Tribal Welfare
-
మాపై ఎందుకంత కక్ష.. చంద్రబాబుపై ఉపాధ్యాయులు ఫైర్
-
నిల్వ ఆహారం తిని 8 మంది బాలికలకు అస్వస్థత
పెదబయలు: ప్రభుత్వం ఆదేశాల మేరకు అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం)లో వండిన ఆహారం మిగిలిపోవడంతో దాన్ని మరుసటి రోజు విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఫుడ్ పాయిజన్ జరిగి 8 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పెదబయలు మండలం, గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 7వ తేదీన మెగా పీటీఎం నిర్వహించారు.ఆరోజు తల్లిదండ్రులకు పెట్టిన తరువాత మిగిలిన బంగాళదుంప, బఠానీ కూరను మరుసటి రోజైన ఆదివారం కొంతమంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పెట్టారు. అదే రోజు సాయంత్రం వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. 5వ తరగతి విద్యార్థులు జి.శ్రావణి, చాందిని, పి.స్వాతి, పి.బిందు (4వ తరగతి), కె.హర్షిత(3వ తరగతి), 2వ తరగతి విద్యార్థులు పి.హిందువదన, పి.సెల్లమ్మి, జి.రíÙ్మ అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లో గోమండి పీహెచ్‌సీకి తరలించి, సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ పి.వసంతను వివరణ కోరగా... తల్లిదండ్రుల సమావేశానికి వచి్చన 200మందికి ఆహారం వడ్డించామనీ, మిగిలిన అన్నం, కూరను పారేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.తనకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం విజయనగరం వెళ్లానని, విద్యార్థుల అస్వస్థత విషయం ఏఎన్ఎం తనకు ఫోన్లో చెప్పడంతో తక్షణమే పీహెచ్‌సీకి సమాచారం అందించి, విద్యార్థులకు చికిత్స అందించినట్లు ఆమె పేర్కొన్నారు. పాఠశాల నుంచి వచి్చన సమాచారం మేరకు సోమవారం స్కూల్‌కు వెళ్లి 11మంది విద్యార్థులకు వైద్యం చేశామనీ, వారిలో పరిస్థితి బాగోలేని 8మందిని పీహెచ్‌సీకి తరలించినట్లు పీహెచ్సీ వైద్యాధికారి చైతన్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
ఉద్యోగ భద్రత కోసం చంటి బిడ్డలతో టీచర్ల ధర్నా
అమరావతి: ‘డీఎస్సీ నుంచి మినహాయించి.. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏడాది మూడు నెలల చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని ధర్నా చేస్తున్న ఈమె పేరు పి.పర్శిక. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూనవరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సైన్స్ టీజీటీగా పనిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో తమ పోస్టులు కూడా ఉండడంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తన ఉద్యోగం పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.దాదాపు 237 కిలోమీటర్ల దూరంలోని కూనవరం నుంచి విజయవాడకు వచ్చి తన ఉద్యోగానికి భరోసా కల్పించేలా కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేయాలని రోజుల తరబడి ధర్నా చేస్తోంది’.పర్శిక టీచర్‌తోపాటు వందలాది మంది తమ ఊరు, వాడ, గూడు వదిలి వచ్చి విజయవాడ ధర్నా చౌక్‌లో గత 13 రోజులుగా శాంతియుత నిరసన కొనసాగిస్తున్నా సర్కార్ కనికరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లోకేశ్ ఓఎస్డీ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గిరిజన గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ గురువారం నాటి కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – సాక్షి, అమరావతి -
గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. 44 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి,అల్లూరి సీతారామరాజు జిల్లా : రంపచోడవరం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాల కర్కశత్వానికి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి పాలయ్యారు. వివిధ కారణాలతో విద్యార్థినులకు పనిష్మెంట్ ఇచ్చారు ఆ ప్రిన్సిపల్.రెండు రోజుల పాటు కళాశాల విద్యార్థినులతో ఒక్కసారిగా 200 గుంజీలు తీయడం, వారితో పరుగులు తీయించడం చేయించారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థునులను నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థుల్ని అత్యవసర చికిత్స కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు కళాశాల సిబ్బంది.ప్రిన్సిపల్ కఠిన శిక్షకు నడవలేని విద్యార్థునులు నడవలేని స్థితిలో రంపచోడవం ఆస్పత్రికి వెళ్లారు. కొంతమంది విద్యార్థునులను ఆస్పత్రి లోపలికి ఎత్తుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యార్థులు. కళాశాల ప్రినిపల్ తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, నిర్దాక్షణ్యంగా శిక్షలు విధిస్తున్నారని, అన్నం తిన్న వెంటనే పరుగులు పెట్టిస్తున్నారని విద్యార్థునులు వాపోతున్నారు. -
వెనుకబడిన వర్గాలకు చేయూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది. బీసీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్లో రూ.6,229 కోట్లు ఇవ్వగా.. ఈసారి సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా రూ.9,200.32 కోట్లను కేటాయించింది. వాస్తవానికి కొన్నేళ్లుగా బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా లేవని.. ఈసారి ఊరట కలిగించేలా కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.⇒ వడ్డెర, కృష్ణబలిజ పూసల, వాల్మీకి బోయ, భట్రాజ, కుమ్మరి, శాలివాహన, సగర కో–ఆపరేటివ్ ఫెడరేషన్లకు, మేదర కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్ కార్పొరేషన్లకు రూ.50కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లు కేటాయించారు.⇒ తెలంగాణ తాడీ టాపర్స్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.68 కోట్లు.⇒ ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు, చేనేతకారుల సహాయానికి రూ.450 కోట్ల గ్రాంటు..⇒ నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు, వాషర్మెన్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.150 కోట్లు..⇒ ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ వెల్ఫేర్ బోర్డులకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.⇒ నీరా పాలసీకి రూ.25 కోట్ల గ్రాంటు ఇచ్చారు.