mid day meal scheme
-
పిల్లలకు పురుగుల అన్నం పెడతారా?: కూటమి సర్కార్‌పై రవిచంద్ర ఫైర్
సాక్షి, తాడేపల్లి: స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా మారింది.. ఆ భోజనం చేయలేక చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిల్లలకు సరైన భోజనం కూడా పెట్టలేని మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. లోకేష్ విద్యాశాఖని పూర్తిగా గాలికి వదిలేశారని.. మిగతా శాఖల్లో వేలు పెట్టి షాడో సీఎంగా లోకేష్ వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘నిధులు ఇవ్వకుండా, మంచి భోజనం పెట్టకుండా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వ చర్యల కారణంగా సగం మంది పిల్లలు కూడా స్కూళ్లలో భోజనం చేయటం లేదు. చిన్న పిల్లలు పురుగుల అన్నం తినలేక బాధ పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినంత తేలిగ్గా మంచి భోజనం మాత్రం పెట్టటం లేదు...వైఎస్ జగన్ హయాంలో గోరుముద్ద పేరుతో నాణ్యమైన భోజనం పెట్టారు. ఏరోజు ఏం పెట్టాలో మెనూ ప్రకారం భోజనం పెట్టారు. అధికారుల పర్యవేక్షణలో మధ్యాహ్న భజన పథకాన్ని జగన్ అమలు చేశారు.. కానీ కూటమి ప్రభుత్వం పిల్లలకు పురుగుల ఆహారం పెడుతోంది. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది’’ అని రవిచంద్ర హెచ్చరించారు. -
TG: మధ్యాహ్న భోజనంపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని కోర్టు ఆదేశించింది. భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.భోజనం వికటించిన ఘటనల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఏజీ కోర్టుకు తెలిపారు. బాధ్యులను వాళ్లను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40 శాతం పెంచామని ఏఏజీ తెలిపారు.పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలుండాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది.. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కమిటీలు సరిగ్గా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని ఏఏజీ చెప్పారు. ఏఏజీ చెప్పిన వివరాలను హైకోర్టు నమోదు చేసుకుంది. -
మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్
సాక్షి, నారాయణపేట: మాగనూర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్ఛార్జ్ హెచ్ఎం బాపురెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అంతకుముందు.. మాగనూర్‌లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. -
బాబూ.. ఇంతకంటే నీచత్వం ఉంటుందా?
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలన అంటే ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. ఏపీలో కూటమి పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పంది. ప్రభుత్వ పాఠశాల్లలో విద్యార్థులకు సరైన ఆహారం అందించడంలేదు. ఈ మేరకు వైఎస్సార్సీపీ.. విద్యార్థుల కష్టాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ.. కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా, వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు ఇంతకంటే నీచత్వం ఉంటుందా?. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ బడిలో పేద విద్యార్థులకి ఐదేళ్లు శుచి, రుచి, పౌష్టికరమైన భోజనాన్ని అందిస్తే.. రెండు నెలల్లోనే ఆ వ్యవస్థను నాశనం చేసి పేదబిడ్డల నోటికాడ ముద్దని లాగేసుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది చంద్రబాబు?. ఏపీలో గాడి తప్పిన విద్యా వ్యవస్థకి ఇంతకంటే సాక్ష్యాలు కావాలా? అని ప్రశ్నించింది. ఇంతకంటే నీచత్వం ఉంటుందా @ncbn? వైయస్ జగన్ గారు సర్కార్ బడిలో పేద విద్యార్థులకి ఐదేళ్లు శుచి, రుచి, పౌష్టికరమైన భోజనాన్ని అందిస్తే.. రెండు నెలల్లోనే ఆ వ్యవస్థను నాశనం చేసి పేదబిడ్డల నోటికాడ ముద్దని లాగేసుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది చంద్రబాబు? ఏపీలో గాడి తప్పిన విద్యా… pic.twitter.com/yHiekMK5BT— YSR Congress Party (@YSRCParty) August 14, 2024 ఇక, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విద్యార్ధులుకు పౌష్టికారహారం అందించిన విషయం తెలిసిందే. రోజుకో మెనూ చొప్పున మొత్తంగా 16 రకాల ఐటమ్స్ అందించారు.గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనంసగటున 90% మంది విద్యార్థులకు భోజనంభోజనం పూర్తయ్యాక ఆహారంపై ఆరా.. బాగుంటే ‘గుడ్’ లేకుంటే ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛనాణ్యత కోసం కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి తినే ఏర్పాటుఎంత మంది భోజనం చేస్తున్నారో ఆన్లైన్లో పక్కాగా రికార్డు43 లక్షల మంది ప్రతి రోజూ సంతృప్తికరంగా భోజనంసోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీమంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డుబుధవారం వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీగురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/ నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డుశుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీశనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్2019–20లో రూ.979.48 కోట్లు, 2020–21లో రూ.1,187.49 కోట్లు, 2021–22లో రూ.1,840.05 కోట్లు, 2022–23లో రూ.1,548.58 కోట్లు, 2023–24లో రూ.1,689 కోట్లు బడ్జెట్.ప్రత్యేకంగా వంట గది, ఎప్పటికప్పుడు బిల్లులు అందించారు. -
టీడీపీ కోట్లు స్కీం.. చంద్రన్న పాచి ముద్ద..
-
ఇంత నిర్లక్ష్యమా?.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్‌రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: భావి భారత పౌరుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.‘‘నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించింది‘‘ అంటూ ట్వీట్ చేశారు.‘‘ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరుతున్నాను‘‘ అని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం.విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం… pic.twitter.com/7zmh8fv81S— Harish Rao Thanneeru (@BRSHarish) August 4, 2024 -
ఎగ్గొట్టారు!
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువులు అర్ధాకలితో సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న గోరుముద్ద పేరుతో ఆకర్షణీయమైన మెనూతో రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించగా.. నేడు ఆ పథకం అస్తవ్యస్తంగా మారింది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ఇవ్వడం లేదు. గుంటూరులో ఉన్న 14 ఉన్నత పాఠశాలలతో పాటు 80 ప్రాథమిక పాఠశాలల్లో 15 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా రూపకల్పన చేసిన మెనూ యథావిధిగా అమలయ్యేది. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పథకం అమలులో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేశారు. దీంతో విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం తృప్తిగా ఆరగించేవారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్కూళ్లు తెరిచినప్పటి నుంచి మధ్యాహ్న భోజనం అధ్వానంగా మారింది. విద్యార్థులకు వారంలో ఐదు రోజులు కోడి గుడ్డు ఇవ్వాల్సి ఉండగా.. దీనిని పూర్తిగా విస్మరించారు. ఎక్కడా మెనూ పాటిస్తున్న దాఖలాలు లేవు. పౌష్టికాహారం సంగతి దేవుడెరుగు.. చాలీచాలని, రుచి లేని భోజనం చేయలేక చాలా మంది విద్యార్థులు ఇళ్ల నుంచే క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ మాట్లాడుతూ.. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానని చెప్పారు. -
మామయ్య గోరుముద్ద..చదువుపైనే శ్రద్ధ
గతం ముద్దన్నం...నీళ్ల సాంబారు... అదీ అరకొర... ఇదీ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో బడిపిల్లలకు అందించే మధ్యాహ్న భోజన తీరు. ఆయన పాలనంటేనే కరువు. చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య రాష్ట్రంలో చాలావరకు కరువు పరిస్థితులు ఏర్పడి, ప్రజలకు ఉపాధి కూడా కరువైంది. ఫలితంగా నిరుపేదలు తిండికి కూడా దూరమయ్యారు. బడికి వెళ్లిన పేదల పిల్లలకు ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం దొరుకుతుందని భావిస్తే.. అక్కడా ఆకలితో అలమటించేలా చేశారు. రోజూ ఒకేరకమైన మెనూవల్ల దానిని తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లల బాధ వర్ణనాతీతం. ఈ అన్నం తిన్నవారికి కడుపునొప్పి సర్వ సాధారణం. కౌమారదశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచి్చన పిల్లల్లో 30 శాతంలోపే మధ్యాహ్న భోజనం చేసేవారు. ఏటా సగటున రూ.450 కోట్లు మాత్రమే దీనికి కేటాయించే వారు. ఒక్కో విద్యార్థికి వంట ఖర్చు రూ.3.59 మాత్రమే కేటాయించారు. అదీ ఏజెన్సీలకు ఎప్పుడూ సకాలంలో చెల్లించిన పాపాన పోలేదు. ప్రస్తుతం పాలనపై చిత్తశుద్ధి... విద్యారంగంపై సరికొత్త విజన్గల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అనేక సంస్కరణలు అమలుచేశారు. పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ‘గోరుముద్ద’ పథకాన్ని స్వయంగా రూపొందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన, పౌష్టికాహారాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో వండి వడ్డిస్తున్నారు. ఒక్కో విద్యార్థి వంట ఖర్చును రూ.8.57 పెంచారు. బడ్జెట్ కూడా ఏడాదికి సగటున రూ.1,400 కోట్లకు పెరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫోరి్టఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం, వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఉడికించిన గుడ్డు ఐదు రోజుల పాటు తప్పనిసరి చేశారు. దీనివల్ల 90శాతం మంది పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అన్ని దశల్లోను శ్రద్ధ తీసుకుంటోంది. రోజుకో మెనూ చొప్పున ఆరు రోజులకు 16 రకాల పదార్థాలు పిల్లలకు వడ్డిస్తున్నారు. ఉపాధ్యాయులు మొబైల్ యాప్‌లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను రాష్ట్ర స్థాయి వరకు తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్‌తో పాటు భోజనం అంశాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. భోజనం చేశాక, వంటపై విద్యార్థులే స్వయంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో 1–10 తరగతుల్లో 43 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. ప్రతిరోజు హాజరైనవారిలో సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో ఏఐ టెక్నాలజీ యాప్ ద్వారా తెలుసుకుని అందుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. సోమవారం: హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం:ఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ ‘గోరుముద్ద’కు జాతీయ అవార్డు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న జగనన్న గోరుముద్ద అమలుకు కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. రక్తహీనత నివారణ, మెరుగైన ఆరోగ్యం లక్ష్యంగా పనిచేయడాన్ని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించి గతేడాది నవంబర్‌లో జాతీయ స్థాయి ప్రథమ బహుమతి రాష్ట్రానికి అందజేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్ల పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ(వేరుశనగ బార్) పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యమే ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ అవార్డు వేడుకలో అభినందించడం గమనార్హం. వంట ఏజెన్సీలకు ఖర్చులు పెంపు గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. 2014–18 వరకు వంటపాత్రల సరఫరా లేదు. ఈ ఏడాది 43 లక్షల మంది విద్యార్థులకు స్టీలు గ్లాసులు అందించారు. 44,617 పాఠశాలలకు రూ.41 కోట్ల వ్యయంతో స్టీలు వంట పాత్రలను ప్రభుత్వం అందించింది. గత ప్రభుత్వం 2014–18 మధ్య పిల్లల భోజన ఏడాది వ్యయం రూ.450 కోట్లు అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అది సగటున రూ.1449 కోట్లకు పెంచింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వంలో 2014–18 మధ్య విద్యార్థుల వంట ఖర్చు రూ.3.59 నుంచి రూ.6.51 మధ్య మాత్రమే కాగా.. ప్రస్తుతం ఆ ఖర్చు రూ.8.57కు పెంచి చెల్లిస్తున్నారు. ఏటా సగటున రూ.1449 కోట్ల ఖర్చు ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించినప్పుడే చదివింది ఒంటబడుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ‘గోరుముద్ద’కు శ్రీకారం చుట్టారు. బడికి వచ్చే ప్రతి పేద బిడ్డకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తూ.. వారు స్కూలుకు వచ్చేందుకు ఆసక్తి చూపేలా మెనూ రూపొందించారు. ప్రభుత్వ బడుల్లోని 43 లక్షల మంది విద్యార్థుల కోసం రోజుకో మెనూ చొప్పున 16 రకాల ఐటమ్స్‌తో ‘జగనన్న గోరుముద్ద’ అందిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకే విద్యార్థుల హాజరుకు అనుగుణంగా పిల్లల అభిప్రాయాలు తీసుకుని ఆ మేరకు వంట చేస్తున్నారు. రోజుకు సగటున 34.90 లక్షల మంది విద్యార్థులు గోరుముద్ద తింటున్నారు. భోజనం పూర్తయ్యాక అభిప్రాయాలు విద్యార్థులే రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ‘గుడ్’ అని ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వం విద్యార్థులకు కల్పించింది. గత ప్రభుత్వంలో నీళ్ల సాంబారు, ముద్ద అన్నం కోసం ఏటా రూ.450 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. గోరుముద్ద కోసం ప్రభుత్వం ఏటా సగటున రూ.1449 కోట్ల చొప్పున ఈ ఐదేళ్లలో రూ.7,244.6 కోట్ల నిధులు వెచి్చంచింది. పౌష్టికాహారం కోసం ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం పిల్లల్లో రక్తహీనత తగ్గించేందుకు వారంలో మూడురోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడురోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం బడి పిల్లల ఆరోగ్యం పరీక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పరీక్షలు చేస్తారు. రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇదే మెనూ పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని అల్యూమినియం పాత్రల్లో వండేవారు, దీనివల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన జగనన్న ప్రభుత్వం వాటి స్థానంలో పూర్తి స్టీలు పాత్రలు అందించింది. -
Fact Check: అన్నంపై ‘ఘోర’ అబద్ధాలు
సాక్షి, అమరావతి: ఐదేళ్లగా అంతుచిక్కని వ్యాధితో అల్లాడుతున్న ఎల్లో మీడియా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తినే అన్నంపైనా ‘ఘోర’మైన అబద్ధాలను వండి వార్చింది. నిత్యం మూడు దశల పరిశీలన అనంతరం పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తుంటే ఈనాడు రామోజీకి ముద్ద సహించడం లేదు! రేపటి తరానికి విద్యా బుద్ధులతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోరుముద్ద మెనూను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని 44,156 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద బలవర్థకమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు హాజరు తీసుకునే సమయంలో ఆ రోజు విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మెనూ సరుకులు వంటవారికి అందిస్తున్నారు. ప్రతి దశలో కొలతలు, లెక్క పక్కాగా అమలు చేస్తున్నారు. పిల్లలకు ఎలా వండితే నచ్చుతుందో వారి అభిప్రాయాలు తీసుకుని పరిశుభ్రంగా వండి పెడుతున్నారు. భోజనం తిన్నాక విద్యార్థులే స్వయంగా రిజిస్టర్లో తమ అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు. ఆ రోజు మెనూ, ఆహారం బాగుంటే ‘గుడ్’ అని బాగా లేదంటే ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వం విద్యార్థులకు కల్పించింది. ప్రతి రోజు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి గోరుముద్ద తిని వారి అభిప్రాయాలు సైతం నమోదు చేస్తున్నారు. రోజుకో మెనూ రుచించలేదా రామోజీ? విద్యార్థుల్లో రక్త హీనతను నివారించేందుకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే గోరుముద్దలో వినియోగిస్తున్నారు. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది స్కూళ్లకు వెళ్లి బడి పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. రక్తహీనత నివారించే మాత్రలు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. పిల్లలు తీసుకునే ఆహారం మెనూను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రూపొందించారు. రక్తహీనత నివారణకు వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడు రోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన కోడిగుడ్డు అందిస్తున్నారు. టీడీపీ హయాంలో బడి పిల్లలకు రోజూ నీళ్ల సాంబారు.. ముద్దగా మారిన అన్నం మాత్రమే ఇవ్వడంతో 20 శాతం పిల్లలు కూడా తినేవారు కాదు. సగటున 34.90 లక్షల మందికి భోజనం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అన్ని దశల్లో శద్ధ తీసుకుంటోంది. రోజుకో మెనూ చొప్పున ఆరు రోజులకు 16 రకాల పదార్థాలను పిల్లలకు ఇస్తున్నారు. విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు బడిలో సరుకుల స్టాక్‌తో పాటు భోజనం అంశాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 1–10 తరగతుల వరకు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా నిత్యం సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు. నాడు 450 కోట్లు.. నేడు 1,450 కోట్లు! టీడీపీ అధికారంలో ఉండగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ఏనాడూ సకాలంలో డబ్బులు చెల్లించలేదు. నాడు స్కూళ్లలో వంటపాత్రల సరఫరా కూడా లేదు. ఈ ఏడాది 43 లక్షల మంది విద్యార్థులకు స్టీలు గ్లాసులు అందించారు. 44,156 పాఠశాలలకు రూ.41 కోట్లతో స్టీలు వంట పాత్రలను ప్రభుత్వం అందించింది. గత సర్కారు పిల్లల భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు వెచ్చించగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సగటున రూ.1,448.92 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో గోరుముద్దకు రూ.1,689 కోట్లు కేటాయించింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ♦ గత సర్కారు వంట ఖర్చు నిమిత్తం ఒక్కో విద్యార్థికి రూ.3.59 మాత్రమే కేటాయించగా ప్రస్తుతం రూ.8.57కి పెంచి నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న కేంద్రీకృత కిచెన్ ఏజెన్సీలకు వంట ఖర్చును ప్రభుత్వం ఇప్పుడు క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. వంట చేసే కుక్/ హెల్పర్ల గౌరవ వేతనాన్ని ప్రతి నెలా వారి ఖాతాల్లోనే జమ చేస్తోంది. ♦ ప్రభుత్వ స్కూళ్లల్లో 70 శాతం మంది విద్యార్థులు మాత్రమే భోజనం తింటున్నట్లు ఈనాడు కాకి లెక్కలు వేసింది. వాస్తవానికి గతేడాది జూన్ నుంచి డిసెంబర్ 31 వరకు హాజరైన విద్యార్థుల్లో సగటున 90 శాతం మంది భోజనం చేశారు. ♦ చిత్తూరు సంతపేట మున్సిపల్ హైస్కూల్లో 585 మంది విద్యార్థులుంటే 400 మందికి మాత్రమే వంట చేస్తున్నారని, కానీ అంతకంటే తక్కువ మంది తింటున్నారంటూ ఈనాడు పేర్కొంది. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 575 కాగా సగటున 420 మంది హాజరవుతున్నారు. వచ్చిన వారంతా గోరుముద్ద తీసుకున్నట్టు తేలింది. ♦ నరసరావుపేట శంకర భారతీపురం హైస్కూల్లో 60 శాతం కంటే తక్కువ మందే గోరుముద్ద తీసుకుంటున్నారన్నదీ అబద్ధమే. ఇక్కడ 1,240 మంది విద్యార్థుల్లో సగటున 862 మంది హాజరు అవుతుండగా (88 శాతం) సరాసరిన 757 మంది (85 శాతం) మంది గోరుముద్ద తీసుకుంటున్నారు. నోరూరే మెనూ.. ♦ సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు / వెజిటబుల్ పలావు, గుడ్డు కూర, చిక్కీ ♦ మంగళవారం ఉదయం 10.20కి రాగిజావ, మధ్యాహ్నం 12.20కి చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు ♦ బుధవారం వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ ♦ గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/ నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు ♦ శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ ♦ శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ -
AP: వావ్.. వాట్ ఏ గ్రేట్ మెనూ.. జపాన్ వాసుల కితాబు
యాదమరి(చిత్తూరు జిల్లా): వాట్ ఏ గ్రేట్ మెనూ.. యువర్ సీఎం కేరింగ్ ఈజ్ సూపర్ ఆన్ మిడ్ డే మీల్స్ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై జపాన్ వాసులు ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు.. పాఠశాలలో అమలవుతున్న మెనూ విధానాన్ని పరిశీలించి సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. రోజుకో స్పెషల్ కూరతో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న భోజన విధానంపై ప్రభుత్వ కల్పిస్తున్న సదుపాయాలను వారు కొనియాడారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కె.గొల్లపల్లె ఉన్నత పాఠశాలను జపాన్ దేశస్తులు శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కనకాచారికి జపాన్‌కి చెందిన స్టాన్లీ స్నేహితుడు. కనకాచారి కోరిక మేరకు క్రిస్మస్ వేడుక కోసం స్టాన్లీ అతని జపాన్ స్నేహితులు కోటరో, హిరోమి, ష్కాలర్ ఇక్కడ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా అక్కడి వాతావరణాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేసేదెవరని ఆరా తీశారు. అలాగే పాఠశాలకు కల్పించిన మౌలిక వసతులకు మంత్రముగ్థులై విషయాలన్నీ కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనివల్ల ఇక్కడి పాఠశాలల స్వరూపం పూర్తిగా మారిపోయిందని కనకాచారి వారికి వివరించారు. దీనికోసం సీఎం జగన్మోహనరెడ్డి మహోద్యమం చేస్తున్నారని, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తీసుకొచ్చి రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆశ్చర్యం చెందినవారు వెంటనే అక్కడ అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. ఇంతటి సదుపాయాలు కల్పిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. పాఠశాల హెచ్ఎం లలితతోపాటు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదీ చదవండి: మనసున్న సీఎం వైఎస్ జగన్ -
అమ్మ ప్రేమతో ‘గోరుముద్ద’
అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు నుంచి 10వ తరగతి వరకు 590 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకల్లా ఆన్లైన్లో విద్యార్థుల హాజరు పూర్తి చేశారు. ఆ వెంటనే అందుకు తగ్గ ట్టుగా నిర్దేశిత కొలత ప్రకారం మంగళవారం మెనూ అనుసరించి రాగి పిండి, చింతపండు పులిహోర కోసం బియ్యం, ఇతర సరుకులను వంట సిబ్బందికి అందజేశారు. ఉదయం 10.20 గంటలకు బెల్లంతో చేసిన రాగిజావ ఇచ్చారు. మధ్యాహ్నం 12.20కి పులిహోర, దొండకాయ చట్నీ, ఉడికించిన గుడ్డు అందించారు. ఆరోజు బడికి హాజరైన 500 మంది విద్యార్థులు బడిలో అందించిన ఆహారాన్నే తీసుకున్నారు. మండల విద్యాశాఖాధికారి అమృత కుమార్ పులిహోరను రుచి చూసి పిల్లల అభిప్రాయం తెలుసుకుని రిజిస్టర్లో నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ పాఠశాలల్లో ‘జగనన్న గోరుముద్ద’ కింద పోషక విలువలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థులు ఉదయం బడికి రాగానే హాజరు తీసుకుని అందుకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేసేందుకు మెనూ సరుకులు అందచేసు్తన్నారు. పిల్లల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ అందుకు తగ్గట్టు వంట చేస్తున్నారు. వివరాలను పారదర్శకంగా రిజిస్టర్లో నమోదు చేస్తూ పిల్లలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. వారంలో ఆరు రోజులు రోజుకో మెనూ చొప్పున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఉపాధ్యాయుల వద్దనున్న మొబైల్ యాప్‌లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ స్టిస్టమ్ ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్‌తో పాటు భోజనం వివరాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు కోసం ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.1,689 కోట్లు కేటాయించిందంటే పిల్లలకు పౌష్టికాహారం పంపిణీకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం.. పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడు రోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. సోమవారం వేడి పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావ్, గుడ్డు కూర, చిక్కీ, మంగళవారం ఉదయం 10.20కి రాగిజావ, మధ్యాహ్నం 12.20కి చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, బుధవారం వెజిటేబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ, గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్‌బాత్ లేదా నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ, శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ మెనూగా అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనతను నివారించేందుకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ సిబ్బంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్త హీనత నివారణ మాత్రలు అందించడంతోపాటు మోతాదు ప్రకారం తీసుకునేలా పర్యవేక్షిస్తున్నారు. రాగి జావ చాలా బాగుంటుంది వారంలో మూడురోజులు ఉదయం ఇంటర్వెల్ టైంలో బెల్లంతో చేసిన రాగిజావను వేడివేడిగా ఇస్తారు. బడిలో అందరం తీసుకుంటాం. చాలా బాగుంటుంది. ఎంత కావాలన్నా ఇస్తారు. మధ్యాహ్నం భోజనం కూడా వేడిగా కావాల్సినంత పెడతారు. మా బడిలో ఎవరూ ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకోరు. అందరూ ఇక్కడ వండిందే తింటారు. టీచర్లు కూడా ప్రతిరోజు మాతో కలిసి భోజనం చేస్తారు. – ఏ.కిరణ్‌కుమార్, రామ్‌ప్రసాద్, చిట్టినాయుడు (పదో తరగతి, సెక్షన్ ‘సి’), నాతవరం జెడ్పీహెచ్ఎస్ ఇంట్లో తిన్నట్టుగానే స్కూల్లో వండే ఆహారం ఇంట్లో ఉన్నట్టుగానే రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఇక్కడే తింటా. అన్నం తినేటప్పుడు ఎలా ఉందని మా మాస్టారు రోజు అడుగుతారు. బాగో లేకపోతే అదే విషయం చెబుతాం. దాన్ని రిజిస్టర్లో రాస్తారు. మాతో కూడా రాయిస్తారు. – వి.స్నేహశ్రీ, 9వ తరగతి బి–సెక్షన్, నాతవరం జెడ్పీహెచ్ఎస్ మా పిల్లలూ ఇక్కడే.. మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. మా బిడ్డలకు వండినట్లే అందరు పిల్లలకు వండి పెడుతున్నాం. గతంలోనూ మధ్యాహ్నం బడిలో భోజనం పెట్టినా ఇంత చక్కగా పెట్టడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. పిల్లలు ఇష్టంగా తినడం చూస్తుంటే మాకూ ఆనందం కలుగుతుంది. – దుర్గాభవాని, మిడ్ డే మీల్స్ తయారీదారు, నాతవరం జెడ్పీహెచ్ఎస్ టీచర్లకూ అదే భోజనం.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అద్భుతంగా ఉన్నాయి. సరిపడినంత మంది ఉపాధ్యాయులు, వసతులను ప్రభుత్వం కల్పించింది. నిజంగా ఇదో గొప్ప మార్పు. మా స్కూల్లో 590 మంది పిల్లలు, 21 మంది ఉపాధ్యాయులున్నారు. మా పర్యవేక్షణలోనే వంటలు చేస్తారు. ప్రతిరోజు ముగ్గురు టీచర్లు ఇక్కడ వండిన ఆహారమే తింటారు. ఏనాడూ బాగోలేదన్న ఫిర్యాదు రాలేదు. – ఎస్.శాంతికుమారి, నాతవరం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం నచ్చకపోతే ‘బ్యాడ్’ అని రాస్తాం స్కూల్లో వండిన ఆహారం ఎప్పుడూ బాగుంటుంది. మాకు నచ్చినట్టుగానే వంట చేస్తారు. తిన్న తర్వాత ఎలా ఉందో ప్రతి రోజు మా టీచర్లు అడుగుతారు. నిర్భయంగా చెప్పమంటారు. బాగుంటే ‘గుడ్’ అని బాగో లేకపోతే ‘బ్యాడ్’ అని రిజిస్టర్లో రాస్తాం. ఒకసారి అలా రాస్తే మెనూ మార్చారు. – కె.మహేశ్వరి, (పదో తరగతి), అల్లిపూడి జెడ్పీ హైస్కూల్ ప్రతి విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం పలు విద్యా సంస్కరణలు అమలు చేస్తోంది. ఉపాధ్యాయుల నుంచి పిల్లల చదువు, ఆహారం, ఆరోగ్యం వరకు అన్ని అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. నిజంగా ఇది ఓ విప్లవమనే చెప్పాలి. ప్రతిరోజు ఒక మెనూ అమలు చేస్తూ తిన్నాక అభిప్రాయాన్ని తెలుసుకోవడం గొప్ప విషయం. పిల్లల అభిప్రాయాల మేరకే గతంలో మెనూ మార్చారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో చెప్పడానికి ఇది చాలు. – ఎన్.వై.నాయుడు పీఎస్ టీచర్, అల్లిపూడి జెడ్పీహెచ్ఎస్ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 104 కాగా బుధవారం రోజు 86 మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం కూరగాయల అన్నం, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ విద్యార్థులకు ఇవ్వాలి. 10 గంటలకల్లా సరుకులు తీసుకున్న వంట సిబ్బంది పాఠశాల ప్రాంగణంలోని కిచెన్‌లో 12.15 గంటలకు భోజనాన్ని రెడీగా ఉంచారు. తెలుగు ఉపాధ్యాయుడు గోవిందు భోజనాన్ని రుచి చూసి విద్యార్థుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. వారు సంతృప్తి వ్యక్తం చేశాక మరో ఉపాధ్యాయుడు ఎన్వై నాయుడు వేడివేడి భోజనం ఫొటోను ఐఎంఎంఎస్ యాప్‌లో అప్లోడ్ చేసి విద్యార్థుల సంఖ్యను కూడా నమోదు చేశారు. - అల్లిపూడి, నాతవరం నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి -
పిల్లల భోజనంపైనా ఏడుపేనా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది పేదింటి పిల్లలకు చదువు, పుస్తకాల నుంచి మధ్యాహ్నం పౌష్టికాహార భోజనం వరకు అన్ని వసతులు కల్పించడం కూడా రామోజీరావుకు తప్పుగానే కనిపిస్తోంది. పిల్లలు సంతృప్తిగా తినేలా రుచికరమైన ఆహారం అందిస్తుంటే ఆ అన్నంలో మట్టి కొట్టాలని చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం పేరుతో నిధులు నొక్కేసి, ఎనిమిదితొమ్మిది నెలలకు కూడా బిల్లులు చెల్లించకపోయినా, నాసిరకం ఆహారం అందించినా ఈనాడు పత్రిక పట్టించుకున్న పాపానపోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో రోజుకో మెనూ, పిల్లల ఆరోగ్యం కోసం రాగిజావ, చిక్కీ అందిస్తున్నా, వాటికి అవసరమైన నిధులను ముందే విడుదల చేస్తున్నా.. ఈనాడుకు కంటగింపుగా మారింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘మాటల్లోనే మధ్యాహ్న భోజనం’ అంటూ ఆధారాలు లేకుండా అడ్డగోలు రాతలు రాసింది. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 44,392 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 37,63,698 మంది విద్యార్థుల పౌష్టికాహారం కోసం రూ. 1,689 కోట్లు కేటాయించారు. ఏజెన్సీలకు, వంటవారికి, సహాయకులకు ఏ నెలకు ఆ నెల చెల్లింపులు జరుగుతున్నాయి. అయినా అబద్ధపు రాతలకు ఈనాడు తెగబడింది. అప్పటికీ.. ఇప్పటికీ ఎంతో తేడా చంద్రబాబు హయాంలో 2019కి ముందు వారంలో ఎక్కువ రోజులు అన్నం, పప్పు లేదా నీళ్ల సాంబారుతోనే పిల్లలకు మధ్యాహ్న భోజనం సరిపెట్టేవారు. అది తినలేక పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డా మెనూ మార్చిన పరిస్థితే లేదు. కానీ 2020లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగతంగా గోరుముద్ద మెనూ రూపొందించి, పిల్లలకు పోషకాహారం అందించాలని ఆదేశించారు. పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్నే పెట్టారు. విద్యార్థులందరికీ ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం, వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడురోజులు చిక్కీ అందిస్తున్నారు. విద్యార్థుల్లో పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలను అధిగమించేందుకు రాగిజావను సైతం మెనూలో చేర్చి ఏరోజు ఏ వంటకం అందించాలో మెనూ ప్రకారం బడిలో పిల్లలకు పక్కాగా పెడుతున్నారు. స్కూళ్లల్లో పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందుతోంది. దీంతో విద్యార్థుల హాజరు శాతం కూడా పెరిగింది. గోరుముద్దకు బడ్జెట్లో భారీగా కేటాయింపు గత ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో డబ్బులు చెల్లించ లేదు. 2014–2018 వరకు బడుల్లో అసలు వంటపాత్రల సరఫరా లేదు. అసలు ఈ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయింపే అరకొరగా ఉండేవి. 2014–2018 మధ్య పిల్లల భోజనానికి చేసిన సగటు వ్యయం కేవలం రూ. 450 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకూ బడ్జెట్ కేటాయింపులు రూ. 7,244 కోట్లకు పైగా ఉన్నాయంటే పేద పిల్లల ఆహారం విషయంలో ప్రభుత్వం ఎంత ఉన్నతంగా ఆలోచిస్తోందో అర్థమవుతుంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసినా రామోజీకి మాత్రం తెలియనట్లు నటించడం విచారకరం. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో 37,63,698 మంది విద్యార్థులకు గ్లాసులు అందించారు. వంట పాత్రలు కొనుగోలు పూర్తి చేశారు. వీటిని సెపె్టంబర్ నెలాఖరులోగా అన్ని స్కూళ్లకు అందించనున్నారు. 2023–24లో బడ్జెట్లో రూ. 1,689 కోట్లు గోరుముద్ద కోసం ప్రభుత్వం కేటాయించింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వంట ఖర్చు పెంపు గత ప్రభుత్వంలో 2014–18 మధ్య విద్యార్థుల వంట ఖర్చు రూ. 3.59 నుంచి రూ. 6.51 మధ్య మాత్రమే కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ ఖర్చును రూ. 8.57 పెంచి చెల్లిస్తోంది. నిబంధనల ప్రకారం పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న కేంద్రీకృత కిచెన్ ఏజెన్సీలకు వంట ఖర్చు కూడా క్రమం తప్పకుండా ప్రభుత్వం చెల్లిస్తోంది. వంట చేసే కుక్/హెల్పర్స్ గౌరవ వేతనాన్ని సైతం క్రమం తప్పకుండా ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తోంది. ఈ చెల్లింపులు జూన్ నెల వరకు పూర్తి చేశారు. ప్రస్తుతం మెనూ ఇలా.. ♦ సోమవారం: వేడి పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావ్, గుడ్డు కూర, చిక్కీ ♦ మంగళవారం: చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగిజావ ♦ బుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూకుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ ♦ గురువారం: సాంబార్‌బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగిజావ ♦ శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ ♦ శనివారం: ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్, రాగిజావ -
మిడ్ డే మీల్లో పాము.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
పాట్నా: బిహార్‌లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం స్థానికంగా కలకలం సృస్టించింది. అప్పటికే ఆహారాన్ని తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అరారియాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలందరికీ సిబ్బంది కిచిడీ వడ్డించారు. ఈ క్రమంలో ఓ అబ్బాయికి వడ్డించిన ప్లేట్లో పాము కనిపించింది. వెంటనే ఆ ఆహారాన్ని పడవేయగా.. అప్పటికే భోజనం చేసిన పిల్లల ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. కొందరు పిల్లలు వాంతులు చేసుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆహారం తిన్న తర్వాత 100 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో ఆరోగ్యం విషమంగా ఉన్న 25 మంది పిల్లల్ని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పిల్లల ఆరోగ్యం కూడా నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. చదవండి:శునకాన్ని చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి... స్థానిక సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం భోజనం పాఠశాల బయట వంట చేసి దానికి ఓ సప్లయర్ తీసుకువస్తాడు. పాఠశాల యాజమాన్యం తప్పిదం ఏమీ లేదని స్థానిక నాయకులు తెలిపారు. కాగా ఛప్రాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మే18న బల్లి కనిపించిన ఘటన మరవకముందే ఈ ఘటన జరగడం గమనార్హం చదవండి:బోగీలను వదిలి రైలింజన్ పరుగులు! -
పంచాయతీ ఎన్నికలు.. మధ్యాహ్న భోజనంలో చికెన్, పండ్లు
లక్నో: పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార టీఎంసీ ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కొత్తగా చికెన్, సీజనల్ పండ్లు అందజేయాలని నిర్ణయింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురానుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలలపాటు వీటిని స్కూల్ పిల్లలకు అందజేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మిల్లో భాగంగా బియ్యం, పప్పులు, కూరగాయలు, సోయాబీన్ ,గుడ్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మెనూలో అదనంగా పీఎం పోషన్ కింద పోషకాహారం కోసం వారానికి ఒకసారి చికెన్, సీజనల్ పండ్లను అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం మమతా బెనర్జీ సర్కార్ అదనంగా రూ. 371 కోట్లను మంజూరు చేసింది. జనవరి నుంచి అదనపు పౌష్టికాహార పథకం అమలులోకి వస్తోందని విద్యాశాఖ విభాగం అధికారి ఒకరు ధృవీకరించారు. అయితే ఏప్రిల్ తర్వాత దీనిని కొనసాగించాలా వద్దా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రతి విద్యార్థికి అదనపు పోషకాహారాన్ని అందించడానికి వారానికి రూ. 20 ఖర్చు అవుతుందన్నారు. ఈ ప్రక్రియ 16 వారాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్ర,ఎయిడెడ్ పాఠశాలల్లో 1.16 కోట్ల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్దిపొందుతున్నారు. దీని కోసం రాష్ట్ర, కేంద్రం 60:40 నిష్పత్తిలో ఖర్చును పంచుకుంటాయి. అయితే ఈ నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది, ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని బీజేపీ మండిపడింది.అయితే దీనిపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్.. ప్రతిపక్షాలు ప్రతిదానిలో చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించింది. మరోవైపు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన నిలుస్తారని టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ అన్నారు. చదవండి: నెల రోజుల్లో రెండో ఘటన.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మరో దారుణం .. -
ఆహా ఏమి రుచి..!
సాక్షి, రాయచోటి: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి..అని ఓ సినిమా కవి పాటలో రాసినట్లు అంతటి రుచికరమైన ఆహారం ప్రస్తుతం విద్యార్థులకు అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో చదివే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఒక వైపు విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూనే మరోవైపు రుచికరమైన ఆహారం అందించేలా ప్రణాళిక రూపొందించింది. సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్రప్రభుత్వం జగనన్న గోరు ముద్ద పథకం ద్వారా రుచికరమైన భోజనం అందిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధగా ఈ పథకంలో విద్యార్థులకు రోజుకో వంటకంతో సరికొత్త మెనూ అమలు చేస్తోంది. ఈనెల 21 నుంచి నూతన మెనూను పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. కడుపునిండా అన్నం: గత టీడీపీ పాలనలో మధ్యాహ్న భోజనం సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇళ్ల నుంచి తెచ్చుకుని తినాల్సిన దుస్థితి ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. జగనన్న గోరు ముద్ద పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇంటి నుంచి విద్యార్థులు అన్నం తెచ్చుకోవడం తగ్గిందని చెబుతున్నారు. జిల్లాలో 2190 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో 1,44,467 మంది విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు. ఆహారానికి అదనపు నిధులు జిల్లా వ్యాప్తంగా గతంలో ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ.5.40లను ప్రభుత్వం అందజేసేది. కొత్త ఉత్తర్వుల ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.5.88ల చొప్పున ఇవ్వనున్నారు. అలాగే ఉన్నత పాఠశాల విద్యార్థికి గతంలో రూ.7.85లు ఉండగా.. ప్రస్తుతం రూ.8.57లు ఇవ్వనున్నారు. వంట ఖర్చుల నిధులు రెట్టింపు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఈ జగనన్న గోరు ముద్ద పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2022–23 సంవత్సరానికి గానూ రూ.20 కోట్ల మేర ఖర్చు చేసింది. అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ ఉండేది కాదు.పైగా నిధులు కూడా వంట ఏజెన్సీలకు సక్రమంగా ఇవ్వక పోవడంతో ఆహారం విషయంలో నాణ్యత గాలిలో దీపంలా ఉండేది. వైఎస్సార్సీపీ పాలనలో జగనన్న గోరు ముద్ద పథకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఈ పథకం అమలును నాలుగు అంచెల్లో పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్, ప్రతి వారం ఒక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. పాఠశాల స్థాయిలో హెడ్మాస్టర్, గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ సేవా సంఘాలు (సెర్చ్, మెప్మా), ఎంఈఓలు ఇలా వివిధ స్థాయిల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జగనన్న గోరు ముద్ద ఒకే నాణ్యతతో అందించేలా ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అమలు చేస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే 14417 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసేలా పారదర్శకతను పాటిస్తున్నారు. పక్కాగా అమలు చేయాల్సిందే.. జిల్లా వ్యాప్తంగా జగనన్న గోరు ముద్ద పథకంలో నూతన మెనూను పక్కాగా అమలు చేయాలని ఆదేశించాం. సర్కార్ బడులలో చదివే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం నాణ్యతగా, రుచిగా అందించాల్సిందే. పౌష్టికాహారం లోపం తలెత్తకుండా మెనూను ప్రభుత్వం రూపొందించింది. మెనూను తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో అమలు చేయాలి. – గిరీషా పీఎస్(జిల్లా కలెక్టర్), అన్నమయ్య జిల్లా కొత్త మెనూ ప్రకారం జగనన్న గోరుముద్ద పాఠశాలల్లో నూతన మెనూను అమలు చేయాలని ఆదేశించాం. సోమవారం అన్ని పాఠశాలల్లో నూతన మెనూ అమలులోకి వచ్చింది. కొత్త మెనూ ప్రకారం గత సోమవారం విద్యార్థులకు వేడి పొంగలి, ఉడికించిన కోడి గుడ్డు, కూరగాయల పలావ్, గుడ్డు కూర, చిక్కీని అందజేశారు. ప్రతి రోజు మధ్యాహ్న భోజనం అమలు తీరును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. –రాఘవరెడ్డి (డీఈఓ), అన్నమయ్య జిల్లా బలవర్థకమైన ఆహారం మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎంతో బలవర్థకంగా ఉంది. ఎదిగే పిల్లలకు మంచి పోషక విలువలను అందిస్తోంది. ఆరోగ్యపరంగా ప్రతి విద్యార్థికి సమతుల్య ఆహారం జగనన్న గోరుముద్ద ద్వారా మాకు లభించడం ఆనందంగా ఉంది. –గాయత్రి, పదో తరగతి, జెడ్పీహెచ్ఎస్, సంబేపల్లె ఇంటి భోజనం కంటే మిన్నగా.. ఎన్నో పోషక విలువలతో మా బడిలో పెట్టే మధ్యాహ్న భోజనం ఇంటి భోజనం కంటే మిన్నగా ఉంది. శరీరానికి ఎక్కువగా అవసరమయ్యే మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు సమపాళ్లలో అందుతున్నాయి. జగనన్న గోరుముద్దతో చక్కటి ఆరోగ్యం కూడా సమకూరుతోంది. – పి.అంజలి, 9వ తరగతి, జడ్పీహెచ్ఎస్, సంబేపల్లె -
Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు
సీతంపేట: సర్కారు బడుల్లో ఈ నెల 21 నుంచి కొత్త మెనూ అమలుకానుంది. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ‘గోరుముద్ద’ను ప్రభు త్వం వడ్డించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిదీమీనా ఉత్తర్వు లు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మెనూ అమలు ఇలా... సోమవారం: ప్రస్తుత మెనూ: అన్నం, పప్పుచారు, కోడిగుడ్డుకూర, చిక్కీ కొత్తమెనూ: హాట్‌పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/ కూరగాయల పులావ్, కోడిగుడ్డుకూర, చిక్కీ మంగళవారం: ప్రస్తుతం: చింతపండు/నిమ్మకాయ పులిహోర,టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు కొత్తమెనూ: చింతపడు/నిమ్మకాయ పులిహోరా, టమాట పచ్చడి/దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు బుధవారం: ప్రస్తుతం: కూరగాయల అన్నం, బంగళాదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ కొత్తమెనూ: కూరగాయల అన్నం, బంగాళదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ గురువారం: ప్రస్తుతం: కిచిడి, టమాటపచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు కొత్తమెనూ: సాంబార్‌బాత్, ఉడికించిన కోడిగుడ్డు శుక్రవారం: ప్రస్తుతం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ కొత్తమెనూ: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ శనివారం: ప్రస్తుత మెనూ: అన్నం, సాంబార్, తీపిపొంగలి కొత్తమెనూ: ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపిపొంగలి -
పాఠశాలకు విద్యార్థులకు వెరీ ‘గుడ్డు’.. ఇక ప్రతివారం రంగు తప్పనిసరి!
రాయవరం (అంబేడ్కర్ కోనసీమ): జగనన్న గోరుముద్ద పథకం పేరుతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పథకాన్ని ఎప్పటికప్పుడు పర్య_వేక్షిస్తూ అవసరమైన మార్పుల్ని చేస్తోంది. ఇపప్పటివరకు కాంట్రాక్టర్లు 10 రోజులకు ఒకసారి చొప్పున నెలకు మూడుసార్లు పాఠశాలలకు కోడి_గుడ్లు సరఫరా చేసేవారు. దీనివల్ల గుడ్ల నాణ్యత దెబ్బతింటుందన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం కోడిగుడ్ల సరఫరాలో తక్షణ మార్పులకు ఆదేశించింది. కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా, తాజా గుడ్లు అందించేందుకు వారానికి ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: చనిపోయాడనుకుని దహన సంస్కారాలు.. చిన్న కర్మ జరుపుతుండగా సతీష్ ప్రత్యక్షం.. అంతా షాక్!) కోడిగుడ్లపై స్టాంపింగ్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు ఉడికించిన కోడి_గుడ్లను అందజేస్తున్నారు. కోడిగుడ్లు అక్రమార్కుల పాలవ్వకుండా కోడిగుడ్లపై ప్రతి వారం ఒక్కో రంగు వేసి సరఫరా చేస్తున్నారు. నెలలో మొదటి వారం నీలం, 2వ వారం గులాబీ, 3వ వారం ఆకుపచ్చ, 4వ వారం వంగపువ్వు రంగులో కోడిగుడ్లపై స్టాంపింగ్ చేస్తారు. ఈ విధంగా వచ్చే కోడిగుడ్లను మాత్రమే ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గుడ్డు పరిమాణం తగ్గినా పాఠశాలల్లో తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు కలర్ స్టాంపింగ్‌తో సరఫరా అవుతున్న కోడిగుడ్లు పకడ్బందీ పరిశీలన మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పర్యవేక్షణను పెంచింది. పాఠశాల స్థాయిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు నిత్యం పర్యవేక్షణ చేస్తారు. కోడి గుడ్ల సరఫరాకు అనుమతి పొందిన కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి వచ్చిన గుడ్ల సైజు, కలర్ స్టాంపింగ్ ఉన్న గుడ్లు, స్టాంపింగ్ లేని గుడ్లు తదితర వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐఎంఎంస్ యాప్‌లో నమోదు చేయాలన్న నిబంధన విధించారు. (చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు) నాణ్యతకు పెద్ద పీట ‘విద్యార్థులకు అందించే పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు నాణ్యత ఉన్న కోడిగుడ్లనే సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. పాఠశాల హెచ్ఎంలు కోడిగుడ్ల ఏజెన్సీ నుంచి దిగుమతి చేసుకునే ముందు కచ్చితంగా గుడ్డు సైజు, కలర్ స్టాంపింగ్ చెక్ చేసుకోవాలి. పాడైన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దిగుమతి చేసుకోకూడదు. – ఎన్వీ రవిసాగర్, డీఈవో, అమలాపురం -
Andhra Pradesh: స్కూళ్ల భద్రతపై దృష్టి
స్కూళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే ముందు వాటి నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలి. బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్న భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలి. ప్రతినెలా నాణ్యత పరీక్షలు జరగాలి. ఆహారాన్ని రుచిగా వండడంపై వంట పని వారికి (కుక్స్) తగిన తర్ఫీదు ఇవ్వాలి. ఈ శిక్షణ కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగించాలి. గుడ్లు సరఫరాలో స్టాంపింగ్ తప్పనిసరి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మనబడి నాడు–నేడు’ పథకం కింద పలు మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన స్కూళ్లలో భద్రత కోసం వాచ్మెన్లను నియమించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాడు–నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్ చేయించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనబడి నాడు–నేడు కింద నిర్దేశించుకున్న అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? లేవా? సమకూర్చిన వాటిలో ఏమైనా సమస్యలు వచ్చాయా? తదితర అంశాలపై ఆడిట్ చేయించాలన్నారు. క్రమం తప్పకుండా ఏటా నాలుగుసార్లు ఆడిట్ జరగాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే స్కూలు మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్), టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్) నిధులను వాడుకుని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. నాడు–నేడు కింద కల్పించిన సదుపాయాలకు సంబంధించి వారంటీ ఉన్నందున సమస్య రాగానే, మరమ్మతులు చేయిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. వీటికోసం గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సేవలను వినియోగించుకోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ ► రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపైనా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. నాడు–నేడు కింద స్కూళ్లను అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ఈ పర్యవేక్షణ పక్కాగా కొనసాగాలంటే ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుంది. ► స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్ సెంటర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి. తద్వారా స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించొచ్చు. స్కూళ్లలో వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేసినా, అవి పని చేయడం లేదన్న మాట రాకూడదు. అంతిమంగా కలెక్టర్లు, జేసీలు.. స్కూళ్ల నిర్వహణపై బాధ్యత వహించాలి. చిక్కీల నాణ్యతపై మూడు దశల్లో పరీక్షలు ► నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించాలి. క్రమం తప్పకుండా మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ చేయాలి. దీనికోసం సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వీటి పర్యవేక్షణలో హెచ్ఎం, సచివాలయ సిబ్బంది పాత్ర కీలకంగా ఉండాలి. ఆ మేరకు వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలి. ► మధ్యాహ్న భోజనంలో అందించే చిక్కీల నాణ్యతపై తయారీదారుల వద్ద, సరఫరా సమయంలో, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు.. ఇలా మూడు దశల్లో నాణ్యతపై ర్యాండమ్ పరీక్షలు చేయాలి. స్టాంపింగ్ లేకుండా గుడ్లు పంపిణీ చేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమంపై కూడా గట్టి పర్యవేక్షణ ఉండాలి. ఇందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి. ఖాళీగా ఉన్న అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాలి. ► ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ►నాడు – నేడు ఎంత ముఖ్యమో స్కూళ్ల నిర్వహణ కూడా అంతే ముఖ్యం ►ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలి ►దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందన్న సీఎం. ►మధ్యాహ్న భోజనం నాణ్యతపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ►నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించడంపై సమావేశంలో చర్చ ►క్రమం తప్పకుండా మధ్యాహ్నం భోజనంపై పర్యవేక్షణ చేయాలి ►దీనికోసం సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి ►స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణలో హెచ్ఎం, గ్రామ సచివాలయ సిబ్బందిది కీలకపాత్ర అన్న సీఎం ►స్కూళ్లకు, అంగన్వాడీలకు బియ్యాన్ని సరఫరాచేసేముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని సీఎం ఆదేశం ►సరఫరా చేసే బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్నం భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలి ►కచ్చితంగా ప్రతినెలా ఈ నాణ్యతా పరీక్షలు జరగాలి ►ఆహారాన్ని రుచిగా వండడంపై కుక్స్‌కు తగిన తర్ఫీదు ఇవ్వాలి ►క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు జరగాలి ►చిక్కీల నాణ్యతపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి ►తయారీ దారుల వద్దా, సరఫరా సమయంలోనూ, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు... ఈ మూడు దశల్లోనూ నాణ్యతపై ర్యాండమ్ పరీక్షలు చేయాలని సీఎం ఆదేశం ►అలాగే గుడ్లు పంపిణీలో సమయంలో వాటికి తప్పనిసరిగా స్టాంపింగ్ చేస్తున్నామన్న అధికారులు ►స్టాంపింగ్ లేకుండా పంపిణీచేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►నాడు – నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్ చేయించాలన్న సీఎం ►నిర్దేశించుకున్న అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? లేవా? ►సమకూర్చిన వాటిలో ఏమైనా సమస్యలు వచ్చాయా? ►తదితర అంశాలపై ఆడిట్ చేయించాలన్న సీఎం ►ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వాడుకుని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలి ►క్రమం తప్పకుండా ఇలా ఆడిట్ చేయాలి ►ప్రతి ఏటా నాలుగు సార్లు ఆడిట్ చేయాలి ►నాడు– నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో సదుపాయాల భద్రతకోసం వాచ్మెన్ నియమించాలి ►నాడు – నేడు కింద కల్పించిన సదుపాయాలకు సంబంధించి వ్యారంటీ ఉన్నందున సమస్య రాగానే వెంటనే మరమ్మత్తులు చేయిస్తున్నామన్న అధికారులు ►గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలనూ వినియోగించుకోవాలి ►అంతిమంగా కలెక్టర్లు, జేసీలు.. స్కూళ్ల నిర్వహణపై బాధ్యత వహించాలి ►స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్‌సెంటర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి ►స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి ►స్కూళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదన్న మాట రాకూడదు ►వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్ కార్యక్రమంపైనా కూడా గట్టి పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ►దీనికి కూడా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి ►ఖాళీగా ఉన్న అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ సిరి, సెర్ఫ్ సీఈఓ ఏ.ఎండి ఇంతియాజ్, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కేటరింగ్ మేనేజర్ పై చేయి చేసుకున్న శివసేన ఎమ్మెల్యే
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీకి చెందిన శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఆయన ఫుడ్ కేటరింగ్ మేనేజర్ పై చేయి చేసుకుని, దుర్భాషలాడుతున్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహరాష్ట్రలోని హింగోలి జిల్లాలో మధ్యాహ్నా భోజన పథకంలో భాగంగా భాగంగా కూలలీలకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో తానే స్యయంగా పరిశీలించేందుకు వచ్చానని అన్నారు. అంతేకాదు కూలీలకు నాశిరకం భోజనం అందిస్తున్న సదరు మేనేజర్ పై చేయి చేసుకుని, గట్టిగా చివాట్లు పెట్టారు. ఎమ్మెల్యే సంతోష్ బంగర్ మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవాడానికి కొద్ది నిమిషాల ముందు ఆయన పార్టీలో చేరారు. శివ సేన నాయకత్వం ఆయనను హింగోలి ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించింది. అంతేకాదు గతంలో సంతోష్ బంగర్ ఓ వైరల్ వీడియోలో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అధ్యక్షతన తిరుబాటు చేసిని ఎమ్మెల్యేలను తిరిగి వచ్చేయండి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మిమ్మల్ని క్షమిస్తాడంటూ వార్తల్లో నిలిచారు. (చదవండి: బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??.. షిండేలాగే నితీశ్ కూడా..) -
రూ.7.45కే రుచీ, శుచీ ఎలా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి విద్యాశాఖ జారీ చేసిన సరికొత్త మార్గదర్శకాలు తలనొప్పిగా మారాయని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. శుచి, శుభ్రత, నాణ్యతకు స్కూల్ హెచ్ఎంలనే బాధ్యులను చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు తనిఖీ సమయంలో సరైన లెక్క చెప్పకపోయినా హెచ్‌ఎంలపైనే చర్య తీసుకుంటామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హెచ్‌ఎంల్లో మరింత కంగారు మొదలైంది. మార్కెట్లో నిత్యావసరాలు మండిపోతుంటే, కూరగాయల రేట్లు ఆకాశాన్నంటితే నిబంధనల ప్రకారం నాణ్యత ఎలా సాధ్యమనే విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. భోజనం ఎంత మందికి పెట్టామనే వివరాలను అధికారులకు పంపాలని కోరడం పెద్ద తలనొప్పి అని చెబుతున్నారు. దీనివల్ల బోధన పర్యవేక్షణ దెబ్బతింటుందని వాపోతున్నారు. ప్రతిబంధకంగా నిబంధనలు ►రాష్ట్రవ్యాప్తంగా 24 వేల బడుల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.7.45 మాత్రమే ఇస్తారు. స్థానిక మహిళా సంఘాలకు స్కూల్ నుంచి బియ్యం మాత్రమే ఇస్తారు. మిగతావన్నీ వాళ్ళే కొని తెచ్చుకోవాలి. ►దీనికి రూ.7.45 ఏమేర సరిపోతాయని మహిళా సంఘాలు అంటున్నాయి. అదీగాక వారానికి మూడు గుడ్లు ఇవ్వాలి. అలాంటప్పుడు కూరలు, ఇతర వంట సామగ్రి ఎలా సమకూర్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పప్పులు, నూనెలు ఏ రోజుకారోజు పెరిగిపోతుంటే, ఆ మొత్తంతో ఎలా సర్దుకోవాలని నిలదీస్తున్నారు. ►తక్కువ ఖర్చుతో తెచ్చే కూరల్లో కొన్ని చెడిపోయి ఉంటే వాటికి తమను ఎలా బాధ్యులను చేస్తారని హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు. ►ప్రతి రోజూ మెనూ వివరాలను స్కూల్ గోడపై రాయాల్సి ఉంటుంది. తనిఖీ సమయంలో ఈ వివరాలు సరిగా లేకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటారు. ఈ మెనూ రాయాలంటే సమయం వృథా అవుతుందని హెచ్ఎంలు అంటున్నారు. ►పాఠశాల విద్యా కమిటీ, విద్యార్థులతో కూడిన కమిటీ సమక్షంలోనూ బియ్యం తూకం వేసి వంట చేసే వారికివ్వాలనే షరతు పెట్టారు. ఈ లెక్కలన్నీ రిజిష్టర్‌లో పక్కాగా పేర్కొనాలి. వంట పాత్రలు శుభ్రంగా లేకపోయినా, విద్యార్థులు భోజనం చేసే ప్లేట్లు అపరిశుభ్రంగా కన్పించినా దానికీ స్కూల్ హెచ్‌ఎందే బాధ్యతని నిబంధనల్లో పేర్కొన్నారు. తనిఖీ అధికారులు దీన్ని అడ్డంపెట్టుకుని తమను వేధించే అవకాశముంటుందని హెచ్ఎంలు చెబుతున్నారు. ►ప్రతినెలా 10వ తేదీలోగా వంట ఏజెన్సీకి చెల్లింపులు చేయాలి. నెలలు గడుస్తున్నా బిల్లులే రానప్పుడు చెల్లింపులు ఎలా చేయాలని హెచ్ఎంలు అంటున్నారు. వాస్తవానికి దూరంగా రూల్స్: పి.రాజా భానుచంద్ర ప్రకాశ్, గెజిటెడ్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధ్యాహ్న భోజనానికి అయ్యే వాస్తవ ఖర్చును అధికారులు గుర్తించాలి. మార్కెట్లో సరుకుల రేట్లు మండిపోతున్నాయి. ఇచ్చే మొత్తంలో వీటిని కొనడం సాధ్యం కావడం లేదని వంట చేసే మహిళా సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటికీ హెచ్ఎంలనే బాధ్యులను చేస్తే ఎలా? బోధన వ్యవహారాలు చూసుకునే బాధ్యతల కన్నా, భోజన జమా ఖర్చు వివరాలు రాయడానికే ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల బోధనలో నాణ్యత తగ్గదా? -
అమ్మకూ మధ్యాహ్న భోజనం
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చిన్నారులకు మాత్రమే భోజనం వండి పెట్టేవారు. ఈ నెల 1 నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. జిల్లాలో 2,389 అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు 17,660, బాలింతలు 17,318, ఏడాదిలోపు పిల్లలు 16,732, మూడేళ్లలోపు చిన్నారులు 57,072, ఆరేళ్లలోపు వారు 48,233 మంది ఉన్నారు. వీరిలో రక్తహీనత నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. మెనూలో సమూల మార్పులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడి అన్నమే అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మెనూలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్న సమయంలో పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలకు రుచికరమైన భోజనం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసి అమలు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. భోజనం తర్వాత తల్లులకు 200 మి.లీ.పాలు, పిల్లలకు 100 మి.లీ. పాలు అందించాలని నిర్ణయించారు. నాణ్యమైన పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రంలో భోజనం తయారు చేసి వడ్డిస్తున్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అందించడం చిన్నారుల ఎదుగుదలకు దోహద పడుతుంది. కరోనా సమయంలో నిలుపుదల చేసిన ఈ విధానం తిరిగి ఈ నెల 1 నుంచి అమలులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం. వేడి భోజనం అందించడం సంతోషదాయకం. – జి.గౌరి, గర్భిణి, కడప రోజూ గుడ్డు, పాలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పోషకాహారం అందిస్తుండటం సంతోషదాయకం. మాలాంటి వారికి ఎంతో ప్రయోజనకరం. మెనూలో రోజూ కోడిగుడ్డు, పాలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం, దానిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడం హర్షించదగ్గ విషయం. –కె.శ్రుతి, బాలింత, కడప సద్వినియోగం చేసుకోవాలి గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నాం. దీనిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎంఎన్ రాణి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్, కడప -
మరింత పకడ్బందీగా ‘జగనన్న గోరుముద్ద’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పకడ్బందీగా నాణ్యతతో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పథకానికి నిధుల కేటాయింపును కూడా ఆ మేరకు పెంచింది. ఈ పథకానికి 2020–21లో రూ.1,546 కోట్లు, 2021–22లో రూ.1,797 కోట్లు ఖర్చు పెట్టింది. 2022–23 విద్యాసంవత్సరానికి రూ.1,908 కోట్లు కేటాయించింది. అలాగే గతంలో ఈ పథకం కింద 32 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈసారి 43.46 లక్షల మందికి మధ్యాహ్న భోజనాన్ని అందించనుంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం సాంబారు, అన్నంతోనే సరిపెట్టేవారు. కానీ ప్రస్తుతం వారానికి ఒక మెనూ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గుడ్లు, చిక్కీలు సహా అన్నం, పప్పుచారు, పులిహోర, పప్పూటమోటా, ఆలూకుర్మా, కిచిడి, పొంగలి.. ఇలా రోజుకోరకమైన ఆహారపదార్థాలను విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి విద్యార్థికి వారానికి 5 గుడ్లు అందిస్తున్నారు. గతంలో మధ్యాహ్న భోజనానికి రూ.515 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టేది. అందులోనూ రూ.400 కోట్లు కేంద్రం నిధులే. కానీ ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.400 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,500 కోట్లు విద్యార్థుల భోజనం కోసం కేటాయిస్తోంది. కేంద్రం కేవలం 1–8 తరగతుల విద్యార్థులకు మాత్రమే నిధులు అందిస్తుండగా 9, 10 తరగతుల విద్యార్థులకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆహార పదార్థాల్లో నాణ్యత, పౌష్టికతతోపాటు రుచికరంగా ఉండేందుకు వీలుగా గతంలో విద్యార్థులకు ఒక్కొక్కరిపై రోజువారీ వెచ్చించే మొత్తాన్ని పెంచింది. ప్రాథమిక తరగతుల్లో ప్రతి విద్యార్థికి రూ.11.26ను రూ.16.07కి, ప్రాథమికోన్నత తరగతుల్లో ప్రతి విద్యార్థికి రూ.12.87ను రూ.18.75కి, ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో ప్రతి విద్యార్థికి రూ.17.52ను రూ.23.40కి పెంచారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే 88,296 మంది వంట వాళ్లు, సహాయకులకు ఇచ్చే రూ.1,000 గౌరవ భృతిని రూ.3 వేలకు ఇంతకు ముందే పెంచిన సంగతి తెలిసిందే. అమలుపై ప్రత్యేక శ్రద్ధ.. నాలుగంచెల్లో పర్యవేక్షణ గతంలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఈసారి నాలుగు అంచెల్లో పర్యవేక్షణ చేస్తూ పథకాన్ని సమర్థంగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాల స్థాయిలో.. ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రుల కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ సేవాసంఘాలు (సెర్ప్, మెప్మా), వివిధ స్థాయిల అధికారులకు పర్యవేక్షణ కమిటీల బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ద్వారా జగనన్న గోరుముద్ద పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను, డ్యాష్ బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్రమంతా జగనన్న గోరుముద్ద ఒకేలా నాణ్యతతో అమలయ్యేలా ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తెచ్చింది. ఎక్కడైనా సమస్య ఏర్పడితే 14417 టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రవేశపెట్టింది. -
కుళ్లిన కూరగాయలు, నీళ్ల చారు..వామ్మో! ఇదేం భోజనం.. ఎలా తింటారు?
