీ నాయకులు నిలిపేశారు. వీరు వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, దొంగ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్నారని అధికారులకు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. వారికి పింఛన్ పంపిణీ నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో 11 మంది వికలాంగులకు అధికారులు పింఛన్ పంపిణీ నిలిపేశారు. ఈ విషయమై ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ 11 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఫింఛన్ తీసుకుంటున్నారని వెంటనే వారికి నిలిపివేయాలని గ్రామ టీడీపీ నేతలు నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతానికి నిలిపేసినట్లు చెప్పారు. ఐదేళ్లు టీడీపీ జెండా ఉండాలని బెదిరింపు పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెం, పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో పలువురికి పింఛన్ల పంపిణీ నిలిపేశారు. అల్లూరివారిపాలెంలో 20 మందికిపైగా లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. సోమవారం గ్రామంలో పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన సచివాలయ సిబ్బంది వద్దకు లబ్ధిదారులు వెళ్లారు. పింఛన్ కావాలంటే గ్రామంలోని టీడీపీ నాయకులను కలవాలని సచివాలయ సిబ్బంది వారికి చెప్పారు. దీంతో పలువురు లబ్ధిదారులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి తమకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరారు.టీడీపీలో చేరి ఇంటిపై జెండా పెడితేనే పింఛన్ ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఐదేళ్లు జెండా ఇంటి మీద ఉండాలని స్పష్టం చేశారు. దీనికి లబ్ధిదారులు విముఖత చూపడంతో వారికి పింఛన్ పంపిణీ చేయలేదు. పమిడిపాడులో పింఛన్ల పంపిణీని జనసేన నాయకులు అడ్డుకున్నారు. సోమవారం కూటమి సానుభూతిపరులకు మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారంటూ పలువురికి పింఛన్ పంపిణీ చేయకుండా జనసేన నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు.గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసు బందోబస్తుతో మంగళవారం పెన్షన్లు పంపిణీ చేశారు. దొండపాడులోను పింఛన్ల పంపిణీని ఇదే విధంగా అడ్డుకున్నారు. పలు గ్రామాల్లో సోమవారం టీడీపీ సానుభూతిపరులకే పింఛన్లు పంపిణీ చేశారు. జాబితాలో ఉన్న అందరికీ పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం మిగిలిన పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ అందలేదని నిరసనశ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట సచివాలయం పరిధిలో తమకు పింఛన్లు ఇవ్వలేదని 19 మంది మంగళవారం నిరసన తెలిపారు. సచివాలయం వద్ద సాయంత్రం వరకు కార్యదర్శి కోసం వేచి చూశారు. సాయంత్రం సచివాలయం కార్యదర్శి నాగరాజు వచ్చి 13 మందికి పింఛన్లు ఇచ్చారు. ఇంకా ఆరుగురికి ఇవ్వాల్సి ఉంది. పింఛన్‌దారుల తరఫున సర్పంచ్ భర్త తమ్మినైన మురళీకృష్ణకు చెప్పి ఆఫీసు పనిమీద మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లానని కార్యదర్శి చెప్పారు. సాయంత్రం 13 మందికి పింఛన్లు ఇచ్చానని, మిగిలిన వారిలో అర్హులందరికీ ఇస్తానని తెలిపారు.ఎంపీడీవో లాగిన్ ద్వారా ఇద్దరి పింఛన్ల తొలగింపుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లులో కలవకూరి రామ్మూర్తి, చిగురుపాటి బోడియ్య పింఛన్లు తొలగించారు. రామ్మూర్తికి ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛన్, బోడియ్యకు నాలుగేళ్లుగా చర్మకార్మిక పింఛన్ వస్తున్నాయి. స్థానిక టీడీపీ నాయకులు కొద్దిరోజులుగా ఇక నుంచి వారికి పింఛన్ రాదని గ్రామంలో ప్రచారం చేశారు. ఆ విధంగానే ఈ నెల 1వ తేదీ వారికి పింఛన్ నగదు అందలేదు.దీంతో రామ్మూర్తి, బోడియ్య మంగళవారం పోలంపాడులోని గ్రామ సచివాలయానికి, కలిగిరిలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్లను తొలగించారని తెలియడంతో నిర్ఘాంతపోయారు. తమ పింఛన్‌ను అన్యాయంగా నిలిపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ద్వారా తమ పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలు పంచాయతీల్లో కొందరికి పింఛన్ నిలిపేయాలని స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించినట్లు తెలిసింది.గత నెలలో పింఛన్ అందిందిగత నెలలో పింఛన్ నగదు బ్యాంకులో జమ అయింది. ఈ నెలలో పింఛన్ కోసం సోమవారం అంతా ఎదురుచూశాను. మంగళవారం కూడా రాకపోవడంతో మా ఊళ్లో సచివాలయానికి వెళ్తే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడికెళ్తే ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్ తొలగించారని చెప్పారు. టీడీపీ నాయకులు అన్యాయంగా పింఛన్ తొలగించారు. – కలవకూరి రామ్మూర్తిదళితులకు చేసే న్యాయం ఇదేనా?దళితుడినైన నాకు కులవృత్తి అయిన చర్మకార్మిక పింఛన్ వస్తోంది. మా కుమార్తె చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలకు కూడా మేమే ఆధారం. నాలుగేళ్లుగా వస్తున్న పింఛన్ తొలగించారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే దళితులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఇదేనా? నాకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. – చిగురుపాటి బోడియ్యజాగ్రత్తగా ఉండు.. సొంత పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే కూన హెచ్చరిక శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే విరుచుకుపడ్డారు. ఆ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమదాలవలస మండలం పీరుసాహెబ్పేటకు చెందిన ఊట రాజారావుకు పింఛన్ ఆపేశారంటూ.. పొందూరు మండలం పిల్లలవలసకు చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి భాస్కరరావు మంగళవారం ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు.రాజారావు వైఎస్సార్సీపీకి చెందినవారని పెన్షన్ నిలుపుదల చేశారని, ఆయన మన టీడీపీ వ్యక్తేనని చెప్పారు. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటలు ముదిరి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఫోన్లో వాదించుకున్నారు. పార్టీ గెలుపునకు వేల రూపాయలు ఖర్చుచేశానని, ఇప్పుడు తమ చుట్టాలకు పెన్షన్ తీసివేయడం సమంజసం కాదని భాస్కరరావు చెబుతుండగానే.. ‘డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు, తొక్కగాడివి, మొనగాడివి అనుకుంటున్నావా? మర్యాద ఇచ్చి మాట్లాడు.మర్యాద ఇస్తున్నాను జాగ్రత్తగా ఉండు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్..’ అంటూ ఎమ్మెల్యే కూన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ మాటలు విన్న భాస్కరరావు ‘ఆ పెన్షన్ డబ్బులు మూడువేలు కూడా మీరే తీసుకోండి. మేం కష్టపడి పనిచేశాం. తప్పుగా మాట్లాడలేదు. ఇడియట్ అని మీరు తిడితే సహించేదిలేదు..’ అంటూ తిరిగి సమాధానం చెప్పాడు. -
ఆయిల్‌పామ్.. ధర పతనం
ఆయిల్‌పామ్ ధరలు తిరోగమనం బాట పట్టాయి. క్రూడ్ ఆయిల్‌పై కేంద్రం దిగుమతి సుంకం రద్దు చేయడం, ఇతర కారణాలతో ఆయిల్‌పామ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే 40 శాతం మేర ధర తగ్గింది. అంతర్జాతీయంగా వచ్చే 30 ఏళ్ల వరకు ఆయిల్‌పామ్‌కు విపరీతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతుండగా దానికి విరుద్ధంగా ధరలు పతనమవుతున్నాయి. ఐదేళ్ల నుంచి వరుసగా ధరలు పెరుగుతూ వచ్చి మళ్లీ ఈ ఏడాది రివర్స్‌లో పయనిస్తున్నాయి. ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే ఏలూరు జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: వాణిజ్య పంటల్లో అగ్రగామిగా ఉన్న ఆయిల్‌పామ్ సాగు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అధికంగా ఉంది. దేశంలోనే సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1.62 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు జరుగుతుండగా ఒక్క ఏలూరు జిల్లాలోనే 48,968.8 హెక్టార్లలో, పశ్చిమగోదావరి జిల్లాలో 3 వేల హెక్టార్లు సాగులో ఉంది. సుమారుగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు కలిపి 1.30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, కోకో, కొబ్బరి, మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు అంతర పంటగా వేసుకునే వీలు ఆయిల్‌పామ్‌కు ఉండటంతో లక్షా 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌తో పాటు అత్యధిక శాతం కోకో అంతర పంటగా ఉంది.ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో గాలిలో 85 శాతం తేమ ఉండటంతో ఆయిల్‌పామ్ సాగుకు జిల్లా పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఇసుకతో కూడిన ఎర్రని నేలలు కావడం, కృష్ణా, గోదావరి డెల్టా మధ్య ప్రాంతం కావడంతో గాలిలో తేమ శాతం ఉండటం వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండటంతో ఆయిల్‌పామ్ సాగు అత్యధికంగా సాగుతుంది. మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా దీర్ఘకాలిక పంటగా దీన్ని అత్యధిక శాతం సాగు చేస్తున్నారు. తిరోగమనంలో ధరలుఆయిల్పామ్ ధరలు తిరోగమనంలో కొనసాగుతున్నాయి. 2017లో సగటున రూ.8 వేలు ఉన్న ధర అంతర్జాతీయ పరిణామాలు డిమాండ్ కారణంగా 2022 నాటికి టన్ను ధర అత్యధికంగా రూ.26 వేలకు చేరింది. ఆ తరువాత క్రూడ్ ఆయిల్‌పై దిగుమతి సుంకం రద్దు చేయడంతో ఆయిల్‌పామ్ ధర తిరోగమన బాట పట్టి గతేడాది రూ.23 వేలు సగటున ఉండగా ప్రస్తుతం రూ.13,180కు పరిమితమైంది. రెండేళ్ల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ ఇంపోర్ట్‌పై డ్యూటీ (దిగుమతి సుంకం) విధించింది. ఐదేళ్ల క్రితం వరకు ఇంపోర్ట్ డ్యూటీ 30 శాతం ఉండగా తర్వాత 20 శాతానికి తగ్గించారు.గతేడాది పూర్తిగా రద్దు చేయడంతో దేశంలోని ప్రధాన కంపెనీలు దిగుమతులపై ఆధారపడుతున్నాయి. వాస్తవానికి 10 లక్షల టన్నులు ఏటా డిమాండ్ ఉంటే 2 లక్షల టన్నులు కూడా ఉత్పత్తి లేని పరిస్థితి. ఈ క్రమంలో డిమాండ్ అధికంగా ఉండాలి. అయితే ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా రద్దు చేయడంతో దిగుమతుల పైనే అత్యధికంగా ఆధారపడటంతో స్థానిక మార్కెట్లో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ ఏడాది మళ్లీ ఇంపోర్టు డ్యూటీ విధించే అవకాశం ఉంది. ఇంపోర్ట్ డ్యూటీ అమలులోకి వస్తే ఆయిల్‌పామ్ ధరలు కొంతైనా పెరిగే అవకాశం ఉంది.ఏలూరు జిల్లాలో భారీగా సాగుఏలూరు జిల్లాలో 14 మండలాల్లో అత్యధికంగా ఆయిల్‌పామ్ సాగు జరుగుతుంది. 2019–20లో 72,860 హెక్టార్లు, 2020–21లో 70,963 హెక్టార్లు, 2022023లో 48,836 హెక్టార్లు, 2023–24లో 48,968.8 హెక్టార్లలో సాగు విస్తీర్ణంలో ఉంది. ప్రధానంగా టి.నర్సాపురం మండలంలో 16190 ఎకరాలు, కామవరపుకోట మండలంలో 16,078 ఎకరాలు, ద్వారకాతిరుమల మండలంలో 17,504 ఎకరాలు, చింతలపూడి మండలంలో 18,304 ఎకరాలు, జంగారెడ్డిగూడెం మండలంలో 8,422 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. హెక్టారుకు నాలుగేళ్లు కలిపి రూ.71 వేలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం, 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే పంట కావడంతో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్‌పామ్‌ను పామాయిల్ పరిశ్రమలు తక్కువ గాను, కాస్మొటిక్స్ ఇతర అనుబంధ పరిశ్రమలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. -
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
-
చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224,225,353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని గూండాగిరిహత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్‌స్టేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చలపాటి రవిపై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు రమ్మని ఆదేశించారు.ఈ క్రమంలో గురువారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ అతడి తండ్రి డేవిడ్ గురువారం ఉదయం 8:30 సమయంలో పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు అతడిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజశేఖర్ టీడీపీ కార్యకర్తల ద్వారా చింతమనేనికి తెలియజేశాడు. దీంతో చింతమనేని తన అనుచరులతో కలిసి స్టేషన్‌కు వచ్చి సీఐ, ఎస్ఐలపై తిరగబడి దౌర్జన్యంగా రాజశేఖర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. -
కాకిస్‌నూరు.. ఓటింగ్‌లో సూపర్..
అది బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఓ కుగ్రామం. ఏలూరు జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గూడేనికి చేరుకోవడమే ఓ ప్రహసనం. ఎలాంటి రహదారి సౌకర్యం లేని అక్కడి పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలంటే కొయిదా గ్రామం నుంచి గోదావరి‡ నదిగుండా బోట్లో ప్రయాణించి, ఆవలి ఒడ్డు నుంచి సుమారు మూడు కిలోమీటర్లు గుట్టల నడుమ కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ మొత్తం 472మంది కొండరెడ్ల ఓటర్లున్నారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో 440 ఓట్లు పోల్ కాగా 93.22శాతం ఓటింగ్ నమోదు చేసుకుని ఎలక్షన్ కమిషన్ దృష్టిని ఆకర్షించింది. అంతేనా... అధికారుల ప్రశంసలను కూడా అందుకుని దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే పోలవరం నియోజకవర్గం పరిధిలోని కాకిస్‌నూరు.వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంత గ్రామమైన కాకిస్‌నూరు గ్రామం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93.22 ఓటింగ్ శాతం నమోదు చేసుకుని ఆదర్శంగా నిలిచింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి వెళ్లిన అధికారులకు గ్రామ కొండరెడ్లు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అధికారులను పూలమాలలతో సన్మానించారు. వారి సహృదయతకు ముచ్చటపడిన భారత ఎన్నికల సంఘం ‘ఎక్స్’ వేదికగా అధికారులకు స్వాగతం పలికిన ఫొటోను అప్లోడ్ చేసి, వివరాలతో ట్విట్ చేశారు. దీనికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. బోటుపై వచ్చి ఓటు హక్కు వినియోగందట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కాకిస్‌నూరు పోలింగ్ కేంద్రం పరిధిలోని పేరంటపల్లి, టేకుపల్లి, చినమకోలు, పెదమంకోలు గ్రామాల ఓటర్లు 440 మంది గోదావరిలో బోటుపై వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16,37,430 ఓటర్లున్న ఏలూరు జిల్లాలోని 1,744 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సకల ఏర్పాట్లు చేశారు. కాకిస్‌నూరు గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేని ఆ గ్రామంలో జనరేటర్ సమకూర్చి, తాత్కాలికంగా లైట్లు ఏర్పాటు చేయించారు.ఫోన్ కవరేజ్ లేకపోవడంతో ఈ గ్రామంలో శాటిలైట్ ఫోన్ ఏర్పాటు చేశారు. ఓటర్లు వచ్చేందుకు బోటు సౌకర్యం కల్పించడమే కాకుండా ఓటింగ్‌కు ఒక రోజు ముందు వారికి ఓటింగ్‌పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల అధికారులు 12న కాకిస్‌నూరు గ్రామానికి చేరుకొని, ఇంటింటికీ తిరిగి ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను వివరించారు. ఫలితంగా ఓటింగ్ శాతం పెరిగింది. తమ గ్రామానికి దే«శస్థాయిలో గుర్తింపు రావడంపై భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు గ్రామ కొండరెడ్లు కృతజ్జతలు తెలిపారు.మా ఓటు వల్లనే ఊరికి మంచి పేరుమేమంతా ఓటు వేయడం వల్లనే మా ఊరికి మంచి పేరొచ్చింది. మా ఊరు దేశ ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. మాకు చాలా సంతోషంగా ఉంది. –సిద్ది శ్రీనివాసరెడ్డిసానా సంతోషంగా ఉందయ్యామేమంతా ఓటెయ్యడం వల్ల ఊరికే పేరు రావడం నాకు సానా సంతోషంగా ఉందయ్యా.. పెద్ద సార్లకు కృతజ్ఞతలు చెబుతున్నా. – కోళ్ల కన్నమ్మ -
రోడ్డు ప్రమాదంలో భారీగా నగదు స్వాధీనం..!
-
కేసుల పుట్ట రఘురామకృష్ణరాజు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆస్తులు, కేసుల పుట్ట అని వెల్లడైంది. ఆయన, ఆయన భార్య కనుమూరి రమాదేవి పేరిట స్థిర, చరాస్తులు మొత్తం కలిపి రూ.215.57 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తేలింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సీబీఐ కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు తరఫున ఆయన భార్య రమాదేవి శుక్రవారం రెండు సెట్ల నామినేషన్‌ను సమర్పించారు. ఉండి అభ్యర్థిగా టీడీపీ ఇంకా ఆయన పేరును అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసుల వివరాలను పేర్కొన్నారు. వీటి ప్రకారం.. బ్యాంకుల్లో అప్పులు రూ.12.60 కోట్లు ఉన్నట్టు తెలిపారు. ఆస్తులు, అప్పులు ఇవి.. రఘురామకృష్ణరాజు పేరుతో రూ.13.89 కోట్లు, ఆయన భార్య రమాదేవి పేరుతో రూ.17.79 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో చూపించారు. తమిళనాడు, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు అన్నీ కలిపి రూ.8.48 కోట్లు రఘురామకృష్ణరాజు పేరిట, ఆయన భార్య పేరుతో రూ.175.45 కోట్లు ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. రఘురామకృష్ణరాజుకు రూ.8.15 కోట్లు, ఆయన భార్యకు రూ.4.45 కోట్లు బకాయిలు ఉన్నట్టు చూపించారు. రఘురామపై కేసుల వివరాలివీ.. ►సైబరాబాద్‌లో వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటనలో, నేరపూరిత కుట్ర ఆరోపణలతో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీస్‌స్టేషన్‌లో, పెనుమంట్ర పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. ►ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి. ►మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడినందుకు చింతలపూడి, మంగళగిరి, భీమవరం, పోడూరు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నర్సాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. ►కుట్ర, మోసం, ఫోర్జరీ చేశారని ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదుపై, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను మోసం చేయడంతో ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదు చేసింది. ►ఫెమా చట్టం ఉల్లంఘన కింద రూ.40 కోట్లు జరిమానా విధించిన కేసు తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోంది. -
రెట్టించిన ఉత్సాహంతో...
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) నుదిటిపై గాయం మానలేదు.. కుట్లు పచ్చి ఆరలేదు.. కంటిపైన వాపు తగ్గలేదు.. అయినా పెదాలపై చిరునవ్వు చెరగలేదు. ఆ ముఖంలో ఏ మాత్రం భయంలేదు. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో జగన్ సోమవారం తన బస్సుయాత్రను ముందుకు దూకించారు. దాడులతో మన యాత్రను ఆపలేరని, ధైర్యంగా ముందుగు సాగుదామని కేడర్‌లో జోష్ నింపారు. బస్సుయాత్రలో భాగంగా ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి జగన్ సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. అలాగే, సోమవారం ఈ కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వారిని కలిసిన అనంతరం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కారణంగా డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత కృష్ణాజిల్లా కేసరపల్లి నుంచి జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సుయాత్ర సోమవారం ఉదయం 10.25 నిమిషాలకు ప్రారంభమైంది. కేసరపల్లి బస ప్రాంతానికి అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు జగన్ రాకతో జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వందలాది మోటార్ బైకులు ర్యాలీగా ముందు నడవగా.. బస్సుయాత్ర గన్నవరం చేరుకుంది. మార్గమధ్యంలో తన కోసం వచ్చిన ఓ మహిళా అభిమానితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం కొత్తపేటలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి జాతీయ రహదారికి ఇరువైపులా బారులుతీరిన మహిళలు అఖండ స్వాగతం పలికారు. గన్నవరం వద్ద జాతీయ రహదారికి రెండువైపులా జనసందోహంతో నిండిపోయింది. గన్నవరం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత జనంతో కూడళ్లు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. బస్సుపైకెక్కి వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. మహిళలు జననేతకు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులిచ్చారు. జగనన్నా.. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీబొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. ఆపదను దాటి వచ్చిన నాయకుడికి అక్కడి ప్రజలు ప్రేమతో స్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు పెద్దఎత్తున భవనాలపైకి స్థానికులు చేరుకున్నారు. జననేతను చూసి ఆనందంతో అభివాదం చేశారు. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనం.. ఉమామహేశ్వరం మీదుగా ముందుకు సాగిన జగన్‌ను చూసేందుకు ఇళ్లల్లో నుంచి వృద్ధులు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హనుమాన్ జంక్షన్ క్రాస్ మీదుగా పెరికీడుకు చేరుకున్న జగన్‌కు భారీ జనసందోహం బాణాసంచాతో స్వాగతం పలికారు. కానుమోలులో శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ (ఉయ్యూరు) నిర్వాహకులు, దివ్యాంగులతో వచ్చి జగన్‌ని కలిశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ను అందించినందుకు వారు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారితో మాట్లాడి ముందుకు సాగిన జగన్‌కు గ్రామస్తులు భారీగా వచ్చి ఘనస్వాగతం పలికారు. ఆరుగొలనులో రహదారి కిక్కిరిసిపోయేలా అభిమానులు తరలివచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆరుగొలను ఆరోగ్యమాత ఆలయం వద్ద స్కడ్ హాట్ ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యార్థులు జగన్ మావయ్యా అంటూ ఎదురొచ్చారు. వారిని దాటి వచ్చిన జగన్‌కు పుట్టగుంటలో దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఎదురొచ్చిన వేద పండితులు జగన్‌ను ఆశీర్వదించారు. మ.3.30 గంటలకు జగన్నాథపురం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకున్న సీఎం జగన్ ప్రజాభిమానాన్ని దాటుకుంటూ సా.5.38 గంటలకు గుడివాడ బహిరంగ సభకు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే బహిరంగ సభకు జనం పోటెత్తడంతో సభా ప్రాంగణం జన సునామీని తలపించింది. ఆ అశేష జనవాహినినుద్దేశించి జగన్ ప్రసంగించారు. సభ అనంతరం 6.40 కి బస్సుయాత్ర తిరిగి ప్రారంభమైంది. హనుమాన్ జంక్షన్ హైవే మీదుగా కలపర్రు టోల్‌ప్లాజా చేరుకుంది. ఏలూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు, బాణాసంచా వెలుగులతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కుట్ర అది.. ఇక జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కుట్రేనని బస్సుయాత్రకు వచ్చిన ప్రతిఒక్కరూ నినదించారు. వాళ్లే వేయించారని, రాళ్లు పెట్టికొట్టండి పగోడు వస్తున్నాడు అని ఆ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ రెచ్చగొట్టారని దుమ్మెత్తిపోశారు. ‘రాళ్లుపెట్టి కొట్టండి అని చంద్రబాబు అన్నాడు. నీకు దమ్ముంటే గెలిపించుకో, నీకు దమ్ముంటే పథకాలివ్వు. నీ దగ్గర శక్తి ఉంటే జనం మనస్సులు గెలుచుకో. కానీ, నువ్వు ఏ ఒక్క పథకం ఇవ్వలేదు. జనానికి సున్నా చుట్టావు. నిన్నెలా నమ్ముతారు చంద్రబాబు.. అంటూ జనం సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేదని, అన్యాయమే చేశాడని, 175 సీట్లు జగన్‌కే వస్తాయి.. చంద్రబాబుకు ఒక్క సీటు కూడా రాదని ముక్తకంఠంతో చెప్పారు. ఏలూరు జిల్లాలో ఎగిసిన అభిమాన సంద్రం బస్సుయాత్ర కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకోగానే ఏలూరు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు బాణాసంచాతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు ఏర్పాటుచేసి మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. పొద్దుపోయినా జాతీయ రహదారిపై జనం బారులు తీరారు. బస్సు పైకెక్కి వారందరికీ జగన్ అభివాదం చేస్తూ ఏలూరు క్రాస్ నుంచి భీమడోలు మీదుగా యాత్ర కదిలింది. కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం తక్షణమే స్పందించి మానవత్వం చూపారు. ఒక పోలీస్ వాహనాన్ని (కాన్వాయ్ వాహనం కాదు) బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. సీఎం బస్సును ఆపి, ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్‌లో ఉంచిన అంబులెన్స్ ద్వారానే క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ముందుకు సాగిన సీఎం జగన్ చేబ్రోలు మీదుగా నారాయణపురం బస ప్రాంతానికి రాత్రి 9.55 నిమిషాలకు చేరుకున్నారు. యాత్ర మొత్తం జగన్‌ను చూసేందుకు వచ్చిన ప్రజలు మీకు తోడుగా మేమున్నామంటూ ఆశీర్వదించంతో 15వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది. మొదటి ఓటు జగన్ మామకే.. ఫస్ట్‌టైమ్ ఓటు వేస్తున్నాను. నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే జగన్ వంటి మంచి వ్యక్తికి ఓటు వేయడమనేది చాలా గర్వంగా ఉంది. జగన్ మామకే ఓటు వేయాలనుకుంటున్నా. మంచి పథకాలిచ్చి జనానికి మంచి చేస్తున్నారు. అందుకోసమైనా గెలిపించుకోవడానికి ఆయనకే ఓటు వేస్తా. మంచిచేసే వ్యక్తిని కావాలని కోరుకుంటాంగానీ తప్పుడు పనులు చేసేవాళ్లకు వేయం కదా. ఇంతకుముందు పాలనలో పేదోడు అయితే బాగుపడింది లేదు. ఇప్పుడు జగన్ మామ వచ్చిన తర్వాత పేదోడు అనేవాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. మంచి గెలవాలి అంటే మనమంతా కలిసి గెలిపించుకోవాలి.. చెడు రాజకీయం చేయకూడదు. ఇక్కడికి వచ్చిన వాళ్లలో విద్యార్థులే ఎక్కువ.. అన్నయ్య గెలుపు కూడా విద్యార్థులతోనే మొదలవుతుంది.– కమలాకర్, విద్యార్థి జగనే మళ్లీ సీఎంగా రావాలి.. జగనన్న స్థలం ఇచ్చాడు.. ఇళ్లు కట్టించాడు. మగ్గం డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాడు. నాకు మగ్గంతో ఇంట్లో ఇరుకుగా ఉండేది. ఇల్లు ఇరుకుగా ఉండటంతో మగ్గాన్ని షెడ్డులో తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడు మాకు బాగుంది. కాబట్టి మళ్లీ జగనన్నే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. – బత్తూరి పద్మావతి, మంగళగిరి టీడీపీ హయాంలో నరకయాతన టీడీపీ ప్రభుత్వంలో చాలా యాతన పడ్డాం.. వాళ్లు వెయ్యి రూపాయల పెన్షన్‌ను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. మా అమ్మ ఆఫీస్ చుట్టూ తిరగలేకపోయేది. మేం వెళ్తుంటే పెన్షన్ మాకు ఇచ్చేవారు కాదు. ఆవిడే రావాలి, ఆవిడే సంతకం పెట్టాలి అని టీడీపీ వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడ నడవలేని, లేవలేని మనిషి.. వాళ్ల అమ్మాయికివ్వండి అని ఎంతమంది చెప్పినా ఇవ్వలేదు. జగనన్న మాకు స్థలం ఇచ్చాడు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. మేం ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్, రేషన్ ఇంటికే వస్తోంది. ఈరోజు ఈ ఇంట్లో ఉండి తినగలుగుతున్నామంటే అంతా జగనన్న చలవే. ఇంతవరకు మమ్మల్ని అలా ఆదరించిన వాళ్లు, అలా అనుగ్రహించి చూసిన వాళ్లు, సహాయం చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. నా తోడబుట్టిన వాడిలా మాకు సహాయం చేశాడు. మళ్లీ మళ్లీ జగనే రావాలని మేం కోరుకుంటున్నాం. – కందుకూరి కల్పన, ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారు సూరీడు నిప్పులు చెరుగుతున్నా.. ఎర్రని సూరీడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నా లెక్కచేయకుండా జగన్ బస్సుపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. చినఅవుటపల్లి వద్దకు రాగానే అక్కడ మహిళలు జగన్‌కు ఎదురొచ్చారు. వారిని జననేత పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. హైవే బైపాస్వల్ల జాతీయ రహదారితో కనెక్షన్ కోల్పోయిన చినవాడిపల్లికి న్యాయం చేయాలంటూ ఆ గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగంపల్లి నేలవేణి సాయం చేయమని సీఎంను కోరారు. ఆమెకు భరోసా ఇచ్చి జగన్ ముందుకు కదిలారు. మరికొంత దూరం రాగానే పెదఅవుటపల్లి క్రాస్ వద్ద తనను చూసేందుకు పరుగుపరుగున వచ్చిన ప్రజలను చూసి జగన్ బస్సును ఆపించి వారితో మాట్లాడారు. సుభాషిణి అనే మహిళ తన అన్న బాలశౌరి ఆరోగ్యంపై వినతిపత్రం అందజేశారు. ఆత్కూరులో అభిమానులు జగన్‌కు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. అక్కడి మహిళల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. పొట్టిపాడు టోల్గేట్ దాటగానే మహిళలు హైవేపై బంతిపూలతో వైఎస్సార్సీపీ అని రాసి స్వాగతం పలికారు. తేలప్రోలు వద్ద అభిమానుల స్వాగతాన్నందుకుని జగన్ ముందుకొచ్చారు. కోడూరుపాడు వద్ద మహిళలు, రైతులను జగన్ పలకరించారు. వీరవల్లి హైస్కూల్ బాలికలు జగన్ మావయ్యకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారితో జగన్ కాసేపు ముచ్చటించారు. -
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 16వ రోజు షెడ్యూల్
సాక్షి, పశ్చిమగోదావరి: మేమంతా సిద్ధం 16వ రోజు మంగళవారం (ఏప్రిల్ 16) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు నారాయణపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. చదవండి: మేమంతా సిద్ధం 15వ రోజు: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్