BC Girls Hostel
-
జ్వరమా.. మరేదైనా కారణమా..?
పెన్‌పహాడ్: గురుకుల పాఠశాల విద్యార్థిని అను మానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే జ్వరంతో విద్యార్థిని చనిపోయిందని ప్రిన్సిపాల్ చెబుతుండగా, రాత్రే చనిపోతే ఉదయం వరకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహంతో మృతురాలి బంధువులు ప్రిన్సి పాల్‌పై దాడి చేశారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివ రాల ప్రకారం... సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన కొంపెల్లి సోమయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు సరస్వతి(10) పెన్ పహాడ్ మండలంలోని దోసపహాడ్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. సరస్వతికి సోమవారం రాత్రి జ్వరం వచ్చింది.గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న జీఎన్ఎం మంగళవారం తెల్లవారుజామున పరీక్షించి మరో ఉపాధ్యాయురాలితో కలిసి గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి ఇంజక్షన్ వేయించారు. అయినా జ్వరం తీవ్రత తగ్గకపోగా సీరియస్‌గా ఉండటంతో 108 వాహనంలో సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరస్వతిని పరీక్షించిన డాక్టర్ అప్పటికే చని పోయిందని చెప్పారు. దీంతో ప్రిన్సిపాల్ విజయ లక్ష్మి.. మీ పాపకు సీరియస్‌గా ఉందంటూ సర స్వతి తల్లి దండ్రులకు ఫోన్ చేశారు. వారు వెంటనే ఆస్పత్రికి చేరుకోగా అప్పటికే మృతి చెందినట్టు తల్లిదండ్రులకు తెలియజేశారు. తమ కూతురు బాగానే ఉందని, అప్పుడే ఎలా చనిపోయిందని వారు ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఆస్పత్రిలో బంధువులు, తల్లిదండ్రుల ఆందోళనసరస్వతి మృతి చెందిన విషయం ప్రిన్సిపాల్ విజ యలక్ష్మి, పాఠశాల సిబ్బంది తమకు తెలియజే య కుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆస్పత్రి లోని మార్చురీ వద్ద కుటుంబసభ్యు లు ఆందోళన చేశారు. తమ కూతురు సోమ వారం రాత్రే చని పోయిందని, ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి మంగళవారం ఫోన్ చేసి సీరియస్‌గా ఉందని చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. తమ కూతురుని కొట్టి చంపారా.. లేక ఏదైనా చేశారా మాకు చెప్పాలని తండ్రి సోమయ్య డిమాండ్ చేశాడు. న్యాయం చేసే వరకు పోస్టుమార్టం చేయొద్దని పట్టుబట్టారు. మాట్లాడదామని చెప్పి...ప్రిన్సిపాల్‌తో మాట్లాడించాలని రీజినల్ కోఆర్డి నేటర్ షకీనాను బంధువులు కోరగా, ఆమెను తీసుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ప్రిన్సిపాల్‌పై సరస్వతి బంధువులు దాడి చేశారు. వెంటనే అక్కడే ఉన్న డీఎస్పీ రవి జోక్యం చేసుకొని ప్రిన్సిపాల్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బీసీ గురుకుల అధికారులు మద్దిలేటి,వెంకటేశ్వర్లు ఆస్పత్రి వద్దకు వెళ్లి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు మృతదేహాన్ని స్వగ్రామా నికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మృతురాలి తండ్రి కొంపెల్లి సోమయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
30 మంది విద్యార్థినులకు అస్వస్థత
మంచాల: హాస్టల్లో వడ్డించిన అల్పాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బీసీ బాలికల వసతి గృహంలో మొత్తం 94 మంది విద్యార్థినులు ఉన్నారు. శనివారం ఉదయం వీరికి అల్పాహారంగా పులిహోర పెట్టారు. అందులో పురుగులు వచ్చాయని విద్యార్థినులు చెబుతున్నా రు. అల్పాహారం తిన్నవారిలో ఒకరి తర్వాత ఒకరు తలనొప్పి, కడుపు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడ్డారు. పదుల సంఖ్యలో పిల్లలు అస్వస్థతకు గురికావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గంట వ్యవధిలోనే 30 మందికి పైగా విద్యార్థినులు వాంతులు చేసుకుని, కాళ్లు, చేతులు లాగుతున్నాయని వాపో యారు. వారికి ఆస్పత్రి వైద్యుడు శ్రావణ్ కుమా ర్‌రెడ్డి చికిత్స చేశారు. కాగా, తీవ్ర అస్వస్థతకు గురై న కె.అనిత (7వ తరగతి), కె.అఖిల (8), వి.వైష్ణవి (5), ఎం.శిరీష (5), పి.అక్షర (3), ఎం.పూజ (7), ఆర్.త్రిష (10), ఎం.శ్రీనిధి (4వ తరగతి)ని మెరు గైన వైద్యం కోసం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇందులో నలు గురిని వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి తీసు కెళ్లారు. విద్యార్థుల విషయంలో వార్డెన్‌తో పాటు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివిధ సంఘాల నాయకులు ఆరోపించారు. -
లంకంత భవనం.. నలుగురే విద్యార్థులు
వీరఘట్టం: లంకంత భవనం.. విశాలమైన గదులు.. అందులో ఉండేది నలుగురే. రిజిస్టర్లో మాత్రం 28 మంది ఉన్నట్లు లెక్కలు. రాత్రయితే చాలు మళ్లీ ఎప్పుడు తెల్లవారుతుందిరా దేవుడా అంటూ ఆ విద్యార్థినులు బిక్కు..బిక్కు మంటూ గడుపుతున్నారు. ఇదీ వీరఘట్టం బీసీ బాలికల వసతి గృహంలోని పరిస్థితి. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ.. కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడ చదువుతున్న ఆ నలుగురు బాలికలు తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. నిధుల స్వాహా! ఈ వసతి గృహాన్ని ఎంతో అందంగా నిర్మించారు. కస్తూర్బా బాలికా విద్యాలయాలు అందుబాటులోకి రావడంతో బాలికల వసతి గృహంలో అడ్మిషన్లు తగ్గాయి. మనుగడను కాపాడుకునేందుకు హాస్టల్ సిబ్బంది కొద్ది మంది బాలికలను చేర్పిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఉండేది నలుగురు మాత్రమే.. మిగిలిన 24 మంది బాలికల పేరిట నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నలుగురు కోసం ప్రతి నెలా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు: రూ.2.50 లక్షలు ప్రస్తుతం ఈ వసతి గృహం నిర్వహణకు ప్రతి నెలా రూ.2.50 లక్షల ఖర్చు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ నలుగురు విద్యార్థులతో పాటు వీరిని చూసుకునేందుకు నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్‌కు ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి నెలా ఖర్చులు ఇలా.. ♦ కరెంటు బిల్లు: రూ.1,000 ♦ ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులకుఇచ్చే జీతం: రూ.26,500 ♦ వంటి మనిషికి ఇచ్చే జీతం: రూ.60,000 ♦ విద్యార్థులకు మెనూ చార్జీలకింద రూ.1.60 లక్షలు (కొన్నేళ్లుగా హాస్టల్‌కు రాని విద్యార్థినులకు హాజరు వేసి మెస్ చార్జీలు సిబ్బంది స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.) దగ్గరలో ఉన్నవారు ఇళ్లకు వెళ్లిపోతున్నారు.. ప్రస్తుతం 28 మంది బాలికలు రోజూ భోజనాలు చేస్తున్నారు. వీరిలో రాత్రి పూట ఐదుగురు మాత్రమే ఉంటున్నారు. మిగిలిన వారు అందరూ స్థానికులు కావడంతో రాత్రి పూట ఉండడం లేదు. వారికి ఎంత చెప్పినా వినడం లేదు.– ఐ.దీప్తి, ఇన్చార్జి వార్డెన్, బీసీ బాలికల హాస్టల్, వీరఘట్టం వచ్చే ఏడాది మూసివేస్తాం ప్రస్తుతం ఉన్న విద్యార్థినులతోనే హాస్టల్ నడుపుతాం. విద్యార్థినుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది హాస్టల్ మూసివేస్తాం. ఎంత మంది ఉంటే.. అంత మందికే హాజరు వేసి అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటాం. – బి.కృత్తిక, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి, శ్రీకాకుళం -
నీళ్ల సాంబారు, ముద్దకట్టిన అన్నం
