విద్యార్థుల వద్ద భోజనాన్ని పరిశీలిస్తున్న ప్రిన్సిపాల్ సుధాకర్
శ్రీకాళహస్తి: పట్టణంలోని తెలుగుగంగ కాలనీలోని బీసీ బాలికల హాస్టల్‌లో భోజనం అధ్వానంగా ఉంటోంది. విద్యార్థులు హాస్టల్ వార్డన్‌ను ప్రశ్నించలేక తల్లిదండ్రులకు మొరపెట్టుకుంటున్నా రు. ఈ హాస్టల్‌లో మొత్తం 133 మంది విద్యార్థులు ఉండగా,70 మంది ఇంటర్, 41 మంది డిగ్రీ, 22 పీజీ కోర్సులు చదువుతున్నారు. హాస్టల్‌లో మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని, గంటికట్టిన ముద్దఅన్నం,వేడినీళ్ల సాంబారుతో భోజ నం వడ్డిస్తున్నారని విద్యార్థులు మధనపడుతున్నారు.
అంతేకాకుండా హాస్టల్ పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో రోగాల బారిన పడుతామనే భయంతో వణికిపోతున్నారు. ఇక సరైన భద్రతా సిబ్బంది లేకపోవడంతో రాత్రిసమయం లో బిక్కుబిక్కుమంటు ఉంటున్నారు. తొట్టంబేడు మండలంలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ సైతం సోమవారం విద్యార్థులు క్యారియర్లలో తెచ్చిన భోజనాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డన్‌కు చెబుతామని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు.
మెనూ ప్రకారం భోజనం పెడుతున్నాం
విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నాం. ఒక మహిళ సెక్యూరిటీగా రాత్రి సమయంలో ఉంటోంది. పరిసరాలను శుభ్రం చేస్తాం.లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం.
– హెచ్. హైమావతి, బీసీ హాస్టల్ వార్డన్
Comments
Please login to add a commentAdd a comment