పురుగులు పట్టిన ఈ క్యాలీఫ్లవర్‌ను చూస్తేనే ఏదోలా ఉంది. దానికి ఫంగస్ వచ్చినా విద్యార్థుల ఆరోగ్యం ఏమైతే మాకేంటీ అన్నట్లుగా వీటినే కోసి వండి పెడుతున్నారు. నగరంలోని ఇంటిగ్రేటెడ్ ప్రీమెట్రిక్ హాస్టల్లో తీసిన ఫొటో ఇది. ఈ చిత్రంలో కుళ్లిపోయి కనిపిస్తున్న టమాటాలు నగరంలోని ఎస్సీ బాలుర వసతి గృహం(బి)లోనివి. టమాట రేటు తగ్గినా కూడా పురుగులు పట్టి కుళ్లిపోయిన టమాటాలనే నిరుపేద విద్యార్థులకు వండి పెడుతున్నారు. సాక్షి,ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో భోజనం అధ్వానంగా మారింది. పలు హాస్టళ్లలో కుళ్లిపోయి పురుగులు పట్టిన కూరగాయలు, నీళ్ల చారే భోజనంగా వడ్డిస్తున్నారు. ఉన్నతాధికారులుండే జిల్లా కేంద్రంలోని ఎస్సీ ప్రీ మెట్రి క్ హాస్టళ్లలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే.. మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ధరలు పెరిగాయనే సాకుతో మెనూలో నుంచి రెండు గుడ్లు, రెండు అరటి పండ్లు తొలగించినా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. కుళ్లిపోయి పురుగులు పట్టిన కూరగాయలు, నీళ్ల చారే స్పెషల్ భోజనంగా మారింది. వార్డెన్ల కక్కుర్తి తో విద్యార్థులకు రుచికరమైన భోజనం అందని ద్రాక్షలా మారింది. ప్రశ్నించలేని విద్యార్థులు వారికి ఏది పెడితే అది తింటున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. ఫుడ్ పాయి జన్ లాంటి ప్రమాదాలు సంభవించే అవకాశముంది. జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 32 ప్రీమె ట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 1,400 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. సంతలో అగ్గువకు తెచ్చి.. పైసలు మిగులుచ్చుకోవడానికి వార్డెన్లు కక్కుర్తి పడుతున్నారు. అంగళ్లు, మార్కెట్లలో వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ సమయంలో కూరగాయలు కుళ్లినవి, పురుగులు పట్టినవి ఉండడంతో అవి రెండు, మూడు రోజులకే పాడవుతున్నారు. టమాలు, వంకాయలు, క్యాలీ ఫ్లవర్, బెండకాయలు, ఉల్లిగడ్డలు, ఆకు కూరలు నాణ్యతగా లేకున్నా వాటినే విద్యార్థులకు వండి పెడుతున్నారు. నీళ్ల చారు, కుళ్లిన కూరగాయలే వడ్డిస్తున్నారు. తూతూ మంత్రంగా మెనూ.. ఎస్సీ హాస్టళ్లలో రూపొందించిన భోజన మెనూ ను వార్డెన్లు తూతూ మంత్రంగానే అమలు చేస్తున్నారు. అసలు మెనూ ప్రకారం ప్రతీరోజు ఉదయం రాగిజావా పాలను అందించాలి. అలాగే బ్రేక్ ఫాస్ట్‌గా వారంలో ఒక రోజు ఉప్మా, పల్లి చట్నీ, రెండు రోజులు పులిహోర, వారంలో మూడు అరటిపండ్లు, అదే విధంగా రెండు రోజులు కిచిడి, సాంబారు, అలాగే ఒకరోజు అటుకుల ఉప్మా, ఆదివారం ఒకరోజు ఇడ్లీ, పల్లి చట్నీ అందించాలి. కాగా ప్రతీరోజు రాత్రి కూర గాయల భోజనం, పప్పు సాంబారు లేదా రసంతో పాటు పెరుగు అందించాలి. వారంలో మూ డు గుడ్లు కూడా ఇవ్వాలి. ప్రతి ఆదివారం మాంసాహారం(చికెన్) వండి ఒక్కో విద్యార్థికి 100 గ్రాముల చొప్పున పెట్టాలి. అలాగే ప్రతి సాయంత్రం స్నాక్స్ అందించాలి. కానీ ఈ మెనూ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. మెనూలో ఉన్న వాటన్నింటిని వండి పెట్టినా విద్యార్థులకు సరిపోయేంత ఉండడం లేదు. -
ఆ బిల్లులన్నీ ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం: మంత్రి సురేశ్
సాక్షి, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించలేదని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఖండించారు. ఆదివారం ఆయనొక ప్రకటన చేస్తూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంబందించిన బిల్లులను వంట వారికి, కాంట్రాక్టర్లకు డిసెంబర్ వరకు పూర్తిగా చెల్లించామని స్పష్టం చేశారు. ‘బిల్లులను అప్లోడ్ చేసిన వెంటనే ఆటో డెబిట్ సిస్టం ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలిచ్చారు. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సహాయంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వాటా కూడా సింగిల్ నోడల్ ఖాతాకు వచ్చిన బిల్లులన్నీ వంటవారి ఖాతాలకు బదిలీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో గోరుముద్దకు సంబంధించిన లావాదేవీలన్నీ సింగిల్ నోడల్ ఖాతాకు బదలాయించి ప్రతినెలా 7వ తేదీలోగా వంటవారికి, కాంట్రాక్టర్లకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వారానికి 5 రోజులు కోడిగుడ్లతో పాటు చిక్కీని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’ అని మంత్రి సురేష్ వివరించారు. జగనన్న గోరుముద్ద పథకంలో పూర్తిగా మార్పులు చేసి పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని 15 రకాల వంటలతో 6 రోజులపాటు మెనూను తయారు చేశామని తెలిపారు.ఇవేమీ తెలియని అయ్యన్నపాత్రుడు భోజన పథకం బిల్లులు చెల్లించటం లేదని ఆరోపించటం సిగ్గు చేటని మంత్రి సురేష్ పేర్కొన్నారు. -
ఆరోగ్యం వెం‘బడి’...
సాక్షి, సిద్దిపేట: విద్యార్థులకు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల ద్వారా పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం నాంచార్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పండిస్తున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్లో సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలతో 45 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 12 మందితో కమిటీ కూరగాయల సాగుకోసం ప్రత్యేకంగా 12 మంది విద్యార్థులతో కిచెన్ గార్డెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థులు ప్రతి రోజు ఉదయం 20 నిమిషాలు పాఠశాల సమయానికంటే ముందుగా రావడం, తరగతులు ముగిసిన తర్వాత మరో 15 నిమిషాల పాటు కిచెన్ గార్డెన్లో కలుపు తీత, మొక్కలకు నీళ్లు పెట్టడం.. వాటిని పరిరక్షించడం చేస్తుంటారు. దీంతో విద్యార్థులకు పంటలు ఎలా పండిస్తారనే అవగాహనతో పాటు పని పట్ల గౌరవం కలుగుతోందని ఉపాధ్యాయులు చెబతున్నారు. ఇతరులు తీసుకోకుండా.. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్‌కు గ్రామ పంచాయతీ సహకారం కూడా అందుతోంది. కిచెన్ గార్డెన్‌కు సేంద్రియ ఎరువులను పంచాయతీ ఉచితంగా అందజేస్తోంది. పాఠశాలలో పండిన కూరగాయలను గ్రామస్తులు ఎవరూ కోసుకుపోవద్దని చాటింపు సైతం చేశారు. కూరగాయలు తెంచినట్లు తెలిస్తే వారికి రూ.10 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. సాగు చేస్తున్న కూరగాయలు సొరకాయ, బీర, వంకాయ, కాకర, టమాటా, దోసకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, బెండకాయ, పాలకూర, తోటకూర, సుక్క కూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఉల్లిఆకు, పచ్చిమిర్చి. నాంచార్‌పల్లి ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాల 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1– 7వ తరగతి వరకు 166 మంది విద్యార్థులున్నారు. స్కూల్ ఆవరణలో 5 గుంటల స్థలంలో గత అక్టోబర్ నెలలో పలు రకాల కూరగాయల విత్తనాలు నాటారు. నవంబర్ 30 నుంచి కాత మొదలైంది. అప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పండించిన కాయగూరలనే మధ్యాహ్న భోజనంలో ఆహారంగా అందిస్తున్నారు. తాజా కాయగూరలతో రోజుకో రకమైన వంటకాన్ని అందిస్తున్నారు. ఎలాంటి పురుగు మందులను వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువుల ద్వారానే సాగు చేస్తుండటంతో విద్యార్థులకు మంచి పౌష్టికాçహారం అందుతోంది. సంపూర్ణ ఆరోగ్యం అందించే తాజా కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేశాం. 45 రోజుల నుంచి బడిలో పండించిన కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పంచాయతీ, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం సంతోషంగా ఉంది. – పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు ఎంతో రుచికరం మా స్కూల్లో పండించిన కూరగాయలతో మధ్యాహ్న భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంది. తాజాగా ఉండడం, పురుగు మందుల వినియోగం లేకపోవడంతో వంటలు ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. ప్రతీ రోజు పాఠశాల సమయం కంటే ముందు వచ్చి కొద్ది సేపు వాటి రక్షణకు కేటాయిస్తాం. ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరం నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. –పూజ, 7వ తరగతి -
‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు
డెహ్రడూన్: కుల వివక్ష ఇప్పటికీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటన ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా సుఖిందాంగ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి అగ్రవర్ణ పిల్లలు నిరాకరించారు. దాంతో పాఠశాల బాధ్యులు ఆమెను తొలగించి మరో వివక్షాపూరిత చర్యకు పాల్పడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండి, వడ్డించే మహిళలను ఉత్తరాఖండ్‌లో ‘భోజనమాత’గా సంబోధిస్తారు. కొద్దిరోజుల కిందట ఈ బడిలో భోజనమాత పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అగ్రవర్ణ మహిళ కూడా ఇంటర్వ్యూకు వచ్చినా ఆమెను కాదని దళిత మహిళను ఎంపిక చేయడంపై పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత సదరు మహిళ వండిన ఆహారాన్ని తినడానికి పిల్లలు నిరాకరించారు. మొత్తం 66 మంది పిల్లల్లో 40 మంది పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానివేసి ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో దళిత మహిళను తొలగించి ఆమె స్థానంలో మరొకరికి తాత్కాలికంగా నియమించారు పాఠశాల బాధ్యులు. అయితే చంపావత్ జిల్లా విద్యాధికారి పి.సి.పురోహిత్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దళిత మహిళ నియామకంలో నిబంధనలను పాటించలేదని, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకుండానే సదరు మహిళను భోజనమాతగా నియమించారని పురోహిత్ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె నియామకాన్ని రద్దు చేశామని చెప్పారు. (చదవండి: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం) -
మాకొద్దు సారూ ఈ తిండి..! చారు నీళ్లలాగా.. కూరలు చారులాగా, గుడ్ల సంగతి సరేసరి..
నగరంలోని మేకలమండి ప్రభుత్వ పాఠశాలకు బుధవారం మధ్యాహ్న భోజనంలో భాగంగా, పప్పు చారు, ఉడకబెట్టిన కోడి గుడ్లు సరఫరా అయ్యాయి. విద్యార్థులు గుడ్డు పొరను తొలగించగా లోపల కుళ్లిపోయి తినడానికి పనికి రాకుండా ఉన్నాయి. దీంతో విద్యార్థులు హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. ఆయన సంబంధిత ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లగా .. మరుసటి రోజు తాజా గుడ్లు పంపిస్తామని తాపీగా సమాధానం ఇవ్వడం విస్మయానికి గురిచేసింది. సాక్షి, హైదరాబాద్: ముద్ద అన్నం... నీళ్ల పప్పుచారు.. కుళ్లిన కోడి గుడ్లు... అకలితో తినడానికి ప్రయత్నించినా.. గొంతు నుంచి ముద్ద దిగని వైనం. ఇదీ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా అవుతున్న మధ్యాహ్న భోజనం పరిస్థితి. నగరంలో మ«ధ్యాహ్న భోజనం అధ్వానంగా తయారైంది. వాటిని సరఫరా చేసే ఏజెన్సీల తీరుతో విద్యార్థుల ఆకలి తీరకపోగా అనారోగ్యం పాలవుతున్నాయి. ప్రతిస్థాయిలోనూ అవినీతి తాండవిస్తోంది. తాజాగా కుళ్లిన కోడిగుడ్లను సరఫరా వెలుగు చూడడం ఆందోళన కలిగించింది. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడటం మానవ హక్కుల ఉల్లంఘనే కాక పిల్లల ప్రాథమిక హక్కుల ఉల్లంఘించడమేనని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించి పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అమలు కావాల్సిన మధ్యాహ్నా భోజన పథకం వారికి మరింత హానికరంగా తయారైంది. చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే నాసిరకంగా మెనూ మధ్యాహ్నా భోజనం నాసిరకంగా తయారైంది. దొడ్డు బియ్యంతో వండిన అన్నం ముద్ద ముద్దగా ఉండటం. అందులోనూ రాళ్లు వస్తున్నాయి. చిన్న గుడ్డు, నాసిరకం పప్పు , చారు నీళ్లను తలపిస్తుండగా, కూరలు చారును మరిపిస్తున్నాయి. ఉడకని కూరగాయలు, రుచిపచీలేని వాటితో విద్యార్థులు తినలేకపోతున్నారు. సగం విద్యార్థులు దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను లంచ్ టైమ్‌లో ఇళ్లకు రప్పించుకోవడమో...లేదంటే క్యారేజీలు కట్టివ్వడమో చేస్తున్నారు. మరోవైపు సరఫరా అవుతున్న భోజనం కూడా విద్యార్థులకు సరిపోని పరిస్థితి. చదవండి: విద్యార్థినుల హాస్టల్.. నీడలాగ ఒక ముఖం.. వింత శబ్దాలు.. హాజరు శాతం తక్కువ పేరుతో కనీసం 25 శాతం కూడా సరఫరా జరగడం లేదని స్పష్ట మవుతోంది. దీంతో ఉదయమే పాఠశాలకు వస్తుండడం వల్ల టిఫిన్‌న్ తినలేని పిల్లలు మధ్యాహ్నం ఆకలితో తిందామన్నా అది సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. వారానికి మూడు గుడ్లు ఇవ్వాలని నిబంధన ఉన్నా... సరఫరా మాత్రం మొక్కుబడిగా తయారైంది. వారానికి ఒక్క గడ్డు పెట్టి చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తోంది. లక్షకు పైగా విద్యార్థులు హైదారాబాద్ జిల్లాలో సుమారు 690 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 1,06,676 మంది విద్య అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం హాజరుశాతం మాత్రం సగం మించనట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోంది. ఒక ఫౌండేషన్‌కు సంబంధించిన ఏజెన్సీ నగరంలోని ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. అయితే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో కమ్మక్కై సరఫరాలో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మధ్యాహ్న భోజనం ఖర్చు రోజుకు ఇలా.. ► ప్రాథమిక పాఠశాల విద్యార్థికి: రూ.4.97 పైసలు ► ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ. 7.45 పైసలు -
మధ్యాహ్న భోజన పథకానికి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత మధ్యాహ్న భోజన పథకం పేరును ‘నేషనల్ స్కీమ్ ఫర్ పీఎం పోషణ్ ఇన్ స్కూల్స్’గా మారుస్తూ మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2021–22 నుంచి 2025–26 వరకూ ఐదేళ్లపాటు పథకాన్ని కొనసాగిస్తారు. ఇందుకు కేంద్రం రూ.54,061.73 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్ల మేరకు వ్యయాన్ని భరించనున్నాయి. అలాగే ఆహార ధాన్యాల కోసం కేంద్రం రూ.45 వేల కోట్లు అదనంగా వెచ్చించనుంది. మొత్తంగా ఐదేళ్లలో పీఎం పోషణ్ పథకం అమలుకు రూ.1,30,794.90 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడ్ పాఠశాలల్లో వండి, నిత్యం ఒకపూట వేడిగా భోజనం అందించే ఈ పథకంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. గతంలో ఈ పథకం పేరు ‘నేషనల్ స్కీమ్ ఫర్ మిడ్డే మీల్ ఇన్ స్కూల్స్’గా ఉండగా ఇప్పుడు ‘నేషనల్ స్కీమ్ ఫర్ పీఎం పోషణ్ ఇన్ స్కూల్స్’గా మార్చినట్టు కేంద్రం వెల్లడించింది. 2007 వరకు ఈ పథకం పేరు ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్’ అని ఉండగా, 2007లో ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మిడ్ డే మీల్ ఇన్ స్కూల్స్’గా మార్చారు. దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల మంది విద్యార్థులకు పీఎం పోషణ్ స్కీమ్ వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.24,400 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. పిల్లలకు ‘తిథి భోజనం’ ► పీఎం పోషణ్ పథకాన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ ప్రీ–ప్రైమరీ లేదా బాల వాటికలకు కూడా వర్తింపజేయాలని కేంద్రం యోచిస్తోంది. 11.80 కోట్ల విద్యార్థులకు ఇది అదనం. ► తిథి భోజనం కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ► ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయాల్లో ప్రత్యేకమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ఉద్దేశించిన సామాజిక భాగస్వామ్య కార్యక్రమం ఈ తిథి భోజనం. ► పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తోటల పెంపకాన్ని విద్యార్థులకు పరిచయం చేయడమే దీని ఉద్దేశం. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ► అన్ని జిల్లాల్లో సామాజిక తనిఖీలు తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అనుబంధ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారు. -
‘జగనన్న గోరుముద్ద’పై కేంద్ర బృందం పరిశీలన
శ్రీకాళహస్తి రూరల్: ‘జగనన్న గోరుముద్ద’ అమలును మిడ్ డే మీల్స్ (ఎండీఎం)ను పర్యవేక్షించే కేంద్ర బృంద సభ్యులు శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. 8వ తరగతి గదిలోకి వెళ్లి యోగేష్ అనే విద్యార్థిని మధ్యాహ్నం సమయంలో రోజువారీ మెనూను తెలపాలని కోరారు. గతంలో ప్రతి పూటా అన్నం, సాంబారు మాత్రమే వేసేవారని, రెండేళ్ల నుంచి జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వం ప్రతి వారం సోమవారం అన్నం, పప్పుచారు, కోడిగుడ్డు కూర, చిక్కీ, మంగళవారం పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం వెజిటబుల్ బిర్యానీ, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ, గురువారం కిచిడీ, టమాటా చెట్నీ, ఉడికించిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకు కూరపప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ, శనివారం అన్నం, సాంబారు, తీపి పొంగల్ అందిస్తున్నారని విద్యార్థి చెప్పాడు. విద్యార్థి చెప్పిన ప్రతి మాటను కేంద్ర బృంద సభ్యులు వీడియోలో చిత్రీకరించారు. అలాగే వంటశాలను, పిల్లలు భోజనం చేస్తుండగా వీడియో తీశారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి కలకలం
సీతానగరం (పార్వతీపురం): మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా సాంబారులో బల్లి కనిపించడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదన్న వైద్యుల వివరణతో ఊపిరిపీల్చుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని గెంబలివారివీధి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా సాంబారులో చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే హెచ్ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, భోజన నిర్వాహకులు విద్యార్థులను భోజనం చేయనివ్వకుండా నిలువరించారు. ముందు జాగ్రత్తగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 27 మంది విద్యార్థులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యసేవలు అందించారు. ఆస్పత్రిలో 2 గంటల సేపు వైద్యుల సంరక్షణలో ఉంచారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించడంతో ఉపాధ్యాయులు, విద్యారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎన్వీ రమణ, ఆర్ఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ వీరబాబు పాఠశాలకు చేరుకుని వాకబు చేశారు. ఆస్పత్రి నుంచి పాఠశాలకు చేరుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటలకు టమాటా రైస్ వడ్డించారు. ఈ ఘటనపై తహసీల్దార్ మాట్లాడుతూ సాంబారులో బల్లిపడడం వాస్తవమేనని, ఉపాధ్యాయులు, నిర్వాహకులు అప్రమత్తం కావడంతో చిన్నారులకు ప్రమాదం తప్పిందన్నారు. -
ఇది మనసున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పేద, బడుగు ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచించే మనసున్న ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై గురువారం శాసనసభలో సుదీర్ఘంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏటా ఖర్చు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే అధికంగా వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గత 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని కులాల పేద ప్రజలకు వివిధ పథకాల కింద 5.65 కోట్ల మందికి రూ.77,731.32 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏటా సగటున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.15,961.2 కోట్లు వ్యయం చేస్తే తమ ప్రభుత్వం రెట్టింపు కంటే ఎక్కువగా రూ.39,153 కోట్లు వ్యయం చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అంటూ హడావుడి చేయడం ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రాజకీయాలపైనే బాబు దృష్టి ► అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు ఎలా సాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేవలం రాజకీయాలపైనే చంద్రబాబు దృష్టి సారించారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ చేపట్టినప్పుడు కూడా సూచనలు, సలహాలు ఇవ్వకుండా అబద్ధాలు మాట్లాడుతూ సభను అడ్డుకోవడం ద్వారా సస్పెండ్ అవ్వడం వరకు వెళుతున్నారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల అభ్యున్నతి, బాగు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. వీటిని ఏ విధంగా ఇంకా మెరుగు పరచాలని ఆలోచిస్తున్నాం. ఈ దిశగా ప్రతిపక్షం నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకోవాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కూడా ప్రతిపక్షం తీరు మారలేదు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో – ఇప్పుడు మన పాలనలో.. ► బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లకు కలిపి రూ.79,806 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వం వీరి కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.58,729 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారు గుర్తుకు వస్తారు. అందుకే 2019 ఫిబ్రవరిలో బీసీ సబ్ ప్లాన్ తెచ్చాడు. అప్పుడే 13 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పెన్షన్లు కూడా అంతే. ► ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబర్ 2018 వరకు పెన్షన్లు కేవలం 44 లక్షలుంటే, ఎన్నికలు వచ్చే సరికి ఆ సంఖ్యను 51 లక్షలకు పెంచారు. అంటే 7 లక్షల మందికి పెన్షన్ లేదని తెలిసినా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం 61.90 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తోంది. రిజర్వేషన్లు రాకుండా చంద్రబాబు కుట్ర ► గతంలో 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నిలు జరిగాయి. అందులో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాయి. ఎన్నికలు జరపాలని 2018 అక్టోబర్ 23న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, తనకు అనుకూలంగా లేదని చంద్రబాబు ఎన్నికలు జరపలేదు. ► మనం అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు వెళితే రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలి కదా? 59.85 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కేసు వేయించారు. దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. దేనిలోనూ చిత్తశుద్ధి లేదు ► ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బిల్లులు దాదాపు రూ.3 వేల కోట్లు బాబు బకాయిలు పెడితే, మనం చెల్లించాం. పెండింగు లేకుండా తల్లుల ఖాతాల్లో జమ చేసేలా వ్యవస్థను తీసుకువచ్చాం. ► చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లకు పైగా మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఇవ్వక పోవడంతో వారిపై రూ.3,036 కోట్ల భారం పడింది. మన ప్రభుత్వం వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 2019–20లో అక్షరాలా రూ.1,400 కోట్లు ఇచ్చాం. ► గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. కానీ మన ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా వ్యయంతో 45 వేల స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఆధునీకరిస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో క్వాలిటీ పెంచాం. పిల్లల్లో 85 శాతం మెదడు వికాసం ఆరేళ్లలోపే జరుగుతుంది. ఈ దృష్ట్యా పిల్లలు, తల్లులు, గర్భవతులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం బావుండాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ అని అమలు చేస్తున్నాం. అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారునికే ► ప్రవేశపెట్టిన ప్రతి పథకం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ చేరాలన్నది మన ప్రభుత్వ ఆలోచన. ఇందుకని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ను పెట్టాం. ఎవరైనా పథకంలో మిస్ అయితే, దరఖాస్తు తీసుకుని అర్హత ఉంటే, ఆ తర్వాత నెలలోనే ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతో చేశాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో వారే నలుగురు ఉన్నారు. 60 శాతం మంత్రి పదవులు వారికే ఇచ్చాం. అణగారిన బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీలలో విభేదాలు రాకుండా వేర్వేరుగా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ► రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలు, మండలికి ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు మైనార్టీలు, ఒకరు బీసీ ఉన్నారు. కార్పొరేషన్లు, ఆలయాల చైర్మన్లు, పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చే విధంగా చట్టాలు చేశాం. గ్రామ సచివాలయాల్లో వారికి 82 శాతం ఉద్యోగాలు దక్కాయి. ► అక్షరాలా 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 2.61లక్షల వలంటీర్ల ఉద్యోగాలు ఆ విధంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులోనూ తోడుగా.. ► మహిళా పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులో చూపాం. ప్రతి పథకంలో లబ్ధిదారులు అక్క చెల్లెమ్మలే. వైఎస్సార్ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చేలా రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, అల్లానా, హిందుస్తాన్ యూనీ లీవర్, అమూల్ వంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. రీటెయిల్ రంగంలో 77 వేల షాపులు ఏర్పాటు చేశాం. ► 4.69 లక్షల అక్క చెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెలు.. 2.49 లక్షల అక్క చెల్లెమ్మలకు మేకలు, గొర్రెల యూనిట్లు ఇస్తున్నాం. 31 లక్షల ఇళ్ల స్థలాలు నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ► మహిళల కోసం దిశ చట్టం బిల్లు తీసుకొచ్చి,, దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాం. దశలవారీ మద్య నియంత్రణ ఒక పాలసీగా అడుగులు వేశాం. 43 వేల బెల్టు షాపులు రద్దు చేశాం. వీటన్నింటి వల్ల మద్యం అమ్మకాలు తగ్గినా, ధరలు పెంచాం కాబట్టి ఆదాయం తగ్గలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే జూన్ 2019 నుంచి నవంబర్ 2020 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి 58,729 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. ఇందులో ఒక్క ఏడాదిలో వ్యయం చేసినది రూ.39,153 కోట్లు. అదే టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సగటున ఆ వర్గాల సంక్షేమానికి ఖర్చు చేసింది కేవలం రూ.15,962 కోట్లే. -