శ్రీకాళహస్తి: పట్టణంలోని తెలుగుగంగ కాలనీలోని బీసీ బాలికల హాస్టల్లో భోజనం అధ్వానంగా ఉంటోంది. విద్యార్థులు హాస్టల్ వార్డన్‌ను ప్రశ్నించలేక తల్లిదండ్రులకు మొరపెట్టుకుంటున్నా రు. ఈ హాస్టల్లో మొత్తం 133 మంది విద్యార్థులు ఉండగా,70 మంది ఇంటర్, 41 మంది డిగ్రీ, 22 పీజీ కోర్సులు చదువుతున్నారు. హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని, గంటికట్టిన ముద్దఅన్నం,వేడినీళ్ల సాంబారుతో భోజ నం వడ్డిస్తున్నారని విద్యార్థులు మధనపడుతున్నారు. అంతేకాకుండా హాస్టల్ పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో రోగాల బారిన పడుతామనే భయంతో వణికిపోతున్నారు. ఇక సరైన భద్రతా సిబ్బంది లేకపోవడంతో రాత్రిసమయం లో బిక్కుబిక్కుమంటు ఉంటున్నారు. తొట్టంబేడు మండలంలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ సైతం సోమవారం విద్యార్థులు క్యారియర్లలో తెచ్చిన భోజనాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డన్‌కు చెబుతామని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నాం విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నాం. ఒక మహిళ సెక్యూరిటీగా రాత్రి సమయంలో ఉంటోంది. పరిసరాలను శుభ్రం చేస్తాం.లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం. – హెచ్. హైమావతి, బీసీ హాస్టల్ వార్డన్ -
చాడీలు చెప్పారంటూ మనస్తాపం
* హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య.. * ఆందోళనకు దిగిన కుటుంబీకులు పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట బీసీ బాలికల హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. తనపై అమ్మకు చాడీలు చెప్పడంపై తీవ్ర మనస్తాపానికి గురైన 14 ఏళ్ల బాలిక సూసైడ్‌నోట్ రాసి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తండాకు చెందిన కర్ర హరినాయక్, చావ్లీబాయి దంపతులకు ఏడుగురు సంతానం. అందులో ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నకూతురు అరుణ (14) పెద్దశంకరం పేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతూ అక్కడే బాలికల హాస్టల్లో ఉంటుంది. విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఏఎన్ఎం కమల శనివారం ఉదయం హాస్టల్‌కు వచ్చింది. రిజిస్టర్లో సంతకం చేసేందుకు ఆమె హాస్టల్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపు తట్టినా ఎవరూ తీయలేదు. ఏఎన్‌ఎంతోపాటు ఆయా కిటికీలో నుంచి లోనికి చూడగా కర్ర అరుణ ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించింది. దీంతో తలుపులు పగులగొట్టి అరుణను కిందికి దించారు. వైద్యాధికారి శంకర్ వచ్చి చూడగా అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు. అక్కడే రెండు పేజీల సూసైడ్ నోట్ దొరికింది. ‘మౌనిక, భూలక్ష్మి అనే ఇద్దరు నాపై అమ్మకు చాడీలు చెప్పారు. నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను అపార్థం చేసుకున్నారు. నా చావుకు వారిద్దరే కారణం’ అంటూ అరుణ అందులో పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న అరుణ కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్‌కు చేరుకున్నారు. వారు వచ్చి ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరుణ మృతికి కారకులను శిక్షించాలని, నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. జోగిపేట ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ, ఎస్ఐలు మహేష్‌గౌడ్, సత్యనారాయణ, విజయరావు, శేఖర్‌రెడ్డి, తహశీల్దార్ దేశ్యా, రాణా ప్రతాప్‌సింగ్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సువర్ణ సంఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.