
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్‌లో నిద్రపోతున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌వర్ధన్‌రెడ్డి (9) దారుణహత్యకు గురయ్యాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అటవీ ప్రాంతంలో గల శివారు గ్రామం ఒర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు. వారిద్దరు అక్కచెల్లెళ్లు. మొదటి భార్య లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, రెండో భార్య రామలక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామలక్ష్మి రెండో కుమారుడైన అఖిల్‌వర్ధన్‌రెడ్డి గత ఏడాది ఈ ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతిలో చేరాడు.
ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి 10 గంటలకు తోటి విద్యార్థులతో కలిసి వసతిగృహంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వసతిగృహం పక్కవైపు కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి టార్చ్‌లైట్‌తో అఖిల్‌వర్ధన్‌రెడ్డిని గుర్తించి మరీ బయటకు తీసుకువెళ్లారు. దుండగులు తీసుకెళ్లిన అఖిల్‌వర్ధన్‌రెడ్డి తెల్లవారేసరికి పాఠశాల ఆవరణ సమీపంలో శవమై కనిపించాడు.
మృతుడి చేతిలో ఒక లెటర్ ఉంది. దాన్లో ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఎందుకంటే ఇకనుంచి ఇలాంటి సంఘటనలే జరుగుతాయి..’ అని రాసి ఉంది. అఖిల్‌వర్ధన్‌రెడ్డి మెడ నల్లగా కమిలిపోయి ఉంది. కాలితో తొక్కి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. మర్మాంగాలు చితికిపోయి ఉన్నాయని, వీపుపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మేరీ ప్రశాంతి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు నుంచి తీసుకొచ్చిన పోలీస్ జాగిలం సహాయంతో గాలించారు.
Comments
Please login to add a commentAdd a comment