లంచ్ బెల్: మధ్యాహ్న నైవేద్యం
అక్టోబర్ 15 నుంచి దేశంలోని విద్యాలయాలను తెరుస్తున్నారు. గణ గణ ఇక గంటలు మోగుతాయి. ప్రభుత్వం ఓకే చెప్పేసింది. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా. మిడ్–డే మీల్ వండేవారు, వండాక పిల్లలకు వడ్డించే వారు శుభ్రంగా ఉండాలి. ఏప్రాన్లు, తలగుడ్డలు పెట్టుకోవాలి. చేతులకు గోళ్లు, గోళ్లకు రంగు ఉండకూడదు. అలంకరణగా పెట్టుడు గోళ్లు ఉంటే వాటిని తీసేయాలి. ఉంగరాలు పెట్టుకోకూడదు. చేతులకు గాజులు వేసుకోకూడదు. వాచీలు, అభరణాలు ఇంట్లోనే వదిలేసి రావాలి. మాసిన బట్టలు వేసుకోకూడదు. వంటపాత్రలు, వంట ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి. పిల్లలు భోజనం చేశాక ఆ ప్లేట్లను పిల్లలు కడిగినప్పటికీ పనివాళ్లు మళ్లీ కడగాలి. కడిగిన ప్లేట్లలో సబ్బు నురగ, సబ్బు పౌడర్ మరకలు కనిపించకూడదు. మిడ్–డే మీల్‌కు పని చేసేవారంతా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ల ఇంట్లో వాళ్లకూ ఎలాంటి అనారోగ్యం ఉండకూడదు. ఉంటే, వేరొకర్ని ఏర్పాటు చేసి వీళ్లు సెలవు పెట్టాలి. వీళ్లందరినీ జిల్లా, బ్లాక్ లెవల్ అధికారులు కనిపెట్టి ఉండాలి. టైమ్ టు టైమ్ కరోనా టెస్టులు చేయిస్తుండాలి. ఇవన్నీ స్కూళ్లు తెరవక ముందే కేంద్ర విద్యాశాఖ సిద్ధం చేసిపెట్టిన నియమావళిలోని మార్గదర్శక నిబంధనలు. మరికొన్ని కూడా ఉన్నాయి. పిల్లలకు వండి పెట్టే కూరగాయలను ముందుగా కొంచెం ఉప్పు, పసుపు కలిపి శుభ్రంగా కడగాలి. పిల్లలు తాగే మంచినీళ్లు కలుషితమైనవి కాకుండా జాగ్రత్త పడాలి. పిల్లలు తినే సమయానికి భోజనం కనీసం 65 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉండాలి. భోజనం చేస్తున్నప్పుడు పిల్లల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. చోటు లేకుంటే ఎవరి తరగతి గదిలోనే వారికి భోజనం ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ పెద్ద లిస్టుగా చెప్పుకోబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గైడ్ లైన్స్ లా ఉన్నాయి కానీ, గైడ్ లైన్స్ లేకున్నా మామూలుగా చేయవలసిన పనులే. ఇంట్లో అమ్మ రోజూ కేర్ తీసుకుంటుంది కదా అలాగే. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వామివారి నైవేద్యసేవగా భావిస్తే పిల్లలు సురక్షితంగా ఉంటారు. దేశ భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన జవసత్వాలు అవుతారు. -
రఘురాం అంకితభావం.. ఆదర్శం
సాక్షి, జడ్చర్ల: విధి నిర్వహణలో అంకితభావం.. దానికి తోడు సేవాదృక్పథం కలిగి ఉండటంతో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యాడు జడ్చర్ల ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ కళాశాల అధ్యాపకుడు రఘురాం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి చిత్రా రామచంద్రన్ ప్రకటించిన ఉత్తమ అధ్యాపకుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. కరోనా పరిస్థితులతో అవార్డును డీఐఓ ద్వారా నేరుగా కళాశాలకు పంపించి అందజేయనున్నారు. ఉమ్మడి జిల్లాల ఒక్కరికే అవకాశం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్కరికే వచ్చిన ఈ అవార్డు త్వరలోనే రఘురాం అందుకోనున్నారు. మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జడ్చర్ల అనంతరామయ్య 2005లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో కారుణ్య నియామకం ద్వారా ఆయన కుమారుడు రఘురాం ఎల్డీసీగా వంగూరులో ఉద్యోగంలో చేరారు. తిమ్మాజిపేటలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి 2014లో ఖిల్లాఘనపూర్ కళాశాలకు పదోన్నతిలో లెక్చరర్‌గా బదిలీపై వెళ్లారు. 2018 జూన్‌లో జడ్చర్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు బదిలీపై వచ్చారు. బదిలీపై వచ్చిన సమయంలో కళాశాలలో కేవలం 75మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 375కు చేరింది. స్పందించిన ఎమ్మెల్యే.. కో ఎడ్యుకేషన్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన అధ్యాపకుడు రఘురాం సేవలతో స్పందించిన జడ్చర్ల ఎమ్మెల్యే డా. లక్ష్మారెడ్డి ప్రభుత్వ బాలికల కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. ఆయన సొంత ఖర్చులతో భోజన వసతి కల్పించారు. మధ్యాహ్న భోజనానికి రాష్ట్రవ్యాప్త అమలుకు శ్రీకారం.. జూలై 17వ తేదిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జడ్చర్ల బొటానికల్ గార్డెన్ నిర్వాహకుడు వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.సదాశివయ్యతో కలసి సీఎం కేసీఆర్‌ను రఘురాం కలిశారు. దీంతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగున్నాయని సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న బోజనం ఆవశ్యకత ఉందని గ్రహించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయిస్తానని ప్రకటించారు. నాన్న స్ఫూర్తితోనే.. నాన్న ఆశయాల సాధనకోసమే సేవ చేయాలని తలంచాను. జడ్చర్ల కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సంకల్పించి మధ్యాహ్న భోజనం, యూనిఫాంలను ఉచితంగా అందించాను. తోటి అధ్యాపకులు, ప్రిన్సిపాల్ సహకారంతో ముందుకెళ్తున్నాం. నా సేవలకు గుర్తింపుగా వచ్చిన ఈ అవార్డు మా నాన్నకే అంకితం. – రఘురాం, గణిత అధ్యాపకుడు, జడ్చర్ల కో ఎడ్యుకేషన్ కళాశాల -
ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్‌కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలని ఆకాంక్షించారు. త్వరలోనే అన్ని కాలేజీల బోటనీ అధ్యాపకులతో సమా వేశమై గార్డెన్ల అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.. జడ్చర్ల జూనియర్ కాలేజీ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారన్న విషయం తెలిసి సీఎం వారిని అభినందించారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిస్ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రికి సదాశివయ్య బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ పాల్గొన్నారు. -
ఏ విద్యార్థీ ఆకలితో ఉండరాదు
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో ప్రభుత్వ పాఠశాలలను మూసేసిన కారణంగా ఇంటివద్ద ఏ ఒక్క విద్యార్థీ ఆకలితో ఉండరాదని ప్రభుత్వం విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ సమయంలో విద్యార్థుల భోజనానికి అవసరమైన సరుకులను పంపిణీ చేయాలని నిర్దేశించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికే పంపిణీ పూర్తయింది. తాజాగా వివిధ సంక్షేమ శాఖలకు చెందిన రెసిడెన్షియల్ స్కూళ్లలోని విద్యార్థులకు కూడా సరుకులు అందించాలనే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పంపిణీకి సిద్ధమయ్యారు. పాఠశాల విద్యాశాఖలో ఇలా.. ► పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న 45,723 స్కూళ్లలోని 36 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలలు మూతపడినప్పటి నుంచి ఏప్రిల్ 23 వరకు సరిపడేలా మధ్యాహ్న భోజనం సరుకులను ప్రభుత్వం పంపిణీ చేసింది. ► మార్చి 19 నుంచి 31వ తేదీ వరకు తొలి విడతగా 4,073 టన్నుల బియ్యం, 2,59,92,180 గుడ్లు, 1,29,96,090 చిక్కీలు అందించారు. ► ఆ తరువాత లాక్డౌన్ పొడిగింపుతో ఏప్రిల్ 23 వరకు సరిపడేలా 6,336 టన్నుల బియ్యం 5.5 కోట్ల గుడ్లు, 3,24,90,225 చిక్కీలు సరఫరా అయ్యాయి. సంక్షేమ స్కూళ్లలో ఇలా.. ► సంక్షేమ శాఖలకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలల్లోని దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు కూడా ఏప్రిల్ 23వ తేదీ వరకు సరిపడా సరుకులను అందించనున్నారు. ► పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతున్నందున ఆమేరకే సరుకులు ఇచ్చారు. సంక్షేమ శాఖలు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మూడుపూటలా ఆహారాన్ని అందిస్తున్నందున ఆమేరకు అదనంగా సరుకులు ఇవ్వనున్నారు. ► వీరికి 7,414 టన్నుల బియ్యం, 1,80,49,380 గుడ్లు, 1,68,46,088 చిక్కీలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు గ్రామాల్లోనే సరుకుల పంపిణీ.. విద్యాశాఖ పరిధిలో చదువుతున్న విద్యార్థులే కాకుండా వివిధ సంక్షేమ శాఖల పాఠశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) విభాగం ద్వారా ఏర్పాట్లు చేస్తున్నాం. లాక్డౌన్ వల్ల గుడ్లు, చిక్కీల సరఫరాలో సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తున్నాం. విద్యార్థులకు వారి గ్రామాల్లోనే సరుకులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. టీచర్లు, వలంటీర్ల సహకారంతో విద్యార్థులకు సకాలంలో వీటిని అందించేలా అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. –చిట్టూరి శ్రీధర్, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ -
ఏప్రిల్ నెలకూ ‘జగనన్న గోరుముద్ద’
గుంటూరు ఎడ్యుకేషన్: కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థంగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించడం లేదు. లాక్‌డౌన్‌తో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులివ్వడంతో ఇళ్లకే పరిమితమైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా బియ్యం, కోడిగుడ్లు, చిక్కీని వారి ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో మార్చి 19 నుంచి 31 వరకూ తొమ్మిది పని దినాలకుగాను రాష్ట్రవ్యాప్తంగా 45,753 ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 37 లక్షల మంది విద్యార్థులకు బియ్యం, కోడిగుడ్లు, చిక్కీని అందజేసింది. ఇప్పుడు రెండో దశ కార్యక్రమాన్ని అమలు పర్చేందుకు నిర్ణయించింది. - ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 14 వరకూ తొమ్మిది రోజుల పాటు పాఠశాలల పనిదినాలను లెక్కించి ఆ మేరకు ఇళ్లలో ఉంటున్న విద్యార్థులకు సరుకుల పంపిణీకి శనివారం ఉత్తర్వులిచ్చింది. - ఏప్రిల్ 14 తర్వాత పాఠశాలలను తెరవకుంటే విద్యాసంవత్సరం చివరి రోజైన 23 వరకూ పరిగణనలోకి తీసుకుని మొత్తం 17 రోజులకు సరుకులు సరఫరా చేయనున్నట్టు రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్ కె.రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభిస్తామన్నారు. - ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కేజీ 700 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 2 కేజీల 550 గ్రాముల చొప్పున బియ్యం అందిస్తారు. - ఒక్కో విద్యార్థికి తొమ్మిది చిక్కీలు, 17 చొప్పున కోడిగుడ్లు ఇస్తారు. - గ్రామ, వార్డు వలంటీర్లు, సిబ్బంది ద్వారా విద్యార్థుల ఇంటికి వెళ్లిమరీ వీటిని పంపిణీ చేయనున్నారు. - పంపిణీ సమయంలో సామాజిక దూరం పాటించాలని ఎంఈవోలు, హెచ్ఎంలు, వలంటీర్లకు రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. -
విద్యార్థుల ఇంటికే మధ్యాహ్న భోజనం సరుకులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పొందుతున్న విద్యార్థులకు ఇక ఇంటికే మధాహ్న భోజనం అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆదేశాలను జారీచేసింది. వాటికనుగుణంగా చేపట్టాల్సి న చర్యలపై విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపా దనలను పంపింది. విద్యార్థులకు బియ్యం, కూరగాయలు, నూనెలు, కోడిగుడ్లకు సం బంధించిన వాటిని గ్రామ పంచాయతీల ద్వారా సరఫరా చేయాలని భావిస్తోంది. అది సాధ్యం కాని పరిస్థితుల్లో వాటికి వెచ్చించే మొ త్తం డబ్బును పాఠశాలలు మూసివేసిన రోజులకు లెక్కిం చి విద్యార్థులకు అందజేయాలని భావిస్తోంది. అయితే విద్యాశాఖ పంపి న ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 11,37,547 మంది, 6 నుంచి 8వ తరగతి వరకు 6,58,409 మంది, 9, 10 తరగతుల విద్యార్థులు 4,77,087 మంది ఉన్నారు. వారందరికి ఒక్కొక్కరికి ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు. ప్రస్తుతం విద్యార్థులపై వెచ్చిస్తున్నదిదే.. 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు రోజు 100 గ్రాముల బియ్యం, 6 నుంచి పదో తరగ తి వరకున్న విద్యార్థులకు 150 గ్రాముల బి య్యం ఇవ్వనున్నారు. వాటిని ఈనెల 16 నుంచి 31 వరకు లెక్కించి మొత్తంగా ఒక్కో విద్యార్థికి అందించనున్నారు. లేదా అం దుకు సమానంగా డబ్బులు చెల్లించనున్నారు. అలాగే ప్రాథమిక పాఠశా లల్లో భోజనం వండి పెట్టేందుకు అవసరమైన కూరగాయలు, వంట నూనెల కింద మధ్యాహ్న భోజనం కార్మికులకు ఒక్కో విద్యార్థిపై చెల్లిస్తున్న రూ.4.48, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై చెల్లిస్తున్న రూ.6.71లను ఒక్కో విద్యార్థికి లెక్కించి అందజేస్తారు. అలాగే వారికి మూడు రోజులకు ఒకటి చొప్పున కోడి గుడ్లు అందించేందుకు ఒక్కో గుడ్డుకు రూ. 4 చొప్పున లెక్కించి అందజేయనున్నారు. -
జగనన్న గోరుముద్ద పథకం పై సర్వత్రా హర్షం
-
బడికి రా..రమ్మంటున్న గోరుముద్ద..
-
మధ్యాహ్న భోజనంలో.. కొత్త రుచులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూ కొత్త రుచులు సందడి చేయనున్నాయి. మారిన ఈ కొత్త మెనూ మంగళవారం నుంచి అమల్లోకి రానుండడంతో విద్యార్థిలోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారంతోపాటు శుచి, శుభ్రతతో ఉండాలన్న లక్ష్యంతో ఆçహార పట్టికలో పలు మార్పులు చేశారని అధికారులు చెబుతున్నారు. ఐదు రోజులు గుడ్డుతోపాటు మూడు రోజులు బెల్లం, వేరుసెనగ, చక్కీలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితోపాటు రోజూ ఒక్కోరకం రుచులు వడ్డించేలా ఆహార పట్టిక రూపొందించారు. జిల్లా, మండల స్ధాయిలో కొత్త మెనూపై అధికారులు ఇప్పటికే వర్క్‌షాపు నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 2,961, ప్రాథమికోన్నత 376, ఉన్నత పాఠశాలలు 581 వరకూ ఉన్నాయి. వీటిలో 3,89,565 వేల మంది విద్యార్థుల వరకూ విద్యను అభ్యసిస్తున్నారు. కొత్తగా అందించే చిక్కీకి కిలోకు రూ.135 చొప్పున నిర్వహకులకు చెల్లించనున్నారు. ప్రతి విద్యార్థికీ 25 గ్రాముల చొప్పున చక్కీ ఇవ్వనున్నారు. దశల వారీగా మార్పులు... ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం 2003–04వ సంవత్సరంలో ఆరంభమైంది. మొదట్లో అన్నంతోపాటు సాంబారు లేదా పప్పు వడ్డించేవారు. తర్వాత చట్నీ మరి కొన్ని రోజులు కూర జత చేశారు. క్రమేణా పప్పు, సాంబారుతో పాటు కూర, వారానికో గుడ్డు, తరువాత రెండు ఇలా మార్పులు చేస్తూ వచ్చారు. తాజాగా వారానికి ఐదు గుడ్లు ఇవ్వాలన్నది జగన్ ప్రభుత్వ నిర్ణయం. అంతేగాక వంట తయారీ చేసే ఏజెన్సీ వాళ్లకు గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచి వారి డిమాండ్ నేరవేర్చారు. ప్రతి విద్యార్థీ తినాలి... ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోవడానికి సమయం లేక బాక్సు తెచ్చుకుంటున్నారు. ఆ పద్ధతికి స్వస్తి పలికి ప్రస్తుత ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి విద్యార్థీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎస్.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి -
మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ వద్దు
ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం. నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజన పథకం కోసం ఏటా రూ.1,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆయాలకు రూ.3 వేల వేతనం, సరుకుల ఖర్చులకు గ్రీన్ చానల్లో ఎప్పటికప్పుడు చెల్లింపులు ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో నాణ్యత ఒకేలా ఉండాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘మధ్యాహ్న భోజనం నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దు. అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన నాణ్యత ఉండాలి. ఎక్కడ తిన్నా రుచి ఒకేలా ఉండాల్సిందే. పులివెందులలో తిన్నా.. అమరావతిలో తిన్నా రుచి మారకూడదు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నాణ్యత కోసం నాలుగు అంచెల విధానంలో తనిఖీలు ఉండాలని సూచించారు. పౌష్టికాహారంతో కూడిన మెనూతో మధ్యాహ్న భోజనం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాణ్యత తనిఖీతో పాటు ఫీడ్ బ్యాక్ కోసం పాఠశాల స్థాయిలో పేరెంట్స్ కమిటీలో ముగ్గురు తల్లులను నియమించాలని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కూడా కమిటీలో చోటు కల్పించాలన్నారు. పేరెంట్స్ కమిటీ పిల్లలతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ కమిటీ నాడు – నేడు, పారిశుధ్యాన్ని కూడా పరిశీలించాలన్నారు. తనిఖీల పర్యవేక్షణ బాధ్యతలు ఆర్డీఓకు అప్పగించాలని, క్వాలిటీతో పాటు ఫుడ్ సేఫ్టీపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాణ్యత కోసం నాలుగంచెల తనిఖీలు ఇలా.. 1. పేరెంట్స్ కమిటీ పిల్లలతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలి. 2. గ్రామ సచివాలయాల ద్వారా తనిఖీలు నిర్వహించాలి. 3. పొదుపు సంఘాలతో తనిఖీ చేయించాలి. 4. సెర్ప్ లేదా మరో సంస్థ ద్వారా తనిఖీ చేపట్టాలి. ప్రత్యేకంగా మొబైల్ యాప్ మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ యాప్ పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం దీనిని మెనూ పరిశీలన కోసం ఉపయోగిస్తామని వివరించారు. ఆహార నాణ్యత తనిఖీ కోసం ఉపయోగించే దిశగా కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. నాణ్యత తనిఖీల పర్యవేక్షణకు వాడితే బాగుంటుందన్నారు. డివిజనల్ స్థాయిలో గుడ్ల సరఫరాకు టెండర్లు గుడ్లు సరఫరా చేయడానికి డివిజనల్ స్థాయిలో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని అధికారులు వివరించారు. రివర్స్ టెండరింగ్‌లో పౌల్ట్రీఫారం యజమానులు ఎవరైనా పాల్గొనేలా నిబంధనలు ఉండాలని సీఎం సూచించారు. నేరుగా పౌల్ట్రీ యజమానులే టెండరింగ్‌లో పాల్గొంటే ధర రీజనబుల్‌గా ఉంటుందన్నారు. చిక్కీ (వేరుశనగ, బెల్లంతో తయారయ్యే పదార్థం) సరఫరాకు స్వయం సహాయక సంఘాల సహాయం తీసుకోవాలని, నాణ్యత పాటించాలని సీఎం సూచించారు. చిక్కీ తయారీలో వారికి తగిన శిక్షణ ఇస్తామని అధికారులు వివరించారు. ‘నాడు–నేడు’ వేగవంతం కావాలి నాడు–నేడు కార్యక్రమం చాలా ముఖ్యమైనదని, ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, రివాల్వింగ్ ఫండ్ వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద స్కూళ్లలో పెయింటింగ్, డిజైన్స్, తదితరాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. దీని కోసం రెండు, మూడు డిజైన్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు వివరించగా.. రెండు మూడు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ కింద ఫర్నిచర్, పెయింట్స్, బాత్రూం ఫిట్టింగ్స్, ఫ్యాన్లు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. కాగా, సమీక్ష అనంతరం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 45 వేలకు పైగా పాఠశాలల్లో 21 నుంచి మధ్యాహ్న భోజనంలో నూతన మెనూ అమలు చేస్తామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణపై కూడా శ్రద్ధ పెడతామన్నారు. అమ్మఒడి కింద రూ.6,028.98 కోట్లు పంపిణీ జగనన్న అమ్మఒడి పథకం కింద 42,32,098 మంది లబ్ధిదారులు ఎంపికవ్వగా, ఇప్పటి వరకు 40,19,323 మంది తల్లులకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.6,028.98 కోట్ల నగదు బదిలీ అయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశీలనలో ఇంకా 2,12,775 మంది లబ్ధిదారులున్నారని చెప్పారు. ఈ పథకం విద్యా శాఖలో అత్యంత ప్రతిష్టాత్మకం అని, పిల్లలను బడికి పంపిస్తే మేలు జరుగుతుందన్న భరోసా ప్రజల్లో కల్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆ తర్వాత ఇంగ్లిష్ మీడియం, నాడు – నేడు కార్యక్రమాలని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం మీద సెల్ఫ్ ఎసెస్మెంట్ యాప్‌ను వర్కవుట్ చేస్తున్నామని, వారంలో తుది రూపు వస్తుందని అధికారులు వివరించారు. ఈ నెల 21న ఆయా పాఠశాలల్లో జరిగే సమావేశంలో మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాల పారిశుధ్య నిర్వహణ గురించి కూడా వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకునే బాధ్యత కమిటీలకు కూడా ఉందని, వారి పిల్లలు చదివే స్కూల్స్ శుభ్రంగా ఉండాలనే భావన ఉండాలని సీఎం అన్నారు. -
మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూ
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈనెల 21 నుంచి నూతన మెనూ అమలవుతుందని వెల్లడించారు. అన్నిచోట్ల ఒకే రకమైన నాణ్యత, రుచి ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నాలుగు అంచెలుగా తనిఖీలు ఉంటాయని మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల కమిటీ, గ్రామ సచివాలయ సిబ్బంది, సెర్ప్ నుంచి తనిఖీలు ఉంటాయని అన్నారు. నాడు-నేడు, జగనన్న మధ్యాహ్న భోజన పథకం, మౌలిక వసతుల కల్పన ప్రతిష్టాత్మకంగా చేపడుతామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పులిహోరా,కిచిడి, వేరుశనగ చిక్కీ, గుడ్డు వంటి పౌష్టికాహారం అందిస్తామని మంత్రి అన్నారు. -
మధ్యాహ్న భోజన పథకంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష ప్రారంభించారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరగైన మధ్యాహ్న భోజనాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు భోజన మెనూలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఇక సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం జగన్ ఈనెల 9న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతీ పేద విద్యార్థి తల్లికి ఏటా రూ.15 వేలు ప్రభుత్వం అందిస్తుంది. (చదవండి : అమ్మఒడి.. విద్యా విప్లవానికి నాంది) -
సంతృప్తికర స్థాయిలో అమ్మఒడి
పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం ప్రవేశ పెడుతున్నందున తొలి ఏడాది స్ఫూర్తి నింపేలా 75 శాతం హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75 శాతం హాజరు నిబంధన పాటించాల్సిందేనని పిల్లల తల్లిదండ్రులకు తెలియజెప్పాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో అమ్మ ఒడి పథకం అందాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నిబంధనలంటూ ఇబ్బంది పెట్టకుండా వాస్తవాలను పరిశీలించాలని చెప్పారు. అమ్మ ఒడి, నాడు–నేడు కార్యక్రమం, మధ్యాహ్న భోజనం పథకంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తొలి ఏడాదిలో ‘అమ్మ ఒడి’ పథకానికి సంబంధించి 75 శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనాథ పిల్లలకు సంబంధించి ‘అమ్మ ఒడి’ డబ్బును సగం అనాథాశ్రమానికి, మిగతా సగం పిల్లల పేరు మీద డిపాజిట్ చేయాలన్నారు. కొన్ని కుటుంబాల్లో విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు ఉందని, ఇందులో ఉమ్మడి కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని క్షేత్ర స్థాయి నుంచి వినతులు వస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి రీ వెరిఫికేషన్ చేయించి, అర్హులైన వారికి తప్పనిసరిగా ఈ పథకం వర్తింప చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో తప్పుల కారణంగా కొందరికి లేని భూమిని ఉన్నట్టుగా చూపిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వెంటనే పరిశీలించి అర్హులుగా గుర్తించాలని చెప్పారు. ఈ పథకం కింద సుమారు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు వివరించారు. టెక్టŠస్ బుక్స్, యూనిఫారాల పంపిణీ ఆలస్యం కాకూడదు స్కూళ్లు తెరిచే నాటికి పాఠశాలల పిల్లలకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్కూల్ కిట్‌లో భాగంగా మూడు జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, ఒక జత షూ, సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి ఆరు తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంలో భాగంగా ఉపా«ధ్యాయులకు ఇస్తున్న శిక్షణ గురించి అధికారులు సీఎంకు వివరించారు. స్వయం శిక్షణ కోసం వెంటనే యాప్స్ కూడా తయారు చేయించాలని సీఎం సూచించారు. నాడు–నేడు కింద అన్ని వసతులు కల్పించాలి ప్రభుత్వం చేపడుతున్న నాడు–నేడు పనుల్లో నాణ్యతలో రాజీ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో పిల్లలకు మంచి బాత్రూములు ఏర్పాటు చేయాలని, నాణ్యమైన బెడ్లు, అల్మారాలు, చదువుకునేందుకు టేబుల్స్ ఉండాలని స్పష్టం చేశారు. మొదటి దశలో 15,715 పాఠశాల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇవి జనవరి 15 నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. రెండు, మూడు దశల్లో స్కూళ్లు, హాస్టళ్లు, అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో చేపట్టాల్సిన పనులపై ఈ నెలాఖరు నాటికి ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు. మరింత నాణ్యతతో మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యతతో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి గత సమీక్షా సమావేశాల్లో సీఎం ఆదేశాల మేరకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. మెనూలో తీసుకు వస్తున్న మార్పుల గురించి చెప్పారు. మధ్యాహ్న పథకంలో నాణ్యత పెంచడం కోసం రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆహారాన్ని నాణ్యంగా వండటానికి ఆయాలకు రూ.3 వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నామన్నారు. దీంతో మొత్తంగా నాణ్యత పెంచేందుకు రూ.343.55 కోట్లు అదనంగా ఖర్చు అవుతోందన్నారు. ఈ పథకం కోసం మొత్తం రూ.1,294 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, ఈనెలలో సంక్రాంతి సెలవుల అనంతరం స్కూళ్లు ప్రారంభమయ్యే రోజు నుంచి నాణ్యమైన మెనూ అమల్లోకి రానుంది. ఇక మధ్యాహ్న భోజనం మెనూ ఇలా.. సోమవారం : అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, చిక్కి మంగళవారం : పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు బుధవారం : కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు శుక్రవారం: అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి శనివారం : అన్నం, సాంబారు, స్వీట్ పొంగలి -
మధ్యాహ్న భోజనం.. వెరీ ‘గుడ్డు’
సాక్షి, విశాఖపట్నం : మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల సరఫరాలో పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు మధ్యాహ్న భోజనంతోపాటు నాణ్యమైన కోడిగుడ్డు అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలన్నింటినీ రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్ర వాతావరణంలో రుచిగా అందించడంతోపాటు నాణ్యతని పరిశీలించేందుకు శాస్త్రీయ పద్ధతులు అవలంబించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విమర్శలకు చెక్ చెప్పేందుకు యత్నం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ఇప్పటికీ అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చెయ్యడం లేదనీ, రుచిపచీ లేకుండా పిల్లలకు భోజనం పెడుతున్నారనీ, ఉడకని అన్నం, నీళ్ల చారు అందిస్తున్నారంటూ ఎక్కడో ఒక చోట నిత్యం ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతోపాటు అందించే గుడ్లు కూడా నాణ్యమైనవి కావనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ చెప్పేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించడంతోపాటు నిర్వాహకులకు డ్రెస్ కోడ్ ఉండాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీంతోపాటు నాణ్యతని పరిశీలించేందుకు మైక్రో స్కోప్‌లని వినియోగించాలని సూచించింది. తాజాగా భోజనంలో అందించే గుడ్లు కూడా నాణ్యమైనవి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీలకు మేలు జరిగేలా.. ఇప్పటిదాకా కోడిగుడ్ల టెండర్ల దాఖలు అర్హతలో రకరకాల నిబంధనలు ఉండేవి. బడా వ్యాపార వేత్తలు మాత్రమే టెండర్లలో పాల్గొనేవారు. నిజమైన పౌల్ట్రీ ఫాం నిర్వాహకులు, రైతులు టెండర్లలో పాల్గొనేందుకు వీలుండేది కాదు. ఈ ప్రక్రియలో అనేక లోపాలున్నాయని, రవాణా ఖర్చులు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత విధానంలో కొనుగోలు చేయడం ద్వారా ప్రతి కోడిగుడ్డుకు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. వీటన్నింటినీ పరిశీలించిన ముఖ్యమంత్రి లోపభూయిష్టమైన అంశాలను సవరించి సన్నకారు రైతులు కూడా కోడిగుడ్ల సరఫరాలో పాల్గొనే విధంగా చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో రైతుల నుంచే కోడిగుడ్లు సరఫరా చేస్తున్నామని డీఈవో లింగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తాజాగా కోడిగుడ్ల సరఫరాలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ నుంచి వెలువడే ఉత్తర్వులు మేరకే తదుపరి కార్యచరణ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యా డివిజన్ యూనిట్‌గా టెండర్లు జిల్లాలో 5,397 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1 నుంచి పదో తరగతి వరకూ 6,48,162 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మంచి భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారానికోసారి స్కూళ్లకు గుడ్లు సరఫరా చేయాలనే నిబంధన దాదాపు ఎక్కడా అమలు కావడం లేదనే విమర్శలు ఎదురవుతున్నాయి. అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. కోడిగుడ్ల సరఫరాపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సైజు, నాణ్యత, సరఫరాపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా యూనిట్‌గా కాకుండా విద్యా డివిజన్ యూనిట్‌గా టెండర్లు అప్పగించేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సరఫరా చేస్తున్న గుడ్డు కనీసం 50 గ్రాముల బరువు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఏజెన్సీల ఎంపికలో రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లా యూనిట్‌గా కాకుండా డివిజన్ యూనిట్‌గా ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో నాలుగు (విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు) విద్యా డివిజన్లు ఉన్నాయి. ఇందుకోసం డివిజన్‌కో టెండర్ ప్రొక్యూర్మెంట్ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీకి జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఐసీడీఎస్ నుంచి ఒకరు, డిప్యూటీ డీఈఓ, ఒక ఎంఈఓ, హెచ్ఎం (ఆయా డివిజన్లలో డీఈఓ నియమిస్తారు), రవాణా శాఖ నుంచి ఒకరు (జేసీ నియమిస్తారు) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏజెన్సీలను ఖరారు చేయనుంది. అయితే ఏజెన్సీలకు అర్హత, ఇతర విధివిధానాలు రావాల్సి ఉంది. -
గుడ్డు కట్.. కడుపు నిండట్లే
సాక్షి, నల్లగొండ : మధ్యాహ్న భోజనం సగంతోని సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం 150 గ్రాములు మాత్రమే ఇస్తుంది. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అది సరిపోని పరిస్థితి. దానికి తోడు ఉదయమే పాఠశాలకు వస్తుండడం వల్ల టిఫిన్ తినలేని పిల్లలు మధ్యాహ్నం ఆకలితో తిందామన్నా అది సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. వారానికి మూడు గుడ్లు పెట్టాల్సి ఉన్నా కొన్ని చోట్ల చిన్న అరటిపండుతోనే సరిపెడుతుండగా మరికొన్ని చోట్ల వారానికి ఒక్క గుడ్డే పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. బియ్యం కొన్ని చోట్ల మంచిగా ఉంటుండగా మరికొన్ని చోట్ల రావడం లేదు. వండిన అన్నం ముద్ద అవుతుంది. చారు నీళ్లను తలపిస్తే, కూరలు చారును తలపిస్తున్నాయి. రుచిపచిలేని వాటితో విద్యార్థులు తినలేకపోతున్నారు. జిల్లాలో మొత్తం 1,462 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలోనే భోజనం పెడుతున్నారు. మొత్తం 1,05,020 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ఇందులో ఇందులో 1 నుంచి 5వ తరగతి వరకు 54,286, 6 నుంచి 8వ తరగతి వరకు 28,944, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు 21,790 మంది ఉన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రతి విద్యార్థికీ 150 గ్రాముల భోజనాన్ని అందిస్తున్నారు. వారానికి మూడు కోడిగుడ్లు అందించాలి. అయితే బియ్యం ప్రభుత్వమే ఇస్తుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఒక్కంటికి రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కంటికి రూ.6.51 ప్రభుత్వం మధ్యాహ్నం వంట నిర్వహకులకు చెల్లిస్తుంది. గుడ్డుకు అదనంగా రూ.4 చెల్లిస్తారు. ఈ డబ్బులతో కూర, చారు, గుడ్డు పెట్టాల్సి ఉంటుంది. అయితే గౌరవ వేతనం కింద వారికి ప్రతి నెలా రూ.వెయ్యి ఇస్తారు. ప్రతి పాఠశాలకు ఒక వంట మనిషి, అసిస్టెంట్ ఉంటారు. ప్రధాన సమస్యలు ఇవీ.. ► వంటగదులు లేవు. ► ఉప్పునీటితోనే బియ్యం కడుగుతున్నారు. దీంతో అన్నం పచ్చగా అవుతోంది. ► తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇంటివద్దనుంచి బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు. ► నీళ్లచారు, అన్నంలో పురుగులు ► కూరగాయలు సరిగా ఉడకడం లేదు. వారం మెనూ ► సోమవారం కూరగాయలు, గుడ్డు, చారు మంగళవారం పప్పు, ఆకుకూరలు, చారు ► బుధవారం గుడ్డు, కూరగాయలు, చారు ► గురువారం సాంబారు, కూరగాయలు ► శుక్రవారం గుడ్డు, పప్పుతో కూరగాయలు ► శనివారం వెజిటేబుల్ బిర్యాని ప్రతి విద్యార్థికి అందజేయాల్సిన మెనూ ఇలా.. ఆహార పదార్థాలు 1–5తరగతి 6–10తరగతి వరకు బియ్యం 10గ్రాములు 150గ్రాములు ఆయిల్ 5గ్రాములు 7.5గ్రాములు పప్పు 20గ్రాములు 30గ్రాములు కూరగాయలు 50గ్రాములు 75గ్రాములు -
విద్యార్థుల భోజనంలో చచ్చిన ఎలుక
లక్నో : ఉత్తరప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం మరోసారి అభాసుపాలైంది. విద్యార్థులకు పెట్టే భోజనంలో ఎలుక రావడం కలకలం రేపింది. ఈ ఆహారం తిన్న తొమ్మిది మంది విద్యార్థులతో పాటు ఓ టీచర్ కూడా అస్వస్థతకు గురయ్యారు. తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతుండటంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు... ముజఫర్‌నగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఆరో, ఎనిమిదో తరగతి విద్యార్థులకు మంగళవారం ఆహారం వడ్డించారు. అయితే అది తిన్న కాసేపటి తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. భోజనం పాత్రను పరిశీలించగా అందులో ఎలుక చనిపోయి ఉంది. దీంతో వెంటనే విద్యార్థులను, ఓ టీచర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ భోజనాన్ని హాపూర్‌కు చెందిన జన్ కల్యాణ్ సంస్థా కమిటీ అనే ఎన్జీవో తయారు చేసినట్లు సమాచారం.(చదవండి: లీటరు పాలు.. బకెట్ నీళ్లు..) ఇక ఈ ఘటనపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అయితే ఈ విషయం తన దృష్టికి రావడంతో ముజఫర్ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. కాగా యూపీలో మధ్యాహ్న భోజన పథకంలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం యూపీలోని మీర్జాపూర్లో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రోజూ రోటీ- ఉప్పు, అన్నం- ఉప్పు పెడుతున్న విషయాన్ని ఓ జర్నలిస్టు వెలుగులోకి తీసుకువచ్చారు. అదే విధంగా సోనభద్ర జిల్లాలోని పాఠశాలలో నవంబరు 29న లీటరు పాలల్లో బకెట్ నీళ్లు కలిపి విద్యార్థులకు అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలైంది. -
లీటరు పాలు..81 మంది విద్యార్థులకు
సోన్‌భద్ర: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ఎంత దారుణంగా అమలవుతుందో తెలిపే ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా చోపన్ బ్లాక్‌లోని కోటా గ్రామ పంచాయతీలో ఈ ఘటన ఇటీవల చోటుచేసుకుంది. సలాయి బన్వా ప్రాథ మిక పాఠశాలలో 81 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి రోజూ మధ్యాహ్నం గ్లాసు పాలు అందించాల్సి ఉంటుంది. పాఠశాల నిర్వాహకుడు (శిక్షామిత్ర)మాత్రం లీటరు పాలు తెప్పించి, వాటిని బకెట్ నీళ్లలో కలిపి ఒక్కో విద్యార్థికి అరగ్లాసు చొప్పున అందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగన్ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల నుంచి వివరాలను తెలుసుకుని ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంతోపాటు అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, మిర్జాపూర్ జిల్లా సియూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఒక మహిళ రొట్టెలు, మరో మహిళ ఉప్పు పంచుతున్న వీడియో ఒకటి ఆగస్టులో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా అధికారులు అప్పట్లో హడావుడి చేశారు. -
లీటరు పాలు.. బకెట్ నీళ్లు..
లక్నో : ప్రభుత్వ పాఠశాలకు పంపితే చదువుతో పాటు.. మధ్యాహ్న భోజన పథకం ద్వారా తమ పిల్లల కడుపు కూడా నిండుతుందని ఆశపడే నిరుపేదలు కోకొల్లలు. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఈ పథకానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే వాటి ఫలాలు మాత్రం విద్యార్థులకు అందడం లేదని మరోసారి రుజువైంది. లీటరు పాలల్లో బకెట్ నీళ్లు కలిపి విద్యార్థులకు అందిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాలు... మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా బుధవారం విద్యార్థులకు పాలు పంపిణీ చేస్తున్న సమయంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఒకరు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పెద్ద అల్యూమినియం పాత్రలో వేడి నీళ్లలో లీటరు పాలు కలిపి దాదాపు 81 మంది పిల్లలకు ఇవ్వడాన్ని గమనించారు. ఈ తతంగాన్నంతా వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై స్పందించిన అధికారులు.. తమ వద్ద పాలు పంపిణీ చేయడానికి గేదెలు, ఆవులు లేవని పేర్కొన్నారు. పాల ప్యాకెట్ల సరఫరా ఆలస్యమైన కారణంగానే తప్పిదం జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదే రోజు మళ్లీ పిల్లలందరికీ సరిపడా పాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇక విద్యార్థులకు నీళ్ల పాలు పోసిన విషయం గురించి వంటమనిషి మాట్లాడుతూ... తనకు కేవలం ఒక ప్యాకెట్ పాలు మాత్రమే ఇచ్చారని.. అందుకే వాటిని అందరికీ సమానంగా పంచేందుకు నీళ్లు పోయాల్సివచ్చిందని పేర్కొంది. కాగా రెండు నెలల క్రితం యూపీలోని మీర్జాపూర్లో గల ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులకు రోజూ రోటీ- ఉప్పు, అన్నం- ఉప్పు పెడుతున్న విషయాన్ని ఓ జర్నలిస్టు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. . ఈ క్రమంలో ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే అతడు కుట్ర పన్నాడంటూ పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. -
నిర్లక్ష్యాన్ని సహించబోం
బోధనలో నిర్లక్ష్యం వహించినా, మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోయినా సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన రాప్తాడులో ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు చెప్పలేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బోధన విధానం బాగోలేదన్నారు. సాక్షి, రాప్తాడు : విద్యా బోధనలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం రాప్తాడు ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరుపట్టిక, మధ్యాహ్న భోజన వివరాలు పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సమాధానం చెప్పలేక తడబడ్డారు. మరి కొంతమంది విద్యార్థులను సైన్సు, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టులలో ప్రశ్నలు అడగడంతో వారు కూడా చెప్పలేకపోయారు. ఉపాధ్యాయుల బోధన తీరు బాగలేదంటూ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు విషయంలో ఎవరు అశ్రద్ధ చేసినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉత్సుకత, ప్రేరణ కలిగించేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో ఆలోచన, పరిశీలనాశక్తి పెగిగేలా సైన్సు ఎగ్జిబిషన్లు, క్విజ్ పోటీలు, ప్రయోగాలు నిర్వహించేలా చూడాలని డీఈఓ శామ్యూల్‌కు సూచించారు. విద్యార్థులు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రీడీంగ్, రైటింగ్, కమ్యూనికేష్‌న్స్ స్కిల్స్‌లో ప్రావీణ్యత సాధించాలన్నారు. భోజనం రుచిగా లేకపోతే చర్యలు మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సాంబారులో ప్రతి 30 మందికి కేజీ చొప్పున ఆరు కేజీలు కంది పప్పు వాడాల్సి ఉండగా ఐదు కేజీలే వాడినట్లు తెలుసుకున్న కలెక్టర్ సదరు ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంబారులో కూడా కాయగూరలు తక్కువగా ఉన్నాయన్నారు. మరొకసారి పాఠశాలను తనిఖీ చేస్తానని, ఆ రోజు ఇదే విధంగా మధ్యాహ్న భోజనం ఉంటే ఏజెన్సీని బాధ్యతల నుంచి తప్పిస్తామని స్పష్టం చేశారు. మెనూ ప్రకారం భోజనం ఉండేలా పర్యవేక్షించాలని హెచ్ఎం నరసింహులును ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రామాంజనరెడ్డి పాల్గొన్నారు. -
పిల్లలకిస్తోన్న భోజనాన్ని ప్రశ్నించడం నేరమా?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం పిల్లలు ఓ రొట్టెముక్కను ఉప్పులో నంజుకుని తింటున్న వీడియో ఒకటి ఇటీవల మీడియాలో హల్చల్ చేసింది. ఇది ఆ ఒక్క రోజు కనిపించిన దశ్యం కాదని, ఎప్పుడూ జరిగేదేనని ఆ దశ్యాన్ని వీడియో తీసిన హిందీ వార్తా పత్రిక ‘జనసంఘర్ష్ టైమ్స్’ జర్నలిస్ట్ పవన్ జైస్వాల్ తెలిపారు. ఈ వీడియో వార్తా కథనంపై తక్షణమే స్పందించిన మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ దార్యాప్తు జరిపి ఆ పాఠశాల అధికారులను సస్పెండ్ చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఆదిత్యనాథ్ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా గత ఆదివారం నాడు యూపీ పోలీసులు జర్నలిస్ట్ పవన్ జైస్వాల్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వీడియో కథనం వెనక ఆయన నేరపూరిత కుట్రపన్నారంటూ ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. పాఠశాల ఉన్న సియూర్ గ్రామ పెద్ద ప్రతినిధి అయిన రాజ్‌కుమార్ పాల్‌తోపాటు ఓ గుర్తుతెలియని వ్యక్తిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో రోటి, సోయాబీన్, ఇతర కూరగాయలు, లేదా రోటి, దాల్ లేదా పలావును తప్పనిసరిగా సర్వ్ చేయాలంటూ యూపీ ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలను సూచించింది. ప్రతి రోజు 450 గ్రాముల క్యాలరీలు, 12 గ్రాముల ప్రొటీన్లు విధిగా ఉండాలని కూడా నిర్దేశించింది. యూపీలో బడి పిల్లలు పౌష్టికాహార లోపంతో ఎక్కువగా బాధ పడుతున్నందున ఆహారం విషయంలో మార్గదర్శకాలు అవసరం అయ్యాయి. భారత దేశం మొత్తం మీద 4.66 కోట్ల మంది ఐదేళ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని, ఈ విషయంలో భారత్ ప్రపంచంలోనే దిగువ నుంచి మూడో స్థానంలో ఉందని 2018లో విడుదలైన ‘ప్రపంచ న్యూట్రిషన్ రిపోర్ట్’ తెలియజేస్తోంది. బడి పిల్లల్లో పోష్టికాహార లోపాన్ని సరిదిద్ది వారిని అంటు రోగాల బారిన పడకుండా నిరోధించడంతోపాటు వారిని పాఠశాలలకు ఆకర్షించడానికి, వారిలో కుల, మత భేదాలు లేకుండా సామరస్యం పెంపొందించడానికి 1995లో కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ ఈ ‘మధ్యాహ్న భోజన పథకం’ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ను అమలు చేయడంలో కొన్ని రాష్ట్రాల్లో అప్పుడప్పుడు అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. 2013లో బీహార్‌లో విషాహారం సరఫరా వల్ల 23 మంది బడి పిల్లలు మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఓ పాఠశాలలో తనిఖీ నిర్వహించగా తెల్ల అన్నం, ఉప్పును మాత్రమే పెట్టిన ఘోరం బయట పడింది. యూపీలోని ఐదేళ్లలోపు పిల్లల్లో ఎక్కువ మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు పలు నివేదికలు ఇప్పటికే బహిర్గతం చేశాయి. మధ్యాహ్న భోజనం పథకంలో లొసుగులను పూడ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం, పథకం అమలు తీరును బయటన పెట్టిన జర్నలిస్టుపై చర్య తీసుకోవడం ఏమిటో ఎవరికి అర్థంకాని విషయం. -
అన్నం-ఉప్పు, రోటి-ఉప్పు
లక్నో: తినడానికి మూడు పూటలా తిండి దొరికితే చాలు అనుకునే కుటుంబాలు నేటికి మన దేశంలో కొకొల్లలు. ఈ క్రమంలో కనీసం ఓ పూటైనా కడుపు నిండా తిండి దొరుకుతుందనే ఉద్దేశంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పేద విద్యార్థులకు సరైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చింది. దీని కోసం ప్రతి ఏడాది కొన్ని వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెడుతోంది. కానీ నేటికి కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం కాదు కదా.. కనీస భోజనం కూడా సరిగా అందట్లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణమైన సంఘటన వెలుగు చేసింది. మీర్జాపూర్ జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పేరుతో కేవలం రొట్టెలు, కూరకు బదులుగా ఉప్పు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో చిన్నారులకు ప్రతిరోజు అన్నం, పప్పు, రొట్టె, కూరగాయాలు, పండ్లు, పాలు వంటి పోషకాహారం భోజనంగా ఇవ్వాలని అధికారులు ఈ పథకం తీసుకొచ్చారు. అయితే మీర్జాపూర్‌లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఇవేవీ కాకుండా కేవలం రొట్టెలు మాత్రమే పెడుతున్నారు. కనీసం కూర కూడా వండకుండా ఉప్పుతో తినమంటున్నారు. ఒకరోజు ఉప్పు, రొట్టెలు.. మరుసటి రోజు అన్నం, ఉప్పు ఇలా వారమంతా విద్యార్థులకు ఇదే భోజనం అందిస్తున్నారు. ఇలా ఓ ఏడాది నుంచి జరుగుతోంది. అయితే తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థ కథనంతో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. This clip is from a @UPGovt school in east UP's #Mirzapur . These children are being served what should be a 'nutritious' mid day meal ,part of a flagship govt scheme .On the menu on Thursday was roti + salt !Parents say the meals alternate between roti + salt and rice + salt ! pic.twitter.com/IWBVLrch8A — Alok Pandey (@alok_pandey) August 23, 2019 ‘గత ఏడాది కాలంగా ఈ పాఠశాలలో మా పిల్లలకు ఇదే భోజనం పెడుతున్నారు. పాలు ఎప్పుడో ఒక్కసారి వస్తాయి. వచ్చినా వాటిని పిల్లలకు ఇవ్వరు. ఇక అరటిపండ్లు ఇంతవరకూ పంచలేదు’అని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకు బాధ్యులైన గ్రామ పంచాయతీ సూపర్వైజర్, స్కూల్ ఇన్ఛార్జ్లను విధుల నుంచి సస్పెండ్ చేశామని వెల్లడించారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌లోని చిన్సురాలో గల ఓ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. అక్కడ కూడా పిల్లలకు ఉప్పు, అన్నం మాత్రమే పెడుతున్న వీడియో వైరల్ అయ్యింది. దాంతో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. -
‘మరుగుదొడ్లో వంట.. అయితే ఏంటి’
ముంబై: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లలో వంట చేస్తున్నారనే వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తి దేవి స్పందిస్తూ.. ‘టాయిలెట్లలో వంట చేస్తే తప్పేంటి. టాయిలేట్ సీట్‌కు, స్టవ్‌కు మధ్య విభజన ఉంటే అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం మన ఇళ్లలో అటాచ్డ్ బాత్రూంలు ఉంటున్నాయి. అంతమాత్రాన ఇంటికి వచ్చిన బంధువులు భోజనం చేయడం మానేయడం లేదు కదా. ప్రస్తుతం ఆ బాత్రూంను వినియోగించడం లేదు. దాన్ని గులకరాళ్లతో నింపేశారు. అలాంటప్పుడు పాత్రలను బాత్రూం సీట్ మీద ఉంచితే ఏం అవుతుంది. మన ఇళ్లలో కూడా పాత్రలను కిందే పెడతాం కదా’ అన్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు ఇమర్తి దేవి. ఈ విషయంపై జిల్లా అధికారి దేవేంద్ర సుంద్రియాల్ స్పందిస్తూ.. ‘మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయం సహాయక బృందానికి అప్పగించాం. వారే టాయిలెట్‌ను కిచెన్‌గా మార్చారు. ఇందుకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటాం’ అన్నారు. -
అమ్మో.. మధ్యాహ్న భోజనం..
సాక్షి, దేవరపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులను అర్థాకలితో ఉంచుతుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు. సుమారు ఆరు నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పలువురు విద్యార్థులు ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. ఇంటి వద్ద భోజనం అందుబాటులో లేని విద్యార్థులు పాఠశాలలో పెడుతున్న భోజనం తిని అర్థాకలితో ఉంటున్నారు. ముతక రకం బియ్యం, రుచికరంగా లేని కూరలను విద్యార్థులకు సరఫరా చేయడం వల్ల తినడానికి విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థులు తినకపోవడంతో చాలా పాఠశాలల్లో భోజనం నేలపాలవుతుంది. బుధవారం మెనూ ప్రకారం విద్యార్థులకు పప్పు, ఆకుకూర, కోడిగుడ్డు ఇవ్వవలసి ఉంది. అయితే విద్యార్థులకు పెట్టిన భోజనం చిమిడి ముద్దగా ఉండంతో పాటు సాంబరులాంటి పప్పు అందజేశారు. కోడిగుడ్డు పాడైపోయి దుర్వాసన రావడంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. లక్ష్మీపురం పాఠశాలకు సరఫరా చేసిన భోజనం అధ్వానంగా ఉందని విద్యార్థులు తెలిపారు. చిమిడి ముద్దగా ఉన్న అన్నం, పలచని పప్పు, పాడైపోయిన కోడిగుడ్లు సరఫరా చేసినట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం ముద్దగా ఉండి గట్టిగా ఉంటుందని, రుచికరంగా లేని కూరలతో అన్నం తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. 2018 డిసెంబర్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో డ్వాక్రా మహిళలు వంటలు చేసి విద్యార్థులకు అందజేసేవారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి వంట ఏజన్సీ మహిళలను తొలగించి ఢిల్లీకి చెందిన ఏక్తా శక్తి ఫౌండేషన్‌కు మధ్యాహ్న భోజనం సరఫరాను అప్పగించారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి మండలాలకు సంస్థ ద్వారా పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తున్నారు. యర్నగూడెంలో భోజనాలు తయారుచేసి పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. అప్పటినుంచి మధ్యాహ్న భోజన పథకం గాడి తప్పింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడిందని విద్యార్థులు విమర్శిస్తున్నారు. బడిలో భోజనం చేస్తుంటే కడుపులో నొప్పి వస్తుందని విద్యార్థులు అంటున్నారు. బుధవారం పల్లంట్ల పాఠశాలకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు విద్యార్థులు మధ్యాహ్న భోజనం గురించి మొరపెట్టుకున్నారు. అన్నం తినలేకపోతున్నామని, సన్న బియ్యం అన్నం, రుచికరమైన కూరలు సరఫరా చేయాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే వెంకట్రావు ఫోన్లో జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడారు. భోజనం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించనని, వెంటనే భోజనం సరఫరా చేస్తున్న ఏజన్సీతో మాట్లాడి నాణ్యతగల భోజనం సరఫరా చేయాలని సూచించారు. సమస్యను విద్యాశాఖా మంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన అన్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
‘కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలి’
సాక్షి, విజయవాడ : సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సీఐటీయూ) నాయకులు మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచటం చాలా సంతోషమన్నారు. అంగన్వాడీ ఉద్యోగస్తులకు వేయి రూపాయలు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం పెంచిన వేతనాలను రాష్ట్ర ఖజనాతో కలపకుండా నేరుగా వేతనాలతో జత చేయాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను నిర్మూలించి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి చేయాలని గఫూర్ డిమాండ్ చేశారు. కార్మిక శాఖను డీటీపీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ధార్మిక సంస్థలకు ఇవ్వటం సరి కాదన్నారు. -
వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం అందించే ఏజన్సీలకు గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. వారికి నెలనెలా ఇచ్చే రూ.1000 గౌరవ వేతనాన్ని రూ. 3000లకు పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ సమాచార పౌరసంబంధాల శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది. విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మధ్యాహ్న భోజన పథకం-అక్షయపాత్ర, పాఠశాలల మౌలికాభివృద్ధిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నాతాధికారులతో సమీక్షించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడొద్దని సీఎం ఆదేశించారు. ఇది ప్రాథమిక సమావేశమని, ఇంకా పూర్తిస్థాయి ప్రణాళికలతో మళ్లీ సమావేశం కావాలని స్పష్టం చేశారు. ఇకపై ఈ పథకాన్ని ‘వైఎస్సార్ అక్షయ పాత్ర’ గా పిలుస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు 30 లక్షలకుపైగా విద్యార్థులున్నారని, వీరంతా పాఠశాలలకు పూర్తిస్థాయిలో హాజరు కావాలని, అందుకు తగిన విధంగా పాఠశాలల మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి, పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, అక్షయపాత్ర నిర్వాహకులు సత్యగౌడ చంద్రదాస్, వంశీధర దాస, నిష్కింజన దాస పాల్గొన్నారు. -
ఏపీకి ఆహార సబ్సిడీ కింద రూ.534 కోట్ల నిధులు
-
గుడ్డు జారి గల్లంతయ్యిందే...
సాక్షి, బేస్తవారిపేట(ప్రకాశం): పేద విద్యార్థులు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. పిల్లల ఆరోగ్యానికి వారానికి ఐదు కోడి గుడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.. ఆచరణలో అసంపూర్తిగానే అమలు చేస్తోంది. ఏజెన్సీలకు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం, ఏజెన్సీల గడువు ముగిసిన పట్టించుకోకపోవడంతో గుడ్డు సరఫరా నిలిచిపోయింది. ఫిబ్రవరి నుంచి పత్తా లేని గుడ్డు.. ప్రచార ఆర్భాటానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పౌష్టికాహారం దగ్గరకొచ్చేసరికి గుడ్లు తేలేస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి మధ్యాహ్నా భోజన పథకంలో గుడ్డుకు ఎగనామం పెడుతోంది. అంగన్వాడీల్లోనూ అందని గుడ్డు.. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నా భోజన పథకం అమల్లో ఉంది. పాఠశాల్లో సుమారు 2.60 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అదేవిధంగా ఐసీడీయస్ ప్రాజెక్టు పరిధిలో జిల్లాలో మొత్తం 21 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో 180 సెక్టార్లు గా విభజించారు. మొత్తం 4244 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 4009 మెయిన్ సెంటర్లు, 225 మినీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 85 వేల మంది చిన్నారులు ఉన్నారు. వీరు కాక 13568 మంది గర్భిణిలు, 9826 మంది గర్భిణులు ఉన్నారు. వీరందరికి నెల రోజులుగా గుడ్లు అందని పరిస్థితి నెలకొంది. బిల్లుల చెల్లింపులకు ‘ఎగ్’నామం ఒక్క శనివారం మినహా మిగితా ఐదు రోజులు కోడిగుడ్డు అందించాల్సి ఉంది. గుడ్డును పాఠశాలకు సరఫరా చేసే ఏజెన్సీల గడువు ముగియడంతో ప్రభుత్వం గత ఏజెన్సీకే టెండర్‌ను పొడిగించింది. కానీ గడువు పూర్తి అయిన తర్వాత పెంచడంతో మళ్లీ గుడ్లు కొనుగోలు చేసి సరఫరా చేయడంలో కొంత సమయం పట్టింది. దీంతో రెండు వారాలకుపైగానే గుడ్ల సరఫరా నిలిచిపోయింది. బిల్లులు కూడా ప్రభుత్వం సక్రమంగా చెల్లించకపోవడంతో మరింత అలసత్వం నెలకొంది. మధ్యాహ్నా భోజన ఏజెన్సీలు గుడ్డును కొనుగోలు చేసి పెట్టేందుకు భారంగా మారడంతో ఒప్పుకోలేదు. ప్రస్తుతం పెంచిన గడువు ముగియడంతో పూర్తిగా గుడ్ల సరఫరా లేక విద్యార్థులకు పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మారింది. కోర్టులు ఆదేశించినా... మధ్యాహ్న భోజన పథకం అమలు సక్రమంగా లేదని తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉలవపాడు మండలం రామాయపట్నంలోని పాఠశాలలను ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, కలెక్టర్ తోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు తనిఖీలు జరిపారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వమే నిర్లక్ష్యంగా ఉంటే ప్రధానోపాధ్యాయులు మాత్రం ఏం చేయగలరు. ఓ వైపు కోర్టు అధికారులను, ప్రభుత్వాన్ని మందలిస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. పరీక్షల సమయంలో ఇబ్బందులు.. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా, మార్చి–18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వీరంతా ఎక్కువ సమయం చదువుపై దృష్టి సారించడం సహజం. ఈ సమయంలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అవసరం. కానీ మధ్యాహ్నా భోజన పథకానికి చెల్లించే ధరలు తక్కువ కావడంతో చాలాచోట్ల నాసిరకమైన భోజనం అందిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు విద్యార్థులు భోజనాన్ని తినలేకపోతున్నారు. విద్యార్థులు ఆహారంలో గుడ్లు వేస్తారని కొంతమేర ఆసక్తి చూపిస్తారు. గుడ్లు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పరీక్షల సమయంలోనైనా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా రోజుల నుంచి గుడ్డు పెట్టడం లేదు.. గత నెల నుంచి మధ్యాహ్నా భోజనంలో గుడ్డు ఇవ్వడం లేదు. గుడ్డు గురించి అడిగితే పైనుంచి సరఫరా లేదని చెబుతున్నారు. దీంతో ఏజెన్సీ వారు పెట్టే కూర అన్నం మాత్రమే తింటున్నాం. పాఠశాలలకు గుడ్లను సరఫరా చేయాలి. –బ్రహ్మయ్య, 8వ తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, బేస్తవారిపేట ప్రభుత్వం గుడ్లు సరఫరా చేయాలి.. ప్రభుత్వం నెల రోజులుగా గుడ్ల సరఫరా నిలిచిపోయిన పట్టించుకోలేదు. పాఠశాలలకు గుడ్లను సరఫరా చేయాలి. గతంలో వారానికి రెండు రోజులు పంపిణీ చేసేటప్పుడు బాగా ఇచ్చారు. వారానికి ఐదు రోజులు పంపిణీ జరుగుతున్నప్పటి నుంచి సక్రమంగా లేకుండపోయింది. –సంజీవరాయుడు, 8వ తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, బేస్తవారిపేట -
పాఠశాల విద్యార్థుల ఆకలి కేకలు
-
మిన్నంటిన విద్యార్థుల ఆకలి కేకలు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలో విద్యార్థుల ఆకలి కేకలు మిన్నంటాయి. బుధవారం నిర్ణీత సమయానికి భోజనాలు పాఠశాలలకు చేరకపోవటంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల విద్యార్థులు ఆకలితో అలమటించారు. ఏలూరు, కాళ్ల తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ పాఠశాలలో పెట్టవలసిన భోజనం నాలుగున్నర వరకు పెట్టకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు 35 స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవలె మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ఏక్తాశక్తి అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. డ్వాక్రా మహిళలు నిర్వహించే ఈ పథకాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో డ్వాక్రా మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. మొదటి రోజునే ఇలా ఆలస్యం అవ్వడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ చర్యలతో విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మధ్యాహ్న భోజన పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశాయి. భోజనం కోసం విద్యార్థుల ఎదురుచూపులు తూర్పు గోదావరి : జిల్లాలోని అయినవిల్లి మండలంలోనూ మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థుల ఎదురుచూపులు తప్ప లేదు. భోజన సమయానికి ఆహార పదార్థాలు పాఠశాలలకు చేరుకోకపోవటంతో వారు ఆకలితో అలమటించారు. పిల్లల బాధ చూడలేక ఉపాధ్యాయులే వారికి బిస్కట్లు, గుడ్లు అందజేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించటం మూలానే ఇలాంటి పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
39మంది విద్యార్ధులకు అస్వస్ధత
-
అక్షయ పాత్ర ఆధిపత్యం సబబేనా?
బడి పిల్లలకు బడిలోనే మధ్యాహ్నం భోజనం పెట్టే సదుపాయం చాలా దేశాల్లో అమల్లో వుంది. ఈ పథకం భారతదేశంలో భారీ స్థాయిలో ఉన్నట్లు యునెస్కో ప్రశంసించింది. ఈ విద్యా సంవత్సరంలో 12.65 లక్షల పాఠశాలల్లోని పన్నెండు కోట్ల మంది పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేస్తోంది. పాఠశాలల్లో డ్రాపవుట్సును నివారించి, విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించటం ప్రధాన లక్ష్యం. అన్ని సంక్షేమ పథకాల్లో ప్రవేశిస్తున్నట్లే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవోలు) ముసుగులో ప్రైవేట్ సంస్థలు ఇందులోనూ వ్యాపిస్తున్నవి. వాటిలో అక్షయ పాత్ర ఫౌండేషన్, ఏక్తా శక్తి ఫౌండేషన్, నాంది ఫౌండేషన్, జయ్ గీ హ్యుమానిటేరియన్ సొసైటీ, పీపుల్స్ ఫోరమ్ అనేవి కొన్ని. అన్నిటి కంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ పెద్దది. అది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ఇస్కాన్) అనుబంధ సంస్థ. పన్నెండు రాష్ట్రాల్లో 14,702 ప్రభుత్వ పాఠశాలల్లోని 17.60 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు అక్షయ పాత్ర చెబుతోంది. గతంలోనే కొన్ని రాష్ట్రాల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ సరఫరా చేసే భోజనంపైన అభ్యంతరాలు వ్యక్తమైనవి. మధ్యాహ్న భోజన పథకంలో అక్షయ పాత్ర భాగస్వామ్యాన్ని తొలగించాలని సామాజిక కార్యకర్తలు కేంద్ర విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకంగా1995 ఆగస్టు15 నుండి దేశమంతటా అమల్లోకి వచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యిచ్చిన మార్గదర్శకాల ప్రకారం అమలు చేయాలి. ప్రొటీన్లు గల ఆహారం అందివ్వాలి. అందుకు అవసరమైన బియ్యం/గోధుమలు, పప్పులు, కూరగాయలు/ ఆకుకూరలు, నూనె/ఫ్యాట్, ఉప్పు, పోపు దినుసులతో వండిన భోజనం పెట్టాలి. వారంలో కనీసం మూడు రోజులు ఉడకబెట్టిన కోడిగుడ్లు వడ్డించాలి. కోడిగుడ్డుకు బదులు పాలు లేదా అరటి పండు ఇవ్వడాన్ని కూడా జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అంగీకరించలేదు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం యిచ్చిన మార్గదర్శకాలు, జాతీయ పౌష్టికాహార సంస్థ చేసిన సిఫార్సులు, సుప్రీంకోర్టు తీర్పులోని ఆదేశాలకు విరుద్ధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రవర్తిస్తోంది. అధునాతన యంత్రాలతో కేంద్రీకృత వంటశాలలు నెలకొల్పి బడికి అందుబాటులో ఉండే బడుగు బలహీన వర్గాల మహిళలకు అవకాశం లేకుండా చేశారు. తెల్లవారుజామున వండి, కంటెయినర్లలో పెట్టి, మైళ్లకొద్దీ వాహనాల్లో రవాణా చేసి, మధ్యాహ్నంకి చల్లారిన భోజనం పెడుతున్నారు. రోజూ ఒకే రకమైన ఆహార పదార్ధాలతో రుచి లేకపోవడం వలన విద్యార్థులు యిష్టంగా తినలేక పోతున్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2005 లోనే 187 శాంపిల్సును పరిశీలించి వాటిలో నిర్దేశిత పోషకాలు లేవని, పదార్థాల పరిమాణం కూడా తక్కువగా ఉంటుందని తేల్చింది. పౌష్టికాహారం అయిన కోడిగుడ్లు వడ్డించటం లేదు. అంతేకాదు ఆ వంట కంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా వేయటం లేదు. విద్యార్థులకు యిష్టమైన భోజనం కాకుండా సాత్వికాహారం పేరుతో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి మతాచార ఆహారాన్నే నిర్బంధంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వుండే విద్యార్థుల్లో 95 శాతం మంది మాంసాహారులు. వంట చేసే వారు మాత్రం మాంసాహార వ్యతిరేకులు. భోజనం చేసేవారు దళితులు, గిరిజనులు, బహుజనులు కాగా వండి వార్చేదేమో అగ్రవర్ణ సంస్థ. పాఠశాలల్లోనే వంట చేయకుండా అస్పృశ్యత పాటిస్తున్న ఫౌండేషన్ పట్ల 2013 లోనే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనలు వెల్లువెత్తడంతో ఫౌండేషన్ కూడా కొంత దిగొచ్చి స్కూల్ మేనేజిమెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల ద్వారా కోడిగుడ్లను విద్యార్థులకు అందించుకోవచ్చని, అందుకు చెల్లించాల్సిన సొమ్మును తనకిచ్చే బిల్లు నుండి మినహాయించుకోవచ్చని అంగీకరించింది. అంతేకానీ తాను మాత్రం కోడిగుడ్లు వడ్డించేది లేదని తెగేసి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోడిగుడ్లు వేరే ఏజెన్సీల ద్వారా పెట్టిస్తున్నారు. తెలంగాణలో అది కూడా లేదు. పైగా స్థానిక సంస్కృతీ, ఆహార అలవాట్లను అణిచివేసి సాత్వికాహారం పేరుతో రుచిలేని చప్పటి తిండి పెట్టి విద్యార్థుల కడుపు కాలుస్తున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ భాగస్వామ్యంలోని అనర్ధాలను ఎవరూ పట్టించుకోక పోవడం అన్యాయం. ఇది బాలల హక్కుల సమస్య, భావి భారత పౌరుల పౌష్టికాహార సమస్య. దేశ ప్రయోజనాల పేరుతో వేలాది స్వచ్ఛంద (ఎన్జీవో) సంస్థలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం భోజనం పేరుతో ప్రభుత్వ నిధులు, ప్రైవేట్ విరాళాలు పోగేసుకుంటూ విద్యార్థుల జీవి తాలతో ఆడుకుంటున్న సంస్థను కొనసాగనివ్వడం నేరం కాదా? వ్యాసకర్త: నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు, మొబైల్ : 94903 00577 -
చిట్టి బొజ్జలకు.. చేటు భోజనం!
మధ్యాహ్నం భోజనం కింద పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని జంతువులు కూడా తినవు. ఒకవేళ తిన్నా అవి బతికి బట్టకట్టవు’’.. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన నాణ్యతా ప్రమాణాలపై ప్రకాశం జిల్లా రామాయపట్నం మండల పరిషత్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకు లేఖరాయడంతో నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర సర్వోత్తమ న్యాయస్థానం..విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి.. ఉడకని బియ్యం, నీళ్ల చారు. గోలీ సైజు కోడిగుడ్డు.. ఇదీ ప్రకాశం జిల్లాలో మధ్యాహ్న భోజనం మెను. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విషయం ప్రస్తావిస్తేనే విద్యార్థులు ‘అమ్మో’ అంటున్నారు. అది తిని ఆరోగ్యంగా ఉంటామా? అని సందేహం వ్యక్తంచేశారు ఒంగోలు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. మధ్యాహ్న భోజనం కంటే జైలు భోజనమే నయమంటూ వారు వ్యాఖ్యానించడం విశేషం. దీంతో చాలామంది ఇంటి నుంచే తెచ్చుకు తింటున్నారు. ఇది ఒక్క ప్రకాశం జిల్లాకే పరిమితం కాదు..రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పరిస్థితి దాదాపు ఇంతే. సాక్షి, అమరావతి/నెట్వర్క్: పిల్లలకు పౌష్ఠికాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలో అధ్వానంగా మారింది. జంతువులు కూడా ముట్టుకోని రీతిలో ఉంటున్న ఆహార పదార్థాలను ప్రభుత్వం పిల్లలకు అందిస్తోంది. ఈ ఆహారాన్ని తినలేక పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. పౌష్టికత మాట దేవుడెరుగు.. తిన్నవారంతా రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా కమీషన్ల యావతో ప్రభుత్వ పెద్దలు పిల్లల కడుపుకొడుతున్నారు. భారీగా కమీషన్లు తీసుకుంటుండడంతో సరుకులు పంపిణీ చేసే సంస్థలు నాసిరకమైనవి సరఫరా చేస్తున్నాయి. వాస్తవానికి గతంలో ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోనే సరుకుల పంపిణీ వ్యవహారాల టెండర్లు ఖరారుచేసి, పాఠశాలల వారీగా అక్కడికక్కడే డ్వాక్రా మహిళల ద్వారా మధ్యాహ్న భోజనం వండించి పిల్లలకు వేడివేడి పదార్ధాలను అందించేవారు. కానీ, కమీషన్ల యావతో ప్రభుత్వ పెద్దలు ఈ టెండర్లను రాష్టస్థాయిలో కేంద్రీకరించి తమకు భారీగా ముడుపులిచ్చే సంస్థలకు కట్టబెడుతున్నారు. మరోపక్క డ్వాక్రా మహిళలను తప్పించి క్లస్టర్ల వారీగా పలు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఎప్పుడో తెల్లవారుజామున వండిన పదార్థాలను మధ్యాహ్నానికి ఆయా స్కూళ్లకు అందిస్తున్నాయి. దీంతో ఆ పదార్థాలు పాడవుతున్నాయి. విద్యార్థులు తినడానికి పనికిరావడంలేదు. వారానికి ఐదు గుడ్లు అందించాల్సి ఉన్నా ఈ సంస్థలు పంపిణీ చేయడంలేదు. కొన్ని జిల్లాల్లో గుడ్లు పంపిణీ చేస్తున్నా అవి పురుగులుపట్టి ఉండడంతో విద్యార్థులు పారేస్తున్నారు. నాణ్యత ఒట్టిమాటే! రాష్ట్రంలోని 45,589 స్కూళ్లలోని 36.17 లక్షల మంది విద్యార్థులకుగాను హాజరును బట్టి 23.46లక్షల మందికి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నారు. ఆరంభంలో 1 నుంచి 8వ తరగతి పిల్లల వరకే ఇది అమలుకాగా తరువాత 9, 10 తరగతుల పిల్లలకు విస్తరించారు. వీరికి ఉడికీ ఉడకని అన్నం, కూరలు కొన్నిసార్లు వడ్డిస్తుండగా కొన్నిమార్లు ముద్దయిన అన్నం పెడుతున్నారు. ఇక జిల్లాల్లో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చూడండి.. - కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు దగ్గర ఇటీవల ఒక కేంద్రీకృత వంటశాలను ప్రారంభించారు. నాణ్యత సక్రమంగా లేకపోవడంతో రెండు రోజులకే బంద్ చేశారు. బియ్యం నాసిరకంగా ఉండడంతో ఉడకడంలేదు. కందిపప్పు సైతం విద్యార్థులకు సరిపడా పంపిణీ చేయడంలేదు. 840 స్కూళ్లకు కోడిగుడ్డు సరఫరా నిలిచి పోయింది. - శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలుచోట్ల పూర్తిస్థాయిలో భోజనం సరఫరా కావడంలేదు. అప్పుడప్పుడు తడిసిపోయిన, ముక్కిపోయిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో రంగుమారి వాసన వస్తుండడంతో అనేకమంది విద్యార్థులు భోజనం చేయడంలేదు. - ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు నాసిరకంగా ఉంటున్నాయని నెల్లూరు జిల్లా నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. - చిత్తూరు జిల్లాలో బడ్జెట్ సరిపోక నీళ్లచారు, నీళ్ల పప్పును వడ్డిస్తున్నారు. బియ్యం కూడా నాసిరకం కావడంతో అన్నం ముద్దముద్ద అవుతోంది. భోజనం అధ్వానంగా ఉండటంతో చాలాచోట్ల పిల్లలు తినడానికి ఆసక్తి చూపించడంలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చదువుకున్న చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. - కృష్ణాజిల్లా వ్యాప్తంగా 90శాతం పాఠశాలల్లో నీళ్లచారు, ఉడకని అన్నం, కుళ్లిన కోడిగుడ్లు అందిస్తున్నారు. వాటిని తినలేక బయటపడేస్తున్న పరిస్థితి నెలకొంది. - కేంద్రీకృత వంటశాల విధానంతో అనంతపురం జిల్లాలోని నాలుగుచోట్ల ప్రయోగాత్మకంగా తెల్లవారుజామున 2.30గంటలకే తయారుచేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేసరికి నాణ్యత లోపిస్తోందని టీచర్లు ఆరోపిస్తున్నారు. కోడిగుడ్లను సైతం నాణ్యతలేనివి సరఫరా చేస్తున్నారు. - విజయనగరం జిల్లాను ఐదు క్లస్టర్లుగా విడగొట్టి కార్పొరేట్ సంస్థకు అప్పగించారు. దీంతో రెండ్రోజులపాటు అనేక పాఠశాలలకు సకాలంలో భోజనాలు అందలేదు. జిల్లాలో శుక్రవారం గుడ్డు, అన్నం, వెజిటబుల్స్, పప్పు పెట్టాలి. కానీ, ఉడికీ ఉడకని అన్నం, తాలింపులేని పప్పు మాత్రమే పెట్టారు. గుడ్డు ఇవ్వలేదు. - వైఎస్సార్ జిల్లాలో అయితే చాలాచోట్ల కోడిగుడ్ల సరఫరా లేదు. ఇక్కడ మెనూను పక్కన పెట్టి వండుతున్నారు. - గుంటూరు జిల్లాలో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం పెడుతుండడంతో పిల్లలు తినకుండా ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. అలాగే, ఎక్కువశాతం పాఠశాలల్లో మంచినీరు అందుబాటులో ఉండడంలేదు. - ఇక విశాఖ జీవీఎంసీ పరిధిలో నాణ్యత కొంతమేర బాగానే ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం అధ్వాన్నంగా ఉంది. ముతకబియ్యం సరఫరా చేస్తున్నారు. అన్నంలో రాళ్లు, ఇసుక, పురుగులు కూడా ఉంటున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సాంబారు చిక్కగా ఉండేందుకు పప్పుకు బదులుగా జొన్న, శనగపిండి కలిపేస్తున్నారు. సాంబారులో కూరగాయల ఊసే లేదు. దీంతో విద్యార్థులు ముట్టకుండానే పారేస్తున్నారు. - తూర్పుగోదావరి జిల్లాలోనైతే విద్యార్థులు ఆహారాన్ని తినడంలేదని సాక్షాత్తు కేంద్ర, రాష్ట్ర ఆహార కమిటీ సభ్యులు గుర్తించడం గమనార్హం. ఢిల్లీ, అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు గత నెల 68 పాఠశాలల్లో పరిశీలించగా 20 శాతానికిపైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకోవడంలేదని గుర్తించాయి. పర్యవేక్షణ లేకపోవడం, శుభ్రత పాటించకపోవడం, నాసిరకం సామాగ్రి వినియోగంతో విద్యార్థుల్లో పోషకాహారం లోపించి వ్యాధుల బారిన పడుతున్నారని.. వయసు, ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండటంలేదని, మరికొన్ని, ఇతర ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నట్టు వారి పరిశీలనలో తేలింది. వంట ఏజెన్సీలపై బకాయిల బండ పిల్లలకు భోజనాలు అందించే వంట ఏజెన్సీలకు, కార్మికులకు బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఉదాహరణకు.. శ్రీకాకుళం జిల్లాలో రెండు నెలలుగా ఇలా బకాయి ఉన్నాయి. దీంతో పలుచోట్ల ప్రధానోపాధ్యాయులే సొంత డబ్బులతో గుడ్లు తెప్పిస్తున్నారు. వారానికి ఐదు కోడిగుడ్లు అందించాల్సి ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏజెన్సీలు, కార్మికులకు మొత్తం రూ.4.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోవడంలేదని నెల్లూరు జిల్లాలోని నిర్వాహకులు వాపోతున్నారు. కృష్ణాజిల్లాలోనూ సకాలంలో బిల్లులు రాక అప్పుల పాలవుతున్న వంట నిర్వాహకులు నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా బిల్లులు విడుదల చేయకపోవడంతో ఏజెన్సీలు, కార్మికులకు మొత్తం రూ.3.72కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక విజయనగరం జిల్లాల్లోనూ రూ.6కోట్ల వరకు బకాయిలున్నాయి. ఇక్కడ సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోయినా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అప్పులు చేసి వారు బాధ్యతగా భోజనాలు పెడుతుండగా ఇక్కడ ప్రైవేట్‌కు అప్పజెప్పడంతో నిర్వాహకులు రోడ్డునపడ్డారు. వైఎస్సార్ జిల్లాలో రూ.1.32కోట్ల బకాయిలున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అప్పులు చేస్తూ మరీ నిర్వాహకులు వంట చేస్తున్నారు. జిల్లాలన్నింటిలో ఇదే పరిస్థితి. రాష్ట్ర ఫుడ్ కమిషన్ తప్పుబట్టినా మారని వైనం మధ్యాహ్న భోజనం తీరుపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కొద్దికాలం క్రితం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉంటోందని ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చినా పథకం అమలు తీరులో ఎలాంటి మార్పు రాలేదు. గుడ్లలో 60 శాతం మాత్రమే పంపిణీ అవుతోందని తేల్చింది. గుడ్లు కూడా 52 గ్రాములు ఉండాల్సి ఉండగా కేవలం 35 గ్రాములే ఉంటున్నట్లు గుర్తించింది. ఈ లెక్కన రూ.131కోట్ల వరకు నిధులు పక్కదారి పడుతున్నట్లు కమిషన్ నివేదిక ద్వారా తేటతెల్లమవుతోంది. స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం సరికాదు 16 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వహిస్తున్నా. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తే మేం రోడ్డున పడతాం. ప్రస్తుతం మూడు నెలల బిల్లులు రావాలి. తొమ్మిది నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్న రోజుల్లో కూడా అప్పులు తెచ్చి విద్యార్థులకు వడ్డించాం. – రుక్మిణి, ఏజెన్సీ నిర్వాహకురాలు, బేతంచెర్ల, కర్నూలు జిల్లా కడుపులో నొప్పి వస్తోంది అన్నం లావుగా ఉంటోంది. తినాలంటే చాలా కష్టంగా ఉంది. ముద్ద దిగడంలేదు. ఆకలికి ఉండలేక తింటున్నాం. ఒక్కోసారి అన్నం తిన్నాక కడుపులో నొప్పి వస్తోంది. అందుకే ఎక్కువ రోజులు ఇంటి దగ్గర నుంచి అన్నం తెచ్చుకుంటాం. ఇక్కడ మంచి నీళ్లు కూడా సరిగాలేవు. – ఓర్చు అశ్వని, 4వ తరగతి, చండ్రాజుపాలెం పాఠశాల, బెల్లంకొండ మండలం, గుంటూరు జిల్లా రోడ్డున పడేస్తున్నారు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి మాకు రేషన్ సరుకులు ఇచ్చేవారు. వాటితోనే అప్పటికప్పుడు వండి వేడివేడిగా పిల్లలకు పెడుతున్నాం. కానీ, ఇప్పుడు నవప్రయాస్ సంస్థ వారు వండి తీసుకొస్తున్నారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందిపడుతున్నారు. అయినా సరే ఆ ఏజెన్సీకే సహకరిస్తూ సేవలందిస్తున్న మమ్మల్ని రోడ్డుపాల్జేస్తున్నారు. చాలా దారుణం. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. – జి.వరలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు, మిడ్ డే మీల్స్ నిర్వాహుకల సంఘం, విశాఖపట్నం వంట కార్మికులకు ఇస్తున్న వేతనం అత్యల్పం రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రూ.1000 చొప్పున మాత్రమే అందిస్తోంది. ఇది కనీస వేతనం కూడా కాదు. అదే ఇతర ప్రాంతాల్లో చూస్తే తమిళనాడులో రూ7,500, కేరళలో 6వేలు, లక్షద్వీప్‌లో రూ.6వేలు, పాండిచ్చేరిలో రూ.5నుంచి 9వేలు ఇస్తున్నారు. కేంద్రం ఇస్తున్నది రూ.1000 అయినా మిగతా మొత్తాన్ని కలిపి టైమ్‌స్కేల్ కింద ఈ మొత్తాన్ని ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూ.1000 మాత్రమే ఇస్తుండగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్రమేణా స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తూ వారి నోట మట్టికొడుతోంది. రూ.4.35తో భోజనం వస్తుందా.. ప్రభుత్వం ఆయా విద్యార్థులకు భోజనానికి నిర్దేశించిన మొత్తాన్ని పరిశీలిస్తే విస్మయం కలుగక మానదు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్ధుల్లో 90 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఈ రోజుల్లో బయట భోజనం చేయాలంటే కనీసం 30 నుంచి 40 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక ఈ పిల్లల భోజనానికి అవసరమయ్యే బియ్యాన్ని పౌరసరఫరాల ద్వారా అందిస్తుండగా పప్పులు, కూరగాయలు, ఆయిల్, ఇతర పప్పు దినుసులు, గుడ్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న మొత్తం మరీ దారుణంగా చాలా తక్కువగా ఉంటోంది. ఈ విద్యార్ధుల్లో ప్రాథమిక స్థాయి వారికి రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారికి రూ.6.51 కేటాయిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయి. ఈ మొత్తమే అతి తక్కువ కాగా ఇందులో ఆయా సరుకుల కాంట్రాక్టులను కట్టబెడుతూ ప్రభుత్వ పెద్దలు కమీషన్లు కోట్లలో కాజేస్తున్నారు. కోడిగుడ్లు, కందిపప్పు, ఆయిల్ సరఫరా కాంట్రాక్టుల్లో రూ.10 నుంచి 15 కోట్ల వరకు ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా అయితే క్యాలరీస్, ప్రొటీన్లు ఎలా.. ప్రభుత్వమిచ్చే మొత్తమే తక్కువగా ఉండగా అందులో కమీషన్ల కారణంగా కాంట్రాక్టర్లు నాసిరకంగా ఉన్న వాటిని సరఫరా చేస్తున్నారు. దీంతో విద్యార్ధులకు సరైన పౌష్ఠికాహారం అందడంలేదు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హోమ్‌సైన్సు కాలేజీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సూచనల మేరకు స్థానిక వనరులతో పౌష్టికాహార మెనూను నిర్దేశించారు. అన్నం, పప్పు, కూరగాయలు, సాంబారు, పులిహోరతో పాటు వారానికి ఐదు గుడ్లు, అరటి పండ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాలు విడుదల చేస్తున్నా ఆ మేరకు పథకం అమలుకావడంలేదు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ స్థాయిలో క్యాలరీస్, ప్రొటీన్లు అందకపోవడంతో అందడానికి విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతోంది. ఏ మోతాదులో ఆయా పదార్థాలు అందించాలో సూచించినా అవి అందడం లేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆధ్యాత్మిక వ్యవహారాలతో కూడుకున్నవి అయినందున కోడిగుడ్ల పంపిణీని పూర్తిగా నిలిపివేశాయి. కిచెన్ షెడ్లు ఏవీ? ఇప్పటివరకు ఈ మధ్యాహ్న భోజనాన్ని ఆయా పాఠశాలల పరిధిలోని డ్వాక్రా మహిళలకు అప్పగించారు. వారే స్కూళ్లలో ఈ ఆహారాన్ని వండి విద్యార్థులకు వేడివేడిగా అందిస్తున్నారు. అనేకచోట్ల కిచెన్ షెడ్లు వంటివి లేకపోయినా ఆరుబయటే ఏదోలా సర్దుబాటు చేసుకుంటూ భోజన తయారీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇదే పరిస్థితి. కర్నూలు జిల్లాలో 1,078 స్కూళ్లలో వంట గదులు, 1,445 స్కూళ్లలో తాగునీటి సదుపాయంలేదు. అనంతపురం జిల్లాలో షెడ్లు లేకపోవడంవల్ల పొయ్యిలు మండక ఉడికీ ఉడకని భోజనాన్నే పిల్లలకు వడ్డించే పరిస్థితి. ఇక్కడ 2012లో మంజూరు చేసిన వంట గదుల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాలేదు. గుంటూరు జిల్లాలోని సగం పాఠశాలల్లో కిచెన్ షెడ్లు లేక అపరిశుభ్రమైన వాతావరణంలోనే విద్యార్థులకు భోజనాన్ని వండి పెడుతున్నారు. పాఠశాలల్లోనే వండి వడ్డించాలని ‘సుప్రీం’ చెప్పినా.. విద్యార్థులకు అందించే భోజనాన్ని పాఠశాలల్లోనే వండి వడ్డించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013లో రాష్ట్రంలో సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ పర్యటించింది. మొత్తం 13 మందితో కూడిన ఈ కమిషన్ ఆయా స్వచ్ఛంద సంస్థల్లో తయారవుతున్న ఆహార పదార్ధాలను, సరఫరా తీరుతెన్నులను పరిశీలించింది. - ఈ సంస్థలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు కమిషన్ గుర్తించింది. - అటెండెన్సు ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారం పిల్లల సంఖ్యలను వేస్తూ కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి పిండుకుంటున్నట్లు నివేదికలో పొందుపరిచింది. - భోజనాన్ని అందించే పరిమాణంలో కూడా 200 గ్రాముల నుంచి 275 గ్రాములు తక్కువగా ఉంటోందని పేర్కొంది. - యంత్రాల సహాయంతో అత్యధిక వేడితో టన్నుల కొద్దీ ఆహార పదార్ధాలను వండుతుండడం వల్ల రేడియేషన్ ప్రభావం పడుతోందని గుర్తించింది. - అదే సమయంలో తెల్లవారుజాము నుంచి ఈ పదార్ధాలు తయారుచేసి మధ్యాహ్నానికి ఆయా స్కూళ్లకు పంపిణీ చేస్తున్నందున పాచిపోతున్నాయని గుర్తించింది. - వీటిని తింటున్న విద్యార్ధులు అనారోగ్యం పాలవుతున్నారని నివేదించింది. - కుళ్లిన కూరగాయలు, నాణ్యతలేని సరుకులతో వంటకాలు తయారు చేస్తుండడంవల్ల అవి మరింత త్వరగా పాడవుతున్నాయి. డ్వాక్రా మహిళల పొట్టకొట్టి.. పాఠశాలలకు బియ్యం వచ్చినా ఇతర సరకులు సరఫరా కాని సమయంలో కూడా డ్వాక్రా మహిళలు స్థానికంగా ఉన్న షాపుల్లో అరువుకు తెచ్చి పిల్లలకు పదార్ధాలు చేసి పెడుతుండేవారు. ఈ వంటలకు కాలసిన గ్యాస్ సరఫరా ప్రభుత్వమే చేయాల్సి ఉన్నా పలుచోట్ల అదీ లేదు. దీంతో స్థానికంగా ఉన్న వనరులతో పూర్తిచేస్తూ వచ్చారు. ఇటీవల గ్యాస్ సరఫరాను చేస్తున్నా దానికి సంబంధించిన నిధులు విడుదల చేయకపోతుండడంతో నెలల తరబడి ఆ గ్యాసూ రావడంలేదు. నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని, కిచెన్ షెడ్లు నిర్మాంచామని గొప్పలు చెబుతున్నప్పటికీ విశాఖ జిల్లాలోని 70 పాఠశాలల్లో ఆరుబయటే కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం గుడ్లు, పప్పు, ఆయిల్ వంటి సరుకుల సరఫరా కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో కేంద్రీకరించడంతో పాటు ఆహార పదార్థాలు వండి స్కూళ్లకు సరఫరా బాధ్యతను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం అప్పగిస్తోంది. క్లస్టర్ల వారీగా ఆయా స్కూళ్లకు సెంట్రలైజ్డ్ కిచెన్లను తానే ఏర్పాటుచేసి అక్కడ వండే పదార్థాలను ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80వేల మంది డ్వాక్రా మహిళలను దశలవారీగా ఈ వంట పని నుంచి తొలగిస్తూ వస్తున్నారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వారు ఉద్యమం చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదు. -
చంద్రబాబు సభలో మహిళల నిరసన.. ఖాళీగా కుర్చీలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విశాఖలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గురువారం భీమిలిలో జరిగిన సభలో చంద్రబాబు ప్రసగిస్తుండగా మధ్యాహ్న భోజన పథక మహిళలు నిరసన తెలిపారు. ప్రభుత్వమే ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయవద్దని మహిళలు నినదించారు. టీడీపీ కార్యకర్తలు వారించిన కూడా వారు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కూర్చొవాలని చెప్పిన కూడా లెక్కచేయకుండా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు వారించిన కూడా వినకుండా తాము పడుతున్న కష్టాలను ఫ్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. సీఎం సభలో ఖాళీగా కుర్చీలు.. ఆత్మీయ సదస్సు పేరిట ఏర్పాటు చేసిన ఈ సభకు జనాలు హాజరు కాలేదు. సభకు జనాలను తరలించేందుకు టీటీడీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. మైకుల్లో పదే పదే ప్రకటనలు ఇప్పించారు. ఆర్టీసీ బస్సులో జనాలను తరలించే ప్రయత్నం చేశారు. దీంతో నగరవాసులు సీటీ బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం సీఎం సభకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. -
ఏక్తా పోయి అక్షయ వచ్చే..!
ఒంగోలు టౌన్: ప్రభుత పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించేందుకు ప్రభుత్వం తహతహలాడుతోంది. గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మ«ధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని దశలవారీగా వెళ్లగొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో ఏక్తా ఏజెన్సీ ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో ఆ ఏజెన్సీ వెనకడుగు వేసింది. తమ జీవనోపాధికి ఎలాంటి డోకా లేదనుకుంటూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న నిర్వాహకుల నెత్తిపై పాఠశాల విద్యాశాఖ పిడుగులు వేసింది. ఏక్తా ఏజెన్సీ స్థానంలో తాజాగా అక్షయపాత్రకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో దశలవారీగా అక్షయపాత్రకు ఈ పథకాన్ని అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద అద్దంకి, కొరిశపాడు మండలాల్లోని పాఠశాలల్లో వెంటనే మధ్యాహ్న భోజన పథకం అమలు జరిగేలా చూడాలంటూ జిల్లా విద్యాశాఖాధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయాన్ని అక్షయపాత్ర నిర్వాహకులకు కూడా తెలియజేయడంతో వారు ఆ రెండు మండలాల్లోని పాఠశాలల వివరాలు, అందులో ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుంది లెక్కగడుతున్నారు. దీంతో ఆ రెండు మండలాలతోపాటు జిల్లాలోని మిగిలిన మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నా రు. ముందు రెండు మండలాలు అని ప్రకటించి ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు. పెంపు.. పంపు... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద అందిస్తున్న డైట్ ఛార్జీలను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కొంతమేర పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ పెంపు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎప్పటికైనా కొంత పెరుగుదల ఉంటుందన్న ఉత్సాహంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు విద్యార్థులకు భోజనాన్ని వండి వడ్డిస్తున్నారు. అయితే, వారి ఆశలను అడియాశలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు భగ్గుమంటున్నారు. పెంపు పేరుతో తమను ఇంటికి పంపుతున్నారంటూ విమర్శిస్తున్నారు. చాపకింద నీరులా... ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిర్వాహకులు నిర్వహిస్తూ వస్తున్నారు. బిల్లులు సక్రమంగా రాకపోయినా, గౌరవ వేతనం నెలల తరబడి నిలిపి వేసినా తమకు ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతూ ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం 5,500 మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఉన్నారు. పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండి పెడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. కోడిగుడ్లను ఏజెన్సీ ద్వారా అందిస్తోంది. పప్పు మొదలుకుని వంట నూనె వరకు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులే కొనుగోలు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నారు. అయితే, ఇటీవల ప్రభుత్వం కందిపప్పు, వంట నూనె కూడా సరఫరా చేయడం మొదలుపెట్టింది. చివరకు మ«ధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులచే ఏమీ కొనుగోలు చేయనీయకుండా ప్రభుత్వమే అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. నిత్యావసర సరుకులన్నీ ప్రభుత్వమే అందిస్తుంటే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు కేవలం వండేందుకు మాత్రమే పరిమితమయ్యేలా చేస్తోంది. చివరకు ఆ వంటను కూడా వారికి కాకుండా ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే అక్షయపాత్రను రంగంలోకి దించింది. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో తమ ప్రాధాన్యతను క్రమేణా తగ్గిస్తూ చివరకు కరివేపాకులా తొలగించేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేసిందంటూ నిర్వాహకులు వాపోతుండటం గమనార్హం. -
అందని ‘మధ్యాహ్న’ బిల్లులు
సాక్షి, గుర్రంపోడు : మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలకు బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా బిల్లులు అందక పోవడంతో అప్పులు చేసి వంట సామగ్రి తేవాల్సి వస్తుందని ఏజెన్సీ మహిళలు వాపోతున్నారు. మండలంలో 58 పాఠశాలలకుగాను 58 భోజన ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఒకటవ తరగతి నుంచి ఐదవతరగతి వరకు వంట వండినందుకుగాను ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.13, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.6.18 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. వంట చెరుకుతో పాటు కూరగాయలు, నూనె, పప్పు, ఉప్పు ఇతర వంట సామగ్రిని ఏజెన్సీలు సమకూర్చుకోవాలి. బియ్యం మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు వంద గ్రాములు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రోజుకు 150 గ్రాముల చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ పరిమాణం కూడా సరిపోక తాము నింద మోయాల్సి వస్తుందని వంట ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సోమవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, మంగళవారం అన్నం, ఆకుకూరల పప్పు, బుధవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, గురువారం అన్నం, సాంబారు, కూరగాయల కర్రీ, శుక్రవారం గుడ్డు, అన్నం, పప్పు కూర, శనివారం బఠానీ, ఆలు, క్యారెట్లతో వెజ్ బిర్యాణీ లేదా బగార అన్నం వండాల్సి ఉంది. ఏజెన్సీలు తప్పనిసరిగా ఈ మెనూ ప్రకారమే వండాల్సి ఉంటుంది. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ తదితర అధికారులు తరుచూ ఆకస్మిక తనిఖీలతో మధ్యాహ్న భోజన మెనూను పరిశీలిస్తారు. వారానికి మూడు గుడ్ల చొప్పున తప్పనిసరిగా అందించాల్సి ఉంది. గుడ్డుకు నాలుగు రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుండగా ఒక్కోసారి ఐదు రూపాయల వరకు గుడ్డు ధర ఉండి నష్టపోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. వంట సామగ్రితోపాటు గుడ్లకు బిల్లులు అందక గ్రామాల్లో వ్యాపారులు తమకు ఉద్దెరగా సామాను ఇవ్వడం లేదని అంటున్నారు. బిల్లులు అందక వంట చేయలేక, మధ్యలో మానుకోలేక అవస్థలు పడాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. ఎప్పుడు బిల్లు అడిగినా ఎస్టీఓకు వెళ్లిందని, బ్యాంకు వెళ్లిందని చెబుతున్నారని వారు వాపోతున్నారు. కొన్ని చోట్ల వంట గదులు లేవు మండలంలో 31 పాఠశాలలకు మాత్రమే వంట గదులు ఉన్నాయి. ఇంకా 20 పాఠశాలలకు వంట గదుల అవసరం ఉంది. వంట గదులకు గతంతో మండల పరిషత్ నిధుల నుంచి, ప్రస్తుతం ఉపాధిహామీ నిధుల నుంచి మంజూరు చేస్తున్నా అసంపూర్తి నిర్మాణాలతోనే ఉన్నాయి. కొన్ని బేస్మెంట్ స్థాయిలో, మరికొన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. గతంతో నిర్మించిన వంట గదులు ఇరుకుగా ఉండి ఆరుబయటే వండాల్సి వస్తుందని, ఉన్నత పాఠశాలల్లో వంట గది నిర్మాణం విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విశాలంగా లేవు. కొన్ని చోట్ల ఇంటివద్దనే వండుకుని తీసుకుని వస్తున్నారు. ఏజెన్సీలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. వర్షాకాలంలో వంట చెరుకు తడిసి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయమై ఎంఈఓ నోముల యాదగిరిని ప్రశ్నించగా జూలై, ఆగస్టు బిల్లు ఎస్టీఓ నుంచి బ్యాంకుకు వెళ్లిందని, ఒకటి, రెండు రోజుల్లో ఏజెన్సీల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. బిల్లులు ప్రతినెలా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిల్లులు అందక తిప్పలు మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా అందించాలి. నాలుగు నెలలుగా బిల్లులు అందక ఇప్పటికే ఎన్నో అప్పులు చేశాం. బిల్లు అందక సకాలంలో డబ్బులు ఇవ్వక అప్పు కూడా పుట్టడం లేదు. బిల్లు రానిదానికి వారానికి మూడు గుడ్లు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది. – పెరిగ జంగమ్మ, పిట్టలగూడెం -
గుడ్లుతేలేస్తున్న వంట ఏజెన్సీలు!
శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనపథకం వండుతున్న ఏజెన్సీలకు గుడ్డు భారం కానుంది. అక్టోబరు 31వ తేదీ వరకు కాంట్రాక్టరు ద్వారా గుడ్లను సరఫరా చేయగా, ఆ గడువు ముగియడంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏజన్సీలే స్థానికంగా గుడ్లు సమకూర్చుకోవాలనిప్రభుత్వం ఆదేశించింది. కాంట్రాక్టు కాల వ్యవధి ముగియకముందే కొత్త ఏజెన్సీలు ఖరారుచేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రభుత్వం వారం రోజుల క్రితం ఓ ఉత్తర్వును విడుదల చేస్తూ ఏజెన్సీలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. స్థానికంగానే గుడ్లును సమకూర్చుకుంటే అన్ని ఖర్చులతో కలిపి గుడ్డుకు 4.68 రూపాయలు చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. ఒక్కో గుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాములు బరువు ఉండాలని ఆదేశించింది. గుడ్లు బిల్లులను ప్రధానోపాధ్యాయులు యాప్ ద్వారా రాష్ట్ర స్థాయికి నివేదించాలని చెబుతూ, వంట ఏజెన్సీలు, ఎన్జీఓల నుంచి రాతపూర్వకంగా హామీపత్రాలను తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు ఆపనిలో నిమగ్నమై ఉండగా, పలు వంట ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలకు ఇప్పటికే మూడు నుంచి నాలుగు నెలల బిల్లులు బకాయి ఉండగా, కొత్తగా గుడ్లను సైతం స్థానికంగానే సమకూర్చుకోవాలని చెప్పడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని ఖర్చులతో కలిపి రూ.4.68 లు ఇస్తుండగా, కేవలం గుడ్డు కొనుగోలుకు రూ.4లకు పైబడి వెచ్చించాల్సి ఉంది. ఇలా ఒక్కో విద్యార్థికి వారానికి 5 గుడ్లు చొప్పున రూ.20 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వంద మంది విద్యార్థులు ఉంటే ఆ ఏజెన్సీలు రెండువేల రూపాయలు వారానికి గుడ్లు కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వీటిని తక్షణం చెల్లించే అవకాశాలు కూడా తక్కువ. అలా అని విక్రయదారులు అరువు ఇచ్చే ప్రసక్తే ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమపై భారం మోపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 2.2 లక్షల మంది విద్యార్థులు ప్రతిరోజు గుడ్లను తింటున్నారు. ఈ లెక్కన ఏజెన్సీలు అన్ని కలిపి గుడ్లు కోసం రోజుకు 8.8 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత మొత్తాన్ని భరించే స్థోమత తమకు లేదని, ఇప్పటికే సకాలంలో బిల్లులు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, వాటినిపరిష్కరించాల్సింది పోయి కొత్తగా మరింత భారాన్ని మోపడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ విధానాన్ని నిలుపుదల చేసి ఏజెన్సీల ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేస్తున్నారు. అలా కాని పక్షంలో వంటను మానేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పలు సంఘాలు ఖండన ఏజెన్సీలను గుడ్లు సమకూర్చుకోవాలని చెప్పడాన్ని ఏపీటీఎఫ్, యూటీఎఫ్, డీటీఎఫ్ నాయకులు భానుమూర్తి, చౌదరి రవీంద్ర, పేడాడ కృష్ణారావులు తప్పుపట్టారు. ఏజెన్సీలు సమకూర్చుకోనప్పుడు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ఆ బాధ్యతలను తీసుకోవాలని చెప్పడాన్ని కూడా ఆక్షేపించారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు నిధులు లేకపోవడంతో ఇప్పటికే వేలాది రూపాయలు తమ జేబు నుంచి ఖర్చు చేశారని మళ్లీ గుడ్లు కోసం వెచ్చించే పరిస్థితి ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు లేదన్నారు. ఏజెన్సీలకు ఇప్పటికే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు తుపాను సందర్భంగా బాధితులకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు పెట్టిన ఖర్చు కూడా ఇప్పటికి ఇవ్వకపోగా, కొత్తగా మరింత ఆర్థిక భారాన్ని మోపాలని చూడడం సరికాదని అన్నారు. ప్రభుత్వం టెండర్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించి దానిని కప్పిపుచ్చుకొనేందుకు ఎవరిని బలి చేస్తారని నిలదీశారు. ఇదే విధానం కొనసాగితే ఆందోళన తప్పదని బుధవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించారు. -
మధ్యాహ్నంలో ప్రైవేటు మంట
సంపాదించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నేతల చూపు చిన్నారుల మధ్యాహ్న భోజనంపై పడింది. సరుకుల నాణ్యతను సాకుగా చూపి... పంపిణీ చేసే బాధ్యతను తమ అనుచరులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటికే కూలి గిట్టుబాటు కాక అల్లాడి పోతున్న వంట ఏజెన్సీల నిర్వాహకులకు కష్టకాలం వచ్చిపడింది. సరుకులన్నీ ప్రైవేటు వ్యక్తులే సరఫరా చేస్తే వండేందుకు తమకు వేతనం ఇవ్వాలని..లేకపోతే మానుకుంటామని వారు అల్టిమేటం జారీ చేశారు. అదే జరిగితే పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం వేళ ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అనంతపురం , కనగానపల్లి: పేద విద్యార్థులకు ఒక్క పూటయినా నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఈ పథకం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే నెలల తరబడి బిల్లుల పెండింగ్ పెట్టడంతో అల్లాడిపోతున్న వంట ఏజెన్సీలకు... రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. నవంబర్ 1 నుంచి మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే సరకులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్లు తెలిపింది. ఇప్పటికే సకాలంలో బిల్లులు అందక...అప్పులు చేయలేక చాలా ఏజెన్సీలు వంట వండేందుకు ముందుకు రావడం లేదు. ఇపుడు సరుకుల పంపిణీ బాధ్యతనూ ప్రైవేటుకు అప్పగిస్తే... వంట చేసేవారికి కూలీ కూడా గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంటుంది. దీంతో ఏజెన్సీ సభ్యులు మధ్యాహ్న భోజనం వంటకు ఫుల్స్టాప్ పెట్టే ప్రమాదం ఉంది. అదే జరిగితే పాఠశాలల్లో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటించే పరిస్థితి తలెత్తనుంది. ప్రైవేటు ఏజెన్సీలకు సరుకుల పంపిణీ బాధ్యత నవంబర్ 1వ నుంచి మధ్యాహ్న భోజనానికి వినియోగించే కంది బేడలు, వంట నూనెను ఏజెన్సీల ద్వారా సరఫరా చేస్తామనిఅధికారులు ప్రకటించారు. అందువల్ల భోజన ఏజెన్సీలకు అందించే బిల్లుల్లో 30 శాతం వరకు కోత విధిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలోనే కోడి గుడ్డు సరఫరాను ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చి బిల్లుల్లో కోత పెట్టారు. దీనివల్ల ప్రతీసారి బిల్లులు తగ్గిపోతే తమకు గిట్టుబాటు కాదని వంట ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. అధికారులు సరుకులు, బియ్యం పంపిణీ చేసినా గ్యాస్, కాయగూరలు ధరలు పెరుగుదలతో బిల్లులు సరిపోవటం లేదంటున్నారు. మూడు నెలలుగా బిల్లుల పెండింగ్ జిల్లాలో మూడు నెలలకు సంబంధించి సూమారు రూ.7 కోట్లు మధ్యాహ్న భోజన బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో ఉన్నత పాఠశాలలకు సంబంధించి బిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో జూలై నుంచి బిల్లులు సక్రమంగా రావటం లేదు. దీంతో ఒక్కో పాఠశాలలో రూ.వేలాది బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. దీనివల్ల రాప్తాడు నియోజక వర్గంలోని పలు పాఠశాలల్లో వంట ఏజన్సీలు భోజనం చేయటం మానుకొంటున్నాయి. ఒక్క కనగానపల్లి మండలంలోనే ఐదు పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందటం లేదు. వేతనాలిస్తేనే వంట చేస్తాం మధ్యాహ్న భోజనానికి సరుకులన్నీ సరఫరా చేసి...వంట చేసే వారికి ఒక్కొక్కరికి రూ.5 వేల వేతనం ఇస్తేనే వంట చేస్తాం. అలా కాకుండా బిల్లుల్లో కోత పెడితే ఏజెన్సీలు అప్పుల పాలు కావాల్సిందే. తొలుత సరుకుల పంపిణీని ప్రయివేటు వ్యక్తులకిచ్చి ఆ తర్వాత వంట ఏజెన్సీలను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇలా చేస్తే వేలాది మంది సభ్యులు జీవనోపాధి కోల్పోతారు. – నాగమణి, మధ్యాహ్న భోజన ఏజెన్సీల సంఘం జిల్లా కార్యదర్శి -
కుకింగ్ చార్జీల్లో కోత!
వీరఘట్టం : పిల్లలందరినీ సర్కార్ బడిబాట పట్టించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం రోజురోజుకూ నీరుగారుతోంది. పాలకుల నిర్ణయాలు.. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో ఈ పథకం గతి తప్పుతోంది. తాజాగా వంట ఏజెన్సీలకు ఇస్తున్న కుకింగ్ చార్జీల్లో కూడా కోత వేయాలని సర్కార్ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే తాము వంటలు చేయలేమని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో 3,155 సర్కారు విద్యా సంస్థలు ఉండగా వీటిలో 3,154 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలౌతోంది. ఈ ఏడాది 2,38,616 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులు 1,58,096 మంది, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వారికి మంగళం పలికేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ బాధ్యతను అన్న క్యాంటీన్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కందిపప్పు, వంటనూనె తదితర ముడిసరుకులు సరఫరా చేస్తూ ఆ మేరకు వీరికి ప్రతీ నెలా ఇచ్చే కుక్కింగ్ చార్జీల్లో కోత కోయనుంది. ఇప్పటికే అరకొరగా వస్తున్న కుకింగ్ చార్జీలు సగానికి తగ్గనుండటంతో వంట ఏజెన్సీ మహిళలు లబోదిబోమంటున్నారు. చార్జీల్లో కోత విధిస్తే ఇక మీదట బడుల్లో వంటలు చేయలేమని వాపోతున్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల జిల్లాలో 6,158 మంది మహిళలు తీవ్రంగా నష్టపోనున్నారు. 1,80,520 మంది ఉన్నారు. వీరిలో 95 శాతం మంది మధ్యాహ్న భోజనాన్ని చేస్తునట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరికి షిఫ్ట్ పద్ధతిలో ప్రతీ నెల 6,158 మంది మహిళలు మధ్యాహ్న భోజనాన్ని వండిపెడుతున్నారు. వీరు తమ సొంత డబ్బులతో వంటలు చేస్తూ నెల పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే కుకింగ్ చార్జీలతో నెట్టుకొస్తున్నారు. చార్జీల్లో కోతకు కుట్ర ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికీ 100 గ్రాముల బియ్యం, మసాలా దినుసులకు రూ.4.13 పైసలు చొప్పున అలాగే 6–10 వతరగతి విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం, మసాలా ఖర్చులకు రూ.6.18 పైసలు చొప్పున ఈ మహిళలకు విద్యాశాఖ చెల్లిస్తోంది. తాజాగా ప్రభుత్వం 1–5వ తరగతి వారికి 20 గ్రాముల కందిప్పు, 5 గ్రాముల నూనె, అలాగే 6–10వ తరగతి విద్యార్థులకు 30 గ్రాముల కందిపప్పు, 7.25 గ్రాముల నూనె చొప్పున సరఫరా చేస్తోంది. ఈ సరుకులకు గాను కుకింగ్ చార్జీల్లో 1–5వ తరగతి విద్యార్థులకు రూ.2లు, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.3లు కట్ చేయనుంది. ఈ లెక్కన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.2.18 పైసలు, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.3.18 పైసలు మాత్రమే ఇక మీదట కుకింగ్ చార్జీలుగా చెల్లిస్తుంది. చాలీ చాలని చార్జీలు.. కందిపప్పు, నూనె ప్రభుత్వం ఇచ్చినా చింతపండు, ఉల్లి, తెల్లఉల్లి, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర, ఇతర మసాలా దినుసులు, వంట చేసేందుకు గ్యాస్ లేదా కట్టెలు మొదలైనవి మహిళలే సమకూర్చుకోవాలి. ప్రస్తుతం ఇస్తున్న చార్జీలే అరకొరగా ఉంటే ముందుముందు వీటిని కూడా తగ్గించడంవల్ల వంట సాధ్యం కాదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో రకంగా తాము మానేస్తే అన్న క్యాంటీన్ కాంట్రాక్టర్లకు ఈ పని అప్పచెప్పాలని ప్రభుత్వం యోచిస్తోందని మహిళలు మండిపడుతున్నారు. కూలీ కూడా గిట్టడం లేదు సాధారణంగా 100 మంది హైస్కూలు విద్యార్థులకు వంట చేయాలంటే ప్రభుత్వం ఇచ్చే బియ్యం, కందిపప్పు, నూనె కాకుండా ఇతర సరుకులకు ప్రస్తుత ధరల ప్రకారం రోజుకు రూ.300 ఖర్చు అవుతుంది. వంద మందికి ప్రభుత్వం ఇచ్చే కుక్కింగ్ చార్జీలు రూ.318లు అంటే ఖర్చులు పోను వీరికి మిగిలేది రోజుకు 18 రూపాయలు. వంద మందికి ముగ్గురు మహిళలు వంట చేస్తున్నారు. ఈ ముగ్గురికీ ఒక్కొక్కరికీ రూ.6 గిట్టుబాటు అవుతుంది. వ్యవసాయ పనికి వెళితే ఒక్కో మహిళకు రోజుకు రూ.180 ఇస్తున్నారు. అంటే కనీసం శ్రమకు తగ్గ ఫలితం కూడా రావడం లేదన్న మాట. మా కష్టానికి తగ్గ డబ్బులు రావడం లేదు పాఠశాలల్లో మధ్యాహ్న భోజ న వంటలు చేస్తున్న మాకు కష్టానికి తగ్గ డబ్బులు రావ డం లేదు. దీనికి తోడు కంది పప్పు, వంటనూనెల సరఫరా పేరుతో కుకింగ్ చార్జీలను తగ్గిస్తే మాకు నష్టం తప్ప లాభం ఉండదు. ఎన్నో కష్టాలు పడి వంటలు చేస్తున్న మా పనిని ప్రభుత్వం గుర్తించడం లేదు. – దూడి పార్వతి, మధ్యాహ్నభోజనం నిర్వాహకురాలు, వీరఘట్టం మా చేతి డబ్బులు పెట్టుకుంటున్నాం రోజూ వంట చేయడానికి మా చేతి నుంచి డబ్బులు పెట్టుకుంటున్నాం. డ్వాక్రా గ్రూపులో ఉండడంతో తప్పని సరిగా వంటలు చేస్తున్నాం. లేదంటే ఈ వంటలు మేము చేయలేం. వరిచేనులో కలుపు తీస్తే రోజుకు రూ.150 ఇస్తున్నారు. వంట చేయడం వల్ల కనీసం రోజుకు రూ.20లు కూడా రావడం లేదు. – ఎండు దుర్గమ్మ,మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు, వీరఘట్టం ఇది ప్రభుత్వ నిర్ణయం మధఆ్యహ్నం భోజనానికి కావాల్సిన ముడిసరుకులు సరఫరా చేసి వంట ఏజెన్సీలకు ఇచ్చే కుకింగ్ కాస్ట్లో వీటిని మినహాయించి మిగిలిన మొత్తాన్ని వారికి అందజేస్తాం. ప్రస్తుతం అక్టోబర్ నెల కందిపప్పు మాత్రం ఇచ్చాం. నవంబర్ నుంచి వంటనూనె, పప్పు సరఫరా చేస్తాం. వీటికి కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కుకింగ్ చార్జీల్లో మినిహాయిస్తాం. – ఎం.సాయిరాం, జిల్లా విద్యాశాధికారి, శ్రీకాకుళం -
పప్పన్నమే..
ఎదిగే పిల్లలు.. శారీరక, మానసిక ఎదుగుదల పాఠశాలలోనే జరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందాలి. పుష్టిగా భోజనం అందిస్తే విద్యార్థి అన్ని రకాలుగా ఎదిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ధరల ప్రభావం విద్యార్థుల భోజనంపై పడింది. ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం సూచించిన మెనూ ఎక్కడా పాటించడం లేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందలేదు. కుల్కచర్ల వికారాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ధరల మంట అంటుకుంది. ధరలు భారీగా పెరగడంతో ఏజెన్సీల నిర్వాహకులు కూరగాయలను కొనలేకపోతున్నారు. దీంతో విద్యార్థుల భోజనంలో కూరగాయలు కనిపించడం లేదు. విద్యార్థులకు కేవలం పప్పుచారు, అన్నం వడ్డిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. కూరగాయలు ధరల ప్రభావం మధ్యాహ్న భోజనంపై తీవ్రంగా పడింది. పెరిగిన కూరగాయల ధరలు మధ్యాహ్న భోజనంపై ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్లో అన్ని కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో కూరగాయలను కొని వండితే అప్పుల పాలు కావాల్సిందేనని నిర్వాహకులు అంటున్నారు. దీంతో విద్యార్థులకు పప్పన్నం వడ్డిస్తున్నారు. ఈ భోజనాన్ని విద్యార్థులు సగం కడుపుకే తింటున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. అర్ధాకలితో విద్యార్థుల సతమతం బడుల్లో మధ్యాహ్న భోజనం రుచి లేకపోవడంతో పిల్లలు కడుపునిండా తినడం లేదు. రోజూ పప్పుచారే వడ్డిస్తుండడంతో పిల్లలు చాలామంది ఇళ్లకు వెళ్లి తింటున్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చే పిల్లలు సగం ఆకలితో ఉంటున్నారు. ఈ విషయ మై మధ్యాహ్న భోజన నిర్వాహకులను అడిగితే కూరగాయల ధరలు పెరగడంతో పప్పు వండుతున్నామని బదులిస్తున్నారు. పెరిగిన ధరలతో కూరగాయలు కొనుగోలు చేస్తే అప్పుల పాలు కావాల్సిందేనన్ని నిర్వాహకులు వాపోతున్నారు. పెరిగిన ధరలు ప్రభుత్వం పాఠశాలల్లో సన్నబియ్యంతో భోజనం అందిస్తుండగా.. అయితే పెరిగిన కూరగాయల ధరలతో విద్యార్థులకు చారన్నమే దిక్కవుతోంది. కూరగాయాలు కిలో రూ.60కి చేరాయి. దీంతోభోజన ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం నిర్వహించలేమని చేతులెత్తేస్తున్నారు. పప్పుతో చేసిన చారును మాత్రమే వడ్డిస్తున్నారు. చాలా పాఠశాలల్లో నీళ్ల చారే వడ్డిస్తున్నారు. పచ్చిమిరపకాయలు రూ.120, టమాటా కిలో రూ.60పైనే ఉంటున్నాయి. బీర కాయ, పాలకూర, వంకాయ, క్యారెట్‌తోపాటు ఆకుకూరల ధరలు భారీగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో చాలా పాఠశాలల్లో మిర్చి, టమాటాలను అసలే వాడడం లేదు. ఇది మెనూ మెనూలో భాగంగా సోమ, గురువారం గుడ్డు, సాంబారు అందించాలి. మంగళ, శుక్రవారాల్లో ప ప్పు, కూరగాయలతో భోజనం ఉండాలి. బుధ, శనివారాల్లో పప్పు, ఆకుకూరలతో మధ్యాహ్నం భోజనం ఇవ్వాలి. ఒక్కో విద్యార్థికి 75 గ్రాముల కూర ఇవ్వాలని నిబంధన. అయితే కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ఎక్కడా కూడా మెనూ పాటించడం లేదు. భోజనం మోతాదు ఇది.. మధ్యాహ్న భోజనం పథకాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. 1 నుంచి 5వ తరగతుల వారికి ఒక్కొక్కరికి ప్రభు త్వం రోజుకు రూ.4.13, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రూ.6.18 పైసలు చెల్లిస్తోంది. గుడ్డు ఉన్న రోజు రూ.4 అదనంగా అందిస్తారు.మెనూ తప్పనిసరిగా పాటించాలి ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ప్రభు త్వం సూచించిన మెనూ పా టించాలి. అలా పాటించ ని మధ్యాహ్న భోజనం ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. బిల్లులు నిలిపివేస్తాం. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా మెనూ అమలయ్యేలా చూడాలి. – అబిబ్హమ్మద్, కుల్కచర్ల మండల విద్యాధికారి -
'మిడ్ డే మీల్స్' ప్రయివేటీకరణ చేయాలని బాబు ఆరాటం
-
ఎందుకీ వివక్ష...
రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల పట్లవివక్ష చూçపుతోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో మధ్యాహ్న భోజానాన్ని పెడతామని ప్రకటన చేసింది. అమలులో వివక్ష చూపుతోంది. అడ్మిషన్ల సమయంలో పలు ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి.. ‘మీ పిల్లలను మా కళాశాలల్లో చేర్పించండి.. మధ్యాహ్న భోజనం పెట్టిస్తాం’ అని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం కేవలం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకే మధ్యాహ్న భోజనమని ప్రకటించింది. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లితండ్రులు మా పిల్లలకు ఎందుకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏమి చెప్పాలో తెలియక అధ్యాపకులు తల పట్టుకుంటున్నారు. కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కళాశాలలు ప్రారంభమయ్యాక కేవలం ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తోంది. ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టడం లేదు.దీంతో వేలమంది పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రం ఈ నెల 6 నుంచి ప్రారంభించారు. ఎయిడెడ్ కళాశాలల్లో ఇంకా అమలు కాలేదు. పాఠశాలలకు సరఫరా చేసే ఏజెన్సీలకే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ఏజెన్సీలకు చెందిన వారే కళాశాలలకు భోజనం అందించాలని ఇంటర్‌బోర్డు అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించారు. రెండు శాఖల మధ్య సమన్వయలోపం, సరైన ప్రభుత్వ ఉత్తర్వులు లేని కారణంగా చాలా రోజులు విద్యార్థులకు భోజనం అందలేదు. ఈ నెల 4న జిల్లా పర్యటకు వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం అందుతుందా అని విద్యార్థులు ప్రశ్నించగా అందడం లేదని చెప్పారు. వెంటనే విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కావాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు ఆయన ఆదేశం ప్రకారం ఈనెల 6వ తేదీ నుంచి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజజాన్ని అమలు చేస్తున్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో అమలెక్కడ ప్రభుత్వ చెప్పిన ప్రకారం మొదట్లో కొన్ని ఎయిడెడ్ కళాశాలల్లో(వేంపల్లి, బద్వేల్, పొద్దుటూరు తది తర ప్రాంతాల్లో) మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. తరువాత ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలకు మాత్రమే మధ్యాహ్న భోజనం అని జీఓ విడుదల చేసింది. దీంతో ఎయిడెడ్ కళాశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అపేశారు. జిల్లావ్యాప్తంగా 20 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 5,605 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి మధ్యాహ్న భోజనం అందడం లేదు. మేమేం పాçపం చేశామని.. మాకెందుకు బువ్వపెట్టరని పలువురు విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఆలోచించాలి ఈ విద్యార్థిని పేరు నందిని. లక్కిరెడ్డిపల్లె మండలం నేను లక్కిరెడ్డిపల్లెలోని ఓ ఎయిడెడ్ కళాశాలలో ఇం టర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. నిత్యం పది కిలోమీటర్ల నుంచి కార్యి యర్ తీసుకుని కళాశాలకు వస్తాను. మధ్యాహ్నం భోజనం చేసే సమయానికి అన్నం చల్లగా పోతుంది. తినాలంటే కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయలి. – నందిని, ద్వితీయ ఇంటర్ బైపీసీ మధ్యాహ్న భోజనం పెట్టాలి నేను ఎల్ఆర్పల్లిలోని ఓ ఎయిడెడ్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నా. మాది చాగులగుట్టపల్లె గ్రామం. దాదాపు 8 కిలోమీటర్ల నుంచి వస్తాను. ఒక్కోసారి టైమ్ అయిపోతుందని క్యారియర్ తెచ్చుకోకుండా రావాల్సి వస్తుంది. ప్రభుత్వం చెప్పినట్లుగా మధ్యాహ్న భోజనం పెడితే బాగుంటుంది. – నాగార్జున, ఇంటర్, చాగులగుట్టపల్లె ఎయిడెడ్ కళాశాలల్లో భోజనం పెట్టాలి ప్రభుత్వ కళాశాలల చదువుకున్న విద్యార్థుల మాదిరిగా ఎయిడెడ్ కళాశాలల్లో కూడా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఇందులో చదువుకునే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. ఈ విషయం గురించి అధికారులు, ప్రభుత్వం ఆలోచించాలి. – వి. రామమోహన్‌రెడ్డి, ప్రెసిడెంట్, ఎయిడెడ్ జూనియర్ కళాశాల ఎంప్లాయీస్ అసోసియేషన్ -
అన్నం పెట్టినోళ్లకు ఎసరు
ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా..కనీస వేతనం లేకపోయినా.. అప్పులు చేసి అన్నం తయారు చేశారు.. విద్యార్థుల కడుపునింపి ఆకలి తీర్చారు.. అలాంటి మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే భోజనపథకం నిర్వాహకులను ఆదుకుంటాం అంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు వారి పొట్టకొట్టేందుకు ఈ పథకాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టేస్తున్నాడు. ఫలితంగా వీరు రోడ్డున పడనున్నారు. దీనిపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డక్కిలి (నెల్లూరు): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం అందిస్తున్న నిర్వాహకులను ఒక్కసారిగా తొలగించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన జీఓలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక అధికారులకు చేరాయి. 2018 సెప్టెంబర్ 15 నుంచి మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు గత నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా అందుకు సంబంధించిన విధి విధానాలతో అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. ఎలాంటి ముందుస్తు నోటీసులు ఇవ్వకుండానే ఒక్కసారిగా మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్న తమని రోడ్డున పడేస్తే ఎలా, ఇన్నేళ్లుగా కష్టపడి చేసిన దానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలం ఇదేనా అంటూ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మికులు మండిపడుతున్నారు. జీఓ విడుదల ఇప్పటికే జిల్లాలోని ముత్తుకూరు, ఇందుకూరుపేట, మనుబోలు, వెంకటాచలం, గూడూరు, నెల్లూరుటౌన్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల పరం చేసింది. జిల్లాలోని మరో 19 మండలాల్లోని ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ఢిల్లీకి చెందిన నవ ప్రయాస్ సంస్థకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులకు, స్థానిక ఎంఈఓ కార్యాలయాలకు ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని పైవేట్ సంస్థకు ఇవ్వడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి కోల్పోతున్న మహిళలు జిల్లాలో వెంకటాచలం, నాయుడుపేట, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లోని 19 మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఢిల్లీకి చెందిన నవ ప్రయాస్కు అప్పగించింది. డక్కిలి మండలంలో 71 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 60 ప్రాథమిక, 5 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు సంబంధించి 70 మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలలో 123 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరంతా సెప్టెంబర్ నెల నుంచి ఉపాధి కోల్పోనున్నారు. నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు తెలుసుకొన్న నిర్వాహకులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది నుంచే.. గతేడాది మొదటి దశగా జిల్లాలో ముత్తుకూరు, ఇందుకూరుపేట, మనుబోలు, వెంకటాచలం మండలాల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. నెల్లూరు టౌన్లో ఇస్కాన్ సంస్థకు అప్పగించారు. అయితే రెండో విడతగా నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, దొరవారిసత్రం, వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, కావలి, కావలి రూరల్, బోగోలు, జలదంకి, కలిగిరి, ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం, సంగం మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. మొదటి విడతగా మధ్యాహ్న భోజన నిర్వహణను పొందిన సంస్థలు నిర్వహణ వ్యవహారంలో ఆదిలోనే కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా యి. ఉదయం 10 గంటలకు తయారు చేసిన అన్నం, కూరలను మధ్యాహ్నానికి పాఠశాలలకు చేరవేయడంతో విద్యార్థులు తినేందుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం తాజాగా జిల్లాలో 19 మండలాల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసి పాఠశాలలకు చేరవేయడం సాధ్య కాదనే అభిప్రాయం తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది. వేళకు అందేనా.. పాఠశాల ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి వేడిగా విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి రూ.కోట్లు ఖర్చు చేసి పాఠశాలల ప్రాంగణాల్లోనే వంట గదులు నిర్మించి గ్యాస్ పంపిణీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ పథకం నిర్వహణను పైవేట్ సంస్థకు అప్పగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో విడుదల చేయడంతో విద్యార్థులకు భోజనం వేళకు అందుతుందా అనే సందేహ వ్యక్తమవుతోంది. స్థానిక ఏజెన్సీల పాత్ర నామమాత్రం ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న స్థానిక ఏజెన్సీలు నామమాత్రంగా మిగలనున్నాయి. ఈ ఏజెన్సీల ఆధారంగా ప్రతి రోజూ ముగ్గురు ఉపాధి పొందేవారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన జీఓతో వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆహారం వడ్డించడం, పాఠశాలలను శుభ్రం చేయడం, విద్యార్థుల ఆలనాపాలనా చూడడం వంటి పనులకే పరిమితం కావాల్సిఉంది. అయితే నిర్వాహకులకు మాత్రమే నెలకు రూ.1000 ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల ప్రాంగణంలోనే భోజనం తయారీ మంచిది పాఠశాల ప్రాంగణంలోనే వంటను తయారు చేసి విద్యార్థులకు అందిస్తే బాగుంటుంది. ఎక్కడో తయారు చేసి పాఠశాలకు తీసుకురావడం వల్ల విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుంది. స్థానికంగా తయారు చేస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుంది. – గువ్వల రాధ, మహసముద్రం, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ఎంతో కాలంగా పనిచేస్తున్నాం 2003 నుంచి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నాం. కనీస వేతనం లేకపోయినా కష్టపడి పనిచేసిన నిర్వాహకులను తొలగించడం అన్యాయం. రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఏజీన్సీల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. – కట్లా శివరావమ్మ, ఏజెన్సీ నిర్వాహకురాలు, ఆల్తూరుపాడు -
కందిపప్పులో 'పందికొక్కులు'
సాక్షి, అమరావతి: చిన్నారుల నోటికాడ ముద్దనూ బొక్కేయడానికి వెనుకాడని దారుణం ఇదీ. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు వండి పెట్టాల్సిన కందిపప్పు సరఫరా టెండర్లలో భారీ అక్రమాలకు తెరతీశారు. జిల్లాలవారీగా ఉన్న కందిపప్పు సరఫరా టెండర్‌ను రాష్ట్రస్థా యిలో కేంద్రీకృతం చేయడం ద్వారా రూ.65 కోట్ల దాకా కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరు మంత్రు లు ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణ లున్నాయి. దీనికి సంబంధించి న్యాయస్థా నంలో వ్యాజ్యాలు దాఖలైనా టెండర్లలో పాల్గొన్న కంపెనీల మధ్య సెటిల్మెంట్లు కుదిర్చి వాటాల వసూలుకు ప్రణాళిక రచించారు. హోల్‌సేల్ మార్కెట్లో కందిపప్పు కిలోకు రూ.52 లోపే ఉన్నా రూ.80కి పెంచి ఆమేరకు ముడుపులు పొందేందుకు పథకం వేశారు. 2 కోట్ల కిలోల కొనుగోలుకు టెండర్లు రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలకు రోజూ కందిపప్పును ఆహార పదార్థంగా వడ్డించాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 20 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిత్యం 30 గ్రాముల చొప్పున కందిపప్పును అందించాలి. రాష్ట్రంలోని 45,932 పాఠశాలల్లో 36,78,538 మంది విద్యార్థులకు ఏటా 2,10,10,497.20 కిలోల కందిపప్పు అవసరం. గతంలో మధాహ్న భోజన పథకం సరకులను జిల్లాలవారీగా కలెక్టర్ల ద్వారా టెండర్లు పిలిచి సరఫరా చేశారు. ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సరకుల సరఫరా టెండర్లను రాష్ట్రస్థాయిలో కేంద్రీకృతం చేశారు. దాదాపు రూ.165 కోట్ల విలువైన టెండర్‌ను తమకు నచ్చిన కంపెనీకి అప్పగించేలా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాదని ప్రైవేట్‌కు... కందిపప్పు సరఫరా కోసం పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లు పిలిచింది. ఏటా రూ. 145 కోట్ల టర్నోవర్‌తో గత మూడేళ్లలో రూ.435 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు ఇందులో పాల్గొనాలని నిబంధన విధించింది. ఎనిమిది సంస్థలు టెండర్లు దాఖలు చేయగా కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థకు మాత్రమే టెండర్ నిబంధనల్లో పేర్కొన్నట్లుగా రూ.145 కోట్ల టర్నోవర్ అర్హత ఉంది. తక్కిన ఏ సంస్థకూ ఆమేరకు టర్నోవర్ లేదు. టెక్నికల్ బిడ్లను తెరిచిన అధికారులు అర్హత ఉన్నా కృష్ణా సహకార మార్కెటింగ్ సంస్థను పక్కనపెట్టారు. విశాఖకు చెందిన కేంద్రీయ భాండార్, నేషనల్ కోపరేటివ్ కన్సూ్యమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నెల్లూరుకు చెందిన ఎంఎస్.పూరి జగన్నాథ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థల టెండర్లను మాత్రమే ఆమోదించారు. కిలో కందిపప్పు సరఫరాకు కేంద్రీయ భాండార్ రూ.87, నేషనల్ కోపరేటివ్ కన్సూ్యమర్ ఫెడరేషన్ రూ.86, పూరి జగన్నాథ్ ఎంటర్ప్రయిజెస్ సంస్థ రూ.84 చొప్పున టెండర్ దాఖలుచేశాయి. టర్నోవర్ నిబంధనల ప్రకారం వీటికి అర్హత లేకున్నా తక్కువ రేట్ కోట్ చేసిందంటూ పూరి జగన్నాథ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు కందిపప్పు సరఫరా కాంట్రాక్టు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ఉన్నా ఓకే... పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు పంపిణీ చేసే స్నాక్స్ సరఫరా చేసిన అనుభవం మాత్రమే ఉంది. ఈ సంస్థ దాఖలు చేసిన పత్రాల్లో 2014–15లో రూ. 2.17 కోట్లు, 2015–16లో రూ. 1.18 కోట్లు, 2016–17లో 0.04 కోట్లు మాత్రమే టర్నోవర్ ఉంది. టెండర్ నోటిఫికేషన్ల ప్రకారం ఏటా 145 కోట్ల టర్నోవర్ లేకపోవడంతో అక్రమాలకు తెగబడింది. చెన్నైకి చెందిన అరుణాచల్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన టర్నోవర్‌ను తనదిగా పేర్కొంటూ టెండర్ పత్రాల్లో చూపించింది. పూరి జగన్నాథ్ సంస్థ మూడేళ్ల టర్నోవర్ దాదాపు రూ.3 కోట్లే ఉన్నా అరుణాచల్ ఇంపెక్స్ సంస్థ టర్నోవర్‌ను కలిపి రూ.523 కోట్లు ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థకు టెండర్‌ను ఓకే చేసి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కంపెనీలతో మంత్రుల సెటిల్మెంట్లు మరికొద్ది రోజుల్లో ఫైనాన్సియల్ బిడ్లను కూడా ఓపెన్ చేసి కందిపప్పు సరఫరా టెండర్‌ను ఖరారు చేయనున్నారు. నెల్లూరు చెందిన పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఓ మంత్రి ద్వారా తెరవెనుక వ్యవహారాన్ని నడిపించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విశాఖ కేంద్రీయ భాండార్, నేషనల్ కోపరేటివ్ కన్సూ్యమర్ ఫెడరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు తమ జిల్లాకు చెందిన మంత్రిని కలిసి దీనిపై నివేదించడంతో ఇద్దరు మంత్రులూ కలసి ఈ మూడు సంస్థల మధ్య రాజీ కుదిర్చి వ్యవహారాన్ని సెటిల్ చేశారు. దీని ప్రకారం పూరి జగన్నాధ్ సంస్థకు 3 జిల్లాలు, కేంద్రీయ భాండార్‌కు 6 జిల్లాలు, నేషనల్ కోపరేటివ్ కన్సూ్యమర్ ఫెడరేషన్‌కు 4 జిల్లాల్లో కందిపప్పు సరఫరా కాంట్రాక్టు అప్పగిస్తూ ఇద్దరు మంత్రులు సర్దుబాటు చేశారు. కిలో కందిపప్పు రూ.52 నుంచి రూ.79కి పెంపు ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రూ. 48 నుంచి 52 మధ్య మాత్రమే ఉంది. అయితే రూ. 27 నుంచి రూ. 30 మేర ధర అధికంగా పెంచి కిలో రూ.79 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి 2.10 కోట్ల కిలోలు కొనుగోలు చేస్తున్నందున ధర ఇంకా భారీగా తగ్గుతుంది. రూ.52 చొప్పున 21010497.20 కిలోల కొనుగోలుకు రూ.109,25,45,854 అవుతుంది. కానీ ధరను రూ.79కి పెంచేయడంతో రూ. 165,98,29,278 కోట్లకు చేరింది. అంటే ఖజానాపై రూ.56,72,83,426 అదనంగా భారం పడనుంది. ఈ రూ.56.72 కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారనున్నాయి. అయితే హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నందున కిలో రూ.52 కన్నా ఇంకా తక్కువకే లభించే అవకాశం ఉంది. అప్పుడు ఈ ముడుపుల బాగోతం రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్లకు చేరుతుంది. ఇంత భారీగా ముడుపులు దక్కుతుండటంతోనే ఈ కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో కేంద్రీకృతం చేశారని చెబుతున్నారు. మార్క్‌ఫెడ్‌కు మొండిచేయి... తమ సంస్థకు అర్హత ఉన్నా టెండర్ల నుంచి పక్కకు తప్పించడం, తెరవెనుక వ్యవహారాలపై కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. ప్రస్తుతం టెక్నికల్ టెండర్లో ఆమోదించిన పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు అర్హత లేకపోగా విశాఖకు చెందిన మిగతా రెండు సంస్థలు బ్లాక్‌లిస్టులో ఉన్నాయని ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రస్తుతం స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయితే భారీ ముడుపుల వ్యవహారం కావడంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ ముఖ్యులతో సెటిల్మెంట్ చేయించారు. కేసును ఉపసంహరించుకుని తమకు కావాల్సిన మూడు సంస్థలకు టెండర్లు కట్టబెట్టేలా రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. మార్క్‌ఫెడ్ గోదాముల్లో ముక్కిపోతున్న కందులు కృష్ణా జిల్లా మార్కెటింగ్ సంస్థ ఛైర్మన్ కంచి రామారావు రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా అవసరమైన కందిపప్పును ప్రభుత్వమే కొనుగోలు చేసి మధ్యాహ్న బోజన పథకానికి అందచేస్తే తక్కువ ధరకే దక్కటంతోపాటు రైతులకు కూడా మేలు జరిగేది. రైతుల నుంచి కొనుగోలు చేసిన కందులను రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉన్న మిల్లులకు అందించి కందిపప్పును మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేయిస్తే వేలాది మంది కార్మికులకు మేలు జరిగేది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన 80 వేల టన్నుల కందులు గోడౌన్లలో మగ్గుతున్నాయి. కానీ ముడుపులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు దీన్ని పట్టించుకోకుండా అర్హతలు లేని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధపడ్డారు. -
వండిందే మెనూ.. పెట్టిందే తిను!
మటన్ స్థానంలో చికెన్.. చికెన్ స్థానంలో సాంబారు.. సాంబారు స్థానంలో నీళ్లచారు.. ఇదీ మరికల్ గురుకుల పాఠశాలలోని మెనూ.. అడిగే వారు లేక విద్యార్థుల కడుపు కొట్టి కాంట్రాక్టర్లు కాసులు వెనకేస్తున్నారు.. బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రిన్సిపాల్ సైతం విద్యార్థులకు అందాల్సిన మెనూ విషయమై కాంట్రాక్టర్ల వద్ద నోరు మెదపడం లేదు.. ఇంత జరుగుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ఎక్కడా విద్యార్థులకు అందిస్తున్న భోజనం మెనూ తెలుసుకోవడం కోసం ఏనాడూ ప్రయత్నించకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.. మరికల్ (నారాయణపేట) : మరికల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లేకపొవడంతో భోజన కాంట్రాక్టర్లు వారు వండిందే మెనూ.. పెట్టిందే తినూ అన్న చందంగా తయారైంది గురుకుల పాఠశాల విద్యార్థుల పరిస్థితి. నాలుగు డబ్బులు వెనక వేసుకోవడం కోసం కూరగాయాలు, వివిధ సరుకులు అందిస్తున్న కాంట్రాక్టర్లు విద్యార్థుల నోళ్లు కొడుతున్నా ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఎందుకు నోరు విప్పడం లేదని గతంలో విద్యార్థుల తల్లిదంద్రులు ఆందోళనకు దిగిన సంఘటనలు కోకొల్లలు. దారితప్పిన మెనూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలాల్లో వి ద్యార్థులకు మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గుడ్డుతోపాటు మటన్, చికె న్ మెనూలో చేర్చింది. ప్రతినెల మొదటి, మూడో ఆదివారం విద్యార్థులకు మెనూ ప్రకారం మటన్ పెట్టాలి. 2వ, 4వ ఆదివారాల్లో చికెన్ భోజనం పెట్టాలి. పాఠశాతలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే మటన్ పెట్టినట్లు విద్యార్థులు తెలిపారు. చికెన్ మాత్రం వారికి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పెడుతూ ఆ రోజు మెనూను దారి తప్పిస్తున్నారు. మిగతా వారాల్లో సాంబర్, నీళ్ల చారు తప్ప మరొకటి ఉండదు. కూరగాయల, పాలు, గుడ్లు, మటన్, చికెన్, స్నాక్స్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎప్పుడు కూడా ఇక్కడ మెనూ పాటించడం లేదనే వాదన విద్యార్థుల నుంచి వినిపిస్తుంది. ప్రతిరోజు విద్యార్థులకు సాయంత్రం అందించే స్నాక్స్ పైతరగతి విద్యార్థులకు మాత్రమే అందుతున్నట్లు సమాచారం. విద్యార్థులను భయపెట్టి మెనూ ప్రకారం భోజనం పెట్టలేదనే విషయాలను కాని ఇక్కడ మరొకటి ఏదైనా సంఘటనలు జరిగిన విషయాలను బయట ఎవరికైనా, తల్లిదండ్రులకైనా చెబితే కఠిన చర్యలు తీసుకుంటామని స్వయంగా ప్రిన్సిపాల్, అద్యాపకులే విద్యార్థులను భయపెడుతున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం ఇప్పుడే మొదలైంది కాదని.. గతంలో నుంచే కొనసాగుతుందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక్కడి ఏ ప్రిన్సిపాల్ బదిలీపై వచ్చినా ముందుగా చెప్పే మాటలే ఇవని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం. సమస్యల తిష్ట.. స్థానిక గురుకుల పాఠశాలలో 680 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ అనేక సమస్యలు తిష్టవేసి పీడిస్తున్నాయి. జలమణి కింద శుద్ధనీరు అందకపోవడంతో గత కొన్నాళ్ల నుంచి ప్రధానంగా నీటి సమస్య నెలకొంది. ఎలిగండ్ల మన్నేవాగు నుంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు పైపులైన్ వేసి అసంపూర్తిగా వదిలేశారు. అలాగే మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు కాలకృత్యాలను తీర్చుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. మరోపక్క గురుకుల పాఠశాల ఆవరణలో పాములు బెడద చాలా ఉంది. దీంతో విద్యార్థులు రాత్రివేళలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. -
మహిళలపై దురుసుగా ప్రవర్తించడం దారుణం
-
పేద మహిళల కడుపు కొడతారా?
-
అక్కాచెల్లెమ్మల పట్ల ఇంత అమానుషమా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆడపడుచుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. మధ్యాహ్న భోజనం వండే పనిని వారి నుంచి తప్పించి ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. తాము అధికారంలోకి రాగానే ఈ దుస్థితిని సమూలంగా సంస్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు జగన్ మంగళవారం ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. ఏమిటీ అమానుషం? వాళ్లేం తప్పు చేశారు? అధికారం ఉంది కదాని కర్కశంగా వ్యవహరిస్తారా? మహిళా పార్లమెంట్ విజయవాడలో నిర్వహించామని గొప్పలు చెప్పుకున్న మీరు.. అదే విజయవాడలో అక్కచెల్లెమ్మల పట్ల ప్రవర్తిస్తున్న తీరు సిగ్గుచేటు కాదా? వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం, దారుణం కాదా? మీ ప్రభుత్వం సరిగా వేతనాలు ఇవ్వకున్నా, ఐదారు నెలలుగా సరుకుల బిల్లులు చెల్లించకపోయినా.. 85 వేల మంది అప్పోసొప్పో చేసి పిల్లలకు భోజనం వండి పెడుతున్నారు. అయినా సరే దేశంలో ఎక్కడా లేని విధంగా భోజనం వండే పని నుంచి వారిని తొలగించి, ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడానికి ఈ సర్కారు తహతహలాడుతోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజనం వండే పనిని అక్కచెల్లెమ్మలకే అప్పగిస్తాం. వారికి గౌరవ వేతనం పెంచి అండగా ఉండటంతో పాటు.. పిల్లలకు పౌష్టికాహారం అందేలా భోజన ధరలు పెంచి, బిల్లులు సకాలంలో చెల్లిస్తాం’’ అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. pic.twitter.com/rERo6TJb9R — YS Jagan Mohan Reddy (@ysjagan) 7 August 2018 -
అన్నం పెట్టే మహిళల అరెస్ట్ ఒక దుర్మార్గపు చర్య