⇒ మైనారిటీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,200 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.798 కోట్లు అదనంగా రూ.3,002.60 కోట్లు కేటాయించారు.⇒ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఈసారి రూ.2,736 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇచ్చిన రూ.2,131 కోట్లతో పోలిస్తే ఇది రూ.605 కోట్లు అదనం.⇒ ఇక ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కోసం అన్ని సంక్షేమశాఖలకు కలిపి రూ.2,600 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.200 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల కింద బీసీ సంక్షేమ శాఖకు అధికంగా రూ.1,650 కోట్లు కేటాయించారు.సంక్షేమ శాఖలకు కేటాయింపులివీ..శాఖ నిధులు (రూ.కోట్లలో)ఎస్సీ సంక్షేమం 28,724.53గిరిజన సంక్షేమం 15,123.91బీసీ సంక్షేమం 9,200.32మైనారిటీ సంక్షేమం 3,002.60మహిళా, శిశు సంక్షేమం 2,736.00కార్మిక సంక్షేమం 881.86 -
సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
అమరావతి, సాక్షి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ నేపథ్యంలో.. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. డీఎస్సీ నుంచి గురుకులాల 1,143 పోస్టులు మినహాయించాలన్నది వాళ్ల ప్రధాన డిమాండ్. పదిహేనేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో తాము పని చేస్తున్నామని, ఇప్పుడు డీఎస్పీ నోటిఫికేషన్ ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, పరీక్ష రాయడానికి తమకు ఏజ్ లిమిట్ కూడా దాటిపోయిందని అంటున్నారు వాళ్లు. శనివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎదురుచూశామని, అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వచ్చామని టీచర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వాళ్లను అక్కడి నుంచి పంపించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుకు తమ సమస్య వివరించిన తరువాతే కదులుతామని అంటున్నారు వాళ్లు. -
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతికి 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కె.జగజ్యోతిని ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. జ్యోతికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మార్చ్ 6 వరకు జ్యోతికి రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. జ్యోతిని చంచల్గూడా మహిళా జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని జజ్యోతి తరపు నన్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నారని ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. దీంతో జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధింస్తున్నామని కోర్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్ బాయిస్ హాస్టల్ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్డ్ కాంట్రాక్టర్ చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్‌ను ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్ఎస్) భవన్లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్‌ఛార్జి హోదాలో ఎస్ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం. చదవండి: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అరెస్ట్ -
10 కోట్ల ఆస్తి.. 4 కేజీల బంగారం.. మైండ్ బ్లాక్ అయ్యేలా జ్యోతి ఆస్తులు
-
జ్యోతి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు
-
గిరిజనుల సంక్షేమానికి రూ.24,000 కోట్ల పథకం
బేతుల్: గిరిజనుల సంక్షేమ కోసం రూ.24,000 కోట్లతో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన మంగళవారం మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని పునరుద్ఘాటించారు. తమ పార్టీ సభలకు జనం భారీ ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీ పట్ల అపూర్వమైన విశ్వాసం, మమకారం చూపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం ‘జనజాతీయ గౌరవ్ దివస్’ను జరుపుకోబోతున్నామని, జార్ఖండ్‌లో భగవాన్ బిర్సాముండాకు నివాళులు అరి్పంచబోతున్నానని తెలిపారు. గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా రూ.24,000 కోట్ల పథకాన్ని ప్రటించనున్నట్లు వివరించారు. మోదీ ఇస్తున్న గ్యారంటీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పరాజయాన్ని ఇప్పటికే అంగీకరించిందని ప్రధాని మోదీ చెప్పారు. మోదీ గ్యారంటీల ముందు కాంగ్రెస్ నకిలీ హామీలు పని చేయవని తేల్చిచెప్పారు. ఆ విషయం కాంగ్రెస్‌కు కూడా తెలుసని అన్నారు. ఆ పార్టీ ఇక అదృష్టాన్ని నమ్ముకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాఖ్ రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదని తప్పుపట్టారు. వాటన్నింటినీ తమ ప్రభుత్వం ఆచరణలో చేసి చూపించిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్ఛిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. మూర్ఖుల సర్దార్ రాహుల్ గాంధీ ప్రజల జేబుల్లో ‘మేడ్ ఇన్ చైనా’ఫోన్లు మాత్రమే కనిపిస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. మొబైల్ ఫోన్ల తయారీలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుందని వెల్లడించారు. అలాంటి మూర్ఖుల సర్దార్ ప్రపంచంలో ఉంటారా? అని రాహుల్‌పై మండిపడ్డారు. భారత్ నుంచి ఏటా రూ.లక్ష కోట్ల విలువైన ఫోన్లు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. ఆకాశంలో విహరిస్తున్న కాంగ్రెస్ నాయకులకు వాస్తవాలు ఏమిటో తెలియవని ఎద్దేవా చేశారు. మన దేశం సాధిస్తున్న విజయాలను కళ్లతో చూడలేని జబ్బు వారికి ఉందని విమర్శించారు. భారత్ వోకల్ ఫర్ లోకల్‌గా మారిందన్నారు. స్వదేశీ ఉత్పత్తులు మార్కెట్లను ముంచెత్తుతున్నాయని, ఈ పరిణామంపై వ్యాపార, వాణిజ్య వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విధ్వంసమే మిగులుతుదందని ఓటర్లను అప్రమత్తం చేశారు. -
గతంలో మా గిరిజన ప్రాంతానికి ఒక చిన్న వాహనం కూడా రాలేకపోయేది
-
గిరిజనాభివృద్ధికి పెద్దపీట
వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో విద్య పాత్ర కీలకం. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన 28 ఏకలవ్య పాఠశాలల్లో 24 స్కూళ్లు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లోనే ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలోని గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం 1,953 ప్రభుత్వ ప్రాథమిక, 81 గురుకుల, 378 ఆశ్రమ పాఠశాలలతో పాటు 179 ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తోంది. మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఈ స్కూళ్లన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.. డిజిటలైజేషన్ పరంగా తరగతి గదులన్నింటినీ అప్‌గ్రేడ్ చేస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రజల హక్కులు పరిరక్షిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గిరిజన రైతుల అభివృద్ధి కోసం 3.22 లక్షల ఎకరాలకు పట్టాలు జారీ చేశామన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలంటే విద్య ప్రధాన ఆయుధంగా తీసుకొని ఆయా ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర హోం శాఖ ధృడమైన మార్గదర్శకత్వం, మద్దతుతో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను విజయవంతంగా రూపు మాపుతామని, రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొన్న వైఎస్ జగన్.. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదంపై పోరాటం, నిర్మూలన, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ గత నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోంది. జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం.. తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం సానుకూల ఫలితాలను అందించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. మా ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి’ అని తెలిపారు. ఈ సదస్సులో సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. తీవ్రవాదబలం బాగా తగ్గుముఖం తొలుత ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యల కారణంగా మావోయిస్టు తీవ్రవాదబలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50 కి తగ్గింది. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లతో పటిష్టమైన సమన్వయం ఉంది. నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ టాస్క్‌ఫోర్స్‌లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మాకున్న సమాచారాలను ఈ ఉమ్మడి టాస్క్‌ఫోర్స్ ద్వారా పరస్పరం పంచుకుంటూ సమష్టిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. స్థిరమైన అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతి మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కీలక పరిష్కారాలు అని దృఢంగా విశ్వసిస్తున్నాం. పేదరికం, అవిద్య, అందుబాటులో లేని వైద్యం, సమాజాన్ని పీడిస్తున్న పరిమితమైన ఉపాధి అవకాశాలే తీవ్రవాదానికి అత్యంత అనుకూల అంశాలు. సమర్థవంతమైన విధానాలు అమలు చేయడం ద్వారా మాత్రమే దీన్ని రూపు మాపగలం. ప్రత్యామ్నాయ పంటల సాగు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 2020–21 నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 9,371 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు. 224 కేసులు నమోదు చేసి, 141 మంది నిందితులను అరెస్టు చేశారు. సుమారు 3.24 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని తగులబెట్టారు. నిరంతరాయంగా చేస్తున్న ఈ ఆపరేషన్ వల్ల 2022లో గంజాయి సాగు 1500 ఎకరాలకు తగ్గింది. ప్రస్తుత సంవత్సరం అంటే 2023లో అది కేవలం 45 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని చెప్పడానికి సంతోషిస్తున్నా. గంజాయి సాగు చేసే గిరిజనుల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి పోలీసులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు గంజాయి సాగు చేపడుతున్న గిరిజనులతో సంప్రదించి.. వారికి ప్రత్యామ్నాయ పంటలైన కాఫీ, నిమ్మ, జీడి మామిడి, నారింజ, కొబ్బరి, చింతపండు, సిల్వర్ ఓక్తో పాటు రాజ్మా, కందిపప్పు, వేరుశనగ తదతర పంటల సాగును ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తోంది. తద్వారా వారిని గంజాయి సాగు నుంచి మరల్చే ప్రయత్నం చేస్తోంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు.. రహదారులు అటవీ ప్రాంతంలో అర్హులైన 1.54 లక్షల మంది గిరిజన రైతులకు 3.22 లక్షల ఎకరాల మేరకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారీ చేశాం. వారి భూములను సాగు చేసుకునేందుకు మద్దతుగా, పెట్టుబడి ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు భరోసాగా రూ.13,500 ఆర్థిక సహాయం అందజేస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదా రులతో అనుసంధానం అన్నది అత్యంత కీలక మైన అంశం. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజమ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ స్కీం కింద 1,087 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తి చేశాం. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా, పారదర్శకంగా త్వరితగతిన అందజేయడం కోసం 897 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ కూడా ఉన్నారు. కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో భాగంగా మొబైల్ కనెక్టివిటీ పెంచడం కోసం 944 కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేశాం. పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రోత్సాహకం పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ, అమ్మఒడి కార్యక్రమం ద్వారా వారికి ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం చేయడానికి, మా ప్రభుత్వం కొత్తగా 879 విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు గిరిజన ప్రాంతాల్లో 108 అంబులెన్స్‌లు 75 పని చేస్తున్నాయి. 89 మొబైల్ మెడికల్ యూనిట్ల (104) ద్వారా గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలు కూడా ప్రవేశపెట్టాం. సికిల్‌సెల్ అనీమియా, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు ఆ రోగ్య పింఛన్ కింద నెలకు రూ.10 వేలు అందజేస్తున్నాం. వృద్ధాప్య ఫించను కింద గిరిజన ప్రాంతాల్లో 50 ఏళ్ల నుంచే నెలకు రూ.2,750 ఇస్తున్నాం. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ఈ మావో ప్రభావిత జిల్లాల్లో కనీసం 15 కొత్త బ్యాంకు శాఖలు మంజూరు కావాల్సి ఉంది. గతంలో సదరన్ జోనల్ కౌన్సిల్లో సిఫార్సు మేరకు వైజాగ్‌లో గ్రే హౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించి, దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి సమర్పించిందనే విషయాన్ని తెలియజేస్తున్నా. దీనిని వీలైనంత త్వరగా మంజూరు చేయగలరు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, శాంతిని సాధించడం, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించకుండా నిరోధించడం కోసం కేంద్ర, రాష్ట్రాల నడుమ నిరంతరం పరస్పర సహాయ సహకారాలు అవసరం. ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు.. అక్కడ పోలీసు బలగాల ఆధునికీకరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక, వ్యూహాత్మక మద్దతును కేంద్రం అందించడం అన్నది చాలా కీలకం. -
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నుతోంది. దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్ రూమ్ నుంచి భోజనశాల, బాత్రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. బుట్టాయగూడెం ఈఆర్ఎం స్కూలులోని తరగతి గదులు 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70 శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు ఎన్నో పథకాల ద్వారా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్ క్లాత్, టెక్ట్స్‌బుక్స్, నోట్ బుక్స్ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్‌్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు. స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ న్యాప్కిన్లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాలకు 2020 అక్టోబర్ 2న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్‌లో కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. – కంగాల వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి, ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మాకు ఇంగ్లిష్ చదువులు అందించారు మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. –ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్లో నిద్రపోతున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌వర్ధన్‌రెడ్డి (9) దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అటవీ ప్రాంతంలో గల శివారు గ్రామం ఒర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు. వారిద్దరు అక్కచెల్లెళ్లు. మొదటి భార్య లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, రెండో భార్య రామలక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామలక్ష్మి రెండో కుమారుడైన అఖిల్‌వర్ధన్‌రెడ్డి గత ఏడాది ఈ ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతిలో చేరాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి 10 గంటలకు తోటి విద్యార్థులతో కలిసి వసతిగృహంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వసతిగృహం పక్కవైపు కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి టార్చ్లైట్తో అఖిల్‌వర్ధన్‌రెడ్డిని గుర్తించి మరీ బయటకు తీసుకువెళ్లారు. దుండగులు తీసుకెళ్లిన అఖిల్‌వర్ధన్‌రెడ్డి తెల్లవారేసరికి పాఠశాల ఆవరణ సమీపంలో శవమై కనిపించాడు. మృతుడి చేతిలో ఒక లెటర్ ఉంది. దాన్లో ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఎందుకంటే ఇకనుంచి ఇలాంటి సంఘటనలే జరుగుతాయి..’ అని రాసి ఉంది. అఖిల్‌వర్ధన్‌రెడ్డి మెడ నల్లగా కమిలిపోయి ఉంది. కాలితో తొక్కి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. మర్మాంగాలు చితికిపోయి ఉన్నాయని, వీపుపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మేరీ ప్రశాంతి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు నుంచి తీసుకొచ్చిన పోలీస్ జాగిలం సహాయంతో గాలించారు. -
డోలీలకు చెక్ పెట్టేలా ‘గిరి రక్షక్’
సాక్షి, అమరావతి: మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు సుస్తీ చేస్తే దుప్పట్లతో డోలీ కట్టి కర్రలతో మోసుకుపోవడం.. మంచాలపై పడుకోబెట్టి ఆస్పత్రులకు తరలించే దుస్థితి తప్పనుంది. మారుమూల గిరిజన బిడ్డలకు సైతం తక్షణ వైద్య సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘గిరి రక్షక్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతోంది. ఈ ప్రాజెక్ట్ కింద 123 బైక్ అంబులెన్స్‌లను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో 108, 104 అంబులెన్స్‌లతోపాటు 122 ఫీడర్ అంబులెన్స్ (మూడు చక్రాల బైక్)లు వైద్య సేవలు అందిస్తున్నాయి. మూడు చక్రాల ఫీడర్ అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని ప్రాంతాలకు చేరుకునేలా బైక్ అబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చే కసరత్తు తుది దశకు చేరుకుంది. కాలిబాట ఉన్నా సరిపోతుంది నాలుగు చక్రాల అంబులెన్స్‌లు వెళ్లాలంటే కనీసం 6 అడుగుల దారి, మూడు చక్రాల ఫీడర్ అంబులెన్స్‌లు వెళ్లాలంటే మూడు అడుగుల దారి తప్పనిసరి. అదే బైక్ అంబులెన్స్ అయితే అడుగు, అడుగున్నర మార్గం ఉంటే చాలు. దీంతో ఇది మారుమూల ప్రాంతాల గిరిజనులకు ఉపయోగపడుతుందని గిరిజన సంక్షేమ శాఖలోని వైద్య, ఆరోగ్య విభాగం అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో కాకినాడ జేఎన్టీయూ రూపొందించిన బైక్ అంబులెన్స్ మోడల్ తరహాలో కొత్త బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తేనున్నారు. డ్రైవింగ్ సీటు వెనుక ఒక వ్యక్తి సౌకర్యంగా కూర్చునేలా 140 డిగ్రీల కోణంలో వాల్చిన తొట్టెలాంటి సీటు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేలా ఆరకిలో ఆక్సిజన్ సిలిండర్, సెలైన్ బాటిల్ పెట్టుకునే ఏర్పాటుతోపాటు ప్రాథమిక చికిత్స(ఫస్ట్ ఎయిడ్ కిట్) సామగ్రి ఉండేలా డిజైన్ చేయడం విశేషం. ప్రత్యేక యాప్‌తో పర్యవేక్షించేలా.. బైక్ అంబులెన్స్‌లను పర్యవేక్షించేలా ప్రత్యేక యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. అటవీ ప్రాంతంలో వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేని 1,818 ప్రాంతాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ కారణంగా ఆ ప్రాంతాల వాసులు ఎవరికైనా ప్రాణాపాయ స్థితి తలెత్తితే డోలీ, మంచాలపై మోసుకెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందిచేలా బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం గిరిజన సంక్షేమ, ఆరోగ్య, విద్య, పోషకాహారం కార్యక్రమాన్ని అమలులోకి తేనున్నారు. ప్రతి బైక్ అంబులెన్స్‌కు 15 మారుమూల గిరిజన ప్రాంతాల చొప్పున అప్పగించి.. అక్కడి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన, వారి సంక్షేమం, విద్య, పోషకాహారం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రధానంగా గర్భిణులను నెల రోజుల ముందుగానే బర్త్ వెయిటింగ్ రూమ్‌లకు తరలిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 45 బర్త్ వెయిటింగ్ రూమ్‌లకు అదనంగా 32 కొత్త వాటిని ఏర్పాటు చేసి మొత్తం 77కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా శిశు మరణాలు, డోలీ మరణాలు పూర్తిగా నిర్మూలించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. -
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కృషి
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): గిరిజనుల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ గిరిజనుల అభ్యున్నతిని పట్టించుకోలేదని, సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వారి తలరాతలు మారాయని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విశాఖలో నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలను శుక్రవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి పోరాడిన మహనీయుల చరిత్రతో కూడిన మ్యూజియాన్ని రూ.35 కోట్లతో లంబసింగిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులకు సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. దేశం నలు మూలల నుంచి 14 రాష్ట్రాల గిరిజనులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాలు వేరైనా అందరం ఒకటేనన్నారు. మూడు రోజులు పాటు సాగే ఈ ఫెస్టివల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు వారి రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలు తెలిపేలా నృత్యాలు ప్రదర్శించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, కళావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పాల్గొన్నారు. -
గిరిపుత్రుల్లో కొత్త ‘రాజ’సం
గిరిజనులకు తగిన గుర్తింపునిస్తూ పార్వతీ పురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి వారికి మరో వరం అందించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, గిరిజనులకు తలలో నాలుకలా ఉన్న పీడిక రాజన్నదొరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఉపముఖ్యమంత్రిగా అత్యున్నత గౌరవం కల్పించారు. గౌరవం పొందిన రాజన్నదొర రాక కోసం పార్వతీపురం మన్యం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన రాజన్నదొర పోస్టు గ్రాడ్యుయేషన్ చదివారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మేనేజరుగా కొన్నేళ్లు పనిచేశారు. ప్రజాసేవపై మక్కువతో ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. వరుసగా నాలుగు దఫాలు సాలూరు నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. గిరిజన బిడ్డగా, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయనపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. తమ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపిస్తారని ఆశిస్తున్నారు. గిరిజనులపై ప్రత్యేక మమకారం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో తమ ప్రాంతాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తారని విశ్వసిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన పార్వతీపురం మన్యం జిల్లాలో తొలి మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా రాజన్నదొర తనదైన ముద్ర వేసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న ముందు సవాళ్లు.... ∙గిరిశిఖర గ్రామాలకు రోడ్లు వేయడానికి అటవీశాఖ అనుమతులు రాక పనులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. వాటికి పరిష్కారం చూపా ల్సిన అవసరం ఉంది. ∙అభివృద్ధిగా దూరంగా ఉన్న గిరిశిఖర గ్రామాల్లో గిరిజనులకు విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందేలా చేయాలి. ∙గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు దళారుల బారిన పడకుండా జీసీసీ ద్వారా గిట్టుబాటు« దరకు కొనుగోలు జరిగేలా చూడాలి. ∙పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆధ్యాత్మిక, ఆçహ్లాదకర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ∙వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేలాది మంది గిరిజనులకు పోడు (ఆర్వోఎఫ్ఆర్) పట్టాలు అందాయి. ఆ భూముల్లో చిరుధాన్యాలు, ఉద్యానవన పంటలు సాగు మరింత పెరిగేలా ప్రోత్సా హకాలు అందించాల్సి ఉంది. రాజన్నదొరకు శుభాకాంక్షలు... చీపురుపల్లి: డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీడిక రాజన్నదొరకు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం అమరావతిలో దుశ్శాలువతో సత్కరించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఉన్నారు. -
గిరిజనాభివృద్ధికి ఏడు సూత్రాలు
సాక్షి, అమరావతి: నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు గిరిజనులకు ఎనలేని మేలుచేస్తున్నాయి. వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యం, విద్యుత్, మౌలిక వసతుల వంటి అంశాలపైనా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల వెలగపూడి సచివాలయంలో జరిగిన గిరిజన ఉప ప్రణాళిక సమీక్షలోనూ ఇదే విషయంపై దృష్టి కేంద్రీకరించింది. మరోవైపు.. గిరిజన (ఎస్టీ) సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం 2020–21లో రూ.5,177.54 కోట్లు కేటాయించగా దానికి మరో రూ.953.70 కోట్లు (18.42%) కలిపి 2021–22కు రూ.6,131.24 కోట్లు కేటాయించింది. వీటిని సద్వినియోగం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం తన దూకుడును పెంచింది. ఇందులో భాగంగా 7 అంశాలపై దృష్టి సారించింది. ఏడు కీలక అంశాలివే.. ►ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచినట్లుగా ‘నవరత్నాలు’ పథకాలను పక్కాగా అమలు జరిగేలా చూసి ఎక్కువమంది ఎస్టీలకు మేలు జరిగేలా ప్రణాళిక. ►ఎస్టీలు చేసే వ్యవసాయం, ఉద్యానవన, ఇతర రకాల సాగుకు దోహదం చేసే యాంత్రీకరణ, సబ్సిడీ రుణాలు అందించేందుకు కృషి. ►గిరిజన మహిళలు, పిల్లల సంక్షేమానికి అవసరమైన చర్యలు. ►విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు పెంచేలా నాడు–నేడు అమలు. ►గిరిజనుల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వారికి దశలవారీగా మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు. ►200 యూనిట్లలోపు వినియోగించే ఎస్టీలకు విద్యుత్ చార్జీల మినహాయింపు. ►గిరిజన ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రోడ్లు, మంచినీరు, పక్కా ఇళ్లు వంటివి ప్రాధాన్యత క్రమంలో నిర్మాణం. గిరిజనుల జీవనం మెరుగుపరిచేలా.. అడవుల్లో జీవించే గిరిజనులు సైతం సాధారణ పౌరుల్లాగే మెరుగైన జీవనం గడపాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే వారి అభివృద్ధి, సంక్షేమంతోపాటు మౌలిక వసతులను కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో 16,156 గిరిజన ప్రాంతాల వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. ఎస్టీ ఉప ప్రణాళిక అమలులోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నాం. – పాముల పుష్పశ్రీవాణి, ఉపముఖ్యమంత్రి -
గిరిజన కష్టాలకు కాంగ్రెస్సే కారణం
భోపాల్: కాంగ్రెస్ హయాంలో గిరిజనుల సంక్షేమం మరుగునపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. గత పాలకుల వల్ల ఇప్పటికీ వెనుకబాటుకు గురైన ప్రాంతాల అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని అన్నారు. సోమవారం ఆయన భోపాల్‌లో జన్‌జాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళన్‌లో మాట్లాడారు. అనంతరం ప్రధాని ఆధునీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. గోండ్ రాణి దుర్గావతి ధైర్యసాహసాలు, రాణి కమలాపతి త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదన్నారు. ‘గత ప్రభుత్వాల్లో గిరిజనులకు సముచిత స్థానం దక్కలేదు. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేదు. అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, వీర్‌సావర్కర్ జయంతిల మాదిరిగానే భగవాన్ బిర్సాముండా జయంతిని ఏటా నవంబర్ 15న నిర్వహిస్తాం’అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న 50 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈపీఐ దిశగా పరివర్తన: గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని చెప్పారు.‘వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి ఒకరూ ముఖ్యులే) అన్న ఆదర్శం దిశగా దేశం పరివర్తన చెందుతోందనడానికి ఇదే ఉదాహరణ. దేశవ్యాప్తంగా 175 రైల్వే స్టేషన్లలో ఇటువంటి అత్యాధునిక వసతులను సమకూరుస్తాం’అని చెప్పారు గత ప్రభుత్వాల హయాంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 40–50 ఏళ్లు పట్టేంది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1,100 కిలోమీటర్ల ఈస్టర్న్, వెస్టర్న్ ఫ్రెయిట్ కారిడార్ల పనులు ఏడేళ్లలోపే పూర్తయిందన్నారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: సీఎం జగన్
-
గిరిజనాభివృద్ధిలో నవశకం
వారి వారి ఊళ్లలోని గ్రామ సచివాలయాల్లో గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చాం. వలంటీర్లుగా నియమించాం. తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రైబల్ ప్రాంతాల్లో గిరిజనులకు పూర్తి రిజర్వేషన్ ఇచ్చాం. రికార్డు స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. స్కూళ్లు, ఆస్పత్రులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, వాటి రూపురేఖలు మారుస్తున్నాం. పౌష్టికాహారం పంపిణీ ద్వారా గర్భిణులు, బాలింతలైన చెల్లెమ్మలు, చిన్నారులకు అండగా నిలిచాం. ఈ కార్యక్రమాలన్నీ గిరిజనుల జీవన ప్రమాణాలను కచ్చితంగా పెంచుతాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి : చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గిరిజనుల అభివృద్ధికి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టి, సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా తొలి విడతలో 1.24 లక్షల మందికి 2.28 లక్షల ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామని తెలిపారు. దేశంలోనే ఇది ఒక చరిత్ర అని, రెండో విడతలో మరికొంత మందికి ఈ పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. 19,919 మంది గిరిజనులకు 31,155 ఎకరాల్లో డీకేటీ పట్టాలు ఇచ్చామన్నారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబర్ 26న సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలు, ఈ విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు, వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టాలు ఉన్న గిరిజన రైతులకు రైతు భరోసా కూడా ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా రూ.13,500 వారి చేతిలో పెడుతున్నామన్నారు. ఆ భూముల్లో బోర్లు వేసి, పంటల సాగు కోసం కార్యాచరణ రూపొందించామని, దీన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆసరా, చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో నవరత్నాల ద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు. 36 షెడ్యూలు మండలాల్లో పాఠశాలలు, హాస్టళ్లను నాడు –నేడు కింద 10 అంశాల ద్వారా మెరుగు పరుస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. హోం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ గిరిజన గ్రామాలకు కమ్యూనికేషన్ మెరుగు పరచాలి – గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాం. రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు పలు చర్యలు తీసుకున్నాం. షెడ్యూలు ప్రాంతాల్లోని స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలు చేపట్టాం. ఈ కార్యక్రమాలకు కేంద్రం సాయం అందేలా చూడాలి. – గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న టవర్ల మ్యాపింగ్ జాగ్రత్తగా చేయాలి. దాదాపు 400 టవర్ల ద్వారా 900 గ్రామాలకు టెలికాం సౌకర్యం కల్పిస్తున్నందున ఇంటర్నెట్, మొబైల్ సౌకర్యం సమగ్రంగా ఇచ్చేలా విధానం ఉండాలి. – దీనిపై ఒక ప్రణాళిక రూపొందించాలి. ఒక్క గ్రామం కూడా మిగిలిపోకుండా అన్ని గిరిజన గ్రామాలకు ఇంటర్నెట్, మొబైల్ సౌకర్యం కల్పించే దిశగా అడుగులేయాలి. – గ్రామ సచివాలయాలు ఉన్న ప్రతి చోటా పోస్ట్ ఆఫీసు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు మ్యాపింగ్ చేసుకుని, మిగిలిన పోస్ట్ ఆఫీసులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. ట్రైబల్ యూనివర్సిటీని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. – గిరిజనుల్లో చాలా మంది పిల్లలకు ఆధార్ లేదని తెలుస్తోంది. ఈ దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లోని అన్ని గ్రామ సచివాలయాలను ఆధార్ సెంటర్లుగా గుర్తించేలా కూడా కేంద్రాన్ని కోరాలి. తగ్గిన మావోయిస్టుల కార్యకలాపాలు రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని, సాయుధ మావోయిస్టుల బలం సుమారు 50కి పరిమితమైందని డీజీపీ గౌతం సవాంగ్ వివరించారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకే పరిమితమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గిరిజనుల జీవితాలపై విశేష ప్రభావం చూపుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా వారి గడప వద్దకే సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పట్ల గిరిజనులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మావోయిస్టుల రిక్రూట్మెంట్ పట్ల గిరిజన యువకులు ఆసక్తి చూపడం లేదని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే ఇందుకు ప్రధాన కారణమని డీజీపీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్ప శ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న సమావేశం నేపథ్యంలో హోం, గిరిజన సంక్షేమంతో పాటు వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశంలో ప్రస్తావించనున్న అంశాలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పన విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చ జరిపారు.(చదవండి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు) రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు, తదితర అంశాలను సమావేశంలో డీజీపీ వివరించారు. మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ తెలిపారు. సాయుధ మావోయిస్టుల బలం సుమారు 50కి పరిమితమైందన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకే పరిమితమైందని డీజీపీ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గిరిజనుల జీవితాలపై విశేష ప్రభావం చూపుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా వారి గడప వద్దకే సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అతిపెద్ద కార్యక్రమమని, దీనిపట్ల గిరిజనులు సంతోషంగా ఉన్నారని డీజీపీ వెల్లడించారు. మావోయిస్టుల రిక్రూట్మెంట్ పట్ల గిరిజన యువకులు ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణమని డీజీపీ అన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...? ♦గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చాం ♦అంతేకాదు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న గిరిజన రైతులకు రైతు భరోసాకూడా ఇస్తున్నాం ♦ప్రతి ఏటా రూ.13,500 గిరిజన రైతుల చేతిలో పెడుతున్నాం ♦ఆ భూముల్లో బోర్లు వేసి, పంటల సాగుకోసం కార్యాచరణకూడా రూపొందించాం: ♦దీన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం ♦ఆసరా, చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో గిరిజనులకు జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం ♦31,155 ఎకరాల డీకేటీ పట్టాలను 19,919 మంది గిరిజనులకు ఇచ్చాం ♦గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చాం ♦వాలంటీర్లగా వారిని నియమించాం ♦తద్వారా పెద్ద సంఖ్యలో గిరిజనులకు ఉద్యోగాల కల్పన జరిగింది ♦వారి గ్రామాల్లోనే వారికి ఉద్యోగాలు ఇచ్చాం ♦స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రైబల్‌ప్రాంతాల్లో గిరిజనులకు పూర్తి రిజర్వేషన్ ఇచ్చాం ♦ఈ కార్యక్రమాలన్నీ కూడా గిరిజనుల జీవన ప్రమాణాలను కచ్చితంగా పెంచుతాయి ♦36 షెడ్యూలు మండలాల్లో పాఠశాలలు, హాస్టళ్లను నాడు – నేడు కింద 10అంశాల ద్వారా మెరుగుపరుస్తున్నాం ♦నాడు – నేడు కార్యక్రమాలకు తగిన సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలన్న సీఎం ♦అలాగే షెడ్యూలు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేస్తున్న నాడు–నేడు కార్యక్రమాలకూ తగిన సహకారాలు అందించాలంటూ కేంద్రాన్ని కోరాల్సిందిగా అధికారులకు సూచించిన సీఎం ♦ట్రైబల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న టవర్ల మ్యాపింగ్ జాగ్రత్తగా చేయాలని సమావేశానికి హాజరైన టెలికాం అధికారులకు సీఎం ఆదేశం ♦దాదాపు 400 టవర్ల ద్వారా 900 గ్రామాలకు టెలికాం సౌకర్యం కల్పిస్తున్నామన్న అధికారులు ♦సమగ్రంగా ఇంటర్నెట్, మొబైల్ టెలికాం సౌకర్యం ఇచ్చేలా విధానం ఉండాలన్న సీఎం ♦దీనిపై ఒక ప్రణాళిక రూపొందించి, ఆమేరకు కేంద్రం సహకారం కోరాలన్న సీఎం ♦ఒక్క గ్రామం కూడా మిగిలిపోకుండా అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్, మొబైల్ సౌకర్యం కల్పించే దిశగా అడుగులేయాలన్న సీఎం ♦గ్రామ సచివాలయాలు ఉన్న ప్రతిచోటా కూడా పోస్ట్‌ఆఫీసు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦ఆ మేరకు మ్యాపింగ్ చేసుకుని , మిగిలిన పోస్ట్ ఆఫీసులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలన్న సీఎం ♦ట్రైబల్ యూనివర్శిటీని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦గిరిజనుల్లో చాలామంది పిల్లలకు ఆధార్ లేదన్న అధికారులు ♦ట్రైబల్ ప్రాంతాల్లో అన్ని గ్రామ సచివాలయాలను ఆధార్ సెంటర్లుగా గుర్తించేలా కూడా కేంద్రాన్ని కోరాలన్న సీఎం ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ప్రిన్స్‌పల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్ ప్రతీప్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: పేదలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు -
వర్షాలపై అప్రమత్తం: మంత్రి సత్యవతి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులపై ప్రతిరోజు తన కార్యాలయానికి నివేదికలు పంపాలని సూచించారు. గురువారం ఆమె తన కార్యాలయం నుంచి ఐటీడీఏ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో వరదల కారణంగా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. గర్భిణీ స్త్రీలను వారి ప్రసవ గడువు తేదీల ప్రకారం ఆస్పత్రుల్లో చేర్పించే చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం కలిగినా, ప్రమాదం జరిగినా రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని చర్యలు చేపట్టాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి మండలానికి ఒక అధికారిని ఇన్‌చార్జీగా నియమించి, బాధ్యతలు ఇవ్వాలన్నారు. -
మానస స్వప్నం నిరుపేదలకు ఓపాడ్ ఇళ్లు
సొంతింట్లో నివసించాలని కోరుకునే వారు మన సమాజంలో చాలామంది ఉంటారు. పేద, మధ్యతరగతి వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు 23 ఏళ్ల పేరాల మానస రెడ్డి సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. డ్రైనేజి నీటి పారుదల కోసం ఉపయోగించే.. పైపుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను అతి తక్కువ ఖర్చుకే అందించనున్నట్లు మానస ప్రకటించింది. ప్రకటించినట్లుగానే రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది మానస. తను మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో మానసను, ఆమె చెల్లిని తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చిన్నప్పటి నుంచి తల్లి పడుతోన్న కష్టాలను దగ్గర నుంచి చూస్తూ పెరిగిన మానస... తల్లి ప్రోత్సాహంతో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ అయిన తరువాత మరో ఆరు నెలలపాటు కొత్త కొత్త ఇళ్ల నిర్మాణ నమూనాలపై ఆమె పరిశోధనలు చేసింది. పరిశోధనలో భాగంగా జపాన్, హాంగ్‌కాంగ్, ఇతర ప్రదేశాల్లో అక్కడి వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా నిర్మించిన ఇళ్ల నమూనాలపై లోతుగా అధ్యయనం చేసింది. వీటి ఆధారంగా మన దేశంలోని వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇంటిని నిర్మించవచ్చో నిర్ణయించుకుని కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టడానికి రిజిస్టర్ చేసుకుంది. నిరుపేద కుటుంబాల కోసం 12 రకాల డిజైన్లు రూపొందించగా... ఇప్పుడు ఒక నమూనాతో ‘ఓపాడ్’ ఇంటిని నిర్మించింది. ఓపాడ్.. సిమెంటు తూములు (పైపు)ల్లో నిర్మించే ఈ ఇళ్లు చిన్నగా... చూడముచ్చటగా కనిపిస్తాయి. ఓపాడ్ లో ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్, వాష్‌రూమ్‌లు ఉంటాయి. వస్తువులను పెట్టుకునేందుకు అల్మారాలు, ఎలక్ట్రిసిటీæ, వాటర్, డ్రైనేజీ సదుపాయాలు ఉంటాయి. పైపు పైన లాంజ్ లాంటి బాల్కనీ కూడా ఉంది. ఈ ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు సౌకర్యంగా జీవించవచ్చు. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుంది. ‘‘అన్ని వాతావరణ పరిస్థితుల్లో అటూ ఇటూ కదపగల ఈ ఇళ్లæజీవిత కాలం వందేళ్లు అని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని మానస చెప్పింది. సరికొత్త ఓపాడ్ ఇళ్లలో డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ..‘‘పట్టణాలు, గ్రామాలు, స్లమ్స్‌లో నివసించే వారు ఎక్కువగా పూరి గుడిసె ల్లో నివసిస్తుంటారు. వర్షం పడిందంటే ఇళ్లలోకి నీరు చేరడం, పైకప్పు నుంచి వర్షం కురవడం, కొన్నిసార్లు నీటి ప్రవాహానికి ఇళ్లు కొట్టుకుపోవడం వంటివి సంభవిస్తుంటాయి. నేను బి.టెక్ చదివేటప్పుడు ఇటువంటి సందర్భాలెన్నింటినో దగ్గరగా గమనించాను. సమస్యలు ఏవీ ఎదురుకాని ఇళ్లను నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఓపాడ్ ఇళ్లను నిర్మిస్తున్నాను. ఈ ఇళ్లు ఎంతో చల్లగా ఉండడంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. నిరుపేదలకోసం రూపొందించిన ఈ డిజైన్లలో కొన్ని రెస్టారెంట్లు, రిసార్టులు, మొబైల్ హోమ్స్, మొబైల్ క్లినిక్‌లు, గెస్ట్ హౌస్, గార్డులు నివసించే రూములుగా కూడా ఉపయోగపడతాయి’’ అని వివరించింది. మానస తల్లి రమాదేవి మాట్లాడుతూ.. మా అమ్మాయి మానసకు వచ్చిన ఐడియాను మొదట్లో ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు ఎంతోమంది తన డిజైన్స్ గురించి మెచ్చుకోవడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మానస నిరుపేదలు ఖర్చుచేయగల సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని రమాదేవి చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... మానసకు వచ్చిన ఆలోచన కొత్త ఆవిష్కరణలకు పునాది వేసేదిగా ఉంది. ఇది తన విజయ ప్రస్థానంలో కేవలం ప్రారంభం మాత్రమే. ముందుముందు తను మంచి విజయాలను అందుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. మానస చెంగిచెర్లలో డెమో కోసం నిర్మించిన ఓపాడ్ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లి రమాదేవితో మానస -
గిరిజనుల అభ్యున్నతికి ఎన్నో చర్యలు
సాక్షి, అమరావతి: గిరిజనులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థితిలో నిలిపేందుకు, గిరిజనుల ప్రత్యేక సంస్కృతిని, హక్కుల్ని కాపాడటానికి సీఎం జగన్ ఎన్నో చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించేందుకు ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సజ్జల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2024 నాటికి తాము వెనుకబడి ఉన్నామని గిరిజనులు అనుకోకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎక్కువ మందికి ఎక్కువ సంక్షేమం, ఎక్కువ మందికి ఎక్కువ ప్రయోజనం కల్పించడం కోసం సీఎం పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం, మహిళలకు 50 శాతం పదవులిచ్చే సంప్రదాయాన్ని వైఎస్సార్సీపీ నిబంధనావళిగా చేశారని, ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోనూ అదే సూత్రం ప్రాతిపదికన పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలో కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఎస్టీ కమిషన్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి దానికి తొలి చైర్మన్‌గా కుంభా రవిబాబును సీఎం నియమించారని తెలిపారు. డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రజత్ భార్గవ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు ఎస్టీ కమిషన్ కార్యాలయంలో కుంభా రవిబాబు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.