హెడ్మాస్టర్ సస్పెన్షన్పై వైఎస్సార్సీపీ ఆందోళన | ysrcp leaders protests in visakha over head master suspension | Sakshi
Sakshi News home page

హెడ్మాస్టర్ సస్పెన్షన్పై వైఎస్సార్సీపీ ఆందోళన

Published Wed, Sep 7 2016 5:07 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

హెడ్మాస్టర్ సస్పెన్షన్పై వైఎస్సార్సీపీ ఆందోళన - Sakshi

హెడ్మాస్టర్ సస్పెన్షన్పై వైఎస్సార్సీపీ ఆందోళన

విశాఖపట్నం: విశాఖ జిల్లాలో హెడ్మాస్టర్ సస్పెన్షన్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆందోళనకు దిగింది. టీడీపీ నేతల ఒత్తిళ్ల వల్లే హెచ్ఎంను సస్పెండ్ చేశారని నేతలు ఆరోపించారు. 

మునగపాక ప్రాథమిక పాఠశాలలో ఆగస్టు 15న జాతీయ జెండాను సర్పంచ్ ఎగురవేయడంపై స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీటీసీకి అవకాశం కల్పించలేదని అధికార బలంతో టీడీపీ నేతలు హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేయించారు. వెంటనే సస్పెండ్ ఎత్తివేయాలని కోరుతూ ఎమ్మార్వో, ఎంఈవోలకు వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement