head master suspension
-
మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్
సాక్షి, నారాయణపేట: మాగనూర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్ఛార్జ్ హెచ్ఎం బాపురెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అంతకుముందు.. మాగనూర్‌లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. -
శంకర్‌రెడ్డి దొరికాడు..
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెజవాడ శంకర్‌రెడ్డి పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటంతో పాటు లైంగి కంగా వేధింపులకు పాల్పడగా ఫిబ్రవరి 2న అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ ఘటనతో పరారీలో ఉన్న హెచ్ఎంను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మంరూరల్ ఏసీపీ రామోజీ రమేష్ వివరాలను వెల్లడించారు. హెచ్ఎం శంకర్‌రెడ్డి పాఠశాలలోని పలువురు విద్యార్థినులపై చేతులు వేయటం, వారిని తనపై కూర్చోబెట్టుకోవటం, లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిబ్రవరి 2న బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న హెచ్ఎం పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతన్ని డీఈఓ సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న హెచ్ఎం గుజరాత్, హైదరాబాద్ ప్రాంతాల్లో తలదాచుకోగా పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపు చేపట్టారు. ఇటీవల రైలులో ఖమ్మం వస్తున్న విషయాన్ని తెలుసుకుని సిబ్బంది అప్రమత్తం కాగా గమనించి పరారయ్యాడు. మంగళవారం ఉదయం కూసుమంచిలో తనకు తెలిసిన వారిని కలిసేందుకు రాగా సమాచారం తెలుసుకుని ఎస్ఐ అశోక్ అతన్ని అరెస్ట్ చేశారు. విద్యార్థినులను వేధించిన ఫిర్యాదుపై తాము అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, బాధితుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. శంకర్‌రెడ్డిపై పోస్కో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. -
హెడ్మాస్టర్ సస్పెన్షన్‌పై వైఎస్సార్సీపీ ఆందోళన
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో హెడ్మాస్టర్ సస్పెన్షన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆందోళనకు దిగింది. టీడీపీ నేతల ఒత్తిళ్ల వల్లే హెచ్ఎంను సస్పెండ్ చేశారని నేతలు ఆరోపించారు. మునగపాక ప్రాథమిక పాఠశాలలో ఆగస్టు 15న జాతీయ జెండాను సర్పంచ్ ఎగురవేయడంపై స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీటీసీకి అవకాశం కల్పించలేదని అధికార బలంతో టీడీపీ నేతలు హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేయించారు. వెంటనే సస్పెండ్ ఎత్తివేయాలని కోరుతూ ఎమ్మార్వో, ఎంఈవోలకు వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు.