మెగా పీటీఎం ఆహారాన్నే మరుసటి రోజు పెట్టిన నిర్వాహకులు
గోమంగి పీహెచ్‌సీలో చికిత్స
పెదబయలు: ప్రభుత్వం ఆదేశాల మేరకు అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం)లో వండిన ఆహారం మిగిలిపోవడంతో దాన్ని మరుసటి రోజు విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఫుడ్ పాయిజన్ జరిగి 8 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పెదబయలు మండలం, గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 7వ తేదీన మెగా పీటీఎం నిర్వహించారు.
ఆరోజు తల్లిదండ్రులకు పెట్టిన తరువాత మిగిలిన బంగాళదుంప, బఠానీ కూరను మరుసటి రోజైన ఆదివారం కొంతమంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పెట్టారు. అదే రోజు సాయంత్రం వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. 5వ తరగతి విద్యార్థులు జి.శ్రావణి, చాందిని, పి.స్వాతి, పి.బిందు (4వ తరగతి), కె.హర్షిత(3వ తరగతి), 2వ తరగతి విద్యార్థులు పి.హిందువదన, పి.సెల్లమ్మి, జి.రíÙ్మ అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లో గోమండి పీహెచ్‌సీకి తరలించి, సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ పి.వసంతను వివరణ కోరగా... తల్లిదండ్రుల సమావేశానికి వచి్చన 200మందికి ఆహారం వడ్డించామనీ, మిగిలిన అన్నం, కూరను పారేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.
తనకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం విజయనగరం వెళ్లానని, విద్యార్థుల అస్వస్థత విషయం ఏఎన్‌ఎం తనకు ఫోన్‌లో చెప్పడంతో తక్షణమే పీహెచ్‌సీకి సమాచారం అందించి, విద్యార్థులకు చికిత్స అందించినట్లు ఆమె పేర్కొన్నారు. పాఠశాల నుంచి వచి్చన సమాచారం మేరకు సోమవారం స్కూల్‌కు వెళ్లి 11మంది విద్యార్థులకు వైద్యం చేశామనీ, వారిలో పరిస్థితి బాగోలేని 8మందిని పీహెచ్‌సీకి తరలించినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి చైతన్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment