సాక్షి, నారాయణపేట: మాగనూర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం బాపురెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అంతకుముందు.. మాగనూర్‌లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment