food poison
-
తెలంగాణ గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్
-
ఫుడ్ పాయిజన్‌తో గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
ఘట్కేసర్: ఫుడ్ పాయిజన్‌తో మైనారిటీ గురుకులానికి చెందిన విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా నాగారంలోని మైనారిటీ గురుకులంలో 450 మంది విద్యార్థినులు ఉన్నారు. గురువారం ఉదయం అల్పాహారం బోండా, మధ్యాహ్నం చికెన్‌తో భోజనం చేశారు. తిరిగి సాయంత్రం అల్పాహారంలో బొప్పాయి తిన్నట్టు విద్యార్థినులు తెలిపారు. కొద్ది సేపటి తర్వాత కొంతమంది విద్యార్థినులకు కడుపు నొప్పి, వికారంగా అనిపించడంతో ప్రిన్సిపాల్ స్వప్నకు తెలి పారు. ఆమె ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి విద్యార్థినులను వెంటనే తీసుకెళ్లారు. 33 మంది విద్యార్థినులను పరీక్షించి 9 మందిని అడ్మిట్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆస్పత్రికి వెళ్లగా వార్డెన్, ఇతర సిబ్బందితో కలిసి దుర్భాషలాడింది. ఆస్పత్రికి మీరెందుకు వచ్చారంటూ ఫొటోలు తీ యకుండా అడ్డుకున్నారు. ప్రిన్సిపాల్ స్వప్న ను వివరణ కోరగా కడుపునొప్పి ఉందంటే విద్యార్థినులను ముందస్తుగా ఆస్పత్రికి తీసు కొచ్చామన్నారు. డాక్టర్ యాదయ్యను వివ రణ కోరగా 33 మందిని పరీక్షించామని అందులో 9 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నామన్నారు. ఫుడ్ పాయిజన్‌తోనే ఇలా అయ్యిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. -
అల్లూరి జిల్లా గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
AP: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, అల్లూరి: పాడేరులోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పాడేరులోని గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారి పరిస్థితి సీరియస్‌గా మారడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులను చూసి వారి పేరెంట్స్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో మిగిలిపోయిన వంటకాలను గురుకుల సిబ్బంది మరుసటి రోజు వడ్డించినట్టు సమాచారం. దీని వల్లే వారు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. -
నిల్వ ఆహారం తిని 8 మంది బాలికలకు అస్వస్థత
పెదబయలు: ప్రభుత్వం ఆదేశాల మేరకు అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం)లో వండిన ఆహారం మిగిలిపోవడంతో దాన్ని మరుసటి రోజు విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఫుడ్ పాయిజన్ జరిగి 8 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పెదబయలు మండలం, గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 7వ తేదీన మెగా పీటీఎం నిర్వహించారు.ఆరోజు తల్లిదండ్రులకు పెట్టిన తరువాత మిగిలిన బంగాళదుంప, బఠానీ కూరను మరుసటి రోజైన ఆదివారం కొంతమంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పెట్టారు. అదే రోజు సాయంత్రం వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. 5వ తరగతి విద్యార్థులు జి.శ్రావణి, చాందిని, పి.స్వాతి, పి.బిందు (4వ తరగతి), కె.హర్షిత(3వ తరగతి), 2వ తరగతి విద్యార్థులు పి.హిందువదన, పి.సెల్లమ్మి, జి.రíÙ్మ అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లో గోమండి పీహెచ్‌సీకి తరలించి, సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ పి.వసంతను వివరణ కోరగా... తల్లిదండ్రుల సమావేశానికి వచి్చన 200మందికి ఆహారం వడ్డించామనీ, మిగిలిన అన్నం, కూరను పారేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.తనకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం విజయనగరం వెళ్లానని, విద్యార్థుల అస్వస్థత విషయం ఏఎన్ఎం తనకు ఫోన్లో చెప్పడంతో తక్షణమే పీహెచ్‌సీకి సమాచారం అందించి, విద్యార్థులకు చికిత్స అందించినట్లు ఆమె పేర్కొన్నారు. పాఠశాల నుంచి వచి్చన సమాచారం మేరకు సోమవారం స్కూల్‌కు వెళ్లి 11మంది విద్యార్థులకు వైద్యం చేశామనీ, వారిలో పరిస్థితి బాగోలేని 8మందిని పీహెచ్‌సీకి తరలించినట్లు పీహెచ్సీ వైద్యాధికారి చైతన్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం
సాక్షి,నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా,నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కస్తూరిబా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఫలితంగా ఇటీవల కాలంలో పాఠశాలలో భోజనం తిని అస్వస్థతకు గురవుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. అందుకు నవంబర్ 27న నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.మాగనూర్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? వారికి కూడా పిల్లలున్నారు కదా! మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు ' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఈ క్రమంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ఫుడ్ సేప్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. -
ఐదుగురు మోడల్ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెంచికల్‌పహాడ్ మోడల్ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థు లు గురువారం అస్వస్థతకు గురికావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదు వుతున్న ముగ్గురు విద్యార్థి నులు, ఆరో తరగతి చ దువుతున్న మరో ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్న భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యా రు. కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకోవడంతో వారిని 108 వాహనంలో ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వై ద్యం అందించారు.వారిలో ఇద్దరు జ్వరంతో బాధపడుతుండగా మరో ముగ్గురు వాంతులు, క డుపునొప్పితో బాధపడుతున్నట్లు దేవరకొండ ఆస్ప త్రి సూపరింటెండెంట్ మంగ్తానాయక్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మాతృనాయక్ ఆస్పత్రికి చేరు కొని విద్యార్థినులను పరామర్శించారు. దేవరకొండ నియోజకవర్గంలోనే ఇటీవల ఒక మోడల్ స్కూల్ విద్యార్థి నులు అస్వస్థతకు గురయ్యారుఓయూలో పీహెచ్డీ ప్రవేశానికి దరఖాస్తులు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో కేటగిరీ–1 పీహెచ్‌డీలో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. న్యాయశాస్త్రం, సైన్స్, సోషల్ సైన్స్, ఎడ్యుకేషన్ డీన్లు.. పీహెచ్డీ ఖాళీల సంఖ్యను వివరిస్తూ దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేటగిరీ–1 పీహెచ్డీ ప్రవేశాలకు పీజీ కోర్సులు పూర్తి చేసిన.. యూజీసీ నెట్, టీజీసెట్, జేఆర్ ఎఫ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
నల్లగొండ జిల్లా పెదఅడిశర్లపల్లి మోడల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్
-
తెలంగాణలో మళ్లీ ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి: తెలంగాణలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా మోడల్ స్కూల్ హాస్టల్లో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి ఐదుగురు బాలికలు ఆసుపత్రిలో చేరగా.. ఈరోజు మరో ఇద్దరు కడుపు నొప్పితో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో, బాలికల సంఖ్య ఏడుకు చేరుకుంది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, తీవ్రమైన కడపు నొప్పి రావడంతో వారికి వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం రాత్రి పరామర్శిచారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. విద్యార్థినలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగలేదని.. రెండు మూడు రోజులుగా విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోకపోడంతో నీరసంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అయితే, బాలికలు మాత్రం.. తాము తిన్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు.దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మూడు రోజుల నుంచి భోజనం సరిగా ఉండటం లేదు. ఎస్వోకి చెప్పినా పట్టించుకోవడం లేదు. అన్నం సరిగా ఉడకడం లేదు. సగం ఉడికించిన అన్నం పెట్టడంతో అదే తినాల్సి వస్తోంది. మూడు రోజుల నుంచి కడుపునొప్పి వస్తోంది. మాకు పెట్టే భోజనంలో నాణ్యత ఉండటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రి ఎదుట పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు సరైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. -
నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్లో ఫుడ్‌పాయిజన్
-
నా గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్‌కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు. కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కానీ మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూచించారు.సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు. రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024 -
విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్తో వరుసగా అస్వస్థతకు గురవుతున్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. పలుమార్లు హెచ్చరించినా ఇలాంటి ఘటనలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి అందించే ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా సదరు అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తరచూ తనిఖీలు చేయండి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వొద్దని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఇదివరకే పలుమార్లు సమీక్షించానని గుర్తు చేశారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. ఈ మేరకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్రతిష్టపాలు చేసేందుకు కొందరి యత్నాలు విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని.. పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాము ఇలా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
ఎల్లుండి తెలంగాణలో స్కూళ్ల బంద్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలల్లో జరుగుతున్న వరుస పుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి (శనివారం) ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. రక్షణ కరువై, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కీలకమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే ఏడాది గడిచిందన్నారు. ఈ సమస్యలపై కనీసం సమీక్ష చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు.అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. తక్షణమే వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ అధికారులు సమీక్షించి, సమస్యలు పరిష్కారించాలని ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేసింది. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల మరణాలు ఆగేదెన్నడు?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో వరుసగా ఆహారం కలుషిత మైన (ఫుడ్ పాయిజన్) సంఘటనలు, విద్యార్థుల మరణాలు కొనసాగున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాన్నీ, సౌకర్యాల కల్పనలో వైఫల్యాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘటనలన్నిటికీ రాష్ట్ర సర్కారే భాధ్యత వహించాలి. ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలవ్వగా, 42 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయి. వీరిలో ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యంతో మరణించిన వారు, బలవన్మరణానికి పాల్పడినవారూ, అనుమానాస్పదంగా మృతి చెందినవారూ ఉన్నారు.ఇదే ఏడాది ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు, శానిటరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్ళలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదని గుర్తించారు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని తెలిసింది. ఎక్కడ కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపండ్లు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ళ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. వంటశాలలు రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిలువచేస్తున్నారనీ, మరుగుదొడ్లు– బాత్రూంలలో కనీస శుభ్రత లేదనీ, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదనీ తేలింది. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతోంది. నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్టోబర్ 30వ తేదీన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసి డెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మార్చి నెల నుంచి నవంబర్ 15 వరకు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా... 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆగస్టు 22న భువనగిరిలోని ఈ గురుకులాన్ని ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్’ బృందం సందర్శించినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు.చదవండి: విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. పిల్లలకు నాణ్యమైన చదువు దూరం!ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసు కోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్‌లను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి – యువజనులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు వివిధ రూపాలలో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి.– కోట ఆనంద్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు -
ఫుడ్ పాయిజన్ అంశం.. సీతక్క సంచలన ఆరోపణలు
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందన్నారు. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కామెంట్స్ చేశారు.మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది. రాజకీయ పార్టీ కుట్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయటపెడతాం. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. అన్ని ఘటనలపై పూర్తి వివరాలతో బయట పెడతాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ విషయంలో తలసానిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. దీంతో, మంత్రి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దిలావార్పూర్ ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హాయాంలోనే ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పును బీఆర్ఎస్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. పర్మిషన్ కాపీలో కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయి. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నాడు. దీని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. దమ్ముంటే కేటీఆర్ దిలావార్పూర్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లుగా కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారు.విధ్వంసం సృష్టించడం.. ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం అని కేటీఆర్ టీం ప్రచారం చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ వియ్యంకుడు పుట్టా సుధాకర్ ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. కేటీఆర్ నువ్వు దిలావార్పూర్ రావాలి.. నేను కూడా వస్తా.. తప్పెవరిదో తేల్చుదాం. అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ చేసిన చరిత్ర కేటీఆర్ దే. కేటీఆర్ నీకు నిజంగా నీతి చర్చకు రావాలి. వచ్చే అసెంబ్లీలో ఇథనాల్ కంపెనీపై చర్చ పెడతాం. కేటీఆర్ మీ ప్రభుత్వంలో గురుకాలలో ఎంత మంది చనిపోయారో లెక్క చెప్పమంటావా?. మంత్రులు, అధికారులు అంతా గురుకులాలలో మంచి సౌకర్యాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. లగచర్లలో గ్రామ సభ జరుగుతుంది.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం
-
ఫుడ్ పాయిజన్ ఘటనలు.. చర్యలు తప్పవని రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రభుత్వ స్కూల్స్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఇక, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్కూల్స్, గురుకులాలను తరుచూ తనిఖీ చేయాలి. పరిశుభ్ర వాతావరణంలో ఆహారం అందించాలి. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లఓ్యం వహిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో పలుచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఫుడ్ పాయిజన్ ఘటనలకు సంబంధించి అన్ని వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగనుంది. -
ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుíÙతమై విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు చనిపోయినా పట్టించుకోరా? అని మండిపడింది. ‘ఒకే పాఠశాలలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? విద్యార్థులు చనిపోతున్నా స్పందించకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా లేనట్లు అనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలిస్తేనే అధికారులు పని చేస్తారా?’అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ‘హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్’అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఫుడ్ పాయిజన్‌తో ఎంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. అధికారులు ఏం చేశారు.. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (డిసెంబర్ 2వ తేదీ) వాయిదా వేసింది. చట్టం అమలే లేదు.. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించటం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 8వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానమంత్రి పోషణ్ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదు. అర్హులైన మహిళలు, పిల్లలకు సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రకారం మెనూ అందించడం లేదు. మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో ఈ నెల 20న 100 మంది.. 26న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోచోట చిన్నారి మృతి చెందింది. కరీంగనర్ జిల్లా గంగాధర్ మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషకాహార ప్రమాణాలు పాటించి మధ్యాహ్న భోజనం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరారు. ఇంత నిర్లక్ష్యమా? ఫుడ్ పాయిజన్ ఘటనల విషయంలో అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘జిల్లా విద్యాశాఖాధికారులు నిద్రపోతున్నారా? వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా! మానవత్వం లేకుండా వ్యవహరిస్తారా? నవంబర్ 20న, 24న, 26న.. ఒకే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినా ఉన్నతాధికారులకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదా? ఇంత సాంకేతిక యుగంలో వారం క్రితం జరిగిన ఘటనపై వివరాలు లేవంటూ వాయిదా కోరతారా? ఘటన జరిగింది మారుమూల ప్రాంతంలో కూడా కాదు.. హైదరాబాద్‌కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్ లేదా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. మమ్మల్నే నిర్ణయం తీసుకోమంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తాం. పాస్ ఓవర్ (స్పల్ప వాయిదా)కు గానీ, వాయిదాకుగానీ అంగీకరించం. వెంటనే ఏఏజీ వచ్చి సమాధానం చెప్పాలి’అని ఆదేశించింది. దీంతో భోజన విరామం తర్వాత ధర్మాసనం ముందు ఏఏజీ హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ని జిల్లాల్లో ఆహార నాణ్యతను పరీక్షించండి పాఠశాలల్లో ఆహార కలుషితంపై కఠిన చర్యలు తీసుకొంటున్నామని ధర్మాసనానికి ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. ‘చిన్నారులే ఈ రాష్ట్ర ఆస్తులు, భవిష్యత్ ఆశాకిరణాలు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విద్యార్థుల కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఈ నెల 20న ఉప్మా తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే దాన్ని మార్చాం. ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయుడు సహా బాధ్యులపై సస్పెన్షన్‌కు వెనుకాడం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఫుడ్ పాయిజన్‌పై పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం. రెండు రోజుల సమయం ఇవ్వండి’అని కోరారు. వాదనలు విన్న కోర్టు.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఆహార శాంపిల్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్లను ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం– 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషక విలువలను పరిశీలించాలని సూచించింది. ఇప్పటికే చోటుచేసుకొన్న ఫుడ్ పాయిజన్ ఘటనలతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరంగా తెలుపుతూ డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక అందజేయాల ఆదేశించింది. -
పట్టింపు లేదా?.. ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఫుడ్ పాయిజన్ అంశం చాలా తీవ్రమైనదని వ్యాఖ్యలు చేసింది.నారాయణపేట జిల్లాలో మాగనూర్‌లోని పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థులు కుర్ కురేలు తినడం వల్లే అస్వస్థతకు గురైనట్టు కోర్టుకు తెలిపారు. ఈ ఘటన విషయంలో బాధులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ఏఏజీ చెప్పారు. ఈ సందర్భంగా.. సదరు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఫుడ్ పాయిజన్ అయిన పాఠశాలల్లో శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో మాగనూరు, కరీంనగర్, బురుగుపల్లి ఘటనలపై కూడా నివేదిక ఇవ్వాలని న్యాయ స్థానం కోరింది. ఈ ఘటనలపై సోమవారంలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవలే 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, అధికారులు రంగంలోకి హెచ్ఎం సహా మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరువకముందే నిన్న(బుధవారం) మళ్లీ ఫుడ్ పాయిజన్ కారణంగా మరో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ వరుస ఘటనలపైనే నేడు హైకోర్టులో విచారణ జరిగింది. -
మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
-
TG: స్కూళ్లలో ఫుడ్‌పాయిజన్‌పై హైకోర్టు సీరియస్
సాక్షి,హైదరాబాద్:నారాయణపేట జిల్లా మాగనూరు ఫుడ్‌పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయంలో ఫైల్ అయిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం(నవంబర్ 27) విచారించింది.పిల్లలు చనిపోయినా కానీ స్పందించరా అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని హైకోర్టు సీరియస్ అయింది. వారంలో మూడు సార్లు ఫుడ్‌పాయిజన్ అవడం ఏంటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఇదీచదవండి: మాగనూరులో మళ్లీ ఫుడ్‌పాయిజన్ -
నారాయణపేట జిల్లాలో కలకలం రేపిన ఫుడ్ పాయిజన్ ఘటన
-
మళ్లీ ఫుడ్ పాయిజన్
నారాయణపేట: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మరోసారి కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఉపాధ్యాయులు మొదట మాగనూర్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 30 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం మక్తల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో 9వ తరగతి విద్యార్థులు నేత్ర, దీపిక పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి తరలించారు. తహసీల్దార్ పర్యవేక్షణలోనే వంట మాగనూర్ ఇన్చార్జి తహసీల్దార్ సురేష్ కుమార్, మధ్యాహ్న భోజనం ఇన్చార్జి, పాఠశాల ఉపాధ్యాయుడు రాఘవేంద్రచారి పర్యవేక్షణలోనే మధ్యాహ్న భోజనం తయారు చేయించారు. అయినప్పటికీ మళ్లీ ఫుడ్ పాయిజన్ కావడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వంట చేసిన కార్మీకులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. బయట చిరుతిళ్లు తిన్నారా? విద్యార్థులు స్కూల్ బయట ఉన్న బేకరీలు, దుకాణాల్లో చిరుతిళ్లు తినడంతోనే అస్వస్థతకు గురై ఉంటారని కలెక్టర్ సిక్తా పటా్నయక్ అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి మాగనూర్‌లోని పలు బేకరీలు, దుకాణాల్లో విచారణ చేపట్టారు. సీఎం దృష్టికి వెళ్లినా.. గత బుధవారం కలుషిత ఆహారంతో 100 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 17 మంది ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మరునాడే అన్నంలో మళ్లీ పురుగులు రావడం, అధికారులపై చర్యలు తీసుకోవడం వంటివి జరిగాయి. తాజాగా మళ్లీ ఫుడ్ పాయిజన్ కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు వరుసబెట్టి అస్వస్థతకు గురవుతుండటంపై ప్రభుత్వం దృష్టిసారించాలని వారు కోరుతున్నారు. -
ఉద్రిక్తత మధ్య శైలజ అంత్యక్రియలు
వాంకిడి (ఆసిఫాబాద్): హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిన కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ అంత్యక్రియలను స్వగ్రామం ధాబాలో ఉద్రిక్తతల మధ్య మంగళవారం నిర్వహించారు. అక్టోబర్ 30వ తేదీన పాఠశాలలో భోజనం చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన శైలజకు.. 21 రోజులపాటు నిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మంగళవారం వేకువజామున 3 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ధాబా గ్రామానికి తీసుకువచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం బందోబస్తును పర్యవేక్షించారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, ధాబా గ్రామానికి వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. ధాబా గ్రామానికి వెళ్లేందుకు ఎవ్వరినీ అనుమతించలేదు. పోలీసుల కన్నుగప్పి గ్రామానికి చేరుకున్న మాలి సంఘం, విద్యార్థి సంఘాల నాయకులు.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కచి్చతమైన హామీ ఇచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు శైలజ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఎక్స్‌గ్రేషియా విషయంపై మంత్రి సీతక్కతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. తక్షణ సాయం కింద రూ.20 వేలు.. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు రూ.లక్ష నగదును అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు ముగిశాయి. అనంతరం శైలజ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కోవ లక్షి్మ, పాల్వాయి హరీశ్‌బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
TG: మాగనూరులో మళ్లీ ఫుడ్ పాయిజన్
సాక్షి, నారాయణపేట: తెలంగాణలోని పలు పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాజాగా జరిగిన ఘటనలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో ఆసుపత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్ఇక, ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నాలుగైదు రోజులు గడవకముందే మరోసారి నేడు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: మళ్లీ పురుగుల అన్నమే!